7, ఏప్రిల్ 2026, మంగళవారం

( వాల్మీకి రామాయణం - 28)

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం  - 28)

                (పరశురాముడు  -  5)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

                              ----


       (6-4-'26 పోష్టు తరువాయి భాగము)


పరశురాముడు తాను జయించిన భూమండలాన్నంతా "కశ్యప మహర్షి" కి దానం ఇచ్చి మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.


అప్పటి నుండి భూమికి "కాశ్యపి" అన్న పేరు ఏర్పడింది.


అయితే భూమండలం అంతా పరిపాలకులు లేనందున "అరాచకం". అయింది.

చాతుర్వర్ణ్యాలు కట్టుబాట్లు తప్పినవి.

పరస్పర దోపిడీలతో భూమి అల్లకల్లోలం అయింది.


ప్రజల పాపకృత్యాలు భరించలేక భూదేవి "అతల లోకంలో" తలదాచుకున్నది.


కశ్యప మహర్షి అది గమనించి తన ఊరుతలంతో ధరిత్రిని ఉద్ధరించి జనులందరికి అమందానందం కలిగించాడు.

అందువల్ల ఆ నాటి నుండీ భూదేవికి " ఉర్వీ " అన్న పేరు వచ్చింది.


భూమాత కశ్యప మహర్షికి అంజలి ఘటించి వినయంతో ఇలా అన్నది.

" మహామునీ! నన్ను ధర్మంగా పరిపాలించే బాధ్యత క్షత్రియులదే.

హైహయుల అకృత్యాల వల్ల వారందరూ భగవంతుడైన పరశురాముని చేత సంహరింప బడ్డారు.

అయితే నా కరుణా దృష్టివల్ల కొంతమంది క్షత్రియులు ఇంకా అక్కడక్కడ శేషించి ఉన్నారు.

కొంతమంది "హైహయ వంశీయులు" ఇంకా బ్రతికి ఉన్నారు.

మరియు పౌరవాన్వయంలో జన్మించిన "విధూరధుని" కుమారుడు,

"సౌదాస"వంశీయులు కొంతమంది,

"శిబి చక్రవర్తి" పౌత్రుడు "గోపతి",

ప్రతర్దనుని కుమారుడు "వత్సుడు",

దధివాహనుని కుమారుడు, బృహద్రథుని వంశీయుడైన " భూరి",

మరుత్త నృపతి వంశీయులైన మువ్వురు రాకుమారులు,

ఈ మొదలుగాగల సుక్షత్రియ వంశ సంజాతులు

కొంతమంది నా చేత,

 కొంతమంది "ఎలుగుబంట్ల"చేత,

 కొంతమంది మహర్షులచేత,

కొంతమంది ధేనువులచేత,

కొందరు కొండముచ్చుల చేత,

కొంతమంది "మత్స్యముల"చేత,

మరికొందరు సముద్రని చేత, 

రక్షింపబడి జీవిస్తున్నారు.

వారందరినీ రావించి పరిపాలనా బాధ్యతలు అప్పగించి, ఈ అరాచకం నుండి నన్ను కాపాడ వలసినది",

అని ప్రార్థించింది.


కశ్యప మౌని ఆ ప్రార్థన మన్నించి,ఆ యా క్షత్రియ వంశాంకురాలను రావించి, వారికి ఆ యా ధరణీ భాగాలు అర్పించి, యథావిధిగా పట్టాభిషేక మహోత్సవాలు ఆచరించాడు.


వారి వంశాలలో తిరిగి అసంఖ్యాకమైన నృపాలురు ఆవిర్భవించారు.

అయినా దెబ్బతిన్న పాలకవ్యవస్థ పూర్తిగా కోలుకోలేదు.


దానిని చక్కదిద్ది, ధర్మమును సుస్థిరంగా స్థాపించటానికి  "శ్రీరామావతారం"  వచ్చింది.


సకలక్షత్రియ సంహారం చేసి,  మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకుంటున్న పరశురామునకు దశరథరాముడు చేసిన శివధనుర్భంగం విషయం తెలిసింది.


ఎంత గొప్ప తపస్సంపన్నుడైనా, తన తండ్రి హత్యకు కారణమైన క్షత్రియజాతిపై ద్వేషము ఆయనకు పూర్తిగా ఉపశమించలేదు.


అందువల్ల ఆయన జ్ఞానం మరుగున పడి రాముని యదార్ధ స్వరూపము తెలుసుకోలేక పోయాడు.


ఒక క్షత్రియుడైన రాముడు చేసిన

 "శివ ధనుర్భంగం" ఆయన సహించలేక పోయాడు.


తీవ్రమైన క్రోధంతో భూమి అంతా కంపిస్తుండగా వైష్ణవ ధనస్సు తీసుకొని  రాముని ముందు ప్రత్యక్షమైనాడు.


ఈ ధనుస్సు ఎక్కుపెడితే నీతో ద్వంద యుద్ధం చేస్తానన్నాడు రామునితో.


నిజానికి పరశురాముని అవతార ప్రయోజనము నెరవేరినది.


 తపస్సు వల్ల వచ్చిన నిగ్రహానుగ్రహ శక్తులు,

ముందు ముందు భోగానుభవమునకు ఏర్పడిన పుణ్యలోకాలు, 

ఆయన బ్రహ్మజ్ఞాని అవటానికి అవరోధములుగా ఉన్నాయి.

ఆయన దేహము ఋచీకమహర్షి క్షత్రమంత్రాలతో తయారు చేసిన చరువు వల్ల ఏర్పడింది. 

అందువల్ల ఆ ఉపాధి దోషం కూడా ఇంకా ఉంది.


పరశురాముడు చేసిన క్షత్రియ సంహారం వల్ల పాలకులు అధికార గర్వంతో చేసిన అకృత్యాలకు తెరపడింది.


అయితే ధర్మంగా ప్రజలను పరిపాలించడం  క్షత్రియజాతి వల్లే జరగాలి.

బ్రాహ్మణజాతి దాని కోసం సృజింపబడ లేదు.

ప్రజా పాలన,ధర్మ రక్షణ, క్షత్రియుల సహజ స్వభావం.

" చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ,కర్మ, విభాగశః" మొదలైన శ్లోకాలలో ఈ విషయం భగవద్గీతలో విశదీకరింపబడింది.


దెబ్బతిన్న పాలకవ్యవస్థను ఉద్ధరించి, ధర్మసంస్థాపన చేయడానికి రామావతారం వచ్చింది.


శ్లో// రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః /

చాతుర్వర్ణ్యం చ లోకే ౽ స్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి //

(ఈ లోకమునందు రాముడు వందలాది క్షత్రియ వంశములను స్థాపించును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను యథావిధిగా వారి వారి ధర్మముల నాచరించుట యందు, నియమించును)

(బాలకాండ - 1 - 96)


(సశేషం)

శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

7-4-'26.

శిశువులకు కలుగు రోగములు -

 శిశువులకు కలుగు రోగములు -


      పసివారికి కలుగు రోగములను బాల రోగములు అని పిలుస్తారు . బాలురకు కూడా పెద్దవారి వలే సమస్త రోగములు కలుగును. కాని మరికొన్ని వ్యాధులు గ్రహదోషములు వలనను , మాతృకా దోషముల వలనను కూడా కలుగుచున్నవి. గ్రహాదుల వలన కలుగు వ్యాధులు కాక సామాన్యముగా కలుగు రోగములు 22 రకాలుగా ఉండును. అని శార్ఙ్గధరుడు వివరించెను . ఇప్పుడు మీకు వాటి గురించి సంపూర్ణముగా వివరిస్తాను .


• వాతజము -


    వాతప్రకోపము చేత దేహమున పాలు దోషమును పొందినప్పుడు ఆ పాలను తాగించుట చేత శిశువు కంఠస్వరం మరియు శిశువు క్షీణించడం , మలమూత్ర , అపాన వాయువు నిరోధము కలుగుట వంటి సమస్యలు ఉత్పన్నం అగును .


• పిత్తప్రకోపం -


     పిత్తప్రకోపం చెందుట చేత పాలు దోషం పొంది ఆ పాలు సేవించుట వలన సర్వదా చెమటపట్టుట , మలము బురద వలే వెడలుట , కళ్లు ఉబ్బు , సర్వాంగముల యందు వేడి కలిగి ఉండును.


• శ్లేష్మజము - 


     శ్లేష్మ వికారముచే చెడిన పాలను త్రాపుట చేత చొల్లు కారుట , అతినిద్ర , ఒడలు బరువు వంటి సమస్యలు కలుగును.


• ధంతో భేదము -


     శిశువులకు కొత్తగా దంతములు మొలచునప్పుడు జ్వరం , భేదులు , వాంతులు , దగ్గు , తలనొప్పి కలిగి ఉండును.


• దంతఘాతము -


     5 , 7 , 8 సంవత్సరముల వయస్సున దంతములు రాలుట చేత జ్వరం వంటి ఉపద్రవములు కలుగును.


• దంత శబ్దము ( దంత హర్షము ) - 

 

   శిశువులు నిద్రలో ఉన్నప్పుడు పళ్లు కోరుకుట


• అకాల దంతము -


     శిశువులకు పండ్లూడు కాలమునకు ముందుగానే పండ్లు జ్వరాల వంటి ఉపద్రవాలు కలుగును.


• అహి పూతనము -

  

   క్షుద్రరోగము . శిశువులు నిద్రించు సమయమున పక్క మీదనే మలమూత్రములు విసర్జించగా ముడ్డిని తుడవకగాని , కడగక ఉండటం వలన ముడ్డి యందు దురద కలిగి వ్రణము ఏర్పడును .


• ముఖపాకము -

 

   శిశువుల నోరు పండినట్లు ఉబ్బుట .


• ముఖస్రావము -


   శిశువుల నోట చొల్లు కారుట .


• గుదపాకము - 


    శిశువుల ముడ్డి పండి వ్రణం ఏర్పడుట .


• ఉపశీర్షకము - 


   శిశువుల కపాల స్థానమున వ్రణము ఏర్పడి జ్వరం వంటి ఉపద్రవాలు కలుగును.


• మహావిసర్పి - 


     శిశువుల శరీరం నందు వాతాదిదోషము వికారం పొందుట వలన మహాపద్మము అనే విసర్పి రోగము పుట్టును . ఇది చాలా తీవ్రంగా ఉండును. గుదస్థానము నందు ఎర్రటి తామర వలే ఉండును . హృదయము మొదలు శిరస్సు వరకు వేదనాభరితముగా ఉండును.


• తాలుకంటకము - 


    శిశువుల దవడల యందు శ్లేష్మ ప్రకోపము చేత ముండ్లవలే గరగరలాడుచుండి కఫము పడుట .


• విచ్ఛిన్నము - 


   తాలు పాకము . - శిశువుల దవడల యందు పల్లము పడుట చేత శిశువు పాలు త్రాగక నీళ్ల వలే మలము , విసర్జించునప్పుడు కడుపునొప్పియు , నేత్ర కంఠముల యందు వికారం , తాగినపాలు గొంతు దిగక కక్కుట వంటి సమస్యలు కలుగును.


• పారిగర్భికము -. 


     తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చు పాలను శిశువు తాగుటచేత శిశువుకు ఆ దోషమున దగ్గు , అగ్నిమాంద్యము , వాంతులు , కండ్లమబ్బు , అరుచి , భ్రమ , కాళ్లు చేతులు సన్నం అగుట , కడుపు పెరుగుట మొదలగునవి కలుగును. ఈ సమస్య తల్లి గర్భముతో నుండకుండా ఉన్నను ఆమె పాలు తాగినను కొందరికి కలుగును.


• దౌర్బల్యము - 


   శిశువుల శరీరముకు దుర్బలత్వము కలుగుట.


• గాత్రశోషము - 


  ఏ దోషము వల్లనైనా శిశువు శరీరం కృశించుట .


• శయ్యా మూత్రము - 


   వాత వికారముచే శిశువు రాత్రియందు గాని పగటి యందు గాని పక్కపైన మూత్రమును పలుమార్లు విడుచును.


• కుకూనము - 


   చంటి పాల దోషముచే శిశువుల కనురెప్పల యందు దురద కలిగి దానిని నలుపుట చేత సూర్యుని తేజస్సు చూడనీయక పలుమార్లు కన్నీరు కార్చును .


• రోదనము -


     పిల్లలు సదా ఏడ్చుచుండును.


• ఆజగల్లి -


    శ్లేష్మ ప్రకోపము చేత శిశువు ల శరీరమున పెసరగింజల వంటి కురుపులు కలిగి వేదనాయుక్తమై శరీరం పాలిపోయినట్లు ఉండును. పైన చెప్పిన విధముగా 22 రకాలుగా శిశు సంబంధ దోషములు కలుగును. సరైన పద్ధతిలో సమస్యని గుర్తించి చికిత్స చేయవలెను .


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .



07ఏప్రిల్ 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    *🍁మంగళవారం🍁*

  *🌹07ఏప్రిల్ 2026🌹*

   *దృగ్గణిత పంచాంగం* 

                

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - కృష్ణ పక్షం*

 

*తిథి : పంచమి* సా 04.34 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : జ్యేష్ఠ* రా.తె 05.54 వరకు ఉపరి *అనూరాధ*

*యోగం : వ్యతీపాత* సా 04.17 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం  : తైతుల* సా 04.34 *గరజి* రా.తె 05.48 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

*మ 12.00 - 01.00 సా 04.30 - 06.00*               

అమృత కాలం  :*రా 08.01 - 09.49*

అభిజిత్ కాలం  : *ప 11.45 - 12.34*

*వర్జ్యం    : ఉ 09.14 - 11.02*

*దుర్ముహూర్తం  : ఉ 08.27 - 09.16 రా 11.00 - 11.46*

*రాహు కాలం  :మ 03.15- 04.48*

గుళికకాళం      : *మ 12.10 - 01.43*

యమగండం    : *ఉ 09.04 - 10.37*

సూర్యరాశి : *మీనం*                    

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం *ఉ 06.06*

సూర్యాస్తమయం :*సా 06.30*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం       :*ఉ 05.58 - 08.27*

సంగవ కాలం       :*08.27 - 10.55*

మధ్యాహ్న కాలం    :*10.55 - 01.24*

అపరాహ్న కాలం    :*మ 01.24- 03.53*

*ఆబ్ధికం తిధి        : చైత్ర బహుళ పంచమి*

సాయంకాలం       :*సా 03.53- 06.21*

ప్రదోష కాలం        :*సా 06.21- 08.40*

రాత్రి కాలం       :*రా 08.40 -11.46*

నిశీధి కాలం      :*రా 11.46 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.24- 05.11*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం 🍁*


*సింధూర తైల రచి తాతి విభూషణాత్మన్!*

*లాంగూల తాడ నకృతాసుర సంఘ నాశ!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 6 ఏప్రిల్ 2026*


         *శ్రీ మహావిష్ణు పురాణం*

` `` *49వ భాగం*``


*గజ్రేంద మోక్షము - మకర సంహారం - గజేంద్ర రక్షణం*```


మొసలిని భూమి పైకి లాగి ఓడించాలని ఏనుగు, ఏనుగుని నీటిలో ముంచి ఓడించాలని మొసలి తమ శక్తి సామర్థ్యాలు పూర్తిగాపెడుతూ పోరాడుతున్నాయి. ఆడ ఏనుగులు తీరం నుంచి ఏమి చేయలేక తమ నాథుడుకి కలిగిన పరిస్థితికి దుఖిస్తున్నాయి. కరి మకర పోరాటం గంటలుదాటి రోజులకి మారింది. స్థాన బలిమి వలన రోజులు గడిచేకొద్ది మొసలి బలం పెరుగుతూ ఏనుగు బలం క్షీణిస్తోంది.


గజరాజుకి తనకు ఓటమి, మరణం తప్పదని తెలిసి వస్తోంది. శక్తి సామర్థ్యాలు పూర్తిగా క్షీణించాయి. తనను లోకేశ్వరుడైన శ్రీహరిమాత్రమే రక్షించగలడని అర్థమైంది.

అంతబాధలో,మరణంతప్పదన్న ఆఖరి క్షణాల్లో ఆకాశం వైపు తల ఎత్తి, తొండం ఎత్తి నారాయణుని రక్షించమని ప్రార్ధించింది. పోతనా మాత్యులు భాగవతంలో చెప్పిన సుప్రసిద్ధ పద్యం గజేంద్రుడి పరిస్థితిని తెలియజేస్తుంది.. ```

"లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్ 

ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె, దనువుదస్సెన్శ్రమంబయ్యెడిన్||

నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింపదగున్ దీనునిన్

రావే ఈశ్వరా! కావవే వరద! సంరక్షింపు భద్రత్మాకా||"```

మంచి చేసే మనస్సు గల శ్రీహరీ! నా బలము పూర్తిగా నశించింది. ధైర్యము సన్నగిల్లిపోయింది. పంచప్రాణాలు శరీరంలో తమ స్థానాలు వదలివెళ్లిపోతున్నాయి. శరీరం అలసి సృహతప్పుతోంది. ఈ కష్టం, బాధ తట్టుకోలేక పోతున్నాను. నాకు నీవు తప్ప వేరెవ్వరు తెలియదు. ఈ దీనుని మన్నించి రక్షించడానికి రావయ్యా! ఓ శ్రీహరీ! భక్తులు కోరిన వరాలిచ్చే వరదరాజా! ఈశ్వరా!నన్ను రక్షింపుము!


గజేంద్రుని హృదయం నుండి రక్షించమని ప్రార్ధిస్తూ వెలువడిన దీనాలాపాలు లోకాలన్ని దాటి వైకుంఠంలో మహాలక్ష్మితో 

సరసమాడుతున్న శ్రీహరి చెవులకు చేరాయి. భక్తుల పిలుపులకు తక్షణమే స్పందించే ఆర్తత్రాణ పరాయణుఢైన నారాయణుడు గజేంద్రుడి మొర ఆలకించగానే ఉన్నవాడు ఉన్నట్లే వైకుంఠం వదలి గజేంద్రుని రక్షించడానికి త్రికూట వనము వైపు వేగంగా బయలుదేరి వెళ్ళసాగాడు. 


ఈ సన్నివేశం వర్ణిస్తూ పోతన గారి పద్యం చదువుదాం..```

"సిరింకింజెప్పడుశంఖచక్రయుగముం జేదోయి సంధింప డే

పరివారంబును జీరడభ్రగపతిం మన్నింపడాకర్ణికాం

తర థమిల్లము చక్కనొత్తడు వివాదప్రోద్ధత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై||"```

గజేంద్రుడి ప్రాణం రక్షించాలనే తొందరలో శ్రీహరి లక్ష్మికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో తీసుకోలేదు. పరివారాన్ని రమ్మనలేదు. గరుత్మంతుడి పైన ఆధిరోహించ లేదు. చెవులవరకు జారిన జుట్టును సరిచేసుకోలేదు. చదరంగంలో ఓడి తన చేత చిక్కిన లక్ష్మీదేవి పైటను వదలలేదు. అలాగే పట్టుకుని బయలుదేరి వెళ్లాడు.


లక్ష్మీదేవి, గరుడుడు, ఆదిశేషుడు ఆశ్చర్యంగా చూస్తూ హరి వెంట కదిలారు. వారి వెనుక శంఖచక్ర గదాది ఆయుధాలు. నారదుడు, విష్వక్సేనాది వైకుంఠపుర వాసులు వెళుతుంటే ఊర్ధ్వలోకాల వారైన బ్రహ్మ మహేశ్వర ఇంద్రాది దేవతలు, దేవర్షులు, గంధర్వాదులు ఆశ్చర్యంగా చూస్తున్నారు.


త్రికూట పర్వత సమీపానికి వచ్చిన నారాయణుడు కింద సరస్సులో మొసలి నోటికి కాలు చిక్కి రక్షించమని తనను ప్రార్ధిస్తున్న గజేంద్రుని చూసాడు. క్షణమైనా ఆలస్యం చేయకుండా చక్రాన్ని తలచి చేతికి రాగానే మకరం పైకి ప్రయోగించాడు. 


ముల్లోకాలు కంపించి పోయేట్టు ధ్వని చేస్తూ సుదర్శన చక్రం కదిలింది. చక్రభ్రమణ వేగానికి అగ్ని కణాలు ఉత్పన్నమై ఆకాశాన్ని ప్రకాశితం చేస్తూంటే, సరస్సులోకి దూసుకు వెళ్లి గజేంద్రుని కాలు పట్టుకున్న మొసలి కంఠాన్ని ఖండించి వేసింది.


గజేంద్రుడు తెగిన మొసలి శిరస్సు పట్టు వదలించుకున్నాడు. బాధ తొలిగి ఉపశమనం లభించింది. ఆడ ఏనుగులు సరస్సులో దిగి గజేంద్రుని చుట్టూ చేరి చల్లని నీటిని జలధారలుగా పోస్తూ అలసిన శరీరానికి స్వాంతన చేకూర్చాయి. గజేంద్రుడు తన భార్యలతో కలసి సరస్సులోని పద్మాలు తొండాలతో తీసుకుని శ్రీమహావిష్ణువుకి సమర్పిస్తూ, ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు అర్పిస్తూ ఘీంకారం చేసాడు.


శ్రీహరి చేతిలోకి వచ్చిన పాంచ జన్య శంఖాన్ని పూరించి విజయ నాదం చేశాడు. దేవదుందుభులు మ్రోగాయి.లక్ష్మీదేవిచెంతచేరింది. చతుర్భుజాలలో గదా శంఖ చక్ర పద్మాలు విరాజిల్లగా లక్ష్మీదేవి సమేతుడై గరుత్మంతుడి ఫై ఆసీనుడై గంజేంద్రునికి దర్శన మిచ్చాడు. దేవతలు పుష్ప వర్షం కురిపిస్తూ స్తుతి సోత్రానికి చేశారు.


మకర సంహారంతో శాప విముక్తుడైన గంధర్వుడు భార్యతో కలసి లక్ష్మీనారాయణులకు భక్తి శ్రద్థలతో నమస్కరించి నారాయణ నామాన్ని స్మరిస్తుగంధర్వలోకానికి వెళ్లి పోయాడు.


శ్రీమహావిష్ణువు గంజేంద్రుని దగ్గరకు వచ్చి తన దివ్య హస్త స్పర్శతో అనుగ్రహించి ముక్తి ప్రసాదించాడు. గజేంద్రుడు, అతని భార్యలు తమ దేహాలు వదిలి ఆత్మజ్యోతులుగా వెళ్లి శ్రీహరిలో లీనమయ్యారు. తనను స్తుతిస్తున్న నారదాది మహర్షులను, ఇంద్రాది దేవతలను శ్రీమహావిష్ణువు మందహాసంతో చూసి..”దేవతలారా! మహర్షులారా! నేను భక్తవత్సలుడను. నిరంతరం నా నామం జపించే వారిని, దేవతలా మానవులా జంతువులా అని చూడకుండా ఆపద కలిగి నప్పుడు వెంటనే వచ్చి రక్షించి కాపాడుతాను. ఈ గజేంద్ర రక్షణమే ఇందుకు నిదర్శనం. నా భక్తుడైన గజేంద్రుని మకర బంధం నుండి విడిపించి మోక్షం ప్రసాదించాను.


ఈ గజేంద్ర మోక్షము కథ విన్నవారికి, చదివినవారికి దుఖాలు తొలగి శుభాలు, కీర్తి జయాలు కలుగుతాయి. నిత్య పారాయణ చేసినవారికి మరణానంతరం మోక్షము లభిస్తుంది” అని లక్ష్మీదేవితో కలసి గరుత్మంతుడిపై వైకుంఠానికి వెళ్లి పోయాడు.


               *(సశేషం)*

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏