25, నవంబర్ 2025, మంగళవారం

కర్తవ్యం, బాధ్యత*

  *కర్తవ్యం, బాధ్యత*

             

```

కర్తవ్యం, బాధ్యత

అనే రెండు మాటలూ మనకు ఒకేలా వినిపిస్తాయి. అర్థాలు ఒకేలా తోస్తాయి. వాస్తవానికి ఆ రెండూ వేరువేరు. 


విధి నిర్దేశించేవి కర్తవ్యాలు. 

కావాలని మనిషి నెత్తికెత్తుకొనేవి బాధ్యతలు. 


కాబట్టే కర్తవ్యాలకు ముగింపు(డిటాచ్ మెంటు)ఉంటుంది. బాధ్యతలకు కొనసాగింపు(అటాచ్మెంట్) ఉంటుంది. 


వివేక వంతులు కర్తవ్యాలను పూర్తి చేస్తారు.


తక్కినవారంతా జీవితాంతం బాధ్యతల్లో మునిగి తేలుతూ ఉంటారు. 


రామాయణంలోని ఇద్దరు మహర్షుల చర్యలను పరిశీ లిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది. 


రాముణ్ని ఓ ఇంటి వాణ్ని చేసింది- కన్నతండ్రి దశరథుడో, పిల్లనిచ్చిన జనకుడో కాదు. 


జాగ్రత్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామిత్రుడు. అది ఆయనకు విధి నిర్దేశించిన కర్తవ్యం. ఆయన పుట్టుకకు లోకకల్యాణం, సీతారామకల్యాణం అనేవి రెండూ ప్రధాన లక్ష్యాలు.


వీటిలో మొదటిది- రాముడి అవతార పరమార్ధంతో ముడివడినది. 


రెండోది- ఆ పరమార్థం నెరవేరేందుకు కావలసిన శక్తిని సమకూర్చినది. ఆ శక్తి పేరు సీతమ్మ. 


విశ్వామిత్రుడు తొలుత తాటక వధతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు. రాక్షసులతో వైరానికి నాంది పలికాడు. యాగ సంరక్షణమనేది ఓ నెపం. అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడి వశం చేసేందుకు ఏర్పడిన సన్నివేశం. రావణ సంహారానికి అవసరమైన సాధన సంపత్తిని రాముడికి సమకూర్చే ప్రయత్నం అది. యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు.


మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకై అహల్యను పరిచయం చేశాడు. గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు. ఇదంతా ఆ ముని కర్తవ్యం! సీతారామకల్యాణం పూర్తవగానే రంగంలోంచి ఆయన నిష్క్రమించాడు. వారి సంసారం ఏ విధంగా నడుస్తోందో, రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అనవసరం.


అది రాముడి పని. రాక్షసుల రక్తాన్ని తోడేయడం, ఇక తానిచ్చిన అస్త్ర శస్త్రాలే చూసుకొంటాయి. పంట కోత పూర్తయ్యాక- ఇక కొడవలికి పనేమిటి? కర్తవ్యం ముగిసిందనే మాటకు, డిటాచ్ మెంట్ అనే భావానికి అసలైన అర్థం అదే!


రామరావణ సంగ్రామం మధ్యలో అగస్త్య మహర్షి ప్రవేశించాడు. రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. మూడుసార్లు పారాయణ చేయించాడు. 


వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. తన ఉపదేశం ఫలించిందా లేదా, రాముడు తేరుకొని రావణాసురుణ్ని సంహరించాడా లేదా... వంటి సంశయాలు, కుతూహలాలు ఆ మహర్షికి లేనే లేవు. 


తాను నేర్పించిన గాండీవ పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వామిత్రుడికి తెలుసు. 

రాముడికి తాను ఉపదేశించిన మంత్ర శక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్యుడికి తెలుసు. 

అంతవరకే వారి పని!


కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వేదిక దిగిపోయారిద్దరూ!


పిల్లలను పెంచి పెద్ద చేయడం, సంస్కారాన్ని అలవరచడం, విద్యాబుద్ధులు నేర్పించడం వరకు తల్లిదండ్రుల కర్తవ్యం. 


పెరిగి పెద్దయి వారివారి జీవితాల్లో స్థిర పడినా- ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవడం ఓ బలహీనత. 


తాము బతికున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవడం కర్తవ్యం కాదు. దాని కొనసాగింపు. 


కర్తవ్యాలు సంతృప్తికి, 

బాధ్యతలు అశాంతికి కారణాలవుతాయి!


ఆ తేడాను గుర్తించిన జీవితాలు సుఖశాంతులకు నోచుకుంటాయి!!✍️```


🙏 **సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*


సేకరణ🙏🏻🙏🏻🙏🏻

తల్లిదండ్రుల రుణం

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేని వారు పుట్టడమెందుకు? గిట్టడమెందుకు? అన్నాడు వేమన. ఆ రోజుల్లో అంటే పురాణ కాలంనాటి గరుత్మంతుని కథ వినవలసిందే. తల్లిని దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి ఏం చేశాడో, తల్లి రుణం ఎలా తీర్చుకున్నాడో.. మన పురాణ కథలు లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు చెబుతున్నారు వినండి. మన జీవితాలు సన్మార్గంలో నడవాలంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అవి వినాలి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత: పదునేడవ అధ్యాయము

శ్రద్ధాత్రయ విభాగయోగము:శ్రీ భగవానువాచ


కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః 

ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః (9)


యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ 

ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ (10)



బాగా చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారంకలిగి, చమురులేకుండా వెర్రిదాహం పుట్టించే ఆహారపదార్థాలంటే రాజసులకు ఇష్టం. ఇవి శరీరానికి బాధ, మనసుకు వ్యాకులత, వ్యాధులు కలగజేస్తాయి. తామసులకు చల్లబడిపోయింది, సారంలేనిది, వాసనకొడుతున్నది, చలిది, ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారమంటే ఇష్టం.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

పంచ మహా యజ్ఞాలు

 *పంచ మహా యజ్ఞాలు - వాటి వివరాలు*


ఇవి ఋత్విక్కులు చేసేయజ్ఞాలు కాదండీ. శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తీ అను నిత్యం పాటించ వలసిన విధులు. అవి ఏమిటి?


*1. దేవ యజ్ఞం*


పూర్వం నిత్యాగ్నిహోత్రులు వుండేవారు. వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనికి *ఆహుతం* అని పేరు. అలాకాక ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా ఆహుతం చేసినట్లే. *సృష్టికి మూలకారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం.*


*2. పితృ యజ్ఞం*


మనల్ని కని పెంచి ఇంత వారిని చేసిన తల్లితండ్రలను ప్రేమగా చూడాలి. చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మన అవసరాలెలా తీర్చారో, *అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని వుండాలి. ఇలా వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలం. ఇది పితృ యజ్ఞం.*


*3. భూత యజ్ఞం*


గృహస్తు సర్వప్రాణికోటిమీద దయ కలిగి పుండాలి. పశు పక్షులు, క్రిమి, కీటకాదులు మానవుడి మీద ఆధార పడి వున్నాయి. అందుకే మనిషికి భూతదయ వుండాలి. అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట (పక్షులు వచ్చే ప్రదేశంలోపెట్టాలి. ఇంటి ముందు కుక్కకి, ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి. ఇంట్లో పశువులు వుంటే వాటికి పెట్టాలి. క్రిమి కీటకాల కోసం కొంచెం అన్నం (తినక ముందు) పక్కన పెట్టాలి. (మన పెద్దలు వీటిని పాటించటం మీలో కొందరయినా చూసే వుంటారు). జలాశయాలలో జలచరాలకు కూడా ఆహారం వెయ్యాలి. *సర్వ ప్రాణులయందూ దయ కలిగి వుండి ప్రతి నిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారం ఇవ్వాలి.*


*4. మనుష్య యజ్ఞం*


మన పెద్దలు అతిధి దేవో భవ అన్నారు. అప్పటివారు ఆతిధ్యం కోరి వచ్చినవారు తమకు తెలియనివారయినా వారిని ఆదరించి సత్కరించేవారు. రోజులు మారినాయి. అయినా ఇంటికొచ్చినవారిని మన కులం వారా, మన మతం వారా మన కేవిషయంలో నైనా పనికి వస్తారా లేదా వగైరాలాలోచించకుండా వారు వచ్చిన సమయాన్నిబట్టి తగు విధంగా గౌరవించాలి. *తోటి వారి పట్ల దయ కలిగి వుండాలి. అందరితో సఖ్యంగా వుండాలి. ఎవరైనా సహాయం కోరితే, మనం చెయ్యగలిగితే నిస్వార్ధంగా చెయ్యాలి.*


*5. బ్రహ్మ యజ్ఞం*


ప్రతి వారూ, ప్రతి రోజూ వేద మంత్రాలు కానీ శాస్త్రిలని కానీ చదవాలి. ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య తక్కువగానీ *ప్రతి వారూ ఎవరికి వీలయిన, ఎవరికి ఆసక్తి వున్న, ఎవరికి అనుకూలంగా వున్న శాస్త్రాలను చదవాలి. ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి చూపించాలి. అంతేకాదు. తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి.* 


*ప్రతి మనిషికీ భగవంతుని పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భూత దయ, తోటి మనిషులతో కలిసి వుండే మనస్తత్వం, శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస వున్నాయనుకోండి. ఈ ప్రపంచం ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచ యజ్ఞాలను నిర్దేసించారు మన పెద్దలు.*

*Gas Trouble: గ్యాస్ స‌మ‌స్య

  



*Gas Trouble: గ్యాస్ స‌మ‌స్య:*

             ➖➖➖✍️


```

మ‌న‌ల్ని వేధించే అనేక అనారోగ్య స‌మస్య‌ల్లో పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో చిన్నా పెద్దా అనే లేడా లేకుండా అంద‌రూ బాధ‌ప‌డుతూ ఉంటారు. 


ఆహార నియ‌మాల‌ను పాటించ‌క పోవ‌డం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, మాన‌సిక ఒత్తిడితోపాటు పులుపు ఎక్కువ‌గా ఉండే ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం, మసాలాలు ఎక్కువగా తినడం, జంక్ ఫుడ్ తినడం, మ‌ల‌బ‌ద్ద‌కం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌నం గ్యాస్ స‌మ‌స్య బారిన ప‌డుతూ ఉంటాం. 


గ్యాస్ స‌మ‌స్య కారణంగా క‌డుపులో మంట‌, అజీర్తి, ఆక‌లి లేక‌పోవ‌డం, క‌డుపులో నొప్పి, పుల్ల‌టి త్రేన్పులు రావ‌డం వంటివి జ‌రుగుతూ ఉంటాయి. 


మ‌నం రోజూతినే ఆహారంతోపాటు మ‌న జీవ‌న విధానంలో కొన్ని ర‌కాల మార్పులు చేయ‌డం వ‌ల్ల మ‌నం ఈ స‌మ‌స్య నుండి తేలిక‌గా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.


మ‌నం చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైపోయి వేళ‌కు తిన‌ని వారు చాలా మందే ఉంటారు. గ్యాస్ స‌మ‌స్య రావ‌డానికి ప్రధాన కార‌ణం స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డ‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు. స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం వ‌ల్ల మ‌నం ఈ స‌మ‌స్య బారిన ప‌డే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. 

అలాగే క‌డుపును ఎప్పుడూ ఖాళీగా ఉంచ‌కూడ‌దు. మ‌ధ్య మ‌ధ్య‌లో పండ్లను కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి. మ‌న‌కు పండ్లు కూడా అందుబాటులో లేన‌ప్పుడు కనీసం మంచి నీళ్ల‌నైనా తాగుతూ ఉండాలి. అలాగే మనం తినే ఆహారంలో మ‌సాలాల‌ను, పులుపును ఉప‌యోగించ‌డం త‌క్కువ చేయాలి. బ‌య‌ట దొరికే శీత‌ల పానీయాల‌ను తాగ‌కూడ‌దు. ధూమ‌పానం అల‌వాటును కూడా మానాలి.


ఎన్ని ర‌కాల స‌మ‌స్య‌లు ఉన్నా ఆందోళ‌న‌కు, ఒత్తిడికి గురి కాకుండా ప్ర‌శాంతంగా ఉండాలి. అదేవిధంగా ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీటిలో అల్లం ర‌సాన్ని, తేనెను క‌లిపి తీసుకోవాలి. అదే విధంగా గోరు వెచ్చ‌ని నీటిలో ఉప్పు, వాము పొడి, అల్లం ర‌సం, నిమ్మ ర‌సం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా గ్యాస్ స‌మ‌స్య రాకుండా ఉంటుంది. 

వాము పొడిని, సోంపు పొడిని క‌లిపి రెండు పూట‌లా తీసుకోవ‌డం వల్ల, అలాగే చిన్న అల్లం ముక్క‌కు ఉప్పును రాసి నేరుగా తిన‌డం వ‌ల్ల కూడా గ్యాస్ స‌మ‌స్య బారిన ప‌డ‌కుండా ఉంటాం.


పుదీనా ఆకుల‌ను మ‌రిగించిన నీటిని తాగ‌డం వ‌ల్ల, రోజూ ఉద‌యం ఆరు తుల‌సి ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ చిట్కాల‌ను పాటిస్తూ ఆహారంలో, జీవ‌న విధానంలో మార్పులు చేయ‌డం వ‌ల్ల పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య రాకుండా ఉంటుంది. ఈ స‌మ‌స్య వ‌చ్చిన త‌రువాత బాధ‌ప‌డ‌డం క‌న్నా.. రాక‌ముందే జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

*ఏది ముసలితనం

 

  *ఏది ముసలితనం?* 

                *ఎవరు వృద్ధులు??*

                 ➖➖➖✍️


*వార్ధక్యం వయసా నాస్తి*

*మనసా నైవ తద్భవేత్‌*

*సంతతోద్యమ శీలస్య*

*నాస్తి వార్ధక్య పీడనమ్‌*

```

ముసలితనం వయసులో లేదు, వయస్సుతో రాదు. మనస్సులోనూ ఉండకూడదు.


ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదని సుభాషితం.


ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం,

దుఃఖం వల్ల వచ్చేది భావజం.


వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే.


70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు.


కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది.


మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు.```


*‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’* ```అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి.


భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారు గానీ వయో వార్ధక్యాన్నికాదు.


నిత్యవ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, మంచిమాటలు ఇవి ఉన్న చోట ముసలితనంఉండదు.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

శ్రీ తనోట్ మాతా ఆలయం

 🕉 మన గుడి : నెం 1306


⚜  రాజస్థాన్ : జైసల్మేర్ 


⚜  శ్రీ తనోట్ మాతా ఆలయం 



💠 రాజస్థాన్‌లోని అందమైన పసుపు నగరమైన జైసల్మేర్‌లో తనోట్ మాతా ఆలయం ఉంది. ఇది థార్ ఎడారిలో భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన హిందూ తీర్థయాత్ర ప్రదేశాలలో ఒకటి. 


💠 ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో జైసల్మేర్‌ను పాలించిన భాటి రాజ్‌పుత్ మహారావల్ లోన్‌కావత్ నిర్మించాడు.


💠 ఈ ఆలయం దుర్గాదేవి స్థానిక అవతారంగా పరిగణించబడే తనోట్ మాతకు అంకితం చేయబడింది. తనోట్ మాతా ఆలయం భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మరియు దేశం నలుమూలల నుండి యాత్రికులను ఆకర్షిస్తుంది.


💠 హింగ్లాజ్ మాతా అవతారమైన తనోట్ దేవతకు అంకితం చేయబడిన ఈ ఆలయం విశ్వాసం మరియు అద్భుతాలతో లోతుగా ముడిపడి ఉంది.


💠 పురాణాల ప్రకారం, దుర్గాదేవి అవతారమైన తనోట్ మాత చాలా కాలంగా ఈ ప్రాంతానికి రక్షకురాలిగా సేవలందిస్తోంది. తన అనుచరులను ప్రమాదం మరియు శత్రు దాడుల నుండి కాపాడుతూ, దేవత అద్భుత జోక్యాలను ప్రదర్శించినట్లు అనేక కథలు ఉన్నాయి. 


💠 ఇండో-పాకిస్తాన్ యుద్ధాల సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ సైనికులకు ఈ ఆలయం భక్తి కేంద్రంగా మారింది, వారు తమ ప్రాణాలతో బయటపడటానికి కారణం తనోట్ మాత దైవిక జోక్యం అని నమ్ముతారు.


💠 ఒక సహస్రాబ్ది క్రితం నిర్మించబడిందని భావించిన ఈ ఆలయం 1965 మరియు 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధాల సమయంలో అద్భుతంగా విధ్వంసం నుండి రక్షించబడి, దైవిక రక్షణకు ప్రాతినిధ్యం వహించే హోదాను పొందిందని పురాణాలు చెబుతున్నాయి.



🔆 స్థలపురాణం.


💠 మమద్జీ చరణ్ (గాధ్వి) కుమార్తె అయిన ఆవద్ దేవతను తనోత్ మాతగా పూజిస్తారు మరియు కర్ణి మాతకు పూర్వీకురాలు . 


💠 టెండే రాయ్, కర్ణి మాత, దేగ్ రాయ్ మరియు ఖోడియార్ వంటి ఈ ప్రాంతంలోని అనేక ఇతర దేవతల మాదిరిగానే, ఆమె కూడా చరణ్ కులంలో జన్మించి  ఋషిగా తన జీవితాన్ని గడిపింది. 


💠 పురాతన చరణ్ సాహిత్యం ప్రకారం , తనోత్ మాత దైవిక దేవత హింగ్లాజ్ మాత అవతారం మరియు అందువల్ల యుద్ధ దేవత.

సాంప్రదాయ చరిత్ర లేఖకుల చరణ్ రికార్డుల ప్రకారం , హింగ్లాజ్ మాత తనోట్ మాతగా పునర్జన్మ పొంది, తరువాత కర్ణి మాతగా పునర్జన్మ పొందారు .


💠 చాలా కాలం క్రితం మమద్జీ చరణ్ అనే వ్యక్తి ఉండేవాడు , అతనికి  పిల్లలు లేరు. అతను సంతానం కోసం దాదాపు ఏడు సార్లు హింగ్లాజ్ మాతకు కాలినడకన ప్రయాణించాడు. ఒక రాత్రి, హింగ్లాజ్ మాత తన కలలో మమదియ చరణ్ (గాధ్వి) ని, నీకు కొడుకు కావాలా లేక కూతురు కావాలా అని అడిగినప్పుడు, చరణ్ నువ్వు నా ఇంట్లో జన్మించాలని చెప్పాడు. 


💠 హింగ్లాజ్ మాత దయవల్ల, ఆ ఇంట్లో ఏడుగురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు జన్మించారు. వీరిలో ఒకరు ఆవద్ మాత, ఆమెను తనోత్ మాత అని పిలుస్తారు.


💠 ఈ ఆలయాన్ని నిర్మించి, పాలిస్తున్న దేవత విగ్రహాన్ని భాటి రాజ్‌పుత్ రాజు తనూ రావు 828 లో ప్రతిష్టించారు . అప్పటి నుండి, ఈ ఆలయాన్ని భాటి రాజ్‌పుత్‌లు మరియు జైసల్మేర్ ప్రజలు తరతరాలుగా గౌరవించి పూజిస్తున్నారు. 


💠 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం తనోట్ పై దాడి చేసింది, ఈ సమయంలో ఆలయం వైపు 3,000 బాంబులు ప్రయోగించబడ్డాయి. 

అయితే, స్థానిక కథనం ప్రకారం, బాంబులు లక్ష్యాన్ని తప్పిపోయాయి లేదా పేలలేదు.

1965 యుద్ధం తర్వాత, భారతదేశ సరిహద్దు భద్రతా దళం (BSF) ఆలయాన్ని నిర్వహణ బాధ్యతను చేపట్టింది.


💠 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో తనోట్ పై మళ్ళీ దాడి జరిగింది , కానీ ఈసారి దాడి చేసే ట్యాంకులు ఇసుకలో కూరుకుపోయాయి, దీనివల్ల భారత వైమానిక దళం వాటిని నాశనం చేయగలిగింది.


💠 1971 యుద్ధం తర్వాత, లోంగేవాలా యుద్ధంలో విజయానికి గుర్తుగా భారత సైన్యం ఆలయ ప్రాంగణం లోపల విజయ స్తంభం (విక్టరీ టవర్) నిర్మించింది .

భారత సైన్యంలోని 120 మంది పదాతిదళ సైనికులతో కూడిన ఒక కంపెనీ 2000 మంది పాకిస్తాన్ సైనికుల విభాగాన్ని ఓడించింది, దీనికి పాకిస్తాన్ ట్యాంక్ స్క్వాడ్రన్ కూడా ఉంది.


💠 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం విజయం సాధించిన తర్వాత, భారత సరిహద్దు భద్రతా దళం (BSF) ఆలయాన్ని విస్తరించింది, విజయ స్తంభాన్ని మరియు పేలని పాకిస్తానీ బాంబులు మరియు ట్యాంకులను ఉంచే యుద్ధ మ్యూజియంను నిర్మించింది. 


💠 ప్రతి సంవత్సరం డిసెంబర్ 16ని ఆలయంలో విజయ దినోత్సవంగా జరుపుకుంటారు .


💠 ఈ ఆలయం జైసల్మేర్ నుండి దాదాపు 120 కి.మీ దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

మంగళవారం*🍁 *🌹25నవంబర్ 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

   🍁 *మంగళవారం*🍁

*🌹25నవంబర్ 2025🌹*      

   *దృగ్గణిత పంచాంగం* 

                    

           *స్వస్తి శ్రీ విశ్వావసు* 

           *నామ సంవత్సరం*

 *దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్ల పక్షం*


*తిథి  : పంచమి* ‌రా 10.56 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : ఉత్తరాషాఢ* రా 11.57 వరకు ఉపరి *శ్రవణం*

*యోగం : గండ* మ 12.50 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం  : బవ* ఉ 10.12 *బాలువ* రా 10.56 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 05.30 - 06.30* 

అమృత కాలం  : *సా 05.00 - 06.45*

అభిజిత్ కాలం  : *ప 11.32 - 12.17*

*వర్జ్యం    : ఉ 06.35 - 08.19 & రా.తె 04.13 - 05.56*

*దుర్ముహూర్తం  : ఉ 08.32 - 09.17 రా 10.38 - 11.29*

*రాహు కాలం   : మ 02.43 - 04.08*

గుళికకాళం      : *ప 11.54 - 01.19*

యమగండం    : *ఉ 09.05 - 10.30*

సూర్యరాశి :*వృశ్చికం*                         

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 06.27*

సూర్యాస్తమయం :*సా 05.40*

*ప్రయాణశూల   : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.16 - 08.32*

సంగవ కాలం         :     *08.32 - 10.47*

మధ్యాహ్న కాలం    :    *10.47 - 01.02*

అపరాహ్న కాలం    : *మ 01.02 - 03.17*


*ఆబ్ధికం తిధి         : మార్గశిర శుద్ధ పంచమి*

సాయంకాలం        :  *సా 03.17 - 05.32*

ప్రదోష కాలం         :  *సా 05.32 - 08.05*

రాత్రి కాలం           :*రా 08.05 - 11.29*

నిశీధి కాలం          :*రా 11.29 - 12.20*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.35 - 05.26*

*****************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*


*యశోజయంచ మే దేహి* 

*శత్రూన్ నాశయ నాశయ*

*స్వాశ్రితానామ భయదం*  

*య ఏవం స్తౌతి మారుతిం*

*హానిమేతో భవేత్తస్య*  

*సర్వత్ర విజయీ భవేత్.!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

సంపూర్ణ మహాభారతము*

  

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!


                            5️⃣4️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


    *సంపూర్ణ మహాభారతము* 

        

            *54 వ రోజు*                  

          *జరాసంధ వధ*```


శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలసి కపట బ్రాహ్మణ రూపాలలో కపట స్నాతక వ్రతం స్వీకరించారు. జరాసంధుని నగరమైన గిరివ్రజపురం సమీపించారు. ఆ పురం చుట్టూ ఉన్న పర్వతాలు ప్రాకారాలలా ఆ పురాన్ని రక్షిస్తున్నాయి. పక్కనే చైత్యకమనే కొండ ఉంది. దానిపై మూడు ఢక్కలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు భీమార్జునులకు ఆ ఢక్కలను చూపి “భీమా నగరంలోకి ఎవరన్నా కొత్త వారు ప్రవేశిస్తే ఆ ఢక్కలు మోగుతాయి” అని చెప్పాడు. భీమార్జునులు ఆఢక్కలను పగులకొట్టి చైత్యకపర్వత మార్గంలో నగరంలో ప్రవేశించారు. శ్రీకృష్ణుడు భీమార్జునులు సిగలో పూలు అలంకరించుకున్నారు. స్నాతకుల మాదిరి గోశాలలో ప్రవేశించారు. జరాసంధునికి బ్రాహ్మణులంటే భక్తిప్రపత్తులు మెండు కనుక బ్రాహ్మణులు రాజమందిరంలోకి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. బ్రాహ్మణవేషాలలో ఉన్న శ్రీకృష్ణుడు  భీమార్జునులకు అర్ఘ్యపాద్యాలను ఇచ్చాడు. వారు వాటిని పుచ్చుకోలేదు. జరాసంధుడు సందేహపడి వారిని “మీరు గంధపుష్పాలు ధరించినా స్నాతకులుగా లేరు. మీ ఆకారాలు క్షత్రియుల మాదిరి ఉన్నాయి. మీరు ఎవరు? ఎందుకు వచ్చారు?" అని అడిగాడు. 


అందుకు శ్రీకృష్ణుడు, భీమార్జునులు 

“మేము క్షత్రియ స్నాతకులము. ముఖద్వారం గుండా మిత్రుల ఇంటికి, దొంగ ద్వారం గుండా శత్రువుల ఇంటికి ప్రవేశించడం క్షత్రియ ధర్మం" అన్నారు. 


జరాసంధుడు "నేను ఎవరికీ అపకారం చేయలేదు. నేను బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు భక్తుడను. ఉత్తమ క్షత్రియ ధర్మాలు ఆచరిస్తున్నాను. మీకు నేనెలా శత్రువునైయ్యాను?" అన్నాడు. 


“ఓ జరాసంధా! ధర్మరాజు 

ఆజ్ఞపై శత్రుసంహారానికి వచ్చాము. ఉత్తమ క్షత్రియుడిని అని చెప్పుకుంటున్న నీవు క్షత్రియులను పట్టి బంధించి శివునకు బలి ఇచ్చి శివపూజలు ఎలా నిర్వహిస్తావు? ఉత్తమ క్షత్రియులు ఇలా చేస్తారా? నిష్కారణంగా సాధు హింస చేసే వారు, జనులను హింసించే వారు అందరికి శత్రువులు కారా? నిర్ధోషులైన సాటి కులం వారిని చంపడం పాపం కాదా. అలాంటి పూజలు ఫలిస్తాయా? నీలాంటి పాపులను విడిచి పెడితే మాకు పాపం వస్తుంది. కనుక నీతో యుద్ధానికి వచ్చాము. నేను కృష్ణుడిని, ఇతను భీముడు, అతడు అర్జునుడు. ఇప్పటికైనా చెరలో ఉన్న రాజులను విడిచిపెడితే సరి లేని యడల వీరు నీ గర్వమణచి వారిని విడిపించకలరు" అని శ్రీకృష్ణుడు అన్నాడు. 


జరాసంధుడు కోపించి “పరాక్రమంతో రాజులను జయించడం నేరమా. పరమ శివునకు బలి ఇవ్వడానికి తెచ్చిన వారిని నేను ఎందుకు

వదిలి పెడతాను. సైన్యంతో వస్తే సైన్యంతో యుద్ధం చేస్తాను. లేనియడల మీ ముగ్గురితో కానీ, ఇద్దరితో కానీ, ఒక్కరితో కానీ యుద్ధం చేస్తాను మీకు ఏది ఇష్టమో చెప్పండి" అన్నాడు. 


శ్రీకృష్ణుడు “ముగ్గురు నీతో యుద్ధం చేయడం ధర్మంకాదు. మా ముగ్గురిలో నీకు సరిజోడుని కోరుకో. అతను మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు" అని అన్నాడు. 


జరాసంధుడు “నాకు సరిజోడు భీముడే. కనుక అతనితో యుద్ధం చేస్తాను" అని చెప్పాడు. 


జయాపజయాలు దైవాధీనం కనుక జరాసంధుడు ముందుగా అతని కుమారుడు సహదేవునికి రాజ్యాభిషేకం చేసాడు. పురోహితుల చేత మంగళ శాసనాలు పొంది భీముని మల్ల యుద్ధానికి పిలిచాడు. భీముడు-  జరాసంధుడు ఘోరంగా తలపడ్డారు. ఒకరిని ఒకరు జయించాలన్న కాంక్షతో ఒకరిని మించి ఒకరు భీకరంగా తల పడ్డారు. ఇలా కార్తీక శుద్ధ పాడ్యమి నుండి త్రయోదశి వరకు సాగింది. అప్పటికి జరాసంధుడు అలసి పోయాడు. 


శ్రీకృష్ణుడు “భీమా! జరాసంధుడు అలసి పోయాడు. ఇది తగిన సమయం, అతడిని సంహరించు!” అన్నాడు. 


భీమసేనుడు తన తండ్రి వాయుదేవుని తలచుకుని జరాసంధుని గిరా గిరా తిప్పి నూరు సార్లు విసిరి వేసాడు. అతడి ఎముకలు విరిచి ఘోరంగా సంహరించాడు. జరాసంధుని మృతదేహాన్ని అతని ముఖద్వారం ముందు పడవేశాడు.  


శ్రీకృష్ణుడు మగధవాసులకు అభయం ఇచ్చాడు. జరాసంధుని చెరలో ఉన్న రాజులను విడిపించాడు. జరాసంధుడి కుమారుడైన సహదేవునికి ధైర్యం చెప్పాడు.తరువాత వారు ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. ధర్మరాజుకు జరిగినది చెప్పి విడిపించిన రాజులను చూపించాడు. రాజులంతా వారి వారి రాజ్యాలకు పయనమయ్యారు.  శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పంచభూతాలు

  .


*పంచభూతాలు – ఆహారంలో ఉన్న శక్తులు*


*ముందుమాట:*  

మన శరీరం పంచభూతాల (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) ఆధారంగా పనిచేస్తుంది. తినే ఆహారంలో కూడా ఈ భూతాల సమతుల్యత ఉంటుంది. ఏ భూతం ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. అందుకే పంచభూతాలను అర్థం చేసుకుని ఆహారాన్ని ఎంచుకుంటే శరీరం సమతుల్యం అవుతుంది మరియు రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.


1) *భూమి తత్త్వం (Earth Element) – స్థిరత్వం ఇచ్చే ఆహారం*  

ఈ తత్త్వం శరీరానికి బలం, స్థిరత్వం, నిర్మాణం ఇస్తుంది. అన్నం, గోధుమ, రాగి, జొన్న, బంగాళాదుంప, వేరుశనగ వంటి భూభాగంలో పెరిగే ఆహారాలు ఇందులోకి వస్తాయి. వీటివల్ల శరీరానికి శక్తి, బలం, నిండిన అనుభూతి కలుగుతుంది. అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతుంది, కాబట్టి పరిమాణం ముఖ్యం.


2) *నీటి తత్త్వం (Water Element) – శరీర ద్రవాల సమతుల్యం*  

శరీరానికి హైడ్రేషన్ ఇచ్చే అన్ని ఆహారాలు ఈ తత్త్వంలో పడతాయి. నీరు, మజ్జిగ, పండ్ల రసాలు, కీరా, పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఈ తత్త్వం రక్త ప్రసరణ, చర్మ కాంతి, జీర్ణం కోసం అవసరం. తక్కువైతే డీహైడ్రేషన్ వస్తుంది.


3) *అగ్ని తత్త్వం (Fire Element) – జీర్ణశక్తి + వేడి*  

ఈ తత్త్వం శరీరంలో జీర్ణశక్తి, శక్తి ఉత్పత్తి మరియు ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. మిరపకాయ, అల్లం, మసాలాలు, తేనె, కుంకుమపువ్వు వంటి పదార్థాలు అగ్ని తత్త్వాన్ని పెంచుతాయి. ఇవి శరీరాన్ని తేలికగా ఉంచుతాయి మరియు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఎక్కువైతే వేడి, యాసిడ్ సమస్యలు వస్తాయి.


4) *గాలి తత్త్వం (Air Element) – కదలిక, ఊపిరితిత్తుల శక్తి*  

ఈ తత్త్వం మనం ఊపిరి పీల్చే విధానం, రక్త ప్రసరణ, శరీర చలనం మీద ప్రభావం చూపుతుంది. ఆకుకూరలు, మొలకలు, తేలికపాటి పండ్లు, వేపిన శెనగలు, కందిపప్పు వంటి పదార్థాలు గాలి తత్త్వాన్ని బలోపేతం చేస్తాయి. శరీరాన్ని తేలికగా, చురుకుగా ఉంచుతాయి. ఎక్కువైతే గ్యాస్, ఊబకాయం, నరాల బలహీనత వస్తాయి.


5) *ఆకాశ తత్త్వం (Space Element) – శరీర ఖాళీల నియంత్రణ*  

శరీరంలో స్థలం, ఖాళీలు, మానసిక స్థిరత్వం ఈ తత్త్వం మీద ఆధారపడి ఉంటాయి. కొబ్బరి నీరు, తేలికపాటి పండ్లు, మిలెట్స్, కీరా, బాదం, వాల్‌నట్స్ ఆకాశ తత్త్వాన్ని సమతుల్యం చేస్తాయి. ఇవి మనసును ప్రశాంతం చేస్తాయి. అధిక ఆకాశ తత్త్వం ఆకలి తగ్గడం, బలహీనతకు దారితీస్తుంది.


6) *పూర్ణాన్నాలు పంచభూతాల సమతుల్యాన్ని ఇస్తాయి*  

బియ్యం, రాగి, జొన్న, క్వినోవా, ఓట్స్ వంటి పూర్ణ ధాన్యాలు ఐదు తత్త్వాల్లో బ్యాలెన్స్ కలిగిస్తాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి మరియు నిద్రమత్తు లేకుండా శక్తినిస్తాయి.


7) *పండ్లు – నీరు + గాలి తత్త్వాల ఆధారం*  

పండ్లలో నీరు అధికం, తేలికగా జీర్ణమయ్యేవి. కాబట్టి ఇవి నీరు, గాలి తత్త్వాల సమతుల్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ రెండు రకాల పండ్లు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి.


8) *కూరగాయలు – గాలి + భూమి తత్త్వాలు*  

పచ్చి కూరలు గాలి తత్త్వాన్ని పెంచుతాయి, వేరుజన్య కూరగాయలు భూమి తత్త్వాన్ని పెంచుతాయి. రెండు రకాలూ శరీరానికి అవసరం. ఇవి శరీరానికి విటమిన్లు, మినరల్స్ అందిస్తాయి.


9) *పప్పులు – భూమి + అగ్ని తత్త్వాలు*  

పప్పులు బలం, ప్రోటీన్, జీర్ణశక్తి ఇస్తాయి. అధిక అగ్ని తత్త్వం ఉన్నవారికి తక్కువగా తినటం మంచిది. శాకాహారులకి ఇది ప్రధాన ప్రోటీన్ వనరు.


10) *పాలు – భూమి + నీటి తత్త్వాలు*  

పాలు శరీరానికి చల్లదనం, బలం ఇస్తాయి. రాత్రి గోరు వెచ్చని పాలులో తుమ్మెర కలిపితే అగ్ని తత్త్వం కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది.


11) *మసాలాలు – అగ్ని తత్త్వాన్ని పెంచేవి*  

మసాలాలు శరీరాన్ని వేడిగా ఉంచుతాయి మరియు జీర్ణక్రియను చురుకుగా చేస్తాయి. కానీ ఎక్కువైతే ఆమ్లత్వం వస్తుంది కనుక పరిమాణం ముఖ్యం.


12) *కొబ్బరి – నీరు + ఆకాశ తత్త్వాలు*  

కొబ్బరి నీరు, కొబ్బరి పాలు శరీరానికి చల్లదనం, తేలికనిచ్చే ఆహారం. ఇది శరీర వేడి తగ్గించి నాడీవ్యవస్థను ప్రశాంతం చేస్తుంది.


13) *నూనెలు – భూమి + అగ్ని తత్త్వాలు*  

తక్కువ మోతాదులో నూనె శరీరానికి అవసరం. నూనెలో ఉన్న భూమి + అగ్ని తత్త్వాలు కీళ్ళను లూబ్రికేట్ చేస్తాయి. అధికంగా తీసుకుంటే అగ్ని తత్త్వం పెరిగి acidity, బరువు పెరుగుదలకు దారితీస్తుంది.


14) *ప్రోటీన్ ఫుడ్స్ – భూమి తత్త్వం బలోపేతం*  

పప్పు, పాలు, గుడ్లు, చేపలు వంటి ఆహారం శరీర నిర్మాణానికి అవసరం. ఇవి పెరుగుదల, మరమ్మత్తు, బలం కోసం ముఖ్యమైనవి.


15) *మిలెట్స్ – పంచభూతాల సమతుల్యం*  

జొన్న, రాగి, కొర్ర వంటి మిల్లెట్స్ శరీరానికి బలం, నీరు, శక్తి అన్నిటినీ సమతుల్యం చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరం.


*ముగింపు:*  

పంచభూతాలను అర్థం చేసుకుని ఆహారాన్ని ఎంచుకోవడం ఆరోగ్యం కోసం చాలా కీలకం. శరీరంలో భూతాలు బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడు జీర్ణం మెరుగుపడుతుంది, నిద్ర బాగుంటుంది, రోగాలు దూరంగా ఉంటాయి. ప్రతి రోజు భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం తత్త్వాలు ఉన్న ఆహారం తీసుకుంటే జీవితం ఆరోగ్యంగా, చురుకుగా ఉంటుంది.


    🙏🏻🙏సేకరణ🙏🙏🏻

హిందూధర్మం

  🌹హిందూధర్మం 🌹


మరి మనం గ్రీకుల నుంచి జ్యోతిష్యం స్వీకరించామా? వారు ఇక్కడి నుంచి తీసుకున్నారా? కలియుగం ప్రారంభంలో కొంతకాలం వరకు ప్రపంచమంతా సనాతన ధర్మమే వ్యాపించి ఉంది. మహాభారత యుద్ధం నాటికి వైభవోపేతంగా విలసిల్లింది. ఈ విషయం మీద మనం ఇదే శీర్షికన ప్రరురిచిన అనేక భాగాల్లో దానికి ఆధారాలు కూడా చూశాము. ఈ గ్రీకు, రోమన్ నాగరికతలు కూడా హిందూ ధర్మం నుంచి వేరుపడ్డవే. మహాభారత యుద్ధం తర్వాత యుగాంతం యొక్క ప్రభావం చేత ప్రపంచంలో అనేక మార్పులు సంభవించాయి. సరస్వతీ నది ఎండిపోయింది, అప్పుడు కొంతమంది ఈ భరతఖండం నుంచి పశ్చిమ దిశగా వెళ్ళారు. కొందరు ఈజిప్టులో స్థిరపడ్డారు. కొందరు ఇంగ్లాండ్, గ్రీకు దేశాల దిశగా మళ్ళారు. ఇంతకముందు యుగాల మాదిరిగా ఋషులు దేశపర్యటనలు చేసి ధర్మప్రచారం చేయలేదు, ఈ యుగప్రభావంగా. అలా అక్కడున్న సంస్కృతుల వారు సనాతనధర్మ మూల సూత్రాలకు దూరమయ్యారు. ఆస్ట్రేలియాలో కొన్ని స్థానిక తెగలున్నాయి. వారికి మనలా అగ్నిహోత్రం, యజ్ఞ ప్రక్రియ ఉంది. మంట రగిల్చి, దానిలో ఆకులు, కట్టెపుల్లలు వేస్తూ, హా!హా! అంటూ అరుస్తారు. వేదంలో చెప్పబడ్డ స్వాహా కారం కాలక్రమంలో అక్కడ అలామారింది, మూలగ్రంధాలతో సంబంధం తెగిపోయి. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంతేందుకు, గ్రీకులకు కూడా భారతదేశమే తమ గురువనే భావన బలంగా ఉండేది. అ.పూ. 326 లో అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్రకు వచ్చాడు, కోటా వేంకటాచలం గారు నిర్ధారించిన చారిత్రిక ఆధారాల పరంగా, అలాగే గ్రీకు చరిత్ర ఆధారంగా.  


అలెగ్జాండర్ విశ్వమంతా జయించి వస్తానని తన గురువు అరిస్టాటిల్ వద్దకు వెళ్ళినప్పుడు నువ్వు ప్రపంచంలో ఏ దేశం మీదకైనా వెళ్ళు, కానీ భారతదేశం మాత్రం వెళ్ళకు, అక్కడికి వెళితే నీ ఆటలు సాగవు, నీ పనైపోతుంది అంటాడు. అయినా వినకుండా భారతదేశం మీదకు వస్తాడు, అది తెలుసుకున్న అరిస్టాటిల్, నువ్వెలాగో నా మాట వినకుండా భారతదేశం వెళ్ళావు, కనీసం అక్కడి నుంచి వచ్చేటప్పుడు నీతో పటు 5 వస్తువులు తీసుకురా!ఒకటి భారతదేశం మట్టి. ఎందరో ఋషులు, గురువులు, మహాపురుషులకు జన్మనిచ్చిన మట్టి అది. అక్కడ అనేకమంది ఆ మట్టిపై తిరిగారు. దాన్ని నీవు తీసుకువస్తే, నేను దాన్ని పవిత్రంగా భావించి పూజించుకుంటాను. అలగే గంగాజలం తీసుకురా. అది ఎప్పటికి పాడవ్వనిది, పవిత్రమైనది. మూడవది భగవద్గీత, నాలుగు భాగవతం తీసుకురా, ఐదవది, ముఖ్యమైనది, అక్కడి నుంచి ఒక గురువును తీసుకొనిరా. ఆయన్ను నేను గురువుగా చేసుకుంటాను అన్నాడు. అలెగ్జాండర్ మనదేశం మీద యుద్ధానికి రావడం, ఓడిపోవడం, ఇక్కడి బ్రాహ్మణులతో శాస్త్ర చర్చలు జరిపి, వాళ్ళ జ్ఞానానికి మెచ్చి, కొందరిని అక్కడికి తనతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. దారిలో ఒక సాధువుకు చేసిన అపచారం కారణంగా, అతని శాపానికి గురై, ఆ శాపవశాత్తు తన మాతృభూమికి చేరకుండానే రోగం వచ్చి మరణించాడు గ్రీకువీరుడు. అలా అలెగ్జాండర్‌తో వెళ్ళిన బ్రాహ్మణ పండితులు గ్రీకువారికి జ్ఞానోదయం చేశారు. అంతేకాక అలెగ్జాండర్ భారతదేశం నుంచి పరాజయంతో తిరిగి వెళుతూ తనతో పాటు ఎన్నో ధార్మిక గ్రంధాలను తీసుకువెళ్ళాడు. అలా సనాతన జ్ఞానం గ్రీకు అంధకారాన్ని నశింపజేసింది.


ఈనాడు పాశ్చాత్య ప్రపంచం తన ఆలోచనా విధానానికి ముగ్గుర్ని మూల పురుషులుగా చెప్తుంది, ఒకరు సోక్రటిస్, రెండు ప్లాటో, మూడు అరిస్టాటిల్. వాళ్ళే కాదు, మన దేశంలో అభ్యుదయవాదులుగా చెలామణి అవుతున్న కుహనా మేధావులు, నాస్తికులు కూడా వీరినే గురువులుగా భావిస్తారు. అరిస్టాటిల్ గురించి చెప్పుకున్నాం. మిగిలింది సోక్రటీసు, ప్లాటో. సోక్రటీస్‌కూ ఒక హిందు మునికి జరిగిన వాగ్వాదాన్ని గురించి 'యూసేబియస్'లో ఒక చోట ఇలా చెప్పడం జరిగింది. సోక్రటీస్ ఆ హిందూ మునిని అఘోర లేదా మార్కెట్ స్థలంలో కలుసుకున్నాడు. ఆ హిందూముని సోక్రటీస్ ను నీవేమీ చేస్తున్నావని, నీ తత్త్వం విషయ విస్తృతి ఏమిటని అడిగాడు. దానికి సోక్రటీస్ మానవ దృగ్విషయాల అనుశీలన అని జవాబిచ్చాడు, కాగా ఆ భారతీయుడు విరగబడి నవ్వాడు. దివ్య విషయాలను ఎరగనప్పుడు, మానవ దృగ్విషయాలను మనిషి ఎలా అనుశీలన చేయగలడని అంటాడు.

మనకు అర్దమయ్యేలా చెప్పుకోవాలంటే సోక్రటీసు 'నేను మనిషిని అర్దం చేసుకోవడం కొరకు మనుషుల్ని ప్రశ్నిస్తున్నాను' అంటాడు. అప్పుడా హిందూముని గట్టిగా నవ్వి, భగవంతుని/ ఆత్మను అర్దం చేసుకోకుండా మనిషిని ఎలా అర్దం చేసుకుంటారని అంటాడు. పాశ్చాత్య తత్త్వశాస్త్రాల్లో ప్రతిధ్వనించే గ్రీకు ఆదర్శం: 'మనిషి, నువ్వు స్వయంగా తెలుసుకో' (Man, Know thyself). హిందువు అనేది 'మనిషీ, నీ ఆత్మను తెలుసుకో' (Man, Know thy Self) అని. నేను ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను (I think, therefore I exist) అనేది పశ్చిమ దేశాల్లో బాగా కనిపిస్తుంది. అది డెకార్ట్ (Descartes) అన్న వాక్యం. కానీ అది తాత్త్వికంగా చెల్లదు. భారతీయుడంటాడు నేను ఉన్నాను, కనుక నేను ఆలోచిస్తున్నాను (I Exist, therefore I think). ఎందుకంటే తార్కిక వివేచన శక్తులు మానవుడి పరమ సత్యాన్ని వెల్లడించలేవు. మానవ మనస్సు, అది గుర్తించే పరిణామశీల ప్రపంచంలాగే శాశ్వత పరివర్తనలో ఉన్నది. అంతిమ నిర్ణయాలను అది అందించలేదు. బుద్ధి సంబంధమైన సంతృప్తి అత్యున్నత లక్ష్యం కాదు, దేవుడిని అన్వేషించేవాడే 'విద్య'ను నిజంగా ప్రేమించేవాడు. విద్య అంటే మార్పు చెందని సత్యం (Absolute Truth). తక్కినదంతా అవిద్య. అంటే సాపేక్ష జ్ఞానం (Relative Knowledge🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

శివా ప్రభూ… నీ విన్యాసం ఇదేనా?”

  🍃💠 “శివా ప్రభూ… నీ విన్యాసం ఇదేనా?”


శివా…

మంచి మనసు పెట్టుకుని నడిచేవాళ్లకే ఎందుకో ఈ లోకంలో పరీక్షలు ఎక్కువగా వస్తున్నాయి..లోకంలోని మాయ, మోసం, స్వార్థం వారిని వెంటాడుతున్నాయి..

ఎవరికి జాలి, దయ ఉందో, ఎవరు నిజాయితీగా జీవించాలనుకుంటారో… వారికే ఎక్కువ నష్టం, ఎక్కువ బాధ, ఎక్కువ త్యాగం ఎదురవుతోంది..


🔹నిజంగా మంచి వాళ్లే ఎందుకు అకాలమరణం పొందుతున్నారో?

🔹దానం కోసం చాచే చేతులే ముందెందుకు విరిగిపోతాయి?

🔹పరుల బాగుకోసం నడిచే అడుగులే ముందుగా అలసిపోతాయి..

🔹మానవత్వం అనే పడవకు మంచివారే భారం అవుతున్నారా?


🔹శివా.! దయా–హృదయం లేని వాళ్లు, మనసులో మోసం నింపుకున్న నటించే వారు, హాయిగా, భారంలేకుండా నడుస్తున్నట్టు కనిపిస్తారు.. 

🔹ఏ కష్టం అంటకుండా, ఏ పరీక్షా దరిచేరకుండా నిత్య సుఖంలో తేలియాడుతున్నట్టు కనిపిస్తారు..


ఇది నీ ఆటా ప్రభూ? 


🔹ఈ జగన్నాటకంలో నీ నియమం ఇదేనా?

🔹మంచిని నమ్ముకున్న మనసులకు, నిస్వార్థాన్ని పాటించే హృదయాలకు ఇంత కఠిన పరీక్ష ఎందుకు?


కానీ ఒక మాట మాత్రం చెప్తాను శివా— అంతిమ సత్యం ఇదే..

మంచి మనసు పడి చేసిన ఒక్క పని కూడా, ఒక చిన్న దయ కూడా, నీ దృష్టికి అందకుండా ఉండదు కదా..

నీ కనుసన్నల్లో ప్రతిదీ లెక్కించబడుతుంది అంటారు..

🔹మంచి వాళ్ల జీవితం చిన్నదైనా… వారి వెలుగు మాత్రం కాలాతీతం, శాశ్వతం..

🔹లోకం చూడకపోయినా, వారి త్యాగాన్ని గుర్తించకపోయినా,

మరి కలియుగం ధర్మం ప్రకారం, కర్మకు ఫలితం వెంటనే ఉండాలి కదా ప్రభూ? 

🔹నిస్సహాయులను బాధించి, కన్నీరు పెట్టిన వారికి, వారి కర్మ ఫలం ఇప్పుడే, ఈ జన్మలోనే ఉండాలి కదా? 

అప్పుడు కూడా వారికి శిక్షలు ఉండవా శివా?


చివరిమాట శివా.! ఈ లోకంలో మంచి మనసులకు నువ్వే చివరి ఆధారం గమనించు తండ్రీ.


🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*



*571 వ రోజు*


*వసుమంతుడు*


భీష్ముడు ధర్మరాజుకు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఒకరోజు వసుమంతుడు అనే రాజు వేటకై అడవికి వెళ్ళి అక్కడ భృగువంశ సంజాతుడైన ఒక మునిని చూసి " మునిపుంగవా ! ఈ లోకములో కాని పరలోకములో కాని ఆచరించతగిన ధర్మము ఏదో చెప్పండి " అని అడిగాడు. అందుకు ఆముని " మహారాజా ! మనం ప్రతి రోజు చేసే మంచి పనులు చెడ్డ పనుల వలన మనకు సుఖముదుఃఖము కలుగుతున్నాయి. అత్యాశతోను పనులు చెయ్యాలనుకోవడం తప్పు. తియ్యటి తేనె కొరకు కొండమీదకు ఎగబాకుతున్నామని అనుకుంటారు కాని అక్కడ నుండి జారితే విరగబడతాము తెలుసుకోరు. ధర్మాన్ని జ్ఞానాన్ని నిర్మలమైన మనస్సుతో అభ్యసించాలి. ఎల్లప్పుడూ సత్సంగంతో గడపాలి. అలా చేసిన మానవునికి ఇహలోక సుఖమే కాక పరలోకసుఖము ప్రాప్తిస్తుంది. బ్రాహ్మణులకు హితమైన పనులు చెయ్యాలి. అర్హులకు దానమివ్వాలి. ఇచ్చిన తరువాత దానికి బాధపడకూడదు. క్రోధమును కామమును వదలాలి. మనసు దృఢంగా ఉంచుకోవాలి. మనసికంగా బలహీనుడైనందు వలన పూర్వము మహాభిషుడు బ్రహ్మలోకం నుండి భూమికి జారాడు. యయాతిమహారాజు మనో ధైర్యము ఉండటం చేత ఆపదల నుండి బయటపడ్డాడు " అని చెప్పిన ముని మాటలకు వసుమంతుడు కామక్రోధములను వదిలి మనోధైర్యము పొంది ధర్మ మార్గాన నడిచాడు.


*యాజ్ఞవల్క్యుడు*


ధర్మరాజు " పితామహా ధర్మము అధర్మము అను బేధము లేనిది, చావు పుట్టుకలు లేనిది, సకల సందేహములను నివృత్తి చేయకలిగినది, శుచియై, నిత్యమై, అవ్యక్తమై, ధుఃఖ రహితమై, ఆనందమయమై, పరతత్వమై ఉంటుందో దానిని నాకు వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీకు జనకుడు యాజ్ఞవక్యుల మధ్య జరిగిన సంభాషణ గురించి వివరిస్తాను. సకలలోకములలోకెల్లా విజ్ఞానఖని అయిన యాజ్ఞవల్క్యుడితో జనకుడు " మునీంద్రా ! ఇంద్రియములు, అవ్యక్తము అయిన ప్రకృతి, బ్రహ్మము, పరతత్వము, పంచభూతములు ఎలా పుట్టాయి. ఎలా లయమౌతాయి. ఆకాలమును గురించి వివరించండి " అని అడిగాడు. అందుకు యాజ్ఞవల్క్యుడు " మహారాజా ! సృష్టిని, లయమును ప్రకృతి కల్పిస్తుంది. ఒక రోజులో పగలు పది కల్పములు, రాత్రి ఒక కల్పము ఉంటాయి. పగలు సృష్టి జరుగుతుంది, రాత్రి లయము జరుగుతుంది. ఈ లోకము లోని జీవరాశులకు జీవనాధారముగా ఓషధులు సృష్టించబడ్డాయి. సృష్టికార్యము కొరకు బ్రహ్మ సృష్టించబడ్డాడు. ఆ బ్రహ్మ పంచభూతములు సృష్టించాడు. వాటికి శబ్ధ, స్పర్శ, రస, రూప, గంధములు అను గుణములను సృష్టించాడు. వీటిని గ్రహించడానికి పంచ జ్ఞానేంద్రియములను పంచ కర్మేంద్రియములను సృష్టించాడు. ఈ ఇంద్రియములకు మనసు అధినేత. జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి మనసు చేతనే విషయము గ్రహిస్తాయి కాని స్వయముగా ఏమీ చేయలేవు. మిగిలిన అన్ని అవయమలు మనసుచేత నియంత్రించబడతాయి. ఈ విషయము జ్ఞానులు అజ్ఞాలు సమానంగా గ్రహించగలరు. ఇంద్రియములు విశ్రమించినా మనసు విశ్రమించదు. కనుక ఇంద్రియములను ప్రాపంచిక విషయముల నుండి నిగ్రహించి మనసును అదుపులో ఉంచాలి. అది అభ్యాసము మీద అలవడుతుంది.


*ప్రళయము*


ఇక ప్రళయము గురించి వివరిస్తాను. రాత్రి కాగానే అవ్యక్తమైన ప్రకృతి అహంకార పూరితుడైన పురుషుని ప్రభోదిస్తుంది. ఆ పురుషుడు 12 రూపములు ధరించి సర్వభూతములను లయం చేస్తాడు. ఆ తరువాత భూమి అంతా జలమయమౌతుంది. ఆ జలమును కాలాగ్ని ఆవిరి చేస్తుంది. కాలాగ్నిని వాయువు తుదముట్టిస్తుంది. వాయువు ఆకాశంలో లయమౌతుంది. ఆ కాశం మనసులో లయమౌతుంది. ఆ మనసును అహంకార పూరితుడైన పురుషుడు కబళిస్తాడు. ఆ అహంకారం అవ్యక్తమైన ప్రకృతిలో లీనమౌతుంది. ఇలా రాత్రి జరుగుతుంది. తరువాత పగలు రాగానే తిరిగి పునఃసృష్టి జరుతుంది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

ప్రేమ చాలా విలువైనది

 *నేటి సూక్తి*


*ప్రేమ చాలా విలువైనది ఆ విలువ తెలిసిన వారు ఎప్పటికీ మోసం చేయరు.* 


*క్రాంతి కిరణాలు*


*కం‌. ప్రేమన్నది విలువైనది*

*ప్రేమను మోసంబు లేక పెంచుము నెపుడున్*

*ప్రేమ విలువ తెలిసి కొనుచు* 

*నేమైనను చేయవలయు నిష్టము పెరుగున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

గమ్యం చేరలేము

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️ *అడుగు వెయ్యకుంటే గమ్యం చేరలేము.. ప్రయత్నం లేకుండా విజయం సాధ్యం కాదు.. సంతోషం అనేది మనం ఎక్కడ ఉన్నామో కాదు.. మనం ఎలా జీవిస్తున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది.. అయ్యిందేదో మంచికే అయ్యింది.. అవుతున్నదేదో అది మంచికే అవుతుంది.. అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది.. నేనేమి పోగొట్టుకున్నానని నీవు విచారిస్తున్నావు?.. నేనేమి తెచ్చానని నీవు పోగొట్టుకున్నావు?.. నేనేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది.. నీవు ఏదైతే పొందావో అది ఇక్కడ నుండే పోదావు.. ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు.. ఈరోజు నీవు నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కాదా!!.. మరి రేపు మరొకరి సొంతం కాగలదు.. పరివర్తన చెందటం అనేది లోకం యొక్క పొగడ.. పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే భగవంతుని ధ్యానం తప్పనిసరి*🏵️ కోరికలు, అత్యాశ అనేవి ప్రయాణంలో తీసుకువెళ్లే వస్తువులు వంటివి.. అవి అంత ఎక్కువ అయితే జీవిత ప్రయాణం అంత కష్టం గా ఉంటుంది🏵️🏵️మీ *అల్లంరాజు భాస్కర శర్మ శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3. గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినారకి రాలేను వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా మందులు పంపబడును వైద్య సలహాలు ఉచితం.9440893593.9182075510* 🙏🙏🙏

25నవంబర్ 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

   🍁 *మంగళవారం*🍁

*🌹25నవంబర్ 2025🌹*      

   *దృగ్గణిత పంచాంగం* 

                    

           *స్వస్తి శ్రీ విశ్వావసు* 

           *నామ సంవత్సరం*

 *దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్ల పక్షం*


*తిథి  : పంచమి* ‌రా 10.56 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : ఉత్తరాషాఢ* రా 11.57 వరకు ఉపరి *శ్రవణం*

*యోగం : గండ* మ 12.50 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం  : బవ* ఉ 10.12 *బాలువ* రా 10.56 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 05.30 - 06.30* 

అమృత కాలం  : *సా 05.00 - 06.45*

అభిజిత్ కాలం  : *ప 11.32 - 12.17*

*వర్జ్యం    : ఉ 06.35 - 08.19 & రా.తె 04.13 - 05.56*

*దుర్ముహూర్తం  : ఉ 08.32 - 09.17 రా 10.38 - 11.29*

*రాహు కాలం   : మ 02.43 - 04.08*

గుళికకాళం      : *ప 11.54 - 01.19*

యమగండం    : *ఉ 09.05 - 10.30*

సూర్యరాశి :*వృశ్చికం*                         

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 06.27*

సూర్యాస్తమయం :*సా 05.40*

*ప్రయాణశూల   : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.16 - 08.32*

సంగవ కాలం         :     *08.32 - 10.47*

మధ్యాహ్న కాలం    :    *10.47 - 01.02*

అపరాహ్న కాలం    : *మ 01.02 - 03.17*


*ఆబ్ధికం తిధి         : మార్గశిర శుద్ధ పంచమి*

సాయంకాలం        :  *సా 03.17 - 05.32*

ప్రదోష కాలం         :  *సా 05.32 - 08.05*

రాత్రి కాలం           :*రా 08.05 - 11.29*

నిశీధి కాలం          :*రా 11.29 - 12.20*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.35 - 05.26*

*****************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*


*యశోజయంచ మే దేహి* 

*శత్రూన్ నాశయ నాశయ*

*స్వాశ్రితానామ భయదం*  

*య ఏవం స్తౌతి మారుతిం*

*హానిమేతో భవేత్తస్య*  

*సర్వత్ర విజయీ భవేత్.!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

సంపూర్ణ మహాభారతము*

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🕉️సోమవారం 24 నవంబర్ 2025🕉️*


             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!


                            5️⃣4️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


    *సంపూర్ణ మహాభారతము* 

        

            *54 వ రోజు*                  

          *జరాసంధ వధ*```


శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలసి కపట బ్రాహ్మణ రూపాలలో కపట స్నాతక వ్రతం స్వీకరించారు. జరాసంధుని నగరమైన గిరివ్రజపురం సమీపించారు. ఆ పురం చుట్టూ ఉన్న పర్వతాలు ప్రాకారాలలా ఆ పురాన్ని రక్షిస్తున్నాయి. పక్కనే చైత్యకమనే కొండ ఉంది. దానిపై మూడు ఢక్కలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు భీమార్జునులకు ఆ ఢక్కలను చూపి “భీమా నగరంలోకి ఎవరన్నా కొత్త వారు ప్రవేశిస్తే ఆ ఢక్కలు మోగుతాయి” అని చెప్పాడు. భీమార్జునులు ఆఢక్కలను పగులకొట్టి చైత్యకపర్వత మార్గంలో నగరంలో ప్రవేశించారు. శ్రీకృష్ణుడు భీమార్జునులు సిగలో పూలు అలంకరించుకున్నారు. స్నాతకుల మాదిరి గోశాలలో ప్రవేశించారు. జరాసంధునికి బ్రాహ్మణులంటే భక్తిప్రపత్తులు మెండు కనుక బ్రాహ్మణులు రాజమందిరంలోకి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. బ్రాహ్మణవేషాలలో ఉన్న శ్రీకృష్ణుడు  భీమార్జునులకు అర్ఘ్యపాద్యాలను ఇచ్చాడు. వారు వాటిని పుచ్చుకోలేదు. జరాసంధుడు సందేహపడి వారిని “మీరు గంధపుష్పాలు ధరించినా స్నాతకులుగా లేరు. మీ ఆకారాలు క్షత్రియుల మాదిరి ఉన్నాయి. మీరు ఎవరు? ఎందుకు వచ్చారు?" అని అడిగాడు. 


అందుకు శ్రీకృష్ణుడు, భీమార్జునులు 

“మేము క్షత్రియ స్నాతకులము. ముఖద్వారం గుండా మిత్రుల ఇంటికి, దొంగ ద్వారం గుండా శత్రువుల ఇంటికి ప్రవేశించడం క్షత్రియ ధర్మం" అన్నారు. 


జరాసంధుడు "నేను ఎవరికీ అపకారం చేయలేదు. నేను బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు భక్తుడను. ఉత్తమ క్షత్రియ ధర్మాలు ఆచరిస్తున్నాను. మీకు నేనెలా శత్రువునైయ్యాను?" అన్నాడు. 


“ఓ జరాసంధా! ధర్మరాజు 

ఆజ్ఞపై శత్రుసంహారానికి వచ్చాము. ఉత్తమ క్షత్రియుడిని అని చెప్పుకుంటున్న నీవు క్షత్రియులను పట్టి బంధించి శివునకు బలి ఇచ్చి శివపూజలు ఎలా నిర్వహిస్తావు? ఉత్తమ క్షత్రియులు ఇలా చేస్తారా? నిష్కారణంగా సాధు హింస చేసే వారు, జనులను హింసించే వారు అందరికి శత్రువులు కారా? నిర్ధోషులైన సాటి కులం వారిని చంపడం పాపం కాదా. అలాంటి పూజలు ఫలిస్తాయా? నీలాంటి పాపులను విడిచి పెడితే మాకు పాపం వస్తుంది. కనుక నీతో యుద్ధానికి వచ్చాము. నేను కృష్ణుడిని, ఇతను భీముడు, అతడు అర్జునుడు. ఇప్పటికైనా చెరలో ఉన్న రాజులను విడిచిపెడితే సరి లేని యడల వీరు నీ గర్వమణచి వారిని విడిపించకలరు" అని శ్రీకృష్ణుడు అన్నాడు. 


జరాసంధుడు కోపించి “పరాక్రమంతో రాజులను జయించడం నేరమా. పరమ శివునకు బలి ఇవ్వడానికి తెచ్చిన వారిని నేను ఎందుకు

వదిలి పెడతాను. సైన్యంతో వస్తే సైన్యంతో యుద్ధం చేస్తాను. లేనియడల మీ ముగ్గురితో కానీ, ఇద్దరితో కానీ, ఒక్కరితో కానీ యుద్ధం చేస్తాను మీకు ఏది ఇష్టమో చెప్పండి" అన్నాడు. 


శ్రీకృష్ణుడు “ముగ్గురు నీతో యుద్ధం చేయడం ధర్మంకాదు. మా ముగ్గురిలో నీకు సరిజోడుని కోరుకో. అతను మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు" అని అన్నాడు. 


జరాసంధుడు “నాకు సరిజోడు భీముడే. కనుక అతనితో యుద్ధం చేస్తాను" అని చెప్పాడు. 


జయాపజయాలు దైవాధీనం కనుక జరాసంధుడు ముందుగా అతని కుమారుడు సహదేవునికి రాజ్యాభిషేకం చేసాడు. పురోహితుల చేత మంగళ శాసనాలు పొంది భీముని మల్ల యుద్ధానికి పిలిచాడు. భీముడు-  జరాసంధుడు ఘోరంగా తలపడ్డారు. ఒకరిని ఒకరు జయించాలన్న కాంక్షతో ఒకరిని మించి ఒకరు భీకరంగా తల పడ్డారు. ఇలా కార్తీక శుద్ధ పాడ్యమి నుండి త్రయోదశి వరకు సాగింది. అప్పటికి జరాసంధుడు అలసి పోయాడు. 


శ్రీకృష్ణుడు “భీమా! జరాసంధుడు అలసి పోయాడు. ఇది తగిన సమయం, అతడిని సంహరించు!” అన్నాడు. 


భీమసేనుడు తన తండ్రి వాయుదేవుని తలచుకుని జరాసంధుని గిరా గిరా తిప్పి నూరు సార్లు విసిరి వేసాడు. అతడి ఎముకలు విరిచి ఘోరంగా సంహరించాడు. జరాసంధుని మృతదేహాన్ని అతని ముఖద్వారం ముందు పడవేశాడు.  


శ్రీకృష్ణుడు మగధవాసులకు అభయం ఇచ్చాడు. జరాసంధుని చెరలో ఉన్న రాజులను విడిపించాడు. జరాసంధుడి కుమారుడైన సహదేవునికి ధైర్యం చెప్పాడు.తరువాత వారు ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. ధర్మరాజుకు జరిగినది చెప్పి విడిపించిన రాజులను చూపించాడు. రాజులంతా వారి వారి రాజ్యాలకు పయనమయ్యారు.  శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

జీవనోపాధి

  జీవనోపాధి

ఇప్పుడు మనము తెలుసుకొని పోయేటువంటి జీవనోపాధి మధ్యతరగతి లేక దిగువ మధ్యతరగతి యువతులు తమ భర్తలకి అండగా ఉండి కొంత సంపాదన చేయాలి అనేటువంటి కాంక్ష ఉన్న వాళ్ల కోసం కేటాయించుకున్నటువంటిది

తక్కువ పెట్టుబడితో చేసుకునేటువంటి ఒక చిరు వ్యాపారం దీనికి ప్రారంభంలో ఒక వెయ్యి లేక రెండు వేల లోపు గానే ఖర్చవుతుంది కావాల్సింది ఏమిటి ఎలా చేయాలి ప్రతిదీ వివరంగా తెలుసుకుందాం

ఈ రోజుల్లో ప్రతివారు ఉదయం పూట ఏదో ఒక ఫలహారం చేస్తూ ఆఫీసుకు లేక తమ తమ వ్యాపారాలకు వెళ్లడం కద్దు చాలా మటుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్లు లేక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు వాళ్ళ పని సమయాలను బట్టి ఇంట్లో ఫలహారాలు చేసుకోవటం కొంతమందికి చాలా కష్టంగా పరిణమిస్తున్నది అందుకనే దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అని ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం అర్రులు చాస్తూ ఉన్నారు కొంతమంది తాము సొంతంగా ఫలహారాలు చేసుకోలేక పోవటం చేత దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్ కి వెళ్లి ఫలహారాలని ప్యాక్ చేసుకొని తెచ్చుకొని తింటున్నారు ఇంకా కొంతమంది ఓపిక చేసుకొని ఇంట్లోనే దోశల పిండి ఇడ్లీ పిండి తయారు చేసుకుని రెండు మూడు రోజులు దోసెలు లేక ఇడ్లీలు చేసుకోవటం మనందరికీ తెలిసినదే ఇంట్లో దోసెలు లేక ఇడ్లీలు చేసుకుంటే బయట ఫలహారసాల నుండి తెచ్చుకున్న ఇడ్లీలు లేక దోసెల కన్నా చాలా తక్కువ ఖరీదుకే చేసుకోవచ్చు కాకపోతే అది కొంత శ్రమతో కూడుకున్న పని కాబట్టి ఈరోజుల్లో దోసెలు చేసుకోవటానికి కానీ ఇడ్లీలు చేసుకోవటానికి గాని అప్పటికప్పుడు రెడీమేడ్ గా రుబ్బినటువంటి పిండి మనకు కొన్ని ప్రదేశాలలో జరుగుతున్నా యి నాకు తెలిసినంత మటుకు హైదరాబాదులో సూపర్ మార్కెట్లలో ఈ పిండ్లు జరుగుతున్నట్లు సమాచారం ఈరోజు నేను బెంగళూరులో ఒక మహిళ ఇడ్లీ పిండి అమ్మడం చూసి ఈ పోస్టు పెడుతున్నాను ఆమె రెండు మూతలు ఉన్నటువంటి బకెట్లను తీసుకొని వాటిని రెండు లాస్టిక్ స్టూళ్లమీద పెట్టుకొని ఒక స్టీలు డబ్బా మరియు ఒక కొల పాత్ర కొన్ని ప్లాస్టిక్ సంచులు అంటే కవర్లు పెట్టుకొని ఉన్నది ఒక కుల పాత్రడు పిండి ఆమె 50 రూపాయలకి అమ్ముతున్నది దానికి కొంచెం నీళ్లు కలుపుకొని దోశల పిండి లాగా చేసుకుని దోసెలు చేసుకోవచ్చు లేదా ఆ పిండిని అదే విధంగా ఇడ్లీల పాత్రలో వేసుకొని ఇడ్లీలు చేసుకోవచ్చు ఇక్కడ మన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం సహజంగా చేసుకునేటువంటి ఇడ్లీ పిండి మినప పిండిని రుబ్బుకొని అందులోపడా ఇడ్లీ రవ్వని కలుపుకొని తయారు చేసుకుంటాం కానీ ఇక్కడి వాళ్ళు అట్లా కాకుండా మినప్పప్పు నీ నానబెట్టి దానికి ఇడ్లీ బియ్యం అని ప్రత్యేకంగా కొంచెం లావుగా ఉండే బియ్యం దొరుకుతాయి వాటిని కలిపి అవి కూడా నానబెట్టి రెండిటిని కలిపి మిషన్ లో రుబ్బుతారు అట్లా రుబ్బిన పిండిని అటు ఇడ్లీలు తయారు చేసుకోవటానికి ఇటు దోసెలు తయారు చేసుకోవడానికి ఉభయాత్ర ఉపయోగిస్తారు

ఆమె తీసుకున్నా రెండు మూత ఉన్న బకెట్లలో ఒక బకెట్లో చాలా చిక్కగా ఉన్నటువంటి పిండి ఉన్నది రెండవ బకెట్లో నీళ్లు కలిపి జావగా చేసి ఉన్నటువంటి పిండి ఉన్నది అంటే ఆ పిండి అమ్మటానికి సిద్ధంగా ఉన్న పిండి అన్నమాట ఈ బకెట్లో ఉన్న పిండి పూర్తిగా అమ్మిన తర్వాత చిక్కగా ఉన్న పిండిలో నీళ్లు కలిపి మళ్ళీ ఈ రెండో బకెట్లోకి మార్చి ఇది కూడా అమ్మటం చేస్తుంది అంటే దాన్ని బట్టి నాకు తెలిసిందేమిటంటే చిక్కగా ఉన్న పిండిని నీళ్లు కలపటం వల్ల ఒక బకెట్ పిండి రెండు లేక అంతకన్నా ఎక్కువ బకెట్ల పిండిగా తయారవుతుందన్నమాట అంటే ఆమె ఒక కుల పాత్రను పట్టుకొని దానిని ఆ పిండి నిండా నింపుకొని ఒక స్టీల్ గిన్నెలో ప్లాస్టిక్ కవర్ పెట్టి ఆ కవర్ లోపల పిండిని పెట్టి ప్యాక్ చేసి ఇస్తున్నది ఒక పాత్రడు పిండి 50 రూపాయలని ముందే చెప్పుకున్నాం. అట్లా ఆ రెండు బకెట్లలో పిండి అమ్ముతే ఆమెకు దాదాపు ఒక 50 లేక అంతకన్నా ఎక్కువ కొలపాత్రలపిండి అవుతుండవచ్చు అంటే 50 రూపాయలు ఇంటూ 50 అంటే మనకు 2500 నుంచి 3000 రూపాయల దాకా ఆ పిండి అమ్మడం వల్ల లాబించవచ్చు అని అంచనా వేసుకోవచ్చు

పిండి తయారు చేసుకోవడానికి కావలసిన ముడి సరుకులు మినప్పప్పు లేక మినప గుండ్లు ఒక రెండు కిలోలు ఒక మూడు లేక నాలుగు కిలోల ఇడ్లీ బియ్యం కావాలి

కిలో మినప గుండ్లు 150 రూపాయల చొప్పున లెక్కిస్తే రెండు కిలోలకి 300 రూపాయలు అవుతాయి అదే విధంగా కిలో ఇడ్లీ బియ్యం 70 రూపాయలు చొప్పున చూసుకుంటే నాలుగు కిలోలకి 280 రూపాయలు బియ్యం ఖర్చు అవుతాయి వెరసి ఒక 700 రూపాయలు దాకా ముడి సరుకు ఖర్చవుతుంది ఒక రవంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ రుబ్బినందుకు మొదట్లో రుబ్బుడు మిషన్ ఉండకపోయినా పర్వాలేదు ఈరోజుల్లో ప్రతి కాలనీలో రుబ్బుడు మిషన్ అద్దెకు దొరుకతున్నాయి 





భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ।

ఉభయోరపి దృష్టోఽన్తః త్వనయోస్తత్త్వదర్శిభిః ।। 16 ।।


ప్రతిపదార్థ: 


న — కాదు; అసతః — తాత్కాలికమైనదానికి; విద్యతే — ఉన్నది; భావః — ఉనికి; న — లేదు; అభావః — అంతం; విద్యతే — ఉన్నది; సతః — శాశ్వతమైనదానికి; ఉభయో — రెంటిలో; అపి — మరియు; దృష్టః — చూడబడినది; అంతః — సారాంశం; తు — నిజముగా; అనయోః — వీటిలో; తత్త్వ — వాస్తవమును; దర్శిభిః — జ్ఞానదృష్టికలవారిచే.


తాత్పర్యము :r


అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు.


 వివరణ:


శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకారం, ఒక మూడు అస్తిత్వములు ఉన్నవి.


భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్వా


సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్ (1.12)



క్షరం ప్రధానమమృతాక్షరం హరః


క్షరాత్మానా వీశతే దేవ ఏకః (1.10)



సంయుక్తమేతత్ క్షరమక్షరం చ


వ్యక్తావ్యక్తం భరతే విశ్వమీశః (1.8)


 


ఈ వేద మంత్రములు అన్నీ ప్రతిపాదించేది ఏమిటంటే - భగవంతుడు, జీవాత్మ, మరియు మాయ – ఈ మూడూ కూడా నిత్యము, శాశ్వతము.


1. భగవంతుడు నిత్యశాశ్వతుడు, అంటే ఆయన సత్ (ఎల్లప్పుడూ ఉంటాడు). అందుకే వేదాల్లో ఆయనకు ఒక పేరు సత్-చిత్-ఆనంద స్వరూపుడు (నిత్యుడు-జ్ఞానస్వరూపుడు- ఆనంద సింధువు).


2. ఆత్మ నాశనములేనిది. అందుకే అది 'సత్'. కానీ, ఈ శరీరం ఏదో ఒక రోజు నశిస్తుంది అందుకే ఇది 'అసత్' (తాత్కాలికం). ఆత్మ కూడా సత్-చిత్-ఆనంద రూపమే కానీ ఇది 'అణు' (అతి సూక్ష్మమైన) మాత్రమే. కాబట్టి ఇది అణు-సత్, అణు-చిత్, అణు-ఆనంద స్వరూపము.


3. దేని నుండి అయితే ఈ జగత్తు సృష్టించబడిందో, ఆ 'మాయ' కూడా నిత్యమైనదే లేదా 'సత్'. కానీ, మన చుట్టూ కనిపించే అన్నీ భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే, మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి. ఈ విధంగా అవన్నీ కూడా 'అసత్' లేదా తాత్కాలికమైనవి అని చెప్పవచ్చు. భౌతిక ప్రపంచం 'అసత్' అయినా, మాయ మాత్రం 'సత్'.


ఈ ప్రపంచం 'అసత్' అన్నప్పుడు దాన్ని 'మిథ్య' అని తప్పుగా అనుకోవద్దు. అసత్ (తాత్కాలికము) అంటే మిథ్య (లేనిది) కాదు. కొంత మంది తత్త్వ వేత్తలు ఈ ప్రపంచం 'మిథ్య' (ఉనికి లేనిది) అంటారు. వారు ఏమంటారంటే, మనలోని అజ్ఞానం వల్లనే మనకు అన్నీ ఉన్నట్టు అనిపిస్తున్నాయని, మనం బ్రహ్మ జ్ఞానంలో స్థితులమై ఉంటే, ఈ జగత్తు ఉనికి ఉండదు అని. కానీ, ఇది గనక నిజమే అయితే, బ్రహ్మ జ్ఞానులకు ఈ జగత్తు కనుమరుగైపోవాలి. వారు తమ అజ్ఞానాన్ని నశింపచేసుకున్నారు కాబట్టి ఈ ప్రప్రంచం ఉనికి వారికి ఉండకూడదు. మరి అప్పుడు ఆ మహాత్ములు భగవత్-ప్రాప్తి నొందిన తర్వాత కూడా పుస్తకాలు ఎందుకు, ఎలా రాసారు? పెన్ను, పేపరు ఎక్కడ నుండి వచ్చాయి? బ్రహ్మ-జ్ఞాన పరులు ఈ జగత్తుకు చెందిన వస్తువులు వాడటం బట్టి, ఈ జగత్తు వారికి కూడా ఉన్నదని తెలుస్తున్నది. అంతేకాక, బ్రహ్మ జ్ఞానులకు కూడా తమ శరీర పోషణకు ఆహారం అవసరమే. వేదాల్లో 'పశ్వాదిభిశ్చావిశేషత్’ అని చెప్పబడింది. ‘అన్ని ప్రాణులలాగానే బ్రహ్మ-జ్ఞానులకు కూడా ఆకలి వేస్తుంది, వారు కూడా ఆహారం తినాలి.’ ఈ జగత్తు ఉనికి వారికి లేకపోతే వారు ఎలా మరియు ఎందుకు ఆహారం భుజించాలి?


ఇంకా, తైత్తిరీయ ఉపనిషత్తులో పలుమార్లు, ఈ జగత్తు అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పబడింది.


సోఽకామయత బహు స్యాం ప్రజాయేయేతి స తపోఽతప్యత స


తపస్తప్త్వా ఇదంసర్వమసృజత యదిదం కిం చ తత్సృష్ట్వా


తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సచ్చ త్యచ్చాభవత్


నిరుక్తం చానిరుక్తం చ నిలయనం చానిలయనం చ విజ్ఞానం


చావిజ్ఞానంచ సత్యం చానృతం చ సత్యమభవత్ యదిదం


కిం చ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి (2.6.4)


 


భగవంతుడు ఈ జగత్తుని సృష్టించడమే కాదు, ప్రతి పరమాణువులో వ్యాపించి ఉన్నాడు అని ఈ వేద మంత్రం, ప్రతిపాదిస్తున్నది. భగవంతుడు ప్రతి పరమాణువులో వాస్తవంగా ఉన్నట్లయితే, ఈ ప్రపంచం లేకుండా ఎలా ఉంటుంది? ఈ జగత్తు మిథ్య అనటం, భగవంతుడు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న నిజాన్ని వ్యతిరేకించటమే అవుతుంది. ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, జగత్తుకి ఉనికి ఉంది కానీ అది అనిత్యము, అశాశ్వతము అని వివరిస్తున్నాడు. అందుకే దీనిని 'అసత్' లేదా 'తాత్కాలికము' అన్నాడు; దాన్ని మిథ్య లేదా 'లేనిది' అనలేదు

పంచాంగం 25.11.2025 Tuesday,

 ఈ రోజు పంచాంగం 25.11.2025 Tuesday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస శుక్ల పక్ష పంచమి తిథి భౌమ వాసర ఉత్తరాషాఢ నకత్రం గండ యోగః బవ తదుపరి బాలవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు. 

  

 

శ్రాద్ధ తిథి: పంచమి

 


నమస్కారః , శుభోదయం

25-11-2025 మంగళవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

25-11-2025 మంగళవారం రాశి ఫలితాలు


మేషం


చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------


వృషభం


ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. 

---------------------------------------


మిధునం


వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు.

---------------------------------------


కర్కాటకం


దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------


సింహం


ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దాయదులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి.

---------------------------------------


కన్య


మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------


తుల


దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనులలో అధిక శ్రమ ఫలితాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------


ధనస్సు


ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.

---------------------------------------


మకరం


చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

---------------------------------------


కుంభం


ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలు ఉన్నవి.

---------------------------------------


మీనం


ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

---------------------------------------

పెళ్ళి లో ఖర్చులు

 *పెళ్ళి లో ఖర్చులు తగ్గించడమే ప్రధాన ఉద్దేశ్యం, ఎందుకంటే పెళ్ళి వలన ఎవరూ అప్పులతో బాధపడకూడదు, అలాగే భార్యాభర్తల గొడవలు కోర్టుల దాకా వస్తున్నందు వలన, పెళ్ళి వీలైనంత తక్కువ ఖర్చుతో ముగించడమే మంచిది.*

⭐⭐⭐ కేవలం ముఖ పరిచయం ఉన్న అందరిని వేల సంఖ్యలో పిలవడం (పిలిచిన వారు ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు. Attend అయిన వారికి 6 నెలల తరువాత అసలు సదరు పెళ్లికి వెళ్లామని కూడా గుర్తుండదు)

⭐⭐⭐ ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం. (కాబోయే వధూవరులను, పెళ్లి కాకుండానే, ఒక చోట కూర్చోపెట్టి, ఆహ్వానితులకు అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమనడం)

⭐⭐⭐ పెళ్లి కాకుండానే pre wed photo shoot అని సినిమా లెవెల్లో వింత, సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు photos కి pose. ఇంకా ఆ photos(కొన్ని intimate వి) కూడా పెళ్లి తంతులో భాగంగా పెద్ద TV screen పైన ప్రదర్శించడం. పనికిమాలిన మంగళ స్థానం పేరున అమ్మాయిని నడి బజారులో కూర్చోబెట్టి అందరి ముందు తల స్నానం చేయించడం ఏమిటి నీతిమాలిన సంస్కృతి. ఈ మధ్య చిన్న పిల్లలను సైతం వధూవరులుగా అలంకరించి నడి బజార్లో మంగళ స్థానాలు చేయడం, స్టేజీల పైన కూర్చోబెట్టి ఆర్భాటాలు చేసి వారికి చిన్నప్పటి నుండే పెద్దరికం కట్టబెట్టడం చూస్తుంటే ఇది ఒక వింత ఆచారంగా భావించాల్సి వస్తుంది. దేశంలో ఎక్కడలేని ఈ వింత సంస్కృతి ఈమధ్య మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నది. దీన్ని రాబోవు తరాలు తగ్గించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

⭐⭐⭐ పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్ 10 గంటల్లో, ఇంకో ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం.

⭐⭐⭐ Photos Natural (candid) గా, తీయకుండా photographer కోసమే పెళ్లి చేసుకున్నట్టు, వాడు చెప్పిన వింత భంగిమల్లో pose ఇచ్చి ఫోటోల పరమార్ధం లేకుండా పోయింది. (photographer bill కూడా లక్షల రూపాయలు)

⭐⭐⭐ పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి, జీవితంలో మళ్ళీ ఇంకో function కి వాడకుండా, డబ్బు వృధా చేయడం

⭐⭐⭐ భోజనాల పేరుతో, సమయంతో నిమిత్తం లేకుండా, అల్పాహారం, chat, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల fruits, 5 రకాల డిసెర్ట్స్ (ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు, ఆహుతులు, అన్ని తినే ప్రయత్నం చేయడం ఒక వింత. భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు)

⭐⭐⭐ పెళ్లి తంతు తరువాత కిలోమీటర్ క్యూలో నిలబడి, స్టేజి ఎక్కి, మొక్కుబడిగా అక్షింతలు, వధూవరుల నెత్తిన చల్లి, వాటిని బూట్లు తొడుకున్న కాళ్లతో తొక్కి, photos కి pose ఇవ్వడం ఆ (photos జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదు), అనే ప్రక్రియ కూడా ఆక్షేపనీయం.

⭐⭐⭐ పెళ్లి జరిపించే పంతుళ్ళు మాటలను, శ్లోకాలను పట్టించుకోకుండా, కెమెరామాన్లు, వీడియో గ్రాఫర్ల భంగిమల కోసం జరుగుతున్న తంతు ఒక చిత్రాతి విచిత్రం.

⭐⭐⭐ DJ MUSIC అనే పేరుతో, చెవులు, మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో, అర్థం పర్థం లేని సినిమా పాటలు.

⭐⭐⭐ కర్ణ కఠోరంగా పాడే orchestra బృందం (వీళ్లు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ maintain చేస్తారు).

⭐⭐⭐ ఇంకా mehendi అని ,సంగీత్ అని, bachelor పార్టీ అని , అదనపు ఈవెంట్స్.

⭐⭐⭐ మద్యంతో కూడిన విందైతే, హాజరు 110%(బందు మిత్ర సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్ గా పాటిస్తారు)

⭐⭐⭐ ఒక పెగ్గు కెపాసిటీ వాడు 3 పెగ్గులు, 3 పెగ్గుల కెపాసిటీ వాడు 10 పెగ్గులు లాగేస్తారు.

⭐⭐⭐ తదనంతరం పెళ్ళికొడుకు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్ పూజ పవిత్రత మంట కలుపుతూ, మాంసాహార వంటలతో, మళ్ళీ పెళ్లి నాటి ప్రహసనం రిపీట్.

⭐⭐⭐ ఇంకా హనీమూన్ అనే కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్ (ఇది కూడా లక్షల్లో)

⭐⭐⭐ ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే తాత్కాలిక వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు.

⭐⭐⭐ అందుకని పగ తీర్చుకొనేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు, పచ్చడి సీసాలు వగైరా ఇవ్వడం.

⭐⭐⭐ పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు, తాహతుకి మించి, ఈ మధ్య విపరీతంగా పాటిస్తు, అప్పుల పాలవుతున్నారు

⭐⭐⭐ ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ, ఎదుటివారి ఆడంబరాలను చూసి మేము సైతం అని అప్పులు చేసి బంధువర్గాలకు మొక్కుబడిగా ఫోన్చేసి మేము పిలిచాము అని చాటింపు చేసుకొని, ఇతర ముఖ్యమైన పనుల వల్ల ఫంక్షన్ కి వెళ్ళని వారితో కక్షలు పెంచుకోవడం ఎక్కడి సంస్కృతి. అందుకే మన ఆడంబరాలకు ఇతరులను ఇబ్బంది పెట్టడం మానుకుందాం ముఖ్యమైన ఫంక్షన్లకు మాత్రమే బంధువులందరిని ఆహ్వానిద్దాం చిన్న చిన్న ఫంక్షన్లను కుటుంబంలోనే చేసుకుందాం.

⭐⭐⭐ రెండు కుటుంబాల కలయికని కొత్త బంధువులని ఆర్దికంగా కృంగదీయకండి. ఉన్నంతలో వేడుకని బాగా చేసుకోండి. వేరే వారి వేడుకలతో పోల్చుకోకండి. ఎందుకంటే దేశంలో ధనవంతులతో పోటీపడి వివాహవేడుకలో చూపించుకోకూడదు. మనకి ఉన్నది దానిలో చేసుకోవడం వలన, పిల్లలకి ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. 

⭐⭐⭐ ఆర్థికంగా వెనుకబడకండి. పెళ్ళి అనేది వధూవరుల తల్లిదండ్రులకి భారం అవ్వకూడదు. కొత్త దంపతులకి ఆర్థిక భరోసా ఇవ్వండి. పిల్లలు ఫుట్టడానికి హాస్పిటల్స్ కి ఖర్చులు పెట్టా ల్సిన దుస్దిలో ఉన్నాము. పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఆస్తులు ఇవ్వడం, బంగారు ఇవ్వడం కోసం, పెళ్ళి ఖర్చులను ఆదాచేయండి. 

      ||సర్వేజనాః సుఖినో భవంతు||

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం - పంచమి - ఉత్తరాషాఢ -‌‌ భౌమ వాసరే* (25.11.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*