*అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలతో....*
సీ॥
చిటపటలాడెడు చిన్న కాకరవత్తి
పువ్వుల వెదజల్లు పూవువత్తి
చిఱ్ఱున ప్రేలెడు సీమటపాకాయ
ఫెళ్ళుమనుచు ప్రేలు పెద్ద బాంబు
తారల నందగ తారాడు రాకెట్టు
చీదుచు వెలిగేటి చిచ్చుబుడ్డి
దంభమంతయు జూపు తాటాకు బాంబులు
తుర్రున తిరిగేటి తూనిగలును
తే.గీ.
ఇండ్ల చిన్నారి బాలల నెంతగానొ
సంతసిల్లగ జేయుచు చెంత నిలచు
క్రొత్తయల్లుళ్ళ సరదాల కూర్మి దీర్చు
స్ఫూర్తి గొలుపు దీపావళి చొచ్చి వచ్చె
తే.గీ.
తీపివంటకములతోడ తృప్తిబఱచి
క్రొత్తబావల మరదళ్ళు కొంటెపనుల
నాటపట్టించి సందడి నాడిపాడు
కామ్యదీపావళీశుభాకాంక్షలివొగొ
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి