11, జులై 2023, మంగళవారం

శ్రీ డౌల్ గోవింద ఆలయం

 🕉 మన గుడి : 





⚜ అస్సాం : ఉత్తర గౌహతి


⚜ శ్రీ డౌల్ గోవింద ఆలయం


💠 బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున , చంద్రభారతి కొండ పాదాల మీద ఉన్న డౌల్ గోవింద దేవాలయం అస్సాంలోని గౌహతిలో అత్యంత ముఖ్యమైన వైష్ణవ శాఖకు చెందిన  అత్యంత ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలలో ఒకటి. 


💠 ఆలయంలో ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. 

ఈ దేవాలయం గౌహతిలో ఉన్న శ్రీకృష్ణుని పుణ్యక్షేత్రాలలో ఒకటి. 

ఆలయ ఆవరణలో నామ్‌ఘర్ (అస్సామీ ప్రార్థనా స్థలం) ఉంది. 

దౌల్ గోవింద దేవాలయం  అపారమైన ప్రకృతి సౌందర్యాన్ని కలిగి ఉంది. 

చాలా మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించి, శ్రీకృష్ణుని ప్రార్ధనలు చేయడానికి వస్తారు.



⚜ స్థల పురాణం ⚜


💠 నల్బరీకి చెందిన గంగారామ్ బారువా అనే వ్యక్తి  శ్రీకృష్ణుడి విగ్రహాన్ని నల్బరి సమీపంలోని ఏకాంత ప్రదేశం నుండి సంధ్యాసర్ నుండి తీసుకువచ్చి రాజదూర్‌లో ప్రతిష్టించాడని చెబుతారు. 

అతను ఆలయంలో సాధారణ "పూజ" మరియు "అర్చన" చేసేవాడు. 

ఆ సమయం నుండి దౌల్ గోవింద ఆలయంలో సాధారణ "పూజ" మరియు "అర్చన" నిర్వహిస్తారు మరియు ఇక్కడ హోలీ పండుగ విశేషంగా జరుపుకుంటారు. 


💠 ఆలయం యొక్క మొదటి అసలు నిర్మాణం 150 సంవత్సరాల క్రితం నిర్మించబడింది మరియు  1966లో పునరుద్ధరించబడింది. ప్రస్తుతం, దౌల్ గోవింద ఆలయాన్ని 25 మంది సభ్యుల కమిటీ నిర్వహిస్తోంది.


💠 పూజలు : 

దౌల్ గోవింద దేవాలయంలో ప్రతిరోజూ శ్రీకృష్ణుని పూజలు జరుగుతాయి. రోజూ ఉదయం 7 గంటలకు ఆలయం తెరవడంతో ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి.

శ్రీ కృష్ణ భగవానుడి విగ్రహం "అర్చన" తరువాత సాంప్రదాయ ఆచారాలు మరియు అభ్యాసాలతో స్నానం చేయబడుతుంది. ఆలయం తెరిచిన తర్వాత స్వామిని ప్రార్థించేందుకు భక్తులు ఆలయానికి రావడం ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ రోజు చివరి వరకు కొనసాగుతుంది. 


💠 స్వామివారికి "భోగ్" ( నైవేద్యం) సమర్పించడం కోసం మధ్యాహ్న సమయంలో ఆలయ తలుపులు కొంత సమయం పాటు మూసివేయబడతాయి, తరువాత ఒక హాలులో భక్తులకు "భోగ్" పంపిణీ చేస్తారు. 

సాయంత్రం స్వామికి భక్తిగీతాలు పాడుతూ

హరికృష్ణ ఆరతి భక్తి పాటలు లేదా 'కీర్తన్' పాడటం ద్వారా  "ఆరతి" చేస్తారు.


💠 డౌల్ గోవింద ఆలయంలో పండుగలు జరుపుకుంటారు.

దౌల్ గోవింద దేవాలయం శ్రీకృష్ణుని పండుగలను జరుపుకోవడానికి ప్రసిద్ధి చెందింది. 

డౌల్ గోవింద ఆలయంలో ఏడాది పొడవునా వివిధ పండుగలు జరుపుకుంటారు. దేవాలయంలో జరుపుకునే అన్ని పండుగలలో రంగుల పండుగ హోలీ ప్రధానమైనది. ఆలయంలో హోలీని ఇక్కడ చాలా కోలాహలంగా మరియు ఉల్లాసంగా జరుపుకుంటారు. 

ఆలయంలో 5 రోజుల పాటు హోలీ పండుగను జరుపుకుంటారు. 

వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా స్థానిక ప్రజలు ఆలయంలో హోలీని జరుపుకుంటారు. 


💠 సంవత్సరంలో ఈ సమయంలో రంగుల పండుగను జరుపుకోవడానికి వేలాది మంది యాత్రికులు ఆలయంలో గుమిగూడుతారు.


💠 శ్రీ కృష్ణ జన్మాష్టమి దౌల్ గోవింద మందిరంలో అదే ఉత్సాహంతో జరుపుకునే మరొక పండుగ. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. 

జన్మాష్టమి  సందర్భంగా ఆలయంలో రాత్రంతా "పూజ" మరియు "హోం-జగ్య" ( హోమం- జాగరణ ) నిర్వహిస్తారు. 


💠 ఈ ఆలయంలో మాఘి ( మాఘ) పూర్ణిమ పండుగను కూడా జరుపుకుంటారు. 

ఈ సమయంలో "భోగ్" తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తారు.


💠 డౌల్ గోవింద ఆలయం, గౌహతి, అస్సాం, రోజువారీ దర్శన సమయాలు

ఆలయం ఉదయం 7.00 నుండి సాయంత్రం 8.00 గంటల వరకు తెరిచి ఉంటుంది.


💠 రవాణా :

సాధారణంగా ఫెర్రీలు అలాగే స్టీమర్లు ఫ్యాన్సీ బజార్ ఫెర్రీ ఘాట్ నుండి రాజదూర్ వరకు అందుబాటులో ఉంటాయి, ఇది ఆలయానికి చేరుకోవడానికి సులభమైన మరియు వేగవంతమైన మార్గం. రాజదూర్‌లో దిగిన తర్వాత, ఆలయానికి చేరుకోవడానికి ఐదు నిమిషాల నడక. ట్రెక్కర్లు ఖర్గులి నుండి అలాగే అడబరి మరియు జలుక్‌బరి నుండి అందుబాటులో ఉంటారు . 


💠 గౌహతి డిస్పూర్ నుండి 15 కి.మీ, షిల్లాంగ్ నుండి 98 కి.మీ, కోహిమా నుండి 350 కి.మీ, ఇంఫాల్ నుండి 485 కి.మీ.

ప్రతి ఫలం

 

 ప్రతి ఫలం 

కొన్ని సందర్భాలలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇవ్వవచ్చు.  ఇటువంటి దానికి నిదర్శనంగా ఆది శంకరుల ఒక వృత్తాంతం తెలుపుతారు. 

బాల శంకరులు బిక్షాటన కొరకు ఒకసారి ఒక గుడిశముందు నిలబడి " భవతి బిక్షం దేహి" అని యాచించాడట కానీ ఆ గృహంలోనుంచి ఎంతసేపటికి ఎవ్వరు రాలేదట.  అయినా కానీ మన శంకరులవారు ఇంకా నిరీక్షిస్తూ ఉన్నారట. కొంతసేపటికి ఒక పేదరాలు వణుకుతున్న చేతులతో స్వామికి లేదు అని చెప్పటానికి మనస్కరించక ఒక ఉసిరిక పండును మాత్రం ఆయన జోలెలో వేసిందట. ఆమె దైన్యతను గమనించిన శంకరాచార్యులవారు ఒకసారి ఆమె గుడిసెను పరికించారట అంతా కాళిగా ఉండటం చూసి ఆమె కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నదని తెలుసుకున్నారట. 

శంకరులవారి మనస్సు ఆర్ద్రతమైనదట. వెంటనే శంకరాచార్యులవారు మహాలక్షిని స్తుతిస్తూ స్తోత్రము చేశారట.  ఆయన స్తోత్రానికి ప్రసన్నమైన అమ్మవారు ఆయనకు ప్రత్యక్షం అయి నాయనా ఎందుకు నన్ను పిలిచావు అని అడిగింది.  దానికి శంకరులవారు అమ్మా ఇది నీకేమైనా న్యాయంగా ఉన్నదా ఈ స్వాద్విమణి  దీనత్వం చూసి నీకు దయరాలేదా తల్లి అని వేడుకొన్నాడు. అప్పుడు అమ్మవారు నాయనా నేను ఏమి చేతును ఆమె గతజన్మలో పూర్తిగా పిసినారిగా వుంటూ ఎవరికి కూడా ఎటువంటి దానధర్మాలు చేయకుండా ఉండి పూర్తిగా పుణ్యరహితంగా ఉండటం వలన ఆమెకు ఈ జన్మలో ఈ దారిద్యం దాపురించింది.  అమ్మా ఆమె ఏ పుణ్యము చేయలేదు సరే మరి ఆమె భర్త పుణ్యము వలన అయినా ఈమెకు కొంత ఊరట కలగాలి కదా తల్లి అని అన్నాడు. దానికి తల్లి నాయనా ఆమె భర్త ఈమెకన్నా ఎక్కువ పాపాత్ముడు . అందుకే వారిద్దరిని కలిపాడు పరమేశ్వరుడు.  ఇద్దరు ఒకరిని మించిన వారు ఇంకొకరు.  కాబట్టి వారు ఈ దారిద్యాన్ని అనుభవిస్తున్నారు అని అన్నారు అమ్మవారు. 

నాయనా ప్రస్తుత పరిస్థితుల్లో వారి దారిద్యాన్ని బాపటం ఆ పరమేశ్వరుని వశం కూడా కాదు వారు అంత పాపాత్ములు అని తల్లి ఉన్నసంగతి తెలిపింది. అప్పుడు ఆలోచించటం శంకరులవారి వంతయినది శంకరులు అంటే సాక్షాత్తు శంకరులేకదా మరి శంకరాచారులవారు ఊరుకుంటారా.  తల్లి నీవు చెప్పింది నిజమే ఆ సాద్విమణి ఏ పుణ్యము గత జన్మలో చేసి ఉండకపోవచ్చు.  మరి ఈ జన్మలో విషయం ఏమిటి తల్లీ అని అమ్మవారిని మరల వినమ్రుడై అడిగాడు.  ఈ జన్మలోకూడా ఆమె ఏ రకమైన దానం చేయలేదు అని తల్లి బదులిచ్చింది. అప్పుడు శంకరులవారు ఒక్కసారి ఆమె గుడిశ మొత్తం పరికించి చూడు తల్లీ అని వేడుకున్నాడు.  మొత్తం చూసిన మహాలక్షి ఏమున్నది నాయనా అని అన్నది.  తల్లీ నేను చెప్పేది కూడా అదే ఆ సాద్వీమణికి ఇవ్వటానికి ఏమిలేకపోయినా నాకు ఒక ఉసిరిక పండును దానం చేసింది తల్లీ మరి ఆ దానఫలితాన్ని ఇవ్వవా అని మరల వేడుకొన్నాడు. అప్పుడు శంకరుని తెలివికి మెచ్చుకొనిన లక్ష్మీ దేవి ఆ ఇంట బంగారపు ఉసిరికాయలను వర్షించిందట దానితో ఆ పేదరాలి పేదరికం అంతా మటుమాయం అయిందట. 

ఆది శంకరులు లక్షి అమ్మవారిని ప్రసన్నురాలిగా చేసిన స్తోత్రం కనకధారా స్తోత్రముగా చాల ప్రసిద్ధి చెందింది.  ఈ స్తోత్రాన్ని భక్తితో రోజు పారాయణ చేసే భక్తులకు సిరి సంపదలు సమకూరుతాయని ప్రతీతి. త్రికరణ శుద్ధిగా అకుంఠిత దీక్షతో ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తే తప్పకుండా ఆ మహాలక్షి ప్రత్యక్షం అవుతుంది.  

చూసారా సత్పురుషునికి చేసిన ఒక చిన్న దాన ఫలితంగా యెంత ఫలితం లభించిందో కదా.  కాబట్టి మనం ఎప్పుడూ సపాత్ర దానాన్ని చేయాలి. అంటే పాత్రనెఱిగి దానం చేయాలి.  దానం చేసేటప్పుడు దాన గ్రహీత మీరు చేసే దానానికి యోగ్యుడా కాదా అని నిర్ధారణ చేసుకొని మరి దానం చేయాలి. మీరు చేసిన దాన ద్రవ్యముతో దాన గ్రహీత ఏదైనా పాపపు కృత్యాలు చేస్తే మీకు దానఫలితంగా పుణ్య ఫలం రాకపోగా ఆ పాపంలో భాగం వస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి మరి పాపాలను కొనుక్కోవటం అన్నమాట. 

మన పూర్వికులు అందుకేనేమో అన్నిదానాలలోకి అన్నదానం గొప్పది అని అన్నారు. అన్నదానం చేయటం  వలన రెండు విషయాలు అవగతం  అవుతాయి. ఒకటి అన్నం తిన్న దాన గ్రహీత ఇక నాకు చాలు అంటాడు అంటే అతను మీ దానంతో తృప్తి చెందుతాడు. కాబట్టి అతని తృప్తివలన మీకు దాని ఫలితంగా పుణ్యఫలం వస్తుంది.   ఇంకొక విషయం. మీరు పెట్టిన అన్నాన్ని మీ సమక్షంలోనే ఆరగిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో అన్న దానం వలన పాపం రాదు.  ఏదానానికైనా పాత్రను యెరిగి దానం చేయాలి కానీ అన్నదానానికి మాత్రం ఆకలితోవున్న ఎవ్వరికైనా చేయవచ్చు. పుణ్య ఫలితం ఒకేవిధంగా ఉంటుంది.  అన్నదానం కేవలం మనుస్యులకు మాత్రమే చేయాలనీ నియమం లేదు. పశుపక్షాదులకు కూడా చేయవచ్చు. నిత్యం పక్షులకు అన్నం పెట్టె వారికి ఈ జన్మలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి జీవితం కలుగుతుంది. వారి పితృదేవతలు కూడా సంతోషిస్తారు.

కాబట్టి మిత్రమా ఇతర దానాలకన్నా అన్నదానమే శ్రేష్ఠము కావున అన్నదానాన్ని చేయండి. అన్నదానాన్ని ప్రోత్సహించండి. ఆలా అని రోజు ఒక్కరికే అన్నాన్ని పెట్టి మనుషులను ఏ పని పాట చేసుకొని సోమరులుగా తయారు చేయకూడదు.  

అన్నదానం తరువాత చెప్పుకోదగిన దానం విద్య దానం. ప్రతి విద్వంసుడు తాను సముపార్జించిన విద్యను పలువురికి దానం చేసి విద్యావంతులను చేయాలి.  విద్యావంతుడైన వాడు తన విద్యతో చక్కగా జీవితాంతం సంపాదించుకొని తానూ సుఖపడి పలువురిని సుఖపెట్టగలడు.  కాబట్టి విద్యాదానం చేయటం కూడా చాలా మంచి విషయం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

బ్రహ్మపుత్ర

 సృష్టి కర్త అయిన బ్రహ్మ దేవుడు 'బ్రహ్మపుత్ర' ను తన అంశ తో ఆవిర్భవింప జేసినట్లు కథనం.


పూర్వము  శంతనుడు అనే ఋషి   వుండేవాడు. అయన భార్య అమోఘ.వీరిద్దరూ ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యం దైవ చింతనలో నియమ నిష్టలతో తపో జీవనాన్ని సాగిస్తూ వుండేవారు.


వారిని చూసి బ్రహ్మ దేవుడికి సంతోషం కలిగి 

వారికేదైనా మేలు చెయ్యాలని తలచి వారికి తన అంశ తో ఒక కుమారుని ప్రసాదించాడు.తపస్సంపన్ను డయిన 

శంతనుడు తన కుమారుని జన్మ రహస్యాన్ని తెలుసుకున్నాడు. లోకహితం కోసమే తనకు కుమారుడు కలిగాడని గుర్తించాడు.


శంతనుడు తన కుమారుడిని తెసుకొని కైలాసం, గంధమాదనం, జరుది,శంబకం అనే నాలుగు పర్వతాల మధ్యకు తీసుకొని వెళ్లి అక్కడ వదిలిపెట్టాడు.


బాలుడిని ఆ నాలుగు కొండల మధ్య వుంచగానే అతడు జల రూపంగా మారి 5 యోజనాల ప్రదేశం లో విస్తరించాడు. శంతనుడు ఆ కుండా నికి 'బ్రహ్మకుండం'అని పేరు పెట్టి తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.ఆ కుండం లో దేవతలూ, అప్సరసలూ 

స్నానము చేస్తూ వుండేవారు.ఈ బ్రహ్మ కుండమే బ్రహ్మపుత్రా నదిగా మారింది. 


రేణుకా జమదగ్నుల కుమారుడు పరశురాముడు. రేణుకాదేవి రోజూ నదికి వెళ్లి అక్కడి ఇసుకతో కుండను తయారు చేసి ఆ కుండలో నీళ్ళు తెచ్చి తన భర్త సంధ్యా వందనాని కోసం పెట్టేది. 


ఒకనాడు ఆమె కుండలో నీళ్ళు తెస్తూండగా ఆకాశం లో గంధర్వులు నాట్యం చేస్తుండడం కనిపించి వారి వైపు చూస్త్తూ వుండి పోయింది. పర పురుషులను  దీక్షగా చూడడం వల్ల ఆమె ప్రాతివ్రత్యం భంగమై ఆ కుండ పగిలి పోతుంది. మరీ యెంత ప్రయత్నించినా ఇసుకతో కుండ తయారు కాదు.


ఆమె నిరాశతో ఆశ్రమానికి తిరిగి వస్తుంది. అప్పుడు జమదగ్ని తన దివ్య దృష్టి తో తెలుసుకొని కోపంతో తన కుమారులను పిలిచి ఆమె తలను ఖండించమని ఆజ్ఞాపిస్తాడు.తల్లిని చంపడానికి  కుమారులేవ్వరూ ఒప్పుకోరు.జమదగ్ని వారి శపిస్తాడు..


అపుడు జమదగ్ని పరశురాముడి కి చెప్తాడు అతడు తండ్రి  ఆనతిని పాటించి తల్లి తల తెగ వేస్తాడు.అతడి పితృభక్తికి మెచ్చుకొని యేదైనా వరం కోరుకోమంటాడు. 


అప్పుడు పరశురాముడు తల్లిని బ్రతికించి తన తన సోదరులకు శాప విముక్తి కలిగించ మంటాడు.జమదగ్ని అలాగే చేస్తాడు. 


పరశురాముడి   కి మా తృ హత్యా పాపం అంటుకుంటుంది. అది పోగొట్టు కోవడానికి ఎన్నో తీర్థాలు,క్షేత్రాలు దర్శించినా పోదు.


జమదగ్ని కుమారుడి ని చూసి జాలిపడి మానస సరోవరం లోని బ్రహ్మ కుండం లో స్నానం చేయమని చెప్తాడు.అందులో స్నానం చెయ్యగానే అతన్ని అంటిన బ్రహ్మ హత్యా పాతకం పోతుంది పరశురాముడు ఈ పవిత్ర నీటి వల్ల  కలిగే పుణ్య ఫలాలను అందరికీ కలిగించాలనే ఉద్దేశ్యం తో తన గొడ్డలితో త్రవ్వి బ్రహ్మ కుండాన్నించి వేరు  చేసి పారేలాగా చేశాడు.


నీరు పారుతూ వెళ్లి కైలాసం లో వున్న లోహిత సరోవరం లోకి చేరింది.పరశురాముడు కైలాసం వెళ్లి అక్కడ త్రవ్వి దారి చేస్తాడు.అది భూమి పైకి ప్రవహించింది.ఈ విధంగా పరశురాముడు బ్రహ్మపుత్రను భూమి పైకి తీసుకొని వచ్చినట్టు పురాణ కథనం.


ఈ నది ఒడ్డున శ్రీకృష్ణుడు 

సత్యభామతో పాటు కొంతకాలం విశ్రమించి ఆ నదిలో స్నానమాచరించి దాని ఫలితంగానే నరకాసురుడిని సంహరించి నట్లు కథనం ఈ నదీ తీరం లోనే శివుడు మన్మథుడిని దహించి పార్వతీదేవికి జ్ఞాన బోధ చేసినాడని చెప్తారు.శ్రీ  మహావిష్ణువు ఈ నదీ తీరం  లోనే మధు కైటభులనే రాక్షసులను సంహరించాడని 

పురాణాలలో చెప్పబడింది.దీని నీరు ఎర్రగా వుండడం వల్ల.దీనికి లౌహిత్య అనే మరో పేరు కూడా వుంది.టిబెట్ లో ఈ నదికి  'తింగ్ పో' అని పేరు. అరుణాచల ప్రదేశ్ లో ;సియాంగ్' అని ఈ నదిని పిలుస్తారు.


అన్ని నదులనూ స్త్రీలుగానే వర్ణిస్తారు.కానీ ఈ బ్రహ్మపుత్ర మాత్రం పురుషుడు గా చెప్పబడ్డది.

గుండెపొటు

 గుండెపొటు గురించి సంపూర్ణ వివరణ  -  


    ఉపిరితిత్తులలో శుభ్రమైన రక్తమును అన్ని భాగాలకు సరఫరా చెసి చెడురక్తమును మరలా ఊపిరితిత్తులకు పంపించు సాధనం గుండె . ఇది ఒక పంపుసెట్ వలే పనిచేయును . శుభ్రపడిన రక్తమును తీసుకువెళ్ళునవి ధమనులు , చెడురక్తమును తీసుకెళ్ళునవి సిరలు అంటారు. నూనె , చక్కెర, తియ్యటివి , డాల్డా , నెయ్యి , మాంసం , చేపలు , గుడ్లు మొదలైన వాటిని అత్యధిక మోతాదులో విపరీతముగా వాడుట వలన ధమనులలో కొవ్వు ఏర్పడును . దీనిని కొలెస్టరాల్ అని పిలుస్తారు . 


                   ఈ కొలెస్టరాల్ పెద్ద రక్తనాళాల్లో పేరుకుని పొవడం వలన రక్తనాళం లోపలి వ్యాసార్థం తగ్గి గుండె పనిచేయుటకు కావలసినంత రక్తం సరఫరా కాదు . రక్తము నందలి ఉండు ఆక్సిజన్ గుండెకు అందకపోవడం వలన రక్తం గ్రహించుటకు గుండె అధికశ్రమ చేయవలసి ఉంటుంది. దీనివలన ఎడమవైపు రొమ్ములో నొప్పి కలుగును. దీనిని గుండెపొటు అంటారు. ఈ నొప్పి ఒక్కోసారి భరింప శక్యం కానంతగా ఉండును. ఇది ఎడమవైపు రొమ్ము నుండి ఎడమ భుజానికి అచట నుండి ఎడమ చేతి మణికట్టుకు కూడా పాకుతుంది. ఈ నొప్పితో ఊపిరి ఆడదు . చేతులు , కాళ్లు చల్లగా ఉండును. అధికంగా చెమటలు పట్టును . 


                  ఇది అత్యంత ప్రమాదకరం అయినది. ఇది ప్రాణాలు తీయుటలో మనదేశంలో మూడొవ స్థానము నందు కలదు. శారీరక శ్రమ ఎక్కువ చేయు వారిలో ఇది ఎక్కువ కనిపించును. 


  ఈ వ్యాధి నివారణోపాయాలు  - 


 *  నూనె , నెయ్యి , డాల్డాతో  తయారుచేసిన తీపి పదార్దాలు , చాకోలెట్స్ , అతి కారపు పదార్దాలు , మాంసం , చక్కెరలు వాడకూడదు . 


 *  తాజా ఆకుకూరలు , కూరగాయలు , ముఖ్యముగా ఎర్ర ఉల్లిగడ్డ , వెల్లుల్లి , సోయాబీన్స్ మొదలైన వాటిని విరివిగా వాడవలెను . 


 *  వెల్లుల్లి శ్వాసకోశ వ్యాధుల నివారణలో ఎంతో ప్రాముఖ్యత వహించును. TB వ్యాధి నివరణలో కూడా వాడతారు. రక్తమును శుభ్రపరచడంలో అత్యంత గుణకారిగా పనిచేయును . రక్తనాళాలను శుభ్రపరచును. రక్తమును పలుచబరిచి రక్తనాళాలలో సులభముగా ప్రసరించుటకు తోడ్పాటు అందించును. 


 *  ప్రతినిత్యం 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు తేనె లేదా బెల్లములో వేసి నలిపి తింటుంటే శ్వాసకోశ , హృదయ వ్యాధులు నివారణ అగును. 


 *  పీచుపదార్థం పుష్కలంగా కలిగిన ఆహారపదార్దాలు , అతిగా పాలిష్ పట్టని బియ్యం , పైన పొట్టు తియ్యని ఆపిల్ , కమలాలు , బత్తాయి కొనల పైన ఉండు తెల్లని పొరతో సహా తినవలెను . 


 *  ఎర్ర ఉల్లిగడ్డ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చును. సోయాచిక్కుడు , విటమిన్ E , క్యాల్షియం , మెగ్నీషియంలు గుండెపొటు రాకుండా కాపాడును . 


                    మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  


 

పవిత్ర పుడమిపై

 " పవిత్ర పుడమిపై, ప్రకృతి ఒసగిన ప్రశాంత జీవన మార్గం "

విశ్వ జీవన చక్రభ్రమణంలో ప్రతి సెకనూ విలువైనదే, " బ్రతుకు బ్రతకనివ్వు ", అనెడి సన్మార్గ జీవన పథంలో !

సృష్టిలో ప్రకృతి ప్రసాదించే ప్రశాంత తత్వ చింతన వెలకట్టలేనిది,             " బంగరు భవితకు సువికాస దృక్కోణమందు " !                   ప్రకృతి విశ్వ జీవరాశికి ఒసగెడి సన్మార్గ నిత్య ప్రశాంత సమైక్య జీవన గమనంలో ప్రస్ఫుటమయ్యెడి ప్రశాంత సుప్రకాశ దీప్తి ! 

ప్రకృతి, నిత్య తేజోమయ జీవన దివ్య ప్రకాశిక, సకల జీవ సురక్షా మార్గదర్శి !

సృష్టి కర్త, విశ్వ మానవాళికి ఒసగిన, సన్మార్గ జీవన పథం, నిత్య సువ్యక్తిత్వ చైతన్య తేజోమయ దృక్పథం !

భారతావనిపై, " అపౌరుషేయమై ఆవిర్భవించిన పవిత్ర వేద నాదం ", సర్వ శుభంకరి, సర్వ శ్రేయోభిలాషి !

పవిత్ర పుడమిపై  కలుపుకుపోయే తత్వం, సకల విశ్వ జీవ సుహృద్భావ, సువికాస జీవన మార్గగామి !

ప్రతి వ్యక్తీ నేడు యోచించాల్సిన ముఖ్య విషయం, సకల విశ్వ శ్రేయోభివృద్ధి, సకల జీవ సంరక్షణాత్మక జీవనవిధానం !

అణువణువూ నిండి ఉన్న పరమాత్మ సత్కటాక్ష సముపార్జనకు, ప్రకృతి ప్రసాదించే సన్మైత్రీ భావనాత్మక రక్షణ కవచం !

సాటి వాని నిత్య సత్య శ్రేయోమార్గ జీవన గమనంలో, ప్రకృతి తోడ్పాటు, విశ్వ జీవ సుసంక్షేమ దృక్పథ దార్శనికత !                                  రచన :                                            గుళ్లపల్లి ఆంజనేయులు 

దాశరధీ!కరుణాపయోనిధీ!



దాశరధీ!కరుణాపయోనిధీ!


కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స

జ్జనపరిపాలశీల! దివిజస్తుత సద్గుణ కాండ! కాండ సం

జనిత పరాక్రమ! క్రమ విశారద! శారద కందకుంద చం

దన ఘనసార! సారయశ దాశరథీ కరుణాపయోనిధీ...


*భావం:..*

గొప్పదైన బంగారంతో నేసిన వస్త్రములు ధరించినవాడవు. జనన-మరణ చక్రమనే అడవిని నరికి వేయగల పదునైన గొడ్డలి యొక్క అంచువంటి వాడవు. సజ్జనులను కాపాడే స్వభావం కలవాడివి. దేవతలచే స్తుతించబడే సద్గుణరాసి గలవాడివి. ధనుర్విద్యలో పండితుడివి. శరత్కాల మేఘము, మల్లెపువ్వులు, శ్రీ గంధము వంటి వాటివలె ఎంతో స్వచ్ఛమైన కీర్తి కలవాడివి. దశరధ తనయుడవు, కరుణా సముద్రుడవు, శ్రీ రామచంద్రుడవు. నన్ను దయ చూడు స్వామీ!


"ముక్త పదగ్రస్త మనే యలంకారప్రయోగంతో పద్యంగోపన్నహృద్గతభావాలకు నిలువుటద్దమైనది!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

దాశరధీ!కరుణాపయోనిధీ

 శు భో ద యం🙏


దాశరధీ!కరుణాపయోనిధీ!


కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స

జ్జనపరిపాలశీల! దివిజస్తుత సద్గుణ కాండ! కాండ సం

జనిత పరాక్రమ! క్రమ విశారద! శారద కందకుంద చం

దన ఘనసార! సారయశ దాశరథీ కరుణాపయోనిధీ...


*భావం:..*

గొప్పదైన బంగారంతో నేసిన వస్త్రములు ధరించినవాడవు. జనన-మరణ చక్రమనే అడవిని నరికి వేయగల పదునైన గొడ్డలి యొక్క అంచువంటి వాడవు. సజ్జనులను కాపాడే స్వభావం కలవాడివి. దేవతలచే స్తుతించబడే సద్గుణరాసి గలవాడివి. ధనుర్విద్యలో పండితుడివి. శరత్కాల మేఘము, మల్లెపువ్వులు, శ్రీ గంధము వంటి వాటివలె ఎంతో స్వచ్ఛమైన కీర్తి కలవాడివి. దశరధ తనయుడవు, కరుణా సముద్రుడవు, శ్రీ రామచంద్రుడవు. నన్ను దయ చూడు స్వామీ!


"ముక్త పదగ్రస్త మనే యలంకారప్రయోగంతో పద్యంగోపన్నహృద్గతభావాలకు నిలువుటద్దమైనది!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

 🕉 మన గుడి : 


⚜ అస్సాం : హజో


⚜ శ్రీ కేదారేశ్వర్ ఆలయం



💠 కేదారేశ్వర ఆలయం భారతదేశంలోని ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి కాబట్టి, మతపరమైన తీర్థయాత్ర పర్యాటకులతో పాటు, అస్సాంలోని హజోలో ఉన్న ఈ అందమైన శివాలయాన్ని చరిత్ర మరియు పురావస్తు ఔత్సాహికులు తరచుగా సందర్శిస్తారు

కానీ ఆలయంలో శిల్ప కళ అంతగా కనిపించదు.


💠 ఈ ఆలయాన్ని మొదట విశ్వకర్మ నిర్మించాడంటారు. 

భారత దేశంలో అనాదినుంచీ వున్న ఆలయాలలో ఇది ఒకటి.   


💠 ఈ ఆలయంలో వున్న ఫలకాలమీద వ్రాసిన సమాచారం ప్రకారం ఇది  1753 సంవత్సరంలో అహోం రాజవంశం రాజేశ్వర్ సింఘ రాజు స్థాపించాడని నమ్ముతారు. 

అంటే మొదట నిర్మింపబడిన ఆలయం శిధిలమైన తర్వాత రాజేశ్వర సింఘ ఆలయ పునర్నిర్మాణంగావించాడు.


 💠 కేదారేశ్వర్ దేవాలయం పాదాల వద్ద ప్రసిద్ధ గణేష్ దేవాలయం ఉంది. 

కేదారేశ్వర ఆలయంలో రాతితో చేసిన భారీ శివలింగం ఉంది. శివలింగం స్వయంభూ లింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ శివుని రూపాన్ని అర్ధనారీశ్వరుడు అని కూడా అంటారు. 

శివ పార్వతులు ఒక చోట కలిసి వుండటంవల్ల లింగం మీద ఎప్పుడూ ఒక  వెండి మూత పెట్టబడివుంటుంది.  

పూజారిగారు ఆ కవర్ తీసి అతి కొంచెంసేపు దర్శనం చేయించి మళ్ళీ కవర్ పెట్టేస్తారు.


💠 ఇక్కడ శివుడికి వివిధ రకాల పుష్పాలతో పూజ జరుగుతుంది. ఒక్కొక్క విధమైన కోరిక నెరవేరటానికి ఒక్కొక్క రకం పూలతో పూజ చేయాలని చెబుతారు.  అలా చేయటంవల్ల ఆ కోరిక  నెరవేరుతుందని భక్తుల నమ్మకం. 


💠 ఇక్కడ ఐదు అఖండ దీపాలున్నాయి. 

 ఇవి 6000 ఏళ్ళ నుంచి వెలుగుతున్నాయంటారు. 

గర్భాలయంలో ఈ దీపాల వెలుతురు తప్ప వేరే వెలుతురు వుండదు.


🔅 ఉత్సవాలు :-


💠 ఇక్కడ శివరాత్రికీ, చైత్ర మాసంలో మదన త్రయోదశికీ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి.  

ఈ రెండు రోజులూ స్వామికి మహా నైవేద్యం రాత్రి పూజలయిన తర్వాతే పెడతారు.  

ఇంకొక విశేషమేమిటంటే, స్వామికి పెట్టే  నైవేద్యంలో  చేపలు, ప్రత్యేకంగా తయారు చేసిన గొఱ్ఱె మాంసం తప్పకుండా  వుంటాయి. ఇవి ఇక్కడ విశేషాలు.


💠 కేదార మందిరానికి కింద కమలేశ్వర్ మందిర్, జయదుర్గ మందిరాలున్నాయి. 

చైత్ర శుక్ల అష్టమిని అశోకాష్టమి అంటారు.  అశోకాష్టమి రోజు బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేసి దానాలు చేయాలి.  ఆ రోజు ఎనిమిది అశోక పూల మొగ్గలను తిని నీరు తాగి ఉపవాసం వుండాలి.  ఇలా చేసినవారి జీవితంలో ఎప్పుడూ శోకం వుండదని ఇక్కడివారి నమ్మకం.  


💠 ఆ రోజు శ్రీ హయగ్రీవ మాధవుడు, కేదారేశ్వరుడు, కామేశ్వరులను పల్లకీలలో దండం, ఛత్రం, చామరం, వగైరా సకల మర్యాదలతో బ్రహ్మపుత్రలో స్నానానికి ఊరేగింపుగా తీసుకు వెళ్తారు.  

ఈ ఉత్సవంలో దాదాపు 500 మంది స్వామివారి సేవకులు పాల్గొంటారు స్వామికి రకరకాల సేవలు చేయటానికి. 


💠 ఊరేగింపు వెళ్తుంటే స్వామికి ముందు ఎవరూ గొడుగు వేసుకునిగానీ, టోపీ పెట్టుకునిగానీ వుండకూడదు. 

విశేషమేమిటంటే  ఇలాంటి నియమాలను అమలు చేయటానికి ముస్లిం మతస్తులు కొందరు వెండి బంగారం తాపడం చేసిన కర్రలను తీసుకుని ముందు నడుస్తారు.  హాజోలో సనాతన కాలం నుంచి వస్తున్న హిందూ, బౌధ్ధ, ముస్లిం మతస్తుల ఐకమత్యతకి చిహ్నం ఇది.  ఇప్పటికీ వీరంతా సహృద్భావంతో కలిసి మెలిసి వుంటారు.


💠 హాజో అనేక ఆలయాలకు నిలయమైనా, అందులో పంచ తీర్ధాలనబడే గణేష్, కేదార్, కమలేశ్వర్, కామేశ్వర్, హయగ్రీవ మాధవ మందిర దర్శనానికి ప్రాముఖ్యత.


💠  సమీప విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కూడా గౌహతి.

గౌహతి నుండి హజో చేరుకోవడానికి ప్రైవేట్ క్యాబ్  తీసుకోవచ్చు. 

హజో పట్టణం నుండి, గమ్యస్థానానికి చేరుకోవడానికి ఆటో-రిక్షా లేదా టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు.

మనస్సును ప్రసన్నంగా

 శ్లోకం:☝️

*చిత్తే ప్రసన్నే భువనం ప్రసన్నం*

 *చిత్తే విషణ్ణే భువనం విషణ్ణమ్ |*

*అతోఽభిలాషో యది తే సుఖే స్యాత్*

 *చిత్తప్రసాదే ప్రథమం యతస్వ ||*


అన్వయం: _యదా మనః ప్రసన్నం భవతి తదా సర్వత్ర ప్రసన్నతా ఏవ దృశ్యతే యదా మనః దుఃఖితం స్యాత్ తదా సర్వత్ర దుఃఖం అతః యది సుఖం వాఞ్ఛతి చేత్ మనసః ప్రసాదనాయ యతస్వ |_


భావం: ప్రపంచం ఒక అద్దం వంటిది. మన మనస్సు సంతోషంగా ఉన్నప్పుడు లోకమంతా సంతోషంగా ఉంటుంది (ఆనందమయంగా కనిపిస్తుంది) మరియు మన మనస్సు దుఃఖంగా, విచారంగా ఉన్నప్పుడు లోకమంతా దుఃఖమయంగా కనిపిస్తుంది. కాబట్టి సంతోషంగా ఉండాలనుకుంటే ముందుగా మన మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి.

తానే రాజు,తానే మంత్రి,

 


నెట్వర్క్ రాలేదనే టెన్షన్ లేదు.

నెట్ బ్యాలన్స్ అయిపోయిందనే గోల లేదు

బీపీ,షుగర్ రోగాలు లేవు.

EMI లు కట్టాలనే టెన్షన్ లేదు

అప్పులోళ్ళ గోల లేదు

నెల జీతం కోసం వెయిటింగ్ లేదు

రేపు ఏమవుతుందో అనే గాబరా లేదు

కోట్లు కూడబెట్టాలన్న ఆశ లేదు

కోటల్లో ఉండాలన్నా కోరిక లేదు

కార్లలో తిరగలన్నా ఆకాంక్ష లేదు

ప్లాట్లు,భూములు కొనాలన్న ధ్యాస లేదు

పిజ్జా,బర్గర్లు తినాలనే ఊసు లేదు

ఆరోగ్యం కోసం డైటింగ్ చేసే పని లేదు

ప్రకృతే నేస్తం

పచ్చగడ్డే పట్టు పరుపు

నేలతల్లే డబుల్ కాట్ మంచం

పచ్చడి మెతుకులే పరమాన్నం

తుండు గుడ్డే పట్టు వస్త్రం

చినుకు పడితే ఆనందం

పంట చేతికొస్తే పరమానందం

తాను సృష్టించుకున్న సామ్రాజ్యానికి

తానే రాజు,తానే మంత్రి,తానే సైన్యం👍