26, అక్టోబర్ 2020, సోమవారం

సెలవు

 సెలవు

౼౼౼౼

సరదా సరదా దసరా

సరిగమపదని స్వరముల సయ్యాటలునా

సరోజరుచిరాస్యమ్మున

ఉరుకులపరుగుల ఉరముల కుత్సాహ మిడెన్ !


బొమ్మల కొలువుల వెలుగై

బమ్మెర పద్యామృతమున పర్వెడు ఝరియై

సమ్ముదమందగజేయుచు

సమ్మోహముగొల్పివెడలె

చయ్యన దసరా.


దీక్షలు క్రతువులు పద్యా

లీక్షితిసాగింపమోదమేర్పడ జేయున్

దక్షతగూర్చినదసరా

దక్షిణతాంబూలమంది త్వరత్వర సాగెన్.


రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

కామెంట్‌లు లేవు: