8, ఫిబ్రవరి 2024, గురువారం

Self balanced

https://youtube.com/shorts/mltj2zmlBa8?si=rPRPYfScy3NuHdB0 

బ్రాహ్మణుడు

 #బ్రాహ్మణుడు 


నమోస్తు మహాపూజ్యం నమోస్తు సద్బ్రాహ్మణం

నమోస్తు శాస్త్రాన్వితం నమోస్తు గురోర్ సర్వత్రః


నమోస్తు మహాపూజ్యం.. నమోస్తు సద్బ్రాహ్మణం..


బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే అత్యంత వందనీయుడు పూజ్యనీయుడు.. సద్బ్రాహ్మణుడే.. సర్వదా ద్విజుడే


ద్విజుడు అనగా రెండు జన్మలు కలిగిన వాడు..


ఒకటి ప్రాపంచికంగా.. 

మరొకటి ఉపనయనమనే జ్ఞాన స్వరూపంగా...


జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేదపాఠం తు విప్రాణాం బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణాః 


అన్నది శాస్త్ర ప్రమాణం..


ఇది పక్షపాతం కాదు.. పరమ యధార్థం....


అవసరమైతే బిక్షాటన చేసి సైతం..

వేదాన్ని.. వేదధర్మాన్ని.. భగ్వత్ తత్వాన్ని..

కాపాడే నిష్కల్మష త్యాగ స్వరూపుడే.. ద్విజుడు..


అందుకే అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల కంటే..

సర్వ దేవతల కంటే అగ్రగణ్యుడు.. పూజ్యనీయుడు..


నమోస్తు శాస్త్రాన్వితం..


ఋగ్, యజుర్, సామ, అధర్వణములనబడే చతుర్వేదాలను.. షట్ శాస్త్రములు (శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తి, కల్పం, జ్యోతిష్యం ) మొదలగు వేదాంతర్గతమైన శాస్త్రాలను.. 


సంగీత సాహిత్యాలను ఔపోసనపట్టి సర్వే సర్వత్రా లోక కళ్యాణానికై ధారపోసే తేజోమూర్తులు.. నిష్కల్మష త్యాగ హృదయులే ద్విజులు..

సమస్య అర్థమైంది

 ఒకతనికి ఎడమ కాలు బ్లూ రంగు లోకి మారింది. గాబరా పడి డాక్టరు కి చూపించాడు.


డాక్టరు : కాలు మొత్తం విషం తో నిండి పోయింది. ఆ విషం మొత్తం శరీరానికి పాకే అవకాశంఉంది. ఆపరేషన్ చేసి కాలు తీసేయాలి.


ఆపరేషన్ చేసి కొత్త కృత్రిమ కాలు అమర్చారు.


కొద్ది రోజుల తర్వాత కుడి కాలు కూడా నీలం రంగు లోకి మారింది.


డాక్టరు : వెంటనే ఆపరేషన్ చేసి కుడి కాలు కూడా తీసేయాలి అన్నాడు.


కుడికాలు కూడా తీసేసి కృత్రిమ కాలు అమర్చారు.


కొద్ది రోజుల తర్వాత కృత్రిమ కాళ్ళు రెండూబ్లూ కలర్ లోకి మారిపోయాయి. వెంటనే డాక్టరు దగ్గరికి వెళ్ళాడు పేషెంటు.


అప్పుడు డాక్టరు బాగా పరిశీలించి ఇలా అన్నాడు...



“నాకిప్పుడు అసలు సమస్య అర్థమైంది మీ ప్రాబ్లం మీ కాలు లో లేదు... మీ లుంగీ రంగు వదులుతోంది ఆ రంగే నీ కాలుకు అంటుతోంది.... ఏం గాభరా పడకండి మంచి బ్రాండ్ లుంగీ పేరు రాస్తున్నా అది కొనుక్కోండి... నిశ్చింతగా ఉండండి.” 🤑

అదృష్టవంతు లెవరుంటారు

 రైల్వే స్టేషన్ లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ల కోసం మారాం చేసిన జెనరేషన్ మాది.

ఇంటి ముందు కొచ్చే పాల ఐసు 10 పైసలూ, ఫ్రూట్ ఐసు 5 పైసలూ నూ. 

యస్సెల్సీ పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్లిన తరం వాళ్లం.

అద్దెకి బుక్స్ ఇచ్చే షాప్ దగ్గర్లో వుందా, ఆస్పత్రి వుందా అని అద్దె ఇళ్లు చూసుకున్న బంగారు రోజులవి.

సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కుని బట్టీలు పట్టే కాలం అది.

గెజిటెడ్ ఆఫీసర్లు అయినా సైకిళ్లు తొక్కేవాళ్లు ఆ రోజుల్లో.

డ్రాయింగ్ రూమ్ లలో జిమ్ములలో తొక్కే అవసరం పడేది కాదు.

చేబదుళ్లకి కాదేదీ అనర్హం.

పిన్నిగారింట్లోంచి గ్లాస్ తో కాఫీ పొడైనా, బాబాయ్ గారి రేలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సూ , స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలూ. 


అప్పు పుట్టని పచారీ షాపులూ బట్టల కొట్టులూ వుండేవే కావు.

రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం నిలబడి, డ్యూయెట్లూ.

పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ లు జరిగేవి.

మధ్యతరగతి మందహాసం కాదు. పగలబడి నవ్వేది.

ఇంటి ముందుకు

కోతులాడించేవాడు, పాములాడించేవాడు, గంగిరెద్దులాడించేవాడు,ఎలుగు బంటిని తెచ్చేవాడు, చిలక జోస్యం చెప్పేవాడు, వానల్లు పడాలి వాన దేవుడా అని కప్పలకి పెళ్లిళ్లు చేసే వాళ్లు కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించే వాళ్లు.

మేకప్పులు అంటే మాకు తెలీని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులేసుకునొచ్చి, ఇళ్ల ముందు సినిమా పాటలకి డాన్స్ లాడే వారు.

గారడీల వాళ్లు బాలన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లలని నడిపిస్తూ చూపించే వాళ్లు.

మూలికలూ, పసర్లూ అమ్మేవాళ్లు తాము నయం చెయ్యలేని రోగం లేదనే వాళ్లు.

స్టేషన్ దగ్గర చెవి గులిమిలు తీస్తామనే పెట్టెలతో తిరిగే వాళ్లూ.

ఇళ్లముందు కొచ్చి సవరాలు కడతాం అనే వాళ్లూ.

వాళ్ల కోసం టిన్నుల్లో జుట్టు వూడితే దాచుకున్న వాళ్లూ వుండేవారు.

మధ్యాహ్నాలు భోజనాలయి వంటింటి గుమ్మం మీద తల పెట్టి కునుకు తీస్తుంటే.

 "దువ్వెన్నలు, బొట్లు, కాటుక పెట్లు, ఇయర్ పిన్లు, లబ్బర్ గాజులు, రిబ్బన్లహో". అంటూ పెట్టె నెత్తిన పెట్టుకొచ్చే వాళ్ల దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువుండేది కాదు. వాళ్లు వెళ్లగానే "పాత బట్టలకి స్టీల్ సామాన్లిస్తాం". అన్న వాళ్లు వచ్చి ఎన్నేసినా, చూపించినా గంగాళం కాకుండా, ఆఖర్న ఉగ్గు గిన్నె ఇచ్చి పోయేవాళ్లు. గోతాముడు పాత బట్టలొదిలిపోయేవి. కత్తికి సాన పెడ్తాం, నవార్లు నేస్తాం. పరుపులేకుతాం. గిన్నెలకి సొట్టలు తీస్తాం. బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం. అరువు మీద చీరలిస్తాం అంటూ ఇంటి ఇల్లాళ్లని ఊపిరి తీసుకోనిచ్చే వాళ్లు కారు. ఇంక ముగ్గు అమ్మే వాళ్లూ, ఉప్పు అమ్మేవాళ్లూ, కూరలూ పండ్లూ అమ్మే వాళ్లూ సరేసరి. మాదా కబళం వాళ్లు "అన్నం వుంటే పెట్టమ్మా నీ కొడుకులు, బిడ్డలు, మనవలు సల్లంగుండ" అంటూ టైముల వారీగా వచ్చే వాళ్లు...సాయంత్రం 8 గంటల బిచ్చగాడొచ్చి వెళితే మా నానమ్మ మాత్రలేసుకునేది..

రేడియోలో బినాకా గీత్ మాలా ఊహల రెక్కలు విప్పేది. భూలే భిస్రే గీత్ అమర లోకాల్లో విహరింప చేసేది. రహస్య ప్రేమలు, అచ్చట్లు, ముచ్చట్లు... "ఏమిటో" అనుకోవడాలు ప్రొద్దుట సంస్కృత వార్తలు 'ఇతి బలదేవానంద సాగరహా 'తో ప్రారంభం అయితే ఈ మాసం పాటలూ కార్మికుల కార్యక్రమాలూ సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలూ..వివిధ భారతి మీరుకోరిన పాటలూ..పండితులచే నిర్మించబడ్డ నాటకాలూ..వావ్ రేడియో స్వర్ణ యుగం అది!

అప్పట్లో పేపరు చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు..ఇంగ్లీష్ పేపర్ చదువుతే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే ,దూర్దర్శన్ లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం..తాతయ్యలకీ దూరపు చుట్టాలకీ ఉత్తరాలు రాస్తూ లెటర్ రైటింగులు నేర్చుకున్నాం....ఉభయకుశలోపరి ఎక్కడ పెట్టాలో, గంగాభాగీరధీ సమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసు!!

ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు.... *ఇప్పటికి ఎప్పటికి మా గుండెల్లో నిలిచిపోయి మా గుండెలు అగిపోయేవరకు మాతో వెన్నుండి మమ్మల్ని నడిపిస్తున్న. ఏమో. మాటలు రావట్లేదు.

అమ్మ చేతి మురుకులు లేవు

అలసట లేని పరుగులు లేవు

ఎత్తరుగులు మొత్తం పోయే

రచ్చబండలూ మచ్చుకు లేవు

వీధిలో పిల్లల అల్లరి లేదు

తాతలు ఇచ్చే చిల్లర లేదు

ఏడు పెంకులు ఏమైపోయే

ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా వెదురు తడికెలు లేవు

ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు 

పెరుగులమ్మే ముంతలు లేవు

బువ్వా లాటల విందే లేదు

గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు 

కళ్ళ గంతలు కానే రావు

డ్రింకు మూతల గోలే లేదు 

బచ్చాలాడే ఇచ్చా లేదు

కోతి కొమ్మచ్చి ఏమైపోయే

అవ్వా అప్పచ్చి ముందే పాయె

గూటీ బిళ్ళా గూటికి పోయే

తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు

చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు 

జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు

కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె

మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే

భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె

ఉన్న రంగులూ మాసికలాయె

దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె

బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు

మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు

ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే

రేపటి సంగతి దేవుడి కెరుక

నేటి బాలలకు తప్పని చురక

బాలానందం లేని జీవితం

మానవాళికే మాయని మరక.

మేమేఅదృష్టవంతులమ్*!           

1960-80 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. 

ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము. లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. 

పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత 

గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. 

దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.

*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.* 

పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.* 

దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!  

ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.  

ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.

మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట

రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం

ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!

అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.   

*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?*

ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది కదూ...

రామాయణం

 రామాయణం "పురాణం" కాదని, ఇది మన చరిత్ర అని నిరూపించే 9 ఆధారాలు !! 

ఒక్కొక్కటి ఆధారాలు మీకోసం..


1. రామసేతు భగవాన్ రామ్ వానర్ సేనను తన సైన్యాన్ని లంక మీదుగా తీసుకెళ్లే వంతెనను నిర్మించమని కోరిన ప్రదేశం ధనుష్కోడి అని నమ్ముతారు. NASA చిత్రాలు మరియు ఈ ప్రాంతంలో తేలియాడే రాళ్ల ఉనికి రామసేతు వంతెన


2. పుష్పక్ విమాన మార్గం అక్షాంశాలు 

(N,E) 

నాసిక్ 19.99°, 73.78°

 హంపి 15.33°, 76.46°

 లేపాక్షి 13.80°, 77.60° 

శ్రీలంక 7.87°, 80.77° 

మా సీత అపహరణకు గురైనప్పుడు పుష్పక విమానం వెళ్లే మార్గం ఇది. 

ఆశ్చర్యకరంగా అన్నీ సరళ రేఖలో ఉంటాయి. 

వాల్మీకి 1000 సంవత్సరాల క్రితం ఎలా తెలుసు?


3. భగవాన్ హనుమాన్ పాదముద్రలు రాతితో చెక్కబడిన భారీ పాదముద్రల రూపంలో హనుమాన్ జీ ఉనికికి సంబంధించిన భౌతిక జాడలు ఉన్నాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. అతనిది అని నమ్ముతున్న పాదముద్రలు ఆంధ్ర ప్రదేశ్ నుండి శ్రీలంక వరకు & ఆసియా అంతటా విస్తరించి ఉన్నాయి.


4. అశోక్ వాటిక అపహరణ తర్వాత సీతను బందీగా ఉంచింది ఇక్కడే. ప్రస్తుత నువారా ఎలియా అశోక్ వాటిక ప్రదేశమని నమ్ముతారు. హనుమంతుడు శ్రీలంకలో సీతను కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పాదముద్రలు కనుగొన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.


5. సిగిరియా శ్రీలంకలోని సిగిరియా రాతి కోట కుబేరుడు రూపొందించిన రావణుని బంగారు ప్యాలెస్‌గా భావించబడుతుంది. పీఠభూమి దిగువన ఉన్న ఒక గుహ, సీతామాత బందీగా ఉన్నట్లు విశ్వసించబడే ప్రదేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది.


6. కోబ్రా హెడ్డ్ గుహ సిగిరియా రాక్ కోటలో భాగమైన కోబ్రా హుడ్ గుహలో "పరుమక నగులియా లీనా" అనే శాసనం ఉంది. చాలా చోట్ల సీతను వర్ణించడానికి "నాగులి" అనే పదం ఉపయోగించబడింది. రామాయణ కాలం తరువాత చెక్కబడిన శాసనం సీతను సూచిస్తుందని చెప్పబడింది


7. కన్నయ్య హాట్ వెల్స్ రామాయణంలో వేడి నీటి బుగ్గల ప్రస్తావన ఉంది. రావణుడు & అతని తల్లి భగవాన్ శివుడిని పూజించినట్లు చెప్పబడే ప్రదేశం ఇది స్థానిక పురాణాలు & పరిశోధకులు ఈ కన్నయ్య వేడి నీటి బుగ్గలను నీటి సరఫరా కోసం రావణుడు సృష్టించాడని సూచిస్తున్నారు


8. లేపాక్షి మందిరం రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు జటాయువు పడిపోయిన ప్రదేశం అని నమ్ముతారు.


రావణుడి రాజ్యం సమీపంలో అగ్ని విధ్వంసాన్ని సూచించే మసి నల్లని నేల ఇతర ఉదాహరణలు.


9. సంజీవని పర్వతం, ద్రోణగిరి


సంజీవని పర్వతం సంజీవని బుటిని కలిగి ఉంది మరియు అన్యదేశ మూలికలు మరియు ఔషధ మొక్కలు రామాయణంలో పేర్కొన్నట్లు హిమాలయాలలోని ద్రోణగిరిలో ఉన్నాయని నమ్ముతారు.


కొన్నేళ్లుగా రామాయణం ఒక పురాణం & భగవాన్ రామ్ ఉనికిలో లేరు అని చెప్తున్నారు


రామాయణం మన చరిత్ర & ఎప్పుడూ పురాణం(myth) కాదు. 


జై శ్రీ రామ్ .

మూత్రపిండములలో రాళ్లు

 మూత్రపిండములలో రాళ్లు కరిగించు గొప్ప ఔషధ యోగములు - 


 * కానుగ గింజలలోని పప్పు మూడు గ్రాములు తీసుకుని పొడిచేసి 60 మిల్లీలీటర్ల ఆవుపాలలో కలిపి లోపలికి తీసుకొనుచుండిన మూత్రపిండాలలోని రాళ్లు పడిపోవును .


 * యవాక్షరం , బెల్లం సమాన భాగాలుగా కలిపి రెండు గ్రాముల చొప్పున రోజుకొకసారి ఒక వారం నుంచి పదిరోజులపాటు తినిన రాళ్లు కరిగి పడిపోవును . దీనితో పాటు బూడిదగుమ్మడికాయ రసం కూడా వాడిన ఫలితం తొందరగా కనిపించును.


 * వేపాకు నీడలో ఎండించి కాల్చి భస్మం చేసి పూటకు ఒకటిన్నర గ్రాము చొప్పున ఒకరోజు నిలువ ఉంచిన నీళ్లతో కలిపి తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాయి కరిగిపోవును . రెండుపూటలా తీసికొనవలెను .


 * రణపాల ఆకు రసము 6 గ్రాములు కాచిన వెన్న 13 గ్రాములు కలిపి ప్రతినిత్యము తాగుచున్న రాళ్లు కరుగును.


 * పల్లేరు చూర్ణం ఒక స్పూన్ , కొండపిండి చూర్ణం ఒక స్పూన్ ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాళ్లు నివారణ అగును.


 * పొద్దుతిరుగుడు పువ్వు చెట్టు వేర్లు పొడి 25 గ్రాములు తీసుకుని ఒక లీటర్ తియ్యటి మజ్జిగతో కలిపి తీసుకొనుచున్న రాళ్లు కరుగును.


 * పూటకు రెండు వెల్లుల్లి రేకల గుజ్జు తినుచున్న మూత్రాశయపు రాళ్లు కరుగును. అలా అప్పుడప్పుడు తినుచున్న రాళ్లు పుట్టవు .


  మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు -


 తినవలసిన ఆహారపదార్దాలు -


  పాతబియ్యపు అన్నం , యవలు , గోధుమలు , ఉలవలు , పెసలు , మజ్జిగ , ఆవునెయ్యి , ఆవుపాలు , పెసరకట్టు , ఉలవకట్టు , అల్లం , తియ్యని కల్లు , చక్కెర , ముదురు గుమ్మడికాయ , బూడిద గుమ్మడికాయ , పొట్లకాయ , కొండపిండికూర , పల్లేరుకూర , చిర్రికూర , పెరుగుతోటకూర , ఖర్జురము , వెదురుమొలకలు , కొబ్బరికాయ , తాటిముంజలు , నక్కదోసకాయ , మేకమాంసం .


 తినకూడని ఆహార పదార్ధాలు -


    మలబద్ధకర ఆహారాలు , చద్ది అన్నం , బిరుసుఅన్నం , తాంబూలం , ఎక్కువ ఉప్పు గల ఆహారపదార్థాలు , ఎక్కువ నూనె , పిండివంటలు , నువ్వులపిండి , పులుసు , ఇంగువ , నువ్వులు , ఆవాలు , మినుములు , మామిడికాయ , వెల్లుల్లి మొదలగు వేడివస్తువులు , మలబద్దకాన్ని కలిగించు వస్తువులు , కోడిమాంసం , పందిమాంసం , చేపలు , మద్యం , మైథునం , అతిశ్రమ , మూత్రము , వీర్యము నిరోధము చేయరాదు . 


         పైన చెప్పిన ఆహారపదార్ధాలు పాటిస్తూ ఔషధాలను వాడగలరు .


      ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

రాజ్యాంగం వ్రాసిన 286 మంది


 *భారత రాజ్యాంగం వ్రాసిన 286 మంది ఫోటో (కమిటీలసభ్యులు) ఇది వీరందరూ కొన్ని కమిటీలుగా ఏర్పడి వ్రాసారు ,ఒక్కరే రాజ్యాంగము ను వ్రాయలేదు. చాలా కమిటీలు నియమించారు.వారందరు కలసి వ్రాసారు.డా.అంబేద్కర్ గారు ఆకమిటీ లలో ఒక కమిటీ (డ్రాప్టింగ్ కమిటీ)అధ్యక్షుడు మాత్రమే రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు డా.బాబు రాజేంద్రప్రసాద్ గారు.*

శ్రీ మేరువర్ధనస్వామి మందిర్

 🕉 మన గుడి : నెం 722


⚜ జమ్మూకాశ్మీర్  : పండ్రెతన్, శ్రీనగర్


⚜ శ్రీ మేరువర్ధనస్వామి మందిర్ 



💠 పాండ్రేతన్ బాదంబాగ్ వద్ద శ్రీనగర్ నుండి కొన్ని మైళ్ల దూరంలో ఉంది.  

ఇది వాస్తవానికి కాశ్మీర్ యొక్క పాత రాజధాని,



 💠 శ్రీనగర్ నుండి 3 మైళ్ల దూరంలో పాండ్రేతన్ అనే చిన్న గ్రామం ఉంది.  ప్రస్తుతం దాని ఏకైక ఆకర్షణ, కొత్తగా నిర్మించిన మిలిటరీ బ్యారక్‌లు మినహా, కార్ట్-రోడ్ ఎడమ వైపున ఉన్న బాగా సంరక్షించబడిన మధ్యయుగ ఆలయం. 


💠 పండ్రేతన్ అనే పదం "పురాణం" అంటే "పాతది" మరియు "అధిష్ఠన్" అంటే "రాజధాని" అనే పదంతో ఏర్పడింది. 


💠 పాండ్రేతన్ ఆలయం (పాని మందిర్ అని కూడా పిలుస్తారు) శివునికి అంకితం చేయబడిన పురాతన మరియు ప్రత్యేకమైన రాతి ఆలయం. 

పురాతన కాలంలో ఈ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉండేదని డిజైన్ మరియు ఆధారాలు వివరిస్తున్నాయి.  


💠 ఆలయం బాహ్యంగా 17 అడుగుల 6 అంగుళాల చతురస్రాకారంలో ఉంటుంది మరియు మండప రకానికి చెందినది - అంటే, ఇది నాలుగు వైపులా తెరిచి ఉంటుంది


 💠 ఆలయం యొక్క పునాది ఎక్కువ భాగం నీటిలో మునిగి ఉంటుంది,


💠 ఈ రాజధానిని గోనంద రాజవంశానికి చెందిన ప్రవరసేనుడు-I నిర్మించాడు.  

ఈ ఆలయాన్ని శివుడు మరియు అష్ట మాతృకలకు అంకితం చేసి ప్రవరసేనుడు పాక్షికంగా నిర్మించాడు, 


💠 పదవ శతాబ్దం ప్రారంభంలో మేరువర్ధనుడు పూర్తిస్థాయిలో నిర్మించాడని నమ్ముతారు.  అతను 921-931 సంవత్సరంలో  కాశ్మీర్‌ను పాలించిన  రాజు ప్రవరషేణుడి మంత్రి.


💠 ఈ ఆలయం ప్రస్తుతం శివునికి అంకితం చేయబడింది మరియు వాస్తవానికి విష్ణు దేవాలయం అయి ఉండవచ్చు.  


💠 ఇది వాస్తవానికి అశోక చక్రవర్తిచే స్థాపించబడిన కాశ్మీర్ యొక్క పాత రాజధాని.  


💠 ఇది జీలం నది ఒడ్డు నుండి 100 గజాల దూరంలో ఉంది.  960 లో జరిగిన ఒక గొప్ప అగ్నిప్రమాదంలో పాండ్రేథాన్ నగరం నాశనమైందని చెప్పబడింది.  మనుగడలో ఉన్న ఏకైక నిర్మాణం ఈ ఆలయం మాత్రమే.


💠 ఈ ఆలయ విశిష్టత ఆలయ పైకప్పులో ఉంది, ఇది ఒకే రాయి ముక్క నుండి పిరమిడ్ నిర్మాణంలో చెక్కబడింది.

లోపలి భాగంలో, కాశ్మీర్‌లో దాదాపుగా పరిపూర్ణమైన పురాతన శిల్పకళను ప్రదర్శిస్తూ, బొమ్మలలో పైకప్పు చాలా క్లిష్టమైనదిగా చెక్కబడింది. 


💠 ఈ ఆలయంలో కనిపించే విశిష్టమైన కాశ్మీరీ నిర్మాణ శైలి మరియు మార్తాండ్, అవంతీస్వామి, అవంతీశ్వర మరియు ఇతరులు వంటి వాటిలో చాలా వరకు గ్రీకు మరియు గాంధారన్-బౌద్ధ మఠ శైలుల వాస్తుశిల్పాల మిశ్రమంతో ప్రభావితమైందని నమ్ముతారు.


💠 ఈ ఆలయంలో అనేక దేవతలు ఉన్నారు.  ఆలయ ప్రాంగణంలో ఉన్న చాలా చిత్రాలు శివునికి సంబంధించినవి.  

కొన్ని చిత్రాలు మూడు తలలతో ఉంటాయి, వాటిలో రెండు మగని సూచిస్తాయి మరియు మూడవది స్త్రీని సూచిస్తుంది. 


💠 ఆలయ సముదాయంలో నాలుగు వైపులా బొమ్మలతో కూడిన స్తంభం కూడా ఉంది.  

స్త్రీ దేవతల చిత్రాలలో గంగా, చాముండ, వైష్ణవి, వారాహి మరియు ఇంద్రాణి ఉన్నాయి.  ఈ చిత్రాలలో చాలా వరకు బహుళ-సాయుధమైనవి మరియు వివిధ రూపాలు మరియు భంగిమల్లో ప్రదర్శించబడతాయి.




© Santosh Kumar

08-02-2024 / గురువారం / రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*08-02-2024 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

---------------------------------------

వృషభం


సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో విశేషమైన ఆధరణ పెరుగతుంది.

---------------------------------------

మిధునం


కుటుంబసభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించింది నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలు సేకరిస్తారు. స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

---------------------------------------

కర్కాటకం


కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. బంధు వర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------

సింహం


ఉద్యోగాలు ఆశించిన రీతిలో రాణించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. 

---------------------------------------

కన్య


వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 

---------------------------------------

తుల


చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

వృశ్చికం


బంధు మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. దూరప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది.

---------------------------------------

ధనస్సు


ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.

---------------------------------------

మకరం


ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. ఆత్మీయుల నుంచి అందిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

కుంభం


ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఉంటాయి. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్పు చేయడం వలన నష్టాలు తప్పవు.

---------------------------------------

మీనం


వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహమున శుభకార్యాల నిర్వహణ పై చర్చలు చేస్తారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

సుభాషితమ్

  💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 శ్లో𝕝𝕝 

*వాగ్వైఖరీ శబ్దఝరీ శాస్త్రవ్యాఖ్యానకౌశలమ్౹*

*వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే న తు ముక్తయే॥* 


*॥ _-వివేక చూడామణి-_॥*


 *తా𝕝𝕝* పండితుల వాక్చాతుర్యము, అనర్గల పదప్రయోగ కౌశలము, శాస్త్రవ్యాఖ్యాన నైపుణ్యము మున్నగునవి భుక్తినిచ్చునే కాని ముక్తినివ్వజాలవు.... *ముక్తిని కేవలము సద్గురు పదములే ప్రసాదించగలవు....*

సద్గురునిఅనుగ్రహమహిమ

 శు భో ద యం🙏


సద్గురునిఅనుగ్రహమహిమ!

                      నరసింహశతకం.


"దుష్టసంహార నరసింహదురితదూర"!

-అనే మకుటంతో రచింపబడిన ఈశతకంలోని పద్యాలు అనవద్య హృద్యాలు.సాంఘికదురవస్థలను తూర్పారబట్టే ఇందలిప్రతిపద్యము

ఒకరత్నమే! ఈపద్యాన్ని కొంచెంరుచిచూడండి,


"సంచలింపకనెందు సంజవార్చిననేమి

      బ్రహ్మనందకగాడు బ్రాహ్మణుండు;

తిరుమణిశ్రీచూర్ణతిలకమద్దినగాని

      విష్ణునందకగాడు వైష్ణవుండు;

భూతినుదుటనునంతబూసికొన్ననునేమి, 

       శంభునందకగాడుశైవజనుడు;

కాషాయవస్త్రాలు గట్టినంతననేమి

       రాజుబోవగగాడుయతివరుండు;


ఇట్టిలౌకిక వేషాలు గట్టికొనిన

గురునిజెందక సన్ముక్తి దొరుకబోదు

భూషణవికాస!శ్రీధర్మపురినివాస!

దుష్టసంహార!నరసింహ!దురితదూర!"-

           -ధర్మపురి శేషప్పకవి.

 

"


భావము:ప్రతినిత్యంసంధ్యావందనంచేస్తున్నా, బ్రహ్మజ్ఞానంలేకపోతేవాడు బ్రాహ్మణుడు కాబోడు.

         తిరుమణితో శ్రీచూర్ణంతో ఎంతఅందంగా నామంతీర్చిదిద్దినా, విష్ణుధ్యానపరాయణత లేకపోతేవాడు

వైష్ణవుడు కాబోడు.

   బూడిద మొగమంతాపూసుకున్నతమాత్రంచేత

శివభక్తి లేనివాడు శైవుడు అవడు.

     కాషాయవస్త్రాలు డాబుసరిగా ధరించినా సన్యాసి రాజుకాబోడు.

          అలాంటి లౌకిక మైనవేషాలు యెన్నివేసినా,సద్గుర్వనుగ్రసిధ్ధిలేనిచో 

మోక్షము లభించదు.

             అందువలన సద్గుని సమాశ్రయణము సర్వశ్రేయోదాయకము.🙏🙏🙏👌👌🙏

చొల్లంగి అమావాస్య ప్రత్యేకత*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*9-2-2024 తారీకున చొల్లంగి అమావాస్య ప్రత్యేకత*


అన్ని రకాల దీర్ఘకాలిక రోగాల నుంచి మానసిక రుగ్మతల నుంచి పూర్తి ఉపశయనం పొందగోరు వారు చొల్లంగి అమావాస్య రోజు ఈ క్రింది విధంగా చేసి అద్భుత ఫలితాన్ని పొందగలరు.


పుష్య మాసంలో వచ్చే ఆఖరి రోజు అమావాస్య చొల్లంగి అమావాస్య దీని ప్రత్యేకత భూమి మీద విష్ణుమూర్తి వైద్య వీర రాఘవ  స్వామిగా అవతరించిన దినం.


త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ ? 

విష్ణు సహస్రనామం లోని నామాన్ని నిరూపించటం కొరకు విష్ణుమూర్తి వైద్య వీర రాఘవ స్వామిగా భూమి మీద అవతరించారు. ఈరోజు రోగ హరణ శక్తి కల రోజు 


ఈ క్రింది మూడు పనులతో ఎవరైతే వైద్య వీర రాఘవస్వామిని ఆరాధిస్తారో వారి యొక్క అన్ని రోగాలు హరించి పోతాయి.


1  వైద్య వీరరాఘవ స్వామి ఫోటోను ప్రత్యేక దీపంతో స్వామిని ఆరాధించాలి.  ఒక ప్లేట్లో బియ్యప్పిండి పంచదార పొడి సమానంగా తీసుకు కలిపి కొద్దిగా ఏలకపొడి కలిపి  మధ్యలో గుంతలా చేసి ఆవు నేతితో తడిపిన పువ్వొత్తి  వేసి వెలిగించాలి తమ యొక్క రోగా హరణ  చేయమని ప్రార్థించాలి.


2. ఇంట్లో ఎవరికైనా ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఎడల వారికి ఒక వెండి  తీగ  కడియం తీసుకువచ్చి స్వామివారి పూజలో ఉంచి మాకు కానీ మీ దయవలన స్వస్థత చేకూర్తే   తిరువళ్లూరు వచ్చి మీ హుండీలో ఆ కడియం వేస్తాము అని సంకల్పం చెప్పుకోవాలి.


3 మీ ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర దగ్గర ఏదైనా కోనేరు గాని చెరువు గాని లేనిపక్షంలో బావి గాని ఉంటే

(ఏదీ లేనిపక్షంలో ఒక చిన్న గిన్నె తీసుకుని నీళ్లు పోసి దానిలోనే బెల్లం ముక్క వేయాలి) ఇంటిళ్ల పాది ప్రతీ ఒక్కరు చిన్న బెల్లం ముక్క అందులో వేసి దాని చుట్టూ ప్రదక్షణ చేసి తిరువెల్లూరు లోని పుష్కరిణి హృత్ పాపనాసిని లో స్నానం చేస్తూ ప్రదక్షిణ చేస్తున్నాం అని తలచు కోవాలి.


పూజ పూర్తయిన తర్వాత ఆ పిండిలో నుంచి ఒత్తిని తీసివేసి కొద్దిగా నెయ్య వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ప్రసాదంగా అందరూ స్వీకరించాలి


వ్యాధి నెమ్మదించిన తరువాత   తిరువళ్లూర్ వెళ్లి ఆ కడియం హుండీలో వెయ్యాలి ఈ విధంగా చేసి దీర్ఘకాలిక రోగాల నుంచి స్వస్థత పొందిన వారు లక్షల సంఖ్యలో కలరు.


శ్రీ వైష్ణవ 108 దివ్య క్షేత్రాలలో ఈ తిరువళ్లూర్ ఒకటి చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో అరకోలం వెళ్లే మార్గంలో ఉంది .


హృత్ పాపనాసిని అనే పుష్కరిణి గొప్పతనము


పరమేశ్వరుడు దక్ష యజ్ఞంలో వీరభద్రుని అవతారంతో దక్షుడుని సంహరించి తర్వాత  బ్రహ్మ మానస పుత్రుని సంహరించినానని చింతాక్రాంతులైనారు.  అసరీరవాణి సూచన మేరకు స్వామి వీరభద్రునిగా హృత్ పాపనాసిని పుష్కరిలో స్నానమాచరించి ఆ చింత నుంచి విముక్తుడైనారు.

చింతాక్రాంతుడైన పరమేశ్వరునికే స్వస్థత చేకూర్చిన మహత్యము గల పుష్కరిణి అది.


తిరువళ్లూర్ క్షేత్రం గురించి.



నివసించే సాలిహోత్రుడు అనే విష్ణు అంశ కల ఋషి తీర్థయాత్ర చేస్తూ తిరువళ్లూర్ క్షేత్ర దర్శనం చేశారు అక్కడి ప్రశాంతతకు  ముగ్దుడు అయిన ఆయన ఒక సంవత్సర కాలం ఉపవాస దీక్షతో తపస్సు చేసుకో సంకల్పించారు దానిని నెరవేర్చి పాలన చేయుటకు పూనుకుంటున్న సమయంలో ఒక వృద్ధుడు వచ్చి ఆకలి భరించలేకపోతున్నాను ఆహారము నాకిమ్మని వేడుకొ కొనేను.

ఆహారమును అతనికి  ఇచ్చి వేసి మరల ఇంకొక సంవత్సరము ఉపవాస దీక్షతో తపస్సు కొనసాగించెను. అనంతరం పాలన సమయమున మరల ఆ వృద్ధుడు తిరిగి ఆహారము నాకిమ్మనెను అది కూడా అతనికి వసంగెను వెంటనే ఆయనే విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై నీ కోరిక ఏమి అని అడిగేను నాకు కోరికలు ఏమీ లేవు ఈ లోక కళ్యాణం కొరకు తపస్సు చేస్తున్నాను అని చెప్పాను మరి వెంటనే స్వామివారు శయనమూర్తిగా అక్కడ వెలిసినారు అదే ఈ క్షేత్రం.


లక్ష్మీ అమ్మవారు.


ఆ ప్రాంతాన్ని ధర్మశాల మహారాజు అనే రాజు పరిపాలిస్తుండేవారు వీరికి వసుమతి అనే కుమార్తె కలదు ఆమె ఒకసారి పాపనాసిని వద్దకు వచ్చినప్పుడు అత్యంత సౌందర్యవంతుడైన ఒక రాజుని చూశాను వారిరువు ఒకరినొకరు మోహించుకొనిరి. వివాహము కొరకు ప్రస్తావన చేయగా మా తండ్రి గారి అనుమతి తీసుకొనమని ఆమె బదులు  పలికెను.

అంత ఆయన మహారాజు వద్ద వివాహ  విషయమే ప్రస్తావించగా రాజుగారు మీ గోత్రనామాలు తెలియ జేయమనిరి. అవన్నీ మీకు నేను తెలియ జేయలేను మీ అమ్మాయిని నాకు వసంగినచో లక్షల మంది మీ అమ్మాయికి  నీరాజనాలు అర్పించే స్థాయిలో ఉంచుతాను అని చెప్పిరి.

మహారాజు అత్యంత తేజస్సుతో వెలిగిపోతున్న అతనితో అమ్మాయి వివాహము జరిపిరి. వివాహ అనంతరం భార్య చేయి పట్టుకుని గర్భగుడిలో విగ్రహంలోనికి అంతర్ధానం అయ్యిరి.


ఇచ్చట అమ్మవారిని కనకవల్లి గాను ఉత్సవ మూర్తిని  వసుమతి గాను పిలుస్తారు.


స్వామివారి విగ్రహం  ప్రాముఖ్యత


స్వామివారు  విగ్రహం శయన రూపంలో ఉంటుంది కుడి చేయి క్రిందకి వంచి ఉంటుంది పక్కనే శాలిహోత్ర మహర్షి ఉంటారు.


ఎడమ చేతితో చిన్ముద్ర చూపిస్తూ ఉంటారు ఏదైనా వసంఘగలను అని చెప్పినట్లు


స్వామివారి తలగడగా చిన్న మందుల పెట్టే ఉంటుంది.

🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

.           *🌹వేమన పద్యములు🌹* 

.             *అర్థము - తాత్పర్యము*

.                    *Part - 23*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥 వేమన పద్యాలు--- 64*


*అఖిల జీవములను నజుడవై పుట్టించి*

*విష్ణుడవై  వాని వెలయ జేసి*

*శివుడవై సకలము శిక్షించుచుందువు*

*విశ్వదాభిరామ వినురవేమ !*


*🌹 తాత్పర్యము ---*

బ్రహ్మగా సృష్టిస్తావు.

విష్ణువుగా స్థితికారకుడవుతావు.

తుదకు శివునిగా లయము కలిగిస్తావు.

ప్రళయము సృష్టిస్తావు.


*💥 వేమన పద్యాలు --- 65*


*అఖిల దేవతలును హరిపూజ జేయంగ*

*హరుడు నృత్యమాడె నాదియందు*

*ఆదిబ్రహ్మ తానె యట మద్దెలనుగొట్టె*

*విశ్వదాభిరామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము ---*

దేవతలందరు విష్ణువుని పూజించ , శివుడు శివతాండవం చేసినాడు.

బ్రహ్మ తనంతటతానే మృదంగమును ధ్వనింపజేసినాడు.


*💥వేమన పద్యాలు -- 66*


అఖిలాకారు డనంతుడు

సకలాత్మలయందు సర్వసాక్షియై తానై

నిఖిలముల నిర్వికారుడు

నికరము బ్రహ్మ మ్మనంగ నిజముర వేమా !


*🌹తాత్పర్యము --*

సమస్త ఆకారములు ధరించువాడు , అంతములేనివాడు , సమస్త జీవకోటికి సాక్షీభూతుడు, నిర్వికార నిరంజనుడు అతడే బ్రహ్మ.

బ్రహ్మ తత్వమంటే అదే !


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పెళ్లి సంబంధాలు

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


*పెళ్లి సంబంధాలు..*


"రాబోయే శ్రావణ మాసం లో మా అబ్బాయి వివాహం నిశ్చయం అయిందండీ..ఇక్కడే శ్రీ స్వామివారి సన్నిధిలో నే పెళ్లి జరిపిద్దామని అనుకుంటున్నాము..అమ్మాయి తరఫు వాళ్లకు కూడా చెప్పాము..ఆరోజు మీ దంపతులిద్దరూ ఇక్కడ వుండి.. వధూవరులను ఆశీర్వదించాలి.." అన్నారు ఆ భార్యా భర్తలు ..వాళ్లిద్దరూ ఎప్పుడూ శ్రీ స్వామివారి మందిరానికి వచ్చేవారే.. శ్రీ స్వామివారి మీద అపారమైన భక్తి కలిగి వున్నవారు..మాకూ బాగా తెలుసు..అందువల్ల..ఒక్కక్షణం కూడా సంకోచించకుండా "సరే!" అనేశాము.. పెళ్లికి సుమారు నెలన్నర పైనే సమయం ఉంది..


శ్రావణమాసం వచ్చింది..సహజంగానే శ్రావణమాసం లో వచ్చే శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది..మేమూ ఆందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటాము..ఆ నెలలో మందిరం వద్ద వివాహాలూ జరుగుతుంటాయి..మొదటివారం గడిచిపోయింది..అప్పుడు గుర్తుకొచ్చింది నాకు..ఆ దంపతులు వచ్చి వాళ్ళబ్బాయి వివాహం అని చెప్పి వెళ్లారు కదా..నేను మర్చిపోయానేమో..అనే సందేహం వచ్చి మా సిబ్బందిని అడిగాను..ఫలానా వాళ్ళబ్బాయి వివాహం ఎప్పుడు?..లేక జరిగిపోయిందా?..అని..మా సిబ్బంది కూడా "ఆరోజు వచ్చి శ్రావణమాసం లో వివాహం అని చెప్పారే కానీ..ఫలానా తేదీ అని చెప్పలేదు..మళ్లీ మందిరానికి రాలేదు..మనలను సంప్రదించలేదు.." అన్నారు..హమ్మయ్య!..నేను మర్చిపోలేదు అని సంతోషించాను..వివరం కనుక్కోవడానికి ఫోన్ చేసాను.."అయ్యా..అబ్బాయి పెళ్లి విషయం నేను వచ్చి మీతో మాట్లాడతాను..వచ్చే ఆదివారం నాడు నేనూ నా భార్యా ఇద్దరమూ గుడికి వస్తాము.." అని ముక్తసరిగా బదులిచ్చి, ఫోన్ పెట్టేసాడు..ఏదో జరిగింది అని అనిపించింది..ఆ తరువాత నేను నా పనుల్లో మునిగిపోయాను..


ప్రక్క ఆదివారం నాడు ఆ దంపతులిద్దరూ మందిరానికి వచ్చారు..ఈసారి తమ కుమారుడిని కూడా తీసుకొని వచ్చారు..వాళ్ళను చూస్తే..పుట్టెడు దిగులుతో ఉన్నారనిపించింది..శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్లి, సమాధి మందిరం గడప వద్ద చాలా సేపు నిలబడి ప్రార్ధించుకున్నారు..యధావిధిగా అర్చన చేయించుకున్నారు..నన్ను అనుమతి అడిగి, సమాధి వద్దకు వెళ్లి, సమాధికి తల ఆనించి నమస్కారం చేసుకున్నారు..ఇవతలికి వచ్చేసారు..


"మీతో ఆరోజు శ్రావణమాసం లో వివాహం అని చెప్పాను కదండీ..అన్నీ మాట్లాడుకున్నాము..నిశ్చయ తాంబూలాలు కూడా తీసుకున్నాము..మరి ఏ కారణమో తెలీదండీ..అమ్మాయి తల్లిదండ్రులు ఫోన్ చేసి.."మేము మీ సంబంధం వద్దు అనుకుంటున్నాము..మేము బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.." అన్నారండీ..మాకేమి అర్ధం కాలేదు..మా ఇంట్లో శుభకార్యం అని బంధువులందరితో చెప్పేశాము..ఫలానా తేదీ నాడు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద వివాహం అని కూడా తెలిపాము..ఉన్నట్టుండి వాళ్ళు "పెళ్లి రద్దు" అని చెప్పేసరికి..బాగా బాధపడ్డాము..మేమేమీ కట్న కానుకల దగ్గర పేచీ పెట్టలేదు..మా వైపు నుంచి ఎటువంటి కోరికలూ కోరలేదు..మరి ఎందుకని వద్దన్నారో అర్ధం కాలేదు..మనసుకు తీవ్ర కష్టం వేసింది..శ్రీ స్వామివారినే నమ్ముకొని వున్నాము..ఆయన ఎందుకని మాపై చిన్న చూపు చూశాడో తెలీదు..ఇప్పుడు కూడా ఆయనకే మొర పెట్టుకున్నాము.." అన్నారు.. 


"నమ్మిన వాళ్ళను దైవం ఎప్పుడూ చిన్న చూపు చూడడు..మీకు ఇంతకంటే మంచి సంబంధం కుదురుతుందేమో..కొన్నాళ్లపాటు మీకు వేదన ఉండొచ్చు..కానీ అది తాత్కాలికంగానే ఉంటుంది..శ్రీ స్వామివారిని నమ్మి వున్నారు..నిశ్చింతగా వుండండి.." అని ఓదార్పుగా చెప్పాను..అన్యమన్యస్కంగానే తలూపారు..తల్లీ దండ్రి తో పాటు వచ్చిన ఆ అబ్బాయి కూడా ముభావంగా వున్నాడు..తిరిగి వాళ్ళ ఊరికి వెళ్లేముందు మళ్లీ ఒక్కసారి ఆ కుటుంబం మొత్తం శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని వెళ్లారు..మాకూ కొద్దిగా బాధ అనిపించింది..


ఆ ప్రక్క బుధవారం నాడు ఉదయం పది గంటలప్పుడు..నేనూ మా సిబ్బంది మందిరం లో కూర్చుని వున్నాము..ఇంతలో ఆ దంపతులు వచ్చారు..వాళ్ళ ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి..ఇద్దరూ నేరుగా శ్రీ స్వామివారి సమాధి మందిరం వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..అర్చన కూడా చేయించుకున్నారు..అక్కడనుంచి నేరుగా మా వద్దకు వచ్చి.."వచ్చే గురువారం అబ్బాయి పెళ్లి..ఇక్కడే చేయాలి..మొన్న సోమవారం నాడు మాట్లాడుకున్నాము..ఇంతకూ అమ్మాయి తరఫు వాళ్ళు మా బంధువులే!..వాళ్ళు మా సంబంధం చేసుకోవాలని అనుకున్నారట.. కానీ ఈలోపల మేము వేరే కుదిరింది అని చెప్పడంతో ఊరుకున్నారట..తీరా ఆ సంబంధం తప్పిపోయిందని తెలిసి..మా ఇంటికొచ్చి మాతో మాట్లాడి అన్నీ కుదుర్చుకుని వెళ్లారు..పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు..ఆలస్యం ఎందుకని వచ్చే గురువారానికి ముహూర్తం పెట్టుకున్నాము..ఈ స్వామివారు చల్లంగా చూసాడు..మంచి సంబంధమే కుదిరింది.." అని చెప్పారు..


అనుకున్నవిధంగానే శ్రీ స్వామివారి సన్నిధిలో ఏ ఆటంకం లేకుండా లక్షణంగా వివాహం జరిగిపోయింది..మొదటి సంబంధం తప్పిపోవడానికి ఏ కారణమో తెలీదు..మళ్లీ ఈ సంబంధం కుదిరి వివాహం కావడానికి కూడా కారణం తెలీదు..కారణం తెలిసింది ఒక్క స్వామివారికే..వారు చెప్పరు..మౌనంగా సమాధి నుంచి గమనిస్తూ వుంటారు..అందుకే మేము నిత్యమూ ఒకటి అనుకుంటూ వుంటాము.."స్వామి వారి లీలలు మన ఆలోచనలకు అందవూ.." అని..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699

వేద ఆశీర్వచనం

*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం  -‌ త్రయోదశి -  ఉత్తరాషాఢ -‌ గురు వాసరే* *(08-02-2024)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏