9, డిసెంబర్ 2020, బుధవారం












 


 

అవసరం

 ఏ పనిచేసినా 

     "నిబద్ధత" అవసరం.

ఏ మాటమాట్లాడిన

    "వాక్ శుద్ధి "అవసరం.

ఏ చదువు చదివిన 

   "ఏకాగ్రత" అవసరం.

ఏ పదవిని పొందిన 

  " కార్యదక్షత" అవసరం.

ఏ ప్రయాణం చేసిన

   "నిదానం" అవసరం.


🌹🌹 🌹🌹

కార్తీక పురాణం - 25 వ అధ్యాయము

 *🚩కార్తీక పురాణం - 25 వ అధ్యాయము🚩*_


🕉☘🕉☘🕉☘🕉☘🕉☘🕉


*దూర్వాసుడు అంబరీషుని శపించుట*


☘☘☘☘☘☘☘☘☘


"అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము" అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు "ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్న, విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును" అని వారి యెదుటనే జలపానము నొనరించెను.


అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ "ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీ హరి బ్రాహణావమానమును సహింపడు. మమ్మే యవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీషా! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరీషుడు, ముని కోపమునకు గడ గడ వణుకుచు, ముకుళిత హస్తములతో "మహానుభావా! నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయా దాక్షిణ్యములు గలవారూ కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన యెడమకాలితో తన్ని "దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవజన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవజన్మలో వామనుడు గాను, ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక" అని వెనుక ముందు లాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా! అటులనే - మీ శాపమనుభవింతు" నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి "బ్రతుకుజీవుడా" యని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ యెంత ప్రార్దంచినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. 


*ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము - ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము.*

🙏🙏🙏🙏🙏🙏.🙏🙏🙏🙏🙏


_

ముక్కోటి వైకుంట ఏకాదశి

 ఈ నెల 25న ముక్కోటి వైకుంట ఏకాదశి🚩🌼🍒*


✡️🌿🍒పుష్య మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అందురు. దీనినే వైకుంట ఏకాదశి అని కూడా అంటారు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది ఈ వైకుంఠ ఏకాదశి.🌷

⚛️ఈ రోజు వైకుంటంలో మూడు కోట్ల దేవతలు శ్రీమన్నారాయణున్ని దర్శించి సేవించుకుంటారు. అందువలన దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది🏵️

🚩దేవాలయాలలో మామూలుగా ఉత్తరద్వారాలను మూసి ఉంచుతారు. ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఈ ద్వారాలు తెరుస్తారు. భక్తులు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని ఉత్తర ద్వారం ద్వారా దేవాలయమునకు వెళ్ళి దేవుని దర్శించుకోవలెను. ఈ రోజు దైవదర్శనం చేసుకొంటే ఆ పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. భద్రాచలం లోనూ, తిరుమల క్షేత్రాల్లోను ఈ 'ఉత్తర ద్వారదర్శనం ' ప్రత్యేకంగా జరుగుతుంది. ⚛️

*✡️వైకుంఠ ఏకాదశీ వ్రతం" ఎలా చేయాలంటే* 

ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వ దినం వైకుంఠ ఏకాదశి. దీనినే ‘ముక్కోటిఏకాదశి’ పేరుతో వైష్ణవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు.✡️

🌷ఈ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం. శ్రీమహావిష్ణువుతో బాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. దక్షియణాయానంలో దివంగతులైన పుణ్యాత్ములు ఈ రోజున వైకుంఠ ద్వార౦ ద్వారా స్వర్గానికి చేరుకుంటారు. ⚛️

*🌺వైకుంఠ ఏకాదశీ వ్రతం ఎలా చేయాలో తెలుసా?🌺*

✡️ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. ఏకాదశి ఉపవాస తిథి విష్ణు స్వరూపమైనది. ఈ వైకుంఠ ఏకాదశీనే ‘పుత్రదా ఏకాదశి’ అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ద్వాదశి రాత్రి కూడా భుజించకూడదు.
ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు.
అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే  మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున లభిస్తుంది*

*🌷జై శ్రీమన్నారాయణ 🌷* 

పదపల్లవాలలో

 తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో  చూద్దాం.


1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 

*-దేవులపల్లి కృష్ణ శాస్త్రి*


2. ‘‘కప్పివుంచితే కవిత్వం విప్పి చెబితే విమర్శ’’

*డా.సి.నారాయణరెడ్డి*


3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 

*- కాళోజి*


4. ‘‘గత కాలము మేలు వచ్చుకాలముకంటెన్‌’’ 

*- నన్నయ*


5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 

*-సుబ్బారావు పాణిగ్రాహి*


6. ‘‘రాజే కింకరుడగు కింకరుడే రాజగు’’ 

*-బలిజేపల్లి లక్ష్మీకాంతం*


7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 

*-బసవరాజు అప్పారావు*


8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 

*-గుర్రం జాషువా*


9. ‘‘అత్తవారిచ్చిన 

 నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 

*- కాళ్ళకూరి నారాయణరావు*


10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’ 

*- దాశరధి*


11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 

*-నార్ల వెంకటేశ్వర రావు*


12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 

*- తిరుపతి వెంకట కవులు*


13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 

*- గురజాడ*


14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 

*- గరిమెళ్ళ సత్యనారాయణ*


15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’ 

*- శ్రీనాథుడు*


16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 

*- పోతన*


17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 

*- గద్దర్*


18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 

*- శ్రీ శ్రీ*


19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 

 *- వెన్నలకంటి*


20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 

*- కొనకళ్ల వెంకటరత్నం*


21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’

*- అల్లసాని పెద్దన*

 

22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 

*- చేమకూరి వేంకటకవి*


23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 

*- త్యాగయ్య*


24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 

*- ధూర్జటి*


25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’ 

*- బద్దెన*


26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’ 

*- వేమన*


27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 

*- కంచర్ల గోపన్న*


28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 

*- సుద్దాల హనుమంతు*


29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 

*- ఆరుద్ర*


30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’ 

*- వేముల శ్రీ కృష్ణ*


31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 

*- త్రిపురనేని రామస్వామి*


32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 

*- బాలాంత్రపు రజనీకాంతరావు*


33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 

*- అడవి బాపిరాజు*


34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’

*- కరుణశ్రీ*

 

35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 

*- గుడ అంజయ్య*


36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 

*- అలిసెట్టి ప్రభాకర్*


37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 

*- సావిత్రి*


38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 

*- ఖాదర్ మొహియుద్దీన్*


39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను 

*- బాలగంగాధర తిలక్*


40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 

*- అన్నమయ్య*


41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’ 

*- ఏనుగు లక్ష్మణ కవి*


42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 

*- పాలగుమ్మి విశ్వనాథం*


43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 

*- చెలం*


44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’

*- విమల*

 

45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’ 

*-డూరి సుబ్బారావు*


46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’ 

*- అందెశ్రీ*


47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’

*- చెరబండరాజు*

 

48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ 

*- కందుకూరి రామభద్రరావు*


49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ 

*- నందిని సిధారెడ్డి*


50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’

*- మిట్టపల్లి సురేందర్*


"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను 

తెలుగు వల్లభుండ.........

దేశభాషలందు తెలుగు లెస్స".(శ్రీకృష్ణదేవరాయలు)....


"ఈ రోజు రేపు రాదు ఈ నిమిషం తిరిగి రాదు"

(అంగోతు జయ వాసు)


సేకరణ 🙏

తులసి రకాలు వాటి గుణాలు

 తులసి రకాలు వాటి గుణాలు

తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థస్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగాతీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.రోజూ నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం, ప్రదక్షిణలు చేయడం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూ మండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని ఓ నమ్మకం.తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పోషించినా మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.తులసి మొక్కతో హరిహరులను పూజిస్తే పునర్జన్మ ఉండదని చెబుతుంటారు.. 

సనాతన సంప్రదాయాల ప్రకారం ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తులసి ఆకులను తుంచరాదు.

తులసి ఆకులను తూర్పు, ఉత్తర ముఖంగా నిల్చుని మాత్రమే కోయాలి.

ద్వాదశి అమావాస్య, పున్నమి తిథులలో తులసి ఆకులను తుంచరాదు.

రాత్రి వేళల్లోనూ, స్నానం చేయకుండా గానీ, పాదరక్షలతో గానీ తులసి మొక్కను ముట్టుకోరాదు.

తులసి ఆకులను ఒంటిగా తుంచరాదు. మూడు ఆకుల దళంతో కలిపే తుంచాలి.

తులసి ఆరోగ్యం ప్రయోజనాలు మానవుని ఆరోగ్య పరిరక్షణ లో అత్యధిక ప్రాధాన్యత కలిగిన తులసి, భారతీయ సంస్కృతి లో ప్రత్యేక స్థానం ఉంది. చాలా ఆరోగ్య సమతుల్యతను కాపాడ గల తులసి ఒక విధంగా ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పవచ్చు ! విశిష్ట ఔషధ గుణాలున్న ఈ మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి మంత్రోపాసకుల తో సహా మనమంతా ఉత్సాహం చూపుతాం తప్పరోజుకు కనీసం ఒక మూడు ఆకులు తినడానికి ఇష్టపడము . దీని వాసన, దీని పై నుంచి వీచే గాలి, నీటిలో కరిగే వచ్చే తీర్థం…… అన్నీ రోగ నివారిణులుగా పని చేస్తుంది.ఇది నయం చెయ్యని రోగం లేదు. తులసి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునే ముందు అసలు తులసి ఎన్ని రకాలు ఉన్నాయి అన్నది ఒకసారి తెలుసుకుందాం

తులసి రకాలు – వివిద పేర్లు

 నిఘంటువులో తులసి చాలా పేరు కనిపిస్తాయి. కానీ మనకు తులసి లో మొత్తం మన దేశానికి సంబంధించిన 7 తులసి రకాలున్నాయి. ప్రధానమైనవి. 3 అని అర్చన పరంగా చెప్పిన (శ్రీలక్ష్మి తులసి, కృష్ణ తులసి, వన తులసి) ఆయుర్వేదంలో ఉపయోగించే రకాలు నాలుగింటిని కలిపి ఏడు రకాలుగా తులసి లభ్యమవుతున్నది.

1. కృష్ణ తులసి

2. శ్రీలక్ష్మి తులసి .

3. రామ తులసి

4. అడవి/వన తులసి

5. నెల తులసి

6. మరువక తులసి

7. రుద్ర జడ తులసి

1. కృష్ణ తులసి

దీనినే ‘నల్ల తులసి’ అని కూడా వ్యవహరిస్తారు. క్రిష్టియన్స్ దీన్ని హోలీ బ్లాక్ బాసిల్ అంటారు. ఇది క్రీస్తు సమాధి మీద నాటబడినది. బొల్లి, మలేరియా, ధనుర్వాతం, గుండెజబ్బులు, విషదోషాలు, ప్లేగు నివారిస్తుంది. కృష్ణ తులసి తైలాన్ని ఊపిరి తిత్తుల రోగాలకు, గాయాలకు, చర్మ వ్యాధులు తయారు చేసే మందుల లో ఉపయోగిస్తారు.

 2. లక్ష్మి తులసి

‘తెల్ల తులసి’ లేక లక్ష్మి తులసి అని వ్యవహరిస్తారు. దీనికాడలు తెల్లగా ఉంటాయి. . ఇందులో మళ్లీ రెండు జాతులు లభ్యమవుతున్నాయి. మంచి పరిమళం, పెద్ద పెద్ద ఆకుల తో, దట్టమైన పుష్పగుచ్ఛాలు ఉండే జాతి గల తెల్ల తులసి క్రిమి కీటక నాశిని. ఇంట్లో ఒక కొమ్మ వ్రేలాడ దాస్తే దోమలు దరిచేరవు.. ” వస్థ దవనం ఆకు వల్ల చిన్న చిన్న ఆకులు ఉండే ఇంకో జాతి తెల్ల తులసిని మూత్ర సంబంధ రోగాలు నివారినిగా ఉపయోగిస్తారు.

 3. రామ తులసి

  చాలా వాసన కలిగి ఉంటుంది. ఇది కూడా క్రిమి కీటక సంహారిణిగా పనిచేస్తుంది. రాతి నేలలు, కొండవాలు లలో ఎక్కువగా కనిపిస్తుంది తులసి. నీటి వనరులు లేని చోట్ల కూడా పెరగగలదు. జీర్ణశక్తిని పెంచే గుణం గల రామ తులసి ఆకులను కొన్నింటిని భోజనానంతరం సేవిస్తే కడుపులో నులి పురుగులు సైతం నశిస్తాయి.

 4. అడవి తులసి

గిరిజనులు తమ పాలిటి కల్పతరువు గా భావించే అడవి తులసి కూడా ఔషధగుణాలను కలిగి ఉంది. ఎక్కువ ఎత్తు ఎదగదు. చాలా ఘాటైన వాసన కలిగి తేలు, జెర్రీ వంటి పెద్ద విషకీటకాల విషాన్ని విరిచే గుణాన్ని కలిగి ఉంది. శ్రీశైలం, తిరుపతి, తలకోన తదితర అడవులలోనూ కొన్ని కొండ ప్రాంతాల్లో ను లభిస్తుంది.

5. నెల తులసి 

కొందరు దీనిని ‘వైద్య తులసి’ అని; ‘శొంఠి తులసి’ అనీ వ్యవహరిస్తారు. ఈ రకం తులసి కూడా చాలా ఘాటైన వాసన తో ఉండి సూక్ష్మ జీవుల్ని హరిస్తుంది, * వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. స్పోటకం వంటి అంటు రోగాలున్న చోట్ల ఈ తులసిని పూర్వం నాటేవారట ! ఇది ఉన్న ఊళ్లలో అమ్మవారు పోయుట జ్వరం వంటివి కనిపించవు. అలాగే మలేరియా క్రిములు సైతం నిర్మూలిస్తుంది.

6. మరువక తులసి

 దీనినే కొందరు మరువం, మరువకం అనీ పిలుస్తారు కర్పూర తులసి కూడా అనీ అంటారు. దీనిని సువాసన గల ఇతర పుష్పాలతో జత చేసి దండలుగా కట్టు తల లో పెట్టుకోవడానికి దైవ పూజ నిమిత్తం కూడా వాడతారు. ఈ తులసి వాసనకు తలలో పేలు, ఈ పి, చుండ్రు నశిస్తాయి.. జుట్టుకు సువాసన అబ్బుతుంది. కొన్ని ప్రాంతాల్లో దీనిని కర్పూరం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ కర్పూరం చర్మ రోగ నివారిణి ఔషధాలు వినియోగం కోసం తయారీ చేస్తారు. అట్లే దీని ఎస్సెన్స్ (సారాన్ని) సువాసన గల కేశ తైలం తయారీలో వినియోగిస్తారు. ఈ కర్పూర తులసి తైలం చెవిపోటుకి, ఉదర కోశ వ్యాధుల నివారణకు, వాత దోషాలు పోగొట్టడానికి సైతం వాడతారు. : ఇది పేరుకు తగినట్లుగా కర్పూరము వాసనతోనే ఉండును. ఇది తూర్పు ఆఫ్రికాలోనిది. ఇటీవల కర్పూరము దీని నుండి తీయుట చేత ఇది ప్రాముఖ్యత సంతరించుకుంది. దీనిని కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన ప్రదేశములలో సాగుచేయు చున్నారు.

7. రుద్రజడ తులసి 

వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ప్రాచీనుల “సబ్జా గింజలను వాడేవారు. ఇది “రుద్రజడ తులసి’ జాతికి చెందినదిగా గుర్తించారు. ఈ తులసి గింజలు నీట నాని వేసి, ఆ పానీయం తాగితే – శరీరంలో అధికంగా చేరిన ఉష్ణం, త్వరితంగా తగ్గుతుంది దీని ఆకులు కొద్దిగా మిరియాలను నూరి తింటే చాలు జ్వరాలు, సీమ జ్వరాలు సహితం తగ్గడం గమనార్హం. కొందరు ఈ ఆకులు శొంఠిపొడి వేసి కషాయంగా కాచి, తీసుకుంటారు. ఇది కూడా జ్వరనివారణకు బాగా ఉపకరిస్తుంది. నిత్యం ఈ ఆకుల్ని సేవిస్తే, మూత్ర కోశ సంబంధ వ్యాధుల్ని కూడా నివారించుకోవచ్చు !

తులసి ఆరోగ్యం ప్రయోజనాలు 

1. చర్మరోగాలు నివారిస్తుంది.

2. ఆస్మా ఆస్మా, ఆయాసం, కోరింత దగ్గులను అరికడుతుంది. కఫాన్ని విరుస్తుంది.

3. సాంక్రమిక వ్యాధులైన కలరా, ప్లేగు వంటివి అదుపులో ఉంచుతుంది.

4. కడుపులో నులి పురుగుల్ని నిర్మూలిస్తుంది.

5. తులసి రసం మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు, శిరో భారం తగ్గుతాయి.

6. తులసి రసాన్ని పై పూత గా పూస్తే, ఆర్నెల్లకు బొల్లి వ్యాధి మాయమవుతుంది.

7. తులసి విషహారిణిగా పనిచేస్తుంది.

8. ఇస్నోఫీలియా ను నయం చేస్తుంది.

9. మెదడు వాపు వ్యాధి ని నివారిస్తుంది.

10. ఆకలిని వృద్ధి చేస్తుంది.

11. నోటి అరుచి పోగొడుతుంది.

12. శ్వాసకోశనాళ శుభ్రతకు దోహదపడుతుంది.

13. పులిపిర్లను నిరోధిస్తుంది.

14. తులసి ఆకు రసం లో కొబ్బరి నూనె కలిపి కాళ్ల పగుల్లకు పూస్తే త్వరగా నయమయే అవకాశం ఉంది.

15. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది.

16. ప్రతిరోజు క్రమం తప్పకుండా 10 – 15 తులసి ఆకుల్ని నమిలి తింటూవుంటే, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎలాంటి వ్యాధులైనా సరేదరిచేరు సాహసించరు.

17. మలబద్దకాన్ని నివారిస్తుంది.

18. నోటి దుర్వాసన ను అరికడుతుంది.

19. కిడ్నీలో రాళ్లు కరిగిస్తుంది.

20. వీర్యపుష్టికివీర్యపుష్టికి తులసి గొప్ప వరం.

 

జుట్టు సంబంధ తులసి ఆరోగ్యం ప్రయోజనాలు

1. తలకు తులసి రసం రాసి, రాత్రంతా ఉంచుకొని – మర్నాడు తలస్నానం చేస్తే పాలు పోతాయి.

2. తలలో పేలు నశింపజేయడానికి మరో మార్గం కూడా ఉంది. రాత్రి పడుకోబోయే ముందు — ఘాటైన వాసన గల ముదురు తులసి ఆకులు (కోసి ఉంచిన విఎప్పుడైనా) దిండు పై ఒత్తుగా పరుచుకుని – వాటి ఘాటు తలకు పట్టేలా చూసుకున్నా చాలు! తెల్లవారేసరికి పేలు, ఈపులు సహా రాలిపోతాయి.

3. తులసి విత్తులు, నల్ల ఉమ్మెత్త విత్తులు కలిపి తింటే అద్భుతంగా నిద్రపడుతుంది.

4. మానసిక పరమైన ఒత్తిళ్లతో సతమతమయ్యే స్త్రీలకు తులసి దివ్యౌషధం.

5. అందంగా ఉండే స్త్రీల జుట్టు సమస్యలు మొదలై, జుట్టురాలిపోతూంటే రోజూ గుప్పెడు తులసి ఆకుల్ని నమలడం వల్ల ఈ ఒత్తిడి దూరమై గుణం కనిపిస్తుంది. నెల్లాళ్లు గడిచేలోగానే జుట్టు రాలడం తగ్గుతుంది.

6. తులసి ఆకుల రసం కొన్నాళ్ల పాటు రోజూ వెంట్రుకలకు దట్టంగా పట్టించుకొని, ఉదయం పూట శిరః స్నానం చేస్తూంటే ఆరు నెలలుగా తెల్లజుట్టు తగ్గి నల్ల వెంట్రుకలు అధికం అవుతాయి తులసి ఆరోగ్యం ప్రయోజనాలు

 నేత్ర సంబంధ తులసి ఆరోగ్యం ప్రయోజనాలు

1. తులసి విత్తనాల చూర్ణాన్ని కంట్లో కొద్దిగా వేస్తే దుమ్ము, ధూళి బైటికి వచ్చి కళ్లకు మంచి తేజస్సు కలుగుతుంది.

2. తులసి ఆకుల రసాన్ని నీడన ఎండించి, అది చిక్కనిద్రవంగా మారాక వేలికాసకు కాస్తతీసి రెండు పూటలా కంటి క్రింద భాగాన మసాజ్ చేస్తున్నట్లుగా రాస్తూవుంటే కంటి ఉబ్బు – కంటి క్రింద నలుపు దేరడం వంటివి తగ్గుతాయి.

3. వయస్సు పై బడి చూపు మందగిస్తున్నట్లయితే – అటువంటి వారు ప్రతి రోజూ రెండు చుక్కల తులసి రసం కళ్లలో వేసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

4. తులసి ఆకు రసాన్ని రెండు లేదా మూడు చుక్కలు కంట్లో వేస్తే కళ్ల వెంట నీలు. కారడం – కళ్ల మంటలు తగ్గడమే కాక, కంటికి బలాన్ని చేకూరుస్తుంది.

5. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు టానిక్ వలె పుచ్చుకుంటే – కంటికి కునుకు రాదన్న బెంగ ఉండదు. నిద్రలేమి బాధ నుండి ఉపశమనం తధ్యం.

 చెవి సంబంధ తులసి ఆరోగ్యం ప్రయోజనాలు 

1. తులసి ఆకుల్ని బాగా ఎండబెట్టి, దానిమ్మ రసంలో నూరి ఆ మిశ్రమాన్ని పిల్లలు ఇస్తే ఒళ్ళు నొప్పులు పాటు చెవి సంబంధ రోగాలు అంతరిస్తాయి.

2. రుద్ర తులసి ఆకుల రసాన్ని కొద్దిగా వెచ్చజేసి చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది. చెవి నుండి దుర్వాసన తో కూడిన చీము కారడాన్ని రుద్ర తులసి అరికడుతుంది.

3. తులసి రసానికి సమపాళ్లలో నువ్వుల నూనె కలిపి కాచి, గోరువెచ్చగా ఉన్నప్పుడే 3 లేక 4 చుక్కలు చెవిలో వేసి దూది పెట్టినట్లయితే చెవిపోటు నెమ్మ దిస్తుంది.

4. ప్రాచీనకాలంలో చెవిపోట్లకు, వినికిడి సమస్యల నివారణకు తులసిపసరు చెవిలో పోసేవారని శాస్త్రప్రమాణాలున్నాయి.

5. కృష్ణ తులసి, భూతులసి రసాన్ని చెరొక రెండు స్పూన్లు తీసుకుని, శుద్ధమైన కొబ్బరి నూనెలో కలిపి గోరువెచ్చ గా చేసి, అందులో కొద్దిగా వేపతైలం చేర్చి చెవి యందు రెండు చుక్కలు వేసినచో ఆర్నెల్ల వరకు ఎటువంటి చెవిపోటు ఉండదు.

సి శ్వాస సంబంధిత తులసి ఆరోగ్యం ప్రయోజనాలు

1. కఫాన్ని వెడల గొట్టే శక్తి తులసికి విపరీతంగా వుంది. వన తులసి ఆకులు రోజూ గుప్పెడు నముల్లూంటే, శ్వాసనాళాలు శుభ్రమవుతాయి.

2. మిరియాల చూర్ణం తులసి రసంలో బాగా చాది, తేనెతో అద్ది లోపలికి పుచ్చుకుంటే శ్వాసకాసలు తగ్గుతాయి.

3. తులసి రసం, వస చూర్ణం, నువ్వులు నూనె సమపాళ్లలో తీసుకొని బాగా కాచి, చల్లార్చిన తర్వాత రోజు రెండుమూడు చుక్కలు వేసుకొంటూ వుంటే ఎలాంటి నాసికా రోగాలైనా అంతరిస్తాయి.

4. ఎండబెట్టిన తులసి ఆకుల చూర్ణాన్ని నశ్యం మాదిరిగా పీలుస్తూ వుంటే ఆస్త్మా అద్భుతం గా నయం అవుతుంది పరిశోధనలో తేలింది.

 నోరు, గొంతు సంబంధ తులసి ఆరోగ్యం ప్రయోజనాలు

1. ఒక స్పూన్ తులసి రసంలో కొంచెం తేనెను కలిపి ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే, బొంగురు పోయిన గొంతు, సాఫీగా ఉంటుంది. గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. నోట్లో పూతకు ఇదే మందు.

2. పళ్లు తోముకొనే ముందు, ముఖం కడుక్కొనే నీటిలో తులసి ఆకులు నానవేసి . ఆ నీటిని పుక్కిలించి ఆ పైన దంతధావనం చేస్తే, నోటి దుర్వాసన ఉండదు.

 

 కడుపులో రుగ్మతలకు తులసి ఆరోగ్యం ప్రయోజనాలు

1. కావ్య వ్యాధులకు తులసి కషాయాన్ని వాడవచ్చు ! గుప్పెడు ఆకుల్ని వేడినీటిలో వేసి, మూత పెట్టి రెండు నిముషాలు అలాగే ఉంచు, ఆకుల్ని మెత్తగా పిండివడకట్టి, ఈ రసాన్ని గ్లాస్ నిండా పరగడుపున తీసుకుంటూ ఉంటే, మూడు నెలలకు మంచి గుణము కనిపిస్తుంది.

2. విరేచనాలు, రక్త విరేచనాలు సమపాళ్లలో తులసి రసం, ఉల్లిపాయ రసం, అల్లం రసం, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఏడు చెంచాలు (2×3) రెండు పూట్లో తీసుకోవాలి. మూడురోజులకు గుణము కనిపిస్తుంది.

3. తులసి కొమ్మలు లేతవి యధాతధంగా నీళ్లలో వేసి మరిగించి/కాచి చల్లార్చిన కషాయాన్ని రెండు రోజులు తీసుకుంటే జిగట విరేచనాలు మటుమాయం.

4. తులసి రసం – తమలపాకు రసం కలిపి, దీనికి చిటికెడు పంచదార చేర్చి ఉదయం సాయంత్రం రెండేసి స్పూన్ల చొప్పున తీసుకుంటూ ఉంటే, మంచి ఆకలిపుట్టి జఠరాగ్ని ప్రేరేపిస్తుంది.

5. తులసి గింజలను బాగా నూరి, ఆ పొడిపాలలో కలుపుకొని త్రాగుతూంటే ఎటువంటి వాంతులైనా అరికట్టబడతాయి.

తులసి ఒళ్లు నొప్పులు ఉప‌శ‌మ‌నానికి 

1. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే ఒళ్లునొప్పులు పుడుతుంటాయి. దీనికీ తులసి ఆకుల తో చక్కటి ఉపశమనం ఉంది. పది తులసి ఆకులను కప్పు నీళ్ళలో వేసి వేడి చేయాలి. ఆకులు బా గా మరిగి నీళ్లు సగం అయ్యే దాకా కాచాలి. చల్లార్చిన తర్వాత ఆ కషాయానికి ఉప్పు కలిపి, దాన్ని ప్రతి రోజూ తీసుకుంటే ఒక నొప్పులు ఉపశమిస్తాయి. ఇంకొక మార్గం కూడా ఉంది. అది దిగువ ఇవ్వబడింది.

2. తులసి ఆకుల్ని, ఆముదపు చెట్టు వేర్లను నీటిలోవేసి మరిగించాలి. చల్లారిన తర్వాత వడగట్టి, ఈ ద్రవాన్ని సేవిస్తే కీళ్ల నొప్పులు, కీళ్ళ నొప్పులు సహా మత సంబంధమైన సమస్త నొప్పు లు హరిస్తాయి.

3. తులసి గింజల్ని పొడిచేసి, ఈ పొడిని పాలల్లో వేసి త్రాగుతూన్నట్లయితే, కొంత కాలానికి కండరాలనొప్పులన్నీ ఉపశమిస్తాయి.

4. తులసి రసం, అల్లపురసం ఎండించి, పుష్కర చెట్టు వేర్లతో కలిపి ముద్దగా నూరుకోవాలి. ఈ ముద్దు కీళ్ళ నొప్పులున్న చోట్ల మర్దనా చేయడం కూడా నొప్పి నివారిణి గానీ అద్భుతంగా పనిచేస్తుంది.

5. ఇంకొక పద్దతిప్రకారం – తులసి ఆకులు, ఆముదం ఆకులు, రాతి ఉప్పు మెత్తగా నూరిన ముద్ద తో కీళ్ల జాయింట్ వద్దు మర్దనా చేయడం ద్వారా కూడా ఇటువంటి నొప్పుల్ని నివారించవచ్చు !

6. కాళ్ల ముణుకులు (మోకాళ్లు), పాదాల జాయింట్లు (మడమలు) వద్ద వచ్చే నొప్పుల నివారణ – తులసి ఆకు ఎండించి నీళ్లలో వేసి కాచి కషాయం వలె రోజూ తాగుతుంటే సరిపోతుంది.

7. గుప్పెడు మరువక తులసి ఆకుల్ని మెత్తగా దంచి రసం తీసి, ఈ రసాన్ని మామూలు నీళ్లలో కలిపి తీసుకున్నా కూడా అజీర్ణం, వాత వ్యాధులు, ఒళ్ళు నొప్పులు హరిస్తుంది.

తులసి విషాలకు విరుగుడుగా

1. తులసి వేర్లు ఎండబెట్టి పొడుం చేసి నిల్వ ఉంచుకుని, తేలు కుట్టినచోట అద్దితే, నొప్పి మటు మాయం అవుతుంది.

2. తులసి వేర్లు బాగా ఎండబెట్టి, పొడుం చేసి చిన్నచిన్న మాత్రమే వలె కట్టుకుని ఏదైనా విషకీటకాలు కుట్టినప్పుడు రోజుకు నాలుగు ఐదు పర్యాయాలు లోపలికి తీసుకుంటే – విష ప్రభావం అరికట్టబడుతుంది.

3. రెండేసి చెంచాల తులసిరసం ఆరారగా అరగంటకోసారి చొప్పున నోట్లో పోస్తూంటే, విష కీటకాలు కాటు వల్ల కలిగే అపస్మారం నుంచి విముక్తి పొందగలుగుతారు.

 

తులసి దురదలు నివారణగా 

1. స్నానం చేసేటప్పుడు తులసి ఆకులను నలిపి నీటిలో వేసి, ఆ నీటితో స్నానం చేస్తే చెమట నుంచి ఉపశమనం కలిగి దురదలు రాకుండా ఉంటాయి. (కృష్ణ తులసి అయితే ఇంకా శ్రేష్ఠం),

2. లక్ష్మీ తులసి రసం రెండు చెంచాలు, తేనె ఒక చెంచా కలిసిన నీటిని సేవిస్తే (ప్రతిరోజూ) కఫ జనితమైన వ్యాధులు తగ్గిపోతాయి. శ్లేష్మ, కఫ, వాతములను హరించడమేగాక, కృష్ణ తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం కూడా కలదు.

3. తులసి ఆకుల్ని ఎండబెట్టి, పొడుము మాదిరిగా కొట్టి ఉంచుకొని అప్పుడప్పుడు తేనె లో కలిపి పిల్లలు నాకిస్తూ ఉంటే, వారికి ‘సర్వరోగనివారిణి’ వలె పని చేస్తుంది.

 

తులసి రక్త శుద్ధికి 

1. ఏ తులసి రకం అయినా రక్తంలోని కొలెస్టరాలని నిరోధిస్తుంది.

2. ప్రతిరోజూ తులసిరసం చేత కొద్దిగానైనా తడుపబడిన గుడ్డను ఆవిరి పట్టడం ద్వారా హై బ్లడ్ ప్రెషర్ ను నిరోధించవచ్చు !

3. ఉదయాన్నే కొన్ని తులసి ఆకుల్ని నమిలి మింగడం వల్ల నీరసం దరిచేరక చలాకీ గా ఉంటారు. గుండె జబ్బులు రావు.

4. తులసి రస ప్రభావం వల్ల సమస్త రక్తదోషాలు తొలగిపోతాయి. రక్తదోషాలు లేకుంటే ఆ కి పెరుగుతుంది. అందువల్ల పోషకాలు సరిగ్గా శరీరానికి అందగలవు. కృష్ణ తులసి లో ఈ గుణం అధికం.

 

తులసి కిడ్నీలో రాళ్లు

1. తులసి రసాన్ని క్రమం తప్పకుండా ప్రతీరోజునా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే, కిడ్నీ లో చక్కగా పని చేస్తాయి. కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి.

2. అడవి తులసి రసాన్ని పంచదారలో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకొనే ముందు రెండు చెంచాలు తీసుకుంటే, బాగా నిద్ర పడుతుంది. నిద్రలేమి బాధపడేవారికి ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుంది.

 

తులసి సౌందర్య సాధనంగా 1

1. అడవి తులసి ఆకుల రసంలో ఎన్నో ఔషధీయ గుణాలు కలిగి ఉన్నాయి. దీని రసాన్ని కంటి క్రింద పూస్తూ ఉంటే, కళ్ళ క్రింద వచ్చే ఉబ్బు – నల్లటి వలయాలు అరికట్టబడతాయి.

2. నేల తులసి విత్తనాలు చూర్ణాన్ని కంట్లో ప్రతి వారానికోసారి వాస్తు వుంటే, కంట్లో ఏర్పడే పూసి, కంట్ లో బాధ పెట్టే నలుసు బయటకు వచ్చేస్తాయి. కంటికి మంచి తేజస్సు కలుగుతుంది.

3. తులసి ఆకుల్ని ఎండబెట్టి చూర్ణం చేసి, దీనియందు కొద్దిగా నీటిని కలిపి పేస్ట్ లో తయారు చేసి, ముఖానికి – కాళ్లు, చేతులు పట్టిస్తే స్త్రీల చర్మ సౌందర్యం వృద్ధి చెందుతుంది. చర్మం సున్నితంగా మారుతుంది.

4. తులసి ఆకుల్ని ఎండబెట్టి బాగా పొడుంలా కొట్టి, ఎస్త్రగాళితం పట్టి ఈ చూర్ణాన్ని ఫేస్ పౌడర్ వలె రాసుకుంటూ ఉంటే శోభి మచ్చలు సహా సర్వ మచ్చలు అంతరించి శరీరానికి మెరుపు వస్తుంది. కుష్టు, బొల్లి మచ్చలు కూడా నివారించబడతాయి.

5. ఆయుర్వేదీయ ఫేస్ పౌడర్ వలె పని చేసే తెలుసా కి చూర్ణానికి ఏదీ సాటి రాదు. వేసవిలో వేడి తగ్గిస్తుంది. చేమట వల్ల దుర్వాసన రాదు.

6. పిల్లలు పళ్లుతోముకోడానికి ముందు తులసి రసం పుక్కిలించి, ఉమ్మేసి, ఆ తర్వాత పెళ్లి తోముకోడం అలవాటు చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేస్తూ ఉంటే, దంత సంబంధిత వ్యాధులు రాకుండా నివారించవచ్చు ! పంటి

 

తులసి సౌందర్య సాధనంగా 2

1. చిగుళ్లు గట్టి పడతాయి. నోటి దుర్వాసన ఉండదు. ముఖ సౌందర్యం ఇనును డిస్తుంది.

2. పిల్లలకు ఊపిరి తిత్తుల్లో నెమ్ము చేరుకుంటున్నప్పుడు – ఎక్కువగా జలుబు చేయడం, ఊపిరి సరిగా అందకపోవడం, ఊపిరి తీస్తే ‘విజిల్’ వంటి శబ్దం రావడం….. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇవి తగ్గడానికి ఓ వారం రోజుల పాటు తులసి ఆకులు వేసి మరిగించి న పాలు పట్టిస్తే సరిపోతుంది.

3. యువకులు ఉదయాన్నే కొన్ని తులసి ఆకుల్ని నమిలి మింగడం వల్ల నీరసం తగ్గిపోయి చలాకీగా ఉండగలరు. మంచి దేహారోగ్యం పెంపొందును.

4. ఒకరోజంతా నిమ్మరసం తగినంత తీసుకుని రాగిపాత్రలో ఉంచాలి. ఇలా ఉండటం వల్ల తయారయిన ఆమె పదార్ధానికి కొంచెం తులసి ఆకుల రసాన్ని కలపాలి. దీనికి కొంచెం వెనిగర్ కలిపి ఈ మిశ్రమం ముఖానికి పట్టించి సూర్యకాంతిలో ఆరబెట్టి ముఖం శుభ్రంగా కడుక్కుని ఉండాలి. ఈ ఫేస్ ప్యాక్ ని ప్రతి రోజూ ముఖానికి పట్టిస్తుంటే ముఖం కాంతివంతంగా కళకళ లాడుతుంటుంది.

5. తులసి రసంలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖం లేక శరీరం మీద నల్ల మచ్చలు న్న ప్రాంతంలో రాసుకోవాలి. ఆరిన తరువాత నీటితో కడుగుతూ ఉండాలి. ఇలా ప్రతి రోజుకు మూడు సార్లు చొప్పున గాని; రెండు పూటలా చేస్తున్నాగాని నల్ల మచ్చలు పోయి శరీరం తేజోవంతం అవుతుంది.

6. ఒక కేజీ పెసలు, 50గ్రా. వేప పొడి, 50గ్రా. తులసి పొడి, 25 గ్రా. కస్తూరి పసుపు, 15 గ్రా మంజిష్ఠ, 20p గ్రా. చందనం, 5d గ్రా. లవంగాలు ఒక తులం వట్టి వేర్ల పొడి, కొద్దిగా కర్పూరం వేసి అన్నింటినీ మెత్తగా పొడి చేసి – సున్నిపిండి లా వాడితే శరీరం కాంతివంతంగా వుండి, ఎలాంటి చర్మ వ్యాధులు సోకవు.

 

తులసి స్త్రీల వ్యాధులు 

1. ప్రతిరోజూ క్రమం తప్పకుండా తులసి ఆకుల రసాన్ని సేవిస్తూ వుంటే, స్త్రీలకు ఎం అధికంగా అయ్యే రుతుస్రావం క్రమబద్దీకరించబడుతుంది.

2. స్త్రీలకు 5 రోజుల మించి ఋతుస్రావం ఎక్కువగా అవుతూ ఉంటే, ఈ ఆకుల రసం, తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే, రోజుల తరబడి అయ్యే స్రావం అరికట్ట బడుతుంది.

3. స్త్రీలకు గర్భాశయ లోపం ఉంటే, సహజంగా గర్భాలు నిలవకపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి రోజు తులసి రసం తీసుకోవడం వల్ల ఎలాంటి గర్భాశయ వ్యాధులైనా నివారించబడి గర్భం దాల్చడానికి మార్గం సుగమం కాగలదు.

 

తులసి జలుబు నివారణగా 

1. తులసిరసం, దాల్చిన చెక్క లవంగాలు, చిటికెడు పంచదార, పాలు కలిపి తీసుకుంటే జలుబు మూడు రోజుల్లో ఉపశమిస్తుంది.

2. తులసి వేళ్ల చూర్ణం, తేనె లేహ్యం వలె చేసుకుని రెండు రోజుకు – ఆరుడోసులుగా వేసుకుంటే జలుబెలా వచ్చిందో అలా గే మాయం అవుతుంది.

3. కృష్ణ తులసి రసంలో శొంఠి, అల్లం కలిపి తీసుకున్నట్లయితే – రొంప, జలుబు తగ్గుతాయి.

4. తేనె, తులసిరసం, శొంఠి, నీరుల్లిపాయల రసం సమపాళ్లలో మేళవించి లోపలికి ఆరుపాటలు పుచ్చుకుంటే – జలుబు, దగ్గు తో కూడిన రొంప నుండి ఉపశమనం లభిస్తుంది. మన

5. చిన్నపిల్లలకు జలుబు – జ్వరం వస్తే, తులసి రసమును, గుండెలమీద నుదుటి మీద ఆరారగా రాస్తూ, ఒక టీస్పూన్ తేనెతో ఒక టీ స్పూన్ తులసి ఆకుల రసాన్ని తాగితే జలుబు – జ్వరం తగ్గిపోతాయి. పిల్లలకు ప్రతి రోజూ ఉదయాన్నే కొంచెం తులసి ఆకుల రసాన్ని ఇస్తుంటే. వారికి తరచుగా వచ్చే జలుబు, దగ్గు, వాంతులు తగ్గుతాయి.

6. పది పదిహేను తులసి ఆకులు, ఐదు మిరియపు గింజలు వీటిని నూరి, అది బఠాణీ గింజ పరిమాణం లో మాత్రలు చేసుకోవాలి. వీటిని వారం రోజులపాటు – ఉదయం, మధ్యాహ్నం రాత్రి ఇలా మూడు పూటలా పూటకో మాత్ర చొప్పున వేసుకొని గ్లాసు నీరు తాగితే జలుబు – దగ్గు తగ్గి ఉపశమిస్తాయి.

 

తులసి గుండె సంబంధిత ఆరోగ్యం ప్రయోజనాలు కోసం 

1. తులసి ఆకుల రసంలో పటిక, పంచదార వేసుకుని, ప్రతిరోజూ క్రమం తప్ప కుండ సేవిస్తూ ఉంటే, గుండె నొప్పి – దగ్గు – ఆయాసం నివారించబడతాయి.

2. ఐదుగ్రాముల తులసి ఆకు రసం లో రెండు గింజల మిరియాల పొడి, ఐదు , గ్రాముల పంచదార కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే గొంతు నొప్పి, కండరాలు నొప్పులతో పాటు గుండె నొప్పి కూడా ఉపశమిస్తుంది.

3. తులం తులసిరసం, తులం తేనె, అరతులం అల్లపురసం కలిపి రోజూ కొద్దికొద్దిగా – పది రోజుల పాటు సేవిస్తే, దగ్గు ద్వారా వచ్చే జ్వరం తగ్గిపోతుంది.

4. పదిగ్రాముల తులసి ఆకుల రసం, కొద్దిగా బెల్లం, రెండు ఏలకులు వీటిని కలిపి బాగానూరి, ఈ మిశ్రమాన్ని తేనె లో కలుపుకొని సేవిస్తే, గుండె యందు పేరు కొన్ని కఫం బయటకు వస్తుంది. ఆయాసము తగ్గిపోతుంది.

5. కుండా ఉండాలంటే, వార్థక్యం సమీపిస్తున్నవారు రోజూ గుప్పెడు తులసికి నమలడం దైనందిన జీవితంలో ఓ అవాటుగా మార్చుకోవాలి.

6. గుండె పోటు రాకుండాక ఉండాలంటే, వార్థక్యం సమీపిస్తున్నవారు రోజూ గుప్పెడు తులసికి నమలడం దైనందిన జీవితంలో ఓ అవాటుగా మార్చుకోవాలి.

7. తులసి ప్రతిరోజూ రెండు చెంచాలు అడవి తులసి రసాన్ని పిల్లల చేత త్రాగిస్తూ ! ఉంటే, వారి లో బుద్ధి వికాసం మెరుగు పడుతుంది.

8. తులసి ఆకుల కషాయాన్ని పరగడుపున/ఉదయాన్నే త్రాగుతూంటే…… కీళ్ల నొప్పి, నడుమునొప్పి, పొత్తికడుపు లో మంట, తొడ సలుపు, నడుము నొప్పి ఇలాంటివన్నీ నివారించబడతాయి.

9. ఇంగ్లీషు మందుల వల్ల కూడా నయం కాని కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు తులసి వైద్యం తో నయం అవుతాయి. ప్రారంభ దశలో క్షయ, క్యాన్సర్ వంటి మొండి వ్యాధుల్ని గుర్తించడం జరిగితే, వరుసగా ఆరు నెలలపాటు ప్రతిరోజూ క్రమం తప్పకుండా తులసి ఆకుల రసాన్ని సేవించడం మంచిది.

10. గుప్పెడు తులసి ఆకుల్ని, ఏడు మిరియాల్ని బాగా నూరి, రెండు చెంచాల – నీళ్లలో కలిపి తీసుకుంటే, నీళ్ల విరేచనాలు కూడిన టైఫాయిడ్ నెమ్మదిస్తుంది.

11. తులసి వేర్లను నీటిలో మరిగించి, ఆనీటిని ప్రతిరోజూ తాగుతూంటే, స్త్రీలకు నడుం నొప్పి, కాళ్ళ నొప్పులు నెమ్మదిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కాళ్ళ నొప్పులకు ఇది దివ్యౌషధం.

 

తులసి రతి సామర్థ్యం కోసం

1. తులసి గింజల ఐదు గ్రాములు, సుధామూలం ఐదు గ్రాములు, సఫేద్ ముసిలి ఐదు గ్రాములు, ఏలకులు ఐదు గ్రాములు చూర్ణంగా మార్చుకొని పంచదారతో .” కలిపి గాని, లేదా ఆవు పాలలో కలుపుకొని గాని తాగితే పురుషులకు వీర్య వృద్ధి . అవుతుంది.

2. తులసి ఏభైగ్రాముల తులసి గింజల్ని చూర్ణం చేసుకొని, దానిలో సగం పంచదా కలుపు కొని, ప్రతిరోజూ ఉదయం ఆవుపాలతో తీసుకున్నట్లయినచో వీర్యవంది కలుగుతుంది.

3. కాక నిదానంగా జరిగి, స్త్రీని రతిలో ఎక్కువ సేపు సంతృప్తి పరచగలగుతారు.

4. ఎండబెట్టిన తులసి ఆకులు, మెంతిగింజలు, అశ్వగంధ – వీటిని కలిపి బాగా ఒక నూరి, ఈ మిశ్రమాన్ని ఆవు పాలతో కలిపి నిత్యం లోపలికి పుచ్చుకుంటూ ఉంటే, పురుషులకు వీర్య వృద్ధి.

5. తులసి గింజలు నీటిలో నానబెట్టి, పటిక, పంచదార చేర్చి రోజూ త్రాగితే. మూత్రంలో మంట మటుమాయం..

6. అధిక వేడి వల్ల గానీ, మరే ఇతర కారణాల వల్ల గాని, మూత్రం స్తంభిస్తే తులసి రసం లో ద్రాక్ష రసం లేదా చెరకు రసం, అదీ లేదంటే కొబ్బరినీరు గాని కలిపి సేవిస్తే – మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది.

7. పదిగ్రాముల తులసి గింజల్ని ఒక గ్లాసుడు నీళ్లలో రాత్రంతా నానబెట్టి, మర్నాడు ఉదయాన్నే ఆ నీటిలో కొద్దిగా పంచదార కలిపి సేవిస్తూంటే మూత్ర విసర్జన కష్టంగా ఉండటం తగ్గుతుంది. ..

8. కొద్దిగా తులసి రసం, ఐదుగ్రాముల నీళ్లలో కలిపిత్రాగి, వెంటనే ఆవుపాలు ప్రతిరోజూ తాగుతుంటే పురుషులు మూత్ర విసర్జన సమయంలో ఏర్పడే మంట తగ్గుతాయి.

9. ఐదుగ్రాముల తులసి గింజలు – 125గ్రాముల నీళ్లలో నానబెట్టి ఆరారగా ఐదు రోజులు తాగుతుంటే పురుషులు సోకిన సుఖ వ్యాధులు నెమ్మదిస్తాయి.

10. తులసి గింజలు — బెల్లం మెత్తగా నూరి ముద్దవలె చేసి, ఆవు పాలలో వేసి తాగితే గనేరియా మాయం

11. బలం తులసి ఆకుల రసం, ఐదు గ్రాములు అల్లం రసం నీటిలో కలిపి రోజూ రెండు ఔన్సుల మోతాదులో ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే, వాత సంబంధ వ్యాధులు తగ్గుతాయి.

12. తులసి ఆకుల రసంలో కొంచెం మిరియాల పొడి, స్వచ్ఛమైన నెయ్యి రోజూ ఈ మిశ్రమాన్ని తీసుకొంటూంటే వాత సంబంధిత మైన కడుపు మంటలు తగ్గిపోతాయి.

తులసి జ్వరాలు

1. * గుప్పెడు తులసి వేళ్లు కషాయంగా కాచి, కొద్దిగా తేనె చేర్చి తాగితే మలేరియాను నివారించవచ్చు !

2. * తులసి ఆకులు, మిరియాలు, తేనె సమపాళ్లలో నూరి, లేహ్యంలా చేసుకుని ముప్పుటలా లోపలికి తీసుకుంటే ఎలాంటి జ్వరాన్నయినా నివారిస్తుంది.

3. * నల్ల మిరియాలు, గచ్చపప్పు సమపాళ్ళలో తీసుకొని తులసి రసంలో మర్ధించి, శనగ బద్దలంత మాత్రలు గా కట్టుకోవాలి. రోజుకు 4 మాత్రలు తక్కువ గాకుండా రెండుపూటలా ఉపయోగిస్తే బోద జ్వరం (ఫైలేరియా), ఇన్ ఫ్లూయెంజా నివారణ అవుతాయి.

4. * తులసి, సహదేవి మొక్క వేరు, సప్తపర్ణివేరు సమపాళ్లలో నూరి మాత్రలుగా చేసుకుని నాలుగు రోజులు పుచ్చుకుంటే, ఎంతటి పైత్య జ్వరమైనా హుష్ కాకి అవుతుంది.

5. * తులసి విత్తనాలు, బెల్లం కలిపి ఉదయం సాయంకాలం వాడుతూంటే, వంద రోజుల్లో వీర్యంలో సత్తువ పెరుగుతుంది. ఓజస్సు కు సంబంధించిన మేహదోషాలను నివర్తింప చేస్తుంది. తులసి రసం, తుమ్మిపూల రసం, మిరియాల చూర్ణం రోజాపూలు నీటితో కలిపి – రోజూ కొద్ది కొద్దిగా త్రాగుతూంటే ఎటువంటి విష జ్వరాలైనా నివర్తించబడ

6. * ప్రతిరోజూ పరగడుపున కృష్ణతులసి ఆకులు ఓ పది – పది హేను తింటూ ఉంటే, శరీరంలో అధికంగా ఉన్న ఉష్ణం వెడల గొట్టబడి, దేహాన్ని సమ శీతలంగా ఉంచుకోవచ్చు ! అంటువ్యాధుల విషయంలో :

7. * అతిసారం, మశూచి, ప్లేగు, కలరా, ఇటీవలే తాజాగా వెలుగులోకి వచ్చిన సార్స్ వైరస్ వ్యాధులు పోలిన అంటు వ్యాధులు విషయమై ‘- ప్రతి రోజూ రెండు స్పూన్ల తులసి రసం లో రెండు స్పూన్ల వేప రసం కలిపి (అంటువ్యాధులు , ప్రబలి ఉన్నంత కాలం) త్రాగుతూ ఉంటే, ఊరంతా వ్యాధి ఉన్నప్పటికీ ఆ ! కుటుంబ దరిదాపులకు కూడా పై వ్యాధులేవీ దరిచేరవు..

8. * తులసి ఆకుల రసం, వేప ఆకుల రసం, గజ నిమ్మకాయ రసం ఒకే మోతాదులో కలిపి, అందులో అరతులం గంధకం పొడిని మిళితం చేసి రాస్తే – గజ్జి, తామర, చిడుము పొక్కులు ఏవీ దరిచేరవు. వడదెబ్బ నుంచి రక్షణగా :

9. తులసి ఆకుల రసం, నిమ్మరసం, కలబంద చేర్చి షర్బత్ గా తయారు చేసి, వేసవి కాలంలో రోజు తాగుతూ ఉంటే వడదెబ్బ తగలదు..

10. తులసి దళాలను ఎండబెట్టి వీటికి సమానంగా మెంతులు, అశ్వగంధ చూర్ణం కలిపి – ఆవుపాలతో సేవించినచో వీర్యవృద్ది కలుగుతుంది.

 

తులసిగర్భ సంబంధిత : 

1. * రుద్రజడ తులసి గింజల్ని నీటిలో నానబెట్టి, ఆ నీటిని బహిష్టు మొదలైన నాటి నుంచి, బహిష్టు ముగిసిన రోజు దాకా ప్రతిరోజూ మూడు పూటలా త్రాగుతూ ఉంటే – స్త్రీల గర్భాశయం వృద్ధి – శుద్ధి చెందుతుంది. పిల్లలు పుట్టని వారికి – ఇది ప్రయత్నించి చూడడంలో తప్పులేదు.

2. * ఇరవై గ్రాముల తులసి ఆకుల రసం, ఇరవైగ్రాముల మొక్కజొన్న ఆకుల రసం, పది గ్రాముల అశ్వగంధ రసం, పది గ్రాముల తేనె……. ఒక సీసా కలికి ఉంచుకుని, ప్రసవానికి వారం రోజుల ముందు నుంచి సేవిస్తూ ఉంటే చనుబాలు వృద్ధి చెందుతాయి.

3. * తులసి రసాన్ని యోని పెదవులకు రాస్తూ వుంటే, ఏంటీ ఫంగస్గా పనిచేస్తుంది.

 

తులసిచర్మ సంబంధిత వ్యాధుల్లో :

1. * గుప్పెడు తులసి ఆకులు మెత్తగా నూరి, శరీరానికి రాసుకొని 15 ని||లు అలాగే వుంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే, చర్మ వ్యాధులు అంతరిస్తాయి..

2. * తేనె, గొంఠి, నీరుల్లి పొంగుల రసానికి తగినంతగా తులసిరసం చేర్చి ఒక వద్ద నటి చేసి గజ్జి, తామర వంటి చర్మరోగాలు నశిస్తాయి.

3. * లక్ష్మీ తులసిని సమూలంగా నూరి, వారానికోసారి నలుగుపిండిలో కలిపి నలుగు పెట్టుకొని, అభ్యంగన స్నానం చేస్తే, ఎలాంటి చర్మ రోగం దరిచేరదు.

4. * తులసి వేర్లు ఎండబెట్టి, దంచి, చూర్ణం చేసుకొని దీన్ని ప్రతిరోజూ పిల్లలకు (మూడేళ్లు వచ్చే దాకా) తేనెతో నాకిస్తూఉంటే, అనవసరపు క్రొవ్వు తగ్గి, స్థూలకాయం బెడదను అరికడుతుంది.

మలబద్ధకం :

1. రాత్రి పూట నీళ్లలో తులసి ఆకులు వేసి ఆ నీటిని ఉదయం ముఖం కడుక్కుని వెంటనే తాగితే మలబద్ధకం మటుమాయం.

2. ఒక టీ స్పూన్ తులసి ఆకుల రసంలో, అరస్పూన్ తేనె కలిపి, కొద్దిగా మంచినీరు జోడించి ప్రతిరోజూ ఉదయం తాగితే జీర్ణక్రియ సరిదిద్దడమే కాక, చర్మానికి మంచి మెరుపు కూడా వస్తుంది.

3. * తులసి ఆకులరసం, అల్లపు రసం సమపాళ్లలో కలిపి వేడిచేసి చల్లార్చిన తర్వాత తేనె లో కలిపి – అప్పుడప్పుడు పిల్లలు ఇస్తూ ఉంటే మలబద్దకం నివారించే బడుటయే గాక, ఇతర రోగాలను దరి చేరనీయదు.

 

పిల్లల వ్యాధులు

1. * తులసి ఆకులు 10గ్రా, ఉత్తరేణి ఆకులు 10గ్రా; రెండేసి గ్రాముల చొప్పున వరుసగా అతివస, లవంగాలు, తలాక్షరి; చిన్న ఏలకులు 5 గ్రా……. ఈ ప్రకారము తీసుకొని చూర్ణంవలె నూరి శెనగబద్దంత పరిమాణంలో మాత్రలు

2. కట్టి ఉంచుకోవాలి.. ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఓ మాత్ర చొప్పున వేడినీటితో గాని, పాలతో కాని ఇస్తే…. ఆకు విరేచనాలు, రంగు విరేచనాలు, జ్వరం, పాలు ప్రక్కడం వంటి చిన్న పిల్లల వ్యాధులు నివారించవచ్చు ! (మూలికలు అమ్మా, పచారీ దుకాణాల్లో ఇవన్నీ లభ్యమవుతాయి.)

 జలుబు తులసి కషాయం

చలికాలంలో జలుబూ, దస్తూ అందరినీ వేధించే సమస్య. ఇలాంటప్పుడు వేడి వేడిగా, ఘాటుగా, వగరుగా ఉండే పానీయాలను తాగాలని అనిపిస్తుంటుంది. టీ, కాఫీ లాంటివి తాగిన పెద్దగా ప్రభావం ఉండదు. ఇందుకు చిన్న చిట్కా పాటిస్తే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. పది పదిహేను తులసి ఆకులు, చెంచాడు మిరియాలు తీసుకుని నీళ్ళలో మరగబెట్టాలి. బాగా వేడిగా ఉన్నప్పుడే ఆ కషాయాన్ని తాగెయ్యాలి. జలుబుతో బాధపడుతున్నప్పుడు కాకుండా చలికాలం మొత్తంలో ఈ కషాయం తాగిన మంచిదే.


 (నిజానికి – తులసి వల్ల; మనదేశంలోని లభ్యమయ్యే 7 తులసి రకాల వల్ల ఉపశమించే వ్యాధుల చిట్టా పరిశీలిస్తే – దాదాపు తులసి 500 రకంగా వైద్యం చేయవచ్చునని ఒక పరిశీలన లో తేలింది.)

ఆచార్య సద్భోదన

 *ఆచార్య సద్భోదన*


అంతర్గతమైన జీవనశక్తి అమితమైన దర్శనాన్ని ఆవిష్కరిస్తుంది.


మనలను రక్షించేవాడు మన అంతరంగంలోనే దాగి ఉన్నాడు.


సర్వవ్యాపకుడు బాహ్య ప్రపంచంలో మార్గదర్శనం చేస్తుంటే అంతరంగ రక్షకుడు దానిని గుర్తిస్తూ ఉంటాడు.


ఆ కృపాశీలుని వాక్కులు నిశ్శబ్ధ గీతంగా మన అంతరంగంలో ప్రతిధ్వనిస్తాయి.


ఈ నిశ్శబ్ధ సంగీతాన్ని వినగలిగితే మనం ధన్య జీవులమవుతాం.


జీవితం పరిపూర్ణంగా వికసించేందుకు అనువైన స్థితిగతులు ఏర్పడుతాయి.


అందువల్లనే మౌనాన్ని అభ్యసించడం వలన ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతుంది.


*శుభంభూయాత్*

పాదాల 👣 కెందుకు నమస్కరిస్తాం?*

 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

*పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోనేపుడు పాదాల 👣 కెందుకు నమస్కరిస్తాం?*


అక్షింతలు అంటే మనకందరికీ తెలుసు..


 బియ్యం లో పసుపు కలిపి ఏ పండగ వచ్చినా, ఏదైనా శుభకార్యాలు జరిగినా, దేవాలయాలలోను మన పెద్దలు మనల్ని అశిర్వదించడానికి  మన ఫై అక్షింతలు వేస్తారు. 


అయితే ఈ అక్షింతలు వెయ్యడం లోని పరమార్దం ఏమిటో  తెలుసుకుందాం..


    అక్షింతలు అంటే క్షతం కానివి అని అర్ధం. అంటే రోకలి పోటుకు విరగని వి అని..  శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట.


 అలాంటి బియ్యాన్ని పసుపు మరియు  నెయ్యితో లేక,నూనెతొ కలిపి అక్షింతలు తయారు చేస్తారు.


 నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా పేర్కొంటారు.


 ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి

ప్రీతి కరమైన దానవస్తువు బియ్యం.  చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.


 మనిషి మనసు, బుద్ధి, గుణము, వ్యసనము వీటన్నిటికి చంద్రుడే  కారణమని, మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా  ఉంటుంది అని మన  పెద్దల నమ్మకం.


అందుకే  ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుందని, మనోధర్మాన్ని నియంత్రిస్తాయి అని గట్టిగా విశ్వసిస్తారు..  అందుకే అక్షింతలను తల ఫై వేసి ఆశిర్వదిస్తారు..


     సైంటిఫిక్ గా చెప్పాలంటే బియ్యానికి విద్యుత్ శక్తిని ని గ్రహించే  తత్వం ఉంది.  దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం.

ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి.


 పెద్దలు మన ఫై అక్షింతలు వేసి ఆశీర్వదించే సమయంలో, వారి దేహంలోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి.


ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. అంతే కాదండీ! 


మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు,  విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా.


తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. ఈ కారణంగా అక్షింతుల ద్వార  పెద్దలలో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది.  ఇక పసుపు క్రిమి సంహారకం,

ఆశీస్సులు ఇచ్చే వారికీ ఎటువంటి చర్మ వ్యాదులు లాంటివి ఉన్నా అవి ఆశీస్సులు పుచ్చుకొనేవారికి రాకుండా ఉంటాయి.. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు  శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే! 


ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యమేనట..


    ‘అన్నాద్భవన్తి భూతాని’


అని భగవద్గిత లో మూడవ అధ్యాయంలో చెప్పబడింది. 


జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమే.


పెద్దల దగ్గర ఆశిర్వదం తీసుకోనేపుడు పాదాల కెందుకు నమస్కరిస్తాం?


    పెద్దల దగ్గర మన ఆశిర్వదం తీసుకోనేపుడు వారి పాదాలకు నమస్కారించడం మన సంప్రదాయం. అయితే అలా చెయ్యడం లోని అర్ధం మేమిటో తెలుసుకుందాం..


మన  శరీరం లో తల ఉత్తర దృవం అయితే పాదాలు దక్షిణ దృవం.. వ్యతిరేక దృవాలే  ఆకర్షించుకుంటాయి.. అప్పుడే గా శక్తి విడుదల అవుతుంది. అలానే మనం పెద్దల దగ్గర ఆశిర్వాదం తీసుకోనేపుడు మన తలను వారి పాదాలకు తాకించి ఆశిర్వాదం తీసుకుంటాం. అప్పుడు వారి పాదాలలోని దక్షిణ దృవం మన తల లో గల ఉత్తర దృవం తో ఆకర్షితంమై శక్తిని వెలువరుస్తుంది.. అందుకే మన హిందు సంప్రదాయం లో పెద్దల కాళ్ళకు నమస్కరిస్తాం.

🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

శివనామ స్మరణం

 🕉️🕉️🕉️🕉️🕉️

ప్రదోషవేళ శివనామ స్మరణం అత్యంత పుణ్యఫలితాలను ఇస్తుంది.

🕉️🕉️🕉️🕉️🕉️

మహా శివుని యొక్క అష్టమూర్తి నామాలు.


1. ఓం భవాయ దేవాయ నమః 

2. ఓం శర్వాయ దేవాయ నమః

3. ఓం ఈశానాయ దేవాయ నమః

4. ఓం పశుపతయే దేవాయ నమః 

5. ఓం  రుద్రాయ దేవాయ నమః

6. ఓం ఉగ్రాయ దేవాయ నమః

7. ఓం భీమాయ దేవాయ నమః

 8. ఓం మహా తే దేవాయ నమః.


సహస్ర నామాలతో ను అష్టోత్తర శత నామాలతో ను పూజ చేయలేని వారు కనీసం ఈ ఎనిమిది నామాలతో నైనా మహా దేవుని పూజించవచ్చు.


ప్రతిరోజు ప్రదోష వేళలో ఈ నామస్మరణ సర్వ శుభప్రదము.

🕉️🕉️🕉️🕉️🕉️

అరుణాచల శివ శివ అరుణాచల శివ అరుణాచల.

🕉️🕉️🕉️🕉️🕉️

అంతటా ఆనందమే.

 అంతటా ఆనందమే. 

మనిషిలో నిజమైన ప్రతిభ ఉన్నప్పుడు ఎవరైనా గుర్తిస్తారు. అసూయా ద్వేషాలు దాడి చేసినప్పుడు మాత్రం మానవుడు తోటి మనిషిలోని ప్రతిభను అంగీకరించడు. అతడి మనసు గుర్తించకపోయినా అంతరాత్మ తప్పక గుర్తిస్తుంది. ఆత్మపరంగా ప్రతిభకు ద్వేషం అంటదన్నది గీతామృత సారం.

మనిషి మనసును రంజింపజేయడానికి భగవంతుడు లలిత కళల్ని సృజించాడు. శిశువులు, పశువులు సైతం మధుర గానానికి పరవశమవుతాయని ప్రతీతి.

అన్ని దానాలూ యశస్సుతో పాటు అపార పుణ్య ఫలాన్ని ఆర్జించి పెడతాయి. ఏ దానానికీ లేని ప్రాశస్త్యం అన్నదానానికి ఉంది. ఆకలి తీరగానే మనిషి పూర్ణ తృప్తిని పొందుతాడు. ఇంకా తినాలని ఆశించడు. దాతకు యశస్సు అందివస్తుంది.

కళలు అన్నీ గొప్పవే. ఉత్కృష్టమైనవే. ప్రతి కళా సాధించిన తరవాత కళాకారుడి ద్వారా వ్యక్తమైనప్పుడు వీక్షకుడిలో ఆనందంతో కూడిన ఆశ్చర్యాతిరేకాలకు వేదిక అవుతుంది. సుస్వరమైన సంగీత శ్రవణం వల్ల శ్రోత ఆత్మానందాన్ని అనుభవిస్తాడు. మంచి సంగీతం విన్న శ్రోత ఆనందం స్థాయిని కొలవలేం. అలాగే ఆకలి తీరిన అన్నగతప్రాణి తృప్తికి సైతం కొలమానం ఉండదు.

హాయిగా ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తున్న దృష్టికి సైతం స్థాయిని నిర్ధారించే ప్రాతిపదిక ఉండదు. అందుకే భగవంతుడి సృష్టి అమోఘమైనదంటారు పండితులు.

కష్టంతో కూడిన కార్యాలు ఫలించిన పిదప అందివచ్చే ఆనందం విలువ వెలకట్టలేనిది. ఓ విద్యార్థి, కార్మికుడు, కర్షకుడూ అటువంటి ఆనందాన్నే పొందుతారు. ఇంద్రియాలతో మనిషి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇంద్రియాలకు అధిపతి శ్రీమన్నారాయణుడు. ఆయన కరుణ లేకుండా మనిషికి ఇంద్రియానందం దక్కదు. పూర్ణ జ్ఞానికి ఇంద్రియ స్పృహ ఉండదు కదా... అలాంటి వారు ఆనందాన్ని ఎలా అనుభవించగలరు? దుఃఖ భావన లేని యోగులు, రుషులకు మిగిలేది ఆనందమే కదా!

సృష్టిలో ప్రతి వస్తువుకూ ప్రత్యామ్నాయం ఉంటుంది. మనిషికి ప్రత్యామ్నాయం ఉండదు. అందుకే ఎలాంటివారైనా తోటివారికి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. అప్పుడు అందరూ సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. జాతిపిత మహాత్మా గాంధీ ప్రవచించిన మంచినే పలకడం, వినడం, చూడటం వల్ల ఎవరికీ ఖేదం కలగదు.

వస్తువులను ఎంచుకొనే సౌలభ్యం ఉన్నట్లు విషయాలనూ మనిషి ఎంచుకోవచ్చు. వివేకవంతుడి ఎంపిక మంచి ఫలితాలనిస్తుంది. పరిస్థితుల ప్రాబల్యంవల్ల, లేదా మేధాపరిణతి లోపంవల్ల విషయ అవగాహన చేయలేని వ్యక్తులకు మోదం దుర్లభమే. జీవితానుభవాలను ఉపయోగించి సాధకుడు ఆనందసాధన చేయవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనలో గురుశిష్య సంబంధాలు మర్కట, మార్జాల కిశోర న్యాయాలుగా భాసిస్తాయంటారు పెద్దలు. కోతి పిల్ల తల్లిని అంటిపెట్టుకుని ఉండగా, పిల్లిపిల్ల తల్లి సంరక్షణలో జీవిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో శిష్యుడు, గురువును సంపూర్ణంగా నమ్మక ముందు మర్కట(కోతి) కిశోర న్యాయంగానూ, నమ్మిన తరవాత మార్జాల(పిల్లి) కిశోర న్యాయంగానూ అలరారుతాయి. అంటే, సంపూర్ణ శరణాగతి పొందిన భక్తుడి యోగక్షేమాలు భగవంతుడే చూసు కుంటాడు. కష్టాలు ముంచుకు వచ్చినా భగవంతుడిపై భారం వేసి తనకు కాదు అన్నట్లు జీవించగల కర్తవ్య పరాయణత్వం ఉంటే సుఖసంతోషాలకు లోటుండదు. సాధనలో ఆ మెట్టుదాకా ఎదిగిన తరవాత సాధకుడిని ఏ కష్టాలూ బాధించవు. మిగిలేది అంతటా ఆనందమే!

చెప్పండి ప్లీస్

 💥చెప్పండి ప్లీస్💥


❤️మనకు ఒక శరీరం ఉంది, 

అంతరంగం ఉంది, 

సరే మనమేటు ఆత్మ స్వరూపులం. 

మరి

మనతో కర్మ చేయించేది,

శరీరమా,

అంతరంగమా

ఆత్మా

ఏది.


శరీరం ఏమో సప్తదాతువులతో, 

తల్లిదండ్రులు వలన, 

వారు తిన్న అన్న రసం వల్ల ఏర్పడింది. 


ఇది పంచ కర్మెన్ద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు తో ఏర్పడింది. 

ఈ ఇంద్రియాలు స్వయంగా జడము. 

(ఏవరైనా వ్యక్తి  మరణించినప్పుడు ఆ వ్యక్తి శవం చూస్తే అర్థం అవుతుంది మనకి ఈ విషయము). 


ఆత్మ ఏమో శక్తి స్వరూపం, 

ఎదో ఒక దానితో అది ప్రకటితం అవుతుంది. 

దాన్నే ఉపాది అంటారు. 


ఉదాహరణకి విద్యుత్చ్ఛక్తి (electricity) ఉంది కదా,  అది మన ఇంట్లో వైర్లలలో, 

బయట transformerలో, 

కరెంట్ తీగలతో, 

ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ లలో ఉంటుంది. 


కానీ అది వ్యక్తం కావాలి అంటే,  

మన ఇంట్లో ఒక బుల్బ్ లేక, 

ఒక ఫ్యాన్ అన్నా ఉండాలి.  

వాటి ద్వారా మాత్రమే విద్యుత్చ్ఛక్తి వ్యక్తము అవుతుంది. 


అలానే ఆత్మ విద్యుత్చ్ఛక్తి లాంటిది, 

అది వ్యక్తము కావాలంటే,  

దేహేంద్రియా మనో బుద్ధులు కావాలి.


ఇక అంతరంగం అన్నది మనో బుద్ది, చిత్త అహంకారములతో ఉంటుంది.


ఇప్పుడు చెప్పండి.


మనతో కర్మలు చేయించేది ఏది శరీరమా, అంతరంగమా, లేక ఆత్మనా


మనని ఉద్ధరించేది ఏది శరీరమా, అంతరంగమా, లేక ఆత్మనా


మనకి నిజమైన మిత్రుడు కానీ శత్రువుకాని ఎవ్వరు?


ఈ ప్రపంచంలోని ప్రాణి కొటినా లేక,  

మన శరీరమా లేక,  

అంతరంగమా లేక 

ఆత్మనా, 

లేదు వేరెవరు కారు 

పరమాత్మ అంటారా?

చెప్పండి


ఈ ప్రశ్నలకి సమాధానము చెప్పండి


ఒక వేళ మీ సమాధానము శరీరము అయితే,  ఎందుకు ఎలా చెప్పండి

కాదు ఆత్మ అయితే అయితే ఎందుకు ఎలా చెప్పేండి,

కాదు అంతరంగం అంటారా అప్పుడు కూడా అయితే ఎందుకు ఎలా చెప్పేండి,

ఇవేవీ కావు, నాకేమి తెలియదు అంటారా, కనీసం ఆదైనా చెప్పండి.


💥❤️💥❤️💥❤️💥

కాశ్యాంతు మరణాన్ముక్తిః"

 "కాశ్యాంతు మరణాన్ముక్తిః"

శ్రీ రామకృష్ణ పరమహంస గారి అద్భుత దివ్య దర్శనాలలో ఇది ఓకటి....

కాశీ క్షేత్రములో మరణము, ముక్తి అనే నానుడికి బలము చేకూర్చే సంఘటన ఇది.

ఒక సమయములో రాణిరాసమణి తన పరివారము, అల్లుడు మథుర్, కొంతమంది పండితులు, రామకృష్ణుల వారితో కలసి కాశీ నగర సందర్శనకు నౌకల్లొ బయలుదేరారు.అలా కాశీలో వున్న రోజులలొ ఓకనాడు మధుర్,ఇంకొంతమంది పండాలతో కలసి గంగానదిపై విహారము చేస్తున్నారు.ఆ పడవ మణికర్ణికా ఘాట్ సమిపించగా,అక్కడి స్మశానములో జరుగుచున్న శవదహనాన్ని చూసి,అకస్మాత్తుగా ఆనందపరవశులై వడిగా పడవ అంచుకు వెళ్ళి సమాధిమగ్నులై నిలబడిపొయారు. (ఆ పరిస్థితులలొ సాధారణముగా దేహస్మృతి వుండదు అందువలన ఆయిన ఎక్కడ నదిలో పడిపొతారోఅని కొందరు రివ్వున ముందుకు వెళ్ళారు. కాని ఆయిన దివ్యదరహాసాలతో నిశ్చలముగా అక్కడ నిలబడి ఉండగా ఎవ్వరు కాపాడవలసిన అవసరము లేకుండా పొయింది). కొంత సేపటికి వారే ఈ అనుభూతిగూర్చి వివరించారు."పొడవరి పింగళవర్ణ జటాధారీ,శ్వేతవర్ణ పురుషుడు ఐన ఓక పురుషుడు మెల్లగా ఆడుగులు వేస్తూ ప్రతి చితి వద్దకు వెళ్ళి, నెమ్మదిగా అందలి జీవుని పైకెత్తి,చెవిలో తారకబ్రహ్మమంత్రము ఉపదేశించడము చూశాను! సర్వశక్తిమయి అయిన జగదాంబ - కాష్ఠానికి ఆవలి వైపు కూర్చుని,ఆ జీవుడి స్థూలసూక్ష్మ కారాణాది బంధాల నన్నిటిని విడదిసి,స్వయముగా మోక్ష ద్వారము తెరచి,కైవల్య ధామానికి పంపుతున్నది. ఎన్నో యుగాల తపొనిష్ఠలచే మాత్రమే పొందగ్గ అద్వైతానుభవాన్ని భూమానందాని శ్రీ విశ్వనాధుడు క్షణములో ఆ జీవులకు యీ రీతిన ప్రపాదించి వారిని కృతార్థులను చేస్తున్నాడు

శ్రీ మహాకాలభైరవుని దర్శనం

 కాశీ క్షేత్ర పాలకుడైన శ్రీ మహాకాలభైరవుని దర్శనం

#అందరూ_దర్శించేందుకు_దయచేసి_షేర్_చేయండి

#సంభవామి_యుగే_యుగే


మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. " సంభవామి యుగే యుగే " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.


కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని 8 రకాలు. వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు ”ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే, తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌” అని ప్రార్థిస్తారు. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగాఉంటాడు. నేపాల్‌ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.

గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.

కాలభైరవుని ‘క్షేత్రపాలక’ అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు. మన దేశంలో కాలభైరవుని దేవాలయాలు చాలానే ఉన్నాయి. మన రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడు దర్శనమిస్తారు. విశాఖపట్నంలో భైరవకోన ఎంతో ప్రముఖమైంది. కాగా నిజామాబాద్‌లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది.

న్యూఢిల్లిద్ పురానా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైంది. పాండవ సోదరుల రాజధాని ఇంద్ర ప్రస్త నగరంలో ప్రశస్తమైన కాలభైరవ ఆలయం ఉంది. తమిళనాడు, అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవుడున్నాడు. అలాగే కరైకుడి, చోళపురం, అధియమాన్‌ కొట్టయ్‌, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది. కర్ణాటకలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.

భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని, నిరంతరం ఆపదలనుండి కాపాడాలని భక్తిప్రపత్తులతో కాలభైరవుని పూజిస్తుంటారు.


#అందరూ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి

#సంభవామి_యుగే_యుగే


‘‘కాలభైరవా నమోస్తుతే –  కాశీ విశ్వేశ్వరా నమోస్తుతే”


ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా తెలుస్తోంది.


కాలభైరవ ఆవిర్భావం

ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు ‘నేను సృష్టికర్తను… పరబ్రహ్మ స్వరూపుడను… నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి’ అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు.


దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుని తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో, మూడు నేత్రాలతో, త్రిశూలము, గద, డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీకాలభైరవుడు.


హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుని కోరాడు. శివుని ఆజ్ఞమేరకు కారభైరవుడు బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు.


‘నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి..’ అని శివుడు సలహా ఇచ్చాడు.


కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు


కాలభైరవుడు బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థించుతాడు.


అందుకు ‘‘కాలభైరవా! నీవు శివుని పుత్రుడివి. కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించిన వాడవు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీ క్షేత్రానికి వెళ్లు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యాపాతకం భస్మమై పోతుంది ’అని సలహా మహావిష్ణువు ఇచ్చాడు.


దీనితో కాలభైరవుడు కాశీచేరుకున్నాడు. ఆయనబ్రహ్మహత్యాదోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశిలో పూడ్చి పెట్డాడు. బ్రహ్మ కపాలం పూడ్చి పెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని ‘కపాల మోక్ష తీర్థం’


తర్వాత కాలభైరవుని చూసి శివుడు ‘కాలభైరవా! నీవు ఇక్కడే కొలుదీరి క్షేత్రపాలకుడుగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి. నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి.’ శివుడు పలికాడు. దీనితో  కాలభైరవుడు కాశీక్షేత్రంలో కొలువు దీరి క్షేత్రపాలకునిగా పూజలందుకొంటున్నాడు.


#అందరూ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి

#సంభవామి_యుగే_యుగే


కాలభైరవ ఆరాధన

కాశీక్షేత్రాన్ని దర్శించినవారు శ్రీకాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీనుంచి వచ్చిన వారు కాశీసమారాధన చేయడం ఆచారం అయింది.


కాశీక్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతోపాటు మినప వడలతో మాలను తయారు చేసి పూజానంతరం ఒక శునకమును కాలభైరవస్వామిగా భావించి  పసుపుకుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు.


ఈ ఏడాది డిసెంబరు 15వ తేదీన కాలభైరవాష్టమి నాడు శ్రీకాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోను, అష్టోత్తరాలతోను శ్రీకాలభైరవ స్వామిని పూజిస్తారు. మినపవడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకపూట ఉపవాసం చేస్తారు. భైరవుని రూపాలు :…


భైరవుని రూపాలు :…

కాల భైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రుద్ర భైరవ, ఉన్మత్త భైరవ

ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహా భైరవ, చండ భైరవ అనే రూపాలు కుడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం…. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.


#అందరూ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి

#సంభవామి_యుగే_యుగే


కాలభైరవాష్టకం పఠించడం పుణ్యప్రదం

జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ ‘కాలభైరవాష్టకం’ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇలా కారభైరవాష్టమి నాడు శ్రీకాలభైరవ స్వామిని స్మరించడం, పూజించడం వల్ల సకల పుణ్యఫలాలు కలుగుతాయి. శ్రీకాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్నభయాలు దూరమవుతాయి. గ్రహదోషాలు తొలగిపోతాయి.


కాలభైరవాష్టకం:


దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |

నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |

కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||

శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |

నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |

స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |

మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |

అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |

శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||


#అందరూ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి

#సంభవామి_యుగే_యుగే


కాల భైరవుడు అనగానే చాలామంది కుక్క అని తేలిగ్గా అనేస్తారు. కాని ఆయనకు చాలా విసిస్త్థత ఉంది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు.గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపసానతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నయి.కాల భైరవుడిని కాశి క్షేత్ర పాలకుడిగా కీర్తించారు.ఏది సాదించాలన్నా ముందుగా అయన అనుమతి తీసుకోవాలని "కాశి క్షేత్ర మహిమ చెబుతుంది.సాక్షాత్తు శివుడే కాల భైరవుడే సంచారించాడని శాస్త్రాలు చెబుతున్నాయి.హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని,అతింద్రమైన శక్తులని అయన ప్రసాదిస్తారు.దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు.కొబ్బరి బెల్లం నైవేద్ద్యం పెడతారు.ఈశ్వరుడు ఆయుషును ప్రసాదిస్తాడు.ఆయనకు పరమ విధీయుడైన కాల భైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.


#అందరూ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి

#సంభవామి_యుగే_యుగే


శ్రీ కాలభైరవస్వామి ప్రధాన క్షేత్రాలు..


1. వారణాసి (ఉత్తరప్రదేశ్) :


కాలభైరవునికి బ్రహ్మ హత్యాపాతకం తొలగించిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందినది.. అందుచే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడు..


2. ఉజ్జయిని (మధ్యప్రదేశ్ లో ఇండోర్) :


గర్బాలయంలోని శ్రీకాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది.. స్వామి విగ్రహం అల్కాహాల్ ను సేవించుట సైన్సుకు కూడా అంతుబట్టని విచిత్రము..


3. దంతేవాడ (చత్తిస్ ఘడ్ లో జగదల్ పూర్) :


ప్రాచీనాలయం ధ్వంసం కాగా భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్ధాలు అర్చించబడినాయి.. ప్రస్తుతం కన్పించే భైరవమందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలు, పై కప్పుగా పెంకులతో కన్పిస్తుంది..


ఈ మందిరంలో నాలుగు భైరవమూర్తులు దర్శినమిస్తాయి..


1. వనభైరవుడు

2. జటాభైరవుడు

3. గధాభైరవుడు

4. తాండవభైరవుడు.


4. తేజ్ పూర్ (అస్సాం లో గౌహతి) :


ఇచ్చటి ప్రాచీనాలయంలోని స్వామి పేరు 'మహాభైరవుడు' లింగరూపంలో పూజలందుకుంటాడు. సుమారు 5,500 సం.ల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి, పూజించినట్లు స్థలపురాణం.


నాగులు ఈ లింగాన్ని పూజించేవి అనుటకి నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో సర్పస్తంభాలు, ఆలయం ముందు ప్రవేశద్వారంపై భాగంలో సర్ప ప్రతిమలు కనిపిస్తాయి..


5. ఇసన్నపల్లి / రామారెడ్డి (తెలంగాణ లో కామారెడ్డి జిల్లా) :


సుమారు 11 వ శతాబ్దం లో స్వామి వారి ఆలయం నిర్మించబడింది..


దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవక్షేత్రంగా, గ్రహాపీడలను తొలగించే క్షేత్రంగా ఇది చెందినది.


ప్రధాన గర్బాలయంలో 7 అడుగుల ఎత్తుతో ఉన్న కాలభైరవస్వామి వారి విగ్రహం నిల్చోని దిగంబరంగా దర్శనమిస్తుంది..


6. రామగిరి (ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లా) :


ఇచ్చట 9వ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ కాలభైరవాలయం, శ్రీ వాలేశ్వర స్వామి వారి ఆలయం ప్రక్కప్రక్కనే ఒకే ప్రాకారంలో అమరియున్నవి.  ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది..


7. భైరవసెల (శ్రీశైల క్షేత్రం దగ్గర) :


ఎచ్చటా కానరాని సహజ సిదమైన 7 జలపాతాలతో, లోయలు, కొండలతో ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే ఈ క్షేత్రంలో ఒకేసారి పాతికమంది కూర్చోవడానికి వీలున్నట్లు భైరవగుహ, ఆ గుహలో శివస్వరూపుడైన భైరవుడు.. ఒక శివలింగం.. స్థానిక చెంచుల దేవుడైన నిరాకార 'బయన్న' దర్శనమిచ్చును..


8. అడవివరం (ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం) :


ప్రకృతి సౌందర్యం మధ్యలో ఆలయం, గోడలు ఏమిలేకుండా పైకి మెట్లు నఇర్మించబడి, చుట్టూ మండపంతో ఓపేన్ ఎయిర్ లో భైరవుడు దర్శనమిస్తాడు..


9. ఖాట్మండు (నేపాల్) :


నేపాల్ దేశ రాజధానిగా ఈ క్షేత్రం ఉన్నది.. నేపాలీయులందరూ కాలభైరవుని ఎక్కువగా ఆరాధిస్తారు..


అందుకే ఇచ్చట అనేక దేవీ దేవతల విగ్రహాలతో పాటు ప్రతిష్ఠించబడిన శ్రీకాలభైరవస్వామికి విశేషంగా పూజలు జరుగుతుంటాయి.. ఇక్కడ స్వామి చిత్రవిచిత్రంగా ఆలంకారాలు చేస్తారు..


10. భైరవకొండ (ఆంధ్రప్రదేశ్ లో బంగోలు జిల్లా) :


ఇక్కడ త్రిముఖదుర్గ అమ్మవారు కొలువైఉంటారు.. అమ్మవారి శిరస్సు మాత్రమే ఉంటుంది.. కార్తికపూర్ణిమ నాటిరాత్రి 7 - 8 గం.ల మధ్య దేవీ ఏదురుగా ఉన్న జలాశయంలో చంద్రకిరణాలు ప్రసరించబడి అమ్మవారి ముఖం మీదికి పరావర్తనం చెందుట అపూర్వం.. క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామి గుహాలయం శివాలయాలకు ఎదురుగా నిర్మించబడినది.


11. తిరువైసనల్లూరు (తమిళనాడు లో కుంబకోణం) :


ఇచ్చటి శివయోగినాథాలయంలోని గర్బగుడిలో యోగ భైరవుడు, జ్ఞాన భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు అను నాలుగు విగ్రహాలను ఒకేసారి దర్శించడానికి వీ‌లుగా ఉన్నవి.


12. న్యూడిల్లి :


ఈ క్షేత్రంలో పురాణాఖిల్లాకు దగ్గరగా అతిప్రాచీనమైన కాలభైరవస్వామి ఆలయం ఉన్నది. మహాభారత కాలంలో పాండవులు ఈ స్వామిని ఆరాధించినట్లు స్థల పురాణం.


13. ధున్నాస్ (ఉత్తరప్రదేశ్) :


ఇచట ధర్మశాలతో పాటుగా శ్రీకాలభైరవస్వామి ఆలయం ఉన్నది. ఇచట నుండి కొంచం దూరం ముందుకు వెల్తే ప్రధాన పీఠ రహదారిలో కాళీమాత మందిరాన్ని దర్శించవచ్చు..


14. మున్నంగి (ఆంధ్రప్రదేశ్ లో గుంటూర్ జిల్లాలో)  :


స్వయంభువులు గా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు..


15. భైరవపాడు (ఆంధ్రప్రదేశ్ లో గుంటూర్ జిల్లా) :


స్వయంభువులు గా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు..


16. అధియమాన్ కొట్టాయ్ (కర్నాటక లోని ధర్మపురి జిల్లా) :


9వ శతాబ్దంలో అధియమాన్ అను చక్రవర్తిచే ఇచ్చట కాలభైరవాలయం నిర్మింపబడినది.


17. కచ్ఛాద్రి (కర్నాటక లోని కొల్లూర్ దగ్గర) :


ఇచ్చట గల కొండపై గల ఆలయంలో శ్రీకాలభైరవస్వామి తో పాటుగా ఉమాదేవిగా పిలువబడు అమ్మవారు దర్శనమిస్తారు.


#అందరూ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి

#సంభవామి_యుగే_యుగే


అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం. https://www.facebook.com/sambhavami2498/


అందరం భక్తితో " ఓం శ్రీ కాలభైరవాయ నమః  " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు


ఓం శ్రీ కాలభైరవాయ నమః

🕉️🕉️🕉️🕉️🕉️

ఆచార్య సద్భావన*

 *ఆచార్య సద్భావన*


మనం అంతర్ముఖులమయ్యేకొలదీ బాహ్య సంఘటనల ప్రభావం మన ఎడల అంతకంతకూ తగ్గుతూ వస్తుంది.


బాహ్యంలో జీవించే వ్యక్తి అన్ని విషయాలను గమనిస్తాడు. అన్ని విషయాలు అతని గమనింపుకు వస్తాయి. అతడు గోరంత దాన్ని కొండంతగా చూస్తాడు.


ఒక వ్యక్తి చూపులుగాని, చర్యలుగాని దుష్ఠభావాంతో ఉన్నట్టుగా అతడు ఊహించుకుంటాడు.


దుష్టత్వాన్ని భూతద్దంలో చూస్తే అది చివరకు మనకు భరించలేని భారమయ్యేంతగా తయారయి ఆఖరికి మనం అరణ్యానికి పోయినా శాంతిని దక్కనివ్వదు.


అందు వలన ఈ చింతనను జయించాలి. అంతర్కుఖుడై జీవించే వ్యక్తి ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉండడు.


అంతరంగంతో సంబంధం ఏర్పరచుకోవటం తెలిసినవాడు కోల్పోయేదీ ఏదీ ఉండదు.


*శుభంభూయాత్*

తాపత్రయం

 తాపత్రయం:-


తాపం అంటే దుఃఖం, త్రయం అంటే మూడు. త్రి విధ దుఃఖాలే తాపత్రయం, తాపాలు మూడు రకాలు.


1) ఆధ్యాత్మిక తాపం:

    మనలోని కామ, క్రోధ, లోభ, మద, మోహ,మాత్సర్యాలనే అరిషడ్వర్గాల వలన కలిగే బాధలనే 'ఆధ్యాత్మిక' తాపాలంటాం. 

ప్రతి మనిషికి ఉండే బాధల మొత్తంలో 90% ఈ విధంగా ఎవరికి వారు కల్పించుకుంటున్న బాధలే.


2) ఆది భౌతిక తాపం:

     ఇతర ప్రాణికోటి వలన కలిగే తాపాలని 'ఆది భౌతిక తాపా'లంటారు.  ఇతరుల అజ్ఞాన, అక్రమ చర్యల వలన మనకు కలిగే బాధలు అన్నమాట.

 ప్రతి మనిషికి 9% బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.


3) ఆది దైవిక తాపం:

     ప్రకృతి సహజమైన మార్పుల వలన కలిగే తాపాలని 'ఆది దైవిక తాపాలు' అంటాం.

ఉదాహరణకు :  అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు మొదలైనవి.  1% బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.


తాపత్రయాలు లేని స్థితే ముక్త స్థితి.  

ఆత్మ జ్ఞానం వల్లనే ముక్తి సంప్రాప్తిస్తుంది.

ఆరోగ్యం, ఆహారంపై గ్రహాల ప్రభావం

 ఆరోగ్యం, ఆహారంపై గ్రహాల ప్రభావం


   మానవులపై గ్రహాల ప్రభావం ఉంటుందని మనం తెలుసుకున్నాం. అయితే గ్రహాల ద్వారా మన నిత్య జీవనం ఆధారపడి ఉంటుంది. వారం రోజులకు రోజుకో గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. ఆదివారం–సూర్యుడు, సోమవారం–చంద్రుడు, మంగళవారం–కుజుడు, బుధవారం–బుధుడు, గురువారం-బృహస్పతి శుక్రవారం–శుక్రుడు, శనివారం–శని.. ఈ విధంగా వుంటుంది. ప్రతి రోజూ ఆ గ్రహ ప్రభావం ఉంటుంది.


ఆహారం

ఈ నేపథ్యంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రోజున ఏ రకమైన ఆహారం తినాలి అనేది ముఖ్యం. మొక్కలు, పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతాయి. ఆదివారం మన ఆహారంపై సూర్యుడి ప్రభావం వుంటుంది. కనుక మనం ఏ రకమైన ఆహారం తిన్నప్పటికి తేలికగా జీర్ణం అయి శరీరం పీల్చేస్తుంది. సోమవారం చంద్రుడి ప్రభావం వుంటుంది. కనుక చంద్రుడు నీటి సంబంధమైన గ్రహం. కనుక నీరు అధికంగా కలిగి ఉండే.. గుమ్మడి, దోస, పుచ్చ పండు వంటివి తింటే బాగా జీర్ణం అయిపోతాయి. మంగళవారం కుజుడి ప్రభావం వుంటుంది. కుజుడు వేడి గ్రహం. కనుక వేడిపుట్టించే మామిడి పండు, పైన్ ఆపిల్, ఉల్లిపాయ, మిరియం, వెల్లుల్లి, మొదలైనవి బాగా పీల్చబడి త్వరగా జీర్ణం అవుతాయి.


బుధవారం బుధుడి ప్రభావం వుంటుంది. ఈ గ్రహం రెండు రకాలు కనుక ఏ ఆహారం ఈ రోజు తీసుకున్నా పరవాలేదు. గురువారం, గురుగ్రహ ప్రభావం వుంటుంది. పసుపు లేదా ఆరెంజ్ రంగు ఆహార పదార్థాలు (ఉదా.. ఆరెంజ్, నిమ్మ, అరటిపండు, మొదలైనవి..) తినండి. శుక్రవారం శుక్రుడి ప్రభావం వుంటుంది. శుక్రుడు ప్రేమ వ్యవహారాలకు, సంబంధించిన ఆహారాలు, బాదం, పిస్తా, బాదంపప్పు, జింక్ అధికంగా వుండే ఆహారాలైన డార్క్ చాక్లెట్, వేయించిన గుమ్మడి గింజలు, వంటివి తినడం మంచిది. శనివారం శని ప్రభావం వుంటుంది. శని నూనెలపై ఆధిపత్యం కలిగి వుంటాడు. కనుక నూనె ఆహారాలు, జంక్ ఫుడ్ శనివారం బాగా జీర్ణం అవుతుంది.


మన భుజించే ఆహారం భూమి ద్వారా వస్తుంది. భూమిలో అన్నిరకాల ఎనర్జీలు వుంటాయి. మనం తినే ఆహారం భూమి నుంచి నెగెటివ్, పాజిటివ్ శక్తులు కలిగి వుంటుంది. మనం సంతోషంగా వుంటే, సరైన ఆహారం తింటాం. మన దుఖం లేదా విచారంతో వుంటే మనం తినే ఆహారాలు మారుస్తూ సంతోషం కొరకు ప్రయత్నిస్తాం. జీర్ణక్రియ సమస్యలు తరచుగా వస్తూ వుంటే.. మీ జాతకంలోని బలహీన గ్రహాలను బలం చేసేందుకు ప్రయత్నించాలి. మీ జీవన నాణ్యతను మెరుగుపరచుకుంటూ వేగంగా జీర్ణం కలిగించుకోవాలి కనుక మీ బలహీన గ్రహాలేవో తెలుసుకోండి. బలహీన గ్రహాలను ఎలా బలపరచాలి? వైద్య సలహాలకు జ్యోతిషం, గ్రహాలు ప్రత్యామ్నాయాలు కావు, కాని, అది మీకు ఆరోగ్య అంశాలలో ఎన్నో వివరాలను అది అందిస్తుంది.


ఆరోగ్యం

గ్రహాల దుష్ట కిరణాల ప్రభావం వల్ల మానవుడిలో ఏర్పడే శారీరక, మానసిక రుగ్మతలకు కారణమవుతాయి. గ్రహాల మంచి కిరణాల ద్వారా వృద్ధి చెందిన వృక్ష జాతులు ఔషధాలవుతాయి అనేది జ్యోతిర్వైద్య సిద్ధాంతం.


చంద్రుడు

కాల్షియంకు ముత్యపు చిప్పలకు, ముత్యాలకు, మంచి గంధానికి, లవణానికి అధిపతి చంద్రుడు. మనస్సుకు చంద్రుడు ఆది దేవత. రక్తంలోని తెల్ల రక్తకణాలకు చంద్రుడే అధిపతి. శరీరంలోని కాల్షియం తగ్గినప్పుడు ముత్యపు భస్మం ముందుగా తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. పూర్వపు రాజులు ముత్యపు సున్నం తాంబూలంలో వాడుకున్నారు. శరీరంలోని రక్తవేగం పెంచడానికి లవణం ఉపయోగపడుతుంది. ప్రేమ, కోపం, ఉద్వేగం బొమ్మా బొరుసులు. ఆ ఉద్వేగాన్ని పెంచే లక్షణం లవణంలో ఉంది. ఆ ప్రేమకు కూడా చంద్రుడే అధిపతి. అదే లవణాన్ని సూక్ష్మీకరించి (నేట్రంమూర్‌) ముం దుగా వాడితే ఉద్వేగాన్ని రక్తపోటును తగ్గిస్తుంది. మంచి గంథం రాసుకుంటే చల్లదనం ఇస్తుంది. వెన్నెల ఆ లక్షణం కలదే. ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతిని పొందుతుందని శాస్త్రం చెబుతోంది.


కుజుడు

ఎర్ర రక్త కణాలకు, రక్త చందనానికి, ఎముకలలోని మజ్జకు, తుప్పుగల ఇనుముకు, వ్రణాలకు, దెబ్బ సెప్టిక్‌ అవ్వడానికి, బెల్లంలోని ఐరన్‌కు అధిపతి కుజుడే. కుజగోళం ఆకాశంలో ఎర్రగా కనుపిస్తుంది. ఆ ఎరుపుకు కారణం ఆ గోళం మీద తుపపు పై సూర్యకాంతి పడటమే. శరీరంలో ఐరన్‌ అధికంగా ఉంటే దెబ్బలు తొందరగా తగ్గుతాయి. అవి లోపించిన దెబ్బపై తుప్పు ఇనుము తగిలినా సెప్టిక్‌ అవుతుంది. బెల్లాన్ని శరీరంలో ఇముడ్చుకునే శక్తి లోపించినపపుడు ఆ బెల్లమే వ్రణాలను తగ్గకుండా చేస్తుంది. ఎములలోని మజ్జలో పగడం కలిసిపోతుందని ఫ్రాన్స్‌ శాస్త్రవెత్తల అభిప్రాయం. పగడం కుజగ్రహానికి చెందిన రత్నం. కుజుడు శరీర పుష్టికి ప్రాధాన్యం ఇచ్చే గ్రహం. కుజుడికి ధాన్యమైన కంది పప్పు శరీర పుష్టినిస్తోంది. కందుల రంగు ఎరుపే. ఆ ఎముకలలోని లోపాలను పగడం ద్వారా పూరించడం ఫ్రాన్స్‌ శాస్తవెత్తల కృషి ఫలితం.


బుధుడు

బుధుడు నరాలకు సంబంధించిన గ్రహం. అతని రాశులు మిథున, కన్యలు. ధాన్యం పెస లు. కన్యారాశి ఉత్పత్తికి, అమ్మకానికి సంకేతం. బుధుడు వ్యాపారస్థుడు. అతని రంగు ఆకుపచ్చ. ఆ రంగు ఉత్పత్తికి సంకేతమని ఆధునిక వైజ్ఞానికుల అభిప్రా యం. పెసల రంగూ ఆకుపచ్చేనని, అవి నరాల నిస్సత్తువను తొలగిస్తాయని ఆహార వైద్యుల అభిభాషణం. బుధుడు సమయస్ఫూర్తికి అధిపతి. అది లోపించడం బుద్ధి మాంద్యం. పెసలలోనూ బుధునికి చెందిన వసలోను ఆ బుద్ధి మాంద్యాన్ని తగ్గించే లక్షణం ఉంది.


గురుడు

గురుడు పసుపుకు, పంచదారకు, షుగర్‌ వ్యాధికి, శనగలకు సంబంధించిన గ్రహం. పంచదారను జీర్ణించుకుంటే షుగర్‌ వ్యాధి రాదు. అది జీర్ణించుకోలేనప్పుడు ఏర్పడే పుళ్ళకు వేప, పసుపు మందులైతే పంచదార, శనగలు పుళ్ళు తగ్గకుండా చేస్తాయి. గురుడు మేధావి. మేధావులు ఆలోచనలు చేస్తారు. వ్యాయామం చేయరు. ఆ రెండు లక్షణాలే షుగర్‌ వ్యాధిని పుట్టిస్తాయి. పసుపు షుగర్‌ వ్యాధి తగ్గిస్తుందని, వ్యాయామం షుగర్‌ రాకుండా చేస్తుందని వైద్యుల అభిప్రాయం. విశేషించి గురునికి చంద్ర, కుజ, శనులను దోషరహితులుగా చేసే ప్రత్యేక లక్షణం ఉంది.చంద్రుడిచ్చే జబ్బులకు శనిచ్చే వాతానికి పసుపు మంచి మందు. టి.బి.కి కూడా చంద్రుడే అధిపతి. దాన్ని నివారించే శక్తి వెన్న కలిపిన పసుపుకున్నది.


శుక్రుడు

ఇక శుక్ర గ్రహం సౌందర్యానికీ కారణమవుతుంది. శుక్రుడు నిమ్మపండుకు, తేనెకు, చింతపండుకు, చర్మానికి అధిపతి. సౌందర్యాన్ని చింతపండు, నిమ్మపండు పెంపొందించడం లోకప్రసిద్ధమే. తేనె కూడా ఈ విషయంలో సహకరిస్తుంది. అది పుష్పాల నుంచే వస్తుంది. పుష్ప జాతులు సౌందర్యానికి, సౌకుమార్యానికీ ప్రతీకలు.


శని

చర్మంలోని మాలిన్యాలను వెలువరించే శక్తికి శని అధిపతి. నువ్వులకు, ఊపిరితిత్తులకు కూడా అధిపతి. ఊపిరితిత్తులు చేసే పని వాయువును క్రమబద్ధం చేయడమే. మాలిన్యాలను వెలువరించే లక్షణం, ఊపిరితిత్తుల పనిని క్రమబద్ధం చేసే లక్షణం నువ్వులకు ఉందని ఆయుర్వేద విజ్ఞానం చెపుతోంది. నువ్వుల నూనె శరీరానికి పట్టించి అభ్యంగనం చేస్తే రోమ కూపాలు శక్తివంతమై చర్మంలోని మాలిన్యాలను తొలగిస్తాయి.


ఇలా గ్రహాలకు చెందిన లేదా పొంత ఉన్న వస్తువులు గ్రహాల వల్ల కలిగే అనారోగ్యాలను తొలగిస్తున్నాయి. విశ్లేషించి ఆయా గ్రహాలు ఉచ్ఛ స్వక్షేత్రాదులలో బలంగా ఉన్నప్పుడు ఆయా పంటలు ఎక్కువగా పండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాయి. సప్త గ్రహాల సామ్రాజ్యాన్ని అర్థం చేసుకుంటే అందం, ఆరోగ్యం మన చెంత ఉన్నట్టే....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

శ్వేతార్క గణపతి

 సకల సుఖశాంతులు అందించే 'శ్వేతార్క గణపతి'


శ్వేతార్కంలో 'శ్వేతం' అంటే తెలుపు వర్ణం, 'అర్క' అంటే సూర్యుడు. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు గణపతి. శ్వేతార్క మూలంలో వినాయకుడు నివశిస్తాడని ప్రతీతి. దీన్ని మనం పొందగలిగి, గృహంలో ప్రతిష్టించుకోగలిగితే శుభప్రదం. శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి. బాగా పాతబడిన తెల్లజిల్లేడు మొదళ్ళు కొన్ని గణపతి రూపం ధరిస్తాయని, అటువంటి బహు అరుదు అని చెప్పవచ్చు.


జాతకచక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, జాతకచక్రంలో సూర్యుడు నీచలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు, సర్వకార్య సిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని గృహంలో ప్రతిష్టించి పూజించాలి. శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకు నేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. పండితుల్ని, పురోహితుల్ని సంప్రదించి, వారి సలహా మేరకు ముహూర్తం పెట్టించుకోవాలి. వినాయక చవితి పండుగ రోజున ఈ శ్వేతార్క గణపతిని ప్రతిష్టించి పూజ చేసుకోవాలి.


పూజా విధానము

తెల్లజిల్లేడు చెట్టు 45 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగానే గణపతి రూపం వస్తుంది. ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం రోజున వేరును స్వీకరించాలి. శ్వేతార్క మూల గణపతిని శుద్ధమైన నీటితో కడిగి, తర్వాత దానిపై ఎర్రని వస్త్రం మీద పెట్టి పూజ చేయాలి. పూజలో ఎర్ర చందనం, అక్షతలు, ఎర్రపూలు సింధూరం ఎరుపు రంగు ఉండే వస్తువులే ఎక్కువగా వాడాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. వీటితో ఒక నాణాన్ని దక్షిణ గా సమర్పించి తర్వాత ఈ దిగువ మంత్రాలతో గణేశునికి పూజ చేయాలి.

ఓం గం గణపతయే నమః

ఓం గ్లౌం గణపతయే నమః

ఓం శ్రీ గణేశాయ నమః

ఓం శ్రీ ఫాలచంద్రాయ నమః

ఓం ఏకదంతాయ నమః

ఓం లంబోదరాయ నమః

మంత్ర జప ఆరంభానికి ముందే ఎన్ని సార్లు మంత్ర పఠనం చేసేది సంకల్పం చెప్పుకోవాలి. మంత్ర జపం చేసే సమయంలో ఎర్రని జప మాల, రుదక్ష్రమాల వాడడం మంచిది. ప్రతి జపమాలలోనూ 108 గింజలు ఉంటాయి. ఒకసారి అన్ని గింజలు లెక్కిస్తూ పూజ చేస్తే 108 సార్లు జపం చేసినట్టవుతుంది. అలా పది సార్లు జపమాల చేయడమంటే 1000 సార్లు నామ జపం అవుతుంది. ఈ విధంగా ఎన్ని జపమాలలు పూజ చేయాలనుకుంటారో ఆ ప్రకారం చేయాలి. శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి.


తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు. జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాదిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట.శ్వేతార్క మూలాన్ని వెలికి తీసి, మట్టిని కడిగివేసి, నీళ్లలో నానబెట్టి జాగ్రత్తగా పరి శీలించినట్టయితే ఆ వేళ్ల మీద గణపతి ఆకృతి కనిపిస్తుందని చెబుతారు. తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి.


ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదని శాస్త్రం చెబుతోంది. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు.


శ్వేతార్క మూలానికి వశీకరణశక్తి ఉంటుందిట, ఏదైనా శుభముహూర్తాన శుచియైన తర్వాత ఆవునెయ్యి, గోరోజనం సిద్ధంగా ఉంచుకుని, ఈ ఆవు నెయ్యి గోరోజనంలో శ్వేతార్క మూలాన్ని గంథంలాగా అరగదీసి ఇష్టదైవాన్ని మనసులో ప్రార్ధిస్తూ నుదుటి మీద తిలకం వలె ధరిస్తే ఆ తిలకానికి ఉన్న వశీకరణ శక్తి స్వయంగా వస్తుంది. 


శరీర రక్ష కోసం శ్వేతార్క మూలాన్ని చిన్నదిగా తీసుకుని భుజం మీద లేదా కంఠంలో ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది. ఇంటిలోగాని, వ్యాపారసంస్ధలలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్క గణపతిని పూజించటం గాని, శ్వేతార్క వేరుని తాయిత్తులలో ధరించటంగాని చేస్తే శుభప్రదం....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

ధార్మికగీత - 104

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 104*

                                    *****

        *శ్లో:- సంపత్సు మహతాం చిత్తం ౹*

               *భవ  త్యుత్పల కోమలం ౹*

               *ఆపత్సు చ మహా శైల- ౹*

               *శిలా సంఘాత కర్కశమ్ ౹౹*

                                       *****

*భా:-  మనోవాక్కాయాలు ఏకంగా ఉన్నవారిని "మహాత్ములు" అని అంటారు. వారిలో శాంతిసామరస్యాలు, అగ్రహానుగ్రహాలు సరి సమానంగా ఉంటాయి. వారి హృదయం సంపదలలో కలువపూవు వలె మృదువుగా, మార్దవంగా, సుకుమారంగా ఉంటుంది. ఆపదలలో వారి హృదయం  సమీకృత కఠిన శిలలతో  కరుడుకట్టిన మహా పర్వతము వలె దృఢంగా, కర్కశంగా ఉంటుంది. కారుణ్యము కాగడా పెట్టి వెతికినా పొడసూపదు. శ్రీరాముడు పట్టాభిషేక వార్త వినగానే, మందస్మితవదనారవిందంతో  నిర్మలంగా, శాంతంగా ఉన్నాడు. మరునాడు  అరణ్యవాస వార్తవిని,  పితృవాక్యపరిపాలనా నిబధ్ధతతో కానలకు ఉద్యుక్తుడు అయినాడు. ఇలాంటి "స్థితప్రజ్ఞత"  మహాత్ములకే సాధ్యపడుతుంది. రాక్షసరాజు, త్రిలోకాధిపతి "బలి" తన గురువైన శుక్రుని ఆజ్ఞను థిక్కరించి, తన అస్థిత్వానికే ముప్పు వాటిల్లుతున్నదని తెలిసినా,        సత్యవాక్పరిపాలనకై మూడడుగులు దానం చేసి, త్యాగశీలిగా భాసించాడు.  అదీ మహాత్ముల హృదయ స్పందన. వారు సుఖాలలో పొంగిపోరు. కష్టాలలో కృంగిపోరు. వారి హృదయాలలో శిరీషకుసుమపేశలత్వము , వజ్రకాఠిన్యము రెండును సహజాతములుగా పొదగబడి ఉంటాయని సారాంశము*.

                               *****

               *సమర్పణ   :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

వివేకానంద

 ఒకసారి ఒక కరడుగట్టిన క్రైస్తవుడు వివేకానంద ను చూడ్డానికి వచ్చాడు..

అతను వచ్చిన దగ్గర్నుంచి టేబుల్ మీద ఉన్న పుస్తకాల దొంతరమీదే దృష్టి పెట్టాడు..

ఓ గంట సంభాషణ తర్వాత నెమ్మదిగా సర్కాస్టిగ్గ మాట్లాడం మొదలెట్టాడు..

సంభాషణ వాదనగా మారుతుంది..వాతావరణం కొద్దిగా వేడెక్కింది స్వామిజీ మొహం మీద చిరునవ్వు చెరగలేదు వచ్చిన అతిధి లో అసహనం మొదలయింది ఎలా అయినా వివేకానంద కు కోపం తెప్పించాలి అని రెచ్చగొట్టే మాటలు వాడుతున్నాడు..

స్వామీజీని అడిగాడతను ' స్వామి ఈ పుస్తకాల దొంతరలో అన్నింటికన్నా పైన బైబిల్ పెట్టారు తర్వాత ఖు.రాన్ ఇంకా ఇతర మత గ్రంధాలు పెట్టి అన్నింటికన్నా కింద మీ భగవద్గీత పెట్టారు ' అంటే అన్నింటికన్నా పైన క్రైస్త.వం ఉన్నతం అన్నింటికన్నా కిందది హిందుత్వ అని మీరు కూడా మానసికంగా ఒప్పుకున్నట్టున్నారు !!.

వివేకా చిన్నగా నవ్వారు...కింద ఉన్న భగవద్గీత ను  లాగేశారు పుస్తకాల దొంతర మొత్తం కింద పడిపోయింది పుస్తకాలు నేల మీద చెల్లాచెదురుగా పడిపోయాయి..

చేతిలో ఉన్న భగవద్గీత ను ఆ క్రైస్తవుడికి చూపుతూ వివేకా అన్నారు ' అన్నింటికీ ఆధారం ఈ ధర్మమే  అన్నింటికీ మూలం  కూడా సనాతన ధర్మమే..మీరు ఏం చెప్పినా దీనినుంచి తీసుకున్నదే ' అందుకే ఇది పునాది దీన్నితొలగిస్తే ఇప్పుడు చూశారు కదా! అన్ని మతాలు పుస్తకాల దొంతర కూలినట్టు కూలిపోతాయి అందుకే  ' అన్నింటికంటే కింద ' పెట్టాను.. అదే ధర్మానికి పునాది..

వచ్చిన అతిధికి నోరుపెగల్లేదు.. నమస్కారం చేసి వెళ్ళిపోయాడు..

నేటి సమాజం

 _*💫 నేటి సమాజం ♨️*_


_ఒక బ్యాంకులో దొంగతనం జరిగే సమయంలో దొంగలు తుపాకీలు చూపెట్టి అక్కడి వారిని బెదిరించారు._


_ఈ డబ్బు ప్రభుత్వానికి సంబంధించినది. కానీ మీ ప్రాణాలు మీకు సంబంధించినవి. ఎవరూ మాతో పోరాడకుండా అలాగే నేలపై పడుకోండి అని చెప్పారు.._


_మనసు మార్చే మాటలంటే ఇవే..._


_"This is called Mind changing concept. Changing the conventional way of thinking"._


_దొంగలను పక్కదారి పట్టించాలని ఒక స్త్రీ అనాగరికంగా ప్రవర్తించడంతో... ఒక దొంగ మేము దొంగతనానికి వచ్చాము. ఇక్కడ అత్యాచారం చేయడానికి రాలేదు అని ఆమెను భయపెట్టాడు._


_దీన్నే చేసే పనిలో "నిమగ్నత" అవసరం అనేది._

 

_"Being a proffesional focus only on what you are trained"._


_దొంగతనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక డబ్బును లెక్క పెడదాం అన్నాడు ఒక దొంగ. అందులో ఒకడు అంత డబ్బు ఇప్పుడు ఎక్కడ లెక్కపెడతాం... ఎంత డబ్బు పోయింది అన్నది రేపు ప్రభుత్వమే చెప్తుందిలే అని అన్నాడు._


_దీన్నే అంటారు చదువుకన్నా అనుభవం గొప్పది అని.._


_This is called "Experience" Now a days experience is more important than paper qualification !!_


_దొంగతనం జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పే ముందు బ్యాంకు అధికారి బ్యాంకులో దొంగతనం జరిగింది 20 కోట్లు, ఇంకో 30 కోట్లు మనం అందరం పంచుకుని 50 కోట్లు దొంగతనం జరిగిందని చెపుదాం అన్నాడు._


_దీన్నే ఆసందర్భాన్ని కూడా మనకు ఉపయోగరంగా మార్చుకోవడం అంటారు._ 


_"This is called Swim along with the tide connverting an unfavourable situation to yours"._


_ఇది విన్న ఒక అధికారి ప్రతి సంవత్సరం ఇలాంటి దొంగతనం జరిగితే బాగుంటుంది అని అన్నాడు._  


_ఇదే స్వార్థపూరిత లోకమంటే.._


_"This is called killing boredom world. Personal importance is more important than your job"._


_మరుసటి రోజు వార్తల్లో బ్యాంక్లో 100 కోట్లు దొంగతనం జరిగినట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఆయన భాగం 50 కోట్లు._ 


_ఆశ్చర్యపోయిన దొంగలు వెంటనే లెక్కపెట్టడం మొదలు పెట్టారు. ఎన్నిసార్లు లెక్కపెట్టిన 20 కి దాటట్లేదు.._


_దొంగల్లో ఒకడికి ఆవేశం కట్టలు తెంచుకుంది. మనం మన ప్రాణాలు పణంగా పెట్టి దొంగతనం చేస్తే వీళ్ళు దొరల్లా 80 కోట్లు దోచుకున్నారు అని. చదువు అవసరం ఇప్పుడు తెలిసింది._


_True knowledge is now a days very important than money in this world._


_ఇప్పుడు మన సమాజంలో ఇలాంటి వారే అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు..!_


🙏🇮🇳😷🌳🏵️🤺🥀

ధార్మికగీత - 104*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 104*

                                    *****

        *శ్లో:- సంపత్సు మహతాం చిత్తం ౹*

               *భవ  త్యుత్పల కోమలం ౹*

               *ఆపత్సు చ మహా శైల- ౹*

               *శిలా సంఘాత కర్కశమ్ ౹౹*

                                       *****

*భా:-  మనోవాక్కాయాలు ఏకంగా ఉన్నవారిని "మహాత్ములు" అని అంటారు. వారిలో శాంతిసామరస్యాలు, అగ్రహానుగ్రహాలు సరి సమానంగా ఉంటాయి. వారి హృదయం సంపదలలో కలువపూవు వలె మృదువుగా, మార్దవంగా, సుకుమారంగా ఉంటుంది. ఆపదలలో వారి హృదయం  సమీకృత కఠిన శిలలతో  కరుడుకట్టిన మహా పర్వతము వలె దృఢంగా, కర్కశంగా ఉంటుంది. కారుణ్యము కాగడా పెట్టి వెతికినా పొడసూపదు. శ్రీరాముడు పట్టాభిషేక వార్త వినగానే, మందస్మితవదనారవిందంతో  నిర్మలంగా, శాంతంగా ఉన్నాడు. మరునాడు  అరణ్యవాస వార్తవిని,  పితృవాక్యపరిపాలనా నిబధ్ధతతో కానలకు ఉద్యుక్తుడు అయినాడు. ఇలాంటి "స్థితప్రజ్ఞత"  మహాత్ములకే సాధ్యపడుతుంది. రాక్షసరాజు, త్రిలోకాధిపతి "బలి" తన గురువైన శుక్రుని ఆజ్ఞను థిక్కరించి, తన అస్థిత్వానికే ముప్పు వాటిల్లుతున్నదని తెలిసినా,        సత్యవాక్పరిపాలనకై మూడడుగులు దానం చేసి, త్యాగశీలిగా భాసించాడు.  అదీ మహాత్ముల హృదయ స్పందన. వారు సుఖాలలో పొంగిపోరు. కష్టాలలో కృంగిపోరు. వారి హృదయాలలో శిరీషకుసుమపేశలత్వము , వజ్రకాఠిన్యము రెండును సహజాతములుగా పొదగబడి ఉంటాయని సారాంశము*.

                               *****

               *సమర్పణ   :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

వర్ణమాలాంకృత శంకరుడు

 "వర్ణమాలాంకృత శంకరుడు".🙏🙏


వర్ణమాలాంకృత శంకరుడు

              🙏🙏🙏


అఖిలం..... నమశ్శివాయ

ఆనందం..... నమశ్శివాయ

ఇహమూ .... నమశ్శివాయ

ఈప్సితమూ ... నమశ్శివాయ

ఉల్లం............. నమశ్శివాయ

ఊహా.............. నమశ్శివాయ

ఋణమూ ....    నమశ్శివాయ

ౠకా........... నమశ్శివాయ

ఎదలో .....         నమశ్శివాయ

ఏకం................. నమశ్శివాయ

ఐహికం......... నమశ్శివాయ

ఒక్కడే............. నమశ్శివాయ

ఓజస్సు............ నమశ్శివాయ

ఔషధం............. నమశ్శివాయ

అంతయు.......... నమశ్శివాయ

కరుణ...నమశ్శివాయ

ఖగమూ.. నమశ్శివాయ

గరళం.... నమశ్శివాయ

ఘనము... నమశ్శివాయ

చమకం...... నమశ్శివాయ

ఛత్రం........ నమశ్శివాయ

జడము...... నమశ్శివాయ

ఝరులూ.... నమశ్శివాయ

టముకు....... నమశ్శివాయ

ఠావు     ........ నమశ్శివాయ

డమరుకం....... నమశ్శివాయ

ఢక్కానాదం..... నమశ్శివాయ

తలపూ............ నమశ్శివాయ

థమ్మిల్లం........... నమశ్శివాయ

దమనం............ నమశ్శివాయ

ధార్మికం............. నమశ్శివాయ

నమకం.............. నమశ్శివాయ

పదము........ నమశ్శివాయ

ఫలము......... నమశ్శివాయ

బలము......... నమశ్శివాయ

భవము......... నమశ్శివాయ

మనసు.......... నమశ్శివాయ

యమము....... నమశ్శివాయ

రవము............ నమశ్శివాయ

లఘువు............ నమశ్శివాయ

వదనం............... నమశ్శివాయ

శంకరం............... నమశ్శివాయ

షణ్ముఖప్రియ......... నమశ్శివాయ

సకలం.................. నమశ్శివాయ

హలము................. నమశ్శివాయ

క్షమయూ............... నమశ్శివాయ

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 32 /

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 32  / Sri Devi Mahatyam - Durga Saptasati - 32 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 9*

*🌻. నిశుంభ వధ - 2 🌻*


17. భయంకరపరాక్రముడైన అతని సోదరుడు నిశుంభుడు నేలగూలగా శుంభుడు మిక్కిలి రోషంతో అంబికను చంపడానికి బయలుదేరాడు.


18. తన రథంపై నిలిచి, మిక్కిలి పొడవై అసమానమైన తన ఎనిమిది చేతులలో మహోత్తమ ఆయుధాలు ధరించి ఆకాసమంతా వ్యాపించి ప్రకాశిస్తున్నాడు.


19. అతడు రావడం చూసి దేవి శంఖాన్ని పూరించి ధనుష్టంకారం ఒనర్చింది. ఆ శబ్దం అత్యంత దుర్భరమై ఉంది. 


20. మరియు సకలదైత్య సైన్యాల ధైర్యం సడలిపోయే తన ఘంటానాదాలతో ఆమె దిక్కులను నింపివేసింది.


21. అంతట సింహం తన గొప్ప గర్జినినాదంతో ఏనుగుల మహామదం దిగజారిపోయేట్లు దశదిశలను నిండించివేసింది.


22. అంతట కాళి ఆకాశానికి ఎగిరి (క్రిందికి దూకుతూ) భూమిని తన రెండు చేతులతో కొట్టింది. ఆ శబ్దంలో అంతకు ముందటి శబ్దాలన్ని మునిగిపోయాయి.


23. కీడును సూచించే మహాట్టహాసాన్ని (మిక్కిలి బిగ్గరగా, దీర్ఘమైన నవ్వు) శివదూతి చేసింది. ఆ శబ్దాన్ని విని అసురులు భీతి చెందారు. శంభునికి అత్యంత కోపం వచ్చింది.


24. "దురాత్మా! నిలువు, నిలువు!” అని అంబిక పలుకగా, ఆకాశంలో ఉన్న దేవతలు జయధ్వానాలు ఒనర్చారు. 


25. శుంభుడు వస్తూ ప్రయోగించిన బల్లెం అతి భయంకరంగా, అగ్నిసమూహం వలే ప్రకాశిస్తుండగా, దేవి (దానిపైకి) విసరిన ఒక గొప్ప కొరివి వల్ల అది ఆరిపోయింది.


26. రాజా! శుంభుడు చేసిన సింహనాదం మూడు లోకాల నడిమిధాలాన్నంతా నిండిపోయింది. కాని (దేవి వైసిన) భయంకర్మెన పిడుగు యొక్క ఉటుము ఆ శబ్దాన్ని కప్పివేసింది.


27. శుంభుని బాణాలను దేవి, దేవి బాణాలను శుంభుడు వందల కొద్ది, వేల కొద్ది త్రుంచివేసారు.


28. అంత చండిక రోషపూరితయై అతనిని త్రిశూలంతో గట్టిగా పొడిచింది. అతడు ఆ పోటుకు మూర్ఛిల్లి భూమిపై పడ్డాడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీరామనాథస్తుతిః

 శ్రీరామనాథస్తుతిః 


(శ్రీరామేశ్వరక్షేత్రే)

శ్రీరామపూజితపదాంబుజ చాపపాణే

శ్రీచక్రరాజకృతవాస కృపాంబురాశే

శ్రీసేతుమూలచరణప్రవణాంతరంగ

శ్రీరామనాథ లఘు తారయ జన్మవార్ధిం ..


నమ్రాఘవృందవినివారణబద్ధదీక్ష

శైలాధిరాజతనయాపరిరబ్ధవర్ష్మన్ .

శ్రీనాథముఖ్యసురవర్యనిషేవితాంఘ్రే

శ్రీరామనాథ లఘు తారయ జన్మవార్ధిం .. 2..


శూరాహితేభవదనాశ్రితపార్శ్వభాగ

క్రూరారివర్గవిజయప్రద శీఘ్రమేవ .

సారాఖిలాగమతదంతపురాణపంక్తేః

శ్రీరామనాథ లఘు తారయ జన్మవార్ధిం .. 3..


శబ్దాదిమేషు విషయేషు సమీపగేష్వ-

ప్యాసక్తిగంధరహితాన్నిజపాదనమ్రాన్ .

కుర్వాణ కామదహనాక్షిలసల్లలాట

శ్రీరామనాథ లఘు తారయ జన్మవార్ధిం .. 4..


ఇతి శృంగేరి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహ-

భారతీస్వామిభిః విరచితా శ్రీరామనాథస్తుతిః సంపూర్ణా .

శశాంకశేఖరప్రాణవల్లభాయై

 ౬. శశాంకశేఖరప్రాణవల్లభాయై నమో నమః! – 


చంద్రుని తన శిగపై పెట్టుకున్న పరమేశ్వరునికి ప్రాణసమానమైన ప్రియురాలు. 


శశాంకశేఖరుడు అంటే చంద్రశేఖరుడు అనగా శివుడు. చంద్రుని తన శిగపై పెట్టుకున్న పరమేశ్వరుడు. అయనకు ప్రాణవల్లభి’ ఈ తల్లి. ‘వల్లభ’ అంటే ప్రియురాలు అని అర్థం. ఆయనకి ప్రాణసమానమైనటువంటి, ప్రియమైనటువంటి జగదంబ. 


శివునికి ఉన్న నామాలలో చంద్రశేఖర నామం దివ్యమైనది. మనం లోకంలో చూసే చంద్రకళలు పదిహేను. ఇవి మార్పు చెందేవి. మారని పదహారవ కళకి సదాకళ, ధృవా కళ, అమృతకళ అని పేరు. అది శివుని శిగపై ఉంటుంది. ఇది శివుడు సదా ఉండే శాశ్వతమైన అమృత తత్త్వము అని తెలియజేస్తుంది. 


‘చంద్రశేఖరా’ అనే నామాన్ని పఠిస్తే మృత్యుబాధలు తొలగిపోతాయి. మృత్యుంజయ తత్త్వాన్ని తెలియజేస్తుంది. ఆ కారణం చేతనే మార్కండేయుడు యముడు వెంటపడినప్పుడు 


‘చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం! 

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం! 

చంద్రశేఖర మాశ్రయే కింకరిష్యతి వైయమః’ అన్నాడు. 


ఆయన అమృతస్వరూపుడు. ఆయనకి ప్రాణసమానమైన ప్రియమైన స్వరూపం అమ్మవారు. 


ప్రాణితి చేష్టాన్ కరోతి ఇతి ప్రాణః – చేష్టను కలిగించునది. శివుని చేష్ట అమ్మవారి వల్లనే కలుగుతున్నది. లేకపోతే ఆయన నిర్వికారుడై ఉంటాడు. సృష్టిస్థితిలయలు చేస్తున్నాడు అంటే శక్తివల్లనే చేస్తున్నాడు. అవి చేస్తున్నాడు అంటే ఆయనకి కదలిక వచ్చింది. అదే స్పందనశక్తి. శివుని యొక్క స్పందన శక్తియే అమ్మవారు. సంకల్పం ఉంటేనే స్పందన ఉంటుంది, స్పందన ఉంటేనే సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం ఇచ్ఛాజ్ఞానక్రియారూపముగా సృష్టిస్థితిలయలు చేస్తూ ఉంటుంది. ఈ రహస్యాన్నే శంకరభగవత్పాదుల వారు ‘న ఖలు కుశలః స్పందితుమపి’ అని సౌందర్యలహరి ప్రథమ శ్లోకంలో చెప్తున్నారు. 


ఇందులో భావించవలసినది శివశక్తుల అన్యోన్యదాంపత్యం. వారి అన్యోన్య దాంపత్యాన్ని భావిస్తే చాలు శాంతి లభిస్తుంది. ఇది సమయాచారం. దక్షిణాచారం, ఉత్తమ సంప్రదాయం. దంపతుల అన్యోన్య ప్రేమ ఎలా ఉండాలి అనేది శివశక్తుల ద్వారా నేర్చుకోవాలి. ఒకవేళ ఆ ప్రేమ కానీ లోపిస్తే శాంతి ఉండదు. అలాంటి అన్యోన్య ప్రేమ దంపతుల మధ్య ఉండాలంటె ఆదిదంపతుల అన్యోన్యతని ధ్యానించాలి, ఉపాసించాలి, ఆరాధించాలి. అప్పుడు ఆ కుటుంబాలలో అన్యోన్యత, శాంతి ఉంటుంది. ఈ నామం విడిగా జపం చేసుకుంటే అమృతత్త్వాన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. 


౭. సదాపంచదశాత్మైక్యస్వరూపాయై నమో నమః! – 


ఎల్లప్పుడూ పంచదశీ మంత్ర స్వరూపముగా ఉన్న తల్లి. పంచదశీమంత్రముతో అభిన్నమైన స్వరూపము కలిగిన తల్లి. ధర్మార్థ కామ మోక్షములు నాలుగూ ఇవ్వగలిగే పంచదశీమంత్ర స్వరూపమే అమ్మవారి దివ్యమంగళ విగ్రహం అని ఈ నామంలో భావం. 


పంచదశీ మహామంత్రము. శ్రీవిద్యలో రాజరాజేశ్వరీ లలితామహాత్రిపురసుందరి మంత్రము పంచదశి. మంత్రములలో ఉన్నతమైన మంత్రము, శ్రీవిద్యలో ఉదాత్త మంత్రము, సంపూర్ణ మంత్రము. పంచదశీ మంత్ర స్వరూపమే అమ్మవారు. దేవతాకృతి అంటేనే మంత్రాకృతి. మంత్రం యొక్క చైతన్యమే దేవత. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవతాకారము. ఎన్ని మంత్రాలుంటాయో అందరు దేవతలుంటారు. లలితాదేవి మంత్రం అంటే పంచదశీ విద్య. 


అమ్మవారి స్వరూపం ఒకప్పుడు ఉండి మరొకప్పుడు పోయేది కాదు. క్రమక్రమంగా క్షీణించేదో, పెరిగిపోయేదో కాదు. ఎప్పుడూ పరిపూర్ణమైనది, నిత్యము, శాశ్వతం అని చెప్పడానికి ‘సదా’ అని చెప్పారు. అమ్మవారి స్వరూపాన్ని ధ్యానిస్తేనే ఆ మంత్రాన్ని జపించిన ఫలం. ఎల్లప్పుడూ పంచదశీ మంత్ర స్వరూపముగా ఉన్న తల్లి. 


శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా! కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ! శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ! మూలమంత్రాత్మికామూలకూటత్రయకళేబరా!” –


ఈ నామములో చెప్పింది పంచదశీ మంత్రం మూడు భాగాలుగా ఉంటుంది – వాగ్భవ, కామరాజ, శక్తికూటములు. వాగ్భవకూటం అమ్మవారి కంఠంవరకు ఉన్న భాగం. మంత్రంలో మధ్యభాగం కామరాజ కూటం అని చెప్పబడుతూ కంఠం నుండి నడుము వరకు ఉంటుంది. అటుతర్వాత కటినుంచి పాదం వరకూ ఉన్న మంత్రభాగం శక్తికూటం అని పంచదశిలో మూడవభాగం. ఇలా మంత్రంలో ఉన్న మూడు భాగాలు శరీరంలో మూడు భాగాలుగా చూపిస్తూ మంత్రానికీ, దేవతామూర్తికీ అభేదాన్ని చూపిస్తున్నారు. ఈ మూడు కూటముల మంత్రం ద్వారా లభించేది ఏమిటంటే ధర్మార్థకామమోక్షములు. 


వాగ్భవ కూట ధ్యానం వల్ల ధర్మము, కామరాజ కూట ధ్యానం వల్ల అర్థము, కామము; శక్తి కూట ధ్యానం వల్ల మోక్షం లభిస్తుంది. ధర్మార్థ కామ మోక్షములు నాలుగూ ఇవ్వగలిగే పంచదశీమంత్ర స్వరూపమే అమ్మవారి దివ్యమంగళ విగ్రహం అని ఈ నామంలో భావం.


అనంతవిశ్వమే అమ్మవారి స్వరూపం. ఎంత అనంత విశ్వమైనా పంచభూతాలతో కూడి ఉన్నది. పంచభూతాలలో ఒక్కొక్క భూతానికీ కొన్ని గుణాలుంటాయి. ఆకాశానికి ‘శబ్దము’, వాయువుకు ‘శబ్దము, స్పర్శ’, అగ్నికి ‘శబ్దస్పర్శరూప’; నీరుకి ‘శబ్దస్పర్శరూప రసములు’; భూమికి ‘శబ్దస్పర్శరూపరసగంధములు’. మొత్తం కలిపితే పదిహేను గుణాలు. ఈ పదిహేను గుణాలతోనే ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. పంచభూతాలు వాటి గుణములు కలిపితే పదిహేను అవుతున్నాయి. ఈ పదిహేనింటితో ఉన్న విశ్వమే అమ్మవారి యొక్క రూపము. ఈ విశ్వమునిండా అమ్మవారు ఈతత్త్వంగా ఎల్లవేళలా వ్యాపించి ఉన్నది గనుక ‘సదా’.

సిద్ధాసనం

 2.సిద్ధాసనం:-హఠయోగ ప్రదీపికలో ఈ ఆసనం 72నాడుల్లోని మాలిన్యాన్ని శోధించి వేస్తుందని చెప్పబడింది. ఈ ఆసనం సిద్ధించినట్లయితే ఇతరమైన ఏ ఆసనాలతోనూ పని ఉండదు. ఈ ఆసనవిధానం ఎడమకాలి మడమను గుద స్ధానంలో ఉంచాలి. కుడికాలుని లింగంమీద ఉంచాలి. ఇది సిద్ధాసనం. ఈ ఆసన స్థితుడై సాధకుడు ఏ మంత్రసాధన చేసినా ఆ మంత్రం అవశ్యము సిద్ధిస్తుంది. పద్మాసనం తర్వాత మహిమాన్విత ద్రుష్టి లో మరింత మహత్వపూర్ణమైన స్థానము ఈ ఆసనానికి ఉంది. ఈ ఆసనాన్ని సముచితరీతిని అభ్యాసం చేశాక అనేక విధాలైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. స్థూలకాయులైన సాధకులు కూడా ఈ ఆసనాన్ని అనాయాసంగా అభ్యాసం చేసుకోవచ్చును. బ్రహ్మచర్య పాలనకు ఈ ఆసనం మిక్కిలి ఉపయోగకరమైనదిగా పేర్కొనబడింది. పద్మాసనంలో గానీ సిద్ధాసనంలో గానీ 15నిముషాలుపాటు కూర్చుని గలిగేలా అభ్యాసం చేసి ఏకాగ్రత తో జప సాధన చేయగలిగినట్లయితే ఆ సాధకుడు ఊహించని ఉపయోగాలను అత్యద్భుతంగా తన సాధన పొందగలుగుతాడు. వాత రోగ నిదానానికి ఈ ఆసనం ఉత్తమోత్తమైనది. ఈ ఆసనం పిక్కలలోని నరాలకు బలం చేకూర్చుతుంది... సేకరణ

పద్మాసనం

 పద్మాసనం :- ఈ ఆసనం జపానికి, ధ్యానానికి శ్రేష్టమైనది గా చెప్పబడింది. దర్భాసనం మీదగాని ఇతరమైన అనుకూల ఆసనాలమీద గానీ కూర్చుని ఈ ఆసనం వేసుకుని జపధ్యానాలు కొనసాగిస్తే చాలా మంచిది. కుడికాలుని ఎడమతొడపైన, ఎడమకాలు ని కుడి తొడపైన ఉంచాలి. అటుపైన కుడిచేయి ని కుడిమోకాలిపైన, ఎడమచేయిని ఎడమమోకాలుపైన ఉంచాలి. ఇలా కూర్చుని వేసే ఆసనం పద్మాసనము. ఈ ఆసనంలో శిరస్సు, మెడ, వెన్నెముక అన్ని ఒకే సరళరేఖ లో నిటారుగా ఉండాలి. ♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

మనిషి విలువ తెలుసుకో

 ఇది కథే కాదు చాలా మంది జీవితాల్లో కనిపించే వాస్తవం కూడా.

.........................


రచన: శ్రీమతి Umabala Chunduru


మనిషి విలువ తెలుసుకో


                              *****


స్కూటర్ బయటికి తీసి చాలా రోజులయ్యింది అనుకుని,  పొద్దున్నే వాకింగ్ వెళ్లేప్పుడు స్కూటర్ మీద వెళ్లారు పార్క్ కి ..శంకర నారాయణ గారు...


వారంలో ఒకసారైనా నడపకపోతే బండి మొండిదయ్యి మొరాయిస్తుందని...


వెళ్తుంటే దారిలో ఒకాయన అదే పార్కు కి వస్తారు రోజూ..రోడ్ మీద కనిపిస్తే,  స్కూటర్ ఆపి ఎక్కండి సర్, నేనూ అదే పార్క్ కి వెళ్తున్నా..అన్నారు...

ఆయన పర్లేదండీ మీరు వెళ్ళండి అన్నారు...

పర్లేదు రండి ఈ ఒక్కరోజూ...

ఇక్కడ నడిచేదేదో పార్క్ లో నడవండి అనడంతో తప్పలేదు ఆయనకి...

ఎక్కి కూర్చున్నారు...


దిగగానే...థాంక్స్ అండీ అన్నారు...దానికి శంకరం గారు...భలేవారే..

నేనూ రోజూ స్కూటర్ మీద రాను...అప్పుడప్పుడు వస్తాను అన్నారు నవ్వుతూ...

మీ పేరు అని అడిగారు శంకర నారాయణ గారు...

ఆయన 'అనంత మూర్తి' అని చెప్పి షేక్ హాండ్ ఇచ్చారు...ఈయన కూడా తన పేరు చెప్పారు...

ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు లోపలికి వెళ్లిపోయారు...


శంకరం గారు ఎదురైన వాళ్లందరికీ విష్ చేస్తూ నడుస్తున్నారు...

ఆయన దిన చర్యే అంత...ఇంటికి

వెళ్తూ కూరగాయలు,  ఆకుకూరలు,  ఫ్రెష్ గా ఉంటే కొనుక్కుని వెళ్తారు...

రిటైర్ అయినప్పటి నుండీ ఇదే దినచర్య...


ఒక రోజు సాయంత్రం గుడికి వెళ్తే అక్కడ కనిపించారు  అనంతమూర్తి గారు...

ఆయన ఇల్లు అక్కడికి దగ్గరేట...

రండి రండి అని,  బలవంతంగా తీసికెళ్లారు...

శంకరం గారు కూడా.. సరే అని వెళ్లారు...

1st ఫ్లోర్ లో మొదటి అంతస్తులో ఉంటున్నారాయన...

రెండు బెడ్ రూముల అపార్ట్మెంట్ కాంపాక్ట్ 

గా ఉంది...

కుర్చీలో కూర్చున్నాకా,  మంచినీళ్లు తాగుతూ ఇంటిని పరిశీలించారు శంకరం గారు...

ఎదురుగా ఒక స్త్రీ మూర్తి  ఫోటో కి దండ వేసి, బొట్టు పెట్టి ఉంది..

చూడగానే తెలిసిపోతోంది ఈ లోకంలో లేనట్టు...


ఎవరెవరు ఉంటారింట్లో అని అడిగారు శంకరం గారు...

నేనొక్కడినే...పిల్లలు యూ ఎస్ లో ఉంటారు...

ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి...

"తను లేదు"  అని ఫోటో చూస్తూ చెప్పారు...


ఓ సారీ...అని...

వంట మీరేనా అని అడిగారు...శంకరం గారు...

లేదండీ కుక్ ఉంది...నాకు వంట రాదు...రెండుపూటలా వచ్చి చేసిపోతుంది అని చెప్పారు...

కాఫీ గానీ,  టీ గానీ అని ...అడుగుతుండగానే..

"అబ్బే వద్దండీ భోజనం చెయ్యాలి కదా...

ఇంకోసారి వస్తాను తప్పక...

వెళ్ళొస్తాను " అంటూ లేచి...

అవునూ రేపు మీరు మా ఇంటికి లంచ్ కి ఎందుకు రాకూడదూ...?

రేపు ఆదివారం కూడా...

ఇప్పుడు కూడా ఉద్యోగం లేకపోయినా ఆదివారం అంటే ఇష్టం పోలేదు అన్నారాయన నవ్వుతూ...


రేపు పన్నెండు గంటలకల్లా వచ్చేయండి...

నాకూ మీకూ కూడా మార్పు ఉంటుంది...అనేశారు శంకరం గారు..

అబ్బెబ్బే వద్దులెండి అని మొహమాట పడుతున్నారు...

దానికి శంకరం గారు అన్నారు...రోజూ వంటావిడ వంటే కదా ..రేపు మా ఇంటి భోజనం చేయండి సర్...మీకోసమేమీ కష్టపడి చాలా ఏమీ చేసేయరు లెండి...

రేపు ఫోన్ చేసి బయలుదేరండి...నేను మీకు ఎదురొచ్చి పికప్ చేసుకుంటా...

మీరు వస్తున్నారంతే అని చెప్పేసి వెళ్లిపోయారాయన....


మరుసటిరోజు పన్నెండుగంటలకల్లా...శంకరం గారు ఫోన్ చేశారు "బయలుదేరారా అని"...

అనంతమూర్తి బయలుదేరాననగానే,  స్కూటర్ వేసుకుని ఆయనఇంటివైపుకి వెళ్లి ఆయన్ని ఎక్కించుకుని తన ఇంటికి తీసుకొచ్చారు...

ఇండిపెండెంట్ ఇల్లు...

చక్కగా మొక్కా మొలకతో పచ్చగా ఉంది ఆవరణ...ఇంకో పోర్షన్ అద్దెకిచ్చారట...


మొదట్లో అసలు ఇక్కడ ఇళ్ళు లేవని, అడవిలా ఉండేదని కాలక్రమేణా  డెవలెప్ అయ్యి ఇప్పుడు ఇలా అయిపోయిందని చూపించారు గర్వంగా...

ఇంటికి రాగానే లోపలికి వెళ్ళి చల్లని మంచి నీళ్ళు తెచ్చిచ్చారు...

ఇల్లంతా చక్కగా నీట్ గా సర్ది పొందికగా ఉంది...

ఎంతైనా ఆడవాళ్లు ఉండే ఇల్లే వేరు అనుకున్నారు అనంతం గారు...

ఇద్దరూ వాళ్ళు పనిచేసే ఆఫీస్ వివరాలు, పెన్షన్, స్నేహితుల వివరాలు మాట్లాడుకున్నారు...

మాటల్లో శంకరం గారు కూడా చెప్పారు...తన పిల్లల సంగతి...

కూతురు అమెరికా లో ఉంటుందని...

కొడుకు చండీఘర్ లో ఉంటాడని...ఆయన

ఇద్దరి దగ్గరకూ వెళ్లి వస్తూ ఉంటారని...

కొడుకు వచ్చేయమంటాడని... కొద్ది కాలం ఉండి మరీ ఓపిక లేకపోతే వస్తానని చెప్పారట...

ఇల్లంతా చూపించారు...

భార్య నవ్వుతున్న ఫోటో...పిల్లలతో, మనవలతో ఫోటోలు ఉన్నాయి..

పెరట్లో చెట్లుతో  భలే ముచ్చటగా ఉంది...ఎంత లేదన్నా ఇప్పుడు ఇల్లు వాల్యూ కోటి పైనే ఉంటుందని అంచనా వేశారు అనంతమూర్తి గారు... 


కూర్చోండి భోజనం చేసేద్దాం...ఇప్పుడు కాఫీ ఎందుకని అడగలేదు అని కూడా అన్నారు...


ఈ లోపు డైనింగ్ టేబుల్ మీద అన్నీ తెచ్చి పెట్టారు...

ఆనంతమూర్తి గారు అనుకున్నారు ...శంకరం గారి

భార్య ఊరు వెళ్లి ఉంటుందేమో అని...ఇంట్లొ

ఎక్కడా కనపడక పోతే,  ఈయనే అన్నీ సర్దుతుంటే...


రండి..అని శంకరం గారు అనగానే...

అడిగారు ఆనంతమూర్తి గారు తన సందేహాన్ని...


వెంటనే శంకరం గారు చాలా నార్మల్ గా

అన్నారు..

అవును మీకు నేను చెప్పలేదు కదా...తినేసి మాట్లాడుకుందాం రండి అన్నారు...

దొండకాయ వేపుడు, సాంబారు, టమాటో పచ్చడి, ఆవకాయ, కందిపొడి, అప్పడాలు, గుమ్మడి వడియాలు...

ఒక ప్లేట్లో నెయ్యి, నూనె,  గిన్నెలు

చాలా చేశారే అన్నారు అనంతం గారు...

చేసినవి మూడే నండీ...మిగిలినవి చేసినవి కాదు కదా...

ముందు తిని చెప్పండి నా వంట ఎలా ఉందో అన్నారు...


అన్నీ చక్కగా రుచిగా పద్ధతి గా  ఉన్నాయి...

లాస్ట్ లో గడ్డ పెరుగుతో కానిచ్చి తృప్తిగా లేచారు...

అన్నీ చక చకా సర్దేసి, టేబుల్ తుడిచేసి 

వక్కపొడి భరిణతో వచ్చారు శంకరం గారు...

అలవాటుందా అంటూ....


'తల ఊపి తీసుకున్నారు'  అనంతం గారు...


'నాకు అలవాటు లేదు...కానీ ఎవరైనా భోజనానికి వస్తే ఇవ్వాలికదా.. అని కొనిపెడతాను'  అన్నారు శంకరం గారు మూత పెడుతూ.. 


సోఫా లో కూర్చుంటుంటే అన్నారు అనంతం గారు...చాలా బాగా చేసారండీ వంట...

బాగానే నేర్చుకున్నారు అని..


అప్పుడన్నారు శంకర నారాయణ గారు, "నేను ఉద్యోగం చేసేటప్పుడు రాదండీ వంట...టైం ఉండేది కాదు...కూరలు సెలవుల్లో కట్ చేసి ఇచ్చేవాడిని అంతే...

రిటైర్ అయ్యాకే వంట నేర్చుకున్నాను...

మొదట కూరలు కట్ చేసి ఇచ్చేవాణ్ణి...

తరువాత తను వేపుళ్ళు, సాంబారు..పప్పు చేయడం నేర్పించింది"...


అన్నట్టు మీ సందేహం తీర్చలేదు కదా నేను...

నా భార్య అపర్ణ లేదు...రెండేళ్లు అవుతోంది పోయి...

నాకు ఆమాట చెప్పడం ఇష్టం ఉండదు అస్సలు...

తను నాతోనే ఉంది కదా అనిపిస్తుంది...

చాలావరకూ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాను....

ఎందుకో ఆ మాట అనడం కూడా నా కిష్టముండదు...

అందుకే ఇంట్లో కూడా అన్నీ సజీవంగా అనిపించే ఫోటోలే ఉంటాయి...

కృత్రిమంగా ఫోటోకోసం నిలబడి ఉన్న ఫోటో పెట్టి, దానికి ఒక పెద్ద దండేసి...

మొహాన పెద్ద కుంకుమబొట్టు పెట్టి...ఎందుకో ఆ వ్యవహారం నచ్చదు నాకు...

నా భార్య లేదని అనుక్షణం గుర్తు చేసే కొన్ని పనులు నేను చేయను...పిచ్చి అనుకోండి...ఛాదస్తం అనుకోండి...

నాది భ్రమ అని తెలుసు...కానీ ఆ భ్రమ నాకు ఇష్టం...


తనే "మీకు కొన్ని వంటలన్నా రావాలి"  అని కసిరి కోప్పడీ

మరీ నేర్పింది...

చక్కటి కాఫీ, టీ పెట్టుకోవడం కూడా...


మరి తనకి నాకు ఆ అవసరం పడుతుందని తెలుసేమో అనిపిస్తుంది నాకు...


నేను ప్రతీ సంవత్సరం తను పోయిన రోజు కూడా చాలా సింపుల్ గా ఒక పది మంది పేద పిల్లలకి 

హోటల్ లో వాళ్ళు ఇష్టపడే ఫుడ్ తినిపించి...మంచి మల్టీప్లెక్స్ లో  సినిమాకి తీసుకెళ్లి...వాళ్ళ కి

ఇష్టమైన ఐస్ క్రీమ్ తినిపించి తీసుకొస్తాను...


వాళ్లంతా మెకానిక్ షెడ్ లో పనిచేసేవాళ్ళు...ఆ పిల్లల స్నేహితులు అంతే....

మా పిల్లలు వంట మనిషిని పెట్టుకో నాన్నా అంటారు...

కానీ నేనే వద్దన్నాను...నాకూ టైం పాస్ అవుతుంది కదా...వాళ్ళు ఎప్పుడో వండింది మళ్లీ వేడి చేసుకుని తినడం అంతా ఎందుకని...

నేను పిల్లల దగ్గిరకి వెళ్లినప్పుడు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి వండి పెడతా...

మా కోడలు, అల్లుడి తో  సహా...అందరూ బావుంది బావుంది అని తింటారు పిచ్చి పిల్లలు...


ఈ ఊళ్ళో మా కోడలి తల్లి తండ్రులు ఉంటారు...

వాళ్ళు నన్ను వదలరు...

ఆవిడైతే ఆవకాయ, మాగాయలు నాకు పెట్టి పంపుతుంది...

ఫ్రెష్ గా గోంగూర పచ్చడి...మీరు తిన్న ఆ పొడులు

వడియాలు ఆవిడ పంపినవే...

అన్నయ్యగారూ అంటూ ఆప్యాయంగా ఉంటారు...


నా అదృష్టం నాకు అందరూ మంచివాళ్ళు స్నేహాపాత్రులు దొరుకుతారు...అందులో మీలాంటి వాళ్ళు ఒకరు.. అన్నారు నవ్వుతూ...

లోకల్ గా ఆఫీస్  ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు...

అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం...

కొంత మందిని అప్పుడప్పుడు భోజనానికి పిలుస్తాను.  అది నా సరదా...

నా స్నేహితులు కూడా వాళ్ళు కూడా ఏదో ఐటమ్స్ చేసి తీసికుని వస్తారు...అందరం కలిసి తింటాం...

పుస్తకాలు, సోషల్ మీడియా కాలక్షేపం...


పిల్లలదగ్గరికి వెళ్లి వస్తూ ఉంటాను...సంవత్సరంలో ఒక ఎనిమిది నెలల పిల్లల దగ్గరే ఉంటాను...

ఒక నాలుగు నెలలు ఇక్కడ ఉంటాను...

అదీ నా జీవితం...అన్నారు నవ్వుతూ...


చాలా సంతోషమండీ...మిమల్ని చూసి చాలా నేర్చుకోవాలి అన్నారు అనంత మూర్తి గారు మనస్ఫూర్తిగా...

నేనింక బయలుదేరతానూ అని లేచారు..

ఉండండి నేను డ్రాప్ చేస్తాను అని, 

వద్దన్నా ఆయన ఇంటివరకూ డ్రాప్ చేశారు శంకరం గారు...


అనంత మూర్తి గారు తాళం తీసుకుని,  లోపలికి వెళ్ళి, చెప్పులు వదిలి... సోఫాలో నిస్త్రాణంగా కూర్చున్నారు...

ఆయనికి చాలా గిల్టీ గా ఉంది...


ఒక్కసారి తన భార్య గాయత్రి గుర్తొచ్చింది...

ఉన్నంతకాలం,  తను ఎంత అహాన్ని చూపించాడో గుర్తొచ్చింది...

ఆఫీస్ కి వెళ్లి రావడమే ఘనకార్యం గా అనుకునేవాడు...

ఇంటికి వస్తే కింగ్ తను...

అన్నీ చేతికి అందించాల్సిందే తన భార్య...

కాఫీ తాగి గ్లాసు కింద పెట్టేసేవాడు...

మంచినీళ్లు తాగి కింద పెట్టేసేవాడు...


మొత్తం ఇల్లు తనే చూసుకునేది...

ఏనాడూ భార్యకి సహాయం చేయలేదు సరికదా...వంకలు పెట్టేవాడు...


స్టవ్ వెలిగించడం కూడా రాదు తనకి...

ఇప్పుడు తను లేకపోయేసరికి తెలిసొచ్చింది..తన విలువ...

భార్య పోతూ కూడా,  తను లేకపోతే  'ఏమీ రాని ఈ మనిషి ఎలా బతుకుతాడా అని బాధపడింది'...

పిల్లలకి తండ్రిని బాగా చూసుకోమని చెప్పి,  మాట తీసుకుంది...


టీ పెట్టుకోవడం ఒక్కటీ నేర్చుకున్నాడు ఎలాగో...

కానీ భార్య చేతి రుచి రాలేదు...


వంటమనిషి.. ఒక్కడికీ పొద్దున్నే వండి పడేసి పోతుంది...


వంటలో ఓనమాలు తెలియవు...

సోషల్ మీడియా తెలీదు...పిల్లలు వాట్సాప్ ఒక్కటి ఫోన్ లో పెట్టి నేర్పించారు అక్కడికి వెళ్ళినప్పుడు...

వాళ్ళ మెసేజ్ లు, ఫోటోలు చూడటం వచ్చింది...


పిల్లల దగ్గిరికి వెళ్లినా అలా పైపైన గడిపేసి వస్తాడు...

వాళ్ళల్లో మనసావాచా హాయిగా కలిసిపోడు...

జైల్లో ఉన్నట్టు గడుపుతాడు..


 కోడళ్ల తల్లిదండ్రులు ఇండియాలోనే ఉన్నా వాళ్ళు ఆడపిల్లల తల్లితండ్రులని,  వాళ్లతో కలిసి పోకూడదని...తన ఐడెంటిటీ వేరే అని ఆహంభావం తనకి..ఏనాడూ వాళ్లకి ఫోన్ చేసి స్నేహంగా మాట్లాడడు...

వాళ్ళు చేసినా ముభావంగా మాట్లాడితే....

వాళ్లు కూడా తన గంభీరతకి జంకుతారు...


బయటికి వెళ్తే వెళ్లి వచ్చేయడమే...తన చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి..అని గమనించడు...

మనుషుల్లో కలిసిపోవడం తెలీదు...స్నేహితులు లేరు...


ప్రతీ ఏడు పద్ధతిగా భార్య పోయిన రోజు,  కొడుకుని పిలిచి తద్దినం పెట్టించేవాడు...

కొడుక్కి ఎప్పుడూ  వీలు కాకపోవడంతో... ఒక చోట డబ్బులు కట్టి వాళ్ళ చే ఈ శ్రాద్ధ కర్మలు చేయిస్తున్నాడు...

ఇది జరపడం పెద్ద ఘనకార్యంగా భావించి బోర విరుచుకు తిరుగుతున్నాడు తను...

శాస్త్రోక్తంగా అన్నీ చేయిస్తున్నాననే గర్వం తనకి...


బ్రతికి ఉన్నప్పుడు మనిషిని సంతోషంగా ఉంచాలి గానీ...చనిపోయాకా ఎన్ని చేసి ఏమి లాభం...?

వాటి ప్రభావం ఏంటి..వాటి ఉపయోగం ఉందా...

ఏదో తరతరాలుగా వస్తున్న పద్ధతిని ఫాలో అవడమే...

ఇంత చిన్న విషయం తనకి తెలీదు ఇంతకాలం..


తను జీవించే విధానం కరెక్ట్ కాదని తెలిసింది ఈ రోజు...

తను తన పరిధిలో ఇంకా బాగా జీవించొచ్చు...

ఇద్దరి పరిస్థితులు ఒకటే...బాధ ఒకటే...

కానీ ఒకళ్ళ జీవితంలో జీవం తొణికిస లాడుతోంది...

ఒకళ్ళ జీవితం స్తబ్దుగా ఉంది...

కారణం.. ఆలోచనలు...

ఇల్లు ఇరుకుగా ఉన్నా, ఆలోచనలు విశాలంగా ఉండాలి...

జీవితం ప్రవాహం...ఎలాంటి ఒడిదుడుకులు, అడ్డంకులు ఉన్నా సాగిపోతుంది...దానికి ఢోకా లేదు... 

కొన్ని బాధలు తీరేవి కావు...

కనీసం కొందరి బాధల నైనా తీర్చి ఆనందం పొందొచ్చు...

ఆనందం పంచొచ్చు...


వెంటనే బీరువా తెరిచి ఫోటో ఆల్బమ్స్ తీసాడు...

అన్నీ చూసాడు...

 భార్య పిల్లలతో వాళ్ళ చిన్నప్పుడు నవ్వుతూ ఉన్న ఫోటోలు ఉన్నాయి..

తనతో నవ్వుతూ....నేను తన  భుజంమీద చెయ్యి వేసిన   ఒక్క ఫోటో లేదు...

ఎప్పుడైనా ఎక్కడికైనా తను సరదాగా తీసుకెళ్తేకదా అనుకున్నాడు...

ఏనాడైనా ప్రేమగా ఆహ్లాదం గా ఉన్నాడా...?


పిల్లల చిన్నప్పుడు,  వాళ్లతో భార్య నవ్వుతూ ఉన్న ఫోటోలు...

భార్య తన  తోబుట్టువులతో నవ్వుతున్న ఫోటోలు..

తమ పెళ్లిలో నవ్వుతున్న ఫోటోలు ఉన్నాయి...

కొన్ని బయటికి తీసాడు...


గోడమీదున్న ఫోటో తీసేసి లోపల పెట్టేసాడు...


నేను కూడా ఈ ఫోటోలన్నీ అందంగా సహజంగా  ఫ్రేమ్ కట్టించి పెడతాను...

నేనూ ఇప్పుడైనా సాటి మనుషులు ఆనందపడే పనులు చేస్తాను...


శంకర నారాయణ నన్ను ముందే కలిసుంటే ఎంత బాగుండేది అనుకున్నాడు..

ఒక మనిషి ఎలా ఉండాలో, ఉండొచ్చో చూపించాడు నాకు అనుకున్నాడు ఆయన...


'గాయత్రీ నన్ను క్షమించు అనుకుంటే'.. మనస్సు నిజాయితీగా కదిలి,  కళ్ళు చెమర్చాయి అనంత మూర్తికి...


                          ******