31, మే 2025, శనివారం

నౌకాగ్ర కాకవత'

 నౌకాగ్ర కాకవత'




కాకులకు గల సహజ గుణం ఒకచోట వాలి కొంతసమయం ఉండి మరల లేచి ఇంకొక చోటికి వెళ్ళుతాయి. అంటే ఒకచోట స్థిరంగా వుండవు. అలాగే ఒక కాకి ఒక నౌకమీద అంటే నౌకమీద వుండే స్తంభం మీద వాలిందట కొంతసమయం అది అక్కడ వున్నది. కానీ కాకికి తెలియకుండా ఒక సంఘటన జరిగింది అదేమిటంటే ఆ నౌకని నడిపే నావికుడు అతివేగంగే నౌకను సముద్రంలోకి తీసుకొని వెళ్ళాడు. ఈ విషయం తెలియని కాకి తన స్వభావానుసారం నౌక స్తంభం మీదినుంచి లేచి ఇంకొక చోటికి వెళ్ళటానికి యెగిరి వెళ్ళింది. కానీ దానికి ఆ స్తంభం తప్పించి ఆ పరిసరాలలో ఎత్తయిన ప్రదేశం అంటే భవంతులు కానీ, చెట్లు కానీ ఏవి కనుచూపు మేరలో కనిపించలేదు. అంతే కాదు చుట్టూ లోతయిన సముద్రం. పొరపాటున సముద్రంలో పడితే అంతం తప్పదు. కొంచం సేపు గాలిలో యెగిరి మరలా ఆ నౌక స్తంభంమీదనే వాలింది. కొద్దిసేపయినా తరువాత తన సహజ స్వభావంతో మరల గాలిలో యెగిరి అంతటా తిరిగి చూసింది కానీ పరిస్థితి అట్లానే వున్నది. అలాగ మరలా మరలా తిరిగి తిరిగి చివరకు తెలుసుకున్నది తనకు ఆ నౌక స్తంభం తప్ప వేరే ఆధారం లేదని. కానీ ఈ విషయం తెలుసుకోవటానికి ఆ కాకి చాలాసార్లు ఆ నౌక స్తంభం మీది నుంచి లేచి గాలిలో ఎన్నో సార్లు తిరిగిన తరువాత కానీ తనకు ఆ నౌక స్తంభం తప్ప వేరే గతి లేదని తెలుసుకోగలిగింది. కాబట్టి 




సాధక మన మనస్సు కూడా ఆ కాకి లాంటిదే ఎప్పుడు ఒక చోట నిలువదు ఒకచోటి నుండి ఇంకొక చోటికి అంటే ఒక విషయం మీదనుండి ఇంకొక విషయం మీదకు వెళుతూ ఉండటం దాని సహజ లక్షణం. ఆ లక్షణాన్ని వదిలి దానికి భగవంతుడు తప్ప ఇతర విషయాలు లేవనేవిధంగా సాధకుడు సద దైవ జ్యానంలో ఉండాలి ఎలాగంటే కాకికి ఒక్క నౌక స్తంభం తప్ప ఇంకొకటి కనపడనట్లు సాధకుని మనస్సుకు భగవంతుడు తప్ప ఇంకొక విషయం లేదు అనే విధంగా సాధకుడు ప్రవర్తిస్తే సాధకుని మనస్సు సదా భగవంతుని మీదనే ఉంటుంది. కాకపొతే ఇది చెప్పినంత సులువు కానే కాదు. అతి కఠోరమైన, నిరంతమైన కఠోర తప్పస్సు చేస్తేనే అది సాధ్యం. నేను ఆలా చేయగలనా అనే సందేహం ప్రతి సాధకునికి కలుగుతుంది. కానీ మిత్రమా నిత్య దీక్షాపరుడైన సాధకుడు తప్పకుండా సాధించగలడు. అరిషడ్వార్గాలను వదిలి ఇప్పుడే సాధన మొదలు పెట్టు తప్పకుండా నీ లక్ష్యం నెరవేరుతుంది. ఎందుకంటె సదా సర్వేశ్వరుడు సాధకునితోటె ఉంటాడు.  




ఓం తత్సత్ 




ఓం శాంతి శాంతి శాంతిః

విశ్వేశ్వరా

 శు భో ద యం🙏


                  విశ్వేశ్వరా!!


శా.

నీ విన్నాణము చిత్రమే, మకుటరత్నీభూతజైవాతృకా!/

గ్రైవేయీకృతకాద్రవేయ! గళరుద్రాక్షీభవద్బాడబా!/

సేవాస్వీకృత భూత రాక్షస పిశాచీప్రేత! నేత్ర ప్రభా/

శ్రీవిన్యస్త కృశాను! పార్వతమృగాక్షీదార! విశ్వేశ్వరా!

23

     -కవిసామ్రాట్. విశ్వనాధసత్యనారాయణ.


        మనం నేడు విశ్వనాధ వారి విశ్వేశ్వర శతకంలోని ఈపద్యం పరిశీలిద్దాం

       చిత్రవిచిత్రమైన ఊహలకు వ్యంగ్య

మర్యాదలకు ఆటపట్టైన శతక మిది.

విశ్వప్రతిభకు ముకురాయమానం.

          

               "కిరీటంలో తురాయిగా చంద్రుని అలంకరించుకోవటం.కంఠ హారంగా వాసుకిని అలంకరించుకోవటం,

మెడలో రుద్రాక్షగా గరళాన్ని నిలుపుకోవటం, సేవక సముదాయంగా

భూతప్రేత పిశాచములను నియమించటం, తృతీయ నేత్రంగా ఫాలభాగాన అగ్నినిధరించటం, కోయపిల్ల పార్వతిని భార్యగా స్వీకరించటం, ఏవిటయ్యా?ఈతిక్కపనులు?

        అంటూ హేళన జోడించి వ్యంగ్యంగా విశ్వరుని మహిమలను నుతించటం ,విశ్వనాధకుదక్క ,మరెవరికి సాధ్యం?

    మహాకవీ! నీకూ, నీప్రతిభకూ,

శత సహస్ర వందనాలు!!


                       స్వస్తి !!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

గమ్మత్తైన_పద్యం

 #గమ్మత్తైన_పద్యం🌹

💥💥💥

పూర్వం ఒక రామ భక్తుడు.... రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.

ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు.

"విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.

❤️గవీశపాత్రో నగజార్తిహారీ

కుమారతాతః శశిఖండమౌళిః।

లంకేశ సంపూజితపాదపద్మః

పాయాదనాదిః పరమేశ్వరో నః॥

 ఆశ్చర్య పోయాడు చదవగానే.

అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్ అని. 

అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి విశేషణాలు. అర్ధం చూడండి...

♦️గవీశపాత్రః ... గవాం ఈశః గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ.

అనాదిః ... ఆది లేని వాడూ ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ,

అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.

♦️అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది. అది పట్టుకుని తెగ తిరిగాడు.

చివరికి ఒకాయన "అది విష్ణువుని కీర్తించేదే ... ఏమీ అనుమానం లేదు" అని అతడిని ఓదార్చాడు.

ఇది మరో ఆశ్చర్యం.

అనాది అనే మాటలో ఉంది అంతా. కిటుకు చూడండి ....

పరమేశ్వరుడు ఎలాటివాడూ అంటే అనాదిః అట. అంటే ఆది లేని వాడు. అంటే పరమేశ్వరలో ఆది అక్షరం లేనివాడు.

ఇప్పుడు ఏమయ్యింది? రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!

గవీశపాత్రః ... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది. విః అంటే పక్షి అని అర్ధం. వీనామ్ ఈశః వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.

కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు.

శశిఖండ మౌళి: ... మొదటి అక్షరం లేకపోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: ... క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేంద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.

అతడు మనలను కాపాడు గాక ....

గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

ఇప్పటికి అతడు శాంతించాడు.

సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి. సర్వదేవతలలో విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు. సర్వ దేవతలలో శివుని దర్శించగలిగితే వాడు శైవుడు. ఇది మన భారతీయ కవితా వైభవము.

🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

కపిలారణ్యం

 కపిల మహర్షి పేరు మీదే కపిలారణ్యం ! అదే నేటి కాలిఫోర్నియా ! 


పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ వంటి అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారు..


సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు.


ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖ రేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.)


కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)

(సగర పుత్రులు బూడిద కుప్పలు గా

మారిన ప్రదేశం) మరియు హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.


వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తోలి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే దీని పురాతన నామం మహాబలి భూమి, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందింది. ఈ మలిపునగరానికి దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం.

బలిచక్రవర్తిని శ్రీ మహా విష్ణువు పాతాళానికి అధిపతి గా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి.


భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా స్వరంగం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము. రాముడి ఆజ్ఞ మింద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజింతారు. మధ్య అమెరికా, హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని Lost City of the Monkey God‘ గా వ్యవహరిస్తారు.


అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారు (Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు 1939 లో వెళ్ళడించారు.) “సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ" అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు. భూమినుండి 50000 యోజనాల దూరంలో పాతాళం ఉన్నది.

ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, Oregonలో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీకూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.


మూల అమెరికాయులు (రెడ్ ఇండియన్లు) విగ్రహారాధన చేస్తారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడు తుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది.


Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారతదేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం The light of India లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు.

వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఉన్నది. వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలు అవుతుంది. ఇంచుమించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరి పోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు.


వారి పండగలు కూడా మన దశరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్య వలసిన అవసరం ఉన్నది.

పేదవాడా

 దారిద్ర్య! శోచోమి భవన్తమేవం 

అస్మచ్ఛరీరే సుహృదిత్యుపిత్వా |

విపన్నదేహే మయి మన్దభాగ్యే 

మమేతి చిన్తా క్వ గమిష్యసి త్వమ్||


ఓ పేదవాడా! నువ్వు చాలా కాలంగా మన శరీరంలో స్నేహితుడిలా ఉన్నావు, కానీ నేను చనిపోయిన తర్వాత, 'నీకు ఎవరు ఆశ్రయం ఇస్తారు? నువ్వు ఎక్కడికి వెళ్తావు?' నాకు చాలా ఆందోళనగా ఉంది!


మృచ్ఛకటికమ్.

పందిరి నాశ్రయించక

 ఉ॥

పందిరి నాశ్రయించక సువాసన గల్గియు జాజితీవలున్ 

సుందరి నాశ్రయించక సుశోభితమౌ యపరంజిభూషలున్ 

ముందటిరాజుఁ జేరక సమూర్జిత కైతల 

పండితాళియున్ 

వందిత భర్తఁ గూడక నపారగుణాన్విత యయ్యు జాయయున్ 

పొందగబోరు శేముషి ప్రమోదము నందుచు సృష్టి నెచ్చటన్ 

*~శ్రీశర్మద*

పార్వతీపరమేశ్వరుల విహారపు పద్యం

 పార్వతీపరమేశ్వరుల విహారపు పద్యం

తెనాలి రామలింగ కవి ఉద్భటారాధ్యచరిత్రమనే కావ్యంలో చెప్పిన పద్యం—


తరుణ శశాంక శేఖర మరాళమునకు సార గంభీర కాసారమగుచు

కైలాసగిరి నాథ కలకంఠ భర్తకు కొమరారు లేమావి కొమ్మయగుచు

సురలోక వాహినీ ధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు

రాజ రాజ ప్రియ రాజకీరమునకు మానిత పంజరస్థానమగుచు


ఉరగ వల్లభ హార మయూరమునకు

చెన్ను వీడిన భూధర శిఖరమగుచు

లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి

అద్రినందన బొల్చె విహారవేళ. ఈ పధ్య భావార్ధమును సోదాహరణము గా ఎవరైనా తెలియజేయండి!

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఆరవ అధ్యాయం

ఆత్మసంయమయోగం: శ్రీ భగవానువాచ


అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ 

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే(35)


అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః 

వశ్యాత్మనా తు యతతా శక్యో௨వాప్తుముపాయతః (36)


అర్జునా.. మనస్సు చంచల స్వభావం కలిగిందీ, నిగ్రహించడానికి శక్యం కానిదీ అనడంలో సందేహం లేదు. అయితే దానిని అభ్యాసంవల్ల, వైరాగ్యంవల్ల వశపరచుకోవచ్చు. ఆత్మనిగ్రహం లేనివాడికి యోగం సిద్ధించదని నా ఉద్దేశం. ఆత్మనిగ్రహం వుంటే అభ్యాసం, వైరాగ్యం అనే ఉపాయాలతో యోగం పొందవచ్చు.

ఆశ్రయం లేకపోతే ప్రకాశించరు"*...

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *అనర్ఘమపి మాణిక్యం హేమాశ్రయమపేక్షతే।*

          *వినాశ్రయం న శోభన్తే పణ్డితా వనితా లతాః॥*


                   *---- _సుభాషితరత్నకోశః_----*


తా𝕝𝕝 "*ఎంత అమూల్యమైన మాణిక్యమైనా అది శోభించాలంటే దానికి బంగారం ఆశ్రయం ఉండాలి... అదే విధంగా పండితులు, స్త్రీలు, లతలు ఆశ్రయం లేకపోతే ప్రకాశించరు"*...

                     

 ✍️🌹💐🌸🙏

శ్రీ భులేశ్వర్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1126


⚜ మహారాష్ట్ర : పూణే 


⚜  శ్రీ భులేశ్వర్ ఆలయం



💠 ఈ ఆలయం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో మల్షిరాస్ సమీపంలోని కొండపై ఉంది.  

ఇది రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించబడింది మరియు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే నిర్వహించబడుతుంది.



💠 ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది మరియు యాదవ పాలకుల కాలంలో 13వ శతాబ్దంలో నిర్మించబడింది.  

శివాజీ కాలం నాటి గైముఖి బురుజ్ నిర్మాణం వలె ఆలయ ప్రవేశ ద్వారం దాగి ఉన్నందున ఈ ఆలయాన్ని ముస్లిం ఆక్రమణదారులచే ధ్వంసం చేసి, తరువాత పునర్నిర్మించారని నమ్ముతారు.  ఆలయం ఉన్న కోటను దౌలత్ మంగళ్‌గడ్ కోట అంటారు.



💠 ఈ ఆలయం దాని వాస్తుశిల్పం కారణంగా ప్రత్యేకంగా ఉంటుంది.  

ఈ ఆలయాన్ని నిర్మించడానికి బ్లాక్ బసాల్ట్ రాక్ తీసుకురాబడింది, ఇది చుట్టూ ఉన్న గోధుమ రంగు బసాల్ట్ రాయి కంటే భిన్నంగా ఉంటుంది.  వృత్తాకార గోపురాలు మరియు మినార్లు వంటి ఇస్లామిక్ వాస్తుశిల్పాన్ని పోలి ఉండటం వల్ల బయటి నుండి ఇది ఆలయం కంటే మసీదుగా కనిపిస్తుంది.  గోడలపై శాస్త్రీయ శిల్పాలు ఉన్నాయి.

 ఈ ప్రత్యేకమైన డిజైన్‌కు కారణం ఆక్రమణదారులచే ధ్వంసమవకుండా ఆలయాన్ని రక్షించడానికి చేయబడింది.


💠 ఆలయం దాని గర్భగుడిలో ఐదు శివలింగాలను కలిగి ఉంది.  

అవి ఒక కందకంలో దాగి ఉండటం వల్ల, ఈ శివలింగాలు కాంతితో కనిపిస్తాయి.  ఈ ఆలయంలో లక్ష్మీదేవి, విష్ణువు మరియు మహాదేవుడు కూడా కొలువై ఉన్నారు.  


💠 ఈ ఆలయంలో స్త్రీల వేషధారణలో గణేష్ విగ్రహం  ఉంది మరియు దీనిని గణేశ్వరి లేదా లంబోదరి లేదా గణేశ్యని అని పిలుస్తారు.


💠 భూలేశ్వర్ ఆలయానికి పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది.  వాస్తవానికి ఇది దౌలత్మంగల్ కోట అని పిలువబడే ఒక కోట (దీనిని మంగళ్‌గఢ్ కోట అని కూడా పిలుస్తారు), ఇక్కడ పార్వతి కైలాసానికి వెళ్లి వివాహం చేసుకునే ముందు శివుని కోసం నృత్యం చేసిందని చెబుతారు.


💠 మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి విపరీతమైన రద్దీ ఉంటుంది.  

ఒక స్థానిక నమ్మకం ఉంది, ఒక గిన్నె తీపిని శివుడికి సమర్పించినప్పుడు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్వీట్లు మాయమవుతాయి.  


💠 ఈ ప్రాంతం వలస పక్షులకు నిలయంగా ప్రసిద్ధి చెందింది మరియు చాలా మంది ప్రకృతి ప్రేమికులు మరియు పక్షి పరిశీలకులు సందర్శిస్తారు.



💠 భులేశ్వర్ అనేది పూణే నుండి 45 దూరంలో ఉంది. 



రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం 255-*

 *తిరుమల సర్వస్వం 255-*

*ద్వాదశ ఆళ్వారులు-19*


 *దేవదేవి ప్రతిన* 


 ఒకానొక దినాన 'దేవదేవి' గా పిలువబడే ప్రముఖనర్తకి చోళరాజు సభలో తన నృత్యగానాలను అతినేర్పుగా ప్రదర్శించి, చోళప్రభువును ఆకట్టుకొంది. రాజుగారిచే బహూకరింపబడ్డ వెలలేని కట్నకానుకలు, దాసదాసీ జనంతో పాటుగా ఆమె తన స్వగ్రామానికేగుతూ, మార్గమధ్యలో విప్రనారాయణుని పూదోటను చూడటం తటస్థించింది. మార్గాయాసంతో అలసి ఉన్న దేవదేవి, ముచ్చట గొలుపుతున్న ఆ ఉద్యానవనంలో తన సోదరితో పాటుగా విశ్రమించింది. ఆ పూదోట సోయగానికి అబ్బురపడిన వారిరువురూ కొంత తడవు సేద తీరిన తరువాత, వారికి సర్వసంగపరిత్యాగి యైన విప్రనారాయణుడు తారసిల్లాడు. వారిరువురూ విప్రనారాయణునికి నమస్కరించగా, అద్వితీయ సౌందర్యంతో అలరారుతున్న దేవదేవిని అత్యంత సమీపం నుండి చూచి కూడా, యౌవనదశలో నున్న ఆ సాధుపుంగవుడు ఏవిధమైన చిత్తచాపల్యానికి లోనవ్వలేదు. ఆ సాధుసత్తముడు వారినాశీర్వదించి నిష్క్రమించిన తరువాత; దేవదేవి తనవంటి సౌందర్యరాశిని చూచి కూడా నిర్వికారంగా ఉండగలిగిన ఈ విప్రుడు నిశ్చయంగా ఉన్మత్తుడే (పిచ్చివాడు) నని వెటకారమాడింది. అంతట ఆమె సోదరి వీరెవ్వరో ఇంద్రియనిగ్రహం కలిగిన సాధుపుంగవుని వలె గోచరిస్తున్నారని, దేవదేవి తళుకు బెళుకులకు లొంగిపోయే సాధారణ పురుషుడు కారని, ఆ మునివర్యుని వశం చేసుకోవడం దేవదేవి వల్ల కాదని, పుణ్యపురుషులను హేళన చేయడం కూడదని హితవు పలికింది. దానితో అహం దెబ్బతిన్న దేవదేవి ఆరునెలలలో ఆ సన్యాసిని తన దారి లోకి తెచ్చుకుంటానని; అతనిని తన కోసం సర్వం ధార పోసేటట్లుగా చేయగలనని; లేకుంటే తాను తన సోదరికి జీవితాంతం దాసిగా పడి ఉంటానని ప్రతిన పూనింది.


 *ముని ఆశ్రయంలో దేవదేవి* 


 తన పంతం నెరవేర్చుకోవడానికై వెనువెంటనే రంగం లోకి దిగిన దేవదేవి తన సర్వాభరణాలను, పట్టుపీతాంబరాలను తీసివేసి; కాషాయ వస్త్రధారియై విప్రనారాయణుణ్ణి సమీపించింది. తాను సమీప గ్రామంలో నున్న ఒక వేశ్యా కుటుంబంలో జన్మించానని; తనకు చిన్నతనం నుండే ఆ వృత్తి పట్ల ఏహ్య భావముందని; కానీ తన తల్లి తనను కులవృత్తి చెపట్టడానికై ఒత్తిడి చేయసాగిందని; మీవంటి మునిపుంగవుల సమీపంలో ఉంటే మరుజన్మ లోనైనా ఉత్తమజన్మ సంప్రాప్తిస్తుందని; ఉద్యానవనంలో తలదాచుకుంటూ మొక్కలను సంరక్షించడానికి తనను అనుమతించమని; లేకుంటే తనకు అత్మహత్యే శరణ్యమని కల్లబొల్లి మాటలల్లింది. అప్పటివరకు పరస్త్రీ సాన్నిహిత్యమే లేని, లోకరీతి తెలియని విప్రనారాయణుడు దేవదేవి కపటపు మాటలను పూర్తిగా విశ్వసించి, ఆ అబల దీనావస్థకు జాలిపడి, తన ఉద్యానవనం లోని ఒక పూరిపాకలో నివసించడానికి ఆమెను అనుమతించాడు. అదే అదనుగా భావించిన దేవదేవి తాను కూడా తాపసి దుస్తులు ధరించి, తోటపని చేస్తూ, మాలలల్లడంలో విప్రనారాయణునికి సాయపడుతూ, కొంత సమయం సంయమనంతో గడిపింది. దేవదేవి ఎంత సమీపంలోనున్నప్పటికీ విప్రనారాయణుడు ఏ విధమైన వికారానికి లోనుకాలేదు

2 ఆరు నెలలు పూర్తికావడానికి మరికొంత సమయం మాత్రమే మిగలి ఉండడంతో దేవదేవి కలవరానికి గురై; విప్రనారాయణుణ్ణి లొంగదీసు కోవడానికి అనువైన సమయం కోసం వేచిచూస్తూ, తన కార్యం సఫలం చేయమని శ్రీరంగనాథుణ్ణి పరిపరి విధాలుగా వేడుకోసాగింది.


 *ఉచ్చులో చిక్కిన విప్రుడు* 


 ఇంతలో వర్షఋతువు ఆసన్నమైంది. ఒకనాటి రాత్రి విప్రనారాయణుడు తన కుటీరంలో విశ్రమించి యుండగా ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టి కురియసాగింది. ఆ ఫెళఫెళారావాలకు నిద్రాభంగం కలిగిన విప్రనారాయణునికి, ఆశ్రమం బయటే విశ్రమిస్తున్న దేవదేవి దైన్యస్థితి తలపు చ్చింది. దయాహృదయం పెల్లుబికిన విప్రనారాయణుడు ఆరుబయలే ఒక వృక్షం క్రింద నిలుచుని జడివానలో తడిసి ముద్దవుతున్న దేవదేవిని కాంచి; తన ఆశ్రమం లోనికి వచ్చి, వర్షం వెలిసేంత వరకూ ఒక మూలన విశ్రమించడానికి ఆమెకు అనుమతినిచ్చాడు. అదే అదను కోసం వేచియున్న దేవదేవి ఆశ్రమం లోనికి ప్రవేశించి, తన కోకిల కంఠంతో మునీశ్వరుని క్షేమ సమాచారాలడుగుతూ, వారితో సంభాషణ ప్రారంభించింది. మొట్టమొదటి సారిగా అంత సమీపం నుండి వినవచ్చిన ఆమె మృదువైన కంఠస్వరం విప్రనారాయణునికి ఆసక్తి కలిగించింది. తన నేర్పరితనంతో దేవదేవి సంభాషణ తీరుతెన్నులను తనకు అనుకూలంగా మార్చుకో గలిగింది. అలా వారి సంవాదం సరససల్లాపంగా మారిన కొంత తడవు తరువాత, విప్రనారాయణుడు దేవదేవి కోరికపై ఆమెను తన పాదాల నొత్తడానికి అనుమతించాడు. తొలిసారిగా అంతటి మధుర స్పర్శను ఆస్వాదించిన విప్రోత్తముడు విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయాడు. ఇరువురూ శ్రీరంగనాథుని భక్తులే! ఆ రంగశాయి లీలావినోదం వల్ల, దేవదేవి ప్రతిన నెరవేరింది. ఆరునెలల సమయం ముగిసే లోపుగానే విప్రనారాయణుడు దేవదేవికి దాసానుదాసునిగా మారాడు. బ్రాహ్మణ్యం మంట గలిసిపోయింది. విప్రనారాయణుడు నిత్యానుష్ఠానుదులకు, భగవతారాధనకు తిలోదకాలర్పించి, ఎల్లవేళలా దేవదేవి సాంగత్యంలో కాలం గడపసాగాడు. భోగలాలసుడై, ఆశ్రమాన్ని విడిచి దేవదేవితో పాటుగా ఆమె గృహానికి చేరుకున్నాడు. సత్సాంగత్యం వల్ల దేవదేవి కూడా పరిణతి చెందింది. తన ప్రతిన విషయం మరిచి, అర్థాంగి వలె విప్రనారాయణునికి చిత్తశుద్ధితో సపరిచర్యలు చేయసాగింది. కానీ, కేవలం ధనాపేక్ష మాత్రమే గలిగిన, కఠినాత్మురాలైన దేవదేవి తల్లి తన సర్వస్వం అప్పటికే ధారపోసిన విప్రనారాయణుణ్ణి, నిర్దాక్షిణ్యంగా ఇంటినుండి తరిమి వేసింది. దేవదేవిపై వ్యామోహం వీడని విప్రనారాయణుడు ఆరుబయట, వేశ్య ఇంటి అరుగుపై విశ్రమించాడు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

శనివారం🍁* *🌹31 మే 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🍁శనివారం🍁*

    *🌹31 మే 2025🌹*       

    *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం*


*తిథి  : పంచమి* రా 08.15 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం   : పుష్యమి* రా 09.07 వరకు ఉపరి *ఆశ్లేష*


*యోగం : వృద్ధి* ఉ 10.44 వరకు ఉపరి *ధ్రువ*

*కరణం   : బవ* ఉ 08.42 *బాలువ* రా 08.15 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.30 - 01.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *మ 02.49 - 04.23*

అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*


*వర్జ్యం          : శేషం ఉ 06.56 వరకు*

*దుర్ముహూర్తం  : ఉ 05.34 - 07.18*

*రాహు కాలం    : ఉ 08.50 - 10.27*

గుళికకాళం       : *ఉ 05.34 - 07.12*

యమగండం     : *మ 01.43 - 03.21*

సూర్యరాశి : *వృషభం*

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.41*

సూర్యాస్తమయం :*సా 06.47*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.34 - 08.10*

సంగవకాలం         :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం    :     *10.47 - 01.23*

అపరాహ్న కాలం    : *మ 01.23 - 04.00*


*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ శుద్ధ పంచమి*

సాయంకాలం       :*సా 04.00 - 06.36*

ప్రదోష కాలం         :  *సా 06.36 - 08.48*

రాత్రి కాలం           :*రా 08.48 - 11.43*

నిశీధి కాలం          :*రా 11.43 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

-------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్వామి🙏*

     *🔯పంచకస్తోత్రం🔯*


*తారహీరక్షీరశార* 

*దాభ్రతారకేశకీర్తి* 

*విహార మాదిమధ్య్* *ఆన్తశూన్యమవ్యయమ్ ।*


*🌹ఓం నమో వేంకటేశాయ🌹*

*****************************

_*🚩హనుమ ధ్యాన శ్లోకాలు*_🚩


_*అంజనానందనం వీరం*_ 

_*జానకీశోకనాశనమ్*_

_*కపీశ మక్షహంతారం*_

_*వందేలంకా భయంకరమ్*_


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం -‌ పంచమి - పుష్యమి -‌‌ స్థిర వాసరే* (31.05.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఈశ్వరుడి లీలా అపారమైనది

 *🌴🌈ఈశ్వరుడి లీలా అపారమైనది మనిషి శరీరంలోని వేళ్లపై ఉన్న చర్మం మీద రేఖలు రూపుదిద్దుకోవడం, శిశువు తల్లిగర్భంలో సుమారు నాలుగు నెలల వయసు ఉన్నప్పుడే ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఈ రేఖలు మాంసంపై జాలంలా... అంటే వలయంలా ఏర్పడతాయి. ఈ రేఖల ఏర్పాటుకు సమాచారం డిఎన్ఎ ద్వారా లభిస్తుంది.* 


*🌴🌈కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రేఖలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ శిశువు తల్లి లేదా తండ్రి లేదా ప్రపంచంలోని ఏ ఇతర వ్యక్తితోనూ సరిపోవు. ఈ రేఖలను సృష్టించేవాడు కూడా అంతే ప్రత్యేకమైన పరమాత్మనే, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారి, ఇంకా ఈ లోకంలో లేనివారి చేతి, నుదుటి రేఖలను కూడా ఆయన రూపకల్పన చేస్తాడు, వాటి ప్రతి ఒక్క డిజైన్‌ను గుర్తుంచుకుంటాడు.*  


*🌴🌈కాబట్టి ప్రతిసారి ఆయన తన వేళ్లపై కొత్త రకమైన రూపాన్ని ఏర్పాటు చేస్తూ తన అద్భుతాన్ని చూపిస్తాడు. ఆశ్చర్యకరంగా, వేళ్ల రేఖలు కాలిపోవడం,*

*గాయపడడం లేదా ఏదైనా కారణంగా నాశనం కావడం జరిగినా, అవి మళ్లీ అదే నిర్మాణంతో తిరిగి వస్తాయి — అందులో ఒక చుక్క కూడా భిన్నంగా ఉండదు. ఈ సమస్తాన్ని నిర్వహిస్తున్న ఒక అద్భుతమైన శక్తి ఉంది, అదే ఈ ప్రపంచాన్ని నడుపుతోంది. ఆ పరమాత్మ మొదటగా మన హస్తరేఖలను సృష్టించాడు — ఇవే నేడు మన ఆధార్ కార్డు రూపంలో మన గుర్తింపుకి ఆధారంగా మారాయి... అతడే శక్తిశాలి భగవాన్... అతడే పరమేశ్వరుడు... అతడే సూక్ష్మంలో సూక్ష్మమైనవాడు, అనంతంలో అనంతమైన బ్రహ్మాండం.*


*┈┉┅━❀꧁ శివోహం ꧂❀━┅┉┈*

         *SPIRITUAL SEEKERS*

👆🇮🇳👆 🙏🕉️🙏 👆🇮🇳👆