29, జూన్ 2025, ఆదివారం

Panchaag

 


ఆకలి లేనివారికోసం

 ఆకలి లేనివారికోసం సులభ యోగాలు - 


 * మిరియాలను నూరి తీసిన రసం గాని మిరియాల కషాయం కాని తీసుకొనుచున్న అగ్నిమాంద్యం , ఆకలి లేకపోవటం వంటి సమస్య తొలగి జీర్ణశక్తి వృద్ది అగును.


 * వేడిగా ఉన్న అన్నం వార్చిన గంజిలో కొంచం పొంగించిన ఇంగువ , సౌవర్చ లవణం కలిపి తాగుచున్న అగ్నిమాంద్యం తొలగును .

 

* యవాక్షారం , శొంఠి సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 5 గ్రాముల చొప్పున ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న మంచి ఆకలి కలుగును.

 

* బెల్లం , జీలకర్ర సమాన భాగాలుగా కలిపి తినుచున్న ఆకలి పెరుగును .

 

* పిప్పళ్లు చూర్ణం చేసి బెల్లముతో కలిపి తీసుకొనుచున్న ఆకలి పెరుగును .

 

* కరక్కాయ , పిప్పళ్లు , సౌవర్చ లవణం సమపాళ్లలో తీసుకుని నూరి చూర్ణం చేసి పెరుగు పైన ఉండే నీటితో కలిపి సేవించుచున్న అగ్నిమాంద్యం తొలగి ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్దిచెందును.

         

. పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా చేయగలరో చూసుకుని పాటించి అగ్నిమాంద్యం సమస్య నుంచి విముక్తి పొందగలరు. అగ్నిమాంద్యం అనగా ఆకలి లేకపోవడమే.

 

అగ్నిమాంద్య సమస్య ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు -

 

•. తినవలసినవి -

 

తేలికైన పాతబియ్యపు అన్నం , పెసలు , పేలాలు , పెసర కట్టు, చిన్న చేపలు , లేత ముల్లంగి , వెల్లుల్లి , లేత అరటికాయలు , లేత మునగకాయలు , పొట్లకాయ , బీరకాయ , వంకాయ , నక్క దోసకాయ , కాకరకాయ , అల్లం , చుక్కకూర, చెంచలికూర , ఉశిరికాయ , దానిమ్మపండు , నారింజపండు , పలచని మజ్జిగ , తాంబూలం , వేడినీళ్లు సేవించవలెను , తేనె , కారం , నూనె , చేదు , వగరు పదార్థాలు , వ్యాయమం .

 

•. తినకూడనవి -

        

. కొత్తబియ్యం , చేపలు , బచ్చలికూర , ఎక్కువుగా నీరు తాగరాదు , కంద , ఆలుగడ్డ మొదలగు దుంప కూరలు , నేరేడు పండ్లు , గోధుమలు , పిండివంటలు , మాంసపదార్దాలు , పాలు , పాలతో వండిన పదార్దాలు , చారపప్పు , ఎక్కువుగా నూనె ఉండు పదార్థాలు , పూర్తిగా ఉడకని పదార్ధాలు మరియు అన్నం , మద్యపానం, ముందు తినిన పదార్దాలు పూర్తిగా అరగకముందే మరలా భుజించటం , అమిత భోజనం , నిద్రపోకుండా మేలుకుని ఉండటం, మలమూత్ర నిరోధం .

        

. పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఔషధ యోగాలు వాడుచున్న సమస్య త్వరగా పరిష్కారం అగును.

      

. మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 

    

గమనిక -

      

. నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

           

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ క్రింద ఇచ్చిన ఫోన్ నెంబర్ నందు సంప్రదించగలరు.

                   

            కాళహస్తి వేంకటేశ్వరరావు .

         

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                         

. 9885030034

అరసున్న

 అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు. అలా చేసారు మన ఆధునిక భాషా వేత్తలు. తెలుగుకు పట్టిన దుర్గతి ఇది. అయితే, ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. తెలుగు భాషా లక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణ శాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. కానీ వీటిగురించి తెలుగువాడు తెలుసు కోవాలిగదా! మన భాషా సంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న( ఁ ) , ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతుంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:


అరుఁగు = వీధి అరుగు


అరుగు = వెళ్ళు, పోవు


అఱుగు = జీర్ణించు


ఏఁడు = సంవత్సరం


ఏడు = 7 సంఖ్య


కరి = ఏనుగు


కఱి = నల్లని


కాఁపు = కులము


కాపు = కావలి


కాఁచు = వెచ్చచేయు


కాచు = రక్షించు


కారు = ఋతువు, కాలము


కాఱు = కారుట (స్రవించు)


చీఁకు = చప్పరించు


చీకు = నిస్సారము, గ్రుడ్డి


తఱుఁగు = తగ్గుట, క్షయం


తఱుగు = తరగటం(ఖండించటం)


తరి = తరుచు


తఱి = తఱచు


తీరు = పద్ధతి


తీఱు = నశించు, పూర్తి(తీరింది)


దాఁక = వరకు


దాక = కుండ, పాత్ర


నాఁడు = కాలము


నాడు = దేశము, ప్రాంతము


నెరి = వక్రత


నెఱి = అందమైన


నీరు = పానీయం


నీఱు = బూడిద


పేఁట = నగరములో భాగము


పేట = హారంలో వరుస


పోఁగు - దారము పో( గు


పోగు = కుప్ప


బోటి = స్త్రీ


బోఁటి = వంటి [నీబోఁటి]


వాఁడి = వాఁడిగా గల


వాడి = ఉపయోగించి


వేరు = చెట్టు వేరు


వేఋ = మరొకవిధము


మడుఁగు = వంగు, అడఁగు


మడుగు = కొలను, హ్రదము


మొదలైనవీ ఉన్నాయి.


అయినా తెలుగు భాషను నాశనం చేస్తున్న కాలం దాపురించింది కదా!


[డాక్టర్ ద్వా. నా. శాస్త్రి )

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి) 


సర్వథా సుకరం మిత్రం 

దుష్కరం పరిపాలనమ్.

అనిత్యత్వాచ్ఛ చిత్తానాం 

ప్రీతిరల్పేపి భిద్యతే

(4.32.7)


*అర్థం:*

స్నేహితుడిని సంపాదించుకోవడం సులభం, కానీ ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవడం కష్టం. మనసులోని చంచలత్వం వల్ల, చిన్న చిన్న కారణాల వల్ల కూడా స్నేహం తెగిపోతుంది.


"జయ జనార్ధన కృష్ణ రాధికా పతే, నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే" అంటూ శ్రీ కృష్ణుని స్తుతిస్తూ.... శుభోదయం.


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః 


శుభ శనివారం

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝 *సత్యం వేదేషు జాగర్తి ఫలం సత్యే పరం స్మృతమ్l*

             *సత్యాద్ధర్మో దమశ్చైవ సర్వం సత్యే ప్రతిష్ఠితమ్ll*


                             *... మహాభారతమ్ …*


తా𝕝𝕝 "వేదాలలో సత్యమే నిలచి ఉంటుంది. సత్యఫలమే శ్రేష్ఠమైన ఫలం. సత్యం ద్వారానే ధర్మం, ఇంద్రియ నిగ్రహం కలుగుతాయి. *సర్వమూ సత్యము మీదనే ఆధారపడి నిలుస్తుంది".*

                   

 ✍️VKS ©️ MSV🙏

పంచాంగం 28.06.2025

 ఈ రోజు పంచాంగం 28.06.2025

Saturday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్ల పక్ష తృతీయ తిథి స్థిర వాసర పుష్యమి నక్షత్రం హర్షణ యోగః గరజి తదుపరి వణిజ కరణం


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు. 




నమస్కారః , శుభోదయం

🙏శ్రీ కృష్ణ తత్త్వం 🙏

 🙏శ్రీ కృష్ణ తత్త్వం 🙏

శ్రీకృష్ణుడు కర్మయోగి. ధర్మయోగి. జ్ఞానయోగి. ఒక దానిని మిగిలిన రెండింటితో సమన్వయ చేస్తూ, తన అవతార సందేశాన్ని లోకానికి అందించిన జ్ఞానమూర్తి. శ్రీకృష్ణుడి అవతార తత్త్వంలో సమున్నతమైన విలువలు అడుగడుగునా కనిపిస్తాయి. అందుకే శ్రీ కృష్ణావతారం సార్వజనీ నకమై, సత్యప్రామాణికమై, పరిపూర్ణావతారంగా నిలిచిపోయింది. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి శ్రీకృష్ణుడు. ప్రతి క్షణం ధర్మానికి అండగా ఉంటూ ధర్మాన్ని గెలిపించాడు. శరణాగత వత్సలుడు అయ్యాడు. ప్రేమైకమూర్తిగా నిలిచాడు. అందుకే యుగయుగాల పాటు శ్రీకృష్ణుని కథ నిలిచిపోయింది. చెరసాల అంటే చీకటి ప్రదేశం. మనిషి చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానా నికి ప్రతీక. ఇక అష్టమ గర్భం, అష్టమి తిథి. అష్టమ సంఖ్య అనేది అష్టాంగ యోగాన చివరిదైన సమాధి స్థితి. సాధకుడు యీ స్థితిలోనే భగవత్‌ సాక్షాత్కారాన్ని పొందుతాడు. శ్రీకృష్ణ జననమే యిక్కడ భగవత్‌ సాక్షాత్కా రం. శ్రీకృష్ణుని జననం తర్వాతే వసుదేవునికి సంకెళ్లు విడిపోయాయి. చీరలను దోచుకుని గోపికల దేహ చింతలను తీర్చాడు. చీరలిచ్చి నిండు సభలో ద్రౌపది గౌరవాన్ని కాపాడిన లీలా మానుషధారి శ్రీకృష్ణుడు.

గోపాలుడనగా గోవులను పాలించినవాడు. గో సంరక్షకుడు అని అర్థం.

ఇక్కడ గోవులు అంటే జీవులు. జీవుల సంరక్షకుడే శ్రీకృష్ణుడు.

కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో వానరులే, ద్వాపరంలో గోపికలు. కృతయుగంలో ఋషులకు దర్శన భాగ్యమే కలిగింది. త్రేతాయుగం లో వానరులకు సంభాషణా భాగ్యం, ద్వాపరయుగంలో దర్శన, స్పర్శన, సంభాషణా భాగ్యాలను పొందిన ధన్యజీవులు గోపికలు. సర్వత్రా భగవం తుని లీలా విభూతిని దర్శించడమే కర్తవ్యమని నిరూపించారు గోపికలు.

శ్రీకృష్ణుడు దొంగిలించినది వెన్నకాదు. గోపికల హృదయాలలోని పవి త్రమైన ప్రేమ. గోపికలు మధించినది పెరుగుకాదు.వాళ్ళ మనసుల్ని కృష్ణ నామస్మరణతో మధించి, భగవదనుగ్రహం అనే వెన్న పొందారు. జీవుల భౌతిక ఆవరణలను ఛేదించి, అశాశ్వతమైన రాగద్వేషాలలో చిక్కుకున్న జీవులకు ముక్తిని ప్రసాదించడమే పాలు/ పెరుగు కుండలను పగులగొట్టడం. పెరుగుతో తడుపుకున్న పాదముద్రల ఆధారంగానే కృష్ణుణ్ణి గోపికలు పట్టుకోగలిగారు. అంటే భగవంతుని పాదాలు పట్టుకుంటే, భగవ దనుగ్రహం తప్పక దొరుకుతుందనేది విశేషార్ధం. కృష్ణుణ్ణి రోలుకి యశోద బంధించినప్పుడు, కట్టినతాడు రెండు కొసలలో ఒకటి బ్రహ్మ నిష్ట. రెండోది ధర్మనిష్ట అని చెబుతారు. అమ్మ ప్రేమ పాశానికి, వాత్సల్యానికి తనంత తానుగా కట్టుబడిపోయేడు శ్రీకృష్ణుడు. ఇక కాళీయ మర్దనం. మడుగు సంసారానికి ప్రతీక. కాళీయుడు విషయ వాంఛా పూరితుడైన మానవునికి చిహ్నం. కాళీయుని శిరసుపై శ్రీకృష్ణుడు తాండవం చేయగానే విషమంతా బయటకువచ్చింది. కాబట్టి సంసారమనే మడుగులో మమకారాలనే లోతైన బురదలో, విషయ వాంఛలతో కూరుకు పోయే మానవులను ఉద్ధరించడమే కాళీయ మర్దనం.

గోవర్ధనగిరి ఎత్తడం వెనుకా ఓకథ ఉంది. రామావతారంలో వారధి కట్టే టప్పుడు, ఓ వానరుడు ఓ పర్వతాన్ని, సేతు నిర్మాణం పూర్తైపోతున్న సమ యంలో తీసుకువస్తాడు. ”నేను రామకార్యానికి ఉపయోగపడలేకపోయా నని” బాధపడుతుంది ఆ పర్వతం. ”వచ్చే అవతారంలో నిన్ను ఉద్ధరిస్తాన ని” పర్వతానికి మాటయిస్తాడు శ్రీరాముడు. ఆ పర్వతమే గోవర్ధనగిరి.

నిజమైన హితుడు, స్నేహితుడు భగవంతుడు ఒక్కడే అనే సత్యాన్ని చెప్పే దే కుచేలుని చరిత్ర. ప్రకృతి పురుషుల కలయికను తెలిపే తత్త్వబోధనే రుక్మి ణీ కళ్యాణం. రుక్మిణి జీవాత్మ. శ్రీకృష్ణుడు పరమాత్మ. జీవాత్మ పరమాత్మ ను చేరాలనే తపనే రుక్మిణీ కళ్యాణం. గోపాలునిగా గోసేవ చేయడం, రాజసూయ యాగ సమయంలో, ఋత్వి క్కుల పాదాలు కడగటం, యుద్ధం అనంతరం ప్రతిరోజూ అర్జునిని సారధి గా అశ్వాలకు సేవ చేయటంలాంటివి, మానవాకారంలో భగవంతుడు సర్వ జీవులకు సేవచేసే నిమిత్తమై అవతరిస్తాడనే సత్యానికి నిదర్శనాలు.శ్రీకృష్ణుడు హృదయాలనే భూముల్ని సాగు చేసేవాడు, ఆటపాటలతో సర్వులను ఆకర్షించేవాడు. కృష్ణావతార ప్రధాన లక్ష్యం ప్రబోధ.

సాధు రక్షణ- దుష్ట శిక్షణ (పరిత్రాణాయ సాధూనాం)

భక్త రక్షణ (అనన్యా శ్చిన్తయన్తో మాం)

శరణాగత రక్షణ (సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య మామేకం) అనే మూడు ప్రతిన లను అవతార లక్ష్యంగా చేసుకున్నాడు. తానాచరించిన తర్వాతే బోధలు చేసాడు. శ్రీకృష్ణుడు చేసిన ప్రతి కార్యం వెనుక బలీయమైన కారణం ఉంటుంది. తార్కికతతో కూడిన తాత్త్వికత ఉంటుంది. గీతార్ధసారమిచ్చి గీతలెన్నొమార్చిన పరిపూర్ణ ప్రేమైకమూర్తి శ్రీకృష్ణుడు

రెండు సార్లు చదవండి అర్ధం అవుతుంది 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ