*శ్రీగురుభ్యోనమః*🙏
పరహితము లేక సేవ యందు స్వార్ధపూరిత భావము చోటు చేసుకున్నచో, నీటి యందు సుడి వలె కామ శరీరమున ఒక సుడి ఏర్పడును. సత్కర్మా చరణము చేయుచు, ధనము, కీర్తి, పలుకుబడి, అనుయాయులు, సౌకర్యములు పెరుగుచుండగా వానియందు ఆసక్తికి లోనైన వారందరును సుడిలో పడినవారే. కాలము సుడిలో వీరందరును క్రమముగా అదృశ్యమగుట తధ్యము. లక్షలాది సద్భావములు, సత్కర్మలు ఇట్లే నశించినవి.
పరమగురువులు ఈ విషయమును ఎక్కువ గమనించు చుందురు. సాధకుని మనోతత్త్వమును పరిశీలించి, హితకార్యము పెంపొందించుట యందే లగ్నమై దీక్షగా పన్నెండు సంవత్సరములు సత్కార్యములు ఆచరించు సాధకుని పరమగురువులు స్ఫూర్తితో నడిపించుటకు సంకల్పింతురు.
*Master K.P.K.🙏*
నవ గోపికా సంఘము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి