10, జులై 2025, గురువారం

Panchaag

 


అద్దం లాంటి గురువు..

 *అద్దం లాంటి గురువు...!!*


గురువులే అద్దము

సరి చేసుకో జీవిత అందము

గురువు సమీపములో ఉంటే

ప్రవర్తన చక్క చేసుకున్నట్లే..!!


గురువు లోని సదాచారం

బ్రతుకు తెరువు కు సమాచారం

తప్పొప్పుల దర్పణం

మార్గ నిర్దేశిక ప్రయాణం..!!


ప్రతిపాదనల అలంకారం

అందుకొనే ఆచరణలో మమకారం

గురువు మార్గంలో నడవాలి

ఇతరులకోసం జీవించాలి...!!


ప్రతి సమస్యను తీరుస్తూ

కావలసిన జ్ఞానాన్ని అందిస్తూ

సూక్ష్మ బుద్ధిని కలిగి

నిర్ణయాలలో స్వేచ్ఛతో తిరిగి..!!


నీడలా వెంటే ఉండి

నిచ్చెనల ఎదుగుదలలో తోడుండి

జ్ఞానాన్ని బోధిస్తూ

అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తూ..!!


గాలిపటంలా వివరిస్తుంటే

దారమై అండగా నిలిచి ఉండే

గంధముల తరుగుతూనే

విజ్ఞాన సువాసనలు పంచెను..!!


వృత్తులు ఏవైనప్పటికీ

గురువు బోధనలే ఎప్పటికీ

సమస్త శాస్త్రాలకు వారధి

త్రోవు కొనేవారికి విజ్ఞాన నిధి...!!


కొప్పుల ప్రసాద్,

 నంద్యాల.

గురు పౌర్ణమి

 *****గురు పౌర్ణమి*****


గురువంటే విద్యా దాత

జ్ఞాన ప్రదాత,

పౌర్ణమి అంటే వెలుతురు చల్లదనం.

గురుపౌర్ణమి అంటే జ్ఞాన జ్యోతి ..


సనాతన భారతీయధర్మం లో గురువుపాత్ర విశిష్టం,

గురువు అంటే బ్రతుకును తీర్చి దిద్దువాడు,మార్గదర్శి,

వ్యాసునికి పూర్వం ఎంత మంది గురువులున్నప్పటికీ, 

వేద విభజనచేసిమానవాళికి

ఉపయుక్తంచేసింది వ్యాసుడు.


అందుకే గురు పీఠం వ్యాస పీఠం అయినది,      

వ్యాసునిజన్మదినం ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి,        

భారత, భాగవతాది అష్టా దశ పురాణములు,    

మానవాళికి అందించిన జ్ఞాన ప్రదాత వ్యాస మహర్షి.


నేడు వ్యాసుని కొలిచిన గురుదేవుల సేవించినట్లే..


చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి,రాజమండ్రి.

జన్మదినం

 "" జన్మదినం ""


జన్మకో శివరాత్రిలా 

ప్రతి ఏడాదీ వచ్చేది...

వచ్చి పోతూ ఒక సంవత్సరం ఆయుష్షును తీసుకెళ్ళేది...

జన్మదినమైన సుదినం!


పెద్దలు శుభాశీస్సులను...

పిన్నలు శుభాకాంక్షలను...

తెలపాల్సిన తరుణం...

మరపురాని, మరువలేని 

మధురమైనది జన్మదినం!


వెలుగులు పంచుతూ...

కరిగే క్రొవ్వొత్తిని ఆదర్శంగా తీసుకుని...

ప్రతి జన్మదినం రోజున 

మానవత్వాన్ని పంచుతూ...

ఉన్నదానిలో పదుగురికి సాయపడుతూ...

ఉన్నదానితో సంతృప్తి చెందుతూ....

మహోన్నతమైన మానవజన్మను సార్ధకం చేసుకోవాలి 

పుణ్యకార్యాలతో ప్రభవిస్తూ...

కన్నవారిపై కరుణను కురిపిస్తూ...

కట్టుకున్న వారిపై ప్రేమను వర్షిస్తూ....

బంధుమిత్రులకు తలలో నాలుకయై నిలుస్తూ...

చేతనైన మేర సాయం అందిస్తూ...

ఉరిమే ఉత్సాహంతో జన్మదినం జరుపుకోవాలి!

చిన్నదైన జీవితాన్ని నందనవనం చేసుకోవాలి!

జీవన బృందావనంలో ఆనందపు కుసుమాలను

పూయించాలి!!!

***********************

మీ శుభాశీస్సులను, శుభాకాంక్షలను ఆశిస్తూ...

మీ అభిమాని:

డా. ఆళ్ళ నాగేశ్వరరావు

( కమల శ్రీ)

కవి... రచయిత... ఆర్టీసీ కండక్టర్

తెనాలి

చరవాణి:7416638823

కాలం రెక్కల కింద

 *కాలం రెక్కల కింద నడుచుకుంటూ...!!*


ఈ పోరాటం ఈనాటిది కాదు .

యుగాల చరిత్రకు సాక్షి భూతంగా నిదర్శనం

మనిషి దిగంతాలుగా పరిణితి చెందుతూ 

నిరంతర ప్రయాణానికి ఎదురుచూపులు..


ఎప్పుడూ భవిష్యత్తును ప్రశ్నగానే వేసుకుంటూ 

కాలం రెక్కల కింద నడుచుకుంటూ 

సజీవ కళలకు జీవం పోద్దామని 

వేసే ప్రతి అడుగు జవాబులకు అన్వేషణ...


కొండల్ని కోనల్ని మహాసముద్రాలని దాటుకుంటూ 

ఆహారపు అన్వేషణకు ఎన్నో పోరాటాలు 

పిడికెడు అన్నాన్ని ముద్దగా మార్చుకుంటూ 

నేలపై నిరంతరము సాగిన దాడులెన్నో...


బడుగు జీవులలో పుట్టిన దుఃఖం కదులుతూ 

మనిషిని మరమనిషిగా మార్చుకుంది 

సమూహాలై ప్రపంచాన్ని మోస్తూ 

అదృశ్య శక్తులేవో మోస్తున్నట్లు భ్రమ పడ్డారు..


జీవితాన్ని మోస్తున్నటువంటి మనుషులే 

నీరు నేలను మోయడం సులభమే 

ఖగోళాన్ని ఉదరగోళంలా చూసుకుంటూ 

దానికోసం నిత్య శ్రమజీవిలా కదులుతుంటారు...


రెండు కళ్ళు మూతలు పడుతున్నప్పటికీ 

మనసులోని ఆశల్ని నెరవేర్చుకునేందుకు

జీవితమౌన సముద్రాన్ని దాటేందుకు 

ఎల్లప్పుడూ కెరటాల రెక్కలతో ఎగురుతుంటారు..


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

ఎగ్జిమాయె యైన

 ఎగ్జిమాయె యైన నెల్లర్జి దురదైన

సొరియసిస్సు గాని శోభి గాని

తామరైన నిజము తగ్గించు హోమియో

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: చర్మవ్యాధులు కనిపించగానే అందరూ మేధావుల్లా డాక్టర్ల అవతారమెత్తేసి, ఇంగ్లీష్ మందుల షాపు నుంచి సిట్రాజెన్, ఏంటీబయోటిక్ టాబ్లెట్లు, ఏంటీబయోటిక్ ఆయింట్మెంట్లూ కొని తెచ్చేసుకుని వాడేస్తూ, దానిని కట్టడిలో పెట్టేసిన వీరుల్లా ఫీలైపోతారు! ఆనక అది తొండ ముదిరి ఊసరవెల్లిగా మారి, చుక్కలు చూపించినప్పటికి తమ వల్ల కాదనుకుని ఇంగ్లీషు స్కిన్ స్పెషలిస్టులందరి తెలివితేటలను కూడా చర్మంపై ప్రయోగిస్తూ, జీవితకాలం పాటు దానితో రాజీపడి గోక్కుంటూ, మా బ్రతుకింతేనని సరిపెట్టుకుని, మచ్చలు, దురదలు, దద్దుర్లు, పొలుసులు, పగుళ్ళు, రక్తాలు, చీము కంపులతో గతిలేక గోక్కుంటూ బ్రతికేస్తారు! నిజానికి వీళ్ళంతా తెలుసుకోవలసిన నగ్న సత్యం ఒకటుంది! అదేమిటంటే "ఇంగ్లీషు వైద్యంలోని ఏ మందులూ, ఆయింట్మెంట్లూ, ఏ చర్మవ్యాధినీ నయం చేయకుండా, లోలోపల అణచిపెట్టి (సప్రెస్ చేసి), ముదరబెట్టి, మరింత మొండి వ్యాధిగా మార్చి, ఎప్పటికీ మీరు వాళ్ళ చుట్టూ తిరిగే కుక్కలుగా మార్చుకుంటారు! అదే ఆంగ్లేయుల శైలి, ఆంగ్ల వైద్య శైలీ! సమస్య లేనివాడు వాళ్ళను పట్టించుకోడు! కాబట్టి అర్జంటుగా రిలీఫ్ కనిపించాలి, ఆహా! భలే వైద్యమని అనిపించాలి, ఆ ఒక్క రోగానికి వేసుకునే మందులే వీళ్ళకు తెలియకుండా వంద రోగాలను పుట్టించి, వీడు అందరు స్పెషలిస్టులకూ ఆహారమవ్వాలి! ఇది కదా ఇంగ్లీషు స్ట్రేటజీ! ఇదే నచ్చుతుంది అందరికీ! ఎందుకంటే అందరూ దాని మాయలో ఏనాడో జాంబీలుగా మారిపోయారు కాబట్టి! నిజానికి ఎలర్జీలు గానీ, దురదలు, చర్మవ్యాధులు ఏమైనా కనిపించిన తొలి రోజుల్లో దానిపై కేవలం కొబ్బరి నూనె రాసుకుని పడుకోవాలే తప్ప, ఏ మాత్రలూ, ఆయింట్మెంట్లూ వాడకూడదు! దానిని ఏమీ గెలక్కుండా వదిలేస్తే, మన ఆటోఇమ్యూన్ వ్వవస్థే దానిని నయం చేసేస్తుంది! కానీ అర్జంటుగా రిలీఫ్ వచ్చెయ్యాలని రాసే ఆయింట్మెంట్లు దానిని చర్మం దగ్గర అడ్డుకుని, రివర్స్ లో రక్తంలోకి పోయేలా చేస్తాయి! అలా రక్తంలోకి పోయినది రక్తమంతా తిరుగుతూ, అన్ని చోట్లకూ విస్తరిస్తుంది! ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ బయటపడటానికి ప్రయత్నిస్తుంది, అక్కడ కూడా ఆయింట్మెంట్లు రాస్తే, ఇంకొక కొత్త ప్లేస్ చూసుకుంటూ, చర్మానికి, అంతర్గత అవయవాలకూ దాని ప్రభావాన్ని విస్తరిస్తూ, ఆస్తమా, కేన్సర్, గుండె జబ్బులు, మైగ్రేన్ తలనొప్పులు, ఫిట్స్, బ్రెయిన్ ట్యూమర్లు, మానసిక జబ్బులు, షుగర్, బీపీ, థైరాయిడ్, కీళ్ళు, కిడ్నీ, లివర్ జబ్బులు, ఇలా ఎన్నో జబ్బుల సృష్టికి బీజాలు వేస్తుంది! పైకి రాసేది పసరైనా, ఆయింట్మెంట్ అయినా, వేసేది ఇంగ్లీషులో ఏ మందైనా, ఏ ఇంజక్షనైనా సప్రెషన్ క్రిందకే వస్తుంది! పిల్లి అయినా తలుపులు మూసి కొడితే తిరగబడుతుంది, అణచివేతకు గురైన వాడు ఎవ్వడైనా ఎప్పుడో ఒకప్పుడు మన మీద పడి, మన పీక నొక్కి, ప్రాణం తీయక మానడు! అదే సృష్టి ధర్మం! మందులే వాడుదాం అనుకుంటే హోమియో వాడండి, ఇది మాత్రమే ప్రకృతి ధర్మాన్ని అనుసరించి నివారణ చేస్తుంది! లేదంటే అసలు ఏ మందులూ వాడకుండా, యోగా, ప్రాణాయామం, ధ్యానం, ప్రకృతి ఆహారంతో కొన్నాళ్లు గడపండి! సకల రోగాలూ సరైపోతాయి! ముఖ్యంగా చెప్పొచ్చేదేంటంటే ఎలర్జీలు, శోభి, దురద, ఎగ్జిమా, తామర, సొరియాసిస్ ఇలా ప్రతీ చర్మ వ్యాధినీ హోమియోతో సమర్థవంతంగా నయం చేయవచ్చు! ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమ్ పడుతుంది, కాబట్టి ఓర్పు, ఓపికతో నిలబడి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోండి! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌷గురువారం 10 జూలై 2025🌷*

``

           *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మనసమస్త 

పాపాలని తీసేస్తుంది.               

``

    *వాల్మీకి రామాయణం*               

          *94 వ భాగం*

```

దేవతలందరితో పాటుగా అక్కడికి వచ్చిన శివుడు అన్నాడు… “నాయనా రామా! నీ తమ్ముడైన భరతుడు అయోధ్యలో దీనంగా ఉన్నాడు, ఆయనని ఓదార్చు. నీ తల్లి అయిన కౌసల్యని ఊరడించు. కైకేయి, సుమిత్రలకి నమస్కరించు. లక్ష్మణుడిని ఊరడించు. ఇక్ష్వాకు వంశీయులు ఇంతకాలం నుంచి పరంపరాగతంగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించి, నీవారిని సంతోషపెట్టు. ఏ వంశంలో నువ్వు జన్మించావో ఆ వంశాన్ని పెంచు. యాగాలు చెయ్యి, బ్రాహ్మణులకు భూరి దానాలు చేసి పరమ సంతృప్తిని పొందు. తదనంతరం స్వర్గానికి చేరుకుందువుగాని. అదిగో, ఆ విమానంలో మీ తండ్రిగారైన దశరథ మహారాజు ఉన్నారు, వెళ్ళి చూడు” అన్నాడు.


తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేశాడు. 


అప్పుడు దశరథుడు రాముడిని ఒకసారి ఆనందంతో గట్టిగా కౌగలించుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకుని… “రామా! నేను స్వర్గలోకంలో విహరించానురా, ఇంద్రలోకంలో తిరిగానురా, కాని నువ్వు లేకపోతే అది కూడా నాకు పెద్ద సుఖంగా అనిపించలేదురా. ఆనాడు నీకు పట్టాభిషేకాన్ని చేద్దాము అనుకోవడం, నేను ఎంతో ఆనందాన్ని పొందడం, రాత్రి కైక దగ్గరికి వెళ్ళడం, కైక వరాలు కోరడం, నీ పట్టాభిషేకం భగ్నం అవ్వడం, ఆనాడు నేను ఏడ్చి ఏడ్చి నా శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. నేను ఇప్పుడు తెలుసుకున్నదేంటంటే, ఆ పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కారణం దేవతలు. రావణ సంహారం జరగాలి కనుక దేవతలు ఆనాడు నీ పట్టాభిషేకాన్ని భగ్నం చేశారు” అన్నాడు.


అప్పుడు రాముడు… “ఆనాడు మీరు భావనా వ్యగ్రతని పొంది, 

నా పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కైకమ్మ కారణం అనుకొని… 'ఇప్పుడే నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నువ్వు నా భార్యవి కావు, నీ కుమారుడు భరతుడు నాకు కొడుకు కాదు' అన్నారు. ఆ మాటని మీరు ఉపసంహారం చెయ్యండి, నేను సంతోషిస్తాను” అన్నాడు.


అప్పుడు దశరథుడు… “నువ్వు కోరుకున్నట్టు తప్పకుండా జరుగుతుంది” అన్నాడు. 


తరువాత ఆయన లక్ష్మణుడితో…

“నాయన లక్ష్మణా! నువ్వురా ప్రాజ్ఞుడవి అంటే. చక్కగా అన్నయ్య సేవ చేశావు, ఇలాగే సర్వకాలములయందు అన్నయ్యని, వదినని సేవిస్తూ నీ జన్మ చరితార్ధం చేసుకో !” అన్నాడు.


అప్పుడు దశరథుడు రామలక్ష్మణుల వెనకాల తనకి నమస్కారం చేస్తూ నిలబడ్డ సీతమ్మని దగ్గరికి పిలిచి… “అమ్మా సీతమ్మా! నీ మనస్సుకి కష్టం కలిగిందా. 'సీతా! నీతో నాకు ప్రయోజనం లేదు, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు' అని మావాడు అన్నాడు కదా, అలా అన్నాడని నువ్వు బాధపడ్డావా. ఇవ్వాళ నేను ఊర్ధలోకవాసినమ్మా, తప్పు మాట చెబితే కిందకి పడిపోతాను, నీకొక నిజం చెప్పనా, రాముడికి నీమీద ఎప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు. ఆ మాట ఎందుకన్నాడో తెలుసా, నిన్ను వేరొకరు ఎప్పుడూ వేలెత్తి చూపించకూడదని మావాడి తాపత్రయం.


కూతురా! నువ్వు ఇవ్వాళ చేసిన పతి సేవ వల్ల జరిగిన గొప్పతనం ఏమిటో తెలుసా, ఇంతకు పూర్వం పతివ్రతలై భర్తని సేవించిన వాళ్ళందరి చరిత్రలను పక్కన పెట్టి, పతివ్రత అంటె సీతమ్మ అని నిన్ను చూపిస్తున్నారు. నీలాంటి కోడలు నా వంశానికి రావడం నా అదృష్టం. నీకు నేను ఇంక చెప్పడానికి ఏమిలేదమ్మా, నీకు అన్నీ తెలుసు, కాని మామగారిగా ఒక్క మాట చెబుతాను. అమ్మా! భర్త మాత్రమే దైవము అని తెలుసుకో!” అన్నాడు.


తరువాత దశరథుడు విమానంలో ఊర్ధలోకాలకి వెళ్ళిపోయాడు.


అప్పుడు దేవేంద్రుడు… “రామా! ఒకసారి మేము వచ్చి దర్శనం ఇస్తే, ఆ దర్శనం వృధా కాకూడదు. అందుకని ఏదన్నా ఒక వరం కోరుకో” అన్నాడు.


రాముడన్నాడు… “నాకోసమని తమ యొక్క కొడుకులని, భార్యలని విడిచిపెట్టి ఎన్నో కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని మిగిలాయి, మిగిలిన వాటిలో కొన్నిటికి చేతులు తెగిపోయాయి, కొన్నిటికి కాళ్ళు తెగిపోయాయి, కొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఓడుతూ పడున్నాయి, కొన్ని యమ సదనమునకు వెళ్ళిపోయాయి. మీరు నిజంగా నాయందు ప్రీతి చెందినవారైతే, యమ సదనమునకు వెళ్ళిన వానరములన్నీ బతకాలి, యుద్ధభూమిలో కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి పడిపోయిన కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు మళ్ళీ జవసత్వములతో పైకి లేవాలి. అవన్నీ యుద్ధానికి వచ్చేటప్పుడు ఎంత బలంతో ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ అంతే బలంతో ఉండాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు ఫలించాలి, పువ్వులు పుయ్యాలి, అక్కడ సమృద్ధిగా తేనె ఉండాలి, వాళ్ళు తాగడానికి ఎప్పుడూ మంచి నీరు ప్రవహిస్తూ ఉండాలి” అన్నాడు.


ఇంద్రుడు… “తప్పకుండా నీకు 

ఈ వరాన్ని కటాక్షిస్తున్నాను” అన్నాడు.


వెంటనే యుద్ధ భూమిలో పడి ఉన్నవారు లేచి వచ్చారు, యమ సదనానికి వెళ్ళినవారు తిరిగి వచ్చేశారు. వానరులందరూ పరమ సంతోషాన్ని పొందారు.


ఆరోజు రాత్రి అక్కడ విశ్రమించారు, మరునాడు ఉదయం రాముడు విభీషణుడిని పిలిచి… “నేను తొందరగా అయోధ్య చేరుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడినుంచి కాలి నడకన వెళితే చాలా సమయం పడుతుంది కనుక తొందరగా వెళ్ళడానికి ఏదన్నా ప్రయాణ సాధనం ఏర్పాటు అవుతుందా” అన్నాడు.


విభీషణుడు… “మన దగ్గర పుష్పక విమానం ఉంది, ఉత్తర క్షణంలో మీరు అయోధ్యకి చేరిపోతారు. ఇన్ని కష్టాలు పడ్డారు కదా, సీతమ్మ లభించింది కదా, సీతమ్మ అభ్యంగన స్నానం ఆచరించి, పట్టు పుట్టం కట్టుకుని, నగలు అలంకరించుకుంది కదా, మీరు కూడా తలస్నానం చేసి, పట్టు పుట్టాలు కట్టుకుని, ఆభరణములను దాల్చి, నా దగ్గర బహుమతులు అందుకొని మీరు బయలుదేరితే నేను ప్రీతి పొందుతాను” అన్నాడు. 


అప్పుడు రాముడు… “నా తమ్ముడైన భరతుడు అక్కడ జటలు పెంచుకొని, మట్టి పట్టిన వస్త్రం కట్టుకొని, నా పాదుకలని సింహాసనం మీద పెట్టి, నన్ను చూడాలని శోకిస్తు రాజ్యం చేస్తున్నాడు. ఆ భరతుడు స్నానం చెయ్యకముందు నేను స్నానం చెయ్యనా. భరతుడు పట్టుపుట్టం కట్టుకోకముందు నేను కట్టుకోనా. భరతుడు ఆభరణాలు పెట్టుకోకముందు నేను పెట్టుకోనా. నాకు తొందరగా భరతుడిని చూడాలని ఉంది” అన్నాడు.


విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు, రాముడు ఆ విమానాన్ని అధిరోహించాక… “మీరందరూ నాకోసం చాలా కష్టపడ్డారు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బయలుదేరతాను.” అని చెబుతుండగా, అక్కడున్న వాళ్ళందరూ అన్నారు… “మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము, మేము కూడా మీతో అయోధ్యకి వచ్చేస్తాము. మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, మిమ్మల్ని కన్న కౌసల్యమాతని ఒకసారి చూడాలని ఉంది, మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటే చూడాలని ఉంది రామా” అన్నారు.


విశాల హృదయుడైన రాముడు సరే అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ 

ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. 


అప్పుడు రాముడు సీతమ్మకి ఆ పుష్పక విమానం నుండి కిందకి చూపిస్తూ… “సీతా చూశావా, ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం. అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం, అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం, ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం. ఆ సముద్రంలో ఉన్న సేతువుని మేము వానరములతో కలిసి నిర్మించాము. ఇక్కడే మేమందరమూ కూర్చుని 

ఈ సముద్రాన్ని ఎలా దాటడం అని అనుకున్నాము. ఇదే కిష్కింద, ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకి నీ జాడ కనిపెట్టడానికి బయలుదేరారు” అని చెప్తుంటే సుగ్రీవుడు గబగబా వచ్చి… “రామా! మనం కిష్కింద మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తార, రుమ చూస్తుంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందాము” అన్నాడు.


అప్పుడా పుష్పకాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి తార, రుమలకి విషయాన్ని చెప్పి రమ్మన్నాడు. అప్పుడు తార మిగిలిన ఆడవారి దగ్గరికి వెళ్ళి … “రండి, రండి, సుగ్రీవుడు జయాన్ని సాధించి రామ పట్టాభిషేకానికి వెళుతున్నారు. మంచి మంచి బట్టలు, ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చెయ్యండి” అన్నది. 


అప్పుడు వాళ్ళు మానవ కాంతలుగా కామరూపాలని పొంది, పట్టుపుట్టాలు, ఆభరణములు వేసుకుని, పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసేసి, లోపలికి ఎక్కి… “సీతమ్మ ఎక్కడ? సీతమ్మ ఎక్కడ?” అని అడిగారు.


“ఆవిడే సీతమ్మ” అని చూపిస్తే అందరూ వెళ్ళి ఆమెకి నమస్కరించారు. 


అప్పుడు సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంగా కౌగలించుకొని, పలకరించింది.


మళ్ళీ రాముడన్నాడు… “సీతా! అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను, సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి యొక్క ఆశ్రమం. అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను. చూశావా సీతా, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం, ఇక్కడే రావణుడు నిన్ను అపహరించాడు” అని రాముడు చెబుతుంటే సీతమ్మ గబుక్కున రాముడి చెయ్యి పట్టుకుంది.


కొంతముందుకి వెళ్ళాక… “అదే అగస్త్య మహర్షి ఆశ్రమం, ఇక్కడే అగస్త్యడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ కనపడుతున్నది సుతీక్షణుడి ఆశ్రమం. అక్కడ కనపడుతున్నది చిత్రకూట పర్వతం, ఇక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళము” అన్నాడు.


అలా ఆ పుష్పకం కొంత ముందుకి వెళ్ళాక వాళ్ళకి భారద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. 


అప్పుడు ఆ పుష్పకాన్ని అక్కడ దింపి, భారద్వాజుడికి నమస్కరించారు. 


అప్పుడు భారద్వాజుడు… “రామా! నేను నా తపఃశక్తితో అన్ని కాలములయందు నీ గురించి తెలుసుకుంటున్నాను. నువ్వు రావణ సంహారం చెయ్యడం కూడా నాకు తెలుసు. ఇవ్వాళ ఒక్క రాత్రి నా దగ్గర ఉండి, విశ్రాంతి తీసుకొని, నా ఆతిధ్యం తీసుకొని బయలుదేరు” అన్నాడు.


అప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి… “హనుమా! నువ్వు ఇక్కడినుంచి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిభేరపురంలో గుహుడు ఉంటాడు, అతను నాకు మిక్కిలి స్నేహితుడు. ఆ గుహుడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. తరువాత అక్కడినుంచి బయలుదేరి అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా అని కనుక్కొని నందిగ్రామానికి వెళ్ళి, నేను తిరిగొస్తున్నాను అని భరతుడికి చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు. భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను, భరతుడు అయోధ్యని పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి తిరిగిరా” అన్నాడు.


వెంటనే హనుమంతుడు అక్కడినుంచి బయలుదేరి గుహుడిని కలుసుకొని, ఆయనని పలకరించి, రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తరువాత అక్కడినుంచి బయలుదేరి వెళ్ళి భరతుడిని కలుసుకొని, రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలని వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు.


మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయేముందు భారద్వాజుడు అన్నాడు… “నీ ధర్మానుష్టానికి నాకు ప్రీతి కలిగింది రామా. నీకొక వరం ఇస్తాను, ఏదన్నా కోరుకో” అన్నాడు.


అప్పుడు రాముడు… “వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫలసంవృద్ధి ఉండాలని నేను కోరాను. ఇప్పుడు ఇక్కడినుంచి 3 యోజనముల దూరం వరకూ అయోధ్యకి ప్రయాణిస్తాము. ఆ మార్గంలో కూడా చెట్లన్నీ ఫల పుష్పభరితములై, తేనెపట్లతో తేనెలు కారుతూ ఉండాలి” అని అడిగాడు.


తరువాత భారద్వాజుడి దగ్గర సెలవు తీసుకొని పెద్ద కోలాహలంతో నందిగ్రామానికి రాముడు చేరుకున్నాడు.


అప్పుడు భరతుడు తన సైనికులతో “రాముడు వచ్చేస్తున్నాడు, అయోధ్యలో ఉన్న తల్లులని తీసుకురండి, రథాలని తీసుకురండి, పెద్దవాళ్ళని తీసుకురండి, అందరినీ అయోధ్యకి రమ్మనండి. అంతటా పసుపు నీరు, గంధపు నీరు జల్లించండి. దివ్యమైన ధూపములు వెయ్యండి. అందరమూ కలిసి రాముడిని నందిగ్రామం నుంచి అయోధ్యకి పట్టాభిషేకానికి తీసుకువెళదాము” అని భరతుడు ఆజ్ఞాపించాడు. 


రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు.


రాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు. 


ఇది చూసి సుగ్రీవ విభీషణులు కన్నుల వెంట నీళ్ళు కారాయి. 


వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకొని… “”ఇంతకముందు మేము నలుగురము, ఇవ్వాల్టి నుంచి మనం అయిదుగురము అన్నదమ్ములము సుగ్రీవా” అన్నాడు. 


తరువాత అక్కడున్న గంధమాదుడిని, మైందుడిని మొదలైనవారిని భరతుడికి పరిచయం చేశారు. 


అప్పుడు భరతుడు ఆ వానరాలని 'మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు, మీరు ఎంత మంచివారుగా' అని అందరినీ కౌగలించుకున్నాడు.


పుష్పకం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వాళ్ళ ప్రేమలని, వాళ్ళ అలంకారాలని చూసి ఆశ్చర్యపోయారు. 


అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయ, సుమిత్రలు అన్నారు… 

“ఈ వానర కాంతలందరికి మేమే తలస్నానాలు చేయిస్తాము” అని, వాళ్ళందరికీ తలస్నానం చేయించారు.


తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని “కుబేరుడి దగ్గరికి వెళ్ళిపో” అని ఆజ్ఞాపించాడు. అప్పుడా పుష్పకం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది.```


        *రేపు….95వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

గురువారం🪷* *🌹10 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🪷గురువారం🪷*

 *🌹10 జూలై 2025🌹*  

   *దృగ్గణిత పంచాంగం*                  

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - శుక్లపక్షం*


*తిథి  : పౌర్ణమి* రా 02.06 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం   : పూర్వాషాఢ* పూర్తిగా రోజంతా రాత్రితో సహా.

         *ఈనాటి పర్వం*     

     *🌹గురుపూర్ణిమ🌹* 

         *వ్యాస పూర్ణిమ*


*యోగం : ఐంద్ర* రా 09.38 వరకు ఉపరి *వైధృతి*

*కరణం   : భద్ర* మ 01.55 *బవ* రా 02.06 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:* 

 *ఉ 06.30 - 08.00 & 11.00 - 12.00*

అమృత కాలం  : *రా 12.55 - 02.35*

అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.39* 

*వర్జ్యం      : మ 02.52 - 04.33*

*దుర్ముహూర్తం  : ఉ 10.02 - 10.54 మ 03.16 - 04.08*

*రాహు కాలం   : మ 01.51 - 03.29*

గుళికకాళం       : *ఉ 08.57 - 10.35*

యమగండం     : *ఉ 05.41 - 07.19*

సూర్యరాశి : *మిధునం*                            

చంద్రరాశి : *ధనస్సు*

సూర్యోదయం :*ఉ 05.48*

సూర్యాస్తమయం :*సా 06.55*


*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.41 - 08.18*

సంగవ కాలం         :      *08.18 - 10.54*

మధ్యాహ్న కాలం    :     *10.54 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 04.08*

*ఆబ్ధికం తిధి         : ఆషాఢ పూర్ణిమ*

సాయంకాలం        :  *సా 04.08 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.56*

రాత్రి కాలం           :*రా 08.56 - 11.51*

నిశీధి కాలం          :*రా 11.51 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.14 - 04.58*

---------------------------------------------------

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీదత్త నవరత్నమాలికా స్తోత్రం*


*విత్తతర్షరహితైర్మనుజానాం*  

*సత్తమైరనిశసేవ్యపదాబ్జమ్ ।*


     *జై దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🌹🌷🌹🌷🌷🌹

గురు సాక్షాత్

 *గురు సాక్షాత్ పరబ్రహ్మ*🙏


లోక కళ్యాణం కోసం

భారత భాగవత అష్టాదశ పురాణాలు

నాల్గు వేదాలు ఈ జగత్తుకు

అందించిన బాదరాయణుడు

భగవాన్ వేదావ్యాస మునీంద్రుల వారి జన్మదినం నేడు గురు పూర్ణిమ.ఆయనను స్మరిద్దాం


పిల్లల్లో సంస్కారం మంచి బుద్దిని

మంచి ప్రవర్తనను మంచి నడవడికను నేర్పుతూ పెంచే తల్లీ తండ్రులే ఆది గురువులు


జ్ఞానం విద్యను భోధిస్తూ

విద్యార్థుల ఔన్నత్యానికి

తోడ్పడుతూ ప్రగతి బాట చూపే

అధ్యాపకులే సద్గురువులు


మానవుల్లో పేరుకుపోయిన మూఢత్వం అనే అంధకారాన్నితొలగించి వారిలో జ్ఞాన జ్యోతినివెలిగించి మంచి మార్గంలో పయనింప జేసిన రామానుజులు మధ్వాచార్యులు రామ కృష్ణులు పరమ గురువులు ఈశ్వర రూపులు


గురువుల పూజించాలి. వారినిశక్తిమేరా సత్కరించాలి. వారి ఆశీస్సులు పొందాలి. పవితమైన సంతోష జీవనం గడపాలి. ఈ లోకాన్ని తేజోవంతం చేయాలి.


*కృష్ణం వందే జగద్గురుమ్*


*మిత్రాజీ*

(గుండవరం ప్రభాకర్ రావు పంతులు)

ఫోన్ నం. 9949267638

జ్ఞానాన్ని ఆరాధించే రోజు

 జ్ఞానాన్ని ఆరాధించే రోజు ఇది

"గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః 

గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః "ఈ శ్లోకం చిన్నదే కానీ అర్థం చాలా లోతైనది. గురువు అనే వ్యక్తిని బ్రహ్మ, విష్ణు, శివునిలా మూడు రూపాల్లో చూస్తూ, చివరికి పరబ్రహ్మతో సమానంగా పరిగణించడం భారతీయ సంస్కృతి గొప్పతనం. ఈ భావనను ప్రతిఫలించే పవిత్రదినమే గురుపౌర్ణమి. ఈ రోజున వ్యాస మహర్షి జన్మించిన రోజు. వేదాలను అనువదించి నాలుగు భాగాలుగా విభజించిన మేధావి. అతనే మహాభారతాన్ని రచించిన విశ్వవిద్వాంసుడు. అందుకే ఈ రోజును వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు.

"మాతా పితా గురుర్ దేవం"

 (తల్లి, తండ్రి తర్వాత గురువు – అనంతరం దేవుడు) ఈ పదాల అనుక్రమంలో గురువు స్థానాన్ని చూడండి. ఎందుకంటే గురువు మాత్రమే శిష్యుడి లోపాలను సరిచేసి, అజ్ఞానాన్ని తొలగించి, జీవనమార్గం చూపుతాడు.

ఆధునిక దృష్టికోణం

నేడు గురువు క్లాస్‌రూమ్‌కే పరిమితం కావడం లేదు. జీవితంలోని మార్గదర్శకులు,

 కోచ్‌లు, మెంటార్లు, ఆచరణలతో పాఠం చెప్పేవారంతా గురువులే.

ఇలాంటి గురువులను గుర్తుంచు కోవడానికి ఒక రోజైనా ఉండడం అదృష్టం.

"ఆచార్యాత్ పదమాదత్తే..."

 (విద్యలో గురువు వాటా నాలుగింటిలో ఒకటి – మిగతా మూడు భాగాలు శిష్యుని మేధ, ఇతరులతో పంచుకోవడం, కాలంతో కలిపి ఎదగడం) ఈ భావన ఆధునిక కాలానికీ వర్తిస్తుంది – గురువు మాత్రమే బోధించేవాడు కాదు,తాను ప్రేరణనిచ్చే వ్యక్తి.

ఈ రోజు ఏంచేయాలి? గురువులను కృతజ్ఞతతో స్మరించటం.

 మన జీవిత మార్గదర్శకులను గౌరవించటం.

 నేర్చుకున్న దానిని ఇతరులకు పంచటం.

 మనల్ని మనం ఓ మంచి గురువుగా తీర్చిదిద్దుకోవాలని సంకల్పించటం.గురుపౌర్ణమి అనేది ఒక పూజా పర్వం కాదు 

 జ్ఞానానికి నమస్కరించే సంధ్యారాగం.గురువు రూపంలో దైవాన్ని దర్శించే రోజు. తేజోమయులైన గురువులు మన జీవితాల్లో శాశ్వతంగా వెలిగిపోవాలి."తమసో మా జ్యోతిర్ గమయ" (అజ్ఞానాంధ కారంలో నుండి జ్ఞానజ్యోతి వైపు నడిపించే వాడే గురువు!)జ్ఞానం పొందడంలో ఆనందాన్ని, పంచడంలో పరమార్థాన్ని వెతికే రోజు ఇది. గురుపౌర్ణమి మనకి కృతజ్ఞత భావన నేర్పే రోజు. ఇది శిష్యుని హృదయంలో గురువు పట్ల గౌరవాన్ని నిలిపే పండుగ. ఈ సందర్భం మనని గురు-శిష్య సంప్రదాయాన్ని గుర్తుచేస్తుంది, ఇదే సమయంలో సనాతన భారతీయ సంస్కృతిని మనం నిలుపుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తోంది. జ్ఞానమార్గంలో అజేయమైన ప్రయాణానికి ఇది ఒక కొత్త మార్గం చూపాలి. గురుపౌర్ణమిశుభాకాంక్షలతో…

-ఎస్.వి.రమణా చార్య,సీనియర్ జర్నలిస్ట్

వాతరోగం

 వాతరోగం నందలి రకములు - లక్షణములు - 

    

. మనిషియొక్క శరీరం నందు వాతం,పిత్తం , కఫం అనునవి కలవు. వీటిలో ఏదైనా వృద్ధిని పొంది తమ పరిధిని దాటునో అప్పుడు ఆదోష సంబంధమైన సమస్య మనిషిని పీడించును.

         

. శరీరం నందు వాతం ప్రకోపించినప్పుడు నొప్పి , శ్లేష్మం ప్రకోపించినప్పుడు దురదయు , పైత్యం ప్రకోపించినప్పుడు అజీర్ణం మరియు జ్వరం కలుగును. అసలు వాత , పిత్త , కఫము గురించి సంపూర్ణ అవగాహన ఏర్పరుచుకున్నప్పుడు మనకి వాటి వలన వచ్చే రోగాలపైన కూడా మనకి అవగాహన ఉంటుంది అటువంటప్పుడు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

           

. ఈ పోస్టులో మీకు వాతరోగంలో రకాల గురించి అవగాహన రావటం కోసం కొంత విలువైన సమచారాన్ని ఇస్తున్నాను. ఈ సమాచారాన్ని జాగ్రత్తగా పదిలపరుచుకోగలరు. 

     

. వాతరోగాలు మొత్తం 80 రకాలుగా ఉండును. ఇప్పుడు వాతరోగ లక్షణాన్ని గురించి సంపూర్ణంగా వివరిస్తాను. అసలు ముందు మనిషి శరీరంలో వాతం ప్రకోపించుటకు గలకారణాలు తెలియచేస్తాను .


•. వాతం ప్రకోపించుటకు గల కారణాలు -

      

. అతివేడి , చల్లటి , తక్కువ ప్రమాణంలో అన్నము భుజించటం , ఎక్కువుగా మైధునం చేయుట , నిద్రతక్కువ పోవడం , నదుల యందు ఎక్కువసేపు ఈదుట , ఎక్కువ దూరం నడవటం , దుముకుట వంటి విరుద్ధచేష్టలు చేయడం , శరీరం నందు రసరక్తాధి ధాతువులు క్షయించుట , అతిగా బాధ,దుఃఖం చెందటం , శరీరాన్ని కృశింపచేసుకోవడం , మలమూత్రాలను ఆపుట , ఉపవాసాలు అతిగా చేయుట , గుండెమీద దెబ్బ తగలటం , ఏనుగు , గుర్రం , ఒంటె వంటి వాటిపైనుంచి భూమిమీద పడుట వంటి కారణముల వలన శరీరము నందు వాతం ప్రకోపించి బలిష్టమైన శరీరము నందలి నాడులపై ప్రభావం చూపించి అన్ని అంగముల యందు గాని లేదా ఏదైనా ఒక అంగమును ఆశ్రయించి శరీరము నందు అనేకరకములైన వాతరోగాలను కలుగచేయును .

 

•. శరీరము నందు వాతప్రకోపం చెందినపుడు కనిపించు లక్షణాలు -

      

. జాయింట్లు కదల్చలేకపోవడం , గట్టిగా అవ్వడం , ఎముక సంధులు బలహీనపడటం , గగుర్పాటు , తడపడుతూ మాట్లాడటం , చేతులు , శిరస్సు , వీపు యందు పట్టుకోవడం , కుంటితనం , గూని , అంగముల యందు వాపు , నిద్రలో మధ్యమధ్యలో మెలుకువరావడం , గర్బము ధరించలేకపోవడం , శుక్రము , ఆర్థవం నశించుట , శరీరం వణుకుట , శరీరం మొద్దుబారినట్లు ఉండటం , వెంట్రుకల స్థానం , కణతలు స్థానం నందు పగిలినట్లు అగుట , వాసన చూసే శక్తి తగ్గుట , నేత్రదృష్టి తగ్గుట , రొమ్ములు ఎండిపొవుట , మెడ తిరగకుండా స్థంభించుట , పెదవుల ,కంఠం , దంతముల యందు పగుళ్లు రావటం , సూదులతో పొడిచినట్లు ఉండటం , వంటివన్నియు వాతలక్షణాలు . ఉదరం నందు ఉండు వాతం పెరిగిన మలమూత్రాలు అడ్డగించును. 

        

. పైన చెప్పిన లక్షణాలు కనపడుచున్నచో శరీరము నందు వాతం విపరీతముగా పెరిగినది అని అర్థం చేసుకొనవలెను . వాతనివారణకు సరైన ఔషధాలు తీసుకొనుచూ పథ్యం పాటించుచున్న వాతరోగాలు నయం అగును.


• వాతరోగులు పాటించవలసిన ఆహారనియమాలు -


 *. తినవలసిన ఆహారాలు -

       

. పాతబియ్యపు అన్నం , గోధుమరొట్టె , గోధుమనూక జావ , మేకమాంసం , పొట్టేలు మాంసం , కందిపప్పు మరియు కట్టు , బీరకాయ , పొట్లకాయ , లేత వంకాయ , లేత మునగకాయ , వెల్లుల్లి , ఉల్లిపాయ , కొయ్యతోటకూర , గలిజేరు కూర , మునగాకు కూర , చిర్రికూర , కసివిందాకు కూర , నల్లేరు , ద్రాక్షపండు , ఖర్జూరపు పండు , మజ్జిగ , ఆవునెయ్యి , పటికబెల్లం , పాతబెల్లం , తేనె అదేవిధముగా శరీరానికి మర్దన చేయించుకోవలెను .

  

*. తినకూడని ఆహారపదార్థాలు -

       

. కొత్తబియ్యపు అన్నం , చద్ది అన్నం , జొన్నన్నం , మొక్కజొన్నలు , అలసందలు , శెనగలు , పెసలు , మినుములు , బచ్చలికూర , చుక్కకూర , పెరుగు , పెరుగు మీద మీగడ , సామలు , పిండివంటలు , అతినూనె , కల్లు, కలి , కోడిమామాసం , కోడిగుడ్డు , ఏటినీరు , వెదురు మొలకలు , నేరేడుపండు , కాకరకాయ , మామిడిపండ్లు , మామిడికాయలు , చేపలు , పులిహార , చింతపండు , చల్లటి నీరు , టీ , కాఫీ , నూనెవేపుళ్ళు , పాతపచ్చళ్లు , తిన్నది అరగక ముందే మరలా భుజించటం , మైథునం , చన్నీటిస్నానం , ఉపవాసం , అతిశ్రమ , చల్లటిగాలి , మంచు , తడి ప్రదేశాల్లో ఉండరాదు. 

     

. పైన చెప్పిన ఆహారనియమాలు తప్పక పాటించవలెను . లేనిచో సమస్య నుంచి విముక్తి దొరకదు. ఆయుర్వేదము నందు పథ్యం అనునది కేవలం రోగము యెక్క నివారణ కొరకే కాని ఔషధముల కొరకు కాదు.  

 

 

. మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 

    

గమనిక -

      

. నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            

నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

           

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ క్రింద ఇచ్చిన ఫోన్ నెంబర్ నందు సంప్రదించగలరు.

                   

            కాళహస్తి వేంకటేశ్వరరావు .

         

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                         

. 9885030034

బ్రహ్మ సూత్రాలు

 🙏వేదాంత సారం బ్రహ్మ సూత్రాలు 🙏

శ్రీ గురుబ్యోనమః

ఓం గణపతయే నమః

హరి ఓం! విష్ణువు అవతారమైన బుద్ధిమంతుడైన బాదరాయణుడు మరియు శ్రీకృష్ణ ద్వైపాయనుదు శ్రీ వ్యాసునికి నమస్కారములు.


వేదాలు మూడు భాగాలను కలిగి ఉంటాయి, అవి, ఆచార కర్మలను వివరించే కర్మ కాండ, ఉపాసన (ఆరాధన) గురించి వివరించే ఉపాసన కాండ మరియు బ్రహ్మ జ్ఞానాన్ని వివరించే జ్ఞాన కాండ. కర్మ కాండ పురుషుని పాదాలను, ఉపాసన కాండ హృదయాన్ని మరియు జ్ఞాన కాండ శిరస్సును సూచిస్తుంది. తల పురుషునికి అతి ముఖ్యమైన భాగం అయినట్లే, వేదాల జ్ఞాన భాగాన్ని వివరించే ఉపనిషత్తులు కూడా వేదాలకు శిరస్సు. అందుకే దీనిని వేదాల శిరస్సు అని అంటారు.


మీమాంస అంటే పవిత్ర గ్రంథాల యొక్క అనుసంధానించబడిన అర్థంపై పరిశోధన లేదా విచారణ. ఈ మీమాంసలో రెండు శాఖలు గుర్తించబడ్డాయి, పూర్వ మీమాంస (మునుపటిది) మరియు ఉత్తర మీమాంస (తరువాతిది). మునుపటిది కర్మ కాండను క్రమబద్ధీకరిస్తుంది - వేదంలోని భాగం, ఇది చర్య మరియు కర్మ కాండకు సంబంధించినది మరియు సంహితలు మరియు బ్రాహ్మణాలను కలిగి ఉంటుంది; 

తరువాతిది జ్ఞాన కాండను క్రమబద్ధీకరిస్తుంది, అంటే, బ్రాహ్మణాలు మరియు ఉపనిషత్తుల యొక్క అరణ్యక భాగాన్ని కలిగి ఉన్న వేదాలలోని భాగం. జైమిని పూర్వ మీమాంస రచయిత. జైమిని గురువు శ్రీ వ్యాస భగవానుడు బ్రహ్మ సూత్రాల రచయిత, దీనిని వేదాంత సూత్రాలు అని కూడా పిలుస్తారు. బ్రహ్మ సూత్రాల అధ్యయనం ఉపనిషత్తుల సంశ్లేషణ అధ్యయనం. ఇది వేదాంత తత్వశాస్త్రాన్ని వివరిస్తుంది.


వేదాలు శాశ్వతమైనవి. అవి ఏ వ్యక్తిచే వ్రాయబడలేదు. అవి హిరణ్యగర్భ (బ్రహ్మ దేవుడు) శ్వాస నుండి ఉద్భవించాయి. వేదాంతం వేదాల ముగింపు లేదా సారాంశం. ఇది జ్ఞాన భాగానికి సంబంధించినది. వేదాంతం కేవలం ఊహాగానాలు కాదు. ఇది అతీంద్రియ అనుభవాల యొక్క ప్రామాణికము లేదా గొప్ప ఋషుల ప్రత్యక్ష మరియు వాస్తవ సాక్షాత్కారం. బ్రహ్మ సూత్రాలు ఆత్మ యొక్క శాస్త్రం.


సూత్రాలు సంక్షిప్త సూత్రాలు. అవి ఒక అంశంపై వాదనల సారాంశాన్ని ఇస్తాయి. గరిష్ట ఆలోచనను ఈ సూత్రాలలో వీలైనంత తక్కువ పదాలలో కుదించవచ్చు. వాటిని గుర్తుంచుకోవడం సులభం. గొప్ప మేధావులు మాత్రమే, సాక్షాత్కారంతో, సూత్రాలను తయారు చేయగలరు. అవి ఆధారాలు లేదా జ్ఞాపకశక్తికి సహాయకాలు. స్పష్టమైన వ్యాఖ్యానం (భాష్యం) లేకుండా వాటిని అర్థం చేసుకోలేము. వ్యాఖ్యానానికి మరింత విస్తృతమైన వివరణ కూడా అవసరం. అందువల్ల సూత్రాల వివరణలు మరియు కారికాలు వంటి వివిధ రకాల సాహిత్య రచనలకు దారితీశాయి. వివిధ ఆచార్యులు (విభిన్న ఆలోచనా విధానాల స్థాపకులు) తమ సొంత సిద్ధాంతాలను స్థాపించడానికి సూత్రాలకు వారి స్వంత వివరణలను ఇచ్చారు. బ్రహ్మ సూత్రాలపై శ్రీ శంకరుడి భాష్యాన్ని సరిరక భాష్యం అంటారు. ఆయన ఆలోచనా విధానం కేవల అద్వైతం. విశిష్టాద్వైత పాఠశాలను స్థాపించిన శ్రీ రామానుజుడి భాష్యాన్ని శ్రీ భాష్యం అంటారు. శ్రీ నింబార్కాచార్యుల వ్యాఖ్యానాన్ని వేదాంత-పారిజాత-సౌరభ అని పిలుస్తారు. శ్రీ వల్లభాచార్య తన శుద్ధాద్వైత (స్వచ్ఛమైన ఏకవాదం) తత్వశాస్త్రాన్ని వివరించాడు మరియు బ్రహ్మ సూత్రాలపై అతని వ్యాఖ్యానాన్ని అను భాష్య అంటారు.


సంస్కృతం చాలా సాగేది. ఇది కామధేనువు లేదా కల్పతరు లాంటిది. మీరు మీ మేధో సామర్థ్యం మరియు ఆధ్యాత్మిక అనుభవాల ప్రకారం దాని నుండి వివిధ రకాల రసాలను పొందవచ్చు. అందువల్ల వివిధ ఆచార్యులు సూత్రాలను వారి స్వంత మార్గాల్లో అర్థం చేసుకోవడం ద్వారా విభిన్న ఆలోచనా వ్యవస్థలను లేదా ఆరాధనలను నిర్మించారు మరియు శాఖల స్థాపకులు అయ్యారు. మధ్వుడు తన స్వంత ద్వైత వ్యవస్థను స్థాపించాడు. భాగవతం లేదా పంచరాత్రంగా పిలువబడే విష్ణు ఆరాధనలు మరియు శివుడు, పాశుపతం లేదా మహేశ్వర ఆరాధనలు బ్రహ్మ సూత్రాలను వారి స్వంత సిద్ధాంతాలకు అనుగుణంగా అర్థం చేసుకున్నాయి. నింబార్కాచార్యుడు వేదాంత వ్యవస్థను భేదాభేద-ద్వైతాద్వైత దృక్కోణం నుండి అర్థం చేసుకున్నాడు. తొమ్మిదవ శతాబ్దం మొదటి భాగంలో అభివృద్ధి చెందిన భాస్కరుడి బోధనల ద్వారా అతను ఎక్కువగా ప్రభావితమయ్యాడు. భాస్కరుడు మరియు నింబార్క అనుసరించిన సిద్ధాంతాన్ని ప్రాచీన గురువు ఆవులోమి అనుసరించాడు. బాదరాయణుడు స్వయంగా తన బ్రహ్మ సూత్రాలలో ఈ సిద్ధాంతాన్ని ప్రస్తావించాడు.


బ్రహ్మ సూత్రాలకు పద్నాలుగు కంటే ఎక్కువ వ్యాఖ్యానాలు ఉన్నాయి. శ్రీ అప్పయ దీక్షిత తన పరిమల ద్వారా, శ్రీ వాచస్పతి మిశ్రా తన రచన భామతి ద్వారా మరియు శ్రీ అమలానంద సరస్వతి తన కల్పతరు ద్వారా శ్రీ శంకరుల వ్యాఖ్యానాన్ని మరింత స్పష్టంగా వివరించారు.


శరీరాన్ని స్వచ్ఛమైన ఆత్మతో తప్పుగా గుర్తించడం మానవ బాధలకు, దుఃఖానికి, జనన మరణాలకు మూల కారణం. మీరు మిమ్మల్ని శరీరంతో గుర్తించుకుని, 'నేను అందంగా, నల్లగా, బలిష్టంగా లేదా సన్నగా ఉన్నాను' అని అంటారు. నేను బ్రాహ్మణుడిని, నేను క్షత్రియుడిని, నేను వైద్యుడిని' అని అంటారు. మీరు ఇంద్రియాలతో మిమ్మల్ని గుర్తించి, 'నేను అంధుడిని, నేను మూగవాడిని' అని అంటారు. మీరు మనస్సుతో మిమ్మల్ని మీరు గుర్తించి, 'నాకు ఏమీ తెలియదు. నాకు అన్నీ తెలుసు. నాకు కోపం వచ్చింది. నేను మంచి భోజనం ఆస్వాదించాను. నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను' అని అంటారు. బ్రహ్మ సూత్రాల మొత్తం లక్ష్యం ఏమిటంటే, ఆత్మను శరీరంతో గుర్తించడాన్ని తొలగించడం, ఇది మీ బాధలకు, దుఃఖాలకు మూల కారణం, ఇది అవిద్య (అజ్ఞానం) యొక్క ఉత్పత్తి మరియు బ్రహ్మ జ్ఞానం ద్వారా అంతిమ విముక్తిని పొందడంలో మీకు సహాయం చేస్తుంది.


ఉపనిషత్తులు మొదట్లో వైరుధ్యాలతో నిండి ఉన్నట్లు అనిపిస్తుంది. వాటిలో స్థిరమైన ఆలోచనా విధానం ఉండదు. శ్రీ వ్యాసుడు తన బ్రహ్మ సూత్రాలలో ఉపనిషత్తుల ఆలోచనలను లేదా తత్వశాస్త్రాన్ని క్రమబద్ధీకరించాడు. సూత్రాలు ఉపనిషత్తుల విరుద్ధమైన ప్రకటనలను సమన్వయం చేస్తాయి. వాస్తవానికి ఆలోచనాపరుడికి ఎటువంటి విభేదాలు ఉండవు. ఔదులోమి మరియు అస్మరథ్య కూడా ఈ పనిని వారి స్వంత మార్గంలో చేసి, వారి స్వంత ఆలోచనా విధానాలను స్థాపించారు.


వేదాంత తత్వాన్ని అధ్యయనం చేయాలనుకునే వారు పది శాస్త్రీయ ఉపనిషత్తులు మరియు బ్రహ్మ సూత్రాలను అధ్యయనం చేయాలి. అందరు ఆచార్యులు బ్రహ్మ సూత్రాలపై వ్యాఖ్యానించారు. భారతదేశంలోని ప్రతి తాత్విక పాఠశాలకు ఇది గొప్ప అధికారం. ఏదైనా ఆచార్యుడు తన సొంత సంస్కృతిని లేదా శాఖను లేదా ఆలోచనా విధానాన్ని స్థాపించాలనుకుంటే, అతను బ్రహ్మ సూత్రాలపై తన స్వంత వ్యాఖ్యానాన్ని రాయవలసి ఉంటుంది. అప్పుడే అది గుర్తించబడుతుంది.


ఐదుగురు గొప్ప ఆచార్యులు: కేవల అద్వైతం లేదా రాజీలేని ఏకత్వాన్ని వ్యక్తపరిచిన శ్రీ శంకరుడు, విశిష్టాద్వైతం లేదా అర్హత కలిగిన ఏకత్వాన్ని వ్యక్తపరిచిన శ్రీ రామానుజుడు, భేదాభేదవాదాన్ని వ్యక్తపరిచిన శ్రీ నింబార్క, కఠినమైన ద్వైతం లేదా ద్వైతవాదాన్ని వ్యక్తపరిచిన శ్రీ మధ్వుడు మరియు శుద్ధాద్వైతవాదాన్ని వ్యక్తపరిచిన శ్రీ వల్లభుడు బ్రహ్మ ఈ ప్రపంచానికి కారణమని మరియు బ్రహ్మ జ్ఞానం జీవిత లక్ష్యం అయిన మోక్షానికి లేదా అంతిమ విముక్తికి దారితీస్తుందని అంగీకరిస్తున్నారు. వారు కూడా బ్రహ్మను కేవలం తర్కం ద్వారా కాకుండా గ్రంథాల ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చని గట్టిగా ప్రకటించారు. కానీ ఈ బ్రహ్మం యొక్క స్వభావం, బ్రహ్మంతో వ్యక్తిగత ఆత్మకు ఉన్న సంబంధం, అంతిమ విముక్తి స్థితిలో ఆత్మ యొక్క స్థితి, దానిని పొందే మార్గాలు మరియు ఈ విశ్వానికి సంబంధించి దాని కారణవాదం వంటి అంశాలలో వారు తమలో తాము విభేదిస్తారు.


శ్రీ శంకరుల అభిప్రాయం ప్రకారం, సత్-చిత్-ఆనంద అనే ఒక సంపూర్ణ బ్రహ్మం ఉంది, అతను పూర్తిగా సజాతీయ స్వభావం కలిగి ఉంటాడు. ఈ ప్రపంచం కనిపించడానికి కారణం మాయ - బ్రహ్మం యొక్క మాయా శక్తి, ఇది సత్ లేదా అసత్ కాదు. ఈ ప్రపంచం అవాస్తవం. ఈ ప్రపంచం మాయ ద్వారా వివర్తం లేదా స్పష్టమైన మార్పు. మాయ ద్వారా బ్రహ్మం ఈ విశ్వంగా కనిపిస్తుంది. బ్రహ్మమే ఏకైక వాస్తవికత. వ్యక్తిగత ఆత్మ అవిద్య మరియు శరీరం మరియు ఇతర వాహనాలతో గుర్తింపు ద్వారా తనను తాను పరిమితం చేసుకుంది. తన స్వార్థపూరిత చర్యల ద్వారా అతను తన చర్యల ఫలాలను అనుభవిస్తాడు. అతను నటుడు మరియు ఆనందించేవాడు అవుతాడు. అతను తనను తాను అణువుగా మరియు అవిద్య లేదా పరిమితం చేసే అంతఃకరణం కారణంగా ఒక ప్రతినిధిగా భావిస్తాడు. వ్యక్తిగత ఆత్మ తన అవిద్య నాశనం అయినప్పుడు బ్రహ్మంతో సమానంగా ఉంటుంది. వాస్తవానికి జీవుడు సర్వవ్యాప్తి చెంది బ్రహ్మంతో సమానంగా ఉంటాడు. ఈశ్వరుడు లేదా సగుణ బ్రాహ్మణుడు మాయ యొక్క ఉత్పత్తి. ఈశ్వరుని ఆరాధన క్రమ ముక్తికి దారితీస్తుంది. భక్తిగల భక్తులు (సగుణ బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు) బ్రహ్మలోకానికి వెళ్లి అత్యున్నత జ్ఞానం ద్వారా తుది విడుదలను పొందుతారు. వారు ఈ లోకానికి తిరిగి రారు. వారు చక్రం చివరిలో నిర్గుణ బ్రహ్మాన్ని పొందుతారు. నిర్గుణ బ్రహ్మం యొక్క జ్ఞానం మాత్రమే విముక్తికి ఏకైక మార్గం. నిర్గుణ బ్రహ్మం తెలిసినవారు తక్షణ తుది విడుదల లేదా సద్యోముక్తిని పొందుతారు. వారు దేవతల మార్గంలో లేదా దేవయాన మార్గంలో వెళ్ళవలసిన అవసరం లేదు. వారు పరబ్రహ్మంలో తమను తాము విలీనం చేసుకుంటారు. వారు ఏ లోకానికి లేదా ప్రపంచానికి వెళ్ళరు. శ్రీ శంకరుల బ్రాహ్మణం లక్షణాలు లేని నిర్విశేష బ్రహ్మం (నిరాకార సంపూర్ణం).


శ్రీ రామానుజుల ప్రకారం, బ్రహ్మం గుణాలతో (సవిశేష) ఉన్నాడు. నేను అన్ని శుభ గుణాలతో నిండి ఉన్నాను. ఆయనే తెలివి కాదు. తెలివితేటలు ఆయన ముఖ్య లక్షణం. ఉన్నదంతా ఆయన తనలోనే ఉంటుంది. ప్రపంచం మరియు వ్యక్తిగత ఆత్మలు బ్రహ్మ స్వభావానికి అవసరమైన నిజమైన భాగాలు. పదార్థం (అచిత్) మరియు ఆత్మ (చిత్) అనేవి భగవంతుడు, భగవంతుడు నారాయణుడి శరీరాన్ని ఏర్పరుస్తాయి, అతను అంతర్ పాలకుడు.పదార్థం మరియు ఆత్మలను ఆయన గుణాలు (ప్రకార) అని పిలుస్తారు. వ్యక్తిగత ఆత్మలు బ్రహ్మంలో ఎప్పటికీ పూర్తిగా పరిష్కరించబడవు. రామానుజుల ప్రకారం, బ్రహ్మం పూర్తిగా ఒకటి మరియు సజాతీయమైనది కాదు. ప్రళయ సమయంలో వ్యక్తిగత ఆత్మలు సంకోచ స్థితికి లోనవుతాయి. సృష్టి సమయంలో అవి విస్తరిస్తాయి (వికాశం). శ్రీ రామానుజుల బ్రాహ్మణం లక్షణాలతో కూడిన వ్యక్తిగత దేవుడు. రామానుజుల వ్యక్తిగత ఆత్మ నిజంగా వ్యక్తిగతమైనది. అది ఎప్పటికీ వ్యక్తిత్వంగా ఉంటుంది. ఆత్మ ఆనంద స్థితిలో వైకుంఠంలో ఎప్పటికీ ఉంటుంది మరియు భగవంతుడు నారాయణుడి దివ్య ఐశ్వర్యాన్ని ఆస్వాదిస్తుంది. భక్తి అనేది అంతిమ విముక్తికి ప్రధాన సాధనం, జ్ఞానం కాదు. శ్రీరామానుజుడు తన భాష్యంలో బోధాయన అధికారాన్ని అనుసరించాడు.



కేవలద్వైత తత్వశాస్త్ర పాఠశాల విద్యార్థులు శ్రీ శంకరుని శరీరక భాష్యాన్ని అధ్యయనం చేయాలి, ఇది లోతైనది, సూక్ష్మమైనది మరియు ప్రత్యేకమైనది. ఇది బ్రహ్మ సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి దారితీసే అధికారం. తత్వశాస్త్ర పుస్తకాలలో ఇది ఉన్నత స్థానాన్ని ఆక్రమించింది. అద్వైత తత్వశాస్త్రం హిందువుల అత్యంత ఉన్నతమైనది మరియు గొప్ప తత్వశాస్త్రం.


పన్నెండు శాస్త్రీయ ఉపనిషత్తుల పరిజ్ఞానం ఉంటే మీరు బ్రహ్మ సూత్రాలను అర్థం చేసుకోవచ్చు. సాంఖ్య, న్యాయ, యోగ, మీమాంస, వైశేషిక దర్శనం మరియు బౌద్ధ పాఠశాల గురించి కూడా మీకు జ్ఞానం ఉంటే మీరు రెండవ అధ్యాయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పాఠశాలలన్నింటినీ శ్రీ శంకరులు ఇక్కడ ఖండించారు. శ్రీ శంకర వ్యాఖ్యానమే ఉత్తమ వ్యాఖ్యానం. డాక్టర్ తిబౌట్ ఈ వ్యాఖ్యానాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. "బ్రహ్మ సూత్రాలు" ప్రస్థానత్రయ పుస్తకాలలో ఒకటి. ఇది హిందూ తత్వశాస్త్రంపై ఒక అధికారిక పుస్తకం. ఈ రచనలో 4 అధ్యాయాలు (అధ్యాయాలు), 16 పాదాలు (విభాగాలు), 223 అధికరణాలు (అంశాలు) మరియు 555 సూత్రాలు (సూక్ష్మసూత్రాలు) ఉన్నాయి. మొదటి అధ్యాయం (సమన్వయాధ్యాయ) బ్రహ్మాన్ని ఏకం చేస్తుంది, రెండవది (అవిరోధాధ్యాయ) ఇతర తత్వాలను ఖండిస్తుంది, మూడవది (సాధనాధ్యాయ) బ్రహ్మను సాధించడానికి సాధన (సాధన) గురించి మరియు నాల్గవది (ఫలాధ్యాయ) ఆత్మసాక్షాత్కార ఫలాల గురించి వివరిస్తుంది. ప్రతి అధ్యాయంలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పదంలో అధికరణాలు ఉంటాయి. ప్రతి అధికరణలో చర్చించడానికి ప్రత్యేక ప్రశ్నలు ఉంటాయి. మొదటి అధ్యాయంలోని మొదటి ఐదు అధికరణలు చాలా చాలా ముఖ్యమైనవి.


పరాశర పుత్రుడు, మహా ఋషి, అన్ని పురాణాలను రచించిన మరియు వేదాలను విభజించిన చిరంజీవి శ్రీ వ్యాస భగవానునికి కీర్తి. ఆయన ఆశీస్సులు మన అందరికీ ఉండుగాక!

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

జన్మనిచ్చిన తల్లి

 *సీసము*

జన్మనిచ్చిన తల్లి జనులకు తొలియొజ్జ

   కర్మమిచ్చెడితండ్రి ధర్మ గురువు.

తోడబుట్టిన వారు తూర్ణంపు గురువులౌ

   చెలిమిజేసెడివారు చెంత గురులు

విద్య నిచ్చినవాడు వెలగట్ట ధరలేని

   ఉత్తమోత్తమ మైన ఉర్వి గురువు.

ఇట్టి గురుగణంబులెట్టివారలె గాన

  కొలువకున్నను నింద గొలుప దగదు.

*ఆ.వె.*

వేదశాస్త్రములను భేదమెంచకనిచ్చి

జగతి వెలుగులిచ్చు నిగమగురుల

వ్యాసపూర్ణిమమున న్యాసించి మనమున

పూజలొనరువారు తేజరిల్లు.

*అందరికీ వ్యాసపూర్ణిమ అనబడే గురుపూర్ణిమ శుభాకాంక్షలు. గురువులందరికీ సాష్టాంగ ప్రణామములు.*


*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

విశ్వగురువు వేదవ్యాసుడు*



*విశ్వగురువు వేదవ్యాసుడు*

 

సంస్కృతంలో 'గు' అనే శబ్దానికి చీకటి అని 'రు' అంటే నాశనం చేసే తేజస్సు అని అర్థం. గురువు తేజోమయమై మనలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతారు. మన భారతీయ సనాతనధర్మంలో గురువులకి అగ్రస్థానం ఉంది. హిందూమతంలో గురువును, భగవంతునిగా భావిస్తుంటారు. మనిషి జీవితంలో అడుగడుగునా గురువు చేయూత అవసరం ఏదో రూపంలో కనబడుతూ ఉంటుంది. మన భారతీయ సనాతనధర్మంలో వ్యాసపౌర్ణిమకు అత్యంత ప్రాధాన్యత ఉంది. లోకహితార్ధం వ్యాసుడు సత్యవతికి పరాశరుడి వలన పుట్టాడు. మానవజాతికంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చాడు కాబట్టి ఆయన్ని మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. 

వేదవ్యాసుని పూర్వనామం *కృష్ణ ద్వైపాయనుడు*. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాలుగా విభాగం చేసి. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అధర్వణ వేదాలుగా విభజించి సులభతరం చేయడంవలన, అతనికి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. 

సత్యవతికి పరాశరునికి జన్మించిన వ్యాసుడు పుట్టిన వెంటనే తపస్సుకు వెళ్లిపోతూ, సత్యవతికి తాను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రత్యక్షమవుతానని చెప్తాడు. వ్యాసుని రచనలు, మన పురాతన ధర్మాలను, సత్సాంప్రదాయాలను అందరు అర్ధంచేసుకొనే రీతిలో వివరిస్తాయి. పురాణ రచనలో వ్యాసుని ఆలోచనా పటిమ, దీర్ఘ ప్రణాళిక, కథావివరణ అద్వితీయం. 


నాలుగు వేదాలలో ఉన్న పరమార్ధమంతా ప్రతిపాదించే విధంగా, ధర్మం, అర్ధం, కామం, మోక్షం అనే నాలుగు పురుషార్థములను సాధించడానికి అవసరమయ్యే జ్ఞానం అంతా వేదవ్యాసుడు మహాభారతంలో ఇమిడ్చాడు. వేదసారం, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారాంశం ఇందులో ఇమడ్చడం వలన, దీనికి పంచమ వేదం అని పేరు వచ్చింది. *మహాభారతంలో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది మరెక్కడా లేదు* అని ఉగ్రశ్రవసుడు భారత కథను శౌనకాది మునులకు వినిపించినప్పుడు అంటాడు.


క్రీస్తు పూర్వం 3 వ శతాబ్ధానికి ముందు, మ్లేఛ్చుల దాడుల వలన వేదసంస్కృతికి ప్రమాదం వాటిల్లింది. ప్రకృతి ఆరాధన, యజ్ఞయాగాది క్రతువులను చేయడంలాంటివి సన్నగిల్లాయి. వేదధర్మం అడుగంటే స్థితి వచ్చింది. *పరిణిత చిత్త* సంస్కారం లేకుండా కొందరు గురువులు వ్యవస్థను నాశనం చేసే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు ఈ మహాభారత కథను ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చి,దాని ద్వారా ప్రజలను మళ్ళీ వైదికమార్గంలో పెట్టడానికి ప్రయత్నించారు.


 మహాభారతకథకు కాల పరిమితి లేదు. ఇప్పటి సమకాలీన పరిస్థితులను చూసినా మనకు భారతం గుర్తుకు రాక మానదు. 

వేదాల సారాన్ని వివరించే ఎన్నోకథల ద్వారా, ధర్మాన్ని పాటించే గొప్ప రాజుల పరిపాలన, ప్రజల నడవడిక, కుటుంబ వ్యవస్థ, పండితుల ఆదరణ, ప్రకృతిని పరిరక్షించే క్రమం, అరిషడ్వర్గాలను అదుపు ఉంచుకోవడం, అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసే సంఘటనలు ఎన్నో మహాభారతంలో కనబడతాయి. భయపడి, నిరాశ నిస్పృహలకు లోనయ్యే అర్జునుడికి, భగవానుడు ఉపదేశించిన భగవద్గీత హైందవ ధర్మానికి ఆయువుపట్టు అయ్యింది. 

మహాభారత ఇతిహాసంలో వేదవ్యాసుడు *ఒక పాత్రగా* కూడా కనిపిస్తాడు, అడుగడుగునా ఆయన గురు స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. దుర్యోధనుడు ప్రవర్తించే అధర్మప్రవర్తన నచ్చక, ధృతరాష్ట్రుడితో కొడుకుని అదుపు చేయమని చెప్పడానికి వస్తాడు. ధర్మరాజుకు ధర్మసంకటం కలిగినప్పుడు, దాన్ని ఎలా అధిగమించాలో వివరించడానికి అడుగడుగునా కనబడతాడు . 

అరణ్య వాస సమయంలో

 *ప్రతిస్మృతి* అనే విద్యను ధర్మరాజుకు ఉపదేశించి అది అర్జునుడికి పాశుపాతం సంపాదించడానికి, ధర్మ పరిరక్షకులైన పాండవులను బలోపేతం చేయడానికి తన చేయూతనిస్తాడు.  


గాంధారి కోపాగ్ని పాండవులకు తగలకుండా, ఆమెను వారించడానికి వస్తాడు. 


కురుక్షేత్ర యుద్ధసమయంలో విశ్వశ్రేయస్సు కోరి, వినాశనానికి దారితీసే అశ్వత్థామను *బ్రహ్మశిరోనామకాస్త్ర* ప్రయోగం నివారించడానికి వస్తాడు. ధృతరాష్ట్రుణ్ణి , గాంధారిని, కుంతిని,విదురుడిని వానప్రస్థం చేసి ఇక జీవితాలు చాలించమని చెప్పడానికి అక్కడ ప్రత్యక్షం అవుతాడు. 

మనం మహాభారతం పరిశీలన చేస్తే, వ్యాసుడిలా మన జీవితాల్లో కూడా గురువు అనేవారు ఏదో రూపంలో కనిపించి మనల్ని సరైనా మార్గంలో నడిపిస్తారు, హృదయపూర్వకంగా మనం గురువుని ప్రార్థిస్తే, ఆశ్రయిస్తే, మన జీవిత గమనానికి గురువే ఆలంబన అవుతారు. 

ప్రపంచం దేశాలన్నీ మన భారతీయత వైపు, మన సనాతన ధర్మ వైపు చూసే రోజులు వచ్చాయి. భారతదేశం విశ్వగురువుగా ప్రపంచాన్ని శాసించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అని ఆధ్యాత్మిక వేత్తలు విశ్వసిస్తున్నారు.   

వేదవ్యాసుడు జన్మించిన ఈ గురుపౌర్ణిమ నాడు ఆయనను స్మరించుకుంటూ, మా లిపి. గేమ్ డిజిటల్ గేమ్ ద్వారా మహాభారతాన్ని భావి తరాలకు అందించాలనే తపనతో ముందుకు సాగుతున్నాం. అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు.


*చాగంటి ప్రసాద్*

(మహాభారత కథా అనుసంధానకర్త)

లిపి. గేమ్ ఇండియా లిమిటెడ్ 

9000206163

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *గంగాపాపం శశీతాపం*

          *దైన్యం కల్పతరుస్తథా !*

          *పాపం తాపంచ దైన్యంచ*

          *గురుర్హరతి దర్శనాత్....!!*


భావం 𝕝𝕝 *గంగాస్నానం వలన* పాపం నశిస్తుంది.... *చంద్రుని శీతల కిరణాల ప్రసరణం వలన* తాపం తొలగి ఆహ్లాదం కలుగుతుంది..... 

*కల్ప వృక్ష స్మరణ* - సేవనాదుల వలన అన్నిరకములుగ ఉన్న దీనస్థితి తొలగుతుంది..... 

*శుధ్ధాంతఃకరణముతో శిష్యుడు కనుక సర్వదేవతా స్వరూపమైన గురు చరణములను దర్శించి....ఆశ్రయించి.... సేవనాదులు జరిగించిన యడల.... ఆ పుణ్యఫలం వలన..... పైన చెప్పబడిన మూడు పవిత్రమైన పదార్థములను సేవించి పొందిన ఫలములు ఏవైతే ఉన్నవో అట్టి మూడు ఫలములును కూడా శిష్యునికి ఒక్కగురువే అనుగ్రహం చెయగలుతారు*.. మనసంప్రదాయంలో గురువు యొక్క

వైశిష్ట్యం ఇంత గొప్పగా చెప్పబడినది.....


 ✍️VKS ©️ MSV🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం -‌ పూర్ణిమ - పూర్వాషాఢ -‌‌ గురు వాసరే* (10.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

తిరుమల సర్వస్వం -296*

 *తిరుమల సర్వస్వం -296*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-11


అక్షరబద్ధమైన ఆలయవ్యవహారాలు

➖➖➖➖➖➖➖➖

ఈస్టిండియా కంపెనీ హయాంలో దేవాలయానికి జరిగిన మరో మేలు ఆలయ ఆచార వ్యవహారాలను, స్థిరచరాస్తులను, సిబ్బంది వివరాలను, వారి బాధ్యతలను, వంశపారంపర్యంగా వారికి సంక్రమించిన గౌరవమర్యాదలను, పారితోషికాలను అక్షరబద్ధం చేయడం. అప్పటివరకూ ఆలయ వ్యవహారాలన్నీ మౌఖికాదేశాల మేరకు, పరంపరానుగతంగా వస్తున్న కట్టుబాట్ల కనుగుణంగా నడిచేవి. లిఖితపూర్వక నియమ నిబంధనలు, ఆస్తుల వివరాలు శిలాఫలకాల మీదా, రాగిరేకుల పైనా, తాళపత్రాల యందు మాత్రమే లభించేవి. శతాబ్దాల తరబడి ఆ నిబంధనలను, వివరాలను క్రోడీకరించక పోవడం వల్ల ఆలయ నిర్వహణలో ప్రామాణికత లోపించి అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. వేర్వేరు కాలాల్లో వెలువడిన, పరస్పర విరుద్ధంగా ఉన్న మౌఖికాదేశాలను స్వలాభేపేక్ష కోసం అన్వయించుకున్న సందర్భాలు కూడా అరుదుగా చోటు చేసుకునేవి. ఈ లోటుపాట్లను అధిగమించి, అనవసరమైన, అసంబద్ధమైన వ్యయాలకు కత్తెర వేసి, ఆలయ నికరాదాయాన్ని పెంపొందించు కోవడం కోసం; ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునే నిమిత్తం అందుబాటులో ఉన్న సమస్త వివరాలను మొట్టమొదటి సారిగా, అప్పుడప్పుడే అందుబాటు లోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, కాగితం మీద ముద్రించి అక్షరబద్ధం చేసే బృహత్తర కార్యానికి కంపెనీ వారు శ్రీకారం చుట్టారు. వారు పాలనా సౌలభ్యం కోసం ముఖ్యంగా ఐదు రిజిష్టర్లలో ఆలయ వివరాలన్నింటినీ నిక్షిప్తం చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం -


1819 వ సం‌ లో కూర్చబడిన పైమాయిషీ అనే దస్తావేజులో తిరుమల, తిరుపతి, తిరుచానూరు లో ఉన్న 18 ప్రముఖ ఆలయాల, ఉపాలయాల భౌతిక స్వరూపాలను, కొలతలను, ఆలయాల విస్తీర్ణాన్ని, మూర్తుల వివరాలను పొందుపరిచారు. తిరుమల ప్రధానాలయం, తిరుపతి లోని గోవిందరాజస్వామి ఆలయం, అలిపిరి వద్ద గల కపిలేశ్వరస్వామి ఆలయం, అందులోని కొన్ని ఉపాలయాలు, పద్మావతి అమ్మవారి ఆలయం, అందలి ఉపాలయాలు, వరదరాజస్వామి ఆలయం, అలిపిరి మార్గం లోని పాదాలమంటపం, హరిజనవాడల్లో గల కొన్ని ఆలయాలు (ఇవి ఇప్పుడు చాలావరకూ కాలగర్భంలో కలిసిపోయాయి) పైమాయిషీ జాబితాలో కానవస్తాయి. ఈ వివరాలను అప్పట్లో సంబంధిత గ్రామకరణాలు తయారు చేయగా, అప్పటి తహసీల్దార్ ఆఫీసులో శెరిస్తేదార్ గా పని చేసే అలబ్దు గోవిందరావు అనే ఉద్యోగి ధృవీకరించారు. ఈ దస్తావేజు ద్వారా ఆలయాలకు సంబంధించిన విలువైన సమాచారం భావితరాల వారికి లభించడమే కాకుండా, ఆలయ సరిహద్దులు చెరిగిపోకుండా, అవి అన్యాక్రాంతం కాకుండా కాపాడబడ్డాయి. 


అదే సంవత్సరం (1819) లో 

కూర్చబడిన సవాల్ జవాబ్ పట్టీ అనే మరో పుస్తకంలో - పైమాయిషీ లో పొందుపరిచి బడిన ఆలయాలకు మరికొన్ని ఆళ్వార్ ల దేవాలయాలు కలిపి మొత్తంగా 22 దేవాలయాల ఆదాయ వ్యయాల, ధర్మకార్యాల, సేవల వివరాలు; ఆలయాల, మంటపాల కట్టుబడికి సంబంధించిన వివరాలు; తరగతుల వారీగా ఆలయ సిబ్బంది వివరాలు (కైంకర్యపరులను మినహాయించి), వారి విధులు, వాటిని అతిక్రమించిన వారికి విధించే జరిమానాలు; ఆలయ చరాస్తుల భద్రతకు సంబంధించిన వివరాలు; తిరుపతి పట్టణంలో నిర్వహించబడే అన్నదాన కేంద్రాల, ధర్మసత్రాల వివరాలు, వీటన్నింటినీ మెరుగు పరచడానికి తీసుకోవలసిన చర్యలు ప్రశ్నలు - జవాబుల రూపంలో నమోదు చేయబడ్డాయి. 


 కైంకర్యపట్టీ అనే మరో రికార్డులో - ఆలయం నందు వివిధ హోదాల్లో సేవలందిస్తున్న కైంకర్యపరుల పూర్తి వివరాలు, వారి నిర్దిష్ట విధులు, వంశపారంపర్యంగా వారికి దక్కుతున్న ఆలయ మర్యాదలు, నగదు మరియు ద్రవ్యరూపంలో వారికి లభిస్తున్న పారితోషికాలు, వారి అధీనంలో ఉన్న ఆలయభూములు మరియు గ్రామాల వివరాలు పొందుపరిచారు. దీనిలో ఉన్న సమాచారాన్ని బట్టి, ఆలయభూములు - వంశానుగతంగా వస్తున్న నాలుగు అర్చక కుటుంబాలు, జియ్యంగార్లు మరియు వారి సేవకులైన ఏకాంగులు, సర్కారు వారిచే నియమింప బడ్డ అర్చకులు, ఆచార్యపురుషులకు చెందిన ఏడు కుటుంబాల వారు, బొక్కసం వ్యవహారాలు చూసే ఉద్యోగులు, తాళ్ళపాక వంశీయులు, సన్నిధి గొల్ల వంశీయులు, మహంతులు, తిరుపతి మరియు మంగాపురం గ్రామ కరణాలు, కరకంబాడి - కృష్ణాపురం - మామండూరు పాలెగార్ల అధీనంలో ఉండేవి. ఆయా భూములపై వచ్చే ఆదాయాన్ని వారు వంశపారంపర్యంగా అనుభవిస్తూ, ప్రతిగా నిర్ణీత విధులు నిర్వహించాలి. 1801 సం. లో వెలువడిన ఈ రికార్డు, 1820 లో సమూలంగా సవరించ బడింది. 


దిట్టం పుస్తకం అనే దస్తావేజులో - మూలమూర్తికి, ఉత్సవ మూర్తులకు, గర్భాలయంలో ఉండే ఇతర దేవతామూర్తులకు, ఉపాలయాల లోని మూర్తుల నిత్యనైవేద్యం నిమిత్తం; వారపుసేవలు, ఉత్సవాల సందర్భంలో సమర్పించే నైవేద్యాల నిమిత్తం తయారు చేయవలసిన వివిధ ప్రసాదాల పరిమాణాలు; వాటిలో వినియోగించ వలసిన ద్రవ్యాలు, దినుసుల నాణ్యత, మోతాదులు; అవి తయారు చేసే వంటబ్రాహ్మణులకు చెల్లించ వలసిన పారితోషికాలు - ఇత్యాది వివరాలన్నీ పొందుపరిచి ప్రసాదాల తయారీలో ప్రామాణికతకు పాదుగొల్పారు. కాలానుగుణంగా చోటు చేసుకున్న కొద్ది మార్పులు, చేర్పులు మినహా, అందులో ఉదహరింప బడిన ప్రసాదాల నైవేద్యక్రమం, వాటిలో ఉపయోగించే ద్రవ్యరాశుల పాళ్ళు ఈనాడు కూడా అమలులో పరచడం వల్ల; అదే ప్రామాణికతను ప్రాతిపదికగా చేసుకొని చేయి తిరిగిన వంటవారు అంకితభావంతో వండటం వల్లనే - ఈనాడు తిరుమల ప్రసాదాలు ప్రపంచ ప్రసిద్ధికెక్కాయి. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*


*433 వ రోజు*


*శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర గాంధారీలను ఓదార్చుట*


కృష్ణుడు ధర్మరాజు మాట మీద హస్థినాపురం బయలు దేరి వెళ్ళి ధృతరాష్ట్రుడికి వర్తమానం పంపాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడిని సాదరంగా తీసుకు రమ్మని చెప్పాడు. కృష్ణుడు ధృతరాష్ట్రుడి అంతఃపురంలోకి ప్రవేశించే సమయానికి అప్పటికే వ్యాసుడు ధృతరాష్ట్ర గాంధారీలను కుమారుల మరణానికి ఓదార్చడానికి వచ్చి ఉండటం చూసి వ్యాసునకు సాష్టాంగ నమస్కారం చేసి ధృతరాష్ట్ర గాంధారీలకు నమస్కరించాడు వారి పక్కన నేల మీద కూర్చుని ధృతరాష్ట్రుడి చేతిని తన చేత పట్టుకుని " మహారాజా ధృతరాష్ట్రా ! నీ కుమారుల వలన మీ వంశం సమూలంగా నాశనం అయింది. ఇలాంటి పరిస్థితి కలుగకూడదని పాండవులు నన్ను రాయబారానికి పంపారని నీకు తెలుసు సంధికి అంగీకరించి ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు కదా ! మహారాజా లోకంలో జూదం ఆడటం సహజమే కాని అంతఃపురంలో ఉన్న కుల స్త్రీలను ఏక వస్త్రలను పతివ్రతలను సభకీడ్పించి వలువలు ఊడ్పింఛి అవమానించడం ఎక్కడైనా ఉందా ! అయినా పాండవులకు కోపం రాలేదు 13 సంవత్సరాలు అరణ్య అజ్ఞాత వాసాలలో ఇడుములు అనుభవించినా వారికి కోపం రాలేదు. అందుకే నీకుమారుడు వారికి చేసిన అవమానాలు సహించి మరచి మన్నించి అయిదు ఊళ్ళు ఇచ్చినా చాలని అర్ధించాడు. నీ కుమారుడు లోభంతో, అహంభావంతో ఆప్రతిపాదన తిరస్కరించాడు. విదురుడు బంధు మిత్రులు మహామునులు ఎంతో చెప్పి చూసారు. కాలోపహతులై నీవు నీకుమారుడు వారి మాటను పెడచెవిన పెట్టారు. విధి నిర్ణయం మార్చలేనిది కనుక ఇక వగచి లాభం లేదు. నిష్కల్మష హృదయులైన పాండవులు వారి మీద కోపగించ వలదని వేడుకుంటూ నన్ను పంపారు. ప్రస్థుతం మీకు కుమారులు లేరు కనుక మీ ఇరువురికి ఉత్తర క్రయలు చేసి ఉత్తమ గతులు కల్పించవలసిన పాండవుల హితం కోరుట మీకు శ్రేయస్కరం. మీకు కలిగిన కష్టానికి ధర్మరాజు ఎంతో దుఃఖిస్తున్నాడు. తన మనో భావాలను తెలుపమని ధర్మరాజు నన్ను మీ వద్దకు పంపాడు అని గాంధారిని చూసి " అమ్మాగాంధారీ ! నీకు సాటి వచ్చు రాజమాతను నేను ఈలోకములో చూడ లేదు. లేకున్న నిండు సభలో పలువురు వినుచుండ నీవు సుయోధనుడికి బుద్ధిమతి చెప్ప ప్రయత్నిస్తావా ! నాడు నీవు పలికిన పలుకులు నా చివులలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. కాని సుయోధనుడు లోక విరుద్ధంగా నీ మాటలు పెడచెవినబెట్టాడు. తనకు ఏది మేలో తెలుసుకో లేక పోయాడు. సుయోధనుడు అహంకారంతో తుళ్ళక రాజ్యభాగాన్ని ఇచ్చి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా ! నీవు ఆ నాడే చెప్పినట్లు కీడే జరిగింది. 

*సుయోధనుడు అశ్వత్థామను సైన్యాధ్యక్షుని చేయుట*

సంజయుడు ధృతరాష్ట్రుతో " మహారాజా ! భీమసుయోధనులు యుద్ధం చేసే సమయంలో నేను పక్కనే ఉన్న పొదలలో ఉన్నాను. వారు వెళ్ళి పోగానే నేను వెలుపలికి వచ్చి సుయోధనుడి వద్దకు వెళ్ళాను. ధూళితో నిండిన ముఖము మీద ఉన్న వెంట్రుకలను తొలగించి కళ్ళ నీరు నింపుకుని సుయోధనుడు " సంజయా ! చతస్సముద్ర వేలావలయుత ధరణీ తలంబును ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన సుయోధనుడి దుర్గతి చూసావా ! ఏకాదశ అక్షౌహినులకు అధిపతిని, అణుకువ కలిగిన సామంతరాజులు కలిగిన వాడిని అత్యంత వైభవమును అనుభవించిన వాడిని అయిన నేను ఎలా ఉన్నానో చూసావా ! లోక నిందకు వెరువక భీముడు అధర్మంగా నా తొడలు విరిచాడని మన వాళ్ళకు చెప్పు. నాడు భీష్ముని, ద్రోణుని, కర్ణుడిని అధర్మ యుద్ధంలో చంపి నేడు నన్ను భీముడు అధర్మ యుద్ధంలో చంపాడు. ఇదీ ఒక విజయమేనా ! ఇందుకు లోకులు పాండవులను పురుగులు పట్టిపోతారని తిట్టరా ! పాండవులకు ఇది వృధా విజయం కాక మరేమి ! నన్ను అధర్మంగా కూలదోసిన భీముడు ఏమి బాగుపడతాడులే ! సంజయా భీముడు నా తొడలు కొట్టి పడతోసింది చాలక తన వామ పాదంతో నా తలను తన్నాడు. లోకులు దీనిని మెచ్చుతారా ! నేను రారాజుగా ఉన్నప్పుడు నన్ను తృణీకరించారు. నేను పడిపోగానే నన్ను కాలితో తన్నారు. లోకులు ఘర్హించరా ! నేను ఎన్నో యజ్ఞాలు చేసాను. ఎన్నోదానధర్మాలు చేసి ఎందరినో శ్రీమంతులను చేసాను. బ్రాహ్మణులకు అగ్రహారాలను ఇచ్చాను. నా బాహు బలంతో దేశాన్ని సుభిక్షంగా పాలించాను. ఇప్పుడీ శమంతక పంచకంలో మరణించి పుణ్యలోకాలకు పోతాను. నా గురించి నాకు చింత లేదు. పాండవులు నన్ను అధర్మ యుద్ధమున గెలిచి నా రాజ్యమును వశపరచుకున్నారు. నీకు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కనపడితే జరిగినది వివరించి నా మాటగా " పాండవులు అందరూ అనుకున్నట్లు ధర్మపరులు కాదు అసత్యవాదులు, అధర్మపరులు ధర్మము అనే ముసుగులో లోకమును వంచిస్తున్నారని వారికి చెప్పు. వారిని ఎన్నటికీ నమ్మరాదు " అన్నాడు.



*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

గురుః బ్రహ్మాః

 


గురుః బ్రహ్మాః గురుః విష్ణుః గురుర్దేవో మహేశ్వరః అని గురువు కి త్రిమూర్తుల తో సరిసమానమైన స్ధానాన్ని ఇచ్చిన సంస్కృతి మనది....మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లి తండ్రుల తర్వాత ఆ బాధ్యత గురువుకు పంచిన సంప్రదాయం మనది....కాని నేడు మారుతున్న జీవన విధానం, సామాజిక పరిస్థితులు గురు స్ధానాన్ని పలుచన చేస్తున్నాయి....


సినిమాలో అయితే గురువు కమెడియన్లుగా, బఫూన్లు గా చివరికి బ్రోకర్లుగా కూడా చూపిస్తున్నారు....పవిత్రమైన గురు శబ్దాన్ని 'హలో గురూ' అంటూ అపరిచితులను పిలిచే సంభోదనా పదంగా మార్చి వేసారు.....


 ’గు’ కారో అంధకారస్య, ’రు ’ కారో తన్నిరోధకః !!

అంటే అర్థం, గు అంటే అజ్ఞానం...రు అంటే తొలగించువాడు అని....


అసలు గురు పౌర్ణమి సంప్రదాయం మన వాతావరణ, జీవన విధానం అనుసరించి ఏర్పడినది.. ఆషాఢ మాసంలో వర్షాలు, వ్యవసాయపు పనులు ఆరంభమై, అందరూ ఇంటిపట్టునుండడం, గురువులు చాతుర్మాస దీక్షవహించి ఉండడం విద్యాభోదనకు, అధ్యయనము నకు అనుకూలమై కాలం ... పూర్వం గురుకుల సాంప్రదాయం కావున గురువు ను తగురీతిగ సత్కరించి, పూజించి వారి పిల్లలను గురువు సంరక్షణలో వదిలి వెళ్ళేవారు.... అదే కాలక్రమంలో గురు పౌర్ణమి, గురు పూజోత్సవంగా రూపాంతరం చెందినది...

 

వ్యాసం వశిష్టనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్! పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్!!


వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే!!


విష్ణువు 21 అవతారాలలో 17 వ అవతారమైన కృష్ణద్వైపాయనుడు వేద విభజన చేసి వేదవ్యాసుడైనాడు....ఆయన పేరుతో ఏర్పడిన వ్యాస పూర్ణిమ తరువాత గురుపూర్ణిమై అసలుమూల రూపాన్ని, ఔన్నత్యాన్ని కోల్పోయింది...నేడు అసలు వ్యాస మహర్షి ని తలచే వారే లేరు...


 బ్రతుకు తెరువుకు నాలుగు గారడివిద్య లు, కనికట్టు నేర్చిన ఫకీర్లని, బాబాలని దేవుళ్ళని చేసాం....నలుగురు శిష్యులను వెనకేసుకుని, రంగు రంగు బట్టలు, విచిత్ర వేషధారణ వేసే అమ్మలు, భగవాన్ లు, స్వామీజీ లను గురువు లని, దైవాలని చేసి ఏమాత్రం జ్ఞానాన్ని, మోక్షాన్ని కలుగ చేయని వ్యక్తి పూజలో విలువైన కాలం వ్యర్థం చేసుకుంటున్నాం....


బోయ నుండి మహర్షి గా ఎదిగి, రామాయణ మహాకావ్య రచన చేసిన ఆది కవి వాల్మీకి మనకి గురువు.....


అష్టాదశ పురాణాలు , పంచమ వేదం మహాభారతం రచించిన సాక్షాత్తు విష్ణు స్వరూపుడు వేదవ్యాసుడు మనకి గురువు.....


 వైష్ణవ ఆగమాలలో విశిష్టమైన శ్రీ వైఖానస ఆగమాన్ని రచన చేసిన విఖనసాచార్యుల వారు మన గురువు..వీరి ఆగమానుసారం కలియుగ వైకుంఠం తిరుమల లో స్వామి వారి నిత్యార్చనాది బ్రహ్మోత్సవ పర్యంతం సేవలు జరుతున్నాయి...బృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షులు విఖనస మునీంద్రుల శిష్యాగ్రగణ్యులు....


32 సం!!ల అతి పిన్న వయసు లోనే ఆసేతు హిమాచలం పర్యటించి, అష్టాదశ శక్తి పీఠాలను ప్రతిష్టించి, వందలాది అవైదిక మతాలను ఖండించి హైందవ ధర్మానికి పునర్జీవం పోసి, శివతత్వం చాటిన ఆదిశంకరులు మన గురువు... నేడు మనకు లభ్యమవుతున్న అనేక దేవి దేవతల స్తోత్రాలు, పూజా విధానాలు వంటి ధార్మిక సాహిత్యం ఆదిశంకరులు అందించినది...


సమాజంలోని ఛాందస భావనలు రూపుమాపి, అష్టాక్షరి మహామంత్రమైన ఓం నమో నారాయణాయ మంత్రాన్ని అన్ని వర్ణాల కు అందించి వైష్ణవ తత్వాన్నితెలియ చేసిన భగవాన్ రామానుజులు మన గురువు.....


ఇంత విశిష్ట గురు పరంపర మనకుండగా, మఖ లో పుట్టి పుబ్బ లో మాయమయ్యే చిల్లర గురువులు మనకేల???

పంచాంగం

*

🌹*పంచాంగం*🌹

*శ్రీరస్తు,శుభమస్తు,ఆవిఘ్నమస్తు*          

*ప్రదేశము:* *హైదరాబాద్,తెలంగాణ,* *భారతదేశము.*

🙏 🕉 *నమః శివాయ*

 🙏 *నమో వెంకటేశయ*        

         *ఓం శ్రీ *స్వామియే*శరణం*అయ్యప్ప*  

📆తేది : *10, జూలై, 2025*

🌹సంవత్సరం : *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

🍫ఆయనం : *ఉత్తరాయణం*

🌈ఋతువు : 🌻 *గ్రీష్మ ఋతువు*

🔥మాసం : *ఆషాఢ*

🙂 పక్షం : *శుక్ల*

🍎వారము: *గురువారం* ( *బృహస్పతివాసరే*)                             

*☀సూర్యోదయం : *ఉ 5.52*

*🌤*సూర్యాస్తమయం* : *సా 6.50*

🏵తిథి: *పూర్ణిమ నిన్న రా తె 1.37 నుండి ఈ రోజు రా తె 2.06 వరకు.*

⭐నక్షత్రం: *పూర్వషాడ నిన్న రా తె 4.49 నుండి ఈ రోజు రా తె 5.56 వరకు.*. 

🧶యోగము: *ఐద్రము ఈరోజు రా 10.08 వరకు.*

🤠కరణం-1:*భద్ర ఈ రోజు మ 1.55 వరకు*

🤠 కరణం-2: *బవ ఈ రోజు రా తె 2.06 వరకు.* 

👍అభిజిత్ ముహూర్త: *ఉ 11.55- 12.47.*

👏బ్రహ్మ ముహూర్త :*రా తె 4.16-5.04*     

👌అమ్రుతఘడియ: *లేవు*             

🙉దుర్ముహూర్తం: *ఉ 10.11-11.03 & మ 3.23-4.15*

🐵గుళికకాలం:*ఉ 9.07-10.44*

🙊యమగండం: *ఉ 5.52-7.29*

 🙈వర్జ్యం: *మ 2.51- 4.31*

😡రాహుకాలం:*మ 1.58- 3.36*

   సూర్యరాశి: *మిథునం*

   చంద్రరాశి: *ధనస్సు*


*గోమాతను పూజించండి*

  *గోమాతను సంరక్షించండి* 🥦🥦🥦🥦🥦🥦🥦🥦

*పచ్చని చెట్లను పెంచండి* *స్వచ్చమైన ప్రాణ వాయువును పీల్చండి* *పర్యావరణాన్ని కాపాడండి* *వృక్షో రక్షతి రక్షితః వృక్షాన్ని రక్షిస్తే సదా ఆ వృక్షం మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది*

🥦🥦🥦🥦🥦🥦🥦🥦