10, ఫిబ్రవరి 2025, సోమవారం

Panchaag


 

అష్టోత్తర శతనామావళి- భావం*

 *లలితా అష్టోత్తర శతనామావళి- భావం* 


 *(పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు )* 


 ⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️


 *Part - 14* 


 *౪౨.* *సనకాదిసమారాధ్యపాదుకాయై నమో నమః! –* 


సనకాదులచేత పూజింపబడుతున్న దివ్యపాదుకలు గల తల్లి. శుభాగమ పంచకం ద్వారా ఆరాధింపబడే తల్లి. 


ఇక్కడి నుంచి వరుసగా మూడు నామములు అమ్మవారి ఉపాసకుల గురించి తెలియజేస్తున్నాయి. అమ్మవారి పాదుకలను సనకసనందాదులు సంపూర్ణంగా, సమగ్రంగా, సంతోషంగా ఆరాధన చేస్తూ ఉంటారు. పుట్టుకతోనే బహ్మవేత్తలైనటువంటి వారు వాళ్ళు. నారాయణుని అంశావతారం అని చెప్తున్నది భాగవతం. అటువంటి సనకసనందాదులు నిరంతరం ఆరాధించే పాదుకలు అమ్మవారివి. 


శ్రీవిద్యలో పాదుకా దీక్ష అని ఒకటి ఉంది. అది పరిపూర్ణమైన దీక్ష. ఆ పాదుకలు బ్రహ్మజ్ఞానానికి సంకేతం. సమస్త విశ్వానికీ మూలమైన పరబ్రహ్మ, పరబ్రహ్మయొక్క శక్తిని తెలియజేస్తున్నది. పరబ్రహ్మము తప్ప అన్యము లేదు ఈ జగత్తులో. అన్యంగా జగత్తు కనబడడం కేవలం మిథ్య మాత్రమే. పరమాత్మ తత్త్వమే ఉన్నది అనే స్థితియే నిజమైన పాదుకాదీక్ష. ఆ స్థితి బ్రహ్మవేత్తలకి ఉంటుంది. అటువంటి వారు పరతత్త్వ స్వరూపిణియైన అమ్మవారి యొక్క భావనలోనే నిరంతరం ఉంటారు అదే సమారాధన అంటే అర్థం. సమారాధన అంటే కేవలం బాహ్యపూజ మాత్రమే కాదు. నిరంతరం మనస్సు అనుసంధానింపబడడమే సమారాధన. 


అమ్మవారి ఉపాసనా సంప్రదాయంలో శుభాగమ పంచకము అని వైదికమైన సంప్రదాయంతో కూడిన తాత్త్వికమైన ఉపాసనా విధానాలున్నాయి. అవి సనక, సనంద, వశిష్ఠ, శుక, ఆదిగురువైన దక్షిణామూర్తి ఇత్యాదులు.. వీరినుంచి వచ్చినటువంటి వచ్చిన ఆచారాన్ని సమయాచారం, దక్షిణాచారం అంటారు. ఇవి శుభాగమములు అని చెప్పబడుతున్నాయి. ఇవి సనక మొదలైన వారి చేత ఏర్పడ్డాయి గనుక శుభాగమ పంచకం ద్వారా ఆరాధింపబడే తల్లి.


అమ్మవారి పాదుకాధ్యానం జరిగే చోటు సహస్రార కమలం. అమ్మవారి పాదచిహ్నములు భాసిస్తున్న చోటు సహస్రారం. పాదుకా స్మరణ చేసేటప్పుడు -


“వందే గురుపదద్వంద్వం అవాఙ్మానస గోచరం!  

రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహత్‌!!  - 


త్రిపుర యొక్క కాంతి సమూహము పాదములుగా భాసిస్తున్నది. ఆ పాదముల వద్దకు చేరుకోవడమే పాదుకాదీక్ష. సహస్రార కమలం వద్దకు చేరుకొని అక్కడ శివశక్తుల ఏకత్వాన్ని గ్రహించగలిగితే అది పాదుకాదీక్ష. అది సనకసనందాదులు బ్రహ్మానుభవం ద్వారా పొంది ఉన్నారు గనుక ‘సనకాదిసమారాధ్యపాదుకాయై నమోనమః’. 


 *౪౩.* *దేవర్షిభిస్స్తూయమానవైభవాయై నమో నమః! –* 


౧. మనలో ఉన్న ఆలోచనలు ఋషులు, ఇంద్రియశక్తులు దేవతలు. ఇంద్రియములతో అమ్మవారిని స్తుతిస్తూ, అర్చిస్తూ ఆలోచనలో అమ్మవారిని భావిస్తూ, ధ్యానిస్తూ, స్మరిస్తూ ఉంటే అదే ‘దేవర్షిభిస్స్తూయమానాత్మవైభవా’. 


౨. దేవతలు, ఋషులచేత స్తుతింపబడుతున్న తల్లి. 


అమ్మవారి వైభవాన్ని దేవతలు, ఋషులు స్తుతిస్తున్నారు. వైభవం – గొప్ప భావం, విశేషమైన భూతి, విభుత్వము అదే వైభవము. భూతి అనగా ఐశ్వర్యం. అమ్మవారి ఐశ్వర్యము, గుణము, లీల, మహిమ, తత్త్వము – ఇవన్నీ వైభవాలే. ఎక్కడా లేనంత సొగసు, గొప్పతనము, శోభ అమ్మవారి రూపనామగుణలీలాతత్త్వాలలో ఉన్నాయి. ఈ అయిదింటినీ కలిపి వైభవం అనాలి. అలా అమ్మవారి  రూపనామగుణలీలాతత్త్వమహిమా వైభవాలను నిరంతరం గానం చేసేవారు ఋషులు. వారిచేత నిరంతరం గానం చేయబడు తల్లి. 


ఎందుకంటే గొప్పతనాన్ని గొప్పవారే గుర్తించగలరు. మానవ ప్రజ్ఞకి అమ్మవారి వైభవం అందదు. అమ్మవారి వైభవాన్ని కీర్తించాలి అంటే రెండు రకాల ప్రజ్ఞ ఉండాలి. ఆ ప్రజ్ఞాస్థాయికి చేరిన వాళ్ళే అమ్మవారిని కీర్తించగలరు. తర్కవితర్కాలతో కూడిన మానవప్రజ్ఞ అమ్మవారి వైభవాన్ని గుర్తించలేదు, కీర్తించలేదు. తర్కవితర్కాలకు అతీతమైన దేవతా ప్రజ్ఞ, ఋషి ప్రజ్ఞ ఉండాలి. దివ్యమైన ప్రజ్ఞ దేవతా ప్రజ్ఞ, అలౌకికమైనది. అతీంద్రియమైన దర్శనశక్తి కలవాడు ఋషి. అతీంద్రియమైన జీవనము, ఉపాధి కలవారు దేవతలు. అలాంటి దేవతలు, ఋషుల చేత మాత్రమే గానం చేయబడగలిగినటువంటి వైభవం అమ్మవారిది. 


మన శరీరంలో ఇంద్రియశక్తులను దేవతలు అంటారు. కంటికి సూర్యుడు, చేతికి ఇంద్రుడు, చెవులకి దిగ్దేవతలు, నాసికకి వాయువు,  పాదములకు విష్ణువు – ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. ఋషులు అనగా ఆలోచనాపరులు. తపస్సంపన్నులు. మనలో ఉన్న ఆలోచనలు ఋషులు, ఇంద్రియశక్తులు దేవతలు. ఈ ఇంద్రియములతో అమ్మవారిని స్తుతిస్తూ, అర్చిస్తూ ఆలోచనలో అమ్మవారిని భావిస్తూ, ధ్యానిస్తూ, స్మరిస్తూ ఉంటే అదే ‘దేవర్షిభిస్స్తూయమానాత్మవైభవా’. ఇలాంటి మాటే ‘దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా’ అని సహస్రనామాలలో ఉంది.


 *శ్రీమాత్రే నమః* 🙏🏻


⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

సభ్యత - సంస్కారాలు

 కుటుంబంలోని సభ్యత - సంస్కారాలు


ప్రతి ఆలోచనా పరుని యొక్క దృష్టి, ధ్యాస కుటుంబ నిర్మాణం వైపు ఆకర్షింపబడటం అవసరం. దీని ఉపయోగం ఎంతో ఉంది. వ్యక్తిత్వ వికాసం పొందినవాడే తన కుటుంబ శ్రేయస్సు గురించి కన్న కలలను సాకారం చేసుకోగలుగు తాడు. ఈ వికాస క్రమాన్ని కుటుంబ పాఠశాలలో మాత్రమే అధ్యయనం చేయడం జరుగుతుంది. అర్ధం చేసుకోవడానికి ప్రయోగశాల కూడా కుటుంబమే. కుటుంబంలోని సుసంస్కా రాల సంపద కుబేరుని సంపద కంటే ఎన్నో రెట్లు విలువైనది. అనేక రకాల నిర్మాణాలు ఉన్నాయి - సొంత ఇల్లు కట్టుకోవడం, కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకోవడం, నగర నిర్మాణం, ధర్మ శాలలు, పాఠశాలలు మున్నగునవి. తెలివైనవాడు, సమర్థుడు ఇటువంటి పనులను ఆనందంతో పూర్తి చేస్తాడు.


సాహిత్యకారులు, శాస్త్రవేత్తలు, కళాకారులు ఇంకా ఎన్నో సాధించిన వాళ్ళు ఉంటారు. చివరకు వాళ్లు అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోతారు. మరణించిన తరువాత కూడా వారు ప్రజల మనస్సుల్లో గుర్తుండిపోతారు. ఇటువంటి విజయాలు అసాధారణమైన ప్రతిభ మరియు నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కోరిక ఉన్నంత మాత్రాన, ప్రతివాడు ఇటువంటి విజయాన్ని పొందలేడు. కుటుంబ నిర్మాణం వీటన్నిటికంటే ఎంతో మహత్వపూర్ణమైనది మరియు సరళమైనది కూడా. కుటుంబ శ్రేయస్సు కొరకు పాటుపడిన వ్యక్తి గురించి వార్తా పత్రికల్లో ప్రచురించకపోవచ్చు. కానీ పోలిస్తే నిజానికా పని అసాధారణమైనది మరియు సాటి లేనిది.


సంత్ వినోబా తల్లి గారి కుటుంబ సంరచన ఏ స్థాయిలో ఉందంటే, దాని ఫలితంగా మానవాళికి గొప్ప విజయాలను సాధించే అవకాశం లభించింది. శివాజీ, నెపోలియన్ మొదలగు ఎంతోమంది మహామనీషులు తమ తల్లుల ద్వారానే


సార్థకులైనారు. కౌసల్య, కుంతీ, మదాలస, శకుంతల, సీత మొదలైన వారు జన్మనివ్వటమే కాక వ్యక్తిత్వ నిర్మాణం కూడా చేశారు. గురు గోవిందసింగ్ వంటి ఎందరో యుగపురుషుల కథలు చరిత్రలు వింటే వారి కుటుంబం యొక్క ఉన్నత లక్షణాల ప్రభావం కూడా మనకి తెలుస్తుంది. కుటుంబ పరిస్థితులే భగత్సింగ్కి స్ఫూర్తిని అందించాయి. ప్రపంచ చరిత్రలో ఈరోజు వరకు కూడా, ఇటువంటి అనేక సంఘటన లను మనము చూస్తూనే ఉన్నాము. కుటుంబ సంరచనా ప్రయత్నశీలులందరూ గొప్ప సృజన కారుల వలె ప్రపంచం యొక్క గొప్ప సేవా సాధనా సంపన్నులైనారు.


కుటుంబ నిర్మాణం ఒక ప్రత్యేక స్థాయి సాధన. దీనికి యోగి వలె ప్రజ్ఞను, తపస్వి వలే ప్రతిభను కలిగి ఉండాలి. కళాకారుడు తనను తాను సాధించుకుంటాడు. కానీ కుటుంబ నిర్మాత విభిన్న స్వభావాలు మరియు స్థితులు గల సభ్యులందరి వ్యక్తిత్వ నిర్మాణం చేయాలి. ఈ పని ఎంతో ఆత్మీయత, సరైన దూరదృష్టి మరియు సమర్థవంతమైన సంసిద్ధతతో మాత్రమే సంభవము. ఇందు కొరకు భూమాతలా ఓర్పును, పర్వతంలా ధైర్యాన్ని, సూర్యునిలా తీక్షణతను కలిగి ఉండాలి. లేకపోతే గొప్ప సుఖసౌకర్యములను సమకూర్చి, అవసరాలను తీర్చినప్పటికి కూడా, కుటుంబం విఫలమవుతుంది. కుసంస్కారవంతులుగా తయారై, తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే స్థితిలో ఉంటారు. కుటుంబ నిర్మాణం కోసం తాను చేసిన సేవలకు, ఎన్నో రెట్ల అధిక లాభాన్ని వ్యక్తి ఆత్మ నిర్మాణ రూపంలో పొందుతాడు. ఇలా ప్రత్యక్ష లాభాలు రెండు. మూడవది పరోక్షము, సంస్కారిత కుటుంబాలను అందించటం ద్వారా ప్రపంచానికి, సమాజానికి సుఖకరమైన పురోభివృద్ధికి ఎంతో తోడ్పడిన వాళ్ళవుతారు.


Yug shakti Gayatri 2025 Feb 

https://chat.whatsapp.com/J8tGzFrz7zj2gq587yTnZM

*శ్రీ మల్లికార్జున ప్రపత్తి*_

 _*శ్రీ మల్లికార్జున ప్రపత్తి*_

⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️


_*కైలాసవాస కమలోద్భవనారదాది*_

_*మౌనీంద్రసంస్తుత మహోత్తమ దివ్యతేజ:*_

_*పాపాద్రిభేదనపవే పరమోపకారిన్*_

_*శ్రీ మల్లినాథ పరిపాలయ మామనాథం*_


_*భావము :*_ 🔱 


💐 కైలాసవాసా! బ్రహ్మ,నారదుడు మొదలైన మనీంద్రులచే స్తుతింపబడువాడా! ఉత్కృష్టమును, దివ్యమునైన తేజస్సు కలవాడా! పాపములనెడి పర్వతములను భేదించుట యందు వజ్రాయుధము వంటి వాడా! మిక్కలి ఉపకారము చేయువాడా! శ్రీమల్లికార్జున స్వామీ! అనాధుడనైన నన్ను పాలింపుము.


_*భూరిప్రపంచ పరిపాలన చిత్తవృత్తే*_

_*గౌరీ ముఖాంబుజ మనోహర సప్తసప్తే*_

_*దారిద్య్రదు:ఖ విపినోత్కట వీతిహోత్రా*_

_*శ్రీ మల్లినాథ పరిపాలయ మామనాథం*_


_*భావము :*_ 🔱


💐 విస్తారమైన ప్రపంచమును పరిపాలించు మన:ప్రవృత్తి కలవాడా! పార్వతీ దేవి యొక్క ముఖారవిందమునకు సుందరుడైన సూర్యుడా! దారిద్య్ర, దు:ఖమనెడి అడవికి గొప్ప అగ్నిహోత్రుడా! శ్రీమల్లికార్జున స్వామీ! అనాధుడనైన నన్ను పాలింపుము.


_*శ్రుత్వాత్వదీయచరితం భువనప్రసిద్ధం*_

_*వాణీముదంబునిధి మజ్జనమాతనోతి*_

_*సృష్ట్యాదిదేవ జగదీశ్వర దీనబంధో*_

_*శ్రీ మల్లినాథ పరిపాలయ మామనాథం*_


_*భావము :*_ 🔱  


💐 సృష్టికి ఆదిదేవుడా! జగత్ప్రభూ! దీనబంధూ! జగత్ప్రసిద్ధమైన నీ చరిత్రను విని సరస్వతీదేవి సంతోషమనెడి సముద్రము నందు ఓలలాడు చున్నది. శ్రీమల్లికార్జున స్వామీ! అనాధుడనైన నన్ను పాలింపుము.


_*జగతాం జనకం నమతాం సుఖదం*_

_*గిరి రాజసుతా ధవమీశమహం*_

_*నతపాప హరం జితమారశరం*_

_*ప్రణమామి హరం జగదేకసురం*_


_*భావము :*_ 🔱


💐 సర్వలోకములకు తండ్రియైన వాడును, నమస్కరించు వారికి సుఖము నిచ్చు వాడును, పార్వతీభర్తయు, భక్తుల పాపముల హరించు వాడును, జయింపబడిన మన్మథుని బాణములు కలవాడును, హరుడును, జగత్తునకేకైక దేవుడును అగు నీశ్వరునికి నమస్కారము చేయుచున్నాను.


_*గురుదేవ గణాధిప సాంబశివం*_

_*ద్విపదా నవఖండన చండభవం*_

_*జనతా మునితా వనబద్ధకరం*_

_*ప్రణమామి హరం జగదేకసురం*_


_*భావము :*_ 🔱


💐 గురుదేవుడును, గణాధిపుడును, అంబయైన పార్వతితో కూడిన వాడును, గజాసురుని సంహరించుట యందు భయంకరుడును, జనులను మునులను రక్షించుట యందు బద్ధహస్తుడును, జగత్తునకేకైక దేవుడునైన ఈశ్వరునికి నమస్కారము చేయుచున్నాను.


_*అఘనాశకరం గజచర్మధరం*_

_*ఫణిరాజవిరాజిత భవ్యతనుం*_

_*మధురాకృతి మందరచాపధరం*_

_*ప్రణమామి హరం జగదేకసురం*_


_*భావము :*_ 🔱


💐 పాపములను నాశనము చేయు వాడును, ఏనుగు చర్మమును ధరించిన వాడును, సర్పరాజులచే ప్రకాశించు ఉత్తమమైన శరీరము కలవాడును, మధురమైన ఆకారము కలవాడును, మందర పర్వతమును ధనుస్సుగా ధరించిన వాడును, జగత్తునేకైక దేవుడు నైన ఈశ్వరునికి నమస్కారము చేయుచున్నాను.


_*శివశంకరకింకర కల్పతరుం*_

_*భవబంధన భంజన మేరుఘనం*_

_*భువనత్రయరక్షణ భారవహం*_

_*ప్రణమామి హరం జగదేకసురం*_


_*భావము :*_ 🔱 


💐 సేవకులకు కల్పవృక్షము వంటివాడును, సంసార బంధములను భగ్నము చేయట యందు మేరువు వలె గొప్పవాడును, ముల్లోకములను రక్షించు భారమును వహించినవాడును, జగత్తునేకైక దేవుడునైన ఈశ్వరునికి నమస్కారము చేయుచున్నాను.


_*మహేశ్వరం మంజుల వాగ్విలాసం*_

_*గంగాధరం చంద్రకళావతంసం*_

_*గౌరీవరం శ్రీనిధిశైలవాసం*_

_*శ్రీమల్లినాధం శిరసానమామి*_


_*భావము :*_ 🔱


💐 మహేశ్వరుడును, మృదువైన వాగ్విలాసము కలవాడును, గంగను ధరించు వాడును, చంద్రకళ శిరోభూషణముగ కలవాడును, పార్వతీ భర్తయు, సంపదకు నిధియైన పర్వతము నివాసముగా కలవాడునైన శ్రీమల్లికార్జున స్వామికి శిరస్సుతో నమస్కరించుచున్నాను.


_*వినామల్లినాథం నదేవో నదేవ:*_

_*సదామల్లినాథం భజేహం భజేహం*_

_*కదామే పవర్గం ముదాయచ్ఛసిత్వం*_

_*నజానే నజానే గురోశ్రీగిరీశ*_


_*భావము :*_ 🔱


💐 మల్లికార్జున స్వామి తప్ప వేరే దేవుడు లేడు. మల్లికార్జున స్వామినే నేను పూజించెదను, భజించెదను. ఓ గురూ! శ్రీశైలాధీశ్వరా! నీవు నాకు సంతోషముతో మోక్షము నెప్పుడు ప్రసాదించెదవో ఎరుగను.


⚜️ _*హరహర మహాదేవ శంభో శంకర*_ 🔱


❀┉┅━❀🕉️❀┉┅━❀

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*

🚩 *హిందువునని గర్వించు*

🚩 *హిందువుగా జీవించు*


*సేకరణ:* ఆధ్యాత్మిక భక్తిప్రపంచం - ఈ సమూహంలో చేరడానికి *జైశ్రీరామ్* అని 7013672193 కి WhatsApp చేయండి.

⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️

హైదరాబాద్‌లోని ప్రాంతాలు*

 *హైదరాబాద్‌లోని ప్రాంతాలు*


ఆరో నిజాం కాలంలో అల్‌ బర్ట్ అబిద్ అనే యూదుడు ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా అబిడ్స్ గా మారిపోయింది.


గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ఖానాకాలక్రమేణా లంగర్‌ హౌజ్‌ మారింది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.


చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్‌ గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.


 ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు కార్వాన్ అని పిలుస్తున్నారు.కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.


 ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. క్రమంగా ఆ ఏరియా కవాడిగూడగా మారింది.


దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది.


ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగంకు ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది.


హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగం బజారుగా నిలిచిపోయింది.


ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది.

ఏడవ నిజామ్ పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతో హిమాయత్ నగర్ గా స్థిరపడింది.

మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో హైదర్ గూడ ఏర్పడింది.

గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా వద్ద పనిచేసే మాలిక్ యాకూబ్ ఇంటి పరిసరాలు ఆయన పేరుతో మలక్ పేట్ గా మారింది.


తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె.. నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది.


శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ నివసించేవాడు. ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు..కాలక్రమంలో అది శాలిబండగా మారింది.


నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను హబ్సిగూడ పిలుస్తున్నారు.


ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది.


చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది! బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో చిక్కడపల్లిగా మారిపోయింది.


అడిక్‌మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో అడిక్ మెట్ గా మారిపోయింది.


నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి నౌబత్

పహాడ్ అని పేరొచ్చింది.


గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో  పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను బాగ్‌లింగంపల్లి అంటున్నారు.


సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీరాలంమండి అనేవారు. ఇప్పటికీ మీరాలంమండి మార్కెట్ ఫేమస్!


నిజాం సైన్యంలో అరేబియన్‌ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు బార్కాస్అని పిలుస్తున్నారు.


 తాడబండ్ అసలు పేరు తాడ్- బన్! తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో తాడ్‌ బండ్‌గా మారిపోయింది.


ఇర్రంమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం ఎర్రమంజిల్‌ గా స్థిరపడింది.


ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్‌ గా వాడేవారు.


కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి కాచిగూడ అనే పేరొచ్చింది


మహ్మద్ ఖులీకుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన లాడ్‌ బజార్ లాడ్లీ అనే పేరుమీదనే స్థిరపడింది.


హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్ గా స్థిరపడిపోయింది.


ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒకచోట బస చేశాడు. ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్! ఇప్పుడక్కడ ఎల్బీ స్టేడియం నిర్మించారు.


పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడుబాగ్-ఏ-ఆమ్ అని పిలిచేవారు: బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్-ఏ-ఆమ్ అన్నారు. ఇంగ్లీష్‌లో పోష్‌గా పబ్లిక్ గార్డెన్స్ అని పిలుస్తున్నారు.


మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరొచ్చింది.


1887-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్  పేరు మీద ఆస్మాన్ గఢ్ ఏర్పడింది.


నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద ఉమ్దా బజార్ ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్గా ప్రసిద్ధిగాంచింది.


గౌలీ అంటే గొర్రెల కాపరి! వాళ్లంతా ఎక్కువగా ఉండేవాళ్లు కాబట్టి ఆ ప్రాంతం గౌలిగూడగా స్థిరపడిపోయింది.


రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం మౌలాలీ సమీపంలో ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో లాలాగూడగా మారింది. 


1933కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేచౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక, ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు.


రెండో అసఫ్ జాహీ తన కూతురు బషీర్- ఉల్- నిసా బేగంకు కట్నం కింద 1796లో కొంత జాగీర్ రాసిచ్చాడు. బేగంపేట ఏరియా ఆమె పేరుమీదనే స్థిరపడింది. 


1853లో నవాబ్ నసీరుద్దౌలా హయాంలో పండిట్ సోనాజీ అనే రెవెన్యూ ఉద్యోగి ఉండేవాడు. ఆయన ఇల్లు ఆ రాజప్రాసాదాన్ని తలపించేది! లాండ్ మార్కుగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని మొదట్లో సోనాజీగూడ అని పిలిచేవారు. తర్వాత సోమాజీగూడ అయింది.


రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో రికాబ్ గంజ్‌గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్! మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు.


రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.


నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ డబిర్ పురాలో ఉండేవి! డబీర్ అంటే పండితుడు అని అర్ధం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.


అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది అంబర్‌ పేటగా స్థిరపడిపోయింది.


చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణగుట్టగా మారిపోయింది.


చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి చిలకలగూడకు ఆ పేరొచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులుగుంపులుగా వచ్చి వాలి పళ్లు తిని వెళ్లేవి!


మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్‌ హత్! మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మంగళ్ హత్ అనే పిలిచేవారు. కాలక్రమంలో మంగళ్‌హాట్‌గా మారిపోయింది.


నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్అనే దివాన్‌కు నెఖ్‌ నామ్‌ ఖాన్  అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది.


1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరుమీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు. తర్వాత సైదాబాద్ అని పిలుస్తున్నారు.


టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం అని అర్ధం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని టప్పాచబుత్ర అని పిలుస్తున్నారు.


లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు. ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చేవాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే లాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం తుకారాంగేట్ గా మారిపోయింది.


హైదరాబాద్ కు చార్మినార్ గుండెకాయ అయితే, పాతబస్తీకి యాఖుత్పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు యాఖుత్ పురా అని నవాబే నామకరణం చేశాడు.

నాటకము --- పంచ సంధులు🙏

 🙏 నాటకము --- పంచ సంధులు🙏

నాటక రచనకు పూర్వము తాను స్వీకరించిన వస్తువు క్రమ వికాస పరిణామము పొందుటకై, దానిని ఏ విధముగా సన్నివేశపరుపవలెనో ఆ విధ మును ఊహించి ఏర్చరచుకొనిన కథా ప్రణాశికా భాగములను అర్థప్రకృతులు అందురు .

1బీజము, 2 బిందువు, 3 పతాక 4 ప్రకరి 5 కార్యము అని అర్థప్రకృతులు ఐదు విధములు 

ఆ యర్థ ప్రకృతులలో ఏ భాగమునందు ఏ కార్యదశను నిబంధింవవలెనో నిర్ణయించుకొని కవి ఆ ప్రకారము కథను నడుపును. ఈ దశలకు కార్యావస్థలు అనిపేరు

 1 ఆరంభము 2:ప్రయత్నము 3 ప్రాప్తాశ 4:నియతాప్తి 5 ఫలాగమము ఇవి కార్యావస్థలు

అర్థప్రకృతులు కార్యావస్థలతో కూడిన వాటికి పంచ సంధులు అని పేరు

1 ముఖసంధి, 2:ప్రతి ముఖసంధి 3 గర్భ సంధి 4 అవిమర్శ సంధి 5 నిర్వహణ సంధి


అర్థప్రకృతులు + కార్యావస్థలు = పంచ సంధులు

బీజము + ఆరంభము = ముఖ సంధి

బిందువు + ప్రయత్నం = ప్రతి ముఖ సంధి

పతాక + ప్రాప్తాశ =గర్భసంధి

ప్రకరి+ నియతాప్తి = అవిమర్శ సంధి

కార్యము + ఫలాగమము = నిర్వహణ సంధి


ఇచ్చట సంధి అనగా రెండు రేఖలు కలియగా 

ఏర్పడెడి బిందువువంటి స్థానమని తలవరాదు ఆ పదమునకు ఆనుకూల్యము, 

అవిరోధము, సమన్వయము అని అర్థము చెప్ప 

కొనవలెను. కథ ప్రణాళికానునారము నడచిన నాటకమే సుసంపన్న ఘటితమగును అది ఎట్లంటే ఒక భవన నిర్మాణమునకు పూనుకొన్న వాస్తుశిల్పి ముందుగా ఆ భవనము యొక్క అవయవ పరిమాణాత్మకమైన ఒక పటమును వేసుకొని , దానిని ఆనుసరించియే నిర్మాణము ప్రారంభించును. ఆ పటమున పునాదుల లోతు వెడల్పులు, గోడల ఎత్తు పొడవులు, ద్వారముల, కిటికీల స్థానములు, వాటి 

కొలతలు మొదలైన విధములన్నియు ముందే సూచించి యంచుకొనును. శంకు స్థాపన మొదలు భవనము పూర్తి యగు వరకును ఆ ప్రణాళికనే అనుసరించు చుండును గాని, దానికి విరుద్ధముగా కట్టడు

అట్లే నాటక కర్త కూడా ముందుగా తాను వేసుకున్న అర్థప్రకృతులు కార్యావస్థలు పంచ సంధుల ప్రణాళికను తు. చ తప్పక పాటించుచు

ఆయా అంకములందు పొందుపరచును

ఈ విధముగా నాటక రచన చేయడం కాళిదాసు వంటి సంస్కృత కవులకు ప్రాచీన తెలుగు కవులకు సాధ్యం అయినది.

మనము నాటకం లోని పంచ సంధులు వెతికితే అంత సులభంగా దొరకవు ప్రతి అంకము క్షణ్ణముగా పరిశీలించి కవి హృదయం తెలుసుకోవాలి. అల్లా తెలుసుకున్న భాష్య కారులు ఆ పంచ సంధులను మనకు అందించారు ముందుగా పతాక సన్నివేశం ఎక్కడ ఉన్నది గుర్తించాలి. ప్రతి నాటకమున పతాక సన్నివేశం ఉంటుంది ఇప్పుడు మనకు పతాక సన్నివేశం అంటే ఏమిటి అని ప్రశ్న కలుగుతుంది.

నాటక కథను మలుపు తిప్పు సన్ని సన్నివేశాన్ని

 పతాక సన్నివేశం అంటారు అభిజ్ఞాన శకుంతలం

నాటకములో అంగుళీయక వృత్తాంతం పతాక

సన్నివేశము దుష్యంతుని సత్య సంధతకు భంగం వాటిల్లకుండా కవి కల్పించిన అపూర్వ సృష్టి ఇది.

ఈవిధముగా పతాక సన్నివేశం పంచ సంధులను

గుర్తించినపుడే ఆ కవి హృదయం తెలుసు కోగలము.( విద్యార్థులకు సులభంగా అర్ధమవడానికి నిజముగా ఈ వ్యాసం వ్రాయడం చాలా కష్టమనిపించింది కృతకృత్యుణ్ణి అయ్యానో లేదో చూడాలి )

తెలుగు నాటకాలు 

ప్రాచీన కాలంలో కవులు ఎందువల్లనో గాని తెలుగులో నాటకాలు వ్రాయలేదు సంస్కృత నాటకాలను అనువదించేటప్పుడు నాటకాలుగా కాక ప్రబంధలుగా అనువదించారు. సంస్కృత కవులు ఆర్జించిన ఖ్యాతి తమకు లభించదనియో,

అంత రసవత్తరముగా రచించుట సాధ్యం కాదనియో, మరేయితర కారణమో తెలియదు కాని మొత్తం మీద నాటక రచన చేయలేదు

వినుకొండ వల్లభరాయుని క్రీడాభిరామము వీధి నాటకమని పేర్కొనినను అది ప్రదర్శన యోగ్యం కాదని కొందరి భావన. ప్రాచీన కాలములో తెలుగు నాటకాలు మృగ్యము.

1860లో కోరాడ రామచంద్రశాస్త్రి రచించిన మంజరీ మధుకరీయం తెలుగు నాటక రచనకు అంకురార్పణ జరిగింది. 1880లో తొలి సాంఘిక నాటకమైన నందకరాజ్యాన్ని వావిలాల వాసుదేవశాస్ర్తి రచించారు. కందుకూరి వ్యవహార ధర్మబోధిని తొలి ప్రదర్శన పొందిన తెలుగు నాటకంగా గుర్తింపు పొందింది. వ్యవహారిక భాషకు పట్టం కట్టిన గురజాడ కన్యాశుల్కం, పాత్రోచిత భాషకు పెద్దపీట వేసిన వేదం వెంకటరాయశాస్ర్తి ప్రతాపరుద్రీయం నాటక రచనలో ఒక అద్భుత పరిణామం.చిలకమర్తి నాటకాలు విశిష్టతను సంతరించుకొన్నవి 

కీచక వధ, ద్రౌపదీ పరిణయం, శ్రీరామ జననం 

పారిజాతాపహరణం, సీతా కళ్యాణం 

గయోపాఖ్యానం, నల చరిత్రం, ప్రసన్నయాదవం 

చతుర చంద్రహాసము ఆయనకు విశేష ఖ్యాతిని కలుగజేసినవి.బలిజేపల్లి సత్యహరిశ్చంద్ర, ధర్మవరం చిత్రనిళయం, కోలాచలం రామరాజు చరిత్ర, తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ విజయాలు, కాళ్లకూరి చింతామణి, వరవ్రికయం, త్రిపురనేని హేతువాద నాటకాలు, దామరాజు పుండరీకాక్షుడి స్వాతంత్ర్యోద్యమ నాటకాలు, సుంకర వాసిరెడ్డి ఉద్యమ నేపథ్య నాటకాలు, సమకాలీన సమస్యలకు అద్దంపట్టిన ఆత్రేయ నాటకాలు తెలుగు నాట రచనను సుసంపన్నం చేశాయి. ఎన్నో పాశ్చాత్య ధోరణుల ప్రభావంతో తెలుగు నాటకం ఆధునికతను సంతరించుకుంది. అపురూపమైన జానపద కళారూపాలు నాటకంతో మమేకమయ్యాయి. ఆంధ్ర నాటక కళాపరిషత్‌ పోటీలతో పాటు తెలుగునాట జరిగిన ఎన్నో పరిషత్తుల ప్రదర్శనల మూలంగా నాటక రచన ఇబ్బడిముబ్బడిగా జరిగింది. ప్రజానాట్యమండలి స్ఫూర్తితో నాటక రచన జనజాగృతికి బాటలు తొక్కింది. దాదాపు 141 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో వేలాది నాటక, నాటిక రచనలు వెలువడ్డాయి

                      స్వస్తి 


సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ధాన్య సమృధ్ధి గూర్చి

 ఉ.ధాన్య సమృధ్ధి గూర్చి భువి ధర్మ విచక్షణ తోడ సర్వదా

అన్య హితార్థ మెంచు మహితాత్ముల నెన్ని మదంబుతో నసా

మాన్యులు కొందరెంచగ, నమానుష చేష్టల దాచి పెట్టి, సౌ

జన్యము బోలు కూటపు విషమ్మును జిమ్ముదురేల? భారతీ!౹౹ 37


ఉ.నిత్య హితార్థమై తనరు నెయ్యము, సద్గుణ సంపదాలి స

త్కృత్యములన్ విపత్తులను తీర్చగ నౌను తృణప్రదమ్ముగా

దైత్య గుణాళి నైజపు కృతఘ్నుల భ్రష్టుల నెయ్యమెంచరా 

దత్యపకార పూర్ణిత విషాస్పదమౌనది గాన భారతీ!౹౹ 38

తెలుగు సామెతలు

 ⚡ *మరుగున పడుతున్న కొన్ని  తెలుగు సామెతలు..మీకోసం!*

🙏🙏🙏

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5. అనువు గాని చోట అధికులమనరాదు

6. అభ్యాసం కూసు విద్య

7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

12. ఇంట గెలిచి రచ్చ గెలువు

13. ఇల్లు పీకి పందిరేసినట్టు

14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

19. కోటి విద్యలూ కూటి కొరకే

20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

22. పిట్ట కొంచెం కూత ఘనం

23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక

25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె

27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29. ఆది లొనే హంస పాదు

30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

32. ఆకాశానికి హద్దే లేదు

33. ఆలస్యం అమృతం విషం

34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

35. ఆరోగ్యమే మహాభాగ్యము

36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట

37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు

40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41. ఏ ఎండకు ఆ గొడుగు

42. అగ్నికి వాయువు తోడైనట్లు

43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

48. అప్పు చేసి పప్పు కూడు

49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

51. బతికుంటే బలుసాకు తినవచ్చు

52. భక్తి లేని పూజ పత్రి చేటు

53. బూడిదలో పోసిన పన్నీరు

54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,

గిల్లితే యేడుస్తాడు

55. చాప కింద నీరులా

56. చచ్చినవాని కండ్లు చారెడు

57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

58. విద్య లేని వాడు వింత పశువు

59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

61. చక్కనమ్మ చిక్కినా అందమే

62. చెడపకురా చెడేవు

63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు

64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ

65. చింత చచ్చినా పులుపు చావ లేదు

66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,

ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67. చిలికి చిలికి గాలివాన అయినట్లు

68. డబ్బుకు లోకం దాసోహం

69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

71. దాసుని తప్పు దండంతో సరి

72. దెయ్యాలు వేదాలు పలికినట్లు

73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

75. దొంగకు తేలు కుట్టినట్లు

76. దూరపు కొండలు నునుపు

77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

78. దురాశ దుఃఖమునకు చెటు

79. ఈతకు మించిన లోతే లేదు

80. ఎవరికి వారే యమునా తీరే

81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

83. గాజుల బేరం భోజనానికి సరి

84. గంతకు తగ్గ బొంత

85. గతి లేనమ్మకు గంజే పానకం

86 గోరు చుట్టు మీద రోకలి పోటు

87. గొంతెమ్మ కోరికలు

88. గుడ్డి కన్నా మెల్ల మేలు

89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు

90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా

92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93. గుడ్ల మీద కోడిపెట్ట వలే

94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు

97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100. ఇంటికన్న గుడి పదిలం

101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ

102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

105. కాకి ముక్కుకు దొండ పండు

106. కాకి పిల్ల కాకికి ముద్దు

107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109. కాసుంటే మార్గముంటుంది

110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును

112. కలి మి లేములు కావడి కుండలు

113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114. కంచే చేను మేసినట్లు

115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !

116. కందకు కత్తి పీట లోకువ

117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

118. కీడెంచి మేలెంచమన్నారు

119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా

123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

124. కూటికి పేదైతే కులానికి పేదా

125. కొరివితో తల గోక్కున్నట్లే

126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127. కొత్తొక వింత పాతొక రోత

128. కోటిి విద్యలు కూటి కొరకే

129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

131. కృషితో నాస్తి దుర్భిక్షం

132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

135. ఉన్న లోభి కంటే లేని దాత నయం

136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137. మెరిసేదంతా బంగారం కాదు

138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

141. మనిషి మర్మము.. మాను చేవ...

బయటకు తెలియవు

142. మనిషి పేద అయితే మాటకు పేదా

143. మనిషికి మాటే అలంకారం

144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా

148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149. మొక్కై వంగనిది మానై వంగునా

150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు

151. మొసేవానికి తెలుసు కావడి బరువు

152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159. నవ్వు నాలుగు విధాలా చేటు

160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161. నిదానమే ప్రధానము

162. నిజం నిప్పు లాంటిది

163. నిమ్మకు నీరెత్తినట్లు

164. నిండు కుండ తొణకదు

165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు

166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి

167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

172. ఊరు మొహం గోడలు చెపుతాయి

173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

174. పాము కాళ్ళు పామునకెరుక

175. పానకంలో పుడక

176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు

178. పండిత పుత్రః పరమశుంఠః

179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

183. పెళ్ళంటే నూరేళ్ళ పంట

184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట

186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది

187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188. పిచ్చోడి చేతిలో రాయిలా

189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం

191. పిండి కొద్దీ రొట్టె

192. పిట్ట కొంచెము కూత ఘనము

193. పోరు నష్టము పొందు లాభము

194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు

195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199. రామాయణంలో పిడకల వేట

200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు

203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

204. రౌతు కొద్దీ గుర్రము

205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

207. సంతొషమే సగం బలం

208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు….

🙏🙏🙏

.

తులసి…* *లక్ష్మీ కటాక్షం

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*తులసి…*

     *లక్ష్మీ కటాక్షం లభిస్తుంది!*

              ➖➖➖✍️


*తులసిదళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు.*


*‘యాన్ములే సర్వతీర్దాని!  యన్మధ్యే సర్వదేవతాః* 

*యాదాగ్రే సర్వవేదాశ్చ! తులసిం త్వాం నమమ్యహమ్’’*


*ఐశ్వర్య ప్రదాయిని అయిన తులసిని పై శ్లోకం చదువుతూ ప్రదక్షిణం చేసినచో సర్వదేవతా ప్రదిక్షణం చేసిన ఫలితం దక్కుతుంది.* 


*తులసి శ్రీ మహాలక్ష్మిః, విద్యా  విద్యా యశస్విని!*

*ధర్మా ధర్మనా దేవీ దేవ దేవ మనః ప్రియా!*

*లక్ష్మి! ప్రియ సఖీ దేవీ ద్యౌర్బమి రచలాచలా!*


*లక్ష్మీ నారాయణ స్వరూపిణి యైన తులసిని నమస్కరిస్తూ పైన 16నామాలను పఠించిన వారికి గృహంలో లక్ష్మి సుస్థిరంగా నిలిచి సుఖ, సౌభాగ్యాలు వృద్ధి పొందుతాయి.*


*తులసి చెట్టుతోనూ దేవికి బాంధవ్యముంది. తులసిదళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు.*


*విష్ణుమూర్తితో కలిసి లక్ష్మి ఇంటి లోపల నివసిస్తే, తులసి ఇంటి ఆవరణలో కొలువై ఉంటుంది.* 


*తులసిదళంతో పూజలు చేయడం అంటే విష్ణువుకు పరమ ప్రీతికరమైనది. ఈ దళాలతో పూజలు చేసిన వ్యక్తికి సకల హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం దక్కుతుంది.* 


*తులసి స్తోత్రం చేయడం అంటే అనంత గుణ ఫలాలను పొందడమే. తులసి ఉన్న ఇంటికి ప్రేత, పిశాచ, భూతాలవంటివి దూరమవుతాయి. ప్రతిరోజు ఇంటిముందు లేదా తులసికోట వద్ద దీపం పెట్టడం వల్ల దారిద్య్రం తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఆలయాల్లో, ఇళ్లల్లో, తులసి, మారేడు వంటి దేవతా వృక్షాల వద్ద దీపాలను వెలిగించడం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి.* 


*శ్రీ తులసి లక్ష్మీదేవి స్వరూపిణి. లేవగానే తులసిని చూస్తే పాపాలు పోతాయి.* 


*తులసి మొక్క ముందు భాగంలో సకల తీర్థాలు, మధ్యభాగంలో దేవతలు, చివరి భాగంలో వేదాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది.* 


*తులసి పత్రం అగ్రభాగంలో బ్రహ్మ, మధ్యలో విష్ణుమూర్తి, కాండమందు శివుడు, శాఖల్లో అష్టదిక్పాలకులు విడిది చేసి ఉంటారని పండితులు చెబుతారు.* 


*ప్రాతఃకాలంలోను, సంధ్యాసమయంలోనూ తులసి కోట ముందు దీపాన్ని వెలిగించి, ప్రదక్షిణలు చేస్తే శుభప్రదం.*✍️


🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మాఘ పురాణం 🌄- 12 వ అధ్యాయము*_

 _*🔱మాఘ పురాణం 🌄- 12 వ అధ్యాయము*_


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*🙏ఓం నమో భగవతే నారాయణాయ*


*శూద్ర దంపతుల కథ*


*📚டி.வி.பி.சி📲@TVBC🪀*

**************************

🕉️📚🕉️📚🕉️📚🕉️📚

వశిష్ఠమహర్షి దిలీపునితో మహారాజా మరియొక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండెడి వాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు , వ్యవసాయము చేయును. పశువులవ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యపారమును గూడ చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకను సంపాదించ లేకపోవు చున్నానని విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయవంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. *"అమ్మా నేను బాటసారిని అలసినవాడను , చలి , చీకటి మిక్కుటములుగ నున్నవి. ఈ రాత్రికి నీ ఇంట పండుకొను అవకాశమిమ్ము. ఉదయముననే  వెళ్లిపోదునని"* ఇంట నున్న కుముదను అడిగెను. ఆమెయు వానిస్థితికి జాలిపడి యంగీకరించెను. ఆమె యదృష్టమో ఆ బ్రాహ్మణుని యదృష్టమో యజమానియగు సుమనందుడు వడ్డీని తీసికొనుటకై గ్రామాంతరము పోయియుండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్లసావిడిలో ఒక చోట బాగుచేసి కంబళిమున్నగు వానినిచ్చి , పాలను కూడ కాచియిచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరి నామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలపాడుచుండెను.


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*🪀📖courtesy by📲🙏*.

*🛕卐ॐ•TVBC•ॐ卐🪔*•••••••••••••••••••••••••••

కుముద *"ఓయీ నీవెచటినుండి వచ్చుచున్నావు యెచటికి పోవుచున్నావని యడిగెను. అప్పుడా విప్రుడు "తుంగభద్రాతీరము నుండి శ్రీ రంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును , అందులకై ఇట్లు వచ్చితిని సమాధానమునిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను , కుముదయు మాఘస్నానము చేయుటకైన నదికి పోవలయునని యనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసిరావలెననుకొనెను. తన అభిప్రాయమును చెప్పగ బ్రాహ్మణుడును సంతోషముతో నంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీస్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు నదీస్నానము వలదు అనారోగ్యము కలుగును. పూజకు , అనారోగ్యమునకు , ధనవ్యయమగును వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండ బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి. నదిలోస్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా నా దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది. పుణ్యము కూడ కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచుకొట్టుచు ఇంటికి తీసికొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవతార్చన చేసికొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు గొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానమెక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి.*


అప్పుడామె విష్ణుదూతలారా ! నామాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమ లోకమునకు తీసికొనిపోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో బాటు యమలోకమునకు పోవలసియున్నది మరి నన్ను విష్ణులోకమునకు ఏలగొనిపోవుచున్నారని అడిగెను. అప్పుడు విష్ణుదూతలు  అమ్మా నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగ నరకమునకు పోవలసియున్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడుపనులు నీ కిష్టము కాకున్నను , భయమువలన గాని , పతిభక్తి వలన గాని నీ భర్తకు యెదురు చెప్పలేదు. కాని మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివికావు. ఇంతే గాక మాఘమాస స్నానమును కూడ మనః పూర్వకముగ భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యము నొందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడామే నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగెను కదా !  మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనయు నీటమునిగి లేచెను కదా ! బలవంతముగ చేసినను ఇష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా ! ఆవిధముగా జూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనయు నాతోబాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమునడిగిరి.


*🛕📚TVBC📲🪀*

అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను జూచెను. సుమందుడుని పట్టికలో నన్నియును పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీజలమున పడుట , నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసికొని రావలయునను ప్రయత్నమున , నీటిలో పలుమార్లు మునిగి తేలుటవలన నితడు ఇష్టములేకున్నను. బలవంతముగ మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణు లోక ప్రాప్తిని పొందవలసియున్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమును గొనిపోయిరి. రాజా ! బలవంతముగ నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగ పూర్వము చేసిన పాపములుపోయి , విష్ణులోకమును చేరు పుణ్యమువచ్చిన దన్నచో మాఘమాసమంతయు నదీస్నానము చేసి , యిష్ట దేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని , యధాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత యుండునో ఆలోచింపుము.


మానవుడు తెలిసికాని , తెలియకకాని బలవంతముగ దుష్కార్యములు చేసి పాపమునందును. అట్లే పై విధముగ చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవజన్మ దుఃఖ భూయిష్టము పాపబహుళము. ఇట్టివారికి చెడు కార్యములయందాసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పని సరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు యత్నింపవలయును , తన పనులను నూరింటినైనను వదలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లుకాక స్నానము , పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒకదినమైనను స్నానము పూజా , పురాణశ్రవణము , దానము యధాశక్తి గా పాటించినవాడు పైన చెప్పిన కుముదా సుమందులవలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసినవానికి పునర్జన్మ వుండదు. వానికి మోక్షము కలుగును. ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి , కృష్ణవేణి , నర్మద , తుంగభద్ర , సరస్వతి , గోకర్ణ , ప్రభాస , కోణభద్ర , గౌతమీ యిత్యాది నదులయందు స్నానము చేసినను , కూడ ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరును వారెట్టి వారయినను మాఘస్నానము పూజ , పురాణశ్రవణము , దానము వీనినన్నిటినిగాని , కొన్నిటిని యధాశక్తిగ చేయుటయే వారికి పాపతరణోపాయము , మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠమహర్షి దిలీపునకు వివరించి చెప్పెను.

*-❀꧁❀-TVBC❀-꧂❀-*


🟨🟥🟨🟥🟨🟥🟨🟥

*🙏స్వస్తి 🙏*

📚🕉️📚🕉️📚🕉️

*FOR MORE DAILY "DEVOTIONAL UPDATES"  & SPIRITUAL INFORMATION 📖 WATCH 🪀 AND SUBSCRIBE TO TVBC ON YOUTUBE.🤳*


*🌈స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం న్యాయ్యేన మార్గేణ మహీంమహీశాః*

     *🌎గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం *🪐లోకాఃసమస్తాఃసుఖినోభవంతు*||*

🕉️🌎🕉️🌎🕉️🌎🕉️

*🌈సర్వేజనాః సుఖినోభవంతు*

🙏🌼🙏🌼🙏🌼🙏

*శుభమ్ భూయాత్*

తిరువంబాడి శ్రీకృష్ణ దేవాలయం

 🕉 మన గుడి : నెం 1016


⚜ కేరళ  : త్రిస్సూర్ 


⚜ తిరువంబాడి శ్రీకృష్ణ దేవాలయం



💠 తిరువంబాడి ఆలయం మరియు త్రిస్సూర్ పూరం ఉత్సవాలు నేడు సాధారణ ప్రజలకు దాదాపు పర్యాయపదాలు.

వేలాది మంది భక్తులకు శాంతి, ప్రశాంతత మరియు మానసిక ఉల్లాసం, ఆధ్యాత్మిక వేదిక తిరువంబాడి శ్రీకృష్ణ ఆలయం


💠 తిరువంబాడిలోని ప్రధాన దేవత ఉన్నికృష్ణ (శిశువు రూపంలో ఉన్న కృష్ణుడు). 

భగవతి దేవి శ్రీకృష్ణునికి ఎడమవైపున ఉన్న మందిరంలో ప్రతిష్టించబడి, సమానమైన భక్తితో పూజించబడుతుంది.


💠 గణేశుడు, ధర్మశాస్త, మరియు ద్రావిడ పేర్లతో పిలువబడే దేవతలు - కుక్షి అయ్యప్ప, మణికండ, ఘండకర్ణ, రక్తేశ్వరి మరియు భైరవ కూడా ఇక్కడ  ప్రతిష్టించారు.


💠 తిరువంబాడి శ్రీ కృష్ణ దేవాలయం  భారతదేశంలోని కేరళలోని త్రిస్సూర్ నగరంలో ఉన్న పురాతన హిందూ దేవాలయం.


💠 కేరళలో అతిపెద్ద స్థానిక పండుగ అయిన త్రిస్సూర్ పూరంలో పాల్గొనే రెండు ప్రత్యర్థి సమూహాలలో ఈ ఆలయం ఒకటి.  


💠 కృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన, తిరువంబాడి ఆలయ చరిత్ర యొక్క పురాతన రికార్డు 16వ శతాబ్దానికి చెందినది. 

ఈ ఆలయం గతంలో త్రిచూర్ పట్టణానికి వాయువ్యంగా 15 కిమీ దూరంలో ఎడక్కలత్తూరులో ఉండేది. 


🔆 ఆలయ చరిత్ర


💠 ప్రస్తుతం ఇక్కడ పూజించబడుతున్న కృష్ణుడి విగ్రహం నిజానికి త్రిస్సూర్ నుండి 15కి.మీ దూరంలో కుగ్రామమైన ఎడక్కలత్తూర్‌లోని దేవాలయంలో పార్థసారథి విగ్రహం. 

ఆలయానికి అదే పేరు ఉంది - తిరువంబాడి - మరియు భగవతి, శాస్త మొదలైన అనేక మందిరాలు కూడా ఉన్నాయి.


💠 దురదృష్టవశాత్తు,  సుమారు 4 శతాబ్దాల క్రితం, గ్రామంలో మత ఘర్షణలతో ప్రాణాలకు మరియు ఆస్తికి ముప్పు ఏర్పడినప్పుడు, ఎడక్కళత్తూరులోని పవిత్రమైన నంబూతిరీలు త్రిస్సూర్‌కు వలస వెళ్ళవలసి వచ్చింది, వారితో పాటు శ్రీకృష్ణుని విగ్రహం మోసుకెళ్ళారు.


💠 త్రిస్సూర్‌కు  200 మీటర్ల దూరంలో ఉన్న కాచనప్పిల్లి ఇల్లం వద్ద ఒక పవిత్రమైన నంబూద్రి దంపతులకు దానిని అప్పగించారు. 

సంతానం లేని దంపతులు దీనిని శ్రీకృష్ణుడి మారువేషంలో ఉన్న ఆశీర్వాదంగా భావించారు మరియు వారు ఆరాధన కోసం విగ్రహాన్ని తమ సొంత బిడ్డగా భావించారు. 


💠 తనకు కావలసిన రూపంలో భక్తుడి ముందు ప్రత్యక్షమయ్యే దయగల భగవంతుడు, విగ్రహం అకస్మాత్తుగా బాలకృష్ణుడి రూపంలోకి మారింది. 

పార్థసారథిగా కొరడాను పక్కన పెట్టి, ఒక చేతిలో వేణువును పట్టుకుని, మరొక చేతిలో 'పెంపుడు తల్లిదండ్రుల' నుండి భక్తి యొక్క వెన్నను స్వీకరించడానికి ఉన్నికృష్ణన్ ( చిన్ని కృష్ణుడి) విగ్రహ రూపంగా మారిపోయాడు.

త్రిస్సూర్‌లోని అత్యంత ప్రసిద్ధ విగ్రహాలలో ఇది ఒకటి.


💠 ఆలయ చరిత్రలో భాగమైన మరో పురాణం కూడా ఉంది. 

అదే జంట భగవతీదేవి యొక్క పెద్ద భక్తులు మరియు సమీపంలోని పట్టణంలోని ఆమె ఆలయాన్ని క్రమం తప్పకుండా సందర్శించేవారని నమ్ముతారు. 

సంవత్సరాలు గడిచేకొద్దీ, దంపతులు పెద్దవారవుతుండగా, వారు ఇక ఆలయాన్ని సందర్శించలేకపోయారు మరియు ఆ సమయంలో దేవత ఒక గొప్ప భక్తుడిని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోవడంతో వారితో కలిసి వారి స్థానానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అందుకే అమ్మవారికి అంకితం చేసిన స్తంభం ఇప్పుడు ఆలయంలో భాగం.


💠 తిరువంబాడి కృష్ణ దేవాలయం దాని భౌతిక ఆకృతిలో చిన్నదైనప్పటికీ, దాని విస్తృతమైన ఆరాధనల కారణంగా మహాక్షేత్రంగా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతేకాకుండా, ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన పండుగ - త్రిసూర్ పూరంలో చురుకుగా పాల్గొంటుంది. 


🔅 శ్రీ కృష్ణ జయంతి :  తిరువంబాడి కృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని పగలు మరియు రాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటారు.

ఈ రోజున, ఆలయం దీపాలతో వెలిగిపోతుంది మరియు పంచరీ మేళంతో పాటు అలంకరించబడిన 5 ఏనుగులను ఊరేగింపుగా తీసుకువెళతారు.


🔅 వైకుంఠ ఏకాదశి : ధనుర్మాసంలో వైకుఠ ఏకాదశి రోజు ఆలయంలో పెద్ద ఎత్తున జరుపుకుంటారు.

ఏనుగుల ఊరేగింపులు, కళా ప్రదర్శనలు, పంచవాద్యం, డోలు కచేరీ తదితర కార్యక్రమాలు ఆ రోజు నిర్వహిస్తారు.  ఏకాదశి పండుగకు ముందు 10 రోజుల పాటు సంగీతోత్సవం జరుగుతుంది.

 

🔅 ఋగ్వేద అర్చన : ప్రతి సంవత్సరం ఆలయంలో 8 రోజుల సుదీర్ఘ యజ్ఞంలో ఋగ్వేద మంత్రాలు మరియు పుష్ప నివాళులు అర్పిస్తారు. 


🔅 లక్షార్చన: తుల మాసంలో, కృష్ణ మరియు దేవి నామాలను లక్షసార్లు జపించడం జరుగుతుంది.


🔅 కృష్ణనాట్టం : ఆలయంలో ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు సంపూర్ణ కృష్ణనాట్టం ప్రదర్శించబడుతుంది.


💠 భగవద్గీత పఠనం ఆలయాన్ని సజీవంగా చేస్తుంది.  దేవస్థానం ప్రతి రోజు ప్రజలకు ఉచితంగా భోజనం అందిస్తుంది.      


💠 ఆలయంలోకి కేవలం సాంప్రదాయ వస్త్రధారణ మాత్రమే అనుమతి 

మరియు ప్రవేశం హిందువులకు మాత్రమే పరిమితం చేయబడింది


💠 ఈ ఆలయం వడక్కునాథన్ ఆలయానికి ఉత్తరాన 1 కిమీ , త్రిసూర్ రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ నుండి 10 మీటర్ల దూరం మాత్రమే


రచన

©️ Santosh Kumar

13-22-గీతా మకరందము

 13-22-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారికII ప్రకృతియొక్క గుణములతోటి కలయికయే జీవుని జన్మకు హేతువని వచించుచున్నారు-


పురుషః ప్రకృతిస్థో హి 

భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ 

కారణం గుణసంగోస్య సదసద్యోనిజన్మసు


తాత్పర్యము:- ప్రకృతియందున్నవాడై పురుషుడు (జీవుడు) ప్రకృతివలన బుట్టిన (సుఖదు:ఖాది) గుణములను అనుభవించుచున్నాడు. ఆ యా గుణములతోడి కూడికయే ఈ జీవునకు ఉత్తమ నికృష్టజన్మములెత్తుటయందు హేతువైయున్నది.


వ్యాఖ్య:- జీవుడు ఈ సంసారబంధమున తగుల్కొనుటకును, ఉత్తమాధమజన్మలను బొందుటకును కారణమేమియో ఈ శ్లోకమున తెలుపబడినది. ప్రకృతియొక్క (సత్త్వరజస్తమో) గుణములతోటి, ఆ యా గుణములవలన బుట్టిన ప్రాపంచిక పదార్థములతోటి సంయోగమే జీవునకు బంధహేతువగుచున్నది. పురుషుడు వాస్తవముగ నిర్వికారుడై, జన్మవర్జితుడై, దృగ్రూపుడై యున్నను దృశ్యమగు దేహేంద్రియాదులందు, ప్రాపంచిక పదార్థములందు అహంకార, మమకారములు గలిగి అట్టి దృశ్యోపాధితోను, దానిగుణములతోను సంయోగము గలిగియుండుటవలన వికారవంతుడై, జనన మరణములనొందుచు సంసారిత్వమును బడయుచున్నాడు. కాబట్టి విచారశీలుడు జన్మాది దుఃఖములకు కారణము ఈ గుణసంగమేయని  ఎరింగి తన ఉపాధితోను, ఆ ఉపాధిగుణములతోను, సంగము, ఆసక్తి, మమకారము, అహంకారము లేనివాడై, అసంగ నిర్గుణ చిద్రూపమే తానని భావించుచు, తద్రూపుడై వెలయుచున్నచో, ఇక జన్మాది దుఃఖము లెచ్చట? దుఃఖభూయిష్టమగు ఈ జననమరణ ప్రవాహమునుండి తప్పించుకొనుటకు ఉపాయ మిదియొకటియే అయియున్నది. సంసక్తియే బంధము, అసంసక్తియే ముక్తి. ఒక పెద్ద "ఫ్యాక్టరీలో " అనేకచక్రములు, యంత్రములు పనిచేయుచున్నను, మూలస్థానమునగల పెద్దచక్రము (Flywhee)నకు తగిలించియుండు బెల్టు తెగిపోయినచో వేలకొలది యంత్రములన్నియు ఒక్కుమ్మడి ఆగిపోవునుగదా! అట్లే ఈ జననమరణాదిరూప సంసారయంత్రాంగమంతయు, జీవుడు గుణములతోటి, ఉపాధితోటి, ప్రకృతితోటి సంగమును త్యజించినచో, ఆ క్షణమే నిలిచిపోవ జీవునకు వెూక్షము కరతలామలకమగును.


ప్రశ్న: - జీవుడు ఉత్తమ, నీచజన్మలను బొందుటకు కారణమేమి? 

ఉత్తరము:- గుణములతోడ, ప్రకృతితోడ, ఆతని కలయికయే అట్టి జన్మాదిదుఃఖములకు కారణము. 

ప్రశ్న:- కాబట్టి జన్మరాహిత్యమునకు ఉపాయమేమి?

ఉత్తరము:-వివేకముద్వారా ప్రకృతితోను, గుణములతోను, ఉపాధితోను, దృశ్యవిషయములతోను, సంగమును (సంసక్తిని) త్యజించుటయే.

తిరుమల సర్వస్వం -145*

 *తిరుమల సర్వస్వం -145*

 *అలిపిరి మార్గం-16*

 *పౌరాణిక ప్రాశస్త్యం* 


 శ్రీవారి పాదస్పర్శతో పునీతమై, *'శ్రీపతిమెట్టు"* గా కూడా పిలువబడే ఈ మార్గం ఎనలేని పౌరాణిక ప్రాశస్త్యాన్ని పొందింది. ఈ మార్గంలోనే శ్రీవారు అనేకసార్లు వేటనిమిత్తం, వ్యాహ్యాళికై; అశ్వారూఢుడై కొన్నిసార్లు, కాలినడకన కొన్నిమార్లు కొండదిగి పరిసర అటవీప్రాంతానికేతెంచేవారు. శ్రీనివాసుడు ఈ మార్గం ద్వారానే కొండ దిగి వచ్చి మొట్టమొదటిసారిగా నారాయణవనం పరిసరప్రాంత అడవిలో ఆకాశరాజు తనయ పద్మావతిని కాంచి, తొలిచూపులోనే ఆమెను ప్రేమించారని; తదనంతరం వారిరువురికి వకుళమాత చొరవతో పరిణయం జరిగిందని; ఇంతకు ముందే తెలుసుకున్నాం. 


 వివాహానంతరం అగస్త్యుని సలహా మేరకు ఆరు నెలలపాటు ప్రస్తుతం *"శ్రీనివాసమంగాపురం"* గా పిలువబడే ప్రదేశంలోని అగస్త్యాశ్రమంలో గడిపిన శ్రీవేంకటేశ్వరుడు-పద్మావతి, ఈ మార్గం గుండానే ఆదివారాహక్షేత్రానికి చేరుకొని; తొండమాన్ చక్రవర్తి అప్పటికే అంగరంగ వైభవంగా నిర్మించి సిద్ధంగా ఉంచిన ఆనందనిలయంలో ప్రవేశించారు. ఆ ఆరు మాసాల వ్యవధిలో, శ్రీనివాసుడు సతీసమేతంగా పగటివేళల్లో గడిపినట్లుగా స్థానికులు చెప్పుకునే *"ముక్కోటి"* ఆలయం కూడా శ్రీనివాసమంగాపురం సమీపంలోని స్వర్ణముఖి నదీ తీరంలో ఉంది. శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి దిగి వచ్చి మొట్టమొదటగా తిరుమలక్షేత్రంపై కాలు మోపిన *"నారాయణగిరి"* శిఖరం "శ్రీవారిమెట్ల" మార్గానికి ఆనుకునే ఉంటుంది.


శ్రీవారి పాదస్పర్శకు గుర్తుగా నారాయణగిరి శిఖరం మీదనున్న "శ్రీవారిపాదాలు" గా పిలువబడే స్వామివారి దివ్య శిలాపాదాలను ఈనాడు కూడా దర్శించుకుని తరించవచ్చు


 *చారిత్రక ప్రాధాన్యం* 


 14-15వ శతాబ్దాలలో విజయనగర చక్రవర్తుల పరిపాలనా కాలం నందు "శ్రీవారిమెట్ల" మార్గం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. శ్రీకృష్ణదేవరాయల వారు సతుల సమేతంగా ఈమార్గం ద్వారానే ఏడు సార్లు తిరుమలకేతెంచి, స్వామివారికి లెక్కలేనన్ని కానుకలు సమర్పించి తరించాడు. రాయలవారి మంత్రులు, సామంతులు, సేనాధిపతులు, ఉన్నతోద్యోగులు సైతం సపరివార సమేతంగా; గుర్రాల పైన, పల్లకీలు, డోలీలు, మేనాల పైన; ఈ మార్గం లోనే ప్రయాణించి తిరుమలకు చేరుకునేవారు. శ్రీవారిమెట్లకు సమీపంలో ఉన్న చంద్రగిరిని ఏలిన ప్రభువులదరూ శ్రీవారి పరమ భక్తులే! తిరుమల ఆలయంలోని నైవేద్యనివేదన ఘంటానాదం విననిదే ఆహారాన్ని తీసుకునేవారు కాదు. వీరు కూడా తరచూ శ్రీవారిమెట్ల మార్గం ద్వారానే తిరుమలేశుణ్ణి దర్శించుకునే వారు. ఆలయనిర్మాణానికి, పునరుద్ధరణకు, ఆ కాలంలో కట్టబడిన లెక్కలేనన్ని మంటపాలకు అవసరమైన బండరాళ్ళను, రాతి ఇటుకలను, గండశిలలను, శిలాస్తంభాలను గజరాజుల చేత, ఈ మార్గం ద్వారానే చేరవేశారని చాలామంది చరిత్రకారులు అభిప్రాయ పడ్డారు.


 మనం "విమానప్రదక్షిణం' ప్రకరణంలో చెప్పుకున్నట్లుగా, 15వ శతాబ్దంలో నియమింపబడ్డ 24 మంది వేదపండితులు శ్రీనివాసమంగాపురం లోనే నివాసముంటూ, శ్రీవారిమెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరుకొని వేదపారాయణం చేసేవారు. అలాగే తిరుమల కొండపై జనావాసాలు అంతగాలేని సమయంలో, అర్చకులు శ్రీనివాసమంగాపురం సమీపంలో నుండే 'కొత్తూరు" అనే గ్రామంలో నివసిస్తూ; వేకువఝామునే బయలుదేరి శ్రీవారిమెట్ల ద్వారా కొండపైకి చేరుకుని అర్చనాఅభిషేకాదులు నిర్వహించి చీకటి పడకుండానే క్రిందకు చేరుకునేవారు. 


 శ్రీవారి ఆలయంలో ఉండే హుండీని *"కొప్పెర"* గా పిలుస్తారని మనం ముందుగానే చెప్పుకున్నాం. "కొప్పెర" అంటే వెడల్పాటి మూతి గల పెద్ద లోహపుపాత్ర అని అర్థం. తిరుమలక్షేత్రం మహంతుల ఆజమాయిషీలో ఉన్నప్పుడు ప్రతిరోజూ రెండుపూటలా కానుకలతో నిండిన "కొప్పెర" ను మోసుకుంటూ వెళ్లి; ఆలయం ప్రక్కనే ఉన్న "మహంతు మఠం" లో చేర్చటానికి ప్రత్యేకంగా పరిచారకులు ఉండేవారు. "కొప్పెర" ను మోసే వారందరూ కలిసి ఒక తెగగా ఏర్పడి శ్రీనివాసమంగాపురం సమీపంలో ఉన్న ఒక గ్రామంలో నివసించటం వల్ల ఆ గ్రామాన్ని *"కొప్పెరవాండ్ల పల్లి"* గా పిలిచేవారు. వారు కూడా శ్రీవారిమెట్ల మార్గం గుండానే ప్రతిరోజూ తిరుమలకు చేరుకునేవారు. 


‌ ఆ రోజుల్లో శ్రీవారి సేవలకు, ఉత్సవాలకు, నైవేద్యాలకు, నిత్యదీపారాధనకు కావలసినటువంటి ధాన్యం, పప్పుదినుసులు, కూరగాయలు, ఆవునెయ్యి, పాలు, పెరుగు, పూలు మొదలైనవన్నీ కూడా; చంద్రగిరి పరిసర ప్రాంతాల నుండి గంపలలో కెత్తుకుని శ్రీవారిమెట్ల మార్గం ద్వారానే కొండపైకి చేర్చేవారు. 


 ఈ విధంగా, శ్రీనివాసమంగాపురం, చంద్రగిరి పరిసర గ్రామాలైన ఎగువ రెడ్డివారిపల్లి, దిగువ రెడ్డివారిపల్లి, మెట్టపాలెం, నరసింగాపురం, కాళూరు, చెర్లోపల్లె, పెరుమాళ్ళపల్లి మొదలైన గ్రామాల ప్రజలందరూ; శ్రీవారిమెట్ల మార్గంతో, ఆనాడూ-ఈనాడూ కూడా; ఆత్మీయ సంబంధం, తద్వారా శ్రీనివాసునితో విడదీయరాని అనుబంధం, కలిగి ఉన్నవారే! 


‌ఇంతటి మహత్తరమైన చారిత్రక వారసత్వాన్ని సొంతం చేసుకున్న శ్రీవారిమెట్ల మార్గం గుండా కనీసం ఒక్కసారైనా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోవటం శ్రీనివాసుని భక్తులందరి చిరకాల స్వప్నం.


[ రేపటి భాగంలో... *తొండమాన్ చక్రవర్తి* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము*


*284 వ రోజు*


*యుద్ధారంభం*


రెండవ రోజుయుద్ధానికి ద్రోణుడు కౌరవ సైన్యాలను గరుడవ్యూహంలో నిలిపాడు. గరుడపక్షి ముక్కు స్థానమున ద్రోణుడు ముక్కు స్థానమున నిలిచాడు. సుయోధనుడు అతడి తమ్ములు తలవపు నిలిచారు. కృపాచార్యుడు కృతవర్మ నేత్రష్తానాలలో నిలిచారు. సింహళ అభీర, శూరసేన రాజులు మెడ భాగమున నిలిచారు, బాహ్లిక, భూరిశ్రవస, సోమదత్త, శలుడు, శల్యుడు కుడి రెక్క వైపున, అశ్వత్థామ, సుదక్షిణుడు, విందుడు, అనువిందుడు ఎడమ రెక్క వైపున నిలిచారు. శకుని, పౌండక, అంబష్ట , శకుని, కళింగుడు, మగధరాజు వెన్ను భాగమున నిలిచారు. కర్ణుడు తన సైన్యముతో తోకభాగమున నిలిచాడు. సైంధవుడు మొదలైన రాజులు అక్కడక్కడా తమ సైన్యాలతో నిలచారు. భగదత్తుడు తన గజము మీద ఎక్కి మధ్యభాగమున నిలిచాడు.


*త్రిగర్తదేశాధీశులు అర్జునుడిని యుద్ధముకు పిలుచుట*


త్రిగర్త దేశాధీసులు వ్యూహముతో కలవక విడిగా దక్షిణమున నిలిచారు. వారు అర్జునిని పిలిచి యుద్ధముకు రా అని కవ్వించారు. అర్జునుడు అది చూసి " త్రిగర్తాధీశుడు అతడి తమ్ములతో నన్ను యుద్ధముకు రమ్మని పిలుస్తున్నాడు. యుద్ధానికి పిలిచినపుడు పోవడం ధర్మం . నేను పోయి వారిని ఓడించి విజయుడినై తిరిగి వస్తాను అనుజ్ఞ ఇవ్వండి. ఈ కొంచం సేపట్లో నీకు ఏమీ కాదు అన్నాడు " అని నమస్కరించి అనుమతి కోరాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు అర్జునుడితో " అర్జునా ! ద్రోణుని శౌర్యప్రతాపములు నీకు తెలియనివి కాదు. నన్ను పట్టి సుయోధనునికి ఇస్తానని ద్రోణుడు ప్రతిజ్ఞ చేసాడు. మనమా ప్రతిజ్ఞ భంగపరచ వలెను. నీకు ఏది మంచిది అనిపించిన అది చేయి " అన్నాడు. ఆ మాటలకు అర్జునుడు " అన్నయ్యా ! యుద్ధానికి పిలిచినపుడు పోకున్న లోకం నన్ను పిరికి వాడు అని గేలిచేస్తుంది. కనుక నేను త్రిగర్తలతో యుద్ధానికి పోక తప్పుదు. ఇతడి పేరు సత్యజిత్తు. ఇతడు నీ పక్కన ఉండగా ఏమీ భయపడవలసిన పని లేదు. ఒకవేళ ఇతడు మరణిస్తే యుద్ధము నుండి తొలగి పోవడం మంచిది. అంతకంటే వేరు మార్గం లేదు " అన్నాడు. ధర్మరాజు చేసేది లేక అర్జునుడు సంశక్తులతో యుద్ధానికి వెళ్ళడానికి అనుమతించాడు. అర్జునుడు సంశక్తులతో యుద్ధానికి వెళ్ళడం చూసిన కౌరవ సైన్యంలో ఆనందోత్సాహాలు వెల్లి విరిసాయి. జయ జయ ధ్వానాలు చేసారు.


*ద్రోణ సారధ్యంలో రెండవ రోజు సమరం*


ధర్మరాజు ధృష్టద్యుమ్నుని చూసి " ద్రోణుడు గరుడ వ్యూహము పన్నాడు అందుకు ప్రతిగా మన సేనలను నీవు మండలార్ధ వ్యూహమున నిలుపు " అన్నాడు. ధృష్టద్యుమ్నుడు సేనలను మండలార్ధ వ్యూహమున నిలిపాడు. ఉభయ సైన్యములలో భేరి, మృదంగ నాదాలు మిన్నంటాయి. ధర్మరాజు ధృష్టద్యుమ్నుని చూసి " నేను ద్రోణునికి చిక్కకుండా ఉండాలంటే " నేను ద్రోణుని చేతికి చిక్కకుండా ఉండాలంటే మీరంతా నన్ను అతి జాగరూకతతో వెన్నంటి ఉండాలి మీ శౌర్య ప్రతాపములు చూపి కౌరవ సేనలను ఒక్క అడుగు ముందుకు రానీయక చూడవలసిన బాధ్యత మీదే " అన్నాడు. ధృష్టద్యుమ్నుడు ధర్మనందనా నేను ఉండగా ద్రోణుడు నీ దరిదాపులకు కూడా రాలేడు. ద్రోణుడు ఎన్నటికీ నన్ను గెలువ లేడు " అన్నాడు. యుద్ధం ప్రారంభం అయింది ధృష్టద్యుమ్నుడు పాండవ సేనకు ముందు నిలిచి తన రధమును ద్రోణుని ముందు నిలిపాడు. యుద్ధ ప్రాంరంభంలో ధృష్టద్యుమ్నుని చూడటం అరిష్టమని తలచిన ద్రోణుడు పక్కకు తిరిగి పాంచాలసేనతో యుద్ధం చేయసాగాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

భావశాంతి

 త్యాగరాజకృతి ఒక పెనుతుఫానువంటిది.


పల్లవి గానంచేయగానే రసికహృదయంలో భావోదయంతో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది.


అనుపల్లవితో భావోద్వేగంపెరిగి ఒక తుఫానుగా మారుతుంది.


చరణంలోని సంగతులతో, నెరవులతో అది ఒక ప్రభంజనంగా మారి భావశబలతతో రసికహృదయతీరాలలో రసవృష్టి కురిపిస్తుంది.


కృతి అంతముకాగానే ఆ తుఫాను తీరందాటి భావప్రభంజనంతో కూడిన రసవృష్టి ఆగిన తరువాత భావశాంతి కలుగుతుంది....


త్యాగరాజకృతిలో  ఈ భావోదయము, భావోద్వేగము, భావశబలత, భావశాంతి కలిగించగలవారే నిజమైన, అత్యుత్తమ కళాకారులు.


అటువంటివారికి రసహృదయులంతా "దాసోహమ్"  అంటారు....


   -- ఆలమూరు విజయభాస్కర్

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం  - త్రయోదశి - పునర్వసు -‌‌ ఇందు వాసరే* (10.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*