8, జూన్ 2025, ఆదివారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌞ఆదివారం 8 జూన్ 2025🌞*


`` *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది…

``

     *వాల్మీకి రామాయణం*                  

           *62 వ భాగం*


*తీక్ష్ణ కామాః తు గంధర్వాః తీక్ష్ణ కోపా భుజంగమాః।*

*మృగాణాం తు భయం తీక్ష్ణం తతః తీక్ష్ణ క్షుధా వయం॥*```


గంధర్వులకి కామం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, మృగాలకి భయం ఎక్కువ, పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకని నాకు ఆకలి ఎక్కువగా ఉండేది, కాని వెళ్ళి తిందామంటే నాకు రెక్కలు లేవు. నా కొడుకైన సుపార్షుడు రోజూ వెళ్ళి ఆహారం తీసుకోచ్చేవాడు. కాని ఒకనాడు ఆహారం తీసుకురావడానికి వెళ్ళిన నా కొడుకు ఎంతసేపటికీ వెనక్కి రాలేదు. కడుపు నకనకలాడుతూ నేను ఎదురుచూస్తున్నాను. ఇంతలో ఒట్టి చేతులతో నా కొడుకు వచ్చాడు, అది చూసిన నాకు కోపంవచ్చి నా కొడుకుని నిందించాను. 


అప్పుడు సుపార్షుడు అన్నాడు…  

'నాన్నగారూ! నా దోషంలేదు, నేను పొద్దున్నే వెళ్ళి సముద్రంలో ఉన్న మహేంద్రగిరి పర్వతం మీద కూర్చొని సముద్ర జలాలలోకి చూస్తున్నాను, ఏదన్నా పెద్ద ప్రాణి కనపడగానే తీసుకొచ్చి మీకు పెడదాము అనుకున్నాను. కాని ఇంతలో ఆకాశంలో, నల్లటి స్వరూపంతో ఉన్న రాక్షసుడు, మెడలో తెల్లటి ముత్యాల హారం వేసుకొని, తెల్లటి బట్ట కట్టుకొని వెళుతున్నాడు. మేఘం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో, అలా ఒక స్త్రీ అతని చేతులలో తన్నుకుంటోంది. “హా రామా, హా లక్ష్మణా” అని అరుస్తోంది. నేను వాడిని చూసి మంచి ఆహారం దొరికింది అనుకున్నాను. కాని వాడు నా దగ్గరికి వచ్చి నమస్కరించి… 

'మహానుభావా! నాకు దారి విడిచిపెట్టవయ్యా' అన్నాడు. ఎంతటివాడైనా అలా బతిమాలుతూ సామంతో మాట్లాడితే, ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడు అటువంటివాడిని దిక్కరించకూడదు కదా, అందుకని నేను వాడిని వదిలిపెట్టేశాను. కాని వాడు వెళ్ళిపోగానే ఆకాశంలో దేవగణాలు, ఋషిగణాలు నా దగ్గరికి వచ్చి' అదృష్టవంతుడివిరా బతికిపోయావు, వాడు దుర్మార్గుడు, వాడి పేరు రావణాసురుడు. వాడు చాలా బలవంతుడు, వాడికి విశేషమైన వరాలు ఉన్నాయి' అని చెప్పి వెళ్ళారు. 


ఈ విషయాన్ని నా కొడుకు చెప్పడం వల్ల నాకు సీతమ్మ గురించి తెలిసింది. సీతమ్మని రావణాసురుడే అపహరించి లంకకి తీసుకువెళ్ళాడు.


నేను వింధ్య పర్వత శిఖరం మీద రెక్కలు కాలిపోయి పడినప్పుడు 6 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. 6 రోజుల తరువాత తెలివొచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు, నాకేమో రెక్కలు కాలిపోయాయి, అందుకని ఆ పర్వతం మీద నుండి కిందకి దూకి మరణిద్దాము అనుకున్నాను, కాని ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో నేను,నా తమ్ముడు కామరూపులము కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళము. అక్కడ ఉండేటటువంటి నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళము. అందుకని ఒక్కసారి ఆ మహర్షి పాదాలకి నమస్కరించి ప్రాణాలు విడిచిపెడదాము అనుకొని మెల్లగా డేకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను. అప్పుడా మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఎలా ఉందంటే, అభిషేకం చెయ్యబడ్డ బ్రహ్మగారు వెళుతున్నట్టు ఉన్నారు. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో, అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఆయన చుట్టూ ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు చేరి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి. తరువాత ఆయన బయటకి వచ్చి నన్ను చూసి.. 'నిన్ను చాలాకాలం నుండి చూస్తున్నాను, నువ్వు, నీ తమ్ముడు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా. నువ్వు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావేంటి' అని అడిగారు. 


అప్పుడు నేను జరిగిన కథంతా చెప్పాను. 


అప్పుడాయన అన్నారు 'సంపాతీ! బెంగ పెట్టుకోకు, భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జరగవలసి ఉంది. నువ్వు కొంతకాలానికి సీతాపహరణాన్ని చూస్తావు. ఈ సీతమ్మని అన్వేషిస్తూ వానరులు వస్తారు. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి. నేను నీకు అభయం ఇస్తున్నాను, అలా చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్ళి వస్తాయి. నాకు కూడా రామలక్ష్మణులను చూడాలని ఉంది, కాని అంతకాలం ఈ శరీరంలో ఉండాలని నాకు లేదు, ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దాము అనుకుంటున్నాను. నువ్వు మాత్రం ఈ కొండమీదే వేచి ఉండు.


నీకు ఇంకొక విషయం చెబుతాను, సీతమ్మని అపహరించిన తరువాత ఆమెని వశం చేసుకుందామని రావణాసురుడు తన అంతఃపురం చూపిస్తాడు, దివ్యమైన భోజనము పెడతాడు. కాని ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు, ఒక మెతుకు ముట్టదు. ఆ తల్లికోసం దేవేంద్రుడు ప్రతి రోజూ దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపిస్తాడు. కాని సీతమ్మ ఆ పాయసాన్ని తినదు. ఆమె, పైన ఉన్న పాయసాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బతికుంటే, ఈ పాయసం వారికి చెందుగాక, ఒకవేళ రామలక్ష్మణులు శరీరాలని విడిచిపెట్టి ఉంటె, ఊర్ధలోకములలో ఉన్నవాళ్ళకి ఈ పాయసం చెందుగాక, అని భూమి మీద పైన ఉన్న పాయసాన్ని పెడుతుంది. ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టినది కాదు. ఈ విషయాన్ని ఆ వానరులు వచ్చాక వాళ్ళకి చెప్పు' అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. అందుకని కొన్ని వేల సంవత్సరముల నుండి ఇలా బతికి ఉన్నాను.

```

*తస్య తు ఏవం బ్రువాణస్య సంహతైః వానరైః సహ।*

*ఉత్పేతతుః తదా పక్షౌ సమక్షం వన చారిణాం॥*```


సంపాతి ఈ మాటలను వానరాలకి చెప్పగానే కాలిపోయిన ఆయన రెక్కలు మళ్ళి పుట్టాయి. 


అప్పుడాయన తన ఎర్రటి రెక్కలని అటూ ఇటూ ఊపి చూసుకున్నాడు. ఆనందంతో ఆ సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు.```


        *రేపు…63వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

ఆదివారం🌞* *🌹08 జూన్ 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌞ఆదివారం🌞*

  *🌹08 జూన్ 2025🌹*            

     *దృగ్గణిత పంచాంగం*  

                 

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠ మాసం - శుక్లపక్షం*


*తిథి  : ద్వాదశి* ఉ 07.17 వరకు ఉపరి *త్రయోదశి* 

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం   : స్వాతి* మ 12.42 వరకు ఉపరి *విశాఖ*


*యోగం : పరిఘ* ప 12.18 వరకు ఉపరి *శివ*

*కరణం   : బాలువ* ఉ 07.17 *కౌలువ* రా 08.28 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.30 - 09.30 మ 01.30 - 04.30*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.33*


*వర్జ్యం          : సా 06.57 - 08.44*

*దుర్ముహూర్తం  : సా 04.54 - 05.47*

*రాహు కాలం    : సా 05.01 - 06.39*

గుళికకాళం       : *మ 03.23 - 05.01*

యమగండం     : *మ 12.07 - 01.45*

సూర్యరాశి : *వృషభం*

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 05.41*

సూర్యాస్తమయం :*సా 06.50*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.34 - 08.11*

సంగవకాలం         :*08.11 - 10.48*

మధ్యాహ్న కాలం    :     *10.48 - 01.25*

అపరాహ్న కాలం    : *మ 01.25 - 04.02*


*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి*

సాయంకాలం       :*సా 04.02 - 06.39*

ప్రదోష కాలం         :  *సా 06.39 - 08.50*

రాత్రి కాలం           :*రా 08.50 - 11.45*

నిశీధి కాలం          :*రా 11.45 - 12.28*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.50*

----------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 *🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*


*ఓం ఉదయగిరిముపేతం* 

*భాస్కరం పద్మహస్తం*

*సకలభువననేత్రం* 

*రత్నరజ్జూపమేయమ్ ।*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

మృగశిర కార్తె ప్రారంభం*_

 _*ఈ రోజు నుండి మృగశిర కార్తె ప్రారంభం*_


🕉️🪷🕉️🪷🕉️🪷🕉️🪷🕉️🪷🕉️


ఈ కార్తె రోజు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది. రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణికార్తె ముగిసి.. చల్లబరిచే మృగశిర మొదలవుతుంది. 


మృగశిర కార్తె అంటే.. ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం , ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మీక్రిములు వంటివి పునురుత్పత్తి అవుతాయి. మానవునిలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం , దగ్గు , శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు , ఆస్తమా , మధుమోహ వ్యాధి ఉన్నవారు , గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ నేపథ్యంలో మనిషి శరీరంలో మార్పులు జరిగి వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. గుండెజబ్బులు , ఆస్తమా తదితర ఆనారోగ్యసమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటన్నింటికి అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాల్సిందే.


*అసలు మృగశిర కార్తెకు ఉన్న సంబంధం ఏమిటి..?*


వ్యాధుల నియంత్రణకు చేపలు మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..? రోకండ్లను సైతం పగులగొట్టే ఎండలు తగ్గిపోతాయి. వర్షాలు మొదలవుతాయి. 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర కార్తె చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు , ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేకాక ఈ సీజన్‌లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం , దగ్గు బారిన పడతారు. ఇలాంటి వాటి నుండి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే.


పూర్వీకులు శాఖాపరమైన ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు.. ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో , చింత చిగురులో పెట్టుకుని తినేవారు. ఈ రోజు ఏ ఇంటా చూసినా చేపల పులుసే. చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పులుసో , ప్రై చేసుకుని ఖచ్చితంగా తింటుంటారు.


పంచాగ ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా,వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.


*పురాణగాధ ప్రకారం*


మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను , పంటలను హరించి వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం , వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేడిది. ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్ర హలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు.


ప్రకృతి మార్పు ప్రభావం

ఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇక్కడ నురుగు అనేది ఋతుపవనాలకు , వర్షాలకు సూచన. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది. వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా , వర్షదేవుడుగా పిలుస్తారు. ఇది కథ.


*చేపలలో పోషకాలు:*


🐟 చేపలలో ఎన్నో పోషకాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. చేపలలో అనేకమైన మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం , పాస్పరస్‌ , ఐరన్‌ , మెగ్నీషియం , కాపర్‌ , జింక్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి.


🐟 చేపలు కొవ్వులు చాలా సులభంగాజీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు.


🐟 చేపల్లో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్త పీడనంపై మంచి ప్రభావం చూపుతాయి.


🐟 ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ , ఈపీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి.


🐟 చేపల్లో బీ12 విటమిన్‌ , రైబోప్లవిన్‌ , నియాసిన్‌ , బయెటిక్‌ , థయామిన్‌ తదితర విటమిన్లు లభిస్తాయి.


🐟 సముద్ర చేపల కాలేయంలో విటమిన్‌ఏ , డీ , ఈ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.


🐟 చేపలు గుండెకు సంబంధిత వ్యాధులకు , ఆస్తమా , షూగర్‌ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పని చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులు , పిల్లల తల్లులకు ఎంతో మేలు. పిల్లల్లో జ్ఞాపకశక్తి , నాడీ వ్యవస్థ అభివృద్ధి చేస్తాయి చేపలు


🐟 మన రాష్ట్ర చేపల్లో కొర్రమీనులో లభించే ఆరాఖిడోనిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం ఉంటుంది


🐟 దేశీయ మార్పు చేపల్లో ఐరన్‌ , కాపర్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలను ఏ రూపంలో తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.


🐟 ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందున స్థానికంగా దొరికే పెద్ద చేపలను ఇంగువ , చింత చిగురుతో కలిపి వండుకుని తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు


🐟 మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.


🐟 చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు , ఆస్తమా , మధుమోహ వ్యాధి ఉన్న వారు , గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.


🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

18-08-గీతా మకరందము

 18-08-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - రాజసత్యాగమును వర్ణించుచున్నారు- 


దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్ | 

స కృత్వా రాజసం త్యాగం 

నైవ త్యాగఫలం లభేత్ || 


తాత్పర్యము:- ఎవడు శరీరప్రయాసవలని భయముచేత దుఃఖమును గలుగజేయునది యనియే తలంచి విధ్యుక్తకర్మమును విడిచిపెట్టునో, అట్టివాడు రాజసత్యాగమును గావించినవాడై త్యాగఫలమును బొందకయే యుండును.


వ్యాఖ్య:- తామసత్యాగి అజ్ఞానమువలన విధ్యుక్తకర్మలను వదలుచున్నాడు. రాజసత్యాగియో ఆ కర్మచేయుట ప్రయాసమని తలంచి దానిని వదలివేయుచున్నాడు. అనగా సోమరితనము వహించుచున్నాడని అర్థము. ఉత్తమసుఖమును గలుగజేయు క్రియలు సామాన్యముగ ప్రారంభములో కష్టముగా తోచును. కాని తుదకు అనంతసుఖమునే కలుగజేయును. కాని రాజసత్యాగి ప్రారంభమునతోచు కష్టమునకు బెదరిపోయి, సోమరితనముచే ఏమాత్రము శ్రమించక, ఆ కర్మలనే వదలివైచుచున్నాడు. బ్రహ్మముహూర్తమున లేచుట, శీతలోదకముచే స్నానముచేయుట, బ్రహ్మచర్యమును పాలించుట మున్నగు క్రియలు ప్రారంభములో కష్టముగా తోచవచ్చును. కాని అవియే తుదకు మహదానందమును కలుగజేయును. కాని రాజసత్యాగి (బద్ధకము వలన) వానిని చేయుటకు నిచ్ఛగింపక వదలిపెట్టుచున్నాడు. అట్టివానికి త్యాగముయొక్క ఫలమేమియు లభించుటలేదు ఏలననగా త్యాగమనగా సంగత్యాగమేకాని కర్మత్యాగముకాదు. వారో, కర్మలనే త్యజించివైచుచున్నారు. ఈ ప్రకారముగ తామసుడు, రాజసుడు వేర్వేఱు కారణములచే విధ్యుక్తకర్మలను త్యజించివైచుచు తత్ఫలములను పొందకున్నారు.


ప్రశ్న:- రాజసత్యాగముయొక్క లక్షణమేమి?

ఉత్తరము :- కార్యము కష్టమని తలంచి (సోమరితనముచే) దానిని వదలివేయుట రాజసత్యాగమనుబడును.

ప్రశ్న:- దానివలన అతనికి కలుగు నష్టమేమి?

ఉత్తరము: - అతడు త్యాగఫల మిసుమంతేని పొందకుండును.

తిరుమల సర్వస్వం -264*

 *తిరుమల సర్వస్వం -264*

 *శ్రీవారి సంవత్సర సేవలు - 1* 


 తిరుమల క్షేత్రం ఉత్సవాలకు పుట్టినిల్లు. ప్రతినిత్యం అనేక సేవలు, ఉత్సవాలతో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతుంది. శ్రీవేంకటేశ్వరునికి జరిగే నిత్య, వార, పక్ష, మాసోత్సవాలన్నింటినీ; సంవత్సరసేవల్లో చాలా వరకూ మునుపటి ప్రకరణాల్లో చెప్పుకున్నాం. మిగిలిన సంవత్సర సేవల గురించి ఈనాటి ప్రకరణంలో తెలుసుకుందాం.


 *పార్వేటోత్సవం* 


 క్రూరమృగాలను నిర్జించి, పౌరులను కాపాడటం క్షాత్రధర్మం. ఈ కార్యాన్ని నిర్వర్తించడానికై రాజులు, చక్రవర్తులు తరచూ వేటకు వెళ్ళేవారు. కొందరికైతే వేట ఒక వ్యసనంగా కూడా మారేది. శ్రీవేంకటేశ్వరుడు ముల్లోకాలనేలే రాజాధిరాజు. సృష్టిలోని సమస్తజీవాలు వారి పాలితులే! సదా వారిని కాపాడటం కోసం, మృగయావినోది (వేట యందు అనురక్తి కలిగినవాడు) యైన శ్రీనివాసుడు కూడా వేటాడుతూనే ఉంటారు. వాస్తవానికి సుదీర్ఘకాలం శేషాచలక్షేత్రం లోని వల్మీకం (పుట్ట) లో తలదాచుకున్న శ్రీనివాసుడు అశ్వారూఢుడై వేటకు వెడలినప్పుడే నారాయణవనం ప్రాంతంలోని అరణ్యంలో పద్మావతీ దేవితో తొలి పరిచయం జరిగి వారి పరిణయానికి దారి తీసింది.


 ఆధ్యాత్మిక దృష్టితో అవలోకించినట్లైతే, అడవుల్లో సంచరించే క్రౄరమృగాలు, యుద్ధరంగంలో శత్రువుల కంటే; నిత్యమూ మనను అంటిపెట్టుకుని ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు (అంతర్గతంగా ఉండే ఆరు శత్రువులు) మరింత ప్రమాదకరమైనవి. వాటిపై విజయం సాధించాలంటే, ఇంద్రియాలను అదుపులో నుంచుకో గలిగే ఆత్మనిగ్రహం కావాలి. పరమాత్ముని కృపతోనే అది సాధ్యం.


 ప్రతి ఏడాది సకల లాంఛనాలతో, రాజోచిత సత్కారాల నందుకుంటూ పార్వేట ఉత్సవంలో పాల్గొనే శ్రీవేంకటేశ్వరుడు తన శరణు జొచ్చినవారిని అరిషడ్వార్గాల నుండి కాపాడతాననే అభయమిస్తున్నాడు. ప్రధానాలయం నుండి పాపనాశనం వెళ్ళే రహదారికి ఎడం ప్రక్క, నిర్జనంగా నున్న అటవీ ప్రాంతంలో, రాచఠీవితో ఉట్టిపడే ఓ ప్రాచీన మంటపమే పార్వేట ఉత్సవానికి వేదిక. దీనినే 'పార్వేట మంటపం' గా పిలుస్తారు.


 మకరసంక్రాంతి పండుగ దినాలలో మూడవనాడైన 'కనుమ' రోజు ఈ ఉత్సవం జరుగుతుంది. ఆరోజు శ్రీనివాసునికి యథావిధిగా ప్రాతఃకాలం జరిగే నిత్యకైంకర్యాలు పూర్తయిన తరువాత, స్వామివారు రథారూఢుడై ఆలయం నుండి పార్వేటమండపానికి బయల్వెడలుతారు. మరో రథంలో, ఆనందనిలయ వాసియైన శ్రీకృష్ణుడు వారిననుసరిస్తారు. ఆ మంటపంలో స్వామివారికి పుణ్యాహవచనం, ఆరాధన, నివేదన వంటి ఉపచారాలు జరిపి, వారిని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మంచెపై ఆసీనుల్ని చేస్తారు. తదనంతరం వేదపఠనం, అన్నమయ్య కీర్తనాలాపనలతో పాటుగా; అన్నమయ్య వంశస్తులకు, హాథిరామ్ జీ మఠం వారికి సత్కారాలు జరుగుతాయి.


 ఈలోగా, శ్రీకృష్ణుడు పార్వేట మండపానికి ప్రక్కనే ఉన్న 'గొల్లవిడిది' కి వేంచేసి, చిన్నికృష్ణుణ్ణి తలపుకు తెస్తూ పాలు,వెన్న ఆరగిస్తారు. తదనంతరం వారిని పార్వేటమండపానికి తోడ్కొనివెళ్ళి; గొల్లవారు సమర్పించుకున్న పాలు, వెన్నను మలయప్పస్వామి వారికి కూడా నివేదించి, హారతి సమర్పించు కుంటారు.


 తదనంతరం మలయప్పస్వామి వారు వేటకు బయల్దేరుతారు. వేగంగా పరుగెడుతున్న మృగరాజును తరుముతున్నట్లు, స్వామివారు కూడా వేగంగా ముందుకు కదులుతారు. స్వామివారి తరఫున అర్చకులు శరాన్ని (బాణం) సంధిస్తారు. ఈ విధంగా కొన్ని పర్యాయాలు జరిగిన తరువాత, వేట ముగుస్తుంది. ఉత్సవానంతరం మలయప్పస్వామి, శ్రీకృష్ణుడు యథావిథిగా ఆలయ పునఃప్రవేశం చేస్తారు.


 వేట సన్నివేశాన్ని రక్తి కట్టించడంలో పల్లకీని మోసే బోయీలు, స్వామివారి తరఫున శరసంధానం చేసే అర్చకులు ప్రధానపాత్ర పోషిస్తారు.


శ్రీవారి పార్వేటోత్సవాన్ని దర్శించుకున్న వారికి ఇంద్రియనిగ్రహం కలుగుతుందని, తద్వారా వారు అరిషడ్వర్గాలను జయించ గలరని భక్తుల విశ్వాసం.


 *పవిత్రోత్సవాలు* 


 తిరుమల క్షేత్రం పవిత్రతకు మారుపేరు. ఆలయంలో జరిగే ఉత్సవాలు, ఉపచారాలు అన్నీ శాస్త్రోక్తంగా, ఆగమశాస్త్రబద్ధంగా జరుగుతాయి.


 వైదిక సాంప్రదాయాలననుసరించి కొన్ని సందర్భాలలో అశౌచాన్ని (వ్యావహారిక భాషలో అశౌచాన్ని 'మైల' గా వ్యవహరిస్తాం) తప్పనిసరిగా పాటించాలి. ఈ నిబంధనల వెనుక వైదిక కారణాలతో పాటు వ్యావహారిక, ఆరోగ్యపరమైన కారణలు కూడా ఎన్నో ఉన్నాయి. అంతే గాకుండా, వైఖానస ఆగమసూత్రాలననుసరించి స్వామిని అర్చించడానికి కొన్ని నిర్దిష్టమైన, సంక్లిష్టమైన, విస్తృతమైన నియమాలను పాటించాలి.


 కానీ, నిత్యము లక్షకు పైగా భక్తులు, వందల సంఖ్యలో సిబ్బంది, పదుల సంఖ్యలో అర్చకులు సందర్శించే ఆలయంలో, తెలిసో తెలియకో పొరపాట్లు జరిగే అవకాశముంది. అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ కొన్ని లోటుపాట్లు జరగవచ్చు. అటువంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఏవిధమైన భంగం కలుగకుండా, దోషపరిహారార్థం జరిపించే ఉత్సవాలను 'పవిత్రోత్సవాలు' గా పిలుస్తారు. 


 వందల సంవత్సరాలుగా అమలులో ఉన్న ఈ ఉత్సవాలు పాలకులు మారడం వల్ల కొంతకాలం నిలిచిపోగా, 1962 లో పునరుద్ధరించబడి అప్పటినుండి నిరాటంకంగా జరుగుతున్నాయి.   

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం*


*401 వ రోజు*


*కర్ణార్జునుల యుద్ధ సమారంభం*


అప్పుడు అర్జునుడు కర్ణుడు ఒకరికి ఒకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. అప్పుడు కర్ణుడు శల్యుని చూసి " మద్రరాజా ! అర్జునుడు నన్ను జయించిన మీరు ఏమి చేస్తారు ? " అన్నాడు. నేను కృష్ణార్జునులతో యుద్ధము చేస్తాను " అన్నాడు శల్యుడు. అక్కడ అర్జునుడు కూడా " కృష్ణా !కర్ణుడు నన్ను జయించిన నువ్వేమి చేస్తావు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! సూర్యుడు పశ్చిమాన ఉదయించినా కర్ణుడి చేతిలో నీవు ఓడి పోవుట జరగదు. నీ ప్రశ్నకు సమాధానం అవసరం లేదు. విధి వక్రించి అలా జరిగితే అలాంటి దురవస్థను నేను నవ్వులాటకైనా భరించ లేను. కౌరవవంశం నిర్మూలించి ఆ కర్ణుడిని, శల్యుని ఒంటి చేత వధించి ఈ కురు సామ్రాజ్యానికి ధర్మరాజును చక్రవర్తిని చేస్తాను. ఇది నిశ్చయము " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! నేను నవ్వులాటకు అన్నాను కాని నీదాకా రానిస్తానా! నాడు కురు సభలో ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొనక వదులుతానా ! ఆ త్రిమూర్తులు అడ్డుపడినా నేడు నా చేతిలో కర్ణుడు చావడం తధ్యం. కర్ణుడు తల నా చేత నరకబడటం నీవు వినోదంగా చూడు. కర్ణుడి భార్యను శల్యుడి భార్యను విధవలుగా చేస్తాను " అన్నాడు. ఇరు పక్షముల వారు ఎదురు ఎదురుగా నిలిచారు. కర్ణుడికి అర్జునుడికి మధ్య లోకోత్తర యుద్ధము జరుగ బోతుందని దేవతలు సహితము యుద్ధము కనులారా చూడటానికి ఆకాశంలో కూడారు.


*అశ్వత్థామ సుయోధనుడి వద్ద సంధి ప్రస్థావన తెచ్చుట*


కర్ణార్జునులు ఒకరితో ఒకరు సమరానికి సిద్ధపడిన సమయానఅశ్వత్థామ సుయోధనుడితో " సుయోధనా ! భీష్ముడు అంతటి వాడు అర్జునుడి చేత ఓడి పోయాడు. ఈ కర్ణుడు అంతకంటే గొప్పవాడా ! అర్జునుడి ముందు నిలువగలడా ! నేను అర్జునుడిని సమాధానపరుస్తాను నీవు కర్ణుడిని అనునయించు. మనం అందరం ధర్మరాజుతో సంధి చేసు కుంటాము. వ్యవహారం చక్కబడుతుంది. భీముడు నకులసహదేవులు ధర్మరాజు చెప్పిన మాట వింటారు. నా మాట విన్న నీవు, నీ సహోదరులూ, సకల రాజన్యులు, సాధారణ జనం క్షేమంగా ఉంటారు. నీవు నన్ను కృపాచార్యుడిని, కర్ణుడిని నమ్ముకున్నావు. నేను కృపాచార్యుడు ఎవరి చేతిలో చావమని అర్జునుడిని గెలువ గలమని అనుకోవడం పొరపాటు. భీష్ముడు, ద్రోణుడు అరివీర భయంకరులనీ వారిని ఎవరు ఓడించ లేరని అనుకున్నారు. కాని కృష్ణుడి సాయంతో అర్జునుడు వారిని గెలువలేదా ! వారు మరణించ లేదా ! మేమూ అంతే కదా ! కనుక పాండవులతో సంధి చేసుకోవడం ఉత్తమం. కృష్ణుడు రాయబారిగా వచ్చినప్పుడు మనం ఏదేదో అన్నామని ఇక సంధి అసాధ్యమని అనుకోవద్దు. నీ తండ్రి ధృతరాష్ట్రుడిని ధర్మరాజు చక్రవర్తిగా అంగీకరిస్తాడు. అతడి పాలనలో మనమంతా హాయిగా ఉంటాము. కర్ణుడు కూడా నా మాట వింటాడు. మాకు నీవు బ్రత కడం కావాలి. బ్రతికి ఉంటే సుఖములు అనుభవించ వచ్చు కదా! చచ్చి ఏమి సాధిస్తావు ! కనుక అసూయా ద్వేషాలు మాని సంధికి ఒండంబడుట మంచిది. అందరికీ శ్రేయోదాయక మైన సంధికి అంగీకరించక ఉన్న సాము చేస్తున్న త్రాటి నుండి పడినట్లు అధఃపాతాళానికి పోతావు జాగర్త " అన్నాడు.


*సంధికి సుయోధనుడి నిరాకరణ*


అశ్వత్థామ మాటలు సావధానంగా విన్న విరక్తిగా నవ్వి " అశ్వత్థామా ! నీవు ఎంత వెర్రి వాడవయ్యా ! నా తమ్ముడు దుశ్శాసనుడిని చంపి ఒక శపథం నెరవేర్చు కున్న భీముడు నన్ను చంపి రెండవ శపథం నెరవేర్చక మానతాడా ! ఇంత జరిగిన తరువాత సంధి ఏమి బాగుంటుంది. ఈ సమయంలో కర్ణుడు యుద్ధము మానగలడా ! కానున్నది కాక మానదు. నీ ప్రయత్నము విరమించుట మంచింది. అర్జునుడిప్పుడు బాగా అలసి ఉన్నాడు. కర్ణుడు అవక్రపరాక్రమంతో విలసిల్లు తున్నాడు. ఇప్పుడు కర్ణుడి చేతిలో అర్జునుడి వధ తధ్యం " అన్నాడు. సుయోధనుడు తన సేనలను ఉత్సాహ పరిచాడు.

కర్ణార్జునుల యుద్ధం


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత:  ఏడవ అధ్యాయం

విజ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే

యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః (3)


భూమిరాపో௨నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ 

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా (4)


ఎన్నో వేలమందిలో ఏ ఒక్కడో యోగసిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్న వాడు ఏ ఒక్కడో వుంటాడు. నా మాయాశక్తి ఎనిమిది విధాలుగా విభజింపబడింది. అవి: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం.

వివాహమెందుకు

 *🙏వివాహమెందుకు?*🙏


*ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది.*

*దీనికి సమాధానం* *ప్రతివారూ* *తెలుసుకోవాలి.* 

*ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు.*

1. ఋషిఋణం, 

2. దేవఋణం, 

3. పితృ ఋణం.


ఈ ఋణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ ఋణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు ఋణ విముక్తుడు కావాలి. దానికి ఏంటి మార్గం? మన పెద్దలు చెప్పారు - "బ్రహ్మచర్యేణ ఋషిభ్యః" " యజ్ఞేన దేవేభ్యః" "ప్రజయా పితృభ్యః" అని.


1. ఋషి ఋణం: 


బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో చేయవలసిన వేదాధ్యయనం చేయాలి. అలాగే పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి.


2. దేవఋణం: 


యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి. నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికి మనమెంతో ఋణపడివున్నాం. కనుక ఆ ఋణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నలం అవుతాం.🙏


3. పితౄణం: 


సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి. సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి గదా! "ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః" అంటుంది వేదం. అంటే వంశపరంపరను త్రెంచవద్దు. వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, సంతానము కనడం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెపుతున్నది. యజ్ఞాలలో పంచ యజ్ఞాలు విధిగా ప్రతి మనిషీ చేయాలి. అవి దేవ, మనుష్య, భూత, పితృ, బ్రహ్మ యజ్ఞాలు.


🌳🙏సేకరణ🙏🌳

*డెత్ సర్టిఫికెట్

 *డెత్ సర్టిఫికెట్:*

       ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్టుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది. 


     ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు.

  

     “చూడు నాయనా! విద్యుత్ బల్బు లు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను, నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా. 

                                                                                                            అంతే .. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి.


     ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. "నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వే లో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావు గారు ఆర్మీలో లెఫ్నె౦ట్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివ గారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను" 

"మాడిపోయిన బల్బ్ లు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటి కి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్.. ఏది అయినా ఒకటే. 


     అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బ్ లమే. 

ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా! ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. 


       మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటి కి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే.. ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి. 

చదరంగం ఆటలో రాజు, మంత్రి.. వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే.. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి మూత పెడతాము. 


     ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు..

 

     మన జీవితంలో ఎన్ని సర్టిఫికట్లు పొందినా.. చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే.. 

అదే డెత్ సర్టిఫికేట్.



*గౌ.శ్రీ. జస్టిస్ ఎన్.వి.రమణ*

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి


          *సేకరణ*✒️

యుద్ధ క్షేత్రం

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹అది యుద్ధ క్షేత్రం. ఇటు పాండవులు, అటు కౌరవులు వారి వారి సైన్యాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధ క్షేత్రంలోని విశేషాలు చెబుతున్నాడు. దుర్యోధనుడు ఆచార్యుడైన ద్రోణుని వద్దకు వచ్చి ఏమన్నాడో ఈ ఎపిసోడ్ లో సునీల్ ఆకెళ్ల వివరిస్తున్నారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

మణిపూరక చక్రం.

 మణిపూరక చక్రం.

 

మనవ శరీరం లొ ఇది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది నాభి కి కుడివైపు ఒక అంగుళం దూరం లొ వెన్నుని ఆనుకొని ఉంటుంది. ఇది గతి తప్పినా అనగా సరిగ్గా శక్తి సంచాలనం చేయక పోయినా లేక స్థితి తప్పినా అనగా ఉండాల్సిన చోట ఉండకుండా కొంచెం కదిలినా శక్తి హీనం అయినా మనిషి చాలా రోగాలుకి గురి అవుతాడు.


మణిపూరక చక్రం పరీక్ష - 

 

 మణిపూరక చక్రం సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి 2 పరిక్షలు ఉన్నాయి .

 

* పరగడుపున అనగా ఏమీ తిననప్పుడు వెల్లికిలా పడుకొని నాభిలో వేలుపెట్టి కొద్ది గా అదిమితే గుండె చప్పుడు లాంటిది వినపడుతుంది.అలా వినపడితే మణిపూరక చక్రం సరిగ్గా ఉన్నట్టు.


 * నాభి స్థానం నుండి కుడి ఎడమ స్థనగ్రముల వరకు దూరాలు కొలవండి. ఈ రెండు దూరములు సమానం గా ఉంటే మణిపూరక చక్రం సరిగ్గా ఉన్నట్టు.

 

మణిపూరక చక్రం కదలడానికి గల కారణాలు - 

 

     మూలాధారం నుండి ప్రారంబించి ఆ చక్రాలు ఒక నిర్ణిత స్థానం లొ ఉంటాయి. ఈ చక్రాలు ఒక నిర్ణీత స్థానం లొ వెన్నుని ఆనుకుని ఉంటాయి.వీటి సంభందం శరిరం లొని నాడీ కేంద్రాలతో అన్నిటితో ఉంటుంది . ఈ నాడి కేంద్రాలలో ని అయస్కాంత శక్తి తగ్గినప్పుడు వాటికి అనుగుణం గా చక్రాల స్థితులలో మార్పు రావోచ్చును కారణం ఇవన్ని జివయస్కాంత శక్తి కేంద్రాలు.కనుక 


 శరీరం లొ జీవయస్కాంత శక్తి తగ్గడానికి గల కారణాలు - 


 * చాలా ఎక్కువ సమయం ఇనప వస్తువులపై కూర్చోవడం.


 * ఎక్కువుగా ఇనప గ్రిల్ల్స్ మొదలయినవి ఉండే ఇంట్లో నివసించడం.


 * అత్యధిక ఉష్ణం కలిగించె ఆహరం తరుచుగా తినడం.


 * అయస్కాంత శక్తి తగ్గిపోయిన స్త్రీ తొ కాని పురుషుడు తో కాని సంభందం పెట్టుకొవడం.


 * ఉప్పు, కారం లు అదికం గా తినడం


 * మాంసాహారం హద్దు దాటి తినడం .

 

* ఎక్కువ సమయం స్కూటరు, కార్ మొదలయిన వాహనాలు గాని లేక రోడ్ రోలర్ , ప్రొక్లియన్ వంటి వాహనాలు నడపడం.


 * అయస్కాంత విదుతయస్కాంత యంత్రాలకు సంభందించిన ఉద్యోగాలు.


 * చాలా శక్తి వంతమైన విధ్యుత్ తో నడిచే యంత్రాల వద్ద పని చేయడం .

 

మణిపూరక స్థానభ్రంశం వలన కలుగు రోగాలు - 


 " ఉదార విథానం " ( Diaphram ) అనేది కడుపుని పై భాగాన్ని వేరు చేస్తూంది .ఈ ఉదార వితానం క్రింది భాగం లొ ముఖ్యం గా నాభి నుండి క్రిందికి గల భాగం లొ ఏ రోగమైన రావొచ్చు. 

 

* జీర్ణకోశ వ్యాదులు , అల్సర్, apendisitees , డయారియా , డిసెంత్రీ , లైంగిక సమస్యలు, నడుంనొప్పి, పైల్స్ , phiistula , కడుపు నొప్పి ఇటువంటివి రావొచ్చు.

 

 మణిపూరక చక్రం శక్తి హీనం అయ్యి స్థానబ్రంశం పొందినా కాలేయం పాంక్రియాస్ పాడు అయ్యి మదుమేహం రావొచ్చు .పెద్ద ప్రేవులలో, పురీష నాళం కాన్సర్ రావొచ్చు .

 

మణిపూరక చక్రాన్ని సరి చేయు విధానం -


. వెల్లికిలా పడుకోండి . నాభి పైన ఒక రూపాయి బిళ్ళ ఉంచండి.దానిపైన ఒక కొవ్వొత్తి ఉంచండి.దానిపై ఒక స్టీల్ గ్లాస్ బోర్లించి పట్టుకోండి.వేడి వలన గ్లాస్ లొ ప్రాణ వాయువు

 ఖర్చు అయిపోయి శూన్యం ఏర్పడుతుంది.లేదా వాయువు వ్యాకోచించి ఒత్తిడి ఎర్పడుతుంది. ఆ వత్తిడి వలన మణిపూరక చక్రం సరి అయిన స్థానం లొ కి వస్తుంది. ఈ ప్రక్రియను నాలుగు , అయిదు సార్లు చేసి మణి పూరకానికి పైన చెప్పిన పరీక్షలు నిర్వహించాలి. అది సరి అయిన స్థానానికి వచ్చినపుడు గుండె చప్పుడు వినిపిస్తుంది.


 * అరచేతి కేంద్ర స్థానాన్ని గాని అరకాలి కేంద్ర స్థానాన్ని బొటన వ్రేలితో నొక్కండి.(sound వినపడే వరకు ) .


 * వెల్లికిలా పడుకొని గాలి పీల్చి కడుపుని ఉబ్బించి పెట్టండి అలా మణిపూరక చక్రం తన స్థానం వచ్చె వరకు చేయండి .


 * సూర్య యంత్రం మెడలో ధరించండి.

 

* సూర్య నమస్కారాలు చేయండి .


 * కుడి చేతి మద్య వేలికి మాణిక్యం ధరించండి. 

  

            మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.

   

  గమనిక -

    

  నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

                 

. కాళహస్తి వేంకటేశ్వరరావు .

              

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                         

. 9885030034

ఇంటి ముందు చెట్టు

 ఇంటి ముందు చెట్టు పోయి ఇంట్లో A.C వచ్చింది.

ఇంటి బయట పొయ్యి పోయి ఇంట్లో గ్యాస్ వచ్చింది.

ఇంటి ముందు అరుగులు పోయి ఇంట్లో టీవీ వచ్చింది.

ఇంటి ఆవరణలో పెరడు పోయి పాలరాయి ఫ్లోర్ అయింది.

ఇంటి బయట కుండ పోయి ఇంట్లో ఫ్రిడ్జ్ అయింది.

ఒంట్లో బద్దకం చేరి ఇంట్లో వాషింగ్ మెషీన్ అయింది.

ఇంటి బయట రుబ్బురోలు పోయి ఇంట్లో మిక్సీ అయింది.

ఇంట్లో పుస్తకాలు పోయి చేతిలో మొబైల్ అయింది.

ఇంటిముందు రంగవల్లులు పోయి పెయింటింగ్ లు వచ్చాయి.

ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో అనాధలయ్యారు.

ఇంటి బయట మరుగుదొడ్లు ఇంట్లో ఎటాచ్ బాత్రూమ్స్ అయ్యాయి.

అమ్మ,నాన్న,అత్త,మామ,బాబాయ్,పిన్ని పిలుపులు మామ్, డాడ్,అంటీ,అంకుల్ గా మారాయి.

శరీరానికి రాసే సున్ని పిండి పోయి మార్కెట్లో సబ్బులయ్యాయి.

జుట్టుకు పెట్టుకొనే కుంకుడుకాయలు పోయి షాంపూలు అయ్యాయి.

గడపకు కట్టే పచ్చని తోరణాలు ప్లాస్టిక్ పువ్వులయ్యాయి.

వంట చేసుకొనే మట్టి పాత్రలు ఇంట్లో స్టీల్,ప్లాస్టిక్ గిన్నెలయ్యాయి.

ఇంట్లో ఆయుర్వేద వైద్యం మరచి పోయి వీధిలో 

మెడికల్ షాపులకు వలసకట్టాము.

శరీరాన్ని కప్పుకొనే దుస్తులు పోయి ఫ్యాషన్ మాయలో గుడ్డ పీలికలయ్యాయి.

ముఖానికి రాసుకొనే పసుపు,మీగడ పోయి మార్కెట్లో ఫేస్ క్రీములయ్యాయి.

పొడుగైన వాలుజాడలు కొత్తిమీర కట్టలయ్యాయి.

చేతికి అందంగా పెట్టుకొనే గోరింటాకు పోయి మెహిందీ కోనులయ్యాయి.

కుటుంబం కలిసి జరుపుకొనే పండుగలు,పబ్బాలు 

వాట్సప్ స్టేటస్ గా మారాయి.

సాంప్రదాయబద్ధమైన పెళ్ళిళ్ళు పోయి డెస్టినేషన్ పెళ్ళిళ్ళు వచ్చాయి..

ఎడ్లబండ్లు పోయి పెట్రోల్ వాహనాలు వచ్చాయి..

పచ్చని పొలాలు ఫ్యాక్టరీలు,భవంతులయ్యాయి.

కుటుంబంలో అనుబంధాలు ఆర్ధిక సంబంధాలయ్యాయి...

ఇంటి చుట్టూ బంధాలు అవసరాలకు పరిమితమయ్యాయి.

మనిషిలో మంచి,మానవత్వం పోయి మోసం,ద్వేషం పెరిగాయి.

సంపాదన ధ్యాసలో మనిషి జీవితం యాంత్రికంగా మారింది.

డబ్బే పరమావధిగా,వస్తువులే హోదాగా భావించే మనిషి రాక్షసుడయ్యాడు.

నాటి మనిషి జీవితం ఆరోగ్యంగా,ఆనందంగా సాగేది..

నేటి మనిషి జీవితం ఒత్తిడి,ఆందోళనలు,

అనారోగ్యంతో సాగుతుంది..

ఆధునికత మాయలో ప్రకృతిని కలుషితం చేసి 

మన గొయ్యిని మనమే తవ్వుకున్నాము.

"పెరుగుట విరుగుట కొరకే" అంటే ఇదే మరి.