23, మే 2025, శుక్రవారం

లోకేశ్వరునకు అంజలి!!

 లోకేశ్వరునకు అంజలి!!


"ఎవ్వనిచే జనించు ?జగమెవ్వని లోపలనుండు లీనమై,?

ఎవ్వనియందు డిందు,? పరమేశ్వరుడేవ్వడు,?మూలకారణం,

బెవ్వ,?డనాది మధ్య లయుడేవ్వడు, ?సర్వము తావెయైనవా,

డెవ్వడు,?వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదవ్;


లోకమంతా ఎవనిచే సృష్టింపబడుచున్నదో,?పోషింపబడుచున్నదో,?లయింపబడుచున్నదో,?


పుట్టుట, పెరుగుట,గిట్టుటలు యెవనితిలేవో,?

ఎవనియందీసృష్టి పరివృధ్ధినొందుచున్నదో,?పరమేశ్వరుడెవ్వడో,సకలమునకూ మూలకారణమెవ్వడో,?నాహృదయమున చైతన్యరూపుడైనిలచిన ఆసర్వేశ్వరుని శరణువేడెదను.!!


       బమ్మెఱపోతన భాగవతములోని గజేద్రుని ప్రార్ధనమిది.

       గజేంద్రుడు సకలజీవకోటికి ప్రతినిధి

.అహంకారమున్నంతవరకూ పరమేశ్వరుడు గుక్తుకురాడు.

అహంకారమణగినంతవే జీవునకు పరమాత్మజ్ఙప్తికి వచ్చును.

సహజమైన యీపరిణామమును పోతన కడుంగడు సహజముగా చిత్రించి నాడు.


          మనమందరము గజేంద్రులమే! భోగపరాయణులమైఅహంకార మమకారములలో మునిగి,యాదేవదేవునకు నానాటికి దూరమవుచున్నాము.

ఒక్కసారి మనయాత్మలను పరిశీలించికొందము.మరచిన యాపరమేశ్వరుని పాదపద్మములకు ప్రణమిల్లి,మనలోనియహంకారరూపమైన గ్రాహమును పరిమార్చి, భవసాగర తరణము నొనరింజేసి రక్షింపు మనిశరణువేడెదముగాక!

                           స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పోతన పాత్ర చిత్రణ

 శు భో ద యం 🙏


పోతన పాత్ర చిత్రణ 


                    ఉ: కాటుక కంటినీరు చనుగట్ల పయింబడ నేలయేడ్చెదో?


                          కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! యోమదంబ! యో


                         హాటకగర్భురాణి! నిను నాకటికైఁ గొనిపోయి యల్ల క


                         ర్ణాట కిరాట కీచకులకమ్మ ;త్రిశుధ్ధిగ నమ్ము; భారతీ!


                                        -- చాటువు ;


                 ఉ: కోపము తోడ నీవు దధి భాండము భిన్నము సేయుచున్నచో


                        గోపిక త్రాటఁగట్టిన వికుంచిత సాంజన భాష్ప తోయ ధా


                        రా పరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం


                      బాపఁడవై నటించుట గృపాపర ! నామదిఁ జోద్యమయ్యెడిన్ ;


                                        భాగ-ప్రథ-స్కం: 181 పద్యం: కుంతి కృష్ణుని స్తుతించుట;


                                          ఆంధ్ర సాహిత్య క్షేత్రాన్నలంకరించిన కవితల్లజులలో పాత్ర చిత్రణ విషయమున కవులందరు నొకయెత్తు. బమ్మెరపోతన యొకయెత్తు. అతడుచిత్రించిన పాత్రలన్నియు శబ్దచిత్రములే! కానీ,అందుకొన్ని నిశ్చలనములు, మరికొన్ని చలనములు.

ఆపాత్రలు పోతనగారితో మాటగలిపిమాటాడినవే! మనకుగూడ నట్టి మనః పరిణామము గల్గినచో నవిమనతోగూడ మాటాడగలవు.

"పాత్రకు తగిన యాకారము. ఆకారమునకు దగిన ఆహార్యము. ఆహార్యమునకుదగిన వేషము.దానికితగనమాటలు .మాటలకు దగిన చక్కనిపదములకూర్పు. పోతన చిత్రణలోని విశేషములు.


                                        పైరెండుపద్యములలో మొదటిది పోతన సరస్వతి నోదార్చుట. ధనముపై నాశతో భాగవత గ్రంధమును నరాంకిత మొనరించునేమోనని యనుమానమంది చదువులతల్లి దీనవదనయై కన్నులనీరుగార దేవతార్చనా పీఠమున నున్నపోతనకన్నుల

కగుపించినదట! పోతనయామెరూపమును గాంచి నివ్వెరపోయెను,." అమ్మా! సరస్వతీమాతా! కాటుక తో దిగజారు కన్నీరు వక్షోజములపై బడగా నేలనమ్మా విలపింతువు? ఓహో! ధనాశతో నిన్నముకొందుననియా నీవిచారము. అటులెన్నటికి జరుగదు. త్రికరణ శధ్ధిగా జెప్పునామాటను నమ్ము. మనుట"-. ఇది నిశ్చలన చిత్రమే! ,ఆజగదంబ కన్నులనీరుగార్చుట. కన్నులకున్న కాటుక కరగి కన్నీట గలసి చనుగట్లపై బడుట. ఆహా! ఏమాచిత్రణము! మనోముకురమున గాంచగల్గినవాని జీవితము ధన్యము.


                                   ఇఁక రెండవ చిత్రము చలనము. బాలకృష్ణుని కొంటేపనులను దలచుకొని కుంతి కృష్ణుని ప్రస్తుతించుచు నాడిన మాటలు. ఆమాటలవెనుక నార్తియున్నది. అభిమానమున్నది. భక్తియున్నది. ఆప్యాయతను రంగరించి చిత్రించిన యీచిత్రము అపూర్వము.


                                    "కృష్ణా! యేమి చెప్పనయ్యా నాటి ముచ్చటలు. బాల్యమున నీవొకనాడొకగోపిక యింటికేగి. దధి భాండమును కోపముతో పగులగొడితివి. ఆగోపికయు కోపమున నిన్ను త్రాటితోగట్టివేయుచో, మొగమొక వంకకు వంచి,కన్నుల కాటుక కన్నీరుగార

దానినంతయు నిరుచేతులతో మొగమంతయు పులుముకొనుచు వేడినిట్టూర్పులను విడచుచు బాలునివలె నటించుట నేడుదలచికొనిన నాకు చోద్యమనిపించునయ్యా! కొంటె కృష్ణయ్యా! యెంత దొంగ నటన! భక్తిపాశములచే గట్టుబడు నీవు సామాన్యమగు త్రాట బంధింపఁబడుట నటన గాకమరేమి? "- యనిమేనత్తమాటలు.


                                  త్రాటగట్టబడుట , సాంజన భాష్పతోయ సిక్తమైన మోమును చేతులతో పులిమికొనుట. అప్పటి కృష్ణయ్య ఆ యాకారము. ఇవియన్నియు పోతన పాత్రచిత్రణము లోని మెళకువలు.చివరకు అంతవాడ వింతవాడ వైతివే యని యాశ్చర్యమును ప్రకటించుట. యతని రచన లోని చమత్కారము. 


                                                                  ఇదండీ పోతన గారి పాత్ర చిత్రణలోని గొప్పతనం!


                                                                                                   స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

తిరుపతి వైంకట కవుల అవధాన జైత్ర యాత్ర!

 శు భో ద యం 🙏


తిరుపతి వైంకట కవుల అవధాన జైత్ర యాత్ర! 


                                            తిరుపతి వేంకట కవుల అవధాన జైత్ర యాత్ర సాగిన తీరు తెన్నులను వారీ పద్యంలో ఘనంగా వివరించారు. వినండి యిది మీకోసమే!!


         ఉ: 

""ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మెచ్చగ నిక్కినాము, స 

   న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియిమచినార, మె 


   వ్వానిని లెక్కపెట్టక నివారణ దిగ్విజయమ బొనర్చి ప్ర 

   జ్ఙా నిధులంచు పేరుగనినారము నీవలనన్ సరస్వతీ!!! 


               గజారోహణ సన్మానం చాలా విశిష్ట మైనది. వెళ్ళిన ప్రతి యాస్థానంలోను ఘన సన్మానములే! యిదంతా అమ్మా సరస్వతీ నీకృపవల్లనే నమ్మా అంటారు .యెంతవినయం! 


                           కవిత్వం చెప్పటం యెంతకష్టం! అందులో ఆశువు మరీకష్టం!శ్రోతల మనోరంజకంగా, అర్ధవంతంగా ఆశువు చెప్పాలంటే యేమేమి చేయాలో తమనానారాజ సందర్శనంలో వివరించారు. 


                  సీ: " చదువగావలె శబ్ద శాస్త్రాదికమ్మును 


                                               వీక్షింపగావలె విద్య లెల్ల; 


                        చూడగావలె రాజచూడా మణుల సభల్ 


                                                పొందగావలె మహా భోగములను; 


                          తిరుగగావలె దేశ దేశాల వెంబడి 


                                                  పడవలె పడరాని పాటులెల్ల; 


                          వినగావలెను పూర్వ విద్వత్ చరిత్రముల్ 


                                                         దర్శింపవలెను ఛంధః ప్రశంస; 


                        కవులు కవులన్న మాత్రాన కవులుగారు , 

                              

                       ్ఎంత భారమ్ము గలదొ కవీశ్వరులకు 


                               యింత కృషి జరిపితే అతడు కవియౌతాడట!🙏🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷☝🏻

మరుమల్లెల కన్న తెలుపు

 *2020*

*కం*

మరుమల్లెల కన్న తెలుపు

విరి తేనెలకన్న తీపి వెలకట్టగ నే

సిరులకు సరికాని సిరియు

పరమాత్మ కు రూపు తల్లి పదవిల సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మరుమల్లెల కన్నా తెల్లని, విరితేనెల కన్నా తీయని వెలకట్టలేని సిరి ఈ లోకంలో తల్లి పదవి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Panchang

  


కసవింద

 కసవింద - 

 

తెలుగు - కసవింద . 

  

 సంస్కృతము - కాసమర్ధ . 

  

 హింది - కసౌందీ . 

 

 లాటిన్ - Cassia occidentalis linn . 

 

 కుటుంబము - Caesalpinaceae . 

  

 రూపలక్షణాలు - 

    

కసవింద చెట్టు క్షుపజాతికి చెందినది . గజము ఎత్తువరకు పెరుగును . ఇది సన్నని , వెడల్పు ఆకుల బేధము కలిగి ఉంటుంది . ఆకులు 3 అంగుళముల పొడవు కలిగి 2 అంగుళముల వెడల్పు కలిగి మిరపకాయలను పోలి ఉండును . దీని కాయలు ఉలవకాయల వలే సన్నముగా 5 నుంచి 6 అంగుళముల పొడవుగా ఉండును. దీని ఆకు కొంచము నలుపురంగుగా పొడవుగా కొనగలిగి ఉండును . పసుపుపచ్చని అందమైన పూతలు పూయును . బీజములు గుండ్రముగా , బల్లపరుపుగా , నునుపుగా ఉండును . ఇది సర్వత్రా జలము గల భూముల యందు ఉండును కొన్ని ప్రదేశాలలో గుబురుగా ఒకేచోట ఎక్కువుగా ఉండును . 

  ఈ కసవిందలో 3 రకాలు కలవు . అవి 

  

    * కసవింద సాధారణమైనది . 

    * కమ్మ కసవింద . 

    * కొండ కసవింద లేదా తీట కసవింద . 

        

. పై మూడింటిలో కొండ కసవిందకు ముండ్లు గల ఆకులు ఉండటం మూలన తీట కసవింద అని కూడా పిలుస్తారు . ఇది మామూలు కసవింద మాదిరి పొదలా పెరగక నేలను పాకి అల్లుకొనును . 

  

. గుణగణములు - 

     

  కసివింద ఎక్కువ చేదు , కొంచం మధురంగా ఉండును . వేడిగా , జీర్ణకారిగా , కంఠమును శుభ్రపరచునదిగా , కఫము , వాతము , అజీర్ణము , దగ్గును , పిత్తమును హరించునదిగా ఉండును . త్రిదోషములను హరించు శక్తి కలిగినది . విషములను పొగొట్టును . గాయములను , చర్మవ్యాధులను , నేత్రరోగములను , గడ్డలను పోగొట్టును . వాతసన్నిపాతములను హరించును . ఉదర రోగములను హరించును . అతిమూత్రవ్యాధి నివారణ అగును . 

           

. కసవిందాకు కూర కొంచము చేదుగా , వెగటుగా ఉండును . వేడిని , పిత్తమును కలిగించును . కఫవాతములను , నులిపురుగులు పడుటను , ఆయాసముతో కూడిన దగ్గులను , చర్మవ్యాధులను పోగుట్టును . ఆకలిని కలిగించును . ఇందులో కమ్మ కసవిందకు కూర తియ్యగా , రుచిగా ఉండును . వాతములను పోగొట్టును . పొత్తికడుపును శుభ్రపరచును . రక్తపిత్తములను , క్రిమిరోగమును పోగొట్టును . మంచి వీర్యవృద్ధిని ఇచ్చును . 

        సాధారణముగా కసవిందకాయలు లేతవి వండుకొని తినినచో కొంచం వేడిచేయును . కాని శ్వాసకాసలు , వాతములు , జ్వరముల యందు పథ్యముగా ఉపయోగించదగినది . కొండకసవింద , కమ్మ కసవింద కాయలు మాత్రం కూరకు ఉపయోగించరాదు . వాతరోగము అత్యంత తీవ్రముగా ఉన్నప్పుడు మాత్రమే తక్కువ మోతాదులో ఇవ్వవచ్చు . 

     

. కమ్మ కసవింద రసము , చూర్ణము సాధరణ కసవింద వలె చేదుగా ఉండక తియ్యగా ఉండును . దీని ఆకును కూరగా కాని లేదా పులుసుకూరగా గాని వండి తినుదురు . ఇది రుచిగా , స్వాదుగా ఉండును . కొండ కసవింద ఆకుల రసముగాని , కషాయము గాని జ్వరములను , సన్నిపాతములను , ఉదరరోగములను నశింపచేయును . వేరుచెక్క విషజ్వరాలను హరించును . ఇది రుచికి కారముగా ఉండి అగ్నిదీపనమును కలిగించును . దీని వ్రేళ్ళు , కాయలు వేసి కాచిన తైలము మర్దించిన వాతపునొప్పులు నెమ్మదించును . నీళ్ల విరేచనములు పోగొట్టు గుణము కలిగినది . దీని రసపు మోతాదు 3 తులముల ఎత్తు , కషాయం మోతాదు 5 తులముల ఎత్తు వరకు ఇవ్వవచ్చును . సాధరణ కసవింద చూర్ణం లోపలికి పుచ్చుకునే మోతాదు 2 నుంచి 4 చిన్నముల ఎత్తు వరకు ఉండవచ్చు . 

  

 ఔషధోపయోగములు - 

  

 * వాతనొప్పుల నివారణ కొరకు - 

       

. కసవిందాకు రసాన్ని నువ్వులనూనెతో కలిపి తైలపక్వము చేసి కీళ్లపై వ్రాసిన వాతనొప్పులు తగ్గును . 

 

 * పక్షవాత నివారణ కొరకు - 

      

. కసవింద ఆకు రసాన్ని వెన్నతో కలిపి మర్దించిన నరాల బలహీనత తగ్గి పక్షవాతం వలన పడిపోయిన అవయవం తిరిగి స్వాధీనంలోకి వచ్చును . 

 

 * గజ్జి నివారణ కొరకు - 

       

. కసవిందాకు రసము ఒంటికి రాసుకున్న గజ్జి తగ్గును . అంతే కాకుండా ఎలర్జీ , దద్దుర్లు తగ్గును . 


  * విరిగిన ఎముకలు అతుక్కునుటకు - 

     

. కసవింద ఆకులను కోడిగుడ్డు సొనతో నూరి పట్టువేసిన విరిగిన ఎముకలు అతుక్కునును . 


  * బోదకాలు నివారణ కొరకు - 

       

. కసవింద వేరుని అవునేతితో కలిపి తాగిన బోదకాలు తగ్గును . 

       కసవింద వేరు పై బెరడును నూరి ఒక చెంచా మోతాదులో రోజుకి రెండుసార్లు సేవించిన బోదకాలు నయం అగును . 

 

 * చుండ్రు , పేలు నివారణ కొరకు - 

      

. కసవింద ఆకు రసాన్ని తలకు పట్టించి మరుసటిరోజు ఉదయాన్నే తలస్నానం చేసిన పేలు , చుండ్రు తగ్గును . 

 

 * దగ్గు , ఆయాసం నివారణ కొరకు - 

     

. కసవింద ఆకు రసాన్ని 1 నుంచి 2 చెంచాలు రోజుకి 2 లేదా 3 సార్లు సేవించిన దగ్గు తగ్గును . కసవింద గింజల చూర్ణాన్ని కాఫీలా కాచుకొని తాగుచున్న ఆయాసము తగ్గును . 

 

 * కండ్లకలక నివారణ కొరకు - 

     

. కసవింద ఆకులను కండ్లపైన వేసి ఉదయం , సాయంత్రం కట్టు కట్టుచున్న కండ్లకలక నివారణ అగును . 

 

 * సోరియాసిస్ , సిబ్బెము నివారణ కొరకు - 

       

. కసవింద వేరును పుల్లని పండ్లరసముతో గాని లేదా పుల్లటి మజ్జిగతో గాని లేదా పులిసిన గంజితో మెత్తగా నూరి పూసిన సోరియాసిస్ , సిబ్బెము , తామర , గజ్జి నయం అగును . 


  * అతిమూత్రం నివారణ కొరకు - 

      

. కసవింద గింజల చూర్ణము 1 గ్రాము 1 స్పూన్ తేనెతో కలిపి ఉదయం , సాయంత్రం తీసుకున్న అతిమూత్రం తగ్గును . 

 

 * నులిపురుగుల నివారణ కొరకు - 

     

. కసవింద ఆకులను శుభ్రపరచి నీడన ఎండించి మెత్తని చూర్ణం చేసుకుని ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం 2 గ్రాముల మోతాదులో తీసుకొనుచున్న కడుపులో నులిపురుగులు నశించును . ఆయసం , దగ్గు , చర్మరోగాలు కూడా నశించును . 

       

. పైన మీకు వివరించిన విధముగా సంపూర్ణమైన వివరణతో ఒక్కో మొక్క గురించి నేను రాసిన గ్రంథాలలో మొక్కలను గుర్తించే విధముగా కలర్ ఫొటోస్ తో ఇవ్వడం జరిగింది . 

 

   గమనిక -

     

. నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

          

. కాళహస్తి వేంకటేశ్వరరావు 

      

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  

. 9885030034

బియ్యపు నీళ్ల ఉపయోగాలు -

 గంజి  -  బియ్యపు నీళ్ల ఉపయోగాలు  - 


  గంజి ఉపయోగాలు  - 

     గంజి అనగా అన్నం వార్చిన నీరు . కలి అనగా  గంజి మరియు మంచి నీటిని కలిపి ఒక కుండలో పోసి కందిపప్పు కాని , అటుకులు కాని గుడ్డలో వేసి మూటకట్టి దానిలో వేసి మూడు దినాలు ఉంచిన అది పులిసి కలి అగును. ఇది పులుపు రుచి కలిగి యుండును. వేడి చేయును . విరేచనమును చేయును . నోరు రుచి లేకుండా ఉండు రోగమును పోగొట్టును . మత్తుని కలిగించును. నిద్రని బాగా పట్టించును. దప్పికని అనుచును . నొప్పులు , అజీర్ణం హరించును. పార్శ్వపునొప్పి హరించును. క్షయని శాంతింప చేయును . వడదెబ్బ ని హరించును. అన్నం పైన ఇష్టాన్ని కలిగించును. 

               దీనిని మామూలు చారు వలే కాచి పోపు పెట్టవచ్చు. మిక్కిలి రుచికరంగా ఉండును. దీనిని లక్ష్మి చారు అంటారు. వీర్యస్తంభన చేయును . 

       ఇది వైద్య చికిత్స యందు ప్రధానంగా ఉపయోగపడును .

  బియ్యపు నీళ్ల వలన ఉపయోగాలు  - 

       బియ్యం కడిగిన నీళ్ళకు కడుగు అని పేరు . ఈ నీటికి తీపి , వగరు కలిపిన రుచి ఉండును. చలువ చేయును . కిడ్ని పట్టు సడలించి మూత్రం జారి చేయును . దీనిని మూత్రం బిగించినప్పుడు ఇచ్చే ఔషధాలకు అనుపానంగా వాడతారు. మూత్రంలో మంట , చురుకు ఉన్నప్పుడు దీనిలో పంచదార కలిపి ఇచ్చినపుడు శమించును. వేడి వలన కలిగిన అతిదాహం శమించును. 

   

               ఈ కడుగు పశువులకు ఇచ్చిన పాలు వృద్ది చెందును. దీనిని పులియబెట్టి చారు లా కాచుకోవచ్చు . మేహశాంతి కలగజేయును. కర్పూర శిలాజిత్ కలిపి ఇచ్చిన చలువచేసి రక్తం బాగుచేయును. రక్తం లొని వేడిని తగ్గించును. ఈ కడుగులో పంచదార కలిపి త్రాగిన అధిక వేడి తగ్గును . మంచి గంధం ముద్ద ఈ కడుగులో కలిపి త్రాగిన కుసుమలు కట్టును. మూర్చలు తగ్గును . నోటివెంట రక్తం పడే రక్తపిత్త వ్యాధి తగ్గును.

 

 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

     


.       కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

.  అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

       

.         9885030034

వానలు

 వానలు" ఇన్నివిధాలుగా

వుoటాయని తెలుసా...?

👇 


1. గాంధారివాన: 

కంటికి ఎదురుగా ఉన్నది

కనిపించనంత జోరుగా 

కురిసే వాన...


2. మాపుసారివాన:

సాయంత్రం కురిసే వాన...


3. మీసరవాన:

మృగశిరకార్తెలో కురిసే వాన...


4. దుబ్బురువాన:

తుప్పర/తుంపర వాన...


5. సానిపివాన:

అలుకు (కళ్లాపి) జల్లినంత

కురిసే వాన...


6. సూరునీల్లవాన: 

ఇంటి చూరు నుండి ధార

పడేంత వాన...


7. బట్టదడుపువాన: 

ఒంటి మీదున్న బట్టలు

తడిపేంత వాన...


8.తెప్పెవాన: 

ఒక చిన్న మేఘం నుంచి

పడే వాన...


9.సాలువాన: 

ఒక నాగలిసాలుకు 

సరిపడా వాన...


10. ఇరువాలువాన:

రెండు సాల్లకు & విత్తనాలకు

సరిపడా వాన...


11.మడికట్టువాన: 

బురదపొలం దున్నేటంత 

వాన...


12.ముంతపోతవాన:

ముoతతోటి పోసినంత 

వాన...


13. కుండపోతవాన:

కుండతో కుమ్మరించినంత వాన...


14. ముసురువాన:

విడువకుండా కురిసే వాన...


15.దరోదరివాన:

ఎడతెగకుండా కురిసే వాన...


16. బొయ్యబొయ్యగొట్టేవాన:

హోరుగాలితో కూడిన వాన...


17.రాళ్లవాన: 

వడగండ్ల వాన...


18.కప్పదాటువాన:

అక్కడక్కడా కొంచెం 

కురిసే వాన...


19.తప్పడతప్పడవాన:

టపటపా కొంచెంసేపు 

కురిసే వాన...


20.దొంగవాన: 

రాత్రంతా కురిసి తెల్లారి

కనిపించని వాన...


21.కోపులునిండేవాన:

రోడ్డు పక్కన గుంతలు

నిండెంత వాన...


22.ఏక్దారవాన: 

ఏకధారగా కురిసే వాన...


23.మొదటివాన:

విత్తనాలకు బలమిచ్చే వాన...


24.సాలేటివాన: 

భూమి తడిసేంత భారీ వాన...

మనుజుడెన్నడు నష్టము పొందడు....*

 🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *కులీనుః సహ సమ్పర్కం పండితైః సహ మిత్రతామ్‌ |*

          *జ్ఞాతిభిశ్చ సమం మేలం కుర్వాణో న వినశ్యతి ||*


                       *(చాణక్య నీతిశాస్త్రము-56)*


తా𝕝𝕝 *మంచి వంశము వారితో సంబంధము, పండితులతో మైత్రి, బంధువులతో కలసి మెలసి యుండుటయు కలిగిన మనుజుడెన్నడు నష్టము పొందడు....*


 ✍️🌹💐🌸🙏

రాగములు

 సంగీతం లో రాగములు :-

కొన్ని స్వరములు కలిస్తే నే రాగములు ఏర్పడుతాయి .

ఒక స్వరముతో - అర్చికము - దేవుని అర్చన - పూజ కు 

రెండు స్వరములు తో - గాధికము-కధలు గాధలుచెప్పుకొనుటకు 

మూడుస్వరములు తో- సామికము - ఉదాత్త అనుదాత్త స్వరితము లతో సామ గాన మైనది 

నాలుగు స్వరములతో - స్వరాంతరము - మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి మహతి ,కశ్చపి రాగములు

ఐదు స్వరములు తో - ఔడవము - మోహన,మధ్యమావతి,శుద్ధసావేరి,హంసధ్వని,శుద్ధధన్యాసి 

ఆరు స్వరములు తో-షాడవము- శ్రీరంజని 

ఏడు స్వరములు తో- సంపూర్ణము - 72 మేళ కర్త రాగములు

ఏర్పడినవి - ఒక్కొక్క మేళకర్తకూ - ఎన్నో జన్య రాగములు -అలా లెక్ఖలేనన్ని అనంత మైన రాగములూ,అనంతమైన భావములతో ,రసములతో మన సంగీతము అలరారుచున్నది - త్యాగరాజాది వాగ్గేయకారులు అమోఘమైన రచనలు ,ప్రతి ఇంటా వినిపిస్తూ ఉండడం మన సంగీతము గొప్పతనము .

చిదంబర క్షేత్రంలో ‘

 *ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు.*


*ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు.*


*ఆ కొడుకు వేదం నేర్చు కున్నాడు.*


*ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు.*


*ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు.*


*గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు.*


*ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు.*


*అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను.*

*నీవు ఈ ఆవులను కొట్టవద్దు.*

*తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు.*


*బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.*


*ఈ పిల్లవాడు వేదమంత్రము లను చదువు కుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడు తుండేవాడు.*


*వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి.*


*ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు.*


*ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి.*


*రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి.*


*ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెటన పాలతో శివాభిషేకము చేయదలచాడు.*


*రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు.*


*అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం.*


*రుద్రాధ్యాయం అంత గొప్పది.*


*అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి.*


*అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు.*


*ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు.*


*‘అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు.*


*ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు.*


*చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసేచోట చేట్టిక్కి కూర్చున్నాడు.*


*పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ.*

*అందుకని కర్ర గొడ్డలికూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు.*


*కాసేపయింది.*


*కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు.*


*ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి.*


*ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారము లతో శివాలయ నిర్మాణం చేశాడు.*


*తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు.*


*ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది.*


*అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు.*


*అవును అతడు చెప్పింది నిజమే.*


*వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తు కుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు.*


*ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు.*


*అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు.*


*కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు.*


*అది ఛిన్నాభిన్నమయింది.*


*అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది.*


*తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు.*


*ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు.*


*ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలులేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు.*


*తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయాయి.*


*క్రిందపడిపోయాడు.*


*నెత్తుటి ధారలు కారిపోతున్నాయి.*


*కొడుకు చూశాడు.*


*‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించ వలసిందే’ అన్నాడు.*


*నెత్తురు కారి తండ్రి మరణించాడు.*


*ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నా భిన్నమయిన సైకత లింగం లోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు.*


*నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు.*


*అపచారం జరిగిందని తండ్రి అనికూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు.*


*మనుష్యుడవైపుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను.*


*ఇవాల్టి నుండి నీవు మా కుటుంబం లో అయిదవ వాడవు.*


*నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు.*


*అయిదవ స్థానం చండీశ్వరుడి దే.*

*నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు.*


*ఇకనుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు.*


*భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది.*


*దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు.*


*భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది.*


*అది పత్నీభాగం.*


*కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి.*


*పార్వతీ నేను ఈవేళ చండీ శ్వరుడికి ఒక వరం ఇచ్చే స్తున్నాను.*


*నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’ అన్నాడు.*


*ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు.*


*చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు.*


*ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు.*


*ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు.*


*ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది.*


*అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు.*


*మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరి కాయ ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు.*


*ప్రసాద తిరస్కారం మహాదోషం.*


*అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు.*


*శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి.*


*అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు.*


*చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు.*


*ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు.*


*ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణా ధికారం ఉంటుంది.*


*దానిని మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు.*


*లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది.*


*అది చండీశ్వరునికి వెళ్ళి పోతుంది.*


*మీకు ఇచ్చినది ప్రసాద రూపము.*


*దానిని మీరు గుడియందు విడిచి పెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు.*


*అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలి పెట్టేయ్యకూడదు.*


*నంది మీద పెట్టడం కాదు.*


*చండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు.*


చండీశ్వర వృత్తంతం


*చిటిక చిన్నగా మాత్రమే వేయాలి.*


*అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు.*


*ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు.*


*చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవ మూర్తులలో.*


*పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు.*


*పరమేశ్వరుడు చండీశ్వరునికి అయిదవ స్థానం ఇచ్చారు.*


*ఒక్కసారి శివాలయంలోకి మనం గడపదాటి అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము.*


*మన భాగ్యమే భాగ్యం.*


*అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు.*


*ఈ రెండూ ఉండి తీరాలి.*

🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄

🙏శ్రీ కుచేలోపాఖ్యానము : ఎనిమిదవ భాగం

 🙏🙏🙏శ్రీ కుచేలోపాఖ్యానము :

ఎనిమిదవ భాగం 


దివిజ వనితలఁ బోలెడు తెఱవ లపుడు

డాయ నేతెంచి "యిందు విచ్చేయుఁ" డనుచు

విమల సంగీత నృత్య వాద్యములు సెలఁగ

గరిమఁ దోడ్కొని చని రంతిపురమునకును.

 టీక:- దివిజ = దేవతా; వనితలన్ = స్త్రీలను; పోలెడు = పోలుచున్నట్టి; తెఱవలు = యువతులు {తెఱవ - తెఱ (తీరైన) వా (ఆమె), స్త్రీ}; అపుడు = అప్పుడు; డాయన్ = దగ్గరకు; ఏరెంచి = వచ్చి; ఇందు = ఇటువైపు; విచ్చేయుడు = రండి; అనుచు = అంటు; విమల = నిర్మలమైన; సంగీత = పాటలు; నృత్య = ఆటలు; వాద్యములు = వాయిద్యములు; చెలగన్ = చెలరేగగా; గరిమన్ = గౌరవముతో; తోడ్కొని = కూడా తీసుకొని; చనిరి = వెళ్ళిరి; అంతిపురమున్ = లోపలి గృహమున; కును = కు.

 భావము:- దేవకాంతల వంటి యువతులు కుచేలుని దగ్గరకు వచ్చి, “ఇటు దయచేయండి.” అంటూ స్వాగతం పలికారు. సంగీత నృత్య వాద్యాలతో అతడిని అంతఃపురం లోనికి తీసుకుని వెళ్ళారు.


ఇట్లు సనుదేర నతని భార్య యైన సతీలలామంబు దన మనంబున నానందరసమగ్న యగుచు.

 టీక:- ఇట్లు = ఈ విధముగా; చనుదేర = రాగా; అతని = అతని యొక్క; భార్య = పెండ్లాము; ఐన = అయినట్టి; సతీ = స్త్రీ; లలామంబు = ఉత్తమురాలు; తన = తన యొక్క; మనంబునన్ = మనస్సు నందు; ఆనందరస = ఆనందరసమున; మగ్న = మునిగిన ఆమె; అగుచున్ = ఔతు.

 భావము:- కుచేలుడు ఇలా వస్తుండటం చూసిన ఆయన భార్య చాలా సంతోషించింది.


తన విభురాక ముందటఁ గని మనమున;

హర్షించి వైభవం బలర మనుజ

కామినీరూపంబు గైకొన్న యిందిరా;

వనిత చందంబునఁ దనరుచున్న

కలకంఠి తన వాలుఁగన్నుల క్రేవల;

నానందబాష్పంబు లంకురింప

నతని పాదంబుల కాత్మలో మ్రొక్కి భా;

వంబున నాలింగనంబు సేసె


నా ధరాదేవుఁ డతుల దివ్యాంబరాభ

రణ విభూషితలై రతిరాజు సాయ

కముల గతి నొప్పు పరిచారికలు భజింప

లలిత సౌభాగ్య యగు నిజ లలనఁ జూచి.

 టీక:- తన = తన యొక్క; విభు = భర్త; రాకన్ = వచ్చుటను; ముందటన్ = ఎదురుగా; కని = చూసి; మనమునన్ = మనస్సునందు; హర్షించి = ఆనందించి; వైభవంబులు = వైభవములు; అలరన్ = వికసించగా; మనుజ = మానవ; కామినీ = స్త్రీ; రూపంబున్ = రూపమును; కైకొన్న = వహించినట్టి; ఇందిరా = లక్ష్మీ; వనిత = దేవి; చందంబునన్ = వలె; తనరుచున్న = ఒప్పుచున్న; కలకంఠి = స్త్రీ {కలకంఠి - కోకిల వంటి కంఠస్వరము కలామె, స్త్రీ}; తన = తన యొక్క; వాలుఁగన్నులక్రేవల = కడకన్నులందు {వాలుఁగన్నులక్రేవలు - దీర్ఘములైనకన్నుల చివరలు, కడకన్నులు}; ఆనంద = సంతోషమువలని; బాష్పంబులున్ = కన్నీరు; అంకురింపన్ = ఊరుతుండగ; అతనిన్ = అతని; పాదంబుల్ = కాళ్ళ; కున్ = కు; ఆత్మ = మనస్సు; లోన్ = అందు; మ్రొక్కి = నమస్కరించి; భావంబునన్ = మనస్సునందు; ఆలింగనంబు = కౌగలించుకొనుట; చేసెన్ = చేసెను; ఆ = ఆ.

ధరాదేవుడు = బ్రాహ్మణుడు {ధరాదేవుడు - భూమిపైని దేవుడు, విప్రుడు}; అతుల = సాటిలోని; దివ్య = దివ్యమైన; అంబర = బట్టలు; ఆభరణ = అలంకారములతో; విభూషితలు = అలంకరింపబడినవారు; ఐ = అయ్యి; రతిరాజు = మన్మథుని; సాయకముల = బాణముల; గతిన్ = వలె; ఒప్పు = చక్కగా ఉన్న; పరిచారికలు = సేవకురాండ్రు; భజింపన్ = సేవిస్తుండగా; లలిత = మనోజ్ఞమైన; సౌభాగ్య = సౌభాగ్యవతి; అగు = ఐన; నిజ = తన; లలనన్ = భార్యను, స్త్రీని; చూచి = చూసి.

 భావము:- ఆ ఇల్లాలు తన భర్త ఎదురుగా వస్తుంటే చూసి, ఎంతో ఆనందంతో ఎదురువచ్చింది. అప్పుడు ఆమె అపర మహాలక్ష్మిలా ఉంది. ఆమె కనుకొలకుల్లో ఆనందభాష్పాలు రాలుతున్నాయి. మనస్సులోనే భర్త పాదాలకు నమస్కరించి, కౌగలించుకుంది. దివ్యాంబరాలూ ఆభరణాలు ధరించి మన్మథుడి బాణాల లాగ ఉన్న పరిచారికల సేవలందుకుంటూ ఐశ్వర్యంతో తులతూగే తన భార్యను కుచేలుడు చూసాడు.


ఆ నారీరత్నంబునుఁ

దానును ననురాగరసము దళుకొత్తఁగ ని

త్యానందము నొందుచుఁ బెం

పూనిన హరిలబ్ధ వైభవోన్నతి మెఱయన్.

 టీక:- ఆ = ఆ; నారీ = స్త్రీ; రత్నంబును = శ్రేష్ఠురాలు; తానునున్ = అతను; అనురాగరసము = ప్రేమరసము; తళుకొత్తగా = చిగురించగా; నిత్య = ఎన్నడు చెడని; ఆనందమున్ = ఆనందమును; ఒందుచున్ = పొందుతు; పెంపూనిన = అతిశయించిన; హరి = కృష్ణునివలన; లబ్ధ = లభించిన; వైభవ = వైభవముల; ఉన్నతిన్ = పెంపుతో; మెఱయన్ = ప్రకాశింపగా.

 భావము:- కృష్ణుని అనుగ్రహంవలన కలిగిన ఐశ్వర్య వైభవాలకు ఆ భార్యాభర్తలు ఇద్దరకూ సరిక్రొత్త అన్యోన్యానురాగాలు చిగురిస్తుండగా అపారమైన ఆనందాన్ని పొందారు.


కమనీయ పద్మరాగస్తంభకంబులుఁ;

గొమరారు పటికంపుఁ గుడ్యములును

మరకత నవరత్నమయ కవాటంబులుఁ;

గీలిత హరి నీల జాలకములు

దీపిత చంద్రకాంతోపల వేదులు;

నంచిత వివిధ పదార్థములును

దగు హంసతూలికా తల్పంబులును హేమ;

లాలిత శయనస్థలములుఁ దనరు


సమధికోత్తుంగ భద్రపీఠముల సిరులు

మానితోన్నత చతురంతయానములును

వలయు సద్వస్తు పరిపూర్ణ వాటికలును

గలిగి చెలువొందు మందిరం బెలమిఁ జొచ్చి.

 టీక:- కమనీయ = మనోహరమైన; పద్మరాగ = పద్మరాగమణులు పొదగబడిన; స్తంభకంబులు = స్తంభములును; కొమరారు = మనోజ్ఞమైన; పటికంపు = స్ఫటికముల; కుడ్యములును = గోడలును; మరకత = మరకతములును; నవరత్నమయ = వజ్రము, వైడూర్యము, గోమేధికము, పుష్యరాగము, నీలము, మరకతము, మాణిక్యము, విద్రుమము, మౌక్తికము అను తొమ్మిది మణులున్న; కవాటంబులున్ = తలుపులు; కీలిత = పొదగబడిన; హరినీల = ఇంద్రనీలాల; జాలకములు = కిటికీలు; దీపిత = ప్రకాశవంతమైన; చంద్రకాంతోపల = చలువరాళ్ళ; వేదులున్ = వేదికలు; అంచిత = ఒప్పిదమైన; వివిధ = అనేక రకములైన; పదార్థములును = పదార్థములును; తగు = సరియైన; హంసతూలికా = హంసల మెత్తని యీకలు నింపిన; తల్పంబులును = శయ్యలును; హేమ = బంగారపు; లాలిత = అందమైన; శయనస్థలములున్ = పడకటిళ్ళును ; తనరు = ఒప్పు;

సమధిక = మిక్కిల అధికమైన; ఉత్తుంగ = ఎత్తైన; భద్రపీఠముల = పీఠములు; సిరులు = వైభవములు; మానిత = చక్కటి; ఉన్నత = గొప్ప; చతురంతయానములును = పల్లకీలు {చతురంతయానము - నాలుగుకాళ్ళు (బొంగులు) కల పల్లకీ}; వలయు = అవసరమైన; సత్ = మంచి; వస్తు = వస్తువులతో; పరిపూర్ణ = నిండుగా ఉన్నట్టి; వాటికలును = గదుల వరుసలు; కలిగి = ఉండి; చెలువొందు = అందగించు; మందిరంబున్ = గృహమును; ఎలమిన్ = వికాసముతో; చొచ్చి = ప్రవేశించి.

 భావము:- పద్మరాగాలు తాపిన చిరుస్తంభాలు; చలువరాతితో నిర్మించిన గోడలు; మరకతమణులు నవరత్నాలు పొదిగిన గుమ్మాలు, తలుపులు; ఇంద్రనీలాల కిటికీలు; అందగించే చంద్రకాంత శిలావేదికలు; బహువిధ పదార్ధాలు; హంసతూలికా తల్పాలు; స్వర్ణమయ శయన మందిరాలు; వైభవోపేతమైన ఉన్నత పీఠములు; చక్కటి నాలుగు బొంగుల పల్లకీలు; కావలసిన సమస్త వస్తువులతో నిండుగా ఉన్న వాటికలు; కలిగి అందాలు చిందే ఆ భవనం లోనికి కుచేలుడు సతీసమేతంగా ఆనందంగా ప్రవేశించాడు.


సుఖంబున నుండు నట్టియెడం దనకు మనోవికారంబులు వొడమకుండ వర్తించుచు, నిర్మలంబగు తన మనంబున నిట్లను; “నింతకాలం బత్యంత దురంతంబగు దారిద్య్రదుఃఖార్ణవంబున మునింగి యున్న నాకుం గడపటఁ గలిగిన విభవంబున నిప్పుడు.

 టీక:- సుఖంబునన్ = సౌఖ్యములతో; ఉండునట్టి = ఉన్నట్టి; ఎడన్ = వేళ; తన = తన; కున్ = కు; మనః = మనస్సు నందు; వికారంబులు = వక్రతలు; పొడమకుండన్ = పుట్టకుండ; వర్తించుచున్ = మెలగుతు; నిర్మలంబు = స్వచ్ఛమైనది; అగు = ఐన; తన = తన; మనంబునన్ = మనస్సు నందు; ఇట్లు = ఈ విధముగా; అనున్ = అనుకొనును; ఇంతకాలంబు = ఇంతవరకు; దురంతంబు = దాటరానిది; అగు = ఐన; దారిద్ర్య = పేదరికము అను; దుఃఖ = దుఃఖపూరితమైన; ఆర్ణవంబునన్ = సముద్రము నందు; మునింగి = ములిగిపోయి; ఉన్న = ఉన్నట్టి; నా = నా; కున్ = కు; కడపటన్ = చివరకు; కలిగిన = లభించిన; విభవంబునన్ = వైభవముచేత; ఇప్పుడు = ఇప్పుడు.

 భావము:- కుచేలుడు ఆ దివ్యభవనంలో ఎలాంటి మనోవికారాలకూ లోనుకాకుండా సుఖంగా జీవిస్తూ, తన నిర్మలమైన మనసున ఇలా అనుకున్నాడు “ఇన్నాళ్ళూ దుర్భరమైన దారిద్ర్య దుఃఖసాగరంలో తపించాను. ఇప్పుడు చివరికి ఈ వైభవం కలిగింది.


ఎన్నఁ గ్రొత్త లైన యిట్టి సంపదలు నా

కబ్బు టెల్ల హరిదయావలోక

నమునఁ జేసి కాదె! నళినాక్షుసన్నిధి

కర్థి నగుచు నేను నరుగుటయును.

 టీక:- ఎన్నన్ = ఎంచి చూసినచో; క్రొత్తలు = నూతనములు; ఐన = అయిన; ఇట్టి = ఇటువంటి; సంపదలు = కలుములు; నా = నా; కున్ = కు; అబ్బుట = పట్టుట, కలుగుట; ఎల్లన్ = అంతా; హరి = కృష్ణుని; దయా = కృపతోకూడిన; అవలోకనమునన్ = చూపు; చేసి = వలన; కాదె = కాదా, అవును; నళినాక్షు = కృష్ణుని; సన్నిధి = వద్ద; కున్ = కు; అర్థిన్ = కోరువాడను; అగుచున్ = ఔతు; నేను = నేను; అరుగుటయున్ = వెళ్ళుట.

 భావము:- ఈ సరిక్రొత్త సంపదలు సమస్తం శ్రీహరి కృపాకటాక్షం వలననే నాకు ప్రాప్తించాయి కదా. నేను శ్రీకృష్ణుని సన్నిధికి అర్థకాంక్షతో వెళ్ళడం....


నను నా వృత్తాంతంబును

దన మనమునఁ గనియు నేమి దడవక ననుఁ బొ

మ్మని యీ సంపద లెల్లను

నొనరఁగ నొడఁగూర్చి నన్ను నొడయునిఁ జేసెన్.

 టీక:- ననున్ = నన్ను; నా = నా యొక్క; వృత్తాంతంబును = విషయమును; తన = తన యొక్క; మనమునన్ = మనస్సు నందు; కనియున్ = తెలిసికొనినను; ఏమి = ఏమియును; తడవక= ఆలస్యము చేయక; ననున్ = నన్ను; పొమ్ము = వెళ్ళు; అని = అని; ఈ = ఈ; సంపదలు = సంపదలు; ఎల్లనున్ = సమస్తమును; ఒనరన్ = చక్కగా; ఒడగూర్చి = కలుగజేసి; నన్నున్ = నన్ను; ఒడయునిన్ = ప్రభువును; చేసెన్ = చేసెను.

 భావము:- ఆ మహానుభావుడు నా సంగతి అంతా గ్రహించినా నన్నేమీ అడగలేదు. నాకు వీడ్కోలిచ్చి పంపాడు. ఈ సకల సంపదలూ అనుగ్రహించి ధనవంతుడిని చేసాడు.


అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠులైన సజ్జనులు లేశమాత్రంబగు పదార్థంబైన భక్తి పూర్వకంబుగా సమర్పించిన నది కోటిగుణితంబుగాఁ గైకొని మన్నించుటకు నిదియ దృష్టాంతంబు గాదె! మలిన దేహుండును, జీర్ణాంబరుండు నని చిత్తంబున హేయంబుగాఁ బాటింపక నా చేనున్న యడుకు లాదరంబున నారగించి నన్నుం గృతార్థునిం జేయుట యతని నిర్హేతుక దయయ కాదె! యట్టి కారుణ్యసాగరుండైన గోవిందుని చరణారవిందంబుల యందుల భక్తి ప్రతిభవంబునఁ గలుగుంగాక!” యని యప్పుండరీకాక్షుని యందుల భక్తి తాత్వర్యంబునం దగిలి పత్నీసమేతుండై నిఖిల భోగంబులయందు నాసక్తిం బొరయక, రాగాది విరహితుండును నిర్వికారుండును నై యఖిలక్రియలందు ననంతుని యనంత ధ్యాన సుధారసంబునం జొక్కుచు విగత బంధనుండై యపవర్గ ప్రాప్తి నొందె; మఱియును.

 టీక:- అట్టి = అటువంటి; పురుషోత్తముండు = కృష్ణుడు {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; భక్తి = భక్తి యందు; నిష్ఠులు = నిష్ఠ కలవారు; ఐన = అయిన; సజ్జనులు = సత్పురుషులు; లేశమాత్రంబు = రవ్వంత; అగు = ఐన; పదార్థంబు = వస్తువు; ఐనన్ = అయినప్పటికి; భక్తి = భక్తి; పూర్వకంబు = తోకూడినది; కాన్ = అగునట్లు; సమర్పించినన్ = ఇచ్చినట్లైతే; అది = దానిని; కోటి = వందలక్షలు (1,00,00,000); గుణితంబు = రెట్లు; కాన్ = ఐనట్లు; కైకొని = పరిగ్రహించి; మన్నించుట = మన్ననచేయు ననుట; కున్ = కు; ఇదియ = ఇదే; దృష్టాంతంబు = ఉదాహరణ; కాదె = కాదా, అవును; మలిన = మాసిపోయిన; దేహుండును = శరీరము కలవాడు; జీర్ణ = చిరిగిపోయిన; అంబరుండును = బట్టలు కట్టుకున్నవాడు; అని = అని; చిత్తంబునన్ = మనస్సు నందు; హేయంబుగాన్ = రోతగా; పాటింపక = తలపక; నా = నా; చేన్ = చేతిలో; ఉన్న = ఉన్నట్టి; అడుకులున్ = అటుకులను; ఆదరంబునన్ = మన్ననతో; ఆరగించి = తిని; నన్నున్ = నన్ను; కృతార్థునిన్ = ధన్యునిగా; చేయుట = చేయుట; అతని = అతని యొక్క; నిర్హేతుక = అకారణమైన; దయయ = కృపయే; కాదె = కాదా, అవును; అట్టి = అటువంటి; కారుణ్య = దయకు; సాగరుండు = సముద్రమువంటివాడు; ఐన = అయిన; గోవిందుని = కృష్ణుని; చరణ = పాదములను; అరవిందంబులన్ = పద్మముల; అందులన్ = ఎడలి; భక్తి = భక్తి; ప్రతి = ప్రతీ ఒక్క; భవంబునన్ = జన్మ యందు; కలుగుంగాక = కలగవలెను; అని = అని; ఆ = ఆ; పుండరీకాక్షున్ = కృష్ణుని; అందులన్ = ఎడల; భక్తి = భక్తి; తాత్పర్యంబులన్ = భావన లందు; తగిలి = లగ్నమై; పత్నీ = భార్యతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; నిఖిల = సర్వ; భోగంబుల = సౌఖ్యముల; అందున్ = లోను; ఆసక్తిన్ = ఆపేక్ష యందు; పొరయక = పొర్లక, పొందకుండ; రాగ = తగులములు; విరహితుండును = లేనివాడు; నిర్వికారుండునున్ = వికారము లేని వాడు; ఐ = అయ్యి; అఖిల = సమస్తమైన; క్రియలు = పనులు; అందున్ = లోను; అనంతుని = కృష్ణుని {అనంతుడు - దేశ కాల వస్తు భేదము లందును అంతము లేని వాడు, విష్ణువు}; అనంత = ఎడతెగని; ధ్యాన = ధ్యానించుటలోని; సుధారసంబునన్ = అమృతము నందు; చొక్కుచు = సోలుతు; విగత = తొలగిన; బంధనుడు = బంధనములు కలవాడు; ఐ = అయ్యి; అపవర్గప్రాప్తిన్ = మోక్షమును {అపవర్గప్రాప్తి - పరలోకము లభించుట, మోక్షము}; ఒందెన్ = పొందెను; మఱియును = ఇంకను.

 భావము:- భగవంతుడు, భక్తితత్పరులైన సజ్జనులు సమర్పించిన వస్తువు రవ్వంతే అయినా దానిని కోటానుకోట్లుగా స్వీకరించి, భక్తులను అనుగ్రహిస్తాడు అనడానికి నా వృత్తాంతమే తార్కాణం. మాసిన నా శరీరాన్ని చినిగిన బట్టలను చూసి శ్రీకృష్ణుడు మనస్సులో నైనా ఏవగించుకోలేదు. నా దగ్గర ఉన్న అటుకులను ప్రీతిగా ఆరగించాడు. నన్ను ధన్యుణ్ణి చేయడం దామోదరుని నిర్హేతుకవాత్సల్యం మాత్రమే. అంతటి కరుణాసాగరుడైన గోవిందుని పాదారవిందాల మీద నాకు నిండైన భక్తి నెలకొని ఉండు గాక.” అని ఈ మాదిరి తలుస్తూ హరిస్మరణం మరువకుండా కుచేలుడు తన ఇల్లాలితో కలసి జీవించాడు. భోగాలపై ఆసక్తి లేకుండా, రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారస వాహినిలో ఓలలాడుతూ, భవబంధాలను బాసి మోక్షాన్ని అందుకున్నాడు. మఱియును...


దేవదేవుఁ డఖిల భావజ్ఞుఁ డాశ్రిత

వరదుఁ డైన హరికి ధరణిసురులు

దైవతములు గాన ధారుణీదివిజుల

కంటె దైవ మొకఁడు గలడె భువిని?

 టీక:- దేవదేవుడు = భగవంతుడు {దేవదేవుడు - దేవతలకు దేవుడు, విష్షువు}; అఖిలభావజ్ఞుడు = భగవంతుడు {అఖిల భావజ్ఞుడు - సర్వుల తాత్పర్యములు తెలిసిన వాడు, విష్ణువు}; ఆశ్రితవరదుడు = భగవంతుడు {ఆశ్రిత వరదుడు - ఆశ్రయించినవారికి కోరికలు తీర్చు వాడు}; ఐన = అయినట్టి; హరి = కృష్ణుని; కిన్ = కి; ధరణిసురులు = బ్రాహ్మణులు; దైవతములు = దేవతలు; కానన్ = కాబట్టి; ధారుణీదివిజుల = బ్రాహ్మణుల; కంటెన్ = కంటె; దైవము = దేవుడు; ఒకడు = మరొకడు; కలడె = ఉన్నాడా, లేడు; భువిని = భూలోకము నందు.

 భావము:- దేవదేవుడైన వాసుదేవుడికి తెలియని విషయం లేదు; భక్తవత్సలు డగు హరికి బ్రాహ్మణులు అంటే దైవ సమానులు; తరచిచూస్తే, భూలోకంలో వారి కంటే వేరే దైవం లేడు


మురహరుఁ డిట్లు కుచేలుని

చరితార్థునిఁ జేసినట్టి చరితము విను స

త్పురుషుల కిహపరసుఖములు

హరిభక్తియు యశముఁ గలుగు నవనీనాథా!

 టీక:- మురహరుడు = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగా; కుచేలుని = కుచేలుడిని; చరితార్థునిన్ = ధన్యునిగా; చేసినట్టి = చేసిన; చరితము = వృత్తాంతము; విను = వినెడి; సత్పురుషుల = సజ్జనుల; కున్ = కు; ఇహ = ఇహలోకపు; పర = పరలోకపు; సుఖములు = సౌఖ్యములు; హరి = కృష్ణుని; భక్తియున్ = భక్తి; యశము = కీర్తి; కలుగున్ = లభించును; అవనీనాథ = రాజా.

 భావము:- ఓ రాజా! మురాసురుని సంహరించిన శ్రీకృష్ణుడు కుచేలోపాఖ్యానం విన్న వారందరికీ ఇహ పర సౌఖ్యములు ప్రసాదించును.

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ