*ఏ చీకటి గర్భం మోసింది ఈ బీజాన్ని..!!*
చీకటి చెట్టుకు పూసిన వెలుగుపూలు
ఏ కొమ్మకు రెమ్మకు పుట్టి వాలిపోయారో
అంధకారంలో చిరునవ్వులు చిందిస్తూ
చీకటి సామ్రాజ్యంలో చిరునామాగా మిగిలారు..
బడుగు జీవుల్లా ఎదుగుతూ
బడికి దూరంగా నడుచుకుంటూ
నిండా అజ్ఞానమే అలుముకొని జీవిస్తూ
సంఘములో వేరుబడ్డ విగత జీవులు మీరేగా..
అడ్డుగీతల నిలువుగీతల సమాజంలో
పిడికెడు మెతుకుల యజ్ఞాన్ని సాగించి
కడగొట్టు బిడ్డల కన్నీళ్లను నింపుకొని
ఖాళీ కడుపులో గాలిని మోస్తూ తిరుగుతారు..
అభాగ్యుడిలా భాగ్యం కోల్పోతూ
భోగాన్ని వదిలి విరాగి మనసును మార్చి
చీకటి వెలుగుల లోకములో
చీకట్లోనే జీవితన్ని జ్ఞాపకంగా ఉంచారు..
ఏ చరిత్ర అడుగుతుంది నిజాన్ని
ఏ గర్భం మోసింది ఈ బీజాన్ని
రెండు తనువుల తృప్తితో నేలపై పడి
అనాధలుగా సంఘములో నిలిచారు..
ఆకలి రాజ్యములో అనంత వేదనలు
బాంధవ్యపు రుచులు తెలియని బాల్యంలో
ఎండ వాన తోడుగా సాగితే
అర్ధరాత్రి ఉలిక్కిపడి ఏడ్చిన దుర్ధినాలే అన్ని...
ఎవరున్నారు అడగడానికి నీకంటూ
చెత్త సంచి అక్షయపాత్రలా నీకుంటే
చెత్త కుప్పే సింహాసనమై నిలుచుంటే
నీకంటే దరిద్రపు రాజు ఎవరుంటారు..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి