4, మే 2024, శనివారం

పరిష్కరం చేయబడును

 ఓం శక్తి తల్లి జ్యోతిష్యాలయం

    గురూజీ సహదేవ రాజు సెల్ :9948381552

   ఈ భూప్రపంచం మీద సమస్య లేని వాళ్ళు ఎవరు ఉండరు

   )1విద్య

   2)ఉద్యోగం

   3)వ్యాపారం

   4)భార్య భర్తల మధ్య గొడవలు

   5)పుత్రసంతానం

   6)ప్రేమ సమస్యలు

   7)ఎన్ని సంబంధాలు వచ్చిన పెళ్లి ముడి పడకపోవడ

   8)ధనము కలసి రాకపోవడం

   10)కుటుంబ సమస్యలు

   11)ఆర్థిక సమస్యలు

   13)స్త్రీ వశీకరణం

   14పురుష వశీకరణం

   15)శని దోషం నాగదోషం నరదిష్ఠి

   16)ఇంట్లో మనశాంతి లేకపోవడం మీ కుటుంబంలో దెయ్యాల సమస్యలు ఉంటే చెడు కర్మలు ఉన్నా గురూజీ చక్కటి పరిష్కరం చెప్పగలరు

   ఎదో సరదాగా ఆడుకుందామని :::చేపి చేయొద్దు సమస్య ఉంటే ఫోన్ చేయండి

   సర్వేజన సుఖినోభవంతు

   నమ్మకంతో ఫోన్ చేయండి

   సర్వ సమస్యలకు పరిష్కరం చేయబడును పూజారి లక్ష్మణ్ రాజు

   సెల్ : 9150206445

నవగ్రహ దోషకారకమైన పనులు

 🎻🌹🙏 *నవగ్రహ దోషకారకమైన పనులు..* 


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌷1.సూర్యుడు🌷


🌸పితృ దేవతలని దూషిస్తే రవికి కోపము. నమస్కార ప్రియుడు. తర్పణ గ్రహీత.

సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట.


🌷2.చంద్రుడు🌷


🌿అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం. అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.


🌷3.కుజుడు🌷


🌸అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపము. వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడు.


🌷4.బుధుడు🌷


🌿బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపము. అందునా బుధవారం అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన,

జ్ఞానం ఉంది అని విర్రవీగినా కోపము.


🌷5.గురువు🌷


🌸సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి ఆగ్రహము కలుగుతుంది. గురువులని పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది.


🌷6.శుక్రుడు🌷


🌿శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపము. ప్రేమకారకుడు. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరు, గొడవలు లేని ఇల్లు ఇష్టము.


🌷7.శని 🌷


🌸శనికి పెద్దల్ని కించపరచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపము. తల్లితండ్రిని చులకన చేసిన సహించడు. సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.


🌷8.రాహువు🌷


🌿రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగును. ఈయన భ్రమ మాయకి కారణము.


🌷9.కేతువు🌷


🌸జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన,

మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు.


🌿ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.

.స్వస్తి..

ఆవు పాల గురించి

 🐂🐂🐂🐂🐂

Jai Shri Ram 

Kancherla Venkata Ramana 

ఆవు పాల గురించి పూర్తిగా చదివి తెలుసుకోండి.

ఆవు పాలను ఎందుకు దూరం చేసుకున్నాం?


 ఆవుపాల శ్రేష్ఠత

1. కొంచెము పలుచగా ఉంటాయి. కావున సులభంగా/త్వరగా జీర్ణమగును.

2. చిన్నపిల్లలకు మంచిది, తల్లిపాలతో సమానము.

3. మనిషిలో చలాకీని పెంచుతుంది.

4. ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతాయి. ప్రేగులలో క్రిములు నశిస్తాయి.

5. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

6. చదువుకునే పిల్లలకు తెలివిని పెంచి, వారిని నిష్ణాతులను చేస్తాయి.

7. మనస్సును, బుద్ధిని చైతన్యవంతం చేస్తాయి.

8. సాత్విక గుణమును పెంచుతాయి.

9. సాధువులు ఋషులు మునులు ఆవుపాలనే సేవిస్తారు.

10. యజ్ఞ,హోమాదులకు ఆవుపాలను వినియోగిస్తారు.

11. దేవాలయములలో పూజకు, అభిషేకానికి ఆవుపాలు వాడతారు.

12. కార్తీకపురాణములో ఆవునెయ్యితో దీపారాధన చేస్తే పాపములు నశించి, పుణ్యం లభిస్తుందని తెలిపారు.

13. గోవు దేవతాస్వరూపము. కైలాసం దగ్గరలోని గోలోకము నుండి వచ్చినది. ఆవుపాలు, ఆవు నెయ్యితో మనకు దేవతాశక్తి వస్తుంది.

14. ఆవుపాలలో – బంగారము ఉన్నది. ఆవు మూపురములో స్వర్ణనాడి సూర్య కిరణాలతో ఉత్తేజితమై బంగారు (చరక సంహిత) తత్వంగల ఒక పుసుపుపచ్చని పదార్ధాన్ని విడుదలవుతుంది. అందువల్ల ఆవుపాలు పచ్చగా ఉంటాయి, ఆవుపాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపు తత్వం ఇమిడి ఉన్నది.

15. తెల్లఆవు పాలు వాతాన్ని, నల్లఆవు (కపిలగోవు) పాలు పిత్తాన్ని, ఎఱ్ఱనిఆవు పాలు కఫాన్ని హరిస్తాయి.

16. ఆవుపాలు సర్వరోగ నివారణి. ఆవుపాలు వృద్ధాప్యానికి దూరంగా ఉంచుతాయి.

17. ఘృతేన వర్దేతే బుద్ధిః క్షీరేణాయుష్య వర్ధనం, ఆవు నెయ్యి బుద్ధి బలమును పెంచును. ఆవుపాలు ఆయుష్షును పెంచును, ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండములో చెప్పారు. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.

18. చందోగ్య ఉపనిషత్ (6–6–3) మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరాలులోని స్థూల భాగం శరీరంలోని ఎముకలుగా మారుతుంది.

మధ్యభాగం మజ్జ (మూలుగ)గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన ఎముకలు, మజ్జ (మూలుగ) మంచి సాత్విక, శ్రావ్యమైన హక్కు కోసం ఆవు నేయ్యి, వెన్న తప్పక తినవలెను.

19. భారతీయ గోవులకు మూపురము వుండును. ఈ మూపురములోని వెన్ను పూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉన్నది, అందువలన ఈ ఆవుపాలు, నెయ్యి, వెన్నలకు పైన చెప్పిన ప్రత్యేక గుణములున్నవి.


పాశ్యాత్య గోవులైన జర్సీ, హె.యఫ్ వంటి గోవులకు మూపురము ఉండదు. యివి సూర్యశక్తిని గ్రహించలేవు. అందువలన వీటి పాలు మంచివి కావు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు మూపురము ఉన్న ఆవుపై ఆధారపడి ఉంది. ఈ ఆవుపాలు చలాకిని, తెలివిని, జ్ఞాపకశక్తిని, సత్వగుణమును, బుద్ధిబలమును, ఒజస్సును పెంచును, ఓజస్సు మనిషి యొక్క తెలివికి, ఆకర్షణశక్తి, వ్యాధి నిరోధక శక్తిని ప్రధాన కారణము, నెయ్యి – ఆరోగ్యమైన మంచి ఎముకలను మంచి రక్తమును ఉత్పత్తి చేయు మూలుగను, మంచి హక్కును, మేధాశక్తిని, కాంతిని, బుద్దిబలమును పెంచుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చెడు కొలెస్టిరాల్ అయిన యల్.డి.యల్ కొలెస్టిరాలును పెరగనివ్వదు.


ఆవు నెయ్యి వలన ఉత్పత్తి అయిన మూలుగ నుండి మంచి రక్తము ఉత్పత్తి అయి, వ్యాధికారక క్రిములను (AIDSను కలుగచేయు విష (Virus) క్రిములతో సహా) చంపి వేసి, ఆరోగ్యమును కలుగజేయును. స్త్రీలలో ఎముకలు బలహీనమై Osteoporosis, Arthritis అనే వ్యాధి రాకుండా ఉండటానికి , వచ్చిన వ్యాధిని తగ్గించుటకు, గర్భిణి స్త్రీలు మంచి కాల్షియం పొందడానికి – Calcium మాత్రల కన్నా ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. స్త్రీ గర్భములోని బిడ్డకు ఎముక పుష్టికి, మేధాశక్తికి పునాది వేస్తుంది.


ఈ జన్మలో నిత్యమూ తీసుకొనే ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి యొక్క సూక్ష్మ అంశతో ఏర్పడే ‘మనస్సు, బుద్ధి’ రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలము ప్రసాదిస్తుంది. మన ఋషులు తపశ్శక్తితో చెప్పిన సూక్ష్మ విషయములు శాస్త్రవేత్తలు కొంతవరకే నిర్ధారించగలరు. ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మ చైతన్యము గురించిన వివరములు విజ్ఞానశాస్త్రము ఇంకనూ కనుగొనలేదు. వాటి గురించిన వివరములు తెలుసుకో గలిగినప్పుడే శాస్త్రవేత్తలు పై విషయములు చెప్పగలుగుతారు. ఆరోగ్యము మేధాశక్తితో కూడిన ప్రజలు మన దేశ భవిష్యత్తుకు మూలము కదా.

🙏🙏🙏🙏🙏

నర్మదా నది పుష్కరాలు*🕉☸️✡️🕉☸️✡️✡️☸️✡️

 నర్మదా నది పుష్కరాలు*🕉☸️✡️🕉☸️✡️✡️☸️✡️



పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానం. 

ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. 


పుష్కర సమయములో ఆయానదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.


బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. 

పుష్కర కాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరం అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు. 


ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

పుష్కర సమయంలో పిండ ప్రదానం

సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రథమని విశ్వసిస్తారు.మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి.

(శ్రాద్ధకర్మలు ఉపనయనం, వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి)


పుష్కరకాల స్నానం

నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం, మార్జనం అనే శక్తులున్నాయని వేదం వివరిస్తుంది.


మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే మార్జన అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన.


నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానంద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు.

తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం.

ఆ సమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.

త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని, పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది.


నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.

ఇసుకతో కాని, మట్టితో కాని పార్థీవ శివలింగాన్ని చేసి పూజించాలంటారు. 

నదీ తీరంలోని ఇసుకను నదిలోకి వేయాలంటారు. పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్ల నీళ్లతో ఆశీస్సులు అందజేస్తారు. 



పుష్కరం అనేది నదులను పూజించడానికి అంకితం చేయబడిన భారతీయ పండుగ.

ఇది భారతదేశంలోని 12 ప్రధాన పవిత్ర నదుల ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలలో, పూర్వీకుల ఆరాధన , ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జరుపుకుంటారు.


ఈ వేడుక ప్రతి నదిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి నది ఒక రాశితో ముడిపడి ఉంటుంది మరియు ప్రతి సంవత్సరం పండుగకు సంబంధించిన నది ఆ సమయంలో బృహస్పతి ఏ రాశిలో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది.


నర్మదా పుష్కరం సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే నర్మదా నది పండుగ. ఈ పుష్కరాన్ని బృహస్పతి వృషభ రాశి (వృషభ రాశి)లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు జరుపుకుంటారు.


ఈ సంవత్సరం నర్మదా పుష్కరలు 2024 మే 1 నుండి ప్రారంభం అయ్యి మే 12న ముగుస్తాయి.


అమర్‌కంటక్ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, చౌబీస్ అవతార్ ఆలయం, మహేశ్వర్ మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర్ మందిరం మరియు భోజ్‌పూర్ శివాలయం చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి.


పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి మరియు నరమదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి అమ్రార్కంటక్ ఉత్తమమైన ప్రదేశాలు.

ఓంకారేశ్వర్‌లో నర్మదా నది ఒడ్డున అనేక అందమైన ఘాట్‌లు నిర్మించబడ్డాయి.


ఈ నది ప్రవాహం నిరంతరం మరియు స్థిరంగా ఉంటుంది మరియు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది.

ఘాట్‌లపై నది లోతు ఎక్కువగా ఉండదు. మరియు భక్తులు సులభంగా స్నానాలు చేయవచ్చు.


భక్తులు లోతు నీటిలోకి వెళ్లకుండా కాపాడేందుకు ఇనుప వలలు, పట్టుకునే చైన్‌లను ఏర్పాటు చేశారు.

వారి భద్రత కోసం సేఫ్టీ బోటు కూడా ఏర్పాటు చేశారు.


ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్‌లలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

ఇక్కడ స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థయాత్రల పుణ్యం లభిస్తుంది.


ఓంకారేశ్వర్‌లోని ఇతర ముఖ్యమైన ఘాట్‌లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

చకర్ తీర్థ ఘాట్,

గౌముఖ్ ఘాట్,

భైరోన్ ఘాట్,

కేవల్రామ్ ఘాట్,

నగర్ ఘాట్,

బ్రహ్మపురి ఘాట్,

సంగం ఘాట్,

అభయ్ ఘాట్

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷*🙏నర్మదా నది - పుష్కర స్నాన సంకల్పం🙏*


ఓం విష్ణవే నమః, విష్ణవే నమః, విష్ణుర్ విష్ణుర్ విష్ణుః, శ్రీ మద్ మహాపురుషస్య విష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య, అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశతే కలియుగే, కలిప్రథమచరణే, జంబూద్వీపే, భారతవర్షే, భరతఖండే, ...

ఆర్యావర్తే ఏకన్తరే దేశే, బ్రహ్మవర్తే దేశే ఓంకార్ గిరిజ క్షేత్రే మాంధాత్ మైన్డుర్ మణిపర్వతే, ఓంకారేశ్వర రాజరాజేశ్వరి నర్మదాయం దక్షిణ తటే, ఓమకారేశ్వర్ - మమలేశ్వర్ చతుర్థ జ్యోతిర్లింగ సన్నిదౌ, సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన, సాలివాహనే, ఉత్తరాయణే, మాసానాం మాసోత్తమే, మాసే పూర్ణ పవిత్రాదిక మాసే, చైత్ర మాసే, శుక్లే పక్షే పౌర్ణమ్యం, గురు బృహస్పతి వాసరాయం, వాసరః అముక వాసారాయం,  నక్షత్రే, మమాత్మనః, శ్రీమాన్ శ్రీమత గోత్రః ఆత్రేయస గోత్రం  శర్మ ధర్మపత్నీసమేతస్య సహ కుటుంబస్య___🫧🫧🫧🫧🫧🫧🫧🫧🫧🫧🫧🫧 *యుగే యుగే నర్మద*


మన దేశంలో ఉన్న ప్రతి నదికీ ఓ ప్రత్యేకత ఉంది. 

అది పారే విధానం, దిక్కు, సారం, ఆ తీరాన వెలసిన క్షేత్రాలు, నది వెంబడి సాగే జీవనం... వీటన్నిటి ఆధారంగా వాటికి ప్రత్యేకతలను ఆపాదించి కొలుచుకునే ఆచారం మనది.


భారతీయుల దృష్టిలో నది, ప్రవహించే నీరు మాత్రమే కాదు… 

జీవాన్నిచ్చే శక్తి!తాపం తీర్చే వనరే కాదు… ప్రాణం నిలిపే తల్లి కూడా! 

అందుకే నదిని దేవతగా పూజిస్తాం. 

ప్రతి భారతీయుడు తన జీవితకాలంలో ఏదో ఒక సమయంలో నదిని దర్శించుకోవాలని తాపత్రయపడతాడు.

అనాదిగా తన తరాలను నిలబెడుతున్న నది పట్ల మనిషిది కృతజ్ఞత మాత్రమే కాదు, ఆరాధనా భావం కూడా! ఆ నదీ తీరానే పితృ దేవతలను తలుచుకుంటాడు, నదీ జలాలను అర్ఘ్యంగా సూర్యుడికి సమర్పిస్తాడు. 


ఆ నీటిలో తడిసి, వాటిని నెత్తిన జల్లుకుని మూడు మునకలు వేసి తరిస్తాడు.


అందుకు కల్పించుకున్న ఓ అపురూప సందర్భమే పుష్కర స్నానం! ‘నర్మదా సింధు కావేరీ..’ అంటూ నీటిని పవిత్రం చేసే మంత్రం చెప్పుకొంటాం. 


ఆ నర్మదకు ఈ రోజు నుండి పుష్కరాలు… 


పుష్కరాల సంప్రదాయం వెనుక ఉన్న కథలలో ఎక్కువగా వినిపించే గాథ ఇది.


 పూర్వం తుందిలుడు అనే రుషి ఉండేవాడు. ఆయన శివుణ్ని ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైన తపస్సు చేశాడు. 

ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగితే… 


‘నీలో నాకు శాశ్వత స్థానం లభించేట్లు అనుగ్రహించమ’ని వేడుకున్నాడు తుందిలుడు.


అతని భక్తికి మెచ్చిన శివుడు తనలోని జలశక్తికి ప్రతినిధిగా మారమని తుందిలుణ్ని అనుగ్రహించాడు. 

అలా ఈ జగాన ఉన్న జలాలకు తుందిలుడు అధిపతి అయ్యాడు. 

జలం లేకుండా జీవం లేదు కాబట్టి, తుందిలుడికి పుష్కరుడు (పోషించేవాడు) అన్న మారుపేరు స్థిరపడింది.


ఇదిలా ఉండగా బ్రహ్మదేవుడు తన సృష్టిని కొనసాగించడానికి జలశక్తి అవసరమైంది. 

దాంతో పుష్కరుణ్ని తనకు అండగా ఉండమని ఆహ్వానించాడు. 

శివుడి అనుజ్ఞతో పుష్కరుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి సృష్టికి సాయపడ్డాడు. 

బ్రహ్మ పని పూర్తయినప్పటికీ, పుష్కరుణ్ని వదులుకోవడం ఆయనకు ఇష్టం లేకపోయింది.

అలా పుష్కరుడు బ్రహ్మ దగ్గరే ఉండిపోయాడు.


కొన్నాళ్లకు దేవగురువైన బృహస్పతి, భూమి మీద ఉన్న జీవులందరినీ తన జలశక్తితో పాపవిమోచనం చేయగలిగే పుష్కరుణ్ని తనతో పంపమని బ్రహ్మను అభ్యర్థించాడు.


 పుష్కరుణ్ని శాశ్వతంగా వదులుకోవడం ఇష్టం లేని బ్రహ్మదేవుడు ఓ మధ్యేమార్గాన్ని సూచించాడు.


 బృహస్పతి ఒక ఏడాదిలో ఏ రాశిలో అయితే ప్రవేశిస్తాడో, నాటి నుంచి 12 రోజుల పాటు ఒక నదిలో ఉండమని సూచించాడు. 

అలా 12 రాశులకు, 12 నదులను కేటాయించాడు.


గంగానది (మేషరాశి), 

నర్మద (వృషభం), 

సరస్వతి (మిథునం), 

యమున (కర్కాటకం),

గోదావరి (సింహం), 

కృష్ణ (కన్య), 

కావేరి (తుల), 

భీమా/తామ్రపర్ణి (వృశ్చికం),

తపతి/బ్రహ్మపుత్ర (ధనుస్సు),

తుంగభద్ర (మకరం), 

సింధు (కుంభం), 

ప్రాణహిత (మీనం)...


ఉత్తరాదికి జీవనది!

నదుల గురించి చెప్పుకొనేటప్పుడు గంగ, యమున, కృష్ణ, గోదావరి లాంటి పేర్లు వినిపించినంతగా నర్మదను తల్చుకోరు. 


నిజానికి నర్మద కూడా అంతే అద్భుతమైన జీవనది, భారతదేశంలో ప్రవహించే నదులలో అయిదో అతిపెద్ద నది. 

పశ్చిమంగా ప్రవహించేవాటిలో అతి పొడవైనది. 

అందుకే మహానది అని కూడా పిలుస్తుంటారు.

గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలలో ప్రవహించే ఈ నది తొలి రెండు రాష్ర్టాలకు అపారమైన జలరాశిని అందిస్తున్నది. 


ఒక్క మాటలో చెప్పాలంటే గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థ, సామాజిక జీవనం లాంటి వాటిని నర్మద లేకుండా ఊహించలేం.

 సుమారు లక్ష చదరపు కిలోమీటర్ల నర్మద పరీవాహక ప్రాంతం చాలా వైవిధ్యమైంది, పురాతనమైంది కూడా.

 దాదాపు 16 కోట్ల సంవత్సరాల కిందట ఉత్తర భారతదేశం, ఇప్పటి ద్వీపకల్పం విడివిడిగా ఉండేవి. 

వాటిమధ్య ఏర్పడిన లోయలో ప్రవహిస్తున్నదే నర్మద. 

ఇంత వైవిధ్యమైన పరిస్థితుల మధ్య ఏర్పడింది కాబట్టే నర్మదలోయలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి...


నర్మద చుట్టూ.. ఆ నదిలో భాగంగా పర్వతశ్రేణులు, జలపాతాలు, లోయలు లాంటి భౌగోళిక అద్భుతాలు కనిపించేందుకు కారణం… అది ఏర్పడిన తీరే. 

అత్యంత ప్రాచీనమైన జీవనది కాబట్టి ఇక్కడి తీరప్రాంతంలో డైనోసార్ల అవశేషాలూ కనిపించాయి

అంతర్జాతీయ గుర్తింపు

 హైదరాబాద్‌ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సీఎస్‌ రంగరాజన్‌.. ఓ దళిత భక్తుణ్ణి భుజాలపైన ఎక్కించుకుని ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్లిన ‘మునివాహన సేవ’తో ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు సాధించారాయన

నోబెల్‌ గ్రహీత దలైలామా ప్రశంసలూ అందుకున్నారు. ఆ సేవ వైపు తనని నడిపించిందేమిటో ఇలా చెబుతున్నారు....


"నా బాల్య జ్ఞాపకాలన్నింటా చిలుకూరు వేంకటేశ్వరస్వామి ఆలయ పరిసరాలే పచ్చగా పరుచుకుని ఉంటాయి. 


తరతరాలుగా వస్తున్న అర్చకవృత్తిని చూస్తూనే నాన్న సౌందర్‌రాజన్‌ ఉన్నత చదువులు చదివారు. కామర్స్‌ లెక్చరర్‌గా మొదలుపెట్టి ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్‌ స్థాయికి ఎదిగారు. 


మా ఇంట్లో ముగ్గురం అబ్బాయిలమే. నేను నడిమివాణ్ణి. నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే. అక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాణ్ణి. టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్లు. బడికి పెద్దగా నామాలు పెట్టుకునేవెళ్లేవాణ్ణి. క్రైస్తవ బడులైనా సరే ఈ విషయంలో అక్కడెవరూ నన్ను ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే నా వ్యక్తిత్వాన్నితీర్చిదిద్దిందని చెప్పాలి. 


చిన్నప్పటి నుంచీ వైద్యరంగంపైన ఆసక్తి ఉన్నా అప్పట్లో నాకు లెక్కల్లో మాత్రమే మంచి మార్కులొచ్చాయి. దాంతో ఇంజినీరింగ్‌ వైపే వెళ్లాల్సిన పరిస్థితి. 


అయినా వైద్యం మీద ఆశ చావక ఉస్మానియాలో ‘బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌’ తీసుకున్నా. చివరి ఏడాది థీసిస్‌ కోసం నేనూ నరేంద్రబాబూ అనే నా సహాధ్యాయీ కలిసి అతితక్కువ ఖర్చుతో తయారుచేయగల ‘సిరంజీ ఇన్‌ఫ్యూషన్‌ పంప్‌’ నమూనాని కనిపెట్టాం.


 డిగ్రీ పూర్తయ్యాక ఆ పరికరాన్నే భారీస్థాయిలో తయారుచేయాలనే కలతో నరేంద్రతో కలిసి ‘ఎన్‌ఆర్‌ బయోమెడికల్స్‌’ అనే కంపెనీ స్థాపించాను. 


మనస్పర్థలొచ్చాయి....


నరేంద్రతో నాకు చిన్నగా మనస్పర్థలు వచ్చాయి. తగవులు పడి విడిపోవడం ఇష్టం లేక ‘కంపెనీని నువ్వే చూసుకో’ అని చెప్పి నేను బయటకొచ్చేశా. అప్పుడే వైద్య పరికరాలు తయారుచేసే ‘మెడ్‌ ట్రానిక్స్‌’ సంస్థ నాకు అధికారిగా ఉద్యోగం ఇచ్చింది.


 చెన్నైలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంత కాలం చిలుకూరికి దూరమవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది. ఆరేళ్లు గడిచాయి. ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో నాకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు. 


దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్‌గా నియమించారు. 1999లోనే సంవత్సరానికి పదిలక్షల రూపాయల జీతం! ఇక జీవితానికి ఏ ఢోకా లేదు అనుకుంటుండగానే.. ఓ సంక్షోభం మమ్మల్ని కుదిపేసింది. 


సర్కారు చట్టానికి నిరసనగా....


హైదరాబాద్‌ నగరానికి తాగునీళ్లిచ్చే ఉస్మాన్‌ సాగర్‌ చెరువులో ఉన్న ఓ చిన్న లంకే ఈ చిలుకూరు. ఇక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహం వెలసిన కొన్నేళ్ల తర్వాత అహోబిల మఠం స్వామీజీ అక్కడికి వచ్చారట. 


ఆగమాల ప్రకారం అనునిత్యం ఇక్కడ దేవుని సేవచేయడానికి తన శిష్యుణ్ణీ, అతని కుటుంబాన్నీ ఇక్కడే ఉండిపొమ్మన్నారట. ఆ శిష్యుడే మా పూర్వీకుడంటారు. తర్వాతికాలంలో ఔరంగజేబు ఆక్రమణకీ, రజాకార్ల దాడులకీ ఎదురొడ్డి ఈ ఆలయాన్ని కాపాడుకున్నాం. 


ఇప్పటికీ ఆ దేవుణ్ణి మా ఇంటి పెద్ద కొడుకుగానే మేమంతా భావిస్తాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1987లో 30/70 అనే దేవాదాయ చట్టంతో వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేస్తూ మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంది! 


నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీం కోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయశాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది.


 మా గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది! అప్పుడు నాన్న మాకు వారసత్వ హక్కులు వస్తాయని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. 


అప్పుడే ఓ అధికారి.. 

‘సౌందర్‌రాజన్‌గారూ, మీ అబ్బాయిలు ముగ్గురూ ఇంజినీర్లు. వాళ్లు ఇక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు. ఇక దేనికండీ మీకీ ఆరాటం!’ అన్నారు. ఆ మాటలు నన్ను ఓ కొరడాలా తాకాయి. ఆ రోజే నిర్ణయించుకున్నా.. నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని! 


అల్లకల్లోలమే....


నాకప్పుడు 35 ఏళ్లు. ‘మెడ్‌ట్రానిక్స్‌’ కంపెనీలో ఉన్నతాధికారి పదవి. ఒకట్రెండు సంవత్సరాల్లో దేశం మొత్తానికీ హెడ్‌ అయ్యే అవకాశాలూ ఉన్నాయి. అంత భవిష్యత్తున్న నేను ఇలా అర్చకవృత్తిలోకి రావాలనుకోవడం నాన్నకి అస్సలు ఇష్టంలేదు! కుటుంబంలో అల్లకల్లోలమే రేగింది. 


ఎవ్వరూ ఒప్పుకోలేదు. నేనూ నా నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు! రెండునెలల తర్వాత వాళ్లనెలాగోలా ఒప్పించాను. ఇక ఆఫీసులో అయితే నన్నెవరూ నమ్మలేకపోయారు. 


‘ఇంతమంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారా!’ అని నవ్వారు. ఎవరేమన్నా, అర్చకుడిగా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్లెం అందుకున్నాను! 


కొత్తదారిలో.. 

అర్చకుడిగా మారిన తొలిరోజుల్లోనే నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించాను. వీఐపీ దర్శనాలూ, టికెట్లేవీ లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించాను. ఇప్పటికీ అదే తు.చ.తప్పకుండా పాటిస్తున్నాం. 


ఏ ఆదాయమూ లేదుకాబట్టి దేవాదాయ శాఖకి మా ఆలయం మీద ఆజమాయిషీ చలాయించే అవకాశం లేకుండా చేశాను. దేవాదాయ చట్టం 30/87 వల్ల తరతరాలుగా ఆలయాన్ని నమ్ముకున్న ఎన్నో అర్చక కుటుంబాలు 

ఎంతో నష్టపోయాయి.


 అందుకే ఆ చట్టంపై అన్నిరకాలా పోరాడుతున్నాను. 1990లకి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యిమంది వస్తే గొప్ప! ఇప్పుడు వారాంతాల్లో నలభైవేలమందిదాకా వస్తున్నారు. వాళ్ల ద్వారా సామాజికంగా మార్పులు తీసుకువచ్చే పనులు చేపట్టాలనుకున్నా.


 ఇవన్నీ కూడా నేను నమ్మే సనాతన ధర్మమనే చట్రంలోనే ఉండాలనుకున్నాను. సనాతన ధర్మమంటే మూఢాచారమో, స్త్రీలపై వివక్షో, అంటరానితనాన్ని ప్రోత్సహించడమో కానేకాదు. అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే. 


వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవినీ ప్రేమించడమే. మన వేదవేదాంగాల సారం అదేనని నేను నమ్ముతా! అందుకే నా వంతుగా ఇక్కడున్న సమస్యలూ, రుగ్మతలూ తీరేందుకు ఏమైనా చేయాలనుకున్నా. 


‘ఇదంతా నటన’ 


ఇక్కడి చేనేత కార్మికులు లాభపడేలా వారాంతాల్లో వచ్చే భక్తులందరూ చేనేత వస్త్రాలే ధరించి రావాలని కోరాను. అది మంచి ఫలితాన్నిచ్చింది. బాలికలపై అత్యాచారాలు జరగకుండా ఆ పసిపాపల్ని దేవతల్లాగే చూడాలని ‘కన్యావందనం’ అనే కార్యక్రమాన్ని చేపట్టాను.


 ప్రతి ఏటా ఫిబ్రవరిలో మేం ఇది చేస్తున్నాం! అమ్మాయిల గొప్పతనం చాటేలా ‘మహలక్ష్మీ’ పూజ అనీ చేస్తున్నాం. ఆరోజు పెళ్లికాని అమ్మాయిలకి కొత్తబట్టలుపెట్టి కాళ్లకి పారాణి రాస్తాం. వీటన్నింటి ద్వారా గుర్తింపుపెరిగి టీవీలో ఏ చర్చాకార్యక్రమాలు చేస్తున్నా నన్ను పిలవడం మొదలుపెట్టారు. 


నా మాటలు టీవీల్లో ప్రసారం కాగానే ‘మీదంతా నటన. అసలు పూజారులందరూ దుర్మార్గులు. అవినీతిపరులు. మీవల్లే దళితులపైన వివక్ష’ అంటూ కుప్పలుతెప్పలుగా లేఖలు వచ్చేవి. ‘ఎవరో కొందరివల్ల మొత్తం హిందూ అర్చకులనే చెడ్డవారంటే ఎలా?’ ఈ మథనం నాలో చాలారోజులుగా ఉండేది. 


అంత అంటరానితనమా? 


గత ఏడాది అయ్యప్పస్వామి పడిపూజకని పిలిస్తే వెళ్లా. కార్యక్రమం తర్వాత నా దగ్గరకి ఓ వ్యక్తి బిడియంగా వచ్చి ‘స్వామీ! ఈ అయ్యప్ప పూజలోనూ కులాల వివక్ష తప్పట్లేదు. నేను దళితుణ్ణని నా వంటని వేరుగా వండుకోమని చెబుతున్నాడు మా గురుస్వామి!’ అన్నాడు. 


నేను కోపంతో వణికిపోయా. గురుస్వామిని పిలిచి చెడామడా తిట్టేశాను. అప్పుడే ఓ దళిత సంఘం నన్నో సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది. నేను దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ ‘మునివాహన సేవ’ గురించి చెప్పాను. 


అప్పుడో సభ్యుడు లేచి ‘మీరయితే ఓ దళితుణ్ని అలా భుజాలపై మోసుకెళ్తారా!’ అని సవాలు విసిరాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చేసి తీరతాననే చెప్పాను. అలా ఏప్రిల్‌ 17న ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అని పాడుకుంటూ ఆ హరిజన భక్తుణ్ణి మోసుకెళ్లాను. అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని ప్రసారం చేసింది. సోషల్‌ మీడియా ఆ దృశ్యంతో హోరెత్తింది. 


దలైలామా మెచ్చారు....

 

నోబెల్‌ గ్రహీత దలైలామా కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన రోజుని మరచిపోలేను! నేను మాట్లాడిన కొద్దిసేపటికే ఆయనో పెద్ద సందేశం పంపారు. ‘మీరు చేసిన పని ఆదర్శనీయం. సదా ఆచరణీయం. దేవుడి ముందు అందరూ సమానమేనని సోదాహరణంగా వివరించారు’ అంటూ సాగిందా లేఖ! 


ఇది నాకెంతో నమ్మకాన్నిచ్చింది. ఇది ఈ ఒక్క ఆలయ ప్రవేశంతో ఆగిపోదు. నగరాల్లోకంటే గ్రామాల్లోనే అంటరానితనం ఎక్కువ. కాబట్టి.. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ పల్లె నుంచి పట్టణం దాకా ఓ ఉద్యమంలా దీన్ని నిర్వహించబోతున్నాం. 


ఇది జరిగాక ప్రముఖ రచయిత కొలకలూరు ఇనాక్‌, కవి గోరటి వెంకన్న వంటివారు ఫోన్‌ చేసి అభినందనల్లో ముంచెత్తారు. ఆ మధ్య తిరుమలకి వెళ్లాను. నా గురించి అప్పటికే టీవీల్లో చూశారు కాబట్టి ఎంతోమంది జనం చుట్టుముట్టారు. 


అప్పుడో ముసలాయన తచ్చాడుతూ వచ్చి ‘మా జాతిని మోసిన భుజాలు ఇవే నా బాబూ..!’ అంటూ వచ్చి ముద్దుపెట్టుకున్నాడు. ఎందుకో తెలియదు ఆ దేవుడే వచ్చి నన్ను తాకాడా అనిపించింది ఆ రోజు! బొటబొటా కన్నీళ్లొచ్చేశాయ్‌!!


ఆ విలాసాలు వదులుకుంది...


"సుధని.. నేను ఇంటర్‌ చదివేటప్పుడు అహోబిల మఠంలో మొదటిసారి చూశాను. ఆమె అక్కడ ‘నృసింహప్రియ’ పత్రిక సంపాదకుడి బంధువులమ్మాయి. చూడగానే ప్రేమలో పడ్డానుకానీ మనసులో దాచుకున్నాను.


ఆ పత్రికకి ‘ఫల్గుణ’ పేరుతో కథలూ, వ్యాసాలు రాయడం మొదలుపెట్టా. 

ఇంజినీరింగ్‌ ముగించాక ఇంట్లో విషయం చెప్పాను. వ్యతిరేకత లేదుకానీ.. పూర్తిగా అంగీకరించినట్టూ కాదు. ఎట్టకేలకు పెళ్ళైంది.


మాకు ఇద్దరు పిల్లలు. పెద్దాడికి ఏడేళ్లున్నప్పుడు అర్చకవృత్తిలోకి వెళ్లిపోతున్నానని చెప్పాను.  ‘బాగా ఆలోచించే ఈ పని చేస్తున్నావా..!’ అని పదేపదే అడిగింది. 


అర్చకుడిగా నా ఆహార్యం, రోజూ దేవుడికిచ్చిన నైవేద్యం మాత్రమే తినడం.. నన్ను చూసి వచ్చే కన్నీళ్లని దాచుకునేందుకు విఫలయత్నం చేసేది. 


ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చాను. మా పెద్దోడు సీఏ చేస్తున్నాడు. చిన్నబ్బాయి ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. 


వీటన్నింటి వెనక నా భార్య ఇచ్చిన నైతిక మద్దతు అంతాఇంతా కాదు. లక్షల రూపాయల జీతం ఇచ్చే విలాసాలు వదులుకుని భర్తవెంట నడవాలంటే ఎంత కృతనిశ్చయం ఉండాలో కదా! తన అంగీకారంతోనే, ఆ మధ్య నా ఇద్దరి పిల్లల్లో ఒకర్ని బాలాజీ సేవకే అప్పగించాలనే నిర్ణయం కూడా తీసుకున్నా!"

మంత్రం జపం

 *🌹మంత్రం జపం🌹*

  🌹🌹🌹🌹

  "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ఈ మంత్రం ఎందుకు జపించాలో? 


ఈ కథను భవిష్యపురాణం నుంచి సేకరించటం జరిగింది. 


ఒక ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మేడలో రుద్రాక్ష హారం ధరించాడు. 


ఈ "ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడుని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్ర శబ్దం అని చుట్టూ చూడసాగాడు. 


గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటరు దూరంలో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో అస్సలు అర్దం కాలేదు, కాసేపయ్యకా చుస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. 


పట్టుకోబోతే ఈసారి మరింత దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. ఇతను చుస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు, కాని పట్టుకుందామనుకొంటే నేను ఎక్కడో పడిపోతున్నాను.


ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ''వేదవ్యాసుడు'' కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి "మహానుభావ, సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి" అన్నాడు. 


వేదవ్యాసుడు నవ్వి "ఇది నీరాజ్యం,  ఈ కలికాలం నీది, నీకేసందేహమా? ఇక్కడ ఏ ఇద్దరిని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా!" అని అడిగాడు.


"కుశలమే! నా రాజ్యంలో నేను కాకా, నువ్వు అయితే పాలించవు కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి" అని వేడుకున్నాడు. 


వేదవ్యాసుడు నవ్వి "ఓహో అదా, నీ సందేహం అర్దమయింది, ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వటం లేదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. 


త్రికరణ శుద్దిగా నిత్యం ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు. కనుక ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో, లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు" అని చెప్పి వెళ్ళిపోయాడు.


ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.

🌹🌹🌹🌹🌹

ఓం నమో భగవతే వాసుదేవాయ..

నీతి వాక్యంn

 🌹🌹🌹నీతి వాక్యంn 🌹🌹🌹

☘️☘️☘️☘️🙏☘️☘️☘️☘️


         కాకరచెట్టుకి  కంపు గిట్టదు!    పొట్ల చెట్టుకి పొరుపు గిట్టదు. ఇష్టమైన వారికి   కాలకూట విషం కూడా కమ్మగా, తియ్యగా ఉంటుంది!  అది మనిషి ఆలోచన విధానం! 


కురుక్షేత్ర     సంగ్రామం   ఐన తరువాత       ఆకాశవాణి ధర్మరాజుని పిలిచి క్రూరమైన జీవుల్లో అతి క్రూరమైన జీవి ఏది? అని అడిగితే! ధర్మరాజు వెంటనే ""మనిషి " అని చెప్పాడుట! వెంటనే ఆకాశవాణి నీవు ఎల్లప్పుడూ ఇలాగే చెపుతూ  ధర్మరాజుగా వర్ధిల్లమని చెప్పిందట!


 మనిషి ప్రక్క మనిషిని నిందించటం తప్పు అని తెల్సినా చేయక మానడు. అదే మానవ నైజం. ప్రతి ఆలోచనలో ఖర్చు లేకపోతే పొదుపు ఉండదు! అలుపు లేకపోతే జీవితంలో మలుపు ఉండదు, కాబట్టి అటుపోటులు సహజం అదుపు, అలుపు సరి సమానంగా చూసుకుంటూ పోయిన వారే జీవితంలో విజేతగా నిలువ గలడు.


నాదగ్గిర ఏముంది ఇవ్వడానికి అంటారు కొందరు. ఎంత ఇచ్చినా తరగని ఆస్తులు రెండు ఉన్నాయి, మొదటిది స్వచ్ఛమైన నవ్వు. రెండవది సంతోషం. 


 ప్రేమని ఎంత పంచితే అంత దగ్గరయ్యే ఆత్మీయత, వెలకట్టలేనివి. ఇతరులు చేసిన ఏనుగoత తప్పుని, ఆవగింజంతా చేసి చూడు,,,,, *నువ్వు చేసిన చిన్న తప్పుని కూడా కొండంత తప్పుగా భావించు అప్పుడు ఏమి జరుగుతుందో చూడండి. ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఇది సత్యం.*


    విదుర నీతి కూడఇదే!

కంచి పరమాచర్య

 కంచి పరమాచర్య ధర్మం పాటించుట... 🙏

పీఠాధిపతులు షడ్రసోపతమైన భోజనం చేయాలి.. వారికి దేనిమీద కూడా జిహ్వ ఉండకూడదు. అదీ నియమం.

ఒకరోజు ఆశ్రమం లో వంట వాడు వంట వడ్డించాడు. ఈ పప్పు ఏ పదార్ధం తో చేసావ్ అని అడిగారు స్వామి. వంట వాడు తోట కూర పప్పు స్వామి అని బావుందా అని అడిగారు. పోరాటున స్వామి వారు బావుంది అని అన్నారు. మరుసటి రోజు, మూడవ రోజు కూడా వంట వాడు తోటకూర పప్పు వడ్డిస్తున్నాడు. అదేమిటి రోజు ఈ పప్పే ఎక్కడ నుండీ వస్తోంది అన్నారు. అప్పుడు వంట వాడు మీరు తోటకూర పప్పు వండితే సంతోష పడుతున్నారు అని శిష్యులతో అన్నాను. వారు కట్టలు కట్టలు తీసుకుని వస్తున్నారు దానిలో మంచిది ఎంచి చేస్తున్నాను అన్నాడు.అలాగా అన్నారు స్వామి వారు.

మరునాడు భోజనం వేళ నేను ఇవ్వాళ బిక్ష స్వీకరించటం లేదు అన్నారు. తరువాత రోజు కూడా బిక్ష చేయటం లేదు అన్నారు.మరి ఏమి తీసుకుంటారు అని అడిగారు శిష్యులు. ఉసిరికాయ అంత గోమయం, ఆచమనం చేయటానికి గోమూత్రం అన్నారు స్వామి. వారు అవే ఏర్పాటు చేశారు.ఉసిరికాయ అంత గోమయం నోట్లో వేసుకునేవారు, గోమూత్రం చేతిలో వేసుకుని ఆచమనం చేసేవారు. అలా వారం రోజులు అయిపోయాయ్. పీఠాదిపతులు ముద్ద ముట్టటం లేదు. ఆశ్రమం లోని వారు అందరు వచ్చి కాళ్ళమీద పడిపోయారు . 

https://chat.whatsapp.com/IToTTEJvyEuE3gAGJ03Y2d

ఏమైంది స్వామి ఎందుకు అని అడిగారు. దానికి స్వామి వారు నేను రేపటి రోజున ఏదైనా ఒక గ్రామానికి వెళితే నన్ను అనుగ్రహ భాషణం చేయమంటారు.నేను గురువు యొక్క స్వరూపం తో వేదిక మీద కూచుని ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఇంద్రియాలకు లొంగ కూడదు అని చెప్తాను. మహానుభావులు శంకరాచార్యులు కూచున్న పీఠo కి అధిపతినయి ఒక తోటకూర పప్పు రుచి కి లొంగి పోయిన నేను జగద్గురు శంకరాచర్య అని పిలిపించుకొనా... పీఠాధిపతి ని అని పిలిపించుకోనా..పది మందిని కూచోపెట్టి అనుగ్రహభాషణం చేయనా.. ఎక్కడ ఉంది ఈ నాలుక కి ఆ యోగ్యత.. ఏ నాలుక తోట కూర పప్పు రుచి కి లొంగిందో దాన్ని గోమయం తో శుద్ధి చేస్తున్నాను.. గోమూత్రం తో శుద్ధి చేస్తున్నాను. మరొకనాడు ఆ నాలుక రుచి నందు ప్రవర్తించనంత కాలం అలా శుద్ధి చేస్తూనే ఉంటాను. ఈ మాట దేశ దేశాలు పొక్కుతుంది. కంచి పీఠాధిపతులు శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి వారికి తోటకూర పప్పు ఇష్టం అని.. తోటకూర పప్పు కి ప్రీతి పడిన వాడు పీఠాదిపతా.. ఈ పదవి లో కూచున్న నేను ప్రవర్తించని తీరు లో ప్రవర్తించాను. అందుకని శుద్ధి చేసుకుంటున్నాను. అన్నారు.

ఆనాటి నుండీ స్వామి వారికి వడ్డిoచిన భిక్ష లో పదార్ధాలు..లడ్డు కూర పప్పు పులుసు అన్ని కలపడమే.. ఇది బావుంది అన్న మాట కానీ బాలేదు అన్న మాట కానీ అయన నోటివెంట రాలేదు..

ఇది పరమాచర్య జీవితం 🙏🙏

ధర్మస్య జయోస్తు

 *ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు విన్నపం* 


-సామవేదం షణ్ముఖ శర్మ


ఇది ఎన్నికల సమయం. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత ప్రధానమైనవి. కాని ప్రపంచ వ్యాప్త పరిణామాలు గమనిస్తే ఈ ఎన్నికలు మరీ కీలకం. దేశ భవితవ్యాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పౌరుడు స్పందించవలసిన తరుణమిది.  


ఎండలెక్కువున్నాయనో ఎవరు ఎన్నికైతే మనకేమనే ఉదాసీనత చేతనో నేనొక్కడినే ఓటు వేయకపోతే ఏమయింది అనే భావన చేతనో బద్దకం చేతనో ఇంట్లో బైటాయించకుండా దేశం పట్ల బాధ్యతతో ఓటు వేయడం ప్రతివాడి కర్తవ్యం. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో చాలామటుకు వంద శాతం వోటింగు జరుగుతుంది. ఓటు వేయకపోతే జరిమానాలు కూడా వేసే ఉదంతాలు ఉన్నాయి. ఇంకా మన దేశంలో ఆ చైతన్యం పూర్తి స్థాయిలో జాగృతం కావడంలేదనే చెప్పాలి. 


ఈ నేపథ్యంలో ఉచితాల ప్రలోభాలకు లొంగిపోయే పౌరుల బలహీనతని ఆసరాగా తీసుకొని అవినీతి నాయకులు దూసుకుపోతున్నారు. వారు తమ ఆస్తులను ప్రజలకు పంచడంలేదు. ప్రజా ధనాన్ని ఎరవేసి మోసగిస్తారు అని కూడా తెలుసుకోలేని ప్రజలున్న దేశమిది. 


మరోవైపు ఓటు బ్యాంకులను తృప్తి పరచడం కోసం ఒక మతం వారికే ఈ దేశం సంపదని పంచిపెడతాం అని రాజ్యాంగ విరుద్ధంగా హామీలు ఇవ్వడం కూడా జరుగుతుంది. దేశం, భద్రత, అభివృద్ధి ఇలాంటివేవీ పట్టించుకోకుండా తమ మతాధిక్యం కోసం మూకుమ్మడిగా విజృంభిస్తూ ఇతర దేశాలలో వాసులుగా, భారతీయ పౌరులుగా ఉన్న తమ మతం వారిని ఈ దేశంలోకి ఈ సందర్భంలో రప్పిస్తూ ఓటును వినియోగించుకొంటున్న మతవాదులకీ వేర్పాటువాదులకీ కూడా ఇక్కడ కొదవ లేదు. వారికి దేశాభ్యుదయం, ప్రతి ఒక్కరి క్షేమం,  అభివృద్ధి వంటివి పట్టవు. వారు దేశాన్ని దెబ్బతీసి స్వార్థపరులతో చేతులు కలపడానికి కూడా వెనుకాడరు. అలాంటివారి శాతం పెరుగుతూ ఉంటే దేశ హితాన్ని కోరేవారు  ఉపేక్షించడం ప్రమాదకరం. 


ఎవరి పాలనలో ఈ దేశం సర్వతోముఖంగా అభ్యుదయ పథంలో ప్రయాణం చేస్తోందో ఉగ్రవాద తీవ్రవాద వేర్పాటువాదములు అణచివేయబడుతున్నాయో, ఎవరి నేతృత్యంలో శత్రు దేశాల నుండి ప్రమాదం లేని భద్రత రక్షణ మనకు లభిస్తున్నాయో, కుల మత వివక్ష లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయో, ఎవరి ఏలుబడిలో సాంకేతికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా స్వయం ప్రతిపత్తితో ప్రపంచ దేశాలలోనే మన దేశానికి గౌరవ ప్రతిష్ఠలు లభిస్తున్నాయో, ఎవరి నాయకత్వంలో అగ్ర రాజ్య స్థాయి వైపు పురోగమిస్తున్నామో, అందరితో కలిసి అందరి వికాసానికి పాటుపడే అంకిత భావం గోచరిస్తోందో, విద్య, విద్యుత్తు, సంపద కొదవ లేకుండా ఎవరి పాలనలో ప్రవాహమైందో, అవినీతిని నియంత్రించే నైతికత ప్రత్యక్షమవుతోందో అటువంటి మహనీయ నాయకులు పునః పునః ఈ దేశాన్ని పాలించాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగాలి, కదలాలి.


వంచనలకి, ప్రలోభాలకి, తాత్కాలిక ఉచిత ఫలాలకి ఆశపడితే శాశ్వత ప్రయోజనాలకి దూరమవుతాం. బద్దకంతో ఇల్లు కదలకపోతే మనమే నష్టపోతాం. దేశ సముజ్జ్వల భవిషత్తుతో పురోగమించాలంటే, పారులందరి జీవితాలు సౌఖ్యంగా సౌకర్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలి. ఇళ్ళ నుండి కదలాలి. అయిదేళ్ళలో ఒక్క రోజు మనం కేటాయిస్తే కొన్ని పదుల సంవత్సరాల వరకూ కూడా దేశ భవిష్యత్తుకు ఇక వెనక్కు చూడవలసిన అవసరం లేదు. విచక్షణ, వివేకం, సమగ్ర దెశాభ్యుదయం,  అలాగే ఈ దేశం యొక్క పరంపర, సంస్కృతి ఇది రక్షింపబడాలనే భావం ప్రతి పౌరునికి ఉండాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి వారు ఇందులో పాల్గొనాలి. 


అదే  సమయంలో విదేశాలలో స్థిరపడ్డ మనవారు ఏమి చెయ్యాలి, ఈ ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. విదేశాలలో ఇంకా భారతీయ పౌరసత్యం కోల్పోకుండా వర్క్ విసా మీద పనిచేసేవారైతే వీలైతే భారత దేశానికి వచ్చి ఓటు చేయడం చాలా ముఖ్యమైన కర్తవ్యం. అలా రాలేని పక్షంలో దూరాభారాల వల్ల కానట్లయితే మరొక పని చేయవచ్చు. అక్కడున్నటువంటి మనవారు అలాగే విదేశీ పౌరసత్వం తీసుకొన్నటువంటి భారతీయులు వీరందరికి దేశం మీద భక్తి ఉన్నది దేశం బాగుండాలనే కోరిక ఉన్నది కనుక అక్కడి నుంచే ఈ దేశంలో ఉన్నటువంటి తమ బంధుమిత్రులను ప్రేరేపించి వారు ఇల్లు కదిలి వోటు వేయడానికి తగిన స్ఫూర్తినివ్వాలి. 


అదే విధంగా దేశం, ధర్మం రక్షింపబడాలి; ఆ దేశీయతా భావం, జాతీయతా భావం, భక్తి భావం ఉండాలి, అటువంటి నేతృత్వం రావాలి అనే భావం అందరిలో కలిగించాలి. ఈ విధంగా ప్రతియొక్కరు ఈ సమయంలో ఉద్యమించి ఓటు హక్కును వినియోగించుకోవాలి.  ఎక్కువ శాతంలో మన తెలుగు రాష్ట్రాలలో ఓటింగ్ జరగాలి అని కొరుకుందాం. 


అంతే కాదు, ఓటర్ల లిస్ట్లో మన పేరు గల్లంతైతే ఉపేక్షించకుండా, వెనుతిరిగి వచ్చేయకుండా సంబంధిత ఎన్నికల కమీషన్ అధికారులకు తప్పకుండా ఫిర్యాదు చెయ్యండి. ఓటు మన హక్కు,  అది మనం వినియోగించుకోవాలి. దానిని ఎవరు తొలగించినా మనం ఊరుకోకూడదు. అదే విధంగా మనం పెందలకడనే వెళ్ళి ఓటు వెయ్యాలని నిర్ణయించుకోవాలి. ఆలస్యం చెయ్యకుండా పొద్దున్న లేచాక ఎంత తొందరగా ఓటు వేస్తామా అని అదొక ప్రధానమైన దైవ కార్యక్రమంలా చెయ్యాలి. ఈ విధంగా మనం అత్యంత శ్రద్ధతో ఓటువేసినట్లయితే దేశం భవిష్యత్తు చాలా బాగుంటుంది. సరైన ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన అభ్యుదయ దృష్టి కలిగిన పాలన రావాలని పరమేశ్వరుని ప్రార్థిద్దాం. 


ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావానాస్తు విశ్వస్య కళ్యాణమస్తు

వందే భారతమాతరం.


ధన్యోస్మి

Slokam


 

Generation of past


 

వైకుంఠపాళి

 *"వైకుంఠపాళి" - కొంచెం పెద్దదే, కానీ "చదివితే జీవితం తెలుస్తుంది."*


తెలుగు తోటలో పండిన విక్రమకేళి - వైకుంఠపాళి


 కేవలం నాలుగు గవ్వలతో మూడో నాలుగో చింత పిక్కలతో (ఆడేవాళ్ళ సంఖ్యను బట్టి) జీవితాన్ని ఆస్వాదించగలిగే, అనుభవించగలిగే, ఎదిరించగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగు వారి సృష్టి. తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి.


ఇందులో 11 వరుసలుంటాయి. ఒక్కో వరుసలో 11 గడులుంటాయి. మొత్తం 121 గడులు పూర్తయ్యాక 11 గడులలో ‘పరమపదసోపానపటము’ అక్షరాలు రాసి ఉంటాయి. ఆ పైన “ధరసింహాసనమైనభంబు గొడుగై తద్దేవత భృతులై...సిరిభార్యామణియై” అన్నట్లుగా పదిమంది దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. చివరకు చేరుకోవల్సిన స్థానం అది. అక్కడకు చేరుకొనే వరకు (జీవితమనే) ఆట ఆడుతూ ఉండవలసిందే. ఈలోగా ఒకటి నుంచి 121 వరకు ఎక్కుతూ దిగుతూనే ఉండాలి. పడుతూ లేస్తూనే ఉండాలి. అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని హెచ్చరిక.


పదకొండు అంటే సంస్కృతంలో ఏకాదశి. ఏకాదశీవ్రతం భారతీయులందరికీ ఆచరణీయం. ఏకాదశి మహా పర్వదినం. ఆ రోజు ఉపవాసం, జాగరణ, దైవస్మరణం అనే మూడూ తప్పని సరి. అలా 11 ఏళ్ళు వరుసగా ఏకాదశీ వ్రతం చేస్తే పరమపదం చేరుకోవచ్చనేది పురాణ కథనం. అయితే ఇదంతా ఆధ్యాత్మికం.


గెలుపోటములు మానసికానుభూతులు. పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్ధం. ఇదొక రకంగా అరచేతిలో వైకుంఠం. ఇందులో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రాలున్నాయి. నీ ఉన్నతి నీ చేతిలోనే ఉందని చెప్పడం. గవ్వలతో గెలవగలవని జీవితం కోసం ‘రవ్వ’ పెట్టుకోవద్దని ఉపదేశం.


ఇందులో చాలా గళ్ళలో ఏదో ఒక బొమ్మ, దానికో పేరు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని గళ్ళు అడ్డంగా దాటేస్తూ నిచ్చెనలు ఊరిస్తాయి. కొన్ని గళ్ళు అమాంతం దించేస్తూ ఉంటాయి. అంతలో ఉత్సాహం అంతలోనే నిరుత్సాహం. అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి. ఇదీ ఆట నడిచేతీరు.


ఈ ఆటలో పాములు, నిచ్చెనల గడుల్లోని పేర్లను నిశితంగా పరిశీలిస్తే అద్భుత రహస్యాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 75వ గడిలో ఒక పాము తల దగ్గర కర్కోటకుడు అని రాసి ఉంటుంది. దాని తోక 10వ గడిలోకి పాకుతుంది. అక్కడ పంది బొమ్మ ఉంటుంది. పాము కరవడం వల్ల కిందికి రావడం అనేది పైకి కనిపించే విషయం. జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందైపుడతావనేది ఆధ్యాత్మిక హెచ్చరిక. పందిలా హీనంగా చూస్తారనేది వ్యక్తిత్వ పాఠం.


అలాగే 55వ గడిలో ఒక పాము తల ఉండి దుర్యోధనుడు అని రాసి ఉంటుంది. దాని తోక 12 వ గడిలోకి పాకుతుంది. 43 గడులు కిందికి జారిపోవడం పైకి కనిపించే ఓటమి. దుర్యోధనుడు అసూయకు ప్రతిరూపం. దాని వల్లే కురు వంశ క్షయం. అలానే... మనమూ అసూయపడితే జీవితం నరకప్రాయమవుతుందని, సుఖ శాంతులు నశిస్తాయని హెచ్చరిక.


పాముల అమరిక ఇంత అర్ధవంతంగా ఉంటే నిచ్చెనల ఏర్పాటు మరింత పరమార్ధ బోధకంగా ఉంటుంది. 63వ గడిలో ఒక నిచ్చెన అడుగు భాగం ఉంటుంది. అక్కడ భక్తి అని రాసి ఉంటుంది. ఒక భక్తుని బొమ్మ ఉంటుంది. దాని కొస 83వ గడి వరకూ సాగుతుంది. అక్కడ బ్రహ్మలోకం అని రాసి ఉంటుంది. బ్రహ్మదేవుని చిత్రం ఉంటుంది. భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయమన్నది పరమైతే..ఏ పనైనా దాని మీద భక్తితో చేస్తేనే మంచి ఫలితాలొస్తాయన్నది ఇహం.


అలాగే 65వ గడిలో ఒక నిచ్చెన మొదలు ఉంటుంది. అక్కడ చిత్తశుద్ధి అని ఉంటుంది. దాని కొస 105వ గడిలో ఉంటుంది. అక్కడ మహాలోకం అని ఉంటుంది. మొత్తం వైకుంఠపాళిలో ఇదే పెద్ద నిచ్చెన. 40 గడులు అమాంతం ఎగబాకవచ్చు. ఇదంతా పైకి ఆశ పెట్టే విధానం. చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయని అంతరార్ధం. లోకంలో మహానుభావుడిగా కీర్తిపొందుతారని విశేషార్ధం. ఏ చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఇవాళ దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందో అటువంటి చిత్తశుద్ధి ప్రాధాన్యాన్ని చిన్నతనంలోనే పిల్లలకు ఆటల రూపంలో నేర్పిన ఏకైక జాతి మన తెలుగుజాతి.


ఇంత గొప్ప విషయాన్ని చెబుతూనే చెంతనే పొంచి ఉన్న ముప్పును గుర్తించి జాగ్రత్త పడమనడం ఈ ఆట ప్రత్యేకత. సాధారణంగా 105వ గడి వరకు రాగానే ఆటగాడికి కొంచెం గర్వం వస్తుంది. ఇంక 16 గడులు దాటితే పండిపోయినట్లే కదా అనుకుంటాడు. అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం. 106వ గడిలో అరుకాషుడు అనే అతి పెద్ద సర్పం ఉంటుంది. దాని నోట్లో పడితే అమాంతం కిందికి జారి మొదటి గడిలోకి అంటే కోతి లోకి వచ్చి పడతాడు. అంటే ప్రముఖుణ్ణి (సెలబ్రిటీ) అయ్యాను కదా అని గర్వించి ఒక్క పొరపాటు (ఒకటి వెయ్యడం)చేసినా మళ్ళీ ఆట మొదటికి రావడం ఖాయం అని హెచ్చరించడం అన్నమాట. పైగా వైకుంఠపాళి పరిభాషలో ఒకటిని గుడ్డి అంటారు. అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక్క గుడ్డి పనిచేసినా మళ్ళీ కిందకి జారిపోవడం తప్పదని చెప్పడం.


ఇంత జరిగినా ఆట మానకూడని పరిస్థితి ఇందులో విచిత్రమైన విషయం. ఒకడు పెద్దపాము నోట్లో పడినా ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతన్ని ఆడమని ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్ధిని సైతం బాగా ఆడమని ప్రోత్సహించే ఏకైక క్రీడ బహుశా వైకుంఠపాళీయే నేమో!


ఇంతకీ చివిరిదైనా చిన్నది కాని విషయం మరొకటుంది. చివర 121 వ గడిలో కూడా ఒక పాము ఉంటుంది. దానిపేరు అహంకారం. దానితోక 99 వ గడిలోకి ఉంటుంది. అంటే 106 లో అరుకాషుణ్ణి దాటినా, 115లో వైకుంఠంలో ప్రవేశించినా, 117లో కైలాసంలో దివ్యానుభూతి పొందినా చివరలో 121 లో అహంకారానికి లోనయితే తిరిగి రాక్షస జన్మ తప్పదు అని హెచ్చరిక. బ్రహ్మరుద్రాది దేవతల్ని తపస్సులతో ప్రసన్నం చేసుకొని మహాభోగాలు అనుభవించి లోకాలన్నీ జయించిన హిరణ్యకశిప, రావణాసురాది వీరులు చివరకు రాక్షసులై దుర్మరణం పాలుకావడానికి ఈ అహంకారమే కారణం కదా!


అంతిమంగా అహంకారం, మమకారం అనే రెండిటినీ జయించినవాడే పరమపదం చేరుకోగలడని సారాంశం.


జీవితమే ఒక వైకుంఠపాళి

నిజం తెలుసుకో భాయి!

ఎగరేసే నిచ్చెనలే కాదు

పడదోసే పాములు ఉంటాయి

చిరునవ్వులతో విషవలయాలను

ఛేదించి ముందుకు పోవోయి.


ఈ చలనచిత్రగీతం ఒక ప్రాచీన శ్లోకంలా, ఒక ప్రబంధ పద్యంలా, ఒక భావకవితలా, ఒక అభ్యుదయ గేయంలా ఎప్పుడూ తెలుగువారి చెవుల్లో మారుమోగుతూ గెలుపుకోసం వెన్ను తడుతూనే ఉంటుంది.🙏👏🤝👍🦜

ఈ రోజు పంచాంగం

 ఈ రోజు పంచాంగం 04.05.2024  Saturday 


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు చైత్ర మాస కృష్ణ  పక్ష: ఏకాదశి తిధి స్థిర వాసర: పూర్వాభాద్ర నక్షత్రం ఇంద్ర యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి  రాత్రి 08:36 వరకు.

పూర్వాభాద్ర  రాత్రి 10:05 వరకు. 

సూర్యోదయం : 05:52

సూర్యాస్తమయం : 06:34


వర్జ్యం : ఉదయం 05:56 నుండి 07:24 వరకు.


దుర్ముహూర్తం : ఉదయం 05:52 నుండి 07:34 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 02:44 నుండి 04:12 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

Jokes etc









 

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 04.05.2024  Saturday 


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు చైత్ర మాస కృష్ణ  పక్ష: ఏకాదశి తిధి స్థిర వాసర: పూర్వాభాద్ర నక్షత్రం ఇంద్ర యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి  రాత్రి 08:36 వరకు.

పూర్వాభాద్ర  రాత్రి 10:05 వరకు. 

సూర్యోదయం : 05:52

సూర్యాస్తమయం : 06:34


వర్జ్యం : ఉదయం 05:56 నుండి 07:24 వరకు.


దుర్ముహూర్తం : ఉదయం 05:52 నుండి 07:34 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 02:44 నుండి 04:12 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

ప్రాప్తిని అనుసరించి లబ్ధి!

 శు భో ద యం🙏


శుభోదయం🙏

             చొప్పకట్ల.


ప్రాప్తిని అనుసరించి లబ్ధి!


వనజభవుడు నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంమ్మొ కొంచెమో

విను మరుభూమి కేగిన లభించును, మేరువు చేరఁబోయినన్

ధన మధికమ్మురాదు;కడు దైన్యము మానుధనాఢ్యులందు న

వ్వననిధి నూతఁదుల్యముగ వారి గ్రహించు ఘటమ్ము చూడుమా?

-భర్తృహరి సుభాషితములు.ఏనుగు లక్ష్మణకవి.


భావం:ప్రాప్తిని బట్టి లబ్ధి.మనకెంతప్రాప్తియోఅంత మరుభూమికేగినా లభిస్తుంది.లబ్ధివ్రాసిపెట్టి లేకపోతే మేరుపర్వతం చుటూతిరిగినా మనకేమీ అంటదు.దైన్యంతో ధనవంతులచుట్టూతిరిగితే ఏంప్రయోజనం?

           కలశ ప్రమాణమునుబట్టినీరు.నీకలశమెంతపెద్దదో అంతనీరు సముద్రమందైనా నూతియందైనా లభించుట నిత్యము మనమెరిగినసత్యమేగదా!!

         "దృష్టాంతాలంకారము."

                        స్వస్తి!!

🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🕉️

సంకల్పము

 *శుభోదయం*

*********

 సంధ్యా వందన 

మరియు ఇతర

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ04.05.2024

శని వారం (స్థిర వాసరే) 

************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ చైత్ర మాసే కృష్ణ పక్షే ఏకాదశ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

స్థిర వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

చైత్ర మాసే  కృష్ణ పక్షే  ఏకాదశ్యాం

స్థిర వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.37

సూ.అ.6.16

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

చైత్ర మాసం 

కృష్ణ పక్షం ఏకాదశి సా.6.03 వరకు. 

శని వారం. 

నక్షత్రం పూర్వాభాద్ర

రా.7.55 వరకు. 

అమృతం మ.12.29 ల 1.58 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 5.37 ల 7.18 వరకు. 

వర్జ్యం   తె. 4.51 ల మరునాడు ఉ.6.19 వరకు. 

యోగం ఐంద్రం ఉ.9.01 వరకు.  

కరణం బవ ఉ.7.17 వరకు. 

కరణం  బాలవ సా.6.03 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ. 9.00 ల 10.30 వరకు. 

గుళిక కాలం.ఉ.6.00 ల 7.30 వరకు. 

యమగండ కాలం మ.1.30 ల 3.00 వరకు.      

*****************    

పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ   ఏకాదశి. 

****************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

వరూధిని ఏకాదశీ

 *_𝕝𝕝 ॐ 𝕝𝕝 నేడు - వరూధిని ఏకాదశీ 𝕝𝕝 卐 𝕝𝕝_*

*≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈*


*_వరూధిని ఏకాదశి ప్రాముఖ్యత_*


చైత్ర మాసం, కృష్ణ పక్ష ఏకాదశిని వరూధిని ఏకాదశి అని అంటారు. ఈ వ్రతం ఉత్తర భారత దేశంలో ఎక్కువగా ప్రచారంలో ఉంది.


పురాణాల ప్రకారం మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది.


ఈ పవిత్రమైన రోజున అత్యంత నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మరియు ఉపవాసం వంటివి చేస్తే మీకు దురదృష్టం పోయి, అదృష్టం వచ్చే అవకాశంతో పాటు మీరు ఇంతవరకు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వరూధిని ఏకాదశి వ్రతం కథ మరియు పూజా విధానాల గురించి తెలుసుకుందాం.


*_పద్మపురాణ ప్రకారం._*


పద్మపురాణం ప్రకారం, ఒకప్పుడు మంధత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండేలా పాలించేవాడు.


ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు, ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణు మూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడట. ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు.


అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యే సరికే రాజు గారి కాలును ఆ ఎలుగుబంటి తినేసిందట. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన రెండు చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు. ‘ఓ ప్రభూ, ఇది నాకు ఎందుకు జరిగింది, అప్పుడు రాజు పూర్వ జన్మల పనుల ఫలాలకు ఇదంతా కారణమని చెప్పాడట.


అయితే అదే సమయంలో అదే శ్రీవిష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడట. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్లీ మీకు తిరిగి లభిస్తాయని చెప్పాడు.


ఆ దేవ దేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందుతాడట.


అప్పటి నుండి వరూధిని ఏకాదశిని హిందువులలో చాలా మంది పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినాన ఎంతో నిష్టతో జరుపుకుంటారు.

 

*_భవిష్యోత్తర పురాణం_*


భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వరూధినీ ఏకాదశి వ్రత మహిమను గురించి చెప్పడం జరిగింది.


'ధర్మరాజా వరూధినీ ఏకాదశి వ్రతం పాటించడం వలన స్త్రీలు మాంగల్య బలాన్ని పొందుతారు. పురుషులు సత్ప్రవర్తననూ, సంఘం లో గౌరవాన్నీ, ధన సంపదలనూ పొందుతారు. అంతే కాదు వరూధినీ ఏకాదశి వ్రతం ఆచరించడం పదివేల సంవత్సరాలు తపస్సు చేయడం తో సమానమైనది. సూర్య గ్రహణ సమయం లో సువర్ణదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మాంధాత వరూధినీ ఏకాదశిని పాటించడం వలనే కష్టాలనుండీ బయటపడ్డాడు. అని స్వయంగా కృష్ణ భగవానుడే వరూధిని ఏకాదశి మహిమను కొనియాడాడు.


పరమపావనమైన ఈ రోజున ఇంటిలో లక్ష్మినారాయణులను భక్తితో పూజించి, పాలను నైవేద్యంగా ఉంచి, విష్ణు సహస్రనామములను, విష్ణు అష్టోత్తరములను పారాయణ చేసి, పాలు, పండ్ల వంటి సాత్వికాహారం తీసుకొని ఉపవాసం ఉండాలి. 


ఈ రోజున నిత్య పూజ, ఉపవాసాది కార్యక్రమములను చేయడం ద్వారా విశేషమైన సిరిసంపదలు కలుగుతాయి, సమస్త పాపముల నుండి విడివడి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. 


ఏకాదశి రోజున ఉపవసించి, దైవదర్శనం చేసుకుని జాగరణను పాటించేవారు ఇహలోకంలో సకల శుభాలనూ పొందగలరు. 

వారికి పరలోకం లోనూ సద్గతులు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకించి ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సహస్ర గోదాన ఫలితం లభిస్తుంది.


*_హరినామ స్మరణం_*

*_సమస్తపాపహరణం_*


 *_𝕝𝕝 ॐ 𝕝𝕝  oఓo నమో లక్ష్మీనారాయణాయ నమః 𝕝𝕝 卐 𝕝𝕝_*

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*04-05-2024 / శనివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఇంట బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగంగా  పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది.

---------------------------------------

వృషభం


దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల  ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో అకారణ  వివాదాలు కలుగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. వృత్తి  ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తికావు.

---------------------------------------

మిధునం


విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో  నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.  ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

కర్కాటకం


ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు  కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి  లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

సింహం


బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో  కొంత జాగ్రత్త వహించాలి. చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి.  వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి.

---------------------------------------

కన్య


చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

తుల


చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. బంధు  మిత్రుల నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యా అనుకూలత కలుగుతుంది.

---------------------------------------

వృశ్చికం


సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రుసమస్యలు  నుండి ఉపశమనం కలుగుతుంది. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.  ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి.  వ్యాపార ఉద్యోగాలు  మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

ధనస్సు


సన్నిహితులతో తగాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సంతానం విద్యా ఫలితాలు లభిస్తాయి. దూరప్రాంత ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------

మకరం


ఋణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాల వలన  శ్రమ పెరుగుతుంది. బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులలో  అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో  కొత్త సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున  ప్రతికూల పరిస్థితులుంటాయి.

---------------------------------------

కుంభం


కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో  ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ క్రయ విక్రయాల లాభిస్తాయి. 

---------------------------------------

మీనం


అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఋణ   ప్రయత్నాలు కలిసి రావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు  ఇబ్బంది కలిగిస్తాయి. గృహమున గందరగోళ వాతావరణం ఉంటుంది.  ఉద్యోగాలలో ఊహించిన సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

సరస్సు ఉండదు

 💎🌅  *_-|¦¦| శుభోదయమ్ |¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *న తపోనశనాత్తుల్యం*

       *న దానాత్పరమం సుఖమ్‌*।

       *న ధర్మస్తు దయాతుల్యో*

       *న జ్యోతిశ్చక్షుషా సమమ్‌*॥


తా𝕝𝕝 ఉపవాసమును మించిన తపస్సు, దానమును మించిన సుఖము లేదు. దయాతుల్యమైన ధర్మము, నేత్రముతో సమానమైన జ్యోతిస్సు లేదు.

      

  👇 //------ ( *భజగోవిందం* )------// 👇


శ్లో𝕝𝕝  

*వయసి గతే కః కామవికారః*

*శుష్కే నీరే కః కాసారః*

*క్షీణే విత్తే కః పరివారః*

*జ్ఞాతే తత్వే కః సంసారః* ॥10॥


భావం: వయస్సు మళ్ళిపోతే కామవికారాలుండవు.  నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. *అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు*

పెసరట్టు ఉప్మా కథ.*

 *పెసరట్టు ఉప్మా కథ.* 


💐💐💐💐💐💐 పూర్వం ఒక సినిమాలో ఒక రంజైన పాట వుంది. "అట్టు అట్టు పెసరట్టూ... ఉల్లిపాయ పెసరట్టూ... ఉప్మాతో జత పెట్టు... అరె చట్నీతోటీ కలేసి కొట్టు..." అని. ఉప్మా కి ఒక జత కలపండి. అదే పెసరట్టు... ఉప్మా కి పూర్వీకులు ముగ్గురు ఉండే వారు.  వారి పూర్వ వృత్తాంతం కూడా మనం చెప్పుకోవచ్చు. పెసరట్టు ఉప్మా కి వెనుక చాలా పురాతనమైన  పురాణం ఉంది. ఉప్మా కి పూర్వీకులు ముగ్గురు ఉప్పు పిండి,  చప్పిడి పిండి, పులుసు పిండి (పిండి పులిహార). ఘోర తపస్సు ఆచరించిన ఉప్పుపిండి 6 గురు  పుత్రికలు పొందింది. అవి వరుసగా: 1.వరినూక ఉప్మా. 2.జొన్ననూక ఉప్మా. 3.గోధుమనూక ఉప్మా. 4.మొక్క జొన్న ఉప్మా. 5.కొర్ర నూక ఉప్మా. 6.బొంబాయిరవ్వ ఉప్మా. మొదటి 5 గురు కన్యలు వివాహం చేసుకోకుండా, ఉపవాసములు, ఏకాదశినాడు ‌వ్రతములయందు భక్తులకు ఫలహారాలుగా సేవ చేయుచున్నారు. వీరి సేవకు మెచ్చిన పరమేశ్వరుడు, "మీకు ఏ వరం కావాలో కోరుకో" మన్నాడు. అంతట  ఆ అయిదుగురు మా ఆఖరి సోదరికి వివాహం జరిగి, దాని దాంపత్యం కలియుగాంతం వరకు అన్యోన్యంగా ఉండేలా వరమివ్వమని కోరగా పరమేశ్వరుడు సంతోషించి, నవగ్రహములలో విశిష్టత పొందిన  బుధుడి అంశతో జన్మించిన పెసరట్టు తో వివాహం జరిపించినట్టు పురాణం వచనం. అన్యోన్యంగా ఉండే దంపతులను  "పెసరట్టు - ఉప్మా ల్లా" కలిసి ఉన్నారనే  ఓ నానుడి ఏర్పడింది ! సర్వే ఉప్మా - పెసరట్ ప్రేమికాః సుఖినో భవంతు !


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

విశ్వనాథవారి ఆగ్రహం-----

 ------విశ్వనాథవారి ఆగ్రహం-----


"ప్రతివారూ వివేకవంతులే, అవివేకులు ఈ ప్రపంచంలో వుండడు. ఈ వివేకవంతులూ మూడు రకాలుగా వుంటారు. ప్రథములకు అసలు ప్రశ్నయే పుట్టదు, ద్వితీయులకు ప్రశ్న 

కలుగుతుంది, కానీ సమాధానం స్ఫురించదు, ఉత్తములకు ప్రశ్న పుట్టిన వెంటనే సమాధానం స్ఫురిస్తుంది." అనేవారు విశ్వనాథసత్యనారాయణ గారు. 


ఓరోజు ఓ కుర్రాడు ఈ కవిసామ్రాట్టును చూడటానికి వెళ్ళాడట. అక్కడ యింట్లో ఓపెద్దాయన 

మామిడికాయముక్కలు కొడుతున్నారు. పనిమనిషేమో ననుకున్నాడు కుర్రాడు. 

విశ్వనాథగారున్నారా? అనడిగాడు. ఆ పెద్దాయన కుర్రాణ్ణి ఓసారి పరీక్షగా చూసి లోపలికి  రమ్మన్నారు. నీ పేరేమిటి? అనడిగారు.చెప్పాడాకుర్రాడు. కుటుంబం,వూరు యిలా ఒక్కొక్కటీ అడుగుతుంటే ఆ అబ్బాయికి విసుగొచ్చింది.  ఇంతకీ విశ్వనాథగారు ఎక్కడా? అనడిగాడు. ఆయనతో నీకేం పని?అని ఎదురుప్రశ్న వేశారు ఆ పెద్దాయన. "వూరికే చూసిపోదామని" అన్నాడా అబ్బాయి. అంతే ఆయనకు కోపం తన్నుకొచ్చింది.


"వచ్చిన ప్రతివాడికీ నేనేం ధర్మదర్శనం ఇస్తానని చెప్పలేదు. నన్నేమి  చూస్తావు నా పిండాకూడు  ఎలాగూ వచ్చావు నాలుక్కాయలు తరిగేసి పో! నాక్కాస్త సాయం చేసినట్టైనా వుంటుంది." అని గయ్యిమన్నారు. దెబ్బకు కుర్రాడు ఆయన కాళ్ళమీద పడిపోయాడు.


క్షమించమని వేడుకున్నాడు.  మరుక్షణంలో విశ్వనాథవారి మనసు వెన్నపూసైపోయింది."లేరా అబ్బాయీ... నువ్వేదో కష్టపడి వచ్చావు గానీ నేను చదవవలిసినవాడినే గానీ చూడవలిసినవాడిని కాదురా" అంటూ అతడిని దీవించారు.


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*_మే 4, 2024_*

శ్రీ క్రోధి నామ సంవత్సరం* ఉత్తరాయణం* వసంత ఋతువు* చైత్ర మాసం* కృష్ణ పక్షం*

తిథి: *ఏకాదశి* సా6.04

వారం: *స్థిరవాసరే*(శనివారం)

🌼 *సర్వ ఏకాదశి* 🌼

ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏