15, అక్టోబర్ 2025, బుధవారం

శరత్తులో జగత్తు*

 *శరత్తులో జగత్తు*


ఉ॥

వెండిని రంగరించి వరిపిండిని పర్వినయట్లు తోచగా 

కొండల మంచుతోడ సమకూరిన సౌరుల భూతల 

మ్ముండగ చంద్రు డంత ధవళోన్నతచంద్రిక నుల్లసిల్లగా 

నిండెను చిత్తజాతుసుమనృత్యరవంపుశరత్తు నందమై 


ఉ॥

చంద్రికలందమై మెఱయ సారెకు సారెకు కన్నుకుట్టి తా 

సాంద్రపయోధరాళిని ప్రశంసల ముంచుచు క్ష్మాకు నంపగా 

నింద్రుడు మేఘమాలికలు నింతలుగా ౘదలంత క్రమ్మగా 

చంద్రుడు మూగవోయెనట శారదరాత్రుల ఖిన్నుడైసనెన్ 


కం॥

వెన్నెల నిండెడి వేళల 

మిన్నగ వానలు వరించె మేదినినెల్లన్ 

క్రొన్నెలతాల్పుని యందము 

తిన్నగ చూడమి జనులును దీనతనందెన్ 

*~శ్రీశర్మద*

మోక్షప్రాప్తి

 

 

శ్రీ  ఆదిశంకరుల గ్రంధాలు అన్నిటిలోనూ 'వివేక చూడామణి' ప్రత్యేక స్థానాన్ని అలంకరించింది
ఆత్మ జ్ఞాన విషయం ఇంతకంటే సులభరీతిన మరే గ్రంధం లోనూ చెప్పబడలేదేమోనని పెద్దల అభిప్రాయం. 580 శ్లోకాలతో ఉన్న గ్రంధం వేదాంత విజ్ఞాన ఆకాశంలో ప్రకాశిస్తున్న ధ్రువ తార.
ఇందులో ఎన్నో విషయాలు ప్రతిపాదింప బడ్డాయి. మనం రోజు బ్రహ్మోపాసనకు సోపానమైన 'సాధనాచతుష్టయం' గురించి తెలుసుకుందాం.

బ్రహ్మోపాసనకు నాలుగు సాధనాలు చెప్పబడినవి. సాధన చతుష్టయం బాగా అభ్యసించినవాడే బ్రహ్మ విద్యకు అధికారి. అవి ఏమిటో చూద్దాం.

1.
వివేకం
2.
వైరాగ్యం
3.
షట్సంపత్తి
4.
ముముక్షత్వం 
వివరణ
వివేకమనగా నిత్య అనిత్య వస్తు నిర్ణయం. బ్రహ్మమే సత్యమని, జగత్తు మిధ్య అని ధృడ విశ్వాసం కలిగి ఉండటమే వివేకం
ఇంద్రియాల ద్వారా అనుభవించదగిన సమస్త భోగ వస్తువులు అశాశ్వతాలు అని ఎరిగి వాటి మీద కోరిక లేకపోవటమే వైరాగ్యం
ఇక షట్సంపత్తి అనగా ఆరు సంపదలు. అవి ఏమిటో చూద్దాం;
-
శమం
-
దమం (ఉపరతి)
-
తితీక్ష
-
శ్రద్ధ
-
సమాధానం 
-
ముముక్షత
ఇక వీటి వివరణ చూద్దాం:
అసంఖ్యాకమైన ఇంద్రియ విషయాలలోని దోషాలను ఎరిగి వాటినుండి మనసు మరల్చి, గమ్యమైన ఆత్మ సాక్షాత్కారం పై స్థిరంగా లగ్నం చెయ్యటాన్ని శమం అంటారు
జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను నిగ్రహించి పరబ్రహ్మం మీద ద్రుష్టి ఉంచడాన్ని దమం అంటారు. బాహ్య ఆకర్షణలకు లొంగక మనస్సు ను అంతర్ముఖం చెయ్యడాని ఉపరతి అంటారు
శీతోష్ణాలు, ఆకలి దప్పికలు మొదలైన ఈతి బాధలను ఓర్చుకుంటూ, ఇతురులు చేసే అపకారాలను క్షమించి వాటి వలన బాధపడకుండా ఉండటాన్ని తితీక్ష అంటారు.
శాస్త్ర వాక్యాలలోనూ , గురు వాక్యాలలోనూ పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండటం శ్రద్ధ అంటారు
ఏకాగ్రతతో బుద్ధిని పరబ్రహ్మం నందు నిలపడాన్ని సమాధానం అంటారు
అజ్ఞానం వలన కలిగే దేహభావం, అహంకారం - వీటివలన కలిగే ఇతర బంధాలను తెంచుకుని సస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మ సాక్షాత్కారం ద్వారా ముక్తిని పొందాలనే తపన ను 'ముముక్షుత'  అంటారు

ఆది శంకరాచార్యుల వారు

వివేక చూడామణిలో

సాధనా చతుష్టయంగురించి ప్రస్తుతించారు

సాధనలో నాలుగు అంశాలు వున్నాయి

1. వివేకం 2. వైరాగ్యం 3. షడ్ సంపత్తి 4. ముముక్షుత్వం

 

నిత్యానిత్య వస్తు విచక్షణా జ్ఞానమేవివేకం”,

ఇహ, ఆముత్ర కర్మ ఫల భోగ అనాసక్తేవైరాగ్యం

మోక్షప్రాప్తి కోరే తీవ్రసాధకుడి గుణగణాలేషడ్ సంపత్తి

షడ్ + సంపత్తి = ఆరు సంపత్తులు

అవి దమము, సమము, తితీక్ష ఉపరతి, శ్రద్ధ, సమాధానాలు

బహిరేంద్రియ నిగ్రహం అన్నదేదమం

అంతరేంద్రియ నిగ్రహం అన్నదేసమం

బాధలను నోర్చుకునే గుణమేతితీక్ష

కామంనుంచి కొంత, సందర్భానుసారంగా, వైదొలగడమేఉపరతి

త్రికరణశుద్ధి + దీక్ష = “శ్రద్ధ

ద్వంద్వాలలో సమంగా చలించకుండా వుండడమేసమాధానం

ముక్తిని సదా, తీవ్రంగా, కోరుకోవటమేముముక్షుత్వం

* ఒకానొక సాధకుడికి వివేకం, వైరాగ్యం, షడ్ సంపత్తి, ముముక్షుత్వం అనే నాలుగు

లక్షణాలు ఉన్నప్పుడే మోక్షప్రాప్తి అవుతుంది” ..అన్నదే ఆదిశంకరాచార్యుల బోధ

సీతాఫలం చెట్టు

 సీతాఫలం చెట్టు ఉపయోగాలు - 


 *  మంచిగా పండిన సీతాఫలం తీసుకోవడం వలన రక్తం వృద్ది చెందును 


 * శరీరం నందు మాంస శాతాన్ని పెంచును. బక్కపలచగా ఉండువారు ఈ పండు తీసుకోవడం వలన మంచి కండ పొందగలరు. 


 * శరీరం నందు వేడిని హరించును . 


 * సీతాఫలం చెట్టు యెక్క ఆకు రసం 3 నుంచి 4 చుక్కలు దంత రంధ్రములో వేసిన క్రిములు ఊడిపడును. 

 

* ఈ చెట్టు ఆకురసం పుండ్లపై పూసి పిమ్మట ఆ ఆకును ముద్దగా నూరి పుండ్లపైన వేసి కట్టు కట్టిన పుండ్లు మానును . 

 

* ఈ పసరు పుండ్లపై పూయుట వలన పురుగులు పట్టిన పుండ్లు లలో పురుగులు చచ్చిపోయి పుండ్లు శీఘ్రంగా మానును . 

            

      ఈ యోగాన్ని పశువుల పుండ్లుపై నేను ప్రయొగించాను . చాలా మంచిఫలితాలు వచ్చాయి . రసాన్ని పుండుపై పిండి ఆకువేసి కట్టాను . 

 

* దీని గింజలు రుబ్బి తలకు పట్టించిన పేలు పోవును . 

 

* శీతాఫలం చెట్టు యొక్క లేత ఆకుల కషాయం ఇచ్చునచో చిన్న పిల్లల లో పేగు మలద్వారం నుంచి బయటకి వచ్చు సమస్య తీరిపోవును .

 

* శీతాఫలం చెట్టు కాండం పైన ఉన్న చెక్క కషాయం ఇచ్చినచో జ్వరం , ఉబ్బసం ద్వారా వచ్చే దగ్గు మానును 


 * శీతాఫలం తీసుకోవడం వలన గుండెకు అద్బుత బలం చేకూర్చును . 

 

* శీతాఫలం యొక్క పండు గుజ్జు గడ్డలపైన వేసి కట్టినచో గడ్డలు పగులును .


*  దీనిఆకు పసరు గజ్జి , తామర నయం చేయును . 


* దీని విత్తనాల పొడిని పేపర్లో కొంచం కట్టి బట్టల మధ్యలో పెడితే బట్టలకు పురుగుల సమస్య ఉండదు.

 శీతాఫలం ఎక్కువ తీసుకోవడం వలన కలుగు దోషాలు  - 


 * శరీరంలో శ్లేష్మము పెంచును. 


 * కొద్దిగా పైత్యం చేయును . 


 * జీర్ణక్రియ సరిగ్గా లేనివారికి జ్వరం తెచ్చును 


 * అతిమూత్ర వ్యాధి కలిగినవారు దీనిని వాడరాదు. 


 * గర్భిణి స్త్రీలు దీనిని అసలు తినరాదు. దీనికి గర్భస్రావం కలిగించే గుణము కలదు . 



             మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .  

గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

Panchaag