1, అక్టోబర్ 2023, ఆదివారం

ఉండ్రాళ్ళతద్దె

 *నేడు ఉండ్రాళ్ళతద్దె(తదియ). సకల సౌభ్యాగ్యకరం ఉండ్రాళ్లతద్దె వ్రతం*


*అక్టోబర్ 01 ఆదివారం ఉండ్రాళ్లతద్దె వ్రతం సందర్భంగా...*


హిందూ సంప్రదాయం పండుగలకు పెట్టింది పేరైతే, ప్రతి వేడుక వెనుక ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యత, ఆరోగ్యపరమైన రహస్యాలను మేళవించి రూపొందించారు మన పెద్దలు. అటువంటి లక్షణాలన్నీ ఉండి మహిళలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ‘ఉండ్రాళ్ల తద్దె’. ప్రతి గ్రామంలో మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో, హుషారుగా జరుపుకునే ఈ వేడుక ప్రతి సంవత్సరం భాద్రపద బహుల తదియ నాడు అంటే పౌర్ణమి తర్వాతి తదియ తిథిరోజున వస్తుంది. ఈ పండుగ జరుపుకేనే విధానాన్ని పరిశీలిస్తే ఆధ్యాత్మిక భావంతో పాటుగా ఊరిలోని వారందరి మధ్య ఒక ఐక్యతాభావం, అలాగే ఈ పండుగకు తీసుకోవాల్సిన ఆహారం విషయం చూస్తే వర్షరుతువులో వచ్చే భాద్రపద మాసానికి తగిన విధంగా ఆరోగ్యపరిరక్షణ మొదలైనవి మనకు కనిపిస్తాయి. తరతరాలుగా ప్రతి గ్రామంలోను తెలుగింటి ఆడపడుచులు ఈ ఉండ్రాళ్ల తద్దె పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవటం మనం చూస్తుంటాం. ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా డైలీ విష్ వీక్షకులకు ఈ ప్రత్యేక కథనం.

 

ఉండ్రాళ్ల తద్దెకు కేవలం తదియ రోజు మాత్రమే కాకుండా ఆ ముందు రోజైన విదియకు కూడా ఎంతో పాత్ర ఉంది. పూర్వకాలంలో ముందు రోజు ఐదుగురు ముత్తయిదువులకు మహిళలు గోరింటాకు ముద్దను, పసుపు, కుంకుమ, కుంకుడుకాయలు, నువ్వులనూనె ఇచ్చి వారిని తమ ఇంటికి తాంబూలం తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించేవారు. అదేవిధంగా వివాహం కాని యువతులు కూడా ఈ ఉండ్రాళ్ల తద్దె నోము నోచుకుంటే త్వరగా వివాహం అయి మంచి భర్త లభిస్తాడని, వివాహితలు నోము నోచుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. దీంతో వివాహం కాని యువతులు సైతం ముందురోజు తెల్లవారుజామున కుంకుడుకాయలతో తలస్నానం చేసి, జుట్టుకు సాంబ్రాణిపొగ వేయటం కనిపిస్తుంది. కుంకుడుకాయలు జుట్టులోకి చుండ్రును చేరనీయకుండా చేస్తాయి, ఇక సాంబ్రాణి వల్ల వెంట్రుకల మూలాల దగ్గర ఉన్న తడిసైతం ఆవిరవుతుంది.

 

ఈ ప్రక్రియ పూర్తికాగానే ఉదయం 6 గంటలలోపే గోంగూరపచ్చడితో పెరుగన్నం పిల్లలందరికి వారి తల్లి తినిపిస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర శరీరంలో ఉష్ణోగ్రత కలిగిస్తే, పెరుగన్నం చలువ పదార్థం కనుక ఈ కాలంలో ఎటువంటి వ్యాధులకు శరీరం గురికాకుండా ఉష్టోగ్రత సమతుల్యంగా ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో నువ్వులపొడిని కూడా కలుపుని తింటారు. దీంతో ఈ వర్షాకాలంలో సహజంగా వచ్చే జలుబు, రొంప, కళ్ల మంటలు వంటి అనేక వ్యాధులకు దగ్గరికి కూడా రావు.

 

ఇక రెండో రోజైన తదియ నాడు అసలైన సందడి మనకు కనిపిస్తుంది. ఆ రోజు తెల్లవారుజామునే గోంగూర, ఆవకాయ నంచుకుని పెరుగన్నం తినడం గ్రామాల్లోని ప్రతి ఇంటిలో జరుగుతుంది. ఆ తర్వాత ఊరిలోని మహిళలు, ఆడపిల్లలు ఒకచోట చేరి ఉయ్యాలలూగటం, దాగుడుమూతలు, దూదుంపుల్ల, కోతికొమ్మచ్చి వంటి అనేక ఆటలు ఆడతారు. ఈ ఆటలు పూర్తయ్యేసరికి మహిళలు తాము చేసిన ఉండ్రాళ్లను తోటి మహిళలకు పంచుతారు. ఈ విధంగా ఈ పండుగల సామాజిక సమైక్యత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం ఎవరింటిలో వారు గౌరీదేవిని పూజించి, ఐదు దారపు పోగులు, ఐదుముడులతో ఏడు తోరాలను అమ్మవారి దగ్గర ఉంచి పూజిస్తారు. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోమునోచుకునే మహిళకు, మిగతా ఐదు ముత్తయిదువులకు కడతారు.

 

అదేవిధంగా బియ్యంపిండిలో బెల్లం కలిపి చేసిన పచ్చి చలిమిడిని, ఐదు ఉండ్రాళ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఉండ్రాళ్ల తద్దె వ్రత కథను చెప్పుకోవాలి. ఆ కథ చెప్పుకునేముందు అక్షింతతలను చేతిలో ఉంచుకుని కథ పూర్తయిన తర్వాత వాటిలో కొన్నింటిని అమ్మవారి పాదాల దగ్గర వేసి మిగతావి నోము నోచుకునే మహిళ తన తలపై వేసుకోవాలి. ఆ తర్వాత తాము పిలిచిన ఐదుగురు ముత్తయిదువులకు వాయనం ఇవ్వాలి. పూర్ణంబూరెలు, గారెలు, తోరము ఇలా అన్నింటిని ఒక పళ్లెంలో ఉంచి ‘ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటి వాయనం’ అని చెప్తూ మహిళలు ఈ వాయనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

 

భాద్రపదమాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది. వినాయకునికి మోదకప్రియుడు అనిపేరు. అలాగే ఈ ఉండ్రాళ్ల తదియకు కూడా ‘మోదకతదియ’ అనే పేరు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా మహిళల వస్త్రధారణ, శారీరక వ్యాయామం కలిగేలా ఆటలు, ఆరోగ్యపరమైన ఆహారం, గౌరీదేవిని పూజించటం ద్వారా ఆధ్యాత్మిక చింతన మొదలైన వాటి సమ్మేళనంతో మహిళలకు సకల సౌభాగ్యాలను కలుగుజేసే గొప్ప తెలుగు పండుగ ఉండ్రాళ్ల తద్దె అనటంలో ఎటువంటి సందేహం లేదు.

జన్మ పుట్టుక లక్ష్యం

 జన్మ పుట్టుక లక్ష్యం ఏమిటి ?

జన్మలు అంటే ఏమిటి? అందులో మానవ జన్మకు గల కారణం ఏమిటి?

మొదట మనం జన్మ అంటే ఏమిటో తెలుసుకుందాం.

జన్మ అంటే మళ్ళీ పుట్టడం. అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ.

కాని మానవ జన్మే అని మాత్రం చెప్పలేము. ఎందుకంటే మరల మనం పొందే జన్మ మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడుతుంది.

అన్ని జన్మలలోనూ మానవజన్మ మాత్రమే ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తువుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు.


అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.


అన్నీ పుణ్య కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవ జన్మ నేత్తుతాడు.

అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు.

అది భోగ భూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం లేదు.

అందువల్ల పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలచరించే అవకాశం లేదు. తన కర్మఫలాలననుసరించి భోగాలననుభావించి, ఆ కర్మ ఫలాలు క్షయం కాగానే ‘క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి’ అన్నట్లు ఈ మర్త్య లోకాన్ని – మానవ లోకాన్ని చేరవలసిందే. మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే

ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్దులుంటాయే కానీ కర్మజేయుటకు సాధనమైన స్థూల శరీరం వుండదు.


కనుక భాగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు ఈ దేవజన్మ.


ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు, ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులయందు జన్మిస్తాడు.


ఆ జన్మలలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు,దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడుతాడు.


ఈ జన్మలలో కర్మలుచేస్తున్న అవి అన్నియు బుద్దిపరంగా కాదు, అవి అన్నియు కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి.


ఈ జంతు జన్మలలో శరీరం –మనస్సు ఉన్నాయి గాని, బుద్ధి మాత్రం లేదు.


కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించడమే కానీ పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు.


కనుక భాగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడ ఉపయోగపడదు.


ఇక పుణ్యపాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు, ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది.

ఈ మానవ జన్మలో పుణ్య కర్మల ఫలంగా సుఖాలు, మరియు పాప కర్మల ఫలంగా దుఖాలు, అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మఫలాలనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా, ఈ మనవజన్మలోనే వుంది.


ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ ఇది.


కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మ, ఉత్తమోత్తమమైనది, మరియు దుర్లభమైనది, అని అన్నారు.

ఈ మానవ జన్మ 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ ఈ మానవ జన్మ.

కనుకనే ఈ మానవ జన్మను, ‘జంతూనాం నర జన్మ దుర్లభం’ అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో తెలియజేసారు.

ఇట్టి ఈ అపురూపమైన, ఉత్తమోత్తమమైన మరియు దుర్లభమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరు, దీనిని సార్ధకం చేసుకోవాలి.

సరే జన్మలు అయితే ఏవో ఒకటి వస్తూనే వున్నాయి కాని, ఎందుకు మనం ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పుట్టవలసి వస్తుంది.పుట్టిన మన జన్మ లక్ష్యం ఏమిటి?

జంతు జన్మలు పొందిన వాటి లక్ష్యం అయితే ఒకటే, అవి మానవ జన్మ పొందడానికి కర్మలను ఆచరిస్తువుంటాయి.


మరి మనిషిగా పుట్టిన మనం ఏమి చేస్తున్నాం? మన లక్ష్యం ఏమిటి అన్నది? అంటే మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి. సార్ధకం చేసుకోవడం అంటే ఏమిటి అన్నది, ఇక్కడ మనం తెలుసుకోవాలి.

సార్ధకం చేసుకోవడం అంటే ఏమిటి? సాధారణంగా మనం అంతా (మనుషులందరూ) బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, లేదా పెద్ద పెద్ద పదవులు చేపట్టాలి. బాగా సంపాదించి భార్యబిడ్డలతో సహా తను అనేక భోగాలు అనుభవించాలి.అయితే ఇక్కడ ఎవ్వరు తాము కోరుకున్నట్లుగా జీవించలేకపోతున్నారు.

ఎన్ని సుఖాలు, భోగాలు అనుభవించిన ఈ మనస్సుకు ఎదో ఒక వెలితి వుంటుంది.

దీనికి కారణం మనం అనుభవించేవి ఏవి కూడ నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు.

ఇవి అన్నియు అనిత్యమైన వస్తువుల ద్వారా వచ్చే సుఖాలు.

నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖం కావాలంటే నిత్యవస్తువు, పరిపూర్ణవస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే లభిస్తుంది. ఏమిటది?

ఆ నిత్యమైన వస్తువు ఏకమైన “పరమాత్మ” మాత్రమే.

‘నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం’ అని తత్వబోధ లో శంకరాచార్యులవారు స్పష్టం చేసారు. అంటే నిత్య వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వమూ, అనిత్యమైనవే అని అర్థం.

కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం – ఆనందం అందుకునేవరకు, మానవుడికి తృప్తిలేదు. అసంతృప్తి తీరదు.

Work from home




 Disclaimer.  The videos are uploaded from YouTube 

This blogger is not responsible for any loss or damage to anyone. 

వ్యాధి..నివారణ..*

 *వ్యాధి..నివారణ..*


"నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నానండీ..మేము మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకోవాలని అనుకుంటున్నాము..ఎలా రావాలో తెలుపుతారా..?" అని నన్ను ఫోన్ లో అడిగారు..కృష్ణమూర్తి గారు వుండే ప్రదేశం నుంచి శ్రీ స్వామివారి మందిరానికి రావడానికి ఉన్న అన్ని మార్గాలూ వివరంగా తెలిపాను.."మేము మొత్తం నలుగురం వస్తామండీ..మా తల్లిదండ్రులు..నేనూ, నా భార్యా..మా అమ్మా నాన్న గార్లు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్లకొఱకు ఒక రూమ్ ఏదైనా చూడగలరా?..మేమిద్దరం స్వామివారి సన్నిధిలో ఉంటాము.." అన్నారు..వాళ్ళు ఎప్పుడు రాదల్చుకున్నదీ చెప్పారు కనుక..వాళ్ళకొఱకు ఒక గది కేటాయించి పెట్టాను..మరో రెండువారాల తరువాత ఒక శనివారం ఉదయం కృష్ణమూర్తి గారు తన భార్యా..తల్లిదండ్రుల తో కలిసి స్వామివారి మందిరానికి వచ్చారు..


"వీరు మా నాన్నగారు సత్యనారాయణరావు గారు, మా అమ్మగారు వెంకటలక్ష్మి..మా ఆవిడ సుమిత్ర " అంటూ..పేరు పేరునా పరిచయం చేశారు..వాళ్లకు కేటాయించిన గది కి వెళ్లి స్నానాదికాలు ముగించుకొని మళ్లీ మందిరం లోకి వచ్చి నా వద్ద కూర్చున్నారు..కృష్ణమూర్తి గారు నాతో ఏదో చెప్పుకోవాలని వున్నారు అని అనిపించింది...."ఏదైనా సమస్యతో వచ్చారా..? లేక..కేవలం స్వామివారి సమాధి దర్శనానికి వచ్చారా?.." అని అడిగాను..కొద్దిగా సందేహంగా నా వైపు చూసి.."ప్రసాద్ గారూ..చిన్న సమస్య కాదండీ..పెద్ద సమస్య తోనే వచ్చాము..మా ఇద్దరికీ వివాహం జరిగి పదిహేను సంవత్సరాలు అవుతోంది..మాకు ఇద్దరు సంతానం..ఇద్దరూ మొగపిల్లలే..పెద్దవాడికి పన్నెండేళ్ళు..రెండోవాడికి పదేళ్లు..రెండోవాడు పుట్టినప్పుడు..కాన్పు తరువాత ఆరు నెలలకు నా భార్యకు చర్మ సంబంధ వ్యాధి వచ్చింది..ఎన్నో రకాల మందులు వాడాము..ఎందరో డాక్టర్లకు చూపించుకున్నాము..నయం కాలేదండీ..అలానే రోజులు గడచిపోతున్నాయి..అల్లోపతి, హోమియో..ఆయుర్వేదం..ఇలా అన్నిరకాల వైద్యాలూ అయ్యాయి..మా నాన్నగారు సలహా ఇచ్చారండీ.."ఒక్కసారి మొగిలిచెర్ల వెళ్లి, ఆ దత్తాత్రేయ స్వామివారి సమాధి వద్ద మొక్కుకొని రండి..ఫలితం వుంటుంది.." అన్నారండీ..పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా..ఈమె సోదరి వద్ద వదిలిపెట్టి..మేము నలుగురమూ ఇలా వచ్చాము.." అన్నారు..


"ఈరోజు శనివారం కనుక..స్వామివారి సమాధి ని ముట్టుకొని మొక్కుకోలేరు..కేవలం ఆ గడప ఇవతలి నుంచి చూసి..నమస్కారం చేసుకోవచ్చు..మీకు వీలుంటే..ఈరోజు ఇక్కడకు దగ్గరలోనే మాలకొండ అని లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉన్నది..వెళ్లి దర్శించుకొని రండి..రాత్రికి ఇక్కడ పల్లకీసేవ వుంటుంది..అందులో పాల్గొనండి..రేపుదయం స్వామివారి సమాధిని దర్శించుకొనవచ్చు.." అని చెప్పాను..అలాగే అన్నారు..మాలకొండ కు వెళ్ళొచ్చారు..సాయంత్రం పల్లకీసేవలో పాల్గొన్నారు..ఆ ప్రక్కరోజు ఉదయం స్వామివారి సమాధిని దర్శించుకొని..ఇవతలికి వచ్చారు..ఆరోజు మధ్యాహ్నం మూడు గంటల వేళ..కృష్ణమూర్తి గారు ఆయన భార్యా వచ్చారు.."ప్రసాద్ గారూ..ఈవిడ మరో పదకొండురోజులపాటు ఇక్కడే ఉంటుందట..మా అమ్మగారిని సహాయంగా ఉండమని అడిగింది..ఆవిడా ఒప్పుకున్నది..నాకు ఆఫీస్ పని ఉంది కాబట్టి నేను వెళతాను..వచ్చే వారం వస్తాను..వీళ్ల కొఱకు ఆ రూమ్ అట్టే పెట్టండి..ఆ ఒక్క సహాయం చేయండి.." అని అభ్యర్ధించారు..సరే అన్నాను..


ఆ ప్రక్కరోజు నుంచీ ఆవిడ రెండు పూటలా స్వామివారి మందిరం లో ప్రతి సేవలోనూ పాల్గొనేది..రోజుకు మూడు సార్లు స్వామివారి విభూతి ని తన శరీరం పై వ్యాధి ఉన్న చోట శ్రద్ధగా రాసుకునేది..ఆవిడ ను చూస్తే ఏదో దీక్ష తీసుకున్న దానిలాగా..నిరంతరం స్వామివారి ధ్యాస లోనే ఉండేది..పదకొండు రోజులు ఉంటానని చెప్పిన ఆ సుమిత్ర గారు నలభై రోజులు తన అత్తగారు మామగార్లతో కలిసి స్వామివారి మందిరం వద్దే ఉండిపోయింది..మధ్యలో కృష్ణమూర్తి గారు రెండు మూడు సార్లు వచ్చి వెళ్లారు..నలభై ఒక్క రోజు పూర్తి అయిన తరువాత..సుమిత్ర గారు నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..రేపు సాయంత్రం మేము మా ఊరెళ్లి పోతున్నాము..మా వారు రేపుదయం వస్తున్నారు..స్వామివారి దయవల్ల నా చర్మవ్యాధి పూర్తిగా తగ్గిపోయింది..ఈ నలభైరోజులు నన్ను స్వామివారే పట్టుబట్టి ఇక్కడ ఉంచారు.." అన్నారు..ఆ ప్రక్కరోజు కృష్ణమూర్తి తన పిల్లలను కూడా తీసుకొని వచ్చారు..అందరూ కలిసి స్వామివారి సమాధి ని దర్శించుకొన్నారు..


"ప్రసాద్ గారూ..మా మామగారు ఇచ్చిన సలహామేరకు ఇక్కడకు వచ్చాము..మొదటిరోజు కొద్దిగా సందేహం తోనే ఉన్నాము..ఆరోజు రాత్రి ఇక్కడ నిద్రచేసిన తరువాత..నాలో ఏదో మార్పు వచ్చింది..ఇక్కడే వుండి..ఈ వ్యాధి నయం చేసుకోవాలి అనే మొండితనం వచ్చింది..స్వామివారి విభూతి తప్ప మరేదీ వాడలేదు..స్వామివారి నామం..ఆ విభూతి..ఈ రెండే నా జబ్బును తగ్గించాయి..ఇన్నాళ్లూ..ఈ వ్యాధి మూలంగా నా బిడ్డలను కూడా దూరంగా పెట్టాను..వాళ్లకు అంటుకుంది అనే భయం ఉండేది..ఇప్పుడు ఆ బాధలేదు.." అంటూ కన్నీళ్ల తో చెప్పింది..


కృష్ణమూర్తి గారు తమ సమస్య తీరిపోయినందుకు స్వామివారికి నమస్కారం చేసుకొని..ప్రతి మూడునెలలకు ఒకసారి స్వామివారి దర్శనానికి రావడం ఒక నియమంగా పెట్టుకున్నారు..ఆ దంపతులు అదే పాటిస్తున్నారు కూడా..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ఆచార్య సద్బోధన:*

 


            *ఆచార్య సద్బోధన:*

                 ➖➖➖✍️


          

#మానవ జన్మ ఎందుకు?

```మంత్రానికి పనికిరాని అక్షరమే ఉండదు. 

ఏ ఏ అక్షరాన్ని ఏవిధంగా ఉచ్చరించాలో, ఏ స్థలంలో ఉపయోగించాలో, ఆవిధంగా ఉపయోగించి, దాన్ని మంత్రంగా ప్రయోగించడం అనేది మంత్రశాస్త్ర పరిభాష తెలిసినవారికి మాత్రమే సాధ్యమౌతుంది.


మందుకు పనికిరాని మూలికలనేవి ఉండవు. 

మూల మంటే వేరు, ఔషధమంటే మందు. 

ఏయే చెట్టు వేర్లు, మూలికలు ఉపయోగిస్తే, ఏ రోగానికి మందుగా ఉపయోగించవచ్చు, అనేది ఆయుర్వేద వైద్య రంగంలో నిష్ణాతులైన వారికి మాత్రమే తెలిసిన మర్మం...


అయోగ్యులంటే అప్రయోజకులు. 

దేనికీ పనికిరాని వారు. అసలీ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు. 

భగవంతుని సృష్టిలో దేని ప్రయోజనం దానికి ఉంటుంది.


పిపీలికాది పర్యంతం... అంటే చీమ మొదలుకొని ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రయోజనంతోనే సృష్టించబడింది. 

భగవంతుడి మాయ మనకు అవగాహన కావడమనేది చాల కష్టం. 

సృష్టిలో పనికిరాని మనిషి ఉన్నాడా అంటే ఉండడు, అందరూ ఏదో ఒక విధంగా పనికివస్తారు.```


యోజగః తత్ర దుర్లభః...!!


యోజగః = ```చక్కగా ఆలోచించ గలిగినవాడు,```

దుర్లభః = ```అరుదు. 

అంటే దేనిని ఏ విధంగా ఉపయోగిస్తే అది ప్రయోజనకారిగా ఉంటుందని, చక్కగా యోచించి, ప్రయత్నం చేసి, ఆచరించ గలిగే వారే ఈ సృష్టిలో చాలా అరుదని దీని అర్థం.```


“జీవులేనుబది నాల్గు లక్షల చావు పుట్టుక లిక్కడా

ఎవరు చేసిన కర్మము వారనుభవించే దక్కడా”


```అని చాటుతుందొక తత్త్వగేయం. 

ఈ సృష్టిలో జీవరాశులు 84 లక్షల రకాలు. 

ఇన్ని ప్రాణుల లోను మానవుడనే ప్రాణి ఉన్నతమైన వాడు, విశిష్టమైన వాడు...

కారణం, కన్ను, ముక్కు, చెవి వంటి పంచేంద్రియములతో పాటు, జ్ఞానమనే ఆరవ ఇంద్రియంద్రియములతో విశిష్టమైంది. 

ఇతర ప్రాణుల నుండి మనిషిని వేరుచేసేది విచక్షణాజ్ఞానం. 

ఏది మంచి, ఏది చెడదు, ఏది పాపం, ఏది పుణ్యం. 

ఏది అక్రమం, ఏది సక్రమం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే విచక్షణాజ్ఞానం కలవాడు మానవుడు. 


ఏది ధర్మం..? ఏది అధర్మం..? అని మనం ప్రశ్నించు కొంటే మహాభారతంలో దీనికి సరైన సమాధానం లభిస్తుంది.```


“ఒరు లేయవి యొనరించిన

నరవర! యప్రియము తన మనంబునకగు

నొరులకు నవి సేయకునికయ

పరాయణము ధర్మపథముల కెల్లన్”


```ఇతరులు, ఎదుటి వారు ఏ పనిని చేసిన యెడల నీ మనస్సుకు అప్రియము, అంతే కష్టం కలుగునో, ఆ పనిని నీవు ఇతరుల యెడ చేయవలదు.

అంతే ఇతులకు కష్టం కలిగించే ఏ పనీ నీవు చేయవద్దు. 

ఇదే అన్ని ధర్మాల కంటే పరమధర్మము.


నీ కర్తవ్యమును నీవు నిర్వర్తిస్తూ, అందరికి ప్రయోజనకరమైన పనులు, నిస్వార్థమైన సేవలు చేస్తూ జీవించిన యెడల మానవజన్మ సార్థకమగును...✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

944065 2774.

లింక్ పంపుతాము.🙏

అందులో మూడవ భార్య

 ౪౪౪ ఆలోచనాలోచనాలు ౪౪౪ సంస్కృత సూక్తి సుధ ౪౪౪                           1* ప్రస్తావన సదృశం వాక్యం, స్వభావ సదృశం క్రియాం! ఆత్మశక్తి సమం కోపం, యో జానాతి సపండితః!!                            ఎవరైతే ప్రస్తావనకు తగిన మాట మాట్లాడటం, పరుల స్వభావానికి తగినట్లుగా పనిచెయ్యడం, తన శక్తి ఎంతో తెలుసుకొని కోపపడటం చేస్తుంటారో, వారే పండితులు లేదా వివేకవంతులు.                      2* ఉషశ్మశంస గార్గ్యస్తు, శకునంతు బృహస్పతిః,          మనో జయంతు మాండవ్యో, బుధ వాక్యో జనార్దనః !!                           ఏదైనా కార్యసాధనకు ఉదయవేళ మంచిదని గార్గ్యముని తెలియబరచాడు. మంచి శకునం చూచుకొని మొదలు పెడితే మంచిదని దేవర్షి బృహస్పతి తెలియబరచాడు. మనస్సులో కార్యసిద్ధి జరుగుతుందనే దృఢనిశ్చయం వుంటే చాలని మాండవ్య మహర్షి పేర్కొన్నాడు. కానీ జనార్దనుడు( శ్రీ కృష్ణ పరమాత్మ) పెద్దలు చెప్పిన సూచనను పాటించడం ఉత్తమమని పేర్కొన్నాడు.      3* ఏకోపి గుణవాన్ పుత్రో, నిర్గుణేన శతైరపి, ఏకచంద్ర ప్రకాశేన , నక్షత్రైః కిం ప్రయోజనమ్?                               సద్గుణాలు గల ఒక్క కుమారుడు చాలు. గుణహీనులైన వందమంది కుమారులున్నను వ్యర్థమే!    ఆకాశంలో కోట్లకొలది నక్షత్రాలు ఉన్ననూ ఒక్క చంద్రునితోనే వెన్నెల ప్రకాశం ఏర్పడుతుంది.           4* ఆహారే, వాద్యే, తథా నృత్తే, సంగ్రామే, రిపు సంకటే, ఆహారే, వ్యవహారేచ, త్యక్తార్లజ్జా సుఖీ భవేత్!!                        పాటలు పాడేటప్పుడు, సంగీత వాయిద్యాలను వాయించేటప్పుడు, నాట్యంచేసేటప్పుడు, యుద్ధం లోను, శత్రువుతో చిక్కులు ఏర్పడినప్పుడు, భోజనం చేసేటప్పుడు, వ్యవహారం చేసేటప్పుడు సిగ్గు, బిడియాలను వదిలేస్తేనే క్షేమదాయకం.( మొగమాటం పనికిరాదు.)                          5* దాతా దరిద్రః, కృపణో ధనాఢ్యః, పాపీ చిరాయుః, సుకృతీ గతాయుః, రాజా ఽకులీనః, స్సుకీలనః భృత్యః, కలౌ యుగే షడ్గుణమాశ్రయింతి!!            దానం చేయగల దాత దరిద్రునిగను, పరమలోభి ధనవంతునిగను, పాపాత్ముడు దీర్ఘాయుష్మంతుడుగను, పుణ్యాత్ముడు అల్పాయుష్కుడిగను, హీనుడు ప్రభువుగాను, ఉన్నత వంశస్థుడు సేవకునిగాను, ఈ ఆరు గుణాలు " కలియుగంలో" ప్రసిద్ధమౌతాయి.                   6* ఆత్మబుద్ధి స్సుఖంచైవ,     గురుబుద్ధిర్విశేషతః,              పరబుద్ధిర్వినాశాయ,            స్త్రీబుద్ధిః ప్రళయాంతకమ్!!    తన స్వబుద్ధితో పనులు చేసుకోవడం ఉత్తమం. గురువు ఆదేశంతో కార్యానికి ఉపక్రమించడం ఇంకా శ్రేష్ఠం. ఇతరులు చెప్పినట్లు చెయ్యడం ప్రమాదకరం. స్త్రీబుద్ధి ప్రళయాన్ని తెచ్చిపెడుతుందని భావం.   7* దర్శనాచ్చిత్త వైకల్యం,       స్పర్శనేన ధనక్షయం,               సంభోగాత్కిల్బిషం,              పణ్యస్త్రీణాం, ప్రత్యక్ష రక్షసామ్!!                              వేశ్యాస్త్రీ చూడగానే మనస్సు వికలమౌతుంది. వారిని ముట్టుకోగానే ధనం పోతుంది. వారితో కలియడం వలన పాపం సంభవిస్తుంది. వారకాంతలున్నారే వారు ప్రత్యక్ష రాక్షసులు.                  చివరగా ఒక చమత్కార శ్లోకం--- శివశర్మ అనే ఒక పండితుడు ఉండేవాడు. ఆ దేశపు రాజుగారు పండిత సత్కారం చేస్తున్నారని విని, ఆ వరుసలో నిలబడ్డాడు. రాజుగారు ఒక్కొక్క పండితునికి బంగారు మామిడి పండును తాంబూలం లో ఉంచి, సన్మానించి వెలుపలికి పంపుతున్నారు. సరిగ్గా ఈ పండిత సత్కారవేళ కుంభవృష్టి కురిసి నేల అంతా బురదమయం అయ్యింది. మొదటిసారి బంగారు మామిడి పండును అందుకొన్న మన శివశర్మకు "ఆశ" చావక, మళ్ళీ రెండవ పర్యాయం వరుసలో ముదుకు కదిలాడు. కాలం, ఖర్మం చాలక బురదలో జారిపడ్డాడు. ఎట్లాగో తెప్పరెల్లి లేచినిలబడి బురదబట్టలతోనే రాజుగారి ముందు నిలబడ్డాడు. రాజుగారు " శివశర్మ" ను గుర్తించి "" ఏమిటీ అవతారమని"" ప్రశ్నించారు. దానికా పండితులవారు దిగువ శ్లోకం తో తలవంచుకొని జవాబిచ్చారు.     

క్షుత్తృడాశాః కుటింబిన్యః మయి జీవతి నాన్యగాః !      తాసా మంత్యా ప్రియతమా-- తస్యా శృంగార చేష్టితమ్!!             

   "" ఓ రాజా! నాకు ఆశ, దప్పిక, మరియు ఆశ అను మువ్వురు భార్యలు. వాళ్ళెప్పుడూ నన్ను విడిచిపెట్టి ఉండరు. అందులో మూడవ భార్య ఉన్నదే "" ఆశ"", ఆమె అంటే నాకెంతో ఇష్టం. ఆమె చేసిన శృంగారపు చేష్టే, ఈ బంగారపు పూత వంటి ఈ బురద"" 

అని పలికి సిగ్గుతో తలవంచుకొన్నాడు. పాపం, రాజుగారు పండితుని " పేరాశ" ను చూసి జాలిపడి రెండవ పర్యాయం " బంగారు మామిడి పండు" తో సత్కరించి పంపించారు. రెండు బంగారు మామిడి పండ్లు శివశర్మ కు, మనకు ఈ " చమత్కారశ్లోకం" లభించాయి.                         తేది 1--10--2023, ఆదివారం, శుభోదయం.

Sunday market bangalore



 

ఆదివారం, అక్టోబరు 1, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


ఆదివారం, అక్టోబరు 1, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - బహళ పక్షం

తిథి:విదియ మ12.12 వరకు  

వారం:ఆదివారం (భానువాసరే)

నక్షత్రం:అశ్విని రా11.09 వరకు

యోగం:వ్యాఘాతం సా5.27 వరకు

కరణం:గరజి మ12.12 వరకు తదుపరి వణిజ రా11.27 వరకు

వర్జ్యం:రా7.18 - 8.51

దుర్ముహూర్తము:సా4.12 - 5.00

అమృతకాలం:సా4.13 - 5.46

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి : కన్య

చంద్రరాశి : మేషం 

సూర్యోదయం:5.54 సూర్యాస్తమయం:5.48


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

Prabhath


 

భజన గీతం.

 భజన గీతం.....రమణుల పై 

రచన&గానం ... లలితా చండీ 


రమణ ర‌మణ రమణ రమణ

రమణ రమణ మహాదేవా!

శరణు శరణు శరణు శరణుదేవా

నీదు స్మరణ మాకు  శరణుదేవా!


మౌనమే ధ్యానానికి మూలమంటివి.

ధ్యానమే దైవానికి  చేరువంటివి


ఎవరు నీవు ఎవరు నీవు ఎరుగ మంటివి

మనసునున్న మమతలన్ని వదల మంటివి.


రమణ ర‌మణ రమణ రమణ

రమణ రమణ గురుదేవా!

శరణు శరణు శరణు శరణుదేవా

నీదు స్మరణ మాకు  శరణుదేవా

శరణు శరణు గురుదేవా 

గురుదేవా గురుదేవా


లలితాచండీ

9885552922 

 (అరుణాచలం రమణాశ్రమం వెళ్లినప్పుడు రాసింది)

Pitrudevatalu


 

Telugu


 

పాపరహితమైన సనాతన

 శ్లోకం:☝️

*నృశంస మనృశంసం వా*

  *ప్రజారక్షణ కారణాత్ |*

*పాతకం వా సదోషం వా*

  *కర్తవ్యం రక్షతా సతా ||*

    రామాయణం - 1.25.17


భావం: తాటకా సంహార సమయంలో "స్త్రీని చంపడం ఎంతవరకూ ధర్మం'' అనే సంశయంలో శ్రీరామచంద్రుడు పడ్డప్పుడు : "ధర్మరక్షణ దీక్షతో ప్రజారక్షణ చూడవలసిన క్షత్రియుడు, ధర్మసంరక్షణ కోసం పాపమని కానీ, క్రూరమని కానీ, అధర్మమని కానీ ఆలోచించకుండా ధర్మాన్ని కాపాడాలి. ఇది పాపరహితమైన సనాతన ధర్మం'' అని బోధిస్తాడు విశ్వామిత్రుడు. అంతే, సంశయాన్ని వదిలి తాటకను సంహరించాడు ... శ్రీ రాముడు.🙏

పంచాంగం 01.10.2023 Sunday,

 ఈ రోజు పంచాంగం 01.10.2023  Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష: ద్వితీయా తిధి భాను వాసర: అశ్విని నక్షత్రం వ్యాఘాత యోగ: గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం.

విదియ పగలు 9:44 వరకు.

అశ్విని రాత్రి 07:32 వరకు.

సూర్యోదయం : 06:09

సూర్యాస్తమయం : 06:01

వర్జ్యం : మధ్యాహ్నం 03:48 నుండి 05:18 వరకు.

దుర్ముహూర్తం : సాయంత్రం 04:26 నుండి 05:14 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం : మద్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

వేణుగానం



వేణుగానం!


"ఏది మరొక్కసారి,హృదయేశ్వర!,గుండెలు పుల్కరింపఁగా/

ఊదగదోయి!ఊదగదవోయి!సుధామయ యుష్మదీయ వే /

ణూదయ రాగడోలికల నూయలలూగుచు విస్మృతిలో విలీనమై /

పోదును; నాదుక్రొవ్వలపుపువ్వుల ముగ్ధపరీమళమ్ముతో;


కరణామయి-ఉదయశ్రీ-

జంధ్యాలపాపయ్యశాస్త్రి.


        ఈపద్యంవింటే రాధికయేగాదు మనంగూడా తన్మయులమైపోతాం.శాస్త్రిగారి కవితాశక్తియలాంటిది!

         హే హృదయేశ్వరా! కృష్ణా! మరోసారి వేణువూదవా! మరోసారి,ఆఁహః కాదుకాదు మరోసారి,బృందావనిలోనీవు వేణువూదుతుంటే,ఆవలపుగానంలో నాతనువూ మనసూ మరచి తన్మయస్ధితిలోలీనమై, నాతొలివలపుల తీయనియూహలు మదిలో నూగుచుండగా,నీకోసంఈ రాధపరవసిపోతుంది.నీకోసం పలవరిస్తుంది.

మరొక్కసారి వేణువు నూదవయ్యా!కృష్ణా! నాకోసం,కాదుకాదు, మనకోసం;

          ఇదీ ఈపద్యంలోని రాధపిలుపు.శాస్త్రిగారి పద్యంలో వలపు రవంతైనా మీకు అందించగలిగానా నాజన్మధన్యమే!

                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Kyabaji curry


 

ఆది వారం* *01-10-2023* *రాశి ఫలితాలు*

 *ఆది వారం* *01-10-2023*

 *రాశి ఫలితాలు*

*మేషం*

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

*వృషభం*

ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

*మిధునం*

కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వ్యాపారస్థులకు అవసరానికి ధన సహాయం అందుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు.

*కర్కాటకం*

ఉద్యోగాలలో అధికారులతో చర్చల్లో పురోగతి కలుగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

*సింహం*

ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

*కన్య*

ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగాల్లలో కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

*తుల*

పాత రుణాలు తీర్చాగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి.

*వృశ్చికం*

ముఖ్యమైన వ్యవహారాలలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చాలకాలంగా పూర్తికానీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. 

*ధనస్సు*

బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితులతో ఆలయాలు దర్శించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు.

*మకరం*

అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.

*కుంభం*

చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.

*మీనం*

ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తికావు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

🕉️

అఖిల భారత శర్మాస్ & శాస్త్రిస్ వంటిల్లు గ్రూపు

 అఖిల భారత శర్మాస్ & శాస్త్రిస్ వంటిల్లు గ్రూపు

     

     అన్ని హిందూ సాంప్రదాయ పండుగ రోజులలో మరియు  మీ ఇంట జరిగే అన్ని శుభ కార్యాలకు మడితో శుచి, శుభ్రంగా చక్కటి బ్రాహ్మణ భోజనం మరియు ప్రసాదాలు చేసి ఇవ్వబడును..స్వాములకు, వేద పండితులకు, ISKON వారికి ఉల్లీ, వెల్లుల్లి లేకుండా మిగతా వారికి  ఉల్లి వెల్లుల్లి తో నచ్చుబాటు అయ్యే విధంగా బోజనాలు మరియు టిఫిన్లు చేసి ఇస్తాం. 


     రైలు,బస్సు,కారు లేదా ఏ ఇతర మార్గాల్లో వచ్చే ప్రయాణికులకు మరియు టూర్స్ & ట్రావెల్స్ వాళ్ళకి దూరప్రాంతాలు ప్రయాణం చేసే ప్రయాణికులకు, లోకల్ గానూ కూడ భోజనం, టిఫిన్స్ తగు రుసుము తీసుకుని అందజేస్తాం. 


గమనిక :-

మావి ఎటువంటి హోటల్స్, మెస్ లు కావు అండి..అంతా ఇంటి తయారీ అందువల్ల దయచేసి 1 రోజు ముందుగా ఆర్డర్ చెయ్యండి.🙏🙏


01. రాజమండ్రీ (విశ్వనాథ్ శర్మ గారు) : 6304049434

02. విజయవాడ: 9346021045

03. సికింద్రాబాద్: 9346747694

04. వరంగల్:  9703100005

05. ఒరిస్సా (సుబ్రహ్మణ్య శర్మ గారు) : 7008179751

06. విజయనగరం: 7675883368

07. అనంతపూర్:  8374392377

08. వైజాగ్: 8008390978

09. గుంటూరు: 6300070049

10. షిరిడి: 9511111585

11. తిరుపతి; 9949189087

12. వారణాసి: 8985667737

13. బెంగుళూరు 9448605879

14. కర్నూల్ 9885777077

15. వారణాసి: 7318366814

16. హోసూరు( తమిళనాడు), మల్లూరు(కర్ణాటక) బోర్డర్ : 9944799931

17. రేణిగుంట : 7013999064

18. నాగపూర్ : 9403302715


Plz నలుగురికి ఉపయోగపడే పోస్టు దయచేసి తప్పకుండా షేర్ చేయండి.


Haven't checked the veracity ..

మరలచిగురించుచున్నవి

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

         *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_*


శ్లో𝕝𝕝 

*ఛిన్నోఽపి రోహతి తరుః క్షీణోప్యుపచీయతే పునశ్చన్ద్రః॥*

*ఇతి విమృశన్తః సన్తః సన్తప్యన్తే న విప్లుతా లోకే॥*

~భర్తృహరినీతిశతకం.


𝕝𝕝తా𝕝𝕝

చెట్లను కొట్టివేసిననూ అవి మరలచిగురించుచున్నవి. చంద్రుడు క్షీణించిననూ మరల పరిపూర్ణుడగుచున్నాడు. ఇట్టి ఉదాహరణలు చూచిన ఆపదలు కలకాలం ఉండవని తెలియుచున్నది కదా!. కావుననే సత్పురుషులెన్నడును ఆపదసమయములందు అధైర్యమునొందరు.

వేదాధ్యయనానికి

 వేదాధ్యయనానికి మాడు దశలు ఉంటాయని పెద్దలు చెబుతారు.వేద మంత్రాలను చదవటం/కంఠస్థం/స్మృతి పథంలో ఉంచడం/వల్లె వేయటం... ఇది మొదటి దశ కంఠస్థం అయిన దానిని లేదా స్మృతిపథం లో ఉన్న దానిపై వేదార్థ విచారణ రెండో దశ. పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం మూడవ దశ. ఈ మూడింటినీ ఏకకాలంలో చేసే వారిని శ్రోత్రీయుడు అంటారు. వేదాన్ని చెప్పుకుంటున్నాను..అని అంటూ ఉంటారు విద్యార్థులు..అదే ఇది. ఇదే తెలుగులో ఇతరభాషాల్లో వాడుకలో చదవటం అని ప్రచారంలో ఉంది. కాబట్టి శ్రోత్రీయుడు స్వచ్ఛమైన వేద స్వరూపం. మీరు పైన చెప్పిన దానికి శ్రోత్రీయుడు అన్న అర్ధం సవరించుకోవాలి తప్ప..ఎదో పుస్తకం చూసి చదివినంత మాత్రాన తత్వం తెలీదు అని వ్యాఖ్యానం చెప్పకూడదు. ఆనంతమైనది వేదం. వ్యాసభగవానుడు సంగ్రహం రూపంలో అనంతమైన వేదార్ధం తెలిసేలా(నిరంతర వేదాధ్యయనం చేసే బ్రహ్మణుడికి మాత్రమే) సుమారు 24వేల మంత్రాలను మాత్రమే ఉటంకించారు.(అంటే రెఫెర్ చేశారు) అని పెద్దలు చెబుతారు. వేద మంత్రాన్ని చడవగలగ్తట మే చాలా చాలా గొప్ప. ఇక శ్రోత్రీయుడు అయితే సాక్షాత్తు వేద స్వరూపమే అతడు. కాబట్టి పెద్దలు చదివితే ఏమీ తెలీదు అని ఎప్పుడూ చెప్పారు. ఎలా చదవాలో అలా చదివితే వంట పడుతుంది అనే చెబుతారు. వైదిక సంప్రదాయంలో  వేదాన్ని గురు శుశ్రూష ద్వారానే ముఖతః  పొందగలం. దీన్నే వాడుకలో చదవటం అని ప్రచారం ఉంది.... శ్రోత్రీయుడు అయితే తప్ప వేదాధ్యయనం చేసినట్లు అవదు. మూడు దశల్లో ఏఒక్క దశలో అయినా విఫలం చెందితే అతడికి వేదార్ధం పరమార్ధం తెలియదు..అని చెప్పటమే ఆశ్లోకం యొక్క లో అర్ధం. అని అనిపిస్తోంది నాకు.🙏

Dancer


 

జీవితం వెలుగుతుంది.

 *1936*

*కం*

చచ్చుటకై సాహసమున

వెచ్చించెడి ధైర్యమందు వీసంబైనన్

నచ్చిన గతి బతుకుటకై

వెచ్చించగ జీవితమ్ము వెలుగును సుజనా. 

*భావం*:-- ఓ సుజనా! ఆత్మహత్య చేసుకోవాలనే సాహసానికి వాడే ధైర్యం లో వీసమెత్తు(ధాన్యపు గింజంత) నీకు నచ్చిన విధంగా బతకడానికి వినియోగిస్తే జీవితం వెలుగుతుంది.

*సందేశం*:-- ఆత్మహత్య కు వాడే ధైర్యం లో ఒక్క వంతు బతకడానికి వాడితే ఆనందం గా బతికి ఎంతో మంది కి బాధ కలిగించకుండా ఉండగలరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కష్టపడిన తరం

 . మిత్రమా...

ఇది యదార్థం... 

💝*రానున్న పది సంవత్సరాల్లో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు కానున్నది.*

💖*ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.*

💕*వాళ్ళు:~*

💓*~రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు*

💓*~ఉదయం పెందరాళే లేచేవాళ్ళు.*

💓*~నడక అలవాటు ఉన్నవాళ్ళు.*

💓*~మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు.*

💖*వాళ్ళు:~*

💕*పొద్దుటే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !*

💕*~ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!*

💕*~మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!*

 💕*~పూజకు పూలు కోసే వాళ్ళు*

💖 *వాళ్ళు:~*

💞*పూజ పూర్తి కాకుండా ఏమీ తినని వాళ్ళు !*

💞 *మడికట్టుకుని వంట వండేవాళ్ళు!*

💞*దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!*

💓*దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు.*

💓*దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !*

💓*మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!*

💖*వాళ్ళు:~*

💕*~అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు.*

💕*~కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు.* 

💕*~స్నేహంగా మెలిగే వాళ్ళు.*

💕*~తోచిన సహాయం చేసేవాళ్ళు.*

💕*చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు.*

💖*వాళ్ళు:~*

💞*ఉత్తరాల కోసం ఎదురుచూసిన వాళ్ళు.*

💞*ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు.*

💞*పాత డబ్బా ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు.*

💞*ఫోన్ నెంబర్ లు డైరీలో రాసిపెట్టుకునే వాళ్ళు.*

 💖*వాళ్ళు:~*

💓*~పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు.!*

💓*~కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు..!*

💓*~సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు...!*

💓*~పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ..!*

💖*వాళ్ళు:~*

💕*తీర్థయాత్రలు చేసేవాళ్ళు.!*

💕*ఆచారాలు పాటించే వాళ్ళు..!*

💕*తిధి,వారం ,నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు!*

💕*పుట్టిన రోజున దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు!*

💖*వాళ్ళు:~*

💓*~చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు.!*

💓*~లుంగీలు, చీరలు  కట్టుకుని ఉండేవాళ్ళు...!*

💓*~చిరిగిన  చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు....!*

💓*~అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు.!*

💝*మీ_ మా వాళ్ళు ..!*

💓*తలకు నూనెలు రాసుకునే వాళ్ళు*

💓*జడగంటలు పెట్టుకున్నవాళ్ళు.*

💓*కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు.*

💓*చేతికి గాజులు వేసుకునే వాళ్ళు.*

💖 *వస్తువులను వాడుకుంటూ మనుషులతో స్నేహంగా గడిపిన తరం...!*

💖 *ప్రస్తుత తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు*

❤️ *వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా  ‘క్యూ’ కట్టి, మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.*

❤️ *మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారిప్పుడు*

💖 *మీ ఇంట్లో ఇలాంటి వాళ్ళుంటే దయచేసి వాళ్ళకు మీ ప్రేమను కాస్త పంచండి.*