31, మే 2025, శనివారం

విశ్వేశ్వరా

 శు భో ద యం🙏


                  విశ్వేశ్వరా!!


శా.

నీ విన్నాణము చిత్రమే, మకుటరత్నీభూతజైవాతృకా!/

గ్రైవేయీకృతకాద్రవేయ! గళరుద్రాక్షీభవద్బాడబా!/

సేవాస్వీకృత భూత రాక్షస పిశాచీప్రేత! నేత్ర ప్రభా/

శ్రీవిన్యస్త కృశాను! పార్వతమృగాక్షీదార! విశ్వేశ్వరా!

23

     -కవిసామ్రాట్. విశ్వనాధసత్యనారాయణ.


        మనం నేడు విశ్వనాధ వారి విశ్వేశ్వర శతకంలోని ఈపద్యం పరిశీలిద్దాం

       చిత్రవిచిత్రమైన ఊహలకు వ్యంగ్య

మర్యాదలకు ఆటపట్టైన శతక మిది.

విశ్వప్రతిభకు ముకురాయమానం.

          

               "కిరీటంలో తురాయిగా చంద్రుని అలంకరించుకోవటం.కంఠ హారంగా వాసుకిని అలంకరించుకోవటం,

మెడలో రుద్రాక్షగా గరళాన్ని నిలుపుకోవటం, సేవక సముదాయంగా

భూతప్రేత పిశాచములను నియమించటం, తృతీయ నేత్రంగా ఫాలభాగాన అగ్నినిధరించటం, కోయపిల్ల పార్వతిని భార్యగా స్వీకరించటం, ఏవిటయ్యా?ఈతిక్కపనులు?

        అంటూ హేళన జోడించి వ్యంగ్యంగా విశ్వరుని మహిమలను నుతించటం ,విశ్వనాధకుదక్క ,మరెవరికి సాధ్యం?

    మహాకవీ! నీకూ, నీప్రతిభకూ,

శత సహస్ర వందనాలు!!


                       స్వస్తి !!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: