26, అక్టోబర్ 2020, సోమవారం

ఆత్మ విచారం

 💦🌺🌻🌸💦🌺🌻🌸💦🌺


          *_🌹నేటి ఆత్మ విచారం 🌹_*


*_యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా_*

*_నమస్తస్త్యై  నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః._* 


*_ఈ  చరాచర జగత్తును నడిపించేది శక్తి. ఆ శక్తినే ఆదిశక్తి, పరాశక్తి అంటారు._*


*_ఆ శక్తి త్రిగుణాత్మకంగా ఉంటుంది. తమోగుణ ప్రధానమైనప్పుడు మహాకాళి అని, రజోగుణ ప్రధానమైనప్పుడు మహాలక్షి అని, సత్వ గుణంతో ప్రకాశించేటప్పుడు మహా సరస్వతి అని పిలవబడుతుంది కానీ,_*


*_శక్తీ ఏ రూపంలో ఉన్నా అది ఆ ఆదిపరాశక్తి వ్యక్తస్వరూపమే ! ఎప్పుడు ఎక్కడ దుష్టశిక్షణ చేయవలిసిన అవసరం కలిగినా మహాశక్తి జీవులపై ఉన్న అంతులేని ప్రేమతో అవతరిస్తూ వచ్చింది.ఎంతైనా జగన్మతా కదా !_*


*_అన్ని సందర్భాలలోనూ ఆ తల్లి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అవతరించి నవమి నాడు రాక్షససంహారం చేయడం జరిగింది. కనుక ఆదిపరాశక్తిని ఆ సమయంలో పూజించి ఆ తల్లి అనుగ్రహం పొందడం సంప్రదాయం అయింది._*


*_దసరా అంటే అందరికి సరదా...పిల్లలు ఆటపాట ల్లోనూ, పెద్దలు విందువినోదాల్లోనూ దసరాను సరదాగా గడిపేస్తారు. అయితే, ఈ సరదా సంబరాలు, విందువినోదాలు, విలాసవిన్యాసాలు, సంతోషసమయాలు  ఎల్లప్పుడు ఎందుకు ఉండవు...?_*


*_జీవితమంతా సుఖ సంతోషాలతో సాగిపోవాలంటే....అసలు ఈ జీవితమే ఓ.. దసరామయం కావాలంటే ఏం చేయాలి.. ? కళ్ళకు కన్నీళ్లు తెలియని స్థితిని, మనస్సుకు వేదన లేని స్థితిని, హృదయంలో అక్షయానందం నెలకొనే స్థితిని పొందాలంటే ఏం చేయాలి...?_*


*_సకల సిరిసంపదలున్న శాంతిమయ జీవనానికి హామీ లేదు : సర్వాధికారాలున్నా భద్రమయ జీవనానికి భరోసా లేదు : సకల బంధుబలగమున్నా సుఖమయ జీవనానికి ఆసరా లేదు._*


*_ఈ జీవిత సత్యాన్ని విశదపరిచేదే "దేవి మహాత్యం " లోని సురథ, సమాధిలా జీవన వృత్తాంతం. ఈ ఇద్దరి జీవితాలతో ముడిపడి ఉన్నవే మనందరి జీవితాలు కూడా ! అందుకే సురథ, సమాధిలా జీవితాలు మనకు కనువిప్పు మార్గదర్శకం!_*


*_సురథ, సమాధిలా గాథలోని అంతరార్థం ఏమిటంటే..._*


 *_"సురథ "అంటే మంచి వాహనం. మన మనస్సులోని దుర్గుణాలన్నీ దూరమైనప్పుడు మన మనస్సే ఒక మంచి వాహనమై మనల్ని ఉన్నత స్థితికి చేర్చే "సురథం " అవుతుంది._*


*_కాబట్టి మనలోని కామక్రోధలోభమోహాది అసురగుణాలు అంతమొందినప్పుడు "సమాధి "అంటే సుఖదుఃఖాలు ఇష్టా ఇష్టాలు శుభా శుభాలు, శోక మొహాలకు అతీతమైన స్థితి అయినా "బ్రహ్మనందస్థితి "లభిస్తుంది._* 


*_శుభమ్ భుయాత్,_* 


*_ఆధ్యాత్మిక ఆత్మ బాంధవులకు "విజయ దశమి" శుభాకాంక్షలు.💐_*


*_సర్వేజనాః_* *_సుఖినోభవంతు._*🙏


    🌺 *__🕉*  🌸

* 🙏


💦🌺🌻🌸💦🌺🌻🌸💦🌺

కామెంట్‌లు లేవు: