23, ఏప్రిల్ 2025, బుధవారం

కుండలినీ యోగ సాధన🙏

 🙏శ్రీవిద్యలో కుండలినీ యోగ సాధన🙏

                  మొదటి భాగము 

తప్పకుండ తెలుసుకోవాలి.

చిన్న చిన్న భాగాలు గానే ఇస్తాను. ఎక్కువ అయితే చదివి అర్ధం చేసుకోవడం కష్టం కదా 

ముందుగా ఇడా, పింగళా సుషుమ్న నాడులు, కుండాలినీశక్తి, షట్చక్రాలు గురించి చర్చించి 

తరువాత మన అర్చనా విధానము వివరిస్తాను

కుండలనిని అత్యున్నత గురువుగారు లేకుండా ఉద్దీపనము చేయరాదు. అది అంత సులభం కాదు. అయినా మనము జపం చేస్తున్నపుడు మనకు తెలియకుండానే ఉద్దీపనం అవుతుంది. సందేహం లేదు.

ఇడా, పింగళా సుషుమ్న నాడులు యోగ సాధనలో చాలా ముఖ్యము.

   పింగళా నాడిని, సూర్య నాడి అని కూడా పిలుస్తారు. ఈ నాడి సూర్య శక్తినిఅత్యున్నత ప్రతిఫలింపజేస్తుంది. ఈ నాడి వెనుబాము యొక్క కుడివైపు ప్రవహిస్తూ, కుడిముక్కు రంధ్రం వద్ద ముగుస్తుంది. ఈ పింగళా నాడి, ఇడా నాడి యొక్క ప్రతిబింబం. ఇడా-పింగళా నాడులు రెండూనూ, వెనుబాముకు ఇరువైపులా, చుట్టుకొన్నట్లు ఉంటాయి.

 సుషుమ్న నాడి , ఈ రెండు నాడులకు మధ్యగా ఉండి....వెనుబాము మధ్య నుండి, షట్చక్రాల ద్వారా పయనిస్తూ....ముముక్షువులకు మార్గదర్శిగా ఉన్నది

మంత్ర శాస్త్రం ప్రకారం, "అ" నుండి "అః" వరకు ఉన్న అక్షరాలను, ఉచ్ఛరించడం "ఇడానాడి" ప్రయోగం వలన సంభవమౌతుంది. "క" నుండి "మ" వరకు ఉన్న అక్షరాలను, ఉచ్ఛరించడానికి "పింగళా నాడి" ప్రయోగం వలన జరుగుతుంది. "య" నుండి "ష" వరకు గల అక్షరాలు సుషుమ్నా నాడి ప్రయోగం ద్వారా ఉచ్ఛరించగలుగుతాం. అంటే, మంత్రోచ్ఛారణ ద్వారా....శరీరంలో గల వేలాది నాడులను స్పందింపజేయగలుగుతున్నాము.


    వేలాది నాడులలో , నిరంతరం ప్రాణశక్తి ప్రవాహం...ప్రవహిస్తూ ఉంటుంది.ఈ నాడులు భౌతిక నేత్రాలదృష్టికి అందవు . శరీర అంతర్గతంలో, ఆయా నాడుల మధ్య క్రియాత్మక బంధం ఉంటుంది. ఈ నాడులన్నీ శక్తి ప్రవాహ మార్గాలు. అయితే ఈ ఇడా-పింగళ నాడులలో కొంతసేపు ఇడా నాడి ప్రభావం ఉధృతంగానూ, మరికొంత సేపు పింగళా నాడి ప్రవాహం ఉధృతంగానూ...ఉంటాయి. సుమారు ప్రతి 90 నిముషాల వ్యవధిలో...ఈ ఇడా-పింగళా నాడుల ప్రభావ ఆధిక్యత మారుతూ ఉంటుంది



కుండలిని శక్తి ఒక అనిర్వచనీయమైన అద్భుతమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నెముకలో అదృశ్య శక్తిగా ఉన్నది . మూలాధారంలో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగసాధన 


కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.

                      సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: