23, ఏప్రిల్ 2025, బుధవారం

ముల్లును తీయగ వాడిన

 *2090*

*కం*

ముల్లును తీయగ వాడిన

ముల్లుయునూ గ్రుచ్చుకొనుట ముల్లు గుణంబౌ

ముల్లుతొ సఖ్యంబైనను

ముల్లని మరువకనె జేయ మోదిలు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ముల్లును తీయడానికి వాడిన ముల్లుకూడా గ్రుచ్చుకోవడమనేది ముల్లు గుణము. ముల్లు తో స్నేహమైననూ అది ముల్లు అని మరిచిపోకుండా చేస్తే సంతోషించగలవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

గొప్పది నీ వ్యక్తత్వం

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️ *జీవితంలో అన్నింటికన్నా గొప్పది నీ వ్యక్తత్వం.. ఆది ఎప్పటికీ కోల్పోకు..ఆది కోల్పోయిన రోజు నిన్ను నువ్వు కోల్పోయినట్లు..కన్ను చేదిరితే గురి మాత్రమే తప్పుతుంది..కానీ మనసు చేదిరితే జీవితం గమ్యం తప్పుతుంది* 🏵️నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రం గానే చూస్తాము.. ఎప్పుడైతే ఆది సముద్రంలో కలుస్తుందో అప్పుడు ఆది దాని అస్టిత్వం కోల్పోతుంది.. అలాగే మీరు మీలాగే ఉన్నంత కాలం సంతోషంగా ఉంటారు.. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలి అనుకుంటారో.. అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు🏵️జీవితంలో కొన్ని సార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు.. ఆది కష్టంగానే ఉంటుంది.. కానీ ఆ ఒంటరి తనమే డబ్బు విలువ, చదువు విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ, మనుషుల విలువ అన్నీ నేర్పిస్తుంది🏵️గొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ.. మనల్ని తడకుండా రక్షణ ఇవ్వగలదు.. అలాగే ఆత్మ విశ్వాషం గెలుపు తెచ్చిపెట్టకపోవచ్చు.. కానీ ఏదైనా గెలవడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.. కష్టం పాఠం నేర్పిస్తుంది.. కాలం పరీక్ష పెడుతుంది.. భయపడి తప్పించుకుంటావో.. లేక తట్టుకుని నెగ్గుకొస్తావో ఆది నీ చేతుల్లోనే ఉంటుంది🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3.గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు లేదా కొత్త వారికి రాలేని వారికి మందులు కొరియర్ ద్వారా మందులు పంపబడును* 🙏🙏🙏

Panchaag


 

కుండలినీ యోగ సాధన🙏

 🙏శ్రీవిద్యలో కుండలినీ యోగ సాధన🙏

                  మొదటి భాగము 

తప్పకుండ తెలుసుకోవాలి.

చిన్న చిన్న భాగాలు గానే ఇస్తాను. ఎక్కువ అయితే చదివి అర్ధం చేసుకోవడం కష్టం కదా 

ముందుగా ఇడా, పింగళా సుషుమ్న నాడులు, కుండాలినీశక్తి, షట్చక్రాలు గురించి చర్చించి 

తరువాత మన అర్చనా విధానము వివరిస్తాను

కుండలనిని అత్యున్నత గురువుగారు లేకుండా ఉద్దీపనము చేయరాదు. అది అంత సులభం కాదు. అయినా మనము జపం చేస్తున్నపుడు మనకు తెలియకుండానే ఉద్దీపనం అవుతుంది. సందేహం లేదు.

ఇడా, పింగళా సుషుమ్న నాడులు యోగ సాధనలో చాలా ముఖ్యము.

   పింగళా నాడిని, సూర్య నాడి అని కూడా పిలుస్తారు. ఈ నాడి సూర్య శక్తినిఅత్యున్నత ప్రతిఫలింపజేస్తుంది. ఈ నాడి వెనుబాము యొక్క కుడివైపు ప్రవహిస్తూ, కుడిముక్కు రంధ్రం వద్ద ముగుస్తుంది. ఈ పింగళా నాడి, ఇడా నాడి యొక్క ప్రతిబింబం. ఇడా-పింగళా నాడులు రెండూనూ, వెనుబాముకు ఇరువైపులా, చుట్టుకొన్నట్లు ఉంటాయి.

 సుషుమ్న నాడి , ఈ రెండు నాడులకు మధ్యగా ఉండి....వెనుబాము మధ్య నుండి, షట్చక్రాల ద్వారా పయనిస్తూ....ముముక్షువులకు మార్గదర్శిగా ఉన్నది

మంత్ర శాస్త్రం ప్రకారం, "అ" నుండి "అః" వరకు ఉన్న అక్షరాలను, ఉచ్ఛరించడం "ఇడానాడి" ప్రయోగం వలన సంభవమౌతుంది. "క" నుండి "మ" వరకు ఉన్న అక్షరాలను, ఉచ్ఛరించడానికి "పింగళా నాడి" ప్రయోగం వలన జరుగుతుంది. "య" నుండి "ష" వరకు గల అక్షరాలు సుషుమ్నా నాడి ప్రయోగం ద్వారా ఉచ్ఛరించగలుగుతాం. అంటే, మంత్రోచ్ఛారణ ద్వారా....శరీరంలో గల వేలాది నాడులను స్పందింపజేయగలుగుతున్నాము.


    వేలాది నాడులలో , నిరంతరం ప్రాణశక్తి ప్రవాహం...ప్రవహిస్తూ ఉంటుంది.ఈ నాడులు భౌతిక నేత్రాలదృష్టికి అందవు . శరీర అంతర్గతంలో, ఆయా నాడుల మధ్య క్రియాత్మక బంధం ఉంటుంది. ఈ నాడులన్నీ శక్తి ప్రవాహ మార్గాలు. అయితే ఈ ఇడా-పింగళ నాడులలో కొంతసేపు ఇడా నాడి ప్రభావం ఉధృతంగానూ, మరికొంత సేపు పింగళా నాడి ప్రవాహం ఉధృతంగానూ...ఉంటాయి. సుమారు ప్రతి 90 నిముషాల వ్యవధిలో...ఈ ఇడా-పింగళా నాడుల ప్రభావ ఆధిక్యత మారుతూ ఉంటుంది



కుండలిని శక్తి ఒక అనిర్వచనీయమైన అద్భుతమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నెముకలో అదృశ్య శక్తిగా ఉన్నది . మూలాధారంలో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగసాధన 


కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.

                      సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల

 శు భో ద యం🙏


"భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో

దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్

రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా

డాండ డడాండ డాండ నినదంబు లజాండమునిండ మత్తవే

దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 34 ॥"🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - దశమి - ధనిష్ట -‌‌ సౌమ్య వాసరే* (23.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

రామాయణం

 🌹🪷🏹🪔🛕🪔🏹🌷🌹

*🪷బుధవారం 23 ఏప్రిల్ 2025*🪷


            *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...


       *వాల్మీకి రామాయణం*

             *17వ భాగం*

                

ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చుని ఘోరాతిఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై, “నేను నీ తపస్సుకి చాలా ఆనందించాను, ఇక నుంచి అందరూ నిన్ను ‘మహర్షి’ అని పిలుస్తారు” అని అన్నారు. 


ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కాని సంతోషం కాని కలగలేదు. ‘ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికి మహర్షిని అయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతానో’ అనుకొని బ్రహ్మగారిని, “నేను నా ఇంద్రియాలని గెలిచానా” అన్నాడు. 


అప్పుడు బ్రహ్మదేవుడు, “ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలని గెలవలేదు, ఇంద్రియాలని గెలవడం అంత తేలిక కాదు” అన్నాడు.


మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుంచి తన ఇంద్రియాల మీదకి వెళ్ళింది. తను అనవసరంగా వశిష్ఠుడి మీద క్రోధాన్ని పెంచుకోవడానికి, మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు.


మళ్ళీ ఘోరమైన తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఈ సారి ఎండాకాలంలో తన చుట్టూ నాలుగు పక్కల అగ్నిని పెట్టుకొని, తల పైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు. వానాకాలంలో నడుముదాకా నీళ్ళల్లో ఉండి తపస్సు చేశాడు. 


విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు. 


రంభ భయపడి వెళ్ళనంటే నానారకాలుగా నచ్చ చెప్పి పంపించాడు. 


మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది, చెట్లన్నీ వసంత ఋతువులో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కళకళలాడుతున్నాయి, కోకిల పాట కూడా వినిపించింది. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి, కోకిల పాట పాడుతోంది. అయితే ఇదంతా ఇంద్రుడు నా తపోభగ్నానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో ఇలా అన్నాడు...

```

*“యత్ మాం లోభయసే రంభే కామ క్రోధ జయ ఏషిణం |*

*దశ వర్ష సహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే ||”*```


“నన్ను ప్రలోభపెడదామని వచ్చిన ఓ రంభా! నువ్వు పదివేల సంవత్సరాలు రాయివై పడుండు” అని శపించాడు.


తరవాత కొంతసేపటికి శాంతించి, ‘అసలు రంభ చేసిన తప్పేముంది, నేను మళ్ళీ క్రోధానికి లోనయ్యాను, ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది’ అనుకొని రంభ అడగకుండానే ‘ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాపవిమోచనం కలిగిస్తాడు’ అని అన్నాడు.


విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు, నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము, కామము నాకు కలగడానికి నా మనస్సు కారణం, ఆ మనస్సు నా ఊపిరి మీద ఆధారపడిఉంది. అందుకని ఊపిరిని తీసి బయటకి వదలను, కుంభకం(యోగాలో ఒక ప్రక్రియ)చేస్తాను, అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం ధృడత్వం ఉండడంవలన, కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకి వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. 


అలా వెయ్యి సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోడానికి కొంత కబళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, “అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది, మీదగ్గరున్నది నాకు కొంచెం పెడతారా” అన్నాడు. 


వచ్చిన వాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్ధమయ్యింది, కాని ఈ సారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు, ఇంద్రుడు తింటే ఏంటి నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళీ కుంభకంలోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.


అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుంచి ఆయన తపఃశక్తి పొగగా బయలుదేరింది. 


ఆయన తపోధూమం సమస్త లోకాలని కప్పేసింది, సముద్రాలు కదలడం ఆగిపోయాయి, సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరూ కదపలేరు, ఆయనకి శత్రువు లేడు మిత్రుడు లేడు, ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి...

```

*“బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపసా స్మ సు తోషితాః |*

*బ్రాహ్మణ్యం తపసా ఉగ్రేణ ప్రాప్తవాన్ అసి కౌశిక ||”*```


“ఓ కౌశికా!నీతపస్సుకి సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్నుబ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయిష్మంతుడవై జీవిస్తావు” అన్నారు.


అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో.. “నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము, వషట్కారము వాటంతట అవి భాసించాలి” అన్నాడు.(ఓంకారము, వషట్కారము భాసిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు, అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక). అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. 


బ్రహ్మగారు సరే అన్నారు.


అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి… “బ్రహ్మర్షి విశ్వామిత్రా!” అని పిలిచారు. 


అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు.


ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో, ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు” అని శతానందుడు రాముడితో చెప్పాడు.


“బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇలాంటి గురువుని పొందిన రామా నువ్వు అదృష్టవంతుడివి” అన్నారు. 


విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు.


“రేపు సూర్యోదయం అయ్యాక ఒకసారి నాకు దర్శనం ఇవ్వండ”ని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పి వెళ్ళిపోయాడు.


*రేపు...18వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

బుధవారం🪷* *🌷23, ఏప్రిల్, 2025🌷*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🪷బుధవారం🪷*

  *🌷23, ఏప్రిల్, 2025🌷*

     *దృగ్గణిత పంచాంగం*                     


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - కృష్ణపక్షం*


*తిథి : దశమి* సా 04.43 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే )

*నక్షత్రం : ధనిష్ఠ* మ 12.07 వరకు ఉపరి *శతభిషం*


*యోగం  : శుక్ల* సా 06.51 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం : భద్ర* సా 04.43 *బవ* రా 03.42 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 08.00 - 11.00 సా 04.00 - 06.00*

అమృత కాలం : *(24) తె 04.01 - 05.31*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*


*వర్జ్యం : సా 06.56 - 08.27*

*దుర్ముహూర్తం : ప 11.41 - 12.31*

*రాహు కాలం : మ 12.06 - 01.40*

గుళికకాళం : *మ 10.31 - 12.06*

యమగండం : *ఉ 07.22 - 08.56*

సూర్యరాశి : *మేషం*

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 05.47* 

సూర్యాస్తమయం :*సా 06.25*

*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 05.47 - 08.19*

సంగవకాలం         :*08.19 - 10.50*

మధ్యాహ్న కాలం  :     *10.50 - 01.22*

అపరాహ్న కాలం   : *మ 01.22 - 03.53*


*ఆబ్ధికం తిధి        : చైత్ర బహుళ దశమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.25*

ప్రదోష కాలం         :  *సా 06.25 - 08.41*

రాత్రి కాలం : *రా 08.41 - 11.43*

నిశీధి కాలం          :*రా 11.43 - 12.28*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.16 - 05.01*

--------------------------------------------------

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ సరస్వతి స్తోత్రం🪷* 

       *(అగస్త్య కృతం)*


*మహాదేవ్యై మహాకాళ్యై*

*మహాలక్ష్మ్యై నమో నమః |*

*బ్రహ్మవిష్ణుశివాయై చ*

*బ్రహ్మనార్యై నమో నమః*


 *🌷ఓం సరస్వత్యై నమః🌷*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹