25, జులై 2025, శుక్రవారం

ప్రబంధ సాహిత్యము

 🙏తెలుగు ప్రబంధ సాహిత్యము🙏

                   రెండవ భాగము 

ప్రబంధ రకాలు

ప్రబంధాలను ఐదు రకాలుగా వర్గీకరణ చేయవచ్చు.

1) పౌరాణిక సంబంధం ప్రబంధాలు - మనుచరిత్ర , వసుచరిత్ర

2) క్షేత్ర మహత్యం సంబంధమైనవి- శ్రీకాళహస్తీశ్వర , పాండురంగ మహత్యం ,

3) చారిత్రక ప్రబంధాలు- కృష్ణరాయ విజయం , రామరాజీయం

4) సాంఘిక ప్రబంధాలు - నిరంకుశోపాఖ్యానం

5) కల్పిత ప్రబంధాలు - కళాపూర్ణోదయం

               మర్రిచెట్టు కు బీజము వలే ప్రబంధమునకు భారతంలోని వర్ణనలే ఆధారములనీ గంటిజోగి సోమయాజి అభిప్రాయపడ్డారు.ఎర్రన్న భారతములో సావిత్రి ఉపాఖ్యానం, హరివంశం లోని ఉషాఅనిరుద్దల కథలను ప్రబంధంగా పరిశీలకులు భావించారు.నన్నెచోడుడు తన కుమార సంభవం ను సద్యసబంధురమైన ప్రబంధముగా పేర్కొన్నారు. తిక్కన తన మహా భారత పర్వములను ప్రబంధ మండలిగా పేర్కొన్నారు.శ్రీనాథుడు శృంగార నైషధం , పిల్లలమర్రి పిన వీరభద్రుడి శృంగార శాకుంతలలలో ప్రబంధ లక్షణాలు కలవు.తెలుగులో అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్ర యే తొలి ప్రబంధంగా పింగళి లక్ష్మీకాంతం పేర్కొన్నారు.

                    మహాభారతం, రామాయణం , మాలతీ మాధవంలు ప్రబంధాలుగా సాహిత్య దర్పణం కర్త విశ్వనాథుడు ప్రబంధ గ్రంథాలుగా చెప్పారు.గీత గోవింద కావ్యాన్ని రాసిన జయదేవుడు తన రచనను ప్రబంధం అని అన్నారు.

                     భానుచంద్ర , సిద్ధ చంద్ర లాక్షణికులు కాదంబరిని కథా ప్రబంధం అన్నారు. భామహుడు పద్యకావ్యాన్ని ప్రబంధం అన్నాడు రుద్రటుడు కావ్య శబ్దానికి పర్యాయపదంగా ప్రబంధంను ఉపయోగించాడు.

                      పొన్నగంటి తెలగనార్యుడు వ్రాసిన యాయతిచరిత్ర అచ్చతెలుగు ప్రబంధములలో మొట్టమొదటిది. అలాగే కవి సిరిసినగండ్ల నృసింహస్వామి రాసిన రచన చిలువ పడగ ఱైని పేరణము. దీనిలో చిలువ అనగా సర్పం , పడగ అనగా ధ్వజం , ఱైని అనగా రాజు , పేరణము అనగా పెండ్లి. పై రచన అచ్చ తెనుగు ప్రబంధం. ఇది మూడు అశ్వాసాలలో 1140 గద్య పద్యాలలో రాయబడిన రచన. దీనిలో దుర్యోధనుడు శుభాంగి (భానుమతి) ని పరిణయం ఆడడం కలదు.

 రామరాజభూషణుడు వసు చరిత్ర అనే ప్రబంధం రచించారు. ఇందులో గిరిక , వసువుల పెండ్లి కథ కలదు. ఐదు అశ్వాసాల ప్రబంధం గా వ్రాయబడిన ప్రబంధం పాండురంగ మహత్య్మం. దీనిని తెనాలి రామకృష్ణడు రచించాడు. మాధుర్య సౌకుమార్యాది లక్షణాలు కల శబ్దార్థ శిల్ప రచన ఇది. ఇందులోనే నిగమశర్మ అక్క గా ప్రసిద్ధి పొందిన పేరులేని పాత్ర కలదు. రచనలో కవి శ్రీనాథుని పెద్దనని , రాయలని అనుకరించాడు. మరో రచన శ్రీ కాళహస్తీశ్వర మహత్యం. దీనిని కవి ధూర్జటి రచించారు. నాలుగు అశ్వాసాల ప్రబంధం. ప్రభావతీ ప్రద్యుమ్నం. దీనిని పింగళి సూరన శృంగార ప్రబంధముగా రచించారు. ఈ గ్రంథం స్వభావోక్తులతో లలిత పద ఘటితమై కథా చమత్కృతి కలిగి, చదివేవారికి కర్ణపేయంగా ఉండే ప్రబంధము . దీనికి ఎన్నో వ్యాఖ్యాన గ్రంథాలు వచ్చాయి. మరో ప్రబంధం కళాపూర్ణోదయము ను పింగళి సూరన రచించారు. ఇది ఎనిమిది ఆశ్వాసాల స్వతంత్ర ప్రబంధం. కథ ప్రారంభం, కథన పద్ధతి, నాయికా చిత్రణ లో నూతన రీతులను ప్రవేశపెట్టాడు కవి. దీనిలో దండకాలు, రగడలు కలవు. పారిజాతాపహరణం ఇది ఆరాశ్వాసాల ప్రబంధం. 500 గద్య పద్యలతో కలదు. ఇది శృంగార ప్రధానమైన ప్రబంధం. శ్రీకృష్ణుడు సత్యభామల కథ, నరకాసుర కథ వంటి ఇతివృత్తాలు కలవు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రబంధం ఆముక్తమాల్యద. ఇది ఏడు అశ్వాసాల కథ . దీనిలో గోదాదేవిని శ్రీరంగనాథుడు వివాహం చేసుకోవడం కలదు. ఈ కావ్యంలో కథా వైచిత్రి , విశిష్టాద్వైత ప్రశస్తి , ఉత్ప్రేక్ష అలంకారాలతో అనేక వర్ణనలతో కలదు. దీనిలో బుుతు వర్ణనలు అధికం. మరో రచన షట్చక్రవర్తి చరిత్రం. ఇందులో వ్యాకరణ పద్యాలు , అలంకార పద్యాలను చేర్చాడు. అన్యదేశ్యాలతో , తెలుగు నుడులతో ఈ ప్రబంధం కలదు.

               పారిజాతాపహరణం అనే ప్రబంధాన్ని రాయల ఆస్థానం లోని కవి నందితిమ్మన రచించారు

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: