26, అక్టోబర్ 2020, సోమవారం

పచ్చ కర్పూరం










 

beautiful story

 *A beautiful story. Do not miss it.*


It was getting dark. Someone was calling from behind the locked iron gate. Wondering who it could be I came out. An elderly person was standing behind the gate. The clothes wrinkled and with a small bag in his hand he appeared to have travelled some distance coming here. Looking into a small piece of paper in his hands he enquired, “Isn’t this Anand, Number8, Yogananda Street, my son?” “Yes, I am Anand and this is the address. And you…”, I mumbled. Slightly shivering and moistening his dry lips with the tongue he replied, handing over the letter, “Babu, I am your father’s friend. I am coming from your village. Your father gave me this letter and advised that I seek help from you”.

Taking that letter from him, exclaiming “father?”, I eagerly read that letter. “Dear Anand, blessings to you. The person carrying this letter is my friend. His name is Ramayya. Works hard. A few days ago, his only son died in an accident. He is running around seeking compensation. That would help him and his wife to pull along with the other meagre income. I am sending the police reports after the accident, the compensation affidavits given by the Travel Agents and other relevant papers. He was told that the final payment may be collected in the Head Office. This is his first visit to Hyderabad and he is a stranger. I am hoping that you would be able to help him. Take care of your health. Visit us at your earliest convenience. Your loving father”.

Ramayyagaru was standing watching me. I thought for a moment and invited him inside. Giving him some water to drink, I enquired, “did you have anything to eat?”. He replied, “No, my son. As the journey got delayed, I ate the two fruits that I brought with me.”

Going inside I prepared four dosas and served them with pickles. Saying, “you please eat”, I went out and made a couple of calls and returned. When I returned, I found that he had finished the tiffin and was sitting with a few papers in his hand. There was a photo of his deceased son. The boy was handsome and young. May be 22 years. My eyes moistened.

“He is my only son. Those who were born before him died due to various other causes. He was the only one we have. Mahesh was his name. He studied well and got a job. Assuring us that he will take care of us and we would get over all hardships he took up the job. On the fateful day he was involved in a road accident while crossing the road. Died on the spot. Not wishing to take compensation in the name of the deceased son we were initially reluctant. But day by day, I am becoming weak and my wife too is not doing well. With your father’s insistence I came here. Saying my son will help, he sent me with this letter”, he concluded. 

“Fine. It’s late now. Take rest”. Saying this I too slept.

Next morning, we got ready, had coffee at home and started. Finishing breakfast on the way, we reached the Office address mentioned in the documents. “Anand, I will take care of the rest. You attend to your office work” said Ramayyagaru. “No issue. I have taken leave for today”, I replied. Being with him I got the compensation paid to him. “Thank you, dear son. My wife is alone at home and I will go back home”, said the old man. “Come, I will drop you at the bus-stand and see you off.” I took him to the bus-stand, got him a ticket, bought a few fruits to eat on the way.

He said with joy in his eyes, he said, “Anandbabu, taking leave for my sake you helped me a lot. Soon after going home I will narrate everything to your father and thank him too.”

Smiling and holding his hands I explained, “I am not your friend’s son Anand. I am Aravind. You came to the wrong address. That Anand’s house is another 2 km away. You were already tired and I didn’t have the heart to tell you the truth. I called the number in your letter and enquired. His wife said that Anand had gone out of town on some work. I called your friend and told him too. He felt very sad. Once I assured him that I will take care he felt good. The loss you have suffered is irreparable. But I felt that I should help you. That I did it gives me greatest pleasure.” As the bus moved, holding my hands Ramayya left with tears of gratitude in his eyes. “God bless you, my child”, were his parting words. That is enough for me, I thought. My father passed away fifteen years earlier. Now looking at Ramayyagaru I felt my father has returned. 

Looking up at the sky I thought my father must be somewhere there. “Dad, did you come in this form to check my progress in life! Sending me a letter, were you testing me whether I would help or not? Born to a great father like you, as a son I have performed by duty. Are you happy?”  

Tears of joy flooded my eyes.


*Have an intention to help. Nature will work out the way*

భూసేకరణ_అంటేఏమిటి

 *భూసేకరణ_అంటేఏమిటి...?*


*ఎందుకోసం భూ సేకరణ  సేకరిస్తారు ...?* 


ప్రభుత్వం వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, సెజ్‌ల, పరిశ్రమలు, రోడ్లు, ఇళ్ళస్థలాల కోసం భూములను సేకరించడం జరుగుతుంది. ఒకోమారు ప్రాణాలు పోయినా తమ భూములను ఇచ్చేది లేదంటూ, మా భూములను తీసుకుంటే ఊరుకోబోమని రైతులు ఉద్యమాలు చేస్తారు.


*భూసేకరణ అధికారులు*

 ఆర్.డి.వో./స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ ‌ (భూసేకరణ)ల ద్వారా ప్రభుత్వం నోటీసులు ఇచ్చి అవసరమైన భూములను సేకరిస్తుంది. అభివృద్ధి పేరుతో జరిగిన భారీ భూసేకరణలో వ్యవసాయానికి అనువైన, రెండు లేక మూడు పంటలు పండే భూములను కూడా ప్రభుత్వం సేకరించింది. రైతులకు పరిహారం ఇచ్చి భూములను సేకరించే పని పరిశ్రమలదే అంటూనే రెవిన్యూ యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. అనేక చోట్ల భారీ కుంభకోణాలకు ఇవి తెరతీశాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పోర్టులు, విమానాశ్రయాలు, సిమెంటు, స్టీలు పరిశ్రమలు, రహదారులు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, ఐటీ పరిశ్రమలు.. ఇలా అనేక పేర్లతో భూములను ప్రభుత్వం సేకరించింది.


*పునరావాసం* :- భూసేకరణలో నిర్వాసితులు ఇళ్ళు, భూమి, పశువులు, చెట్లు కోల్పోతారు. పరిహారంగా లభించిన మొత్తానికి మరోచోట అంతే మొత్తం భూమిరాదు. తిండికీ, ఉపాధికీ.. రెంటికీ భూమి కీలకం. వ్యవసాయం పని  భూమి లేకపోతే రైతులు ఎందుకూ కొరగారు. పరిహారంగా డబ్బులిచ్చినా దాంతో ఏం చేసి బతకాలో తెలిసే అవకాశమూ కానరాదు. పని పోయి, విద్య లేక, మరో పని రాక మరింత పేదలవుతున్నారు. పరిహారంలో కొంత మొత్తాన్ని బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. అప్పులు తీరుస్తున్నారు, ఇంటి ఖర్చుల కోసం, పెళ్ళిళ్ల కోసం, వాహనాలు, ఆభరణాలు కొనటం కోసం, విందు వినోదాల వంటి వాటికోసం ఖర్చు పెడుతున్నారు. పరిహారంలో ఎక్కువ భాగం నిరుపయోగమైన రీతిలో ఖర్చైపోతోంది.


*ప్రత్యామ్నాయ పరిహార మార్గాలు* :- ప్రాజెక్టు లాభాల్లో కొంత శాతాన్ని పునరావాస ప్రాంత అభివృద్ధి కోసం వెచ్చించాలి.

●రాయల్టీల్లోని కొంత శాతాన్ని తిరిగి ఆ ప్రాంత అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టాలి.

●స్థానిక ప్రజలకు ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పిస్తూ వారికి వాటా (ఈక్విటీ) ఇవ్వాలి.

●అభివృద్ధి నిధులతో నిర్వాసితులకు లబ్ధి చేకూరేలా చూసేందుకు ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేయాలి.

●భూమి ఇస్తున్న స్థానిక ప్రజలను ప్రాజెక్టుల్లో ప్రత్యక్ష పెట్టుబడిదారులుగా చేర్చుకోవాలి.


*భూసేకరణకు వ్యతిరేకంగా అప్పీల్ చేయవచ్చు*

భూ సేకరణ చట్టం కింద ప్రభుత్వం ఎటువంటి భూమినైనా సేకరించవచ్చు. కానీ, చట్టంలోని 5ఏ సెక్షన్ ప్రకారం భూముల యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.కొన్ని సందర్భాల్లో భూమి అత్యవసరమైతే 5ఏ సెక్షన్‌ను తోసిపుచ్చు. (17వ సెక్షన్). ఇతరుల భూములను ప్రభుత్వం సేకరించదలచినప్పుడు... ఆ చర్యను వ్యతిరేకిస్తూ అప్పీల్ చేసే హక్కు సంబంధిత భూ యజమానులకు ఉంటుంది. ప్రభుత్వం భూమిని సేకరించదలచినప్పుడు మొదట ఇందుకోసం నోటిఫికేషన్‌ జారీచేస్తుంది.


 భూ యజమానులకు అభ్యంతరాలు తెలిపే అవకాశాన్నిస్తుంది .భూ సేకరణ చట్టంలోని అత్యవసర నిబంధనల ప్రకారం ఐతే భూ యజమానుల అభ్యంతరాలు విననక్కరలేదు. యజమానుల అభ్యంతరాలను పరిశీలించి, వాటిని నెలరోజుల్లో పరిష్కరించాలని, అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుంది. అత్యవసర నిబంధనలను అరుదైన సందర్భాల్లో మాత్రమే వినియోగించాలి.


*భూసేకరణపై పిటిషన్‌కు ఆలస్యం తగదు*


*మార్కెట్ ధర* :-

తమ భూమికి తగిన ధర చెల్లించలేదనే ఎక్కువగా రైతులుఆందోళన చేస్తారు .సుబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని బేసిక్ విలువకు 30% సొలేషియం,12% వడ్డీ(నోటిఫికేషన్ తేదీ నుండి అవార్డు తేదీ లేదా భూమిని స్వాధీనం చేసుకున్న తేదీ వరకు) కలిపి మార్కెట్ ధరగా నిర్ణయించి భూయజమానికిస్తారు. భూమిపై చెట్లు,కట్టడాలకు విడిగా పరిహారం లెక్కకట్టించి ఇస్తారు.


*సంప్రదింపులు* :-

 నిర్బంధ భూసేకరణ ప్రక్రియ వల్ల తగాదాలు పెరిగి కోర్టు తీర్పులతో తీవ్రజాప్యం జరుగుతున్నందు వల్ల  రైతులు కలెక్టర్లు జిల్లాస్థాయిలో సంప్రదింపులు జరుపుకొని మధ్యేమార్గంగా ఒక ధరకు అంగీకరించి భూసేకరణ జరిపే పద్ధతి ఇటీవల బాగా జరుగుతున్నది. ఒకసారి భూయజమానుల ప్రతినిధులు ప్రభుత్వం ప్రతిపాదించిన ధరకు ఒప్పుకున్నాక కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు.


*భూసేకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం*


మైనింగ్‌ కార్యకలాపాలకు దేశంలో ఛత్తీస్‌ఘడ్‌ తర్వాత అత్యధికంగా అటవీ ప్రాంతాన్ని కేటాయించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భూసేకరణలో మాత్రం మొదటి స్థానం రాష్ట్రానిదే .కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఐదులక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర కార్యక్రమాలకు మళ్లించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పరిశ్రమల కారణంగా ఎక్కువమంది నిరాశ్రయులు కానున్నారు. సాగునీటి ప్రాజెక్టుల వల్ల లక్షా 20 వేల కుటుంబాలు నిరాశ్రయులు కానున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల కారణంగా వందల గ్రామాలు కనుమరుగుకానున్నాయి. దళితులు, పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను తిరిగి స్వాధీనం చేసుకొన్నారు.


*భూములు మళ్లీకొనలేని పరిస్థితి*


సేకరించిన భూములకు ఇచ్చే పరిహారంతో మళ్లీ భూములు కొనడానికి వీల్లేని పరిస్థితి. రైతుల నుంచి భూములు సేకరించడం మొదలు పెడుతూనే చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగి వారికి అందుబాటులో లేకుండా పోయాయి. కొందరికి వచ్చిన పరిహారం అప్పటికే ఉన్న అప్పులకు సరిపోయింది. అనేకమంది రైతులు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి కూలి పనులు చేసుకొంటున్నారు. కొన్ని చోట్ల నిన్న వరకు భూ యజమానులుగా ఉన్న రైతులు ఇప్పుడు తమ భూముల్లో ఏర్పాటుకానున్న పరిశ్రమల్లో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. వచ్చిన పరిహారం ఖర్చయిపోతుండటం, కుటుంబ సభ్యులతో కలిసి వీధుల పాలు కావల్సి రావడం, పరిహారంతో మళ్లీ భూములు కొనలేని పరిస్థితి ఏర్పడటంతో అసంతృప్తి పెరుగుతోంది. ప్రజా ప్రయోజనం కోసం మాత్రమే వ్యక్తిపరమైన ఆస్తుల్ని తీసుకోవాలి, పంటలు పండే పొలాల్ని వ్యాపార, పారిశ్రామిక ఉద్దేశాలకై తీసుకోరాదు. ప్రభుత్వ రంగంలోని ప్రాజెక్టులు కాకపోతే, 70 శాతం భూముల్ని సొంతంగా కొనుక్కోవాలి. మిగతా 30 శాతం మాత్రమే భూసేకరణ అనుమతించాలి. ప్రాజెక్టు ఫలాల్లో రైతుల్ని భాగస్వామ్యం చెయ్యాలి, ఏ అవసరం కోసం ప్రభుత్వం భూమిని సేకరించిందో, ఆ అవసరం నిమిత్తం భూమిని ఉపయోగించకపోయినప్పటికీ, ఆ భూమిని తిరిగి తనకు స్వాధీనం చేయాలని కోరే హక్కు సొంతదారుకు ఉండదు. తిరిగి ఆ భూమిని సొంతదారుకు స్వాధీనం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. భూమిని ప్రతిపాదిత ప్రయోజనానికి ఉపయోగించకపోతే ఇంకొక ప్రజా ప్రయోజన కార్యక్రమానికి ప్రభుత్వం వినియోగించాలి.


*నియమాలు నిబంధనలు*


*మార్కెట్‌ విలువను నష్టపరిహారంగా చెల్లించాలి.*


అల్ప సంఖ్యాకవర్గాల విద్యాసంస్థల ఆస్తుల్ని తీసుకుంటున్నప్పుడు వారి హక్కులకు భంగం లేని పద్ధతిలో నష్టపరిహారం చెల్లించాలి. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే భూమి కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలి. 


●అది ఏ విధంగా అనేది నిర్ణయించడానికి గ్రామసభల్లోనూ, మండల పరిషత్తులలోనూ చర్చించాలి.అత్యవసరం అవునా? కాదా? అనేది కోర్టులు తేలుస్తాయి.అత్యవసర అధికారాల్ని ప్రభుత్వం వినియోగించినప్పుడు ముందుగా 80 శాతం నష్ట పరిహారాన్ని భూయజమానులకు చెల్లించాలి. ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ మొత్తాన్ని కోర్టులో జమచెయ్యాలి. ఇది ముందస్తు చెల్లింపు మాత్రమే.నష్ట పరిహారాన్ని నిర్ణయించిన తర్వాత పూర్తి చెల్లింపులు చేయాలి.


●కలెక్టరు... లేదా అధీకృత అధికారి భూ సేకరణ చేయాలనుకునే స్థలం సర్వే నెంబర్లు, కొలతలతో పటం తయారు చెయ్యాలి.


●హక్కు, ప్రయోజనం ఉన్నవారందరికీ భూమిని స్వాధీనం చేసుకోబోతున్నట్లు... నష్టపరిహారం ఎంత కావాలో తెలపాల్సిందిగా నోటీసులు ఇవ్వాలి. అందులో భూమికి సంబంధించిన మొత్తం వివరాలు ఉండాలి.


●భూమికి సంబంధించిన వివరాలు, నష్ట పరిహారం,అర్హులైన వ్యక్తుల వివరాలతో రెండు సంవత్సరాల్లోగా అవార్డు తీర్పు ఇవ్వాలి. ఏ రకమైన స్టే లేకుండా ఈ వ్యవధి మీరితే భూసేకరణ చెల్లకుండా పోతుంది.


*కంపెనీల అభ్యర్థనపై భూ సేకరణ ప్రజాప్రయోజనం కింద రాదు*


●అవార్డు ప్రతిని ఇఛ్ఛి భూమిని స్వాధీనం చేసుకోవాలి. అవార్డులో నిర్ణయించిన సొమ్ము తక్కువనిపిస్తే, కోర్టుకు నివేదించమని కోరాలి.దానికి కోర్టు ఫీజూ చెల్లించనక్కర్లేదు.


●ఇవ్వజూపిన పరిహారం నా హక్కులకు భంగం లేని విధంగా నిరసనతో స్వీకరిస్తున్నాను. ఈ విషయాన్ని కోర్టుకు నివేదించండి అంటూ రాసి తీసుకోవచ్చు.


●హౌసింగ్ కాలనీల అభివృద్ధి కోసం ప్రజల భూములను 'అత్యవసర నిబంధన'ను అడ్డుపెట్టుకుని స్వాధీనం చేసుకోరాదు.ప్రకృతి విపత్తులతో నిర్వాసితులైన వారికి, ప్రాజెక్టుల నిర్మాణం కోసం తరలించిన వారికి పునరావాసం కల్పించడం కోసం, సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి అత్యవసరంగా గృహాలు నిర్మించాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే 'అత్యవసర నిబంధన'ను ఉపయోగించాలి.


●భూములను స్వాధీనం చేసుకున్నాక, ఆ భూములపై సొంతదారులకు ఎటువంటి హక్కులు ఉండవు.పరిహారం చెల్లించే విషయంలో ఆలస్యం జరిగినా కూడా సొంతదారులకు కేవ లం పరిహారం విషయంలో మాత్రమే హక్కు ఉంటుంది తప్ప, ప్రభుత్వం సేకరించిన భూమి పై ఎటువంటి హక్కులు ఉండవు. ఏ అవసరం కోసం ప్రభుత్వం భూమిని సేకరించిందో, ఆ అవసరం నిమిత్తం భూమిని ఉపయోగించకపోయినప్పటికీ, ఆ భూమిని తిరిగి తనకు స్వాధీనం చేయాలని కోరే హక్కు సొంతదారుకు ఉండదు. తిరిగి ఆ భూమిని సొంతదారుకు స్వాధీనం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు.


●డిజైన్‌ నమూనా పూర్తిగా ఖరారు చెయ్యకుండా, కచ్చితంగా నిర్ధారించకుండా, వాటికి అనుమతులు తీసుకోకుండా అలైన్‌మెంట్‌ తుది నమూనాను ఆమోదించకూడదు.భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేశాక తగిన కారణం లేకుండా వదలకూడదు.అలైన్‌మెంట్‌ను మార్చకూడదు.


●నోటిఫికేషన్ వెనక ప్రజా ప్రయోజనం లేదనీ, దురుద్దేశంతో, నిర్హేతుకంగా చట్టవ్యతిరేకంగా తన ఆస్తి తీసుకుంటున్నారని సవాల్‌ చేసే హక్కు యజమానికి ఉంటుంది.


●నీటి చెలమలు, చెరువులు అంతర్థానమయ్యేలా అలైన్‌మెంట్లను తయారుచేయకూడదు.


●భూసేకరణలో ఒకరికి హానిచేస్తూ మరొకరికి సహాయం చెయ్యాలని తలపెడితే ఆ సేకరణ ప్రజా సంక్షేమం కోసమే అయినా సరే దురుద్దేశపూరితమే అవుతుంది.


*భూసేకరణ చట్టలోని ముఖ్యమైన సెక్షన్ల  గురించి తెలుసుకుందాం*


●భూసేకరణకు 2013 చట్టం నిబంధనలు కచ్చితంగా పారదర్శకంగా అమలు చేయాలి. అప్పుడే ఆయా రైతుల హక్కులను కాపాడుకోడానికి వీలవుతుంది. బ్రిటిష్‌ ప్రభుత్వం 1894లో భూసేకరణ చట్టం తెచ్చింది.  ఇప్పటి వరకు 17 సార్లు ఈ చట్టాన్ని సవరించడం జరిగింది.  2013 యుపిఎ ప్రభుత్వ భూసేకరణ చట్టం చేసేవరకూ కొనసా గింది. 1950,1960, 1970లలో ప్రభుత్వాలు చేపట్టిన అనేక భారీ పరిశ్రమలకు, నీటిపారుదల ప్రాజెక్టులకు భూసేకరణ 1894 చట్టం ప్రకారమే జరిగింది.అవసరాలకు సరిపడే భూమిని సేకరించడం రైతులను ఒప్పించడం నష్టపరిహార సమస్యలు, నిర్వాసితుల సమ స్యలు పరిష్కరించటం మొదలగు అంశాల్లో ప్రభుత్వాలు చొరవ చూపడంతో ఎక్కువ వివాదాలు ఏర్పడలేదు.

 

●రాజ్యాంగంలో 1,4, 17,24 మొదలగు రాజ్యాంగ సవరణలన్నీ భూమికి సంబంధించిన వివాదాల గురించే జరిగాయి. గోలక్‌నాథ్‌ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్‌ కేసు మొదలగు వాటిలో భూమి, ఆస్తి వివాదాలు ముడిపడి ఉన్నాయి. 


●25ఏళ్ల కిందట 1991లో భారతదేశంలో సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి దేశంలో అన్ని రంగాల్లో ప్రవేటీకరణ విధానాలు ఆచరణలోకి వచ్చాయి. అంతవరకు ప్రభుత్వ రంగానికి పరిమితమైన పరిశ్రమలలో కూడా ప్రయివేట్‌ రంగాన్ని అనుమతించారు. అభివృద్ధి పేరుతో ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) పారిశ్రామిక పార్కులు, ఐటి పార్కులకు అనుమతులి చ్చారు. వీటి ఏర్పాటుకు లక్షలాది ఎకరాల భూసేకరణ జరిగినది. 2000 సంవత్సరం నాటికి దేశంలో క్రోనికాపిటలిజం (ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం) విస్తృతంగా వ్యాప్తి చెందింది. ప్రభుత్వాలు అభివృద్ధి పేరు తో అవసరానికి మించి భూమిని సేకరించి ప్రయివేట్‌ సంస్థలకు కేటాయించాయి. ప్రైవేట్‌ యాజమాన్యాలు పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో తీసుకున్న వేలాది ఎకరాలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు వినియోగించారు. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా సామా జిక ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు చేసిన ఆందోళన ఫలితంగా భూసేకరణ చట్టం-2012 రూపుదిద్దుకున్నది.


●2013 భూసేకరణ చట్టం ముఖ్యాంశాలు 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత భారత పార్లమెంటు చేసినచట్టాల్లో ఒక ముఖ్యమైన చట్టంగా 2013 భూసే కరణ చట్టాన్ని సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చట్టంలోని కొన్ని ప్రధానమైన అంశాలు. 


●సెక్షన్‌ 4 ప్రకారం వ్యవసాయ కార్మికులు,వృత్తిదారులు, చిరువ్యాపారులు,ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికీ నష్టపరిహారం చెల్లించాలి. ఉపాధి కల్పించాలి.


●సెక్షన్‌ 4(1)ప్రకారం భూసేకరణ వల్ల జరిగే సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలి. భూసేకరణ వల్ల జరిగే నష్టం, నిర్వాసితుల కుటుంబాల సంఖ్య, ఉమ్మడి ఆస్తుల వివరాలు మొదలగు అంశాలను అధ్యయనం చేసి ఆ నివేదికను ప్రజలమధ్య ఉంచి బహిరంగ విచారణ చేసి తెలియచెప్పాలి. స్థానిక ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, అధికారులు ఏడుగురితో కమిటీ వేసి విచారించాలి. 


●సెక్షన్‌ 10(1) ప్రకారం సాగులో ఉన్న బహుళ పంటలు పండే భూమిని సేకరించరాదు. అనివార్యమైతే ఆ భూమికి బదులు ప్రత్యామ్నాయ భూమికి నీటి సౌకర్యం కల్పించి ఆ భూమిని అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి అవసరాల కోసం భూమిని తీసుకుంటే 70 శాతం, ప్రయివేటు సంస్థలకైతే 80 శాతం బాధిత కుటుంబాలు ఆమోదిస్తేనే భూసేకరణ మొదలు పెట్టాలి. షెడ్యూల్‌ ఏరియాలో గిరిజన భూములైతే ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని స్వాధీనం చేసుకుని బదిలీ చేయరాదు.


●సెక్షన్‌ 12(ఇ) ప్రకారం హక్కుదారుని అనుమతి లేకుండా ఆమోదం తెలపకుండా సదరు భూమిలోకి వెళ్లి ఎట్టి పనులూ చేయడానికి వీల్లేదు. కనీసం సర్వే కూడా చేయరాదు. .


●సెక్షన్‌ 26(1) ప్రకారం భూములకు నష్టపరిహారం చెల్లించాలి. భూసేకరణ ప్రతిపాదించిన సంవత్సరం నుంచి గతమూడు సంవత్సరాలపాటు పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు, కొనుగోలు భారత స్టాంపుల చట్టం 1899 మేరకు నిరారించిన భూమి మార్కెట్‌ విలువ ఆధారంగా ఏది ఎక్కువ ధరకు అమ్ముడుపోయి ఉంటే దాని ఆధారంగా నాలుగురెట్లు అధికంగా ఇవ్వాలి. సకాలంలో నష్టపరిహారం చెల్లించడంలో ఆలస్యమైతే 9 శాతం వడ్డీతో ఇవ్వాలి. 


●సెక్షన్‌ 45 ప్రకారం సేకరించే భూమి 99 ఎకరాలకు మించితే పునరావాసం, రీసెటిల్‌మెంట్‌ కోసం బాధిత మహిళలు, స్వచ్ఛందసంస్థ, జాతీయబ్యాంకు అధికారి, స్థానిక సంస్థల ప్రతినిధి, ఎమ్మెల్యేలతో కమిటీ వేసి బాధితులకు పరిహారం అందించాలి.

 

●సెక్షన్‌ 102 ప్రకారం సేకరించిన భూమిలో ఐదేళ్లలోపు ఎటువంటి అభివృద్ధి పనులూ చేపట్టకపోతే భూమి కోల్పోయిన వారికి తిరిగి ఇవ్వాలి. 


●సెక్షన్‌ 32 నుంచి 105 వరకు భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇతర ప్రాంతాల కు వెళ్లాల్సివస్తే వారికి విద్య, వైద్యం, ఇళ్లు, రోడ్లు వంటి 25 రకాల సౌకర్యాలు కల్పించాలి.


● సెక్షన్‌ 85 ప్రకారం పరిహారం పునరావాసం, రీసెటిల్‌మెంట్‌కు సంబంధించి ఏ అంశాలనైనా ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు ఎవరైనా ఉల్లంఘిస్తే సదరు వ్యక్తులకు కనీసంగా ఆరు నెలలు, గరిష్టంగా మూడు సంవత్సరాలపాటు శిక్ష విధించవచ్చు.


●2013 భూసేకరణ చట్టం రైతులకు వ్యవసాయ కార్మికులకు గ్రామీణ పేదలకు కొంత మేరకు భరోసా కల్పించింది.


●2014లోఅధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అభివృ ద్ధికి అడ్డుపడుతుందనే పేరుతో చట్టంలోని ప్రధాన అంశాలను తొలగిస్తూ బిల్లును ప్రతిపాదించింది. రాజ్యసభలో తగిన బలం లేకపోవడంతో రాష్ట్రపతి ఆమోదంతో ఆర్డినెన్స్‌తెచ్చింది. అయితే ఆర్డినెన్స్‌ కాలపరిమితి తీరిపోవడంతో ప్రస్తుత 2013 భూసేకరణ చట్టం ప్రకారం కొనసాగుతున్నది.


*సుప్రీంధర్మాసనం* :- భూసేకరణ చట్టాన్ని సంస్కరించాలని, పరిశ్రమలు, సెజ్‌ల ఏర్పాటుకోసం ప్రభుత్వం భూ సేకరణదారుగానే కాదు, పేదల పక్షాన వారి ప్రయోజనాల పరిరక్షకురాలిగానూ వ్యవహరించాలని సూచించింది. సారవంతమైన పొలాలున్న సన్న చిన్నకారు రైతులకు, వాటిలో 'సెజ్‌'లు నెలకొల్పదలచినవారికీ మధ్య దేశంలో ఇప్పుడు భూ పోరాటం సాగుతోందని డాక్టర్‌ స్వామినాథన్‌ అన్నారు. భూసేకరణపై సమగ్ర బిల్లు తెస్తున్నామని కేంద్రసర్కారు ప్రకటించింది. పవార్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం బిల్లు విధివిధానాలను రూపొందిస్తోంది. దీని ప్రకారం ప్రైవేటు పరిశ్రమలకోసం పారిశ్రామికవేత్తలే స్వయంగా 70శాతం భూమి సేకరించుకొంటే, ప్రభుత్వం మిగిలినదాన్ని సమకూరుస్తుంది. ఏడాదికి ఒక పంట కంటే ఎక్కువ పండే భూముల్ని భూసేకరణ నుంచి మినహాయిస్తారు.భూసేకరణ జరగకముందున్న జీవన అజిత్‌ సింగ్‌, మమతా బెనర్జీ వాదిస్తున్నారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాజధాని పేరిట మూడు పంటల పండే భూమిని చట్టాలకు విరుద్ధంగా సేకరించడం జరిగింది.


*ఎస్.ఆర్.ఆంజనేయులు*

*న్యాయవాది -9848018828*

ప్రసాదాల

 🙏🏻*ప్రసాదాల లోగుట్టు* (*medical benfits of hindu prasadam*)🙏🏻


ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .


*జీర్ణశక్తిని పెంచే ' కబెట్టె పొంగళి*

" బియ్యం , పెసరపొప్పు , జీలకర్ర , ఇంగువ , నెయ్యి , అల్లం , శొంఠిపొడి , ఉప్పు , కరివేపాకు , జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని , జీర్ణశక్తిని పెంచు తుంది . మంచి ఆకలిని కలిగిస్తుంది .


*జీర్ణకోశ వ్యాధుల నివారిణి ' పులిహోర*

' బియ్యం , చింతపండుపులుసు , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి ఉప్పు , ఇంగువ , పసుపు , బెల్లం , నూనె , వేరుశన గలు , జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది . జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది .


*మేధస్సును పెంచే దద్ధోజనం*

' బియ్యం , పెరుగు , ఇంగువ , కొత్తిమీర , అల్లం , - మిర్చి కొంఠి పొడిల మిశ్ర మంతో తయారు చేసే ఈ - ప్రసాదం మేధస్సును పెంచుతుంది . శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది .


*వార్ధక్యాన్ని నిలువరించే ' కదంబ '*

బియ్యం , చింతపండు , ఎండుమిర్చి పోపులు , ఇంగువ , నూనె , ఉప్పు , కందిపప్పు పసుపు , బెల్లం , నెయ్యి , బెండకాయ , వంకాయ , గుమ్మడికాయ , చిక్కుళ్లు , బీన్స్ , దోసకాయ , క్యారెట్ , టమోటా , చిలకడదుంపల మిశ్రమంలో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం . సప్తధాతువుల పోషణ చేస్తుంది . వార్ధక్యాన్ని నిలువరిస్తుంది . అన్ని వయస్సుల వారికి మంచి పౌష్టికాహారం .


*శ్లేష్మాన్ని తగ్గించే ' పూర్ణాలు "*

పచ్చిశనగపప్పు , బెల్లం , కొబ్బరి చురుము , యాలకుల మిశ్ర మంతో ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది . శ్లేష్మాన్ని తగ్గిస్తుంది . మంచి బలవర్ధకం .


*రోగనిరోధకశక్తిని పెంచే చలిమిడి*

' బియ్యం పిండి , బెల్లం , యాలుకలు , నెయ్యి , పచ్చకర్పూరం , జీడిపప్పు , ఎండుకొబ్బరికో రుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం


*కొబ్బరి పాల పాయసం*

కొబ్బరి పాలు పచ్చ కర్పూరం యాలకుల పొడి బాదంపప్పు కుంకుమపువ్వు పంచదార ఆవు పాలు _కలకండ_ పొడి తో చేసే ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్రేష్మాన్ని హరిస్తుంది.


🙏🏻గోమాతను పూజించండి    గోమాతను సంరక్షించండి🙏🏻

శ్లోకం.. 22/25*

 *శ్లోకం.. 22/25*


*యో దేవేభ్య ఆతపతి! యో దేవానాం పురోహితః!*

*పూర్వో యో దేవేభ్యో జాతః! నమో రుచాయ బ్రాహ్మయే!!*


*భావం*


ఎవరు దేవతలకు తేజస్సుగా  వెలుగొందుతున్నాడో, ఎవరు దేవతల గురువుగా భాసిస్తున్నాడో, ఎవరు దేవతలకంటే పూర్వమే ఉధ్భవించినాడో, ఆ ప్రకాశమానుడైన భగవంతునికి నమస్కారము.

శివానందలహరి 66_ వ శ్లోకం

 శివానందలహరి

66_ వ   శ్లోకం

" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ":

అవతారిక :

శంకరులు  ఈ శ్లోకం లో తనను రక్షింపుమని 

ఈశ్వరుణ్ణి కోరారు.


శ్లోకం :క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః

యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ ।

శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం

తస్మాన్మామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా ।।66।।


తాత్పర్యము :


ಓ పరమేశ్వరా !  ಓ పశుపతీ !  నీవు నీ వినోదము

కొఱకే, ఈ సర్వ ప్రపంచాన్నీ సృష్టిస్తున్నావు.  ఈ

జనమంతా  నీ వినోదం కోసం ఏర్పడ్డ జంతువులు.

వారి వారి పెంపుడు జంతువుల నడవడులు, వారికి

ప్రేమాస్పదములు కావడం జగత్ప్రసిద్దమే.  కాబట్టి

నేను చేసే సత్కర్మలు గానీ , దుష్కర్మలు గానీ, ఏ చేష్ట

లయినా, నీకు అవి తృప్తికరములే అవుతాయి.

కాబట్టి నీవు నన్ను రక్షింపవలసిన వాడవవు  తున్నావు.  (పిల్లలు తమ ఆట బొమ్మలను తాము 

రక్షింౘు కొనే విధంగా నీవే నా రక్షణమును చేయ

వలసి యుంది ) అది నీ కర్తవ్యం.


వివరణ :


శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరుడికి ఇలా నివేదించారు

" ಓ శంభూ ! పశుపతీ ! ఈ ప్రపంచాన్ని సర్వమునూ

నీవే నీ ఆట కోసం పుట్టిస్తూ వున్నావు. నీవు సర్వ వాంఛలూ తీరిన వాడవు. అలాటప్పుడు  ఈ పంచ 

భూతాలు అనే ముడి పదార్థాల తో నీవు నిర్మించే ఈ

ప్రపంచం , నీవు సరదాగా ఆడుకోవడం కోసమే. ఈ

ప్రపంచములోని జనులంతా నీ చేతి లోని కీలు బొమ్మ

లు. వీరంతా నీ విలాసం కోసం సృష్టింౘ బడ్డ మృగాలు.  వీరు నీ వాడించి నట్లల్లా ఆడుతారు. 

నీవు తిప్పేవాడవు వారు తిరిగేవారు.  నీవు జగన్నాటక సూత్ర ధారివి. ఈ ప్రపంచానికీ దీనిలోని

ప్రజలకు ఏమాత్రం స్వతంత్ర త లేదు. భగవద్గీత లో

పరమాత్మ సైతమూ ఇలాగే చెప్పాడు.


 " ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి   భ్రామయన్ సర్వభూతానియంత్రారూఢానిమాయయా


తాత్పర్యము :


అర్జునా!  శరీర రూప యంత్రములను అధిరోహించిన

సర్వ ప్రాణుల హృదయాలయందూ, అంతర్యామి గా ఉన్న పరమేశ్వరుడు, తన మాయ చేత వారి వారి

కర్మలననుసరించి వారిని తిప్పు తున్నాడు.


కాబట్టి నాతప్పేమీ లేదు . నేను చేసిన తప్పేదైనా

వుంటే నేను ఒకడిని ఉన్నానని అనుకోవడం మాత్రమే

ప్రపంచములో ఉన్నదంతా నీవే. అందువల్ల నేను 

మంచి చేసినా ,చెడు చేసినా అది నీకు ప్రీతికరంగా 

ఉండాలి .  నేను చేసిన చేష్టలన్నీ నీ వేడుకకు సాధన

ములు.  కాబట్టి నన్ను రక్షింౘడం నీ కర్తవ్యం. 


తోలుబొమ్మలాట లో బొమ్మ లన్నీ సూత్రధారుని 

ఇష్టాను సారంగా తిరిగి వినోదాన్ని కల్పిస్తాయి. అదే

విధంగా జగన్నాటక సూత్రధారుడైన పరమాత్మ 

ఇచ్ఛాను సారంగా నడిపే మన జీవిత రూపమైన ఈ

జగన్నాటకం , పరమేశ్వరుని కి వినోదాన్నే కల్పిస్తుంది.


LIKE | COMMENT | SHARE |


🔱   శివానందా రూపం శివం శివం  🔱

ఉన్నత వ్యక్తిత్వం కోసం

 ఉన్నత వ్యక్తిత్వం కోసం.... అసూయ, ద్వేషాలను విడనాడాలి..


🍁🍁🍁


ప్రతి వ్యక్తీ గొప్పవాడు కావాలని కలలు కంటుంటాడు. ఇది సహజం. కానీ, అందరికన్నా గొప్పవాడు కావాలని కొందరు ఆరాటపడతారు. అలా కావటానికి చేతనైన అన్ని రకాల విధానాలూ అనుసరిస్తారు. అడ్డదారులు తొక్కుతారు. అవినీతికి సిద్ధపడతారు. అనాయాసంగా, నిస్సంకోచంగా అబద్ధాలు ఆడతారు.


కొందరు విశేషంగా ధనం సంపాదించి, తాము గొప్పవారమనే భ్రమతో గర్విస్తారు. మరికొందరు హోదా లభించగానే అధికార దర్పం, అహంకారం ప్రదర్శిస్తారు. ఇది కూడా ఆధిక్యతాభావం వల్లనే !


కొందరు తమకంటే అందరూ తక్కువ స్థాయిలోనే ఉండాలని కోరుకుంటారు. తమకన్నా ఎవరు మించిపోతున్నా భరించలేరు. అసూయతో కుమిలిపోతారు. వారిమీద కక్షగా ఉంటారు. అవకాశం లభిస్తే, ఏదో విధంగా, తమకన్నా అధికులకు అపకారం చేస్తారు. వారికి కష్టనష్టాలు కలిగినప్పుడు, లోలోపల సంతోషపడుతూ, పైకి కపట సానుభూతి ప్రకటిస్తారు.


దుర్యోధనుడికి సుయోధనుడు అనే మరొక పేరు ఉంది. నిజానికి అతడు అసూయాధనుడు. పాండవుల ఔన్నత్యాన్ని, ఆధిక్యతను సహించలేక పోతుండేవాడు. బాల్యం నుంచే పాండవుల పట్ల అసూయ, ద్వేషం కలిగి ఉండేవాడు.


అసూయ అగ్ని వంటిది. ద్వేషమూ అంతే._


ఏ కర్ర నిప్పు ఆ కర్రనే కాల్చినట్టు, ఎవరు అసూయాపరులో, వారినే అసూయాద్వేషాలు దహిస్తాయి. ఇది నిత్య సత్యం.


*'స్పర్ధయా వర్ధతే విద్య'- చదువులో అసూయ తప్పులేదు. కానీ, అది ద్వేషపూరితంగా ఉండకూడదు. పోటీతత్వంతో, పట్టుదలగా విద్య నేర్వాలి. వాయిదాలు వేయకుండా విద్యాకృషి చెయ్యాలి. 'రేపు చదవొచ్చు' అని బద్ధకిస్తే, చివరికది పరీక్షల సమయం దాకా ఆచరణగా మారదు ! అప్పుడు ఆందోళన, ఆవేదన పడుతూ ఆరోగ్యభంగం చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు నిరాశా నిస్పృహలకు లోనై ఆత్మహత్యకు పాల్పడతారు. ఇవన్నీ చేయకూడని పనులే.


'కృషితో నాస్తి దుర్భిక్షం'- నిరంతర కృషి ఒక్కటే విజయ ద్వారాలకు తాళపు చెవి. మరే అడ్డదారులూ ఉండవు. సత్కార్యాలకు ఆలోచన- ఆచరణ మధ్య ఆలస్యం ఉండకూడదు.


 కర్ణుడు ఎడం చేత్తో బంగారు పాత్రను దానం చేయటానికి గల కారణం చెబుతూ- 'చెయ్యి మార్చుకునే లోగా మనసు మారిపోవచ్చు' అనటం అందరికీ ఆదర్శం. 


ప్రజాసేవ చేస్తామనేవారికన్నా, చేస్తున్నవారినే ప్రజలు నమ్ముతారు.


భక్తిని బోధించేవారిని కాకుండా, భక్తిగా జీవించేవారినే భగవంతుడు సైతం ఇష్టపడతాడు. అసూయ లేకపోవటం ఎంత గొప్పదంటే- అసూయలేని ఏకైక మహిళగా, అత్రి మహర్షి అర్ధాంగిగా వినుతికెక్కిన అనసూయా దేవి పుత్రుడిగా జన్మించటానికి, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు ఇష్టపడ్డాడు.


అసూయలేని హృదయం పరిశుద్ధ దేవాలయం. అసూయ లేదంటే, ప్రేమకు నిలయమని అర్థం. ప్రేమ పున్నమి వెన్నెల వంటిది. అందర్నీ ఆకట్టుకొంటుంది. భగవంతుని కూడా ప్రసన్నుణ్ని చేస్తుంది. అసూయ లేనివారికి ద్వేషం ఉండదు. శత్రువులూ ఉండరు.


ఉన్నత వ్యక్తిత్వం కేవలం అసూయా రహితులకే సాధ్యం. మనం మన దేహంలోని రోగాల నుంచి విముక్తి పొందటానికి తహతహలాడతాం.


అసూయ నుంచి విముక్తి పొందటానిక్కూడా తహతహలాడాలి. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జీవితం సాధ్యపడుతుంది !


🍁🍁🍁🍁

నీటిని తీసుకునే విధానం -

 నీటిని తీసుకునే విధానం  - 


 *  భోజనము చేయు సమయంలో మధ్యమధ్యలో కొద్దికొద్దిగా తీసుకోవడం వలన వాతపిత్తశ్లేష్మములను సమత్వం బొందించును. సమస్త ధాతువులకు సౌఖ్యం , సౌమ్యత కలుగజేయును. 


 *  జఠరదీప్తిని కలుగజేయును. అన్నం జీర్ణం కావించును. 


 *  భోజనకాలం నందు అధికముగా ఉదకపానం చేసిన , దాహం వేసినప్పుడు తగినంత నీరు పుచ్చుకొనచుండిన అన్నం అరగదు .


 *  భోజనం చేసిన తరువాత అధికంగా నీటిని తీసుకొనడం వలన జఠరాగ్ని మందగించి దేహమును కృశింపచేయును. కఫం పెంచును. 


 *  మిక్కిలి దాహంగా ఉన్నప్పుడు భొజనం చేసిన శరీరంలో గుల్మాలు ( వ్రణాలు ) , మిక్కిలి ఆకలిగా ఉన్నప్పుడు నీరు ఎక్కువ తాగిన భగంధర రోగమును పుట్టించును. 


 *  కడుపు నిండుగా ఉన్నప్పుడు , దాహం కాకుండా ఉన్నప్పుడు , అప్పటివరకు కష్టం అయిన పనులు చేసి వెంటనే నీరు తీసుకోవడం , నిద్రపోయి లేచిన మరుక్షణం , స్నానం చేసిన వెంటనే , స్త్రీ సంభోగం చేసిన వెంటనే , నిద్ర మధ్యలో లేచి , పరగడుపున , నిలబడియు , నడుముకి గట్టిగా బిగుంచుకొని , పడుకొని నీరు సేవించడం వలన అనేక రోగాలు పుట్టుటకు కారణం అవుతుంది. 


 *  అమితంగా నీటిని సేవించటం వలన పొట్టకి నష్టం చేయును . నరములకు జబ్బు కలుగును. పొట్టకి నష్టం చేయును . లివర్ కి సమస్య సృష్టించును. బుద్ధిమాంద్యం తెచ్చును. పడిసెం పట్టును. దేహం లావు ఎక్కును. కాళ్ళు చేతులు ఉబ్బును. కళ్లక్రింద తెల్లబారును. ముఖము యొక్క తేజస్సులో మార్పు వచ్చును. అతిమూత్రం మొదలగు అనేక రోగాలు వచ్చును. 


 *  అధికంగా దాహం అయినప్పుడు  ఒకేమారు అధికమొత్తంలో నీటిని పుచ్చుకొనరాదు. కొంచంకొంచం రెండుమూడు సార్లుగా తీసికొనవలెను. 


 *  చలువచేసేది ఫలములు , నీరు కలిగిన ఫలములు అనగా నారింజపండు , కమలాఫలం , బత్తాయి , పనసపండు , అరటిపండు , నేరేడుపండు , అనాసపండు , కర్బూజ పండు మొదలగు ఫలములు , మిఠాయి మొదలగు తీపి వస్తువులు , బెల్లము, వరిపిండితో చేసిన వస్తువులు , సెనగపప్పు మొదలగు పప్పుజాతులు , చేపలు , మామిడిపండ్లు తినినవెంటనే , పాలు త్రాగినవెంటనే , తాంబూలం వేసుకున్న వెంటనే  నీటిని త్రాగరాదు. అలా తీసుకున్నచో మలినమైన ఆహార రసం పుట్టును. పొట్టని జెఱుచును. అజీర్ణ విరేచనాలు అగును. 


 *  కుండలో గాని , బిందెలో గాని ఉన్నటువంటి సహజంగా ఉండు చల్లబడిన నీటిని మాత్రమే తాగవలెను. ఫ్రిజ్ మరియు వడగండ్ల తో చల్లబడిన నీరు ఏ కాలం నందు అయినను పుచ్చుకొనరాదు. పుచ్చుకొనిన దీర్ఘకాలంలో ఉబ్బసదగ్గు , క్షయ మొదలగు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు తప్పక వచ్చును. 


       పైన చెప్పిన విధముగా విరుద్ధంగా నీటిని తీసుకున్నచో కలిగెడు వికారములు కు విరుగుళ్లు ఉసిరికాయ , త్రిఫలా కషాయం . 


 

   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ధూళికణం

 




#ధూళికణం 🌍

ఈ అనంత విశ్వంలో #భూమి కూడా ఓ ధూళి కణమే 

చిత్రంలోని తెల్లని చుక్కను గమనించారా మిత్రులారా... పెన్నుతో వృత్తాకార వలయం కనుక గీయకపోయి ఉంటే కనిపించనంతటి చిన్న చుక్క.

#వాయేజర్_ఎయిర్_క్రాఫ్ట్ .

#శనిగ్రహం మీది నుంచి తీసి పంపిన ఈ చిత్రంలో విశ్వంలోని ఒక ధూళికణం పరిమాణంలో మాత్రమే కనిపిస్తున్న ఆ తెల్లని చుక్క ఇంకేదో మరేదో కాదు..

780 కోట్ల మంది ప్రజలకు కొన్ని లక్షల కోట్ల జీవరాశులకూ ఆవాసమైన మన #భూమి... #ధరిత్రి.... #అవర్ఎర్త్...


ఈ విశ్వం తో పోలిస్తే ఒక ధూళికణం సైజులో మాత్రమే ఉన్నది భూమి...ఆ భూమితో పోలిస్తే ధూళికణం కంటే కూడా చిన్నవాడు మనిషి... *తాను సంపాదిస్తున్నాను అనుకుంటున్న స్థలాలు పొలాలు, మిద్దెలు, మేడలు,, బంగారం,, డబ్బు,, హోదా ఎక్కడ... ఎవరి దగ్గర వాటి గుర్తింపు* ఈ మాత్రం దానికే ఈ గొప్పలు.. గొడవలు అయినా.... 


కానీ ఆ మనిషి లోని "#అహం"...ఈ విశ్వవిశ్వంతరాల కంటే కూడా పెద్దదిగా ఉండటమే విచిత్రం....దురదృష్టం కూడా...! అంతా శున్యం... అంతా భ్రమ అంటున్న అర్థం కాదు..

This couple

 





This couple 👇👇have really done extraordinarily great work. From a middle class family, the lady sold her jewellery worth Rs.1.25 lacs to set up a fund and then the couple launched a sustained campaign through lectures and rallies and with public support, raised about Rs 2crore, needed to import from Germany and set it up at the Siachin hospital, a plant to generate oxygen for our braveheart soldiers who are doing the most arduous duty in that area. There will be enough oxygen for 20,000 army men over there. A big problem faced by our Army has been resolved because of this Deshbhakt couple from Pune.

Salutation to them. Their names are Yogesh and Sumedha Chithade..!👍👏👏👏👏👇👇

దేవీ నవరాత్రులు



























 

ప్రవచనములు




 

ఆత్మపరిశీలన

 ఆత్మపరిశీలన చేసుకుందాం 


హిందువులు అల్పసంఖ్యాకులే !

సామవేదం షణ్ముఖశర్మ

భారతదేశంలో హిందువులు అధిక సంఖ్యాకులు. కానీ మరో కోణంలో అల్ప సంఖ్యాకులు. మనం మైనారిటీ అనుకుంటున్న వారే అధికసంఖ్యాకులనడం సత్యదూరం కాదు. ఒక్కసారి పరిశీలిస్తే ఈ వాస్తవాన్ని అంగీకరించుతాం. హిందువులు పేరుకి ఎక్కువ సంఖ్యలో ఉన్నా, అందులో కొందరు కేటాయింపుల కోసం హిందువులుగా చెలామణి అవుతూ, ఇతరుల మతాల్లోకి మారిన వారు.

మరికొందరు - ఇందులో ఉన్నా ఈ మతం పట్ల శ్రద్ధ, హిందువులుగా జీవించాలనే ఆసక్తి, ఈ మతాన్ని కాపాడుకోవాలనే భక్తి ఏ మాత్రం లేనివారు. ఏదో పండక్కో, పబ్బానికో, పురుటికో, చావుకో కాసింత హిందూ పద్దతి అవలంబిస్తారు. మొక్కులు తీర్చుకోడానికి గుళ్ళోకి వెళతారు. అంతేకానీ హైందవ ధర్మానికీ, ఆలయాలకీ ప్రమాదం వాటిల్లుతున్నా స్పందించరు. నాయకులు వివక్ష చూపిస్తున్నా చలించరు. పైగా ‘ఏ మతమైతే ఏం పోయింది?’ అని ఉదాసీనంగా ఉంటారు.

ఇంకొందరు - నాస్తికులై హిందూ గ్రంథాలను, దైవాలను, సంప్రదాయాలను, ఆలయాలను దుయ్యపడుతుంటారు. పుస్తకాలు రాస్తుంటారు.

ఇలా హిందువుల్లో మూడు రకాల వారిని మినహాయిస్తే - శ్రద్ధగా ధర్మాన్ని అవలంబిస్తున్నవారు అల్ప సంఖ్యాకులే. నిజమైన హిందువులు వీరే. దీనికి వ్యతిరేకంగా-ఇతర మతాల్లో వారు నూటికి నూరు పాళ్ళు ఒకే రకంగా ఉంటారు. కుటుంబా లన్నీ తమ మతాన్ని మించిన మతం లేదనే తీవ్ర అభినివేశంలో ఉంటారు. తమ మత గ్రంథాలపై, శ్రద్ధా కేంద్రాలపై, అలవాట్లపై వ్యతిరేకంగా మాట్లాడరు. ఇతర మతాలను అణచివేయడంలో, దూషించడంలో వెనుకాడనంత ఉగ్రాభిమానం కూడా ఉంటుంది. పిల్లా, పెద్దా, ఆడా, మగా ఖచ్చితంగా మత పద్దతులు అధ్యయనం చేస్తారు, అవలంబిస్తారు. తమ మత నాయకుడు అవినీతిపరుడైనా, హింసా స్వభావి అయినా కిమ్మనరు. పైగా ఒకే తాటిపై నిలబడి అతడిని విజయుడ్ని చేస్తారు. తమ మతాల పేరున తీవ్రవాదం ఉగ్రవాదాలతో ఉత్పాతాలు సృష్టిస్తున్న సంస్థల్ని కూడా పల్లెత్తు మాట అనరు.


ఇలా అన్య మతాలు రెండూ చక్కని అనుష్ఠాన నిష్ఠతో ఉంటారు. వారిలో రెండో రకం లేదు. అందుకే వాళ్ళు సంఖ్యలోనూ, అనుష్ఠానంలోనూ, దృఢంగా ఉంటారు. వాళ్ళిద్దరి అభిలాష, తమ మతం ఈ దేశాన్ని ఏలాలి. వాళ్ళ లక్ష్యం హిందూమతం అణచివేయబడాలి. వీరి తపన ఆ దిశగా కృషి చేయడమే. వీరిలో ఉన్న ఈ ఏకతాటి లక్షణాన్ని గమనించిన హిందూ(పుట్టుకతో) నాయకులు కూడా వీళ్ళని మురిపిస్తూ, మెప్పిస్తూ, బుజ్జగిస్తూ, జాతి సంపద పంచిపెడుతుంటారు. వాళ్ళ పండుగల్లో వెళ్ళి వాళ్ళ వేషాలు వేసుకొని విందులారగిస్తుంటారు. కానీ ఆ మతాలకి చెందిన ఒక్క నాయకుడు కూడా హిందూ పండగల్లో కనపడరు. వీలైతే ఆంక్షలు పెట్టేలా గొడవలు చేస్తారు. ఈ హిందూ నాయకులకు తెలుసు. నాలుగు రకాల హిందువుల్లో మళ్ళీ ‘మా కులం వాడే రావాలి - కావాలి’ అనే గోల చేసే నలభై రకాలున్నారని. వీరు ఏనాడూ హిందువులను సంఘటిత పరచలేరని.


భారతదేశంలో నిన్న కాక మొన్న జరిగిన తాజా ఎన్నికల ఫలంగా పేట్రేగిపోయిన కొందరు దౌర్జన్యంగా ఆకుపచ్చ జండాలతో దాడులు చేసి ‘పాకిస్తాన్‍కీ జై .....’ అంటూ బిగ్గరగా నినాదాలు చేసినా - ఏ రక్షణ వ్యవస్థా, ఏ నాయకమ్మన్యుడూ నోరెత్తలేదు. చర్య తీసుకోలేదు. దేశ భద్రతకి, వ్యవస్థకీ పెనుప్రమాదం పొంచి ఉందని తెలిసినా స్పందన లేదు. మతం మారడం లేదనే అక్కసుతో ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఒక దేవీ మందిర ఉత్సవ సమయంలో ఆలయంలో చొరబడి ప్రసాదంలో విషం కలిపి అనేకమంది అమాయకుల మరణానికి కారకులయ్యారు.

ఇటువంటివి హిందూ మనుగడకి మాత్రమే కాదు, దేశ క్షేమానికీ, శాంతి సామరస్యాలకు ప్రమాదకరమైన పరిస్థితి. అల్పసంఖ్యాకులైన హిందువులు ఏం చేయగలరు? అన్ని మతాలవారితో సహా అందరం హాయిగా ఉండాలి - అని కోరుకునే స్వభావం సహజంగా కలిగిన హిందువులు బలంగా ఉండకపోతే, ఈ దేశంలో ఉనికి కూడా అసాధ్యమౌతుంది. ఇప్పుడు, వేల ఏళ్ళ క్రితం ఉన్న పరాయి పాలనకు భిన్నంగా ఏమీ లేదు. కేరళ, పశ్చిమబెంగాల్‍, కాశ్మీర్‍, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హిందువులు మనుగడ సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‍, మధ్యప్రదేశ్‍, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో నేటికీ కొన్ని ప్రాంతాలలో (అన్యుల ప్రాధాన్యం ఉన్నవి) . హిందువులు అనుక్షణం అభద్రతతో, భయాందోళన ల్లోనే బిక్కు బిక్కుమంటున్నారు.


కొందరు మేధావులు గణాంక వివరాలతో సహా వాస్తవాల్ని చెబుతుంటే అవి ఫేస్‍బుక్కుల్లో, వాట్సాప్‍లలో, యూ ట్యూబ్‍లలో లైకింగ్‍లు, షేరింగ్‍లతో సరిపోతున్నాయి. సరియైన ప్రతిచర్య లేదు. ప్రధాన మాధ్యమాలన్నీ వాస్తవాల్ని కప్పిపెడుతున్నాయి. తమ కుల నాయకులకు భజనలు చేస్తూ, పల్లకీలు మోయడంతోనే కాలక్షేపం చేస్తున్నాయి. గతచరిత్రలో భారతీయతపై, హిందూధర్మంపై జరిగిన అన్యుల దాడులు, దౌర్జన్యాలు గానీ, నేడు జరుగుతున్న కిరాతకాలు గానీ నేడు హిందూ యువతకి తెలియవు. వారు ‘నోటా’వర్గంలో ఉంటారు. బాధ్యతతో దేశ ధర్మాలను కాపాడుకునే ప్రయత్నం చేయరు.


ఈ నేపథ్యంలో ఈ దేశాన్నీ, ధర్మాన్నీ పరిరక్షించమని పరమేశ్వరుని ప్రార్థించడం కన్నా ఏమి చేయగలం! స్పందన లేని స్వార్ధజాతిని మేల్కొల్పమని వేడుకోవడం కన్నా ఏమి సాధించగలం!

[ ఋషిపీఠం పత్రిక సౌజన్యంతో ]

టెలిగ్రామ్’ ద్వారా (గురుగీత) పొందాలనుకునేవారు:

HTTPS://T.ME/GURUGEETA

మొగిలిచెర్ల అవధూత

 జీవితానికో గమ్యం..


2019 వ సంవత్సరం దేవీ నవరాత్రుల సమయం లో ఒక గురువారం ఉదయం 9.30 గంటలకు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు ఓ 65 ఏళ్ల పైబడిన ఆడమనిషి ఒక చిన్న చేతి సంచీ ని భుజానికి తగిలించుకుని వచ్చారు..మందిర ప్రాంగణంలో కి వచ్చిన తరువాత ఒకసారి ఆ ప్రదేశం అంతా తేరిపారా చూసి..నీళ్ల పంపుల వద్దకు వెళ్లి..కాళ్ళూ చేతులు కడుక్కొని..క్యూ లైన్ లో వెళ్లి..స్వామివారి సమాధిని దర్శించుకొని..తిరిగి మేము కూర్చుని ఉన్న చోటుకు వచ్చారు.."బాబూ..ఇక్కడ ప్రసాద్ గారంటే ఎవరు?" అని నన్నే అడిగారు.."నేనేనండీ.." అని చెప్పి కుర్చీలో కూర్చోమన్నాను.."చెప్పండమ్మా.. ఎక్కడినుంచి వచ్చారు?..మీ పేరు.." అని అడిగాను.."నా పేరు అరుంధతి..హైదరాబాద్ నుంచి వచ్చాను..నేను ఎక్కువగా దత్తక్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటాను..ఈ ప్రదేశం గురించి విన్నాను..చదివాను..చాలా రోజుల క్రితమే ఇక్కడికి రావాలసింది..కానీ..గాణుగాపూర్ లో నలభైరోజులు ఉండడం మూలంగా..ఇక్కడికి రావడం ఆలస్యం అయింది.." అని చెప్పారు.."ఇక్కడ మూడురోజులు ఉండాలని అనుకున్నాను..దత్తుడి ఆజ్ఞ ఎంతవరకూ ఉంటే అన్నాళ్లు ఉంటాను..నాకు కాలకృత్యాలకు, స్నానానికి ఏర్పాటు ఉంటే చాలు..ఈ మంటపం లోనే ఉంటాను.." అన్నారు.."అలాగేనండీ.." అని చెప్పి..మా సిబ్బందికి ఆమెకు కావాల్సిన ఏర్పాటు చేయమని చెప్పాను.."అమ్మా..ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది.. శనివారం నాడు రాత్రికి కూడా ఆహారపు ఏర్పాటు ఉన్నది.." అని చెప్పాను.."చాలండీ..నేను ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తాను..స్వామివారి జీవితచరిత్ర పుస్తకం ఇక్కడ ఉన్నదా?.." అని అడిగారు.."ఉన్నది..అక్కడ తీసుకోండి.." అని చెప్పాను..సరే అని లేచి వెళ్ళిపోయి..పుస్తకం కొనుక్కొని..స్వామివారి సమాధి దర్శననానికి టికెట్ తీసుకొని..సమాధి వద్దకు వెళ్లి..ఓ ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసుకొని నిలబడి..ఇవతలకు వచ్చేసారు...పూజారిగారు అర్చన చేయడానికి గోత్రనామాలు అడిగితే..తన కుమారుడు, కుమార్తెల గోత్రనామాలు ఇచ్చి..అర్చన చేయించుకొని ఇవతలికి వచ్చేసారు..


ఆ తరువాత ఆవిడ ముఖ మంటపం లోకి వెళ్లి కూర్చుని స్వామివారి జీవితచరిత్రను చదువుకోసాగారు..మా పనుల్లో మేము ఉండిపోయాము..మధ్యాహ్నం అన్నదాన సత్రానికి వెళ్లి భోజనం చేసివచ్చారు..సాయంత్రం స్వామివారి హారతి ఇచ్చిన తరువాత..మా సిబ్బంది వద్దకు వచ్చి.."బాబూ..నేను రాత్రికి మంటపం లోనే పడుకుంటాను.." అన్నారు..ప్రక్కరోజు శుక్రవారంనాడు కూడా తన పాటికి తాను స్వామివారి చరిత్ర పారాయణం చేసుకుంటూ ఓ ప్రక్కగా వున్నారు..శనివారం నాడు ఉదయాన్నే లేచి..ఒక ఆటో మాట్లాడుకుని..మాలకొండకు వెళ్లి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని మధ్యాహ్నం వచ్చారు..ఆరోజు సాయంత్రం పల్లకీసేవలో అర్చన చేయించుకొని..పల్లకీతోపాటుగా మూడు ప్రదక్షిణాలు చేశారు..ఆదివారం ఉదయం భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి..అందరూ దర్శించుకొని వెళ్లిపోయిన తరువాత..ఎవ్వరూ లేని సమయంలో నా వద్దకు వచ్చి.." బాబూ..మరో వారం ఇక్కడ ఉండాలని దత్తుడి ఆజ్ఞ వచ్చింది.. ఇక్కడే వుందామనుకుంటున్నాను..మీకేమీ ఇబ్బంది లేదు కదా?.." అన్నారు.."అమ్మా..మీ పాటికి మీరు వున్నారు..మీ వల్ల మాకేమీ ఇబ్బందీ లేదు..స్వామివారి అనుమతి ఉన్నంతవరకూ వుండండి.." అన్నాను..


అలా చెప్పిన అరుంధతి గారు ఆ తరువాత మరో పదకొండురోజులు స్వామివారి సన్నిధిలోనే వున్నారు..మొత్తంగా 28 రోజులు వున్నారు..సరిగ్గా గురువారం నాడే..మధ్యాహ్నం నా వద్దకు వచ్చి.."బాబూ..ఈరోజు సాయంత్రం బస్ లో నేను మా ఊరికి వెళుతున్నాను..ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది..ఆ స్వామివారు కరుణిస్తే.. నా శేష జీవితం ఇక్కడే గడపాలని అనుకుంటున్నాను..నాకు బాధ్యతలేమీ లేవు..నా కుమారుడు, కుమార్తె ఇద్దరూ వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు..మూడేళ్ల క్రితం మావారు కాలం చేశారు..నేనూ ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను..నా పెన్షన్ తో నాకు లక్షణంగా గడిచిపోతుంది..ఈ నాలుగు వారాల్లో ఇక్కడి వాతావరణం చూశాక..ఒకటి అనిపించింది..నేను నా ధ్యానం అనే ధ్యాసలో వున్నాను..ఇతరులకు కూడా సహాయం చేస్తే..మరింత తృప్తిగా వుంటుంది అని అర్ధం అయింది..నా లాంటి వాళ్ళు ఇక్కడ ఉండాలంటే కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి..ఆ దిశగా మీరు ఆలోచన చేయండి..నా వంతు ఆర్ధిక సహాయం నేను చేస్తాను..దత్తుడు నాకు ఈ రకంగా ఉపయోగపడమని అనుజ్ఞ ఇచ్చాడు..నేను మరలా ఒక నెలరోజుల్లో వస్తాను..ఈసారి నలభైరోజులు ఇక్కడే ఉంటాను..గత రెండేళ్లుగా ఎన్నో దత్తక్షేత్రాలు చూసాను..ఈసారి అలాకాదు.. జీవితానికి ఒక సార్ధకత ఉండాలని నా మనసుకు గట్టిగా అనిపించింది.. నేను చెప్పిన సౌకర్యాల గురించి ఆలోచించండి..ఇన్నాళ్లూ ఆదరించినందుకు ధన్యవాదాలు.." అని చెప్పి వెళ్లిపోయారు..


ఆ తరువాత అరుంధతి గారు మరోసారి వచ్చి, తాను చెప్పినట్టే నలభైరోజులు వున్నారు..మేము నిర్మిస్తున్న డార్మెటరీకి ఆర్ధికంగా సహాయం చేసారు.."ఈ క్షేత్రాన్ని ఒక మంచి ధ్యాన ప్రదేశం గా మార్చండి బాబూ.." అని చెప్పారు..మొత్తంమీద మూడుసార్లు స్వామివారి మందిరానికి వచ్చిన అరుంధతి గారు ప్రతిసారీ ఒకమాట చెప్పారు.."ఇక్కడికి వచ్చిన తరువాత..నా జీవితానికి ఒక గమ్యాన్ని చూపారీ స్వామివారు..సాటి మనిషికి సహాయం చేయని జీవితం వృధా కదా?" 


ఆ మార్పుకు కారణభూతుడైన స్వామివారు మౌనంగా సమాధి లో వున్నారు..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).

ధార్మిక ప్రాధాన్యత

 ధార్మిక ప్రాధాన్యత*


గుడిలో దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే అష్టోత్తరశతనామావళితో పూజిస్తాము. ఆ దేవుని నామస్మరణ చేసుకోవాలంటే 108 పూసలు ఉన్న మాలని వాడతాము. 108 అన్న సంఖ్య అనాదిగా మన పురాణాలలో కనిపిస్తూనే ఉంటుంది. క్షీరసాగరమథనంలో సైతం 54 మంది రాక్షసులు, 54 దేవగణాలు కలిసి చిలికిచిన సాగరంలోంచి అమృతం వెలికి వచ్చింది. మనిషిలో మంచీ, చెడు లక్షణాలు రెండూ ఉంటాయనీ... వాటిలో మంచిది పైచేయి అయినప్పుడు అమృతమయమైన మోక్షాన్ని సాధించగలుగుతామనీ ఈ ఉదంతంలోని ఉద్దేశం కావచ్చు. అలా 108 మనలోని పరిపూర్ణతకు ఒక చిహ్నంగా భావిచవచ్చునేమో! కేవలం క్షీరసాగరమథనమే కాదు- వైష్ణవ దివ్యదేశాలు, శ్రీ కృష్ణుని ముఖ్య గోపికలు... ఇలా మన ధార్మిక జీవితంలో అడుగడుగునా 108 ప్రసక్తి వస్తూనే ఉంటుంది.


పాశ్చాత్య విజ్ఞానం ఇంకా తప్పటడుగులు వేస్తుండగా, వందల ఏళ్ల క్రితమే మన ఖగోళశాస్త్రం పరిపక్వతకు వచ్చిందన్నది ఓ నమ్మకం. దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితమే వెలువడిన సూర్యసిద్ధాంతంలో, ఎక్కడో సుదూరాన ఉన్న శనిగ్రహపు చుట్టుకొలతను సైతం అంచనా వేయగలిగారు. అంతేకాదు! సూర్యుడి కిరణాలు, భూమిని చేరేందుకు ఎంత సమయం పడుతుందో కూడా చెప్పగలిగారు. ఇంతటి సూక్ష్మమైన లెక్కలు కట్టగలిగిన వీరికి ఈ విశ్వసృష్టిలో 108కి ఉన్న ప్రాధాన్యత ఎరుకలోకి వచ్చే ఉంటుంది. ఉదాహరణకు- సూర్యుని చుట్టుకొలతను 108తో హెచ్చిస్తే భూమికీ, సూర్యునికీ మధ్య ఉన్న దూరం వస్తుంది. అలాగే చంద్రుని చుట్టుకొలతను 108తో హెచ్చిస్తే భూమికీ, చంద్రునికీ మధ్య ఉన్న దూరం వస్తుంది. ఇక సూర్యుడు దాదాపు భూమికి 108 రెట్లు పెద్దగా ఉంటాడు. ఈ గణాంకాలన్నీ ఖచ్చితంగా కిలోమీటర్లు, మీటర్లతో సహా సరిపోలవు కానీ... 108కి అతి చేరువలో మాత్రం ఉంటాయి.


మన పెద్దలు స్థూల ప్రపంచంలో ఉన్న ఈ సంఖ్యను మానవ ధార్మిక, లౌకిక జీవితానికి ఆపాదించారేమో అన్న సందేహం కలుగక మానదు. అందుకు ఉదాహరణగా మన జాతకచక్రాలనే తీసుకోవచ్చు. పిల్లవాడు పుట్టిన సమయం ఆధారంగా అతను ఫలానా నక్షత్రంలోని ఫలానా పాదం అని అంచనా వేస్తాము. అలా 27 నక్షత్రాను నాలుగేసి పాదాలతో హెచ్చిస్తే 108 పాదాలు వస్తాయి. అంటే పుట్టినవారందరూ కూడా 108 వర్గాలలో ఏదో ఒక కోవకి చెందాల్సిందే అన్నమాట. ఈ రకంగా 108ని మన జీవితానికి అడుగడుగునా అన్వయించపేచేందుకు పెద్దలు ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. ఆఖరికి ఆ జీవితంలోని తత్వం అర్థం చేసుకునేందుకు రాసిన ఉపనిషత్తుల సంఖ్య కూడా 108.


మన పూర్వీకులు మనిషిని ఈ విశ్వంలోని ఒక భాగంగానే గమనించారు. ప్రపంచం మనిషినీ, మనిషి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలరని నమ్మారు. అందుకు అనుగుణంగానే జీవనశైలిని రూపొందించుకున్నారు. దానికి ఈ 108 సంఖ్య గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ఈ విశ్వానికీ 108 అన్న సంఖ్యకూ ఎక్కడో లంకె ఉన్నదన్న విషయాన్ని మన పెద్దలు నమ్మబట్టే దానికి అనుగుణంగా ధార్మిక సూత్రాలను ఏర్పరుచుకొన్నారు.


*డైలీ విష్* 

ఏకాదశులు..ఉపవాస ఫలితం

 *ఏకాదశులు..ఉపవాస ఫలితం*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


మన భారతీయ సనాతన ధర్మ (హిందూ) సాంప్రదాయములలో కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందు.. కర్మానుష్ఠానం కోసం కొన్ని పర్వములను నిర్ణయించారు మన పెద్దలు. 


ఆ పర్వములను కూడా తిథుల ప్రకారంగా నిర్ణయించడం జరిగింది. ఆ తిథులలో ముఖ్యమైనది *ఏకాదశి తిథి.* 


సర్వమూ కాలాధీనం. 

*“కాలః కలయతా మహమ్”* అని భగవద్గీత అనంతమైన కాలాన్ని భగవత్ స్వరూపంగా నిరూపించింది. 

కాలము శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞతో నడుస్తుందని పెద్దలు సూచించారు.


*గృహస్థో బ్రహ్మచారిశ్చ ఆహితాగ్నిస్తథైవచ*

*ఏకాదశ్యాం న భుంజీత పక్షయోరుభయోరపి*


బ్రహ్మచారి,  గృహస్థుడు, నిత్యాగ్నిహోత్రుడు... ఎవరైనా కావచ్చు, ఉభయ ఏకాదశులలో భోజనం చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది. 


ఎంతో నిష్ఠతో ఏకాదశి రోజున ఉపవాసించిన శ్రీమహావిష్ణువుకు చాలా ఇష్టులు అవుతారు.


 *సర్వోత్తమ తిథి ఏకాదశి:* 


కుచేలుడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించి మహదైశ్వర్యవంతుడైనాడని, ధర్మరాజు ఆచరించి కష్టాల నుండి గట్టెక్కినాడని, రుక్మాంగదుడు ఆచరించి పుత్రప్రాప్తి నొంది, దేవతాకృపకు పాత్రుడై, మోక్షగామి అయినాడని, క్షీరసాగర మథనం, లక్ష్మీ ఆవిర్భావం ఏకాదశినాడే జరిగాయని, వైఖానస రాజు ఆచరించి పితరులకు ఉత్తమ లోక ప్రాప్తి చేకూర్చాడని పురాణ ఉవాచ. ఇక అంబరీష వ్రత ప్రభావం జగద్విదితమే.


*“ఏకాదశ్యాముపవసేన్న కదాచి దతిక్రమేత్”*


ఏకాదశినాడు తప్పక ఉపవాసం చేయాలి. 


 *ఉపవాసం నాడు.* 


*ఉపవాసః స విఙ్ఞేయః సర్వభోగ వివర్జితః”* – 


పాపకృత్యాలకు దూరంగా ఉండి (చేయక),  సకల భోగాలను వదలి,  పుణ్యకార్యాలు చేయడమే ఉపవాసం అని పెద్దలమాట!


*ఏకాదశీ వ్రతం దశమి రాత్రితో ప్రారంభమై, ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది.* 


అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి తరించాల్సినదిగా శాస్త్రవచనం.


ఏడాది పొడుగునా.

నెలకి రెండు పక్షాలు 

1.శుక్ల పక్షము 

2. కృష్ణ పక్షము… 

పక్షానికొక ఏకాదశి చొప్పున్న ఇరవై నాలుగు ఏకాదశులుంటాయి.


శుక్ల ఏకాదశినాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవ కళ చంద్రుణ్ణి ప్రవేశిస్తుంది. బహుళ ఏకాదశినాడు చంద్ర మండలం నుండి పదకొండవ కళ సూర్యమండలాన్ని చేరుతుంది. ఇలా రాకపోకలవల్లనే *“ఏకాదశి”* అనే పేరు సార్థకమవుతుంది.


ప్రతి నెలా అమావాస్యకి, పౌర్ణమికి ముందు  ఈ ఏకాదశులు వస్తుంటాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టమైన పేరు, విశేషమైన ఫలము విశేషముగా  చెప్పబడినది.. 


రాజ్యాన్ని, భార్యను, పుత్రుడిని కోల్పోయి హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ ఏకాదశి నాడు విద్యుక్తంగా ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా అతను తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడు. ఇంకా కామికావ్రతం, శ్రీధరపూజ చేస్తారని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. 


*కామికా వ్రతం ఆచరించే దినం కాబట్టి ఈ తిథిని కామికా ఏకాదశి అని కూడా అంటారు.*


 *24 ఏకాదశుల పేర్లూ, ఫలాలు, సంగ్రహంగా:* 


*1) చైత్ర శుక్ల ఏకాదశి:* *‘కామదా’* – కోర్కెలు తీరుస్తుంది.


*2) చైత్ర బహుళ ఏకాదశి:* 

 *‘వరూధిని’* – సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.


*3) వైశాఖ శుద్ధ ఏకాదశి:* *‘మోహిని’* – దరిద్రుడు ధనవంతుడగును.


*4) వైశాఖ బహుళ ఏకాదశి:*

 *‘అపరా’* – రాజ్య ప్రాప్తి.


*5) జ్యేష్ఠ శుక్ల ఏకాదశి:*

 *‘నిర్జల’* – ఆహార సమృద్ధి.


*6) జ్యేష్ఠ బహుళ ఏకాదశి:*

 *‘యోగినీ’* – పాపాలను హరిస్తుంది.


*7) ఆషాఢ శుద్ధ ఏకాదశి:*

 *‘దేవశయనీ’* – సంపత్ ప్రాప్తి (విష్ణువు యోగ నిద్రకు శయనించు రోజు).


*8) ఆషాఢ బహుళ ఏకాదశి:*

 *‘కామికా’* – కోరిన కోర్కెలు ఫలిస్తాయి.


*9) శ్రావణ శుక్ల ఏకాదశి:*

 *‘పుత్రదా’* – సత్ సంతాన ప్రాప్తి.


*10) శ్రావణ బహుళ ఏకాదశి:*

 *‘అజా’* – రాజ్యపత్నీ-పుత్ర ప్రాప్తి. ఆపన్నివారణం.


*11) భాద్రపద శుద్ధ ఏకాదశి:*

 *‘పరివర్తన’* – (యోగనిద్రలో విష్ణువు ప్రక్కకు దొర్లును కనుక పరివర్తన) యోగసిద్ధి.


*12) భాద్రపద బహుళ ఏకాదశి:*

 *‘ఇందిరా’* – సంపదలు, రాజ్యము ప్రాప్తించును.


*13) ఆశ్వయుజ శుక్ల ఏకాదశి*

 ‘పాపాంకుశ’ – పుణ్యప్రదం.


*14) ఆశ్వయుజ బహుళ ఏకాదశి:*

 *‘రమా’* – స్వర్గప్రాప్తి.


*15) కార్తిక శుక్ల ఏకాదశి:*

 *‘ప్రబోధిని’* – (యోగనిద్ర నొందిన మహా విష్ణువు మేల్కొనే రోజు) ఙ్ఞానసిద్ధి.


*16) కార్తిక బహుళ ఏకాదశి:*

 *'ఉత్పత్తి’* – దుష్ట సంహారం. (మురాసురుణ్ణి సంహరించిన కన్య విష్ణు శరీరం నుండి జనించిన రోజు).


*17) మార్గశిర శుక్ల ఏకాదశి:*

 *‘మోక్షదా’* – మోక్ష ప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).


*18) మార్గశిర బహుళ ఏకాదశి:*

 *'విమలా’* (సఫలా) – అఙ్ఞాన నివ్రుత్తి.


*19) పుష్య శుక్ల ఏకాదశి:*

 *'పుత్రదా’* – పుత్ర ప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).


*20) పుష్య బహుళ ఏకాదశి:*

 *‘కల్యాణీ’* (షట్ తిలా) – ఈతి బాధా నివారణం.


*21) మాఘ శుక్ల ఏకాదశి:*

 *‘కామదా’ (జయా)* – శాప విముక్తి. 

(ఇది భీష్మైకాదశి అని ప్రసిద్ధి).


*22) మాఘ బహుళ ఏకాదశి:*

 *‘విజయా’* – సకల కార్య విజయం


*23) ఫాల్గుణ శుక్ల ఏకాదశి:*

 *‘అమలక ఏకాదశి’*  –ఫలం ఆరోగ్యప్రదం.


*24) ఫాల్గుణ బహుళ ఏకాదశి:*

 *‘సౌమ్య ఏకాదశి’*  – పాప విముక్తి.


పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో  కొన్ని భేదాలు కన్పిస్తున్నాయి.


ఇంద్రియాలను..

(పంచ కర్మేంద్రియ+ పంచ జ్ఞానేంద్రియ + మనస్సులు = 11 ఇంద్రియాలు) 

భగవంతుని సన్నిధిలో వసింపచేయునదియే నిజమైన ఉపవాసం. 


ఏకాదశీవ్రతం దశమి రాత్రితో ప్రారంభమై, ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది. 


అఖండైకాదశీ వ్రతమునకు దశమి నాటి ఉదయము నుంచి ద్వాదశి నాడు రాత్రి వరకు నియమిత కాలము. అందుకే, ఈ మూడు తిథులకు హరిత్రయములని పేరు.

కాశీలో దిగగానే

 *🚩కాశీలో దిగగానే ఏం చేయాలి? అక్కడ ఏం చూడాలి ?*🚩


కాశీ.. వారణాశి. సాక్షాత్తు కైలాసనాథుడి దివ్యక్షేత్రం. ఆ క్షేత్ర దర్శనం జన్మరాహిత్యం కలిగిస్తుంది. అయితే ఆ క్షేత్రంలో.. ఏం చూడాలి? అక్కడ క్షేత్రంలో సందర్శించాల్సిన ప్రదేశాలు గురించి తెలుసుకుందాం.కాశీ లో ప్రవేశించగానే ముందుగా..కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి. బస చేరుకున్న తరువాత ముందుగా.. గంగా దర్శనం..గంగా స్నానం. కాలభైరవుని దర్శనం కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం కాశీ విశ్వేశ్వరుని దర్శనం (ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది) కాశీ భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది. అన్నపూర్ణ దర్శనం భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది).

కాశీ విశాలాక్షి దర్శనం వారాహి మాత గుడి ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది. లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు. లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు.


మణికర్ణికా ఘట్టంలో స్నానం. (వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి) గంగా హారతి - దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు) కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం చింతామణి గణపతి దర్శనం అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ లోలార్కఈశ్వరుని దర్శనం దుర్గా మందిరము గవ్వలమ్మ గుడి తులసీ మానస మందిరము సంకట మోచన హనుమాన్ మందిరం. తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం. తిలాభాండేశ్వర దర్శనం.


వీలైతే సారనాధ్ స్థూపం బుద్ధ మందిరం ఇది కొంతదూరంగా ఉంటుంది. ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్.గంగా నదీ ఘట్టాల దర్శనం అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నాదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు. ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి. ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు. గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి. లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు.

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

ఆంధ్రకవుల అపరాధాలు

 🚩🚩ఆంధ్రకవుల అపరాధాలు.🚩🚩

‘ఆంధ్రకవుల అపరాధాలు’ పద్యాలు మొట్టమొదటగా 

ఆంధ్రపత్రిక కాళయుక్తినామ సంవత్సర ఉగాది (1918) 

సంచికలో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత 1965లో ఆ పత్రిక స్వర్ణోత్సవ సంచికలో పునర్ముద్రితమయ్యాయి. 

ఇందులో #నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, తిమ్మన, పింగళి సూరన, #తెనాలి రామకృష్ణుడు లాంటి హేమాహేమీలందరినీ #వేంకట రామకృష్ణ కవులు అధిక్షేపాత్మక ధోరణిలో విమర్శించారు. 

      వ్యాస భారతాన్ని తెనిగించటానికి నన్నయ పూనుకున్నాడు. తెలుగు ప్రజలకు తొలి గ్రంథాన్ని అందించాలనుకున్నాడు. అంటే కవిత్వాన్ని సంస్కృత భాష నుంచి తెలుగు వైపు మళ్లించే ఒక గట్టి ప్రయత్నం మొదలుపెట్టాడు. అంతవరకు బాగుంది. మరి అలాంటప్పుడు భారతాన్ని చక్కటి తెలుగు పద్యంతో ప్రారంభించకుండా ‘#శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’’ అన్న సంస్కృత శ్లోకంతో ఎందుకు ప్రారంభించాలి అంటూ వేంకట రామకృష్ణ కవులు తమ మొదటి అస్త్రాన్ని ఆదికవిపైనే సంధించారు..

#ఆంధ్ర లోకోపకారము నాచరింప 

భారతమ్మును నన్నయ భట్టు తెలుగు 

జేయుచున్నాడు సరియే బడాయిగాక

తొలుత సంస్కృత పద్య మెందులకు జెపుడి

      బడాయి కాకపోతే నన్నయ తెలుగు భారతాన్ని సంస్కృత శ్లోకంతో ప్రారంభించాలా అని అధిక్షేపించారు. అంతేకాదు అవతారికలో తన సహపాఠి నారాయణభట్టును పేర్కొన్న నన్నయ విద్యాగురువైన #వ్యాసుణ్ని స్తుతించకపోవడం తప్పుకాదా అంటూ ప్రశ్నిస్తారు. అధర్వణుడు భారతం రాసినట్లు అప్ తన గ్రంథంలో ఉదాహరించాడు. అయితే ఆ భారతాన్ని చూసి సహించలేకే నన్నయ మళ్లీ భారత రచనకు ఉపక్రమించాడంటారు ఈ కవులు.

      ఇక #తిక్కన ‘‘జాత్యముగాని సంస్కృత మెయ్యెడ జొన్ప’’నని ప్రతిజ్ఞ చేశాడు. తత్సమ పదభూయిష్టమైన శైలిని తోసిరాజన్నాడు. అన్వయ కాఠిన్యం అనిపించినా అచ్చ తెలుగు పదాలనే భారత రచనలో ఎక్కువగా ప్రయోగించాడు. ఆ అంశాన్నే తిప్పి ఇలా అంటారు రామకృష్ణకవులు.

#అచ్చతెనుగు పదంబుల నిచ్చకొలది 

బుచ్చి తలతిక్కయన్వయములను బెట్టి 

పాడుచేసెను నన్నయభట్టుదారి 

యుభయకవిమిత్రులష! త్రిక్కయొజ్జ గారు

      అంతేకాదు తిక్కన ఒకే ఒక్క సంస్కృత శ్లోకం రాశాడు. అది కూడా ‘#కిమస్థిమాలాం కింకౌస్తుభంవా’’ అంటూ హరిహరనాథుణ్ని స్తుతించిన శ్లోకం. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ రామకృష్ణకవులు, తిక్కన తనకు సంస్కృత భాషలో తగిన శక్తి లేక, ఎలాగో బిగబట్టి ఒక సంస్కృత శ్లోకాన్ని చెప్పగలిగాడు, అలాంటి వానికి ‘ఉభయకవిమిత్ర’ అనే బిరుదును ఏ ప్రభువిచ్చాడో మరి! అంటూ ఎద్దేవా చేస్తారు. తర్వాత ఎర్రన గురించి చెబుతూ మంత్రి భాస్కరుడి కంటే గొప్పవాడినని భావించి ఎర్రన రామాయణం రాశాడు. అందుకే అది ఊరూ పేరూ లేకుండా పోయింది. అంతేకాదు అమాయకత్వంతో తిక్కన దయదలచి అరణ్యపర్వ శేషాన్ని వదిలిపెట్టడంతో ఎర్రన కవిత్రయంలో చోటు సంపాదించుకోగలిగాడు గానీ అందులో ఆయన ఘనత ఏముంది అంటూ ‘‘పామరుడువోలె దిక్కన సోమయాజి/ వెఱచియాంధ్రీకరింపక విడిచినట్టి/ భారతమ్మున వ్రేేల్వెట్ట బట్టి గాని/ #యెఱప్రెగ్గడ బండార మెవరెరుగరు’’ అంటారు. అంతేకాదు ఎర్రన హరివంశం తెనిగించాడు, మంచిదే. కానీ, అది నాచనసోముని ఉత్తర హరివంశం కంటే గొప్పదా? అంటూ నాచన సోముణ్ని ఆకాశానికెత్తుతారీ కవులు.

      ఇక పోతన సహజ పాండిత్య బిరుదాంకితుడు. ‘‘సత్కవుల్‌ హాలికులైననేమి’’ అంటూ రాజాశ్రయాన్ని నిరసించాడు. అయితే అది నిజంకాదని గురుకులక్లిష్టుడై విద్యనేర్చుకోలేని పోతనను ఏరాజు మాత్రం ఆదరిస్తాడంటారు వేంకట రామకృష్ణ కవులు. అంతేకాదు ఛందోవ్యాకరణ శాస్త్రాల్లో దిట్టలైన వారినే ప్రభువులు ఆదరిస్తారు గానీ, దేవుళ్లను కీర్తించినంత మాత్రాన కాదంటూ ఇలా చెబుతారు..

#పాడికవిత్వమల్లు పోతరాజును ఱేడు 

నేడు పిలిచి గౌరవింపరామి 

హాలికుడయి రేగి యవనీశ్వరుల దిట్టె 

నక్క ద్రాక్షపండ్ల నానుడి గతి

      పోతన్నను ఏ రాజూ ఆదరింపకపోవడంతో హాలికుడుగా మారి కవిత్వం రాసుకున్నాడు. కానీ అందని ద్రాక్షపండ్లు పుల్లన అన్నట్లుగా రాజుల్ని #మనుజేశ్వరాధములంటూ తిట్టిపోశాడు. అంతేకాదు శ్రీనాథుని దయవల్ల సర్వజ్ఞసింగభూపాలుని ఆస్థానాన్ని సందర్శించి భోగినీదండకం రాయగలిగాడని కూడా అంటారు! 

      #శ్రీనాథుడి గ్రంథాలు చాలావరకు ఆంధ్రీకరణలే. అవి కూడా మూల శ్లోకాలలోని సుదీర్ఘ సమాసాలకు డు, ము, వు, లు చేర్చి యథాతథ]ంగా తెనుగు చేసినవే అధికం. పల్నాటి వీర చరిత్ర లాంటి ఏదో ఒక్క స్వతంత్ర గ్రంథాన్ని రాసినా దానినెవరూ పెద్దగా మెచ్చుకోలేదు. ఈ విషయాన్నే రామకృష్ణ కవులు పేర్కొంటూ, ‘‘ఆంధ్రకవిచక్రవర్తుల కెందరకును/ నీ పలుకు చాలు మేలు బంతియగుగాక!/ తెలుగు సేతయెకా! స్వతంత్రించి నీవు/ చేసినది యేది? శ్రీనాథ చెప్పుకోగ’’ అంటూ ఆ కవిసార్వభౌముణ్ని ఎద్దేవా చేస్తారు. అంతేకాదు అందలాలెక్కిన శ్రీనాథుడు గొప్ప కవీశ్వరుడు కావచ్చునేమో గాని గుణాఢ్యుడు మాత్రం కాలేడంటారు.

      ఇక, #పెద్దన మనుచరిత్రకు మూలం మారన మార్కండేయ పురాణం. మనుచరిత్ర అవతారికలో, పూర్వ తాళపత్ర గ్రంథాల నుంచి విషయాన్ని అపహరించి కొందరు కవులు రచనలు చేస్తారని, వారు కుకవులు అవుతారని అంటాడు పెద్దన. అంతేకాదు అలాంటి వారికి కొరత వేయడమే శిక్ష అని కూడా అంటాడు. ఆ విషయాన్నే లేవనెత్తి మరి పెద్దన మాత్రం చేసినదేమిటి? అంటూ ఇలా అధిక్షేపిస్తారు వేంకట రామకృష్ణ కవులు...

#మారన కథా విధానము జూఱలాడి 

కోరి శ్రీనాథు తెరువులు గొల్లగొట్టి 

మనుచరిత్రంబొనర్చి పెద్దన గడించె

నాంధ్ర కవితా పితామహుడన్న బిరుదు

      అంటే మారన నుంచి కథను సంగ్రహించి, శ్రీనాథుడి నుంచి రచనా విధానాన్ని కొల్లగొట్టిన పెద్దన ఆంధ్ర కవితా పితామహుడిగా వాసికెక్కాడట. అంతేకాదు శ్రీకృష్ణదేవరాయులు తన పల్లకిపై కూర్చుండబెట్టుకొన్నాడు. అగ్రహారాలు దానమిచ్చాడు. కానీ ముక్కు తిమ్మనార్యుని కంటే రచనా ధురీణుడా? పెద్దన అని కూడా వేంకట రామకృష్ణ కవులు ప్రశ్నిస్తారు. ఆ #తిమ్మన ముద్దు పల్కుల పారిజాతాపహరణ రచనకు ఒక నేపథ్యం ఉందంటారు. కృష్ణరాయలకు, తిరుమలాదేవి మీద ఉన్న అపార్థాన్ని తొలగించడానికే #నంది తిమ్మన ఆ గ్రంథాన్ని రాశాడని లోక ప్రతీతి. అలా వారి సాంసారిక జీవితాన్ని సరిదిద్దిన తిమ్మన రుణం తీర్చుకోవటం రాజుకు సాధ్యమా అంటూ ‘‘తనకునంతఃపురమునకు మనసులందు/ నెడమడుగు పుట్ట ముద్దులొల్కెడు నుడుల/ బారిజాతాపహరణంబు బల్కి మాన్చి/ నట్టి తిమ్మన ఋణము రాజెట్టు తీర్చు?’’ అని చెబుతారు. అలాగే శ్రీకృష్ణదేవరాయుల #విష్ణుచిత్తీయ కావ్యంలోని కథా వస్తువు శ్రావ్యమే కాని పాషాణపాకం లాంటి ఆ గ్రంథాన్ని ఎవరు చదివి అర్థం చేసుకోగలరని విమర్శిస్తారు. #పింగళి సూరన్నను గురించి చెబుతూ రాఘవ పాండవీయం లాంటి ద్వ్యర్థికావ్యాన్ని రాసి గొప్ప కీర్తిని గడించిన ఆయన, శుభమా అంటూ మరణ సమయంలో వైదికుడు పఠించే గరుడ పురాణాన్ని ఎందుకు రాయాల్సి వచ్చిందో కదా! అంటారు. అంతేకాదు అద్భుత కల్పనా గౌరవంతో రాసిన కళాపూర్ణోదయ కావ్యానికి కలభాషిణి, రంభ లాంటి వేశ్యలను నాయికలుగా ఎంచుకోవటాన్నీ అధిక్షేపిస్తారు.

ప్రబంధ కవులందరూ ఇంచుమించు ఒకే మార్గంలో ప్రయాణించారు. ఒకరికి స్వప్నంలో ఎవరో ఒకరు ప్రత్యక్షమై గ్రంథ రచన చేయమంటే అందరికీ అలాంటి కలలే వస్తాయి. ప్రతి ప్రబంధం దేవతా ప్రార్థన, దేశ, పుర, రాజ, చాతుర్వర్ణ, వ్యవస్థల వర్ణనలతో మూసపోసినట్లు ఒకేలా ప్రారంభమవుతుందని చెబుతూ ‘‘దేవతా ప్రార్థనంబున దేశ నగర/ రాజవర్ణనములు కథారచన యంత/ తొక్కి విడిచిన పుంతయే దిక్కుమాలి/ కవనముంజెప్పదగిన ప్రజానిధులకు’’ అంటూ మొత్తంగా ప్రబంధ కవులందరినీ ఎంతమాత్రం తలచకుండా అధిక్షేపిస్తారు పిఠాపురం జంటకవులు. ఇలా ఈ కవులు ఈ ఖండికలో ఆంధ్ర కవుల అపరాధాలను చమత్కారంగా ఎత్తిచూపుతారు. అయితే వీరు అహంకారులూ, దోషైకదృక్కులూ ఎంతమాత్రం కారు. సహజంగా అవధానుల్లో ఉండే చమత్కారం, అధిక్షేపం పాళ్లను కావాలని కొంచెం ఎక్కువ ప్రదర్శించారు. కానీ పూర్వ కవుల మీద వీరికి ఉన్న భక్తి గౌరవాలు అపారం. ఆ విషయంలో శంక అవసరం లేదు. కావాలంటే వారి మాటల్లోనే చూడండి...  

#పూర్వ కవిరాజులకు నిది భూషణంబొ 

దూషణమొ యనుకొనుడు మీ తోచినట్లు 

నన్నయాదుల పట్ల మాకన్న గూర్మి 

గలుగువారలు లేరు జగమ్మునందు

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

🚩🚩ఆంధ్రకవుల అపరాధాలు.🚩🚩

‘ఆంధ్రకవుల అపరాధాలు’ పద్యాలు మొట్టమొదటగా 

ఆంధ్రపత్రిక కాళయుక్తినామ సంవత్సర ఉగాది (1918) 

సంచికలో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత 1965లో ఆ పత్రిక స్వర్ణోత్సవ సంచికలో పునర్ముద్రితమయ్యాయి. 

ఇందులో #నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, తిమ్మన, పింగళి సూరన, #తెనాలి రామకృష్ణుడు లాంటి హేమాహేమీలందరినీ #వేంకట రామకృష్ణ కవులు అధిక్షేపాత్మక ధోరణిలో విమర్శించారు. 

      వ్యాస భారతాన్ని తెనిగించటానికి నన్నయ పూనుకున్నాడు. తెలుగు ప్రజలకు తొలి గ్రంథాన్ని అందించాలనుకున్నాడు. అంటే కవిత్వాన్ని సంస్కృత భాష నుంచి తెలుగు వైపు మళ్లించే ఒక గట్టి ప్రయత్నం మొదలుపెట్టాడు. అంతవరకు బాగుంది. మరి అలాంటప్పుడు భారతాన్ని చక్కటి తెలుగు పద్యంతో ప్రారంభించకుండా ‘#శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’’ అన్న సంస్కృత శ్లోకంతో ఎందుకు ప్రారంభించాలి అంటూ వేంకట రామకృష్ణ కవులు తమ మొదటి అస్త్రాన్ని ఆదికవిపైనే సంధించారు..

#ఆంధ్ర లోకోపకారము నాచరింప 

భారతమ్మును నన్నయ భట్టు తెలుగు 

జేయుచున్నాడు సరియే బడాయిగాక

తొలుత సంస్కృత పద్య మెందులకు జెపుడి

      బడాయి కాకపోతే నన్నయ తెలుగు భారతాన్ని సంస్కృత శ్లోకంతో ప్రారంభించాలా అని అధిక్షేపించారు. అంతేకాదు అవతారికలో తన సహపాఠి నారాయణభట్టును పేర్కొన్న నన్నయ విద్యాగురువైన #వ్యాసుణ్ని స్తుతించకపోవడం తప్పుకాదా అంటూ ప్రశ్నిస్తారు. అధర్వణుడు భారతం రాసినట్లు అప్ తన గ్రంథంలో ఉదాహరించాడు. అయితే ఆ భారతాన్ని చూసి సహించలేకే నన్నయ మళ్లీ భారత రచనకు ఉపక్రమించాడంటారు ఈ కవులు.

      ఇక #తిక్కన ‘‘జాత్యముగాని సంస్కృత మెయ్యెడ జొన్ప’’నని ప్రతిజ్ఞ చేశాడు. తత్సమ పదభూయిష్టమైన శైలిని తోసిరాజన్నాడు. అన్వయ కాఠిన్యం అనిపించినా అచ్చ తెలుగు పదాలనే భారత రచనలో ఎక్కువగా ప్రయోగించాడు. ఆ అంశాన్నే తిప్పి ఇలా అంటారు రామకృష్ణకవులు.

#అచ్చతెనుగు పదంబుల నిచ్చకొలది 

బుచ్చి తలతిక్కయన్వయములను బెట్టి 

పాడుచేసెను నన్నయభట్టుదారి 

యుభయకవిమిత్రులష! త్రిక్కయొజ్జ గారు

      అంతేకాదు తిక్కన ఒకే ఒక్క సంస్కృత శ్లోకం రాశాడు. అది కూడా ‘#కిమస్థిమాలాం కింకౌస్తుభంవా’’ అంటూ హరిహరనాథుణ్ని స్తుతించిన శ్లోకం. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ రామకృష్ణకవులు, తిక్కన తనకు సంస్కృత భాషలో తగిన శక్తి లేక, ఎలాగో బిగబట్టి ఒక సంస్కృత శ్లోకాన్ని చెప్పగలిగాడు, అలాంటి వానికి ‘ఉభయకవిమిత్ర’ అనే బిరుదును ఏ ప్రభువిచ్చాడో మరి! అంటూ ఎద్దేవా చేస్తారు. తర్వాత ఎర్రన గురించి చెబుతూ మంత్రి భాస్కరుడి కంటే గొప్పవాడినని భావించి ఎర్రన రామాయణం రాశాడు. అందుకే అది ఊరూ పేరూ లేకుండా పోయింది. అంతేకాదు అమాయకత్వంతో తిక్కన దయదలచి అరణ్యపర్వ శేషాన్ని వదిలిపెట్టడంతో ఎర్రన కవిత్రయంలో చోటు సంపాదించుకోగలిగాడు గానీ అందులో ఆయన ఘనత ఏముంది అంటూ ‘‘పామరుడువోలె దిక్కన సోమయాజి/ వెఱచియాంధ్రీకరింపక విడిచినట్టి/ భారతమ్మున వ్రేేల్వెట్ట బట్టి గాని/ #యెఱప్రెగ్గడ బండార మెవరెరుగరు’’ అంటారు. అంతేకాదు ఎర్రన హరివంశం తెనిగించాడు, మంచిదే. కానీ, అది నాచనసోముని ఉత్తర హరివంశం కంటే గొప్పదా? అంటూ నాచన సోముణ్ని ఆకాశానికెత్తుతారీ కవులు.

      ఇక పోతన సహజ పాండిత్య బిరుదాంకితుడు. ‘‘సత్కవుల్‌ హాలికులైననేమి’’ అంటూ రాజాశ్రయాన్ని నిరసించాడు. అయితే అది నిజంకాదని గురుకులక్లిష్టుడై విద్యనేర్చుకోలేని పోతనను ఏరాజు మాత్రం ఆదరిస్తాడంటారు వేంకట రామకృష్ణ కవులు. అంతేకాదు ఛందోవ్యాకరణ శాస్త్రాల్లో దిట్టలైన వారినే ప్రభువులు ఆదరిస్తారు గానీ, దేవుళ్లను కీర్తించినంత మాత్రాన కాదంటూ ఇలా చెబుతారు..

#పాడికవిత్వమల్లు పోతరాజును ఱేడు 

నేడు పిలిచి గౌరవింపరామి 

హాలికుడయి రేగి యవనీశ్వరుల దిట్టె 

నక్క ద్రాక్షపండ్ల నానుడి గతి

      పోతన్నను ఏ రాజూ ఆదరింపకపోవడంతో హాలికుడుగా మారి కవిత్వం రాసుకున్నాడు. కానీ అందని ద్రాక్షపండ్లు పుల్లన అన్నట్లుగా రాజుల్ని #మనుజేశ్వరాధములంటూ తిట్టిపోశాడు. అంతేకాదు శ్రీనాథుని దయవల్ల సర్వజ్ఞసింగభూపాలుని ఆస్థానాన్ని సందర్శించి భోగినీదండకం రాయగలిగాడని కూడా అంటారు! 

      #శ్రీనాథుడి గ్రంథాలు చాలావరకు ఆంధ్రీకరణలే. అవి కూడా మూల శ్లోకాలలోని సుదీర్ఘ సమాసాలకు డు, ము, వు, లు చేర్చి యథాతథ]ంగా తెనుగు చేసినవే అధికం. పల్నాటి వీర చరిత్ర లాంటి ఏదో ఒక్క స్వతంత్ర గ్రంథాన్ని రాసినా దానినెవరూ పెద్దగా మెచ్చుకోలేదు. ఈ విషయాన్నే రామకృష్ణ కవులు పేర్కొంటూ, ‘‘ఆంధ్రకవిచక్రవర్తుల కెందరకును/ నీ పలుకు చాలు మేలు బంతియగుగాక!/ తెలుగు సేతయెకా! స్వతంత్రించి నీవు/ చేసినది యేది? శ్రీనాథ చెప్పుకోగ’’ అంటూ ఆ కవిసార్వభౌముణ్ని ఎద్దేవా చేస్తారు. అంతేకాదు అందలాలెక్కిన శ్రీనాథుడు గొప్ప కవీశ్వరుడు కావచ్చునేమో గాని గుణాఢ్యుడు మాత్రం కాలేడంటారు.

      ఇక, #పెద్దన మనుచరిత్రకు మూలం మారన మార్కండేయ పురాణం. మనుచరిత్ర అవతారికలో, పూర్వ తాళపత్ర గ్రంథాల నుంచి విషయాన్ని అపహరించి కొందరు కవులు రచనలు చేస్తారని, వారు కుకవులు అవుతారని అంటాడు పెద్దన. అంతేకాదు అలాంటి వారికి కొరత వేయడమే శిక్ష అని కూడా అంటాడు. ఆ విషయాన్నే లేవనెత్తి మరి పెద్దన మాత్రం చేసినదేమిటి? అంటూ ఇలా అధిక్షేపిస్తారు వేంకట రామకృష్ణ కవులు...

#మారన కథా విధానము జూఱలాడి 

కోరి శ్రీనాథు తెరువులు గొల్లగొట్టి 

మనుచరిత్రంబొనర్చి పెద్దన గడించె

నాంధ్ర కవితా పితామహుడన్న బిరుదు

      అంటే మారన నుంచి కథను సంగ్రహించి, శ్రీనాథుడి నుంచి రచనా విధానాన్ని కొల్లగొట్టిన పెద్దన ఆంధ్ర కవితా పితామహుడిగా వాసికెక్కాడట. అంతేకాదు శ్రీకృష్ణదేవరాయులు తన పల్లకిపై కూర్చుండబెట్టుకొన్నాడు. అగ్రహారాలు దానమిచ్చాడు. కానీ ముక్కు తిమ్మనార్యుని కంటే రచనా ధురీణుడా? పెద్దన అని కూడా వేంకట రామకృష్ణ కవులు ప్రశ్నిస్తారు. ఆ #తిమ్మన ముద్దు పల్కుల పారిజాతాపహరణ రచనకు ఒక నేపథ్యం ఉందంటారు. కృష్ణరాయలకు, తిరుమలాదేవి మీద ఉన్న అపార్థాన్ని తొలగించడానికే #నంది తిమ్మన ఆ గ్రంథాన్ని రాశాడని లోక ప్రతీతి. అలా వారి సాంసారిక జీవితాన్ని సరిదిద్దిన తిమ్మన రుణం తీర్చుకోవటం రాజుకు సాధ్యమా అంటూ ‘‘తనకునంతఃపురమునకు మనసులందు/ నెడమడుగు పుట్ట ముద్దులొల్కెడు నుడుల/ బారిజాతాపహరణంబు బల్కి మాన్చి/ నట్టి తిమ్మన ఋణము రాజెట్టు తీర్చు?’’ అని చెబుతారు. అలాగే శ్రీకృష్ణదేవరాయుల #విష్ణుచిత్తీయ కావ్యంలోని కథా వస్తువు శ్రావ్యమే కాని పాషాణపాకం లాంటి ఆ గ్రంథాన్ని ఎవరు చదివి అర్థం చేసుకోగలరని విమర్శిస్తారు. #పింగళి సూరన్నను గురించి చెబుతూ రాఘవ పాండవీయం లాంటి ద్వ్యర్థికావ్యాన్ని రాసి గొప్ప కీర్తిని గడించిన ఆయన, శుభమా అంటూ మరణ సమయంలో వైదికుడు పఠించే గరుడ పురాణాన్ని ఎందుకు రాయాల్సి వచ్చిందో కదా! అంటారు. అంతేకాదు అద్భుత కల్పనా గౌరవంతో రాసిన కళాపూర్ణోదయ కావ్యానికి కలభాషిణి, రంభ లాంటి వేశ్యలను నాయికలుగా ఎంచుకోవటాన్నీ అధిక్షేపిస్తారు.

ప్రబంధ కవులందరూ ఇంచుమించు ఒకే మార్గంలో ప్రయాణించారు. ఒకరికి స్వప్నంలో ఎవరో ఒకరు ప్రత్యక్షమై గ్రంథ రచన చేయమంటే అందరికీ అలాంటి కలలే వస్తాయి. ప్రతి ప్రబంధం దేవతా ప్రార్థన, దేశ, పుర, రాజ, చాతుర్వర్ణ, వ్యవస్థల వర్ణనలతో మూసపోసినట్లు ఒకేలా ప్రారంభమవుతుందని చెబుతూ ‘‘దేవతా ప్రార్థనంబున దేశ నగర/ రాజవర్ణనములు కథారచన యంత/ తొక్కి విడిచిన పుంతయే దిక్కుమాలి/ కవనముంజెప్పదగిన ప్రజానిధులకు’’ అంటూ మొత్తంగా ప్రబంధ కవులందరినీ ఎంతమాత్రం తలచకుండా అధిక్షేపిస్తారు పిఠాపురం జంటకవులు. ఇలా ఈ కవులు ఈ ఖండికలో ఆంధ్ర కవుల అపరాధాలను చమత్కారంగా ఎత్తిచూపుతారు. అయితే వీరు అహంకారులూ, దోషైకదృక్కులూ ఎంతమాత్రం కారు. సహజంగా అవధానుల్లో ఉండే చమత్కారం, అధిక్షేపం పాళ్లను కావాలని కొంచెం ఎక్కువ ప్రదర్శించారు. కానీ పూర్వ కవుల మీద వీరికి ఉన్న భక్తి గౌరవాలు అపారం. ఆ విషయంలో శంక అవసరం లేదు. కావాలంటే వారి మాటల్లోనే చూడండి...  

#పూర్వ కవిరాజులకు నిది భూషణంబొ 

దూషణమొ యనుకొనుడు మీ తోచినట్లు 

నన్నయాదుల పట్ల మాకన్న గూర్మి 

గలుగువారలు లేరు జగమ్మునందు

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

లవంగాలు - ఉపయోగాలు


*⛑️లవంగాలు - ఉపయోగాలు⛑️*




*శ్రీ ఆంజనేయస్వామి కి జయవారం నాడు ఐదు తమలపాకులు  లో ఐదు లవంగాలు నైవేద్యం  పెడితే...ఋణ విముక్తులౌతారు*



*లవంగాలు … ఆరోగ్యానికి మేలు*


లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాదు .. విలువైన పోషకాలు ఉన్నాయి ....


ఇండోనేషియాలోని స్పైస్ ఐల్యాండ్స్ గా పిలిచే మొలక్కస్ దీవులే వీటి స్వస్థలం. ప్రస్తుతం వీటిని బ్రెజిల్, ఇండియా, వెస్టిండీస్, మారిషస్, జాంజిబార్, శ్రీలంక, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు. మిర్టేసీ మొక్క నుండి కాస్త గులాబీరంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారి లవంగాల ఆకారాన్ని సంతరించుకుంటాయి. 


ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగించే ఈ లవంగాల నుండి నూనెలను కూడా తీస్తారు. ఎన్నో ఔషధగుణాలున్న ఈ లవంగాలను ఏవిధంగా ఇంటిచిట్కాల్లో ఉపయోగించాలో తెలుసుకుందాం.


లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల జలుబు, సైనస్, దగ్గు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆ నీటిలో కొంచెం తేనే కలిపి తాగడం ద్వారా అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతుంది.


నోటి దుర్వాసనతో బాధపడే వాళ్లు ఓ లవంగాన్ని బుగ్గన పెట్టుకుంటే ఆ సమస్య తగ్గుతుంది.


పంటినొప్పితో బాధపడేవాళ్లు రోజూ ఓ లవంగాన్ని నములుతూ ఉంటే క్రమేపీ పంటి నొప్పి తగ్గుతుంది.


ముక్కు దిబ్బడగా ఉన్నప్పుడు.. కర్చీఫ్‌ మీద రెండుమూడు చుక్కల లవంగనూనెని చల్లి వాసన పీలిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఏడెనిమిది లవంగాలను నీటిలో వేసి మరిగించి ఆవిరి పడితే త్వరిత ఉపశమనం లభిస్తుంది.

లవంగంలోని 'యుజెనాల్‌' కు నులిపురుగులను నాశనం చేసే శక్తి ఉంది. చిన్నపిల్లలకు కడుపులో నులిపురుగులు చేరినప్పుడు లంవంగరసాన్ని పాలలో కలిపి ఇస్తే ఆ పురుగులు తగ్గుతాయి.


కొవ్వు తగ్గించుకోవాలనేకునే వారు రోజూ ఒక లంవంగం తింటే తగ్గుతుంది.


లవంగాలను నూరి, పటికబెల్లంతో సేవిస్తే కడుపులో మంట తగ్గుతుంది.

వాంతులు, కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.


టీలో లవంగాలు, తులసి, పుదీనా, యాలకలను వేసి మరిగించి తాగితే నరాలకు శక్తి లభించడమే కాక మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.


వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే.. ఇవి తీసుకోవాల్సిందే…


అయితే గర్భిణులు, గ్యాస్ట్రిక్‌ అల్సర్లు, బౌల్‌ సిండ్రోమ్‌తో బాధపడేవాళ్లు దీన్ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. మరీ ఎక్కువగా వాడితే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.

💠💠💠💠💠💠💠

జీవితంలో ఎప్పుడైనా

 Blissful INSIGHTS 🍉🎈🎁

1. జీవితంలో ఎప్పుడైనా

ఎవరి నైనా పనికి రాని వారిగా

పరిగణించవద్దు ఎందుకంటే

చెడిపోయిన గడియారం

కూడ రోజుకు రెండు సార్లు

సరైన సమయం

సూచిస్తుంది🎁🎈

2. ఎప్పుడూ ఇతరుల తప్పులను

అన్వేషించే వ్యక్తి అందమైన

పుష్పాల పరిమళాలను

వదలి పుండు మీదవాలే

ఈగ లాంటి వాడు🍉🎈

3. పేదరికం ధరిచేరినప్పుడు

ఆప్తమిత్రులు కూడ

దూరమైతారు అదే

ధనవంతులైనప్పుడు

తెలియని వారు కూడ

మిత్రులవుతారు🎁🍉

4. ఒక్క సారి నవ్వుతూ చూడు

ప్రపంచంలో ఉండే అందాలన్ని

నీ సొంతమవ్వుతాయి కానీ

తడిసిన కనురెప్పలతో

చూసే అద్దంకూడ మసక

బారి పోతుంది🥭🎈

5. తొందరగా దొరికేది ఏదైనా

ఎక్కువకాలం మన్నికరాదు

ఎక్కువకాలం మన్నిక

వచ్చేది అంతతొందరగా

దొరకదు🍉🎈

6. జీవితంలో వచ్చే చెడు రోజులు

కూడా మన మంచి కొరకే

అనుకోవాలి అప్పుడే

తెలుస్తుంది నిజమైన

స్నేహితులు ఎవరైనది🎈❤

7. మనిషికి రోగాలు కుందేలు లాగా

వస్తాయి తాబేలు లాగా

వెళ్లుతాయి కానీ డబ్బులు

తాబేలు లాగ వస్తాయి

కుందేలు లాగా

వెళ్లుతాయి🍉🎈

8. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని

వెతకటం అలవాటు

చేసుకోవాలి ఎందుకంటే

పెద్ద పెద్ద మాటలు

జీవితంలో చాలా

అరుదుగా చోటు

చేసుకుంటాయి🎁🍒

9. ఈశ్వరుని ప్రార్ధించినప్పుడు

నాకు ఏమి ఇవ్వలేదని

బాధపడకు ఎందుకంటే

నీకు అక్కడ ఇవ్వక

పోయినా నీకు నచ్చిన

చోట నీకు ఈశ్వరుడు

నచ్చినవిధంగా ఇస్తాడు🎋🎁

10. నిత్యము ఎదురయ్యే

అపజయాలను చూసి

నిరాశ చెందకు కానీ

ఒక్కోసారి తాళంచెవి

గుచ్చంలో ఉండే ఆఖరి

తాళంచెవి కూడ తాళం

తెరుస్తుందని

గమనించు🍒🎈

11. ఈ సమాజంలో నేను ఒక్కడిని

ఎంచేయగలననీ ప్రతి మనిషి

నిరాశ చెందుతుంటాడు

కానీ ఒక్క సారి తలపైకెత్తి

చూడు ప్రపంచానికి

వెలుగునిచ్చే సూర్యుడు

కూడ ఒక్కడేనని🍉🎈

12. బంధవులు ఎంత చెడ్డ వారైనా

సరే వదులుకోవద్దు

ఎందుకంటే మురికి నీరు

దప్పిక తీర్చలేక పోయిన

కనీసం అగ్గి మంటలు

ఆర్పటానికి పనికి

వస్తాయి🎈🍒

13. నమ్మక ద్రోహి స్నేహితునికన్నా

దురాశపరుడు సన్నిహితుడు

మిన్న మట్టితో చేసిన

మనుషులు కాగితాలకు

అమ్ముడు పోతారు🎁🍉

14. మనిషి గా మాట్లాడుట

రాక పోయినా కనీసం

పశువుల మౌనంగా

ఉండటమే ఉత్తమం🍇🍒

15. మనకు మాటలు రాక ముందు

మనముఎంచెప్పబోతున్నామో

అమ్మకు అర్థమయ్యేది కాని

మనము మాటలు అన్ని

నేర్చిన తరువాత ఇప్పుడు

మాటమాటకు ప్రతిసారి

అమ్మా నీకు అర్థం🍇

కాదులే అంటాం

16. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు

దూరమైనారని బాధపడకు

ఎందుకంటే నీవు ఒక్కనివే

జయించగలవని వారు

నమ్మినందుకు నీవు

సంతోషించు🍒

17. సిగ్గు మర్యాద లేని

ధనవంతుడు ఎల్లయ్య కన్నా

మంచి మానవత్వం ఉన్న

పేదరికం సుబ్బయ్య మిన్న🍈🎁

18. జీవితంలో హెచ్చుతగ్గులు

రావటంకూడ మనమంచి

కోసమే అనుకోవాలి

ఎందుకంటే ECG లొ

వచ్చే సరళరేఖా కూడ

మృత్యువును🍉

సూచిస్తుంది

19. ఈ రోజుల్లో సంబంధాలు

రొట్టె తొ సమానమైనవి

ఎందుకంటే కొద్దిగా మంట

ఎక్కవైందొలెదో రొట్టె

మాడిమసి కావటం

ఖాయం✌🎈

20. జీవితంలో మంచి వారి కోసం

అన్వేషించ వద్దు ముందు

నీవు మంచిగా మారు

బహుశా నిన్ను కలిసిన

వ్యక్తికి మంచి మనిషి

అన్వేషణ పూర్తి

కావచ్చు నేమో⁠⁠⁠⁠. 🎈

అమ్మనాన్న

 అమ్మనాన్న 


వృధాప్యం తల్లిదండ్రులకు ఒక వరంలా అనిపించేల మెదులూధాం 


మీ కష్టం అంటే ఏమిటో తెలీదు నిన్న అంతగా కష్టపడే అంతవరకు,,,,,,,,


మీ బాధంటే ఏమిటో తెలీదు నిన్న నేను ఒళ్ళు నొప్పులతో బాధ పడెంతవరకు,,,,,,


మీ ఏడుపు అంటే తెలీదు నిన్న ఒళ్ళు నొప్పులతో నేను ఏడ్చే అంతవరకు,,,,,,


మీ డబ్బు విలువ తెలియదు మనం నిన్న డబ్బు ఇచ్చి మోసపోయే వరకు,,,,,,,


మీరు ఎండలో పనిచేసినప్పుడు ఎండ విలువ ఏమిటో తెలీదు నేను నిన్న ఎండలో పనిచేసేంతవరకు,,,,,,,


మీ విలువ తెలియదు మీరు చెప్పినపుడు కానీ మీ విలువ నాకు నిన్ననే తెలిసింది,,,,,,,


మీ ఆకలి బాధ తెలియదు నిన్న నేను కడుపు మాడ్చుకొని పని చేసేంత వరకు,,,,,


మీ బాధలు మా తరానికి అర్థం కావడం లేదు అమ్మానాన్న.....

మీ బాధని దగ్గరి నుండి చుస్తెనో లేదా ఆ బాధని అనుభవిస్తేనో తప్ప అర్థం కావడం లేదు అమ్మానాన్న.....


సహకరించే చేతులు కాళ్ళు ఉన్నా కూడా మీ బాధ అర్ధం కావడం లేదు అమ్మానాన్న.....

మీరు వృద్ధాప్యం లో ఉంటె అవిటీవారైనా మీ బాధని అర్థం చేసుకుంటున్నారు.......

కానీ మేమేముందుకు  అవిటి వారిగా మారిపోతున్నాము.......

శరీర ఆవేదనలో కాదు అమ్మానాన్న మా మనసులో మా ఆలోచనలో మా ప్రవర్తనలో......


ఇంతకన్నా ఏమి చెప్పగలం అమ్మానాన్న ,,,,,,

మా బతుకుకి మీరు అర్థం

మా జన్మకి మీరు కారణం

మా సంతోషానికి మీరు నిర్వచనం


కానీ అన్నిటికీ అర్థం,కారణం,నిర్వచనం అయిన మీకు ఏ దిక్కు లేదు ఆఖరికి మేము కూడా,,,,,


ఎందుకో తెలుసా అమ్మానాన్న,,,,

మీ వయసుకి వస్తే కాని మీ బాధేంటో తెలియడం లేదు తెలిసే సమయానికి మీరు మాకు అందని దూరం లో ఉంటున్నారు.....


అందని దూరం అంటే ఎంతో దూరం కాదు ఇంటి నుంచి వృద్దఆశ్రమం దురమంతా,,,,,,


 ఒక్క మాట చెప్పగలను నా తరఫున నుంచి,,,,,,,,,,,,,,,,,

నా కట్టే కాలే అంతవరకు మిమ్మల్ని సంతోష పెడతాను అని నేను చెప్పను,,,,,

ఎందుకంటే ఈ పిచ్చి లోకం చూశారు కదా అమ్మానాన్న నన్ను కూడా ఈ లోకం మార్చితే మిమ్మల్ని అనాదలని చేసిన వాడిని అవుతాను,,,,,,,

కానీ ఒక్క మాట మిమ్మల్ని నా కట్టే కాలెంత వరకు నా వల్ల కంటతడి పెట్టనివ్వను......