18, మార్చి 2026, బుధవారం

*"శ్రీ పరాభవ" నామ సంవత్సరం.*

 *"శ్రీ పరాభవ" నామ సంవత్సరం.*


రేపటినుండి నుండి శ్రీ పరాభవ నామ సంవత్సరం మొదలు అవుతుంది. పరాభవ అనే పదం వినగానే మనకి ఒక అనుమానం వస్తుంది...పరాభవం అంటే అవమానం కాబట్టి ఈ సం ll అంతా మనకు అవమానాలేమో అని. కానీ అది నిజం కాదు.


*సంస్కృత పరంగా చూస్తే 'పరా' అంటే అమ్మవారు, పార్వతీదేవి, ఉత్కృష్టమైనది , శ్రేష్టమైనది అని అర్థం. ఇక 'భవ' అంటే శివుడు, పుట్టుక, సృష్టి.*


కాబట్టి 'పరాభవ' అనే పదం పార్వతి , పరమేశ్వరుల కలయికని సూచిస్తోంది . అంటే 

అర్ధనారీశ్వర తత్వాన్ని కూడా గుర్తుచేస్తోంది.

మనం రోజూ పూజలో 'శ్రీ పరాభవ' నామ సం!! అని సంకల్పం చెప్పినప్పుడు ఆ అర్ధనారీశ్వరులను తలచుకోవడమే...అంతా మంచే కదా.


*శ్రీ పరాభవ నామ సంవత్సరం.* అనాలి.


*ముందు 'శ్రీ' తప్పక చేరుస్తారు. మంగళం, శుభం, ఐశ్వర్యం కలిగించే సంవత్సరం. అని చెప్పుకోవచ్చు. కదా !*


*ఈ సంవత్సరం అపశకునం అనుకోవద్దు. ఇది కేవలం కాల గణనలో భాగం మాత్రమే.*


*ప్రతి సంవత్సరానికీ మంచిచెడులు మన కర్మల మీద ఆధారపడి ఉంటాయి.*

సైన్ధవ లవణం యొక్క ఉపయోగాలు -

 సైన్ధవ లవణం యొక్క ఉపయోగాలు - 


 * ఈ సైన్ధవ లవణం కొంచం మధురంగా ఉండును. 


 * శుక్రాన్ని వృద్దిచేయును .


 * హృదయముకు బలమును ఇచ్చును. 


 * శరీరం నందు వాత,పిత్త,కఫ దోషములను పొగొట్టును.


 * శరీరం నందు కొంచం ఉష్ణం కలుగచేయును .


 * నేత్రములకు మంచి ఉపకారం చేయును . 


 * శరీరం నందు జీర్ణశక్తిని వృద్దిచేయును .


 * వాతాన్ని హరించును .


 * వ్రణాలను తగ్గించును . 


 * శరీరం నందు పైత్యం హరించును . 


 * దీనిని వాడటం వలన మలబద్దకం హరించును . 


 * గ్యాస్ పట్టినప్పుడు దీనిని గోరువెచ్చటి నీటిలో కలిపి త్రాగించి వాంతి చేయించిన ఉదరం శుభ్రపడును . 


 * ఒక చెంచా చనుబాలలో చిటికెలో పావు వంతు సైన్ధవ లవణం కలిపి కంటిలో 2 చుక్కలచొప్పున వేయుచుండిన కంటి సమస్యలు నివారణ అగును. 


  గమనిక - 


      దీనిని అమితముగా పుచ్చుకున్న పైత్యం చేయును . అతిసార వ్యాధిని కలుగచేయును . 


          ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


             కాళహస్తి వేంకటేశ్వరరావు  


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                     9885030034

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర ।

అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ।। 19 ।।



ప్రతిపదార్థ:



తస్మాత్ — కాబట్టి; అసక్తః — ఆసక్తి రహితుడవై (మమకారము లేకుండా); సతతం — ఎల్లప్పుడూ; కార్యం — కర్తవ్యమును; కర్మ — పని; సమాచర — నిర్వర్తించుము; అసక్తః — ఆసక్తి రహితుడవై (మమకారం లేకుండా); హి — నిజముగా; ఆచరన్ — ఆచరిస్తూ; కర్మ — పని చేయుము; పరం — ఆ పరమాత్మ; ఆప్నోతి — పొందును; పూరుషః — వ్యక్తి.

  

 తాత్పర్యము : 


  కాబట్టి, మమకారాసక్తులను విడిచిపెట్టి, ఆసక్తి రహితుడవై, నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము, ఏలనన కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు.



 వివరణ:


3.8వ శ్లోకం నుండి 3.16వ శ్లోకం వరకు, శ్రీ కృష్ణుడు, జనులు పూర్తి ఆధ్యాత్మిక జ్ఞాన స్థాయి చేరనంత వరకూ, వారి వారి విహిత (చేయవలసిన) కర్మలను చేస్తుండమనే చెప్పాడు. 3.17వ మరియు 3.18వ శ్లోకాలలో, జ్ఞానోదయమైన మహాత్ములు విధింపబడిన కర్మలను చేయనవసరం లేదు అన్నాడు. కాబట్టి అర్జునుడికి ఈ రెంటిలో ఏ మార్గం యోగ్యమయినది? శ్రీ కృష్ణుడి సిఫారసు, అతన్ని కర్మ యోగిలా ఉండమనే, కర్మ సన్యాసం తీసుకోవద్దనే. దీనికి గల కారణాన్ని 3.20వ శ్లోకం నుండి 3.26వ శ్లోకం వరకూ వివరిస్తాడు.

కృతజ్ఞత అనేది కేవలం "థాంక్స్" చెప్పడం కాదు

 💦 *మరిచిపోయిన కృతజ్ఞత – మసకబారుతున్న దాంపత్యం*


🍥*మనుషుల మూర్ఖత్వం గురించి మాట్లాడాల్సి వస్తే, లైబ్రరీలకి లైబ్రరీలు రాసినా సరిపోవు. కానీ, పెళ్లి అనే వ్యవస్థలో ఈ మూర్ఖత్వం ఒక ప్రత్యేకమైన రంగు పులుముకుంటుంది. మొదట్లో ఒకరి కోసం ఒకరు నక్షత్రాలను తెస్తామన్న వాళ్లే, కాలక్రమేణా ఒక గ్లాసు మంచినీళ్లు ఇస్తే థాంక్స్ చెప్పడం కూడా మర్చిపోతారు. దీన్నే మనం The Couple Who Forgot Gratitude అనుకోవచ్చు. అంటే, ఒకరి కష్టాన్ని మరొకరు 'హక్కు'గా భావించే జంటలు.*


------------


*భూమి మీద అత్యంత దారుణమైన శిక్ష ఏమిటో తెలుసా? ఉరి శిక్ష కాదు, జైలు శిక్ష కాదు. ఎదుటివాడి కోసం ప్రాణం పెట్టి పని చేస్తుంటే, వాడు దాన్ని 'గాలి' లాగా ఫీలవ్వడం. గాలి ఉంటేనే మనం బతుకుతాం, కానీ దాని గురించి ఎప్పుడైనా పట్టించుకుంటామా? పీలుస్తాం, వదులుతాం. అలాగే ఈ జంటల పరిస్థితి కూడా.*


*ఆమె తెల్లవారుజామునే లేచి ఇల్లు సర్ది, బాక్సులు పెట్టి, అలసిపోయి కూర్చుంటే... అతను వచ్చి "ఉప్పు తక్కువైంది" అంటాడు! అలాగే అతను ఆఫీసులో బాస్ దగ్గర తిట్లు తిని, ట్రాఫిక్‌లో నలిగి, ఇంటికి డబ్బులు తెచ్చి ఇస్తే... ఆమె "పక్కోడు కారు కొన్నాడు, మనం ఎప్పుడు కొంటాం?" అని అడుగుతుంది.*


*ఇక్కడ సమస్య ఏమిటంటే, ఎఫర్ట్ ఉంది, కానీ దానికి విలువ లేదు. ఒకరి కష్టం మరొకరికి 'నీ బాధ్యతే కదా' అన్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు మీ భాగస్వామి కష్టాన్ని మీ హక్కుగా భావిస్తారో, అప్పుడే ఆ బంధంలో చెదలు పట్టడం మొదలవుతుంది.*


*ఒకప్పుడు ఆమె కోసం తలుపు తీసినా, అతను అడిగింది వండి పెట్టినా "థాంక్యూ సో మచ్" అనేవాళ్లు. ఇప్పుడది 'ఎక్స్‌పెక్టెడ్' అంటే, ఆమె కాఫీ ఇస్తే అది ఆమె డ్యూటీ. అతను బయట సామాన్లు తెస్తే అది అతని డ్యూటీ.*


*మనుషులు కుక్కలకి బిస్కెట్ వేసి ప్రేమగా తల నిమురుతారు, కానీ తమ జీవిత భాగస్వామి చేసిన సహాయానికి మాత్రం కనీసం తల కూడా ఊపరు. Kindness అనేది సహజంగా రావాలి. కానీ కృతజ్ఞత లేని చోట, అది ఒక మెకానికల్ పనిలా మారిపోతుంది. ఒకరి పట్ల ఒకరికి సానుభూతి లేని ఇల్లు... కేవలం గోడలున్న గది మాత్రమే!*


*ప్రేమ అనేది ఐస్‌క్రీమ్ లాంటిది కాదు, అది నిప్పు లాంటిది. దానికి కృతజ్ఞత అనే ఇంధనం వేస్తూ ఉండాలి. లేకపోతే ఆ నిప్పు ఆరిపోయి, కేవలం బూడిద మిగులుతుంది. అదే ఆ 'వెచ్చదనం తగ్గిపోవడం'.*


*ఒకప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్న వాళ్ళు, ఇప్పుడు ఒకరికొకరు తారసపడితే "గ్యాస్ సిలిండర్ అయిపోయింది", "పిల్లల ఫీజు కట్టాలి" అన్న మాటలు తప్ప వేరే మాట్లాడరు. ఎందుకంటే వాళ్ల మధ్య కృతజ్ఞత లేదు. ఒకరి ఉనికిని ఒకరు ఆస్వాదించడం మర్చిపోయారు.*


*నిజం చెప్పనా?*

*కృతజ్ఞత లేని చోట వెచ్చదనం ఉండదు, Complaints మాత్రమే ఉంటాయి. ఆ ఇల్లు ఒక అకౌంటెంట్ ఆఫీసులా మారుతుంది. "నేను ఇది చేశాను, నువ్వు అది చేయలేదు" అనే లెక్కల మధ్య ప్రేమ ప్రాణాలు వదులుతుంది.*


*మీ భాగస్వామి మీ కోసం చేస్తున్న చిన్న చిన్న పనులను కూడా "అది వారి బాధ్యత" అని కొట్టిపారేయకండి. బాధ్యతలే అయితే రోబోలు కూడా చేస్తాయి. కానీ మనిషి చేస్తున్నాడంటే, దాని వెనుక ఒక ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను గుర్తించకపోవడం మనుషులకే చెల్లిన అతిపెద్ద నేరం.*


*కృతజ్ఞత అనేది కేవలం "థాంక్స్" చెప్పడం కాదు. అది మీ భాగస్వామి శ్రమను గుర్తించడం. వారి ఉనికిని గౌరవించడం. లేకపోతే, మీరు ఒకరికొకరు తెలియని వ్యక్తుల లాగా ఒకే ఇంట్లో కాలం గడిపేయాల్సి వస్తుంది. లైఫ్ అతి చిన్నది, ఒకరికొకరు ప్రేమని పంచుకుంటూ హాపీగా ఉంటే ప్రతీ క్షణం చాలా బాగుంటుంది.*


* 🐥

జీవితంలో

 శ్రీరామ (115)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏



( జీవితంలో చెప్పుకోదగ్గదేదీ సాధించకుండానే యౌవ్వనమంతా గడిచి పోయింది. వార్ధక్యం రానే వచ్చింది. ఇప్పుడేంచెయ్యాలి ? )


శ్లో//జీర్ణా ఏవ మనోరధాశ్చ హృదయే యాతంచ తద్యౌవ్వనం/

హంతాంగేషు గుణాశ్చ వంధ్యఫలతాం యాతా గుణజ్ఞైర్వినా/

కిం యుక్తం, సహసాభ్యుపైతి బలవాన్ కాలః కృతాంతో ౽ క్షమీ/

హా ! జ్ఞాతం ! మదనాన్తకాంఘ్రి యుగళం ముక్త్వాస్తి నాన్యా గతి://


( వార్ధక్యం వల్ల ఏ కోరికా తీర్చుకునే సామర్ధ్యం ఇప్పుడు నాకు లేదు.

అందువల్ల కోరికలన్నీ మనస్సులొనే జీర్ణించి పోతున్నవి.

ఆహా ! ఎంతో ఉజ్జ్వలమైన నా యౌవ్వనం చెప్పుకోదగినదేదీ సాధించకుండానే గతించిపోయింది గదా !

అంతేకాదు, సంగీత, సాహిత్యాది విషయాలలో నేను సంపాదించిన ప్రతిభ, 

గుణజ్ఞులు,రసజ్ఞులు లేనందు వల్ల అంతరించిపోతున్నది (కవిసార్వభౌమునికి చివరి దశలో సంభవించినట్లు)

కాలపురుషుడు సర్వము నశింపజేసే వాడు,

ఆయనకు ఏ ప్రాణిమీద ఎంతమాత్రము దయలేదు.

మహా బలవంతుడైన ఆ కాలుడు, వేగంగా మీది మీదికి వస్తున్నాడు.

ఈ దీనస్థితిలో ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో తెలియడం లేదు.

ఓహో! విచారణ చేయగా ఇప్పటికి తెలిసింది.

మన్మధుని అంతం చేసిన ' ఈశ్వరుని ' పాద పద్మములను ఆశ్రయించడం కన్న నాకు వేరే గతి ఏదీ లేదు).

(భర్తృహరి మహాయోగి)


శుభమస్తు.

తూములూరి మధుసూదన రావు.

18-3-'26.

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*మంగళవారం 17 మార్చి 2026*

``

    *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!


                     1️⃣6️⃣7️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*      

      

                    *167 వ రోజు*                    

*విరాట పర్వము ప్రథమాశ్వాసము*


*సహదేవుడు కొలువులో చేరుట*```


సహదేవుడు చేతిలో ముల్లుగర్రతో, తలమీద తాళ్ళ మూటతో గోపాలుడి వేషంలో విరాటుని వద్దకు వచ్చాడు. సహదేవుడు విరాటునితో.. “మహారాజా! నాపేరు తంత్రీ పాలుడు. నేను ఆల మందలను చక్కగా పెంచుతాను. నాకు పశువులలో ఉన్న రకాలు తెలుసు. పశువుల వ్యాధులకు చికిత్స చేయగలను. ఇంతకు ముందు ధర్మరాజు పాలనలో పశు పాలకుడిగా ఉండే వాడిని. నన్ను తమరి కొలువులో పశు పాలకునిగా నియోగించండి” అని కోరాడు. 


విరాటుడు అతని మాటలకు మెచ్చి అతనిని కొలువులో పశు పాలకుడిగా నియోగించాడు. 


ఈ విధంగా పాండవులు అయిదుగురు కొలువులో చేరారు.```


*ద్రౌపది అంత:పురంలో చేరుట*```


ద్రౌపది సైరంధ్రి వేషానికి తగినట్లుగా తలకు కొప్పు పెట్టుకుంది. మాసిన చీర కట్టుకుంది. దాసీభావాన్ని మనసులో నింపుకుంది. విరాటనగర రాజవీధిలో నడుస్తూ అంత:పురం చేరుకుంది. ఆ సమయంలో విరాట రాజపత్ని సుధేష్ణాదేవి విహారనిమిత్తం రాజప్రాసాదం పైకి ఎక్కి విహరిస్తూ రాజవీధి వెంట విహరిస్తున్న సైరంధ్రిని చూసింది. ఆమె అందానికి ఆశ్చర్యపోయింది. ఆమెను తీసుకు రమ్మని చెలికత్తెలను పంపింది. వారు వెళ్ళి సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని సుధేష్ణ సముఖానికి తీసుకు వచ్చారు. సుధేష్ణ ద్రౌపదితో “మానినీ నీవు ఎవరు? ఏమి కులం? నీ పేరేమి? ఏ పని మీద ఈ నగరానికి వచ్చావు?” అని అడిగింది. 


ద్రౌపది “అమ్మా! సైరంధ్రీ జాతి స్త్రీని. నా పేరు మాలిని. నాకు అయిదుగురు భర్తలు. నేను ఒక కారణంపై నా భర్తల ముందే అవమానింప బడ్డాను. భర్తలతో అడవులలో నివసించాను. బ్రహ్మచారిగా కాలం గడిపాను. నాకు ఇంకొక్క వ్రతం ఉంది. మీరు ధర్మ వర్తనులు అని విని వ్రతకాలం మీ రాణివాసంలో గడపాలని వచ్చాను. నేను ఇంతకు ముందు శ్రీకృష్ణుని భార్య సత్యభామ వద్దా, పాండవ పత్ని ద్రౌపది వద్దా పనిచేసాను. నాకు పూలమాలలు, చెండ్లు కట్టడం తెలుసు. రకరకాలుగా తిలకం దిద్దగలను. అందంగా కురులను అల్లగలను ముడువ గలను” అన్నది. 


ఆమెను అంతఃపురంలో చేర్చుకోవడానికి సుధేష్ణకు కొంత సందేహం ఉంది “సైరంధ్రీ! నీవు అందగత్తెవు. నిన్ను చూసి మహారాజు నీ మీద మనసు పడితే నేను ఏమి చేయాలి? ఆడవాళ్ళే నీపై చూపు మరల్చలేక పోతున్నారే ఇక మగవాళ్ళ విషయం చేప్పేదేముంది. నిన్ను అంతఃపురంలో ఉంచుకోవడం అంటే నా వినాశనం నేను కోరుకోవడమే” అన్నది సుధేష్ణ. 


ద్రౌపది “అమ్మా! తమరు అలా అనవలదు. నా భర్తలు బలవంతులు. నా విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ఎవరైనా నన్ను నీచభావంతో చూసినా చాలు వారిని సంహరిస్తారు. కనుక ఎవరూ నన్ను దుర్బుద్ధితో చూడరు. నాకు అలాంటి నీచ బుద్ధులు లేవు. నన్ను మీరు నమ్మి మీ సేవకురాలిగా స్వీకరించండి. కాని నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నేను ఇతరుల ఎంగిలి తినను. నీచపు పనులు చేయను” అని పలికింది. 


సైరంధ్రి మాటలకు సుధేష్ణ సంతోషించి ఆమెను తన పరిచారికగా స్వీకరించింది. అలా ద్రౌపది కూడా విరాటుని కొలువులో చేరింది. పాండవులు,ద్రౌపది విరాటుని కొలువులో సంతోషంగా కాలం గడుపుతున్నారు.```


        *విరాట పర్వము* 

 *ప్రథమాశ్వాసము సమాప్తం*


            *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

18మార్చి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌷 *బుధవారం*🌷 

   *🪷18మార్చి2026🪷*  

    *దృగ్గణిత పంచాంగం*  

                   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : చతుర్దశి* ‌ఉ 08.25 వరకు ఉపరి *అమావాస్య*

*వారం    : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : పూర్వాభాద్ర* రా.తె 05.21 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*

*యోగం : శుభ* రా.తె 04.01 వరకు ఉపరి *శుక్ల*

*కరణం  : శకుని* ఉ 08.25 *చతుష్పాద* రా 07.43 ఉపరి *నాగ*

*సాధారణ శుభ సమయాలు*

          *-ఈరోజు లేవు-*               

అమృత కాలం  : *రా 09.37 - 11.10*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    : మ 12.20 - 01.53*

*దుర్ముహూర్తం: ప 11.51-12.40*

*రాహు కాలం  :మ 12.16- 01.46*

గుళికకాళం      : *ఉ 10.45 - 12.16*

యమగండం    : *ఉ 07.44 - 09.14*

సూర్యరాశి : *మీనం*                  

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 06.22*

సూర్యాస్తమయం :*సా 06.27*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం         :*ఉ 06.13- 08.38*

సంగవ కాలం       :*08.38 - 11.03*

మధ్యాహ్న కాలం    :*11.03 - 01.28*

అపరాహ్న కాలం   :*మ 01.28- 03.53*

*ఆబ్ధికం తిధి  :ఫాల్గుణ అమావాస్య*

సాయంకాలం      :*సా03.53- 06.18*

ప్రదోష కాలం       :*సా 06.18 - 08.41*

రాత్రి కాలం        :*రా 08.41 - 11.51*

నిశీధి కాలం        :*రా 11.51 - 12.39*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.37 - 05.25*

☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆

        🌹*ప్రతినిత్యం*🌹

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్*


*రాజరాజేశ్వరీ రాజరాజార్చితా*

*పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*మంగళవారం 17 మార్చి 2026*


        *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *28వ భాగం*``


*నారద మహర్షి కథ*```


నారద మహర్షి తండ్రి బ్రహ్మదేవుని ఆహ్వానం మేరకు తన సహోదరులు, బ్రహ్మ మానస పుత్రులైన తొమ్మిది మంది ప్రజాపతులకు, కర్దమ మహర్షి, దేవహూతిల తొమ్మిది మంది కుమార్తెలకు జరిగిన వివాహ మహోత్సవం చూడటానికి

వచ్చాడు. 

శ్రీమహావిష్ణువు అంశ అయిన కపిల మహర్షిని దర్శంచుకున్నాడు.


కపిల మహర్షి బోధించిన అష్టాక్షరి నారాయణ మంత్రంతో శ్రీహరి దర్శనం కోసం తపస్సు చేయాలని నారదుడు మానస సరోవర తీరానికి వెళ్లాడు. చాలాకాలం నారాయణమంత్రం జపిస్తూ కఠోర తపస్సు చేశాడు. నారాయణుడు ప్రసన్నుడైనాడు. నారదుని పరీక్షించి అనుగ్రహించాలని మానస సరోవరంలో హంస రూపం దాల్చి తీరాన తపస్సులో ఉన్న నారదుని ముందుకు వచ్చి “నారదా! నారదా!” అని మధుర స్వరములో పిలిచాడు.


చెవులకు మృదుమధురంగా తన పేరు వినిపించడంతో కన్నులు తెరచి హంసను చూసి ఆశ్చర్యపడ్డాడు. మరింతవిస్మయానికి గురి చేస్తూ ఆ హంస మానవ భాషలో “నారదా! నీ కఠోర తపస్సు చూస్తుంటే ముచ్చట వేస్తోంది, ఆందోళన కలిగిస్తోంది. ఎవరి అనుగ్రహం కోసం అన్నపానాదులు, సమస్త సుఖాలు వదిలివేసి దేహాన్ని శుష్కింపచేసుకుంటూ తపస్సు చేస్తున్నావు?” అని అడిగింది.


నారదుడు “హంసరాజమా! మానవ భాషలో పలుకుతూ ఆశ్చర్యపరుస్తున్నావు. ఎవరు నీవు? నాకఠోర తపస్సుకి జాలిపడుతున్నావు. శ్రీమన్నారాయణుని అనుగ్రహం కోసం చేస్తున్న తపస్సు ఎందుకు ఆపుతున్నావు?" అని ప్రశ్నించాడు.


హంస “నారదా! అనాదికాలం నుండి ఈ మానస సరోవరంలో ఉంటున్నాను. ఈ మానస సరోవరం బ్రహ్మ మానసం నుండి ఉద్భవించింది. బ్రహ్మదేవుడు నారాయణుని నాభికమలం నుండి జన్మించాడు. నిత్యం బ్రాహ్మి ముహుర్త సమయంలో బ్రహ్మదేవుడు ఈ మానస సరోవరానికి వచ్చి స్నానం చేసి నారాయణ మంత్రం జపం చేస్తూ ధ్యానంలో నిమగ్నుడవుతాడు.


ధ్యానంలో ఆనాడు చేయబోయే సృష్టికార్యంగురించి ఆలోచిస్తాడు. సృష్టించబోయే జీవుల పూర్వ, పరాజన్మలను దివ్య జ్ఞాన దృష్టి తో వీక్షిస్తాడు. పిదప బ్రహ్మలోకం వెళ్లి జీవసృష్టి ప్రారంభిస్తాడు. నిత్యం బ్రహ్మదేవుడు చేసే ధ్యాన దీక్షను నేను ఆసక్తితో గమనించేవాడిని. ఆ క్రమంలో నాకు తెలియకుండానే అప్రయత్నంగా బ్రహ్మ దేవుని దివ్యజ్ఞానశక్తి నాకు కలిగింది. జీవుల భూత వర్త మాన భవిష్యత్తులు చూడ గలిగిన దివ్య దృష్టి వచ్చింది.


ఆ దివ్యదృష్టితోనే నీ విషయం తెలిసి నిన్ను పలకరించడానికి వచ్చాను" అని పలికింది.  


హంస మాటలు నమ్మలేక “హంసరాజమా! నిజంగా నీవుబ్రహ్మదేవునికి గల దివ్యజ్ఞానదృష్టి కలిగి ఉన్నావా? అయితే నాపూర్వ జన్మవృత్తాంతం చెప్పు" అని అడిగాడు. 


నారదునిలో తాను బ్రహ్మమానస పుత్రుడిని అనే అహంకారం ఉంది. తాను బ్రహ్మ నుంచి మాత్రమే జన్మించానని, తనకు పూర్వ జన్మలు లేవని నమ్మకం.


హంస నారదుని అహంకారపు మాటలకు నవ్వి నమ్మకాన్ని పటా పంచలు చేస్తూ "నారదానీపూర్వ జన్మ గురించి నాకు బాగా తెలుసు. చెబుతాను. వినుము. గడచిన మహాకల్పంలో నీవు ఒక గంధర్వుడుగా జన్మించావు. నీ తండ్రి మహావిష్ణువుకి పరమ భక్తుడు. నిరంతరం నారాయణ అష్టాక్షరి మంత్రోపాసన చేసే వాడు. ఆయన భక్తికి మెచ్చి వైష్ణవాంశతో పుత్రుడిగా జన్మించావు.


నీ నామధేయము ఉపబహర్హణుడు. శ్రీహరి అంశావతారమైన నీవు అపూర్వ సౌందర్యం,గాత్రం కలిగి ఉండేవాడివి. నీ గంధర్వ మధురగానం అందరినీ ఆకర్షించేది. స్త్రీలు నీ సౌందర్యం, గాత్రం,బుద్ది చాతుర్యం,మాటకారితనం చూసి అమితంగా ప్రేమించేవారు. నీ చుట్టూ చేరేవారు. నీవు నీతండ్రి హితోక్తులు పక్కనపెట్టి, వైష్ణవాంశ అని మరచి పోయి భ్రమరంలా స్త్రీల చుట్టూ తిరిగేవాడివి. క్రమంగా దేహసుఖాలకు అలవాటు పడిపోయావు. విశ్వశాంతి కోసం సప్తర్షులు దేవవ్రతం అనే యాగం ఆరంభించారు. యాగప్రదేశంలో శ్రీమన్నారాయణ కథ గానం చేయడానికి ఆహ్వానం పై నీవు, నీ తండ్రి ఇతర గంధర్వులతో కలసి అక్కడకు వెళ్లారు. శ్రీమన్నారాయణ నామగాన సంకీర్తనతో యాగశాల పరవశించ సాగింది. గానం చేస్తున్న నీ దృష్టి అక్కడఉన్న అందమైన యోగినుల పై పడింది. అందరం గానమాధుర్యంలో మైమరచి ఉన్నసమయంలో నీవు ఆ యోగినుల వద్దకువెళ్లి నీ హావభావచేష్టలతో కామాసక్తిని ప్రదర్శించావు.


త్రికాలజ్ఞులైన మహర్షులు గమనించి ఆగ్రహం చెందారు. నిన్ను చూసి “ఉపబర్హణా! శ్రీమన్నారాయణ నామ గానామృతంతో పవిత్రమైన యాగ ప్రదేశాన్ని పరస్త్రీ వ్యామోహంలో అపవిత్రం చేసావు. ఫలితంగా నీవు నీ సహజ తేజస్సు కోల్పోయి భూలోకంలో మానవు నిగా జన్మించుము" అనిశపించారు. 

ఫలితంగా నీవు గంధర్వ జన్మ వదలి భూమిపై ఒక వేద పండితుని గృహంలో సేవ చేసే స్త్రీకి పుత్రుడిగా జన్మించావు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏