ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
15, మార్చి 2026, ఆదివారం
మూడు దుఃఖాలు
మూడు దుఃఖాలు
మనిషికి దుఃఖం ఎందుకు కలుగుతుంది? దాన్ని నివారించే మార్గం ఏదైనా ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందుగా అసలు దుఃఖమంటే ఏంటో తెలియాలి. దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవాలి. తైత్తిరీయ ఉపనిషత్తులోని సాంఖ్య దర్శనంలో దీనికి సంబంధించి ప్రామాణిక వివరణ కనిపిస్తుంది. మనుషులకు కలిగే దుఃఖాలు మూడు... ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. మనిషిలో రజోగుణ ప్రకోపం ఎక్కువైనప్పుడు కలిగే ఈ మూడింటికీ కాస్త పరిణామ భేదం ఉంటుంది తప్ప అన్నీ ఒక కోవకు చెందినవే.
ఎవరికి వారుగా చిన్నపాటి ప్రయత్నంతో, సులభంగా దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చని సాంఖ్యశాస్త్రం చెబుతోంది. తమను తాము తరచి చూసుకోవడం ద్వారా, ఆలోచనలను సంస్కరించుకోవడం సాధ్యమేనంటోంది. ద్వారా అది
ఆధ్యాత్మిక దుఃఖం... శారీరకం, మానసికం అని రెండు రకాలు. శారీరక అనారోగ్యం కారణంగా కలిగే దుఃఖం- వైద్యుణ్ని సరైన మందు తీసుకుంటే ఉపశమిస్తుంది. అరిషడ్వర్గాలవల్ల కలిగే దుఃఖం మానసికం. ఏ మనిషైనా ఫలానాది నాకు కావాలనుకోవడంలో తప్పులేదు. కానీ స్థాయిని మర్చిపోయి అందని ద్రాక్షకోసం అర్రులు చాచకూడదు. తెల్లారేసరికల్లా అపర కుబేరుడిగా మారిపోవాలనుకోవడం అజ్ఞానం. కోటీశ్వరుడు కావాలనుకోవడం తప్పుకాదు. కానీ, దానికోసం శ్రమించకుండా అప్పనంగా సంపద ఒళ్లో పడాలనుకోవడం అవివేకం. ఇలాంటి అనుచితమైన కోరికలవల్ల మనసుకు దుఃఖం కలుగుతుంది. వీలైనంత ప్రశాంతంగా ఉండాలి. మంచిగా ఆలోచించాలి. ఇతరుల అభివృద్ధిని చూసి సంతోషించాలి. అరిషడ్వర్గాలవల్ల కలిగే దుఃఖానికి ఇవే తగిన ఔషధాలు.
రెండో రకమైన దుఃఖం ఆది భౌతికం. ఇది మనుషులు, పాములు, తేళ్లు, సింహాలవంటి ప్రాణులవల్ల కలుగుతుంది. క్రూరమృగాలకు దూరంగా ఉండొచ్చు కానీ మనుషులకు దూరంగా ఎలా ఉండగలం! 'నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ' అని శతకకారుడు చెప్పినట్టుగా చెడ్డవారికి దూరంగా ఉండాలి. మన గురించి చెడుగా ఆలోచించేవారు చాలామంది ఉండొచ్చు. అది వాళ్ల లోపం. వాళ్ల గురించి, వాళ్ల చర్యల గురించి పదే పదే ఆలోచించి, బాధపడటం ఎందుకు... అనే సత్యాన్ని తెలుసుకుంటే ఈ విధమైన దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది. వివేచన అంటే అదే. ఈ నిజాన్ని తెలుసుకోలేకపోతే అవతలివాళ్లు చేసే చేటుకంటే ఎవరికివారు చేసుకునే చేటే ఎక్కువ.
మూడో రకమైన దుఃఖం ఆది దైవికం. ఇది యక్ష, రాక్షస, గ్రహావేశాలవల్ల కలిగే దుఃఖం. మన జీవితం మన చేతిలో ఉండాలి. మన ఉపాసన బలం మనకుండాలి. మంచి నడవడిక, నిర్మలమైన మనసు ఉంటే భగవంతుడి అండ ఎప్పటికీ ఉంటుంది. అవే నిర్మలమైన ఆనందానికి హేతువులు. ఈ నిజాన్ని తెలుసుకోవటమే దుఃఖనివారణకు సిసలైన మార్గం.
మల్లాది వేంకట గోపాలకృష్ణ
మహాభారతము
🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*శనివారం 14 మార్చి 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
1️⃣6️⃣4️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*164 వ రోజు*
*విరాట పర్వము ప్రథమాశ్వాసము*
*రాజకొలువులో ప్రవర్తించవలసిన పద్ధతులు*```
ధౌమ్యుడు పాండవులను చూసి..
“ధర్మరాజా! మీరు కురువంశంలో జన్మించారు. గౌరవంగా బ్రతికారు. ఇలాంటి మీరు పరులను సేవించుట కష్టమే. కాని మనకు అనుకూలం కాదని మరచి పోవద్దు. మీరు పరాక్రమాలు ప్రదర్శిస్తే అజ్ఞాతవాసం భగ్నమౌతుంది. రాజులను సేవించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. రాజుతో చనువుగా ఉన్నాను అనుకుని రాజమర్యాద అతిక్రమిస్తే హాని కలుగుతుంది. రాజుకన్నా విలువైన దుస్తులు ధరించటం కాని, రాజుకన్నా అధికంగా మాట్లాడటం కాని, రాజగృహంకన్నా ఆడంబరమైన గృహంలో నివసించటం కాని చేయకూడదు. సహజంగా రాజులు తమ ఆజ్ఞను ఉల్లంఘించిన వారు పుత్రులైనా మిత్రులైనా శత్రువులుగా చూస్తారు. తాను చేయలేని పని తలపై వేసుకోకూడదు అందువలన భంగపాటు తప్పదు. రాజుల యందు మౌనంగా ఉండకూడదు అలాగని అతిగా భాషించకూడదు. మితమైన చతుర సంభాషణచే రాజులను మెప్పించాలి. అంతఃపుర రహస్యాలను బయట పెట్టకూడదు. రాజుకు చెప్పదగినవి, వినదగినవి అయిన మాటలనే చెప్పాలి. రాజు అనుమతి మీదనే ఆసనాన్ని అధిరోహించాలి. రాజుకన్నా ఉన్నతాసనం పై ఎప్పటికీ అధిరోహించకూడదు. రాజు అభిమానించాడని పొంగిపోకూడదు. అలాగే అవమానిస్తే కుంగిపోకూడదు. రాజు చెప్పిన పనిని ఎండ, వాన, ఆకలి, దప్పిక, కాలము ప్రదేశం నిమిత్తం లేకుండా చేయాలి. రాజధనాన్ని విషంతో సమానంగా చూడాలి. రాజధనాన్ని సంగ్రహించడం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. రాజు కొలువులో నవ్వటం ఆవులించడం చేయకూడదు. రాజుగారి శత్రువులతోకాని, వారి దూతలతో కాని సన్నిహితంగా మెలగకూడదు. భటుడు సంపద కలదు కదా అని అధికంగా భోగింపరాదు. రాజుకు కంటగింపుగా ఉంటుంది. కనుక అజ్ఞాతవాస సమయమున మీరు అణగి మెణగి మెలగవలసి ఉంటుంది” అన్నాడు.
```
*విరాటనగరానికి పయనం*```
ధర్మరాజు ధౌమ్యుని బుద్ధిమతి విని
“మాకు అన్నీ మీరే. మాకు తెలియని అనేక విషయాలు చెప్పారు. వాటిని తప్పక పాటిస్తాము”అన్నారు.
ధౌమ్యుని ఆశీర్వాదం పొంది పాండవులు,ధౌమ్యుడు అక్కడి నుండి విరాటనగరానికి వెళ్ళారు. యమునా నది వెంట నడుస్తున్నారు. మత్స్యదేశ పొలిమేర చేరగానే అక్కడ ఒక ఆశ్రమంలో ధౌమ్యుడు ఆగి పాండవులు వెళ్ళాక అగ్నిహోత్రాలు తీసుకుని పాంచాల దేశానికి వెళ్ళాడు.
పాండవులు అరణ్యాల వెంట తమ ప్రయాణం సాగించారు.విరాటనగరానికి వెళ్ళటానికి చాలా దూరం నడిచారు. ద్రౌపది ఇక నడవ లేక పోయింది విశ్రాంతి తీసుకుంటాము అనుకుంది. ధర్మరాజు అందుకు ఒప్పు కోలేదు. త్వరగా విరాట నగరం చేరాలన్నది అతని కోరిక పట్టుదల. ద్రౌపది ఇక ఒక అడుగు కూడా వేయలేనని చెప్పింది. ధర్మరాజు నకులుని చూసి
“నకులా! ద్రౌపది అలసి పోయింది. కొంచం ఎత్తుకుని తీసుకు రాగలవా” అని అడిగాడు.
నకులుడు “నేను కూడా అలసి పోయాను అన్నయ్యా!” అన్నాడు.
ధర్మరాజు సహదేవుని అడిగాడు. సహదేవుడూ అలాగే సమాధానం ఇచ్చాడు.
ఇక అర్జునిని వంతు వచ్చింది. అర్జునుడు ద్రౌపదిని అవలీలగా ఎత్తుకుని విరాట నగరం వైపు నడిచాడు.
అందరూ విరాట నగర పొలిమేర చేరగానే కొంత తడవు ఆగారు. ధర్మరాజు తమ్ములతో “మనం ఈ ఆకారాలతో,ఆయుధాలతో నగరంలో అడుగు పెడితే మనలను సులువుగా గుర్తిస్తారు. మనం మన ఆయుధాలను దాచాలి!” అన్నాడు.```
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
15మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం*🌞
*🌹15మార్చి2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*ఫాల్గుణమాసం - కృష్ణ పక్షం*
*తిథి : ఏకాదశి* ఉ 09.16 వరకు ఉపరి *ద్వాదశి*
*వారం : ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : శ్రవణం* రా 05.56 తె వరకు ఉపరి *ధనిష్ఠ*
*యోగం : పరిగ* ఉ 10.25 వరకు ఉపరి *శివ*
*కరణం : బాలువ* ఉ 09.16 *కౌలువ* రా 09.33 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 11.00 - 12.00 మ 02.00 - 04.00*
అమృత కాలం : *రా 07.03 - 08.43*
అభిజిత్ కాలం : *ప 11.52 - 12.40*
*వర్జ్యం : ఉ 09.00 - 10.40*
*దుర్ముహూర్తం :సా04.41- 05.29*
*రాహు కాలం :సా04.47- 06.17*
గుళికకాళం : *మ 03.17 - 04.47*
యమగండం : *మ 12.16 - 01.47*
సూర్యరాశి : *మీనం*
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం :*ఉ 06.25*
సూర్యాస్తమయం :*సా 06.26*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.16- 08.40*
సంగవ కాలం :*08.40- 11.04*
మధ్యాహ్న కాలం :*11.04 - 01.29*
అపరాహ్న కాలం :*మ 01.29- 03.53*
*ఆబ్ధికం తిధి : ఫాల్గుణ బహుళ ద్వాదశి*
సాయంకాలం :*సా03.53- 06.17*
ప్రదోష కాలం :*సా 06.17- 08.41*
రాత్రి కాలం :*రా 08.41- 11.52*
నిశీధి కాలం :*రా 11.52- 12.40*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.39 - 05.27*
౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾
🌷*ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*
*పద్మాయుధాయ నమః*
*చక్రాయుధాయ నమః*
*కటిస్థానే మాం రక్షతు*
🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః*
🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌞🌞🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌞🌞🍃🌷
🌹🌷🌞🌞🌞🌞🌷🌹*
*శ్రీ మహావిష్ణు పురాణం*
🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*శనివారం 14 మార్చి 2026*
*🙏
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *25వ భాగం*``
*కపిల మహర్షి తన తల్లి దేవహూతికి చేసిన సాంఖ్యతత్త్వ బోధ!*
```
దేవహూతి ఒంటరిదయ్యింది. భర్త కర్దముడు సన్యాసాశ్రమం తీసుకుని తపస్సుకి వెళ్లి పోయాడు. తిరిగి రాడు. తొమ్మిది మంది కూతుళ్లు వివాహాలు చేసుకుని భర్తల వెంట వెళ్ళిపోయారు. పరమాత్ముడు కుమారుడిగా జన్మించాడు అన్న ఆనందం.. ‘పుట్టగానే యోగిగా, సాంఖ్య యోగప్రవక్తకుడు,ప్రచారకుడు’ అవడంతో మాయమైపోయింది. కట్టిన బంధాలు, కన్న బంధాలు అలా అయ్యేటప్పటికి దేవహూతి ఒంటరిదై మనస్సు చింతతో, బాధతో, దిగులుతో నిండిపోయింది.
భరించలేక కుమారుడికి తన పరిస్థితి చెబుదామని ఒకరోజు దేవహూతి ధ్యాన దీక్షలో ఉన్న కపిల మహర్షి వద్దకు వెళ్లింది. తల్లి రాకను, ఆమె మనస్సులోని ఆవేదనను గుర్తించి కన్నులు తెరచి కపిలుడు చిరునవ్వుతో “అమ్మా! నీ మనస్సంతా చింతతో నిండిపోయింది. ఒంటరితనం అనుభవిస్తున్నావు. ఎందుకమ్మా ఇంతటి ఆవేదన? దుఖం?
స్వాయంభువ మనువుకి కుమార్తెగా జన్మించావు. కర్దమమహర్షి వంటి మహాత్ముని భర్తను పొంది అనుకూల దాంపత్య జీవనం గడిపావు. చక్కటి తొమ్మిది మంది పుత్రికలను, కుమారుడైన నాకు జన్మనిచ్చి మాతృమూర్తిగా, గృహిణిగా పతివ్రతా ధర్మము నెరవేర్చావు. ఇలాంటి ఉత్తమ జీవితం కోటిలో ఒకరికి మాత్రమే లభిస్తుంది. భగవంతుని నామస్మరణలో గడపవలసిన ఈ సమయంలో ఇంత దుఖం, దిగులు ఎందుకు?” అని అనునయంగా అడిగాడు.
దేవహూతి మనస్సులోని దుఖం కుమారుడి అనునయపు మాటలకు కన్నీరుగా కళ్ళ నుండి రాసాగింది. కొంతసేపటికి స్థిమితపడి కన్నులు తుడుచుకని “కుమారా! నీవన్నది నిజం. నా తండ్రి స్వాయంభువ మనువు నన్ను అల్లారుముద్దుగా చూసుకున్నాడు. బాల్యం చక్కగా సాగిపోయింది. వివాహం జరిగాక
నా భర్త నన్ను ఏలోటులేకుండా చూసుకున్నాడు. తొమ్మిది మంది ఆడపిల్లలకు, ఒక దైవాంశ కుమారుడికి జన్ నిచ్చిన నా వైవాహిక గృహస్థ జీవితం సంతృప్తిగా గడిచింది. నీవన్నట్టే నా అంత అదృష్టవంతురాలు లేదనుకున్నాను. కానీ తరువాత ఏం జరిగింది. ఒంటరి జీవితం మిగిలింది. నా గురించి ఆలోచిస్తే నేను తప్ప ఎవరూ నాతో లేరు. ఇందుకేనా జన్మ ఎత్తింది? భర్తకు సేవ చేస్తూ నవమాసాలు గర్భక్లేశాలు అనుభవించి పదిమందికి జన్మనిచ్చింది.
నన్ను కన్న తండ్రి నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు. జీవితకాలం తోడు ఉండవలసిన భర్త నన్ను సంతానవతిని చేసి, ఆడపిల్లల వివాహం చేసి తన బాధ్యత తీరిందని వదిలేసి తపస్సుకి వెళ్లిపోయాడు. తొమ్మిది మంది కుమార్తెలు వివాహాలు కాగానే తమ జీవితాలు భర్తలతోనే అనుకుని వారి వెంటనడిచి తమ బాధ్యత తీరిందనుకున్నారు. దైవాంశ సంభూతుడివైన నీవు కుమారుడిగా జన్మించావు. నీ నీడలో నీ పంచన శేష జీవితం గడపవచ్చు అనుకుని నీ తండ్రికి సన్యాసాశ్రమం వెళ్ళడానికి అంగీకరించాను. కానీ నీవేమో జన్మిస్తునే యోగిగా, సాంఖ్యయోగ ప్రబోధకుడిగా మారిపోయావు. ధ్యాన దీక్షలో, ప్రచార దీక్షలో నిమగ్నమై తల్లిని ఒంటరిదానిని చేసావు. నా మనస్సులో దుఃఖం, విచారం, ఒంటరితనం కాక ఇంకా ఏముంటుంది? స్త్రీగా పుట్టిన నాకు ఏమి దక్కింది. నా జన్మ ఉద్దేశం ఏమిటి? నన్ను కన్నందుకు, వివాహం చేసినందుకు నా తల్లిదండ్రులకు కన్యాదాన ఫలం దక్కింది. నన్ను వివాహమాడిన నా భర్తకు గృహస్థాశ్రమ ధర్మ ఫలం, దాంపత్య సుఖం, కుమార్తెల వివాహాలు చేసి నందుకు కన్యాదాన ఫలం పొందాడు. వివాహాలై భర్తలతో వెళ్లిన కమార్తెలకు, కుమారుడైన నీకు పితృ ఋణం తీర్చిన ఫలం దక్కింది.
ఏ ఫలం ఆశించకుండా నా బాల్య యవ్వన కౌమార జీవితం మీకు అంకితం చేసి మీ అందరి సేవలు చేసిన నాకు దక్కినఫలం ఏమిటి. జీవిత చరమాంకంలో ఒంటరి తనం, దుఃఖం, ఆవేదన తప్ప! నా జీవితం ముగిసేదాక ఇలా దుఖంతో గడపవలసిందేనా? ఇందుకేనా నేను జన్మించింది?” అని దుఃఖం పొంగుకొస్తుంటే గద్గద స్వరంతో అడిగింది.
తల్లిని చిరునవ్వుతో చూస్తూ “అమ్మా! నీవు సంసార మోహ మాయా భ్రాంతిలో మునిగిపోయి ఇలా మాట్లాడుతున్నావు. ఇందుకు కారణం ఒంటరితనంతో నీవు నిరాహారివై ఉండటం కావచ్చును. కాస్తంత ఆహారం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది కదా” అన్నాడు కపిలుడు.
దేవహూతి ఆశ్చర్యంగా చూస్తూ “కుమారా! నీవు మరచిపోయి నట్టున్నావు. నా దగ్గర మాట తీసుకున్నావు కదా నిరాహారిగా ఉండద్దని. నీ మాట కాదనలేక నాలుగు అరటి పళ్లు తిన్నాను” అంది.
కపిలుడు అడిగాడు “ఒంటరిగా ఉన్నావు కదా! అరటి పళ్లు ఎక్కడ నుంచి వచ్చాయి?”
“మన ఆశ్రమంలో రకరకాల పళ్ళ చెట్లు నాటాము కదా. ఏ ఋతు వులో కాసే పళ్లను ఆ ఋతువులలో మనకు ఆచెట్లు ఇస్తున్నాయి. మనమందరం ఆ పళ్ళను ఆహారంగా తింటున్నాము కదా” అన్న తల్లి కళ్ళల్లో చూస్తూ “అంటే చెట్లు ఋతుధర్మం పాటిస్తూ పళ్లు ఇస్తున్నాయి కదా” అని కపిలుడు అడిగితే దేవహూతి అవునన్నట్టు తలవూపింది.
“అమ్మా! ఋతు ధర్మము అంటే ఏమిటో తెలుసా?” అని కపిలుడు అడిగాడు.
తెలియదన్నట్టు చూసింది దేవహూతి. “ఋతువుకి ఒక ధర్మము ఉంటుంది. ఋతువుకి తగ్గట్టు పెరిగిన వృక్షాలను ఆ చెట్ల పళ్ళను మనకు ఆహారంగా ఇచ్చేట్టు చేస్తుంది. అందుకు కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాం” అని ప్రశ్నించాడు.
“ధర్మానికి కృతజ్ఞత ఎలా చెబుతాం. ప్రకృతి నిర్దేశించినట్టు బుుతువు తగిన ఫలాలు ఇస్తుంది. అది ఋతు ధర్మము. మన నుంచి ఏమి ఆశించకుండానే చేస్తుంది! అవునా" అని దేవహూతి సమాధానం చెప్పింది.
కపిలుడు చిరునవ్వుతో “అంటే ఋతువు మన నుంచి ఎటువంటి ప్రతిఫలం, కృతజ్ఞత ఆశించకుండానే తన ధర్మము నెరవేరుస్తోంది. మరి నీకు అరటి పళ్ళు ఇచ్చిన అరటి చెట్టు సంగతి ఏమిటి? అరటి చెట్టు తన మనుగడయే మనకు ఇచ్చింది. అరటి కాయలు,పళ్లు,ఊచ,పువ్వు మనకు ఆహారంగా ఉపయోగపడుతోంది. అరటి ఆకులు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. అరటి పిలకలు తెచ్చి శుభకార్యాలకు ద్వారాలకు, మందిరాలకు, పూజా వేదికలకు కట్టుకుంటున్నాము. ప్రతిఫలంగా అరటి చెట్టుకి ఏమి లభిస్తోంది? కాయలు కోస్తున్నాము, పళ్లు తెంచుతున్నాము, పిలకలు, బోదె నరుకుతున్నాము. అంతా అయిన తర్వాత ఎండిన చెట్టుని పీకేసి మరొక అరటి మొక్క నాటుతున్నాము. మనం ఇన్ని విధాలుగా హింసించినా పట్టించు కోకుండా అరటిచెట్టు తిరిగి తన ధర్మం నెరవేరుస్తోంది. అంటే మన నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండానే ఈ ప్రకృతి, ఋతువు, చెట్లు తమ ధర్మం నెరవేరుస్తున్నాయి. అలాగే మనం జన్మించిన ఈ దేహం దేహధర్మం పాటించి తనకు నిర్దేశించిన ధర్మాలను నెరవేరుస్తోంది. అనగా జీవుని దేహం ప్రతిఫలం, కృతజ్ఞతలు ఆశించకుండానే పురుషుడిగా, స్త్రీగా తనకు ఉద్దేశించిన కార్యాలను పూర్తిచేస్తుంది. గ్రహించావా తల్లీ" అని సూటిగా అడిగాడు.
మాటరాక దేవహూతి నిశ్చేష్టురాలైంది.
*తరువాతి కథ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు**🔔 _శుభోదయం_ 🕉️Goodmorning 🔔*
*_సలహా పవిత్రంగా ఉండాలి, నమ్మకం పదిలంగా ఉండాలి._*
*_స్నేహం పటిష్ఠంగా ఉండాలి, బంధంశాశ్వతంగా ఉండాలి._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
శుభ రవి వారం 💥Happy Sunday
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
_సలహా పవిత్రంగా ఉండాలి
*🔔 _శుభోదయం_ 🕉️Goodmorning 🔔*
*_సలహా పవిత్రంగా ఉండాలి, నమ్మకం పదిలంగా ఉండాలి._*
*_స్నేహం పటిష్ఠంగా ఉండాలి, బంధంశాశ్వతంగా ఉండాలి._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
శుభ రవి వారం 💥Happy Sunday
అప్పులు పెక్కుజేసి
ఋణకర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర శ్శత్రు రపండితః
ఉ. అప్పులు పెక్కుజేసి మృతి నందిన యప్పుడు తండ్రి శత్రువౌ,
తప్పగు జీవితమ్మునను తా చరియించినతల్లి శత్రువౌ,
గొప్పగు రూపమున్నసతి కూరిమియైనను శత్రువౌనిలన్,
మెప్పగు విద్యలన్ సుతుడు మేలుగ నేర్వక శత్రువయ్యెడున్
✍️గోపాలుని మధుసూదనరావు శర్మ 🙏
