26, అక్టోబర్ 2020, సోమవారం

కాశీ_ఖండం*

 **దశిక రాము**


**కాశీ_ఖండం**


 PART-11


*కవిసార్వభౌముడైన  శ్రీనాధుని రచన*


తీర్ధాలలో ఉపవాసం చేసి దానాలిచ్చి ,అగ్నమాది క్రతువులు చేయాలి .ఎవరి మనసులో విద్యా తపస్సు కేర్తి ఉంటాయో వారికి తీర్ధ యాత్రలు ఫలిస్తాయి .గర్వం లేని వాడు సత్య భాషి ,దృఢ వ్రతుడు ,సర్వ భూత సముడు పొందే ఫలాన్ని తీర్ధ యాత్ర చేసిన వారు పొందుతారు ..తీర్ధాలకు వచ్చి అక్కడి దేవతలను ముందుగా ప్రార్ధించాలి అప్పుడు స్నానం చేస్తేనే ఫలితం ఉంటుంది .శ్రద్ధ తో తీర్ధ యాత్ర చేస్తే పాప ప్రక్షాళనం జరుగు తుంది .ఇతరుల కోసం తీర్ధ యాత్ర చేస్సిన వాడికి పదహారవ వంతు ఫలం దక్కుతుంది .తీర్ధం లో ఉప వాసం శిరో మున్దనం చాలా ముఖ్య మైనవి .క్షౌరం వల్ల శిరోగత పాపాలు పోతాయి .తీర్ధాలలో శ్రాద్ధం పిండ ప్రదానం చేస్తే పితృ దేవతలు తృప్తి చెందుతారు .తీర్ధ యాత్ర సర్వ సాధక మైనది ..మోక్ష ప్రదాయక మైనది .కాశి ,కంచి ,హరిద్వారం ,అయోధ్య ,ద్వారక ,మధుర ,ఉజ్జయిని మోక్ష పురాలు గా ప్రశిద్ధి చెందాయి .శ్రీ శైలం మోక్షదాయకం అంతకంటే కేదారం గొప్పది ఈ రెంటికంటే .గొప్పది ప్రయాగ. దీనికంటే అవిముక్త క్షేత్రం కాశి మహా గొప్పది కాశిలో చని పోతే మోక్షమే .తీర్ధ కోటికి అందని ముక్తి కాశీ లో లభిస్తుంది ..పూర్వం విష్ణు దూతలు శివ శర్మ అనే అతనికి చెప్పిన విషయాన్ని తెలియ జేస్తా విను ‘’అన్నాడు మహర్షి

సప్త పురి వర్ణనం

 అగస్త్య మహర్షి భార్య లోపా ముద్రా దేవికి శివ శర్మ కధను చెప్పటం ప్రారంభించాడు .మధురా నగరం లో శివ శర్మ అనే బ్రాహ్మనుడుండే వాడు .వేద ,వేదాంగాలు ,సకల శాస్త్రాలు నేర్చి ,సత్పుత్రులను కని వారికి సమానం గా ఆస్తి పంచి ,ముసలి తనం లోకి ప్రవేశించాడు .వయస్సంతా ధన సంపాదన లో ఖర్చు అయి పోయిందని విద్య నేర్వటానికి సరి పోయిందని దైవా రాధనా తీర్ధ యాత్రలు చేయ లేక పోయానని విచారించాడు .దానాలు చేయలేక పోయానని బాధ పడ్డాడు చివరికి తీర్ధ యాత్రలు చేసి జీవితానికి పరమార్ధాన్ని కల్పించుకొంటానని నిశ్చయానికి వచ్చాడు మంచి రోజు చూసుకొని విఘ్నేశ్వర పూజ చేసుకొని ననాందీశ్రార్ధాన్ని నిర్వర్తించి తీర్ధ యాత్రలకు బయల్దేరాడు .

శివ శర్మ మొదట అయోధ్య కు చేరాడు .సరయు నదిలో స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అయిదు రాత్రులు ఉండి ,ప్రయాగ చేరాడు .తివేణీసంగమం లో పవిత్ర స్నానం చేసి ,గంగా నది ఇక్కడే కలుస్తుందన్న విషయం తెలిసి కొన్నాడు .ప్రకృష్ట మైన క్షేత్రం కనుక ప్రయాగ అనే పేరొచ్చింది .సప్త పాతాళాలలో వ్రేళ్ళూనుకొని ఉన్న అక్షయ వట వృక్షాన్ని భక్తితో దర్శించాడు .బ్రాహ్మణులకు సమారాధన చేశాడు .ఇది ధర్మార్ధ కామ మొక్షాలనిచ్చే క్షేత్ర రాజం .బ్రహ్మ హత్యా దోషాన్ని కూడా నివారించే శక్తి ఈ క్షే త్రానికి ఉంది .విష్ణు స్థానమైన వేణీ మాధవా న్ని దర్శించాడు .రజో రూపం లో ఉండే సరస్వతి ,తమో రూపం లో ఉండే యమునా ,సత్వ రూపం లో ఉన్నగంగా నది ఇక్కడ కలిసి నిర్గుణ బ్రహ్మ రూపాన్ని పొందినాయి . PART-11


🙏🏻ప్రతి హిందువు చదివి బంధుమిత్రుల చేత చదివించి

 శ్రీ ఉమామహేశ్వర కృపకు పాత్రులు కాగలరు

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: