22, నవంబర్ 2020, ఆదివారం

🙏 అన్నం పరబ్రహ్మ స్వరూపం. 🙏

 *🙏 అన్నం పరబ్రహ్మ స్వరూపం. 🙏*

*🔹 ఒక స్కూల్లో  చిన్న పిల్ల వాడు భోజన సమయంలో తన మిత్రులతో పాటు తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. ఆ అబ్బాయి తాను తెచ్చు కున్న అన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయ కుండా తినేవాడు. అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గ తినకుండా, క్రింద పైన వేసుకుంటూ తినే వారు. మరి కొందరైతే గొడవ పడుతూ కోపంతో ఆహారాన్ని విసిరి పారేస్తుంటారు.*

*🔹 ఈ అబ్బాయి మాత్రం ఒక్క మెతుకు కూడా పారేయ కుండా తినేవాడు. ఒకవేళ తాను తెచ్చుకున్న బాక్స్ కు ఎక్కడైనా రెండు మెతుకులు అతుక్కుని ఉన్నాకూడా వాటిని కూడా తినేవాడు. అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని ఎగతాళి చేసేవారు. " అరే! వీడొక తిండిపోతు రా! ఒక్కమెతుకు కూడా  వదలకుండా తింటాడు" అని ఎగతాళి చేసినా ఈ అబ్బాయి పట్టించు కునేవాడు కాదు.*

*🔹 ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజూ గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు తన  మిత్రున్ని ఇలా అడిగాడు." నువ్వు ప్రతిరోజూ ఇలా నీవు తెచ్చుకున్న ఆహారాన్ని వృధా చేయకుండా, ఇంత చక్కగా తింటున్నావు కదా! మిగతావాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నా, నీకు బాధ అనిపించదా? "  దానికి ఈ అబ్బాయి ఇలా సమాధానం ఇచ్చాడు.*

*🔹 " ఏదో వారికి తెలియకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకేం బాధలేదు. ఇక నేను అలా తినడానికి కారణం చెప్పనా? అలా తినడం అన్నది, నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం. అమ్మ ఉదయాన్నే లేచి నాకు ఇష్టమైన పదార్థాలను వండి ప్రేమతో బాక్స్ లో పెట్టి పంపిస్తుంది, వండటానికి కావలసిన వస్తువులను నాన్న ఎంతో కష్టపడి సాయంత్రానికి తెస్తాడు. ఇద్దరి ప్రేమతో పాటు వారి కష్టంకూడా నా భోజనంలో ఉంది. అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును వృధా చేసినా వారికి అగౌరవ పరచినట్లే!*

*🔹 అంతే కాదు. ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు. అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా. అందుకే నేను ఎవరు నవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను. అంతేకాదు ఎంతోమందికి రెండుపూటలా కడుపు నిండా అన్నం దొరకడం లేదు. నాకు దొరికింది. నా తల్లి దండ్రుల పుణ్యమా అని. అమ్మ ఎప్పుడూ చెపుతుంది - ఆహారాన్ని వృధా చేయకూడదని "అని చాలా చక్కగా చెప్పాడు.*

*🔹 ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటివి చెప్పి వారిలో ఆలోచనా శక్తిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. 🔹*

"మజ్జిగ" వాడకం

 ప్రాచీన భారతంలో 

"మజ్జిగ" వాడకం ( LAB. ల్యాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా)


ఒకనాడు ప్రతి ఊరిలో 

ప్రతి ఇంటిలో లెక్కకు మించి 

ఆవులు , గేదెలు, పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్నా ఇంటి నిండా, కుండల నిండా ఎంత పెరుగు ఉన్నా ఆనాటి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ పెరుగు వాడే వారు కాదు . 


ప్రతి రోజూ ఉదయాన్నే ఆ పెరుగును చిలికి పూర్తిగా వెన్న తీసి 

తగినన్ని మంచి నీరు కలిపి పలుచని తీయని మజ్జిగ తయారు చేసుకొని ఆహరంలో ఉపయోగించే వారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. 


*కాని కమ్మని గడ్డ పెరుగును వదిలి పెట్టి పలుచని నీరు వంటి మజ్జిగను తాగడం లో ఉన్న ఆంతర్యము ఏమిటో మనకు తెలియదు, ఈనాడు ఆ ఆంతర్యం గురించి తెలుసుకుందాం .


*ఆధునిక భావ బానిస భారతంలో - పెరుగు వాడకం.....


ఈనాడు దాదాపు నూటికి 90% మంది ప్రజలు తమ ఆహారంలో మజ్జిగను పూర్తిగా మానేశారు. 


రోజూ రెండు పూటలా పెరుగును మాత్రమే వాడుతున్నారు. 


పెరుగును చిలికి వెన్న తీసి మజ్జిగను తయారు చేయడానికి కొంత సమయం వెచ్చించాలి. 


కాబట్టి ఆ విధంగా సమయం వృధా చేయకుండా అన్నములో పెరుగును కలుపుకొని తినడమే గొప్ప నాగరికత అని ఈనాడు అంతా మురిసిపోతున్నారు. 


* పెరుగు ఆయుక్షీణం.....


ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు వాడకూడదు. అలా వాడితే ఉదరంలో వాయువు ఎక్కువ అయ్యి అనేక వాత రోగాలు వస్తాయని ఆయుర్వేద మహర్షులు మనకు నిక్కచ్చిగా తేల్చి ఏనాడో చెప్పారు.


అయినా 

రోజరోజుకు కష్టపడి పని చేసే స్వభావం కోల్పోతూ,

బద్ధకస్తులుగా మారుతున్న నేటి గృహిణులు మజ్జిగను తయారు చేసి వాడడం కన్నా పెరుగును వాడటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.


*మజ్జిగ  5 రకాలు.....


1.) మధితము అనే మజ్జిగ: 


పేరుకొన్న పాలల్లో నీరు కలపకుండా చిలికి తయారు చేసిన మజ్జిగను మధిత మజ్జిగ అంటారు . ఇది చిక్కగా జిడ్డుగా ఉంటుంది. ఈ మజ్జిగను ఆహారం లో వాడుతూ ఉంటే నీరసం , ఉదర రోగాలు పైత్యము వల్ల కలిగిన వాతము నాలుకకు రుచి తెలియక పోవడం, మూత్రము ఆగిపోవడం, నీళ్ళ విరోచనాలు మొదలైనవి హరించి పోయి శరీరానికి మంచి బలం కలుగుతుంది. ఈ రకమైన మజ్జిగ ను మన రెండు రాష్ట్రాల ప్రజలు గ్రీష్మ, శరత్, హేమంత, శిశిర బుుతువులలో సేవించి ఆరోగ్యం పొందవచ్చు.


2.) మిళితమను మజ్జిగ : 


పెరుగు ఒక వంతు నీళ్లు మూడు వంతులు పోసి చిలికి తయారు చేసిన మజ్జిగ మిళిత మజ్జిగ అనబడుతుంది. ఇది శరీరంలో పైత్యాన్ని అరుచిని అతిసార విరోచనాన్ని రక్తంలో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను పోగొడుతుంది. ఈ మజ్జిగ అన్ని కాలాలలో తీసుకోవచ్చు శ్రేష్ఠమైనది.


3.) గోళము అను మజ్జిగ : 


ఒక వంతు పెరుగు ఒకటిన్నర వంతు నీళ్లు కలిపి తయారు చేసినది. ఈ విధమైన మజ్జిగ వాడుతుంటే శరీరానికి మంచి కాంతి వస్తుంది. కంటికి మంచి మేలు చేస్తుంది. ఉదరములో మందాగ్ని విష దోషాలు మేహము ప్రమేహము కఫ రోగము ఆమ రోగము పోగొడుతుంది. ఈ రకమైన మజ్జిగ గ్రీష్మ, వర్ష బుుతువులయందు తీసుకోవాలి.


4.) షాడభము అను మజ్జిగ : 


ఒకవంతు పెరుగు అయిదు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసింది . ఇది శ్లేష్మ రోగాలను , గుల్మ రోగాలను, రక్త మూల వ్యాధిని పోగొడుతుంది. తేలికగా ఉండి ఉదరములో జఠరాగ్నిని పెంచి శరీరానికి కాంతి ఇస్తుంది.


5.) కాలశేయము అను మజ్జిగ : 


ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసింది. ఈ మజ్జిగ బంక విరోచనాలు, విషములను, ఉబ్బులను, మంటను, వాతమును, మూల వ్యాధిని పోగొట్టి శరీరం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది. ఇప్పటికే పడిన ముడతలను కూడా తీసి వేస్తుంది .


సభ్యులు అందరూ,


బద్ధకం ఉన్నవారు కాస్త బద్ధకాన్ని వదిలిపెట్టి,


పెరుగుని మజ్జిగా చేసుకొని, 


అన్నికాలలో ఆహారంగా తీసుకుంటూ,


ఆరోగ్యం తో ఆనందంగా జీవించండి.

సోషల్ రూల్స్:

 సహజంగా మనం పట్టించుకోని సోషల్ రూల్స్:


 1. ఒకరికి, రెండు సార్లకు మించి

     అదేపనిగా కాల్ చేయవద్దు. వారు

     సమాధానం ఇవ్వకపోతే, వారికి వేరే

     చాలా ముఖ్యమైన పని ఉందని

     అర్థం.


 2. అవతలి వ్యక్తి అడగక ముందే మీరు

     అరువు తీసుకున్న డబ్బును వారికి

     తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న

     మొత్తమైనాసరే! అది మీ

     వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది! 


 3. ఎవరైనా మీకోసం పార్టీ

     ఇస్తున్నప్పుడు మెనూ లో ఖరీదైన

     వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్

     చేయవద్దు.  వీలైతే మీ కోసం వారినే

     ఆహారాన్ని ఎంపిక చేయమని వారిని

     అడగండి.


 4.  "మీకు ఇంకా వివాహం కాలేదా?

      మీకు పిల్లలు లేరా? 

      ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?"

      వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను

      ఎదుటివారిని అడగవద్దు. అవి,

      వారి సమస్యలు. మీవి కావు!


 5. మీ వెనుక ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ

      మీరే  తలుపు తెరిచి లోపలికి

      ఆహ్వానించండి. అమ్మాయి,

      అబ్బాయి, చిన్నా, పెద్దా ఎవరైనా

      సరే. ఒకరిక పట్ల మంచిగా

      ప్రవర్తించడం ద్వారా మీరు చిన్నగా

      మారరు.


 6. మీరు ఎవరితోనైనా వేళాకోళంగా

     మాట్లాడుతున్నప్పుడు దాన్ని వారు

     సరదాగా తీసుకోకపోతే వెంటనే

     దాన్ని ఆపివేయండి! మరలా

     చేయవద్దు.


 7. బహిరంగంగా ప్రశంసించండి,

      ప్రైవేటుగా విమర్శించండి.


 8. ఒకరి బరువు గురించి మీరు

     ఎప్పుడూ  వ్యాఖ్యానించవద్దు.

     "మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు"

      అని చెప్పండి.  అప్పుడు బరువు

      తగ్గడం గురించి మాట్లాడా

      లనుకుంటే, వారే మాట్లాడుతారు. 


 9. ఎవరైనా వారి ఫోన్‌లో మీకు ఫోటో

     చూపించినప్పుడు, అదొక్కటే

     చూడండి. ఎడమ లేదా కుడి వైపుకు

      స్వైప్ చేయవద్దు. తర్వాత

      ఏముంటాయో మీకు తెలియదు

      కదా!


 10. మీరు ఒక సీ.ఈ.ఓ. తో ఎట్లా

       వ్యవహరిస్తారో అదే గౌరవంతో

       క్లీనర్‌తో కూడా వ్యవహరించండి.

       మీ క్రింది వారిని గౌరవంగా చూస్తే

       ప్రజలు ఖచ్చితంగా దాన్ని

       గమనిస్తారు.


 11. మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ

        సలహా ఇవ్వకండి.


 12.  సంబంధంలేని వారికి మీ

        ప్రణాళికల గురించి చెప్పవద్దు. 


 13. ఒక స్నేహితుడు / సహోద్యోగి

       మీకు ఆహారాన్ని ఆఫర్

       చేసినప్పుడు మర్యాదగా 'నో'

       చెప్పండి. కానీ, రుచి లేదా వాసన

       చూసిన తర్వాత 'నో' చెప్పవద్దు.

       అట్లా చేస్తే మీరు వారిని

       అవమానించినట్లే! 


 14. మరో ముఖ్య విషయం! ఇతరుల

        విషయంలో అనవసరంగా జోక్యం

        చేసుకోకుండా, మీ పనేదో మీరు

        చూసుకోండి!!

శ్రీ శివ మహా పురాణం

 **దశిక రాము**


**శ్రీ శివ మహా పురాణం**


7 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


సోమనాథుడు

ఇక్కడ ఒక చిత్రం జరిగింది. శంకరుడు చంద్రుడిని నెత్తిమీద పెట్టుకోవడం మంచిదే. అదే సోమనాథ లింగం. స+ఉమ+నాథుడు=సోమనాథుడు. అనగా పార్వతీదేవి పక్కన ఉన్న కారుణ్యమూర్తి. సశక్తిపరుడు. ఇది ఒక అర్థం. మరొక అర్థం ఉన్నది. సోముడు అనగా చంద్రుడు. సోముడు ప్రార్థన చేశాడు. ‘నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తరా ఎవరు వచ్చినా రక్షించడానికి ఇక్కడే వెలయవలసినది’ అన్నాడు. అపుడు శివుడు అక్కడ జ్యోతిర్లింగమై వెలశాడు. అందుకే అది స్వయంభూ జ్యోతిర్లింగములలో మొట్టమొదటి లింగము. మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా అక్కడికి వెళ్ళి సోమనాథ జ్యోతిర్లింగమును దర్శించుకుంటే దీర్ఘకాలంగా పీడిస్తున్న వ్యాధులు నయం అవుతాయని, భవిష్య జన్మలో చేసిన పాపముల వలన భయంకరమయిన కుష్ఠు మొదలయిన వ్యాధులు రావలసిన పాపములు ఖాతాలో ఉండిపోయినా అవి భగ్నం అయిపోతాయని సోమనాథలింగ దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది.

సోమనాథ దేవాలయం శ్రీ సర్దార్ వల్లభాయ్ సారధ్యంలో పునర్నిర్మాణం అయింది. ఈ లింగం మీద కన్నుపడే ఈ సోమనాథ దేవాలయమును పూర్వం ఎందఱో ఎన్నో మార్లు ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కుమనిషి అనిపించుకున్న భారతదేశపు తోలి ఉప ప్రధానిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి, సోమనాథ దేవాలయమును పునర్నిర్మాణం చేసి, అత్యద్భుతంగా రూపుదిద్దారు.

శ్రీశైల క్షేత్రం:

శ్రీశైలం సాక్షాత్తుగా మన ఆంద్రదేశంలోనే కర్నూలు జిల్లాలో వెలసిన స్వయం భూలింగ మూర్తి ఉన్న క్షేత్రము. విశేషించి అష్టాదశశక్తి పీఠములలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా అమ్మవారు ఒక శక్తిపీఠం. శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. ఆ పరమేశ్వరుడు వెలసిన కొండపేరు శ్రీగిరి. మనం ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయింది. దానిపేరు శ్రీగిరి. శ్రీశైలంలో స్వామి లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు. శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒకమాట చెప్పింది. ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని చెబుతారు. కానీ దాని తాత్త్వికమయిన రహస్యం వేరు. శ్రీ’లో ‘శ’కార, ‘ర’కార, ‘ఈ’కారములు ఉన్నాయి. ఈ మూడక్షరములు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి – ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలం. ఈ మూడు శక్తులు మమైకమయిన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలం ఒక శక్తి పీఠం. ఆ కొండమీద అడుగుపెట్టిన వాడు సరస్వతీ కటాక్షమును కానీ, లక్ష్మీ కటాక్షమును గానీ, జ్ఞానమును గానీ నోరువిప్పి అడగక్కరలేదు. అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తిమంతమయిన కొండ. శ్రీశైల పర్వతం ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు ఆలవాలము. అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయమును చెప్తారు.

గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలమునంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుహ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు. సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన ‘నాన్నగారూ, తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన ప్రదక్షిణతో సమానం. కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను’ అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈవిధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు. అపుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు.

సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు. వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు 24 క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు. అపుడు శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం క్రింద కూర్చున్నాడు. అపుడు పార్వతీదేవి కూడా వెళ్ళింది. పిల్లవాడు ఎలా ఉన్నాడో అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్లి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది. ఆయన మహా జ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటుంది. పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉంది సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లెచెట్టు క్రిందకి వచ్చాము కదా అని అక్కడ వెలశారు. మనం అలకచేతనో, అజ్ఞానం చేతనో మన శరీరములను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాము. ఇలాంటి వాళ్ళు ఎవరయినా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు. శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. మీరు మీ ప్రదేశం నుంచి శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది మీ శరీరం. ఆ బట్టలతో కొండమీదకి వెళతారు. మీరు శుభ్రపడి దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. మీరు ఆ క్షేత్రమునకు వెళ్ళగానే ఆశౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరకు వెళ్లి ధూళి దర్శనమునకు వచ్చాము అని చెప్పి లోపలి వెళ్లి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకుని, శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగి పోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడుట. దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చెయ్యాలి.

అసురసంధ్య వేళలో నందివాహనం భూమండలం మీదనుండి వెడుతుంది. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైలపర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమయిన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు. జన్మ చరితార్థం అయిపోతుంది. చెంచులు చెవిటి మల్లన్నా అని అరుస్తూ ఉండేవారు. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలం స్వామీ వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామమునలు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలి వెళ్లి మన గోత్రం, పేరు, చెప్పుకోవాలి. గణపతి మన గోత్ర నామమును చిట్టాలో రాసేసుకుంటారు.

శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం, విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో నని అనుకున్న వాళ్లకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి. అందుకే అనేక శివాలయములలో చరనంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద వున్నా త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి. అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా? అని. అపుడు శంకరుడు “శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగముల లోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి ‘మా అయన దిగబడిపోతున్నాడు. అందుకని ఎవరయినా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి’ అన్నది. అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అపుడు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. అపుడు ప్రతివాడూ తాను ఏదో పాపం చేసి ఉండక పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది. అపుడు పార్వతీ దేవి ఏమమ్మా, అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా. అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది. అపుడు ఆవిడ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే – అమ్మా నేను ఇప్పడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం లేదు, పుణ్యం లేదు. రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇపుడు నా ఖాతాలో పాపం లేదు. పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను. నేను అర్హురాలను’ అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను’ అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు. అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమె మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది.

🙏🙏🙏

కార్తీకపురాణం 8 వ అధ్యాయము**

 **దశిక రాము**


**కార్తీకపురాణం 8 వ అధ్యాయము**

🌺🌺🌺🌺🌺🌺🌺🌺


**శ్రీ హరి నామస్మరణా ధన్యోపాయం**


వశిష్టుడు చెప్పిన దంతా విని' మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్ని౦టిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు, పుణ్యం సులభ౦గా కలుగు ననియూ, అది- నదీస్నానము, దీపదానము, ఫలదానము అన్నదానము, వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా  వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులె చెప్పు చుందురు గదా! మరి తమరు యిది సూక్ష్మములో  మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము  కలుగుచున్నది. దుర్మార్గులు  కొందరు సదాచారములను పటింపక, వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు 

మహా పాపములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించు చున్నాను'యని కోరెను.


అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి .' జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంగ ములను కూడా పటి౦చితిని. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక, మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్త్వమను గుణము జని౦చి ఫలమంతయును పరమేశ్వరర్పితము కావించి, మనో వాక్కాయ కర్మలచె నొనర్చిన ధర్మము అ ధర్మమందు యె౦తటా ఆధిక్యత కలదు.  సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్ర మున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగ మెరిసి, ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి, సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమునా, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు దేవాలయముల యందు- వేదములు పటించి, సదచారుడై, కుటి౦బీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానము చేసిననూ, లేక ఆ నదీ తీరమందు న్న  దేవాలయం లో జపత పాదు లొనరించినను విశేష ఫలమును పొందగలరు.

రాజస ధర్మమ మనగా- ఫలాపేక్ష  కలిగి శాస్త్రోక్త  విధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ  హేతువై కష్ట సుఖాలు కలిగించున దగను.

తామస ధర్మమనగా - శాస్త్రోక్త  విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.

దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భ స్మమగునట్లు శ్రీ మన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.


*ఆజా మీళుని కథ*


పూర్వ కాలమందు కన్యా కుబ్జ మను నగరమున నాల్గు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్య వ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమ వతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అ పూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతి గారాబముగా పెంచుచు, అజా మీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దిన దిన ప్రవర్ధ మానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు, దుష్ట సావసములు చేయుచు, విద్య నభ్య సింపక, బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగా కొంత కాలమునకు యవ్వనము రాగా కమంధుడై, మంచి చెడ్డలు మరిచి, యజ్ఞో పవితము త్రెంచి, మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి, నిరంతరము నామెతోనే కామా క్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యి౦ టనే భుజించు చుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తామ బిడ్డలపై యెంత అనురాగామున్ననూ పైకి తెలియ పర్చక చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలతో నుంక పోయిన యెడల యీ విధంగానే జురుగును. కావున ఆజామీళుడు కుల భ్రష్టుడు కాగా, వాని బంధువుల తనని విడిచి పెట్టిరి. అందుకు ఆజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫ రములు కోయుచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టే క్కి తేనెపట్టు తియబోగా కొమ్మ విరిగి క్రింద పది చనిపోయెను. ఆజామీళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి, తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంధ కారాముచె కన్ను మిన్ను గానక ఆజా మీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడ కలిగిరి. ఇద్దరూ పురిటి లోనె చచ్చిరి. మరుల ఆమె గర్భము దరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి 'నారాయణ'అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన నూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకుని వెళ్ళు చూ, ' నారాయణా-నారాయణా' అని ప్రేమతో సాకు చుండిరి. కాని ' నారాయణ'యని స్మరించిన యెడల తన పాపములు నశించి, మోక్షము పొంద వచ్చునని మాత్ర మతానికి తెలియకుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజా మీళునకు శరీర పటుత్వము తగ్గి రోగ గ్రస్తుడై 

మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమ భటులు ప్రత్యక్ష మైరి. వారిని చూచి అజా మీళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక ' నారాయణా" నారాయణా' యనుచునే ప్రాణములు విడిచెను. అజా మీ ళుని నోట ' నారాయణా' యను శబ్దము వినబడగానే యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులు శంఖ చక్ర గదా ధరులూయగూ శ్రీ మన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి ' ఓ యమ భటులారా! వీడు మావాడు మేము వీనిని వైకు౦ టమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి'యని చెప్పి, అజా మీళుని విమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు ' అయ్యా! మీ రెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమి చ్చటికి వచ్చితిమి గాన, వానిని మాకు వదలుడని కొరగా విష్ణు దూతలు యిట్లు చెప్పదొ డ౦గిరి.


**ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి**


**ఎనిమిదో అధ్యయము- ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.**

🙏🙏🙏


**ధర్మము-సంస్కృతి**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


136 - ఉద్యోగపర్వం.


శ్రీకృష్ణుడు భగవంతుడు అని తెలిసికూడా ' కేవలం అతడు అర్జునునికి సఖుడైన కారణంగా అతనిని శరణువేడను, ' అని చెప్పిన దుర్యోధనునితో గాంధారి యీవిధంగా అంటున్నది. :


' ఓరీ బాలకా !  దుష్టబుద్దితో, ఐశ్వర్యమనే మోహంలోపడి, అదే జీవితంగా అనుకుంటూ, పెద్దలమాటను పెడచెవిని పెడుతున్నావు.   నీబాల్యం నుండీ నీవు నీ మిత్రులకు ఆనందాన్ని, మాకు దుఃఖాన్ని కలిగిస్తూనే వున్నావు.  నీ సోదరుడైన భీమసేనుని చేతిలో నీవు చావుదెబ్బలు తిని చనిపోయేటప్పుడు, నీ తండ్రి వచనాలు నీకు గుర్తుకువస్తాయి.  '  అని యెంతో  శోకతప్త హృదయంతో ఆ మాతృమూర్తి ఘోషించింది.


ఆసమయంలో యిదంతా చూస్తున్న వ్యాసభగవానుడు, ధృతరాష్ట్రునితో, ' నాయనా !  నీకు యీ జరుగుతున్న విషయాలు అనవసరం.  ముందుగా, నీవు శ్రీకృష్ణునికి ఆప్తుడవు.  అది దృష్టిలో పెట్టుకుని, సంజయుని సహాయంతో, ఉత్తమమార్గంలో నడువు.  సంజయుడు శ్రీకృష్ణుని వైశిష్యము గురించి బాగా తెలిసినవాడు.  అతని మాటలను ఏకాగ్రచిత్తంతో విను.    క్రోధము, సంతోషము అనే విషయాలతో చుట్టుముట్టిన ఆలోచనలతో వున్న జీవులు, తమకు వున్నదానితో, తృప్తిచెందక, ఐహికసుఖాలనే కోరుకుంటూ వుంటారు.  ఆవిధంగాచేసిన తప్పులని మళ్లీమళ్ళీచేస్తూ, భూమికీ, యమపురికి మధ్య తిరుగుతూనే వుంటారు.  (అనగా పునరపి జననం,పునరపి మరణం అని. )  మరికొందరు,  జ్ఞానమార్గంలో, పరమాత్మను అన్నింటా దర్శించి, మహాత్ముల మార్గంలో, ముముక్షత్వం పొందుతారు.  ఐహికసుఖాలకొరకై వెంపర్లాడరు.  మృత్యుపాశం వారినేమీ చేయజాలదు. '  అని చెప్పాడు.


వెంటనే ధృతరాష్ట్రుడు, ' సంజయా !  ఆ హృషీకేశుని చేరడానికి, భయంలేని మార్గం నాకు తెలియజేయి.' అని కోరాడు.   సంజయుడు ఆమార్గం గురించి సవిస్తరంగా తెలియజేస్తున్నాడు : '  రాజా ! ఆత్మతత్వము గ్రహించాలంటే,  మనసును నిగ్రహించే ఓర్పు వుండాలి.  ఇంద్రియనిగ్రహం లేనివాడు, జ్ఞానమార్గంలో సంచరించలేడు. తదుపరి అహింసామార్గం.  కోరికలు త్యజించి,  మనసులో కూడా యెవరికీ హాని తలబెట్టకుండా వుండడం.  కాబట్టి మహారాజా !  ఈక్షణం నుండే, ఇంద్రియాలను నిగ్రహించుకుని,యేకోరికలూ లేకుండా,  తత్వజ్ఞానం పొందే ప్రయత్నం చెయ్యి. నీకు శుభమగుగాక ! '   అని చెప్పాడు.     


భగవద్భావన,  ముముక్షత్వ  సాధనాలను గురించి తెలుసుకున్న ధృతరాష్ట్రుడు, ' సంజయా ! శ్రీకృష్ణుని దివ్యనామాలను గురించికూడా చెప్పు. వానిని మననం చేసుకుంటూ,  ఆపురుషోత్తముని సన్నిధికే చేరుకుంటాను. ' అన్నాడు.   ' రాజా !  నాకు తెలిసినంతలోచెబుతాను.   అని ఈ విధంగా చెప్పసాగాడు, సంజయుడు : 


1 . సర్వప్రాణులలో వసించేవాడు కాబట్టి ' వసు ' అనీ,  దేవతలకు మూలస్థానం కాబట్టి దేవుడనీ ప్రార్ధింపబడుతూ, ' వాసుదేవ ' నామంతో ప్రసిద్దుడయ్యాడు.  

2 . అంతటా వ్యాపించివున్నాడు కనుక ' విష్ణువు. '

3 .  మౌనము, ధ్యానము, యోగము, ద్వారా శ్రీకృష్ణ  అనుగ్రహం ప్రాప్తిస్తుంది గనుక 

' మాధవుడు ' అయ్యాడు.

4 . అన్ని తత్వాలను తనలో యిముడ్చుకున్నవాడు కాబట్టి ' మధుహుడు' ,

 ' మధుసూదనుడు ' అని పిలుస్తారు.

5 . కృషి అనగా స్థిరంగా ణ అనగా ఆనందంగా వుండేవాడు, వుంచేవాడూ కనుక ' కృష్ణుడు ' అయ్యాడు.

6 .  పుండరీకమనే నాశంలేని ఉతృష్టమైన స్థానంలో స్థిరంగా వుండేవాడు, కాబట్టి

' పుండరీకాక్షుడు '  అయినాడు.   

7. దుష్టులను దండించేవాడు కనుక ' జనార్ధనుడు ' గ  పిలవబడ్డాడు.

8 .  సత్యమును వీడని వాడు కనుక సాత్వతుడు.

9 . ఆర్శజ్ఞానం వలన శోభించేవాడు గనుక ' వృషభేక్షణుడు'.

10 . పుట్టుకలేని వాడు గనుక ' అజుడు ' అని పిలవబడ్డాడు. 

11 .  స్వప్రకాశకుడు గనుక అనేకజిత్తు.

12 . దమము తో  వుండేవాడు గనుక  దామోదరుడు.

13 . హర్షము, సుఖము, ఐశ్వర్యము వున్నవాడు గనుక ' హృషీకేశుడు '. 

14 . భూమ్యాకాశాలను ఒడిసిపట్టగల బాహువులు కలవాడు గనుక ' మహాబాహుడు '

15 .  క్రిందవైపు యెన్నడూ పడడు గనుక, ' అధోక్షజుడు ' . 

16 . నరులకు, జీవులకు ఆశ్రయమైనవాడు గనుక  ' నారాయణుడు '

17 .  అన్నింటిలో వుండి, పూర్ణభావం కలిగించేవాడు, సత్యాసత్యముల యొక్క స్థితికి మూలమైనవాడు,  గనుక ' పురుషోత్తముడు '.

18 .  అందరకూ జ్ఞానం ప్రసాదించేవాడు కావున, ' సర్వుడు '.


    సత్యే ప్రతిష్ఠత: కృష్ణ సత్యమాత్ర ప్రతిష్ఠితం 

    సత్యాత్ సత్యం తు గోవింద స్తస్మా త్సతయో>పి నామత :

19 .  శ్రీకృష్ణుడు సత్యము నందు వున్నాడు.  అతనితోనే సత్యము వున్నది. అతడు సత్యమనే దానికన్నా మించినవాడు. అందుచేత ' సత్య ' నామంతో కూడా పిలుస్తారు.


    విష్ణుర్విక్రమణా ద్దేవో జయనా జిష్ణు రుచ్యతే 

    శాశ్వతత్వా దనన్తశ్చ గోవిందో వేదనాద్గవాం.


20 .  అన్నింటిని ఆక్రమించినవాడు ' విష్ణువు.' 21 .  అన్నింటినీ జయించినవాడు ' జిష్ణువు '   22 .  శాశ్వతుడు కాబట్టి ' అనంతుడు '.  23 .  గోవులను కాపాడేవాడు గనుక  ' గోవిందుడు '.


' మహారాజా !  ఆవిధంగా శ్రీకృష్ణుడు ధర్మానికి ప్రతి రూపంగా శోభిస్తున్నాడు.  పై నామాలలో అంతా అయన స్వరూపమే.  త్వరలో శ్రీకృష్ణుడు మనలను అనుగ్రహించ డానికి యిక్కడకు వస్తున్నాడు ' అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. 


' సంజయా ! అట్టి ప్రకాశవంతమైన స్వరూపుడు శ్రీకృష్ణుని చూసే భాగ్యం కన్నులున్నవారికే కదా లభిస్తుంది.  నాకు కూడా ఆ భాగ్యం కలిగితే బాగుండు. '  అని మనసులోని మాట సంజయునితో అన్నాడు.   సంజయుడు చిరునవ్వు నవ్వి '  ఎవరి భాగ్యమెట్లున్నదో ! ' అని వూరుకున్నాడు.


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏


**ధర్మము-సంస్కృతి**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 పంచమస్కంధం యొక్క ప్రధామాశ్వాసం. -5


భరతుని జన్మంబు 


ఋషభ మహారాజు తన రాజ్యాన్ని కర్మభూమిగా భావించి, కర్మతంత్రాన్ని జనులందరికీ ఇష్టమయ్యే విధంగా తెలియజేయా లనుకున్నాడు. అందుచేత కర్మలు ఆచరించడానికి తానే స్వయంగా గురువుల వద్దకు చేరాడు. వారి ఆజ్ఞను శిరసావహించి దేవేంద్రుడు ఇచ్చిన జయంతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఆ జయంతి వల్ల భరతుడు మొదలైన వందమంది కొడుకులను కన్నాడు. పట్టణాలతో, ఆశ్రమాలతో, కొండలతో, చెట్టు చేమలతో నిండిన భూమండలం భరతుని పేరు మీదుగా భరతవర్షం అనే ప్రశస్తిని పొందింది. ఆ భరతవర్షంలోని ఆయా భాగాలకు భరతుడు తన తొంబది తొమ్మిది మంది సోదరులలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు అనే తొమ్మిది మందిని ప్రధానులుగా నియమించాడు. వారి కప్పగించిన భూభాగాలు వారి వారి పేర్లతో ప్రసిద్ధి పొందాయి. కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు అనే తొమ్మిది మంది భాగవత ధర్మాన్ని ప్రకాశింపజేశారు. దేవుని మహిమలను వ్యాప్తి చేసే వారి చరిత్రలను నీకు తరువాత చెపుతాను. తక్కిన ఎనభైయొక్క మంది కుమారులు తమ తండ్రి ఋషభుని మాటను జవదాటనివాళ్ళు. వారంతా మహావినయ సంపన్నులు. వేదధర్మాలను అనుష్ఠించేవాళ్ళు. యాగాలన్నా కర్మలన్నా శ్రద్ధ కలవాళ్ళు. అందుచేత వాళ్ళు బ్రాహ్మణోత్తములుగా పేరు గడించారు. ఋషభుడు సాంసారిక బంధాలలో చిక్కుకొనలేదు. స్వతంత్రుడై మెలిగాడు. తాను ఆనందానుభూతి కలిగిన ఈశ్వరుడైనా సామాన్యుడిగా ప్రవర్తించాడు. ఆయా కాలాలలో చేయదగిన ధర్మాలను ఆచరించేవాడు. ధర్మ ప్రవర్తకుల పట్ల సమబుద్ధి కలిగి ఉండేవాడు. శాంతస్వభావంతో జీవుల పట్ల దయ కలిగి మైత్రీభావంతో ఉండేవాడు. ధర్మం, అర్థం, కీర్తి, సంతతి, ఆనందం. అమృతత్వం చక్కగా సాగడం కోసం గృహస్థాశ్రమాన్ని పాటించవలసిందిగా ప్రజలను అనుశాసించేవాడు. ఈ విధంగా ఋషభుడు నీతిమార్గం తప్పకుండా ప్రజాపాలనం చేసాడు. వేదాలలోని ధర్మరహస్యాలను తనకు అవగతమైనా బ్రాహ్మణులు బోధించినట్లు, ఋత్విక్కులు ఉపదేశించినట్లు వస్తు సంభారాలతో దేశకాలానుగుణంగా శ్రద్ధాపూర్వకంగా తన వయస్సుకు తగినట్లు ఒక్కొక్క యాగాన్ని వంద పర్యాయాలు యథావిధిగా చేసి సుఖజీవనం గడిపాడు. అప్పుడు…రాజా! ఆ ఋషభుని రాజ్యంలో పారలౌకిక ఫలమే తప్ప ఇహలోకఫలం కోరేవాడు ఒక్కడు కూడా కనిపించడు. అతడు సూర్యుని వంటి తేజస్సు కలవాడు. అతని మహిమలను ఏమని వర్ణించాలి?


 ఋషభునిదపంబు 


ఆ ఋషభుడు రాజ్యపాలన చేస్తూ ఒకనాడు ఇహలోక ఫలాన్ని అపేక్షించక, మోహాన్ని వదలిపెట్టి, కొడుకులకు రాజ్యమంతా అప్పగించాడు. తరువాత కొడుకులు, మంత్రులు తనను అనుసరించగా బ్రహ్మావర్త దేశానికి బయలుదేరాడు. అక్కడ మహాత్ములైన మునిజనుల సమక్షంలో కుమారుల నందరినీ దగ్గరకు పిలిచి మహాపుణ్యాత్ముడైన ఋషభుడు సంతోషంతో ఇలా అన్నాడు.“కుమారులారా! ఈ భూమిమీద పుట్టిన మనుష్యులు కామానికి లొంగిపోతే కుక్కలకు కూడా రాని కష్టాలు వారికి ఎదురవుతాయి. అందువల్ల కోరికలకు మీరు దూరంగా ఉండాలి. ఏ తపస్సు వల్ల మానవులకు తరగని సుఖం లభిస్తుందో అలాంటి తపస్సును అవలంబిస్తే బ్రహ్మానందం తప్పక సిద్ధిస్తుంది. వృద్ధులను, దీనులను దయతో కాపాడండి. చెడు మార్గాలలో నడిచే కాముకుల సహవాసాన్ని పూర్తిగా వదలిపెట్టండి. మీకు శుభం కలుగుతుంది.ఇంకా స్త్రీ వ్యామోహంలో ఉండే కాముకులతో సంబంధం వల్ల సంసారం నరకమే అవుతుంది. మహాత్ముల సహవాసం మోక్షానికి దారి తీస్తుంది. అటువంటి మహాత్ములు ఎవరని అంటారా? శత్రు మిత్ర భేదభావం లేకుండా అందరిపై సమదృష్టి కలవారు, శాంతస్వభావులు, కోపం లేనివారు, సమస్త జీవుల పట్ల దయాస్వభావం కలవారు, సాధు స్వభావులు మహాత్ములని పిలువబడతారు. అలాంటి మహానుభావులకు నాయందే పరిపూర్ణ భక్తి ఉండడం వల్ల విషయ లంపటులైన దుర్మార్గుల పట్ల ప్రీతి, తమ దేహమన్నా, ఇల్లన్నా, మిత్రులన్నా, భార్యాపుత్రులన్నా వ్యామోహం ఏమాత్రం ఉండదు. ఇంద్రియ సుఖాలకు లోనైనవాడు పనికిరాని పనులు చేస్తూ ఉంటాడు. చెడ్డపనులు చేసేవాడు పాపం కొనితెచ్చుకుంటాడు. దుఃఖకారణమైన దేహాన్ని మోస్తూ ఉంటాడు. అందువల్ల మీరు పాపాలకు మూలాలైన కోరికలను కోరకండి. యథార్థ జ్ఞానం ప్రాప్తించనంత వరకు మీకు ఆత్మతత్త్వం బోధపడదు. ఆ తత్త్వం తెలియని కారణాన దేహికి దుఃఖం ఎక్కువవుతుంది. లింగదేహ మెంతకాలం ఉంటుందో అంతకాలం మనస్సు కర్మవశమై ఉంటుంది. జ్ఞానం లభించదు. అవిద్య వదలదు. శరీరం కర్మమూలం. అందుచేత కర్మలు చేయడం తగదు. వాసుదేవుడినైన నామీద ఆసక్తి కుదరనంత వరకు మిమ్మల్ని దేహధర్మాలు బాధిస్తాయి. ఎంత చదువుకున్న వాడైనా దేహేంద్రియ సుఖాలపట్ల ఆసక్తుడై సంభోగ సుఖ ప్రధానమైన గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. మూఢుడై సంసార క్లేశాలకు లోనౌతాడు. సంసారికి ఇల్లన్నా, పొలాలన్నా, కొడుకులన్నా, ఆప్తులన్నా, ధనమన్నా నేను నాది అనే వ్యామోహం పెరుగుతుంది. స్త్రీ పురుషుల కలయిక వల్ల సంతానం కలుగుతుంది. ఆ సంతానం కోసం ఇల్లు కట్టడమో, పొలాలు కొనడమో, ధనం సంపాదించడమో జరుగుతుంది. వాటిపట్ల మోహం పెంచుకొనడంతో వానికి మోక్షమార్గం దూరమౌతుంది. సంసారంలో మునిగి ఉన్నవానికి ఎపుడయితే మోక్షాసక్తి కలుగుతుందో అపుడే అతడు సంసారాన్ని వదలి పెడతాడు. మోక్షోపాయం చెప్తాను. పరమేశ్వరుడనైన నా మీద భక్తి ఉండడం, కోరికలు లేకపోవడం, సుఖ దుఃఖాలలో సహనం, సమస్త జీవుల కష్టాలపట్ల సానుభూతి కలిగి ఉండడం, భగవద్విషయమైన జ్ఞానంపట్ల ఆసక్తి, తపస్సు, నా కథలను, లీలలను ఆలకించడం, నన్నే దైవంగా భావించడం, నా గుణాలను కీర్తించడం, ఎవరితోను విరోధభావం లేకుండడం, సర్వత్ర సమబుద్ధి కలిగి ఉండడం, శాంతితో జీవించడం, ‘నా గేహం, నా దేహం’ అనే బుద్ధిని వదలిపట్టడం, ఆధ్యాత్మయోగం అవలంబించడం, ఏకాంత భక్తిభావం, ఇంద్రియాలను జయించడం, కర్తవ్య పరాయణత్వం, సత్కార్యాలందు శ్రద్ధ, బ్రహ్మచర్యం, జాగరూకత, వాక్కులను సంయమనంతో వాడడం, అన్నిటిలో నన్నే చూడడం… ఇవి ముక్తి మార్గాలు. జ్ఞానంతో విజ్ఞాన విజృంభితమైన యోగంతో, గుండె దిటవుతో, సాత్త్వికమైన ప్రవృత్తితో లింగదేహాన్ని జయించి మానవుడు క్షేమాన్ని పొందాలి.

అజ్ఞానం నుండి పుట్టిన హృదయ బంధనమనే తీగను యోగం అనే చురకత్తితో ధైర్యంగా తెంపివేయాలి. ఇటువంటి యోగాన్ని అనుష్ఠించే వ్యక్తి గురువైతే శిష్యులను, తండ్రి అయితే బిడ్డలను, రాజు అయితే ప్రజలను తాను నేర్చిన యోగమార్గంలో పెట్టాలి కాని కర్మఫలాలపై ఆసక్తులను చేయకూడదు. ప్రజలంతా ఏవో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మూర్ఖులై ఎల్లప్పుడూ మనసులో ఐహిక ఫలాలను కోరుతూ ఉంటారు. అల్పసుఖం కోసం ఒకరిపై మరొకకు వైరం పెంచుకుంటారు. అంతులేని దుఃఖంలో మునిగిపోతారు. అందుచేత గురువయినవాడు తానే ముందు నడిచి మాయా మోహాలకు లోబడిన మూర్ఖులైన జీవుల పట్ల సానుభూతి చూపాలి. కళ్ళున్నవాడు గ్రుడ్డివానికి దారి చూపిన విధంగా అజ్ఞానులకు బోధించి సహాయపడాలి. సాటి లేనిది, దివ్యమైనది అయిన మోక్షానికి మార్గం చూపాలి. ఇంకా తండ్రి, గురువు, తల్లి, బంధువు ఎవరైనా సరే అక్షయమైన మోక్షమార్గం చూపలేక పోతే వారెవరూ హితులు కారు. నా శరీరం ఎలా ఏర్పడించో మీరు ఏమాత్రం ఊహించలేరు. నా మనస్సు సత్త్వగుణంతోను, ధర్మంతోను కూడి పాపరహితమైనట్టిది. అందువల్లనే ఆర్యులు నన్ను ఋషభుడు అన్నారు. శుద్ధ సాత్త్వికమైన నా శరీరంనుండి కుమారులై పుట్టిన మీరందరూ తోడబుట్టినవాడు, మీకు పెద్దవాడు, మహాత్ముడు అయిన భరతుణ్ణి నాలాగే భావించి సద్బుద్ధితో సేవించండి. అదే మీరు నాకు చేసే శుశ్రూష. ప్రజలను పరిపాలించడమే మీకు పరమధర్మం” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. సమస్త జీవరాసులలో వృక్షాలు శ్రేష్ఠమైనవి. వృక్షాలకంటె సర్పాలు శ్రేష్ఠాలు. సర్పాలకంటె మేధావులు ఉత్తములు. వారికంటె రాజులు గొప్పవారు. రాజులకంటె సిద్ధులు, కింపురుషులు, గంధర్వులు శ్రేష్ఠులు. వారికంటె దేవతలు గొప్పవారు. దేవతలకంటె ఇంద్రాది దిక్పాలకులు గొప్పవారు. వారికంటె దక్షుడు మొదలైన మునులు గొప్పవారు. వారికంటె రుద్రుడు, రుద్రునికంటె బ్రహ్మ, బ్రహ్మకంటె విష్ణువు అధికులు. విష్ణువు బ్రాహ్మణులను ఆదరిస్తాడు. అందుచేత మానవులకు బ్రాహ్మణుడే దైవం. ఈ చరాచర ప్రపంచంలో బ్రాహ్మణులకు సాటి అయిన దైవాన్ని నేనెరుగను. బ్రాహ్మణులు భోజనం చేస్తుంటే నాకు కలిగే సంతోషం విధి విహితంగా అగ్నులలో వేల్చే హవిస్సు వల్ల కలుగదు. నా దేహం శుభప్రదమైన పరబ్రహ్మ స్వరూపం, వేదమయం. దీనికి ఆది లేదు. అలాంటి వేదమయమైన నా దేహాన్ని బ్రాహ్మణోత్తములు ధరిస్తారు. సత్త్వగుణం కలిగినవాడు, జితేంద్రియుడు, దయాళువు, సత్యసంధుడు, తపస్వి, సహనశీలి అయిన బ్రాహ్మణుడే మంచి గురువు. అందుచేత నేను పరమభక్తులు, మహానుభావులు అయిన బ్రాహ్మణుల దేహంతో కనిపిస్తూ ఉంటాను. పైన చెప్పిన గుణాలు కలిగిన బ్రాహ్మణులను నా రూపంగా భావించుకొని పూజ చేయడం నన్ను పూజ చేయడమే అవుతుంది” అని మళ్ళీ ఇలా అన్నాడు. ఈ రహస్యం తెలుసుకొని బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులను పూజించే మానవుడు మాయాతీతుడై భూలోకంలోనే మోక్షానికి మార్గాన్ని తెలుసుకుంటాడు.


భరతుని పట్టాభిషేకంబు 


ఈ విధంగా సదాచార సంపన్నులైన కుమారులకు లోకాన్ని పాలించడానికి అవసరమైన ఆచారాలను ఋషభుడు ఉపదేశించాడు. మహానుభావుడు, లోకబాంధవుడు అయిన భగవంతుడు ఋషభుని రూపంలో కర్మపరిత్యాగం చేసి శాంత స్వభావులైన మునులకు భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణాలతో పరమహంస ధర్మాలను ఉపదేశించాలని ఉద్దేశించాడు. ఆయన తన నూరుమంది కొడుకులలో పెద్దవాడు, పరమ భాగవతుడు, భాగవతుల పట్ల ఆసక్తి కలవాడు అయిన భరతునికి పట్టంగట్టి రాజ్యభారాన్ని అప్పగించాడు. అనంతరం శరీరమాత్ర సహాయుడై, దిగంబరుడై, చింపిరి జుట్టుతో పిచ్చివానిలాగా ప్రవర్తిస్తూ అగ్నుల్ని తనలో ఆరోపించుకొని బ్రహ్మావర్త దేశాన్ని వదలిపెట్టి వెళ్ళిపోయాడు. జడునిలాగా, చెవిటివానిలాగా, మూగవానిలాగా, పిశాచం ఆవహించిన పిచ్చివానిలాగా అవధూత వేషం ధరించాడు. ఎవరైనా పలకరించినా బదులు చెప్పకుండా మౌనవ్రతం చేపట్టాడు. నగరాలు, గ్రామాలు, పల్లెలు, తోటలు, శిబిరాలు, బిడారాలు, గొల్లపల్లెలు, గొడ్లపాకలు, కొండలు, తపోవనాలు, ఋష్యాశ్రమాలు దాటి పోసాగాడు. వెంటపడే దుండగులు కొడుతున్నా, తిడుతున్నా, రాళ్ళు విసురుతున్నా, దుమ్ము చల్లుతున్నా, తనపై మూత్ర విసర్జన చేసినా, ఉమ్మి వేసినా, కుళ్ళిన వస్తువులను తనపైకి విసరి వేసినా, బూతు కూతలు కూస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా జోరీగలను లెక్కపెట్టని ఏనుగులాగా ముందుకు నడచిపోతున్నాడు. ఏమాత్రం దేహాభిమానం లేకుండా నిశ్చలమైన చిత్తంతో ఏకాకిగా సంచరిస్తున్నాడు. అతని చేతులు, కాళ్ళు, ఉరోభాగం చాలా సుకుమారంగా ఉన్నాయి. భుజాలు, కంఠసీమ, ముఖం మొదలైన అవయవాలు విశాలంగా తీర్చినట్లున్నాయి. అతని రూపం సహజ సుందరంగా ఉంది. పద్మంవంటి ముఖంలో స్వతస్సిద్ధమైన చిరునవ్వులు చిందుతున్నాయి. కొంగ్రొత్త తామ రేకులలాగా చల్లని కనుపాపలు కనిపిస్తున్నాయి. విప్పారిన కళ్ళల్లో ఎఱ్ఱదనం ప్రకాశిస్తున్నది. చెక్కిళ్ళు గాని, చెవులు గాని, మెడభాగం కాని, ముకుపుటాలు గాని ఏమాత్రం లోపం లేకుండా దిద్ది తీర్చినట్లున్నాయి. అతని పెదవుల లోపలి చిరునవ్వు ఇతరులను భ్రమింపజేసేట్లు ఉంది. అటువంటి అతని దివ్య మంగళ విగ్రహం ముద్దుగుమ్మలను మోహంలో ముంచెత్తుతున్నది. ఋషభుని జుట్టు దుమ్ము కొట్టుకొని ధూసరవర్ణం ధరించింది. వెంట్రుకలు జడలు కట్టి గోరోచనం రంగుతో మెరిసి పోతున్నాయి. అటువంటి వేషంలో అతడు ఎవరూ గుర్తుపట్టకుండా తిరుగుతున్నాడు. ఆ ఋషభుడు పిశాచాక్రాంతుడైన వానిలాగా మురికిపట్టిన అవయవాలతో అవధూత వేషంలో సంచరింప సాగాడు. తన యోగవిధానం లోకవిరుద్ధంగా ఉంటుందని ఋషభుడు గ్రహించి ఒకచోట అజగరం లాగా భూమిపై అసహ్యంగా పొరలసాగాడు. ఈ విధంగా జుగుప్స కలిగించే తీరున నేలమీద పడి ఉండి, అన్నం తింటూ, నీళ్ళూ త్రాగుతూ, మల మూత్రాలలో పొరలుతుండేవాడు. అతని మల సుగంధంతో కూడిన వాయువు పది దిక్కులలోను పది ఆమడల దూరం పరిమళిస్తుండేది. భగవదంశ సంభూతుడైన ఋషభుడు వృషభం వలె, మృగం వలె, వాయసం వలె ప్రవర్తిస్తూ మహదానందాన్ని పొందేవాడు. సర్వాంతర్యామి అయిన వాసుదేవుణ్ణి తనలో ప్రత్యక్షంగా దర్శించుకుంటూ యోగసిద్ధుడైనాడు. అపుడు ఆకాశగమనం, మనోవేగం, పరకాయ ప్రవేశం, అంతర్ధానం, దూర దర్శనం, దూర శ్రవణం మొదలైన సిద్ధులు తమంత తాముగా ఋషణుణ్ణి ఆశ్రయించాయి. అయినా ఋషభుడు ఆ సిద్ధులను స్వీకరించలేదు” అని శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు. మునివర్యా! యోగాభ్యాసం వల్ల జ్ఞానం కలుగుతుంది. కర్మలు నశిస్తాయి. అలాంటి మహనీయులకు మహాసిద్ధులు ప్రాప్తిస్తాయి. అయినా తమంత తాము వచ్చిన ఐశ్వర్యాలను ఋషభుడు ఎందుకు స్వీకరించలేదు?” అని (పరీక్షిత్తు) ప్రశ్నించగా శుకుడు ఇలా అన్నాడు. రాజా! నీ వన్నది నిజమే. అడవిలోని మృగాలు వేటగానికి పట్టుబడతాయి. అయినా ఏదో విధంగా వాణ్ణి వంచించి తప్పించికొని బయటపడతాయి. ఇది లోక సహజం. అలాగే ఇంద్రియాలను లొంగదీసుకున్నా మనస్సు మళ్ళీ ఏదో విధంగా విజృంభించి కోరికలకు అవకాశ మిస్తుంది. చాలాకాలం శ్రమపడి సాధించుకున్న తపస్సునైనా మనస్సు హరిస్తుంది. అందుచేత పెద్దలు మనస్సును నమ్మరు. విటులను ఆకర్షించే జారిణిలాగా మనస్సు నిలకడ కోల్పోయి కామక్రోధాదులను ఆహ్వానిస్తుంది. రాజా! కామక్రోధాది అరిషడ్వర్గాలకు, కర్మబంధాలకు మనస్సే కారణం. అందుచేత ఆర్యులు మనస్సును ఎప్పుడూ విశ్వసించరు. రాజా! మనస్సు గతులు తెలిసినవాడు కావడం వల్లనే తమంత తాముగా వచ్చినా సిద్ధులను ఋషభుడు చేపట్టలేదు. లోకాలకు శుభం కోరే వారి అభివందనాలను ఆ మహాత్ముడు అందుకున్నాడు. వేషంలో గాని, మాటల్లో గాని ఋషభుడని గుర్తు పట్టడానికి వీలులేనట్టుగా భగవత్స్వరూపంతో ఋషభుడు వెలిగి పోతున్నాడు. పరమయోగాన్ని ధ్యానించేవారి కందరికీ దేహత్యాగం చేయదగ్గ సమయాన్ని ఋషభుడు సూచిస్తున్నాడు. మహాయోగులలో శ్రేష్ఠుడైనవాడు, మహాత్ములలో అగ్రేసరుడు, సాటిలేని దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు, దేవతలకు గురువైనవాడు, పరమ పురుషుడు అయిన ఋషభుడు శరీరం విడవడానికి నిశ్చయించాడు.

ఆ తరువాత పరమహంస, భగవంతుడు అయిన ఋషభుడు మనసులో దేహాభిమానాన్ని వదలుకొని, కుమ్మరిసారె కుమ్మరివానిచే త్రిప్పబడి విడువబడ్డ తర్వాత కూడా అది కొంతసేపు తిరుగుతున్నట్లే పూర్వ సంస్కార విశేషం వల్ల ఆయన దేహ సంచలనం పూర్తిగా ఆగిపోదు. ఋషభుడు లింగ శరీరాన్ని వదలిపెట్టినా యోగమాయా వాసనల కారణంగా లౌకికంగా దేహధారిగా చరించాడు. అతడు ఒకరోజు కోంకణ, వంగ, పట, కుటకాలు అనే దక్షిణ కర్ణాట దేశానికి అప్రయత్నంగా వెళ్ళి కుటక పర్వత సమీపంలోని ఉపవనం చేరుకున్నాడు. అక్కడ శిలాఖండాలను నోటిలో పెట్టుకొంటూ పిచ్చివానిలాగా చెదరిన జుట్టుతో దిగంబరుడై సంచరించాడు. అప్పుడు వీచిన సుడిగాలి విసురుకు వెదురుకఱ్ఱలు రాపిడి చెంది భయంకరమైన కార్చిచ్చు రేగింది. ఆ మంటలలో ఋషభుడు కాలిపోయాడు. ఋషభుని చేతలను ఆ ప్రాంతంవారు చెప్పుకోగా అర్హతుడు అనే పేరుగల ఆ రాష్ట్రాధికారి విని, స్వధర్మం వదలిపెట్టి స్వదేశస్థులతో ఆ ఆచారానికి ఆమోదం తెలిపాడు. అధర్మ బహుళమైన కలియుగంలో భవిష్యత్తుకు లోబడిపోయి తన రాష్ట్రంలోని మానవులను అయోగ్యమైన వేద బాహ్యమతం పట్ల మొగ్గేటట్లు చేసాడు. కలియుగంలో అధములైన మానవులు దేవమాయవల్ల మోహితులై శాస్త్రాలలో చెప్పబడ్డ శౌచాలను, ఆచారాలను వదలిపెట్టి తమకు ఇష్టం వచ్చినట్లు దేవతలను పరిహసిస్తారు. స్నానం, ఆచమనం చేయకపోవడం, జుట్టు కొరిగించుకొంటారు. అపవిత్ర వ్రతాలను చేస్తారు. అధర్మాలు పెచ్చు పెరిగిన కలియుగంలో బుద్ధి, ధర్మం చెడిపోగా వేదాలను, బ్రహ్మణులను, యజ్ఞపురుషులను నిందిస్తూ, తమతమ మతాలకు తామే సంతోషిస్తూ, వేదవిరుద్ధంగా ఇష్టానుసారం ప్రవర్తిస్తూ, అంద విశ్వాసాలకు లొంగి తమంత తామే గుడ్డి చీకటిలో పడుతూ ఉంటారు. రజోగుణంతో నిండిన మానవులకు మోక్షమార్గాన్ని ఉపదేశించడం కోసమే ఋషభుని అవతారం. సప్త సముద్రాలచేత చుట్టుముట్టబడిన ద్వీపాలలోని, వర్షాలలోని జనులు ఎవని దివ్యమైన అవతార లీలలను కీర్తిస్తారో, ఎవడు ఎంతో కీర్తి గడించిన ప్రియవ్ఱ్ఱతుని వంశంలో జన్మించాడో, ఎవడు లోకాలకు ఆది అయిన పురాణపురుషుడో అటువంటి ఋషభ దేవుడు భూలోకంలో అవతరించి కర్మ సంబంధం లేని మోక్ష ధర్మాన్ని ప్రబోధించాడు. యోగమాయవల్ల తమకు తామై లభించిన అసత్యాలైన సిద్ధులను తిరస్కరించాడు. అటువంటి ఋషభునికి సిద్ధులకోసం ప్రయత్నించే యోగీశ్వరులు ఏ విధంగా సాటి అవుతారు? అన్ని వేదాలకు, అన్ని లోకాలకు, సమస్త దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమ గురువు, భగవంతుడు అయినవాడు ఋషభుడు. ఆయన చరిత్రం వింటే దుశ్చరిత్రుల పాపం తొలగిపోతుంది. శుభాలు చేకూరుతాయి. ఎవరయితే ఋషభుని చరిత్రను మిక్కిలి శ్రద్ధతో వింటారో, ఎవరు ఇతరులకు వినిపిస్తారో వారికి సుదృఢమైన భక్తి లభిస్తుంది. అటువంటి హరిభక్తి పట్ల తత్పరత కలిగిన పెద్దలైన భాగవతులు హరి కృపవల్ల ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలను సాధించుకుంటారు. నానావిధ పాపకారణమైన సంసార తాపాన్ని పోగొట్టుకుంటారు. హరిభక్తి యోగమనే అమృతస్నానం చేసి పునీతులౌతారు. పరమ పురుషార్థమైన మోక్షాన్ని సిద్ధింపజేసుకుంటారు. ఈ విధంగా సప్తద్వీపాలలోని జనులు నేడుకూడా ఋషభుని మహిమను పొగడుతుంటారు. యాదవులకు, మీకు కులగురువైన శ్రీకృష్ణుడు అన్నిచోట్ల ఉన్నాడు. కొలిచేవారికి అతడు సులభుడై తప్పక మోక్షం ప్రసాదిస్తాడు. నీకెందుకు చింత? ఋషభుడు నిత్యానుభూత అయిన స్వస్వరూప లాభంవల్ల తృష్ణను నివారింపజేశాడు. యోగమాయా ప్రాప్తాలైన మహాసిద్ధుల చేత ఆయన బుద్ధి ఆకర్షింపబడలేదు. ఆ మహానుభావుడు లోకులందరినీ కనికరించి అభయ మిచ్చాడు. నిత్యమైనది, దివ్యమైనది, ఆనంద ప్రదమైనది, సేవింప దగినది, సాటిలేనిది అయిన వైకుంఠ లోకాన్ని అందింపగల మోక్షమార్గాన్ని అందరికీ ఉపదేశించాడు. ఆ తరువాత దేహాన్ని వదలి జనులంతా ఆశ్చర్యపడేటట్లు విష్ణువులో తాదాత్మ్యం పొందాడు. ఋషభుడు సామాన్యుడు కాడు. ఆయన సాక్షాత్తుగా విష్ణువు. రాజా! భరతుడు భూమండలాన్ని దీక్షతో పరిపాలించసాగాడు. రాజులలో చంద్రుని వంటివాడైన విశ్వరూపుడనే రాజుకు పంచజని అనే కుమార్తె ఉంది. గొప్పకాంతితో విలసిల్లే ఆ పంచజనిని భరతుడు కోరి శుభలగ్నంలో పెళ్ళి చేసుకున్నాడు. అహంకారానికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనబడే పంచతన్మాత్రలు పుట్టినట్లు భరతునికి పంచజని వలన సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువు అనే అయిదుగురు కొడుకులు పుట్టారు. అంతకుముందు అజనాభం అనే పేరుతో పిలువబడిన భూభాగం భరతుడు పాలించడం వల్ల భరతవర్షం అనే పేరును పొందింది. రాజా! భరతుడు తన పూర్వులు పాలించిన విధంగానే శ్రీహరి అనుగ్రహంతో బ్రాహ్మణోత్తములు పొగిడే విధంగా సత్కర్మలు ఆచరిస్తూ ప్రజలను పరిపాలించాడు. భరతుడు లోకాలను భరించే భగవంతుణ్ణి చిన్నవి, పెద్దవి అయిన యజ్ఞాలతో ఆరాధించాడు. అమావాస్య పూర్ణిమలలో చేసే సత్కర్మలను, చాతుర్మాస్యల కాలంలో చేసే అగ్నిహోత్రాదులను ఆచరించాడు. ఇంకా పశుయాగాలను, సోమయాగాలను నిర్వర్తించాడు. వేదోక్తంగా నిర్వహించిన ఆ సత్కర్మల ఫలాన్ని పరమేశ్వరార్పణం చేసాడు. యాగాలలోను, మంత్రాలలోను పలికే దేవతలను వాసుదేవుని అవయవాలుగా భావించాడు. ఆ మహారాజు భగవంతుని గొప్పతనాన్ని తలచుకుంటూ భక్తిమయమైన హృదయంతో శ్రద్ధతో సమస్త రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ విధంగా పరిశుద్ధమైన చిత్తంతో, ధర్మదీక్షతో, తాను చేస్తున్న కర్మలు ఫలించే విధంగా రాకుమారుడైన భరతుడు భూమిని పాలించాడు.

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

సౌందర్య లహరి

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


ఇరవైయవ శ్లోక భాష్యం - ఏడవ భాగం


జ్ఞాని విషయమూ అంతే. కోరికలు అతనిలోనికి  ప్రవహిస్తాయి. అతడు కోరికలన్నీ లయమయిపోయే స్థితిని చేరుకొంటాడు. ఒక వస్తువును నీదిగా చేసుకొనేకంటే ఆ వస్తువునే నిన్నుగా చూడగలిగితే ఇక ఆ వస్తువు పై నీకు కోరిక అనే అవకాశమే ఉండదు కదా! ద్వైత ప్రపంచంలో ఒక వస్తువుని విడిగా చూసి దానిపై వ్యామోహం పెంచుకోవడాన్ని ఆంతరంగికంగా మలుచుకొని ఆ వస్తువు తన కంటే భిన్నం కాదని తనలోనికి తెచ్చుకోవడం వశీకరణం. ఒక స్త్రీనే కాదు ఈ విధంగా త్రిభువనములను తనలోనికి తెచ్చుకోవడం,  ఈ బ్రహ్మాండమంతా తనకు భిన్నం కాదు, తనలోని భాగమే అని తెలుసుకోవడం వశీకరణలోని అంతరార్థం. తానే మన్మథుడైపోతే మన్మథుడు కలిగించే కామ వికారాదులు మనకు ఉండవు. అదే కామ జయము.


అంబిక రెండు విధాలైన విధులను నిర్వహిస్తుంది. పరమే శ్వరుని సృష్టి కార్యోన్ముఖుని చేస్తుంది. మానవులను తిరిగి ముక్తులను చేస్తుంది. శ్రీ విద్యా సంప్రదాయంలో అంబిక ప్రకాశవంతమైన అరుణ వర్ణమని చెప్పుకొన్నాము. పార్వతి ఆకుపచ్చ - గౌరి పసుపు వర్ణంగా చెప్పబడినప్పటికి తెలుపు. కాళి నలుపు, దుర్గ నీలము. మన కామేశ్వరి సూర్యోదయా మాత్మునితో ఐక్య మొనరించడాన్ని సూచిస్తోంది. తెలుపు సూర్యకాంతి చేత విడదీయ బడినపుడు ఏడు వరము  లేర్పడుతున్నాయి. ఈ వర్ణముల మొదటి అక్షరములన్నీ, చేర్చి VIBGYOR అని చెబుతారు. చివరివర్ణంగా చెప్పబడే ఎరుపు తెలుపు ప్రక్కనే ఉంటుంది. తెలుపు వర్ణంగా గుర్తించబడదు. కాబట్టి ఎఱుపే మొదటి వర్ణము. ఊదారంగుకు ప్రక్కనును నలుపుకూడా వర్ణంగా గుర్తించబడదు. ఎందువలన? మనం  అనేక రంగులున్న వస్తువులను చూస్తూ ఉంటాము. ఒకటి  ఆకుపచ్చ, వేరొకటి నీలము - ఆకుపచ్చగా కనిపించే వస్తువు  మిగతా కాంతితరంగాలనన్నిటినీ లీనం చేసుకొంటుంది.  కాంతి తరంగాలు అంతటా నిండి ఉంటాయి. వాటి విషయం లో మనం రెండు లక్షణాలను గమనించవచ్చు. ఒక విధమైన  కాంతి తరంగము (వస్తువులపై) పరావర్తించబడుతుంది.  మిగతా అన్ని కాంతి తరంగములు (ఆ వస్తువుచే) లయము చేసుకొనబడతాయి. ఏ వర్ణపు కాంతి తరంగము పరావర్తనం కాబడుతోందో ఆ వస్తువుది ఆ వర్ణమని చెబుతున్నాము. ఈ పరావర్తన లయములనే లక్షణములలో తెలుపు రంగుకు చెందిన వస్తువులకు పరావర్తించే లక్షణం మాత్రమే ఉన్నది.  అలా ప్రతిబింబించబడిన వర్ణ తరంగములన్నీ చేరి తెలుపుగా  భాసిస్తాయి. నలుపు వస్తువులకు అన్ని కాంతి తరంగములను  తమలో లయం చేసుకొనే లక్షణము మాత్రమే ఉన్నది.


మనం త్రిగుణములగురించి చెప్పుకొంటాము. సత్త్వ రజస్ తమోగుణములు. తనలో తనకై ఏమీ ఉంచుకోక మొత్తం  బయటకు విడుదలచేసి స్వచ్ఛంగా, కాంతిమంతంగా తెల్లగా  ఉండేది సత్త్వం. ఇది పరబ్రహ్మ లేక జ్ఞానమునకు సంజ్ఞ. అంతటినీ తనలోనే ఉంచుకొనే నలుపు తమోగుణము లేక  అజ్ఞానమునకు సంజ్ఞ, ఎఱుపు రజోగుణమునకు సంజ్ఞ. క్రియాశక్తి-బ్రహ్మను జీవాత్మగానూ, జీవాత్మను తిరిగి బ్రహ్మ గానూ మార్చే క్రియ వెనుకనున్నది ఈ క్రియాశక్తే, చలన రహితము, శుద్ధసత్వము, తెల్లటి తెలుపుగానున్న జ్ఞాన తత్త్వమైన శివుడు ప్రకాశవంతమైన ఎఱుపువర్ణం గల కా శ్వరిగా ఆవిష్కరించబడడానికి పరాశక్తికి మూలమైనవాడు. దీనిని అనుగమించి తమస్సు వరకూ సమస్త సృష్టి జరిగింది VIBGYORలో ఉన్న సప్త వర్ణములు సృష్టిలోని వివిధ దశలకు వైవిధ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అన్ని రంగులు కలిసి తెలుపుగా అయినట్లు ఈ ప్రపంచం శుద్ధ ధవళ వర్ణం అయిన శుద్ద బ్రహ్మ నుంచి ఉద్భవించి తిరిగి తెల్లటి తెలుపుగా బ్రహ్మగా అయిపోయింది. ఈ సృష్టి లయములకు కారణం శుద్ధ బ్రహ్మమునుండి మొదటగా ఆవిర్భవించి, ఆ శుద్ధ బ్రహ్మకు చేరువగా ఉన్న సంస్థితి - అరుణారుణమైన కామేశ్వరి. అందు వలననే అరుణ మార్గానికి శ్రీవిద్యలో అంతటి ప్రాధాన్య మీయబడినది. పరిణామము పొంది తమస్సులో చేరుకొన్న మనం తిరోధానము చెంది తెల్లటి తెలుపు అయిన పరబ్రహ్మలో లయమవాలంటే దారిచూపవలసింది ఈ ఎఱ్ఱటి స్త్రీనే. 


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

ఆధ్యాత్మిక జీవనము*

 *ఆధ్యాత్మిక జీవనము*


యోగాలన్నింటికీ తప్పనిసరిగా కావలసింది *తపస్సు* (అంటే మనస్సును చక్కగా నియంత్రించి, స్వాధీనంలో ఉంచుకొని, ఆపై తీవ్రమైన వ్యాకులతతో చేసే సాధన). తపస్సు గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ విధంగా వివరించాడు.


శారీరకమైన తపస్సు అంటే పరిశుభ్రత, ఋజువర్తనం, బ్రహ్మచర్యం, అహింస, అణకువ మొదలైన ధర్మాలను పాటించడం, సత్యవంతమూ, హితకరమూ, అనుద్వేగకరమూ (అనగా బాధపెట్టని) అయిన మాటలను చెప్పడం, శాస్త్రపఠనం, వీటిని వాక్ తపస్సు లేదా వాజ్ఞ్మయ తపస్సు అంటారు.


ఈ తపస్సు చేయాలంటే మన అలవాట్లను గమనించాలి. పనికిమాలిన, ఇతరులను బాధపెట్టే మాటలను పూర్తిగా వదలిపెట్టాలి. ప్రశాంతత, సాధుత్వం, మౌనం, సంయమనం, హృదయంలో పవిత్రత వీటిని కలిగి ఉండడాన్ని మానసికమైన తపస్సు అంటారు. వీటిని సంపూర్ణమైన విశ్వాసంతోనూ, తీవ్రతతోనూ ఆచరించాలి. అంతేకాక, విశాలదృక్పథాన్ని కలిగి ఉండాలి. 


ఆధ్యాత్మిక జీవనంలో శ్రీకృష్ణుడు చూపిన మార్గాన్ననుసరించి కర్మఫలాలను త్యాగం చేయడం, ఆత్మవిచారణ, భగవంతుని పట్ల ఉన్న మధురభక్తి ఈ మూడూ అవసరమే. మనలోని జీవాత్మ, పరమాత్మను సాక్షాత్కారం చేసుకునేందుకు ఇవన్నీ సోపానాలుగా ఉపయోగపడతాయి. ఆధ్యాత్మికవేత్తలందరూ ఈ విషయాన్నే నొక్కి వక్కాణించారు.


*శుభంభూయాత్*

వ్యవసాయేతర’ రిజిస్ట్రేషన్లు వాయిదా

 వ్యవసాయేతర’ రిజిస్ట్రేషన్లు వాయిదా

23న రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావు


కోర్టు నుంచి స్పష్టత వచ్చే దాకా అంతే?


మరో మూడునాలుగు రోజుల సమయం పట్టే చాన్స్‌


కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన సర్కారు


‘ధరణి’ని సమగ్రంగా రూపొందించామని వెల్లడి


మూడు చట్టాల్లో సవరణలతో ధరణికి చట్టబద్ధత


పకడ్బందీగా పోర్టల్‌కు రూపకల్పన


వివరాలను దాచి పెట్టుకునేలా ‘ప్రైవసీ’ ఆప్షన్‌


ప్రజల ఆస్తులకు పూర్తిస్థాయిలో భద్రత


నిజమైన హక్కుదారులను రికార్డుల్లోకి ఎక్కించాలనేదే ప్రభుత్వ 


ఉద్దేశం. ఎవరి కులం వివరాలను సేకరించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వంటి సామాజిక వర్గాన్ని మాత్రమే 


అడిగాం. ఆధార్‌ నంబర్లను కూడా స్వచ్ఛందం చేశాం.


రాష్ట్ర సర్కారు అఫిడవిట్‌


: ధరణి పోర్టల్‌ ద్వారా ఈ నెల 23 నుంచి ప్రభుత్వం ప్రారంభించాలనుకున్న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు వాయిదా పడ్డాయి. రిజిస్ట్రేషన్లకు మరో మూడు నాలుగు రోజుల సమయం పట్టే అవకాశాలున్నాయి. ‘ధరణి’ పోర్టల్‌పై హైకోర్టులో కేసు కొనసాగుతుండడంతో రిజిస్ట్రేషన్లను ఇప్పుడే ప్రారంభించకూడదని సర్కారు నిర్ణయించింది. హైకోర్టు నుంచి స్పష్టత వచ్చాకే ఈ ప్రక్రియ ముం దుకు సాగనుంది. సెప్టెంబరు 8 నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేపట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే... ధరణి పోర్టల్‌ అక్టోబరు 29 నుంచి అందుబాటులోకి రావడంతో నవంబరు 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఈ నెల 23 నుంచి ప్రారంభిస్తామని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వీటిని ప్రారంభిస్తారని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.


అయితే రిజిస్ట్రేషన్ల విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపై హైకోర్టులో ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఈ అంశాన్ని ఈ నెల 23న హైకోర్టు మరోసారి విచారించనుంది. దీంతో.. హైకోర్టు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తే తప్ప రిజిస్ట్రేషన్లను ప్రారంభించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కోర్టుకు సమగ్ర వివరాలతో అఫిడవిట్‌ సమర్పించారు. ప్రజలకు వ్యవసాయేతర ఆస్తులపై హక్కులు కల్పించి, పాస్‌బుక్‌లను జారీ చేయడానికే ధరణి వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించామని స్పష్టం చేశారు. ఈ పోర్టల్‌ను చాలా పకడ్బందీగా రూపొందించామని, ప్రజా ఆస్తులకు పూర్తి భద్రత కల్పించనున్నామని తెలిపారు. మూడు చట్టాలను (పంచాయతీరాజ్‌, మునిసిపల్‌, జీహెచ్‌ఎంసీ) సవరించి, కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. నిజమైన హక్కుదారులను రికార్డుల్లోకి ఎక్కించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని.. ఎవరి కులం వివరాలను సేకరించలేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వంటి సామాజిక వర్గాన్ని మాత్రమే అడిగామని వివరించారు. ఆధార్‌ కార్డులను కూడా స్వచ్ఛందం చేశామని చెప్పారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఒకే లావాదేవీ కింద జరిగేలా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దామన్నారు. ఆధార్‌, ఫోన్‌ నంబరు వంటి వివరాలు ఉంటే.. ఒకరికి బదులు మరొకరు ఆస్తుల క్రయవిక్రయాలు చేయలేరని వివరించారు.

గోత్రం అనగా

 గోత్రం గురించి అంద‌రు తెలుసుకోవాల్సిన నిజాలు

గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యడి తాలూకు విత్తనానికి (లేక వీర్యకణానికి) జన్మనిచ్చేది

మాత్రం పురుషుడే కాబట్టి గోత్రము మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది. గోత్రము అనగా గో అంటే గోవు, గురువు, భూమి, వేదము అని అర్థములు. ఆటవిక

జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా,ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు,కపిలగోవువారు,తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు. ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు. తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు. ఆ తరువాత భూములను కలిగిన బోయ/క్షత్రియులు భూపని, భూపతి, మండల అనే గోత్రాలను ఏర్పరుచుకున్నారు. ముఖ్యముగా బ్రాహ్మణులు వేదవిద్యను అభ్యసించి తాము

నేర్చుకున్న వేదమునే యజుర్వేద, ఋగ్వేద అని గోత్రాలను వేదముల పేర్లతో

ఏర్పరుచుకొన్నారు. గోత్రాలు ఆటవిక కాలము/ఆర్యుల కాలంలోనే ఏర్పడ్డాయి.

ముందుగా గోత్రములను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే కలిగి

ఉన్నారు. ఒకే మూల(తండ్రికి)పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య వివాహ

సంబంధములు ఉండ రాదని, వేరు గోత్రికుల మధ్య వివాహములు జరపటము మంచిదని గోత్రములు అందునకు ఉపకరిస్తాయని, ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాలవారు గోత్రములను ఏర్పరచుకొన్నారు. తండ్రి (మూల పురుషుడు) చేసిన పని, వాడిన పనిముట్లు కూడా గోత్రముల పేర్లుగా నిర్ణయించ బడినాయి. క్రైస్తవుల మతగ్రంథం బైబిల్లో కూడా గోత్ర ప్రస్తావన ఉంది. కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే, మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద, ఉపయోగించిన ఆయుధము, వాహనము పేర్ల మీద ఏర్పడ్డాయి. ఉదాహరణకు క్షత్రియ బుషి అయిన విశ్వామిత్రుడు వంశంలో పుట్టిన

ధనుంజయుడి పేరు మీద గోత్రం ఉంది, ఖడ్గ, శౌర్య, అశ్వ, ఎనుముల, నల్లబోతుల పేర్ల మీదా గోత్రములు ఉన్నాయి.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

సంధ్య

  "సంధ్య" అంటే సంధికాలం అని అర్థం. రాత్రికి సూర్యోదయానికి మధ్య ఉన్న సంధికాలాన్ని "ప్రాత సంధ్య" అంటారు. ఉదయానికి మధ్యాహ్నిక కాలానికి గల సంధికాలాన్ని "మధ్యాహ్నిక సంధ్య" అంటారు. అలాగే సాయంకాలానికి, రాత్రికి మధ్య గల సంధికాలాన్ని "సాయం సంధ్య" అంటారు. ఈ మూడు సంధికాలాలను కలిపి "త్రికాల సంధ్యలు" అంటారు పెద్దలు, పండితులు. మనము ప్రతీ రోజూ ఈ మూడు సంధికాలాలను చూస్తూ ఉంటాము. ప్రక్రుతిలో మార్పులు గూడా ఈ సంధికాలాల్లోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటికి విశిష్టత ఏర్పడింది. ఈ మార్పులు శుభములు కావచ్చును కాకపోవచ్చును. సాధారణంగా అందరూ శుభములే కోరుకుంటారు. కాలగతి మాత్రం పంచభూతములు, అష్టదిక్పాలకులు, నవగ్రహలు వారి వారి అధి దేవతలు మొదలగు వారి అధీనంలో ఉంటాయి. ఈ ప్రక్రుతి శక్తులు అన్నీ బాహ్యేంద్రియాలకు గోచారం గానీ ఒక పరబ్రహ్మ తత్వం అధీనంలో ఉంటాయి. వీరందరూ శుభులయినప్పుడు మనకు తప్పకుండా శుభమే జరుగుతుంది. మనకూ, మన వారందరికీ శుభం జరగాలని ప్రార్ధించడాన్నే "సంధ్యావందనం" అంటారు.

          ఈ సంధ్యావందనం స్త్రీలు, పురుషులు అందరూ చేయవచ్చును. కాబట్టి ఈ సంధ్యావందనం నిత్యమూ చేసేవారిని బ్రాహ్మణులు అనవచ్చును. "బ్రాహ్మణులు" అంటే కేవలం ఒక కులం కాదు. అది గుణ ప్రధానమైన జాతి. అటువంటి బ్రాహ్మణులు ను సమాజం గౌరవిస్తుంది. సమస్త వేదాలను మనకు అందించిన వేదవ్యాసమహర్షి, బ్రాహ్మణ కులంలో జవ్మించాడా? ద్రోణాచార్యుడు, కుంభసంభవుడు అతనిది ఏ కులము అని చెప్పగలము? అందువలన కేవలం జన్మతః ఎవరూ అసలయిన బ్రాహ్మణులు కావడం లేదు. బ్రహ్మ జ్ఞాన సంపాదనకై తహతహలాడే ప్రతీ మానవుడూ బ్రాహ్మణుడే. కుల, మత, లింగ బేధములను ఆపాదించడం మంచిది కాదని వేదం చెబుతుంది. "ఉపనయనం" అనే ఒక ప్రక్రియ ఉన్నది. బ్రహ్మ జ్ఞానాని సంపాదించుకోవడానికి మన భౌతిక (బాహ్య) నేత్రాలు సరిపోవు. జ్ఞాన (అంతరంగ) నేత్రాలు కావాలి. అట్టి జ్ఞాన నేత్రాలు ప్రసాదించేదే ఉపనయన ప్రక్రియ. జన్మ కారకుడు, వీర్యప్రదాత అయిన తండ్రి తో గాయత్రీ మంత్రమును ఉపదేశం ఇప్పిస్తారు పండితులు. ఈ విధంగా జ్ఞాన నేత్రాలు పొందిన వారిని "ద్విజుడు" అంటారు. అంటే రెండు జన్మలు ఎత్తిన వాడని అర్థం. ప్రతీ మానవుడు జన్యుపరంగా ఒకేసారి జన్మిస్తాడు. జ్ఞాన సముపార్జన కొరకు రెండో జన్మ ఎత్తి ద్విజుడు అవుతాడు. ఓం శ్రీ మాత్రే నమహ.. సేకరణ        🍀🍁🍀🍁🍀🍁🍀🍁

చాణక్య నీతి

 చాణక్య నీతి 


               ఒకటవ అధ్యాయము 


శ్రీకరుండైనట్టి శ్రీమహావిష్ణు

త్రైలోక్యనాథుడై తరియింప జేయ :

ఆట్టి లోకేశుని నతిభక్తి తోడ 

తలవంచి ప్రణమిల్లి తశ్శక్తి తోడ 

బహుశాస్త్ర ధృతమై భాసిల్లు నట్టి

రమణీయ మైనట్టి రాజనీతులను 

విబుధుల కొఱకునై వివరించ నుంటి               


మూర్ఖశిష్యులకును ముదము జెప్పుటయు 

ఆశ్లీలవనితను నాదరించుటయు 

ఆదృష్టలేమిచే నలమటించేటి 

మనుజులచెంతను మసలుటయున్ను 

పండితు , బాధలో పడవేయు నెపుడు.           


దుష్ట తత్వంబుతో దూషించు భార్య 

కుట్ర తత్వంబుతో కూడు మిత్రుండు 

అవిధేయ తత్వంబు నలరు భృత్యుండు 

కన్నుల ముందుగా కదలు సర్పంబు ,

యుండెడి గృహములో నుండిన యెడల 

మరణమే శరణంబు మనిషికి యెపుడు

ధార్మికగీత - 88*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 88*

                                      *****

        *శ్లో:-  అవిద్యా జీవనం శూన్యం ౹*

                *దిక్శూన్యా చే దబాన్ధవాః  ౹*

                 *పుత్రహీనం గృహం శూన్యం ౹*

                 *సర్వ శూన్యా దరిద్రతా ౹౹*

                                        *****

*భా:- లోకంలో "అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని" అని సామెత వింటుంటాము. మన కెన్నో సిరిసంపదలు , భోగభాగ్యాలు ఉన్నా,  కొన్ని లేకపోతే మన జీవితం శూన్యమై నిస్తేజంగా గోచరిస్తుంది. 1. "అవిద్య":- ధనమున్నా,రూపమున్నా "విద్య" అనే ఆభరణం లేకుంటే వాడు వింతపశువని శాస్త్రం చెబుతోంది. అతని జీవనం పూర్తిగా పరాధీనమై అంధకారమయమవుతుంది.    తిని, తిరగగలడేమో కాని, చైతన్యవంతంగా జీవనం చక్కదిద్దుకోలేడు. 2. "అబాంధవము":-  స్థిరచరాస్తులు, నిధినిక్షేపాలున్నా,  తనవైపు, భార్యవైపు చుట్టాలు, పక్కాలు, బంధువులు ,మిత్రులు, హితులు లేని జీవితం తలచుకొంటేనే భీతి కొల్పుతుంది. శుభాశుభ కార్యాలలో బంధువర్గానిదే పెద్దపీట. వారే కొండంత అండ. వారి ప్రమేయం లేనిదే జరిగే విధి వెలవెల పోవడం ఖాయం. 3."సంతు":- మడులున్నా, మాన్యాలున్నా , ధనధాన్యాలు అమేయంగా ఉన్నా, అనుభవించడానికి  పుత్రసంతతి లేని వాని జీవనం చంద్రుడు లేని ఆకాశంలా కళావిహీనమై నిస్సారమౌతుంది.పిల్లలతో కళ కళ లాడే ఇల్లే నిజమైన ఇల్లు.వారు లేకుంటే శ్మశానమే.   4. "దారిద్ర్యము":- అంగబలంతో,  సంతానబలంతో, వేడుకలసందడితో పరుగులు తీయించే సంసారానికి తోడు దరిద్రదేవత తాండవిస్తుంటే, అలాంటి వాడి జీవనం మూలిగే నక్క నెత్తిన తాటికాయ పడ్డ విధంగా దుర్భరమౌతుంది. మరణమే శరణమనిపిస్తుంది. బ్రతుకు భారమనిపిస్తుంది. ఈ నాలుగు సందర్భాలకు ఎదురీద వలసి వచ్చిన వానికి సర్వము   శూన్యముగా గోచరిస్తుందని సారాంశము.*

                                    *****

                    *సమర్పణ   :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము



సీ. మఱునాడు విప్రుడు వరువాతనే లేచి 

            నెఱవేర్చు కొనియును నిత్య క్రియలు 

     సత్య వ్రతము సేయు సంకల్పమును మళ్ళి 

            మదియందు భక్తితో మనన జేసి 

     హరి నామస్మరణతో యాత్మ సంశుద్ధితో 

            వివిధ గృహములందు వేడె బిక్ష 

     ఆనాడు విప్రుకు హరి మహాత్మ్యంబుచే 

            యధిక ద్రవ్యము దక్కె యద్భుతముగ 

తే. ద్రవ్యమున దెచ్చి యంతట తగిన సరుకు ,

     బంధు మిత్రుల బిలిచియు బ్రాహ్మణుండు 

     సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

     సల్పి విద్యుక్త రీతిన సంత సిల్లె          39


తే. సత్య వ్రతమును శ్రద్ధతో సల్పు కతన 

     విప్రునకు జేరె విభవంబు విరివిగాను 

     సత్యపథమున యాతడు సాగుచుండి 

     బంధు మిత్రుల యందున బడసె కీర్తి      40


క. సతతము విప్రుడు తదుపరి 

    ప్రతిమాసము నందు వ్రతము భక్తితొ జేయన్ 

    యతి సంపద సమకూడెను 

    యతులితమగు మోక్షపదము యందెనుతుదిలో 41


తే. సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

     యెవరు భక్తితొ సేతురో యిలను యెపుడు 

     యట్టి వారల కిహమందు యమరి సిరులు 

     ముక్తి  కల్గును తుదియందు మోదముగను   42


క. హరి నారదమునివరునకు 

    యెఱిగించిన విషయమంత యెఱిగిన మీరల్ 

    మఱి యేమి నెఱుగ దలతురొ 

    యెఱిగించిన నెఱుక సేతు వినయము తోడన్ " 43


తే. సూతు డారీతి జెప్పగ , శ్రోత లైన 

     శౌనకాదిగ గల్గిన సకల మునులు 

     "విప్రు వలనను వినియును విమలవ్రతము 

     చేసియుండిరె యెవరైన ? చెప్పు " మనిరి     44


క. శౌనకు  డాదిగ గల్గిన 

    ముని సంఘములెల్ల యటుల ముదమునయడుగన్ 

    విని సూతుం డీవిధముగ 

    వినిపించెను నొక్క వ్యక్తి విమల చరిత్రన్      45


తే. తొల్లి యీ విప్రవర్యుడె తోషముగను  

     సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

     బంధు మిత్రుల తోడను బ్రాహ్మణులతొ 

     సల్పుచుండెను భక్తితొ స్వగృహమున       46


తే. అప్పు డొక కాష్ఠవిక్రేత దప్పి గొనియు 

     చేరె విప్రుని గృహమును నీరమునకు 

     వచ్చి యట జేయుచున్నట్టి వ్రతము జూచి 

     యబ్బురంబొంది విప్రుని యడిగె నిట్లు    47


ఆ. "విప్రవర్య ! నీవు విధ్యుక్త రీతితొ 

     సల్పు చున్న వ్రతము , తెల్పు యేమి ?

     యేమి ఫలిత మిచ్చు ? యేరీతి చేయుట ?

     విశదపరచు మార్య ! వివరముగను "     48


 తే. ఆశతో కాష్ఠవిక్రేత యడుగ నట్లు 

      పరమ పావనుడైన యా బ్రాహ్మణుండు 

      విమల వ్రతవిధి నంతయు విశద పరచె 

      మఱియు ననెనిట్లు యత్యంత మధురముగను 49   


తే. “సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

      సల్పు నెవ్వరు భక్తితో శక్తి కొలది 

      యతని కోర్కెలు దీరియు యవనిపైన 

      సర్వ సంపద లొనగూరు సత్య మిదియె "   50


తే.  విప్రు వలనను వ్రతవిధి వినియు నంత 

      కాష్ఠవిక్రేత మనమందు గట్టిగాను 

      సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

      సల్పెదను నేను యనియును సమయ మొందె  51


తే.  కాష్ఠ విక్రేత యంతట కాష్ఠములతొ 

      ధనికు లున్నట్టి వీధికి తరలి వెళ్లి 

      యమ్మ కట్టెల నెల్లను సొమ్మునకును

      దైవ కృపవల్ల రెట్టింపు ద్రవ్య మొచ్చె       52


తే.  అంత యా కాష్ఠవిక్రేత సంతసమున 

      వలయు సామాగ్రి దెచ్చియు వ్రతమునకును 

      ప్రేమతో బంధువులనెల్ల బిలుచుకొనియు 

      సల్పె భక్తితొ విధ్యుక్త సత్యవ్రతము        53


తే. కాష్ఠవిక్రేత యారీతి క్రతువు జేసి 

     పొందె సంపద లెల్లను పుడమియందు 

     ఇహము యందున సుఖముల ననుభవించి 

     పరము నందున మోక్షంబు బడసె తుదిన "   54


                  రెండవ అధ్యాయము 

                          సమాప్తము 


                                            సశేషము...

సరదాగా

సరదాగా....🤣🤣

"ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ప్రతి మగాడు మొహం ఉదాసీనంగా, ముభావంగా, విచారంగా పెట్టుకుని వెళ్ళాలి..... లేదంటే ఇంట్లో గొడవలు అవుతాయి” అన్నాడు ఏకాంబరం.

“ఛ అదేంటి అలా అంటావు. చక్కగా హాయిగా నవ్వుతూ ఉండాలి.... గృహమే కదా స్వర్గసీమ” అన్నాడు పీతాంబరం.

“కాదు నేను చెప్పిందే కరెక్టు. కావాలంటే జరిగింది చెప్తా విను” 

“ఏడుపు మొహంతో ఇంటికెడితే భార్య ఎదురొచ్చి ఏమండి ఏమైంది అలా ఉన్నారు" అంటుంది. 

ఆఫీసులో ప్రాబ్లం అని చెప్పగానే అబ్బ ఎంత కష్టపడుతున్నాడు అని ఆనందిస్తుంది.

అదే నవ్వుతూ వెళ్ళామనుకో..... ఆ కధ ఇలా సాగుతుంది.

భార్య: ఏమండి ఏమిటి సంగతి..... ఇవాళ గొప్ప హుషారుగా ఉన్నారు.?

భర్త: ఏం లేదు.!

భార్య: ఏం  నాతో చెప్పకూడదా! 

భర్త: ఏం లేదన్నాను కదా! 

భార్య: నాకు తెలుసులెండి, దార్లో ఎవరైనా టక్కులాడి లిఫ్ట్ అడిగి ఉంటుంది. 

భర్త: అదేంలేదే బాబు, ఆఫీసులో ఈ రోజు సరదాగా గడిచింది అందుకని. 

భార్య: ఏముంది మీ రిసెప్షనిస్టు మిమ్మల్ని చూసి పళ్ళికిలించి ఉంటుంది. 

భర్త: అదేం లేదు అంటే వినవేం!  అయినా ఆవిడ అలాంటిది కాదు.

భార్య: ఆహా! అంతవరకూ వచ్చిందా ఆవిడ మీద ఈగ వాలనివ్వట్లేదు మీరు.

భర్త: ఆవిడ అలాంటిది కాదు అన్నానా - దానికి పెడర్ధాలు తీస్తావేం?

భార్య: అబ్బో! ఆవిడ మహా గొప్పది, నేనే పెడర్ధాలు తీసేదాన్ని!

భర్త: ఎక్కడి నుంచి ఎక్కడికి లింకులు పెట్టేస్తావే?

భార్య: అవును మరి నేను లింకులు పెట్టేదాన్ని అది మాత్రం  మహా సాధ్వి.

భర్త: ఛ! సరదాగా నవ్వినా తప్పే ఈ కొంపలో.

భార్య: అవును మరి మీకు మీ పిల్లలికి గొడ్డు చాకిరి చేస్తున్నాను కదా ఇది కొంపలాగే ఉంటుంది మీ కంటికి 

భర్త: అంటే నువ్వే కష్టపడుతున్నావా? నేను రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించడం లేదా!

భార్య: మహా కష్టపడి పోతున్నారు. కష్టపడే వాడికి పొద్దున్నే స్ప్రేలు సెంట్లు ఎందుకో!

భర్త: నేనో ఆఫీసరుని. నీట్ గా తయారవడం కూడా తప్పేనా!

భార్య: అవును మీరేమో పెద్ద ఆఫీసరు. నేను కూలిదాన్ని. ఇంకెందుకు ఈ కూలిదాని ఇంటికి రాకండి!

భర్త: దీనెమ్మ జీవితం ఎప్పుడు ఏడుపులు పెడబొబ్బలు ఛ!

భార్య: ఈ ఏడుపు మొహం దానితో ఇంకెందుకు నేను మా పుట్టింటికి పోతాను మీరు హాయిగా ఉండండి!

భర్త: పొతే పో..... ఏం బెదిరిస్తున్నావా? 

భార్య: నేనెందుకు పోతాను? మీ అంతు, దాని అంతు చూడకుండా పోను......

భర్త: (ఏడుపు మొహం పెట్టి) ఇంక ఆపవే ఏమిటి ఈ గోల...... పిల్లలు చూడు ఎలా భయపడుతున్నారో.....

భార్య: (భర్త మొహంలో ఏడుపు చూసిన ఆనందంలో) రండి భోజనం వడ్డిస్తా.......

ఇక మీ ఇంటికి మీరెలా‌ వెళ్తారనేది మీ ఇష్టం 🤣🤣🤣

Sri Devi Mahatyam - Durga Saptasati - 22 🌹*

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 22 / Sri Devi Mahatyam - Durga Saptasati - 22 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 5*

*🌻. దేవీ దూతసంవాదం - 7 🌻*


122–123. దూత పలికెను: దేవీ ! నీవు గర్వంతో ఉన్నావు నా ఎదుట అలా మాట్లాడవద్దు. ఈ మూడులోకాలలో ఏ మగవాడు శుంభనిశుంభుల ఎదుట నిలువగలడు?


124. ఇతర రాక్షసుల ఎదుట కూడా దేవతలందరూ యుద్ధంలో నిలువజాలరే! ఇక దేవీ! నీ సంగతి ఏమి చెప్పను- స్త్రీవి. ఒంటరిదానవు!


125. ఇంద్రాది దేవతలందరూ శుంభాదుల ఎదుట నిలిచి పోరాడ జాలకపోయారు. స్త్రీవి నీవు ఎలా వారి ఎదుట నిలువగలవు?


126. మాట మీదనే శుంభనిశుంబుల వద్దకు పొమ్ము, తలపట్టి ఈడువబడే గౌరవం పొందకుందువు గాక!”


127-128. దేవి పలికెను : 

నీ మాటలు నిజమే. శుంభుడు బలవంతుడు; నిశుంభుడును మిక్కిలి పరాక్రమశాలి. (కాని) అనాలోచితంగా పూర్వమొనర్చిన శపథం ఉండగా నేను ఏం చేయగలను?


129. తిరిగి పోయి నేను ఇప్పుడు చెప్పినదంతా జాగ్రత్తగా రక్కసులటేనికి చెప్పు. ఏదియుక్తమో అది అతడు చేయు గాక.


శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణి మన్వంతరంలో "దేవీ మాహాత్మ్యము" లో “దేవీ దూతసంవాదం” అనే పేరిటి పంచమాధ్యాయం సమాప్తం. 


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

వత్తిని బట్టి ఫలితం

 🌹🥀💐🌸🌷🌺🌾


*దీపారాధనలో వినియోగించే వత్తిని బట్టి ఫలితం ఉంటుందా?*


దీపారాధనకు శుద్ధమైన వత్తిని ఎంచుకోవాలి. పత్తితో చేసిన వత్తులు సర్వశ్రేష్టమైనవి.


అన్నివేళల్లోనూ పత్తివత్తులను ఎవరైనా వెలిగించవచ్చు తామరతూడులతో వత్తులు చేసి వెలిగిస్తే అఖండభాగ్యం లభిస్తుంది పితృదోషాలు తొలగుతాయి. 


అరటివత్తులతో వెలిగిస్తే ఉత్తమ సంతతి. 


జిల్లేడు వత్తులతో వెలిగిస్తే అపారసంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగుతుంది.


నూతన వస్త్ర పీఠికను కుంకుమనీళ్లలో తడిపి, ఆరబెట్టి దీపారాధన చేస్తే కుజ, శుక్రదోషాలు పోతాయి.


పసుపురంగు వస్త్రంతో వత్తిచేసి వెలిగిస్తే దేవీ కటాక్షం సిద్ధిస్తుంది. 


కుంకుమరంగు వస్త్రంతో చేసిన వత్తితో వెలిగిస్తే సంతానప్రాప్తి కలుగుతుంది. 


ఎర్రరంగు వస్త్రాన్ని గంధపునీటిలో తడిపి, ఆరబెట్టి దీపారాధన చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది.


పన్నీరుతో తడిపిన నేతివత్తులతో వెలిగిస్తే కీర్తివంతులవుతారు.


తామరనారతో దీపారాధన చేస్తే గ్రహదోషాలు పోతాయి.


దీపారాధనలో రెండు వత్తులు వాడడం మంచిది. ఒకటి అడ్డవత్తి, రెండోది నిలువు వత్తి అయితే ఉత్తమం.


లేకపోయినా రెండు నిలువు వత్తులను

వెలిగించవచ్చు.


3.ఉత్తమ సంతానం కలుగుతుంది


5.పంచభూతాలకు సంకేతం


7. ఏడుజన్మల పాపాలు తొలగిపోతాయి


8.అప్లైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి


10. సర్వాంతర్యామికి సంకేతం.


27.నక్షత్రారాధన ఫలితమిస్తుంది సర్వారిష్టాలు తొలగుతాయి


360 సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలం లభిస్తుంది.

🌹🌾🌺🌷🌸💐🥀


*ఒకసారి వెలిగించిన వత్తిని మళ్లీ వెలిగించవచ్చా*


నేడు వెలిగించిన వత్తిని తీసివేసి రేపటినాడు కొత్త వత్తితో దీపారాధన చేయాలి.


ఒకరోజునే వెలిగించిన మూడు వత్తుల్లో ఒక వత్తి శాంతించి మిగిలిన వత్తులు వెలుగుతున్నప్పుడు వాటి సాయంతో కొండెక్కిన వత్తిని వెలిగించవచ్చు. 


అన్ని వత్తులూ ఒకేసారి శాంతించినప్పుడు కూడా అప్పటికప్పుడే అయితే మరోసారి వెలిగించుకోవచ్చు.


 ఒకసారి చేసిన దీపారాధనలోని వత్తులు ఆనాటికి మాత్రమే పరిమితం అని గుర్తించాలి.


                  *భక్తి*

                 M.s.s.k.

                

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఇద్దరు మిత్రులు..*


"ప్రతి పది పదిహేను రోజులకొకసారన్నా ఇక్కడకు వచ్చి, శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకోకపోతే ఏదోలా ఉంటుంది.." అనేవారు శ్రీ రమణయ్య గారు మాతో..వారిది నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామం..ప్రతి నెలలో రెండుసార్లు మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి  ఖచ్చితంగా వచ్చేవారు..ఎప్పుడూ ముఖం లో చెదరని చిరునవ్వు తో వుండేవారు..అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు..


రమణయ్య గారు చిన్నప్పుడు ఐదవ తరగతి దాకా.. శ్రీ స్వామివారితో కలిసి చదువుకున్నారు.. శ్రీ స్వామివారు చదువు ఆపేసి, మోక్షగామి గా మారి సాధన చేయడం మొదలుపెట్టారు..ఆనాటి నుంచే, రమణయ్య గారు, శ్రీ స్వామివారిని ఆరాధించడం ప్రారంభించారు..శ్రీ స్వామివారు ఆశ్రమం నిర్మించుకొని..కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన తరువాత..రమణయ్య గారు మొగలిచెర్ల కు వచ్చి, శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్ళసాగారు..అన్నదానానికి బియ్యం తీసుకొచ్చి ఇచ్చి వెళ్లేవారు..శ్రీ స్వామివారి సమాధి వద్ద నిశ్చలంగా నిలబడి..భక్తి పూర్వకంగా నమస్కారం చేసుకునేవారు..


"మొదటినుంచీ స్వామిది ఒక విలక్షణ జీవనం..నిరంతరమూ తనలో తాను ఏదో ఆలోచిస్తూ వుండేవాడు..లేదా ఒక ప్రక్కకు వెళ్ళిపోయి, ప్రపంచంతో సంబంధం లేకుండా ధ్యానం చేసుకునేవాడు..మాతోటి కూడా ఆటలాడటం లాంటివి కూడా చేసేవాడు కాదు..అతని లోకం అతనిది..ఆ మహానుభావుడి తో కలిసి కొన్నాళ్ళు గడిపాను..ఈ జీవితానికి అది చాలు..నాకు ఏ కోరికలూ లేవు..నడుస్తూ ఉన్నప్పుడే..మంచాన పడకుండా..ఈ బొందిలోని ప్రాణం పోతే చాలు.." అని రమణయ్య గారు చెపుతూ ఉండేవారు..శ్రీ స్వామివారిని మనసా వాచా కర్మణా ఆరాధించారు..రమణయ్య గారు కోరుకున్న విధంగానే ఎటువంటి ఇబ్బందీ పడకుండా కన్నుమూశారు..


శ్రీ స్వామివారికి ఆశ్రమాన్ని నిర్మించి ఇచ్చిన శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారి బావమరిది శ్రీ గోనుగుంట రామయ్య శ్రేష్టి గారు కూడా శ్రీ స్వామివారిని భక్తి గా కొలిచేవారు.. రామయ్య శ్రేష్టి గారి అల్లుడు వీరాస్వామి..వీరాస్వామి నెల్లూరు జిల్లా వింజమూరు లో వుండేవారు..వీరాస్వామి గారు కూడా శ్రీ స్వామివారి తో కలిసి, చిన్నతనంలో కొన్నాళ్ళు చదుకున్నవారే..ఎప్పుడూ చిరాకుగా..కోపంతో ధుమ ధుమ లాడుతూ..ఎవరో ఒకరిని తిట్టుకుంటూ వుండేవారు..వీరాస్వామి నవ్వుతూ మాట్లాడటం చూసిన వాళ్ళు బహు అరుదు..


"మీరు వెఱ్ఱివాళ్ళు కనుక..ఆయన్ను స్వామీ స్వామీ అంటూ కొలుస్తున్నారు..అంత ఆస్తి పెట్టుకొని అనుభవించకుండా దేవుడు, మోక్షం అంటూ గాలికి తిరగడం..కట్టుకున్న బట్టలు కూడా విప్పేసి..సాధన చేయడం..ఏమిటీ తలతిక్క పనులు?..అందుకే నేను ఏనాడూ  మొగలిచెర్ల లోని ఆశ్రమానికి  రాలేదు..చిన్నప్పుడు రెండు మూడు సార్లు "ఇవన్నీ మానుకోరా..హాయిగా మాలాగా వుండు!" అని చెప్పి చూసాను..వినలేదు..వాడి ఖర్మ!..అంతే.." అని శ్రీ స్వామివారి గురించి చెప్పేవారు..


"ఆధ్యాత్మికంగా ఎందరికో శ్రీ స్వామివారు మార్గం చూపారు..ఎందరో వారి వారి సమస్యలు తీరిపోయాయని..సంతానం లేని వారికి శ్రీ స్వామివారికి మ్రొక్కుకుంటే సంతానం కలిగిందనీ..తమకున్న గ్రహబాధలు తొలగిపోయాయనీ..చెప్పుకుంటున్నారు.. ఇంతమంది నమ్ముతున్న ఆ అవధూతను..మీరు పిచ్చివాడిగా భావిస్తున్నారా?.." అని అడిగితే.."మీకూ పిచ్చి కనుక..అతనికి మొక్కుతున్నారు.." అనేవారు వీరాస్వామి..


వీరాస్వామి ఏనాడూ శ్రీ స్వామివారిని అవధూతగా పరిగణించలేదు..పైగా తీవ్రంగా విమర్శించేవారు....శ్రీ స్వామివారిని నిరంతరమూ ద్వేషిస్తూనే తలచుకుంటూ ఉండటం వీరాస్వామికి అలవాటుగా మారిపోయింది..వీరాస్వామి కి నలభై ఐదు ఏళ్ల వయసు వచ్చేసరికి మధుమేహ వ్యాధి ముదిరిపోయి కళ్ళు కనబడటం మానేసాయి..ఎందరో కంటి వైద్యులకు చూపారు..ఫలితం లేదు..మరో ఆరు నెలల కల్లా..పూర్తి అంధుడి గా మారిపోయారు..


"కనీసం ఇప్పుడన్నా శ్రీ స్వామివారిని ద్వేషించడం మానుకోమని" నాతో సహా అతని బంధువర్గమంతా చెప్పిచూసాము..వీరాస్వామి మారలేదు.. తరువాత కొన్నాళ్ళకు..అంధత్వం తో పాటు అనారోగ్యం తో తీవ్రంగా  ఇబ్బంది పడి మరణించారు..


రమణయ్య గారు, వీరాస్వామి..ఇద్దరూ శ్రీ స్వామివారి మిత్రులే..కానీ..శ్రీ స్వామివారి పట్ల  ఒక్కొక్కరిదీ ఒక్కో దృక్పథం.. వారి వారి ఆలోచనల ప్రకారమే వారి జీవనయానం సాగింది..ఎవరికి ఏది ప్రాప్తమో దానినే దైవం అనుగ్రహిస్తాడు..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).