7, నవంబర్ 2020, శనివారం

ఒక అమ్మ కథ

 🔆ఒక అమ్మ కథ

     """"'''''''''''''''''''''"""""""

మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది


మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు


ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది


ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది


ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది


ఇంక అప్పట్నించి చూడండి

”మీ అమ్మ ఒంటి కన్నుది”

అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు


అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే


అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది


ఒక్కోసారి నాకు అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు అనిపించేది


“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను

నువ్వు చచ్చిపో!”


కోపంగా అరిచేసే వాణ్ణి


ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు


నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది


అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది


ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు


ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను


మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది


నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను


అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది


మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు


నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది?


మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను


ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను


ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను


పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను


మంచి విశ్వ విద్యాలయం లో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను


బాగా డబ్బు సంపాదించాను


మంచి ఇల్లు కొనుక్కున్నాను


మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను


నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా


ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది


ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!


అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి


ఇంకెవరు?


మా అమ్మ


ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతోజడుసుకుంది


“ఎవరు నువ్వు?


ఎందుకొచ్చావిక్కడికి?


నువ్వెవరో నాకు తెలియదు


నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?


ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!”


సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను


“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను”


ఆమె అదృశ్యమై పోయింది


“హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”


భారంగా ఊపిరి పీల్చుకున్నాను


ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించు కోనవసరం లేదు అనుకున్నాను


కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు


వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను


స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను


ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి


మా అమ్మ ఒంటరిగా కటికనేలపై పడి ఉంది


ఆమె చేతిలో ఒక లేఖ


నా కోసమే రాసిపెట్టి ఉంది


దాని సారాంశం


ప్రియమైన కుమారునికి, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను


నేనింక నీవుండే దగ్గరికి రాను


కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా!


ఏం చేయమంటావు?


నిన్ను చూడకుండా ఉండలేకున్నాను


కన్నపేగురా


తట్టుకోలేక పోతోంది


నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు


కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే


వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్నవుతాను


ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు


చిన్నా!


నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది


నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా!


అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను


నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?


నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధ పడలేదు


ఒకటి, రెండు సార్లు మాత్రం ''వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా!”

అని సరిపెట్టుకున్నాను


చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు


ఉత్తరం తడిసి ముద్దయింది


నాకు ప్రపంచం కనిపించడం లేదు


నవనాడులూ కుంగి పోయాయి


భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను


తన జీవితమంతా నాకోసం ధారబోసిన అటు వంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిoచాను ?


మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి?


ఎన్ని జన్మలెత్తితే ఆమె ఋణం తీర్చుకోగలను ?


(ఇది ఇంగ్లీష్ కథకు అనువాదం)


నాస్తి మాతృ సమం దైవం


నాస్తి మాతృ సమః పూజ్యో


నాస్తి మాతృ సమో బంధు


నాస్తిమాతృ సమో గురుః


అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు


తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు


ఆకలేసినా..


ఆనందం వేసినా

దిగులేసినా

దుఃఖం ముంచుకొచ్చినా

పిల్లలకైనా

పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా

గుర్తొచే పదం అమ్మ


తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ


అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి


కనుపాప లా కాపాడండి


ఒక్కసారి ఆలోచించండి


నలుగురికీ ఇలాంటి సందేశాలుపంపండి


బంధాలు బాంధవ్యాలను కాపాడుదాం


తల్లి ఋణం ఈ జన్మకి తీరదు 


💐💐 శుభోదయం

మహాభారతము ' ...70 .

 మహాభారతము ' ...70 . 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


దేవతలను కాదని, నలమహారాజును దమయంతి వరించిందని, దేవతలద్వారా తెలుసుకుని, కోపోద్రిక్తుడైనాడు కలిపురుషుడు. దమయంతి దండనార్హురాలని తేల్చి చెప్పాడు. ' కలిపురుషా ! తొందరపడకు. మా సమ్మతితోనే నలుడు ఆమెను వివాహమాడాడు. నలమహారాజు పురుషశ్రేష్ఠుడు. అతన్ని వరించుటకు యే యువతి అయినా ముందుకువస్తుంది. అతడు దేవతలకు యెందులోనూ తీసిపోడు. వారి దాంపత్యానికి యేవిధమైన విఘ్నము కలిగించకు. వారికి హాని తలపెట్టేవారు యెవరైనా నరకకూపం లో పడతారు. ' అని దేవతలు హెచ్చరించి వెళ్లిపోయారు. 


కానీ కలిపురుషుడు ఆ దంపతులని యిబ్బంది పెట్టవలెనని నిశ్చయించుకున్నాడు. ద్వాపరయుగ పురుషుడిని కలిపురుషుడు స్మరించుకుని, తనవద్దవున్న పాచికలలో ఆయనప్రవేశించి నలునితో ఆడబోయే జూదంలో తనకు గెలుపు ప్రసాదించమని కోరాడు. నలదమయంతులను విడదీసే పనిలో ప్రధమఘట్టంగా నలుడు నివసిస్తున్న ప్రదేశానికి వచ్చాడు.  


నలుడు యెప్పుడైనా యేదైనా ధర్మవిరుద్ధమైన పని చేస్తాడేమో, అతనిలో ప్రవేశించాలని కలిపురుషుడు ఆత్రుతతో సమయం కోసం యెదురు చూడసాగాడు. కానీ కలిపురుషుడికి ఆ అవకాశం నలుడు యివ్వలేదు. అయినా ఓపికగా యెదురు చూడసాగాడు కలి. ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి.


ఇలా ఉండగా ఒకనాడు. నలమహారాజు, మూత్రవిసర్జన చేసి, చేతులు, ముఖము మాత్రమే శుభ్రం చేసుకుని, కాళ్ళు కడుగుకొనకుండా, సంధ్యావందనా కార్యక్రమాలు చెయ్యడానికి ఉపక్రమించాడు. అంతే ! సమయం కోసం యెదురుచూస్తున్న కలిపురుషుడు శౌచభంగము కలుగగానే, నలుని హృదయంలోకి స్వేచ్ఛగా ప్రవేశించాడు.  


ఆ విధంగా నలుడు తన వశమవ్వగానే, కలి, పుష్కరుడనే వాడివద్దకు వెళ్లి అతనిని నలుని జూదమాడడానికి పిలవమని ప్రేరేపించాడు. కలిప్రభావంతో పుష్కరుడు కూడా, నలుడిని తనతో జూదమాడవలసినదిగా ఆహ్వానించాడు. నలుడు యెంత వద్దనుకుని వారిస్తున్నా, అప్పటికే కలిపురుషుని ప్రభావం సోకిన అతని మనస్సు జూదక్రీడకు లొంగక తప్పలేదు. పుష్కరునికీ, నలునికీ జూదక్రీడ కొన్ని మాసాలపాటు జరిగింది. ఒక్కొక్క సంపద, క్రమంగాపుష్కరునికి జూదంలో సమ్పర్పించుకున్నాడు నలుడు.  


దమయంతీ, రాజపురోహితులు యెన్నివిధాల చెప్పినా నలుడు జూదక్రీడ ఆపలేదు. రాజ్య వ్యవహారాలపై ధ్యాస పోనివ్వలేదు. ఇది గమనించి దమయంతి తమ యిద్దరు పిల్లలను, తన తండ్రిగారింట వదలి, మాకు రాజ్యం దక్కే అవకాశం లేనందున, నీవు ఆతరువాత ఎటైనా వెళ్ళమని తమ రధసారధి అయినా వార్ష్ణేయుని తో చెప్పి,పిల్లలను అతనితో, పంపివేసింది, దమయంతి.  


అన్నీ ఓడిపోయిన నలునితో, యింకా యేమైనా మిగిలివున్నదా పందెములో ఓడడానికి ? నీ భార్య అయినా సరే ! మళ్ళీ అన్నీ గెలుచుకోవచ్చు, అని రెచ్చగొట్టాడు పుష్కరుడు. నీళ్లు నిండిన కళ్ళతో, పుష్కరునికి జవాబు చెప్పకుండా,తన దేహం పై వున్న ఆభరణాలన్నీ ఒలిచి పుష్కరునికి యిచ్చి, పైకండువా కూడా లేకుండా, రాజసౌధాన్ని వదలి దమయంతితో సహా, నగర పొలిమేర్లలోనికి వచ్చాడు నలుడు.  


నలునికీ, దమయంతికీ యేవిధమైన సహాయం చేసినా, వారితో మాట్లాడినా, దండనకు అర్హులని చాటింపు వేయించాడు ప్రజలకి, పుష్కరుడు. దానితో, యెవ్వరూ నల దమయంతులను పలకరించిన వారుకూడా లేరు. నగర పొలిమేరలలో మూడుపగళ్లు, మూడురాత్రులు కేవలం దగ్గర వున్న సరస్సులో జలపానముచేసి వున్నారువారు.  


ఎంతకాలం కేవలం నీటితో వుండగలరు. కొద్దిదూరంలో వున్న అరణ్యంలో యేవైనా కందమూలాలు దొరుకుతాయేమోనని, వారు అరణ్యం వైపు ప్రయాణం సాగించారు. అలా పోతూ వుండగా, బంగారురెక్కలతో వున్న కొన్నిపక్షులు అతనికి కనిపించాయి. ఆ పక్షులను పట్టి ఆహరంగా సేవించవచ్చని, ఆ బంగారురెక్కలను స్వంతం చేసుకుందామని తలంపుతో, నలుడు తన వంటి మీద వున్న ఏకవస్త్రాన్ని, వాటిపై విసిరాడు, లాఘవంగా. అయితే, ఆ పక్షులు ఆ వస్త్రానికి చిక్కకుండా, ఆ వస్త్రాన్నే తమతో గాలిలో తీసుకునిపోతూ, ' ఓ మూర్ఖ శిఖామణీ ! యెక్కడైనా బంగారురెక్కలున్న పక్షులను చూశావా ? మేము నీవు ఆడిన పాచికలము. నీ వైరిపక్షం పంపగా, నీ వద్ద వస్త్రం కూడా లేకుండా చెయ్యాలని వచ్చాము. దిగంబరునిగా ఈ అరణ్యాన్ని యేలుకో ! ' అని చెప్పి ఆ వస్త్రంతో సహా తుర్రుమన్నాయి. 


నలమహారాజు దిగంబరుడై దిక్కులు చూస్తూ వున్నాడు. ఆహా ! కలిప్రభావం. ఇంతలో దమయంతి అక్కడికి వచ్చి పరిస్థితి గ్రహించి, తాను కట్టుకున్న చీరలో కొంతభాగం నలునికి యిచ్చి అతని మానం కాపాడింది. జరిగిన దురదృష్టకరమైన సంఘటనలకు ఖిన్నుడై, నలుడు, ' దేవీ దమయంతి ! ఇక్కడనుండి నాలుగు దారులు నాలుగు నగరాలకు మార్గం చూపుతున్నవి. అందులో యీ మార్గం విదర్భరాజ్యం వైపు వెళ్తుంది. ' అని నర్మగర్భంగా ఆమెను తన పుట్టినింటికి వెళ్ళమని చెప్పాడు నలుడు. ఇది గ్రహించిన దమయంతి, ' రాజా ! నా పుట్టినింటికి నేను ఒక్కదానను వెళ్ళను. మీరుకూడా వస్తే నాకు సమ్మతమే, ఎందుకంటె, మన పిల్లలు యిప్పటికే అక్కడ వున్నారు. మనకు మంచిరోజులు వచ్చే వరకు అక్కడ వుండవచ్చును. ' అని చెప్పింది.


' నేను యీ పరిస్థితులలో రాలేను. రాకూడదు. ' అని చెప్పి, ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుని, కేవలం సుఖాలలోనే కాదు, దంపతులు దుఃఖాలలో కూడా ఒకరికొకరు చేదోడుగా వుండాలని భావించి, ఒక చెట్టు క్రింద విశ్రమించారు నలదమయంతులు. దమయంతి నిద్రపోయింది గానీ, నలునికి నిద్రపట్టలేదు. తాను ప్రక్కన వుండగా దమయంతి పుట్టినింటికి వెళ్ళదు, తాను నిష్క్రమిస్తే, ఆమె తండ్రిగారి వద్దకు వెళ్తుందని తలచి, ఆమె ఒంటరితనంలో ఆమె పాతివ్రత్యమే ఆమెకు రక్ష అని తలపోసి, దమయంతి యిచ్చిన వస్త్రఖండాన్నే మొలకి చుట్టుకుని, నెమ్మదిగా అక్కడనుంచి నిష్క్రమించాడు నలుడు.  


దమయంతి లేచి చూసేసరికి నలుడులేడు. జరిగినది గ్రహించింది దమయంతి. బిగ్గరగా రోదించింది. నీవు లేకుండా నేను సుఖాలు యెలా అనుభవిస్తాను అనుకున్నావు రాజా ! ఇది నీకు తగునా ! అని విలపిస్తుండగా, ఆఅలికిడికి, అక్కడవున్న కొండచిలువ ఆమె కాలు దొరకగానే పట్టేసుకుని, దగ్గరగా లాక్కొసాగింది, దమయంతిని. దమయంతి పెద్దగా అరవసాగింది, భయంతో.


అదేసమయంలో, వేటకు వచ్చిన ఒక వేటగాడు, కొండచిలువను చంపి, ఆమెను రక్షించాడు. కానీ, ఆమె రూపలావణ్యాలు చూసి, దురాలోచనతో, మీదకు రాసాగాడు. దమయంతికి యేమి చేయవలెనో పాలుపోవక, వెంటనే అగ్నిదేవుని ప్రార్ధించి, నా పాతివ్రత్య ప్రమాణంగా, ఈ కిరాతకుని భస్మం చెయ్యమని వేడుకొన్నది. ప్రాణం రక్షించి తండ్రి స్థానం లో వుండవలసినవాడు, కామంతో కులకాంతను చెరచ ప్రయత్నించి, అగ్నికి ఆహుతి అయ్యాడు, ఆ కిరాతకుడు.  


ఆ తరువాత, దమయంతి అడవులలో జీర్ణవస్త్రయై, రేగినజుట్టుతో, శుష్కించిన దేహంతో, నలునికోసం వెదుకుతూ వుండగా, కొందరు వ్యాపారులు ఆమెను చూసి, తాము సుబాహుడనే రాజు పరిపాలిస్తున్న చేదినగరం వెళ్తున్నామని, అక్కడ ఆమె సుఖంగా జీవించవచ్చని చెప్పి ఆమెను చేదినగరం తీసుకువెళ్లారు. నగరంలో ఆమె వారితో కాలినడకన వెళ్తుండగా, రాజసౌధం నుండి, రాజమాత ఆమెను, ఆమె రూపలావణ్యాలను చూసి, ఆమెను తన దగ్గరకు తీసుకురమ్మని చెలికత్తెలను పంపింది.  

       

స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.


తీర్థాల రవి శర్మ

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం

9989692844

మహాభారతము ' ...69 .

 మహాభారతము ' ...69 . 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


దమయంతి అంత:పురానికి నలుడు, దేవతలు పంపగా వచ్చాడు. ' రాకుమారీ ! నేను నిషిధదేశ రాకుమారుడను. నాపేరు నలుడు. దేవతలు పంపగా దూతగా నీవద్దకు వచ్చాను. నేను మీ స్వయంవరం కొరకై వస్తూ వుండగా, దేవతలు నన్ను సమీపించి, నీవద్దకు దూతగా పంపించారు. నీవు ఇంద్ర, యమ, వరుణ, అగ్ని దేవతలలో యెవరో ఒకరిని స్వయంవరంలో వరించాలని వారు కోరుతున్నారు. ' అని చెప్పాడు.


ఈ మాటలు వినగానే, దమయంతి, యెంతో బాధపడింది. ' ఏమిటి యీదుస్థితి నాకు ! ' అని అడిగింది. నేను యెంతో ప్రేమగా, నలమహారాజును వరించాలని కలలు గంటున్నాను. నాకు యీ పరీక్ష పెట్టడం తగునా ! 'అని వాపోయింది. ' నలమహారాజా ! దేవతలు పూజార్హులే గానీ, పరిణయమాడడానికి అర్హులు కారు. నా హృదయంలో మీరే కొలువై వున్నారు. మీరు నన్ను భార్యగా స్వీకరించకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం. ఆత్మహత్యకు అనేక రకాల విధాలు వున్నాయి. ఏదో ఒకదానిని ఎంచుకోవడమే, నాకు విధిగా తోస్తున్నది. ' అని నలునితో అన్నది.


' దమయంతీ ! దేవతలు కోరి నిన్ను వరించారు. నేను వారి కాలిగోటికి సరిపోను. వారితో విరోధం ప్రాణహానికి దారితీస్తుంది. వారిని తిరస్కరించడమంటే ప్రాణాలతో చెలగాటమే ! ' అని నలుడు దమయంతి కి చెప్పాడు. అయితే, ఆమె చేతులు జోడించి నలునికి నమస్కరించి, అట్టి కర్ణ కఠోరమైన మాటలు మాట్లాడవద్దని చెప్పింది. 


' రాకుమారీ ! నా దౌత్యం నేను నిర్వహించాను. నేను ధర్మం తప్పలేదు. దేవతలకు యిచ్చిన మాట మనసా వాచా నిలబెట్టుకున్నాను. నీమనోవాంఛ నెరవేరేటట్లు నీవే, యేదైనా ఉపాయం ఆలోచించు. ' అని ఆమెను సమాధానపరచాడు నలుడు.


అందుకు దమయంతి ' నలమహారాజా ! నాకొక ఉపాయం తోస్తున్నది. స్వయంవరంలో దేవతలతో పాటు తమరు కూడా మీ ఆసనంపై ఆసీనులు కండి. నేను నా ఇష్టప్రకారం స్వయంవరంలో మిమ్ములను వరిస్తాను. ఇందులో మిమ్ములను తప్పు పట్టే పరిస్థితి రాదు. నా మనోవాంఛ నెరవేరుతుంది.' అని మనసులో మాట చెప్పింది.


నలుడు దేవతల వద్దకు తిరిగివెళ్లి, ' దమయంతి తమకందరకూ ప్రణామములు చెప్పింది. స్వయంవరంలో ఆమె నన్ను కూడా పాల్గొనమని చెప్పింది. ఆమె నన్నే వరిస్తానని చెప్పింది. లేకుంటే ఆత్మహత్యే శరణ్యమన్నది. ' అని కల్లాకపటం లేకుండా వారితో చెప్పాడు. నలుని నిజాయితీకి దేవతలు అచ్చెరువొంది, నోటమాటరాక మౌనంగా వుండిపోయారు. 


స్వయంవర సమయంలో, దమయంతి పూలహారంతో, ఆశీనులైన పలుదేశాలరాజుల ముందు నుండి వెళుతూ వుండగా, రాజపురోహితుడు వివిధదేశాల రాజులను క్లుప్తంగా పరిచయం చేస్తున్నాడు. చెలికత్తెలు ఆమెవెంట నడుస్తున్నారు. అలా నడుస్తున్న దమయంతి, నలమహారాజు కూర్చున్న సింహాసనం వద్దకు రాగానే, వరుసగా, అయిదు సింహాసనాలలో నలుని రూపం తో అదే వర్చస్సుతో వున్నవారు అయిదుగురు కనిపించారు. వీరిలో అసలు నలమహారాజు యెవరో దమయంతి గుర్తించ లేకపోయింది. ఆమెకు దేవతల పన్నాగం అర్ధమైంది. నలుడు చెప్పిన మాటలు ఆమెకు గుర్తుకు వచ్చాయి. వారితో వైరం మంచిది కాదని, దమయంతి హఠాత్తుగా, చేతులు జోడించి,

' దేవతలారా ! నాకు నలుని వద్దనుండి హంస రాయబారం వచ్చినప్పటినుండి, నేను నలుని త్రికరణశుద్ధిగా ప్రేమిస్తున్నాను. వేరెవరినీ నాభర్తగా వూహించలేకున్నాను. కాబట్టి నా సదాచార నియమవర్తన జీవితం పై ఆన. దయచేసి, మీరు మీ నిజ రూపాలలో సాక్షాత్కరించి నలమహారాజును నేను స్వయంవరంలో వరించేటట్లు నాకు తోడ్పడండి. ' అని కోరింది.


ఆమె చిత్తశుద్ధికి, సంకల్పబలానికి సంతోషించి, దేవతలు నలుగురూ, నలుని రూపంలో వుండికూడా, ఆమెకు అర్థమయ్యేటట్లు మార్గం సుగమం చేశారు. ఒక్క నలుని దేహం మాత్రమే, మానవ సహజమైన స్వేద బిందువులతో కనబడేటట్లు, కనురెప్పలు కొట్టుకునేటట్లు, భూమి పై పాదాలు అనేటట్లు,స్ఫుటంగా కనబడసాగాయి. మిగిలిన వారు దేవతలగుట వలన వారికి స్వేద బిందువులు లేవు, అనిమేషులు అవడం వలన, రెప్పల కదలికలు లేవు. వారి శరీరాలు భూమిని తాకడం లేదు. అంతే ! క్షణం ఆలశ్యం చెయ్యకుండా దమయంతి నలుని గుర్తించి, అతని కంఠసీమలో పూలహారం వేసి, తన అంతరంగం సభికులందరి ముందు ఆవిష్కరించింది. దేవతలూ, వచ్చిన వారందరూ, అభినందించారు, దమయంతి కి శుభాకాంక్షలు చెప్పారు. 


దేవతలు నలదమయంతులను దీవిస్తూ, నలునికి అనేక వరాలు ప్రసాదించారు. అగ్నిదేవుడు, నలుడు యెప్పుడు పిలిస్తే అప్పుడు ప్రత్యక్షమై, అతని కోరిక తీరుస్తానని వరమిచ్చాడు. ఇంద్రుడు, నలుడు చేసే అన్ని యజ్ఞాలలో కనబడి దర్శనమిస్తానని, జన్మాంతమున పుణ్యలోకాలు ప్రసాదిస్తానని చెప్పాడు. యమధర్మరాజు, నలుడు యెప్పుడూ ధర్మ నిష్టలో ఉండేటట్లు, పాకశాస్త్రం లో అతనిని ప్రవీణుడుగా వుండేటట్లు అనుగ్రహించాడు. వరుణదేవుడు, నలుడు కోరుకున్నంతనే వర్షాలు పడేటట్లు అనుగ్రహించి, సుగంధమైన, యెప్పటికీ వాడని పూలమాలలు అనుగ్రహించాడు.


ఈ విధంగా, నలదమయంతుల పరిణయ ఘట్టం సుఖాన్తమై, యెవరి ప్రదేశాలకు వారు ఆనందంగా వెళ్లారు. నలుడు దమయంతితో సహా, నిషిధ చేరుకొని రాజ్యం జనరంజకంగా పరిపాలించసాగాడు. అశ్వమేధయాగాలు అనేకం చేశాడు. అలా ఆనందంగా నలదమయంతులు ఇంద్రసేనుడు అనే పుత్రుని, ఇంద్రసేన అనే పుత్రికను కన్నారు. 


ఇక్కడ, యిలా వుండగా, దేవతలు స్వయంవరం నుండి తిరిగి వెళ్తుండగా, వారికీ దారిలో కలిపురుషుడు కనిపించాడు. ఎక్కడికి వెళుతున్నావని కలిని వారు ప్రశ్నించగా, ' నేను దమయంతీ స్వయంవరానికి వెళ్తున్నాను ' అని కలి సమాధానం చెప్పాడు. ' అయ్యో ! మేము దమయంతీ స్వయంవరం నుండి వస్తున్నాము. ఆమె నలమహారాజును వరించింది. ' అని దేవతలు చెప్పేరు. నలదమయంతుల అందచందాలను పొగిడారు. వారిరువురి జంట యెంతో బాగున్నది మెచ్చుకున్నారు. 


ఈమాట వినగానే, కలిపురుషుని ముఖంలో కోపం ప్రస్ఫుటం అయ్యింది.  


స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.

విజయ దశమి శుభాకాంక్షలు తో, శుభాశీస్సలు తో ...

తీర్థాల రవి శర్మ

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం

9989692844

ధార్మికగీత - 62

 *ధార్మికగీత - 62*

                                   

     *శ్లో:- ఋణకర్తా పితా శత్రు: ౹*

            *మాతా చ వ్యభిచారిణీ ౹*

            *భార్యా రూపవతీ శత్రు: ౹*

            *పుత్ర శ్శత్రు రపండితః ౹౹* 


     

అప్పులు పెక్కుజేసి మది

            నారడిబెట్టిన తండ్రి శత్రువౌ

తప్పగు జీవితమ్మునను

            తా చరియించినతల్లి శత్రువౌ

గొప్పగు రూపమున్నసతి 

            కూరిమియైనను శత్రువౌనిలన్ 

మెప్పగు విద్యలన్ సుతుడు

           మేలుగ నేర్వక శత్రువయ్యెడున్



✍️ గోపాలుని మధుసూదన రావు

సిరి గల వానికి

 "సిరి గల వానికి చెల్లును,

తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్,
తిరిపెమునకిద్దరాండ్రా,
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.."

కవి నిరంకుశుడు అంటారు. పూర్వ కవులు చాలా చేమత్కారులు. ఇది శ్రీనాధ కవి వ్రాసిన ఒక చాటు పద్యం. 
అక్కడ వర్షాలు పడక ప్రజలు చాలా బాధలు పడుతున్నారట ఆ సమయంలో సాక్షాత్తు పరమేశ్వరుని మీదనే వ్యంగ్యంగా వ్రాసిన పద్యం. 
ధనవంతుడైన శ్రీ కృషుణునికి చెల్లుతుంది పదహారు వేల స్త్రీలను పెండ్లి చేసుకోటానికి ఎందుకంటె అయన ధనవంతుడు కాబట్టి ఏ ఆట ఆడిన చెల్లుతుంది. నీవా తిరిపమెటుకొని అంటే బిక్షాటన చేసి జీవించే పేదవాడివి నీ కెందుకు స్వామి ఇద్దరు భార్యలు. నీకు పార్వతి చాలు కానీ గంగను మాకు వదిలి పెట్టు. అంటే వర్షాలు కురిపించు అని చమత్కారంగా వ్రాసిన పద్యం. చదివి ఆనందించండి. మీ భార్గవ శర్మ 

హిందూ ధర్మం - 39**

 **దశిక రాము**


**హిందూ ధర్మం - 39**


శౌచం - శౌచం అంటే పరిశుభ్రత కలిగి ఉండడం, మానసికంగా, శారీరికంగా పవిత్రంగా జీవించడం. శౌచం అనేది విశుద్ధతను కలిగించే ఒక ప్రక్రియ.బయటకు కనిపించే మన శరీరాన్ని విశుద్ధ జలంలో స్నానమాచరించి మలాన్ని తొలగించుకోవడం శారీరిక శౌచం. స్నానం పవిత్రమైనది మరియు ఆయుర్ధాన్ని పెంచేది, శ్రమమూలంగా ఏర్పడిన స్వేదమలాన్ని పోగొట్టేది, శరీర బలాన్ని కలిగించేది, ఓజస్సును ఇచ్చేది. మన వాక్కుకు/మాటలకు శౌచం సత్యం వల్ల ఏర్పడుతుంది. అదే వాక్కుకు స్నానం/శౌచం. అబద్దాలు పలకడం వలన వాక్కు అపవిత్రం అవుతుంది. వ్యాకరణం మొదలైన శాస్త్రాలవల్ల శబ్దానికి శుద్ధి కలుగుతుంది. ఏది ఎలా పలకాలో తెలుస్తుంది. అందువల్ల వ్యాకరణం శబ్దానికి శౌచానిస్తుంది. శుభ్రత కలిగిన ప్రదేశంలో వండిన ఆహారాన్నే స్వీకరించాలి. శుద్ధమైన ఆహారం మనసును శుద్ధి చేస్తుంది. శుద్ధి చెందిన మనసు అదుపులోకి వచ్చి, పరమాత్మ సేవకు ఉపకరమిస్తుంది. ఎక్కడపడితే అక్కడ వండిన ఆహార పదార్ధాలను స్వీకరించకపోవడం ఆహారం శౌచం. సంపాదించిన ధనాన్ని ధార్మిక కార్యక్రమాలకు, దానాలకు, సేవకు ఉపయోగించడం సంపాదనకు శౌచానిస్తుంది. అలా కాకుండ స్వార్ధంతో జీవించడం వలన సంపాదన అపవిత్రం అవుతుంది.


మన మనస్సుకు గురువు యొక్క ఉపదేశం, మంచి ప్రవచనం వినడం వలన మంచి ఆలోచనలతో శుద్ధి కలుగుతుంది. మంచి గ్రంధాలు చదవడం వలన, సత్సంగం వలన మనసు మంచిదారిలో పయనిస్తుంది. మనస్సుకు ఇవే స్నానం. విపరీతమైన ప్రేమ, భరించలేని ద్వేషం, పక్షపాతం కలిగి ఉండడం, జరిగిన విషయం మీద అవగాహన లేకుండా సొంత అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం, అనవసరంగా ఒకరిని నిందించడం, అన్యాయం, అధర్మం మొదలైన వాటినుంచి దూరంగా ఉండడం మానసిక శౌచం క్రిందకే వస్తుంది.


తరువాయి భాగం రేపు....

🙏🙏🙏

సేకరణ


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA


**ధర్మము - సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu

హిందూ ధర్మం** 79

 **దశిక రాము**


**హిందూ ధర్మం** 79 


(దేవర్షిగా మారిన విశ్వామిత్రుడు)


ఆమెను చూసి మోహితుడైన విశ్వామిత్రుడు, ఆమె దగ్గరకు వెళ్ళి 'ఓ అప్సరస! నీకు స్వాగతం. నా ఆశ్రమానికి విచ్చేసి, నన్ను అనుగ్రహించ్గు, నీ చేత మోహితుడైనాను, నీకు శుభమగుగాకా' అన్నాడు. ఆ మాటలు విన్న మేనక అక్కడే అగిపోయింది. ఇద్దరూ కలిసి పది సంవత్సరాలు ఉన్నారు. ఇది విశ్వామిత్రుని తపస్సుకు ఆటంకంగా మారింది. పదిఏళ్ళ తరువాత విశ్వామిత్రునికి తాను చేస్తున్నపని తప్పని గ్రహించి, చింతించి, శోకించడం మొదలుపెట్టాడు. ఆ బాధా నుంచి ఆయనకు ఒక ఆలోచన కలిగింది. 'గొప్ప తపస్సు చేస్తున్న నన్ను ప్రక్కదారి పట్టించడానికి దేవతల పన్నిన పన్నాగం ఇది. పదేళ్ళు ఒక రాత్రిపగులులా గడిచిపోయాయి. నేను ఈ కామాన్ని, మోహాన్ని అధిగమించాలి. ఇవి నా తపస్సుకు ఆటంకాలుగా ఉన్నాయి' అని భావించాడు. పశ్చాత్తాపపడుతున్న విశ్వామిత్రుడు దీనికి కారణం మేనకనే అని ఆమె వైపు చూశాడు. విశ్వామిత్రుడు ఎక్కడ శపిస్తాడో అని మేనక వణికిపోతోంది. చేతులో జోడించి విశ్వామిత్రునకు నమస్కరించింది. ఆమె భయపడుతోదని గమనించి, అలాగో ఇప్పటికే తపోశక్తి వృధా చేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ శపించి మరింతగా వృధా చేసుకోవడం ఎందుకని, ఆమెతో మధురంగా మాట్లాడి పంపించేశాడు. తాను ఉత్తర దిశగా హిమాలయాలకు పయనమయ్యాడు.


కౌశికి నదీతీరానికి చేరుకుని తనలో ఉన్న కామాన్ని జయించడానికి, శాంతిని పొందడానికి ఘోరమైన తపస్సు చేశాడు. దాదాపు వేయొ సంవత్సరాల పాటు మాటల్లో వర్ణించలేనటువంటి తపస్సు చేశాడు. అది చూసిన దేవతలకు భయం వేసి, ఋషులతో కలిసి బ్రహ్మదేవునికి వద్దకు వెళ్ళి, విశ్వామిత్రుడు చేసిన తపస్సుకు దేవర్షి స్థానానికి అర్హత పొందాడాని చెప్పారు. దేవతల సలహా మీద బ్రహ్మ విశ్వామిత్రుని చేరుకుని 'ఓ మహర్షి! నా ప్రియమైన నీకు స్వాగతం. నేను నీ తపస్సు చేత సంతోషించాను. నేను నిన్ను ఋషులలో ముఖ్యమైన స్థానాన్ని ఇస్తున్నాను అన్నాడు. అది విన్న విశ్వామిత్రుడు చేతులు జోడించి నమస్కరిస్తూ, మీరు నన్ను దేవర్షికి బదులుగా బ్రహ్మర్షి అని పిలిచి ఉంటే, నేను విజితేంద్రియుడను (ఇంద్రియాలపై విజయం సాధించిన వాడు విజితేంద్రుయుడు) అయ్యేవాడిని అన్నాడు. దానికి బదులుగా బ్రహ్మ 'నీవు ఇంకా ఇంద్రియాలను పూర్తిగా జయించలేదు. దానికోసం ప్రయత్నించు' అని బ్రహ్మ స్వర్గలోకానికి పయనమయ్యాడు. బ్రహ్మదేవునితో పాటు వచ్చిన దేవతలు తమ తమ లోకాలకు వెళ్ళగా, విశ్వామిత్రుడు ఇంకోసారి తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. రెండు చేతులను పైకెత్తి, అటువంటి ఆధారంలేకుండా నిలబడి, గాలిని మాత్రమే తీసుకుంటూ, మరే ఇతర ఆహారం తీసుకోకుండా తపస్సు చేశాడు. ఎండాకాలంలో పంచాగ్నిహోత్రం మధ్య నిలుచుని (నాలుగు వైపుల పెద్దపెద్దగా మండే నాలుగు అగ్నిహోత్రాలు, పైన సూర్య్డు కలిపి ఐదు), వర్షాకాలంలో ఆకాశాన్ని పైకప్పుగా చేసుకుని (ఎటువంటి నీడా, పైకప్పు లేకుండా, వర్షానికి తడుస్తూ) తపస్సు చేశాడు. చలికాలం మొత్తం నీటిలో పడుకుని తపస్సు చేశాడు. ఈ విధమైన తపస్సు కొన్ని వేల సంవత్సరాల పాటు చేశాడు.


తరువాయి భాగం రేపు.....

🙏🙏🙏

సేకరణ

ఆదివారం రోజు

 08-11-2020 ఆదివారం రోజు   (1) "మహా సౌర యోగమనే" విశేష శుభయోగం. (2)"సర్వార్థ సిద్ధి యోగం" అనే  విశేష శుభయోగం (3) "రవి పుష్య యోగం" అనే విశేష శుభయోగం  కలవు. ఉదయం 06.11 - 08.46 నిముషాలు వరకు అంటే రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల  నిడివిలో ఈ మూడు యోగములు కలిసి ఉన్నాయి. ధార్మిక సాధకులు [1] అరుణ పారాయణములు, లేదా [2] శ్రీ సూర్యనారాయణ స్తోత్రములు  లేదా [3] శ్రీ ఆదిత్యహృదయ పారాయణములు లేదా [4] సవిత్రు మండలావర్తి సంబంధ హవనములు ఇత్యాదివి తమ శక్తి కొలది నియమనిష్ఠలతో సదాచారయుతముగా  ఆచరించటంవలన జన్మాంతరముగా ప్రాప్తించిన పాప ఫలితములు క్షీణించును,  ఆయురారోగ్యవృద్ధి కలుగును. సంకల్పములకు అనుకూలతలు పెరుగును.(అవకాశం ఉన్నవారు  గోధుమ రవ్వ+దేశవాళి ఆవు నెయ్యి+బెల్లం+కొద్దిగా పచ్చకర్పూరం+యాలకులు+ జీడిపప్పు+ బాదంపప్పు+ కుంకుమపువ్వు + కొద్దిగా గులాబీ రేకులు, ఉపయోగించి మడి కట్టుకుని శుచిగా తీపిపొంగలి తయారు చేసి, పొంగలి బాగా చల్లారిన తర్వాత  దాని పైన తేనె వేసి నివేదన సమర్పించాలి  ) నేటి ఉదయం 6 గంటల 12 నిమిషాలకు గోధుమ పిండితో చేసిన ప్రమిదలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె తో తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి .                                                                                   🌹శ్రీ భాస్కరాయ నమోనమః🌹

తిరుమలకు పోతున్నారా..??

 తిరుమలకు పోతున్నారా..??

మీ వాహనం 2010కి ముందు మోడల్ అయితే నో ఎంట్రీ..

-------------------------------///

కాలం చెల్లిన వాహనాలు ఇకపై తిరుమలతో పాటు, ఘాట్ రోడ్లపై అనుమతి కోల్పోనున్నాయి. ఈ మేరకు గురువారం తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుమల అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య పాత వాహనాల నిషేధాన్ని వెల్లడించారు. పది ఏళ్లు పూర్తి చేసుకున్న వాహనాలను ఇకపై తిరుమలకి అనుమతించేది లేదని తెలిపారు. పాతవి, ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరుమల ఘాట్ రోడ్లపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 2010 కంటే ముందు రిజిస్టరైన వాహనాలను తిరుమలకు తీసుకురాకూడదని, ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించమని ఆయన వెల్లడించారు.

రెండో ఘాట్ రోడ్డులోని శ్రీవారి సహజ శిలా స్వరూపం కనిపించే ప్రదేశంలో వాహనాలు నిలిపేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.  ఆ ప్రదేశంలో భక్తులు వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమల క్షేత్రం ‘నో హారన్’  జోన్ కావడంతో భక్తులు తమ వాహనాల హారన్ మోగించకూడదని సూచించారు. వాహనాల హారన్ మోగించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జరిమానా విధిస్తామని  ఏయస్పీ  మునిరామయ్య తెలిపారు.

విదురనీతి 38

 విదురనీతి 38


అతిథిసేవ:


అతిథి అనగా తిథి, వార నియమాలు లేకుండా ఇంటికి వచ్చినవాడు, అంటే ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా మన ఇంటికి వచ్చినవాడన్నమాట. అతిథిని దైవంగా భావించి సగౌరవంగా సేవించి సాగనంపడం భారతీయ సనాతన సంస్కృతిలో భాగం. ఇది పెద్దల ఆచరణ ద్వారా తరువాతి తరాలకు అందుతున్న సంస్కార భాగ్యం.


అతిథికి ఎదురువెళ్ళి స్వాగతం పలికి ఇంటిలోనికి తీసుకురావాలి. అభిమానం గౌరవం మేళవించి అతిథి యోగక్షేమాలు ప్రశ్నించాలి. కుటుంబ సభ్యులందరికీ అతిథిని పరిచయం చేసి పిల్లలచే మ్రొక్కించి వారి దీవెనలను స్వీకరింప చేయాలి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అందించాలి. ఆ తరువాత సుఖాసీనుణ్ణి చేయాలి. ప్రయాణపు శ్రమ పోగొట్టాలి. చల్లని నీళ్ళు అందించి దాహం తీర్చాలి. అతిథికి స్నానం ఏర్పాట్లు చూడాలి. స్నానానంతరం అతిథికి ఏకాంతతను సమకూర్చాలి. ఆయన అధ్యాత్మిక భావనలకు తగు ఏకాంత వాతావరణం కల్పించాలి. 


శక్తిమేరకు కాలానుగుణంగా దొరికే ఫలాలతో మధుర భక్ష్య భోజ్యాలతో అతిథికి అన్నం పెట్టాలి. ఇంటి ఇల్లాలు అన్నపూర్ణాదేవియై అతిథికి ఆప్యాయంగా వడ్డిస్తూ ఆదరంతో మెలగాలి. అతిథికి ఇష్టమైన పదార్థాలేవో గ్రహించి వడ్డించాలి. సన్యాసులకు మౌనంగాను, మిగిలినవారికి ఆహ్లాదకరమైన సంతోషదాయకమైన సంభాషణలతోనూ ఎలాంటి తర్క వితర్కాలకు తావివ్వని విధంగా భోజనం పెట్టాలి. 


భోజనానంతరం శయ్యను ఏర్పాటు చేయాలి. కాస్సేపు సుఖనిద్ర పోనీయాలి. ఆ సమయంలో యజమాని కూడా భోజనం పూర్తి చేసుకొని వచ్చి అతిథి తమ ఇంటికి వచ్చిన పనేమిటో, తాను చేయగలిగిందేమిటో అడిగి తెలుసుకుని శక్త్యానుసారం అతిథి కోర్కెను తీర్చాలి. సంతుష్టుడై ఇల్లు వదిలివెళ్ళే అతిథి, ఆతిథ్యం ఇచ్చిన ఇంట్లో పుట్టెడు భోగభాగ్యాలు వదిలివెళతాడని పెద్దల నమ్మకం.  


(ఇంకా ఉంది)

వ్యక్తిత్వ వికాస సంబంధ 40 పుస్తకాలు

 *వ్యక్తిత్వ వికాస సంబంధ 40 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు* 

------------------------------------------------


40 పుస్తకాలు ఒకేచోట! https://www.freegurukul.org/blog/vyakthithwavikasam-pdf


               (OR)


మీరు మారాలనుకొంటున్నారా? www.freegurukul.org/g/VyakthithwaVikasam-1


నిత్య జీవితంలో సైకాలజీ www.freegurukul.org/g/VyakthithwaVikasam-2


మిమ్మల్ని మీరు గెలవగలరు www.freegurukul.org/g/VyakthithwaVikasam-3


యువతా! లెండి!మేల్కోండి!మీ శక్తిని తెలుసుకోండి! www.freegurukul.org/g/VyakthithwaVikasam-4


మనస్తత్త్వ శాస్త్రము www.freegurukul.org/g/VyakthithwaVikasam-5


బాడీ సైకాలజీ www.freegurukul.org/g/VyakthithwaVikasam-6


వ్యక్తిత్వ వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-7


నిత్య జీవితంలో ఒత్తిడి - నివారణ www.freegurukul.org/g/VyakthithwaVikasam-8


స్ఫూర్తి www.freegurukul.org/g/VyakthithwaVikasam-9


యువ శక్తి www.freegurukul.org/g/VyakthithwaVikasam-10


మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే www.freegurukul.org/g/VyakthithwaVikasam-11


రిలాక్స్ రిలాక్స్ www.freegurukul.org/g/VyakthithwaVikasam-12


విద్యా మనో విజ్ఞాన శాస్త్రము www.freegurukul.org/g/VyakthithwaVikasam-13


ధీరయువతకు www.freegurukul.org/g/VyakthithwaVikasam-14


వ్యక్తిత్వ వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-15


వ్యక్తిత్వ వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-16


విజయం మీది www.freegurukul.org/g/VyakthithwaVikasam-17


స్వీయ భావన-వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-18


వండర్ మెమరీ టెక్నిక్స్ www.freegurukul.org/g/VyakthithwaVikasam-19


జ్ఞాపకశక్తి - చదివేపద్ధతులు www.freegurukul.org/g/VyakthithwaVikasam-20


నీ గమ్యం తెలుసుకో www.freegurukul.org/g/VyakthithwaVikasam-21


నీలో ఇద్దరు www.freegurukul.org/g/VyakthithwaVikasam-22


మీరూ 'శ్రీ'లు www.freegurukul.org/g/VyakthithwaVikasam-23


విజయపధం www.freegurukul.org/g/VyakthithwaVikasam-24


కలసి జీవిద్దాం-వ్యక్తిత్వ వికాస విజయమాల www.freegurukul.org/g/VyakthithwaVikasam-25


మనస్స్సరీరాలపై పరిసరాల ప్రభావం www.freegurukul.org/g/VyakthithwaVikasam-26


మానసిక శక్తులు www.freegurukul.org/g/VyakthithwaVikasam-27


మేధో వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-28


మాట మన్నన www.freegurukul.org/g/VyakthithwaVikasam-29


ప్రచారం పొందటం ఎలా www.freegurukul.org/g/VyakthithwaVikasam-30


పిల్లల శిక్షణా సమస్యలు www.freegurukul.org/g/VyakthithwaVikasam-31


బాడీ లాంగ్వేజ్-శరీరభాష www.freegurukul.org/g/VyakthithwaVikasam-32


ఎలా చదవాలి ? www.freegurukul.org/g/VyakthithwaVikasam-33


నవీన విద్య www.freegurukul.org/g/VyakthithwaVikasam-34


ఫస్ట్ క్లాస్ లో పాసవడం ఎలా ? www.freegurukul.org/g/VyakthithwaVikasam-35


జ్ఞాపకశక్తికి మార్గాలు www.freegurukul.org/g/VyakthithwaVikasam-36


వైజ్ఞానిక హిప్నాటిజం www.freegurukul.org/g/VyakthithwaVikasam-37


మనో విజ్ఞాన శాస్త్రం - పరీక్ష www.freegurukul.org/g/VyakthithwaVikasam-38


విశ్వనాథ నవలలు మనస్తత్త్వ చిత్రణ www.freegurukul.org/g/VyakthithwaVikasam-39


పాటల ద్వారా ప్రేరణ www.freegurukul.org/g/VyakthithwaVikasam-40


వ్యక్తిత్వ వికాసం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link www.freegurukul.org/join

చేయాలనుకుంటున్నావో

 ఒకే ఒక్క విషయం గుర్తు పెట్టుకో.. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఎలాంటి సందేహాలు లేకుండా నిర్మొహమాటంగా చేసేయ్! చుట్టూ ఉండే మనుషుల మొహాలు వైపు అస్సలు చూడకు.. అసహ్యపు ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని నిన్ను వెనక్కి లాగడానికి ట్రై చేస్తారు. నీ లైఫ్ నీది.. నీ కష్టం నీది, ఎవడో నిన్ను ఒప్పుకునేది ఏంటి? ఎవడో నిన్ను జడ్జ్ చేసేదేంటి? ఒకే ఒక్క చూపు చూడు.. అది మొహం మీద లాగి కొట్టినట్లుండాలి. రెండోసారి నీ లైఫ్ గురించి, నీ నిర్ణయాల గురించి మాట్లాడటానికి నోరు పెగలకూడదు.


ఇక్కడ ఎవడి లైఫ్‌లో వాడు వందల చిల్లులు పెట్టుక్కుని, మళ్లీ ఆదర్శమూర్తుల్లా "అది చేయొద్దు, ఇది చేయొచ్చు, అది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల కాదు" అంటూ వెధవ పోజులు కొడతారు. "అన్నా నేను ఈ పని చేస్తున్నాను, ఇది కరెక్టేనా" అని ఇంకొకడిని అడిగావే అనుకో.. అతి కొద్దిమంది మాత్రమే భుజం తట్టి ప్రోత్సహిస్తారు. 99 శాతం మంది "అదీ.. పెద్ద వర్కౌవుట్ అవ్వదనిపిస్తోంది" అంటూ వంద వంకలు చెబుతారు.


ఈ జనాభా అంతా మేడిపండులా లోపల్లోపల కుళ్లిపోయారు. పైకి మాత్రమే తెల్లటి ఖద్దరు షర్ట్‌లు, బ్లేజర్లు, గుభాళించి కొట్టే పెర్‌ఫ్యూమ్‌లూ! మైండ్ రీడ్ చేస్తే కంపు కొడుతుంది. సో ఇక్కడ ఎవడూ లేడనుకుని దీక్షగా నీ పని నువ్వు చేసుకో.. కచ్చితంగా విజయం సాధిస్తావు. అప్పుడు ఎగబడి నీ దగ్గరకు వచ్చి రాసుకు పూసుకు తిరుగుతారు.


నీతి బోథ. ఒక స్కూల్లో చిన్న పిల్లవాడు భోజనసమయంలో తన మిత్రులతో పాటు 

తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. ఆ అబ్బాయి తాను తెచ్చుకున్న

అన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు. అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గ తినకుండా, క్రింద పైన వేసుకుంటూ తినేవారు.

మరికొందరైతే గొడవపడుతూ కోపంతో ఆహారాన్ని విసిరిపారేస్తుంటారు.

కానీ ఈ అబ్బాయి మాత్రం ఒక్క మెతుకు కూడా పారేయకుండా తినేవాడు.

ఒకవేళ తాను తెచ్చుకున్న బాక్స్ కు ఎక్కడైనా రెండు మెతుకులు అతుక్కుని

ఉన్నాకూడా వాటిని కూడా తినేవాడు. అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని

ఎగతాళి చేసేవారు. " అరే! వీడొక తిండిపోతు రా! ఒక్కమెతుకు కూడా  

వదలకుండా తింటాడు" అని ఎగతాళి చేసినా ఈ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు. ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజూ గమనిస్తూ ఉండేవాడు,

ఒకరోజు తన మిత్రున్ని ఇలా అడిగాడు.


" నువ్వు ప్రతిరోజూ ఇలా నీవు తెచ్చుకున్న ఆహారాన్ని వృధా చేయకుండా

  ఇంత చక్కగా తింటున్నావు కదా! మిగతావాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నా

  నీకు బాధ అనిపించదా? " దానికి ఈ అబ్బాయి ఇలా సమాధానం

ఇచ్చాడు.


" ఏదో వారికి తెలియకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకేం బాధలేదు.

  ఇక నేను అలా తినడానికి కారణం చెప్పనా? అలా తినడం అన్నది 

 నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం. అమ్మ ఉదయాన్నే

 లేచి నాకు ఇష్టమైన పదార్థాలను వండి ప్రేమతో బాక్స్ లో పెట్టి పంపిస్తుంది,

 వండటానికి కావలసిన వస్తువులను నాన్న ఎంతో కష్టపడి సాయంత్రానికి

తెస్తాడు. ఇద్దరి ప్రేమతో పాటు వారి కష్టంకూడా నా భోజనంలో ఉంది.

అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును వృధా చేసినా వారికి అగౌరవ పరచినట్లే!

అంతేకాదు ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు.

అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా! అందుకే నేను ఎవరు

నవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను .అంతేకాదు ఎంతోమందికి

రెండుపూటలా కడుపునిండా అన్నం దొరకడం లేదు. నాకు దొరికింది. నా తల్లిదండ్రుల

పుణ్యమా అని. అమ్మ ఎప్పుడూ చెపుతుంది. ఆహారాన్ని వృధా చేయకూడదని "

అని చాలా చక్కగా చెప్పాడు.


నేర్చుకోవాలని మనసు ఉంటే చాలు చిన్న పిల్లల నుంచి కూడా 

చాలా నేర్చుకోవచ్చు.ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచరించవలసిన అవసరం 

ఎంతైనా ఉంది కదా! ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటివి చెప్పి

వారిలో ఆలోచనా శక్తిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.

👏



మన ఇతిహాసాలు

 *📖 మన ఇతిహాసాలు 📓*



*రామాయణం, మహాభారతం- రెండింటిలోనూ కనిపించే ఒకే పాత్రలు*


రామాయణ మహాభారతాలు హిందూ పురాణాలలో మహా కావ్యాలుగా పూజింపబడుతూ యుగయుగాలుగా గౌరవించబడుతున్నాయి. హిందువులు వీటిని కేవలం కధలుగా కాకుండా ఇతిహాసం లేదా చరిత్ర గా భావిస్తారు.ఈ కావ్యాలలో వర్ణించబడిన సంఘ్తటనలు నిజం గా జరిగాయని, మరియూ వాటిలోని పాత్రధారులు ఒకప్పుడు రక్త మాంసాలతో కూడిన శరీరం తో భూమి మీద తిరిగారనీ హిందువుల విశ్వాసం. రామాయణం త్రేతా యుగం(యుగాలలో రెండవది)లో జరిగితే, మహాభారతం ద్వాపర యుగం(మూడవ యుగం) లో జరిగింది. ఈ రెంటి నడుమ చాలా సంవత్సరాల వ్యత్యాసం(బహూశా కొన్ని మిలియన్ల సంవత్సరాలు) ఉంది.కానీ ఈ రెండింటిలోనూ కనిపించిన పాత్రలు కొన్ని ఉన్నాయి. 


 *హనుమాన్*


హనుమంతుడు సుగ్రీవుని సచివుడు(మంత్రి) మరియు శ్రీరాముడి భక్తాగ్రేసరుడు.రామయణం లో హనుమంతుని పాత్ర ముఖ్య పాత్రలలో ఒకటి.ఈయన మహాభారతం లో కూడా కనిపిస్తారు.హనుమంతుని సోదరుడైన భీముడు(వాయుదేవుడు వీరి పితామహుడు)సౌగంధికా పుష్పాన్ని తీసుకురావడానికి వెళ్తుండగా ఒక పెద్ద ముసలి వానరం భీముడి దారికి అడ్డంగా తన తోకని అడ్డం పెట్టి పడుకుంది.ఆగ్రహించిన భీముడు తోకని అడ్డం తీయమని అడిగాడు.అప్పుడు ఆ వానరం తాను ముసలిదాన్నయిపోవడం వల్ల అలసిపోయాననీ భీముడే తనని పక్కకి తప్పించాలనీ సమాధానమిచ్చింది.తన శక్తి సామర్ధ్యాల కి గర్వించే భీముడు ముసలి వానరం తోకని కాస్తయినా కదల్చలేకపోయాడు. గర్వ భంగమైన భీముడు తానెవరో తెలుపవలసిందిగా ముసలి వానరాన్ని కోరాడు.అప్పుడు ఆ ముసలి వానరం తాను హనుమంతుడినని చెప్పి భీముడిని ఆశీర్వాదిస్తుంది.

నేటి ఆణిముత్యం

 *💎 నేటి ఆణిముత్యం 💎*



నడవక చిక్కి లేమి యగునాఁడు నిజోదరపోషణార్థమై

యడిగిభుజించుటల్నరుల కారయవ్యంగ్యముకాదు పాండవుల్

గడుబలశాలు రేవురు నఖండవిభూతిఁ దొలంగి భిక్షముల్

గడువరె యేకచక్రపురిఁ గుంతియుఁదారొక చోట? భాస్కరా! 


*భావం:*


మానవుడు కుటుంబము జరుగనప్పుడు, ఒకరిని యాచించి తిని బ్రతుకుట తప్పు గాదు. మహాబలపరాక్రమ సంపన్నులగు పాండవులు ఐదుగురూ, కాలవశమున సంపదలను విడనాడి, తల్లితో కలసి ఏకచక్రనగరమున బిచ్చమెత్తుకొని తిని కాలమును గడపలేదా?


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

కస్తూరీమృగం

 🚩🛕 *హిందూ ఆధ్యాత్మిక వేదిక*🛕🚩

=======================


*కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది*.

*అది మంచి మదపువాసనగా ఉంటుంది*.

*అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది.ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు.ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది..*

*మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు.*


నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్

సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్ధయాత్రల అవసరం ఏముంది?

 ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్ధయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి 'నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి.'అని చెబుతాడు.వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు.

అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపచేస్తాడు కృష్ణుడు.ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.

'అదేంటి బావా? ఇది చేదు దోసకాయ. కటికవిషంలాగా ఉంది.ఇలాంటి వంటకం చేయించావేమిటి?' అని వారు అడుగుతారు. దానికి కృష్ణుడు నవ్వి.' బావా.ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూచావా?' అంటాడు.

ఎన్ని తీర్ధయాత్రలు చేసినా,మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.

మనిషి ప్రయాణం బయటకు కాదు.లోపలకు జరగాలి.యాత్ర అనేది బయట కాదు అంతరిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు.అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలోనుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు. పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు..ఒకచోట స్థిరంగా కూచొని తపస్సుచేశారు. జ్ఞానసిద్ధిని పొందారు.🌸

అన్నీ పట్టించుకోకండి

 అన్నీ పట్టించుకోకండి


ఒక పాము వడ్రంగి దుకాణంలో లోకి దూరి, అక్కడ వున్న రంపం పై నుండి ప్రాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది. వెంటనే పాము కోపముతో రంపమును గట్టిగా కరిచింది. ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, రంపం తనపై ఎదురు దాడి చేస్తోందనుకుని 

వెంటనే రంపమును గట్టిగా చుట్టుకుని, తన బలమంతా వుపయోగించి, రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని నిర్ణయించుకొని, చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకొంది.

మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై యిలానే స్పందించి‌, చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికి అసలు జరిగినదానికి సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరిగిపోతుంది. 

జీవితంలో ప్రశాంతంగా వుండలంటే కొన్నిసార్లు అనవసరమైన కొన్ని పరిస్థితుల్ని, మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలను, అసూయలను మరియు ద్వేషాలను పట్టించుకోకుండా చేయవలసి వుంటుంది. కొన్నిసార్లు అసలు ప్రతిస్పందించకపోవడమే మంచిది....

ఒత్తిడికి విరుగుడుగా దానిమ్మ:

 ఒత్తిడికి విరుగుడుగా దానిమ్మ:

ఆకర్షణీయమైన రంగుతో నిగనిగ లాడుతూ కనిపించే దానిమ్మ పండు ఆరోగ్యానికి కొండంత అండ. రోజూ దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలేమిటో తెలుసుకుందాం.

- దానిమ్మ వినియోగంతో రక్తనాళాలు, గుండె గదుల పనితీరు మెరుగుపడుతుంది. దానిమ్మలోని సహజ యాస్పిరిన్‌ గుణాలు రక్త సరఫరాను వేగవంతం చేస్తాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది.

- దానిమ్మ లైంగిక సామర్థ్యాన్ని, సంతాన సాఫల్యతను పెంచుతుంది. గర్భస్థ శిశువుల ఎదుగుదలకు దోహదం చేసే ఫోలిక్‌ యాసిడ్‌ దానిమ్మ లో పుష్కలంగా లభిస్తుంది. అందుకే తరచూ గర్భిణులు దానిమ్మ తీసుకోవాలి.

- దానిమ్మలో లభించే విటమిన్‌ ఎ, సి, ఈ, బి5, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు హానికారక ప్రీరాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడి క్యాన్సర్‌, అల్జీమర్స్‌ రాకుండా చేస్తాయి.

- వయసు పెరిగిన కొద్దీ ఏర్పడే ముడతలను దానిమ్మ రసం నివారిస్తుంది.

రుతు సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడికి దానిమ్మ రసం విరుగుడుగా పనిచేస్తుంది.

- అలర్జీలు, కీటకాలు కుట్టినచోట దానిమ్మరసం రాస్తే వాపు, నొప్పి తగ్గుతాయి.

నీళ్ల విరేచనాలతో బాధపడేవారికి ఇది మంచి మందు. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.

- వయసుతోబాటు తగ్గే కీళ్ల మధ్య జిగురు నశించకుండా చేస్తుంది. ఆస్టియో ఆర్ధరైటీస్‌ వంటి వ్యాధులనూ నియంత్రిస్తుంది. రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.

దీపారాధన - పాటించాల్సిన నియ‌మాలు

 దీపారాధన  - పాటించాల్సిన నియ‌మాలు


నిత్యం దీపారాధన చేసినా.. కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరకి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి.. దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే.. నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ? ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసుకుందాం.. 


 పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయష్కరం. అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి, మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.


తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే.. గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి.. సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే.. రుణ బాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే.. సిరిసంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణంవైపు దీపారాధన చేయరాదు. దక్షణముఖంగా దీపం వెలిగిస్తే.. అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి. 


దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే.. పూర్వజన్మ పాపాలు తొలగిపోయి.. సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్ర్తం మీద పన్నీరు చల్లి, ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్ర్తాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా.. శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలికిస్తే.. శ్రేయస్కరం. 


దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలి అనే దానిపై చాలా మంది అయోమయం చెందుతూ ఉంటారు. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. లేదంటే.. నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే.. దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 48 రోజులు దీపం వెలిగిస్తే.. సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

అమ్మతో మాట

 ॐ                    అమ్మతో మాట 

    (తప్పక చదువుతూ అనుభూతి పొందేదని అనిపించి forward చేయబడుతోంది) 


    ఏంటమ్మా ఇది.. 

    ఎప్పుడూ ఆ ఆదిశంకరుడు, కాళిదాసు, మూకశంకరులేనా! 

    కొంచెం మావైపు కూడా చూడొచ్చు కదా! 

   “ఏమిట్రా నీ గోల! నేను మీవైపు చూడకుండానే మీరంతా పెద్దాళ్ళైపోతున్నార్రా!” అని ఉరమకు. 

    చూడటం అంటే అలా ఇలా చూడమని కాదు. 

    పామరుడిని మహాకవిని చేయడానికీ, మూగవాడితో అయిదొందల పద్యాలు చెప్పించడానికీ, నువ్వొక చూపు చూశావే! అదీ, ఆ చూపూ చూడాలి. 

    అమ్మా! అవడానికి అక్షరాలను పుట్టించింది మీ ఆయనే అయినా, నీ చూపు పడకపోతే అవి కదలనే కదలవేంటమ్మా! 

     ఆమాట కొస్తే, సర్వేశ్వరుడైన నీ మగడే, నీ అనుమతి లేనిదే ఏ పనీ చేయడు. 

     అప్పట్లో హాలాహలం పుట్టి లోకాలను దహించి వేస్తుంటే.. 

    పాపం ఆ దేవతలంతా మీ ఇంటిముందు బారులు తీరి.. “కుయ్యో! మొర్రో! విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు” అని ఏడుపులు, పెడబొబ్బలూ పెడుతుంటే.., 

    అప్పుడు కూడా అంతటి ఆ భోళాశంకరుడూ, వెళ్ళిరానా?  అన్నట్టు నీవైపు చూశాడు. 

   “పాపం మీ అన్నయ్య ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. నేను వెళ్ళి ఈ హాలాహలం సంగతేదో చూస్తే, అతను పొంగిపోతాడు” అంటూ నీ పుట్టింటి వారి మాటలు చెప్పి మరీ, నిన్ను ఒప్పించి బయల్దేరాల్సి వచ్చింది. 

    మరి నువ్వు భర్తను కొంగున ముడేసుకున్న *“స్వాధీనవల్లభ”* వు కదా! 

    పుట్టింటివాళ్ళ పేరు చెబితే పొంగిపోతావన్న మాట నిజమే కానీ, వాళ్ళైనా మీ ఆయన గురించి, ఒక చిన్నమాట తప్పుగా అన్నా, కళ్ళెర్ర జేస్తావు. అసలే నువ్వు *సదాశివపతివ్రతవు*. 

    *కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరవు.* 

     మీ నాన్న దక్షుడు నీ మగని కోసం నానా మాటలు అంటే, ఆ తరువాత ఏం జరిగిందో మాకు తెలియనిదా! 

    మీ  ఆయనకు కూడా నీవంటే ఎంత ప్రేమో కదా! నువ్వు నవ్వితే ఉబ్బితబ్బిబ్బైపోతాడు ఆ కామారి. 

   మరి *“మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా”* అని ఊరికే అన్నారా ఆ వసిన్యాది దేవతలు. 

    నీ నవ్వులో ఉన్న మధురిమముందు ఆ చదువుల తల్లి వీణానాదమే వెలవెల బోయిందటగా. *“నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ”* అని వాళ్ళువీళ్ళూ చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది. 

    మా ఆది శంకరులు కూడా సౌందర్య లహరిలో *“విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః.. ”* అంటూ మొదలయ్యే ఓ శ్లోకంలో ఈ విషయాన్నే చెప్పారు. 

    సరస్వతీ దేవి నీ దగ్గర కూర్చొని, మీ ఆయన లీలలను తన వీణ కచ్ఛపిపై గానం చేస్తోందట. నువ్వేమో పొంగిపోయి, “భలే పాడుతున్నావ్!” అన్నావట. అసలు నీ మాటలలో ఉన్న మాధుర్యం ముందు నా వీణానాదం మరీ తీసికట్టుగా ఉందనుకుంటూ, ఆవిడా గభాలున ఆ వీణను మూటకట్టేసిందట. 

    ఇక్కడ ఇంకొక విషయం.. మీ ఆయనన్నా, మీ ఆయనను కీర్తించేవారన్నా నీకు ఎంతిష్టమో కదా! 

 *“ఓ మహా కామేశ మహిషీ”* అని పిలిస్తే చాలు పొంగిపోతావ్. అవున్లే అసలు ఉన్నదంటూ మీ ఇద్దరే కదా! 

    ఈ సృష్టి మొత్తం లయం చేసేసి, నీ మగడు ఆనంద తాడవం చేస్తుంటే.. అసలు పోలికే లేనంత అందమైన చుబుకం గల *“అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా”* వైన నువ్వు, నీ పల్లవముల వంటి అందమైన చేతులను అలా ఆ చుబుకం కింద పెట్టుకుని, ఆ తాండవాన్ని చూసి పరవశించిపోతూ.. *“మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి”గా* ఉన్నావు. 

    నువ్వసలే *“లాస్యప్రియ”వు* కూడానాయే. 

   ఎంతటి *“మహాలావణ్య శేవధి”వి*. *“ఆబ్రహ్మకీటజనని”వి* అయినా, 

    నీకు మీ ఆయన తొడమీద కూర్చుని, *“శివకామేశ్వరాంకస్థా”* అని అనిపించుకోవడమే ఇష్టం.  

    అందుకే మా కాళిదాసు 

*"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే*

*జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”* అంటూ మీ ఇద్దరి అభేదాన్ని చూపిస్తూ, నమస్కరించుకున్నాడు. 

  అసలు మా కాళిదాసు నీపై వ్రాసిన *“దేవీ అశ్వధాటి”* స్తోత్రం చదివితే తెలుస్తుందమ్మా! మా కవుల కవిత్వంలోని సొగసు. 

    సంగీతం ఏమాత్రం రానివాడికి కూడా తనకు సంగీతం వచ్చేసునేమో అన్న భ్రమకలిగించేంత అందంగా ఉంటుందా శ్లోకాల నడక.


*చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ* 

*కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా* 

*పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా* 

*ఘోటీఖురా దధికధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతామ్* 


    ఆహా! మొదటి శ్లోకమే ఎంత అందంగా ఉందో చూశావా? 

    ఇలాంటివి 13 శ్లోకాలున్నాయి ఆ స్తోత్రంలో. ఈ శ్లోకాలలో కూడా ఒకచోట నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమను రసవత్తరంగా చెప్పాడు కాళిదాసు. 

   *“శంభా వుదార పరిరంభాంకుర త్పులక దంభానురాగ పిశునా..”* అంటాడు. 

    మీ ఆయన నిన్ను గాఢంగా ఆలిగనం చేసుకున్నప్పుడు నీకు కలిగే పులకరింతలు నీకా పరమేశ్వరునిపై ఉన్న అపారమైన అనురాగానికి సూచికలట. 

    మీ ఆయన కోసమే చెప్పుకుంటూ కూర్చుంటే నీకూ, నాకూ ఇద్దరికీ ఇక ఈ లోకం పట్టదు. 

    కనుక కాసేపు వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం.


    అమ్మా! అసలు మీ అన్న దశావతారాలను అలా నీ చేతివేళ్ళ గోళ్ళలో నుండి అలా ఎలా పుట్టించేశావమ్మా! చిత్రం కాకపోతేను. 

   *“కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః”* అన్న మాట తలచుకుంటేనే భలేగా ఉంటుంది. ఇక్కడే ఇంకొక్క విషయం చెప్పాలి. మళ్ళీ మరచిపోతానేమో! 

   *“సాగరమేఖలా”* అనే నీ పేరు కూడా నాకెంత ఇష్టమో!  

     సముద్రాన్నే వడ్డాణంగా పెట్టుకున్న దానివంటకదా! ఎంత బావుంటుందో తెలుసా ఈ మాట. 

     ఈ నీ నామాన్నే మా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు 

   *“తేనెలతేటల మాటలతో, మన దేశ మాతనే కొలిచెదమా..”* అనే ఓ చక్కని గీతంలో అందంగా వాడారు. 

  *“సాగర మేఖల చుట్టుకొని -  సురగంగ చీరగా మలచుకొని”* అంటూ నీ నామాన్ని దేశమాతకు అన్వయిస్తూ వ్రాశారు. 

    అసలు మా సినీ కవులు కూడా నీమీద పాట రాయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెలరేగిపోతారు. 

    ముందుగా మాత్రం నేను మా మల్లాది రామకృష్ణశాస్త్రి గారినే చెబుతాను. 

*“లలిత భావ నిలయ నవ రసానంద హృదయ*

*విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ*

*మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ*

*సుమరదన విధువదన.. దేవి…”* అంటూ ఆయన వ్రాస్తే, 

    ఆ సాహిత్యానికి మా ఘంటశాల వేంకటేశ్వర్రావు గారు బాణీ కట్టారు. 

    మల్లాది వారి సూచన మేరకు, ఈ పాటలో 

    సరస్వతీ దేవి కోసం వచ్చినప్పుడు సరస్వతి రాగంలో, 

     శ్రీదేవి కోసం వచ్చినప్పుడు శ్రీరాగంలో, 

     లలితాదేవి కోసం వచ్చినప్పుడు లలితరాగంలో స్వరరచన చేశారు మా ఘంటశాల. 

     ఇలాంటి పాట వింటూ నాలాంటి పామరుడే పులకించిపోతుంటే.. 

   *“కావ్యాలాప వినోదిని”వి,* 

  *“రసజ్ఞ”వు.* *“కావ్యకాళా”* రూపిణివి అయిన నీవెంత మురిసిపోతుంటావో కదా! 

    ఆయనే వ్రాసిన *“శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా”* పాట కూడా మరో మేలిమి ముత్యం! 

   *“జగముల చిరునగవుల పరిపాలించే జననీ*

    *అనయము మము కనికరమున కాపాడే జననీ”* అంటూ.. 

   *“అనేకకోటిబ్రహ్మాండజనని”* వైన నిన్ను కీర్తిస్తూ.. 

   *“మనసే నీ వశమై స్మరణే జీవనమై*

    *మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి”* అంటూ మా అందరి తరపునా ఆయనే ప్రార్థించేశారు.

    ఇక సముద్రాలగారి *“జననీ శివకామినీ..”*, పింగళిగారి *“శివశంకరీ..”* పాటలు కూడా మమ్మల్ని ఆనందడోలికల్లో మునకలేయించేవే.

    మా వేటూరి గారి సంగతైతే చెప్పనక్కరనే లేదు. 

*“అఖిలాండేశ్వరి చాముండేశ్వరి*

 *పాలయమాం గౌరీ*  *పరిపాలయమాం గౌరీ”* అంటూ మొదలయ్యే ఆ పాట, కాళిదాసు కవిత్వంలా సొగసుగా పరుగులు తీస్తుంది.

*“శుభగాత్రి గిరిరాజపుత్రి*  

 *అభినేత్రి శర్వార్ధ గాత్రి* 

 *సర్వార్థ సంధాత్రి* 

 *జగదేక జనయిత్రి”* ఇలా అద్భుతంతా సాగిపోతుందా పాట. 

    మీ ఆయన అయిన శర్వునిలో నీవు సగభాగం కాబట్టి *శర్వార్ధ గాత్రి* అన్నారు. గాత్రము అంటే శరీరం అనే అర్థం ఉంది కదా!  అలానే సర్వ కార్యసిద్ధిని ఇచ్చుదానవు కనుక *సర్వార్థ సంధాత్రి* అన్నారు. అసలు శర్వార్థ, సర్వార్థ అనే పదాలు వినడానికి కొంచెం ఒకేలా ఉన్నా, ఎంతటి భేదం ఉందో కదా వాటి మధ్య. అదీ మరి మా వేటూరంటే! 

    అదీ నీ కరుణ ప్రసరించిన వారి కవిత్వమంటే. 

    ఈరోజు  నీతో ఇలా ఏవోవో చెప్పేస్తున్నాను. 

    అప్పట్లో శివరాత్రికి మీ ఆయనకోసం, 

    శ్రీరామనవమికి మీ అన్నయ్యకోసం రెండుత్తరాలు వ్రాశాను. 

    వాళ్ళకు వ్రాసి, మీ అందరికీ తల్లినైన నాకు మాత్రం వ్రాయవా అంటావమోనని ఈ మాటలన్నీ అరచి మరీ చెబుతున్నాను. వింటున్నావు కదా! 

    ఇక్కడ వంటింట్లో పని చేసుకుంటున్న మా అమ్మకు ఏదో ఒకటి చెబుతూ, 

    మధ్యమధ్యలో “ఇదిగో అమ్మా, వింటున్నావా? ఓ అమ్మా!!” అని అరుస్తుంటాను. 

    మా అమ్మేమో, ఊ! చెప్పరా” అంటుంది తన పని తాను చేసుకుంటూనే. కాకపోతే ఆవిడకు ఇక్కడ ఒకింటి పనే కాబట్టి ఇబ్బంది లేదు. 

    కానీ నీ సంగతి అలా కాదు కదా! 

    అనంతకోటి బ్రహ్మాండాలన్నింటినీ పరిపాలించే తల్లివి. 

    లోకాలన్నీ తన బొజ్జలో దాచుకున్న ఆ పరమశివుని భార్యవు. *“సదాశివకుటుంబిని”వి.* 

    అందుకే, కోట్లాదిమంది పిలుపులలో నా పిలుపెక్కడ వినబడదో అన్న భయం చేత, ఇంకాస్త గట్టిగా అరచి చెబుతున్నాను. 

    *ఇదిగో అమ్మా! ఇటూ.. ఈవైపు.. నావైపు చూడు! నేనూ..* 

          *స్వస్తి!*


చాలా బాగుంది కదా! 

సద్గురుదేవదత్త

ధార్మికగీత -73*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                             *ధార్మికగీత -73*

                                        *****

     *శ్లో:-ఉత్తమం  స్వార్జితం  విత్తం౹*

           *మధ్యమం  పితు రార్జితం ౹*

           *అథమం  భ్రాతృవిత్తం  చ ౹*

           *స్త్రీ  విత్త మథమాథమమ్ ౹౹*

                                       *****

*భా:-  సాధారణ, సాంకేతిక, శ్రామిక విద్యలలో ఏదో ఒకదానిని గడించి, లేదా కూలీ నాలీ చేసైనా, నిరంతర కృషితో నీతి నిజాయితీలకు కట్టుబడి, కష్టపడి సంపాదించిన స్వీయ సంపాదన ఉత్తమము. తాతముత్తాతలు,  తండ్రి తిని - తినక కాయకష్టంతో  సంపాదించి కూడబెట్టడం వలన   వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిపాస్తులు తీరికగా కూర్చుని, తేరగా  అనుభవించడం మధ్యమం. పేదరికము,కుటుంబభారము, అలసత్వము, అనారోగ్యములతో, బ్రతుకుతెరువు లేక ఉదారుడైన సోదరుని సంపాదనపై  ఆధారపడి భార్యాబిడ్డలతో సహా జీవించడం అథమము. శక్తియుక్తులు, దీక్షాదక్షతలు,జవసత్త్వాలు,ఆయురారోగ్యాలు పుష్కలంగా ఉన్నా, సిరిసంపదలతో తులతూగుతూ కూడా సంపాదనా పరురాలైన మహాలక్మి వంటి  భార్య  కష్టార్జితంపై ఆధారపడి, ఉదాసీనంగా జీవించే పురుషుని జీవితం అథమాథమమే. "శ్రమ ఏవ జయతే" ; "ఉద్యోగం పురుష లక్షణం" ; "కష్టే ఫలీ"  అంటూ మన భారతీయత పదే పదే చాటుతోంది. కాన ప్రతి ఒక్కరు బుద్ధి బలం, వాగ్బలం ,  కండబలం మేళవింపుతో క్షణ క్షణం కష్టపడుతూ, కణం కణం గా విత్తం ఆర్జించాలని, ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు పెడుతూ, సంసారాన్ని సుఖమయం చేసికోవాలని సారాంశము*.

                                     *****

                       *సమర్పణ  :  పీసపాటి*    

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲





 










 

దేశం





 

6.3.4.1 దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి

 **అద్వైత వేదాంత పరిచయం**


6.3.4.1 దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి :


 శాస్త్రంలో దీన్ని రెండు సాంకేతిక పదజాలాల్లో వర్ణిస్తారు    

తత్‌ క్రతున్యాయ:। భ్రమరకీటక న్యాయ:॥

  ఆలోచనాతీరు మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాబట్టి, వాటిని

మార్చుకోవటం చాలాఅవసరం.భగవద్గీత 16వ అధ్యాయంలో ఆధ్యాత్మిక లక్ష ్యం వైపు తీసుకెళ్ళే దైవీ సంపత్తి గురించి వుంది. లక్ష్యాన్నుంచి దూరం చేసేది ఆసురీ సంపత్తి.  

ఆసురీ సంపత్తిలో ఈర్ష ్య, ద్వేషం, అసహనం, చిరాకు లాంటి లక్షణాలు ఉంటాయి. 

  ఇవన్నీ కూడా మళ్ళీ ఆలోచనలే. ఆలోచనలు ఇటుకలలాంటివి. ఒక భవంతి ఆకారం, ఆ ఇటుకలని పేర్చిన పద్ధతి వల్ల ఏర్పడుతుంది. భవంతి రూపు మార్చాలంటే, ఇటుకల అమరికమార్చాలి.అంతే. అలాగే మన ఆలోచనా తీరుని మార్చుకుని, ‘నాకు ఓపిక ఉంది. నేను నా జీవితాన్ని 

ఎదుర్కోగలనన్న నమ్మకం ఉంది’ అనుకోవాలి. దాని బదులు, ‘నాకేం తెలియదు, నేను అసమర్థుడిని’ అనుకుంటాం. మామూలుగా, ఈరోజుల్లో రోగాలు కూడా కేవలం ఆరోగ్యం 

కోరుకోవటం వల్ల నయమవుతున్నాయి. మనసు శక్తివంతమైన పరికరం. దానికి అఖండమైన సంకల్పబలం, దృఢనిశ్చయ శక్తి ఉంది. ఈ విలువల ధ్యానంలో ఈ సంకల్ప బలాన్ని 

పెంచుకుంటాం. ఇది నాలుగో విధమైన ధ్యానం.  

  ఈ నాలుగు రకాల ధ్యానాలూ మన మనసుని నియంత్రించి, దాన్ని ఆరోగ్యవంతం చేసి, పురుషార్థప్రాప్తికి అర్హులని చేస్తాయి.


07. జ్ఞానయోగం

  శాస్త్రం మనిషి కోరే నాలుగు పురుషార్థాలని వివరించి,వాటిని సాధించటానికి మూడుపద్ధతులని సూచించింది. అవి కర్మయోగం, ఉపాసన యోగం, జ్ఞానయోగం. 

రేపు జ్ఞానయోగం గురించి చూద్దాం.

🙏🙏🙏

సేకరణ

రామాయణమ్..117

 రామాయణమ్..117

అరణ్యకాండము ప్రారంభము

.

ప్రవిశ్య తు మహారణ్యం దణ్డకారణ్యమాత్మవాన్.

రామోదదర్శదుర్దర్షస్తాపసాశ్రమమణ్డలమ్.

.

బుద్ధిమంతుడు ,ఎవరూకూడ తేరిపారచూడసాధ్యముకాని వాడు ఎదిరింపశక్యము కాని వాడు అయిన రాముడు దండకారణ్యములో ప్రవేశించి మునుల ఆశ్రమ సముదాయాన్ని చూశాడు.

.

ఆ ముని వాటికలలో అన్ని మృగాలూ నిర్భయంగా సంచరిస్తున్నాయి.వాకిళ్ళు అన్నీ రంగవల్లులతో తీర్చిదిద్దబడి మనోహరంగా ఉన్నాయి.

.

ఆ ఆశ్రమం చుట్టూ మధురఫలాలనిచ్చే ఎన్నో వృక్షాలు దట్టంగా ఏపుగా పెరిగి చూడటానికి మనోహరంగా ఉన్నాయి.

.

ఆ ఆశ్రమంలో బలిహోమాలతో దేవతాపూజలు,వేదఘోషలతో ప్రాంగణమంతా మారుమ్రోగుతూ బ్రహ్మలోకాన్ని తలపిస్తున్నది.

.

సూర్యుడితో సమానమైన తేజస్సుగల మహామునులంతా ఆ ఆశ్రమంలో నివసిస్తున్నారు.

.

వారందరినీ చూసి తన ధనస్సుకు ఉన్న నారి విప్పివేసి మెల్లగా వినయపూర్వమకముగా వారున్న వైపుకు రాముడు వెళ్ళాడు.

.

సీతారామలక్ష్మణులను కాంచినంతనే మునులు ఎదురేగి స్వాగతము పలికారు.

.

వారందరికీ ఒకటే ఆశ్చర్యం అబ్బ! ఎంత నయనమనోహరంగా ఉన్నాడు రాఘవుడు.

మంచి శోభతోకూడిన శరీర సౌష్ఢవము,సౌకుమార్యము,అద్భుత రూపసౌందర్యము చూసి రెప్పవాల్చకుండా తదేకంగా వారినే చూస్తూ ఉండిపోయారు ఆ ముని గణమంతా!

.

సీతారామలక్ష్మణులకు ఆశ్రమప్రాంగణంలో ఒక పర్ణశాలలో బస ఏర్పాటు చేసి ఆయనను సత్కరించి వినయపూర్వకముగా వేడుకున్నారు.,"రాఘవా,నీవే మాకు రాజువు రక్షకుడవు కావున సర్వదా తల్లిగర్భమును రక్షించినట్లు నీవు మమ్ములను రక్షించ వలెను ." అని పలికారు అందరూ.

.

వారి ఆతిధ్యము స్వీకరించి సూర్యోదయమైన వెంటనే మరల బయలు దేరాడు శ్రీ రాముడు.

.

అరణ్యమధ్యంలోకి ప్రవేశించారు.

అడవి ఈగలు రొదపెడుతున్నాయి,క్రూరమృగాలు గుంపులుగా తిరుగుతూకనపడుతున్నాయి.ఆ ప్రదేశంలో ఉన్న లతలూ వృక్షాలూ పాడుబడ్డట్టుగా కనిపిస్తున్నాయి.ఎక్కడా జలాశయమన్నదే కానరావడంలేదు.ఇంతలో ఎక్కడనుండో వస్తున్న భయంకరమైన అరుపులు పెడబొబ్బలతో అరణ్యమంతా మారు మ్రోగిపోతున్నది.

.

వారి ఎదురుగా పర్వతకాయుడైన ఒక రాక్షసుడు వికృతంగా అరుస్తూ నిలబడి ఉన్నాడు.

.

వూటుకూరు జానకిరామారావు

శుక్లామ్బరధరం వర్సెస్ కాఫీ

 శుక్లామ్బరధరం వర్సెస్ కాఫీ 


☕☕


కాంచి మహా పెరియవర్ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మంచి హాస్య ప్రియులు. ఒకరోజు తన శిష్యుని పిలిచి, 

"సంధ్యా వందనం అయిందా? శుక్లాం బరధరం అయిందా? "అనిఅడిగారు.

వెంటనే ఆ శిష్యుడు అయిందని తల ఆడించాడు. 

దానికి మహా పెరియవర్ అతనితో "శుక్లాం బరధరం చెప్పావా అని అడగలేదు. అయిందా అని అడిగాను " అన్నారు. 

శిష్యుని కి ఏమీ అర్థం కాలేదు. పెరియవర్ ఏమని అడిగారు? ఈ పదాలకు వున్న భేదాలేవీ బోధపడక పరితపించాడు. అతనికి సందేహంగాను వుంది. .......

కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిన తరువాత, 

మహా పెరియవర్ అతనితో "శుక్లాం బరధరం "చెప్పు చూద్దాం అన్నారు.....

పెరియవర్ చెప్పమన్న వెంటనే,"శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే "అని శిష్యుడు చెప్పాడు.......

శిష్యుడు చెప్పింది విన్న మహాపెరియవర్ " దీనికి అర్థం తెలుసా? "అని అడిగారు. "తెలుసు "అని బదులు చెప్పిన శిష్యుడు, తెల్లని మనసు, యేనుగులా నల్లని రంగు, నాలుగు చేతులు,ప్రకాశమయిన ముఖం, అందరూ తలచి చూసేలా చేయు ఆకారం వున్న వినాయకుని స్మరిస్తే ఏవిధమైన ఆటంకాలు, బాధలూ వుండవని చెప్పాడు. .....

అరే !సరిగ్గా చెప్పావే,దానికి ఇంకో అర్థం వుంది, అది నీకు తెలుసా? అని చెప్పి,నవ్వారు. 

శుక్లాం అంటే తెల్లనిది. అంటే పాలు. విష్ణుం అంటే నలుపు అది డికాషన్. శశి వర్ణం అంటే నలుపు తెలుపు కలిసినది. అంటే "కాఫీ". చతుర్బుజం అంటే నాలుగు చేతులు. అంటే, భార్యవి రెండు

చేతులు, కాఫీ ఇవ్వగానే అందుకునే భర్తవి రెండు చేతులు కలిసి నాలుగు చేతులు.

"ధ్యాయేత్ అంటే తలిచే తలపులు. అంటే అలాకాఫీ ఇవ్వడాన్ని మనసులో తలవగానే

"ప్రసన్న వదనం "ముఖం వికసిస్తుంది ఆసమయంలో. "సర్వ విఘ్నోప శాంతయే "అంటే అన్ని వేదనలూ పోగొట్టేది. అనగా కాఫీ త్రాగితే వేదనలుతీరి, మనసు శాంతమవుతుందని అర్థం. ....

"శుక్లాం బరధరం అయిందా "అన్న ప్రశ్నలో , కాఫీ త్రాగటం అయ్యిందా? అన్న అర్ధం దానిలో ఇమిడి వుంది. 

అని తెలుసుకున్న శిష్యులు మైమరచి నవ్వనారంభించారు.  


కంచి పెరియవర్ చిరునవ్వులు చిలకరించారు. 🙏🙏


☕☕☕☕☕☕☕☕☕☕

పోత‌న త‌ల‌పులో 106

 పోత‌న త‌ల‌పులో 106


విష్ణుమూర్తి లీలావిభూతుల్ని ప‌రీక్షిత్తు కు

 వివ‌రిస్తున్నారు శుక‌యోగీంద్రుల‌వారు...

           ***


సుర, సిద్ద, సాధ్య, కిన్నర, వర చారణ,-

  గరుడ, గంధర్వ, రాక్షస, పిశాచ,

భూత, వేతాళ, కింపురుష, కూశ్మాండ, గు-

  హ్యక, డాకినీ, యక్ష, యాతుధాన,

విద్యాధరాప్సరో, విషధర, గ్రహ, మాతృ-

  గణ, వృక, హరి, ఘృష్టి, ఖగ, మృగాళి,

భల్లూక, రోహిత, పశు, వృక్ష యోనుల-

  వివిధ కర్మంబులు వెలయఁ బుట్టి



జల నభో భూ తలంబుల సంచరించు

జంతు చయముల సత్త్వరజస్తమో గు

ణములఁ దిర్యక్సురాసుర నర ధరాది

భావముల భిన్ను లగుదురు పౌరవేంద్ర!

                  ***

రాజోత్తమా!

 జీవులు తాము చేసిన నానా విధాలైన కర్మల్ని అనుసరించి సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, చారణులు, గరుడులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, బేతాళాలు, కింపురుషులు, , , విద్యాధరులు, అచ్చరలు, నాగులు, గ్రహాలు, మాతృగణాలు, తోడేళ్ళు, సింహాలు, సూకరాలు, పక్షులు, మృగాలు, ఎలుగుబంట్లు, చేపలు, పశువులు, చెట్లు మున్నగు బహు జాతులలో పుట్టి నీటిలోను, నింగిలోను, నేలమీద సంచరిస్తారు. సత్త్వగుణ, రజోగుణ, తమోగుణాలు కలిగి ఉంటారు. ఈ ప్రాణిజాతి అంతా విభిన్న రూపాలతో ఉంటుంది

                    ***


ఇరవొందన్ ద్రుహిణాత్మకుండయి రమాధీశుండు విశ్వంబుసు

స్థిరతం జేసి, హరిస్వరూపుఁడయి రక్షించున్ సమస్త ప్రజో

త్కర సంహారము సేయు నప్పుడు హరాంతర్యామియై యింతయున్

హరియించుం బవనుండు మేఘముల మాయం జేయు చందంబునన్.

                 ***

లక్ష్మీకాంతుడు చతుర్ముఖుడై జగత్తును సృష్టిస్తాడు. 

విష్ణు స్వరూపుడై దానిని రక్షిస్తాడు. 

సంహార సమయంలో హరునికి అంతర్యామిగా ఉంటూ, వాయువు మబ్బులను హరించినట్లే సమస్త విశ్వాన్ని సంహరిస్తాడు.

                    ***

ఈ పగిదిని విశ్వము సం

స్థాపించును మనుచు నడఁచు ధర్మాత్మకుఁడై

దీపిత తిర్యఙ్నర సుర

రూపంబులు దాన తాల్చి రూఢి దలిర్పన్.

                 ***


ఈ విధంగా ఆ దేవుడు ధర్మస్వరూపుడై తానే పశుపక్ష్యాదులు, నరులు, సురలు మున్నగు సమస్త రూపాలు ధరిస్తాడు. తానే ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు, పోషిస్తాడు, సంహరిస్తాడు

                        ***


హరి యందు నాకాశ; మాకాశమున వాయు-

  వనిలంబువలన హుతాశనుండు;

హవ్యవాహను నందు నంబువు; లుదకంబు-

  వలన వసుంధర గలిగె; ధాత్రి

వలన బహుప్రజావళి యుద్భవం బయ్యె-

  నింతకు మూలమై యెసఁగునట్టి

నారాయణుఁడు చిదానంద స్వరూపకుం,-

  డవ్యయుం, డజుఁడు, ననంతుఁ, డాఢ్యుఁ,



డాదిమధ్యాంతశూన్యుం, డనాదినిధనుఁ,

డతని వలనను సంభూత మైన యట్టి

సృష్టి హేతు ప్రకార మీక్షించి తెలియఁ

జాల రెంతటి మునులైన జనవరేణ్య!

                   ***


శ్రీహరినుండి ఆకాశం పుట్టింది. 

ఆకాశం నుండి వాయువు పుట్టింది. 

వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు పుట్టాయి.

 నీటి నుండి భూమి పుట్టింది.

 భూమి నుండి నానావిధ జీవజాలము పుట్టింది.

 దీనంతటికి మూలమై ప్రకాశించేవాడు ఆ నారాయణుడే.

 ఆయన జ్ఞానానంద స్వరూపుడు, 

అవ్యయుడు, పుట్టుకలేని వాడు, అంతంలేనివాడు,

 ప్రభువు, ఆదిమధ్యాంత రహితుడు, 

జనన మరణాలు లేనివాడు.

 ఆయననుండి జనించిన ఈ సృష్టికి హేతువేమిటో, 

దాని స్వరూపా మెలాంటిదో ఎంత పరీక్షించినా

 ఎంతటి మునీశ్వరులైనా తెలుసుకోలేకున్నారు.....


           🏵️పోత‌న ప‌ద్యం🏵️

🏵️ప‌ర‌మాత్మ త‌త్వావిష్క‌ర‌ణం🏵️

ప్రకృతి అనుభవం

 గాయత్రీ మంత్రం. దానితో ప్రకృతి అనుభవం వక పరిశీలన. యిది సూపర్ ఆటమ్ పవర్. ఊరకనే దాని ని పరిశీలన చేసి మనకు మన మహర్షులు తెలియపరచ లేదు. వారి దృష్టి సర్వమును శాంతి దాని పురోగతి. ఆరోగ్యంగా ప్రకృతితో ఎలా జీవన యాత్ర సాగించాలో పృకృతితో ్నుభవం తెలియజేసిరి ఎందరు ఎన్న చెప్పినా వాటి మూల శక్తి సూత్రం వలననే. మనదేహంలో సూక్మనాడులు 72 వేలు వాటిని యిది అనీ చెప్పలేము.మన దేహంలో ప్రతీ కదలిక వక నాడీ తత్వం. యిది తెలియుట మౌనంగా అక్రమ శక్తని లేక తత్ పదార్ధం స్థూల ప్రకృతిని లేక లక్షణమును దర్శించుటయే.సూర్యోదయం వలననే జీవ చైతన్యం ఆ తరువాతనే ప్రకృతితో మమేకం. కాంతి గణిత శాస్కప్రకారం సప్త సప్త మహా సప్త అని అనగా 7 రూట్ ప్రకారం 7 టు ది పవర్ ఆఫ్ 7 అని దానిని 7 గుఱ్ఱములను అశ్వ శక్తి భౌతికంగా కలత లేనిది కాంతి పరంగా లెక్కించుటకు వీలు లేనిది. 7*7 ,49*49, యీ విధంగా దాని పరిమాణమును తెలియ లేనిది. దీనినే సముద్ర మథనమునకు మరియు దాని ప్రశాంతతకు ఆదిత్య హృదయం ద్వారా ఏ తత్ త్రిగుణితం జప్త్వా, యని, త్రిః ఆచమ్యః శుచిః భూత్వా ధనుః ఆదాయ వీర్యవాన్,ధనుఃవేద రూపంలో అనంత శక్తి దేహమునకు కలుగును. అదియే అనంత మైనది. దాని ప్రయెూగం విశ్వ వ్యాప్తి. అందువలననే పరమేశ్వర శక్తి సమానమైన అగస్య ప్రోక్తంగా మనకు లభించినది. ఏదైనా వక బ్యాటరీని సూత్ర ప్రకారం దాని శక్ని నింపవలెనన్న దానికి మూలమైన శక్తితో సాధనచేసి నింపవలెనన్న. అది సూర్యశక్తిగాని, నీటి ద్వారా శక్తిని లేక మానవ కర్మ క్రియ ద్వారా గాని దానిని పూర్తి చేయవలెను .మన దేహంలో కూడా కర్బన మిశ్రమమైన ధాతు లక్షణము కలిగిన ఆహారమే ధనానికి మూలం. జీర్ణ లక్షణము నకు దేహంలో శక్కి ప్రకృతి ద్వారా లభించును. దీనిని గాయత్రీ మంత్ర మూల శక్తి లేక రామ నామ శక్తి యే మూలం. దీనినే ప్రణవమని ప్రతి అణవం అని ప్రాణమని, లేక శక్తి యని లేక ఆత్మ అనాత్మ యని లేక జీవం లేని శరీరం అశుభమని పనికిరానిదని, దానికి జీవము మూలమని దానిని రక్షించుటయే దేహ లక్షణమని తెలియును. దీనికి సప్త ఋషులు తప్ప వారములు సప్త గుఱ్ఱములు సప్త ధాతు లక్షణము గ్రహములు మూలం. శ్వాస ప్రణవమని, దాని లక్షణము నకు వాయు అగ్ని జల రూపంలో భూః పదార్ధలక్షణములుగా, భువః దానిని సూక్మంగా తెలియుట, సువః ప్రాకృతికంగా దర్శించుట, అనగా సత్యమని తెలియుట రూఢీ యగుట. దాని వ్యాప్తి అనంతమాన విశ్వ వ్యాప్తి సవితు, హవః ఏ తత్ అణీయం, భః, గో దేవస్, యత్ ధీం అహీ, ధీయెూయెూన్ అహ ఆపః చ ఉదయాత్. సవితు సూర్య అగ్ని తత్వం , హవః హోమ పూర్వక హవిస్సు ఎలక్ర్టాన్స్, జనః జన్యరూపమని, మహః మహత్తు కలది అనగా విశేష లక్షణములు కలుగుట మనకు కంటికి కనపడక ప్రేరణ చేయుట, తపః ధ్యాన రూపమని, అదియే సత్యమని, సత్యము అనగా ఎల్లప్పుడు సూర్యునివలె ప్రకాశము. సత్యం ౦ పూర్ణ శక్తి యేదైతే మ జీవ రూపంలో సత్ ఎల్లప్పుడు కలదో అది ఆత్మ యని ఆటమ్ అని తెలియును. దీని వ్యాప్తి నక్షత్ర మండలం దాటి వ్యాప్తి చెందును లక్షణము కలదు. సామాన్యమైన జీవం అచ్చటికి చేరదు ధాతు లక్షణములు కలిగియున్నందున. మాన దేహం అమితమైన రేడియేషన్ భరించ లేదు. పరిమితిలో మాత్రమే. అదిక రేడియేషన్ ఈ శ ఈ అనే శక్తి లక్షణము. భౌతికంగా సూర్యుని వద్దకు జీవం చేరిన అది అమితమైన శక్తి భరించ లేదు మేధో పరంగా మదించి దానిని దర్శించి. అసలు ఏమీ తెలియని శక్తి లక్షణమును అనేక మార్గముల ద్వారా సులువుగా దర్శించుట యే మన వేద విజ్ఞాన దానికి మూల గాయత్రీ మంత్ర శక్తి. గ్రహముల గురించి నక్షత్రముల గురించి తెలియుట లేదు భౌతిక వాదులకు ఎన్ని జన్మల పరంపరగా కావాలి. తెలియుటకు. నక్షత్ర మండలంలో 27 వాటి శక్తి సూక్మంగా విశ్వ వ్యాప్తిని వాటిని వక స్థిరమైన కక్ష్య రూపంలో తెలిసి. అగ్ని వలన దేహం అగ్నికి మరో పేరు విషు, విష్ణు అని అగ్నిని మథనం వలన సర్వం సిధ్ది యని, దీనినే నిత్యయౌవనం అని దీనినే తమిళంలో పురుఛ్చియని, సంస్కృతంలో పురస్థ యని. థ అక్షర పొట్టలో చుక్క శత్రువులు చక్ర మూలమైన శక్తి చుక్క(.) యని తెలియును.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

సుఖ దుఃఖాలు..


"ఏమండీ..మీరు శ్రీధరరావు గారి కుమారుడా?.." నా వద్దకు వచ్చి అడిగాడు..ఆయనను అంతకు ముందు నేనెప్పుడూ చూసి వుండలేదు..అప్పుడే తలనీలాలు ఇచ్చినట్లుగా వున్నాడు..బోడిగుండుతో.. చిరునవ్వు నవ్వుతూ నన్నే చూస్తున్నాడు..


"అవునండీ..రెండవ కుమారుడిని..ఇంతకూ మీరూ...?" అని సందేహంగా అడిగాను..


"అనుకున్నాలే..ఆ పోలికలు చూసి..నా పేరు కొండూరు మునుస్వామి..దాదాపు ముప్పై ఏళ్ల నుంచీ ఇక్కడికి వస్తున్నాను..అప్పుడు మీ నాయనగారు ఈ గుడిని నిర్వహించేవారు..ఈ మధ్య ఐదారు ఏళ్ల నుంచీ నేను రాలేదు కానీ..మా పిల్లలు వచ్చి పోతున్నారు.." అని చెపుతూ..


"అయ్యా!..ఈ స్వామి చాలా మహత్తు కలవాడు..మాది మర్రిపూడి మండలం జువ్విగుంట వద్ద మా ఊరు..మేము మొత్తం ఏడుగురు సంతానం.. ఆరుగురు అక్కాచెల్లెళ్ల మధ్య నేనొక్కడినే మొగపిల్లవాడిని..ముప్పై ఏళ్ల క్రిందట మొదటిసారి ఇక్కడికి వచ్చాము..అప్పుడు మా చెల్లెలికి ఆరోగ్యం సరిగా లేకపోతే..ఈ స్వామిని నమ్ముకుంటే బాగవుతుందని మా చుట్టుప్రక్కల వాళ్ళు చెపితే..ఆమెను తీసుకొని మా అమ్మా, నేనూ వచ్చాము..తీరా ఇక్కడికొచ్చాక మాకు తెలిసింది..మా చెల్లెలికి శారీరిక బాధ కాదు..అది గాలి చేష్ట అని..పూర్తి గా మండలం రోజులు ఇక్కడే ఉన్నాము..రోజూ ఆ అమ్మాయి 108 సార్లు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేది..ఇరవై ఐదు రోజుల కల్లా అమ్మాయి కోలుకున్నది..ఆ గాలిచేష్ట అనేది కనబడకుండా పోయింది..ఆ తరువాత కూడా మండలం పూర్తి అయ్యేదాకా ఇక్కడే వుండి.. ఆఖరి రోజు స్వామికి పొంగలి పెట్టుకొని..మొక్కు చెల్లించుకొని మా ఊరు వెళ్ళాము..ఆ ప్రక్క సంవత్సరం ఆ అమ్మాయికి పెళ్లి చేసాము..ఈ స్వామి దయవల్ల లక్షణంగా పిల్లా పాపలతో సంసారం చేసుకుంటున్నది.. " అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పుకొచ్చాడు..


"అదిగో! అప్పటినుంచీ ఈ స్వామినే పూర్తిగా నమ్ముకొని ఉన్నామయ్యా..మధ్యలో నా ఆరోగ్యం కూడా సరిగా లేకపోతే..నేను కూడా వచ్చి ఇక్కడ నెల రోజుల పాటు ఉన్నానయ్యా..ఏ డాక్టర్ వద్దకు పోలేదు..నేరుగా ఈ స్వామి సమాధి వద్దకు వచ్చి మొక్కుకున్నాను..తగ్గిపోయింది.." అన్నాడు..


శ్రీ స్వామివారిని అంతగా నమ్ముకున్న మునుస్వామికి జీవితంలో ఏ కష్టాలూ రాలేదా?..అంటే..వచ్చాయి..తీవ్రమైనవే వచ్చాయి..మునుస్వామికి నలుగురు కుమార్తెలు పుట్టారు..మొగ పిల్లలు లేరు..తనకున్నంతలో ఆ పిల్లలను పెంచుకున్నాడు..ఒక కూతురికి పన్నెండేళ్ల వయసులో హఠాత్తుగా జబ్బుచేసి..మరణించింది..ఆ పిల్ల చనిపోయిన తరువాత..ఇంకొక కూతురు ఇరవై..ఇరవైరెండేళ్ల వయసులో తీవ్ర అనారోగ్యం తో మరణించింది..మునుస్వామి తన ప్రారబ్ధం అంతే అనుకున్నాడు గానీ..మొగలిచెర్ల లోని శ్రీ స్వామి వారి దర్శనానికి రావడం మాత్రం మానలేదు..మిగిలిన ఇద్దరు కూతుళ్లకూ వివాహాలు చేసాడు..


ఈ విషయం కూడా మునుస్వామి నాతో చెప్పి.."అయ్యా..ఆ స్వామి దయ వల్ల ఇప్పుడు అందరమూ బాగున్నాము..ఆ స్వామి మమ్మల్ని ఇలాగే చల్లగా చూస్తే చాలు..ఈరోజు వచ్చి మొక్కు తీర్చుకున్నాను.." అన్నాడు..


తన ఇద్దరు కూతుళ్ళూ చనిపోయినా.. మునుస్వామి మనసులో శ్రీ స్వామివారి మీద విశ్వాసం కొంచెం కూడా సడలిపోలేదు..పైగా మరింత భక్తి పెరిగింది..ఆ స్థితప్రజ్ఞత అందరికీ సాధ్యం కాదు అనిపించింది..


మునుస్వామి లాంటి వాళ్ళను చూసినప్పుడు.."ఇంత భక్తి, విశ్వాసాలతో మనం వుండగలమా?..కొద్దిపాటి కష్టం వస్తేనే..దేవుడిని నిందించే ప్రస్తుత సమాజం లో మునుస్వామి లాటి వాళ్ళు చాలా అరుదు.." అని..


నిజమే కదా?..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..సెల్..94402 66380 & 99089 73699).