5, ఫిబ్రవరి 2024, సోమవారం

Joke

మీరు బాగుంటేనే నేను బాగుంటాను "

 🌺  ఈమధ్య చెన్నై వెళ్ళినప్పుడు కంచికి వెళ్ళి వస్తుండగా బాగా ఆకలివేసి ఓ హోటలు దగ్గరకు వెళ్ళాము. మధ్యాహ్నం సమయం హోటల్ లో భోజనం తయారై వడ్డించడానికి రెడీగా ఉంది. వివిధ రకాల వంటలు వేడి వేడిగా ఉన్నాయి.  బాగా ఆకలిమీద ఉన్న మేము టొమేటోబాత్ తీసుకురమ్మని సర్వర్ కు చెప్పాము. అప్పుడు ఆ హోటల్ మేనేజరు వచ్చి కాసేపు ఆగాలని మర్యాదగా చెప్పాడు. ఎందుకు అని అతన్ని అడిగాము. దానికి అతను ఇలా చెప్పాడు. .  " అరటి ఆకులు రావడానికి 10 నిమిషాలు పడుతుంది.అవి రాగానే మీకు అందులోనే టొమేటోబాత్ ఇస్తాము. దయచేసి ఓపిక పట్టండి " అనిచాలా వినయంగా చెప్పాడు. చిన్న హోటల్ అయినా చాలా శుభ్రంగా ఉంది. చేసేదేం లేక అలాగే కూర్చున్నాము.  కాసేపటికి అరటి ఆకులు రాగానే మాకు టొమేటోబాత్ సర్వ్ చేశాడు. తింటూ అతనితో మాటలు కలిపాము.  " అరటి అకులు లేకపోతే ఏమైంది ??? ఇప్పుడంతా ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చాయి కదా! పైగా అవి రేటు కూడా తక్కువే కదా! మీరు అరటి ఆకులోనే వడ్డిస్తున్నారు. దానికేమైనా కారణం ఉందా? అని అడిగాము. .  " నిజమే! మీరు చెప్పినట్లు ప్లాస్టిఫ్ ప్లేట్లు చాలా చవకే అరటి ఆకులతో పోలిస్తే! కానీ, ఆ ప్లాస్టిక్ ప్లేట్లల్లో తింటే రకరకాల జబ్బులు వస్తున్నాయని చెపుతున్నారు.  నేనేమీ చదువుకోలేదండీ! అన్నీ మంచిగా ఉన్నవి తింటేనే రోగాల బారిన పడుతున్నాము. నా హోటలుకు వచ్చే వారు ధనవంతులు కాదండీ..... లక్షల్లో రోగాలకు ఖర్చు పెట్టటానికి. వారు ఆరోగ్యంగా ఉంటేనేకదా మా హోటలుకు వచ్చేది. వారివల్లనే కదా నా కుటుంబం బ్రతుకుతోంది. .  కొంతమందికి ఉపాధి కలిగేది వారివల్లనే కదా! అలాంటప్పుడు నేను నా పదార్థాలను వారికి అరటి ఆకుల్లోనే పెట్టడం మంచిదనిపించింది. పైగా అరటి ఆకుల్లో వేడి పదార్థాలు పెట్టినప్పుడు ఆ ఆకులోని ఔషధ గుణాలు వారికి మంచి చేస్తాయని విన్నాను. .  నాకు ప్లాస్టిక్ ప్లేట్లు వాడితే మహా అంటే 300 మిగులుతాయేమో! కోటీశ్వరుడిని కాలేను కదా! అందుకే కాస్త రేటు ఎక్కువైనా నేను అరటి అకులే వాడతాను. మీరు బాగుంటేనే నేను బాగుంటాను "అంటూ ఆప్యాయంగా మరింత కొసరి కొసరి వడ్డించాడు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 🌺

ముక్కు తిమ్మన పారిజాతాపహరణం

 https://youtu.be/j1AUKVW2VEk?si=rtZo9lHCNCQhUq5i

శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 పంచదార పలుకుల్లాంటి పద్యాలు వినాలంటే.. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన పారిజాతాపహరణం చదవాల్సిందే. సత్యభామ మనసు శ్రీకృష్ణునికి ఎంత తెలుసో ఏమో కానీ, తిమ్మన మాత్రం బాగా పట్టుకున్నాడని ఆ కావ్యం చదివితే తెలుస్తుంది. చక్కని దాననంచు, అనవిని వేటువడ్డ, ఏమేమీ కలహాసనుండు వంటి మనోహరమైన పద్యాలు తెలుగులో తప్ప ఇంకెక్కడ దొరుకుతాయి! సత్యభామ కోపాన్ని కృష్ణుడు ఏ హామీ ఇచ్చి తీర్చాడో.. ప్రముఖ కవి ఆచార్య వేణు గారి మాటల్లో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

*ఏ పురాణంలో ఏముందో

 *ఏ పురాణంలో ఏముందో క్లుప్తంగా తెలుసుకుందాము*

1.మత్స్యపురాణం 

2.కూర్మపురాణం

3.వామనపురాణం

4.వరాహపురాణం

5.గరుడపురాణం

6.వాయుపురాణం

7. నారదపురాణం 

8.స్కాందపురాణం

9.విష్ణుపురాణం

10.భాగవతపురాణం

11.అగ్నిపురాణం 

12.బ్రహ్మపురాణం

13. పద్మపురాణం

14.మార్కండేయ పురాణం

15.బ్రహ్మవైవర్తపురాణం 

16.లింగపురాణం

17.బ్రహ్మాండపురాణం

18.భవిష్యపురాణం

ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.

మత్స్య పురాణం:

మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.

కూర్మ పురాణం:

కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

వామన పురాణం:

పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

వరాహ పురాణం:

వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.

గరుడ పురాణం:

గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.

వాయు పురాణం:

వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.

అగ్ని పురాణం:

అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.

స్కంద పురాణం:

కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.

లింగ పురాణం:

లింగరూప శివ మహిమలతో బాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.

నారద పురాణం:

బహ్మమానస పుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.

పద్మ పురాణం:

ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజా విధానాల గురించి ఉంటుంది.

విష్ణు పురాణం:

పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.

మార్కండేయ పురాణం:

శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.

బ్రహ్మ పురాణం:

బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.

భాగవత పురాణం :

విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.

బ్రహ్మాండ పురాణం:

బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.

భవిష్య పురాణం:

సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.

బ్రహ్మావైపర్త పురాణము :

ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు,తులసీ, సాలగ్రామ మహత్మ్యం ఉంటాయి.

05-02-2024 / సోమవారం / రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

05-02-2024 / సోమవారం / రాశి ఫలితాలు

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

మేషం

ఉద్యోగస్తులకు అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

---------------------------------------

వృషభం

 చిన్ననాటి మిత్రులతో వివాదాలు తప్పవు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు.

---------------------------------------

మిధునం

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

---------------------------------------

కర్కాటకం

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

---------------------------------------

సింహం

మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. స్నేహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల విస్తరణకు భాగస్తులు నుండి సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు.

---------------------------------------

కన్య

దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. రుణదాతల ఒత్తిడి అధికమవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది.

---------------------------------------

తుల

వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధన వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం

ఉద్యోగస్తులకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభాలాబాట పడుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

ధనస్సు

అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

---------------------------------------

మకరం

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

కుంభం

వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

---------------------------------------

మీనం

విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చిన్ననాటి మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది.

---------------------------------------

🍀 *శుభం భూయాత్* 🍁

అంతకు ముందే

 విమానం రైట్ బ్రదర్స్ కనిపెట్టారు అని చెప్పిన వాడు, 

నీకు అంతకు ముందే పుష్పకవిమానం వుందని చెప్పలేదు,

టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టిందని పండగ చేసినవాడు 

101 మంది కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీ లే అని చెప్పలేదు,

3d house అని మురిసిపోయే నీతో తరాల క్రితం మయసభ వుందని చెప్పలేదు, 

చదువు విజ్ఞానం అని గొప్పలు పోయె నీకు 

మొట్టమొదటి విశ్వ విద్యాలయం భారతదేశం లోదే అని తెలియదు,

ఆదిమానవుడి గీతలు ఆశ్చర్యంగా చూసే నీకు 

అంతకు మునుపే తాళపత్ర గ్రంథాలను రాశారు అని తెలియదు,

లేజర్ సర్జరీ అని డప్పు కొట్టుకొనే నీకు 

సుశ్రుడు చేసిన వైద్యం తెలియదు,

గండు చీమల తో చరకుడు చేసిన శస్త్ర చికిత్స లు తెలియదు,

ఎందుకంటే.. ఇలాంటి ఎన్నో నీకు తెలియకుండా చేశారు,

నీ దేశపు గర్వాన్ని నే చేతితోనే తుడిపించారు,

ఓ మేధావి నీకు నిజంగా స్పృహ వుంటే ఒక్కటే తెలుసుకో 

ఆ బ్రిటీష్ వారి పూర్వీకులు గాడిదల మీద తిరగటం కూడా రాక మునుపే,

నీ తాత ముత్తాతలు గుర్రాల రథం మీద బంగారు నగలు ధరించి తిరిగే వారు,

వారికి స్నానం తెలియక తోలు చుట్టుకు తిరగక ముందే

నీ తాత ముత్తాతలు. సుగంధ ద్రవ్యాలతో స్నానాలు చేసేవారు ……..

సోమవారం / రాశి ఫలితాలు