24, మే 2023, బుధవారం

ప్రసన్నం చేసుకోవచ్చు.

 శ్లోకం:☝️

*లుబ్ధమర్థేన గృణ్హీయాత్*

 *స్తబ్ధమంజలికర్మణా ।*

*మూర్ఖ ఛందోఽనువృత్తేన*

 *యథార్థత్వేన పండితమ్ ॥*

   - చాణక్యనీతి


భావం: లోభిని డబ్బుతో, మొండివాడిని నమస్కార దండప్రణామములతో గౌరవించి, మూర్ఖుడిని తన కోరికను నెరవేర్చడం ద్వారా మరియు బుద్ధిమంతుడిని యథార్థం మాట్లాడి ప్రసన్నం చేసుకోవచ్చు.

రోజు పద్యము:

 169వ రోజు: (బుధ వారము) 24-05-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


ఎదుటివారు మనకు ఏమి చేసిన మేలొ 

అట్టి మేలు మనమునందచేయ 

జగములోన వెలుగు సహకారభావమ్ము 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల


ఎదుటి వారు ఏమి చేస్తే మనకు మేలు (మంచి) జరిగింది అని అనుకుంటామో అదే మేలు మనము ఇతరులకు (అందరకు) చేసిన ఎడల మనమందరిలో సహకార భావమ్ము పెంపొందును 


ఈ రోజు పదము. 

ఏనుగు (Elephant): ఇభము, కుంజరము, కరి, దంతి, హస్తి, గజము, గౌరు, దంతి, పద్మి, భార్గవము, మాతంగము, శృంగి, సామజము.