4, నవంబర్ 2025, మంగళవారం

కార్తీకపురాణం - 14 వ అధ్యాయము*

 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴

  🍁 _*మంగళవారం*_🍁

🕉️ *నవంబర్ 4, 2025*🕉️


*కార్తీకపురాణం - 14 వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️

               

(ఆబోతును అచ్చుబోసి వదులుట {వృషోత్సర్గము} )

```

వశిష్ఠుల వారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మాహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి..


“ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానముచేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానముచేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింప జేసుకొందురు. వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమం దెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు.


ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును.


కావున ప్రతిసంవత్సరం కార్తీక మాసమున తనశక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆరాత్రియంతయు జాగారముండి మరునాడు తమశక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములననుభవింతురు.

```


*కార్తీకమాసములో విసర్జింపవలసినవి:*

```

ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు. తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారమునాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందున భోజనం చేయరాదు.


కార్తీకమాసమున నెలరోజులూ కూడా కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విస్మరించరాదు.


కార్తీకమాసమున వేడినీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరీ సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.


ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతిదగ్గరగాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.```


శ్లో!! గంగే యమునే చైవ గోదావరి సరస్వతీ

నర్మదా సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధింకురు!!```

అని పై తెలిపిన శ్లోకం పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను. సాయం కాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను.

```

కార్తీక మాస శివపూజాకల్పము:```

1. ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి


2. ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి


3. ఓం కైలాసవాసాయ నమః - నవరత్నసింహాసనం సమర్పయామి


4. ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి


5. ఓం లోకేశ్వరానమః - ఆర్ఘ్యం సమర్పయామి


6. ఓం వృషభవాహనాయనమః - స్నానం సమర్పయామి


7. ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి


8. ఓం జగన్నాథాయనమః - యజ్ఞోపవీతం సమర్పయామి


9. ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి


10. ఓం సంపూర్ణ గుణాయనమః - పుష్పం సమర్పయామి


11. ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్‌ సమర్పయామి


12. ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి


13. ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి


14. ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి


15. ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి


16. ఓం శంకరాయనమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి


17. ఓం భవాయనమః - ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి


ఈప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను. శివసన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తనశక్తినిబట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను.


ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన, తులసికోటవద్ద కర్పూర హారతులతో దీపారధన చేసిన ఎడల, వారికీ, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును.


శక్తి కలిగియుండికూడా యీ వ్రతము నాచరించనివారు వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, యెలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోకతముగా ఆచరించిన యెడల పదిహేను జన్మలయొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.```


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి*


  *పద్నాల్గవ అధ్యాయము*  

      _*పద్నాల్గవ రోజు*_ 

 *పారాయణము సమాప్తం*


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*

🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

ఏకాదశ రుద్రులు

 1 *కోనసీమలో కొలువైన ఏకాదశ రుద్రులు* 🙏


*🕉️శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తారు🕉️*

.

*”🕉️విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమ:” అని రుద్రనమకంలో చెప్పబడినది.*


*🕉️దీనిప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు –

 1. విశ్వేశ్వరుడు 

2.మహాదేవుడు

3. త్రయంబకుడ 

4.త్రిపురాంతకుడు 

5.త్రికాగ్నికాలుడ

6.కాలాగ్నిరుద్రుడు

7. నీలకంఠుడు, 

8,మృత్యుంజయుడు

9.సర్వేశ్వరుడు 

10. సదాశివుడు

11. శ్రీమన్మహాదేవుడు* 


*🕉️ఈ ఏకాదశ రుద్రులు నవ్యాంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో నెలకొనివున్నారు. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ఈ ఏకాదశ రుద్రులు సమావేశమవుతారు. అలా సమావేశమైన ఏకాదశ రుద్రులను ఒకేచోట చూస్తే మంచిదనే విశ్వా సంతో వేలాదిమంది భక్తులు విచ్చేస్తారు*.


*1. 🕉️విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం. (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వరస్వామి): పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆ పులి శివ లింగరూపాన్ని పొందిందని కథ. వ్యాఘ్రము శివునిగా అవతరించు టచే వ్యాఘ్రేశ్వరస్వామి అని పిలువబడెను*


*2. 🕉️మహాదేవరుద్రుడు- కె.పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి): విశ్వామిత్రుని తపోభంగం చేసిన తరువాత మేనక స్వర్గానికి వెళ్ళ డానికి ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయింది. అపుడు శివుని ప్రార్ధించగా ఆయన ఒక శివలింగాన్ని మేనకకు ఇచ్చి ఆ ప్రదేశంలో ప్రతిష్ఠింపుమనెను. మేనక ఆ లింగాన్ని కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి)లో ప్రతిష్ఠించి స్వర్గానికి వెళ్ళిందని పురాణ కథ. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వర స్వామి అని పిలువబడెను*.

 

*3. 🕉️త్రయంబకేశ్వరుడు- ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి): రావణుని సంహరించిన తరువాత శ్రీరామ చంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండ గా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి విమానం కదలకుండా నిలిచి పోయింది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివ లింగాన్ని ప్రతిష్ఠించెనని కథ కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందు కు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనంద రామేశ్వ రుడని పిలువబడెను.*

 

*4. 🕉️త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వే శ్వరస్వామి): తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సం#హ రింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామం లో శివలింగరూపంలో ఆవిర్భవించెనని కథ. అపుడు ఆ గ్రామపు బ్రాహ్మ ణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను..*


*5. 🕉️త్రికాగ్నికాలరుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమే త శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి): మూడు అగ్నుల యందు హోమం చేసిన ద్రవ్యా లను స్వీకరించి శివుడు లింగ రూపాన్ని పొందుటచే త్రికాగ్నికాలునిగా పిలువబడి అగస్త్య మహర్షిచే నేదునూరులో ఈ శివలింగం ప్రతి ష్ఠింపబడి నది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వరస్వామిగా కొలువబడుచున్నాడు*.

 

*6. 🕉️కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ రాఘవేశ్వరస్వామి): రావణ సంహారం తరు వాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రాలను, ఖడ్గం ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠింప బడుట వల్ల రాఘవేశ్వరస్వామి అని, పాండవ వనవాసంలో శివుడు అర్జు నుని పరీక్షింపదలచి కిరాతుని వేషంలో అర్జునుని ధైర్యపరా క్రమాలను చూచి పాశుపతాస్త్రం ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్ని రుద్రుడని మరొక కథ* .


*7. 🕉️నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి): దేవతలు- రాక్షసులు క్షీరసాగర మధన సమయం లో వెలువడిన విషవాయువులను శివుడు తన కంఠమునందు నిక్షిప్తం చేసికొని నీలకంఠుడైనాడు. ఆ గరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంత భోగాలను అందించేవాడు, అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించిన వాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను*.

 

*8. 🕉️మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీ చెన్నమల్లేశ్వరస్వామి): శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యు ముఖము నుండి రక్షించి, యముని జయించి ”మృత్యుంజయుడు” అయ్యె ను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామంలో లింగరూపంలో ఆవిర్భవించి చెన్న మల్లేశ్వ రస్వామిగా పిలువబడెను.*


*9. 🕉️సర్వేశ్వర రు ద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి): దక్షుని యజ్ఞంలో సతీదేవి తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తన కాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్ప డిన అగ్నిజ్వాలల్లో కాలి బూడిద అయినపుడు శివుడు ఆగ్రంహంచి ఉగ్రరూపుడై నృత్యము చేసి తన జటాజూట ములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీర భద్రుడు జన్మించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసాడు. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారంలో వేదపండి తు లైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను*.

 

*10. 🕉️సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమే త శ్రీచెన్నమల్లేశ్వర స్వామి): పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరు గొప్ప వారని వాదనకు దిగి శివుని వద్దకు వచ్చారు. అపుడు శివుడు ఆద్యంతములు లేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణు వును తన పాదాలను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదాలను కను గొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మ మాత్రం శివుని శిరస్సును చూడకపోయినను ఒక ఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆ లింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేద పండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను*.


*11. 🕉️శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు): పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆ మహాదేవు డు పుల్లేటికుర్రు గ్రామంలో లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి ”పుండరీకపురము” అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీ కము అనగా వ్యాఘ్రము (పులి) అని అర్ధం. వ్యాఘ్రేశ్వరరంలో వ్యాఘ్రేశ్వర స్వామి ఉండుటచేత ఈ గ్రామంలో శివుడు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి అని పిలువబడెను*. 


*🕉️సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు.🕉️*

అగ్గిపెట్టె ఫోను (చిన్ననాటి జ్ఞాపకాలు)

 

అగ్గిపెట్టె ఫోను (చిన్ననాటి జ్ఞాపకాలు)

మనలో అగ్గిపెట్టె ఫోను గురించి తెలియని వాళ్ళు ఎందరు వున్నారు చెప్పండి. ఈ రోజుల్లో పిల్లకు ఆడుకోవటానికి అనేకమైన ఆట వస్తువులు మార్కెట్లో దొరుకుతున్నాయి.  అంతే కాక వాటిని కోనేటంత ఆర్థికస్తోమత ఈ నాటి తల్లిదండ్రులకు వుంటున్నది. చిన్నపిల్లల చేతుల్లో కూడా సెల్ఫోనులు, టాబిలెట్లు, లాప్టాప్లు ఉండటం చేత వాళ్లకు వాళ్ళ తెలివితేటలతో ఆటవస్తువులను చేసుకొని ఇతర స్నేహితులతో కలిసి ఆడటానికి తగిన సమయంలేదు అంతే కాకుండా వాళ్లకు తెలియనుకూడా తెలియదు. అన్నీ ఆధునికమైన ఆటవస్తువులే వాటి ఖరీదులు ఆకాశాన్ని అంటుతున్నా కూడా తల్లిదండ్రులు కొనక మానటం లేదు.  కానీ పూర్వకాలంలో అట్లా కాదు ఒక ఇంట్లో ఐదు నుండి పదిమంది పిల్లలు ఉండేవారు ఒకడు హైస్కూలు చదువు చదువుతుంటే ఇంకొకడు ప్రేమారి స్కూల్లో ఇక చిన్నది లేక చిన్నవాడు అమ్మ వడిలో బడినుంచి వచ్చిన పిల్లలకు ఇంట్లోకి రాగానే తన తమ్ముడు లేక చెల్లెలిని ఎత్తుకొని ఆడించే పని ఉండేది అమ్మా వీడు ఏడుస్తున్నాడు. వీడు ఉచ్చపోశాడు, దొడ్డికి పోయాడు అని తల్లితో చెపితే వంట చేసుకుంటున్న తల్లి తన చేతిని పవిట కొమ్ముకు తుడుచుకొంటూ ఏరా తమ్ముడిని చూసుకోలేవా ప్రతిదానికి నన్ను పిలవాలా అవతల పోపు మాడిపోతున్నది, దోశ కాలిపోతుంది అని విసుకు కుంటూ వచ్చి చంటి పిల్లవాడిని చూసుకుంటుండేది.  మరి ఇప్పుడు యెడ పిల్లలకు చంటిపిల్లలను చూసుకునే ప్రేమ, భాద్యత లేదు. అందుకే పిల్లలకు వాళ్ళ తోబుట్టువులమీద తల్లిదండ్రులమీద ప్రేమ సన్నగిల్లుతుంది. అవునా కాదా. ఇంట్లో చంటివానికి విరోచనాలు అయ్యాయి అంటే ఇంటిల్లపాతి మేలుకొని ఉండేవారు.  భగవంతుడా మా తమ్ముడికి విరోచనాలు తొందరగా తగ్గించేయి   అని . విజ్ఞేశ్వర నీకు 11 గుంజిళ్లు తీస్తాను అని మరీ మొక్కుకునేవారు. అది అన్నా లేక అక్కల ప్రేమ తల్లులు పిల్లలను కంటే అక్కలు వాళ్ళను సాకేవారు. పోత పాలమీద వున్న పిల్లలైతే పాలు పట్టటం కూడా అక్కల పనే .  సీతా  రా ఆడుకుందాము అంటే ఉండేవే మా తమ్ముడికి పాలు పట్టి వస్తా అనే సీతలు లక్స్మీలు నాగమణిలు ఎంతమందో మీకు జ్ఞాపకం ఉందా, తొక్కుడుబిళ్ల, దాగుడు మూతలు, గుంజిళ్ళు ఆడుతూ ఆడపిల్లలు వీధులలో ఉండేవారు. మరి ఇప్పుడు చూద్దామన్నా ఒక్కళ్ళు కూడా లేరు. వీధిలో ఆడుకునే పిల్లలతో తండ్రిగారి స్నేహితులు ఎమ్మా మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా అంటే ఒక్కొక్కసారి వున్నారని లేకపోతె ఆటలో నిమగ్నులైన పిల్లలు ఆదమరచి మా నాన్నగారు ఇంట్లో లేరు అంటే మరుసటిరోజు ఆయన వచ్చి ఏమండీ సీతారామయ్యాగారు నిన్న మీరు ఇంట్లో లేరా ఎక్కడిపోయారు అని అడిగితె అప్పుడు నాన్నగారు నేను ఎక్కడి వెళ్ళాను ఇంట్లోనే కదా వున్నాను, అంటే మీ అమ్మాయి సీత మీరు ఇంట్లో లేరని అన్నదే అంటే ఎమ్మా నేను లేనని అన్నవా మామయ్యతో అని అడిగితె ఏమో నాన్న  నాకు జ్ఞాపకం లేదు అనే అమ్మాయిలు కోకొల్లలు. నిజానికి తోటి స్నేహితులతో ఆటలాడే పిల్లలకు వారి లోకమే వేరు వారికి ఇల్లు, తల్లిదండ్రులు మదిలో వుండనే వుండరు. అది కదా బాల్యం అంటే. ఇట్లా చెప్పుకుంటూ వెళితే అనేకమైన విషయాలు ఉంటాయి. ఇక విషయానికి వద్దాం. 

చిన్నప్పుడు స్వయంగా చేసుకొని ఆదుకునే ఒక ఆట టెలిఫోను ఆట. ఆ రోజుల్లో గడ్డఫోను (P&T ) ఫోన్ ఏ కొంతమంది ధనవంతులకు మాత్రమే వుండెది ఎప్పుడైనా ఏ పిల్లవాడో అరే నేను హైదరాబాదులో  మా మామయ్యా వాళ్ళ ఇంట్లో ఫోనులో మాట్లాడాను తెలుసా అని ఒక రమణారావు అంటే వాడి చుట్టూ తోటి స్నేహితులందరూ చేరి అరె ఫోను యెట్లా ఉంటుంది అందులో మాటలు యెట్లా వస్తాయి ఆ హ్యాండిల్ యెంత బరువు ఉంటుంది. నీవు మాట్లాడింది నల్ల ఫొనేనా లేక అది ఇంకో రంగులో ఉందా అని అనేక ప్రశ్నలతో ముంచెత్తు తారు . వాళ్ళ ప్రశ్నలకు ఓపికగా సమాదానాలు చెప్పే రమణారావు తన తోటి స్నేహితులకన్నా తానూ ఎంతో గొప్ప పని చేసినట్లు బిల్డప్ చేసి వాళ్ళతో ప్రవర్తించటం. చాలామందికి  గతంలో వున్న అనుభవమే. 

పిల్లలలో కొంత తెలివితేటలు ఎక్కువ వున్న వాళ్ళు అగ్గిపెట్టి ఫోను చేసేవారు.  దానిని తోటి స్నేహితులు ఒకరి తరువాత ఒకరుగా మాట్లాడే వారు. అరే నేను ముందు అంటే నేను ముందు అని పోట్లాడుకునే వారు. ఈ ఫోను తయారీకి రెండు అగ్గి పెట్టలను తీసుకొని వాటిలొని లోపలి అరలను తీసుకొని ఫై కేసును పారేసి అరలమధ్యన ఒక పిన్నీసుతో చాలా  జాగ్రత్తగా ఒక సన్నని రంధ్రాన్ని చేసి దానిలోకి దారాన్ని పంపి ఆ దారానికి ఒక చిన్న చీపురు పుల్లను కట్టాలి. దారం ఒక 10 నుంచి 20 అడుగులు తీసుకొని దాని రెండొవ కొసకు కూడా ఇదేవిధంగా అగ్గిపెట్టె అరను కట్టాలి. ఇక మీ ఫోను సిద్ధం. ఈ ఫోను తయారు చేయటానికి నైపుణ్యం వున్న బాలునికి ఒక పది నిముషాలు చాలు. ఒక వైపు వున్న  అగ్గిపెట్టను (అరను) నోటి ముందు పెట్టుకొని మాట్లాడితే రెండవ వైపు అగ్గిపెట్టెను అవతలి వాడు చెవిలో పెట్టుకొని వింటే మాట వినపడుతుంది. తరువాత రెండవ వాడు తన అగ్గిపెట్టెను నోటిముందు పెట్టుకొని మాట్లాడితే మొదటివాడు తన అగ్గిపెట్టను చెవిలో పెట్టుకొని వినవచ్చు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మైక్రోఫోనుగా స్పీకర్ గా  ఒకే అగ్గిపెట్టి పని చేస్తుందన్నమాట. ఇట్లా మాట్లాడేటప్పుడు రెండు విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి దారం సాధ్యమైనంత గట్టిగ ఉండాలి. రెండు. ఆ దారాన్ని ఎవ్వరు తాకకూడదు. మొదటి వాడు అగ్గిపెట్టి ముందు మాట్లాడితే ఆ శబ్ద తరంగాలు అగ్గిపెట్టి లోపలి కాగితాన్ని తాకి శబ్ద తరంగాలకు అనుగుణంగా అది కదిలి ఆ తరంగాలను దారం ద్వారా రెండవ అగ్గిపెట్టి లోపలి కాగితాన్ని కదిలించి మరలా శబ్దాన్ని పుట్టిస్తుంది. ఇది అది పనిచేసే విధానం. నిజానికి ఇందులో పూర్తిగా ఫిజిక్స్ వున్నది.  కానీ ఏ మాత్రం శాస్త్రీయ పరిజ్ఞానం లేని ఆ వయస్సులో అది తయారుచేయటం. దానిని ఉపయోగించి ఆడుకోవటం నిజంగా ఒక ఆనందదాయకమైన విషయం కదా. మీరేమంటారు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ