25, జులై 2025, శుక్రవారం

న్యుమోనియా గురించి

 న్యుమోనియా గురించి సంపూర్ణ వివరణ - 

                

న్యుమోనియా ని ఆయుర్వేదము నందు 

" ఊపిరితిత్తుల జ్వరము " అని వ్యవహరిస్తారు. ఇది "న్యుమోకోకస్ " అనే వైరస్ జాతి క్రిముల వలన ఊపిరితిత్తులకు ఈ వ్యాధి సంక్రమించును. ఇది ఎక్కువుగా 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలలో అధికంగా వచ్చును. ఈ న్యుమోనియా 8 రకాల పేర్లతో పిలవబడుతూ వివిధ భాగాలలో వ్యాప్తిచెందును. ఇప్పుడు మీకు వాటి గురించి మీకు వివరిస్తాను. 


 * సింగల్ న్యుమోనియా - 

         

ఒకే ఊపిరితిత్తి వాపు వచ్చును. 


 * డబుల్ న్యుమోనియా - 

      

   రెండు ఊపిరితిత్తులు వాపు వచ్చును. 


 * ఎపిక్స్ న్యుమోనియా - 

      

  ఊపిరితిత్తుల అగ్రభాగములో వ్యాధి . 


 * బేసల్ న్యుమోనియా - 

       

 ఊపిరితిత్తుల అడుగు భాగములో వ్యాధి . 


 * లోబార్ న్యుమోనియా - 

        

ఊపిరితిత్తుల లోబ్ భాగము వాపు . 

 

* బ్రాంకో న్యుమోనియా - 

       

 ఊపిరితిత్తులతో సహా శ్వాసనాళములు కఫముతో నిండి వాచుట . 


 * పెరపురల్ న్యుమోనియా - 

     

  ఊపిరితిత్తుల పక్క భాగాన వాపు . 


 * సెంట్రల్ న్యుమోనియా - 

    

   ఊపిరితిత్తుల మధ్యభాగాన వాపు . 

       వ్యాధి ఏ భాగాన వచ్చింది అన్నది అనుభవం గల వైద్యుడు గుర్తించగలడు. కొన్నింటిని X - RAY సహాయముతో గుర్తించవచ్చు. ఈ న్యుమోనియా రావడానికి ప్రధాన కారణం తేమతో కూడిన శీతలగాలి తగలడమే కారణం . శీతల గాలి వలన క్రిములు ఊపిరితిత్తులలోకి ప్రవేశించి వ్యాధిని వృద్ధిపొందించగలవు. 

 

* న్యుమోనియా లక్షణములు - 

        

అకస్మాత్తుగా చలితో కూడిన జ్వరము వచ్చును. అర్ధగంట తరువాత చలి తగ్గి జ్వరం పెరుగును . జ్వరం 104 డిగ్రీల వరకు పెరిగి విపరీత తలనొప్పితో శ్వాసగమనం తీవ్రత పెరుగును . మరీ చిన్నపిల్లలలో వ్యాధి అంకురించినప్పుడు మొదట బాలపాప చిన్నెలలోని ఈడ్పుల వలే వచ్చి క్రమేపి మగతతో జ్వరం ప్రారంభం కాగలదు. 

             

. దగ్గు , కఫము , రక్తజీరతో కూడిన కళ్లే , ఊపిరి పీల్చునప్పుడు , వదులున్నప్పుడు పక్కలలో నొప్పి , ఎక్కువ ఆయాసము , పెదవులు పగిలి పొరలు ఊడుట , ముఖము ఒకవైపు గాని , రెండువైపుల గాని ఎర్రబారుట మొదలగు లక్షణాలు కనపడును. క్రమేపి శ్వాస తీవ్రత పెరిగి శ్వాసకు , నాడికి గల సంబంధం చెడిపొవును . వ్యాధి సోకిన ఊపిరితిత్తి భాగాన వాచి బరువుగా , బాధగా ఉండును. రోగి వెల్లకిలా గాని , ఏ వైపున వ్యాధి తగిలినదో ఆ భాగానికి గాని వత్తిగిలి పరుండును. 

                    

 మొదట కఫము చిక్కగా ఉండి చివరకు పలుచన అయ్యి దగ్గుతో వెలువడును. కఫము చిక్కగా ఉన్నప్పుడు రక్తజీర కనిపించును. ఈ రక్తజీర మొదటిరోజులలో ఎర్రగా ఉండి తరవాతి రోజులలో నల్లబారును. 3 రోజుల తరువాత కఫము పసుపురంగుకు మారును . ఉదయం , సాయంత్రం జ్వరం ఒకే మాదిరిగా ఉండి 9 రోజున ఒక్కసారిగా తగ్గిపోవును . కొంతమందికి 11 లేక 13 రోజులకి తగ్గగలదు. 

            

. న్యుమోనియా లక్షణాలు బయటపడిన వెంటనే రోగిని ఒక ప్రత్యేక గది యందు ఉంచి సరైన పథ్యం చేపిస్తూ ఉపిరిత్తులను బలవర్థకం చేయు ఔషధాలను ఇవ్వవలెను. అత్యంత జాగ్రత్తతో వ్యాధి బలాన్ని గమనిస్తూ చికిత్స చేయవలెను . ప్రస్తుత సమయం ఈవ్యాధి వ్యాపించుటకు అత్యంత అనుకూల సమయం కావున తగిన జాగ్రత్తతో వ్యవహరించవలెను .  


       మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక -

     


 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

చక్కని పద్యం!!

 శు భో ద యం 🙏


చక్కని పద్యం!! 


భాగవతంలో పోతనగారి పద్యాలు అనవద్యాలు హృద్యాలు!! 

   వైరాగ్యచింతనకు దూరమైసంపాదనయే ధ్యేయమైన నేటి సమాజమునకు ఈపద్యము చక్కని సందేశము.


“ఊహ గలంగి జీవనపు టోలమునం బడి పోరుచు న్మహా

మోహలతా నిబద్ధ పదము న్విడిపించుకొనంగ లేక సం

దేహము బొందు దేహి క్రియ దీనదశ న్గజ ముండె భీషణ

గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదఖురాగ్ర శల్యమై.”

       భయంకరమైన మొసలికిచిక్కి గెల్తునను ఊహసడలిన ఆ గజేంద్రుడు,సంసార బంధములకుచిక్కి బయటపడలేని జీవుని వలెనున్నాడట!

      సంసారబంధములనుండి బయటపడుట ,వ్యామోహమును తగ్గించుకొని వేదాన్తచింతనతోకాలమును గడుపుడని మనకిది సందేశమేగదా!

    వేదనలకు మందు వైరాగ్య సాధనయే!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

యజ్ఞోపవీత మహిమ*

 *యజ్ఞోపవీత మహిమ*


ఈరోజుల్లో ఎంతోమంది తమ పిల్లలకు సరియైన వయస్సులో ఉపనయన కార్యక్రమం చేయరు. చేసినా వాడిచేత త్రికాల సంధ్యావందనమూ చేయించరు. ఇంకొంతమంది వివాహానికి ఒకరోజు ముందు ఈ ఉపనయన కార్యక్రమాన్ని ఏదో అలా ముగించేస్తారు. వారు అసలు వారికి సంధ్యావందనం అంటేనే ఇంకా ఏమి ఆశక్తి ఉంటుంది. మరికొంతమంది ఉంటారు వారు ఆ యజ్ఞోపవీతాన్ని శరీరంపై ఉంచుకోడానికే సిగ్గు పడుతుంటారు. ఏదో ఎప్పుడో పూజల్లోనో, హోమాల్లోనో యజ్ఞోపవీతాన్ని ధరించి మళ్ళీ ఆ తంతు సంపూర్తి కాగానే ఆ వీతాన్ని విసర్జన చేసేస్తుంటారు. 


గాయత్రీమాత సర్వశక్తి సంపన్నురాలు. త్రికాల సంధ్యావందనం నిత్యక్రతువు. అది ఎవరైతే నిష్ఠగా చేస్తుంటారో వారికి వాక్ దేవతసిద్ధిస్తుంది. నిత్యం ఒక అర్ధగంట సంధ్యావందనం చేయరు కానీ, టీ.వి లు చూడ్డం, ఇటీవల వచ్చిన సెల్ ఫోన్లతో సందేశాలు పంపడం, ఇతరత్రా కబుర్లు వీటికి గంటలు కొద్దీ సమయం వృధా చేస్తుంటారు. వాటివల్ల నిష్ఫలం.


ఎంతోమంది అశ్రద్ధ చేసే ఈ ఉపనయం ద్వారా ధరించే మహపవిత్రమైన ఆ యజ్ఞోపవీతము ఎంత మహిమాన్విత మైనదో మనకు పురాణాలు, శాస్త్రాలు చెప్పాయి. 


ఈ సందర్భంగా ఒకటి మీకు చెప్తాను...


ఒకరోజు కవిత్వం అంటే ఆసక్తి లేని ఒక రాజు వద్దకు నిరుపేద బ్రాహ్మణుడు వచ్చి తాను రచించిన ఒక కృతిని ఆయన ముందుంచుతాడు.


"అయ్యా మహారాజా నాకు పూటగడవటమే కష్టంగా ఉన్నది. నా ఈ గ్రంధానికి తగిన బరువును చూసి మీకు తోచినంత ధనాన్ని ప్రసాదించండి. తద్ద్వారా నాకు కొన్ని రోజులు భుక్తి లభిస్తుంది" అన్నాడు. 


కవిత్వమన్నా, బ్రాహ్మణులన్నా చులకన భావం కల ఆ రాజు, అవహేళనగా "నీకిప్పుడు ఈ పుస్తకమెత్తో, నీయెత్తోధన మివ్వాలా" అంటాడు.


దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు "అంత అవసరం లేదు మహారాజా, ఈ ఉదయం నేను యజ్ఞోపవీతం మార్చుకున్నాను, నావద్ద తీసివేసిన 'జీర్ణయజ్ఞోపవీతం' ఉన్నది దానెత్తు ఇచ్చిన చాలునంటాడు.."


అప్పుడా మహారాజు 

"వీడో పిచ్చాడు. వీడు ధరించిన ఆ కాసిని ధారపు పొగులకు ధనమివ్వాలా ?! 

అయినా వాటికి ఎమోస్తుంది? 

సరే, వాని కోరిక అదే కదా" అనుకుని, ఆ రాజు, కోశాధికారితో "వీనికో రెండు కాసులిచ్చి పంపండి" అని అజ్ఞాపిస్తాడు.


దానికా బ్రాహ్మణుడు, తనకు ఆ యజ్ఞోపవీతమెత్తే కావాలని పట్టబడతాడు.


దానికా రాజు 'సరదాగా ఆ వేడుక చూద్దామనుకుని, త్రాసు తెప్పించి తూచి ఇమ్మని ఆజ్ఞాపిస్తాడు'.


కానీ, వింత ! ఎంత ధనం వేసినా, ఆ రాజ్యంలో సమస్త సంపదలు కూడా దానికి సరితూగలేదు.

దానికి కారణం, ఆ బ్రాహ్మణుని గాయత్రి మంత్ర అనుష్ఠానబలం. 

దానితో ఆ రాజుకు కనువిప్పు కలిగి, ఆ బ్రాహ్మణుని శక్తి తెలియవచ్చి, పాదాక్రాంతుడవుతాడు.


అదీ గాయత్రీ మంత్రం శక్తి.

యజ్ఞోపవీతము యొక్కమహిమ. అటువంటి నిత్యానుష్టానం అశ్రద్ధ చేస్తూ తమకు తామే శక్తిని చేచేతులారా క్షీణింప చేసుకుంటున్నారు.


*శృంగేరీ జగద్గురు శ్రీశ్రీభారతీ తీర్థ మహాస్వామి వారు*

ఆనందకరమైనది ఈ వానకాలము*

 *ఆనందకరమైనది ఈ వానకాలము*


ఉ॥

తూర్పుసముద్రమందు నవదోహపుఫేనముఁ బోలు భంగముల్ 

మార్పులసూచనల్ విడిసి మాటికి మాటికి నంబుధారలం 

గూర్పగ ద్రోణితోడుత ప్రకోపముఁ బూనుచు సత్రికూటముల్ 

పేర్పుగరాఁ ధరాతలము వృష్టివరించె ప్రవాహమేర్పడన్ 

ఉ॥

భూజములల్లలాడి నవి మూర్థము లూచుచు నట్లె రమ్మనన్ 

తేజములుప్పతిల్లగ నధీరలతల్ బహుహీరమాలికల్

వాజులఁ గూర్చి నాజులకు వచ్చు విధమ్మున వర్షధార లీ 

బీజసువీతలమ్మునకు విందులఁ జేయుచు వానకాలమున్ 

*~శ్రీశర్మద*

సు భా షి తం

 శు భో ద యం 🙏


సు భా షి తం !!


"గ్రాసములేక స్రుక్కిన జరాకృశమైన విశీర్ణమైన సా

యాసమునైన నష్టరుచియైనను ప్రాణభయార్తమైన సం

త్రాస మదేభకుంభపిసితగ్రహలాలసశీలసాగ్రహా

గ్రేసరభాసమానమగుకేసరిజీర్ణతృణంబు మేయునే?

-భర్తృహరిసుభాషితములు-ఏనుఁగు లక్ష్మణకవి;

  సంస్కృతమున భర్తృహరి

సుభాషితత్రిశతి"-పేరుననొక శతక సంపుటమును విరచించెను. అందు శృగార,వైరాగ్య, నీతి శతకములను పేరుగల మూడు శతకములున్నవి.

అందలి నీతిశతకమునగలపద్యమిది. అభిమానవంతుడు నీచకృత్యములకు పాల్పడడనిప్రాణముపోవనున్నను లెక్కసేయక తనస్వభావోచితముగానేజీవించుననిసూచించుచున్నాడు.

    "మదగజముల కుంభస్థలమును జీల్చియందలి మాంసమును భుజించు స్వభావముగల భయంకర సింహము గడ్డిమేయదు.

   అట్లే పరాక్రమశాలి నీచకృత్యములకు పాల్పడడని భావము.

                       స్వస్తి!

🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ప్రబంధ సాహిత్యము

 🙏తెలుగు ప్రబంధ సాహిత్యము🙏

                   రెండవ భాగము 

ప్రబంధ రకాలు

ప్రబంధాలను ఐదు రకాలుగా వర్గీకరణ చేయవచ్చు.

1) పౌరాణిక సంబంధం ప్రబంధాలు - మనుచరిత్ర , వసుచరిత్ర

2) క్షేత్ర మహత్యం సంబంధమైనవి- శ్రీకాళహస్తీశ్వర , పాండురంగ మహత్యం ,

3) చారిత్రక ప్రబంధాలు- కృష్ణరాయ విజయం , రామరాజీయం

4) సాంఘిక ప్రబంధాలు - నిరంకుశోపాఖ్యానం

5) కల్పిత ప్రబంధాలు - కళాపూర్ణోదయం

               మర్రిచెట్టు కు బీజము వలే ప్రబంధమునకు భారతంలోని వర్ణనలే ఆధారములనీ గంటిజోగి సోమయాజి అభిప్రాయపడ్డారు.ఎర్రన్న భారతములో సావిత్రి ఉపాఖ్యానం, హరివంశం లోని ఉషాఅనిరుద్దల కథలను ప్రబంధంగా పరిశీలకులు భావించారు.నన్నెచోడుడు తన కుమార సంభవం ను సద్యసబంధురమైన ప్రబంధముగా పేర్కొన్నారు. తిక్కన తన మహా భారత పర్వములను ప్రబంధ మండలిగా పేర్కొన్నారు.శ్రీనాథుడు శృంగార నైషధం , పిల్లలమర్రి పిన వీరభద్రుడి శృంగార శాకుంతలలలో ప్రబంధ లక్షణాలు కలవు.తెలుగులో అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్ర యే తొలి ప్రబంధంగా పింగళి లక్ష్మీకాంతం పేర్కొన్నారు.

                    మహాభారతం, రామాయణం , మాలతీ మాధవంలు ప్రబంధాలుగా సాహిత్య దర్పణం కర్త విశ్వనాథుడు ప్రబంధ గ్రంథాలుగా చెప్పారు.గీత గోవింద కావ్యాన్ని రాసిన జయదేవుడు తన రచనను ప్రబంధం అని అన్నారు.

                     భానుచంద్ర , సిద్ధ చంద్ర లాక్షణికులు కాదంబరిని కథా ప్రబంధం అన్నారు. భామహుడు పద్యకావ్యాన్ని ప్రబంధం అన్నాడు రుద్రటుడు కావ్య శబ్దానికి పర్యాయపదంగా ప్రబంధంను ఉపయోగించాడు.

                      పొన్నగంటి తెలగనార్యుడు వ్రాసిన యాయతిచరిత్ర అచ్చతెలుగు ప్రబంధములలో మొట్టమొదటిది. అలాగే కవి సిరిసినగండ్ల నృసింహస్వామి రాసిన రచన చిలువ పడగ ఱైని పేరణము. దీనిలో చిలువ అనగా సర్పం , పడగ అనగా ధ్వజం , ఱైని అనగా రాజు , పేరణము అనగా పెండ్లి. పై రచన అచ్చ తెనుగు ప్రబంధం. ఇది మూడు అశ్వాసాలలో 1140 గద్య పద్యాలలో రాయబడిన రచన. దీనిలో దుర్యోధనుడు శుభాంగి (భానుమతి) ని పరిణయం ఆడడం కలదు.

 రామరాజభూషణుడు వసు చరిత్ర అనే ప్రబంధం రచించారు. ఇందులో గిరిక , వసువుల పెండ్లి కథ కలదు. ఐదు అశ్వాసాల ప్రబంధం గా వ్రాయబడిన ప్రబంధం పాండురంగ మహత్య్మం. దీనిని తెనాలి రామకృష్ణడు రచించాడు. మాధుర్య సౌకుమార్యాది లక్షణాలు కల శబ్దార్థ శిల్ప రచన ఇది. ఇందులోనే నిగమశర్మ అక్క గా ప్రసిద్ధి పొందిన పేరులేని పాత్ర కలదు. రచనలో కవి శ్రీనాథుని పెద్దనని , రాయలని అనుకరించాడు. మరో రచన శ్రీ కాళహస్తీశ్వర మహత్యం. దీనిని కవి ధూర్జటి రచించారు. నాలుగు అశ్వాసాల ప్రబంధం. ప్రభావతీ ప్రద్యుమ్నం. దీనిని పింగళి సూరన శృంగార ప్రబంధముగా రచించారు. ఈ గ్రంథం స్వభావోక్తులతో లలిత పద ఘటితమై కథా చమత్కృతి కలిగి, చదివేవారికి కర్ణపేయంగా ఉండే ప్రబంధము . దీనికి ఎన్నో వ్యాఖ్యాన గ్రంథాలు వచ్చాయి. మరో ప్రబంధం కళాపూర్ణోదయము ను పింగళి సూరన రచించారు. ఇది ఎనిమిది ఆశ్వాసాల స్వతంత్ర ప్రబంధం. కథ ప్రారంభం, కథన పద్ధతి, నాయికా చిత్రణ లో నూతన రీతులను ప్రవేశపెట్టాడు కవి. దీనిలో దండకాలు, రగడలు కలవు. పారిజాతాపహరణం ఇది ఆరాశ్వాసాల ప్రబంధం. 500 గద్య పద్యలతో కలదు. ఇది శృంగార ప్రధానమైన ప్రబంధం. శ్రీకృష్ణుడు సత్యభామల కథ, నరకాసుర కథ వంటి ఇతివృత్తాలు కలవు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రబంధం ఆముక్తమాల్యద. ఇది ఏడు అశ్వాసాల కథ . దీనిలో గోదాదేవిని శ్రీరంగనాథుడు వివాహం చేసుకోవడం కలదు. ఈ కావ్యంలో కథా వైచిత్రి , విశిష్టాద్వైత ప్రశస్తి , ఉత్ప్రేక్ష అలంకారాలతో అనేక వర్ణనలతో కలదు. దీనిలో బుుతు వర్ణనలు అధికం. మరో రచన షట్చక్రవర్తి చరిత్రం. ఇందులో వ్యాకరణ పద్యాలు , అలంకార పద్యాలను చేర్చాడు. అన్యదేశ్యాలతో , తెలుగు నుడులతో ఈ ప్రబంధం కలదు.

               పారిజాతాపహరణం అనే ప్రబంధాన్ని రాయల ఆస్థానం లోని కవి నందితిమ్మన రచించారు

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ధనప్రాప్తి కొరకు

 *ధనప్రాప్తి కొరకు అమ్మవారి పూజలో ఒక లవంగాన్ని ఉంచండి...!!*

ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పలిగిన, విరిగిన వస్తువులు పడేయండి. 

బూజు దులపడం శుభ్రం చేయడం చేయండి.


గోడలపై పెన్సిలు, బొగ్గు గీతలు గీయడం వల్ల అప్పులపాలయే అవకాశం ఉంది. 

*అలాగని పిల్లలని దండించకండి😒*.

వీలైనంత నల్లకుక్కకు రొట్టెలు తినిపించడం వల్ల భైరవుని కృపకు పాత్రులు కాగలుగుతారు.


కాకులకు బియ్యం వేయడం వల్ల పితృదేవతలు సంతుష్టి చెందుతారు.

నాలుగు చిన్న మేకులు తీసుకుని నృసింహ మంత్రాన్ని చెబుతూ మీ సింహ ద్వారానికి ఇరుప్రక్కలా దించేయండి.

ఎలాంటి దుష్టాత్మలు ఇంట్లోకి ప్రవేశించవు.

ఇంట్లో డబ్బు నిలవకుంటే 4 గచ్ఛకాయలు తీసుకొని 

లక్ష్మి మంత్రాన్ని 108 సార్లు చెప్పి బీరువాలో పెట్టండి.


ఎప్పుడూ ఏదో సమస్యతో బాధపడేవారు భైరవుని పేరుమీద కొంచెం మద్యాన్ని తీసుకొని భైరవాష్టకాన్ని చదివి, తాగేవారికి ఇవ్వండి.


🌷 *లక్ష్మీదేవి అనుగ్రహం కోసం :*


ఇంట్లో ఉన్న గణపతి విగ్రహం లేదా చిత్రపటానికి 5 దళాలు ఉన్న గరికతో "గం గణపతియేనమః" అనే మంత్రోచ్చరణతో అర్చన చెయ్యండి. 


 చెరుకుముక్కలు, వెలగపండులను నివేదనగా పెట్టండి. అర్చన చేసిన గరికను మాలగా కట్టి స్వామికి మెడలో వెయ్యండి. 


ఇలా 5 లేదా 17 బుధవారాలు చెయ్యండి. 


ఆవునెయ్యి లేదా నువ్వులనూనెతో దీపారాధన చేస్తే శ్రేష్ఠం. ..


స్వస్తి...🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

కుంకుమార్చన

 *🙏🌺కుంకుమార్చన: ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, విశిష్టత. 🌺🙏*


కుంకుమార్చన అంటే అమ్మవారిని లేదా ఏదైనా ఇతర దేవతా రూపాన్ని వారి నామాలను జపిస్తూ కుంకుమను సమర్పించడం. ఇది హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పూజా విధానాలలో ఒకటి. 🌺


*కుంకుమార్చనను వివిధ పద్ధతులలో చేస్తారు:*

  దేవతా మూర్తి పాదాలకు కుంకుమను సమర్పించడం,

  పాదాల నుండి శిరస్సు వరకు కుంకుమతో నిండారుగా అర్చించడం,

  కుంకుమను నీటిలో లేదా పన్నీరు (గులాబీ నీరు)లో కలిపి అభిషేకం చేయడం.


*కుంకుమార్చన ప్రాముఖ్యత:*

కుంకుమకు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. 

దాని ప్రాముఖ్యతను కొన్ని అంశాలలో చూడవచ్చు.


 _శక్తి తత్వాన్ని ఆకర్షించే గుణం:_

    *ఎరుపు రంగు:* కుంకుమలోని ఎరుపు రంగు ప్రకాశ గుణాన్ని కలిగి ఉంటుంది. 

ఈ ప్రకాశం నుండే శక్తి తత్వం ఉత్పన్నం అవుతుంది.


  *ఆకర్షణ శక్తి:* 

కుంకుమకు శక్తి తత్వాన్ని ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది. 

మనం కుంకుమతో అర్చన చేసినప్పుడు, దేవతా విగ్రహాలలో నిక్షిప్తమై ఉన్న 'స్థితి శక్తి' ఎరుపు రంగు ప్రకాశంతో మేల్కొని, జాగృతమవుతుంది. 


*గ్రహణ శక్తి:* 

కుంకుమకున్న గ్రహణ శక్తి వలన, అది దేవతా విగ్రహాల నుండి వెలువడే ఆ దివ్య శక్తిని గ్రహించి తనలో నిలుపుకుంటుంది.


 *భగవత్ శక్తిని పొందే మార్గం:*

పూజలో అర్చించిన కుంకుమను మనం బొట్టుగా ధరించినప్పుడు, అందులో నిక్షిప్తమైన భగవత్ శక్తి మనకు లభిస్తుంది. 

ఇది మన శరీరంలోని ఆజ్ఞా చక్రం (నుదుటి మధ్య భాగం)పై ప్రభావం చూపి, సానుకూల శక్తిని, ప్రశాంతతను అందిస్తుంది. 

ఈ శక్తి మన మనస్సుపై, శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపి, ఆటంకాలను తొలగించి, శుభాలను చేకూరుస్తుందని నమ్మకం. 


*పవిత్రత, శుభ సంకేతం:*

 కుంకుమ అనేది సౌభాగ్యానికి, పవిత్రతకు, శుభానికి సంకేతం. 

ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో స్త్రీలు కుంకుమను నుదుట ధరించడం శ్రేయస్కరంగా భావిస్తారు.

అమ్మవారి పూజలలో కుంకుమార్చన చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. 🌺


*మానసిక ప్రశాంతత:*

 కుంకుమార్చన చేసేటప్పుడు దేవతా నామాలను జపించడం వల్ల మనసు ఏకాగ్రత పొందుతుంది. 

ఇది మానసిక ప్రశాంతతను, సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది.

కుంకుమార్చన కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు, ఇది దివ్య శక్తిని పొందడానికి, మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ఒక శక్తివంతమైన సాధనం. 


_ఓం శ్రీమహాలక్ష్మి యే నమః🙏🌹🌺_

శ్రావణ శుక్రవారం

 *శ్రావణ శుక్రవారం శ్రీ మహాలక్ష్మి ఆరాధన*

శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. 

ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.


పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. 

ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. 

వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. 

మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శెనగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు...


శ్రావణ మాసంలో గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పువ్వులు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇళ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మీ దేవి నివసిస్తుందని పురోహితులు చెబుతున్నారు.


అందుచేత శ్రావణ శుక్రవారం పూట తులసీపూజ, ఆలయాల్లో పాలు, తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తున్నారు. 

శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.

గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి.

 అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి.


ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురోహితులు అంటున్నారు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ లేదా అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.


      _అంతేగాకుండా..!!_ మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను అమ్మవారి కోసం సమర్పించి, నేతితో దీపమెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు.

శ్రావణ మాసం పండుగలు

 *శ్రావణ మాసం పండుగలు, పరవడి రోజులు*


2025 సంవత్సరం శ్రావణమాసం జూలై 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆగష్టు 23వ తేదీతో శ్రావణ మాసం పూర్తయిపోతుంది


*_శ్రావణమాసంలో నోములు, వ్రతాలు, పండగుల వివరాలు_*


జూలై 25: మొదటి శ్రావణ శుక్రవారం

జూలై 29: మొదటి శ్రావణ మంగళవారం, నాగ పంచమి పండగ

ఆగష్టు 01 : రెండో శ్రావణ శుక్రవారం

ఆగష్టు 05 : శ్రావణ మంగళవారం

ఆగష్టు 08 : మూడో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, వారాహి జయంతి,

ఆగష్టు 09 : రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి

ఆగష్టు 12 : మూడో శ్రావణ మంగళవారం

ఆగష్టు 14: బలరామ జుయంతి

ఆగష్టు 15 : నాలుగో శ్రావణ శుక్రవారం

ఆగష్టు 16: కృష్ణాష్ణమి

ఆగష్టు 19 : నాలుగో శ్రావణ మంగళవారం

ఆగష్టు 22: ఆఖరి శ్రావణ శుక్రవారం

ఆగష్టు 23 : శనివారం పోలాల అమావాస్య

ఆగస్టు 24 : ఆదివారం నుంచి భాధ్రపద మాసం ప్రారంభం

శ్రావణమాసం ప్రారంభం*

 *_నేటి నుండి..._*


            *శ్రావణమాసం ప్రారంభం*

           *_శ్రావణ మాస విశిష్టత_*

             *>< <> >< >< <> ><*

శ్రావణ మాసం అంటే శుభమాసం. శ్రావణ మాసాన్ని “నభో మాసం” అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగ పంచమి పుత్రాదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరహ జయన్తి హయగ్రీవ జయంతి. ఇలా అనేక పండుగలు వస్తాయి. 


శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.


*_శ్రావణ సోమవారం_*


ఈ మాసంలో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవికి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడంగా నమ్ముతారు


*_శ్రావణ మంగళవారం_*

 

శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లికి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు.


*_శ్రావణ శుక్రవారం_*

 

ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని పెద్దలు చెప్పారు. లక్ష్మిదేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్టశక్తులని అష్టలక్ష్ములుగా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మిదేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతిలో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మిదేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం.


*_శ్రావణ శనివారాలు_*


ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది.


*_శ్రావణ పౌర్ణమి_*


శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతిని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి.


జంధ్యాన్ని యగ్నోపవీతమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.


*_రక్షా బంధనం_*

 

శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయంలో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక, కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండి వస్తున్నా సంప్రదాయమేనని తెలుస్తోంది.


*_꧁ॐ oఓo శ్రీమాత్రే నమః ॐ꧂_*


*_𝕝𝕝 మఙ్గళం మహాత్ 𝕝𝕝_*


              *_🌹శుభమస్తు🌹_*

⚜ శ్రీ మహాదేవ్ ఖోలా ధామ్

 🕉 మన గుడి : నెం 1183


⚜ మేఘాలయ : షిల్లాంగ్


⚜ శ్రీ మహాదేవ్ ఖోలా ధామ్



💠 'పర్వతాలకు ప్రభువు' అయిన శివుడు ఇక్కడి తూర్పు కొండల మధ్య ఒక ప్రత్యేకమైన గుహ నివాసాన్ని కలిగి ఉన్నాడు. 


💠 ఎగువ షిల్లాంగ్‌లో ఉన్న శ్రీ మహాదేవ్ ఖోలా ధామ్, మేఘాలయలోని పురాతన ఆలయాలలో ఒకటి మరియు షిల్లాంగ్‌లోని ప్రసిద్ధ తీర్థయాత్ర స్థలాలలో ఒకటి . 


💠 ఇది ఒక పురాతన హిందూ దేవాలయం . 150 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం ఉనికి గురించి విభిన్న కథనాలు ఉన్నాయి. శివరాత్రి మేళా సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు 


💠 మహాదేవ్ ఖోలా ఆలయం ఉమ్షిర్పి నది ఒడ్డున ఉంది మరియు ఉత్తర భారత శైలి నిర్మాణ శైలిలో నిర్మించబడింది.


💠 మహాదేవ్ ఖోలా ధామ్ అనేది శివుడికి అంకితం చేయబడిన ఒక గుహ ఆలయం. 


💠 పురాణాల ప్రకారం, లఖియా బాబా అనే ఋషి ఇక్కడే ఉండి ధ్యానం చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడింది. 8వ గూర్ఖా రెజిమెంట్‌కు చెందిన ఒక సుబేదార్-మేజర్ తన చేతిలో త్రిశూలం మరియు మెడలో రుద్రాక్ష హారంతో ఋషి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు కలలో చూశాడు. 


💠 మరుసటి రోజు, ఆ వ్యక్తి ఋషి కోసం వెతికి, నేడు మందిరం ఉన్న ప్రదేశంలో ఆయనను కనుగొన్నాడు. ఆలయ నిర్మాణం కోసం తవ్వకం సమయంలో, సుబేదార్-మేజర్ ఒక భారీ శివలింగాన్ని కనుగొన్నాడు, తద్వారా ఆలయం శివుడికి అంకితం చేయబడింది.


💠 ప్రస్తుత ఆలయాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చాలా మంది నిర్మించారు, కానీ మునుపటిది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ అనుమతితో నిర్మించబడింది. గుహలో మరొక గుహకు దారితీసే ఒక చిన్న ద్వారం ఉంది. ప్రవేశ ద్వారం వద్ద శివుని చిన్న విగ్రహం ఉంది. 


💠 ఈ ద్వారం అస్సాంలోని కామరూప్‌లోని నీలాచల్ కొండల పైన ఉన్న పురాతన కామాఖ్య ఆలయానికి దారితీస్తుందని నమ్ముతారు. 


💠 ప్రధాన ఆలయం కాకుండా, ఈ సముదాయంలో అనేక చిన్న దేవాలయాలు ఉన్నాయి, వీటిని మహాదేవ్ ఖోలా ధామ్ భక్తులు నిర్మించారని నమ్ముతారు.


💠 ప్రతి సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో మూడు రోజుల పాటు మహా శివ మేళా జరుగుతుంది. 

ఈ మేళా సమయంలో, 25,000 మందికి పైగా ప్రజలు స్వామి ఆశీస్సుల కోసం ఆలయాన్ని సందర్శిస్తారు.



💠 బిల్వపత్రం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు ఇతర ఆహార పదార్థాలను సమర్పిస్తారు.

ధూపం మరియు దీపాలు కూడా పూజా ఆచారంలో భాగం.


💠 సమయాలు : 

ఉదయం: 06:00 AM - 12:00 PM

సాయంత్రం : సాయంత్రం 04.30 - సాయంత్రం 06:00


💠 ఢిల్లీ నుండి షిల్లాంగ్‌లోని మహాదేవ్ ఖోలా ధామ్‌కు రైలు ప్రయాణ దూరం మరియు సమయం సుమారు 1,100 నుండి 1,200 కిలోమీటర్లు. సాధారణంగా రైలులో ప్రయాణించడానికి 24 నుండి 30 గంటలు పడుతుంది. 

మహాదేవ్ ఖోలా ధామ్ చేరుకోవడానికి, మీరు సాధారణంగా గౌహతి (అస్సాం) కి రైలులో ప్రయాణించి, అక్కడి నుండి రోడ్డు మార్గంలో మహాదేవ్ ఖోలా ధామ్ కు ప్రయాణించాలి.

గౌహతి నుండి మహాదేవ్ ఖోలా ధామ్ వరకు రోడ్డు ప్రయాణం అదనంగా 4 నుండి 6 గంటలు పట్టవచ్చు. 


💠 మీరు ప్రత్యేక పూజా ఆచారాలు లేదా పండుగల సమయంలో ప్రయాణిస్తుంటే, ముందుగానే సమయాలను నిర్ధారించుకుని, సరైన సన్నాహాలు చేసుకోండి. 


💠 మహాదేవ్ ఖోలా ధామ్‌కు ప్రయాణించేటప్పుడు స్థానిక వాతావరణ పరిస్థితులను గుర్తుంచుకోండి, ఎందుకంటే కొండ ప్రాంతాలలో వాతావరణం తరచుగా మారుతుంది.


💠 ఇది షిల్లాంగ్ బస్టాండ్ నుండి 5 కి.మీ దూరంలో ఉంది



Rachana 

©️ Santosh Kumar

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: పదవ అధ్యాయం

విభూతియోగం:శ్రీభగవానువాచ: 


భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః 

యత్తే௨హం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా (1)


న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః 

అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః(2)


నా మాటలు విని ఆనందిస్తున్నావు. కనుక నీ శ్రేయస్సుకోరి శ్రేష్ఠమైన వాక్యం మళ్ళీ చెబుతున్నాను విను. దేవగణాలకుకాని, మహాఋషులకుకాని నా పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. దేవతలకూ, మహర్షులకూ అన్నివిధాల ఆదిపురుషుణ్ణి నేనేకావడం దీనికి కారణం.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *అప్రాప్తకాల వచనం బృహస్పతిరపి బృవన్l*

        *లభతే బహ్వవజ్ఞానం అపమానం చ పుష్కలమ్ll*


                *... అజ్ఞాతకవిః ...*


తా𝕝𝕝 *సందర్భశుద్ధిగా పలకనివాడు అవమానమును పొందును. సాక్షాత్తు దేవతల గురువైన బృహస్పతియే అసందర్భమైన మాట మాట్లాడి అవమానం పొందాడు. కావున ఎల్లప్పుడూ సందర్భోచితంగా మాట్లాడవలెను.*


 ✍️🌹🌸💐🙏