24, ఏప్రిల్ 2025, గురువారం

క్రిముల ( WORMS ) గురించి

 క్రిముల ( WORMS ) గురించి సంపూర్ణ వివరణ -

      

   క్రిములు అనేవి అజీర్ణవ్యాధి వలన కలుగును. పాశ్చాత్య వైద్యులు ఆయుర్వేద శాస్త్రము నందు క్రిముల విషయము క్రిముల గురించి ఎక్కడా ఇవ్వలేదు , చెప్పబడలేదు అని , క్రిములకు ప్రాధాన్యత ఇవ్వబడి ఉండలేదని పొరపాటు అభిప్రాయముతో ఉన్నారు . ఆయుర్వేదం నందు క్రిమివ్యాధులకు కూడా అవసరం ఉన్నంత వరకు ప్రాముఖ్యత ఇవ్వబడినది. ఇప్పుడు మీకు ఆయుర్వేదం నందు క్రిముల గురించి ఏమి చెప్పారో మీకు సంపూర్ణముగా వివరిస్తాను. ఇదే విషయము పైన అంతకు ముందు నేను మీకు ఒక పోస్టులో కొంత వివరించాను. ఇప్పుడు మరిన్ని విషయాలు వివరిస్తాను. 

    

    ఆయుర్వేదం నందు క్రిములను రెండురకాలుగా విభజించారు. అవి 

           

. 1 - బాహ్యక్రిములు . 

             2 - అభ్యంతరములు . 

     త్వక్కులు మొదలగువాని యందు , స్వేదము మున్నగు బాహ్యమలముల యందు శ్లేష్మము , రక్తము , పురీషములను అభ్యంతర మలముల యందు నాలుగు రకములుగా క్రిములు జనించుచున్నవి. 

          

. ముందుగా మీకు బాహ్యక్రిమి లక్షణం వివరిస్తాను. ఈ బాహ్యక్రిములు 20 రకములు కలవు. ఇవి నువ్వులంత పరిమాణమున ఆకారము కలిగి ఆరంగుతో వస్త్రములను ఆశ్రయించి ఉండును. వీటిని నల్లులు అని పిలుస్తారు . జుట్టులో ఉండు యూక , ఈళ్ళు అని రెండు రకములు ఉండును . వాటిలో మరలా అనేక భేదములు ఉండును. ఎర్రటి మచ్చలు , బొబ్బలు , దురదలను , కంతులను కలిగించును. వీటికి బాహ్యక్రిములు అని పిలుస్తారు .  

            

. ముందుగా అసలు ఈ క్రిమిసంబంధ వ్యాధులు రావడానికి గల కారణం తెలుసుకుందాము . ఎవరైతే మొదట భుజించిన ఆహారం జీర్ణము కాకుండా మరలా భుజిస్తారో , ఎల్లప్పుడు మధురపదార్ధములను ఎక్కువుగా తీసుకుంటారో , ద్రవపదార్ధముల సేవన మీద మిక్కిలి ప్రేమ కలిగి ఉందురో , బెల్లము కలిసిన తిండి అధికముగా తినుదురో , కసరత్తు చేయనివాడు , పగలు నిద్రించువారు , పరస్పర విరుద్ద ఆహారములను భుజించువారు ఈ క్రిమివ్యాధులకు లోనగుదురు.  

        మినపపిండి , ఆమ్ల లవణ రసములు గల ద్రవ్యములు , బెల్లము , కూరగాయలు అధికముగా తినువానికి పురీషము నందు క్రిములు పుట్టును . 

            మాంసము , మత్స్యము , బెల్లము , పాలు , పెరుగు , పులిసిన ( తరువాణి ) వస్తువులు నిత్యము సేవించువానికి కఫము నందు క్రిములు పుట్టును . 

      అజీర్ణకరమైన శాకములు , విరుద్ద ఆహారములు తీసుకొనుటచేత రక్తము నందు క్రిమిదోషాలు కలుగును . 

          క్రిముల మన శరీరం నందు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలుగును. మనం ఆ లక్షణాలని గుర్తించి దోషములకు చికిత్స చేయవలెను . ఇప్పుడు మీకు వాటి గురించి వివరిస్తాను . 

      జ్వరము , శరీరం రంగు మారు ట , శూల , హృదయము నందు జబ్బు , శరీరాకృశత్వము , భ్రమ , అన్నద్వేషము , అతిసారం అనునవి ఉండువానికి శరీరము నందు క్రిమి ఉన్నదని తెలుసుకొనవలెను . 

  

          ఇప్పుడు కఫజ క్రిమి గురించి వివరిస్తాను. కఫము చేత ఆమాశయము నందు క్రిములు పుట్టును . అవి వృద్ది నొంది శరీరము నందు పైభాగము నందును క్రింద భాగము నందును కూడా తిరుగుచుండును . వీటిలో కొన్ని లావుగా , పొడవుగా ఫిడేలు చర్మపు తీగవలే ఉండును. ఇవి ఆమాశయము నందు , చుట్టుపక్కల ఆశయముల యందు పొరను అంటిపెట్టుకుని ఉండును. కొన్ని ఎర్రల వలే ఉండును. మరికొన్ని సమముగా పొడవుగా ఉండును. కొన్ని సూక్ష్మాకారముగా ఉండును. మరికొన్ని శ్వేత రక్తవర్ణముగా ఉండును. 

     

  కఫజక్రిములు 7 రకాలుగా ఉండును. అవి 

  * ఆంత్రాదములు - 

         ఇవి శరీరం నందలి ప్రేగులను తినుచుండును. 

  * ఉదరావేష్టములు - 

         ఇవి కడుపున చుట్టుకుని ఉండును. 

 * హృదయాదములు - 

         ఇవి హృదయము నందు తిరుగుచుండును. 

 * మహాగుదములు - 

        ఇవి వెడల్పైన గుదములు కల్గి ఉండును. 

 * భుఱువులు . 

 * దర్భ కుసుమములు - 

          ఇవి రెల్లు పువ్వుల వలే ఉండును. 

 * సుగంధములు -  

         ఇవి సుగంధము కలిగి ఉండును. 

        కఫజ క్రిముల వలన హృదయము నందు అదురుట , నోట నీరుకారుట , ఆహారం జీర్ణం కాకుండా ఉండుట , అరుచి , మూర్చ , వాంతి , జ్వరము , కడుపుబ్బరం , కృశించుట , తుమ్ములు , పీనస వంటి సమస్యలు కలుగును. 


  రక్తజ క్రిమి లక్షణము - 

       రక్తమున జనించిన క్రిములు మిక్కిలి సూక్ష్మమైన ఆకారము కలిగి ఉండును. పాదము పొడవు , గుండ్రమైన ఆకారం కలిగి ఉండును. ఎరుపు రంగు కలిగి రక్తం ప్రవహించు సిరలు యందు ఉండును. వాటిలో చాలా వరకు సూక్ష్మ ఆకారం కలిగి ఉండటం వలన కంటికి కనిపించవు. 

       ఈ రక్తజ క్రిమి మొత్తం 6 రకాలుగా ఉండును. అవి 

 * కేశాదములు - 

          ఇవి తల వెంట్రుకలను నశింపచేయును . 

 * రోమ విధ్వంసకములు - 

         ఇవి శరీరం పైన రోమములను రాలిపోవునట్లు చేయును . 


 * రోమద్వికములు - 

        ఇవి రోమకూపములను ఆశ్రయించి ఉండును . 

 * ఉదుంబరములు 

 * సౌరసములు . 

 * మాతలు .  

    

    ఈ రక్తజ క్రిమి వలన ముఖ్యముగా కుష్టువ్యాధిని కలిగించును. ఈ మాతలను జంతుమాతలు అని అంటారు. 

     

. పురీషజ క్రిమి లక్షణాలు గురించి తెలుసుకుందాము . ఇవి పక్వాశయమున పుట్టి అధోమార్గమున సంచరించును. ఇవి వృద్ధినొంది ఆమాశయమునకు పోయి సంచరించునప్పుడు త్రేన్పులు వచ్చును. ఉపిరి బయటకి విడుచునప్పుడు మలము వలే దుర్గంధము బయటకి వెడలును . వీటిలో కొన్ని లావుగా , కొన్ని గుండ్రముగా , కొన్ని స్థూలంగా , కొన్ని శ్యామల పీత వర్ణముగా , కొన్ని తెలుపు , నలుపు రంగులు కలవిగా ఉండును. ఇవి 5 రకాలుగా ఉండును. అవి 

  

. * కకేరుకములు . 

   * మకేరుకములు . 

   * సౌసుదాములు . 

   * లేలిహములు . 

   * సశూలములు . 

     

 ఈ పురీషజ క్రిముల వలన పురీషము ఉండలు ఉండలుగా వెడలుట , శూల , మలబద్ధము , శరీరం కృశించుట , గరగరలాడుట , ఒళ్ళు తెల్లబారి ఉండటం వంటి గుణములు కలిగి ఉండును. ఇవి తమ స్థానములను వదిలి ఇతర స్థానముల యందు సంచరించునప్పుడు గగుర్పాటు , అగ్నిమాంద్యము , గుద స్థానము యందు దురద అను ఉపద్రవములు కలుగును. పాండు రోగము కూడా కలుగును. 

                

. సమాప్తము  


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

. ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

             

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

         

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                    

. 9885030034

Panchaag


 

సమస్య పూరణ

 *తడయక వచ్చినట్టి యవధానికి రాదcట తెల్గు చిత్రమే*

ఈ సమస్యకు నా పూరణ. 


తడబడకుండ ప్రాకృతము ధారణ యుక్తము సంస్కృతంబునన్


వడివడి జెప్పు పద్యముల వస్తువివేకపు భావుకుండు క


న్నడమున గూడ కైతలను నవ్యపథంబుల జెప్పు జంకకే


తడయక వచ్చినట్టి యవధానికి రాదcట తెల్గు చిత్రమే.



అల్వాల లక్ష్మణ మూర్తి.

రామాయణం

 🌹🪷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌷గురువారం 24 ఏప్రిల్ 2025*

            *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది..


      *వాల్మీకి రామాయణం*  

           *18 వ  భాగం*

                

జనక మహారాజుగారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకి చేరుకున్నారు.


అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటాడు...  “వీళ్ళ ఇద్దరికీ                        నీ దగ్గరున్న శివ ధనుస్సుని చూపిద్దామని తీసుకొచ్చాను, నువ్వు ఒకసారి ఆ శివ ధనుస్సుని చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు” అని అన్నాడు.


అప్పుడు జనకుడు తనకి ఈ శివ ధనుస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు…


“పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు. శివుడులేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె ఐన సతీదేవి(పార్వతీదేవి) యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది.


ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు, వెంటనే దేవతలు ప్రార్ధించగా ఆయన శాంతించాడు. ఆ ధనుస్సుని జనక మహారాజు వంశంలో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర న్యాసంగా(అంటే కొంతకాలం ఉంచారు) ఉంచారు.


అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజూషలో(పెద్ద పెట్టె) పెట్టాడు. చక్రాలున్న ఆ మంజూషలో శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది కావాలి. అలా ఆ విదేహవంశీయులు ఆ శివ ధనుస్సుని రోజూ పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు.```


*అథ మే కృషతః క్షేత్రం లాంగలాత్ ఉత్థితా మమ।*

*క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతా ఇతి విశ్రుతా॥*```


అలాగే నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను.                              అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని ‘సీతా’ అని పిలిచాము (జనకుని కూతురు కనుక జానకి, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతిలేని విదేహ వంశంలో పుట్టింది కనుక ‘వైదేహి’అని సీతమ్మకి పేర్లు). ఆమె అయోనిజ, ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్యరాశి. ఆమెని చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెని తమ భార్య చేసుకుందామన్న వ్యామోహం పొందారు. అందుకని నేను ఆమెని వీర్య శుల్కగా(అంటె పరాక్రమము చేత గెలుచుకోబడవలసినది) ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను’ అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు శివ ధనుస్సుని ఎక్కుపెట్టడానికి, కొంతమంది ఆ ధనుస్సుని చూడగానే పడిపోయారు, ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్నహృదయాలతో వెనుదిరిగేవాళ్ళు.


“ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరమూ గెలవలేము, ఆ ధనుస్సుని ఎవరమూ ఎక్కుపెట్టలేము, కనుక మనందరమూ ఒకటై, జనకుడి మీదకి యుద్ధానికి వెళదాము” అని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగడ్త(భూమిని తవ్వి దానిని నీళ్ళతో నింపుతారు) తవ్వి, ద్వారాలు మూసేశాము. ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు నేను తపస్సు చేశాను. నా తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులని ఓడించాను” అని జనకుడు చెప్పుకున్నాడు.


అప్పుడు జనకుడు.. “ఒకవేళ ఈ రాముడు శివ ధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే, నేను నా కూతురు సీతని కన్యాదానం చేసి ఇస్తాను” అన్నాడు.


*రేపు...19వభాగం*


*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

నా తెలుగు భాష

 డా. ఝాన్సీ ముడుంబై 

హైదరాబాద్‌ 

శీర్షిక :నా తెలుగు భాష 

***************

కలం పట్టిన ఆనాడే అనుకున్నాను కవితలే నా ప్రాణమని 

తెల్లని కాగితం పై నల్లని అక్షరాల పూలు పూయించిన నాడే అనుకున్నాను కవితల సేద్యం చేయాలని 

 కావ్యాల పంటల్ని పండించాలని 


నుడికారాల ఒంపులతో నయాగరా జలపాతంలా 

జాలువారుతుంటే మురిసిపోతున్నాను అక్షర కవలల్ని జూసి 


అద్దుతున్నాను సుగంధ పరిమళాలను... రాజఠీవీతో నడయాడే నా తెనుగు భాషకు నరద్రిష్ఠి తగలకుండా నలుమూలలా రాజరాజ నరేంద్రుని కాలంలా నఖశిఖ పర్యంతం ప్రతిహృదిలో పదికాలాలు 

ప్రజ్వరిల్లాలని 


అక్షరాలనే అందమైన అక్షర తోరణంలా మార్ఛి 

అలంకరిస్తున్నాను నా తెలుగుతల్లికి...


నాతెలుగు రుణం కొంతైనా తీర్చుకోవాలని...

తెలుగే వెలుగై, 

తెలుగే జిలుగై,

మెలగాలి మనమధ్య... తిరిగి తెలుగు భాషకు పట్టాభిషేకం కట్టేదాక కడుతూనే ఉంటాను ఈ అక్షరమాలల్ని అక్షర కుక్షినై

అవస్థా త్రయం

 🙏అవస్థా త్రయం --- తురీయావస్తా 🙏

ముందుగా మనస్సు స్థితి ఎల్లావుంటుంది చూద్దాము

ఎల్లప్పుడు మనస్సు అనేక విషయాలపై సంచరిస్తూ వుంటుంది. మనస్సును ఒక వస్తువుపై లగ్నంచేయటం మన చేతుల్లో లేదు. కాని కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే అది జరుగుతుంది. మనం దాన్ని స్థిరీకరిద్దామని యత్నిస్తే స్థిరీకరింపబడదు. ఉదాహరణకు పూజలు, ధ్యానం చేస్తున్నప్పుడు మనమనస్సు ఒకే విషయంపై పరిభ్రమిస్తూ వుంటుంది. కాని మనకు తెలియని స్థితిలో అది అప్రయత్నంగా మరొక విషయంపై లగ్నమై వుంటుంది. మనస్సు అలా లగ్నం కాకుండా ఉందంటే అది నిద్రాసమయం. వ్యక్తి మనస్సును లగ్నం చేసినా, చేయకపోయినా, నిద్రాసమయంలో మనస్సు సుఖాన్ని పొందుతుంది.

మనసు చాలా చంచలమైంది. దానిని నిశ్చలం చేయుటకు ఎన్ని పాట్లు పడాలి. ఆలోచనల పరంపరలో సంచారిస్తూ ఉంటుంది.


మనసు, బుద్ది, అహంకారం, చిత్తం ఇది అంతరంగ చతుష్టయం 


శ్రీచక్రార్చనలో మనో బుద్ది చిత్త అహంకారాత్మక అని చతుర్ధావరణలో వస్తుంది. అసలు ఏది మనస్సు? ఏది బుద్ది? ఏది చిత్తం? ఏది అహంకారం తెలుసుకోవాలి 

 అహంకార మమకారాలన్న సంకెళ్లలో మనిషిని బంధించాలన్నా, వాటి నుండి విముక్తి కలిగించాలన్నా, మనసే కారణం’ అంటోంది అమృత బిందూపనిషత్తు. మనిషి ఈ జీవితంలో ఏ కార్యకలాపాల్ని కొన సాగించాలన్నా, ఏ వ్యవహారాల్ని నిర్వహించాలన్నా, ఆతనికి ఉన్న సాధనాలు రెండే రెండు. పంచ కర్మేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రి యాలతో కూడిన శరీరం అందులో మొదటి బహిరంగ సాధనం. రెండవది అంతరంగం అనబడే సాధనం. ఈ అంతరంగం వాస్తవంగా ఒకటే అయినా, వృత్తి భేదాన్ని బట్టి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని పిలుస్తుంటారు.


 ఒకే వ్యక్తి ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఉద్యోగి అనీ, ఇంటికి వచ్చినప్పుడు భార్యకు భర్త అనీ, పుత్రునికి తండ్రి అనీ, సహచరునకు మిత్రుడనీ, వ్యవహారాన్ని బట్టి వివిధంగా ఎలా పిలవబడతాడో, అలాగే అంత రంగమే డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు, ఈ పని చేయాలా ఆ పని చేయాలా, అసలు ఏ పనీ చేయకుండా ఉండాలా అని ఆలోచించేటప్పుడు మనస్సు అనీఅంటాము , ఈ పనినే చేద్దాం అని నిశ్చయించుకున్నప్పుడు బుద్ధి అనీఅంటాము , ఆ చేసిన పనిని గుర్తు ఉంచుకునేటప్పుడు చిత్తమనీ అంటాము , ఆ పని ఫలితాన్ని అనుభ వించేటప్పుడు అహంకారమనీ పిలుస్తారు. ఈ అంతరంగం అధీనంలోనే, బహిరంగ సాధనమైన శరీరం స్పందిస్తుంది

మనసు, బుద్ధి, అహంకారంo, చిత్తం-ఈ నాలుగూ మనసులోని విభిన్న స్థితులు. అవి ఏమిటో వాటి పనులేమిటో చూద్దాం! 


మనసు అన్నది ఇక్కడ చేతన మనసును సూచిస్తుంది. మనం కన్ను, చెవి, ముక్కు మొదలగు ఇంద్రియాలద్వారా బాహ్య జగత్తును అనుభవించటం ఈ మనసు ద్వారానే జరుగుతుంది. ఇంద్రియాలు పంపే సమాచారాన్ని సేకరించి ఈ మనసే మన సుఖ లేక దుఃఖ అనుభూతులకు హేతువు అవుతుంది.


మనసు యొక్క నిర్ణయాత్మకమైన భాగం బుద్ధి అనబడుతుంది. "ఇటుగా వచ్చేది ఎవరు?రాముడేనా లేక భీముడా?" అంటూ తికమక పడేది మనసు. "ఆ వచ్చేది నిశ్చయంగా రాముడే" అని నిర్ణయించేది లేక ద్రువీకరించేది బుద్ధి. 


ఇంద్రియాల ద్వారా మనం అనుక్షణం పొందే అనుభవాలు ప్రతి ఒకటి మన మనసు పొరలలో ఒక్కొక్క విభాగం గా ప్రోగుచేయ బడతాయి. దీనినే చిత్తం అంటారు. మనసు ఒక విషయాన్నీ గురించి నిర్ణయించలేక తికమక పడినప్పుడు, చిత్తం లో ఉన్న పాత అనుభవాలను జోడించి బుద్ధి ఒక నిర్ణయానికి వస్తుంది. "ఇతడా లేక అతడా?" అన్న ప్రశ్న తలెత్తినప్పుడు బుద్ది మనసును సలహా అడుగుతుంది. అతనిని ఇంతకు క్రితమే మనం చూసిన అనుభవం ఉంటె, వాటి తాలూకు గుర్తులు అక్కడ వుంటాయి. దానిని బట్టి "ఇది అతడే!" అని బుద్ధి నిర్ణయానికి వస్తుంది. 


మనం మెలకువగా ఉన్నప్పుడూ, కల కంటున్నప్పుడూ, ఘాఢ నిద్రపోతున్నప్పుడూ, లేక ఏ స్థితిలో ఉన్నప్పటికీ, 'నేను ఉన్నాను' అన్న స్ఫురణ మనను విడిచిపోదు. అది మన మనసు వెంటే ఎప్పుడూ ఉంటుంది. దీనినే అహం లేక నేను అంటారు. ప్రతి అనుభవానికి ప్రాతిపదిక గా అహం ఉంటుంది. అది లేకుండా మనకు ఏ అనుభవం ఉండదు. కనుక అన్నిటినీ ' నా అనుభవాలు' అంటాము

ఇక విషయంలోకి వద్దాము 

శ్రీం బీజాక్షరానికి ఉన్న అనేక అర్ధములలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్తా చతుష్టయం అని అర్ధం కూడా ఉంది. త్రిపుటి అనేక అర్ధములలో చెప్పబడిన వాటిలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి కూడా ఒకటి.జాగ్రత్, స్వప్న, సుషుప్తి జీవకోటికి సర్వ సాధారణము. తమో గుణానికి ప్రతీక నిద్ర. ఇదే మాయాస్వరూపము.అసలు మాయ అంటే అర్ధం ఏమిటి? " మా " అంటే కాదు అని అర్ధం "యా " అంటే ఏది అని అర్ధం.

ఇప్పుడు తాత్పర్యం చూస్తే..ఏది సత్యం కాదో అది మాయ.


మెలకువలో ఉండడం , కలలుకనడం , గాఢనిద్ర ఈ మూడు స్థితులనూ జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి అంటారు . వీటినే అవస్థాత్రయం అంటారు. మెలకువ స్థితిలో బాహ్యప్రపంచ జ్ఞానంతో వ్యవహరిస్తాం. పనులు చేస్తుంటాం. ఇది జాగృతావస్థ.

ఇక స్వప్నా వస్థలో మెలకువగా ఉన్నప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు మనసులో సూక్ష్మసంస్కారాలుగా ఏర్పడి స్వప్నంలో మనకు , క్రమపద్ధతిలోనో లేకపోతే మరొక విధంగానో కనిపిస్తాయి. స్వప్నావస్థను అర్ధసుషుప్తి అని కూడా అంటారు. అంటే సగం నిద్ర అన్నమాట. స్వప్నంలో శరీర అవయవాలకు విశ్రాంతి లభించినా, జ్ఞానేంద్రియాలకు విశ్రాంతి లభించదు.మనస్సు పనిచేస్తూ ఉంటుంది.ఇక సుషుప్తిలో.. అంటే గాఢ నిద్రలో శరీరంతో పాటు ఇంద్రియాలకు కూడా పూర్తి విశ్రాంతి లభిస్తుంది. హాయిగా నిద్రిస్తాం.

జాగృత్ (మెలకువ) స్థితిలో ఆత్మతత్వం అనేది కన్నులయందు.., స్వప్నావస్థలో హృదయమునందు, సుషుప్తిలో ప్రాణమునందు ఉంటుంది. సుషుప్తిలో ఆత్మ శరీరాన్ని ప్రాణాలకు అప్పగించి తాను అంతర్యామితో (జీవాత్మ ) కలిసి సుఖిస్తుంది. అందుకే గాఢనిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ‘నేను సుఖంగా నిద్రపోయాను’ అంటాం. ఇది మనందరికీ అనుభవంలోని విషయమే.


అవస్థాత్రయం కాకుండా ఆత్మకు నాల్గవ పాదం ఉన్నది. అది తురీయ స్థితి. తురీయము.. యోగం ద్వారా పొందవలసింది.మనకు అనుభవంలో ఉండదు.


మాండూక్యోపనిషత్ లో తురీయావస్థ గురించి చర్చించింది; జాగ్రద, స్వప్న, సుషుప్తి, తురీయం అనే "నాలుగు స్పృహ స్థితులను" చర్చించాయి . 


అద్వైతం, మూడు అవస్థలను సూచిస్తుంది, అవి జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇవి మానవులు అనుభవిస్తారు. ఈ మూడూ, స్థూలము, సూక్ష్మము , కారణము మూడు శరీరాల సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి: 


మొదటి స్థితి జాగ్రత్ (మేల్కొన్న) స్థితి, దీనిలో ప్రపంచం గురించి మనకు తెలుసు. ఇది స్థూల శరీరం.

రెండవస్థితి కలలు కనే మనస్సు. ఇది సూక్ష్మ శరీరం. 

మూడవ స్థితి గాఢనిద్ర స్థితి. ఇది కారణ శరీరం.


అద్వైతం తురియావస్థ అనే నాల్గవ స్థితిని కూడా ప్రతిపాదిస్తుంది. దీనిని కొందరు స్వచ్ఛమైన స్పృహ అని అంటారు .జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే ఈ మూడు సాధారణ స్థితులనూ అధిగమించే స్థితి. తురీయం అనేది విముక్తి స్థితి. శరీరానికి అతీతం.అద్వైతం ప్రకారం, తురీయావస్థ అంటే ద్వంద్వ ( జీవాత్మ పరమాత్మ) అనుభవం నుండి విముక్తి పొంది, అనంతమైన, అభేదమైన అనుభవాన్ని అనుభవించడం. ఇదే అజాత స్థితి (పుట్టుక లేని స్థితి ). తురియావస్థ అనేది ఆత్మను తెలుసుకున్న స్థితి, దానికి కొలత లేదు, కార్య కారణాల్లేవు, అన్నిటినీ మించిన, బాధలు లేని, ఆనందకరమైన, మార్పులేని, స్వయం ప్రకాశవంతమైన, నిజమైన, అలౌకికమైన స్థితి. తురీయావస్థను అనుభవించిన వారు అందరిలోనూ, అన్నిటి లోనూ తానుండే ద్వంద్వ రహిత స్థితికి చేరుకుని ఉంటారు. వారికి జ్ఞానం, జ్ఞాని, జ్ఞానార్థి ఒకరే అవుతారు. వారు జీవన్ముక్తులు. 


గౌడపాదులవారు అద్వైత వేదాంతంలో ప్రారంభ గురువులు . శంకరచార్యుల వారికి గురువు . ఈయన శ్రీ గౌడపాదాచార్య మఠం స్థాపకులు మాండూక్య కారిక రచయిత.

 దీనిని మాండూక్య కారిక ఆగమ శాస్త్రం అని కూడా అంటారు. తురియావస్థ నిశ్శబ్దానికి ప్రతీక కాగా మిగిలిన మూడు" ఓం" "కి అనుగుణంగా ఉంటాయి. ఓం మిగతా మూడు స్థితులకు మూలాధారం. 

 సాధకుడు తన సాధనను బట్టి తురీయ స్థితిలోని వివిధ స్థాయీఘట్టాలను అనుభవిస్తుంటాడు. జీవుడు పరమాత్మతో సామీప్యాన్ని ప్రజ్ఞాపూర్వకంగా అనుభవిస్తాడు. ఇదే బ్రహ్మానుభూతి. సుషుప్తిలోనూ పరమాత్మతో సమీపంగా ఉన్నా.. అక్కడ ప్రజ్ఞలేదు. అనుభవం మాత్రం మిగులుతుంది.

సుషుప్తిలోనూ తురీయ స్థితిలోను పోలిక ఉన్నట్లు కనబడుతుంది. కానీ పోలిక లేదు


సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూపతా’


సమాధియందు, సుషుప్తియందు, మోక్షమునందు జీవుడు బ్రహ్మసారూప్యమును పొందుతాడు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే స్థితికి చేరుతాడు


వైశ్వానరుడు - జాగ్రదావస్థ: 


మనం జాగ్రదావస్థలో ఉన్నప్పుడు పనిచేస్తూ ఉంటాము, చదువుతుంటాము, ఆడుతూ ఉంటాము, చింతన చేస్తూ ఉంటాము. ఇదంతా చేయిస్తూ, జాగ్రదావస్థలో ఈ జగత్తును అనుభవించేవాడు వైశ్వానరుడు. అంటే జగత్తును అనుభవించే స్థితిలో మనం వైశ్వానరుడు అనే పేరు పొందుతాము. మనం బాహ్య జగత్తును అనుభవించడం మన స్థూల శరీరంతోనే. అందుకే మన స్థూల దేహం బాహ్య జగత్తు యొక్క అంగంగా సూచించబడుతోంది. ఈ జాగ్రదావస్థలో 19 ద్వారాల ద్వారా ఈ బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తున్నాము. అవి 5 జ్ఞానేంద్రియాలు, (త్వక్కు = చర్మం చక్షువు = కన్ను రసన = నాలుక శ్రోతం = చెవి ఘ్రాణం = ముక్కు ) 5 కర్మేంద్రియాలు, (వాక్కు, పాణి, పాదం, పాయువు= మల ద్వారం , ఉపస్థ=మూత్ర ద్వారం ) 5 పంచప్రాణాలు, (ప్రాణ, అపాన, .వ్యాన, ఉదాన, సమాన) మరియు మనసు, బుద్ధి, అహం, చిత్తం అనే నాలుగు, ఈ విధంగా జాగ్రదావస్థలో స్థూల ప్రపంచాన్ని అనుభవించే స్థితిలో మనం వైశ్వానరుడు అనబడుతున్నాము. ఇది మన మొదటి పరిమాణం.


రెండవ పరిమాణం - తైజసుడు - స్వప్నావస్థ :


తరువాతది స్వప్నావస్థ. ఇక్కడ బాహ్య జగత్తు లేదు. అనుభవాలన్నీ మానసిక జగత్తు లోనే ఉంటాయి . శరీరం నిద్రలో విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో కూడా మనసు పనిచేస్తూ ఉంటుంది. కానీ మనకు బాహ్య జగత్తు స్ఫురణ ఉండదు. ఎందుకంటే బాహ్య జగత్తును స్ఫురింపజేసే చేతన మనసు నిద్రలో మునిగి ఉంటుంది. కానీ సుప్త చేతన మనసు మేల్కొనే ఉంటుంది. ఆ మనసు ఒక నూతన లోకాన్ని సృష్టిస్తుంది. అదే కల -స్వప్న లోకం. 

( మనస్సును రెండు విధాలుగా చెప్పారు 1 చేతన మనసు 2 సుప్త చేతన మనసు జాగ్రత్తగా అర్ధం చేసుకోండి.) 

శరీరము, చేతన మనసు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సుప్త చేతన మనసు ఇటువంటి పనులు చేస్తుంది. ఒక లోకాన్ని తనకంటూ సృష్టించి సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. స్వప్నలోకాన్ని అనుభవిస్తున్న స్థితిలో మనిషి తైజసుడు అనబడతాడు. 


మూడవ పరిమాణం - ప్రాజ్ఞుడు - సుషుప్తావస్థ :


కోర్కెలు , కలలు - ఏది లేని గాఢ నిద్రావస్థ మనిషి యొక్క మూడవ పరిమాణం. ఈ స్థితిని అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు ఏవి వుండవు. గాఢ నిద్రలో ఉన్న ఒకే అనుభవం సుఖం. అందువల్లనే నిద్రనుండి లేవగానే ' నేను సుఖంగా నిద్రపోయాను' అంటూ మనం చెప్పగలుగుతున్నాము.


బాహ్య జగత్తు యొక్క అనుభవాలు, మానసిక జగత్తు లో పొందే అనుభవాలు కలిసి ఉన్నదే మన జీవితం. 'నేను' అన్న స్పురణ ఉన్నప్పుడు మాత్రమే ఈ అనుభవాలను మనం పొందగలం. ఈ 'నేను' స్పురణ లేకపోతే ఏ అనుభవాలు ఉండవు. ఈ స్పురణకు ప్రాతిపదికగా ఉన్నది సుషుప్తావస్థ లోని మూడవ పరిమాణమైన ప్రాజ్ఞుడు. కనుక ప్రతి జీవిలోనూ నాయకుని స్థితిలో ఉన్నవాడు ప్రాజ్ఞుడు. "నేను'" లేకుంటే 'నాకు' జగత్తు లేదు. అందుకే ప్రాజ్ఞుడు సమస్తానికి మూల కారణం. 


నాలుగవ పరిమాణం - ఆత్మ: 


నాలుగవ పరిమాణం అని చెప్పబడినప్పటికినీ, ఇది నిజానికి మొదటి మూడు పరిమాణాలు తనలో కలిగి ఉన్నది; కానీ వాటికి అతీతమైన ఒక స్థితి. మన యదార్ధ స్వభావం ఇదే. పై మూడు అవస్థలలోను ఆత్మ ఉనికి ఉన్నది. సూర్యుని సమక్షంలో లోకం నడుస్తోంది. కానీ ఏ కార్యంలోనూ సూర్యుడు ప్రత్యక్షంగా పాల్గొనడు. అలాగే మన సమస్త కార్యకలాపాలు ఆత్మను ప్రాతిపదికగా చేసుకుని జరుగుతాయి. 


ఆత్మ ను గురించి మాండూక్యోపనిషత్తు చక్కగా ఈ విధంగా వివరణ ఇస్తోంది: 


"ఆత్మ అంతర్ముఖ స్థితికాదు, బాహ్య ముఖ స్థితి కాదు. చైతన్యం సమకూరిన స్థితి కాదు; చేతన స్థితి కాదు, అచేతన స్థితి కాదు. అది కనిపించదు. చేతలు లేని, గ్రహించ శక్యం కాని, గుర్తులు లేని, ఊహాతీతమైన, వర్ణనాతీతమైన స్థితి అది. దానిని ఆత్మ చైతన్యం లో మాత్రమే తెలుసుకోగలం. అక్కడ ప్రపంచ చైతన్యం లేదు. అది ప్రశాంతమైనది, మంగళకరమైనది, అద్వయమైనది. ఇదే నాలుగవ పరిమాణం. ఇది ఆత్మ. దీనినే తెలుసుకోవాలి"

జాగ్రత్, స్వప్న సుషుప్తి గురించి లలితా సహస్రంలో చెప్పిన శ్లోకాలు చదువుదాము.


ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా 

విశ్వరూపా జాగరిణీ స్వపన్తీ తైజసాత్మికా


 సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా 

సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిన్దరూపిణీ


విశ్వరూపా - విశ్వము యొక్క రూపమైనది.

జాగరిణీ - జాగ్రదవస్థను సూచించునది.

స్వపంతీ - స్వప్నావస్థను సూచించునది.

తైజసాత్మికా - తేజస్సువంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్ఠాత్రి.


సుప్తా - నిద్రావస్థను సూచించునది.

ప్రాజ్ఞాత్మికా - ప్రజ్ఞయే స్వరూపముగా గలది.

తుర్యా - తుర్యావస్థను సూచించునది.

సర్వావస్థా వివర్జితా - అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది.

వీటి వివరణ వ్యాసములో ఇచ్చాను కాబట్టి కేవలం అర్ధం మాత్రమే సూచించాను


ఐం హ్రీం శ్రీం జాగ్రత్ స్వప్న సుషుప్తినాం సాక్షీభూత్యై నమో నమః

                     స్వస్తి 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

16-22-గీతా మకరందము

 16-22-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - కామాదులను తొలగించుకొనువాడు పరమశ్రేయమును బొందునని సెలవిచ్చుచున్నారు -


ఏతైర్విముక్తః కౌన్తేయ ! 

తమోద్వారై స్త్రిభిర్నరః | 

ఆచరత్యాత్మన శ్శ్రేయః

తతో యాతి పరాంగతిమ్ || 


తాత్పర్యము:- ఓ అర్జునా! (కామక్రోధలోభములనునట్టి) ఈ మూడు నరకద్వారముల నుండి బాగుగ విడువబడిన మనుజుడు తనకు హితమును గావించుకొనుచున్నాడు. అందువలన సర్వోత్కృష్టమగు మోక్షగతిని పొందుచున్నాడు.


వ్యాఖ్య:- కామ, క్రోధ, లోభములను ఈ మూడు దుష్టగుణము లున్నంతవఱుకును ఎవడును వృద్ధికిరాలేడు. హితమును బొందలేడు. తనకు మేలొనర్చుకొనలేడు. అందుచేత మొట్టమొదట వానిని తొలగించివేయవలెననియు, అపుడు మాత్రమే మానవుడు తనకు శ్రేయము నొనగూర్చుకొని సర్వోత్తమమగు మోక్షపదవిని బడయగలడనియు భగవాను డిచట బోధించుచున్నారు. సూర్యచంద్రులు రాహువునుండి విడువబడినట్లున్ను, గజేంద్రుడు మొసలిబారినుండి విడుదల బొందినట్లును, బంధితుడు కారాగృహమునుండి విముక్తుడైనట్లును జీవుడీ దుష్టత్రయము యొక్క బంధమునుండి విడుదలను బొందవలెను. "ముక్తః” అని చెప్పక "విముక్తః" అని చెప్పుటవలన వానినుండి పూర్తిగ విడుదల జెందవలెనని, వానిజాడ ఏమాత్రము హృదయకోశమున నుండరాదని భావము. మఱియు అవి ‘తమోద్వారము' లని పేర్కొనబడుటవలన, ఆ కామాదులు అజ్ఞానరూపములే యనియు, అంధకార బంధురములనియు, ప్రకాశ అభావరూపములనియు, నరకహేతువులనియు స్పష్టమగుచున్నది. అవి తమోద్వారములగుటచే, అవి కలవాడు "చీకటియింటి" లో కాపురము పెట్టిన చందముననే యుండును. అనగా దుఃఖములనే యనుభవించును.


"ఆచరత్యాత్మనః శ్రేయః” - ఆ కామాదులున్నంతవఱకు ఎవరును తనకు శ్రేయమును గలుగజేసికొనజాలరు. ఆత్మోద్ధరణము గావించుకొనజాలరు. తానెవరు? జగత్తేమి? అని విచారింపజాలరు. అనగా వాసనాక్షయము కానంతవఱకు ఆత్మజ్ఞానము పూర్ణముగ ఉదయించనేరదనియు, ఆత్మానుభూతి లెస్సగ కలుగదనియు అర్థము. కామాదులు వదలిపోయినపుడే అట్టి జ్ఞానము బాగుగ సంప్రాప్తము కాగలదని ఈ శ్లోకముద్వారా తెలియుచున్నది.

 కాబట్టి సాధకుడు ప్రప్రథమమున ఆ దుష్టత్రయమును పారద్రోలవలెను.

"పరాంగతిమ్" - అని చెప్పుటచే మోక్షము అన్ని పదములకంటెను, అన్ని గతులకంటెను సర్వోత్కృష్టమైనదని తెలియుచున్నది. మఱియు కామాదులున్న స్థితి అత్యంతనికృష్టమైనదనియు దీనివలన ధ్వనించుచున్నది.

ప్రశ్న:- కామాదు లెట్టివి?

ఉత్తరము:- అవి నరకద్వారములు.

ప్రశ్న:- మోక్షమను హితమునకై ఎవడు యత్నించును?

ఉత్తరము:- ఆ కామాదులనుండి లెస్సగ విముక్తుడైనవాడు.

ప్రశ్న:- అట్లు యత్నించుటవలన నతనికి కలుగు ఫలితమేమి?

ఉత్తరము:- అతడు మోక్షమును బడయగలడు.

ప్రశ్న:- మోక్షపద మెట్టిది?

ఉత్తరము:- అన్నిటికంటెను సర్వోత్తమమైనగతి (పరాంగతిమ్).

తిరుమల సర్వస్వం -215*

 *తిరుమల సర్వస్వం -215*

 *ఫల, పుష్ప ప్రదర్శ-3* 


 తితిదే ఉద్యానవన విభాగం శ్రీవారికి తిరుమల లోని ఇతర ఆలయాలకు కావలసిన పుష్పాలను సరఫరా చేయడంతో పాటుగా; తిరుమలకు విచ్చేసిన భక్తులకు ఆహ్లాదాన్ని కూడా అందిస్తోంది. ప్రతి ఉద్యానవనమూ ఒక నందనవనమే. ఆయా ఉద్యానవనాలను ప్రతి ఒక్కరూ తనివితీరా చూసి ఆనందించవచ్చు. 


 ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా పాపనాశనం మార్గంలో ఉన్న కళ్యాణవేదిక వద్ద తి.తి.దే. వారి ఆధ్వర్యంలో *'ఫల-పుష్ప ప్రదర్శన'* ఏర్పాటు చేయబడుతుంది. దేశ, విదేశాల నుండి తెప్పించిన అరుదైన పుష్ప జాతులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఏదో ఒక పౌరాణిక ఘట్టాన్ని ఇతివృత్తంగా తీసుకొని, పువ్వులను సృజనాత్మకత ఉట్టిపడేలా అమర్చి, ఆ ఘట్టాన్ని సజీవంగా ఆవిష్కరిస్తారు. క్రితం బ్రహ్మోత్సవాల్లో నీలాదేవి, శ్రీవేంకటేశ్వరుడి నుదుటికి తన కేశాలను అతికిస్తున్న దృశ్యం సాకారం చేయబడింది. ఇంతే కాకుండా తండ్రి జమదగ్ని ఆదేశం మేరకు క్షత్రియసంహారం కావిస్తున్న పరశురాముడు, యాచకుని రూపంలో సీతమ్మను అపహరించి వెడలుతున్న రావణుణ్ణి అడ్డగిస్తున్న జటాయువు, అశోకవనంలో శోకతప్తయై ఉన్న సీతమ్మకు నమస్కరించుకుంటున్న ఆంజనేయుడు, బకాసురునితో తలపడుతున్న భీమసేనుడు, చెట్టుచాటు నుంచి వాలిపై బాణప్రహారం చేస్తున్న శ్రీరాముడు వంటి పదునాలుగు పౌరాణిక పాత్రలకు కూడా జీవం పోశారు. పశ్చిమబెంగాల్ నుండి వచ్చిన ఇరవైమంది కళాకారుల ద్వారా సృష్టించబడ్డ అత్తివరదరాజస్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


 గత కొద్ది సంవత్సరాల నుంచి మైసూర్ కు చెందిన గౌరీ, నీలాంబిక అనే ఇద్దరు అక్కచెల్లెళ్ళు సైకతశిల్పాన్ని అత్యంత సృజనాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. క్రితం సారి బ్రహ్మోత్సవాల్లో వీరిరువురూ రెండురోజులు శ్రమించి, మూడు టన్నుల ఇసుక, అనేక రంగుల నుపయోగించి, 'గరుత్మంతునిపై విహరిస్తున్న శ్రీమహావిష్ణువు' యొక్క సైకతశిల్పాన్ని సాక్షాత్కరింప జేసి భక్తుల మనసును దోచుకున్నారు.


 *కొండపై పూలు ధరించరాదు..* 

3  'పుష్పమండపం' గా వ్యవహరించబడే తిరుమల క్షేత్రంలో, పువ్వులన్నీ స్వామివారికే చెందాలి. అందుచేత, భక్తులెవ్వరూ కొండపై పూలు ధరించరాదు. కొండపై జరిగే వివాహాలలో కూడా పువ్వులతో చేసిన మాలలు వాడటం పూర్తిగా నిషిద్ధం.


 శ్రీవారికి కైంకర్యం చేయబడ్డ పువ్వుల నైర్మల్యాన్ని భక్తులకు ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం కూడా తిరుమలలో లేదు. వెయ్యేళ్ళక్రితం రామానుజుల వారు చేసిన కట్టడిననుసరించి, పూజా నైర్మల్యాన్ని ఈ మధ్యకాలం వరకూ సంపంగి ప్రదక్షిణమార్గానికి ఉత్తరదిశలో ఉన్న, నేడు 'పూలబావి' గా పిలువబడే, సాక్షాత్తూ భూదేవిచే నిర్మించబడ్డ 'భూతీర్థం' లో విసర్జించే వారు. అయితే ఎప్పటికప్పుడు పెరుగుతున్న భక్తులు, ఉత్సవాల కారణంగా పూజానైర్మల్యాలు కూడా అధికమవ్వడంతో ఇప్పుడు వాటిని తిరుమల సానువుల్లో, ఎవరూ తొక్కేందుకు అవకాశం లేని నిర్జనప్రాంతంలో వదులుతున్నారు. సంవత్సరంలో ఒకసారి తిరుచానూరులో జరిగే కార్తీకమాస బ్రహ్మోత్సవాల చివరి రోజున మాత్రం శ్రీవారి పూజానైర్మల్యాలను పద్మావతీ అమ్మవారికి కానుకగా సకల లాంఛనాలతో పంపుతారు.


 *పద్మావతీ ఉద్యానవనం* 


 పద్మావతి అమ్మవారి ఆలయం మాడవీధిని ఆనుకొని 'పద్మావతి ఉద్యానవనం' ఉంది. ఇందులో కూడా కనులకు ఇంపుగా ఉండే మందార, చేమంతి, బంతి, సన్నజాజులు, కాగడామల్లెలు వంటి రకరకాల పూలమొక్కలు, కొన్ని అరుదైన వృక్షజాతులు పెంచబడుతున్నాయి. సువిశాల ప్రాంగణంలో ఉండే ఈ ఉద్యానవనంలో చూడచక్కనైన కోనేరును కూడా చూడవచ్చు. ఈ మధ్యనే ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఒక వినూత్నమైన ప్రదర్శనకు తి.తి.దే. శ్రీకారం చుట్టింది. ఉద్యానవనం లోని కుడ్యాలపై పద్మావతీ పరిణయం లోని విశేషాలన్నింటిని వేరు వేరుగా, క్యూ ఆర్ సంకేతంతో సహా, చిత్రీకరించారు. 'పద్మావతి పరిణయం' యాప్‌ను మన చరవాణిలో డౌన్లోడ్ చేసుకుని, శబ్దగ్రహణయంత్రాలను (ఇయర్ ఫోన్స్) మన చెవులకు అనుసంధానించుకుని, ఆయా చిత్రాలపై ఉన్న క్యూ ఆర్ సంకేతాన్ని చరవాణి ద్వారా స్కాన్ చేస్తే; ఆ చిత్రంలో ఉన్న లఘు చలనచిత్రాన్ని, దృశ్య-శ్రవణ మాధ్యమాల ద్వారా చూడవచ్చు. అత్యద్భుతమైన, వినూత్నమైన ఈ ప్రయోగానికి భక్తుల నుండి ఎంతగానో ఆదరణ లభిస్తోంది.


 పుష్పాలకు అధిదేవత యైన 'పుల్లుని' ఆశీస్సులతో, శ్రీవేంకటేశ్వరుని కృపాకటాక్షాలతో, తి.తి.దే. ఉద్యానవనశాఖ మరింతగా రాణించి, ప్రపంచ ఉద్యానవనరంగంలోనే అగ్రగామిగా వెలుగొందాలని ఆ దేవదేవుణ్ణి వేడుకుందాం.


[ రేపటి భాగంలో ... *శ్రీ వేంకటేశ్వర వస్తుప్రదర్శన శాల (మ్యూజియం)* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*353 వ రోజు*


*ధర్మరాజు ద్రోణుని వధించమని సైన్యాలను పురికొల్పుట*


వ్యాసుడు వెళ్ళిన తరువాత ధర్మరాజు మనసును కుదుటపరచుకుని ధృష్టద్యుమ్నుడితో " భీముడు ద్రోణుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇక మీదట నీవు ద్రోణుడితో యుద్ధము చెయ్యి. నీవు ద్రోణుడిని చంపడానికే పుట్టావు. శిఖండిని పాంచాల సైన్యాలను వెంట తీసుకుని ద్రోణుడిని ఎదిరించు " అని చెప్పి మిగిలిన వారిని చూసి చూసి " విరాటరాజా ! ద్రుపద మహారాజా! సాత్యకీ ! నకుల సహదేవులారా! ఉపపాండవులారా! మన ముందున్న ఏకైక లక్ష్యం ద్రోణ వధ. పార్ధుని నాయకత్వంలో మీరంతా ద్రోణుడిని ఎదుర్కొనండి " అన్నాడు. అప్పటికే ఇరుపక్షముల సేనలు ఒక పగలు ఒకరాత్రి యుద్ధం చేసి అలసి పోయాయి. నిద్రమత్తులో క్షణం ఒక యుగంగాఊవస్థ పడుతున్నారు. నిద్ర మత్తులో తూలుతున్నారు. ఇది గమనించిన అర్జునుడు ఇరుపక్షముల యోధులను ఉద్దేశించి " సైనికులారా! మీరంతా బాగా అలసి పోయి ఉన్నారు. నిద్రావస్థతో జోగుతున్నారు. కనుక మీరంతా కొంతసేపు నిద్రపొండి. మరొక ఝాములో చంద్రోదయం ఔతుంది. చంద్రుడు వచ్చిన తరువాత వెన్నెల వెలుగులో మన్ము తిరిగి యుద్ధము చేస్తాము " అన్నాడు. ఈ సూచనకు ఇరుపక్షముల సైనికులు సంతోషంగా అంగీకరించారు. కౌరవ సైనికులు సహితము అర్జునుడి దయాగుణానికి శ్లాఘించారు. సైనికులంతా ఎక్కడి వారక్కడే నిద్రకు ఉపక్రమించారు. అలా నిద్రిస్తుండగా చంద్రోదయం అయింది. పండు వెన్నెల కాయగానే పాండవ కౌరవ సేనలు నిద్ర మేల్కొని యుద్ధానికి సిద్ధం అయ్యాయి.


*సుయోధనుడు ద్రోణుని నిందించుట*


సుయోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి " ఆచార్యా ! నీవు చాలా గొప్పవాడవు, మహావీరుడవ నీముందు నిలువగలవారెవరు లేరు. కాని నీవు నీ శిష్యులైన పాండవులను చంపక వదిలి పెట్టడం నా దురదృష్టం కాక మరేమిటి ? " అన్నాడు. ఆ మాటలకు ద్రోణుడు కోపించి " సుయోధనా ! నీ ఉద్దేశం నేను పాండవులను నా శిష్యులని వదిలి వేస్తున్నాననే కదా ! ఖాండవ వన దహన సమయంలో అర్జునుడు అగ్నిదేవునికి సాయంగా ఉన్నప్పుడు. ఇంద్రుడు నా శిష్యుడనే అతడిని వదిలి వేసాడా ? నాడు ఘోషయాత్రా సమయాన చిత్రసేనుడు నిన్ను బంధీగా పట్టుకున్న సమయాన నీ కొరకు యుద్ధము చేసిన అర్జునుడిని చిత్రసేనుడు నా శిష్యుడనే వదిలాడా? కాలకేయులనే రాక్షసులు అర్జునుడు నా శిష్యుడనే అతడి చేతిలో మరణించారా ? అర్జునుడి పరాక్రమం తెలిసీ నన్ను నిందించడం తగదు " అన్నాడు. సుయోధనుడు " ఆచార్యా ! మీరు అవకాశం వచ్చినప్పుడల్లా అర్జునుడిని పొగుడుతూనే ఉన్నారు. మీరు అలాగే చేస్తూ పాండవులను అర్జునుడిని నాకు వదలండి. నేను కర్ణ, దుశ్శాసన, శకుని సాయంతో పాండవులను అంత మొందిస్తాను. మీరు మీకిష్టమైన వారితో యుద్ధము చేయండి " అన్నాడు. ఆ మాటలకు ద్రోణుడు నవ్వి " సుయోధనా ! అలాగే మీరు అర్జునిడి ని ఎదుర్కొనండి మీరే గెలుస్తారేమో ! నాకు మాత్రం అర్జునుడి చేతిలో మరణించే భయం పోగొట్టావు అంతే చాలు " అన్నాడు.


*ద్రోణుడు పాంచాల సేనను ఎదుర్కొనుట*


తరువాత ద్రోణుడు పాంచాల సైన్యాంతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళాడు. అప్పటికే తెల్లవారు ఝాము అయింది. సుయోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని ఒక్కసారిగా అర్జునుడిని ఎదుర్కొని అతడి మీద శరవర్షం కురిపించారు. మహా వీరుడైన ద్రోణుడు అతిరధ మహారధులతో యుద్ధం చేయక తమలాంటి సామాన్య సైనికులుతో యుద్ధం చెయ్యడమేమిటని పాంచాల సైనికులు ఆశ్చర్య పోతున్నారు. అంతటి మహావీరునితో యుద్ధము చేసి చచ్చినా పరవాలేదని కొందరు అతడిని ఎదుర్కొంటున్నారు. ఇంతలో విరాటరాజు, ద్రుపదుడు, అతడి మనుమలు, కేకయ రాజులు తమ సైన్యాలతో ద్రోణుడిని ఎదుర్కొన్నారు. ద్రోణుడు తన వాడి అయిన బాణాలతో పాంచాల మత్స్య సేనలను హతమార్చడమే కాక ద్రుపదుని మనుమలను ముగ్గురిని హతమార్చాడు. కేకయ రాజుల తలలను పండ్లు రాల్చినట్లు నేమీద పడ వేసాడు. అది చూసి విరాటుడు, ద్రుపదుడు వీరావేశంతో ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు వారిద్దరినీ అమిత పరాక్రమంతో ఎదుర్కొని వారిద్దరినీ చెరి ఒక బాణంతో నేల కూల్చాడు. తన తండ్రి మరణం కళ్ళారా చూసిన ధృష్టద్యుమ్నుడు " నేను కనుక ద్రోణుడిని చంపకపోతే నా కులాచారాన్ని ధర్మాలను తప్పిన వాడిని ఔతాను. అని ఘోర ప్రత్నిజ్ఞ చేసి పాంచాల సేనను తీసుకుని ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. అది చూసి సుయోధనుడు కర్ణుడితో వచ్చి ధృష్టద్యుమ్నుడిని అడ్డుకున్నాడు. అంతలో భీమసేనుడు వచ్చి ధృష్టద్యుమ్నుడికి తోడుగా ద్రోణుడిని ఎదుర్కొన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం

జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ 

నాయం లోకో௨స్త్యయజ్ఞస్య కుతో௨న్యః కురుసత్తమ (31)


ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే 

కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే(32)


కురుకులభూషణా.. యజ్ఞాలలో మిగిలిన అన్నమనే అమృతాన్ని భుజించేవారు శాశ్వత పరబ్రహ్మం పొందుతారు. యజ్ఞం ఒకటీ చేయనివాడికి ఇహలోక సుఖం లేదు; పరలోకసుఖం అసలేలేదు. ఈ విధంగా వివిధ యజ్ఞాలు వేదంలో విశదీకరింపబడ్డాయి. అవన్నీ కర్మలనుంచి ఏర్పడ్డాయని తెలుసుకుంటే నీవు సంసారబంధం నుంచి విముక్తి పొందుతావు.

వడబోసిన అమృతం అవ్వదు

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️ *విషాన్ని ఎన్ని సార్లు వడబోసిన అమృతం అవ్వదు..అలాగే మనల్ని అర్ధం చేసుకోలేని వాళ్ళని ఎంత మార్చాలన్న వ్యర్థమే అవుతుంది..అందుకే కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్లే నీ కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పుతారు.. కాబట్టి అలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త* 🏵️లగేజీ ఎంత తక్కువగా సర్దుకుంటావో అంతగా ప్రయాణం సులువుగా సుఖమయంగా జరుగుతుంది.. రకరకాల మనస్తత్వాల మనుషులతో ఎంతగా అప్రమత్తంగా సర్దుకుపోతారో అంతగా జీవన ప్రయాణం సుఖంగా మనశ్శాంతిగా జరుగుతుంది..సర్దుకుపోవడం అంటే చేతకానితనం అని భ్రమ పడకూడదు.. అందుకే నిందించిన వారిని పొగిడిన వారిని సమానంగా భావించి దూరంగా ఉండడం ఉత్తమము..ఎందుకంటే చెడ్డ మనస్తత్వం కన్నా పొగిడేవారే గుణం చాలా ప్రమాదకం🏵️విత్తనాలను చీమలు తినేస్తాయి..మొలకలను పక్షులు తినేస్తాయి.. మొక్కని పశువులు మేసేస్తాయి.. అన్నిటిని తట్టులుకుని మరియు తప్పించుకుని ఆ విత్తనం భారీ వృక్షంగా ఎదిగినప్పుడు ఈ చీమలు, పక్షులు, పశువులకు ఆ చెట్టు నీడ ఎంతో దాని అవసరం.. అన్నీ ఆ చెట్టు కింద స్వేద తీర్చుకుంటాయి.. మనిషి జీవితం కూడా అంతే.. సమయం వచ్చేవరకు తట్టుకుని వేచి చూడాలి🏵️🏵️మీ *అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3.గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్యసలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా మందులు పంపబడును 9440893593.9182075510.0883.2479577* 🙏🙏🙏

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం

జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే௨పానం తథా௨పరే 

ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః (29)


అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి 

సర్వే௨ప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః (30)


అలాగే ప్రాణాయామపరులు కొంతమంది ప్రాణవాయువు, అపానవాయువుల గతులను నిరోధించి అపానంలో ప్రాణమూ, ప్రాణంలో అపానమూ హోమం చేస్తున్నారు. మరికొంతమంది ఆహారనియమంతో ప్రాణవాయువులను ప్రాణాలలోనే అర్పిస్తారు. యజ్ఞాలు తెలిసిన వీళ్ళంతా యజ్ఞాలవల్ల పాపపంకిలాన్ని క్షాళనం చేసుకుంటున్నారు.

⚜ శ్రీ కాకన్మఠ్ శివాలయం

 🕉 మన గుడి : నెం 1086


⚜ మధ్యప్రదేశ్  : సిహోనియా


⚜  శ్రీ కాకన్మఠ్ శివాలయం 



💠 ఈ ప్రపంచంలో మనకీ తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. 

వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. మరికొన్ని ఇవి నిజాలేనా ? నమ్మొచ్చా అనేలా ఉంటాయి.

నిజాలెప్పుడూ మనిషిలో జ్ఞానం పెంచుతాయి. మెదడుకి మేతలా మారి ఆలోచింపజేస్తాయి. 


💠 మన ఇండియాలో ఉన్న ప్రమాదకర ఆలయాలు గురించి చాలా మందికి తెలియదు. అక్కడికి వెళ్లే వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్ళాలి.

అలాంటి ఒక విచిత్రమైన ఆలయం  మధ్యప్రదేశ్ లోని కాకన్మఠ్ ఆలయం 


💠 ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో రాజ కీర్తిరాజ్ తన రాణి కాకన్‌వతి ఆదేశం మేరకు నిర్మించారని నమ్ముతారు, కాబట్టి ఈ పేరుకు కాకన్‌మఠ్ ఆలయం అని పేరు పెట్టారు. ఇది కేవలం ఒక నమ్మకం. 


💠 కొంతమంది నిపుణులు ఈ పేరు కనక్ అంటే బంగారం అనే పదం నుండి ఉద్భవించిందని నమ్ముతారు. 


💠 ఈ ఆలయాన్ని దెయ్యాల దేవాలయం అని స్థానికంగా పిలుస్తారు

కాకన్‌మఠ్ ఆలయం: గురుత్వాకర్షణ నియమాలను ధిక్కరిస్తోంది!


💠 మధ్యప్రదేశ్‌లోని మోరెనా నడిబొడ్డున ఉన్న కాకన్‌మఠ్ ఆలయం భారతీయ ప్రాచీన వాస్తుశిల్పంలో కలకాలం నిలిచిపోయే అద్భుతం.


💠 11వ శతాబ్దంలో కచ్ఛపఘట రాజవంశానికి చెందిన రాజు కీర్తిరాజ్‌చే నిర్మించబడిన ఈ శివాలయం ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఒక చిక్కుముడిలా మిగిలిపోయింది.  


💠 కాకన్‌మఠ్ ఆలయం చుట్టూ ఉన్న అత్యంత ప్రసిద్ధ ఇతిహాసాలలో ఒకటి దయ్యాలు దీనిని నిర్మించాయని చెబుతారు. 

స్థానిక పురాణాలు ఈ ఆలయాన్ని రాణి ఆదేశం ప్రకారం అతీంద్రియ శక్తులు రాత్రికి రాత్రే నిర్మించాయని సూచిస్తున్నాయి.


💠 దీని నిర్మాణ శైలి యొక్క గొప్పతనం మరియు ఖచ్చితత్వం చాలా అసాధారణమైనవి, అంత తక్కువ సమయంలో ఏ మానవ చేతులు కూడా దీనిని సాధించలేవని చెబుతారు.

 దీని సృష్టిలో దయ్యాలు లేదా దైవిక ఆత్మలు పాల్గొన్నాయని విస్తృత నమ్మకం ఏర్పడింది.


💠 మధ్యప్రదేశ్ కి చెందిన ఉన్న కాకన్మఠ్ ఆలయం .. చాలా ప్రమాదకరం  అని ఎందుకు చెబుతారంటే.. ఇక్కడికి వెళ్లిన వారు ఒక్క రాయి లాగిన ఆలయం మొత్తం నేల మట్టం అవుతుంది. 

ఎన్ని ప్రళయాలు వచ్చినా ఇప్పటికీ ఆ ఆలయం చెక్కు చెదరకుండా ఉంది.


💠 ఈ మందిరం  ఒకదానిపై ఒకటి రాళ్లను పేర్చడం ద్వారా రూపొందించబడింది, అది కూడా సిమెంట్, సున్నం లేదా ఎలాంటి  ఇతర మిశ్రమాలతో అతికించకుండా...


💠 ఈ ఆలయం నాగరా-శైలి వాస్తుశిల్పానికి అసాధారణమైన ఉదాహరణ.  

దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరించినట్లు కనిపిస్తుంది, దాని సహాయక నిర్మాణం చాలా వరకు లేదు, అయినప్పటికీ ఇది ఎటువంటి బాహ్య ఉపబలము లేకుండా దృఢంగా ఉంది. 


💠 ఆలయ సముదాయంలో ఒకప్పుడు అనేక చిన్న దేవాలయాలు ఉన్నాయి, అయితే ఇప్పుడు చాలా శిథిలావస్థలో ఉన్నాయి.


💠 శివునికి అంకితం చేయబడిన కాకన్‌మఠంలో క్లిష్టమైన శిల్పాలు, అందంగా చెక్కబడిన స్తంభాలు మరియు ఒకప్పుడు గొప్ప శివలింగం ఉండే గర్భాలయం ఉన్నాయి.  


💠 శతాబ్దాల తరబడి దెబ్బతిన్నప్పటికీ, ఈ ఆలయం చరిత్రకారులు, వాస్తుశిల్పులు మరియు భక్తులను ఆకర్షిస్తూ విస్మయపరిచే ప్రదేశంగా మిగిలిపోయింది. 


💠 అసలు ఆలయ సముదాయంలో కొంత భాగం మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. ఈ ప్రదేశం నుండి కొన్ని శిల్పాలు ఇప్పుడు గ్వాలియర్‌లో ఉన్నాయి .

ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మెట్లపై రెండు పెద్ద సింహ విగ్రహాలు ఉన్నాయి, అవి ఇప్పుడు గ్వాలియర్‌లోని పురావస్తు మ్యూజియం ప్రవేశద్వారం వద్ద ఉన్నాయి. అనేక ఇతర శిల్పాలను కూడా గ్వాలియర్‌కు తీసుకెళ్లారు. 


💠 ఈ ఆలయంలోని ఇతర లక్షణాలలో ఎత్తైన మరియు అందంగా అలంకరించబడిన వేదిక, దాని చుట్టూ నడక మార్గం ఉన్న గర్భగుడి, మూడు పక్క గదులు, ఒక వసారాలు (అంతరాల), స్తంభాల సమూహాల మద్దతుతో కూడిన విశాలమైన ప్రధాన హాలు (గుఢమండప), మరియు తూర్పు ముఖంగా ఉన్న ప్రవేశ హాలు (ముఖమండప) ఉన్నాయి, వీటిని మెట్ల ద్వారా చేరుకోవచ్చు. 

వసారాలో నాలుగు స్తంభాల ఒకే వరుస ఉంటుంది, ప్రధాన హాలులో నాలుగు స్తంభాల నాలుగు సమూహాలు ఉన్నాయి, అవి వసారాలో ఉన్న వాటితో సమలేఖనం చేయబడ్డాయి. 


💠 మధ్యప్రదేశ్ యొక్క గొప్ప వారసత్వాన్ని అన్వేషించే వారు తప్పక సందర్శించవలసిన ప్రదేశం.


💠 మోరెనా నుండి 35 కి.మీ మరియు గ్వాలియర్ నుండి 65 కి.మీ దూరంలో ఉన్న దీనిని రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు, 


రచన

©️ Santosh Kumar

16-21-గీతా మకరందము

 16-21-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - నరకబాధనుండి తప్పించుకొను ఉపాయమును భగవానుడు సెలవిచ్చుచున్నారు -


త్రివిధం నరక స్యేదం 

ద్వారం నాశనమాత్మనః | 

కామః క్రోధస్తథా లోభః

తస్మా దేతత్రయం త్యజేత్ || 


తాత్పర్యము :- కామము, క్రోధము, లోభము అను ఈమూడును మూడువిధములగు నరకద్వారములు. తనకు (జీవునకు) నాశము గలుగజేయును - కాబట్టి ఈమూడిటిని విడనాడవలెను. (లేక, కామము, క్రోధము, లోభము అను మూడువిధములగు ఈ అసురసంపద నరకమునకు ద్వారములు - అనియు చెప్పవచ్చును).


వ్యాఖ్య:- నరకప్రాప్తికి హేతుభూతమైన దుష్టత్రయము ఈశ్లోకమున తెలియజేయబడినది. ఆ మూడును (కామాదులు) నరకమునకు ద్వారములవంటివేయని చెప్పబడినది. అనగా అవి కలవారికి నరకద్వారము తెఱవబడినట్లేయని అర్థము. ఆ మూడు దుర్గుణములు లేనివారికి ఆ ద్వారములు మూయబడియుండుట వలన, ఇక వారికి నరక ప్రవేశము లేనేలేదని యర్థము. ఇంతదనుక భగవానుడు అనేక అసుర గుణములు చెప్పుచువచ్చెను. అట్టి దుర్గుణములు కలవారు క్రింది క్రింది లోకములకు, నీచనీచజన్మలకు జనుచు నానాదుఃఖపరంపరలను అనుభవించుచుందురనియు తెలిపెను. అయితే ఇక వారిగతి అంతియేనా? వారుద్ధరింపబడుటకిక అవకాశములు లేవా? అని ప్రశ్నించిన, కలవని గీతాచార్యులు చెప్పుచున్నారు. అసురగుణములన్నిటిని మూడుగ విభజించవచ్చును. అవియే (1) కామము (2) క్రోధము (3) లోభము. కాబట్టి ఎవడీ మూడింటిని ప్రయత్నపూర్వకముగ త్యజించివేయునో అతడు నరకముయొక్క బెడదనుండి తప్పించుకొని ఊర్ధ్వగతిని బడయగలడు. ఈసత్యమింకను రాబోవు శ్లోకమున చక్కగ విశదీకరింపబడగలదు. కాబట్టి ఇక పాపాత్ములెవరును తమ యధఃపతనమునుగూర్చి దిగులుపడక, తామెచ్చోటనున్నారో అచటినుండియే భగవానుడు తెలిపిన ఈ కామక్రోధలోభ త్యాగరూపప్రయత్న మాచరించుచు నుండినచో అచిరకాలములోనే వారు నరకవిముక్తులై, దుఃఖవర్జితులై పరమ శ్రేయము నొందగలరు. కావున ప్రతివారును వారివారి హృదయములను చక్కగ పరిశోధించుకొని ఈ కామ, క్రోధ, లోభములను ముగ్గురుదొంగలను కనిపెట్టి వివేకాదుల సహాయమున వారిని దూరముగ తరుమగొట్టవలెను.

ఈశ్లోకమున “త్రివిధమ్" అను పదమును ‘నరకమ్' అనుదానికిగాక, "ఇదమ్” అను పదమునకు విశేషణముగ జెప్పి, (కామ, క్రోధ, లోభములను) మూడువిధములుగనున్న ఆసురీసంపద 'నరకద్వారము’ అనియు అర్థ ము చెప్పవచ్చును.


ప్రశ్న:- నరకమున కెన్ని ద్వారములు? అవియేవి?

ఉత్త6: - మూడు. అవి క్రమముగ (1) కామము (2) క్రోధము (3) లోభము అనునవి.

ప్రశ్న:- ఆ కామాదులవలన జీవునకు కలుగు హాని యేమి?

ఉత్తరము:- అవి యాతనిని నశింపజేయును. (ఆతని వినాశనమునకవి హేతువులైయున్నవి).

ప్రశ్న:- కాబట్టి శ్రేయము నభిలషించువాడేమి చేయవలెను?

ఉత్తరము:- ఆ మూడు దుర్గుణములను త్యజించివేయవలెను.

ప్రశ్న:- ఆసురీసంపదకు సంబంధించిన అనేక దుర్గుణములను భగవానుడు తెలిపెనుగదా! వానినన్నింటిని సంక్షేపించి మూడుగ జెప్పుము?

ఉత్తరము:- (1) కామము (2) క్రోధము (3) లోభము.

తిరుమల సర్వస్వం 214-*

 *తిరుమల సర్వస్వం 214-*

*పుష్పమండపం-2*

 


*పుష్పాలంకరణ* 


 ఉద్యానవనాల పెంపకం లోనే కాకుండా పుష్పాలంకరణలో కూడా తి.తి.దే. ఉద్యానవనశాఖ ఎంతో నైపుణ్యం సంపాదించింది. అలంకరణ అంటే కేవలం మాలలు కట్టడం, దండలు చుట్టడమే కాదు; ఒక చేయి తిరిగిన చిత్రకారుడు తన కుంచెకు రంగులద్ది కాన్వాస్ పై జీవకళ ఉట్టిపడే చిత్రాన్ని సృష్టించినట్లు రంగురంగుల పూలను ఒద్దికగా అమర్చి, ఎప్పటికప్పుడు సరికొత్త పుష్పకళాకృతులకు తి.తి.దే. ఉద్యానవన శిల్పులు రూపకల్పన చేస్తారు.

2 ఉత్సవ సమయాల్లో పుష్పాలతో స్వాగత తోరణాలు నిర్మించటం, స్వాగత వచనాలు వ్రాయడం, వివిధ దేవతామూర్తుల పౌరాణిక ఘట్టాలను రంగు రంగుల పూల అమరికతో సృష్టించడం లాంటివన్నీ తి.తి.దే. ఉద్యానవనశాఖకు కరతలామలకం. 


 బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో ఉన్న విద్యుత్ శాఖ ఉద్యానవన శాఖ; వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి, సృజనాత్మకతను రంగరించి, ఉత్సవాలకు మరింత శోభ చేకూర్చుతారు.


 *అలంకరణే కాదు – ఆరోగ్యం కూడా !* 


 ఉద్యానవనశాఖ వివిధ రకాల ఔషధ మొక్కలను కూడా పెంచుతోంది. శేషాచలశ్రేణుల్లో ఉండే విలక్షణమైన ప్రాకృతిక స్వభావం వల్ల, ప్రపంచంలో మరెక్కడా లేని అత్యంత అరుదైన వృక్షజాతు లెన్నింటినో తిరుమల కొండపై చూడవచ్చు. వేంకటాచలానికే పరిమితమైన ఎర్రకొవ్వి, రత్నపురుష, చిత్రమూలం, సారిందీ, ఈశ్వర, పల్లేరు, ఏనుగు పల్లేరు, సహదేవి, నేలగల్లిజేరు, గొబ్బి, రణభేరి, దేవదారి, కుక్కతులసి, పేలకాయలు, కుక్కనాలుక, బడిత వంటి విలక్షణమైన, ఔషధ విలువలు గలిగిన ఎన్నో వృక్షజాతులకు తిరుమలక్షేత్రం ఆలవాలం. వీటన్నింటినీ నిపుణులైన వృక్షశాస్త్రజ్ఞుల సాయంతో శ్రద్ధగా, వాటి స్వాభావిక పరిస్థితులలో సంరక్షిస్తూ; ఆయా వృక్షజాతులు అంతరించి పోకుండా తి.తి.దే. శ్రద్ధ వహిస్తోంది.


 *పుష్పదాతలకూ కొదవేం లేదు !!* 


 శ్రీవారి పుష్పకైంకర్యం చేసేందుకు ఇప్పుడు కూడా ఎందరెందరో దాతలు ముందుకు వస్తున్నారు. ఆ పుష్పప్రియుడి సేవలకు అవసరమయ్యే మొత్తం పుష్పాల్లో 60 శాతం దాతలే విరాళాల రూపంలో సమకూర్చు తున్నారు. 30 శాతం పుష్పాలను సొంతంగా సాగుచేసే ఉద్యానవనాల ద్వారా, మిగిలిన 10 శాతం పూలను కొనుగోళ్ల ద్వారా తి.తి.దే. భర్తీ చేసుకుంటుంది. బ్రహ్మోత్సవాలలో, వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు, పుష్పయాగం జరిగే రోజున పూల విరాళాలకై దాతలు పోటీపడతారు. ఆ సందర్భాలలో దాదాపుగా భూమండలంపై లభించే పుష్పజాతులన్నింటినీ తిరుమల కొండపై చూడవచ్చంటే అతిశయోక్తి కాదు. దేశం లోని కేరళ, అస్సామ్, హిమాచల్ ప్రదేశ్ వంటి సుదూరప్రాంతాల నుండే కాకుండా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్ వంటి ఖండాంతర దేశాలనుండి కూడా దిగుమతి చేసుకోబడ్డ పూలు శ్రీవారిసేవలో తరించుకుంటాయి.


 ఆ పర్వదినాల్లో తిరుమల పట్టణమంతా ముఖ్యంగా శ్రీవారి ఆలయం ప్రత్యేక పుష్పాలంకరణతో పుష్పమయంగా గోచరిస్తుంది.


 *పూదోటలకు భక్తుల పేర్లు* 


 వందల ఏళ్లక్రితం శ్రీవారికి పుష్పకైంకర్యం చేసిన భక్తుల పేర్లతో కూడా తి.తి.దే. ఉద్యానవనశాఖ అనేక పూలతోటలను పెంచుతోంది. సూరాపురం వారి తోట, పేరిందేవి తోట, హాథీరామ్ జీ తోట ఇలా తిరుమలలో ఎన్నో ప్రాంతాలు, కూడళ్ళు ఆయా పూలతోటల పేర్లతోనే పిలువబడుతున్నాయి. తిరుమలలో పెంచబడుతున్న అనేకానేక ఉద్యానవనాల్లో నారాయణగిరి ఉద్యానవనం అత్యంత సుందరంగా తీర్చిదిద్దబడింది. గోగర్భం ఆనకట్ట ప్రాంతంలోనూ, పద్మావతి వసతిగృహ ప్రాంతంలోనూ ఉన్న పూదోటలు కూడా అత్యంత ఆకర్షణీయంగా మలచబడ్డాయి. ఇప్పుడు వైకుంఠం క్యూ సముదాయం ఉన్న ప్రాంతం కూడా ఒకప్పుడు ఉద్యానవనమే! అప్పుడది చేమకూర తోటగా ఉండేది.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*



*352 వ రోజు*


కాని మరునాడు యుద్ధ భూమిలో ప్రవేశించగానే కర్ణుడితో సహా మేమంతా ఆవిషయం మరచి పోతుంటాము. తిరిగి రాత్రి సమయంలో శిబిరాలకు చేరిన తరువాతగాని మాకు గుర్తుకు వచ్చేది కాదు. అది దైవమాయ కాక మరేమిటి చెప్పు అంతే కాదు. సుయోధనుడు " కర్ణా ! అర్జునుడిని మాత్రమే చంపితే కృష్ణుడు మనలనందరిని చంపి పాండునందనుడికి పట్టం కడతాడు. ఆ శక్తితో కృష్ణుడిని చంపితే మనం ఈ ధరాతలాన్ని ఏకచ్ఛత్రంగా పాలించ వచ్చు " అనే వాడు. కర్ణుడు అలాగే చంపుతాను అనే వాడు. కాని మరునాడు అంతా మరిచిపోయే వాడు అదేమి చిత్రమో. మరొక విషయము వినండి. ఘటోత్కచుడి మరణసమయాన శ్రీకృష్ణుడు రథము మీద నాట్యం చేసాడు కదా ! పాండవ శిబిరానికి వెళ్ళి చాటుగా ఉండి వారి మాటలు విన్నాను. కృష్ణుడు ప్రవర్తనకు కారణమేమిటని అర్జునుడు అడిగిన విషయం పక్కనే ఉన్న సాత్యకి విని " అన్నయ్యా ! కర్ణుడు ఇంత కాలము మహా శక్తిని ప్రయోగించి అర్జునుడిని ఎందుకు చంప లేదు " అన్నాడు. కృష్ణుడు " సాత్యకి ! సుయోధనాదులు ప్రతి రోజు ఆ శక్తి ఆయుధంతో అర్జునుడిని చంపమని చెప్తుండే వారు. నేను కర్ణుడు యుద్ధరంగమున ప్రవేశించగానే నా మాయలో పడవేసి అతడికి ఆసక్తి ఆయుధం గుర్తుకు రాకుండా చేసేవాడిని. ఆ కారణంగా కర్ణుడుఅర్జునుడి మీద ఆ శక్తి ప్రయోగించ లేక పోయాడు. సాత్యకీ ! నీ కంటే, ధృష్టద్యుమ్నుడి కంటే మిగిలిన పాడుసుతుల కంటే నాకు అర్జునుడంటే వల్లమాలిన ప్రేమ. అర్జునుడు నా బహిర్ప్రాణం ఇంత కాలం కర్ణుడి వద్ద ఉన్న శక్తి కారణంగా అర్జునుడికి ప్రమాదం పొంచి ఉన్నదని భయపడుతునే ఉన్నాను. నిద్రలేని రాత్రులు గడిపాను. ఇక నేను సుఖంగా నిద్రిస్తాను " అన్నాడని సంజయుడు ధృతరాష్ట్రునుకి చెప్పాడు. ధృతరాష్ట్రుడు " సంజయా ! దురదృష్టం సుయోధనుడిని వెన్నంటి ఉన్నప్పుడు మనమేమి చేయగలము " అన్నాడు.

*ఘటోత్కచుని మరణానికి ధర్మజుడు విలపించుట*

ఘటోత్కచుడి మరణానికి దుఃఖంతో ధర్మరాజు రథము మీద కూలబడి రోదిస్తున్నాడు. కృష్ణుడు దగ్గరకు వెళ్ళి " ధర్మనందనా! ఏమిటీ వెర్రి. యుద్ధమున వీరులు మరణించరా ! అందుకు ఇంత చింతించ తగునా ! నీవిలా చింతించిన సైన్యమును నడుపగల వాడేవడు. నీ సోదరులను ఓదార్చగలవారెవరు లే వారిని ఓదార్చి యుద్ధసన్నద్ధులను చేయి " అన్నాడు. నీకు తెలియనిది ఏముంది ఘటోత్కచుడికి మేమంటే ఎంత ప్రేమాభిమానాలున్నాయో మమ్ము ఎంత గౌరవిస్తాడో. అరణ్యవాస సమయంలో మాకు ఎంత సహకరించాడు. నాకు ఘటోత్కచుని మీద సహదేవునికన్నా ప్రేమ ఎక్కువ. అటువంటి ఘటోత్కచుడు మరణుస్తే దుఃఖించక ఎలా ఉండగలను " అన్నాడు. అంతలోనే ఉగ్రుడై కృష్ణా ! దీనికంతటికి కారణం కర్ణుడు నాడు అభిమన్యుని విల్లు విరిచి అతడి మరణానికి కారణం అయ్యాడు. నేడు ఘటోత్కచుడిని స్వయంగా చంపాడు. కర్ణుడి మీద ప్రతీకారం చేయాలి. కర్ణుడికి సాయం చేసిన వాడు ద్రోణుడు నేను కర్ణుడిని చంపుతాను భీముడు ద్రోణుడిని చంపుతాడు " అంటూ తన రథమును వేగంగా ముందుకు నడిపాడు. కృష్ణుడు కలవరపడి అర్జునా ! అటు చూడు మీ అన్నయ్య కర్ణుడి మీద యుద్ధానికి పోతున్నాడు అతడిని అనుసరించు అన్నాడు. అలా వేగంగా పోతున్న ధర్మరాజు ఎదుటికి వ్యాసమహర్షి వచ్చాడు. ధర్మరాజు వ్యాసుడికి నమస్కరించాడు. వ్యాసుడు " ధర్మనందనా ! కర్ణుడు శక్తి ఆయుధాన్ని అర్జునుడిని చంపడానికి ఉంచాడు. అది ఇప్పుడు ఘటోత్కచుడి మీద ఉపయోగించబడింది లేకున్న అర్జునుడిని చంపి ఉండే వాడు. అది జరిగి ఉంటే నీ దుఃఖం వర్ణించనలవి కాదు. ఇప్పుడు నీవు కొద్ది ధుఃఖంతో బయటపడటం మంచికే జరిగింది. కనుక అకారణంగా కోపం తెచ్చుకొనక వివేకంగా ఆలోచించి నీ వారినందరిని కలుపుకొని యుద్ధం కొనసాగించు. ఇకొంక విషయం చెప్తాను. నేటికి సరిగా అయిదవ నాటికి నిన్ను విజయలక్ష్మి వరిస్తుణంది. దీనిలో సందేహం లేదు " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

                    

*శ్లో* 𝕝𝕝 *తావత్ ప్రీతిర్భవేల్లోకే*

           *యావద్దానం ప్రదీయతే।*

           *వత్సః క్షీరక్షయం దృష్ట్వా*

           *పరిత్యజతి మాతరమ్॥*   


                        

*భావం* 𝕝𝕝  *ఈ లోకంలో దానం, కానుకలు ఇచ్చినంత కాలమే, నీతో అవసరం ఉన్నంత కాలమే నీపై ప్రేమ నిలుస్తుంది., నీవు ఇవ్వడం ఆపేసిన, నీతో పని లేకపోయినా నీ విలువ తగ్గిపోతుంది....పొదుగులో పాలు లేకపోతే దూడ తల్లిని కూడా వదిలివేస్తుంది.....*


✍️💐🌹🌸🙏

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం

జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


యథైధాంసి సమిద్ధో௨గ్నిః భస్మసాత్కురుతే௨ర్జున 

జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా (37)


న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే 

తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి (38)


అర్జునా... బాగా మండుతున్న అగ్ని కట్టెలను ఎలా భస్మం చేస్తుందో అలాగే జ్ఞానమనే అగ్ని సర్వకర్మలనూ భస్మం చేస్తుంది. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సరితూగే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. కర్మయోగసిద్ధి పొందినవాడికి కాలక్రమేణా అలాంటి జ్ఞానం ఆత్మలోనే కలుగుతుంది.

వరూధిని ఏకాదశి

 *🙏\|/🙏 ఈ రోజు గురువారం వరూధిని ఏకాదశి 🙏\|/🙏* 

*🙏🪷\|/🪷🙏🌹\|/🌹🙏🪷\|/🪷🙏* 


🙏🌹సంవత్సరంలో ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి. చైత్రమాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరూధినీ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని సమస్త పాపాలను పోగొట్టే ఏకాదశిగా భావిస్తారు. ఈ రోజున విష్ణువు శ్రీకృష్ణుని మధుసూదన రూపాన్ని పూజిస్తారు. ఈ రోజున విష్ణువు వరాహ అవతారాన్ని కూడా పూజిస్తారు.


🙏🌹వరూధిని ఏకాదశి రోజున ఈ పదార్థాలు దానం చేస్తే ధనయోగం,లక్ష్మీదేవీ కృప లభించడం ఖాయం.


🙏🌹వరూధినీ ఏకాదశి మహిమను గ్రంథాలలో వర్ణించారు. వరుథిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల, విష్ణువు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది.


🙏🌹వరూథిని ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే పుత్రిక దానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. గంగానదిలో స్నానం చేయడం వల్ల మనిషికి ఎంత పుణ్యం లభిస్తుందో, వరూధినీ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల అంత పుణ్యం లభిస్తుందని చెబుతారు.


🙏🌹వరూధినీ ఏకాదశి రోజున కొన్ని వస్తువులను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున వీటిని దానం చేయడం వల్ల విష్ణువుతో పాటు పూర్వీకుల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ రోజున ఏయే వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం.


*🙏⚜️🙏వరూధినీ ఏకాదశి నాడు ఈ దానం చేయండి🙏⚜️🙏* 


🙏🌹వరూధినీ ఏకాదశి పూజానంతరం బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారి వారి శక్తికి తగ్గట్టుగా కానుకలు, దక్షిణలు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఈ రోజు నువ్వులను దానం చేయడం చాలా శ్రేయస్కరం.


🙏🌹వరూధినీ ఏకాదశి రోజున నువ్వులు దానం చేయడం బంగారాన్ని దానం చేయడం కంటే పుణ్యప్రదంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజు నువ్వులు, ధాన్యాలు నీరు దానం చేయడం చాలా ముఖ్యమైనది.


🙏🌹 బంగారం, వెండి, ఏనుగులు, గుర్రాలు దానం కంటే వరుథిని ఏకాదశి రోజున ఈ మూడు వస్తువులను దానం చేయడం చాలా ముఖ్యమైనది.


🙏🌹 ఆహారం నీరు దానం చేయడం ద్వారా మానవులు, దేవతలు పూర్వీకులు అందరూ సంతృప్తిని పొందుతారు. గ్రంథాలలో, ఈ మూడు వస్తువులను దానం చేయడం ఆడపిల్లల దానంతో సమానంగా పరిగణించబడుతుంది.

⚜ శ్రీ దేవాస్ టేక్రి

 🕉 మన గుడి : నెం 1090


⚜ మధ్యప్రదేశ్ : దేవాస్ 


⚜ శ్రీ దేవాస్ టేక్రి



💠 మధ్యప్రదేశ్‌లోని ఈ పవిత్ర క్షేత్రం కేవలం దేవాలయం కాదు; ఇది చరిత్ర మరియు ఆధ్యాత్మికతతో నిండిన గౌరవనీయమైన గమ్యస్థానం.  


💠 దేవాస్ దేవి చాముండా ఆలయం మరియు 300 అడుగుల (91 మీ) కొండపై ఉన్న దేవి తులజా భవానీ ఆలయానికి ప్రసిద్ధి చెందింది.


💠 కాళికా మాతా ఆలయం , హనుమాన్ ఆలయం, భైరవ్ బాబా ఆలయం, ఖో ఖో మాతా ఆలయం మరియు అన్నపూర్ణ మాతా ఆలయంతో సహా అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి.


💠 'టేక్రి' అనే పదానికి స్థానిక భాషలో 'కొండ' అని అర్థం. 

టేక్రిలో జరుపుకునే ప్రధాన పండుగ నవరాత్రి, ఈ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు మాత ఆశీర్వాదం పొందడానికి వస్తారు.



🔆 స్థల పురాణం 


💠 దేవాస్ మాత మందిర్ శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది (స్థానిక విశ్వాసాలు).  

దేశంలోని ఇతర శక్తిపీఠాలపై తల్లి శరీరంలోని భాగాలు పడ్డాయని చెబుతారు, దేవాస్ టేక్రి అనేది ఒక రక్త పీఠం ( శక్తి పీఠం ), ఇక్కడ మాతా సతి రక్తం కొన్ని చుక్కలు పడ్డాయి అని పురాణాల ప్రకారం .

దాని కారణంగా తల్లి చాముండా దేవి (లేదా రక్త చాముండా) ఇక్కడ కనిపించింది.  


💠 టేక్రిలో ఉన్న తుల్జా భవాని ఆలయాన్ని మరాఠీ రాజ కుటుంబం స్థాపించింది మరియు వారు మాతను తమ కులదేవిగా ఆరాధించారు. తల్లులిద్దరూ నిజమైన సోదరీమణులు బడి మాత (పెద్దది తుల్జా భవాని) చోటి మాత (చాముండ  చిన్నది) 


💠 ఉజ్జయిని చక్రవర్తి అయిన విక్రమాదిత్యుడు ద్వాపర యుగంలో మూసివేయబడిన సొరంగం ద్వారా ఈ ఆలయాన్ని సందర్శించేవాడు.


💠 శ్రీకృష్ణుడు-బలరాముడు కూడా ఆశ్రమానికి కలపను సేకరించేందుకు ఇక్కడి దేవాస్‌కు వచ్చేవారు.  

ఈ ప్రాంతం ఒకప్పుడు చందనం చెట్ల అరణ్యంగా ఉండేది.


💠 ఈ ఆలయంలో విక్రమాదిత్య సోదరుడు భర్తారి తపస్సు చేసినట్లు చెబుతారు.  

ఈ దేవాలయం పురాతన కాలం నాటిదని ఆలయం గురించి చెబుతారు. కానీ ఆలయ ప్రాచీనతకు సంబంధించిన ఆధారాలు లేవు.


💠 ఈ ఆలయం నిజంగా ప్రత్యేకమైనది ఏమిటంటే, దాని పవిత్రమైన ఆవరణలో ఒకటి కాదు, ఇద్దరు శక్తివంతమైన దేవతలు ఉండటం.  

ఇక్కడ, తల్లి తుల్జా భవాని మరియు తల్లి చాముండా దేవి యొక్క దైవిక సన్నిధిని మనం కనుగొంటాము, ఇద్దరు తమ స్వంత ఆధ్యాత్మిక శక్తిని మరియు ఆశీర్వాదాలను ప్రసరింపజేస్తున్నారు.


💠 కొన్ని వర్గాలు ఇది 9వ శతాబ్దానికి చెందినదని పేర్కొంటుండగా, మరికొన్ని 1100–1200 సంవత్సరాల నాటిదని సూచిస్తున్నాయి. 

అదనంగా, కొందరు ఇది పురాతన కాలం నుండి ఉద్భవించిందని, దీనిని "అనాది కాల్" అని పిలుస్తారు అని నమ్ముతారు.


🔆 ఇద్దరు సోదరీమణుల కథ


💠 స్థానిక నమ్మకాల ప్రకారం, ఈ కొండపై మాతృ దేవత యొక్క రెండు రూపాలు మేల్కొన్న స్థితిలో ఉన్నాయి. తుల్జా భవాని మరియు చాముండా మాత సోదరీమణులు అని నమ్ముతారు, తుల్జా భవాని అక్క మరియు చాముండా దేవి చిన్నది. వారు ఈ కొండపై కలిసి నివసించేవారు కానీ విభేదాలు వచ్చాయి, దీని ఫలితంగా వారు ఒకరినొకరు దూరం చేసుకున్నారు. 


💠 కోపంతో, వారు తమ స్థలాన్ని విడిచిపెట్టడం ప్రారంభించారు. 

తుల్జా భవాని పాతాళ లోకంలో అదృశ్యం కావడం ప్రారంభించింది, చాముండా దేవి కొండ దిగడం ప్రారంభించింది.


💠 హనుమంతుడు మరియు భైరవ బాబా జోక్యం చేసుకుని, దేవతలను శాంతించి ఉండమని అభ్యర్థించారు. అయితే, ఈ సమయానికి, తుల్జా భవాని శరీరంలోని కొంత భాగం అప్పటికే పాతాళంలోకి మునిగిపోయింది. 

ఆమె కొండపై అదే స్థితిలో ఉండిపోయింది, దిగుతున్న చాముండా దేవి ప్రస్తుత స్థితిలో ఆగిపోయింది. అందుకే తుల్జా భవాని దక్షిణం వైపు మరియు చాముండా ఉత్తరం వైపు ఉంటుంది. 


💠 టేక్రీని సందర్శించే యాత్రికులు పరిక్రమ చేస్తారు, తుల్జా భవానితో ప్రారంభించి చాముండా దేవత దర్శనంతో ముగుస్తుంది.

తుల్జా భవానీ దేవిని బడి మాత (పెద్ద తల్లి) అని, చాముండా దేవిని చోటి మాత (చిన్న తల్లి) అని పిలవడానికి ఇదే కారణం. 


🔆 ఉజ్జయిని గుహ


💠 దేవాస్‌లోని మాతా టేక్రిని ఉజ్జయినికి అనుసంధానిస్తూ ఒక సొరంగం నిర్మించబడిందని చెబుతారు . ఈ సొరంగం 45 కిలోమీటర్ల పొడవు ఉంది మరియు దీనిని రాజు భర్తారి రహస్య మార్గంగా ఉపయోగించారు . ఇది దేవాస్ నుండి ఉజ్జయినిలోని భర్తారి గుహకు దారితీస్తుంది, దీని ద్వారా రాజు మాత నుండి ఆశీర్వాదం పొందడానికి ప్రయాణించేవాడు. 


💠 పండుగలు : ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగలు నవరాత్రి. 

 చైత్ర / వసంతిక మరియు అశ్వినీ / శారదయ నవరాత్రి రెండింటిలోనూ , లక్షలాది మంది యాత్రికులు మాత ఆశీర్వాదం కోసం టేక్రీని సందర్శిస్తారు. 

కొంతమంది తమ కోరికలు నెరవేరితే, వారు మోకాళ్లపై మాత ఆలయానికి ఎక్కి లేదా ఆలయం వరకు పొర్లు దండాలు పెడుతూ టేక్రీని సందర్శిస్తారని ప్రార్థిస్తారు. 


💠 నవరాత్రి పండుగ సమయంలో, వందలాది మంది భక్తులు ఇండోర్ లేదా ఇతర ప్రాంతాల నుండి దేవాస్‌కు చెప్పులు లేకుండా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి వెళతారు.


💠 దేవాస్ ఇండోర్ నుండి 35 కి.మీ & ఉజ్జయిని నుండి 30 కి.మీ దూరం


Rachana

©️ Santosh Kumar

గీతా మకరందము

 17-01-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయవిభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


శ్రీ భగవద్గీత 

అథ సప్తదశోఽధ్యాయః 

పదునేడవ అధ్యాయము 

శ్రద్ధాత్రయ విభాగయోగః

శ్రద్ధాత్రయ విభాగయోగము 


అర్జున ఉవాచ :-


యే శాస్త్రవిధిముత్సృజ్య 

యజన్తే శ్రద్ధయాఽన్వితాః | 

తేషాం నిష్ఠా తు కా కృష్ణ 

సత్త్వమాహో రజస్తమః || 


తాత్పర్యము:- అర్జునుడు అడిగెను - ఓ కృష్ణా! ఎవరు శాస్త్రోక్తవిధానమును విడిచిపెట్టి శ్రద్ధతో గూడుకొని పూజాదుల నొనర్తురో వారియొక్క స్థితి సాత్త్వికమా, లేక రాజసమా, లేక తామసమా ? ఏది యైయున్నది?


వ్యాఖ్య:- క్రిందటి అధ్యాయముయొక్క చివర శాస్త్రవిధి నుల్లంఘించి స్వేచ్ఛాచారులై ప్రవర్తించువారికి మోక్షసిద్ధి కలుగదని చెప్పబడినది. అయితే కొందఱు శాస్త్రనిర్దిష్టములగు విధినిషేధములను శ్రమయనితలంచియో, లేక, ఔదాసీన్యము వహించియో, వానినిగూర్చి తెలిసికొనుటకై యత్నింపక, శ్రద్ధతోగూడుకొనినవారై, ఆస్తికబుద్ధి గలిగి దేవతాదులను అర్చించుచుదురు గదా! అట్టివారియొక్క ప్రవృత్తి యెట్టిది? అది సాత్వికమా,రాజసమా, తామసమా అని అర్జునుని ప్రశ్న.

తిరుమల సర్వస్వం -218*

 *తిరుమల సర్వస్వం -218*

 *శ్రీవెంకటేశ్వర వస్తుప్రదర్శనశాల (మ్యూజియం)-3*


3  బ్రహ్మోత్సవాల్లో భక్తుల సందర్శనార్థం అన్నమయ్య విరచిత తామ్రపత్రాల ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అప్పుడు మాత్రమే రాగిరేకుల అసలు ప్రతులను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో వాటి నకలు ప్రతులను మాత్రమే సంగ్రహాలయంలో ప్రదర్శిస్తారు. అన్నమయ్య, వారి కుమారుడు, మనుమడు రచించిన 32 వేల కీర్తనలలో కొన్నింటినైనా ఈ రాగిరేకుల రూపంలో దక్కించుకో గలగటం తెలుగువారి పుణ్యఫలమనే చెప్పుకోవాలి.


 మూడవ అంతస్తు లోని చరిత్ర విభాగంలో, ఆలయచరిత్రను దృశ్యరూపంలో వివరించే అరుదైన చిత్రాలు ప్రదర్శించ బడుతున్నాయి. వీటిలో ప్రముఖ చిత్రకారుడు పిలకా లక్ష్మీనరసింహం గారు చిత్రించిన దశావతార చిత్రమాలిక ప్రముఖమైనది. ఈ విభాగంలోనే ప్రస్తుతం వాడుకలో లేని శ్రీవారి అమూల్యమైన ఆభరణాలను కూడా భద్రపరిచారు.


 కాంస్యవిభాగంలో శతాబ్దాల క్రిందట పోతపోసిన కంచు విగ్రహాలు, వక్కలను కత్తిరించే కత్తెర వంటి సాధనాలు (నట్ క్రాకర్స్), కంచుగంటలు, లోహపు పాత్రలు ఉన్నాయి.


 తరతరాల ఆలయ చరిత్రను ఆసాంతం వర్ణించే వెయ్యికి పైగా శిలాశాసనాలను మ్యూజియం బయట ఉన్న గ్యాలరీలో ప్రదర్శిస్తున్నారు. ఈ శాసనాల ద్వారానే ఆలయానికి చెందిన చారిత్రిక విశేషాలు, ఆయా పాలకులు ఆలయాభివృద్ధికి చేసిన కృషి, శ్రీవారికిచ్చిన కానుకల వివరాలు వెలుగులోకి వచ్చాయి.


 శ్రీవారిసేవలో తరించిన 12 మంది ఆళ్వారుల లోహ ప్రతిమలు సంగ్రహాలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ మూర్తుల ముఖారవిందాలలో ఉట్టిపడే జీవకళ అనన్య సామాన్యమైనది. 


 [ఈ పన్నెండు మంది ఆళ్వారుల గురించి మరో ప్రకరణంలో విస్తారంగా తెలుసుకుందాం!]


 ఎందరెందరో సాహిత్యకారులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, ఆలయసిబ్బంది యొక్క సమిష్టికృషితో అత్యద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ సంగ్రహాలయం, తిరుమల చరిత్రను భావితరాల కందించే విశేషమైన కృషిలో ఒక మైలురాయి. మొత్తం పది విభాగాలలో ఏర్పాటు చేయబడ్డ *'శ్రీవెంకటేశ్వర వస్తుప్రదర్శనశాల'* తరతరాల తిరుమల చరిత్రకు సాక్షీభూతంగా నిలిచి, తిరుమలలో దర్శించుకోదగ్గ ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటిగా రాణిస్తోంది. శ్రీవారి భక్తులు, చారిత్రక అంశాలపై ఆసక్తి కలవారు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, అందరూ తప్పనిసరిగా చూసి తీరవలసినదీ ప్రదర్శనశాల.


 తిరుపతి నగరంలో కూడా ఇలాంటిదే ఒక అద్భుతమైన ప్రదర్శనశాలను 1983వ సంవత్సరంలో, గోవిందరాజస్వామి ఆలయానికి ఉత్తరమాడవీధిలో ఉన్న ఓ పురాతన మండపంలో తి.తి.దే. ఏర్పాటు చేసింది. దీనిలో వివిధ ఆలయాల ఆకృతులు, వాటి కొలతలు, నిర్మాణ శైలులు, పూజావిధానాలు, పూజాసామగ్రి, మతపరమైన సాంప్రదాయాలు, ఆలయకళలు, ఆలయ నిర్వహణకు సంబంధించిన వివిధ వృత్తులు మొదలగు వాటిని ప్రదర్శిస్తున్నారు. తిరుపతి నగరంలో తప్పనిసరిగా చూసి తీరవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ముందు ముందు తెలుసుకుందాం! 


[ రేపటి భాగంలో ...*సామాజిక సేవా కార్యక్రమాలు* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*356 వ రోజు*


*ద్రోణుడిలో పరివర్తన*


ద్రోణుడు అలాగే రథము మీద వాలి పోయాడు. ద్రోణునిలో పరివర్తన మొదలైంది. తాను పాండవుల చేసిన పాపం తలచుకుని కుమిలి పోయాడు. ఋషులు మాటలు చెవుల్లో మారు మోగుతున్నాయి. తాను ఎంతో మంది అమాయకులైన సైనికులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. తన పాపానికి నిష్కృతి లేదు. ఇలా అనుకుని పైకి చూడగానే ఎదురుగా ధృష్టద్యుమ్నుడు అవకాశం కొరకు ఎదురు చూస్తుండటం చూసి అతడితో యుద్ధము చేయాలను ఉన్నా చేతులు రాలేదు. ధనుర్భాణాలు చేతి నుండి జారాయి. అతడిలో ఉన్న యుద్ధనిష్ఠ, శౌర్యము, గర్వము నశించాయి. తన కుమారుడు మరణించాడు అన్న దుఃఖం అతడిని కుంగదీసింది. అతడి అవయవములు ముడుచుకు పోయి అలాగే రథము మీద కూర్చుండి పోయాడు. ద్రోణవధ కొరకు అగ్ని నుండి జన్మించిన ధృష్టద్యుమ్నునికి ద్రోణుడిని వధించాలి అన్న కోరిక బలీయంగా కలిగి అతడి మీద శరవర్షం కురిపించాడు. ద్రోణుడికి యుద్ధం చేయాలని ఉన్నా దివ్యాస్త్రములు స్పురణకు రాక మామూలు బాణాలతో ధృష్టద్యుమ్నుడి బాణాలు ఖండిస్తూ ధృష్టద్యుమ్నుడి రథమును, ధ్వజమును ఖండించి, సారథిని చంపాడు. ధృష్టద్యుమ్నుడు రథము నుండి దిగి గదను తీసుకున్నాడు. ద్రోణుడు ఆ గదను తన బాణములతో ఖండించాడు. ధృష్టద్యుమ్నుడు కత్తి డాలు తీసుకుని ద్రోణుని మీదకు ఉరికి అతడి హయములను, సారథిని చంపాడు ద్రోణుడు తన బాణములతో ధృష్టద్యుమ్నుడి కత్తిని ఖండించాడు. ఆ సమయంలో సాత్యకికర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మలతో యుద్ధము చేస్తున్నాడు. దూరం నుండి ఇది గమనించి పది బాణము ద్రోణుడి మీద వేసాడు. భీముడు తన రథము మీద వచ్చి ధృష్టద్యుమ్నుడిని తన రథము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. ద్రోణుడు అతడిని పోనేలే అని వెంబడించక వదిలాడు.


*ద్రోణుడు ప్రశాంతిని పొందుట*


ఇప్పుడు ద్రోణుడి మనస్సు ప్రశాంతమైంది. తన రథము మీద కూర్చుని యోగ నిమగ్నుడయ్యాడు. మనసులో శాంతి పొంది చుట్టూ చూసాడు. " ఓ కర్ణా! ఓ కృతవర్మా ! ఓ సుయోధనా ! మీరు నన్ను యుద్ధం చేయడం లేదని ఎత్తి పొడుస్తూనే ఉన్నారు. అయినా నేను నా చేతనైనంత యుద్ధం చేసాను. ఇంక నిశ్చింతగా పైలోకాలు చేరుకుంటాను. నేను నా ధనుర్భాణాలు విడిచి అస్త్రసన్యాసం చేస్తున్నాను. మీరంతా ఇకనైనా తెలివిగా ప్రవర్తించండి " అని ఎలుగెత్తి అరిచాడు. ద్రోణుడు తన ధనుర్భాణాలు రథము మీద వదిలి తేజోమయమైన ఆత్మతో వెలుగొందు తున్నాడు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు కత్తి తీసుకుని ద్రోణుడి వైపు నడిచాడు. అది చూసి ఉభయసైన్యాలు హాహాకారాలు చేసాయి. కాని అప్పటికే ద్రోణుడి ప్రాణాలు అనంతవాయువులలో కలిసి పోయాయి. అతడి ఆత్మ జ్యోతి రూపంలో పైకెగసి పరమాత్మను చేరుకుంది. అతడి ఆత్మ తేజో రూపంతో పకి వెళ్ళడం నేను, కృపాచార్యుడు, కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు మాత్రమే చూసాము. మిగిలిన వారికి అది గోచరించ లేదు. ఇంతలో ధృష్టద్యుమ్నుడు కత్తి తీసుకుని ద్రోణుని రథము ఎక్కి అతడి జుట్టు పట్టుకుని మెడ నరకడానికి కత్తి పైకి ఎత్తాడు. వద్దు, వద్దు అని అర్జునుడు అరుస్తున్నా, అది ధర్మవిరుద్ధమని ధర్మజుడు ఎంత అరచినా వినక అతడి తలను నరికి మొండెమును నుండి తలను వేరుచేసి నేల మీదికి వేసాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

మహాభారత సారాంశం*

 244e5.

🍀🌺🍀 🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*లక్షల శ్లోకాలు గల..*

           *మహాభారత సారాంశం*

                          *పది వాక్యాలలో..*

                  ➖➖➖✍️


```

1. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి, మీ ఆధీనంలోంచి దూరం అవుతారు... వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు.```

*ఉదా: ’కౌరవులు.’*```



2. నువ్వు ఎంతటి బలవంతుడివి అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ... ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ... వాటిని అధర్మం కోసం వినియోగిస్తే.. అవి నిరుపయోగం అవుతాయి. నువ్వు కూడ నాశనం అవుతావు.```

*ఉదా: కర్ణుడు* ```



3. యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే "వినాశం" జరుగుతుంది.```

*ఉదా: అశ్వత్థామ.*```



4. పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది.```

*ఉదా: ”భీష్ముడు."*```



5. సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము “దురహంకారం” తో “అధర్మంగా” వినియోగిస్తే తనకే కాదు, తన వారందరికి “వినాశం” జరుగుతుంది.

```*ఉదా: “దుర్యోధనుడు.”*```



6. స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు, గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా “తనవారి పట్ల వల్లమాలిన అభిమానం” గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది.```

*ఉదా: ధృతరాష్ట్రుడు* ```



7. శక్తి యుక్తులకి, తెలివితేటలకి “ధర్మం” తోడైతే “విజయం” తప్పక లభిస్తుంది.```

*ఉదా: అర్జునుడు.*```



8. ఒక మంచి శత్రువుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం.```

*ఉదా: శకుని.*```



9. నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు, నీ వాళ్ళకి హానిచేయదు.```

*ఉదా: యుధిష్ఠిరుడు*```



10. అందరి బంధువైనా... అన్ని తెలిసినా, చివరకి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్యధర్మం కూడా.```

*ఉదా: శ్రీకృష్ణుడు*```✍️

  . *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

సాధకుడు- మనస్సు

 సాధకుడు- మనస్సు  

అటుపిమ్మట సాధకుని ద్రుష్టి మనస్సు మీద పెట్టాలి. నిజానికి మనస్సు అనేది ఒక కోతి లాంటిది, ఏ రకంగా అయితే ఒక కోతి ఒక కొమ్మ మీదినుంచి ఇంకొక కొమ్మమీదికి నిర్విరామంగా ఉరుకుతూ, గెంతుతూ నిలకడ లేకుండా ఉంటుందో అదే విధంగా మనస్సు అనుక్షణం వివిధ విషయాలమీద మళ్ళుతూ ఉంటుంది. ఒక క్షణం నీవు చూసిన సినిమా గుర్తుకు వస్తే మరుక్షణం నీకు జరిగిన సంతోషకరమైన లేక దుఃఖకరమైన విషయం. ఒక నిముషం మీ ఊరులో ఉంటే మరుక్షణం ఇంకొక ఊరికి ఇలా పరి పరి విధాలుగా మనస్సు పయనిస్తుంది. అన్నిటికంటే వేగంగా పయనించేది మనస్సు అనేకదా మేధావులు చెపుతారు. యదార్ధానికి సాధకుడు తన శరీరాన్ని నియంత్రించుకోవటంలో ఆంతర్యం మనస్సుని నియంత్రించుకోవటానికి మాత్రమే కదా. 

మనస్సును నియంత్రించుకోవడం: 

ఒక గుర్రం వున్నదనుకోండి దాని రౌతు  చిన్న చిన్న రేకు ఫలకాలను దానికంటికి ప్రక్కగా అమరుస్తారు  దానివలన గుర్రం చూపు ప్రక్కకు మళ్లకుండా కేవలం వీడిమీదనే ఉంటుంది.  కాబట్టి గుర్రం ముందుకు మాత్రమే పరిగెడుతుంది.  అలా గుర్రం నడిపే రౌతు గుఱ్ఱాన్ని లొంగదీసుకుంటాడు. మన మనస్సు కూడా గుఱ్ఱం లాగా పరి పరి విషయాలమీదకు మళ్లకుండా కేవలం భగవంతుని మీదకు మళ్ళటానికి మనం ఏదో ఒక ఫలకాన్ని మనస్సుకు అడ్డంగా పెట్టుకోవాలి.  అది ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సాధకుడు ఏర్పాటు రకంగా వారి ఇష్టానుసారంగా  ఏర్పాటు చేసుకోవాలి.  కొంతమంది నామ స్మరణను ఎంచుకొని భగవన్నామాన్ని సదా ఉచ్చరిస్తుంటారు.   ఇంకొకరు భగంతుని భజిస్తూ వుంటారు, కొంతమంది సదా నామ జపం  చేస్తూవుంటారు. (ఉదాహరణకు ఇస్కోన్ సమస్తలోని సాధకులు) కొందరు నామాన్ని లికిస్తూవుంటారు, రామకోటి, శివకోటి వ్రాయటం మొదలగునవి. ఇలా ఒక్కొక్క సాధకుడు ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంటారు. ఇందులో ఇది మంచిది ఇది కాదు అని అనటానికి లేదు. విధానం ఏదైనాకూడా మనకు కావలసింది మనస్సును నియంత్రించుకోవడం మాత్రమే. మన ప్రయాణం అనాయాసంగా జరగాలి అంటే అది బస్సు అయితే నేమి రైలు అయితేనేమి గమ్యాన్ని చేరటం ముఖ్యం కదా. 

మనం తరచుగా చూస్తూవుంటాము చాలామంది పైన  పేర్కొన్నఏదో ఒక విధానాన్ని అనుసరించి అదే జీవిత లక్ష్యంగా వారి జీవనాన్ని కొనసాగిస్తారు.  కానీ మిత్రమా ఆలా ఎప్పటికి అనుకోకూడదు. ఈ పద్ధతులు కేవలం మనస్సును నియంత్రించుకోవటానికి మాత్రమే ఉపకరిస్తాయి కానీ అంతకంటే వేరొకటి కాదు నీ లక్ష్యం మోక్ష సాధన మాత్రమే. మోక్షయానికి ఈ పద్ధతులు ప్రారంభ శిక్షణగా మాత్రమే ఉపకరిస్తాయి కానీ మోక్షసిద్ది మాత్రము లభించదు. 

మనం పూర్తిగా సాధకులు ఆచరించే భక్తి మార్గాలు మోక్షాన్ని చేరుకోలేవు అని కూడా అనలేముమనం మన చరిత్రను పరిశీలిస్తే భక్తి మార్గంతో మోక్షాన్ని చేరుకున్న మహా భక్తుల ఉదంతాలు మనకు తెలుసుముందుగా భక్తి మార్గాలు ఏమిటో పరిశీలిద్దాంశ్రవణంకీర్తనంవిష్ణోః స్మరణంపాదసేవనంఅర్చనంవందనందాస్యంసఖ్యంఆత్మ నివేదనంతన్మయాసక్తిపరమ విరహాసక్తి   అని పదకొండు భక్తి సాధనలున్నాయి.

          శ్రవణానికి పరీక్షిత్‌ మహారాజుకీర్తనము వలన తుంబురుడువిష్ణుస్మరణ వలన నారదుడుపాదసేవ వలన  శ్రీ మహాలక్ష్మిఅర్చన వలన పృథు చక్రవర్తివందనము వలన అక్రూరుడుదాస్యము వలన హనుమంతుడుసఖ్యము వలన  అర్జునుడుఆత్మ నివేదన వలన బలిచక్రవర్తి ముక్తి పొందారు. ఇక పదవది తన్మయాసక్తి. భక్తితో పారవశ్యము చెంది తన్మయమైపోయాక నీవే ఆ కృష్ణ పరమాత్మగా మారి చైతన్య ప్రభువు ఎలా గంతులేస్తున్నాడోఎలా తనకు తెలియకుండానే గీతాలు పాడుతున్నాడోకవిత్వము రాకుండానే కవిత్వం చెప్తున్నాడో అది తన్మయాసక్తి. పరమ విరాహసక్తి అంటేభగవంతుని విడిచి ఒక్క క్షణము కూడా వుండలేను. ప్రియుని విడిచి వుండలేను అని ప్రియురాలు ఎలాగైతే విరహ వేదన అనుభవిస్తుందోఅలాగే. 

కాబట్టి భక్తి మార్గం కూడా ఉపయుక్తమైనదే అయితే మరి భక్తిమార్గాన్నే అనుసరించవచ్చుకదా.  జ్ఞ్యాన మార్గం ఎందుకు ఆచరించాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. మనం సూక్షమంగా పరిశీలిస్తే భక్తి మార్గం వేరు జ్ఞాన మార్గం వేరుగా గోచరించవు. అటువంటప్పుడు రెండు మార్గాలు ఎందుకు వున్నాయి అంటే.  ముందుగా ఒక సాధకుడు భక్తి మార్గాన్ని అనుసరించి సాధన కొంత ముందుకు సాగిన తరువాత తనకు తానుగా జీవాత్మ వేరు పరమాత్మా వేరు కాదనే భావనలోకి  వస్తాడు. అప్పుడు తానూ ఈ చరచరా జగత్తుకు కారణభూతుడైన సర్వేశ్వరునిలో అంతర్లీనంగా వున్నాను అంటే 

అహం బ్రహ్మాస్మి 

అనే భావనలోకి వస్తాడు.  ఇలా తెలుసుకోవటమే జ్ఞ్యానం తరువాత తనకు తెలియకుండానే భ్రహ్మ జ్ఞ్యాన పిపాసకుడు అయి తానె బ్రహ్మ అవుతాడు. 

"బ్రహ్మ విత్ బ్రహ్మయేవ భవత్" 

ధ్యానం సద్గుణోపానా లేక నిర్గుణోపాసనా 

ధ్యానం సద్గుణోపానా లేక నిర్గుణోపాసనా అనే సందేహం ప్రతి సాధకుని మదిలో తొలిచే ప్రశ్నయే కొంతమంది విగ్రహారాధన సద్గుణోపాసన అని ధ్యానంలో ప్రతిమ లేదు కాబట్టి అది నిర్గుణోపాసనే అని చెపుతారు. నిజానికి సూక్ష్మంగా పరిశీలిస్తే ధ్యానం కూడా సద్గుణోపాసనే అని చెప్పవలసి వస్తుంది.  అది ఎలా అంటే బాహ్యంగా, బౌతికంగా ఎలాంటి విగ్రహం లేకపోవచ్చు కానీ అంతరంగికంగా మనం మనస్సుకు ఒక స్థాన నిర్దేశనం చేసి ధ్యానం చేస్తున్నాం. ఉదాహరణకు గీతలో కృష్ణ భగవానులు భృకుటి (రెండుకనుబొమ్మల నడుమ) జాస నిలిపి అంటే మనస్సు నిలిపి ధ్యానానం చేయమన్నారు. కొందరు సాధకులు ఈ పద్దతి సులువు కాదని పేర్కొన్నారు.  ఏదిఏమైయేన సాధకుని అనుభవంతో మాత్రమే తెలుసుకోగలడు. ఇటీవల చాలా సంస్థలు యోగా కేంద్రాలు వస్తున్నాయి. ఒక్కరు శ్వాస మీద జాస అని ఒకరు హృదయంలో జాస అని ఒకరు బిందువు మీద జాస అని కొందరు క్రియా యోగమని కొందరు సుదర్శన యోగమని ఇలా పరి పరి విధాలుగా ధ్యాన పద్ధతులు  తెలుపుతున్నారు. అవి అన్ని తప్పు అని మనం అనలేము. పద్దతి ఏదైనా కానీ అంతిమ లక్ష్యం మనస్సును నిగ్రహించటమే. కాబట్టి ఎవరికి నచ్చిన పద్దతిని వారు అనుసరించవచ్చు. 

పైన పేర్కొనిన ప్రతి పద్ధతిలోను మనస్సు వున్నది అంటే మనోవృత్తి  వున్నాడనుమాట. ఎప్పుడైతే మనస్సు లయం కాలేదో అప్పుడు అది సద్గుణమే అవుతుంది కానీ నిర్గుణం కాదు.  అయితే నిర్గుణోపాసన లేదా అని అడుగవచ్చు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే నిర్గుణోపాసన వున్నది కానీ అది ఉపాసన మాత్రం కాదు ఎందుకంటె ఉపాసన అనే పదంలోనే నీవు భగవంతునికన్నా బిన్నంగా ఉన్నవని కదా అర్ధం.  ఎప్పుడైతే మనస్సు పూర్తిగా లయం అవుతుందో అదే నిర్గుణోపాసన. అది కేవలం సమాధి స్థితిలోనే లభిస్తుంది. చిత్తవృత్తి నిరోధమే  ధ్యానం అని మహర్షులు తెలిపారు.

సాధకుడు ఎప్పుడయితే సమాధి స్థితిని పొందుతాడో అప్పుడు అతనికి బాహ్య స్మ్రుతి పూర్తిగా పోతుంది. శరీర వ్యాపారాలు అంటే ఆకలి దప్పులు, హృదయ స్పందన, శ్వాస పీల్చుకోవటం, వదలటం. స్పార్స్య జ్ఞ్యానం, ఇవి ఏవి వుండవు. శరీరం మీద పాములు, జర్రులు ప్రాకిన శరీరం చుట్టూ పుట్టలు పెరిగిన, ఎండలు కార్చినా వర్షాలు కురిసిన ప్రకృతి బీబత్సవంగా ప్రళయాలు సంభవించినా సాధకునికి స్పృహ ఉండదు.  ఆ స్థితిని చేరుకునే సాధకుడు  జీవన్ముక్తుడు. అదే మోక్షముగా మనం తెలుసుకోవచ్చు. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ప్రతి సార్దకుడు సమాధి స్థితిని చేరుకునేలా తన సాధనను కొంగసాగించాలని సాధకులందరు మోక్షగాములు కావాలని అభిలాష. 

ఓం తత్సత్,

 ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 

నిజ నేస్తాలు ""

 

ప్రపంచ పుస్తక దినోత్సవం


కవితా శీర్షిక :

      ""  నిజ నేస్తాలు ""


ఏం చేయాలో

తెలియని సమయంలో

నిజంగా పుస్తకాలు

మన మంచి నేస్తాలు!

దురాచారాలను  నిర్ములించి

అజ్ఞానాంధకారాన్ని తొలగించి

విజ్ఞాన జ్యోతులను వెలిగించుటలో

నిజంగా పుస్తకాలు

మన మంచి నేస్థాలు!

దేశ స్వాతంత్ర్య సాధన లో

పుస్తకాలు నేస్తాలై

జన చైతన్యకారకాలై

భరతమాత బానిస సంకెళ్ళను తెంచి

స్వేచ్చాయుత  నవ జీవనానికి పునాదులేశాయి!

పుస్తకాలు హస్తభూషణం లై

మస్తీష్కానికి ఆహారాలై

మానవతను మేల్కొల్పే కారకాలై

ఆపదలో  అభయహస్తాలై

యువత భవితకు మార్గదర్శి లై

సర్వకాల సర్వావస్తల్లో

తోడుండే నిజ నేస్తాలు పుస్తకాలు!

సంస్కృతి సంప్రదాయాల వ్యాప్తికులై

నైతిక విలువలను ప్రజ్వలింప చేసే కర దీపిక లై

మాతృభాషా వికాసకులై

నాటికి, నేటికీ, ఏనాటికైనా

మరపురాని, మరువలేని

మధుర జ్ఞాపకాల నిధులు పుస్తకాలు!

...........................................

రచన : డాక్టర్.

ఆళ్ల నాగేశ్వరరావు( కమల శ్రీ)

కవి.... రచయిత...

ఆర్టీసీ కండక్టర్

నాజరుపేట

తెనాలి....522201

గుంటూరు.... జిల్లా

ఆంధ్రప్రదేశ్.... రాష్ట్రము

చరవాణి. 7416638823

...........................................


వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం  - ఏకాదశి - శతభిషం -‌‌ గురు వాసరే* (24.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*