26, అక్టోబర్ 2020, సోమవారం

వైదిక ధర్మం

 ప్రశ్న: వైదిక ధర్మం అంటే ఏమిటి? అది ఎవరికి వర్తిస్తుంది?దాని ప్రిన్సిపుల్స్ ఏంటి?


ఉత్తరం: చతుర్వేదాలు-ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అథర్వవేదము మరియు వేదానుకూల గ్రంథాలలో చెప్పబడినటువంటి దానిని వైదికధర్మ మంటారు. వేదములు మానవమాత్రులందరివి. కావున వైదిక ధర్మం మానవులందరికి వర్తిస్తుంది. సృష్ట్యాదిలో మనుష్యులందరి హితాన్నిగోరి సృష్టికర్త-పరమాత్ముడు, ఈ నాలుగు వేదాల జ్ఞానాన్ని నలుగురు ఋషుల అంతఃకరణములో ప్రకటించి వ్యాపింపజేశాడు. వేదములో విధి,నిషేధాలున్నవి .విధి అంటే కర్తవ్యకర్మలు. మానవమాత్రులందరు నిత్యం చేయవలసినవి.

.1.సంధ్య-ఈశ్వరోపాసన (ఉదయ సాయం సంధ్యా సమయములలో గాయత్రీ మంత్రమును జపిస్తూ... అర్థవిచారణ చేస్తూ సర్వోత్తమ బుద్దిని బడయుట మరియు ప్రాణాయామము నభ్యసించి శరీరమునకు లోపల, బయట గల అంగప్రత్యంగములను సుదృఢమొర్చుకొనుట.2.దేవయజ్ఞముఅగ్నిహోత్రము(మర్రి,మామిడి,మోదుగ. రావి,జమ్మి మున్నగు సమిధలను యజ్ఞకుండములో పేర్చి ఆవునేతితో(16)ఆహుతుల నిచ్చుట.3.పితృ యజ్ఞం (జీవించియున్న మాతాపితరులకు శ్ర‌ద్ధతో సేవాసుశ్ర‌ూషలు చేయడం. "శ్ర‌ాద్ధం" ,వారికి తృప్తితీరా భోజనాదులందించిసత్కరించడం."తర్పణం" అవసరమైన సేవలు చేసి తృప్తిపరచటం.4.అతిథి యజ్ఞం: మన హితముగోరి ఇంటి కేతెంచిన పరోపకార పరాయణులను సత్కరించడం.5.బలివైశ్వదేవ యజ్ఞం:మనపై ఆధారపడి జీవిస్తున్న అల్పప్రాణులకు (ఆవు,గేదె,మేక,పిల్లి,కుక్క మున్నగు వాటికి ఆహరమునివ్వడం.

 ఇక నిషేధకర్మలు:అకర్తవ్యముులు-చేయగూడనివి.1.హింస(మనోవాక్కాయ కర్మలతో ఏ ప్రాణిని హింసించ కుండుట) 2. సత్యం : అసత్యము పలుకకుండటం. స్వార్థ చింతనతో సత్యాన్నిఅసత్యముగాచిత్రీకరించకుండుట.3.పరులవస్తువులను,హక్కులనుహరించకుండుట.4.నాస్తికుడుగనుండకుండుట, వ్యభిచారమునకు దూరముగనుండుట.5.తనఅవసరాలకు మించి కూడబెట్టకొనకుండుట. 

కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ , అకర్తవ్యానికి దూరముగా నుండుట. వీటినితప్పక ఆచరించాలని వేదాదేశం.విధిపూర్వక కర్మల నాచరిండమే మానవజీవన లక్ష్యం. వేదాలలోసమస్త సత్యవిద్యలన్నీ ఉన్నాయి. పిపీలికము(అమీబా-ఏకకణ జీవి) మొదలుకుని బ్రహ్మ పర్యంతము తెలుపు విషయాలన్నీ వేదాలలో ఉన్నాయి. షోడశ సంస్కారాలు: గర్భదానముమొదలుకునిఅంత్యేష్టివరకుపదహారుసంస్కారాలు వేదాంతర్గతంగానే ఉన్నాయి. నీవు రేపు మీ పాపకు చేయబోవు జాతకర్మ మరియు నామకరణ సంస్కారాలు వేదములో చెప్పబడ్డవే.సైన్స్, టెక్నాలజీ ( గుండుసూదినుండివిమానాలు,రాకెట్లు,ఉపగ్రహాలు,దూరదర్శన్,దూరశ్ర‌వణం మున్నగు వాటినిర్మాణం వరకు) అలాగే రాజనీతి-రాజ్యవ్యవస్థ(శస్త్రాస్త్ర నిర్మాణం) మరియు వైద్యం, అందు గల శల్య చికిత్స(surgery)అన్నీ మన వేదాలలోనుండి వచ్చినవే.. వేదము లుత్పన్నమై నేటికి 196,08,53,119 సంత్సరములైనవి. వీటి ననుసరించియే శ్ర‌ీరాముడు,శ్ర‌ీకష్ణుడు మరియు ఇతర మహా పురుషులు తమ జీవనాన్ని మలుచుకుని మనకు ఆదర్శమయ్యారు.వారి చరిత్రను అనుసరించడమే వారి పూజ. మహాభారతయుద్ధము వరకు వేదధర్మమే ప్రపంచ వ్యాప్తంగా ఉండేది. అప్పటివరకు మనము ఆర్యులు వైదికులుగానే పిలువబడ్డారు. ఆ తరువాత కాలమునుండి మనం భారతీయులని హిందువులని పిలువబడుతున్నాం.తదననంతర పరిస్థితులలో వేదాల స్థానములో 18పురాణములు వెలిశాయి. అహింసాయుతమైనపవిత్రయజ్ఞములుహింసకునెలవయ్యాయి. జంతుబలిఆరంభమైమయింది. తమ ఈ చర్యలను సమర్ధించుకోవడానికి రామాయణ, మహాభారతాలలో కల్పిత శ్లోకాలుకల్పించిఅందుచేర్చారు. అశ్వమేధ యాగం, అజామేధ యాగములకు వికృతార్థమొనర్చిజంతుబలులు, అశ్లీలకృత్యములు సైతం చేశారు.వాస్తవానికి-----

 "రాష్టం వా అశ్వమేధః" (శతపథ బ్రాహ్మణము13-1-63

రాజు న్యాయముగ,ధర్మానుకూలముగ ప్రజాపాలనము చేయుటయే అశ్వమేధము.

గుఱ్ఱము నాభిక్రింది భాగములోని "వప"తో ఆహుతి నివ్వుమని ఎక్కడను లేదు.

యజ్ఞములలో జరుగుతున్న పశుహింసను వేదముల చెప్పబడినదని తప్పుగా భావించి బుద్దుడు వేదవిముఖుడయ్యాడు. నిరీశ్వరవాది అయ్యాడు. అటువంటిదే జైన మతము. తద్వారా వేదమతము నామ మాత్రమైనది. ఆది శంకరాచార్యు లుద్భవించి జైనబౌద్ధమతములనోడించి వేదమతము నుద్ధరించారు. అయితే అప్పటికే వైదికమతములోచేరిన వికృతులు జన్మతోవర్ణవ్యవస్థ, కల్పిత కులవ్యవస్థ, సతీసహగమనం, బాల్య వివాహాలు,వేదాధ్యయననాన్ని బ్రాహ్మణేతరులకు నిషేధించుట, యజ్ఞములో హింస మున్నగు సామాజిక రుగ్మతల విషయాలపై ఎందుకనో చర్చించలేదు. తదననంతర కాలంలో మహర్షి దయానంద సరస్వతి ఉద్భవించి సనాతన వైదిక ధర్మాన్ని కాపాడి తిరిగి మానవమాత్రులందరు వర్ణ,లింగ బేధాలకు అతీతంగావేదాన్ని చదువచ్చని చాటారు. పదహారు సంస్కారాలు యదార్థస్వరూపాన్నిమన ముందుంచారు. యజ్ఞములను హింసారహితమొనర్చారు. శ్ర‌ీరామ, శ్ర‌ీకృష్ణుల నిజమైనచరిత్రను కాపాడారు.స్వాతంత్ర్యశంఖారావాన్నిపూరించారు. వారు స్థాపించిన ఆర్యసమాజమునుండి ఉద్భవించిన శ్యాంజీకృష్ణవర్మ, వీరసావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ మున్నగు వారి కృషి ఫలితంగా మనము స్వాతంత్ర్యాన్ని పొందాము. అట్టి మహర్షి దయానంద సరస్వతి ఆశయాల వ్యాప్తికి కట్టుబడ్డదే మన ఆర్యసమాజం మరియు ఆదిత్య వాణి.

కామెంట్‌లు లేవు: