ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
27, జూన్ 2025, శుక్రవారం
శారదామాత
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
_*ఓం నమో భగవతే రామకృష్ణాయ*_
*శారదామాత జీవితచరిత్ర*
ఓర్పు-సహనం:--
రాధూ అందగత్తె. ఆమె మాతృదేవిని 'అమ్మా' అంటూ పిలిచేది. సొంత తల్లిని 'గుండుకొట్టుకొన్న అమ్మ' అని పిలిచేది. భక్తులు తెచ్చే పండ్లు, పదార్థాలు అన్నీ రాధూకే చెందినవని సురబాల భావించేది. వాటిని ఎవరికైనా ఇస్తే మాతృదేవిని తులనాడేది.
కాలం గడిచింది. రాధూ శరీరకంగా ఎదిగిందేగాని మానసికంగా పెరగలేదు. లోకాన్ని అర్థం చేసుకోవడం, మంచి చెడ్డలు గ్రహించడం ఆమెకు మించిన పని. చటుక్కున కోపం ఉక్రోషం తెచ్చుకొనేది. ఒక రోజు ఎంతో ఆవేదనతో, "ఈ రాధూతో నేను పడుతున్న ఆవేదనను చూడు"!అనేవారు. పలువురి సమక్షంలో అనుచితంగా ప్రవర్తించేది. ఎలాంటి కారణమూ లేకుండా విరుచుకుపడి శాపనార్థాలు ఏకరువు పెట్టేది. చేతికి ఏది అందితే దానిని తీసుకొని మాతృదేవి మీద విసిరివేయడం, ఆమెను తన్నడం, ఉమ్మడం చేసేది. ఏ వ్యక్తియైనా తన ఓర్పును కోల్పోయే రీతిలో నీచంగా ప్రవర్తించేది.
ప్రతి రోజు ఈ ఇద్దరి పిచ్చి వలన కలిగే వేదనను భరించలేక మాతృదేవి "నేను పరమేశ్వరుని ముళ్లతో కూడిన బిల్వ పత్రాలతో పూజించానేమో! అందుకే వీరందరూ నన్ను ముళ్లుగా గుచ్చుతున్నారు" అన్నారు.
1906 వ సం|| మాతృదేవి తమ తల్లి శ్యామసుందరీ దేవిని కోల్పోయారు. ఒక పరిపూర్ణ జీవితం ఆమె గడిపింది. తన కుమార్తెను 'అమ్మా' అంటూ పిలిచే పిల్లలు లేకుండా పోతారేమో అంటూ ప్రారంభంలో ఆమెలో ఉన్న తపన ఈ రోజుల్లో పూర్తిగా తొలగిపోయింది. భక్తులు మాతృదేవిని దర్శించుకోవడానికి, మంత్రదీక్ష పుచ్చుకోవడానికి రాసాగారు. వారందరూ మాతృదేవిని 'అమ్మా' అనీ, తనను 'అమ్మమ్మా' అని పిలవడం విని శ్యామసుందరి ఎంతగానో మురిసిపోయారు. ఎన్నడూ పనిలేకుండా ఉండేది కాదు. ఆవులను చూసుకోవడం, ఆవుల కొట్టాన్ని శుభ్రం చేయడం, పొలంలో పని చేసేవారికి భోజనం తీసుకెళ్లి ఇవ్వడం, వంట, ధాన్యం దంపడం అంటూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవారు. ఏ పని చేస్తూవున్నా ఆమె ముఖాన చిరుమందహాసం కనిపించేది. ఆమె దుఃఖంతో ఉండడమో, కోపగించుకోవడమో ఎవరూ చూసింది లేదు.
ఆఖరి రోజు కూడా ధాన్యం దంపారు. దుకాణానికి వెళ్లి కూరగాయలు కొని తెచ్చారు. హఠాత్తుగా వరండాలో ఒళ్లు తూలి కిందపడ్డారు. మాతృదేవి శిష్యుడు ఒకరితో "నాకు తల తిరుగుతూ ఉంది. ఆఖరి క్షణాలు వచ్చేసినట్లున్నాయి" అన్నారు. మాతృదేవీ, ఇతరులూ పరుగెత్తు కొంటూ వెళ్లారు, గుమ్మడికాయ పులుసు తినాలని తన కుమార్తెతో చెప్పారు. అందుకు మాతృదేవి ఆరోగ్యం బాగుపడ్డాక చేసి పెడతానన్నారు. తర్వాత తాగదానికి నీళ్లు అడిగారు. మాతృదేవి గంగాజలం ఇచ్చారు. దివ్యురాలైన కుమార్తే చేతుల నుండి పావన గంగాజలం సేవిస్తూ అట్లే కళ్లుమూశారు శ్యామసుందరి.
ఏదయినా పని మొదలు పెట్టడం ఆలస్యం, అన్నదమ్ముల మధ్య పోట్లాటలు మొదలవుతాయి. ఒక రోజు ఆస్తి పంపకాల పోట్లాట తారస్థాయికి చేరింది. అన్నదమ్ములు కొట్టుకొనసాగారు. వెంటనే స్వామి శారదానంద వారి మధ్య జొరబడి ఇద్దరిని రాజీ పరిచారు. అందరూ అంగీకరించేలా ఆయన ఆస్తి పంపకం చేశారు.
ఇంత గందరగోళం మధ్య కూడా మాతృదేవి కనబరచిన ప్రశాంతత స్వామి శారదానందను ఎంతగానో అబ్బురపరచింది. ఆయన ఒక బ్రహ్మచారితో, "చూడు, వీరందరి పోట్లాటలతో మనం సహనాన్ని కోల్పోతాం. మాతృదేవిని చూడు! సోదరులు ఎన్నెన్ని సమస్యలు సృష్టిస్తున్నారో! కానీ ఆమె ఒకింతైనా ప్రశాంతతను కోల్పోయారా! ఎలాంటి సమతా స్థితి! ఎలాంటి ప్రశాంతత!" అని అన్నారు.
ఆస్తుల పంపకం ముగిసిన తర్వాత మాతృదేవికి ఆమెకోసమంటూ ప్రత్యేకంగా 1915 వ సం||లో భక్తులు ఒక ఇల్లు కట్టేదాకా ప్రసన్న ఇంట్లోనో, కాళీ ఇంట్లోనో నివసించేవారు. కానీ ప్రసన్న ఇంట్లో నివసించడాన్నే అలవాటుగా చేసుకున్నారు. ఎందుకంటే నళిని, మాకు అనే ఇద్దరు కుమార్తెలను వదలి పెట్టి ప్రసన్నుని భార్య కళ్ళు మూసింది. వారి బాధ్యత కూడా మాతృదేవి మీద పడింది.
ఒకసారి ప్రసన్న కుమార్ అక్కయ్య! ఇక రాబోయే జన్మలలో కూడా నేను నీ సోదరునిగా పుట్టాలని నన్ను ఆశీర్వదించు" అన్నాడు. అందుకు మాతృదేవి, “మళ్లీ మీ కుటుంబంలోనా! అలా కలలు కనకు! ఇప్పుడు జన్మించి నేను పడుతున్న ఆవేదన చాలదా? మళ్లీ మీ సోదరిగా జన్మించడమా! వద్దే వద్దు అని అన్నారు.
ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటూ వెంపర్లాడే తమ సోదరులను గురించి మాతృదేవి ఒకసారి, "వీరందరూ ఎలాంటి జన్మలు? సదా డబ్బు డబ్బు అంటూ కొట్టుకుపోతూంటారు. కాని భక్తి కావాలి. జ్ఞానం కావాలి అనే ఆలోచన
కూడా వారికి రాదు!" అంటూ ఎంతో కలవరపడ్డారు.
https://chat.whatsapp.com/JY0yPPPRgIiHuoZll8ImNd
*శారదామాత చరితామృతం*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్రీ మహాలక్ష్మి ఆలయం
🕉 మన గుడి : నెం 1155
⚜ మహారాష్ట్ర : ముంబాయి
⚜ శ్రీ మహాలక్ష్మి ఆలయం
💠 ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలోని భూలాభాయ్ దేశాయ్ రోడ్డులో ఉన్న అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో మహాలక్ష్మి ఆలయం ఒకటి. ఇది దేవి మహాత్మ్యం యొక్క కేంద్ర దేవత మహాలక్ష్మికి అంకితం చేయబడింది.
💠 ఈ మహాలక్ష్మి ఆలయం విష్ణువు భార్య అయిన మహాలక్ష్మి దేవికి అంకితం చేయబడింది, ఆమె సంపద, శ్రేయస్సు మరియు శుభాలను ప్రసాదించే దేవతగా గౌరవించబడుతుంది.
మహాలక్ష్మితో పాటు, ఈ ఆలయంలో జ్ఞాన దేవత అయిన సరస్వతి దేవి మరియు శక్తి మరియు రక్షణకు ప్రతీక అయిన కాళి దేవి విగ్రహాలు కూడా ఉన్నాయి.
💠 ముంబైలోని ఉత్సాహభరితమైన వీధుల మధ్య ఉన్న మహాలక్ష్మి ఆలయం, ఓదార్పు మరియు ఆశీర్వాదాలను కోరుకునే భక్తులకు ప్రశాంతమైన ఆశ్రయంగా నిలుస్తుంది.
💠 దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ యొక్క సందడిగా ఉండే ఆవరణలో ఉన్న ఈ పవిత్ర అభయారణ్యం, నగర పట్టణ ప్రకృతి దృశ్యంలో దైవిక కృప మరియు శ్రేయస్సుకు చిహ్నంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
💠 ఈ ఆలయాన్ని 1831లో హిందూ వ్యాపారి ధక్జీ దాదాజీ నిర్మించారు. మహాలక్ష్మి ఆలయంలో త్రిదేవి దేవతలైన మహాకాళి, మహాలక్ష్మి మరియు మహాసరస్వతి చిత్రాలు ఉన్నాయి.
మూడు చిత్రాలు ముక్కుపుడకలు, బంగారు గాజులు మరియు ముత్యాల హారాలతో అలంకరించబడి ఉంటాయి. మధ్యలో మహాలక్ష్మి చిత్రం తామర పువ్వులను పట్టుకుని చూపబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులు పూజ మరియు నైవేద్యంగా ఉపయోగించే పూల దండలు మరియు ఇతర సామగ్రిని విక్రయించే అనేక స్టాళ్లు ఉన్నాయి.
💠 ముంబైలో మహాలక్ష్మి నివాసం ఉన్న నవరాత్రిలో మహాలక్ష్మి పండుగ అద్భుతంగా ఉంటుంది
ఈ తల్లి మహాలక్ష్మి, తన ఇద్దరు సోదరీమణులు మహాకాళి మరియు మహాసరస్వతిలతో కలిసి ప్రస్తుత ప్రదేశంలో నివసిస్తుంది.
💠సా ధారణంగా 1784-85 వరకు.
ముంబైకి చెందిన బ్రిటిష్ గవర్నర్ జాన్ హార్న్బీ తీరాన్ని నిర్మించడానికి మరియు మరమ్మతు చేయడానికి ముంబై మరియు వర్లి అనే రెండు కట్టలను నిర్మించాడు.
💠 చరిత్ర మరియు ఇతిహాసాలలో
మహాలక్ష్మి ఆలయం 18వ శతాబ్దం నాటి మూలాలను కలిగి ఉంది.
💠 పురాణాల ప్రకారం, భక్తులు శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి మరియు శ్రీ మహాసరస్వతి అనే మూడు దేవతల విగ్రహాలను ఆక్రమణదారుల విధ్వంసం నుండి రక్షించడానికి వర్లి క్రీక్ సమీపంలో సముద్రంలో ముంచారు.
వర్లి-మలబార్ హిల్ క్రీక్ యొక్క రెండు ద్వీపాలను అనుసంధానించడానికి ప్రభుత్వ ఇంజనీర్ శ్రీ రామ్జీ శివజీ ప్రభు ఒక ప్రాజెక్టును చేపట్టారు.
💠 ప్రభు మరియు అతని బృందం ప్రయత్నించినప్పటికీ, సముద్రపు అలలు ద్వీపాల మధ్య మార్గాల నిర్మాణాన్ని అడ్డుకోవడం వల్ల వారు సవాళ్లను ఎదుర్కొన్నారు.
అయితే, ఒక రాత్రి, మహాలక్ష్మి దేవి ప్రభు కలలో దర్శనం ఇచ్చి, 'నేను నా సోదరీమణులతో కలిసి సముద్రం అడుగున ఉన్నాను. నన్ను బయటకు తీసుకెళ్లండి, అప్పుడు మీ ఆనకట్ట పూర్తవుతుంది. వర్లి క్రీక్ నుండి విగ్రహాలను వెలికితీసి కొండపై ఉంచమని సూచించింది.
💠దేవత కోరికలను నెరవేరుస్తానని వాగ్దానం చేసిన ప్రభు మరియు అతని బృందం విజయవంతంగా విగ్రహాలను వెలికితీసి రెండు వాగులను అనుసంధానించింది.
కృతజ్ఞతగా, ప్రభు కొండపై మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం 1761 మరియు 1771 మధ్య నిర్మించబడిందని చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి.
💠 మహాలక్ష్మి ఆలయ నిర్మాణం సాంప్రదాయ హిందూ ఆలయ రూపకల్పన మరియు సమకాలీన సౌందర్యం యొక్క సామరస్య మిశ్రమాన్ని ప్రతిబింబిస్తుంది. సంక్లిష్టమైన శిల్పాలు, అలంకరించబడిన గోపురాలు మరియు ఎత్తైన స్తంభాలతో అలంకరించబడిన ఈ ఆలయ నిర్మాణం దైవిక వైభవం మరియు భక్తి భావాన్ని వెదజల్లుతుంది.
💠 లోపల, గర్భగుడి ప్రధాన దేవతల అందమైన విగ్రహాలతో అలంకరించబడి, ప్రార్థన మరియు భక్తికి అనుకూలమైన ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తుంది.
💠 భక్తి పద్ధతులు మరియు ఆచారాలు
ఏడాది పొడవునా భక్తులు పెద్ద సంఖ్యలో మహాలక్ష్మి ఆలయానికి ప్రార్థనలు చేయడానికి మరియు దేవత ఆశీర్వాదం పొందడానికి వస్తారు.
💠 నవరాత్రి, దీపావళి మరియు అక్షయ తృతీయ వంటి శుభ సందర్భాలలో మరియు పండుగల సమయంలో ప్రత్యేక వేడుకలు మరియు ఆచారాలు నిర్వహించబడతాయి, దూర ప్రాంతాల నుండి భక్తులు గుంపులుగా వస్తారు.
💠 ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల వారి జీవితాల్లో శ్రేయస్సు, విజయం మరియు ఆధ్యాత్మిక సంతృప్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు.
💠 సమయాలు : తెరిచే సమయం - ఉదయం 06:00 గంటలకు,
ముగింపు సమయం -
రాత్రి 10:00 గంటలు
💠 ఇది ముంబైలోని మహాలక్ష్మి రైల్వే స్టేషన్ నుండి కేవలం 1 కి.మీ దూరంలో ఉంది.
రచన
©️ Santosh Kumar
18-29-గీతా మకరందము
18-29-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అ| బుద్ధి, ధైర్యము - అనువానియొక్క సత్త్వాది త్రివిధరూపములను వేరువేరుగ తెలుపబోవుచున్నారు–
బుద్ధేర్భేదం ధృతేెశ్చైెవ
గుణత స్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ
పృథక్త్వేన ధనంజయ!
తా:- ఓ అర్జునా! బుద్ధి యొక్కయు, ధైర్యముయొక్కయు భేదమును గుణములనుబట్టి మూడువిధములుగా వేరువేరుగను, సంపూర్ణముగను చెప్పబడుచున్నదానిని (నీ విపుడు) వినుము.
తిరుమల సర్వస్వం -283*
*తిరుమల సర్వస్వం -283*
*తిరుమల క్షేత్రంలో నిషిద్ధకర్మలు-1*
పరమపవిత్రమైన, పరిశుభ్రతకు మారుపేరైన తిరుమల కొండపై ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడనట్టి కొన్ని పనులున్నాయి. మనం ఎన్నిసార్లు, ఎంత భక్తితో స్వామిని దర్శించుకున్నప్పటికీ, కొన్ని నిషిద్ధకర్మలకు దూరంగా ఉండకపోతే, యాత్రాఫలం సంపూర్ణంగా సిద్ధించదు. అవేమిటో, ఆ పనులు ఎందుకు కూడదో ఈనాటి ప్రకరణంలో సవివరంగా చూద్దాం.
*ఆదివరాహదర్శనం*
మొదటగా ఆదివరాహుణ్ణి దర్శించుకోకుండా శ్రీవారి దర్శనం కూడదు. తిరుమలక్షేత్రానికి అసలు పేరు *'ఆదివరాహక్షేత్రం'.* ఈ క్షేత్రమంతా ఒకప్పుడు శ్రీమహావిష్ణువు మరో అవతారమైన ఆదివరాహస్వామి లేదా భూవరాహస్వామికి చెందినది. వల్మీకంలో (పుట్టలో) సుదీర్ఘకాలం గడిపిన శ్రీనివాసుడు నిలువనీడ కోసం అలమటిస్తున్నప్పుడు శ్రీవారి శాశ్వతనివాసం కోసం స్వామిపుష్కరిణికి దక్షిణం వైపునున్న నూరు అడుగుల నేలను ఆదివరాహుడు ధారాదత్తం చేశాడు. అదే ప్రదేశంలో తరువాతి కాలంలో తొండమానుడు ఆనందనిలయం నిర్మించాడు. ఇప్పుడున్న తిరుమల ప్రధానాలయం అదే!
*తనకు స్థలాన్ని బహూకరించినందుకు ప్రతిగా భక్తుల తొలిదర్శనం, తొలిపూజ, తొలినైవేద్యం ఆదివరాహునికే చెందుతాయని, తరువాతే తనను దర్శించుకుంటారని శ్రీవేంకటేశ్వరుడు ఆదివరాహస్వామికి వాగ్దానమిచ్చాడు. దానికి ఋజువుగా శ్రీనివాసుడు వరాహస్వామికి ఒక రాగిఫలకంపై వ్రాసి ఇచ్చిన దస్తావేజును తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర వస్తుప్రదర్శనశాలలో నేడు కూడా చూడవచ్చు. శ్రీనివాసుని ఆదేశం మేరకు తొలిపూజను, తొలినైవేద్యాన్ని అర్చకస్వాములు నిర్వహిస్తారు. తొలిదర్శనం బాధ్యత మాత్రం భక్తులదే!*
*'వరాహదర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్నచ దర్శనాత్ ప్రాగ్ వరాహస్య శ్రీనివాసో న తృప్యతి*
అన్న శ్లోకం ద్వారా సాక్షాత్తు శ్రీనివాసుడే స్వయంగా తన భక్తులకు ఈ విధంగా శెలవిచ్చాడు. ఈ ఉదంతాన్ని మునుపటి ప్రకరణాలలో విశదంగా తెలుసుకున్నాం.
శ్రీవేంకటేశ్వరుని వాగ్దానాన్ని నిలబెట్టవలసిన బాధ్యత వారి భక్తులుగా మనందరి పైనా ఉంది. ఈ నియమాన్ని ఈమధ్య కాలం వరకూ తూచా తప్పకుండా పాటించేవారు కానీ, ప్రస్తుతం కొంత ఆలసత్వం కాన వస్తోంది. మొట్టమొదటగా ఉత్తరమాడవీధిలో, స్వామిపుష్కరిణి తటాన ఉన్న వరహస్వామిని సేవించుకోకుండా, శ్రీనివాసుని దర్శించుకోరాదు. అలా చేస్తే తిరుమల యాత్రాఫలం సంపూర్ణంగా సిద్ధించదని పురాణాలలో కూడా ఉటంకించబడింది.
*ముఖ్య నిబంధనావళి*
*కొండపై నవదంపతుల నిదుర నిషిద్ధం*
వివాహమైన ఆరుమాసాల వరకూ కొత్త దంపతులు కొండపై నిదురించరాదు పద్మావతీ శ్రీనివాసులు పరిణయానంతరం ఆరు నెలలపాటు, ఈనాడు శ్రీనివాసమంగాపురంగా పిలువబడుతున్న అలనాటి అగస్త్యాశ్రమంలో విశ్రమించారని, తరువాతే తిరుమలక్షేత్రాన్ని చేరుకున్నారని మునుపటి ప్రకరణాలలో తెలుసుకున్నాం. సాక్షాత్తు శ్రీనివాసుడే పాటించిన ఆ నియమాన్ని ఉల్లంఘించడానికి మనమెంతటివారం?
వివాహమైన తొలినాళ్లలో భార్యాభర్తలలో ఒకరంటే ఒకరికి వ్యామోహం అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక దృష్టితో, శ్రీనివాసుణ్ణి సేవించు కోవడానికి మాత్రమే పరమపావనమైన తిరుమలకు వెళ్ళాలి కానీ, భోగలాలసత్వంతో తిరుమలపై కాలు మోపరాదు. ఒకవేళ తిరుమల కొండపై వివాహం జరిగితే, వివాహానంతరం స్వామిని దర్శించుకొని వెనువెంటనే కొండ దిగిపోవడం శ్రేయస్కరం. కొండపై నూతన దంపతులతో మూడునిద్రలు చేయిస్తామని మ్రొక్కుకోవడం సమంజసం కాదు.
*తిరుమలక్షేత్రంలో పూలు ధరింపరాదు.*
తిరుమల పుష్పమండపంగా ఖ్యాతినొందింది. తిరుమలేశుడు పుష్పప్రియుడు. శ్రీనివాసునికి పుష్పకైంకర్యం చేయడం ద్వారా తిరుమలనంబి, అనంతాళ్వార్, వెంగమాంబ వంటి ఎందరో భక్తులు శ్రీవారికి అప్తులై జన్మ సార్థకం గావించుకున్నారు. నాటి నుండి నేటివరకూ శ్రీవారు అనునిత్యం పెక్కు పూలమాలలను ధరించి దర్శనమిస్తారు. తిరుమల లోని పుష్పాలన్నీ శ్రీవారి సొంతం. పూలతో కూడిన పూజావ్యర్థాలను సైతం భక్తులకు ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం తిరుమలలో లేదు. పూజానైర్మల్యాలను ఈమధ్య వరకూ సంపంగిప్రాకారంలో ఉండే 'పూలబావి' లో విసర్జించేవారు. ఇప్పుడు మాత్రం జనసంచారం లేని సుదూరమైన అరణ్యప్రాంతంలో ఆ వ్యర్థాలను విసర్జిస్తున్నారు. కొండపైకి పుష్పగుచ్ఛాలను సైతం అనుమతించరు. తిరుమలలో జరిగే వివాహవేడుకలలో కూడా పుష్పాలను వినియోగించరు. అటువంటి తిరుమల క్షేత్రంలో పూవులన్నింటినీ స్వామివారి అలంకారానికి, అర్చనకు, కళ్యాణానికే వినియోగించాలి తప్ప సామాన్యులు పువ్వులు ధరించడం పూర్తిగా నిషిద్ధం. ఈ నియమాన్ని పాటించకపోతే, *'పరిమళదోషానికి'* ఒడిగట్టిన వారమవుతాం. అంతే గాకుండా, కొండపై ఎవరైనా పూలను ధరిస్తే *పుష్పాధిపతి యైన 'పుల్లుడు'* అనే దేవత ఆగ్రహానికి కూడా గురవుతారు. స్వామివారి అభీష్టానికి వ్యతిరేకంగా, వారికే స్వంతమైన పుష్పాలను కొండపై ఎట్టి పరిస్థితులలోనూ అలంకరించు కోవద్దు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
మహాభారతము
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*
*420 వ రోజు*
*సుయోధనుడు మడుగునుండి వెలుపలకు వచ్చుట*
వెలుపలకు వచ్చిన సుయోధనుడి చూసి పాంచాలురు, పాండవులు అపహాస్యంగా చిరునవ్వు నవ్వారు. సుయోధనుడు " అలా నవ్వకండి. నేను మిమ్మంతా ఒక్కొక్కరుగా బలి తీసుకుంటుంటే అప్పుడు తెలుస్తుందిలే " అన్నాడు. సుయోధనుడికి ఇంకా పాండవులు పాంచాలురతో కలిసి ఒక్కుమ్మడిగా తన మీద దాడి చేస్తారని శంకిస్తూ " నేను యుద్ధమున అలసి ఉన్నాను మన ఒప్పందం ప్రకారం ఒక్కొక్కరుగా నాతో యుద్ధానికి రండి " అన్నాడు. ధర్మజుడు నవ్వి " సుయోధనా ! నాడు అభిమన్యుని మీదకు ఒక్కుమ్మడిగా యుద్ధముకు పోయినట్లుగా భావించ వచ్చు కదా ! " అని " భయపడకు నువ్వు చేసిన అకృత్యమును గుర్తు చేసాను కాని ఆడిన మాట తప్పను. యుద్ధ నీతికి వ్యతిరేకముగా ప్రవర్తించను. నీవు వెంటనే సరి చేసుకొని కవచము, శిరస్త్రాణం ధరించి యుద్ధ సన్నద్ధుడివి అయి మాలో ఒకరిని ఎంచుకొని యుద్ధం చెయ్యి. మాలో నీకు నచ్చినవాడిని జయించిన రాశ్యలక్ష్మిని వరించు లేకున్న వీర స్వర్గం అలంకరించు ఇది నా ప్రతిజ్ఞ. నీకు నచ్చిన ఆయుధములు ధరించు నీవు నాకు తమ్ముడివి కనుక నీవు అడిగినవి ఇస్తాను ప్రాణములు తప్ప " అన్నాడు. సుయోధనుడు " ధర్మజా ! నీ సత్య వాక్పరిపాలనా నాకు తెలియనిదా ! నాకు నీ మీద ఎందుకు కోపం ఉంటుంది ! మనం మనం అన్నదమ్ములం కదా ! " అని కవచాదులను ధరించి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. చేతిలో గద ధరించి మేరు పర్వతంలా మెరుస్తూ " ధర్మజా ! సహదేవుడో, నకులుడో, అర్జునుడో, భీముడో లేక నీవో నాతో యుద్ధానికి రండి నా గదకు మిమ్ము ఒక్కొక్కరిగా ఎర వేస్తాను. నాతో గదా యుద్ధం చేయ సాక్షాత్తు ఈశ్వరుడే సాహసించరు మీరెంత " అని డంబంగా అన్నాడు.
*ధర్మజుడి మాటకు కృష్ణుడు ఆందోళనపడుట*
సుయోధనుడి ప్రగల్భములకు కృష్ణుడు ధర్మరాజును చూసి " ధర్మరాజా ! నీవిలా అవివేకముతో మాటాడుట ఏమీ బాగా లేదు. నీవింత బుద్ధిహీనుడవని అనుకో లేదు. ఇదేమైనా శకునితో ఆడిన జూదమా ! ఒక్కరిని గెలవగానే రాజ్యం ఇవ్వడానికి. సుయోధనుడు భీముని తప్ప మీలో ఎవరిని కోరుకున్నా గదా యుద్ధముతో మిమ్ము హతమార్చగలడు. ఆఖరుకు ఇది పందెం యుద్ధం అయింది. ఇందుకేనా ఇంత మారణ హోమం జరిగింది ఇంత మంది రాజులను సైన్యాలను యుద్ధానికి బలి ఇచ్చింది ? ఇలా పందెంలో ఓడే కదా నీవు నీ తమ్ములతో కలిసి అడవులలో ఇడుములు అనుభవించింది " అన్నాడు. కనుక ధర్మరాజా ! ఇందుకు నేను ఒప్పుకోను. ఒక్కొక్కరుగా యుద్ధం చేసే పని అయితే భీమసేనుని కూడా పంపడాబనికి అంగీకరించను. దుర్యోధనుడు గధావిద్యలో నైపుణ్యం గడించాడు. అతడి నైపుణ్యం ముందు భీముని బలం చాలదు. నీ ఇష్టం జాగర్త " అన్నాడు.
*భీముని కృష్ణుడు ప్రశంసించుట*
కృష్ణుడి మాటలు విన్న భీమసేనుడు " అన్నగారి అనుమతి నీ అనుగ్రహం ఉండాలే కాని దుర్యోధనుడే కాదు ఈ మూడు భువనాలలో ఉన్న ఎవరినైనా నేను తృటిలో జయించగలను. ఈ సుయోధనుడు ఒక లెక్కా ! ఈ మాత్రం దానికి అన్నగారిని అంత మాట అనవలెనా ! ఈ రోజు నేను నా గధా ఘాతంతో సుయోధనుడిని చంపి నీకు సంతోషం కలిగిస్తాను " అన్నాడు. కృష్ణుడు భీముని భుజం ప్రేమగా తట్టి " భీమసేనా ! బకాసురుడిని, హిడింబుని, జరాసంధుని, కిమ్మీరుడిని సంహరించిన నీ భుజబలం నాకు తెలియనిదా ! ఏదో మీ మీద ప్రేమతో కలిగిన కలవరంతో అన్నాను కాని వేరేమి లేదు. దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం త్రాగుతుంటే చూస్తూ ఊరుకున్నాడే కాని ఏమి చేయని సుయోధనుడి పరాక్రమం నీ ముందెంత ? నా మాటలు పట్టించుకోకు. నాడు కురుసభలో ద్రౌపది జుట్టు పట్టి ఈడ్చినపుడు నీవు చేసిన ప్రతిన ఒకటి నెరవేర్చుకున్నావు. ఇక రెండవది మిగిలి ఉంది సుయోధనుడి తొడలు విరిచి నీ రెండవ ప్రతిజ్ఞ నేరవేర్చి నీ అన్నను పట్టాభిషిక్తుడిని చేసి మీరందరూ సుఖములు అనుభవించండి. నీవిక నీ పరాక్రమం చూపి నీ గధకు పండుగ చెయ్యి నీ వెనుక నేను ఉన్నాను. ఈ రోజు నీ చేత సుయోధనుడు నిర్జీవుడౌతాడు అన్నాడు. కృష్ణుడి మాటలకు భీముడు పొంగి పోయాడు. కృష్ణుడు " భీమసేనా ! ఒక్క మాట సుయోధనుడు గదా యుద్ధంలో నిష్ణాతుడన్నది మరువ వద్దు. ఎన్నో ఏళ్ళు కఠోర శ్రమతో సాధించిన నైపుణ్యం జాగ్రత్త " అని హెచ్చరించాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
శ్రీమద్భగవద్గీత
శ్రీమద్భగవద్గీత: ఎనిమిదవ అధ్యాయం
అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:
యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే(11)
వేదార్థం తెలిసినవాళ్ళు శాశ్వతమని చెప్పేదీ, కామక్రోధాలను జయించిన యోగులు చేరేదీ, బ్రహ్మచర్యాన్ని పాటించేవాళ్ళు చేరకోరేదీ అయిన పరమపదాన్ని గురించి నీకు క్లుప్తంగా చెబుతాను విను.
ధర్మాత్ములను
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *కృపణాస్సతతం దృష్ట్వా*
*తతః సఞ్జాయతే కృపాl*
*ధర్మనిష్ఠాం యదా వేత్తి*
*తదా శామ్యతి సా కృపాll*
*మహాభారతమ్ - శాన్తి పర్వమ్*
తా𝕝𝕝 *దయాహీనుల్నీ, పీనాసి వాళ్ళనీ చూస్తూ ఉండటం వల్ల మనకి కూడా ఆ పీనాసితనం అలవడుతుంది.*. *అదే మనం ధర్మాత్ములను అర్ధం చేసుకుంటే ఆ దయాహీనత పిసినారితనం నశిస్తాయి.*
✍️🌸💐🌹🙏
పక్షవాతమును
పక్షవాతమును హరించు సిద్ధయోగాలు -
* అక్కలకర్ర , సన్నరాష్ట్రం , శొంఠి మూడింటిని కలిపి పలుచటి కషాయం చేసుకుని ప్రతిరోజు సేవించుచున్న పక్షవాతం హరించును .
* కసివింద చెట్టు రసము వెన్నతో కలిపి మర్దన చేయుచున్న పక్షవాతం హరించును .
* కుసుమ విత్తనాలతో చేసిన తైలం మర్దన చేయుచున్న పక్షవాతం హరించును .
* పక్షవాత రోగులు ప్రతినిత్యం ఖర్జురాలు తినుచున్న చాలా మేలు చేయును .
* పక్షవాతం వచ్చి కాలు , చెయ్యి పడిపోతున్న సమయంలో వెంటనే గిద్దెడు తేనె తాగించిన పక్షవాత ప్రభావం పోయి మనిషి సాధారణ స్థితికి చేరును .
* కటుకరోహిణి నల్లనిది చూర్ణం చేసి 5 గ్రా చొప్పున తీసుకొనుచున్న పక్షవాతం నివృత్తి అగును.
* అంజీరపండు ఎండినది , పెద్ద జీలకర్రతో కలిపి తినుచున్న మేలు జరుగును.
* పొంగించిన ఇంగువ అనగా గుంట గంటె లో ఇంగువ వేసి గంటెని వేడిచేసిన ఇంగువ పొంగును . శుద్ది అగును. ఇలా శుద్ధిచేసిన ఇంగువ 5 గ్రాముల చొప్పున తేనెతో కలిపి తీసుకొనుచున్న పక్షవాతం హరించును .
పక్షవాతపు రోగులు పాటించవలసిన ఆహార నియమాలు -
• తినవలసినవి -
పాత బియ్యపు అన్నం , గోధుమరొట్టె , గోధుమ జావ , మేక మాంసము , పొట్టేలు మాంసం , కంది పప్పు , కంది కట్టు , బీరకాయ , పొట్లకాయ , లేత వంకాయ ముదురు వంకాయ తినరాదు. లేత మునగకాయ , వెల్లుల్లి , ఉల్లిపాయ , కొయ్య తొటకూర , గలిజేరు కూర , మునగ ఆకు కూర , చిర్రి కూర , కసివిందాకు కూర , ద్రాక్షపండు తియ్యనిది , ఖర్జూరం , ఆవు మజ్జిగ , ఆవునెయ్యి , పటికబెల్లం , పాతబెల్లం , తేనె , ఒంటికి మర్దన చేయించుకోవలెను.
• తినకూడనవి -
కొత్తబియ్యపు అన్నం , చద్దిఅన్నం , జొన్నన్నం , మొక్కజొన్న , అలసంద , పెసలు , మినుములు , శనగలు , బచ్చలికూర , చుక్కకూర , పెరుగు , మీగడ , సామలు , పిండివంటలు , అతిగా నూనె , కల్లు , కలి , కోడిమాంసం , కాకరకాయ , మామిడిపండ్లు , మామిడికాయలు , చేపలు , పులికడుగు , ఫ్రిజ్ నీరు , కూల్ డ్రింక్స్ , నూనెవేపుళ్ళు , పాతపచ్చళ్లు , అతిగా కారం , చేదుగల పదార్థాలు , సంభోగం , చన్నీటి స్నానం చేయరాదు , చింతపండు పులుపు , మొదట తినిన ఆహారం జీర్ణం కాకమునుపే మరలా భుజించటం , మలమూత్ర నిరోధం , ఉపవాసం , అతిగా కష్టపడకూడదు , చల్లటిగాలికి ఉండరాదు , మంచు , తడిప్రదేశాలలో ఉండరాదు.
. పైన చెప్పినటువంటి పథ్యములు పాటిస్తూ ఔషధసేవన చేయడం వలన రోగి సమస్య నుంచి తొందరగా బయటకి వస్తాడు. పథ్యం చేయకుండా మీరు ఎంత గొప్ప ఔషధాలు సేవించినను సమస్య తగ్గదు. ఆయుర్వేదం నందు పథ్యం అనేది ఔషధాలు కొరకు కాదు. రోగానికి పథ్యం ఉంటుంది. రోగం తగ్గుటకు ఔషధాలు సేవిస్తూ మరొకవైపు రోగాన్ని పెంచే ఆహారం తీసుకోవడం వలన ఔషధం పనిచేయకపోగా రోగం మరింత పెరుగును .
. మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
గమనిక -
. నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ క్రింద ఇచ్చిన ఫోన్ నెంబర్ నందు సంప్రదించగలరు.
కాళహస్తి వేంకటేశ్వరరావు .
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
. 9885030034
రథయాత్ర
శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 జగన్నాథుడు అనగానే పురీ క్షేత్రం గుర్తొస్తుంది. చాలా గొప్ప పుణ్య క్షేత్రం. అక్కడ జరిగే రథయాత్ర ఇంకా గొప్పది. జగన్నాథుడు ఎలా అవతరించాడో, ఆ క్షేత్రం విశేషాలేమిటో, విగ్రహాలు అలా అసంపూర్ణంగా ఎందుకు కనిపిస్తాయో వంటి ఎన్నో విశేషాలను కళ్లకు కట్టినట్లు వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
🙏శ్రీ గురుభ్యో నమః🙏 ప్రతి వ్యక్తిని గురువు అనకూడదు. అది ఎంతో పవిత్రం. ఈరోజు జనాలకు అపరిచిత వ్యక్తిని పరిహాసంగా గురూ అనో గురువుగారు అనో అంటున్నారు. సినిమాలో అయితే గురూ! గురూ! అంటూ పిచ్చి పాటలు వ్రాస్తున్నారు. గురు శబ్దాన్ని అపవిత్రం చేస్తున్నట్టు తెలుసుకోలేకపోతున్నారు. గురువు గురించి తెలియాలని ఈ వ్యాసం వ్రాస్తున్నాను భారతీయ సంప్రదాయంలో గురువు ఉపాధ్యాయుని కంటే ఎక్కువ. సాంప్రదాయకంగా, గురువు శిష్యుడికి లేదా విద్యార్థికి గౌరవప్రదమైన వ్యక్తి. గురువు తప్ప మరొక గతి లేదు అనేది అర్థమై, ఆచరించ గలిగితే అసాధ్యం లేదు... గురువు నీ చేతిని పట్టుకోవాలని అంటే ఆ అర్హతను నువ్వు సాధించుకోవాలి గురువు ఎప్పుడూ పరమ ప్రేమ స్వరూపమే. అందులో సందేహం లేదు. ఎల్లప్పుడూ శిష్యుని అభ్యున్నతిని కోరుతాడు గురువు. అందులోనూ సందేహం లేదు... గురు గీత (17వ శ్లోకం)లో గురువును “చీకటిని పారద్రోలేవాడు” (గు, “చీకటి” మరియు రు, “తొలగించేవాడు”) అని సముచితంగా వర్ణించబడింది. నిజమైన, దివ్య జ్ఞానసంపన్నుడైన గురువు, తాను స్వీయ-నియంత్రణ సాధించడం వలన, సర్వవ్యాపకమైన పరమాత్మతో ఏకత్వము అనుభూతము చెందినవాడు. అటువంటి గురువు సాధకుని అంతర్ముఖ ప్రయాణంలో అతని లేదా ఆమెను పరిపూర్ణత వైపు నడిపించడానికి ప్రత్యేకమైన అర్హత కలవాడు అవుతాడు. “గ్రుడ్డివాడు మరొక గుడ్డివాడిని నడిపించలేడు,” అన్నారు పరమహంసగారు. “భగవంతుణ్ణి తెలుసుకున్న గురువు మాత్రమే, పరమాత్ముని గురించి ఇతరులకు సరిగా బోధించగలడు. మన యొక్క దివ్యత్వాన్ని తిరిగి పొందడానికి అటువంటి ఉపదేశకుడు లేదా గురువు ఉండాలి. నిజమైన గురువును విశ్వాసముగా అనుసరించేవాడు అతనిలా అవుతాడు, ఎందుకంటే శిష్యుడిని తన స్వీయ సిద్ధి స్థాయికి పెంచడానికి గురువు సహాయం చేస్తాడు.” మోక్ష మార్గాన్ని జగత్తుకు అందించటం చేత శంకరభగవత్సాదులవారు అనగా ఆది శంకరాచార్యులవారు జగత్ గురువు అని చిలకమర్తి తెలిపారు. కృష్ణం వందే జగద్గురుమ్ అని కృష్ణుడు భగవద్గీత బోధించడం ద్వారా శ్రీకృష్ణుడు కూడా జగద్గురువు అయ్యాడు అని చిలకమర్తి తెలిపారు. సనాతన ధర్మం ప్రకారం ప్రతీ మానవుడికి తన జీవితములో అష్టవిధ గురువులు (8 రకాల గురువులు) ఉంటారు అష్టవిధ గురువులలో కారణ గురువులను పొందడం, కారణ గురువును పట్టుకోవడం మరియు ఆయన ద్వారా విద్యను పొంది ప్రకృతి మాయా అనేటువంటి వాటిని తొలగించుకుని ముక్తి మార్గంలోకి ప్రవేశించి మోక్షమును పొందువాడు ధన్యుడు. అష్టవిధ గురువులు ఈవిధముగా ఉన్నారు. 1. బోధక గురువు : వేదాంత శాస్త్రముల యందలి శబ్దార్థములను మాత్రము చక్కగ బోధించు గురువు బోధక గురువు. 2. వేదక గురువు : వేదాంత శాస్త్రముల యందలి శబ్ధార్థములు చక్కగ బోధించు తత్త్వమును దర్శింపజేయువాడు వేదక గురువు. 3. నిషిద్ధ గురువు : వశ్యము, ఆకర్షణము మొదలగు మంత్రములచేత ఇహలోకమందును పరలోకమందును సుఖదుఃఖముల నిచ్చువాడు నిషిద్ధ గురువు.(గురువుగా స్వీకరించకూడదు ) 4. కామ్యక గురువు : పుణ్యకర్మములను చేయుమని చెప్పి పుణ్యకర్మలు చేయించి తద్వారా ఇహలోక పరలోక సుఖములనిచ్చువాడు కామ్యక గురువు. 5. సూచక గురువు : వేదాంత శాస్త్రముల అంతరార్థమును తెలుపుచు జ్ఞానమును కలుగజేసి తద్వారా శమ, దమ, ఉపరతి, తితీక్ష్మ శ్రద్ధ సమాధానము అను షడ్గుణములను కలుగజేసి ఆత్మావలోకన చేయుటకు సూచించువాడు సూచక గురువు. 6. వాచక గురువు : జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనోబుద్ధి గోచరా చిత్తాహంకారంబులనెడి అంతరింద్రియముల యొక్కయు విషయములగు శబ్ద స్వర్ణ రూప రస గంధంబులు, వచన దాన గమనాగమన విసర్జన ఆనందములు, సంకల్ప వికల్ప నిశ్చయ చంచల కర్తృత్వములయందు వైరాగ్యము గలిగించి శిష్యుని అంతఃకరణ నిర్విషయమగునట్లు చేయు మహానుభావుడు వాచక గురువు. 7. కారణ గురువు : అహంబ్రహ్మాస్మి యను మొదలుగా గల వాక్యములను బోధించి జీవేశ్వరైక్యమును తేటతెల్లముగ తెలిపి జీవన్ముక్తి యనుభవమును కలుగజేసిన పరమపురుషుడు కారణ గురువు. 8. విహిత గురువు : శిష్యునికి గల సకల సంశయములను నివృత్తి చేసి ఆ సచ్చిష్యుని యేమాత్రము సందేహము లేనివానిగా జేసి తద్వారా విదేహమూర్తి కైవల్యము నిచ్చునట్టివాడు విహిత గురువు. వానినే సాక్షాత్తు పరమశివుడనియు చెప్పనగును. అట్టివాని వర్ణించుట కాదిశేషునికైన నలవిగాదు. కాబట్టి బ్రహ్మవిద్యా ప్రవీణులయొద్ద తేరి రహస్యములను తెలిసికొనవలెను. కుమ్మరవాడు ఎంతటి తెలివిగలవాడయినను సాధనములైన దండము, చక్రము, మృత్తికయు లేక కుండలు చేయలేనట్లు ఎంత సూక్ష్మబుద్ధి గలవానికిని సాధన చతుష్టయ సంపత్తి లేక బ్రహ్మజ్ఞానము కలుగనేరదు అయితే గురువు ప్రసరించే ప్రేమ శక్తిని అందుకునే స్థాయి శిష్యునికి వుండాలి. అదెలా వస్తుంది? గురువు మాత్రమే తనను ఉద్ధరించ గలడు అనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి వుండటమే ఆ స్థాయిని అందిస్తుంది. కానీ మనం ఏమి చేస్తున్నాం???? ఏదో ఒక సమస్య పరిష్కారానికి గురువును ఆశ్రయంచి ఉంటున్నాం. ఆ సమస్య తీరితే ఆ గురువు గొప్పవాడు. తీరకపోతే మరో గురువు... ఇలా కొట్టుకు పోతున్నాం. గురువు నీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఆ శక్తి గురువులో వుందని నువ్వు మనసా, వాచా, కర్మణా నమ్మాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది. సేవాభావం వల్లనూ మరియూ సర్వస్వ శరణాగతి వల్లనూ గురువు ప్రసన్నుడు అవుతాడు... కనుక నువ్వు ఎప్పుడు గురువే సర్వస్వం అని నమ్ము అప్పుడే నీ గురువు నీ చేతిని పట్టుకుని నడిపిస్తాడు. నమ్మకం అచంచలంగా వుందా నీలో? ఆ ప్రశ్నకి ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి... గురువు మార్గాన్ని చూపిస్తాడు…ఆ మార్గంలో నడవటం నీ పని. గురువు జ్ఞానాన్ని అందిస్తాడు…ఆ జ్ఞానాన్ని జీవితంలో భాగం చేసుకోవటం నీ పని. గురువు ప్రేమని ప్రసరిస్తాడు…ఆ ప్రేమని నీలో నింపుకోవడం నీ పని. గురువు దగ్గరకి వెళ్ళేటప్పుడు నీ బుద్ధిని, నీ తెలివితేటలను పక్కనపెట్టి వెళ్ళాలి. గురువుతో వాదన పనికిరాదు. గురువు చెప్పే మాటలను చెవులతో కాదు…మనసుతో వినాలి. గురువును నమ్మినప్పుడు కళ్ళు మూసుకొని, ఇతర చింతనలు లేకుండా నమ్మాలి... గురువుకు నిన్ను నువ్వు సమర్పించుకోవడం అంటే నీ హృదయాన్ని పూర్తిగా తెరచి సమర్పించాలి. గురువు ఉపదేశాన్ని వినేటప్పుడు నోరు మూసుకొని వినాలి. గురువును ఏదైనా కోరేటప్పుడు కొంగు చాచి అడగాలి. ఇవన్నీ చేయగలిగితే గురువు నీవాడు అవుతాడు. గురుకృప ఏ వ్యక్తినైనా కూడా గురు స్థానంలో నిలుపుతుంది. అయితే ఆ వ్యక్తి తనకు గురుత్వ స్థాయిని కోరుకొని చేశాడా? కానే కాదు. తన ఆత్మోన్నతి కోసమే చేస్తాడు. అది సఫలం అయినప్పుడు గురువే ఆ వ్యక్తిని తన పరికరంగా ఆయుధంగా లోకానికి సమర్పించి .. ఆ వ్యక్తిని గురువుగా నిలుపుతాడు. తన పరికరంగా , తన బాధ్యతలను ఆ వ్యక్తి ద్వారా నెరవేరుస్తారు. నువ్వు లౌకికంగా అత్యున్నత విద్యావంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు అనుక్షణమూ నీకు అక్షరాభ్యాసమే నువ్వు సమాజంలో గురువు కన్నా ఉన్నత స్థాయిలో వుండవచ్చు. కానీ గురువు ముందు నువ్వు కేవలం ఒక సేవకుడివే... నువ్వు గురువు కన్నా అత్యధిక ధనవంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు నిరుపేదవే. నువ్వు గురువు కన్నా అధిక లౌకిక జ్ఞానం కలవాడివి కావచ్చు. కానీ గురువు ముందు పరమ అజ్ఞానివే. నీ లౌకిక విద్య గురువు ముందు నిరక్షరాస్యత గా మిగులుతుంది. సమాజంలో నీ స్థాయి గురువు ముందు నిష్ప్రయోజనం గా మిగులుతుంది. నీ ధన సంపద అంతా గురు చరణ ధూళిని కూడా తాకలేదు. నీ లౌకిక జ్ఞానం సమస్తం గురువు అలౌకిక జ్ఞానం ముందు గుడ్డి గవ్వకు కూడా పనికిరాదు ఈ విషయాన్ని మనస్సులో స్థిరంగా నిలుపుకో గలిగితే గురువు నీ వాడు అవుతాడు.... సమర్పణ మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
ప్రతి వ్యక్తిని గురువు అనకూడదు. అది ఎంతో పవిత్రం. ఈరోజు జనాలకు అపరిచిత వ్యక్తిని పరిహాసంగా గురూ అనో గురువుగారు అనో అంటున్నారు. సినిమాలో అయితే గురూ! గురూ! అంటూ పిచ్చి పాటలు వ్రాస్తున్నారు. గురు శబ్దాన్ని అపవిత్రం చేస్తున్నట్టు తెలుసుకోలేకపోతున్నారు. గురువు గురించి తెలియాలని ఈ వ్యాసం వ్రాస్తున్నాను
భారతీయ సంప్రదాయంలో గురువు ఉపాధ్యాయుని కంటే ఎక్కువ. సాంప్రదాయకంగా, గురువు శిష్యుడికి లేదా విద్యార్థికి గౌరవప్రదమైన వ్యక్తి.
గురువు తప్ప మరొక గతి లేదు అనేది అర్థమై, ఆచరించ గలిగితే అసాధ్యం లేదు...
గురువు నీ చేతిని పట్టుకోవాలని అంటే ఆ అర్హతను నువ్వు సాధించుకోవాలి
గురువు ఎప్పుడూ పరమ ప్రేమ స్వరూపమే.
అందులో సందేహం లేదు. ఎల్లప్పుడూ శిష్యుని అభ్యున్నతిని కోరుతాడు గురువు. అందులోనూ సందేహం లేదు...
గురు గీత (17వ శ్లోకం)లో గురువును “చీకటిని పారద్రోలేవాడు” (గు, “చీకటి” మరియు రు, “తొలగించేవాడు”) అని సముచితంగా వర్ణించబడింది. నిజమైన, దివ్య జ్ఞానసంపన్నుడైన గురువు, తాను స్వీయ-నియంత్రణ సాధించడం వలన, సర్వవ్యాపకమైన పరమాత్మతో ఏకత్వము అనుభూతము చెందినవాడు. అటువంటి గురువు సాధకుని అంతర్ముఖ ప్రయాణంలో అతని లేదా ఆమెను పరిపూర్ణత వైపు నడిపించడానికి ప్రత్యేకమైన అర్హత కలవాడు అవుతాడు.
“గ్రుడ్డివాడు మరొక గుడ్డివాడిని నడిపించలేడు,” అన్నారు పరమహంసగారు. “భగవంతుణ్ణి తెలుసుకున్న గురువు మాత్రమే, పరమాత్ముని గురించి ఇతరులకు సరిగా బోధించగలడు. మన యొక్క దివ్యత్వాన్ని తిరిగి పొందడానికి అటువంటి ఉపదేశకుడు లేదా గురువు ఉండాలి. నిజమైన గురువును విశ్వాసముగా అనుసరించేవాడు అతనిలా అవుతాడు, ఎందుకంటే శిష్యుడిని తన స్వీయ సిద్ధి స్థాయికి పెంచడానికి గురువు సహాయం చేస్తాడు.”
మోక్ష మార్గాన్ని జగత్తుకు అందించటం చేత శంకరభగవత్సాదులవారు అనగా ఆది శంకరాచార్యులవారు జగత్ గురువు అని చిలకమర్తి తెలిపారు. కృష్ణం వందే జగద్గురుమ్ అని కృష్ణుడు భగవద్గీత బోధించడం ద్వారా శ్రీకృష్ణుడు కూడా జగద్గురువు అయ్యాడు అని చిలకమర్తి తెలిపారు. సనాతన ధర్మం ప్రకారం ప్రతీ మానవుడికి తన జీవితములో అష్టవిధ గురువులు (8 రకాల గురువులు) ఉంటారు
అష్టవిధ గురువులలో కారణ గురువులను పొందడం, కారణ గురువును పట్టుకోవడం మరియు ఆయన ద్వారా విద్యను పొంది ప్రకృతి మాయా అనేటువంటి వాటిని తొలగించుకుని ముక్తి మార్గంలోకి ప్రవేశించి మోక్షమును పొందువాడు ధన్యుడు. అష్టవిధ గురువులు ఈవిధముగా ఉన్నారు.
1. బోధక గురువు : వేదాంత శాస్త్రముల యందలి శబ్దార్థములను మాత్రము చక్కగ బోధించు గురువు బోధక గురువు.
2. వేదక గురువు : వేదాంత శాస్త్రముల యందలి శబ్ధార్థములు చక్కగ బోధించు తత్త్వమును దర్శింపజేయువాడు వేదక గురువు.
3. నిషిద్ధ గురువు : వశ్యము, ఆకర్షణము మొదలగు మంత్రములచేత ఇహలోకమందును పరలోకమందును సుఖదుఃఖముల నిచ్చువాడు నిషిద్ధ గురువు.(గురువుగా స్వీకరించకూడదు )
4. కామ్యక గురువు : పుణ్యకర్మములను చేయుమని చెప్పి పుణ్యకర్మలు చేయించి తద్వారా ఇహలోక పరలోక సుఖములనిచ్చువాడు కామ్యక గురువు.
5. సూచక గురువు : వేదాంత శాస్త్రముల అంతరార్థమును తెలుపుచు జ్ఞానమును కలుగజేసి తద్వారా శమ, దమ, ఉపరతి, తితీక్ష్మ శ్రద్ధ సమాధానము అను షడ్గుణములను కలుగజేసి ఆత్మావలోకన చేయుటకు సూచించువాడు సూచక గురువు.
6. వాచక గురువు : జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనోబుద్ధి గోచరా చిత్తాహంకారంబులనెడి అంతరింద్రియముల యొక్కయు విషయములగు శబ్ద స్వర్ణ రూప రస గంధంబులు, వచన దాన గమనాగమన విసర్జన ఆనందములు, సంకల్ప వికల్ప నిశ్చయ చంచల కర్తృత్వములయందు వైరాగ్యము గలిగించి శిష్యుని అంతఃకరణ నిర్విషయమగునట్లు చేయు మహానుభావుడు వాచక గురువు.
7. కారణ గురువు : అహంబ్రహ్మాస్మి యను మొదలుగా గల వాక్యములను బోధించి జీవేశ్వరైక్యమును తేటతెల్లముగ తెలిపి జీవన్ముక్తి యనుభవమును కలుగజేసిన పరమపురుషుడు కారణ గురువు.
8. విహిత గురువు : శిష్యునికి గల సకల సంశయములను నివృత్తి చేసి ఆ సచ్చిష్యుని యేమాత్రము సందేహము లేనివానిగా జేసి తద్వారా విదేహమూర్తి కైవల్యము నిచ్చునట్టివాడు విహిత గురువు. వానినే సాక్షాత్తు పరమశివుడనియు చెప్పనగును. అట్టివాని వర్ణించుట కాదిశేషునికైన నలవిగాదు. కాబట్టి బ్రహ్మవిద్యా ప్రవీణులయొద్ద తేరి రహస్యములను తెలిసికొనవలెను. కుమ్మరవాడు ఎంతటి తెలివిగలవాడయినను సాధనములైన దండము, చక్రము, మృత్తికయు లేక కుండలు చేయలేనట్లు ఎంత సూక్ష్మబుద్ధి గలవానికిని సాధన చతుష్టయ సంపత్తి లేక బ్రహ్మజ్ఞానము కలుగనేరదు
అయితే గురువు ప్రసరించే ప్రేమ శక్తిని అందుకునే స్థాయి శిష్యునికి వుండాలి. అదెలా వస్తుంది?
గురువు మాత్రమే తనను ఉద్ధరించ గలడు అనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి వుండటమే ఆ స్థాయిని అందిస్తుంది. కానీ మనం ఏమి చేస్తున్నాం????
ఏదో ఒక సమస్య పరిష్కారానికి గురువును ఆశ్రయంచి ఉంటున్నాం. ఆ సమస్య తీరితే ఆ గురువు గొప్పవాడు. తీరకపోతే మరో గురువు...
ఇలా కొట్టుకు పోతున్నాం.
గురువు నీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఆ శక్తి గురువులో వుందని నువ్వు మనసా, వాచా, కర్మణా నమ్మాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది.
సేవాభావం వల్లనూ మరియూ సర్వస్వ శరణాగతి వల్లనూ గురువు ప్రసన్నుడు అవుతాడు...
కనుక నువ్వు ఎప్పుడు గురువే సర్వస్వం అని నమ్ము అప్పుడే నీ గురువు నీ చేతిని పట్టుకుని నడిపిస్తాడు.
నమ్మకం అచంచలంగా వుందా నీలో? ఆ ప్రశ్నకి ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి...
గురువు మార్గాన్ని చూపిస్తాడు…ఆ మార్గంలో నడవటం నీ పని. గురువు జ్ఞానాన్ని అందిస్తాడు…ఆ జ్ఞానాన్ని జీవితంలో భాగం చేసుకోవటం నీ పని. గురువు ప్రేమని ప్రసరిస్తాడు…ఆ ప్రేమని నీలో నింపుకోవడం నీ పని.
గురువు దగ్గరకి వెళ్ళేటప్పుడు నీ బుద్ధిని, నీ తెలివితేటలను పక్కనపెట్టి వెళ్ళాలి. గురువుతో వాదన పనికిరాదు.
గురువు చెప్పే మాటలను చెవులతో కాదు…మనసుతో వినాలి. గురువును నమ్మినప్పుడు కళ్ళు మూసుకొని, ఇతర చింతనలు లేకుండా నమ్మాలి...
గురువుకు నిన్ను నువ్వు సమర్పించుకోవడం అంటే నీ హృదయాన్ని పూర్తిగా తెరచి సమర్పించాలి. గురువు ఉపదేశాన్ని వినేటప్పుడు నోరు మూసుకొని వినాలి. గురువును ఏదైనా కోరేటప్పుడు కొంగు చాచి అడగాలి.
ఇవన్నీ చేయగలిగితే గురువు నీవాడు అవుతాడు.
గురుకృప ఏ వ్యక్తినైనా కూడా గురు స్థానంలో నిలుపుతుంది. అయితే ఆ వ్యక్తి తనకు గురుత్వ స్థాయిని కోరుకొని చేశాడా? కానే కాదు. తన ఆత్మోన్నతి కోసమే చేస్తాడు. అది సఫలం అయినప్పుడు గురువే ఆ వ్యక్తిని తన పరికరంగా ఆయుధంగా లోకానికి సమర్పించి ..
ఆ వ్యక్తిని గురువుగా నిలుపుతాడు. తన పరికరంగా , తన బాధ్యతలను ఆ వ్యక్తి ద్వారా నెరవేరుస్తారు.
నువ్వు లౌకికంగా అత్యున్నత విద్యావంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు అనుక్షణమూ నీకు అక్షరాభ్యాసమే
నువ్వు సమాజంలో గురువు కన్నా ఉన్నత స్థాయిలో వుండవచ్చు. కానీ గురువు ముందు నువ్వు కేవలం ఒక సేవకుడివే...
నువ్వు గురువు కన్నా అత్యధిక ధనవంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు నిరుపేదవే. నువ్వు గురువు కన్నా అధిక లౌకిక జ్ఞానం కలవాడివి కావచ్చు. కానీ గురువు ముందు పరమ అజ్ఞానివే.
నీ లౌకిక విద్య గురువు ముందు నిరక్షరాస్యత గా మిగులుతుంది. సమాజంలో నీ స్థాయి గురువు ముందు నిష్ప్రయోజనం గా మిగులుతుంది.
నీ ధన సంపద అంతా గురు చరణ ధూళిని కూడా తాకలేదు. నీ లౌకిక జ్ఞానం సమస్తం గురువు అలౌకిక జ్ఞానం ముందు గుడ్డి గవ్వకు కూడా పనికిరాదు
ఈ విషయాన్ని మనస్సులో స్థిరంగా నిలుపుకో గలిగితే గురువు నీ వాడు అవుతాడు....
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
త్వమేవ శరణం...*
*త్వమేవ శరణం...*
విశ్లేషణ :
- శ్రీ తాడేపల్లి పతంజలి గారు
*సుభద్రా బలరాములతో కూడిన పురి జగన్నాథుని వేంకటేశునిగా శరణు కోరుతూ అన్నమయ్య రచించిన కీర్తన ఇది.* 🙏🏻
నువ్వే శరణము. నువ్వే శరణము. పద్మము నాభిలో కలవాడా! ఓ జగన్నాథ స్వామీ!
1. వసుదేవుని కుమారుడా! కృష్ణుడా! వామనుడా! నరసింహ స్వామీ! లక్ష్మీదేవికి ప్రభువా! పద్మములవంటి కన్నులు కలవాడా! బ్రాహ్మణులకు ప్రభువా! పురుషోత్తముడా! పచ్చని వస్త్రములు ధరించినవాడా! ఓ జగన్నాథ స్వామీ!
2. బలరాముని తమ్ముడా! పరమాత్మా! పాలసముద్రంలో విహరించేవాడా! ఏనుగుకు వరము ఇచ్చినవాడా! సులభుడా! సుభద్రాదేవికి ప్రసన్నుడా! దేవా నాయకుడా! కలిదోషములైన పాపములను హరించువాడా! ఓ విష్ణుమూర్తీ!
3. మఱ్ఱిఆకునందు శయనించువాడా! లోకములను పాలించువాడా! శరీరాలను కుండలను నిర్మించువాడా! ( జంతుఘట కార కరణ ) శృంగార రసానికి అధిపతీ! మిక్కిలి బలమైన వాడా! నిత్య వైభవములతో ప్రకాశించేవాడా! పూజ్యమైన, శుభమైన వేంకట పర్వతముపై నివసించువాడా!🙏🏻
*విశేషాలు :*
*పురి జగన్నాథుడు*
ఈ క్షేత్రానికి సంబంధించిన కథను పురాణనామచంద్రిక లో యెనమండ్రం వెంకటరామయ్య ఇలా చెప్పారు. “ఇది పురుషోత్తమ (విష్ణు) క్షేత్రము. కృష్ణుని నిర్యాణమునకు పిమ్మట ఆయన దేహమును దహనము చేయుచు ఉండగా సముద్రము పొంగి ద్వారకా పట్టణమును ముంచెను. అప్పుడు ఆ దేహము సంపూర్ణదగ్ధము కాక సముద్రమునందు కొట్టుకొనిపోవుచు ఉండగా, దానిని కొందరు భక్తులు దారువునందు సంపుటముచేసి ఇచట స్థాపించిరి."
ఇంకొక రకమైన కథ ప్రజలలో ప్రచారంలో ఉంది. అది ఇది. - పురి లో నీలమాధవుని (= విష్ణువు) మందిరం నిర్మించాలని ఇంద్రద్యుమ్నుడనే రాజు అనుకొన్నాడు. ఎన్నో అడ్డంకులు వచ్చాయి. తన సంకల్పం నెరవేరాలన్న పట్టుదలతో సముద్రపు తీరములో ప్రాయోపవేశము (= పస్తులతో ప్రాణమును విడిచిపెట్టడమనే వ్రతము) చేసాడు. అతని దీక్షకు సంతసించి నీలమాధవుడు అశ్వమేధ యాగం చేయమని సందేశము ఇచ్చాడు. ఆ యాగపు పూర్ణాహుతి వేళ సముద్రం నుంచి ఒడ్డుకు ఒక దారువు (కొయ్య దుంగ) చేరుతుందని చెప్పాడు. ఆ దారువుతో విగ్రహాన్ని చేయమని చెబుతాడు. అలా ఏర్పడిందే జగన్నాథుని కొయ్య బొమ్మ.
జగన్నాథుడు వెలిసిన ప్రదేశం కాబట్టి మొదట ఇది జగన్నాథపురిగా పేరు వచ్చింది. క్రమంగా పూరీ జగన్నాథమయింది.
ప్రతి సంవత్సరము ఒక కొత్త రథం జగన్నాథునికి నిర్మిస్తారు. 'వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాలు' వస్తున్నాయి. అంటూ శ్రీ శ్రీ ఉన్నతమైన జగన్నాథుని రథాన్ని, రథ చక్రాలను మనస్సుల్లో గిరగిరా తిప్పాడు. పురి జగన్నాథుని రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియనాడు జరుగుతుంది.
పురి జగన్నాథస్వామి, సుభద్ర, బలభద్రుల మూలమూర్తులకు రథయాత్ర నిర్వహించిన తరువాత మహాప్రసాదాన్ని ఒకే పళ్లెంలో అందరు భక్తులకు జాతి, కుల ప్రస్తావన లేకుండా ఒకే పంక్తిలో కూర్చోబెట్టి పెడతారు. ఇలా అందరూ ఒక చోట చేరి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ క్షేత్రంలో అన్నంచేతికి తగిలితే అంటు దోషము లేదట. కాబట్టి 'సర్వం జగన్నాథం' అని సామెత వచ్చిందట.
*జంతుఘట కార కరణ (= శరీరాలను కుండలను నిర్మించువాడా!)*
జగన్నాథుని సంబోధిస్తూ అన్నమయ్య వ్రాసిన ఈ కీర్తనలో కొన్ని మాములు పదాలున్నా జంతుఘట కార కరణ వంటి విలక్షణ సంబోధనలు కూడా ఉన్నాయి. భగవంతుడు ఈ శరీరాలను కుండలను నిర్మిస్తున్నాడు.
జీవితం అనేది ఒక నీటికుండ. చివరలో చేసే సంస్కారంలో చేసేవాడి భుజం మీద నీటి కుండ పెడతారు. మొదటి ప్రదక్షిణలో ఒక రంధ్రం నుంచి బాల్యమనే నీరు కారిపోతుంది. రెండవ ప్రదక్షిణలో కుండకు చేసే రంధ్రంలో కారిపొయే నీరు యవ్వనానికి సంకేతము. మూడవ ప్రదక్షిణలో కారిపొయే నీరు ముసలితనానికి గుర్తు. కుండను నేలకు కొట్టి వెనక్కు చూడకుండా వెళ్లమంటారు. ముక్కలైన కుండ అన్ని దశలను దాటి చనిపోయిన వాడికి గుర్తు.
వెనక్కి చూడకుండా - అంటే చనిపోయిన వాడి సంగతి ఆలోచించకుండా- నీ దోవన నువ్వు వెళ్లిపో అని సంబంధీకులకు ఒక ఉపదేశము. ఎవడి బతుకు వాడిదే. ఎవడి చావు వాడిదే. ఎవడి ఉద్ధరణ వాడిదే.
*ఘటము జలములందు గగనంబు కనఁబడు*
*ఘటము జలము లేమి గగనమేది*
*ఘటములోన జ్యోతిఁ గ్రమమునఁ దెలియుఁడీ*
*విశ్వదాభిరామ వినర వేమ!*
అని వేమన్న అన్నమయ్య ఘటకారకరణ పద ప్రయోగములోని ఆంతర్యాన్ని వివరించాడు. ఈ శరీరమనే కుండలోని జ్యోతిని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుండాలి.
సేకరణ::::::
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం - ద్వితీయ - పునర్వసు - భృగు వాసరే* (27.06.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
