8, ఫిబ్రవరి 2024, గురువారం

చొల్లంగి అమావాస్య ప్రత్యేకత*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*9-2-2024 తారీకున చొల్లంగి అమావాస్య ప్రత్యేకత*


అన్ని రకాల దీర్ఘకాలిక రోగాల నుంచి మానసిక రుగ్మతల నుంచి పూర్తి ఉపశయనం పొందగోరు వారు చొల్లంగి అమావాస్య రోజు ఈ క్రింది విధంగా చేసి అద్భుత ఫలితాన్ని పొందగలరు.


పుష్య మాసంలో వచ్చే ఆఖరి రోజు అమావాస్య చొల్లంగి అమావాస్య దీని ప్రత్యేకత భూమి మీద విష్ణుమూర్తి వైద్య వీర రాఘవ  స్వామిగా అవతరించిన దినం.


త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ ? 

విష్ణు సహస్రనామం లోని నామాన్ని నిరూపించటం కొరకు విష్ణుమూర్తి వైద్య వీర రాఘవ స్వామిగా భూమి మీద అవతరించారు. ఈరోజు రోగ హరణ శక్తి కల రోజు 


ఈ క్రింది మూడు పనులతో ఎవరైతే వైద్య వీర రాఘవస్వామిని ఆరాధిస్తారో వారి యొక్క అన్ని రోగాలు హరించి పోతాయి.


1  వైద్య వీరరాఘవ స్వామి ఫోటోను ప్రత్యేక దీపంతో స్వామిని ఆరాధించాలి.  ఒక ప్లేట్లో బియ్యప్పిండి పంచదార పొడి సమానంగా తీసుకు కలిపి కొద్దిగా ఏలకపొడి కలిపి  మధ్యలో గుంతలా చేసి ఆవు నేతితో తడిపిన పువ్వొత్తి  వేసి వెలిగించాలి తమ యొక్క రోగా హరణ  చేయమని ప్రార్థించాలి.


2. ఇంట్లో ఎవరికైనా ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఎడల వారికి ఒక వెండి  తీగ  కడియం తీసుకువచ్చి స్వామివారి పూజలో ఉంచి మాకు కానీ మీ దయవలన స్వస్థత చేకూర్తే   తిరువళ్లూరు వచ్చి మీ హుండీలో ఆ కడియం వేస్తాము అని సంకల్పం చెప్పుకోవాలి.


3 మీ ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర దగ్గర ఏదైనా కోనేరు గాని చెరువు గాని లేనిపక్షంలో బావి గాని ఉంటే

(ఏదీ లేనిపక్షంలో ఒక చిన్న గిన్నె తీసుకుని నీళ్లు పోసి దానిలోనే బెల్లం ముక్క వేయాలి) ఇంటిళ్ల పాది ప్రతీ ఒక్కరు చిన్న బెల్లం ముక్క అందులో వేసి దాని చుట్టూ ప్రదక్షణ చేసి తిరువెల్లూరు లోని పుష్కరిణి హృత్ పాపనాసిని లో స్నానం చేస్తూ ప్రదక్షిణ చేస్తున్నాం అని తలచు కోవాలి.


పూజ పూర్తయిన తర్వాత ఆ పిండిలో నుంచి ఒత్తిని తీసివేసి కొద్దిగా నెయ్య వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ప్రసాదంగా అందరూ స్వీకరించాలి


వ్యాధి నెమ్మదించిన తరువాత   తిరువళ్లూర్ వెళ్లి ఆ కడియం హుండీలో వెయ్యాలి ఈ విధంగా చేసి దీర్ఘకాలిక రోగాల నుంచి స్వస్థత పొందిన వారు లక్షల సంఖ్యలో కలరు.


శ్రీ వైష్ణవ 108 దివ్య క్షేత్రాలలో ఈ తిరువళ్లూర్ ఒకటి చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో అరకోలం వెళ్లే మార్గంలో ఉంది .


హృత్ పాపనాసిని అనే పుష్కరిణి గొప్పతనము


పరమేశ్వరుడు దక్ష యజ్ఞంలో వీరభద్రుని అవతారంతో దక్షుడుని సంహరించి తర్వాత  బ్రహ్మ మానస పుత్రుని సంహరించినానని చింతాక్రాంతులైనారు.  అసరీరవాణి సూచన మేరకు స్వామి వీరభద్రునిగా హృత్ పాపనాసిని పుష్కరిలో స్నానమాచరించి ఆ చింత నుంచి విముక్తుడైనారు.

చింతాక్రాంతుడైన పరమేశ్వరునికే స్వస్థత చేకూర్చిన మహత్యము గల పుష్కరిణి అది.


తిరువళ్లూర్ క్షేత్రం గురించి.



నివసించే సాలిహోత్రుడు అనే విష్ణు అంశ కల ఋషి తీర్థయాత్ర చేస్తూ తిరువళ్లూర్ క్షేత్ర దర్శనం చేశారు అక్కడి ప్రశాంతతకు  ముగ్దుడు అయిన ఆయన ఒక సంవత్సర కాలం ఉపవాస దీక్షతో తపస్సు చేసుకో సంకల్పించారు దానిని నెరవేర్చి పాలన చేయుటకు పూనుకుంటున్న సమయంలో ఒక వృద్ధుడు వచ్చి ఆకలి భరించలేకపోతున్నాను ఆహారము నాకిమ్మని వేడుకొ కొనేను.

ఆహారమును అతనికి  ఇచ్చి వేసి మరల ఇంకొక సంవత్సరము ఉపవాస దీక్షతో తపస్సు కొనసాగించెను. అనంతరం పాలన సమయమున మరల ఆ వృద్ధుడు తిరిగి ఆహారము నాకిమ్మనెను అది కూడా అతనికి వసంగెను వెంటనే ఆయనే విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై నీ కోరిక ఏమి అని అడిగేను నాకు కోరికలు ఏమీ లేవు ఈ లోక కళ్యాణం కొరకు తపస్సు చేస్తున్నాను అని చెప్పాను మరి వెంటనే స్వామివారు శయనమూర్తిగా అక్కడ వెలిసినారు అదే ఈ క్షేత్రం.


లక్ష్మీ అమ్మవారు.


ఆ ప్రాంతాన్ని ధర్మశాల మహారాజు అనే రాజు పరిపాలిస్తుండేవారు వీరికి వసుమతి అనే కుమార్తె కలదు ఆమె ఒకసారి పాపనాసిని వద్దకు వచ్చినప్పుడు అత్యంత సౌందర్యవంతుడైన ఒక రాజుని చూశాను వారిరువు ఒకరినొకరు మోహించుకొనిరి. వివాహము కొరకు ప్రస్తావన చేయగా మా తండ్రి గారి అనుమతి తీసుకొనమని ఆమె బదులు  పలికెను.

అంత ఆయన మహారాజు వద్ద వివాహ  విషయమే ప్రస్తావించగా రాజుగారు మీ గోత్రనామాలు తెలియ జేయమనిరి. అవన్నీ మీకు నేను తెలియ జేయలేను మీ అమ్మాయిని నాకు వసంగినచో లక్షల మంది మీ అమ్మాయికి  నీరాజనాలు అర్పించే స్థాయిలో ఉంచుతాను అని చెప్పిరి.

మహారాజు అత్యంత తేజస్సుతో వెలిగిపోతున్న అతనితో అమ్మాయి వివాహము జరిపిరి. వివాహ అనంతరం భార్య చేయి పట్టుకుని గర్భగుడిలో విగ్రహంలోనికి అంతర్ధానం అయ్యిరి.


ఇచ్చట అమ్మవారిని కనకవల్లి గాను ఉత్సవ మూర్తిని  వసుమతి గాను పిలుస్తారు.


స్వామివారి విగ్రహం  ప్రాముఖ్యత


స్వామివారు  విగ్రహం శయన రూపంలో ఉంటుంది కుడి చేయి క్రిందకి వంచి ఉంటుంది పక్కనే శాలిహోత్ర మహర్షి ఉంటారు.


ఎడమ చేతితో చిన్ముద్ర చూపిస్తూ ఉంటారు ఏదైనా వసంఘగలను అని చెప్పినట్లు


స్వామివారి తలగడగా చిన్న మందుల పెట్టే ఉంటుంది.

🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: