22, జులై 2020, బుధవారం

కొంగుబంగారం – శ్రీరామ నామం


https://chat.whatsapp.com/Lv618foaLEP3bPUzrSbKgK
సకల లోకాలలో ఆదర్శగుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించేవాడు శ్రీరాముడు. రాముడు గొప్పవాడా? రామ నామం గొప్పదా అంటే రామని కంటే రామనామమే గొప్పదని చాటే కథలు చాలా ఉన్నాయి. రామ నామం గొప్పతనం గురించి ముందు తెలుసుకుందాం. రామనామ గొప్పతనాన్ని వివరించే ఈ గాథ చదవండి.
లంకానగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తూ వుంది. రాయిపై ‘రామ’ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ వుంది. ఇదంతా చూస్తూ వున్న రాముడిలో "నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేనే రాయి వేస్తే’ అనే ఆలోచన కలిగింది. అంతే శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోనికి వేసాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. దీనిని చూసి ఆశ్చర్యానికి లోనైన రాముడు పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని వివరించి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు
అందుకు హనుమంతుడు “రామ” అనే నామం రాసివున్న రాళ్ళే పైకి తేలుతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం రాయలేదు కదా! అందుకే మునిగిపోయింది” అని సమాధానం యిచ్చాడు.
అంటే రాముడికంటే కూడా రామనామం మహా శక్తివంతమైందన్నమాట!
(శ్రీ సత్యనారాయణ చొప్పకట్లగారి సౌజన్యముతో )

కుచేలుడు శ్రీకృష్ణుని ఆథిత్యాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళే సమయం లో అతని మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. కృష్ణుడు నాకీమీ ఇచ్చి పంపలేదే నా భార్య కేమి సమాధానం చెప్పేది?అనుకున్నాడు. వెంటనే తేరుకొని నాకు అపారమైన సంపద యిస్తే తనను నేను మరిచి పోతానని 
ఇచ్చి వుండడు. మంచిపనే జరిగింది లే సంపద కంటే నాకు ఆయన నామస్మరణ మరవకుండుటే 
ముఖ్యము కదా!అని ఈ క్రింది పద్యం చెప్తాడు. 
నీపాద కమలసేవయు 
నీపాదార్చకుల తోడి నెయ్యము నితాం 
తాపార భూత దయయును 
తాపస మందార నాకునాకు దయ సేయ గదే 
అర్థము:-- నీపాదాలను సేవించుకునే భాగ్యాన్నీ, నీ పాదములను సేవించే వారితో స్నేహాన్నీ అందరితో దయగా మసులుకునే సహృదయాన్నీ నాకు ప్రసాదించమని వేడుకున్నాడు కుచేలుడు
ఇంటికి వెళ్ళిన తర్వాత అపారమైన సంపద చూసి గర్వపడక నిరాడంబరంగా నారాయణుడి ధ్యానంలోనే తన శేష జీవితాన్ని గడిపాడు.
తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది.     9985831828

చిదంబర రహస్యం

ఓం నమః శివాయ:
చిదంబరం లేక చిత్తంబళము
చిదంబర రహస్యం

తమిళనాడులోని ద్రావిడ రీతుల్లో నిర్మించబడిన దేవాలయాల్లో చిదంబరం ఒక మణిపూస. చిదంబరం అంటే విజ్ఞానాంబరము అని అర్ధము. దక్షిణ ఆర్కాట్‌లోని చిదంబరంకు ముఖ్యకేంద్రం. 13 హెక్టార్ల చదరంలో పరచుకొని ఉన్న ఈ ఆలయ సమూహము అతి పురాతనమైనదిగా ప్రసిద్ధి. అందులో ప్రళయతాండవం చేస్తున్న పరమశివుని విగ్రహం కలదు చాలా పెద్ధది. నలువైపులా 4 గోపురాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ గోపురాలు 49 మీ. ఎత్తున ఉన్నాయి. మిగతా 2 గోపురాల మీదా తాండవ నృత్యమాడే నటరాజస్వామి శాస్త్రీయ భంగిమలు 108 చెక్కించబడి ఉన్నాయి. ఆలయంలో విశేషంగా చెప్పుకోదగినవి నృత్యమందిరం. ఒక చిత్ర రధాకృతిలో నున్న పెద్ద సభా భవనంలో మధ్య ఒక చిన్న మందిరంలో నటరాజ స్వామి విగ్రహం ఉండి అంతా తానై వెలసి ఉన్న భావం గోచరిస్తుంది. మరొకటి ముఖ్యమైనది వేయి స్థంబాల మంటపం. ఆలయ ప్రాంగణంలోని పార్వతీ దేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలతో పాటు శ్రీ మహావిష్ణువుకు అంకితమైన మరో ఆలయం ఉంది. శివకేశవులకు అభేదత్వమును కల్పిస్తూ శివుని దర్శించడానికి వెళ్ళిన వానికి విష్ణువు, విష్ణువును దర్శించడానికి వెళ్ళినవానికి శివుడు కనపడుతూ సర్వజగత్తుకు భగవంతుడు ఒక్కడే అనే భావం మన మనస్సులో మెదిలేట్టు చేస్తుంది. అసలు చిదంబర రహస్యం అనే నానుడి ఎప్పట్నుంచో వాడుకలో ఉంది. అంతూ, దరి తెలియని విషయాన్ని చిదంబర రహస్యం అనడం పరిపాటి. ఇక్కడ ఈ ఆలయంలో కూడా పంచ లింగాల్లో ఒకటైనటువంటి ఆకాశలింగమును చూడటానికి రుసుం చెల్లించి లోపలికి వెళ్ళినపుడు ఇది మనకి అనువైకవేద్యమవుతుంది. ఆకాశలింగం అంటేనే దీనికి ఆకారం ఉండదు. ఆలయపు గోడలో బంగారు రేకుమీద యంత్రంతో బిగించబడి ఉంటుంది. దాని ఎదుట ఒక తెరవేసి ఉంటుంది. లోపలకు వచ్చిన తరువాత ఆ తెర తీసి చూపిస్తారు. అంటే మనకు కనపడనిది చిదంబర రహస్యం అనుకోవాలి. 

ఈ చిదంబరం 907 నుండి 1310 వరకూ చోళరాజుల రాజధాని. వీరచోళరాజ కాలంలో నటరాజ ఆలయం వ్యవస్థీకరించబడినట్లుగా ఉన్నత పాఠాలు చెప్తున్నాయి. వీరచోళరాజు కాలం క్రీ.శ. 927 నుండి 997 వరకు ఆలయ పట్టణం మధ్య నుండి 5 ప్రాకారాలు కలిగి ఉన్నది. మొదటి ప్రాకారంలోనే 4 సింహ ద్వారాల మీద గోపురములు ముందు చెప్పిన 4 గోపురాలు ఇవే. చిదంబరం నటరాజస్వామి వారి ఆలయంలో వేంచేసియున్న శ్రీ నందీశ్వరుని విగ్రహం చాలా పెద్దది ఒకటియున్నది. దాని యెదయందు గంటలు, దానిపై జీను వగయిరాలు చూస్తే రాతితో చెక్కబడినది కాదు సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హిందూ దేశాల్లో నంది వాహనాలు అన్నింటిలోకంటే పెద్దది. శివగంగ వేయి స్తంభముల మంటపమునకు పడమటగా అమరి యున్నది కోనేరు. దీనికి సువర్ణ కోనేరు అనే పేరు ఉన్నది. చక్కగా చెక్కిన రాతితో మెట్లున్నవి. పూర్వం ఒకానొకప్పుడు వర్మచక్రుడనే రాజు స్నానం చేస్తే అతన్ని భాదిస్తున్న కుష్ఠురోగం పోయిందని చెప్తారు. ఇంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో చూడదగినది- పెద్ద నెమలి విగ్రహం, స్వామి వారి మయూర వాహనం, వినాయక దేవాలయంలోని వినాయకుని విగ్రహం, హిందూ దేశం మొత్తం మీదనే చాలా పెద్దది అంటారు. శిల్పులు ప్రతి అంగుళంలోనూ చూపిన నిపుణత్వం కౌశల్యము మనకు ఆశ్చర్యము, ఆనందాన్ని కలిగిస్తాయి. చిదంబర నటరాజస్వామి పుండరీ పురంలోని పాండురంగని వలె అనేక మంది భక్తులను, కవులను కాపాడి తనలో ఐక్యం చేసికొన్న భక్తసులభుడు. ఈయన లీలలను తిరువాచకమనే గ్రంధం పేర మణికవచుడు అనే ఆయన వ్రాశాడు. స్వామి అనుగ్రహంతో ఇలా ఎంతో మంది మహాగ్రంధకర్తలు స్వామి అనుగ్రహాన్ని పొంది తరించారు. అనపాయచోరుడు అనే రాజు వైరాగ్యము పొందిన పిదప తన జీవిత శేషాన్ని ఆలయ ప్రాంగణంలోనే నడిపాడు. ఆయన గౌరవార్ధం "జ్ఞానవాసి" అనే చిరు దేవాలయం కూడా ఉంది. ఇంకా చిదంబరంలో చూడదగినవి తిల్లైఅమ్మన్ దేవస్థానము శ్రీరాజ అన్నామలై చిట్టియార్‌ గారి పరిపోషణలో రూపుదిద్ధుకొన్న అణ్ణామలై విశ్వవిద్యాలయము చూడదగినది. చిదంబరంలోని శివాలయంలో ఉన్న తిరుచ్చిత్రకూటము ఒక దివ్యదేశంగా పరిగణించబడు తుంది. శ్రీ గోవింద రాజస్వామి పెరుమాళ్ళు, పుండరీకవల్లీ తాయారు, కుల, తిరుమంగయాళ్‌వార్ల మగయాళ శాస్త్రం వైష్ణవులకు పవిత్రమైన క్షేత్రం.

 .... చిదంబర రహస్యం - కనిపించని మహా దివ్యమంగళ మూర్తి  .... 

 .... ఆకాశం అనంతమైనది .... అలాంటి అనంతమైన  ఆకాశాన్ని వివరించటం .... వర్ణించటం .... అవగాహన చేసుకొవడం కుదరదు .... కానీ ఆ భావనను అనుభవించగలం .... భావించగలం .... ఆ భావనను మనసు భావించి .... అనుభవించి .... అవగాహనకు తెచ్చుకొని .... అనంత ఆనందాన్ని పొంది .... ఆనంద తాండవం   చేయించగల మహాత్యం .... చిదంబరం ఆలయానికి ఉంది .... అయితే ఆ ఆనంద తాండవం భావనను కలిగించే .... దివ్య మంగళ మూర్తి .... అర్ద నారీశ్వరుడు .... మందిరంలొ కొలువై ఉన్నాడు .... కానీ అందరకీ కనిపించడు ఆ ధివ్యమూర్తి .... 

.... దర్శనానికి అడ్డుగా ఓ తెర ఉంటుంది .... పూజారీ పూజ పూర్తీయైన తర్వాత .... ఒక క్షణ కాలం పాటు తెరను తొలగించి .... వేచివున్న భక్తులకు .... దివ్య మంగళ మూర్తి దర్శన భాగ్యం కల్గిస్తారు .... కానీ
లొపల ఉన్న
మూర్తి అందరకీ కనబడడు .... అందరి మనసుల్లొ .... ఆనంద తాండవ మృదంగా ద్వనులు మార్మొగుతున్నా .... కొందరు పుణ్యాత్ములకు మాత్రమే .... లొపలి దివ్య మంగళ మూర్తి ....  అసలు దర్శన భాగ్యం కలుగుతుంది .... 

 .... తెర అన్న మాయను తొలగిస్తే గానీ .... అనంత ఆనంద స్వరూపుడైన .... భగవంతుడి దర్శనం కాదని .... మనసును కమ్మిన మాయ తెరలను తొలగించినవారికే .... దర్శనం అవుతుందని వివరిస్తారు .... కానీ ఇంతకీ తెర మాటున నిజంగా ధివ్య మంగళమూర్తి ఉన్నాడా .... లేక శూన్యానికి ప్రతీకగా .... అనంతానందం లొని అనంత శూన్యాన్ని ప్రతిబింబిస్తూ .... లొపల శూన్యంగా ఉందా .... అంటే ఎవరూ ఏమీ చెప్పలేరు .... ఎందుకంటే లొపల ఏముందొ చూడాలంటే .... కళ్లకున్న పొరలు కరగాలి .... కానీ ఏమీ కనబడలేదంటే .... మాయ తెరలు తొలగలేదని ఒప్పుకొవాలి .... అందుకే చిదంబరంలొని .... తెర మాటున "చిదంబర రహస్యం" ఇప్పటికి పదిలంగా దాగి ఉన్నది .... ఇది చిదంబర రహస్యం .... 

 .... ఓం నమః శివాయ .... 

చిదంబర రహస్యం అంటే ఏమిటి.

పృధ్వి, అగ్ని, వాయువు, తేజస్సు , ఆకాశ లింగాలను పంచభూతలింగాలు అని అంటాము. వాటిలో ఆకాశలింగం చిదంబరంలో ఉంది. ఈ దేవాలయంలో లింగం వెనుక ఒక పరదా కట్టి ఉంటుంది. ఆ వెనుక ఏమీ ఉండదు. అంతా ఖాళీ. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగా ఉంటుంది. అలాగే, ఈ పరదా వెనుక ఏమీ ఉండకపోయినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని , అసలు తెలియకుండా దాచి పెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనటం పరిపాటి అయింది.
దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా తానే దైవత్వంతో ఉట్టి పడుతున్న ప్రధాన పూజారి (శివోహంభవ – శివ – భగవంతుడు, అహం – నేను/మేము, భవ – మన స్థితి) తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ. అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన (భక్త్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు. మన తిరుపతికి దగ్గరలో శ్రీ కాళహస్తి ఉంది కదా, అక్కడ ఉండే లింగమే వాయు లింగం. మనం చిన్నప్పుడు సాలెపురుగు, పాము, ఏనుగు వారికి తోచిన విధంగా శివునికి పూజలు చేసి మోక్షం సంపాదించాయి అనే కథ విన్నాం కదా, ఆ క్షేత్రమే ఈ శ్రీకాళహస్తి . ఇక్కడి స్వామి పేరు కాలహస్తీస్వరుడు, అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ.
రెండవది జలలింగం. ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉంటుంది. ఇది తమిళనాడు లోని తిరుచిరాపల్లి సమీపంలోని జంబూకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఇక్కడి స్వామివారి పేరు జమ్బూకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్న పరమేశ్వరుడు దాని నివారణ కోసం జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జమ్బూకేశ్వరుడు అని పేరు వచ్చింది.
మూడవది తేజోలింగం. ఇది తమిళనాడు లోని అరుణాచల (తిరువన్నామలై ) క్షేత్రంలో ఉంది. అరుణాచలం శిఖరాగ్రం పై అగ్ని శిఖ ఒకటి ఆవిర్భవించి, తేజోలింగ రూపుడయ్యాడు. ఇక్కడి శివుని పేరు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అబిదకుచాంబ లేదా ఉన్నమలై అంబ / ఉన్నమలై నాయగి . ఇక పృథ్విలింగం సంగతేంటంటే ఇది మట్టిలింగం. ఇది తమిళనాడులోని కంచి క్షేత్రంలో ఉంది. ఈ లింగం పార్వతీదేవిచే ప్రతిష్టింపబడింది. ఇక్కడ ఏకాంబరేశ్వరుడు, కామాక్షీదేవి కొలువై ఉన్నారు. ఈ కామాక్షి అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆఖరిది ఆకాశలింగం. ఇది తమిళనాడులోని చిదంబరం అనే క్షేత్రంలో ఉంది. ఈ ఆకాశలింగ దర్శనం చాలా రహస్యమైనది. ఆకాశం లాగా శూన్యంగా కనిపిస్తుంది. అస్సలు లింగ దర్శనమే ఉండదు. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. (అందుకే చిదంబర రహస్యం అని అంటారు) మరి అంతటి రహస్యమైన ఈ ఆకాశలింగాన్ని దర్శించాలంటే మనం ఎంతటి తపోనిష్ఠులం అవ్వాలో కదా. ఎంతో సాధన చేయాలి. జీవిత కాలంలో ఒక సారయినా చూడ వలసిన ప్రదేశం చిదంబరం...

 చిదంబర క్షేత్ర దర్శన ప్రాప్తిరస్తు.......

🕉చిదంబర రహస్యం🕉

ఓ " చిదంబర రహస్యం " అంటారు చాలా మంది.

*ఇంతకి...ఆ చిదంబర రహస్యం..అంటే

*శ్రీకృష్ణలీలలు*

భాగవతంలో  ఇలా చెప్పలేదు.

పెద్దలు చెప్పారు నా చిన్నప్పుడు. భగవంతుని లీలలు ఇలా కూడా ఉంటాయని అది కథగా అల్లాను. 

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

అది మండు వేసవి. మధ్యాహ్న ఒంటిగంట దాటింది. ఆ అవ్వ పండు ముదుసలి. తలపై బరువైన పళ్ళ బుట్టతో వేణుగోపాలస్వామి గుడిదగ్గర కాసేపు నీడలో కూచుందామని వచ్చింది. మెల్లగా బుట్టదించింది. చెమట పట్టిన ఆ ముడుతల ముఖాన్ని తుడుచుకుంటూ  *నాయనా గోపాలా ఊరంతా తిరిగాను. ఒక్కపండుకూడా అమ్మలేదు. ఈ రోజు పస్తేనా*  ఆ వేణుగోపాలుని విగ్రహం చూస్తూ అంది.

అంతలో ఒక బాలుడు. నుదుటిపై కస్తూరి తిలకం, వక్షస్థలంపై కౌస్తుభహారం, నాసాగ్రమున నవమౌక్తికం,  కంఠాన ముత్యాల హారం, చేత పిల్లనగ్రోవి, శిఖలో నెమలి పింఛం. ఎవరో కాదు. ఆ బాలుడు వేణుగోపాలుడే. ఆ అవ్వ దిశగా వస్తున్నాడు. ఆ అవ్వ అలా చూస్తోంది ఎవరా అన్నట్లు. దగ్గరగా వచ్చిన బాలుని చూసింది. ఆ లీలా మానుషుని చూసింది. అయినా కలియుగం. భగవంతుని దర్శనం ఏమిటిలే అనుకుంది. 

*అవ్వా, ఈ పళ్ళుతీయగా ఉంటాయా* అడిగాడు.

*అవును కన్నా. చాలా తీయగా ఉంటాయి. తీసుకో* అంది. 

బాలుడు: *ఎన్ని* 

అవ్వ: *ఎంత డబ్బు ఇస్తే అన్ని*

బాలుడు: *డబ్బా? అంటే?*

అవ్వ: *నీకు అర్ధం అవలేదా*

అవలేదన్నట్లు తల ఊపాడు

ఆ చోద్యాన్ని నారదుడు చూస్తున్నాడు. ఆ లీలామానుష విగ్రహదారి లీల ఏమిటా అన్నట్లు గమనిస్తున్నాడు.

అవ్వ: *అయ్యొ పిచ్చికన్నా, డబ్భంటేనే తెలియదా? నీవు ఏదైనా తీసుకుంటే దానికి ప్రతిఫలం ఇవ్వాలి. అదే డబ్బంటే*

బాలుడు: *డబ్బా? అదేమిటి? నాదగ్గర లేదే?*

అవ్వ: *నీకు తెలియదులే. అమ్మనడుగు పళ్ళుకొనడానికి డబ్బు కావాలని. ఇస్తుంది. పో. త్వరగా రా*

బాలుడు: *అమ్మ ఇంట్లో లేదు. యమునకు వెళ్ళింది*

అవ్వ: *ఇంట్లో ఏమైనా ధాన్యం గింజలున్నాయా*

బాలుడు: *ఓ చాలా ఉన్నాయి. గాదెల నిండా ఉన్నాయి*

అవ్వ: *అయితే  తీసుకురా. పళ్ళు ఇస్తాను*

బాలుడు: *చాలా వింతగా ఉందే. అమ్మ ఎన్నో ఇస్తుంది. కానీ ఏమీ తీసుకోదు. గొల్లభామలు వెన్న పెడతారు. డబ్బులు తీసుకోరు. వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకోమంటారు. కౌగిలించుకోమంటారు. అమ్మా అనమంటారు*

బాలుడి మాటలు అవ్వకు అంత అలసటలోను నవ్వు తెప్పిస్తున్నాయి. బాలుని చూస్తోంది అలాగే. ఏదో తన్మయమయిపోతోంది ఆ ముద్దుముద్దు మాటలకు.

బాలుడు: *అమ్మా*

అవ్వ: *అమ్మానా? నన్నే* 

బాలుడు: *అవునమ్మా నిన్నే అమ్మా అన్నాను. అమ్మా అంటాను. నిన్ను కౌగలించు కుంటాను. నీ ఒళ్ళో కూచుంటాను. నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఒక్క పండు ఇవ్వవా?తినాలనుంది*

అవ్వ: *పిచ్చి తండ్రీ. నాకా అదృష్టం లేదుకన్నా.*

బాలుడు: *ఎందుకు?*

అవ్వ: *నేను అంటరానిదానను. నేను ఎలా ముద్దాడగలను?*

అవ్వ అలా అంటుంటే బాలుడు *ఇలా* అంటూ అవ్వ ఒడిలో వాలిపోయాడు. అవ్వను ముద్దె ట్టుకున్నాడు. మెడ చుట్టూ చేతులు చుట్టేశాడు.

అవ్వ: *అయ్యో కన్నా. ఏమిటిది. ఎవరైనా చూస్తే ఎంత గొడవ. నేను అంటరాని దానను*

బాలుడు: *ఏం? అంటరానివారు మనుషులు కారా?. అలాంటి ఆంక్షలు నాకు ఇష్టంలేదు. నా స్నేహితులు చాలా మంది అంటరానివారే. నవ్వు కూడా అమ్మవే నాకు* అంటూ అవ్వనుముద్థు పెట్టుకున్నాడు.

నారదుడు చూస్తున్నాడు. దవడలు నొక్కుకుంటున్నాడు. ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.

అవ్వ ఆ బాలుడి కళ్ళలోకి అలా వాత్సల్యంగా శ్రీకృష్ణునికి యశోదాదేవిలాగ, శ్రీనివాసూనికి వకుళాంబలాగ చూస్తోంది. తన అదృష్టానికి మురిసిపోతోంది. 

అవ్వ: *కన్నా నువ్వు ఎవరివి? ఏమిటీ మాయ? నీ స్పర్శ నా ఆత్మలో వెలుగు చిమ్మి తన్మయ పరచింది. క్రిందటి జన్మలో యశోదా దేవినా? లేక వకుళాదేవినా? చాలు ఈ అదృష్టం. ఇంతకన్నా ధనం వద్థు. తీసుకో పళ్ళు ఎన్నికావాలో. ఒకటా? రెండా? అన్నీనా? తీసుకో కన్నా ఎన్నికావాలో*.

బాలుడు: *నాకు ఇవి అన్నీ కావాలి*

అవ్వ: *అలాగే కన్నా. అన్నీ తీసుకో* అన్నీ తీసి ఒక గుడ్డలో మూట కట్టబోయింది.

బాలుడు: *ఉండమ్మా. బాధపడకు. నేను కావలసినన్ని  ధాన్యం గింజలు కూడా తెస్తాను* 

అవ్వ: *కన్నా వద్దు. నా జన్మ తరించిపోయింది. పళ్ళు  తీసుకో కన్నా*

ఆ బాలుడు వినిపించుకోకుండా చిట్టి చిట్టి అడుగులతో తుర్ మంటూ  ఇంట్లోకి వెళుతుంటే ఆ అవ్వ ఆ బాలునివైపే చూస్తూ తన్మయమయిపోతోంది.

బుట్టలో పళ్ళన్నీ ఆ బాలునికోసం గుడ్డలో వేసి మూటకడుతోంది.

ఇంతలో ఆ బాలుడు పెద్ద నంద (ధాన్యం దాచే పెద్ద జాడీలాంటి కుండ) మీద ఉన్న మూత రెండు చేతులతో మెల్లగా దించి క్రింద ఉంచాడు. చిట్టి చేతులను దోసిలిగా చేసి, నిండా ధాన్యం తీసుకున్నాడు. తీసుకు వస్తున్నాడు. దారంతా గింజ గింజా పడిపోతున్నాయి. 

బాలుడు: *ఇవిగో ఇన్ని గింజలు తెచ్చాను. తీసుకో* అంటూ అవ్వకు చూపించాడు. ఆ చిట్టి చేతుల దోసిలిలో పది లేదా పదిహేను గింజలు మాత్రమే ఉన్నాయి. 

అవ్వ అలా దోసిలివైపు ఆబాలుని బుంగమూతవైఫు, ఆ బాలుని మిలమిలలాడే కన్నులవైపు చూస్తోంది.

ఆ బాలుడు గర్వంగా చిరునవ్వుతో, నాడు  పదునాల్గులోకాలు యశోదాదేవికిచూపిన ఆ నోటిని సగం తెరచి అవ్వవైపు చూస్తున్నాడు.

ఆ గింజలు చూసి పక్కున నవ్వలేక బోసి నోరు సగం తెరచుకుని, కంటి నుండి వాత్సల్య పూరితమైన ఆనందాశ్రువులతో లీలామానుషధారిని చూస్తూ తన్మయమైపోతూ తనను తాను మరచిపోయి అలా ఉండిపోయింది ఆ అవ్వ. 

అవ్వ: *అబ్బో చాలా తెచ్చావే. చాలు కన్నా* 

బాలుడు: *చాలానే దోసిలిలో తీసకున్నాను. అన్నీ మార్గంలో జల్లుకుపోయాయి. ఇవే ఉన్నాయమ్మా* బుంగమూతితో అవ్వ వైపు చూస్తున్నాడు.

అవ్వ: *ఇవే చాలా ఎక్కువ కన్నా. నా బుట్టనిండా అవుతాయి.* ఆ ధాన్యంగింజలు తీసుకుంది. ఈరోజు ఒక మంచిరోజు అనుకుంది అవ్వ. ఆ కొంచం గింజలే బుట్టలోని గుడ్డలో అపురూపంగా పోసుకుంది. పళ్ళమూట బాలునికి ఇచ్చింది. బాలుడిని మనసారా కౌగలించుకుంది. ముద్థుపెట్టుకుంది. విడువలేక విడువలేక బయలుదేరింది.

అంతా నారదమహాముని తిలకించుతున్నాడు. ఆ శ్రీకృష్ఞపరమాత్మ ఏ లీల చూపనున్నాడా అన్నట్టు నమస్కారం చేశాడు.

అవ్వ బుట్ట తేలికగా ఉంది. మనసు ఆ బాలుని స్పర్శతో పరమానందంతో నిండిపోయింది. ఇంటికి చేరింది. నట్టింట్లో బుట్ట క్రింద పెట్టి, కూర్చుని బుట్టలోని ధాన్యం గింజలు కట్టిన గుడ్డ తెరిచి చూస్తే......🙏🙏🙏అందులో ధాన్యంగింజలు లేవు. వాటి స్థానంలో గంపెడు నవరత్నాలు, మణి మాణిక్యాలు ధగధగలతో అవ్వ కళ్ళను ఆశ్చర్యపరిచాయి. ఆమె చేతులు రేండు జోడించి పరమాత్మని నమస్కరిస్తున్నాయి. 

గమనిస్తున్న నారదుడు ఆ పరమాత్మ ఆవ్వపై కురిపించిన కనకవర్షానికి ఇది పరమాత్మ చూపించిన ఇంకొక భక్తిమార్గము అనుకున్నాడు. మనకు ధనరాశులు ఇచ్చి  భక్తిమార్గంలో వెళుతామా లేక ధనరాశులవలన వేరే పేరాశలు, పెనబంధాలకు  మార్గం మార్చుకుంటామా అనేదానికి ఇది ఒక పరీక్ష కాదుగదా? ఆ పరమాత్మ వేసే ధనాకర్షణ అనే ఉచ్చులో నరుని వివేకము ఏవిధంగా పయనిస్తుందో..దైవచింతనవైపా లేక ధనచింతనవైపా? నరుడీ పరీక్షలో బాగా యోచించి ధనమనే మాయాపాశానికి లొంగక ఆ పరమాత్మ చింతనలోకి వెళతాడా లేక ఆ ఉచ్చులోచిక్కిపోయి ఐహిక బంధాలలో ఉండిపోతాడా? ఆ నందనందనుడు బహు చమత్కారి. అనుకున్నాడు నారదుడు🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

విలువలు

ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి, 200 మంది ఉన్నగదిలోఉపన్యాసం ఇస్తున్నాడు.

తన జేబులో నుంచి ఒక వంద రూపాయల నోట్ ని తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు.

ఆ గదిలో ఉన్న 200 మందిచేతులు గాలిలోకి లేపారు.

సరే ఈ వంద రూపాయలని మీలో ఒకరికి తప్పకుండా ఇస్తాను అని ఆ వంద
రూపాయలని బాగా మడతలు పడేలా నలిపేసాడు.

మరల తను ఇప్పుడు ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. మళ్లీ అందరు చేతుల్ని లేపారు.

తను మంచిది అని వాళ్ళతో అని మరల ఆవంద  రూపాయలని కింద
పడేసి తన కాళ్ళతో తోక్కేసాడు. అప్పుడు ఆ వంద రూపాయలు నోటు బాగా మడతలు పడి,
మట్టి కొట్టుకుపోయింది. 

మరల అతడు దాన్ని తీసి ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలి అన్నాడు. ఇప్పుడు కూడా అందరు తమ చేతులు పైకెత్తారు.

అప్పుడు అతడు అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా చెప్పాడు...
నా మిత్రులారా మీరందరూ ఇప్పటి వరకు ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నారు.

ఇప్పటి వరకు ఈ వంద రూపాయల్ని ఏమి చేసిన మీరందరూ ఇంకా కావాలి అంటున్నారు.
ఎందుకంటే నేను ఏమి చేసిన ఈ వంద
రూపాయల విలువ ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇప్పటికి వంద రూపాయలు.

అలాగే మన జీవితంలో కూడా చాలా సందర్భాలలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనకి
ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతుంటాయి.. కొన్ని సార్లు కిందకి పడిపోతాం. కొన్ని
సార్లు మనం ఎందుకు పనికిరాము అనుకుంటాం. జీవితం ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటుంది.. ఒకవేళ
మనం పరీక్షలలో ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదు..

జీవితం ప్రతి సారి మనకు ఒక క్రొత్త అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది... జారవిడచిన
అవకాశాల కోసం చింతించక క్రొత్త ఆశలతో సరికొత్త ఊహలతో 
ముందడుగు వేయి...
వంద రూపాయల నోటు ఎంత చిరిగినా దాని విలువ ఎలా పోగొట్టుకోలేదో.. మన విలువ కూడా ఎప్పటికీ
తరగదు..

నువ్వు ఎప్పడు నీ విలువను
పోగొట్టుకోలేవు"
నువ్వు ఒక గొప్ప వ్యక్తివి

ఈ విషయం ఎప్పటికి మరవొద్దు

నేను ఇలాంటి పోస్ట్స్ పెడుతుంటే మీరు నన్ను కవి గానో లేక మేధావి గానో  అనుకోవద్దు 
నేను మాములు మధ్యతరగతి కుటుంబ బాధ్యత గల వ్యక్తి ని మాత్రమే 
నా పోస్ట్స్ , మరియు నాపై మీ  అభిప్రాయం తప్పకుండా చెప్పండి

*రామాయ రామభద్రాయ*


*రామాయ రామభద్రాయ* 
*రామచంద్రాయ వేథ సే |* 
*రఘునాథాయ నాథాయ*
*సీతాయాః పతయే నమ: ||* 

_రామా! రామభద్రా! రామచంద్రా! విధాతృ స్వరూపా! రఘునాథా! ప్రభూ! సీతాపతీ! నీకు నమస్కారం._

*శ్రీరామ రామ రఘునందన రామరామ|* 
*శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ ||* 
*శ్రీరామ రామ రణకర్కశ రామరామ |* 
*శ్రీరామ రామ శరణం భవ రామరామ ||* 

_శ్రీరామా! రామా! రఘునందనా! భరతాగ్రజా! రణకర్కశా! – ఓ శ్రీరామా! శరణం రామరామ!_

*శ్రీ రామచంద్ర చరణౌ మనసా స్మరామి |* 
*శ్రీ రామచంద్ర చరణౌ వచసా గృణామి ||* 
*శ్రీ రామచంద్ర చరణౌ శిరసా నమామి |*
*శ్రీ రామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే ||*

_శ్రీరామచంద్రుని చరణాలను నేను మనసా స్మరిస్తున్నాను._
_శ్రీరామచంద్రుని చరణాలను వాక్కు ద్వారా నేను శ్లాఘిస్తున్నాను._ 
_శ్రీరామచంద్రుని చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను._ 
_శ్రీరామచంద్రుని చరణాలను నేను శరణు వేడుచున్నాను._

*మాతా రామో మత్సితా రామచంద్ర:|* 
*స్వామీ రామో మత్సఖా రామచంద్రః ||*
*సర్వస్వం మే రామచంద్రో దయాళు:|*
*నాన్యం జానే నైవ జానే న జానే ||* 

_రాముడే నా తల్లి. రామచంద్రుడే నా తండ్రి. రాముడే నా ప్రభువు. రామచంద్రుడే నా సఖుడు. దయామయుడైన రామచంద్రుడే నా సర్వస్వం. ఆయనను తప్ప నేను మరెవరినీ యెంతమాత్రమూ యెరుగను._

*దక్షిణే లక్ష్మణో యస్య* 
*వామే చ జనకాత్మజా |*
*పురతో మారుతిర్యస్య* 
*తం వందే రఘునందనమ్ ||*

_కుడి వైపున లక్ష్మణుడు, ఎడమ వైపున జానకీదేవి ము౦దు ఆంజనేయుడు తో విరాజిల్లుచున్న రఘున౦దనుకి వందన౦._

*లోకాభిరామం రణరంగధీరం |* 
*రాజీవనేత్రం రఘువంశనాథమ్ ||* 
*కారుణ్యరూపం కరుణాకరం |*
*తం  శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ||* 

_లోకాభిరాముడు, రణరంగధీరుడు, రాజీవనేత్రుడు, రఘువంశనాథుడు,  కారుణ్యరూపుడు, కరుణాకరుడు  అయిన శ్రీరామచంద్రుని నేను శరణు వేడుచున్నాను._

*మనోజవం మారుతతుల్య వేగమ్ | 
*జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ||* 
*వాతాత్మజం వానరయూథముఖ్యం | 
*శ్రీరామదూతం శరణం ప్రపద్యే ||*

_మనోవేగంతో, వాయువేగంతో ప్రయాణించేవాడు, జితేంద్రియుడు, మహాబుద్ధిశాలి, వాతాత్ముజుడు (వాయునందనుడు), వానర సేనలో ముఖ్యుడు అయిన శ్రీరాముని దూతను (హనుమంతుని) నేను శరణు వేడుచున్నాను._

************************

*కరోనా కట్టేసే తిప్పతీగ!!!*


అనంతసాహితి -ఆయుర్వేదం పంచమవేదం-004
-----------------------------------------

నాసంవృతముఖః కుర్యాత్క్షుతిహాస్య విజృంభణం|
నాసికాన్నవికృష్ణీయాన్|
(నోరు, ముక్కు గుడ్డతో కప్పుకోకుండా చీదడం, తుమ్మడం, ఆవులించడం, నవ్వడం, దగ్గడం వంటివి చేయరాదు. అనవసరంగా ముక్కులోకి వేలు పెట్టుకోరాదు. ముక్కుపుటాలు తాకుతుండరాదు. ) 
++++++++++++++++++

సాధ్యయోరపి సంయోగో బలినోర్యాత్యసాధ్యతామ్||
విద్యాదసాధ్యమేవాతః సాధ్యాసాధ్యమాగమమ్|
నాసాధ్యః సాధ్యతాం యాతి సాధ్యో
యాతిత్వసాధ్యతామ్||
పాదాపచారాద్దైవాచ్చ యాన్త్యవస్థాన్తరం గదాః|

(గతంలో చికిత్స ఉన్న వ్యాథులు కూడా వివిధ వ్యాథులతో కలయిక వల్ల చికిత్స చేయలేనివి కావచ్చు. అంతేకాక, చికిత్సలేని వ్యాథులతో కలువడం వలన చికిత్స ఉన్న వ్యాథులు కూడా ఎదురుతిరిగి చికిత్సకు లొంగకపోవచ్చు.

చికిత్సలేని వ్యాథులు కొద్దికాలం ఎదురు తిరగవచ్చు. అలాగే వీటి సాంగత్యం వలన చికిత్సకు లొంగే వ్యాథులు కూడా ఎదురుతిరగవచ్చు. భగవంతుని ఇచ్ఛ వలన, వైద్యుల అశక్తి వలన కూడా చెలరేగవచ్చు. వ్యాథులు తమ తీరు మార్చుకొని కొత్తవాటిగా పుడతాయి.)   
+++++++++++++++++++++++

గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారికి ఆయుర్వేదం అంటే ప్రత్యేకమైన అభిమానం, ఆరాధనా ఉంది. ఎందుకంటే మహాపురాణాలు ఆయుర్వేదాన్ని పంచమవేదంగా చెప్పాయి. ఆయుర్వేదం సాక్షాత్తు పరమేశ్వరుని నుంచీ సూర్యభగవానుడు పొందాడు. కనుకనే మహాశివుడ్ని వైద్యనాథునిగా కొలుస్తారు. ఆరోగ్యవైద్యశాస్త్రం ఆయుర్వేదం సూర్యుని ఆధీనంలోకి వెళ్ళిన కారణం చేత ఆరోగ్యం సూర్యుని హస్తగతమైంది. ఈయనకు పుట్టిన అశ్వినీ దేవతలు వైద్యశాస్త్రానికి అధిదేవతలు అయ్యారు. 

వేదాలతోపాటు సమానంగా పుట్టిన ఆయుర్వేదం సనాతనమైంది. లక్షలాది సంవత్సరాల క్రితం ఉద్భవించింది. నేటికీ మానవాళి సంరక్షణకు మేరుశిఖరంలా నిలిచింది. దీనికి ఉదాహరణే పైన ఇచ్చిన ఆయుర్వేద జ్ఞానగుళికలు.

యుగాల క్రితమే వైద్యులు సంస్కారం, సంప్రదాయం, నాగరికత నేర్పుతూ వైద్యశాస్త్రరీత్యా సదాచారాలు నేర్పారు. అందులోదే మొదటి సుభాషితం. ఇది వాగ్భటీయమైన అష్టాంగహృదయం నుంచీ సేకరించింది. నేడు కరోనా వల్ల వేల ఏళ్ళ క్రితం భారతీయ భిషజులు చెప్పిన ఆచారకాండనే ఆధునిక వైద్యులు చెప్పారు. అయితే నేటి ఆధునిక వైద్యులు చేసేది అరగుండు క్షవరం అని దీన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. 

కరోనా దగ్గువల్లా, తుమ్మువల్లా తుంపర్ల వల్లా వ్యాపిస్తుందని తెలుసు. అయిదే గాలిద్వారా వ్యాపిస్తుందని చాలా ఆలస్యంగా కనుక్కున్నారు. మానవుడు మాట్లాడేటప్పుడు కూడా తుంపర్లు వస్తూ ఉంటాయి. అంతేకాక చీదడం, తుమ్మడం, ఆవులించడం, నవ్వడం, త్రేన్చడం, దగ్గడం వల్ల కూడా వైరస్లు వెలువడుతాయని ఆయుర్వేదం వేలా కొలదీ ఏళ్ళక్రితం చెప్పింది. కనుకనే ముక్కునూ, నోరునూ గుడ్డతో అడ్డుపెట్టుకొని చీదడం, తుమ్మడం చేయాలి. ఆధునిక వైద్యులకు తెలియనిది ఆవులించడం, నవ్వడం, త్రేన్చడం వల్ల కూడా వైరస్లు గాలిలో కలుస్తాయని ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది. కనుక ఇవి చేసేటప్పుడు నోటికి అడ్డుపెట్టుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. దీన్ని బట్టీ తుచ్ఛమైన కాసుపీసాణం ఆంగ్లవైద్యం కన్నా ఆయుర్వేదం ఎన్ని వేల ఏళ్ళ క్రితమే ఎంత అడ్వాన్సుడ్ గా ఉందో తెలుసుకోవచ్చు. మానవుడి నుంచీ వచ్చే గాలిలో నీటి ఆవిరి ఉంటుంది. కనుక అందులో వైరస్ లు ఉండే అవకాశం ఉందని వాగ్భటాది ఆయుర్వేద వైద్యులు చెబుతారు. 

కొన్ని సినిమాల్లో మేనరిజం కోసం ముక్కుపుటాలు తాకుతుండడం చూపిస్తారు. అయితే అది ఆరోగ్యశాస్త్రాలు నిషేధించిన అలవాటుగా గుర్తించాలి.

వైద్యులకు లొంగని వ్యాథులు ఆయుర్వేదవైద్యుల దృష్టిని ఆదిలోనే ఆకర్షించాయి. కనుకనే రెండో సుభాషితాన్ని మహావైద్యగ్రంథాల మొదట్లోనే చెప్పారు. దీని ద్వారా వైద్యుల కర్తవ్యాకర్తవ్యాలు ఉద్బోధించారు. అది నేటికీ నిజం అవుతూ ఉండడం గమనార్హం. 

ఈ పరమేశ్వరానుగ్రహమైన ఆయుర్వేదంలో వేలు లక్షల ఏళ్ళ నుంచీ మానవులకు సేవ చేస్తున్న అనేక వనమూలికలూ, రసాయనాలు, జీవధాతువులు ఉన్నాయి. ఇటువంటి వాటిలో అతిముఖ్యమైంది తిప్పతీగ, గుడుచి అనే పేర్లతో పిలిచే గిల్లోయ్. దీన్ని వైద్యులు అమృతం ముద్దుపేరుతో పిలుస్తారు. ఈ మందు సకలసంజీవని వంటిది. దీని ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు.

 
తిప్పతీగ నేడు కరోనా దుష్ర్పభావాలు అడ్డుకోవడంలో కూడా ముఖ్యపాత్ర పోషించగలదు. కరోనాలో ఉన్న ప్రధాన దుర్లక్షణం పాకిస్తాన్ తీవ్రవాదితో పోల్చవచ్చు. అక్రమంగా చొచ్చుకు వచ్చిన ముష్కరులు ఎక్కడ ఏవిధంగా దాడి చేస్తారో తెలియదు. ఇటువంటి కరోనాను కూడా అనేక విధాలుగా అడ్డుకోగలిగిన మందు కావాలంటే అది తిప్పతీగమాత్రమే అని అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులు తేల్చారు. బహుముఖయుద్ధం చేయగలగడమే తిప్పతీగ ప్రజ్ఞ.

ఇది ప్రధానంగా శరీరంలో రోగనిరోధక శక్తిపెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లను విడుదలను శరీరంలో విద్యుదుత్పత్తి కేంద్రం మాదిరిగా చేస్తుందని క్రీస్తుపూర్వం కొన్ని వేల ఏళ్ళ క్రితం ఆయుర్వేదం కనుగొంది. శరీరంలోని అనేక మలినాలు విషాల నుంచీ రక్తాన్నీ, దేహాన్నీ శుభ్రం చేస్తుంది. అనేక క్రిమి కీటకాల నుంచీ రక్షణ ఇవ్వగలదు. అన్నిటికీ మించి గుండెకు రక్షణ కోట కట్టే మందు ఇది. అనేక హృద్రోగాలను ఇది ఆపగలదు. ఊపిరితిత్తులను కూడా ఆరోగ్యంగా ఉంచగలదు. కొన్ని రకాల ఆస్తమాలకు కూడా ఇది చికిత్స చేయగలదు.

అనేక రకాల జ్వరాలను నివారించగలదు. ఆయుర్వేదం ప్రకారం జ్వరం అనేక వ్యాథులకు కన్నతల్లి. వేల ఏళ్ళ క్రితం నాటి తిప్పతీగ 21వ శతాబ్దంలో జ్వరానికి పుట్టిన వికృత శిశువులు డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియాలను కూడా అడ్డుకోగలదు. ఆయుర్వేదంలో రోగాన్ని పెంచే వాటిలో ముఖ్యమైంది ఆకలి మందగించడం, అరుగుదల లేకపోవడం. ఈ లక్షణాన్ని గిల్లోయ్ నాశనం చేసి తిన్న ఆహారం అరిగేట్లు చేసి శరీరానికి శక్తినివ్వగలదు. 

నేడు అనేక మందిని ప్రపంచవ్యాప్తంగా వేదిస్తున్న చక్కెర వ్యాధిని అదుపు చేయగలదు. ముఖ్యంగా టైప్ 2 రక్తచక్కెరను తిప్పతీగ రసం కూడా అదుపుచేయగలదు. సాఫ్టవేరు ఉద్యోగులు వంటి వారికి వస్తున్న ఆవేదన, మానసిక వత్తిడులను ఇది తీసివేయగలదు.  

వయసు వార్థక్యంలో వచ్చే కీళ్ళవాతం, ఎముక సంధుల రోగాలు (ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్లు, రొమటాయిడ్) వంటి వాటికి ఇది మహాద్భుతంగా పనిచేస్తుంది. కంటి చూపు బాగుచేయగలదు. ముసలి తనం రాకుండా అడ్డుకోగలదు. 

ఇన్ని శుభలక్షణాలున్నాయి కనుకనే దీన్ని భారత ప్రభుత్వరంగంలో ప్రత్యామ్నాయ వైద్యాభివృద్ధి చేయాల్సిన ఆయుష్ సంస్థ బుద్ధి ఉన్న తొలిరోజుల్లో తిప్పతీగను కరోనా నివారణ ఔషథంగా ప్రజలకు సూచించింది. బాబా రాం దేవ్ ఈ తిప్పతీగను ఉపయోగించి కరోనా మందు తయారు చేయడంతో ఏ ఆంగ్ల వైద్యులకు అమ్ముడు పోయిందో కానీ ఆయుష్ సంస్థ విషం కక్కింది. 

జనాలు చచ్చిపోతుంటే వేలాది ఏళ్ళ నుంచీ అందుబాటులో ఉన్న వనమూలికలతో మందు తయారు చేస్తే ఆయుష్ సంస్థకు అభ్యంతరం ఏమిటో ఎవరికీ అర్థంకానిది. పైగా ఆయుష్ సంస్థ ఉన్నదే ప్రత్యామ్నాయ వైద్యవిధానాన్ని అభివృద్ధి చేయడానికి. కానీ ఇది పాము తన గుడ్లు తానే తిన్న చందంగా ఆయుర్వేద భక్షణ సంస్థగా మారి ప్రజల్ని దోచుకుతినే ఆంగ్లవైద్యానికి రక్షణ సంస్థగా మారుతోంది. క్లుప్పంగా చెప్పాలంటే ప్రత్యామ్నాయ వైద్యం నాశనం చేయడానికే పుట్టిన సంస్థగా మారింది.

నేడు అనేక చావులు పరిశీలిస్తే అవన్నీ చనిపోవాల్సినవి కావని ఇట్టే తెలుస్తుంది. యువకులు చనిపోవడం గమనిస్తే దమననీతితో ఆయుర్వేదాన్ని అడ్డగించడానికి కారణం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఒక్కవ్యక్తి మరణించకుండా ఆయుర్వేద మందులు కాపాడినా చాలు అనే ఇంగితం ప్రభుత్వరంగ సంస్థకు లేకపోవడం చూస్తే ఇది ఉండాల్సిన అవసరం ఉందా? అనే సందేహం కలుగుతోంది. 

తిప్పతీగ గోళీలు వాడితే నిర్భయంగా ఉండవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ళ లోపు వారు రోజు ఒక మాత్ర వాడితే చాలని సలహా ఇస్తున్నారు. సామాన్య ఆరోగ్యం లేని 30 ఏళ్ళ పై వారు కూడా తమను సంప్రదించి రోజు రెండు వరకూ వాడవచ్చని చెబుతున్నారు. 

సాధారణ మార్కెట్టులో పనిచేస్తుందో చేయదో తెలియని 5000 రూపాయల ఆంగ్ల మందును 30 వేల రూపాయలకు బ్లాక్ మార్కెట్ చేసి అమ్ముతున్న ఆంగ్ల మాఫియా ముందు ఆయుష్ సంస్థ కళ్ళు కాళ్ళులేని జీవచ్ఛవంగా మారిందనే వారు లేకపోలేదు. 

అశ్వగంధ ఒక బిళ్ళ, గిల్లోయ్ ఘనవతి బిళ్ళ ఒకటి ప్రతిరోజూ వాడితే కరోనా దరికి రాదని వారు చెబుతున్నారు.  దీని ఖర్చు రోజుకు  4 రూపాయల.25 పైసలు మాత్రమే అవుతుందని, వీటిని వాడడం కన్నా లక్షరూపాయల ఆక్సిజన్ సిలెండర్ బ్లాకులో కొనుక్కుని ఇంట్లో బాంబు మాదిరి దాచుకోవడం ఏమిటని నవ్వుతున్నారు.

అన్నిటికీ మించి నేడు మార్కెట్లో గిల్లోయ్ ఘనవతి దొరకడం లేదనే వారు కూడా లేకపోలేదు. 

కరోనాను పారదోలే మరిన్ని ఆయుర్వేద మందుల గురించి ముందు ముందు తెలుసుకుందా.

స్వామి అనంతానంద
అనంతసాహితి ఆశ్రమం
హైదరాబాద్, గుంటూరు.

మహాకవి దాశరధి జయంతి

 
మహాకవి దాశరధి రచించిన సినిమా పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. మచ్చుకి కొన్ని :
ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
వాగ్దానం (1961) : నా కంటిపాపలో నిలిచిపోరా...నీవెంట లోకాల గెలవనీరా
అమరశిల్పి జక్కన (1964) : అందాల బొమ్మతో ఆటాడవా, పసందైన ఈరేయి నీదోయి స్వామి
దాగుడు మూతలు (1964) : గోరంక గూటికే చేరావు చిలకా ; గోరొంక కెందుకో కొండంత అలక
మూగ మనసులు (1964) : గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్టమనసులో ఏముంది
నాదీ ఆడజన్మే (1964) : కన్నయ్యా నల్లని కన్నయ్యా నిను కనలేని కనులుండునా
ప్రేమించి చూడు (1965) :
ఆత్మగౌరవం (1966) : ఒక పూలబాణం తగిలింది మదిలో తొలిప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే
శ్రీకృష్ణ తులాభారం (1966) : ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీవలిగితే నేతాళజాల
పూల రంగడు (1967) : నీవు రావు నిదురరాదు, నిలిచిపోయె యీ రేయి
నిండు మనసులు (1967) : నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో
రంగులరాట్నం (1967) : కనరాని దేవుడే కనిపించినాడే ; నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో.

అభ్యర్థన

హిందూ చైతన్య వేదిక, ఆంధ్రప్రదేశ్
చేతులు జోడించి చేస్తున్న అభ్యర్థన
*5 ఆగస్టు 2020 బుధవారం*మీ *ఇల్లు,షాపు, ఆఫీసు,పనిప్రాంతం,ఫ్యాక్టరీ* ఎక్కడ ఉంటే అక్కడ  
ఉదయం సుముహూర్త సమయానికి సీతారాముల పటం‌ ,మీ ఇంట్లో పూజాగదిలో ,దేవీ దేవతల పటాలముందు.దీపాలు వెలిగించండి పసుపు , కుంకుమ,అక్షింతలు,పుష్పాలుసమర్పించండి,అవకాశం ఉన్నచోట ,దేవాలయాలలోపూజలో పాల్గొనండి ,పూజ చేయండి.
రాత్రి7.00గంటలకుసాధ్యమైనంత వరకు మరింత ఎక్కువ* దీపాలను వెలిగించండి.*మహిమాన్విత రోజుకు, ఆ క్షణాలకు మిమ్మల్ని మీరు సాక్షిగా చేసుకోండి*.
హిందువులారా మీరు హిందులమని గర్వంగా  భావించండి.*ఈ 500 సంవత్సరాలలోఅదృష్ట వంతులు మీరు**హిందూ ఆత్మాభిమాన పునరుద్ధరణ స్వయంగా. మీ కళ్ళతో చూసే భాగ్యం, మీ చెవులతో  వినే భాగ్యం ,మీ చేతులతో పూజచేసే భాగ్యం. మీ నోటీత స్మరించే భాగ్యం మీకు కలిగింది.మీ కలలను సాకారం చేసుకున్న అవకాశం పొందిన అదృష్ఠవంతులు మీరు.ఆరోజుమర్యాద పురుషోత్తముడైన  శ్రీరాముని జన్మస్థలమైన సరయూ నదిఒడ్డున వున్న  అయోధ్య యొక్క పుణ్య భూమిలో మన ఆరాధ్య దైవం * మర్యాద పురుషోత్తముడు .రామో విగ్రహవాన్ ధర్మః . ధర్మానికి ప్రతీక ఐన రాజా రామచంద్ర ప్రభువు మన ఆయోధ్య శ్రీ రాముడికి అద్భుతమైన నవ్య భవ్య  రామమందిరం నిర్మాణం యొక్క భూమి పూజ జరుగుతుంది * హిందువులారా శ్రీ రాముడిఅద్భుత మందిరంలో దివ్య స్వరూపుడైన రాముడివిగ్రహాన్ని ఆయన రాజ్యాన్ని తిరిగి ప్రతిష్టిస్తారు*దయచేసి మీ అందరిని అభ్యర్దిస్తున్నాము.ఈ పవిత్రమైనరోజు దీపం వెలిగించాలి * యావత్ భారతాన్ని కాదు, మొత్తం ప్రపంచాన్ని హిందూ సమాజాన్ని  దీపశక్తికాంతితో  పరిచయం చేయాలి.*
శ్రీరామ జయరామ జయజయ రామ విజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి.
*జై శ్రీరామ్ జైజై శ్రీరామ్* భారత్  మాతా కీ జై 
గంగా మాతా కీ జై ,
గోమాతా కీ జై 
తులసీ మాతా కీ జై .
రాజా రామచంద్ర మహరాజ్ కీ జై 
పవనసుత హనుమాన్ కీ జై 

మళ్ళీ శ్రీ మరాజ్య స్థాపనలో
అందరితో కలసి మన మందరము అడుగులో అడుగు కలిసి ముందుకు వేద్దాం

*స్వర్గమా.... భగవత్ అనుగ్రహమైన మోక్షమా*

_తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే_

స్వర్గలోకముల వుండే సుఖభోగములు తాత్కాలికమైనవని, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అక్కడికి పంపించబడిన జీవులకు, స్వర్గ లోక భోగములు అనుభవించిన తరువాత వారి పుణ్యం అంతా ఖర్చయిపోతుంది, అప్పుడు వారు, తిరిగి భూలోకానికి పంపించబడుతారు. ఈ విధంగా స్వర్గాది లోకములు పొందినా కూడా, దాని వల్ల ఆత్మ యొక్క సనాతన అన్వేషణ నెరవేరదు. మనందరమూ అనంతమైన పూర్వ జన్మలలో ఎన్నో సార్లు అక్కడికి వెళ్లి వచ్చాము, కానీ అనంతమైన ఆనందము కోసము ఆత్మ కున్న కోరిక తీరలేదు. అన్ని వైదిక శాస్త్రాలు ఈ విశ్వాసాన్ని బలపరుస్తున్నాయి.

తావత్ ప్రమోదతే స్వర్గే యావత్ పుణ్యం సమాప్యతే
క్షీణ పుణ్యః పతత్యర్వాగనిచ్ఛన్ కాల-చలితః (భాగవతం 11.20.26)

"స్వర్గ లోకాల్లో నివసించేవారు తమ పుణ్యఫలము అయిపోయేంత వరకు దేవతా భోగాలను అనుభవిస్తారు. ఆ తరువాత వారు కాలక్రమంలో తమకు ఇష్టం లేకపోయినా క్రింది లోకాలకు నెట్టివేయ బడుతారు."

స్వర్గహు స్వల్ప అంత దుఖదాఈ (రామాయణం)

"స్వర్గ ప్రాప్తి అనేది తాత్కాలికమైనది మరియు తర్వాత దుఖాలను తెచ్చేది."

ఎలాగైతే ఫుట్బాల్ బంతి, మైదానం అంతటా ఒక చోటి నుండి ఇంకో చోటికి తన్నబడుతుందో, మాయ అనేది, జీవాత్మను, భగవత్ విముఖం అవటం చేత అలాగే తన్నుతున్నది. కొన్ని సార్లు నిమ్న లోకాలకు వెళుతోంది, కొన్నిసార్లు ఉన్నత లోకాలకు వెళుతుంది. ఈ క్రింది మరియు పై లోకాల్లో తనకు లభించిన ఈ బహు విధములైన రూపములలో కేవలం మానవ రూపం మాత్రమే భగవత్ప్రాప్తికి అవకాశం కల్పిస్తుంది. అందుకే దేవతలు కూడా మానవ జన్మ కోసమే పరితపిస్తుంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. దీనితో వారు స్వర్గ లోకానికి వెళ్ళిన తప్పుని సరిదిద్దుకుని, ఈ సారి భగవత్ ప్రాప్తికై ప్రయత్నిద్దామనుకుంటారు.

దుర్లభం మానుషం జన్మ ప్రార్థయతే త్రిదశైరపి (నారద పురాణం)

"మనుష్య రూపంలో జన్మ చాలా చాలా అరుదు (దుర్లభము). దేవతలు కూడా దీన్ని కాంక్షిస్తారు." అందుకే శ్రీ రామ చంద్రుడు కూడా అయోధ్యావాసులకి ఇలా ఉపదేశం ఇచ్చాడు.

బడే భాగ మానుష తను పావా, సుర దుర్లభ సబ గ్రంథంహి గావా (రామాయణం)

"ఓ అయోధ్యావాసులారా, మీరందరూ మానవ జన్మ లభించినందుకు ఏంతో ఏంతో అదృష్ట వంతులు, ఇది చాలా చాలా దుర్లభమైనది మరియు స్వర్గ లోకవాసులు కూడా కోరుకునేది." 

*దేవతలే ఈ మానవ జన్మను ఇంతగా కోరుకుంటున్నప్పుడు మరి ఇక మనం మాత్రం ఆ స్వర్గ లోకాలని కోరుకోవటం ఏమి ప్రయోజనం? అందుకే, మనం పరమేశ్వరుడి పై భక్తి ద్వారా భగవత్ ప్రాప్తి కై నిమగ్నమవ్వాలి.*

వ్యాపారస్థులలో చాలామంది కరొన బారిన పడుతున్నారు

ముఖ్యముగా వ్యాపారస్థులలో చాలామంది కరొన బారిన పడుతున్నారు. కొంతమంది మరణిస్తున్నారు..

అందుకు ప్రధాన కారణాలు:

1) వ్యాపారస్తులు షాప్ లో  ఉన్నపుడు మాస్కులు పెట్టుకోకపోవడం, లేదా చెమట  వల్ల పెట్టుకున్న  మాస్కులు తరచుగా తీస్తూ ఉండటం,
2) మాస్కును తరచుగా తాకడం,
3) మాస్కును తాకినా వెంటనె శానిటైజ్ చేసుకోకపోవడం,
4) డబ్బులను తీసుకున్న వెంటనే శానిటైజ్ చేసుకోక పోవడం,
5) డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మిని అంటించి నోటితో తడిచేసుకోవడం,
6) మన షాపులు దగ్గర కస్టమర్లు డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యకపోవడం,
 7) వివిద రకాలైన కస్టమర్లు మాన షాపులకి మాస్కులు లెకుండా రావడం వారిని మనం వారించకపోవడం,
8) ప్రతి కస్టమర్ శానిటైజ్ చేసుకునే ఏర్పాట్లు చెయ్యక పోవడం,
9) కరోనా గురించి అవగాహన  ఉన్న అది మనకి రాదులే అని  నిర్లక్ష్యం వహించడం,
10) కరోనా మానవూరిలో లెదు కదా అనో తక్కువగ ఉందనో అనుకోవడవం,
11) సరుకుల కొనుగోలు దగ్గర సొషల్ డిస్టన్స్ లేకపోవడం, డబ్బులు ఇచ్చిపుచ్చుకొనేదగ్గర డబ్బులు నొటితో తాకడం. కొన్న వాటిని పాసెంజర్ ఆటోలో తరలించడం వాటిలో ప్రయాణించడం..

మనకి బ్రతకడానికి డబ్బులుకావాలి.. మందులు లేని జబ్బులు తెచ్చే డబ్బులు వద్దు..!!

మన అజాగ్రత్త మొత్తమ్ మన కుటుంబానికి ప్రమాదంగా మారుతుంది గురుతుంచుకోండి.

నైవేద్యం ప్రత్యక్షంగా తినే శ్రీకృషుని దేవాలయము....


మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది.
📿 గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం.
📿 అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు.
📿 ఇక్కడి కృష్ణపరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండటం తరుచుగా గమనిస్తుంటారు. స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. అదే విధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుంది.
📿 గుడి తెల్లవారుజావున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు.
📿 నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా, ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు. ఏదేని కారణం చేత తాలం పనిచేయకపోయినా, తాలం పోయినా, గొడ్డలితో తాలాన్ని పగలకొట్టడం ఇక్కడి ఆనవాయితీ.
📿 కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడి నియమం. అందుకే అర్చక స్వాములు “ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు ఉన్నారా అని పెద్ధగా అరుస్తారు”.
📿 కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు క్రిందకు దిగడం మనం చూడవచ్చు. పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వలన ఇలాంటి అపసృతి చోటు చేసుకోవడం వలన, ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలోనే కాదు మరెప్పుడూ మూయరు .
📿 గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్ట దోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణపరమాత్మను దర్శించి, పూజిస్తే దోషాలు నివారింపబడుతాయి. దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు కృష్ణభగవాణుడి సేవకులు కనుక ఇక్కడి కృష్ణభక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తితో కొలుస్తారు.
📿 సైంటిష్టులకు కూడా అంతుచిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంత కన్నా గొప్ప దేవాలయం ఎక్కడ ఉంటుంది! 🙏 

 సర్వంశ్రీకృష్ణార్పణమస్తు 🙏

21-07-2020. నుండి శ్రావణమాసం ప్రారంభం.



31-07-2020.
శ్రీవరలక్ష్మి వ్రతమ్

03-08-2020.
శ్రావణ పౌర్ణమి - (రాఖీ)

11-08-2020.
శ్రీకృష్ణాష్టమి

19-08-2020.
పోలాల అమావాస్య.

శ్రావణ మంగళవారములు
21-07-2020. శుద్ధ పాడ్యమి.

28-07-2020. శుద్ద అష్టమి/నవమి.

04-08-2020. బహుళ పాడ్యమి.

11-08-2020. బహుళ అష్టమి.

18-08-2020. బహుళ చతుర్దశి / అమావాస్య.

శ్రావణ శుక్రవారములు:--
24-07-2020. శుద్ధ చవితి.
31-07-2020. శుద్ధ ద్వాదశి.
07-08-2020. బహుళ చవితి.
14-08-2020. బహుళ దశమి/ఏకాదశి.

ముఖ్య అభ్యర్ధన:--
కరోనా వైరస్ కారణం వల్ల - ఈ సంవత్సరం దయచేసి ఎవరూ - ఎవ్వరినీ నోములకి, పేరంటానికి, ఉద్యాపనలకి, ముత్తైదువకి, ముత్తైదువ భోజనాలకి ఇలా వగైరా... వగైరా లకి ఒకరినొకరు పిలుచుకోవద్దని సర్వజన శ్రేయస్సు కోసం **

ఎందుకంటే...
👉వచ్చినవారి కాళ్ళకి పసుపు రాయాలి.
👉కంఠానికి గంధం రాయాలి.
👉నుదుట బొట్టు పెట్టాలి.
👉తాంబూలం వగైరా... ఇవ్వాలి.

👉ఇవి లేకుండా శ్రావణమాసం నోములు వగైరా సాధ్యమా?

👉  ఈ పనులు ఈ కరోనా రోజుల్లో శ్రేయస్కరమా?

పేరంటం అయినా, ముత్తైదువ అయినా... ఇలా ఎవరైనా ఈ సంవత్సరానికి అన్నీ మీకు అమ్మవారు మాత్రమే.

దయచేసి - సంప్రదాయం అనే అక్కర తో అమాయకంగా - ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కరోనా వైరస్ వ్యాప్తి కి కారణం అవ్వద్దు.

👉పుణ్యం కోసం పోయి కరోనా (బహుశా) తెచ్చుకోవద్దు.

🙏అన్నీ తానే అయ్యి - ముత్తైదువ గా ఈ సంవత్సరం అమ్మవారు స్వయంగా మిమ్మల్ని కటాక్షిస్తోంది. దానికి సంతోషించండి
ఇరుగు-పొరుగు, చుట్టూ-పక్క, బంధువులు అంటూ ప్రతీ సంవత్సరం మనం చేసుకుంటున్న హడావుడి వల్ల - నిజానికి పూజ పై శ్రద్ధ తగ్గుతోంది అనేది వాస్తవం. కాబట్టి ... ఈ సంవత్సరం అటువంటి హడావుడి-అయోమయం లేకుండా అమ్మవారు కరుణిస్తోంది అనే సంతోషం తో పూజలు చేసుకోండి.
నైవేద్యాలు మీకు వీలైనట్టే చేసుకోండి.
ఒకవేళ ఏమీ చేసుకోలేకపోయినా - పళ్ళు, కొబ్బరికాయ తో సరిపెట్టుకోండి. తప్పేమీ లేదు.

హెచ్చరిక:--
పూజా సామగ్రి ఏమి తెచ్చుకున్నా.... (పువ్వులతో సహా....) సర్ఫ్ నీళ్లు లో కడిగి, మళ్లీ ఉప్పు కలిపిన మాములు నీళ్లలో కడుక్కుని- జాగ్రత్త పెట్టుకోండి.

కొసమెరుపు:- ఇంతలా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే.... వర్ష ఋతువు కాబట్టి - శ్రావణమాసం లో ఈగలు ఎక్కువగా ఉండచ్చు. మార్కెట్స్ లో మరీ ఎక్కువగా ఉంటాయి. అవి అనేకమంది ఉమ్మిన  కఫము-ఉమ్మి పై వాలి- ఆ తర్వాత పువ్వులతో సహా అన్నిటిపై వాలచ్చు కదా!!
అర్థమై ఉంటుంది. అనుకుంటున్నాము.
పైగా శ్రావణ, భాద్రపదాల్లో సాధారణ జలుబు, దగ్గులు అందరికీ వస్తాయి. అందరూ మార్కెట్స్ కి కూడా వస్తారు మరి!!

ఈ శ్రావణమాసం లో
ముందుజాగ్రత్త పడడం -
కుటుంబానికి శ్రేయస్కరం.

OPEN LETTER TO Hon. PM

OPEN LETTER  TO Hon. PM SHRI NARINDER DAMODDAR DASS MODI JI....
👉🏻
💥I am a senior citizen and on 01.08.2012, I put Rs 40 lakhs in a nationalized Bank for 5 years.
👉🏻I was being paid an amount of Rs. 35,352/- every month (of course subject to income tax) enabling me to lead a worry free life financially. Now on maturity I have reinvested the amount in the same Bank and I will be paid Rs. 26,489/-;
shortfall of Rs8863/-*
👉🏻i.e. 25% over the previous return, per month.
👉🏻Can you please advise me from where I should make good the loss or sacrifice consumption of medicines or atta or dals or vegetables or fruit or milk or what?
👉🏻Practically  government after taking over in 2014 has done nothing for senior citizens. No additional facilities extended but withdrawal of what existed in 2014. No commodity or provision item is available at the price of 2014. Yes you have been able to bring down the figures of inflation and indices but not the actual prices. 👉🏻Every off and on the prices of some essential daily use items go rocket high like dals, chana/besan, salt, onion and now the tomatoes. At that time we cannot even dare see those items. .........😨
I know you have political and the theoretical replies for these issues like interest on deposits and advances in banks depend on demand and supply. 👉🏻The prices of daily use items vary with seasons being agricultural products. But the straight upward shoot of prices cannot be justified by these reasons.
👉🏻If the government wants to provide cheaper credits to the trades and industries, it should not be at the cost of depositors.
👉🏻 Banks are sitting over volcanoes of NPAs and all good money is being diverted for bad money.
👉🏻But is it not the duty of the government to enable the senior citizens to lead a respectable life who have spent their golden years in serving various organizations and finally the nation? Government cannot see the other way.
👉🏻 I am at a loss to understand from where this deficit of 25% be met.
👉🏻Is any of the minister/MP/MLA is ready to cut his salary and allowances by this percentage?  😡If not, then why the public especially the senior citizens?
👉🏻Perhaps it is because that, like you - we do not have the power to fix our own salaries, allowances and perqs and getting everything for full year, for sessions of total of 3 months and that too attending sessions at their sweet will. When the matter of increasing your salaries comes, you pass the same just in 2 minutes with no discussion, with all heads together be it from ruling or opposition benches. For this increase,
👉🏻you totally over look the cost to the exchequer, deficit, economics and any other factor.
👉🏻The government had started a scheme for deposits of senior citizens and the rate was 9.20% but In July, 14 it was reduced to 8.3%; which further reduced to 7.4%  in May 2020 . Further the maximum ceiling of deposit has been limited to Rs 15 lakhs only. This is totally unjustified. The rate should be a minimum of 12% and the amount limit should be equal to what a person gets as terminal benefits.
👉🏻 The government should ensure financial respectability to the senior citizens to walk with their heads straight.
👉🏻I am sure you will understand the plight of the people whose good part of expenses comes from the interest of their savings of life time.
👉🏻Sorry if I have offended you in any way.
Thanks and Regards

-All Sr. Citizen members 🤔

శంకా సంకుచితాంతరంగులు కురుక్షేత్రంలో రాణించగలరా?

మూడు శతాబ్దులముందువరకు యావత్ప్రపంచానికి కావలసిన అన్నివస్తువులను తయారుచేసిఇచ్చిన భారతదేశం ఈనాడు తమప్రజలకు అవసరమైన వస్తువులు తయారుచేసుకోలేదా?నిజంగానే భారతజాతి స్థితి ఇంతగా దిగజారిందా?

 నేడు సగటుభారతీయుడు కురుక్షేత్రంలో అడుగుపెట్టిన అర్జునుడులా ఉన్నాడు. తన రక్తంలో, తన సంప్రదాయంలో, తన దేశపు కళలలో, తనదైన సాహిత్యంలో ఏమిఉన్నదో అది స్ఫురించటంలేదు. మనం తీసుకొనే చర్యలకు పాపం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ల వాళ్ళేమైపోతారో అనిబాధపడిపోతున్నాడు. చైనావాళ్ళెక్కడ రెచ్చిపోతారో అని భయపడి పోతున్నాడు.

 మన దగ్గర ముడిసరుకులు వట్టిపోలేదు. పంటలు పండించే చేవ తగ్గిపోలేదు. రకరకాల వస్తువుల ఉత్పాదన చేసే సామర్థ్యం నశించిపోలేదు. అయినా ఎందుకు అయోమయ స్థితి?

  కొన్నిదశాబ్దాలుగా విదేశీవస్తువులు మేలైనవని, దిగుమతిఅయిన వస్తువులు వాడటంద్వారా గొప్పతనం ప్రదర్శించుకోవచ్చునని మనకు నాటి మన పాలకులు మప్పినారు. గాంధీవారసుల మని ప్రకటించటం కోసమే ఖద్దరు, అంతకుమించి ఖద్దరు, చేనేత వస్త్రాలపై ప్రేమలేదు. మనదేశంలోని కోట్లాదిప్రజలకు భుక్తి సమకూర్చేమార్గమన్న స్పృహలేదు. అన్నివస్తువుల విషయంలోనూ వారికి ఏవిధమైన స్పృహా లేదు.  ఉన్నదల్లా ఏమేరకు కమీషన్లు లభించగలవనే లెక్కలే !

దశాబ్దాలుగా సైన్యానికి ఆయుధాలు ఇవ్వలేదు. తూటాలు ఇవ్వలేదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వలేదు. రోడ్లువేయలేదు, వాహనాలు సమకూర్చలేదు. ప్రజలకునేర్పినది ఒక్కటే.. ఎవడు ఎక్కువ పైసలిస్తాడో, ఎవడు వాగ్దానాల పంచరత్నాలు గుప్పిస్తాడో, ఎవడు త్రాగబోస్తాడో వాడికి వోటువేయటం.

ఆంగ్లమాధ్యమం ఇంజినీరింగ్ చదువులద్వారా గొప్ప సర్టిఫికెట్ లు చేతికివచ్చాయి. కౌశలాలు, నైపుణ్యాలు నేర్పవలసినతీరులో నేర్పలేదు.  నాటకాలు సాగిపోయాయి. కాలేజీ పెట్టటమంటే భవనాలు మాత్రమేనా? రీ ఇంబర్స్ మెంట్ ఉంటే సరిపోయిందా? పాఠాలుచెప్పి నైపుణ్యాల నలవరిచే ఉపాధ్యాయులు, ఆచార్యులూ ఉండనక్కరలేదా? ఇన్ స్పెక్ షన్ వేళకు ఎక్కడినుండో తెచ్చిన వారిని నిలబెడతారు. ఈ తీరున ప్రతిచోటా నాటకాలే నడిచాయి.

 వీటిలోంచి తయారైవచ్చినవారికి మనదేశాన్ని మనం రక్షించుకోగలమని, మన ప్రజలను మనం పోషించుకోగలమని, మనం ఎవరినీ ప్రాధేయపడ నక్కరలేదనీ విశ్వాసంకల్పించగలమా?  ఇదే నేటి సమస్య.

విశ్వాసాన్ని- ఆత్మవిశ్వాసాన్ని మేల్కల్పటం, సంకల్పాన్ని దృఢతరంచేయటం,  మన సామర్థ్యాలను గుర్తుతెచ్చుకొని కర్తవ్యోన్ముఖులం కావటం, విదేశీ ఏజెంట్లు అలవాటు చేసిన తేనెపూసిన విషపదార్థాలను ఏమాత్రం మోమోటమిలేకుండా తిరస్కరించటం - ఇదే ఇప్పుడు చేయవలసినపని , అనుసరించవలసిన నీతి.

  ఈ సందిగ్ధ వాతావరణంలో వందేళ్ళక్రితం గురుదేవ రవీంద్రనాథ్ ఠాకూర్ చెప్పినమాట గుర్తువస్తున్నది. భారతదేశంలో అక్షరాస్యులు ఇరవై శాతమేకాగా నూరుశాతం విద్యావంతులే! అదెలాగా? ఇక్కడి ప్రజలందరికీ తాము మాట్లాడే తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, గుజరాతీ వంటి భాషలేగాక మరో భాషకూడా తెలుసు. అది రామాయణ మహాభారతాల భాష. అది సందేహాలను తీరుస్తుంది విశ్వాసాన్ని అందిస్తుంది, కర్తవ్యం తెలియజేస్తుంది.

ప్రతిభారతీయుడూ వ్యాసమహర్షి రచించిన మహాభారతం నుండి అందులోని ప్రముఖపాత్రలైన శ్రీ కృష్ణార్జునులనుండి ప్రేరణ పొందగల అవకాశం ఉంది.  మహాభారతం ఒక నవల మాత్రమేకాదు. జీవితంలో ఎలా పోరాడుతూ ముందుకు సాగాలో, విజయాన్ని ఎలా కైవసం చేసికోవాలో, తనమార్గంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలియజెప్పే అనుభవాల సమాహారం.

 శ్రీ కృష్ణుని మార్గదర్శనంలో ముందడుగువేసిన విజయునిలా నేడు మనకు లభిస్తున్న సందేశాన్ని గ్రహించుకొని  ధనుర్ధారులమై విజయపథంలో ముందుకు సాగుదాం.

 వీర భారతభూమి నావిర్భవించి
పౌరుషములేని బానిస బ్రతుకు లేల?
 ఈ అయోమయ శృంఖలా లింకనైన
త్రెంచుకొని బయల్పడి విజృంభించరేల?
  (కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి  గారి విజయశ్రీ నుండి)

స్వర్గమా.... భగవత్ అనుగ్రహమైన మోక్షమా

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే

స్వర్గలోకముల వుండే సుఖభోగములు తాత్కాలికమైనవని, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అక్కడికి పంపించబడిన జీవులకు, స్వర్గ లోక భోగములు అనుభవించిన తరువాత వారి పుణ్యం అంతా ఖర్చయిపోతుంది, అప్పుడు వారు, తిరిగి భూలోకానికి పంపించబడుతారు. ఈ విధంగా స్వర్గాది లోకములు పొందినా కూడా, దాని వల్ల ఆత్మ యొక్క సనాతన అన్వేషణ నెరవేరదు. మనందరమూ అనంతమైన పూర్వ జన్మలలో ఎన్నో సార్లు అక్కడికి వెళ్లి వచ్చాము, కానీ అనంతమైన ఆనందము కోసము ఆత్మ కున్న కోరిక తీరలేదు. అన్ని వైదిక శాస్త్రాలు ఈ విశ్వాసాన్ని బలపరుస్తున్నాయి.

తావత్ ప్రమోదతే స్వర్గే యావత్ పుణ్యం సమాప్యతే
క్షీణ పుణ్యః పతత్యర్వాగనిచ్ఛన్ కాల-చలితః (భాగవతం 11.20.26)

"స్వర్గ లోకాల్లో నివసించేవారు తమ పుణ్యఫలము అయిపోయేంత వరకు దేవతా భోగాలను అనుభవిస్తారు. ఆ తరువాత వారు కాలక్రమంలో తమకు ఇష్టం లేకపోయినా క్రింది లోకాలకు నెట్టివేయ బడుతారు."

స్వర్గహు స్వల్ప అంత దుఖదాఈ (రామాయణం)

"స్వర్గ ప్రాప్తి అనేది తాత్కాలికమైనది మరియు తర్వాత దుఖాలను తెచ్చేది."

ఎలాగైతే ఫుట్బాల్ బంతి, మైదానం అంతటా ఒక చోటి నుండి ఇంకో చోటికి తన్నబడుతుందో, మాయ అనేది, జీవాత్మను, భగవత్ విముఖం అవటం చేత అలాగే తన్నుతున్నది. కొన్ని సార్లు నిమ్న లోకాలకు వెళుతోంది, కొన్నిసార్లు ఉన్నత లోకాలకు వెళుతుంది. ఈ క్రింది మరియు పై లోకాల్లో తనకు లభించిన ఈ బహు విధములైన రూపములలో కేవలం మానవ రూపం మాత్రమే భగవత్ప్రాప్తికి అవకాశం కల్పిస్తుంది. అందుకే దేవతలు కూడా మానవ జన్మ కోసమే పరితపిస్తుంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. దీనితో వారు స్వర్గ లోకానికి వెళ్ళిన తప్పుని సరిదిద్దుకుని, ఈ సారి భగవత్ ప్రాప్తికై ప్రయత్నిద్దామనుకుంటారు.

దుర్లభం మానుషం జన్మ ప్రార్థయతే త్రిదశైరపి (నారద పురాణం)

"మనుష్య రూపంలో జన్మ చాలా చాలా అరుదు (దుర్లభము). దేవతలు కూడా దీన్ని కాంక్షిస్తారు." అందుకే శ్రీ రామ చంద్రుడు కూడా అయోధ్యావాసులకి ఇలా ఉపదేశం ఇచ్చాడు.

బడే భాగ మానుష తను పావా, సుర దుర్లభ సబ గ్రంథంహి గావా (రామాయణం)

"ఓ అయోధ్యావాసులారా, మీరందరూ మానవ జన్మ లభించినందుకు ఏంతో ఏంతో అదృష్ట వంతులు, ఇది చాలా చాలా దుర్లభమైనది మరియు స్వర్గ లోకవాసులు కూడా కోరుకునేది." 

దేవతలే ఈ మానవ జన్మను ఇంతగా కోరుకుంటున్నప్పుడు మరి ఇక మనం మాత్రం ఆ స్వర్గ లోకాలని కోరుకోవటం ఏమి ప్రయోజనం? అందుకే, మనం పరమేశ్వరుడి పై భక్తి ద్వారా భగవత్ ప్రాప్తి కై నిమగ్నమవ్వాలి.

షాదీ కరోనా

పెళ్లి తప్పేట్టు లేదు పెదబాబుకి.  ‘కరోనా వెళ్ళేదాకా కాస్త ఆగరా’  అంటే “ఇది జీవితాంతం ఉండే వైరసు! అంటే లైఫులో నాకు పెళ్లి చెయ్యరా?”  తిక్క రేగింది వాడికి. “సరే తగలడు.  ఎవరెవర్ని పిలవాలో లిస్టు తయారు చెయ్యండి.  ఇరవై మందికే పర్మిషనట!” అన్నాడు పెద్దాయన.  “ఇదిగో చెల్లి పెళ్ళప్పటి  లిస్టు. ఇందులో ఏడువందల ఎనభై రెండు పేర్లున్నాయి  మరి!” 

“చచ్చేం! పేర్లన్నీ కొట్టెయ్యండి. దయాదాక్షిణ్యాలు లేవు, బంధుత్వాబంధుత్వాలు లేవు, ప్రతిష్టాఅప్రదిష్ఠలు లేవు!” అన్నాడు పెద్దాయన ఆవేశంగా.   అలాగే  కొట్టేసుకుంటూ పోతే పంతొమ్మిది  మంది తేలేరు. “ఇంతకుమించి  చచ్చినా  తగ్గరు!”  
“గుడ్. పెళ్లి కూతురు ఒక్కత్తినీ పంపించమని వియ్యంకుడికి ఫోన్ కొడదాం. దాంతో ఇరవై మంది అవుతారు.” 

“బావుంది సంబడం! పెళ్ళికూతురొక్కత్తినీ పంపిస్తే మరి ఎవరి బాబొచ్చి చేస్తాడండీ కన్యాదానం?” వియ్యంకుడు ఎగిరి పడ్డాడు.  
“అవును కదా, సరే మీ మొగుడూ పెళ్లాలిద్దరూ కూడా రండి, ఆవార మేం ఇద్దరిని తగ్గించుకుంటాం మా లిస్టులో! ఇంతకీ  పురోహితుణ్ణి మీరు తెస్తున్నారుగా?”    
“లేదు లేదు మీరే తేవాలి.”  “అయినా  ‘మాంగల్యం తంతునా నేనా’ మనకందరికీ నోటి కొచ్చిందే కదా. అది చదివేసి  పుస్తి కట్టించేస్తే పోలా? సుమతీ శతకం చదివేసి  మావాడొకడు పెళ్లిళ్లు చేయించేస్తున్నాడు. వాళ్ళంతా  పిల్లాపాపలతో సుఖంగా కాపరాలు చేసుకుంటున్నారు!”

“ఓకే. మరి భజంత్రీలో?”
“భజంత్రీలు? బహువచనం కూడానా?  ‘భజంత్రీ’.. అనండి. ఒకాయనే వస్తాడు.  ఆయనే నోటితో తూతూబాకా వాయిస్తూ  రెండు చేతుల్తో డోలు వాయిస్తాడు!”

 “అన్నట్టు  వీడియో వాళ్ళు నలుగురొస్తారట.” గుర్తు చేసాడు పెదబాబు.  “చాల్చాలు. వొడిలిపోయి, వాడిపోయిన మన మొహాలకు వీడియోలు కూడానా?  చినబాబు  వాడి కెమెరాతో ఫుటోలు తీస్తాడు చాలు..”   

“మరిచిపోయా బావగారూ. వాళ్ళక్క పెళ్ళిలో జడ తనే పైకెత్తి పట్టుకోవాలని మా చంటిది   ఎప్పట్నుంచో రిహార్సల్సు వేసుకుంటోంది. దాన్ని రావద్దంటే చంపేస్తుంది. ఇంకో విషయం.  పెళ్ళికూతురికి  చీర కట్టుకోడం రాదు. దానివన్నీ  చుడీదార్లే కదా. చీర కట్టడానికి, పీటల మీద  అది జారిపోకుండా చూసుకోడానికీ   మా మరదలు దగ్గరుండాల్సిందే. అలాగే పెట్టి దగ్గర కూర్చుని సామాను అందించడానికి, పిల్లని బుట్టలో తేవడానికి ముగ్గురు బావమరుదులు   తప్పదు!” అన్నాడు వియ్యంకుడు. 
“బుట్ట సిస్టం కాన్సిలండీ. పిల్లని నడిచి రమ్మనండి. పెళ్లి మండపం దూరవేం  కాదు.”

 “అంటే మరో తొమ్మిది  మందిని కొట్టెయ్యాలి మా లిస్టులో!  బావుంది. ఇలా మీరు  పదహారు అక్షౌణీల సైన్యాన్ని యుద్ధానికి తెచ్చినట్టు తెస్తే మేం ఏమైపోవాలి?  మా వాళ్ళని ఎంతమందిని తెగ్గోయాలి? మా కొంపలోనే పదిమంది ఉన్నామాయె!”  “ఎందుకుండరూ? కుటుంబ నియంత్రణాపరేషను చేయించుకోమని అప్పట్లో ఎన్నిసార్లు బతిమాలేరు మా వాళ్ళు! వినిపించుకున్నారా?” వంటింట్లోంచి పలికిందో  స్త్రీ స్వరం.     

“నాన్నా! మరి  భోజనాలు?”  
“ఔన్రోయ్ మరిచిపోయాం.  కేటరింగ్ వాళ్ళు నలుగురొస్తారట. వాళ్ళని తగ్గిస్తే తిండుండదు ఎవరికీ.  ఓర్నాయనో! అవతల ఆడ పెళ్ళివాళ్ళు, ఇవతల వీళ్ళు!  ఎవరి పేర్లు కొట్టెయ్యాలిరా?  ఈ పెళ్లి  నా వల్ల కాదు!  గంగలో దూకండి అంతా!” 

పోనీ, ఇరవై కంటే ఎక్కువమందిని తెచ్చుకోడానికి మనిషికి ఇంత చొప్పున పెనాల్టీ కట్టేద్దామా గవర్నమెంటుకి? సగం సగం భరిద్దాం మీరూ మేమూ.”   
“చాల్చాలు. ఇప్పటికే మాస్కులూ, సబ్బులూ, తువ్వాళ్ళూ  అంటూ చాలా పెనాల్టీలు వేశారు మా మీద. ఇక మా వల్ల కాదు.” వియ్యంకుడి జవాబు. 

“నాన్నా,  అరమొహం మాస్కులతో,  వైరస్ భయాలతో, రాని చుట్టాలతో ఈ పెళ్లి ఏం కళ కడుతుంది?  వాయిదా వెయ్యండి. ఈలోగా ఆ పిల్లని పంపించమనండి. అందాకా సహజీవనం చేస్తాం!” 

“డొక్క చీరేస్తా వెధవా!   రిజిస్టర్ మ్యారేజ్  చేసుకు తగలడండి! పోండి!”

శివుడికి రూపం తలక్రిందులుగా ఉన్న దేవాలయం

ఈ భూ ప్రపంచంలోనే శివుడికి రూపం ఉండి, తలక్రిందులుగా ఉన్న ఏకైక దేవాలయం.

ఈ ప్రపంచంలో ఎక్కడైనా శివుడిని పూజించేది ఒక్క శివలింగ రూపంలోనే !. శివలింగ రూపంలో కాకుండా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఒక క్షేత్రం ఉందని ఎవరికైనా తెలుసా! అంతే కాకుండా ఆ గుడిలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిచ్చి భక్తులచే పూజింపబడతాడు. ఆ పుణ్యక్షేత్రం ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయం పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంకు కేవలం 5 కి.మీ దూరంలో ఉండటం విశేషం.ఈ ప్రపంచంలో ఎక్కడైనా శివుడిని పూజించేది ఒక్క శివలింగ రూపంలోనే !. శివలింగ రూపంలో కాకుండా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఒక క్షేత్రం ఉందని ఎవరికైనా తెలుసా! అంతే కాకుండా ఆ గుడిలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిచ్చి భక్తులచే పూజింపబడతాడు. ఆ పుణ్యక్షేత్రం ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయం పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంకు కేవలం 5 కి.మీ దూరంలో ఉండటం విశేషం.
 ఈ ప్రపంచంలో ఎక్కడైనా శివుడిని పూజించేది ఒక్క శివలింగ రూపంలోనే !. శివలింగ రూపంలో కాకుండా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఒక క్షేత్రం ఉందని ఎవరికైనా తెలుసా! అంతే కాకుండా ఆ గుడిలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిచ్చి భక్తులచే పూజింపబడతాడు. ఆ పుణ్యక్షేత్రం ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయం పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంకు కేవలం 5 కి.మీ దూరంలో ఉండటం విశేషం. ప్రపంచంలో ఎక్కడైనా శివుడిని పూజించేది ఒక్క శివలింగ రూపంలోనే !. శివలింగ రూపంలో కాకుండా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఒక క్షేత్రం ఉందని ఎవరికైనా తెలుసా! అంతే కాకుండా ఆ గుడిలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిచ్చి భక్తులచే పూజింపబడతాడు. ఆ పుణ్యక్షేత్రం ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయం పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంకు కేవలం 5 కి.మీ దూరంలో ఉండటం విశేషం.

ఈ ఆలయం యొక్క విశిష్టత :
ఈ గ్రామంలో వెలసిన శక్తీశ్వరాలయం చాలా విశిష్టమైనది. ఇక్కడ శివుడు శీర్షాసన భంగిమలో విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. శక్తి పీఠంలో శివుడు, పార్వతిదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ముగ్గురు కలసి ఏకపీఠం మీద ఉండటం ఇక్కడి విశిష్టత. అలాగే పార్వతి దేవి మూడు నెలల పసికందు అయిన బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామినీ ఒడిలో లాలిస్తూ కొలువై ఉండటం మరో ప్రత్యేకత….

శివుడు తలక్రిందులుగా కొలువై ఉండటానికి గల కారణం:
యముడు పాలిస్తున్న రాజ్యంలో శంబురా అనే రాక్షసుడు ప్రజలను, మునులను చాలా ఇబ్బంది పెడుతుంటాడు. ఈ ఇబ్బందులు పడలేక ప్రజలు, మునులు ఈ రాక్షసుడిని ఒక్క యముడు మాత్రమే చంపగలడు అని యముడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్నీ చెబుతారు. శంబురా రాక్షసుడితో ఇంతకు ముందే యుద్ధంలో ఓడిపోయిన యముడు మరొక సారి అతనితో పోరాడే శక్తి నివ్వమని శివుడికి తపస్సు చేస్తాడు. ఆ సమయంలో శివుడు లోకకళ్యాణం కోసం తీవ్ర తపస్సులో ఉంటాడు. దానితో యముని తపస్సు చూసి పార్వతి దేవి ప్రత్యక్షం అవుతుంది. యముడు జరిగిన విషయాన్ని పార్వతి దేవికి చెబుతాడు. అప్పుడు పార్వతి యమధర్మరాజుకు ఒక ఆయుధాన్ని ఇవ్వడం తో శంబురా రాక్షసుడిని చంపుతాడు… దానితో ఆ రాక్షసుడి నుండి ప్రజలకు విముక్తి కలుగుతుంది. అప్పటి నుండి ఆ ప్రాంతానికి యమపురి గా పేరు వచ్చింది కాల క్రమేణా అది యనమదుర్రు గా మారిపోయింది.


శంబురా రాక్షసుడు చనిపోయినా యమపురికి భవిష్యత్తులో ఎటువంటి ఆపద రాకుండా అక్కడే ఉండాలని యముడు శివుడిని మరొక సారి ప్రార్దిస్తాడు. అప్పటికి ఇంకా తపస్సులోనే ఉన్న శివుడు అదే రూపంలొ కుటుంబ సమేతముగా యమపురిలో వెలిసాడని ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న కథ. ఈ గుడిలోకి వెళితే దీర్ఘకాలరోగాలు నయం అవుతాయని స్థలపురాణంలో పేర్కొన్నారు.

కరోనా ప్రాణాంతకమైనది కాదు

డా.శివ అయ్యాదొరై lndian American Scientist

కరోనా అనేది అతి సాధారణమైన జలుబు, జ్వరం లాంటి చిన్న జబ్బు. కొందరి స్వార్థం కోసం దీన్ని పెద్ద భూతాన్ని చేసి, భూతద్దంలో చూపిస్తున్నారు. ఇతర జబ్బులు ఏమీ లేకుండా,ఒక ఆరోగ్యవంతుడు కేవలం ఈ వైరస్ సోకి చనిపోయిన కేసు ఒక్కటి కూడా లేదు. జబ్బుకంటే భయంతోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా పాజిటివ్ అని తెలియగానే చాలామంది ఇక చావు తప్పదని వణికిపోతున్నారు. భయం వల్ల స్ట్రెస్ విపరీతంగా పెరిగి శరీరంలో ఇమ్యూన్ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. లక్షలాది మంది చాలా తేలికగా దీని నుంచి బయటపడుతున్నారు. కోవిడ్ పట్ల అవగాహన పెంచుకుని ధైర్యంగా ఉంటే వారిలో మనం కూడా తప్పకుండా ఉంటాం. కేవలం వయసుపైబడిన, రిస్క్ ఉన్నవారి మీద దృష్టి పెట్టి (మన దేశంలో వృద్ధుల సంఖ్య పది శాతానికి మించి లేదు), ప్రభుత్వం వారిని కాపాడడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే రిస్క్ గ్రూప్ లో కూడా మరణాలు చాలా తగ్గించే అవకాశం ఉండేది. కానీ మనవి పెట్టుబడిదారీ ప్రభుత్వాలు కదా వాళ్ళ కోసమే పనిచేస్తాయి. మనకోసం కాదు. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి

అవగాహన, ధైర్యానికి మించిన ఆయుధం లేదు!
          (మిత్రుని వాల్ నుండి) కరోనాకు భయపడకండి...
 బోగస్ ప్రచారాలు నమ్మకండి...

ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలు తగలెయ్యకండి.. ఇది పూర్తిగా చదవండి కరోనా చికిత్స పై ఒక ప్రాథమిక అవగాహన కోసం ఈ పోస్ట్.
  కరోనాకు భయపడకండి.     
కరోనా వచ్చింది అనగానే వారిని అంటరాని వారిగానో, ఎదో తప్పు చేసినా వారిగా చూడకండి. ఇది ఒక మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రకాల వారికి వస్తుంది.

కరోనా వచ్చిన వారు first ధైర్యంగా ఉండాలి.
Covid positive వచ్చిన వారికి ఇచ్చే, మెడిసిన్స్
* ప్యారసిటమాల్-500mg టాబ్లెట్స్,
* B-Complex,
* C Vitamin Tablets,
* Citrizen Tab,
* Ambroxel syrup (దగ్గు ఉన్న వారికి మాత్రమే.)

డాక్టర్ల సూచన మేరకు మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత రోజుకు రెండు సార్లు paracetamol ట్యాబ్లేట్లు మూడు రోజులు వాడాలి. పొడి దగ్గు ఉంటే  దగ్గు సిరప్ ను ఉదయం 5ml, రాత్రి 5ml మూడురోజులు పాటు వాడాలి. రోజుకు ఒకటి B- complex tablet, ఒకటి C-Vitamin tablet మధ్యాహ్నం భోజనం తర్వాత వారం రోజుల పాటు ఇస్తారు.
 మెడిసిన్ తో పాటు  పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే. తప్పనిసరిగా వేడి నీళ్లు తాగడం. రోజు ఉదయం, సాయంత్రం వేడి నీళ్లలో జండుబామ్ కానీ, పసుపు కానీ వేసుకొని ఆవిరి పట్టడం. రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగడం. రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు గొంతులో పోసుకొని gargling చేయడం (ఉక్కిలించడం). రాత్రి భోజనం అనంతరం పడుకునే ముందు సగం గ్లాసు పాలల్లో కొంచం పసుపు, నాలుగు మిరియాలు దంచి పొడి చేసుకొని పాలల్లో కలిపి తాగడం.
''వీటన్నిటినీ  వారం రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం వలన వారం రోజుల్లోనే  సాధారణ స్ధితికి వచ్చేస్తారు."
వీటికి తోడు మంచి ప్రొటీన్ ఫుడ్, రోజుకు రెండు మధ్యాహ్నం, రాత్రి భోజనంతో ఉడకబెట్టిన కోడిగుడ్డు తినాలి. C-vitamin ఉన్న ఫ్రూట్స్ ఆపిల్, బత్తాయి, Orange వంటి పండ్లు ఎక్కువగా తినాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తింటే కరోనా వచ్చిన వారు వారం రోజుల్లో సాధారణ స్థితికి వచేస్తారు.

కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో నుంచి మరో వ్యక్తికి వ్యాపించే సమయం 7 రోజులు మాత్రమే నని, 7 రోజుల తర్వాత వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే శక్తి కోల్పోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక మనిషి శరీరంలోకి చేరిన కరోనా వైరస్ 10 నుంచి 12 రోజులకంటే ఎక్కువగా జీవించి ఉండదని, మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకుంటే 7 నుంచి 10 రోజుల్లోనే కరోనాను జయించిన వారు ఉన్నారు, తప్పని సరిగా తాగే నీళ్లు వేడి నీళ్లు తాగడం, ఉదయం, సాయంత్రం వాకింగ్ కానీ, యోగ కానీ చేస్తే నాలుగు, ఐదు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తారు.

అలాగే ఉదయం, సాయంత్రం "మిరియాలు, దాచిన్ చెక్క, సొంటి, ధనియాలతో " చేసిన powder ను వేడినీళ్లలో వేసి టీ-లాగా మగ్గబెట్టి అందులో కొంచం బెల్లం వేసి ఉదయం ఒక టీ సాయంత్రం ఒక టి చాలు.

కరోనా వచ్చింది అనగానే చుట్టు పక్కల వారు వారిని చూసి ఎదో మాయ రోగం వచ్చింది అన్నట్టుగా చూడడం మానేయండి. కరోనా కూడా ఇతర వ్యాధుల లాంటిదే. మలేరియా, టైఫాడ్ వంటిదే. ఎవరూ వర్రీ కావద్దు. కాక పోతే జాగ్రత్తలు మాత్రం తప్పని సరిగా పాటించండి. ఈ వైరస్ మనిషి శరీరంలో  గరిష్టంగా 14 రోజులకు మించి ఉండదని, ఆ తర్వాత అది నశించిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి 15 రోజుల పాటు హోమ్ క్వరెంటైన్ కానీ, హాస్పిటల్ క్వరెంటైన్ కానీ పాటించాలి. ఈ 14 రోజుల్లో మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ తీసుకుంటే కరోనా ఖతం  మందులు, ఆహారం తీసుకుంటే చాలు అని చెబుతున్నారు.
 కరోనా రాకుండా సామాజిక దూరం పాటిద్దాం మస్కులు దరిద్దాం😷

రామాయణమ్ 7.


...
యజ్ఞము పరిసమాప్తమయ్యింది, సరిగ్గా పన్నెండు మాసాలకు మరల వసంతం వచ్చింది! దశరధమహారాజు జీవితములో ఈ వసంతం ఒక్క కొత్తశోభ తెచ్చింది . మోడువారిన జీవిత ఆశ చిగుర్చింది.
దశరధుడి మనోరధం నెరవేరింది!
 .
చైత్రమాసంలో నవమి తిధి ,పునర్వసు నక్షత్రం , అయిదు గ్రహాలు తమతమ ఉచ్ఛస్థితిలో ఉండగా! .
.
అప్పుడు రవి మేషంలో ఉన్నాడు
కుజుడు మకరంలో ఉన్నాడు
గురుడు కర్కాటకంలో ఉన్నాడు
శుక్రుడు మీనంలో ఉన్నాడు
శని తులా రాశిలో ఉన్నాడు
ఆయా రాశులన్నీ కూడా ఆయా గ్రహాలకు ఉచ్ఛస్థానాలు!.
చంద్రుడు స్వస్థానమైన కర్కాటకంలో ఉన్నాడప్పుడు!
 అంటే పునర్వసు నాల్గవపాదం! అన్నమాట!
గురుచంద్రయోగం సంభవించింది!
లగ్నముకూడా కర్కాటకమే!
ఆ శుభలగ్నమందు కౌసల్య జగత్కల్యాణ కారకుడు,జగన్నాధుడు,ఇక్ష్వాకు వంశ వర్ధనుడు అయిన శ్రీ రామచంద్రుని పుత్రునిగా కన్నది!..
.
శ్రీ రామ జననమయిన పదహారు గంటల తరువాత  భరతుడు మీనలగ్నంలో కైకేయికి జన్మించాడు !ఆయన నక్షత్రం పుష్యమి!
.
ఆ తరువాత మధ్యాహ్న కాలంలో కర్కాటక లగ్నంలో ఆశ్లేషా నక్షత్రంలో లక్ష్మణ,శత్రుఘ్నులకు జన్మనిచ్చింది సుమిత్ర!
.
రాజ్యమంతా కోలాహలం ,ఉత్సవాలు ,సంబరాలు ,రాజు ఇచ్చే భూరిదానాలతో పదకొండురోజులు గడిచినాయి! .
.
పదకొండవరోజున నవజాతశిశువులకు నామకరణం జరిగింది.
.
ఆయన పుట్టి దశరధుడికి మహదానందం కలుగచేశాడు జనులందరికీ సంతోషం కలుగచేశాడు!
ఎవనియందయితే సర్వజనులకు ఆనందం కలుగుతుందో! అతడే రాముడు ,రమింపచేయువాడు అని అర్ధం పెద్ద కుమారుడికి "రాముడు " అని పేరు పెట్టారు వసిష్ఠ మహర్షి!.
.
సంపద,శోభ కలవాడు కావున లక్ష్మణుడు !
.
రాజ్యమును భరించువాడు కావున భరతుడు!
.
శత్రువులకు సింహస్వప్నము ,వారిని చంపువాడు కావున శత్రుఘ్నుడు! .
.
నలుగురు కుమారులను చూసుకొని దశరధుడు మురిసిపోతున్నాడు ఆయన ఆనందానికి అవధులు లేవు.
రాముడంటే మరీ! ఆయన అన్నిప్రాణాలూ రాముడే!
..

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

ధర్మధ్వజం
హిందు చైతన్య వేదిక

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 3 🌹


 📚. ప్రసాద్ భరద్వాజ

ఇప్పుడు మనం చూస్తున్న విపరీత పరిమాణాలు, దుర్ఘటనలు, ఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల కిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో జన్మిచారు. ఆయన ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు- అనే విషయాలపైన వాదోపవాదాలు వున్నాయి.

ఏదేమయినా క్రీస్తు శకం 1600 – 1610 మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చని కొందరి అంచనా. పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెబుతారు. అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్య సూచికగా అత్యధికశాతం హిందువులు నమ్ముతారు.

కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు ‘నీవెవరివి?’ అని శ్రీ కృష్ణుడిని ప్రశ్నించినపుడు “సర్వ శక్తిమంతుడైన కాలుడను నేను” అని జవాబిచ్చాడు. కాలుడు సమస్త చరాచర జగత్తును కబళించగలిగిన, సృష్టించగలిగిన శక్తి వున్నవాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు కాలుని అధీనంలోనే ఉంటాయి!

సృష్టి మొత్తం కాలం అధీనంలోనే వుంటుంది. కేవలం మహాజ్ఞానులకు, యోగులకు మాత్రమే కాల పురుషుని గురించిన జ్ఞానం వుంటుంది. అటువంటి మహాత్ముడు యోగి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి.

అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికే అత్యధికులకు అనుసరణీయంగా వుంటోంది.

సశేషం...

అన్నపూర్ణే

అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే |
జ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్షాం దేహి చ పార్వతీ ‖

మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః |
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్

సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తుతే

సృష్టి క్రమం

ప్రలంబ ముష్టికంచై ఏవ మత్స్యకూర్మో... అని సృష్టి పరిణామం. శక్తి నాలుగు లంబకోణములుగా. దీనినే ప్రేరేయత్  తస్య యత్ భః గ తత్ వహి ఏ తత్ అణీయం ఉపాస్మహే. వకే లంబ కోణం నాలుగు దిక్కులకు శక్తిని సమాంతరంగా విభజించి వ్యాప్తి చెందినది. అది ప్రథమంగా రెండుగా అనగా తూర్పు పడమరగా ఆ తరువాత ఉత్తర దక్షిణంగా అనగా యీ దిక్కులు కూడా భూమియేఆధారముగా. అదే గాయత్రి ఉపాసన శక్తి ఉపాసన గా సమస్త జగత్తును తెలియుటే జ్ఞానము అదియే మెూక్షమని తెలియును. నిజంగా అణు  శక్తి వక సూత్ర ప్రకారము చైతన్యము వలననే ప్రకృతి. అది ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ సృష్టి చేయరాదు. అటుపైన సర్వం వినాశనం. అసలు అది వక పరమార్థం గురించి చేయబడినది. యిది తెలుసుకొనుట యే ఙ్ఞానం మెూక్షం అనితెలియుచున్నది.


మన్వంతరముల వర్ణనము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము

ఓం నమో భగవతే వాసుదేవాయ

రాజోవాచ

1.1 (ప్రథమ శ్లోకము)

స్వాయంభువస్యేహ గురో వంశోఽయం విస్తరాచ్ఛ్రుతః |

యత్ర విశ్వసృజాం సర్గో మనూనన్యాన్ వదస్వ నః॥6326॥

పరీక్షిన్మహారాజు అడిగెను- గురుదేవా! స్వాయంభువ మనువుయొక్క వంశ విస్తృతిని గూర్చి నేను వింటిని. అదే వంశమునందు అతని కుమార్తెల ద్వారా మరీచి మొదలగు ప్రజాపతులను తమవంశ పరంపరను కొనసాగించిరి. ఇప్పుడు ఇతర మనువులను గురుంచి వర్ణింపుడు.

1.2 (రెండవ శ్లోకము)

యత్ర యత్ర హరేర్జన్మ కర్మాణి చ మహీయసః|

గృణంతి కవయో బ్రహ్మంస్తాని నో వద శృణ్వతామ్॥6327॥

మహాత్మా! జ్ఞానులు ఏయే మన్వంతరములలో మహిమాన్వితుడైన భగవంతుని యొక్క అవతారములను, లీలలను వర్ణించిరో, వాటిని నాకు తప్పక వినిపింపుము. నేను శ్రద్ధగా వాటిని వినగోరుచున్నాను.

1.3 (మూడవ శ్లోకము)

యద్యస్మిన్నంతరే బ్రహ్మన్ భగవాన్ విశ్వభావనః|

కృతవాన్ కురుతే కర్తా హ్యతీతేఽనాగతేఽద్య వా॥6328॥

జగత్పతియైన శ్రీహరి గడచిన మన్వంతరములలో చేసిన, వర్తమానమునందు చేయుచున్న, భవిష్యన్మన్వంతరములలో చేయబోవు లీలలను వినిపింపుము.

ఋషిరువాచ

1.4 (నాలుగవ శ్లోకము)

మనవోఽస్మిన్ వ్యతీతాః షట్ కల్పే స్వాయంభువాదయః|

ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సంభవః॥6329॥

శ్రీశుకుడు వచించెను మహారాజా! ఈ కల్పమునందు స్వాయంభువుడు మున్నగు ఆరుగురు మనువుల యొక్క మన్వంతరములు గడచిపోయెను. వాటిలో మొదటి మన్వంతరమును గూర్చి నేను వర్ణించితిని. అందులో దేవతలు మొదలగు వారి యొక్క ఉత్పత్తి జరిగినది.

1.5 (ఐదవ శ్లోకము)

ఆకూత్యాం దేవహూత్యాం చ దుహిత్రోస్తస్య వై మనోః|

ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రతాం గతః॥6330॥

స్వాయంభువమనువు కుమార్తెయైన ఆకూతియందు యజ్ఞపురుషుని రూపములో భగవానుడు జన్మించి, ధర్మములను  ఉపదేశించెను. అట్లే దేవహూతియందు ఆ ప్రభువు కపిలభగవానునిగా అవతరించి, జ్ఞానోపదేశమును చేసెను.

15.6 (ఆరవ శ్లోకము)

కృతం పురా భగవతః కపిలస్యానువర్ణితమ్|

ఆఖ్యాస్యే భగవాన్ యజ్ఞో యచ్చకార కురూద్వహ॥6331॥

పరీక్షిన్మహారాజా! కఫిల భగవానునిగూర్చి మూడవ స్కంధములో వర్ణింపబడినది. ఇప్పుడు ఆకూతియందు యజ్ఞపురుషుడుగా అవతరించి చేసిన లీలలను వివరించెదను.

15.7 (ఏడవ శ్లోకము)

విరక్తః కామభోగేషు శతరూపాపతిః ప్రభుః|

విసృజ్య రాజ్యం తపసే సభార్యో వనమావిశత్॥6332॥

స్వాయంభువమనువు సకల విషయ భోగముల యెడ విరక్తుడై రాజ్యమును పరిత్యజించెను. పిమ్మట, తన భార్యయైన శతరూపతో గూడి తపమాచరించుటకై వనములకు వెళ్ళెను.

1.8 (ఎనిమిదవ శ్లోకము)

సునందాయాం వర్షశతం పదైకేన భువం స్పృశన్|

తప్యమానస్తపో ఘోరమిదమన్వాహ భారత॥6333॥

అతడు సునందానదీ తీరమున ఒంటి కాలిపై నిలబడి నూరు సంవత్సరములు తీవ్రమైన తపమొనర్చెను. ఆ సమయమున అతడు నిత్యము ఈ విధముగా భగవంతుని స్తుతించెను.

మనురువాచ

1.9 (తొమ్మిదవ శ్లోకము)

యేన చేతయతే విశ్వం విశ్వం చేతయతే న యమ్|

యో జాగర్తి శయానేఽస్మిన్నాయం తం వేద వేద సః॥6334॥

మనువు పలికెను పరమాత్మ చేతనను పొంది విశ్వము చైతన్యవంతమగును. కాని, విశ్వము మాత్రము ఆయనను చైతన్యవంతునిగా చేయజాలదు. ఆ ప్రభువు ప్రళయకాలమున నిద్రించు చున్నను మేల్కొనియే యుండును. ఆ విషయమును ఆయన ఎరుగును. కాని, విశ్వము మాత్రము  తెలియజాలదు. కనుకనే, అతడు పరమాత్ముడు.

1.10 (పదియవ శ్లోకము)

ఆత్మావాస్యమిదం విశ్వం యత్కించిజ్జగత్యాం జగత్|

తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనమ్॥6335॥

ఈ సమస్త విశ్వమునందును, అందలి చరాచరప్రాణుల యందును ఆ పరమాత్మయే వ్యాపించియున్నాడు. కనుక, ఈ జగత్తునందలి యే పదార్థము నందును వ్యామోహమును పొందక ఆ ప్రభువు అనుగ్రహించిన వాటిచేతనే జీవితమును గడపవలెను. ఈ జగత్తునందలి సంపదలు ఏ యొక్కని సొంతము కాదు. కనుక, సర్వదా వాటిపై తృష్ణను విడిచి పెట్టవలెను. సమస్తకర్మలను భగవదర్పణ బుద్ధితో ఆచరింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ప్రథమ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

 శ్రీమాత్రేనమః
617వ నామ మంత్రము

ఓం ఐం హ్రీం శ్రీం ఆత్మనే నమః🙏🙏🙏సకలమునకు ప్రాణాధారమైన ఆత్మస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము🌹🌹🌹శివుని అష్టమూర్తుల (పంచభూతములు, సూర్యచంద్రులు, పురుషుడు) లో చంద్రుడు (చంద్రస్వరూపిణి) అయిన జగన్మాతకు నమస్కారము🌻🌻🌻పురుషుడు అనగా యాగము చేయు యజమాని కూడా శివస్వరూపుడు🌺🌺🌺ఆత్మా అనగా ఆత్మస్వరూపిణి🌸🌸🌸ఈ దృశ్యమాన ప్రపంచములోని వస్తువులన్నియు పరిచ్ఛిన్నములైనవే కానీ శ్రీమాత అఖిలాండకోటి బ్రహ్మాండనాయకియై  అంతటా నిండి, నిబిడీకృతమై ఉన్నది.  ప్రమాణ, పరిణామరహితమై, అఖండమై ఉన్నది. కావున ఆత్మ అని భావము. అమ్మవారికి నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం శ్రీ ఆత్మాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🙏🙏నేడు బుధ (సౌమ్య) వారము🔱🔱🔱బుధ (సౌమ్య) వారమునకు అధిపతి బుధుడు🌻🌻🌻ఈ రోజు గణపతిని, షణ్మఖుని ఆరాధించుదుము🌹🌹🌹ఆధ్యాత్మికంగా శ్రీమహా విష్ణువుకు ఈ రోజు  చాలా ప్రీతికరము🌸🌸🌸ఓం గం గణపతయే నమః🚩🚩🚩ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిప్రచోదయాత్🕉🕉🕉🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
[4:50 am, 22/07/2020] P.Dutga Subramanyam: 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
40వ నామ మంత్రము

ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః🙏🙏🙏మాణిక్య కిరీటము వంటి మోకాలు చిప్పల జంటతో విరాజిల్లు లలితాంబకు నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు బ్రహ్మజ్ఞాన సంపదలతో ఆత్మానందమునంది తరించును🌻🌻🌻మాణిక్య (మాణిక్య ఖచితమైన), మకుట - ఆకార (అర్ధగోళాకార కిరీటం యొక్క ఆకారం గల్గిన, జాను-ద్వయ (మోకాళ్ళ జంటచే, విరాజితా (శోభిల్లుచున్నది)🌺🌺🌺కేవలం గోపురం వలె ఎత్తుగా కాక, అర్ధగోళాకారంగా నిర్మితమైన మాణిక్య ఖచిత కిరీటాల జంటవలె శ్రీమాత మోకాళ్ళు రెండునూ విరాజిల్లుతున్నాయి🌸🌸🌸39వ నామ మంత్రము మరియు 40వ నామ మంత్రము అతి రహస్య భావమును బోధించు చున్నవి. ఇందలి భావము అవాఙ్మానసగోచరమైనదియు, తత్ప్వసారమును గురు ముఖైక వేద్యమును అయియుండును. ఈ రహస్యము నెరింగినవాడే సర్వజ్ఞుడును జీవన్ముక్తుడును అనబడును. ఈ కీలకమే పరాపర ప్రకృతి రూపమును, చరణద్వయ సమిష్టిరూపమును, శివా - శివశక్తైక్య రూపమును అగును. పరమేశ్వర స్వరూపుడైన సద్గురు సన్నిధిని సాక్షాత్తు దీని నెఱుంగదగును. మహోన్నతమైన మకుటమనే కిరీటము తయారు చేస్తే ఆ కిరీటం యొక్క ఆకారం ఏవిధంగా ఉంటుందో, ఆ విధముగా అమ్మవారి  మోకాళ్ళతో దేవి అందంగా ఉందని తెలియవలెను🌹🌹🌹శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🙏🙏నేడు బుధ (సౌమ్య) వారము🔱🔱🔱బుధ (సౌమ్య) వారమునకు అధిపతి బుధుడు🌻🌻🌻ఈ రోజు గణపతిని, షణ్మఖుని ఆరాధించుదుము🌹🌹🌹ఆధ్యాత్మికంగా శ్రీమహా విష్ణువుకు ఈ రోజు  చాలా ప్రీతికరము🌸🌸🌸ఓం గం గణపతయే నమః🚩🚩🚩ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిప్రచోదయాత్🕉🕉🕉🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319