*ఆనందకరమైనది ఈ వానకాలము*
ఉ॥
తూర్పుసముద్రమందు నవదోహపుఫేనముఁ బోలు భంగముల్
మార్పులసూచనల్ విడిసి మాటికి మాటికి నంబుధారలం
గూర్పగ ద్రోణితోడుత ప్రకోపముఁ బూనుచు సత్రికూటముల్
పేర్పుగరాఁ ధరాతలము వృష్టివరించె ప్రవాహమేర్పడన్
ఉ॥
భూజములల్లలాడి నవి మూర్థము లూచుచు నట్లె రమ్మనన్
తేజములుప్పతిల్లగ నధీరలతల్ బహుహీరమాలికల్
వాజులఁ గూర్చి నాజులకు వచ్చు విధమ్మున వర్షధార లీ
బీజసువీతలమ్మునకు విందులఁ జేయుచు వానకాలమున్
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి