20, నవంబర్ 2025, గురువారం

పంచాంగము

 


అక్కడ దాచాను

  అక్కడ దాచాను

రామారావు ఒక ధనవంతుడు అతడు ఒక రోజు బ్యాంకుకు వెళ్లి 5 లక్షల రూపాయలు డ్రా చేసి దాన్ని బ్యాగులో పెట్టుకొని వెళ్లబోతుండగా అతని మిత్రుడు కనబడి మాట్లాడించాడు రామారావు ఏంటి హడావుడి, అంటే రేపు నేను ఢిల్లీ వెళుతున్నాను మా అమ్మాయి పెళ్లి విషయంలో  ఐదు లక్షలు మా వాళ్లకు ఇచ్చేది ఉంది అందుకనే నేను తొందరగా వెళ్ళాలి అన్నాడు ఈ సంభాషణ మొత్తం పక్కనే ఉన్నటువంటి కొండ కోచి అనేటువంటి ఒక దొంగ విన్నాడు వాడు అనుకున్నాడు ఓహో ఈయన రేపు ఢిల్లీకి వెళ్తున్నాడు ఐదు లక్షలు తీసుకొని పోతున్నాడు ఇతనితో పాటు ప్రయాణం చేసి ఆ ఐదు లక్షలు మనం కాజేయొచ్చు అని అనుకున్నాడు మరుసటి రోజు పొద్దున్నే రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు రైల్వేస్టేషన్లో కూడా రామారావు క్యూలో నించుంటే రామారావు వెనకాలే ఈ దొంగ గారు కూడా నిల్చున్నాడు రామారావు టికెట్ తీసుకున్నాడు.అదే రైలుకి తను కూడా ఒక టికెట్ తీసుకున్నాడు రామారావు తో పాటు రామారావు ఎక్కిన బోగీలోనికి రామారావు పక్క సీటు సంపాదించాడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.  రామారావు మధ్య రాత్రి  వాష్ రూమ్ కి వెళ్ళవలసి వచ్చింది. అదే మంచి అదునుగా భావించి మన దొంగ గారు వెంటనే రామారావు సంచి రామారావు బ్యాగు రామారావు బిస్తరు మొత్తం తనిఖీ చేసి ఎక్కడ డబ్బులు దాచాడో చూసి అది కాజేసి వెంటనే పక్క స్టేషన్లో దిగిపోదామని ఎత్తుగడ వేశాడు కానీ అతను ఎంత వెతికినా కూడా ఒక్కచోట కూడా ఒక ₹100 నోటు కూడా కనబడలేదు ఆశ్చర్యం ఇదేంటి అని అని అనుకున్నాడు నిన్ననే విన్నది అబద్ధమా నా కళ్ళ ముందే 5 లక్షలు డ్రా చేసాడే మరి ఎక్కడ పెట్టినట్టు అని పరి పరివిధాలుగా ఆలోచించడం మొదలుపెట్టాడు కొండ గోచి పడుకున్నాడే గానీ నిరంతరం అతని మనసులో ఒకటే శోధిస్తున్నది ఏమిటి ఈ పక్కవాడు ఎంతకు నిద్ర పోవట్లేదు అనుకున్నాడు చిన్నగా రామారావు నిధుల్లోకి జారుకున్నాడు రామారావు నిద్రలోకి వెళ్లగానే మళ్లీ దొంగ గారు చిన్నగా అతని చెయ్యి ఇటు అటు కదిలిచ్చి జేబులో  ఆజేబు ఈ జేబు చూసి ప్యాంటు జేబులో చేయి పెట్టి అన్ని జేబులు వెతికాడు తరువాత  అతన్ని నకసిక పర్యంతం పరిశీలించాడు కానీ ఒక్కచోట కూడా అతనికి ధనం లభించలేదు ఇక నిరాశ చెందాడు తెల్లవారేసరికి ఢిల్లీ రానే వచ్చింది. అప్పుడు తెగించి అసలు విషయం రామారావు నే అడుగుదాం అని అనుకున్నాడు ఈ రామారావు డబ్బులు ఎక్కడ దాచిపెట్టాడు రామారావు తీసుకొని వస్తున్నాడు అన్నది మాత్రం సత్యం అందులో ఏమాత్రం అనుమానం లేదు అనుకోని ఎట్లాగో తెల్లవారింది ఆ డబ్బు తనకు లభించలేదు కనీసం అది ఎట్లా భద్రపరిచాడు అన్న విషయం అన్న తెలుసుకుందామని రామారావు ముందర ఓపెన్ అయ్యాడు అయ్యా నన్ను క్షమించాలి నేను మంచివాన్ని కాదు ఒక దొంగని మీ దగ్గర ఐదు లక్షల రూపాయలు ఉన్నట్లు గమనించి నిన్నటి నుంచి మిమ్మల్ని అనుసరిస్తూ వస్తున్నాను. ఇప్పటిదాకా నేను మీ దగ్గర డబ్బులు తీసుకొని పారిపోదామనే ప్రయత్నంలోనే ఉన్నా కానీ నా దురదృష్టం మీ డబ్బులు ఎక్కడ పెట్టారో నాకు కనబడలేదు నిజంగా మీరు డబ్బులు తెచ్చారా తేలేదా చెప్పండి అన్నాడు అదేమిటి నాయనా నేను డబ్బులు తేకుండా ఎట్లా ఉంటాను డబ్బులు తీసుకొని వెళ్తాననీ నిన్న మా మిత్రుడితో చెప్పాను కదా నువ్వు పక్కనే ఉండి అన్నీ విన్నావు కదా అన్నాడు అప్పుడు తెల్ల మొహం వేయడం కొండ గోచి పని అయింది వెంటనే అయితే డబ్బులు ఎక్కడ పెట్టారు సార్ అన్నాడు ఇగో ఇక్కడ పెట్టాను అని దొంగ తల దిండు కింది నుంచి డబ్బులు తీసి లెక్కపెట్టుకొని బ్యాగులో పెట్టుకున్నాడు ఇది సంగతి అప్పుడు అర్థమైంది నేను బయట అంత వెతికా గాని నా దగ్గర నేను వెతుక్కోలేదని తెల్ల మొహం వేశాడు దొంగ గారు. అసలు విషయాన్నీ అర్థం చేసుకోకుండా కొంతమంది ఈ కథ సాధ్యమా కాదా ఇందులో లోపాలు ఏంటి అని వెతకడం మొదలు పెడతారు వాళ్ళు అంతా ఐహికులు.  కేవలం సాధకులు మాత్రమే కిందిది చదివి అర్థం చేసుకొని అన్వయించుకుంటారు

సాధకులారా భగవంతుడు కూడా ఇదే రకంగా మనల్ని పరీక్షిస్తున్నాడు మనము నిత్యం గుళ్ళు గోపురాలు తీర్థాలు అంటూ ప్రయాణాలు చేసి అలసట చెంది ఉపవాసాలు చేసి ఆహారానికి అనేక చిక్కులు చికాకులు అనుభవిస్తూ తీర్థయాత్రలు చేస్తున్నాము గుళ్ళకి వెళ్తున్నాము పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాం కానీ ఇదంతా బాహ్య ప్రపంచంలో మనం ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడు మనకు ఎక్కడ లభ్యం కావట్లేదు నిజానికి ఆ భగవంతుడు బయట ప్రపంచంలో లేడు కేవలం కేవలం అంటే కేవలం మన హృదయ ప్రపంచం లోనే ఉన్నాడు హృదయ ప్రాకారంలోనే భగవంతుడు నెలకొని ఉన్నాడు ఆ భగవంతుడిని తెలుసుకొని భగవంతునిలో లీనం అవటమే మానవ లక్ష్యం ఇదే మనకు మంత్రపుష్పం తెలియజేస్తుంది

 ఓం శాంతి శాంతి శాంతిః

 ఇట్లు మీ చేరువేల భార్గవ శర్మ

పోతన --భాగవతము 🙏

 🙏పోతన --భాగవతము 🙏

                మొదటి భాగం 

ముందుగా పోతన పోతపోసిన పద్యరాజములు చూద్దాము. గజేంద్ర మోక్షం నుండి తీసుకున్నాను.

కొన్ని పద్యాలలో సగుణాన్ని, కొన్ని పద్యాలలో నిరాకార నిర్గుణాన్ని వర్ణించారు.శివ కేశవులకు అభేదం పాటించారు. భాగవతన్ని మోక్ష విద్య అని పేర్కొన్నారు. బీజాక్షర శక్తిని పద్యాలలో సమకూర్చారు. 

భక్త పోతన తన తపస్సుశక్తిని ధార పోసి, తెలుగు భాషలోని అక్షరాలలో ఉన్న అమృతాన్ని పిండి, తన రామ భక్తిని రంగరించి , భాగవత పద్యాలలోకి మంత్ర శక్తిని ఆవహింపచేసిన మహా గ్రంథం- భాగవతం

బతుకుతెరువు కోసమో లేదా రాజులిచ్చే అగ్రహారాల కోసమో కవులు కావ్యాలు రాస్తారన్న అపవాదు భాగవతానికి రాకూడదని, తనకున్న కాసింత పొలాన్ని పండించుకుని ఎంతో నిరాడంబరంగా జీవించిన మహా ఋషి, మహా యోగి రాసిన మహా గ్రంథం - భాగవతం

భగవంతుడు అను భద్ర శబ్దమునకు అర్థము, ఆకృతి గా అతిశయించి నిలబడగలిగిన రామభద్రుడు, శ్రీరామనారాయణుడే స్వయంగా పోతనచే రాయించుకున్న మహా కావ్యం - భాగవతం

సాక్షాత్తూ శ్రీకృష్ణుడే స్వయంగా భాగవతం నా అక్షర స్వరూపంగా ఉంటుందని వెల్లడి చేసిన మహా గ్రంథం - భాగవతం

భక్తి వైభవాన్ని, గొప్పతనాన్ని పతాకస్థాయిలో మేరు పర్వత శిఖరాలు దాటించి, వైకుంఠం అంచుల దాకా తీసుకెళ్ళి వివరించిన మహా కావ్యం- భాగవతం

లక్ష్మీ దేవి కౌగిటిలో ఉన్నా కూడా, పరమాత్మున్ని తన భక్తుల రక్షణకై పరుగులు పెట్టించిన లీలలు తెలిపే గ్రంథం (గజేంద్ర మోక్షం) - భాగవతం

ఏ శ్రీమన్నారాయణుని పాద పద్మములచే పునీతమైన భూమాత రోమాంచితమైనపుడు నిక్కబొడుచుకున్న రోమాలే, ఈ పచ్చదనమంతా అని అప్పుడు మోహపరవశయై రంజిల్లగా, ఆనంద పరవశయైన భూమాత రాల్చిన ఆనంద భాష్పధారలే ఈ సెలయేరులన్నీ అని అట్టి శ్రీహరి పాదారవిందముల శుభ చిహ్నముల వైభవాన్ని కీర్తించే మహా కావ్యం - భాగవతం

పోతన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 

పోతన బ్రహ్మ ,పోతన విష్ణువు, పోతన శివుడు పోతన శక్తి.సాక్షాత్తు పోతన గారే పరబ్రహ్మ స్వరూపము.

పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతోఁ బెక్కేండ్లు పోరాడి, సం

శిథిలంబై, తన లావు వైరిబలముం జింతించి, మిథ్యామనో

రథమిం కేటికి? దీని గెల్వ సరి పోరంజాలరా దంచు స

వ్యథమై యిట్లనుఁ బూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్..

భావము:- గజరాజు గొప్పబలంతో అనేక సంవత్సరాలు యుద్ధం జేసి చేసి చివరికి చితికిపోయాడు. తన సత్తువ శత్రువు బలం సరిపోల్చుకొని ఆలోచించుకొన్నాడు “అనవసర ప్రయత్నాలు నాకు ఎందుకు. దీనిని జయించటం, సరిసమంగా పోరాడటం రెండు నాకు సాధ్యంకాదు.” అని దుఃఖించాడు. పూర్వజన్మల పుణ్య ఫలం వలన కలిగిన మేలైన ఙ్ఞానం వల్ల అతడు ఈ విధంగా అనుకోసాగేడు.

"ఏరూపంబున దీని గెల్తు? నిటమీఁ దేవేల్పుఁ జింతింతు? నె

వ్వారింజీరుదు? నెవ్వరడ్డ? మిఁక ని వ్వారిప్రచారోత్తమున్

వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపార పారాయణుల్

లేరే?మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్ 

- ఏ = ఏ; రక్షిస్తారు? ఈ మహామొసలిని ఆపేశక్తి కలవారు ఎవరు? సర్వకార్యాలలో దిట్టలు గొప్పపుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా. అట్టి వారికిమొరపెట్టుకుంటాను.


నానానేకపయూధముల్ వనములోనంబెద్దకాలంబు స

న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ

ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండ లే

కీనీరాశ నిటేల వచ్చితి? భయం బెట్లోకదే యీశ్వరా!


భావము:- చాలాకాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతు ఉన్నాను. పదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. నా దానజలధారలతో బలంగా పెరిగిన మంచి గంధంచెట్ల నీడలలో సుఖంగా ఉండకుండ, నీటిమీద ఆశతో ఇక్కడకి ఎందుకు వచ్చాను. భగవంతుడా! చాలా భయం వేస్తోంది. ఎలానో ఏమిటో.

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;

యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బెవ్వఁ;డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ

డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

భావము:- ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.


ఒకపరి జగములు వెలి నిడి

యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై

సకలార్థ సాక్షి యగు న

య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్.

భావము:- ఒకసారి లోకాలను సృష్టి చేసి, ఇంకొకసారి తనలో లయం చేసుకుంటు, ఆ లోకాలు రెండు తానే అయ్యి, అన్ని విషయాలను సాక్షీభూతంగా ఆలోకిస్తూ, ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను.


లోకంబులు లోకేశులు

లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం

జీకటి కవ్వల నెవ్వం

డేకాకృతి వెలుఁగు నతని నేసేవింతున్.


భావము:- లోకాలు, లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరు నశించిన అనంతరం; ఆ కారు చీకట్లకు ఆవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను.


నర్తకుని భంగిఁ బెక్కగు

మూర్తులతో నెవ్వఁ డాడు? మునులు దివిజులుం

గీర్తింప నేర? రెవ్వని

వర్తన మొరు లెఱుఁగ? రట్టివాని నుతింతున్.

భావము:- అనేక వేషాలు వేసే నటుడి లాగ పెక్కు రూపాలతో ఎవరు క్రీడిస్తుంటాడో? ఋషులు దేవతలు ఎవరి గొప్పదనాన్ని వర్ణించ లేరో? ఎవరి ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో? అట్టి ఆ మహాదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను.


ముక్తసంగులైన మునులు దిదృక్షులు

సర్వభూత హితులు సాధుచిత్తు

లసదృశవ్రతాఢ్యులైకొల్తు రెవ్వని

దివ్యపదము వాఁడు దిక్కు నాకు..


భావము:- ప్రపంచంతో సర్వ సంబంధాలు వదలివేసిన మునులు, భగవద్దర్శనం కోరేవారు, సమస్తమైన జీవుల మేలు కోరేవారు, మంచి మనసు కలవారు సాటిలేని వ్రతాలు ధరించి ఎవరి పాదాలను సేవిస్తారో అట్టి భగవంతుడు నాకు దిక్కు అగు గాక.

                       సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

పొద్దుతిరుగుడు మొక్కతో ఉపయోగాలు -

 పొద్దుతిరుగుడు మొక్కతో ఉపయోగాలు -


 * పొద్దుతిరుగుడు మొక్కల్ని పీకేసిన తరువాత ఎండించి , శుభ్రం చేసుకుని మెత్తగా దంచి ఆ చూర్ణం ఒక చెంచా మోతాదు రోజూ రెండుపూటలా తీసుకొంటే చర్మవ్యాధుల మీద బాగా పనిచేస్తుంది .


 * మొక్క సమూలంగా దంచిన ఈ చూర్ణానికి అమీబియాసిస్ వ్యాధిని తగ్గించే గుణం ఉంది.


 * కడుపులో క్రిములను పొగొట్టును.


 * పొద్దుతిరుగుడు మొక్కని సమూలంగా ఎండించి దంచిన పొడిని గాని , పచ్చి మొక్కని దంచి పిండిన రసాన్ని గాని కొద్దిగా తీసుకొంటే దగ్గు తగ్గుతుంది . మూత్రవ్యాధులలో కూడా బాగా పనిచేస్తుంది .


 * దీని గింజలు ప్రొటీన్లకు పుట్టిల్లు. నేతిలో ఈ గింజల్ని వేయించి పైపొట్టు ఒలిచి మెత్తగా దంచి ఆ పొడిని పాలలో కలిపి తాగితే మీకు అంతకు మించిన బలకరమైన ఆహారం మరొక్కటి ఉండదు.


 * ఇందులో 50 % కొవ్వు పదార్దాలు ఉన్నాయి. అందుకని ఈ గింజల్ని సన్నగా చిక్కి పొతున్నవారికి పెట్టినట్లు అయితే మంచి ఒళ్ళు చేస్తారు .


 * ఎప్పుడూ నీరసం , అలసట కలిగి ఉండి ఏ పనిచేయలేని అశక్తత ఉన్నవారు పొద్దుతిరుగుడు గింజల్ని తీసుకోవడం వలన శరీరంలో నీరసం , అలసటని తగ్గించి శక్తిని పెంచును.


 * పొద్దుతిరుగుడు గింజలలో "లైనోలిక్ యాసిడ్ " అనే రసాయన పదార్థం ఉన్నది. ఇది కొలెస్ట్రాల్ ని రక్తంలో పెరగకుండా చూస్తుంది. అందుకని వేరుశెనగ నూనె కంటే పొద్దుతిరుగుడు నూనెని ఆహారంలో వాడుకోవడం మంచిది .


 * B విటమిన్ ఇందులో ఎక్కువుగా ఉండును. అందుకని నీరసం మీద బాగుగా పనిచేస్తుంది . పొద్దుతిరుగుడు నూనె వాడటం మాత్రమే కాదు పొద్దుతిరుగుడు గింజలని తినవలెను .


 * రక్తక్షీణత , ఉపిరితిత్తుల జబ్బులలో కూడా పొద్దుతిరుగుడు గింజలు ఎక్కువ మేలు చేస్తాయి .


      మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

కార్తీకపురాణం - 30 వ అధ్యాయము*

 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴

      🌷 _*గురువారం*_🌷

🕉️ *నవంబర్ 20, 2025*🕉️


*కార్తీకపురాణం - 30 వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️             

                

 🔱 *(చివరి అధ్యాయం)*🔱


*కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి*

```

నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున, సూతునిగాంచి, “ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు  సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కావున దీనిని వివరించి తెలియజేయు"మని కోరిరి.


అంత సూతుడా ప్రశ్న నాలకించి “ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వివరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.


కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని, లేక, ఆచరించువారలను ఎగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును ముందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్టివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.


కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.


సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము ఉత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందుగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.


కాన, ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకంబును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.```


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి*


   

  *ముప్పైవ అధ్యాయము*  

        _*ముప్పైవ రోజు*_ 

          *(ఆఖరి రోజు)*

 *పారాయణము సమాప్తం*


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🌷🌷🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*

🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం - అమావాస్య - విశాఖ -‌‌ గురు వాసరే* (20.11.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

జీవితం ధన్యం

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం 🕉️🙏 🔥 * *ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంత ప్రేమ చూపిన వ్యర్ధమే.. ఆరోగ్యం చెడిపోయాక ఆయుష్ మిగిలిన వ్యర్ధమే.. కష్ట కాలం గడిచిపోయాక కనికరం చూపిన వ్యర్ధమే.. ఉన్నప్పుడు తెలియని విలువ కోల్పోయాక తెలుసుకున్న వ్యర్థమే.. కరిగిపోతే తెలుస్తుంది కొవ్వొత్తి విలువ.. గడిచిపోతే తెలుస్తుంది కాలం విలువ.. దూరమైతే తెలుస్తుంది మనిషి విలువ.. విడిపోతే తెలుస్తుంది బంధం విలువ.. మనల్ని అహిష్టంగా దూరం పెట్టే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం దూరం అవ్వడం మంచిది.. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు.. ఎవరిని ఎక్కువ చదవకూడదు.. ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు*🔥 ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో.. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది.. నిన్న అనేది తీరిపోయిన రుణం.. రేపు అనేది భగవంతుడు ఇచ్చిన సమయం.. కావలసినవారు ఎందరు ఉన్న మనశ్శాంతి లేని జీవితం వ్యర్థం.. అసంతృప్తి జీవితం గడపడం చాలా దుర్బలం.. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం🔥🔥మీ