18, జూన్ 2025, బుధవారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🪷బుధవారం 18 జూన్ 2025🪷*

``

          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

       *వాల్మీకి రామాయణం*               

              *72వ భాగం*

```

ఇంతలో త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి… “ఇప్పుడే తెల్లవారుఝామున నాకు ఒక కల వచ్చింది. వెయ్యి హంసలు మోస్తున్న ఒక శిబిక మీద తెల్లటి వస్త్రములను ధరించి, మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకుని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు. అప్పుడు వాళ్ళు నాలుగు దంతములు కలిగిన ఏనుగు మీద దిగారు. ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది, ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పట్టు పుట్టం కట్టుకుని ఉంది. రాముడు సీతమ్మకి తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు. అప్పుడు వాళ్ళు వృషభములు పూన్చిన రథంలోకి మారారు. ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరిని తన చేతితో నిమిరింది. తరువాత వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు.

పాల సముద్రం మధ్యలో ఒక కొండ ఉంది, ఆ కొండ మీద హేమసింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద రాముడు కూర్చుని ఉన్నాడు, ఆయన ఎడమ తొడ మీద సీతమ్మ కూర్చుని ఉంది. అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు. నాకు ఆ సమయంలో రాముడు రెండు చేతులతో కనపడలేదు, ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలోనుంచి వస్తున్నాయో, ఎవరివల్ల నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమయిపోతున్నాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపంగా, నాలుగు చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు.


ఇక్కడ లంకా పట్టణంలో రావణాసురుడు మాత్రం గాడిదలు పూన్చిన రథం ఎక్కి, ఎర్రటి వస్త్రములు ధరించి, నూనె తాగుతూ ఉన్నాడు. ఆ రథం దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. కొంతదూరం వెళ్ళాక ఆ రథం నుండి దక్షిణ దిక్కుకి తల ఉండేలా కింద పడిపోయాడు. తరువాత పైకి లేచి మెడలో గన్నేరు పూల మాలలు వేసుకొని పిచ్చి పిచ్చిగా అరుస్తూ, నాట్యం చేస్తూ పరిగెత్తి ఒక కంపుకొట్టే మురికి గుంటలో పడిపోయాడు. అప్పుడు వికటాట్టహాసం చేస్తూ, ఎర్రటి వస్త్రములు ధరించి, బోడి గుండుతో ఉన్న ఒక స్త్రీ పాశం వేసి రావణుడిని బయటకి లాగింది. అప్పుడామె రావణుడిని పశువుని తీసుకెళ్ళినట్టు దక్షిణ దిక్కుకి తీసుకువెళ్ళింది. ఆవిడ వెనకాల చప్పట్లు కొడుతూ, నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకాల కుంభకర్ణుడు, ఇంద్రజిత్ మొదలైనవారు ఒంటె, మొసలి మొదలైన వాహనములను ఎక్కి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయారు.

ఒక్క విభీషణుడు మాత్రం నాలుగు దంతములు ఉన్న ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు. నలుగురు మంత్రులచేత సేవింపబడుతున్నాడు. ఎక్కడినుంచో ఒక మహావానరము వచ్చి లంకా పట్టణంలోని ఇళ్ళన్నిటినీ అగ్నికి బలిచేసింది. ఎక్కడ చూసినా 'ఓ తల్లి!, ఓ అక్క!, ఓ తండ్రి!, ఓ చెల్లి!’ అనే కేకలు వినపడ్డాయి, లంకంతా బూడిదయిపోయింది.


నేను అటువంటి కలని చూశాను. ఈ సీతమ్మకి సమీప భవిష్యత్తులో గొప్ప శుభం ఉన్నది. అదుగో నిష్కారణంగా సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది, కట్టుకున్న పట్టు పుట్టం తనంతట కొంచెం కిందకి జారింది. ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని కూస్తోంది, పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్న స్త్రీ తొందరలోనే భర్తు సమాగమాన్ని పొందుతుంది. సీతమ్మ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది కాని ప్రస్ఫుటంగా శుభశకునములు ఆవిడ శరీరమునందు కనపడుతున్నాయి. ఈమె సాక్షాత్తు 

శ్రీ మహాలక్ష్మి. మీరు బతకాలి అనుకుంటె, ఇన్నాళ్ళు చేసిన దోషాలు పోవాలనుకుంటె, మీ మీదకి రామ బాణాలు పడకుండా ఉండాలంటె ఒక్కసారి వచ్చి ఆ తల్లి ముందు ప్రణిపాతం చెయ్యండి. ఆమె మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది” అని త్రిజట చెప్పింది. ఆ త్రిజట కల విన్న రాక్షసులు శాంతించారు.```


         *రేపు…73వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

బుధవారం🪷* *🌷18, జూన్ , 2025🌷*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🪷బుధవారం🪷*

 *🌷18, జూన్ , 2025🌷*       

    *దృగ్గణిత పంచాంగం*   


   *స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠ మాసం - కృష్ణ పక్షం*

*తిథి  : సప్తమి* మ 01.34 వరకు ఉపరి *అష్టమి*

*వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే )

*నక్షత్రం   : పూర్వాభాద్ర* రా 12.33 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*

*యోగం : ప్రీతి* ఉ 07.40 వరకు ఉపరి *ఆయుష్మాన్* 

*కరణం   : బవ* మ 01.34 *బాలువ* రా 12.48 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు* 

         *ఉ 09.00 - 10.30 సా 04.30 - 05.30*

అమృత కాలం  : *సా 04.36 - 06.09*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం          : ఉ 07.15 - 08.48*

*దుర్ముహూర్తం  : ప 11.42 - 12.35*

*రాహు కాలం    : మ 12.09 - 01.47*

గుళికకాళం       : *ఉ 10.30 - 12.09*

యమగండం     : *ఉ 07.14 - 08.52*

సూర్యరాశి : *మిధునం*   

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 05.42* 

సూర్యాస్తమయం :*సా 06.52*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం          :  *ఉ 05.35 - 08.13*

సంగవ కాలం         :      *08.13 - 10.50*

మధ్యాహ్న కాలం    :     *10.50 - 01.27*

అపరాహ్న కాలం    : *మ 01.27 - 04.045*

*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ బహుళ అష్టమి*

సాయంకాలం        :  *సా 04.05 - 06.42*

ప్రదోష కాలం         :  *సా 06.42 - 08.52*

రాత్రి కాలం           :*రా 08.52 - 11.47*

నిశీధి కాలం          :*రా 11.47 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.52*

____________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*"ఓం సరస్వత్యై నమః" అనేది సంస్కృత మంత్రం, దీని అర్థం "సరస్వతి దేవికి నమస్కారం" లేదా "సరస్వతి దేవికి నా వందనం"* 

ఈ మంత్రం హిందూ మతంలో జ్ఞానం, విద్య, సంగీతం మరియు కళలకు అధిదేవత అయిన సరస్వతి దేవిని పూజించడానికి ఉపయోగిస్తారు. 

*"ఓం సరస్వత్యై నమః" మంత్రం యొక్క అర్థం:*

*ఓం:*

ఇది ఒక పవిత్రమైన శబ్దం, విశ్వం యొక్క మూలధ్వనిగా పరిగణించబడుతుంది.

*సరస్వత్యై:*

ఇది సరస్వతి అనే స్త్రీలింగ రూపం యొక్క సంబోధన రూపం.

*నమః:*

దీని అర్థం "నమస్కారం" లేదా "వందనం".

కాబట్టి, "ఓం సరస్వత్యై నమః" అంటే "ఓం, సరస్వతి దేవికి వందనం" అని అర్థం. 

ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా, సరస్వతి దేవి యొక్క ఆశీస్సులు కోరుకుంటారు, ముఖ్యంగా విద్యార్థులు చదువులో రాణించడానికి, జ్ఞానం పొందడానికి మరియు సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ఈ మంత్రాన్ని జపిస్తారు. 


*🌷ఓం సరస్వత్యై నమః🌷*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

కీళ్ళలో, మక్కల్లో, వెన్ను పూసలలో

 మక్క నొప్పి గాని మడమలో నొప్పైన

నడుము మెడను యరిగి నరము నొప్పి

సరిగ జేయు యోగ సరియౌను హోమ్యోతొ

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: కీళ్ళలో, మక్కల్లో, వెన్ను పూసలలో, మడమల్లో రక్త ప్రసరణ తగ్గి, తగిన పోషక పదార్థాలు అందకపోవడం వలన అక్కడి మృదులాస్థి క్షీణించి, రెండు ఎముకల సందుల్లో ఉండే కండరాలు, నాడులు, రక్తనాళాలు, రుబ్బురోలులో పడి నలిగి పోయినట్లు నలిగిపోతూ,తీవ్రమైన నొప్పి కలుగుతుంది! అలాగే గౌట్ వలన, యూరిక్ ఆసిడ్ పెరగటం వలన, ఆక్సిడెంట్లు, శ్రమ వలన కూడా కీళ్ళు, నడుము, మెడ, మడమ నొప్పులు వచ్చినా, పెయిన్ కిల్లర్, ఏంటీబయోటిక్, కాల్షియం, స్టెరాయిడ్లు వాడుకుంటూ సమస్యను ముదరబెట్టుకోవడం మానేసి, యోగా, హోమియోల ద్వారా సవ్యంగా నయం చేసుకుని, పది కాలాలు మీ కాళ్ళపై మీరు సుఖంగా నడవండి! ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఇంగ్లీషు వైద్యం వెంట పరుగెత్తి, చివరకు కీళ్ళ మార్పిడి ఆపరేషన్లతో జీవితాన్ని చంకనాకించుకోవద్దు! 


సకురు అప్పారావూ ఇది తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

Panchaag


 

భండనభీముడు

 భండనభీముడు!!

           


భండనభీముఁడార్తజనబాంధవు డుజ్జ్వలబాణ తూణ కో

దండకళాప్రచండ

భుజతాండవకీర్తికి రామమూర్తికిన్ 

రెండవసాటిదైవమికలేడనుచున్ గడకట్టి భేరికా

డాండ డడాండ డాండ నినదండమజాండమునిండ మత్తవే

దండమునెక్కి సాటెదను దాశరధీ!కరుణా పయోనిధీ!

-దాశరధి శతకం-కంచెర్లగోపన్న.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🚩మంగళవారం 17 జూన్ 2025🚩*

``

          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది…

``

     *వాల్మీకి రామాయణం*                 

             *71వ భాగం*

```

అప్పుడు అక్కడున్న వికృత రూపములు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి “సీతా! దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటే సామాన్యుడు కాదు, బ్రహ్మ కుమారులలో నాలుగో ప్రజాపతి అయిన పులస్త్యబ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు రావణబ్రహ్మ. సాక్షాత్తు బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు, బ్రహ్మగారిని గూర్చి తపస్సు చేశాడు, ఎన్నో గొప్ప వరములను పొందాడు. అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఏమిటి ఈ మూర్ఖత్వం. పోనిలే మెల్లగా మనస్సు మార్చుకుంటావు అని ఇంతకాలం చూశాము,కాని మనస్సు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి, ఎంత చెప్పాలి నీకు” అని గద్దించారు.


అప్పుడు సీతమ్మ అనింది…  

“ఐశ్వర్యం ఉంటే భర్తగా చూడడం, రాజ్యం ఉంటే భర్తగా చూడడం, ఒంట్లో ఓపిక ఉంటే భర్తగా చూడడం నాకు తెలియదు. ఆయన దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు, కాని నా భర్త నాకు గురువు, సమస్తం. సూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో, వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో, శచీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, లోపాముద్ర అగస్త్యుడిని ఎలా అనుగమిస్తుందో, సుకన్య చ్యవన మహర్షిని ఎలా అనుగమిస్తుందో, సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో, శ్రీమతి కపిలుడిని ఎలా అనుగమిస్తుందో నేను కూడా అలా రాముడిని అనువర్తిస్తాను. మీరు నన్ను చంపి, నా శరీరాన్ని ముక్కలు చేసి తినెయ్యండి, నేను మాత్రం రాముడిని తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను. రావణుడిని నా ఎడమ కాలితో కూడా ముట్టుకోను. మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు, నేను వినకూడదు” అన్నది.


అప్పుడు హరిజట అనే రాక్షస స్త్రీ లేచి… “ఈమెని రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటినుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతోంది. ఈమెని ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను” అన్నది.


ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ లేచి అన్నది… “నేను బయట పడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను. కాని హరిజట బయటపడింది కాబట్టి చెప్తున్నాను, ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకుని తినకుండా ఎలా నిగ్రహించుకొని ఉంటాడో, అలా నేను కూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకొని తినకుండా నిగ్రహించుకొని ఉన్నాను. ప్రభువు ఎలాగూ అనుమతి ఇచ్చాడు కదా ఈమెని దండించమని, కాబట్టి ఈమె పీక పిసికేసి తినేద్దాము. ఈమె హృదయమునకు కిందన ఉండే భాగము, గుండె, మెదడు నాది అన్నది.


అప్పుడు మిగతా రాక్షస స్త్రీలు, నావి కాళ్ళు, నావి తొడలు, నావి చేతులు అని వాటాలు వేసుకున్నారు.


తరువాత అజముఖి అనే స్త్రీ… “ఈమెని అందరమూ సరిసమానంగా వాటాలు వేసుకుందాము. తొందరగా కల్లు తీసుకురండి. ఈమెని తింటూ, కల్లు తాగుతూ, నికుంబిలా నాట్యం చేద్దాము” అంది.


అప్పుడు సీతమ్మ ఏడుస్తూ… “ఇక్కడ మరణిద్దామన్నా కూడా నాకు స్వేచ్ఛ లేదు” అని అనుకొని, ఆ రాక్షస స్త్రీలని చూసి భయపడుతూ కూర్చున్న చోట నుంచి లేచి శింశుపా వృక్షం మొదటికి వెళ్ళి కూర్చుంది.```


       *రేపు… 72వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - కృష్ణ పక్షం -‌ సప్తమి - పూర్వాభాద్ర -‌‌ సౌమ్య వాసరే* (18.06.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

దాగి ఉన్న దోషాలను

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝  *నిషేకం విపరీతం సః* 

 *ఆచష్టే వృత్తచేష్టయాl*

            *మయూర ఇవ కౌపీనం* 

*నృత్యం సందర్శయన్నివll*


                *_మహాభారతం - శాంతి పర్వమ్_*


*తా𝕝𝕝 నెమలి పురివిప్పి నాట్యం చేసే సమయంలో కౌపీనాన్ని కూడా చూపించినట్లుగా మూర్ఖుడు తన చెడ్డపనుల ద్వారా తనలో దాగి ఉన్న దోషాలను కూడా ప్రకటిస్తాడు.*


 ✍️🌸🌹💐🙏

భూలోకపు సంతోషాలను

 *2047*

*కం*

మేదిని ముదమిడు జనకుల

ఖేదంబగు ముదిమి యందు క్షేమకరముగన్

మోదముకూర్చెడి తనయులె

యాదరమగు  పుత్రులయ్యు నవనిన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! భూలోకపు సంతోషాలను మనకు అందించిన తల్లిదండ్రులకు బాధాకరమైన వార్థక్యంలో క్షేమకరంగా సంతోషాలను సమకూర్చువారే గౌరవప్రథమైన పుత్రులనబడుదురు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*