9, డిసెంబర్ 2020, బుధవారం

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 32 /

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 32  / Sri Devi Mahatyam - Durga Saptasati - 32 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 9*

*🌻. నిశుంభ వధ - 2 🌻*


17. భయంకరపరాక్రముడైన అతని సోదరుడు నిశుంభుడు నేలగూలగా శుంభుడు మిక్కిలి రోషంతో అంబికను చంపడానికి బయలుదేరాడు.


18. తన రథంపై నిలిచి, మిక్కిలి పొడవై అసమానమైన తన ఎనిమిది చేతులలో మహోత్తమ ఆయుధాలు ధరించి ఆకాసమంతా వ్యాపించి ప్రకాశిస్తున్నాడు.


19. అతడు రావడం చూసి దేవి శంఖాన్ని పూరించి ధనుష్టంకారం ఒనర్చింది. ఆ శబ్దం అత్యంత దుర్భరమై ఉంది. 


20. మరియు సకలదైత్య సైన్యాల ధైర్యం సడలిపోయే తన ఘంటానాదాలతో ఆమె దిక్కులను నింపివేసింది.


21. అంతట సింహం తన గొప్ప గర్జినినాదంతో ఏనుగుల మహామదం దిగజారిపోయేట్లు దశదిశలను నిండించివేసింది.


22. అంతట కాళి ఆకాశానికి ఎగిరి (క్రిందికి దూకుతూ) భూమిని తన రెండు చేతులతో కొట్టింది. ఆ శబ్దంలో అంతకు ముందటి శబ్దాలన్ని మునిగిపోయాయి.


23. కీడును సూచించే మహాట్టహాసాన్ని (మిక్కిలి బిగ్గరగా, దీర్ఘమైన నవ్వు) శివదూతి చేసింది. ఆ శబ్దాన్ని విని అసురులు భీతి చెందారు. శంభునికి అత్యంత కోపం వచ్చింది.


24. "దురాత్మా! నిలువు, నిలువు!” అని అంబిక పలుకగా, ఆకాశంలో ఉన్న దేవతలు జయధ్వానాలు ఒనర్చారు. 


25. శుంభుడు వస్తూ ప్రయోగించిన బల్లెం అతి భయంకరంగా, అగ్నిసమూహం వలే ప్రకాశిస్తుండగా, దేవి (దానిపైకి) విసరిన ఒక గొప్ప కొరివి వల్ల అది ఆరిపోయింది.


26. రాజా! శుంభుడు చేసిన సింహనాదం మూడు లోకాల నడిమిధాలాన్నంతా నిండిపోయింది. కాని (దేవి వైసిన) భయంకర్మెన పిడుగు యొక్క ఉటుము ఆ శబ్దాన్ని కప్పివేసింది.


27. శుంభుని బాణాలను దేవి, దేవి బాణాలను శుంభుడు వందల కొద్ది, వేల కొద్ది త్రుంచివేసారు.


28. అంత చండిక రోషపూరితయై అతనిని త్రిశూలంతో గట్టిగా పొడిచింది. అతడు ఆ పోటుకు మూర్ఛిల్లి భూమిపై పడ్డాడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు: