5, ఆగస్టు 2025, మంగళవారం

శ్రీ వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి

 🌸🌸🌸🌸🌸

శ్రీ వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి


పసుపు

కుంకుమ

గంధం

విడిపూలు

పూల మాలలు

తమలపాకులు 30

వక్కలు

ఖర్జూరములు

అగర్బత్తి

కర్పూరము

చిల్లర పైసలు Rs. 30/- ( 1Rs coins )

తెల్ల టవల్

బ్లౌస్ పీసులు

మామిడి ఆకులు

అరటిపండ్లు

ఇతర రకాల పండ్లు

అమ్మవారి ఫోటో

కలశానికి చెంబు

కొబ్బరి కాయలు 3

తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం

స్వీట్లు

బియ్యం 2 kg

కొద్దిగా పంచామృతం లేదా ఆవు పాలు

ఇంట్లో ఉండే పూజా సామాగ్రి కూడా సిద్దం చేసుకోవాలి

దీపారాధన కుందులు

గంట

హారతి

ప్లేటు

స్పూన్స్

ట్రేలు

నూనె

వత్తులు

అగ్గిపెట్టె

గ్లాసులు

బౌల్స్

తెనాలి రామకృష్ణుని కీర్తివైభవం!!

 శు భో ద యం 🙏


తెనాలి రామకృష్ణుని కీర్తివైభవం!!


లింగనిషిధ్ధుకల్వలచెలింగని,మేచకకంథరున్ త్రిశూ

లింగని సంగతాళిలవలింగని,నీలకచన్విధాతృనా

లింగని,కృష్ణదేవునిహలింగని,కర్దమదూషితన్ మృణా

లింగని, 'రామకృష్ణకవిలింగని కీర్తి'హసించు దిక్కులన్;

                             - చాటువు.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నల్లనయ్యకై గోపికల యన్వేషణము

 శు భో ద యం 🙏


నల్లనయ్యకై గోపికల యన్వేషణము


          

 ఉ: నల్లనివాఁడు పద్మ నయనంబులవాఁడు కృపారసంబు పై


                 జల్లెడువాఁడు మౌళి పరిసర్పిత ఫింఛమువాఁడు నవ్వురా


                జిల్లెడు మోమువాఁడొకఁడు చెల్వల మాన ధనంబుఁదెచ్చె నో


                మల్లియలార ! మీ పొదల మాటున లేఁడు గదమ్మ! చెప్పరే?


                   భాగవతము-- దశమస్కంథము--1010 వ:పద్యం: బమ్మెఱ పోతన మహాకవి.


                     


                          భక్తిని శృంగారాన్ని మిళితం చేసి ,దానికి 'మధుర భక్తి ' యనేసంకేతాన్ని పొందేలా మనోజ్ఙంగా మధుర మధురంగా గోపికా కృష్ణుల ప్రణయాన్ని చిత్రించాడు పోతన కవి. ఏమా కృష్ణుడు? ఒకచో తుంటరి .మరియొకచో భక్త రక్షణాపరాయణుడు.కొండొకచో దుష్ఠ సం హారి.వేరొచోరాసవిహారి. అతనిలీలలనుపమానముములు.


                         పాపమామా వెర్రిగొల్ల పడుచులు ఆయన ప్రేమలో చిక్కుకున్నారు. తలస్పర్శిప్రణయమున మునిగిన వారికి కృష్ణయ్య యెడబాటు. మిగుల దుర్భరమైనది. కంసుని పనుపున కృష్ణుడు మధురకేగినాడు. వచ్చుటకు తడవైనది. ఆవిరహమునోర్వజాలక గోపికలు బృందావనమునకు బరువెత్తినారు. కృష్ణుడెందైన దాగియున్నాడేమోనని వారిభ్రమ. చెట్టును పుట్టను గుట్టను కృష్ణుని జాడదెలుప గోరుచున్నారు. 


                                ఆసందర్భములోనిది యీపద్యరత్నము! ఎవరిజాడ గోరెదరో వారిరూపురేఖలను చెప్పవలసియుండునుగదా!

గోపికలు మల్లెపొదల కడకేగి ఆపనియే చేయుచున్నారు.


                         " ఓమల్లియలారా! నల్లనిమేనివాడు .తామరలవంటి విశాలనేత్రములుగలవాడు ,దయావర్షమునుగురియు వాడు ,నెమలిపింఛమును శిరమున ధరించువాడు, నగుమోముతో నొప్పువాడు.అగు దొంగయొకడు వనితామానధనమును కొల్లగొని

యిటువచ్చినాడు. వాడేమైన మీపొదల మాటున లేడుగదా! చెప్పుడు? -- అంటున్నారు. 


                    అసలు చెట్లనడగటం యేమిటి? ఉన్మాదం. విరహంలోకూడా ఉన్మాదం వస్తుంది. అదిగో విరహాధిక్యతచే వారంతా ఉన్మాదులయ్యారు. అందుచేత వారికి యెవరిని యడుగు చుంటిరో తెలియుపరిస్థితికాదు. అయినను కృష్ణుని ఆకారమును గుణములను చక్కగాచెపుతున్నారు. ఇదినిరంతరము కృష్ణదర్శనముచేత వారికి గలిగిన జ్ఙానము. 


                            నీలమేఘ శ్యాముడై విశాలనేత్రుడై దయాప్రవర్షియై శిఖిపింఛమౌళియై సుందర దరస్మిత వదనుడై యొప్పు నల్లనయ్య గోపవనితా మానస చోరుడగుట విచిత్రముగదా!చివరకు గోపికలకడ నతడు దొంగయైనాడు. ఆహా !కృష్ణయ్యా! ఏమినీమాయ? ఏమినీలీలలు? విన్నంతనే పులకితులమగుచుంటిమే , నిను గని నీసన్నిధి ననుభవించిన గోపిక లెంతధన్యలో?

మనసార నిను వర్ణించిన మాపోతనకవీంద్రుడు ధన్యతముడనుటయదార్ధమే!


                                                                      స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

చీకటి గర్భం మోసింది ఈ బీజాన్ని..!!*

 *ఏ చీకటి గర్భం మోసింది ఈ బీజాన్ని..!!*


చీకటి చెట్టుకు పూసిన వెలుగుపూలు 

ఏ కొమ్మకు రెమ్మకు పుట్టి వాలిపోయారో

అంధకారంలో చిరునవ్వులు చిందిస్తూ

చీకటి సామ్రాజ్యంలో చిరునామాగా మిగిలారు..


బడుగు జీవుల్లా ఎదుగుతూ 

బడికి దూరంగా నడుచుకుంటూ

నిండా అజ్ఞానమే అలుముకొని జీవిస్తూ

సంఘములో వేరుబడ్డ విగత జీవులు మీరేగా..


అడ్డుగీతల నిలువుగీతల సమాజంలో 

పిడికెడు మెతుకుల యజ్ఞాన్ని సాగించి 

కడగొట్టు బిడ్డల కన్నీళ్లను నింపుకొని 

ఖాళీ కడుపులో గాలిని మోస్తూ తిరుగుతారు..


అభాగ్యుడిలా భాగ్యం కోల్పోతూ 

భోగాన్ని వదిలి విరాగి మనసును మార్చి 

చీకటి వెలుగుల లోకములో 

చీకట్లోనే జీవితన్ని జ్ఞాపకంగా ఉంచారు..


ఏ చరిత్ర అడుగుతుంది నిజాన్ని 

ఏ గర్భం మోసింది ఈ బీజాన్ని 

రెండు తనువుల తృప్తితో నేలపై పడి

అనాధలుగా సంఘములో నిలిచారు..


ఆకలి రాజ్యములో అనంత వేదనలు 

బాంధవ్యపు రుచులు తెలియని బాల్యంలో 

ఎండ వాన తోడుగా సాగితే 

అర్ధరాత్రి ఉలిక్కిపడి ఏడ్చిన దుర్ధినాలే అన్ని...


ఎవరున్నారు అడగడానికి నీకంటూ 

చెత్త సంచి అక్షయపాత్రలా నీకుంటే

చెత్త కుప్పే సింహాసనమై నిలుచుంటే 

నీకంటే దరిద్రపు రాజు ఎవరుంటారు..


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

కలం యోధుడిలా

 *కలం యోధుడిలా మట్టిలో కలుస్తాను..!!*


నాలో గుండె చప్పుళ్ళు 

కవిత రూపమై స్పందిస్తూ 

కనుల ముందు ప్రత్యక్షమై 

సమాజంలో దర్శనమిస్తాను..


ఎన్నో హృదయాలకు దగ్గరగా

నలుగురి ముందుకు నడుస్తూ 

అక్షర స్వప్నాన్ని ఆవిష్కరిస్తూ 

నన్ను నేను పరిచయం చేసుకుంటా...


మాటలను పాటలుగా మలుచుకుంటూ 

జీవన గీతాన్ని పాడుకుంటూ 

కష్ట సుఖాల కడలిలో ఈదుకుంటూ

ప్రతి అడుగులో నా ఉనికిని చాటుతాను..


పున్నమి వెలుగుల్లో విహరిస్తూ 

అమావాస్య వరకు ఆనందిస్తూ 

చీకటి వెలుగులను ఆస్వాదిస్తూ 

బ్రతుకు పంటను పండిస్తాను....


అమ్మ గోరుముద్దల జ్ఞాపకాలను 

జీవితాంతం గుర్తుచేసుకుంటూ 

వాటిని మధురంగా మలుచుకుంటూ 

జీవన యాత్రలో తోడుగా ఉంచుకుంటాను..


మనసు తొందరలో ఎన్నో చేస్తుంది 

మరలి వెళ్ళిన ఆలోచన నెమరు వేస్తూ 

భవిష్యత్తును ఇంద్రధనస్సుల అలంకరించాలని 

వర్తమానంలో ఎన్నో గీతాలను ఆలపిస్తాను.


సత్కారాలకు అవమానాలకు కొదవలేదు 

రాసే పుటల్లో నా నామం సుస్థిరంగా 

నాలుగు కాలాలు నిలబడితే చాలు 

కలం యోధుడిలా మట్టిలో కలుస్తాను..


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

మంగళవారం 5 ఆగస్టు 2025🍁*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🍁మంగళవారం 5 ఆగస్టు 2025🍁*

                        2️⃣2️⃣

                    *ప్రతిరోజూ*

 *మహాకవి బమ్మెర పోతనామాత్య*


   *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


*దేవహూతికి, కర్దముడికి కపిలుడుగా విష్ణువు అవతారం*             

```

స్వాయంభవ మనువు తన కుమార్తె దేవహూతిని కర్దముడికి ఇచ్చి వివాహం చేసి తన రాజ్యానికి వెళ్లిపోయిన తరువాత, దేవహూతి, పతిభక్తితో అనునిత్యం భర్తకు సేవచేయ సాగింది. ఆమె పతిభక్తికి, సేవకు మెచ్చి ఆమెకు అంతులేని భోగాలు కలుగుతాయనీ, ఆమెకు దివ్యదృష్టిని కూడా ఇస్తున్నాననీ కర్దముడు చెప్పాడామెకు. ఆ దివ్యదృష్టి వల్ల ఆమెకు సర్వం కనిపిస్తుందన్నాడు. అయితే, సంతానం కావాలనుకున్న ఆమె, గతంలో ఆయన అన్న మాటలను గుర్తు చేసింది. సంతానం కలిగేటంత వరకు శరీర సంగమం కలిగి ఉంటానని కర్దముడు చెప్పాడనీ, కాబట్టి తనను అనుగ్రహించి రతిరహస్యాన్ని చెప్పే కామశాస్త్రాన్ని నేర్పమని కోరింది. అప్పుడాయన ఒక దివ్య విమానాన్ని సృష్టించాడు. దానిలో అందమైన గదులు, సన్నని వస్త్రాలు, పట్టు చీరెలు, పట్టె మంచాలు... ఇలా ఎన్నెన్నో సకల భోగ్యాలకు అనుకూలమైనవి ఉన్నాయి. సరోవర జలాలలో స్నానం చేసి విమానాన్ని ఎక్కమన్నాడు.


ఆమె స్నానానికి సరోవరంలోకి దిగగానే, అందులోంచి వేలాది కన్యకామణులు ఆమె చెంతకు చేరి, నలుగుపెట్టి స్నానం చేయించారు. అలంకరించారు. కర్దముడు స్నానంచేసి కూచున్న దేవహూతిని చూసి మురిసిపోయాడు. ఇద్దరూ విమానం ఎక్కి మేరుపర్వత గుహ దగ్గరకు చేరి విహరించారు. ఆ తరువాత భూమండలమంతా వాయువేగంతో చుట్టారు. కర్దముడు భార్యకు ధరామండలం అంతా చూపించి, తిరిగి వాళ్ళుండే చోటుకు తీసుకువచ్చాడు. భార్య మనస్సు అర్ధం చేసుకుని శృంగారంలో మునిగి తేలాడు ఆమెతో. అలా నూరు సంవత్సరాలు ఒక ముహూర్తంలాగా గడిపారు.


అలా గడుపుతూ కర్దముడు ఒకనాడు, తొమ్మిది విధాలైన దేహాలను ధరించి, మృదువుగా తన వీర్యాన్ని తన భార్య గర్భంలో తొమ్మిది విధాలుగా నిలిపాడు. ఆ కారణంగా దేవహూతి తొమ్మిదిమంది కూతుళ్లను కన్నది. అనంతరం సన్యసించడానికి సిద్ధపడుతున్న భర్తను చూసి, కుమార్తెల వివాహం జరిగినదాకా ఆగమనీ, కొడుకును కూడా ప్రసాదించి కటాక్షించమని వేడుకుంది దేవహూతి. శ్రీహరి తనకు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి కర్దముడికి శ్రీహరి ఆమె గర్భంలో జన్మిస్తాడని, విచారించవద్దనీ, భగవంతుడిని ధ్యానించమనీ చెప్పాడు.


కర్దముడి మాటలకు సంతోషించిన దేవహూతి విష్ణుమూర్తిని ధ్యానిస్తూ కొన్ని సంవత్సరాలు గడిపింది. అప్పుడు హరి ఒకనాడు కర్దముడి తేజస్సు ధరించి, జమ్మిచెట్టు తొర్రలో నుండి వచ్చిన అగ్నిలాగా దేవహూతి గర్భంలో జన్మించాడు. ఆ సమయంలో దేవహూతికి తత్త్వ జ్ఞానాన్ని బోధించడం కోసం, గర్భస్త నారాయణుడిని దర్శించడం కోసం, బ్రహ్మ వచ్చాడు. కర్దముడి, దేవహూతిల జన్మలు సాఫల్యమైనాయని అన్నాడు బ్రహ్మ. వారి కుమార్తెలను శ్రేష్ఠులైన మునులకు ఇచ్చి వివాహం చేయమన్నాడు. అప్పుడు అనేక రకాలైన ప్రజా సృష్టి జరుగుతుంది అని చెప్పాడు. దేవహూతి గర్భంలో ఉన్న శ్రీమన్నారాయణుడు వారికి తత్త్వబోధ చేస్తాడని కూడా చెప్పాడు. అతడు కపిలుడు అనే పేరుతో విరాజిల్లుతాడని అన్నాడు. ఇలా చెప్పి బ్రహ్మ వెళ్లిపోయాడు.


బ్రహ్మ ఆజ్ఞానుసారం కర్దముడు తన కుమార్తెలకు పెళ్లి చేశాడు. కళను మరీచికి, అనసూయను అత్రికి, శ్రద్ధను అంగిరసుడికి, హవిర్భువును పులస్త్యుడికి, గతిని పులహుడికి, క్రియను క్రతువుకు, ఖ్యాతిని భృగువుకు, అరుంధతిని వశిష్ఠుడికి, శాంతిని అధర్వుడికి ఇచ్చాడు.


భగవంతుడైన శ్రీహరి దేవహూతికి కపిలుడుగా జన్మించాడన్న విషయం గుర్తుకు తెచ్చుకుని ఆయన్ను స్తుతించాడు పలువిధాలుగా కర్దముడు. కర్దముడి మాటలు విన్న భగవంతుడైన కపిలుడు, తాను కేవలం ముని వేషం ధరించడం కోసం పుట్టలేదనీ, మహాత్ములైన మునులకు భగవత్సంబంధమైన తత్త్వజ్ఞానాన్ని బోధించడం కొరకు మాత్రమే ఈ దేహాన్ని ధరించానని అన్నాడు. మోహాన్ని విడిచి, మోక్షం కోసం యోగామార్గాన్ని అనుసరించమని కర్దముడికి చెప్పాడు కపిలుడు. భగవంతుడు చెప్పినట్లే ఆయన చేసి, భక్తియోగంలో భాగవతులు పొందే స్థానాన్ని పొందాడు.


కర్దముడు అరణ్యాలకు పోయిన తరువాత దేవహూతి కపిల మహర్షిని చూసి తనకు మోహాంధకారం నుండి బయటపడే ఉపాయం చెప్పమని అడిగింది. తల్లి వాక్యాలను విన్న కపిలుడు సమాధానంగా దేవహూతికి తత్త్వజ్ఞానం, భక్తియోగం తెలియ చేశాడు వివరంగా.

```

                 *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


         *రచన:శ్రీ వనం*

 *జ్వాలా నరసింహారావు*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


 *🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

18-59-గీతా మకరందము

 18-59-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII ఒకవేళ అహంకారముచే నా వాక్యములను వినక "నేను యుద్ధముచేయ’ నని నీవు చెప్పినను ప్రకృతియే నీచే యుద్ధము చేయించునని భగవానుడు అర్జునునితో పలుకుచున్నారు -


యద్యహఙ్కారమాశ్రిత్య * 

న యోత్స్య ఇతి మన్యసే | 

మిథ్యైష వ్యవసాయ స్తే 

ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి || 


తా:- ఒకవేళ అహంకారము నవలంబించి "నేను యుద్ధముచేయను" అని నీవు తలంచెదవేని అట్టి నీ ప్రయత్నము వ్యర్థమైనదియే యగును. (ఏలయనిన) నీ (క్షత్రియ) స్వభావమే నిన్ను (యుద్ధమున) నియోగింపగలదు.


వ్యాఖ్య: - కర్తృత్వమునువీడి, క్షత్రియోచితమగు ధర్మయుద్ధమును గావింపుమని అర్జునునకు భగవాను డిదివఱలో తెలిపియుండిరి. ఇపుడు 

"ఓ అర్జునా! అహంకారము వలన నా ఈ వాక్యములను ఉల్లంఘించినచో అది నీయొక్క వ్యర్థప్రయత్నమే కాగలదు. ఏలయనిన, నీ క్షత్రియసంబంధ ప్రకృతియే, స్వభావమే బలాత్కారముగ నిన్ను యుద్ధమున దింపగలదు". అని భవిష్యజ్జ్ఞానముగల పరమాత్మ వచించిరి.

---------

* యదహంకారమాశ్రిత్య = పాఠాన్తరము.