7, నవంబర్ 2020, శనివారం

సిరి గల వానికి

 "సిరి గల వానికి చెల్లును,

తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్,
తిరిపెమునకిద్దరాండ్రా,
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.."

కవి నిరంకుశుడు అంటారు. పూర్వ కవులు చాలా చేమత్కారులు. ఇది శ్రీనాధ కవి వ్రాసిన ఒక చాటు పద్యం. 
అక్కడ వర్షాలు పడక ప్రజలు చాలా బాధలు పడుతున్నారట ఆ సమయంలో సాక్షాత్తు పరమేశ్వరుని మీదనే వ్యంగ్యంగా వ్రాసిన పద్యం. 
ధనవంతుడైన శ్రీ కృషుణునికి చెల్లుతుంది పదహారు వేల స్త్రీలను పెండ్లి చేసుకోటానికి ఎందుకంటె అయన ధనవంతుడు కాబట్టి ఏ ఆట ఆడిన చెల్లుతుంది. నీవా తిరిపమెటుకొని అంటే బిక్షాటన చేసి జీవించే పేదవాడివి నీ కెందుకు స్వామి ఇద్దరు భార్యలు. నీకు పార్వతి చాలు కానీ గంగను మాకు వదిలి పెట్టు. అంటే వర్షాలు కురిపించు అని చమత్కారంగా వ్రాసిన పద్యం. చదివి ఆనందించండి. మీ భార్గవ శర్మ 

కామెంట్‌లు లేవు: