22, జులై 2020, బుధవారం

కొంగుబంగారం – శ్రీరామ నామం


https://chat.whatsapp.com/Lv618foaLEP3bPUzrSbKgK
సకల లోకాలలో ఆదర్శగుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించేవాడు శ్రీరాముడు. రాముడు గొప్పవాడా? రామ నామం గొప్పదా అంటే రామని కంటే రామనామమే గొప్పదని చాటే కథలు చాలా ఉన్నాయి. రామ నామం గొప్పతనం గురించి ముందు తెలుసుకుందాం. రామనామ గొప్పతనాన్ని వివరించే ఈ గాథ చదవండి.
లంకానగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తూ వుంది. రాయిపై ‘రామ’ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ వుంది. ఇదంతా చూస్తూ వున్న రాముడిలో "నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేనే రాయి వేస్తే’ అనే ఆలోచన కలిగింది. అంతే శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోనికి వేసాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. దీనిని చూసి ఆశ్చర్యానికి లోనైన రాముడు పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని వివరించి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు
అందుకు హనుమంతుడు “రామ” అనే నామం రాసివున్న రాళ్ళే పైకి తేలుతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం రాయలేదు కదా! అందుకే మునిగిపోయింది” అని సమాధానం యిచ్చాడు.
అంటే రాముడికంటే కూడా రామనామం మహా శక్తివంతమైందన్నమాట!
(శ్రీ సత్యనారాయణ చొప్పకట్లగారి సౌజన్యముతో )

కుచేలుడు శ్రీకృష్ణుని ఆథిత్యాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళే సమయం లో అతని మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. కృష్ణుడు నాకీమీ ఇచ్చి పంపలేదే నా భార్య కేమి సమాధానం చెప్పేది?అనుకున్నాడు. వెంటనే తేరుకొని నాకు అపారమైన సంపద యిస్తే తనను నేను మరిచి పోతానని 
ఇచ్చి వుండడు. మంచిపనే జరిగింది లే సంపద కంటే నాకు ఆయన నామస్మరణ మరవకుండుటే 
ముఖ్యము కదా!అని ఈ క్రింది పద్యం చెప్తాడు. 
నీపాద కమలసేవయు 
నీపాదార్చకుల తోడి నెయ్యము నితాం 
తాపార భూత దయయును 
తాపస మందార నాకునాకు దయ సేయ గదే 
అర్థము:-- నీపాదాలను సేవించుకునే భాగ్యాన్నీ, నీ పాదములను సేవించే వారితో స్నేహాన్నీ అందరితో దయగా మసులుకునే సహృదయాన్నీ నాకు ప్రసాదించమని వేడుకున్నాడు కుచేలుడు
ఇంటికి వెళ్ళిన తర్వాత అపారమైన సంపద చూసి గర్వపడక నిరాడంబరంగా నారాయణుడి ధ్యానంలోనే తన శేష జీవితాన్ని గడిపాడు.
తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది.     9985831828

కామెంట్‌లు లేవు: