26, ఆగస్టు 2025, మంగళవారం

ఫైబర్ ఫుడ్!*

 ;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍇M.A.35.

*మన ఆరోగ్యం…!



                 *ఫైబర్ ఫుడ్!*

                ➖➖➖✍️



*#ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్ ఫుడ్"!*

```

*మన శరీరం ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం ఎంతో అవసరం.


*సమతుల్యమైన ఆహారం అంటే ఏమిటి? 


*శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ కలగలిపి ఉన్న ఆహారాన్ని తీసుకోవడమే సమతుల్య ఆహారం. 


*విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్, ఫైబర్ వంటివి శరీరానికి కావలసినంత తీసుకున్నట్టు అయితే ఆరోగ్యంగా ఉంటారు. 


*అయితే ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఫైబర్ రిచ్ ఫుడ్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం...


*కొన్ని పండ్లు తొక్క తీసి తినాల్సిందే కానీ, కొన్నింటిని నేరుగా తినవచ్చు. ఐనా చాలామంది వాటిని తొక్క తీసే తింటారు.


*అలాగే పప్పులను పొట్టు తీయకుండా వాడితే చాలా ప్రయోజానాలు ఉంటాయి.


*పండ్లు, కూరగాయల తొక్కలో, పొట్టు తీయని పప్పులో అత్యధిక శాతం ఫైబర్లుంటాయి. ఈ ఫైబర్లు శరీరానికి ఎంతో ఉపయోగాపడతాయి. దీనివల్ల మలబద్దకం, తత్సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు.


*ముఖ్యంగా యాపిల్ పండు తొక్కలో సోల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ ను, బ్లడ్ షుగర్ ను తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. యాంటీ కేన్సర్ ప్రభావం సైతం దీనిలో ఉంది. పైన చర్మం తీసిన దానికన్నా పూర్తిగా తొక్కతో సహా తినడం వల్ల కేన్సర్ సెల్స్ పై ప్రభావం చూపగలదని అనేక పరిశోధనల ద్వారా తేలింది.


*రెండు లీటర్ల ఆరెంజ్ జ్యూస్ లో ఉండే విటమిన్ ‘సి’ ఒక ఎర్రని యాపిల్ పండు తొక్కలో ఉంటుందని పరిశోధనల ద్వారా వెల్లడి అయ్యింది.


*అదేవిధంగా బంగాళాదుంపల తొక్కలో, మినపపొట్టులో అత్యధిక శాతం ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ - బి పుష్కలంగా లభిస్తాయి. యాంటి ఆక్సిడెంట్లు సైతం సమృద్దిగా ఇందులో ఉంటాయి. 


చేదుగా ఉండే సిట్రస్ పండ్ల తొక్కలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఊపిరితిత్తుల సమస్యలకు ఇవి బాగా పనిచేస్తాయి.


*నిమ్మ, నారింజ కాయలు తొక్కలను నేరుగా తినడం సాధ్యం కాదు. కాబట్టి తొక్కకు అంటుకుని లోపలి వైపు ఉండే పల్చని పొరను వంటకాలలో జోడించినా లేక టీ నీళ్ళలో తొక్కలను వేడి చేసి కాచి అవి తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మంగళవారం🍁* *🌹26 ఆగస్టు 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁మంగళవారం🍁*

   *🌹26 ఆగస్టు 2025🌹*  

     *దృగ్గణిత పంచాంగం* 

                  

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - శుక్లపక్షం*

*తిథి  : తదియ* మ 01.54 వరకు ఉపరి *చవితి*

*వారం    : మంగళవారం* ( భౌమవాసరే )

*నక్షత్రం   : హస్త* పూర్తిగా రోజంతా రాత్రితో సహా

*యోగం : సాధ్య* మ 12.09 వరకు ఉపరి *శుభ*

*కరణం  : గరజి* మ 01.54 *వణజి* రా 02.46 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:* 

 *మ 12.00 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 11.30 - 01.15*

అభిజిత్ కాలం  : *ప 11.44 - 12.34*

*వర్జ్యం      : మ 01.01 - 02.46*

*దుర్ముహూర్తం  : ఉ 08.24 - 09.14 రా 11.00 - 11.46*

*రాహు కాలం   : మ 03.17 - 04.51*

గుళికకాళం       : *మ 12.09 - 01.43*

యమగండం     : *ఉ 09.01 - 10.35*

సూర్యరాశి : *సింహం*             

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 06.01* 

సూర్యాస్తమయం :*సా 06.34*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.53 - 08.24*

సంగవ కాలం         :     *08.24 - 10.54*

మధ్యాహ్న కాలం    :     *10.54 - 01.25*

అపరాహ్న కాలం    : *మ 01.25 - 03.55*


*ఆబ్ధికం తిధి         : తిథి శూన్యం*

సాయంకాలం        :*సా 03.55 - 06.25*

ప్రదోష కాలం         :  *సా 06.25 - 08.43*

రాత్రి కాలం           :*రా 08.43 - 11.46*

నిశీధి కాలం          :*రా 11.46 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.07*

******************************

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🍁శ్రీఆంజనేయ స్తుతి🍁*


*నమో నిఖిలారక్షాకరం*

*రుద్రా రూపం*

*నమో మారుతిమ్* 

*రామ దూతం నమామి*


             🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>        


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

రమణ చెప్పిన బాపు కథ!

 💥రమణ చెప్పిన బాపు కథ!


బాపుగురించి చెప్పాలంటే రమణ గురించి, రమణ గురించి చెప్పాలంటే బాపూ గురించి చెప్పక తప్పదు. వారి స్నేహబంధం అంత దృఢమైనది.


ఇద్దరి జీవితాలూ గోదారి ఒడ్డునే మొదలైనా మద్రాసులో వారి బంధం గట్టిపడింది.


సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులూ, పస్తులతో పడుకున్న రోజులూ, మిత్రులతో సరదా సంభాషణలూ, మధ్య మధ్యలో కొంటె బొమ్మలూ, హిట్లు, ఫెయిల్యూర్లు... ఇలా ఒకటేమిటి వారి జీవితాలను తరచి చూస్తే ఎన్నో సంగతులు.


తమ మధ్య చోటుచేసుకున్న ఎన్నెన్నో సంగతులనూ, అప్పటి సందర్భాలనూ రమణగారు తన "కోతి కొమ్మచ్చి"లో గుదిగుచ్చారు.


ముఖ్యంగా తన ప్రియ నేస్తం బాపు గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు... ముళ్ళపూడివారి మాటల్లోనే..


💥ఇడ్లీ కన్నా పచ్చడే బాగుంది!


ఓసారి చిన్న కథ రాసి ప్రభ ఆఫీసుకు వెళ్ళాను. ఎడిటర్ విశ్వంగారికి ఇచ్చి కూర్చున్నాను.


"ఇక మీరు వెళ్లవచ్చు. బాగుంటే దినపత్రికలో ప్రకటన వస్తుంది" అన్నారు విశ్వంగారు.


"చిన్న కథేనండి... కొంచెం చదివి ఇప్పుడే చెప్పేస్తే... అన్నాను నేను.


ఆయన చురుక్కున చూశారు.

చేతిలోని పుస్తకంలో దాచిన బాపు బొమ్మతీసి బల్లమీద పెట్టాను. ‘‘మా ఫ్రెండ్ బాపు – బొమ్మ కూడా వేశాడు. ఫ్రీ’’ అన్నాను.


"అక్కర్లేదు, మాకు ఆర్టిస్టులున్నారు. బయటవాళ్లవి తీసుకోం’’ అంటూనే ఆయన బాపు వేసిన బొమ్మని ఓ క్షణం సేపు చూశారు.


ఏమనుకున్నారో గానీ, పక్కనే ఉన్న నా కథను చూసి చదవసాగారు. రెండు నిమిషాల్లో కథ చదివేశారు. 


బాపు బొమ్మను మళ్లీ ఓసారి చూశారు.

"ఇడ్లీకన్నా పచ్చడే బాగుంది" వేస్తాను లెండి’’ అన్నారు.


ముప్పావలా పెట్టి ఫుల్‌ మీల్స్ తిన్నంత బలం వచ్చేసింది.

ఈ ఇడ్లీ కన్నా పచ్చడి బాగుండటం జోక్‌లా అనిపించినా – తర్వాత అది చిరసత్యమై, స్థిరసత్యమై నిలబడింది.


తర్వాత నేను గోప్ఫ రైటర్నయిపోయి ఎన్ని గొప్ప కథలు రాసినా – బాపు గొప్పన్నర బొమ్మలు వేసేవాడు.

అప్పుడు నేననుకునేవాడిని – ఇడ్లీ కన్నా పచ్చడే బాగుందని.


(సేకరణ)👆

_ఆగష్టు 26, 2025_* 🌝


  🌞 *_ఆగష్టు 26, 2025_* 🌝

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*భాద్రపద మాసం*

*శుక్ల పక్షం*

తిథి: *తదియ* మ12.36

వారం: *భౌమవాసరే*

(మంగళవారం)

నక్షత్రం : *హస్త*

మర్నాడు తె5.46 వరకు

యోగం: *సాధ్యం* మ1.14

కరణం: *గరజి* మ12.36

&

*వణిజ* రా1.18

వర్జ్యం: *మ1.00-2.45*

దుర్ముహూర్తము: *ఉ8.17-9.07*

&

*రా10.53-11.39*

అమృతకాలం: *రా11.19-1.02*

రాహుకాలం: *మ3.00-4.30*

యమగండం: *ఉ9.00-10.30*

సూర్యరాశి: *సింహం*

చంద్రరాశి: *కన్య*

సూర్యోదయం: *5.48*

సూర్యాస్తమయం: *6.17*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

🙏 *మాస్టర్ నమస్కారమ్స్* 🙏

   🪷🇮🇳🚩🙏🚩🇮🇳🪷

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

పరహితము

 *శ్రీగురుభ్యోనమః*🙏


పరహితము లేక సేవ యందు స్వార్ధపూరిత భావము చోటు చేసుకున్నచో, నీటి యందు సుడి వలె కామ శరీరమున ఒక సుడి ఏర్పడును. సత్కర్మా చరణము చేయుచు, ధనము, కీర్తి, పలుకుబడి, అనుయాయులు, సౌకర్యములు పెరుగుచుండగా వానియందు ఆసక్తికి లోనైన వారందరును సుడిలో పడినవారే. కాలము సుడిలో వీరందరును క్రమముగా అదృశ్యమగుట తధ్యము. లక్షలాది సద్భావములు, సత్కర్మలు ఇట్లే నశించినవి.


పరమగురువులు ఈ విషయమును ఎక్కువ గమనించు చుందురు. సాధకుని మనోతత్త్వమును పరిశీలించి, హితకార్యము పెంపొందించుట యందే లగ్నమై దీక్షగా పన్నెండు సంవత్సరములు సత్కార్యములు ఆచరించు సాధకుని పరమగురువులు స్ఫూర్తితో నడిపించుటకు సంకల్పింతురు.


*Master K.P.K.🙏*


నవ గోపికా సంఘము