20, అక్టోబర్ 2025, సోమవారం

దీపావళపండుగ

 *అందరికీ దీపావళపండుగ శుభాకాంక్షలు*


సీ॥

అజ్ఞానతిమిరాల నంతమొందింపగా 

వెలుగు దివ్వెలపేర్పు మలుపునిచ్చు 

దుర్గుణభూతాల దునుమాడగా ప్రేలు 

బాంబుల మ్రోతలు ప్రాపునిచ్చు 

నిప్పులపువ్వుల నింగినంటుచు వెల్గు 

చిచ్చుబుడ్డుల శ్రేణి శ్రీలనిచ్చు 

వివిధటపాసులరాజి విన్యాసతేజము 

ప్రాకృతీధర్మాల రక్షజేయు 

తే.గీ. 

క్రిమికీటకములబాపు కీడునాపు 

దీపకాంతుల లోకాల దీప్తి నింపు 

చెడుగుపై మంచి గెలువంగ చేవజొనుపు 

దివ్యదీపావళి మీకు భవ్యమగుత! 

*~శ్రీశర్మద*

శారీరక , మానసిక మార్పులు -

 శరీరం నందు వాత, పిత్త , కఫాలు పెరిగినపుడు ఏర్పడే శారీరక , మానసిక మార్పులు - 

 

 # శరీరము నందు వాతప్రకోపం చెందినపుడు - 

 

 ☆ శారీరక మార్పులు - 

 

* బరువు తగ్గుట. 

 * శరీర దారుఢ్యం , బలం తగ్గును. 

 * నరాల నొప్పులు పెరుగును . 

 * కండరాల నొప్పులు పెరుగును . 

 * నడుములో నొప్పి ముఖ్యముగా నడుము క్రింద .

 * కీళ్లనొప్పులు , కాళ్ల నొప్పులు పెరుగును . 

 * చర్మం గరుకుదనం పెరుగును . 

 * పెదాలు , శరీరం పగుళ్లు ఏర్పడును . 

 * మలబద్దకం . 

 * కడుపుబ్బరం , గ్యాస్ పెరగటం , గ్రహణి సమస్య  

 * అధిక రక్తపోటు . 

 * చలిగాలికి తట్టుకోలేకపోవడం . 

 * ఋతువునోప్పి . 

  

  ☆ మానసిక మార్పులు - 


 * మనసు కుదురుగా ఉండదు. రకరకాలుగా పరుగుతీయును . 

 * పూర్తి విశ్రాంతి తీసుకోలేకపోవడం . 

 * దేనిమీద ఏకాగ్రత ఉండదు. 

 * అధికమైన ఆందోళన . 

 * గాభరా ఎక్కువ అవ్వడం . 

 * అసహనంగా ఉండటం . 

 * దిగులు , నిద్రపట్టక పోవడం . 

 * త్వరగా అలసిపోవడం . 

 * ఆకలి లేకపోవటం . 

 

 # శరీరం నందు పిత్తం ప్రకోపం చెందినపుడు - 

 

 ☆ శారీరక మార్పులు - 

  * అతిగా దాహం వేయడం . 

  * అతిగా ఆకలి వేయడం . 

 * హైపర్ ఎసిడిటి , అల్సర్ ఏర్పడుట. 

 * ఎండని తట్టుకోలేకపోవడం . 

 * వొళ్ళంతా మంటలు . 

 * చర్మం పైన పుళ్ళు ఏర్పడుట . 

 * దద్దురులు , కురుపులు , మొటిమలు వచ్చును .

 * దుర్వాసన , చమటలు అధికంగా పట్టడం . 

 * మొలల వ్యాధి , మలద్వారం వద్ద మంట. 

 * కళ్లు ఎరుపెక్కడం . 

 * మూత్రం మంటగా , బాగా పలచగా , ఎరుపుగా వెళ్లడం . 


  ☆ మానసిక మార్పులు - 


 * ప్రతిదానికి అరవడం , కేకలు పెట్టడం , చికాకు పడటం . 

 * కోపం అధికం అవ్వడం . అసహనం పెరుగుట . 

 * ప్రతిదాన్ని విమర్శించడం . 

 * ప్రతిదానికి ఎదురుమాట్లాడటం . 

 * ప్రతివాళ్ల మీద పగతీర్చుకుంటా అనడం , ప్రవర్తించటం . 

  

 # శరీరము నందు కఫం ప్రకోపం చెందినపుడు - 

  

☆ శారీరక మార్పులు - 

 

* ఛాతి బరువుగా ఉండటం. 

* కంఠం కఫముతో పూడుకొనిపోయినట్టు ఉండటం. 

 * ముక్కు , సైనస్ లు జిగురుతో నిండిపోవడం . 

 * దగ్గు , ముక్కు కారటం , తరచూ జలుబు చేయడం . 

 * చలి , తేమని తట్టుకోలేకపొవడం . 

 * ఎప్పుడూ ఎలర్జీలతో ఇబ్బందిపడటం 

 * ఉబ్బసం కలగడం . 

 * అధిక బరువు పెరగటం . 

 * కొలెస్ట్రాల్ మోతాదు పెరగటం . 

 * శరీరం నందు వాపులు పెరగటం . 

 * కడుపుబ్బరం . 

 * శరీరం చల్లగా , తెల్లగా మారడం . 

 * మధుమేహ సమస్య రావటం . 

 * శరీరంలో గడ్డలు , కండలు పెరగటం . 

    

 

      పైన చెప్పిన లక్షణాలన్నీ చూస్తే మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది. అనగా శరీరం నందలి వాత, పిత్త , కఫాలు కొన్ని కొన్ని కారణాల వలన హెచ్చుతగ్గులకు లోనగును. అలాంటప్పుడు ఏదైతే పెరిగిందో అలా పెరిగిన లక్షణాలు కనిపిస్తాయి . ఉదాహరణకు పైన చెప్పిన లక్షణాలు ఆయా శరీర ప్రకృతుల వారికి సహజ లక్షణాలు . అంటే వాత ప్రకృతి గల వారికి ఏ మాత్రం వాతం పెరిగినా నొప్పులు వెంటనే వస్తాయి. అలాగే కఫం పెరిగితే వాళ్లకి నొప్పులు రావా ? అంటే వస్తాయి . కఫ శరీర తత్త్వం గలవారికి నొప్పులు వచ్చాయంటే వారితో వాతం పెరిగిందని అని అర్థం . అలాగే బరువు అధికంగా పెరగటం కఫ శరీర తత్త్వం ఉన్నవారి లక్షణమైన వాత, పిత్త శరీరతత్వం ఉన్నవాళ్లు కూడా బరువుపెరుగుతారు అటువంటప్పుడు వారిలో కఫ సంబంధ దోషం పెరిగిందని అర్థం చేసుకోవాలి . 

          

    వాతశరీరం కలిగిన వారు బరువు త్వరగా తగ్గుతారు , బరువు ఆలస్యముగా పెరుగుతారు. పిత్త శరీరం కలవారు ఆకలి ఎక్కువుగా ఉండటం , స్ట్రెస్ ఎక్కువుగా ఉండటం వలన అతిగా తింటారు. దానివల్ల బరువు పెరుగుతారు . వీరుకొంత ఆలస్యముగా బరువు తగ్గుతారు. కఫప్రకృతి వారు బరువు తగ్గడం అంత త్వరగా సంభవించదు.  



మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .  



గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

ధాతువులు వృద్ది అవ్వడం

 శరీరంలో ధాతువులు వృద్ది అవ్వడం వలన కలిగే దోషాలు -


 * రసధాతువృద్ధి లక్షణాలు -

       

   శరీరంలో రసధాతువు వృద్ది చెందినప్పుడు హృదయం నందు ఒకరకమైన వికారం కలుగును. వాంతి కూడా కలుగును. నోటివెంట నీరు కారును.

 

* రక్తధాతువృద్ధి లక్షణాలు -

        

     శరీరం ఎర్రబారును. నేత్రాలు ఎరుపెక్కుతాయి. రక్తసిరలు ఉబ్బి ఉంటాయి.


 * మాంసధాతువృద్ధి లక్షణాలు -

          

   పిరుదులు, దౌడలు, పెదవులు, గుహ్యము,తొడలు , బాహువులు, పిక్కలు బాగా లావెక్కును. శరీరం బరువెక్కును.


 * మేధోధాతువృద్ధి లక్షణాలు -

          

   శరీరం చమురు పూసినట్టు ఉంటుంది. పొట్టయొక్క ప్రక్కలు పెరుగును . దగ్గు వచ్చును. కొద్దిపని చేసినను అలసట వచ్చును. శరీరం నుంచి చెడువాసన వచ్చును.


 * అస్థిధాతువృద్ధి లక్షణాలు -

         

    కొత్త ఎముకలు పుడతాయి. మామూలు దంతాల కంటే ఎక్కువ దంతాలు పుడతాయి . వెంట్రుకలు మరియు గోళ్లు అపరిమితంగా వృద్ధిచెందును.


 * మజ్జాధాతువృద్ధి లక్షణాలు -

          

   సర్వ శరీర అవయవాలు , నేత్రములు బరువెక్కుతాయి. వ్రేళ్ళ సంధుల యందు కురుపులు ఏర్పడతాయి.


 * శుక్రధాతువృద్ధి లక్షణాలు -

          

  శుక్రం అధికంగా ప్రవర్తిస్తుంది. శుక్రాశ్మరీ అనే రోగం కలుగును. శుక్రాశ్మరీ అనగా వీర్యం అధికంగా ఉత్పత్తి అయ్యి రాళ్లు వలే గట్టిగా మారును .


 * పురీషవృద్ధి లక్షణములు -

          

  పురీషం వృద్ది చెందిన ఉదరం నందు శబ్దంతో కూడిన ఉబ్బరం ఏర్పడును . ఉదరం నందు పోట్లు కలుగును. ఉదరం బరువుగా ఉండును.


 * మూత్రవృద్ధి లక్షణాలు -

         

   మూత్రస్రావం అధికం అవ్వును. తరుచుగా మూత్రవిసర్జనకి వెళ్ళవలసి వస్తుంది.మూత్రాశయం నందు బాధ ఉండును. మూత్రాశయం ఉబ్బరంగా ఉంటుంది.


 * స్వేదవృద్ధి లక్షణాలు -

          

    అతిగా చెమటపట్టును. చర్మం దుర్ఘంధంగా ఉండును. చర్మం నందు దురద వచ్చును.

 

* ఆర్తవవృద్ధి లక్షణాలు -

           

   రుతురక్తం అధికం అయితే ఒకవిధమైన బాధ ఉంటుంది.రక్తం అధికం అవ్వడం వలన శరీరం నందు వాతం యొక్క సంచారానికి ఇబ్బంది కలిగి స్త్రీ జననాంగం నందు నొప్పి ఉండును. స్రవించిన రక్తం దుర్గంధపూరితంగా ఉండును.


 * స్తన్యవృద్ధి లక్షణాలు -

           

   స్థనములు పెద్దవిగా మారును . పాలు అధికంగా స్రవించును . స్థనముల యందు తీపు , పోటు కలుగును.

 

* గర్భవృద్ధి లక్షణాలు -

           

  గర్భం అధికంగా వృద్దిపొందును. చెమట ఎక్కువుగా పట్టును.

             

  కావున శరీరం నందు ధాతువులు సమస్థితిలో ఉండవలెను . 


  మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .  


గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

టీచింగ్ కొనసాగుతూనే ఉంది

 😂😂😂😂😂😂😂😂


ఒక గౌరవనీయులైన మాస్టర్ గారు రిటైర్ అయ్యారు. 🎓

ఆయన భార్యతో కలిసి భోపాల్‌లోని ఒక ఫ్లాట్‌లో నివసించేవారు.🏠😉


దసరా సందర్భంగా ఊరికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.💥🔥🔥🔥


వెళ్లే ముందు మాస్టర్ గారు ఆలోచించారు —

“మనం లేనప్పుడు ఏమైనా దొంగ లోపలికి వస్తే,

అల్మారాలు పగలగొట్టి బోల్డంత గజిబిజి చేస్తాడేమో,

ఎందుకంటే ఇంట్లో డబ్బులేమీ లేవు కదా!” 😅


అందుకే ఆయన ఇంటిని పాడవకుండా కాపాడటానికి ₹1000 టేబుల్‌పై పెట్టారు.💸

ఆ డబ్బులతో పాటు ఒక లేఖ వ్రాశారు — 📝


---


"ప్రియమైన అజ్ఞాత దొంగ గారికి,

మీరు నా ఇంట్లోకి చొరబడటానికి తీసుకున్న శ్రమకు హృదయపూర్వక అభినందనలు! 🥰🥰🥰

కానీ దురదృష్టవశాత్తూ నేను మధ్యతరగతి వాడిని,

పెన్షన్ మీదే జీవనం సాగిస్తున్నాను. 😅

అందువల్ల పెద్దగా ఏమీలేవు ఇక్కడ.


మీ శ్రమ, మీ విలువైన సమయం వృథా అయిందని నాకు సిగ్గేస్తోంది. 😔

కాబట్టి మీ కాళ్ల ధూళికి గౌరవంగా

ఈ చిన్న మొత్తాన్ని స్వీకరించండి దయచేసి. 🙏


ఇంకా మీ వ్యాపారంలో (దొంగతనంలో 😜) విజయవంతం కావడానికి

కొన్ని సూచనలు ఇస్తున్నాను👇"


---


మాస్టర్ గారి "సలహాలు" ఇలా ఉన్నాయి: 😂👇

8వ అంతస్తులో – ఒక భ్రష్ట రాజకీయ మంత్రిగారు ఉంటారు 💼💰

7వ అంతస్తులో – పేరున్న ప్రాపర్టీ డీలర్ 🏢

6వ అంతస్తులో – సహకార బ్యాంక్ చైర్మన్ 🏦

5వ అంతస్తులో – పెద్ద పరిశ్రమదారుడు 🏭

4వ అంతస్తులో – ప్రసిద్ధ న్యాయవాది ⚖️

3వ అంతస్తులో – అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు 😏💍💵


“వారి దగ్గర బంగారం, నగదు కొండంత ఉంటుంది.

మీ ‘బిజినెస్ సక్సెస్’ వారిని అసలు ఇబ్బంది పెట్టదు!

ఎందుకంటే వారు పోలీసులకు ఫిర్యాదు చేయరు!” 😂😂😂


---


దసరా తర్వాత మాస్టర్ గారు తిరిగి వచ్చాక,

టేబుల్‌పై ఒక పెద్ద బ్యాగ్ కనిపించింది. 🎒😲

దానిలో ₹10 లక్షలు కాష్! 💸💸💸

మరియు ఒక లేఖ —


---


"గురూజీ 🙏,

మీ మార్గదర్శకత్వానికి మరియు బోధనలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు! 👏👏

మీ సలహా అనుసరించి నా మిషన్ విజయవంతమైంది! 😄

ఈ చిన్న మొత్తాన్ని ధన్యవాదంగా వదిలి వెళ్తున్నాను.


ఇక ముందు కూడా మీ ఆశీస్సులు, సూచనలు నాకు లభించాలని కోరుకుంటున్నాను...


మీ శిష్యుడు – దొంగ 😄😄"


---


😂😂😂

మాస్టర్ గారు చదివి నవ్వుతూ అన్నారు —

“అయ్యో, నేను రిటైరయ్యానని అనుకున్నా కానీ

ఇంకా టీచింగ్ కొనసాగుతూనే ఉంది!” 📚🤣💥


😂😂😂😂😂😂😂😂

కామ్యదీపావళీశుభాకాంక్షలివొగొ

 *అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలతో....*


సీ॥

చిటపటలాడెడు చిన్న కాకరవత్తి 

పువ్వుల వెదజల్లు పూవువత్తి 

చిఱ్ఱున ప్రేలెడు సీమటపాకాయ 

ఫెళ్ళుమనుచు ప్రేలు పెద్ద బాంబు 

తారల నందగ తారాడు రాకెట్టు 

చీదుచు వెలిగేటి చిచ్చుబుడ్డి 

దంభమంతయు జూపు తాటాకు బాంబులు 

తుర్రున తిరిగేటి తూనిగలును 

తే.గీ.

ఇండ్ల చిన్నారి బాలల నెంతగానొ 

సంతసిల్లగ జేయుచు చెంత నిలచు 

క్రొత్తయల్లుళ్ళ సరదాల కూర్మి దీర్చు 

స్ఫూర్తి గొలుపు దీపావళి చొచ్చి వచ్చె 


తే.గీ.

తీపివంటకములతోడ తృప్తిబఱచి 

క్రొత్తబావల మరదళ్ళు కొంటెపనుల 

నాటపట్టించి సందడి నాడిపాడు 

కామ్యదీపావళీశుభాకాంక్షలివొగొ 

*~శ్రీశర్మద*