26, ఆగస్టు 2025, మంగళవారం

ఫైబర్ ఫుడ్!*

 ;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍇M.A.35.

*మన ఆరోగ్యం…!



                 *ఫైబర్ ఫుడ్!*

                ➖➖➖✍️



*#ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్ ఫుడ్"!*

```

*మన శరీరం ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం ఎంతో అవసరం.


*సమతుల్యమైన ఆహారం అంటే ఏమిటి? 


*శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ కలగలిపి ఉన్న ఆహారాన్ని తీసుకోవడమే సమతుల్య ఆహారం. 


*విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్, ఫైబర్ వంటివి శరీరానికి కావలసినంత తీసుకున్నట్టు అయితే ఆరోగ్యంగా ఉంటారు. 


*అయితే ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఫైబర్ రిచ్ ఫుడ్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం...


*కొన్ని పండ్లు తొక్క తీసి తినాల్సిందే కానీ, కొన్నింటిని నేరుగా తినవచ్చు. ఐనా చాలామంది వాటిని తొక్క తీసే తింటారు.


*అలాగే పప్పులను పొట్టు తీయకుండా వాడితే చాలా ప్రయోజానాలు ఉంటాయి.


*పండ్లు, కూరగాయల తొక్కలో, పొట్టు తీయని పప్పులో అత్యధిక శాతం ఫైబర్లుంటాయి. ఈ ఫైబర్లు శరీరానికి ఎంతో ఉపయోగాపడతాయి. దీనివల్ల మలబద్దకం, తత్సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు.


*ముఖ్యంగా యాపిల్ పండు తొక్కలో సోల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ ను, బ్లడ్ షుగర్ ను తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. యాంటీ కేన్సర్ ప్రభావం సైతం దీనిలో ఉంది. పైన చర్మం తీసిన దానికన్నా పూర్తిగా తొక్కతో సహా తినడం వల్ల కేన్సర్ సెల్స్ పై ప్రభావం చూపగలదని అనేక పరిశోధనల ద్వారా తేలింది.


*రెండు లీటర్ల ఆరెంజ్ జ్యూస్ లో ఉండే విటమిన్ ‘సి’ ఒక ఎర్రని యాపిల్ పండు తొక్కలో ఉంటుందని పరిశోధనల ద్వారా వెల్లడి అయ్యింది.


*అదేవిధంగా బంగాళాదుంపల తొక్కలో, మినపపొట్టులో అత్యధిక శాతం ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ - బి పుష్కలంగా లభిస్తాయి. యాంటి ఆక్సిడెంట్లు సైతం సమృద్దిగా ఇందులో ఉంటాయి. 


చేదుగా ఉండే సిట్రస్ పండ్ల తొక్కలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఊపిరితిత్తుల సమస్యలకు ఇవి బాగా పనిచేస్తాయి.


*నిమ్మ, నారింజ కాయలు తొక్కలను నేరుగా తినడం సాధ్యం కాదు. కాబట్టి తొక్కకు అంటుకుని లోపలి వైపు ఉండే పల్చని పొరను వంటకాలలో జోడించినా లేక టీ నీళ్ళలో తొక్కలను వేడి చేసి కాచి అవి తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

కామెంట్‌లు లేవు: