22, నవంబర్ 2025, శనివారం

నేను

 నేను

మనసును మదించి అడిగాను నేను ఎవరు అని

శరీరమా అహంకారమా అభిమానమా ఎవరు నేను మనసును అదుపు ఉంచి ధ్యానించాను

 నేను ఎవరు అని 

చీకటి వెలుతురు సమ్మేళనం అంతా శూన్యం

 ఈ జన్మలో తెలియదు నేను ఎవరు అని 

వచ్చే జన్మలో తెలియదు నేను ఎవరు అని

 తెలియని దానికోసం వెతుకులాట

 వృధా ప్రయాస

 భగవంతుని చేరువ కోసం చేసే ప్రయాసే జీవిత లక్ష్యం

 అదే జీవిత పరమార్ధం 

సి శారద

పంచాంగం

చమత్కారం

 చమత్కారం అంటే ఏమిటి?

ఓ విషయం చెబితే " ఇదేమిటి, అదెలా, అలా ఎలా " అని ఉత్సుకత కలిగించాలి. దీనిలో ఏదైనా మతలబు ఉందా అనిపించాలి. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృత కలిగించాలి. విషయం అలా చెప్పడం చమత్కారం అంటారు.

 ఓ గ్రామం లో సర్వమంగళశాస్త్రి గారని ఓ వేదపండితుడు ఉండేవారు. వారి మనుమడికి ఉపనయనం చేస్తూ ఆహ్వానపత్రికలో 

" మా మనుమడి ఉపనయనానికి మీరందరూ విచ్చేసి వటువుని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళవలెను.

 భోజనాల తరువాత నా ఉపనయన కార్యక్రమాన్ని కూడా వీక్షించి వెళ్ళవలసినదిగా కోరుకుంటున్నాను " 

అని వ్రాసారు; అందరికీ ఆశ్చర్యం వేసింది --

 మనుమడికి

వడుగు వరకు సరే, 

ఈయనకు మళ్ళీ  

వడుగు ఏమిటీ అని.

సరే ఈ విషయం తెలుసుకోవాలనే ఆసక్తితో మొత్తం బంధువులందరూ వచ్చేసారు. భోజనాలయాయి. శాస్త్రిగారు కుర్చీలో కూర్చున్నారు, బంధువులు, అతిధులు ఎదర చాపలమీద ఆశీనులయారు.

శాస్త్రిగారి భార్య ఓ చిన్న అందమైన పెట్టె తెచ్చి శాస్త్రిగారికి ఇచ్చారు. ఆయన ఆ పెట్టె మెల్లిగా తెరచి అందులోనుంచి ఓ కళ్ళజోడు తీసారు.

అందరికీ చూపెట్టి " నాకు చత్వారం వచ్చింది. ఈ మధ్యనే, డాక్టర్ గారు ఈ కళ్ళజోడు పెట్టుకోమన్నారు. ఈరోజు ముహూర్తం బాగుందని పెట్టుకుంటున్నాను. మీరందరూ నా ఈ ఉప_నయనం ( నయనం అంటే కన్ను, ఉప అంటే దగ్గరగా ఉండేది ) కార్యక్రమం కూడా చూసి వెడుతూన్నందుకు ధన్యవాదాలు " అని అది పెట్టుకున్నారు.

లేచామా, తిన్నామా, టీవీ ఫోన్ చూసినామా, పడుకున్నామా అనికాకుండా ప్రతీ పనిలోనూ హాస్యాన్ని ఆస్వాదించాలి.

🙏😀శుభమస్తు

ప్రశ్నాపత్రం

ప్రశ్నాపత్రం నిర్వహణ చేరువేల భార్గవ శర్మ ఈ క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క దానికి నాలుగు సమాధానాలు ఉన్నాయి సరియైన దానిని ఎంచుకోండి 

1. ఈ క్రింది వాటిలో చాయాగ్రహం ఏది

Aచంద్రుడు

Bబుద గ్రహం

Cరాహువు

Dకుజుడు

2. దిక్పాలకులు ఎంతమంది

Aఏడు

B తొమ్మిది 

C ఎనిమిది

 D నాలుగు

3. ముందు కాలాలలో జరిగే వాటిని గురించి తెలిపే పురాణం ఏది

A పద్మ పురాణం

 B కార్తీక పురాణం

 C మార్కండేయ పురాణం

D భవిష్య పురాణం

4.  ఈశ్వరుని ఆత్మ లింగం ఉన్న క్షేత్రం ఏది

A కర్ణాటకలోని మురుడేశ్వరం.

B శ్రీశైలంలోని శివలింగం

C త్రయంబకేశ్వరం లోని శివలింగం 

D. నాసిక్ లోని శివలింగం

4. రామాయణంలో ధర్బలతో జన్మించిన వాడు ఎవడు

A లక్ష్మణుడు 

B లవడు 

C కుసుడు 

D రావణాసురుడు

5. మన శాస్త్రాల ప్రకారము భూమిమీద ఎన్ని జీవరాసులు ఉన్నాయి

A 82 లక్షలు

B 83 లక్షలు

C 84 లక్షలు 

D 95 లక్షలు

6. మనం తినే ఆహారంలో జీవపదార్థం కానిది ఏది

A పెరుగు

B లవణము

C కారము

 D. మామిడికాయ

7. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఈ మొక్క ఉండాలని అంటారు

A. దర్భ

B. గంజాయి

c. తులసి

D. మల్లె

8. ఉపనిషత్తుల సారం అని దీనిని అంటారు

A. భారతం

B. రామాయణం

C. భగవద్గీత

D. ప్రశ్న ఉపనిషత్తు

9. పుష్పాల గురించి రాసిన కవి పేరు ఏమిటి

A. శ్రీ శ్రీ

B. ఉషశ్రీ

C. కరుణశ్రీ

D. పానుగంటి లక్ష్మీనరసింహారావు

10. కంసాలి వారు బంగారాన్ని కరిగించే ద్రావకంలో ఇవి ఉంటాయి

A. సెల్ఫీ రిక్ ఆసిడ్ నైట్రిక్ యాసిడ్

B. హైడ్రోక్లోరిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్

C. సెట్రిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్

D. బెంజోయ్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్

ఈ ప్రశ్న పత్రాన్ని  పూరించి మీ జవాబులను కామెంట్ల రూపంలో పెట్టగలరు.

పంచాంగం

శ్రీ కళ్యాణవేంకటేశ్వర ఆలయం:

 🕉 🕉

🔅 చిత్తూరు జిల్లా : శ్రీనివాసమంగాపురం 

🔅 శ్రీ కళ్యాణవేంకటేశ్వర ఆలయం: 

     శ్రీనివాస మంగాపురం:

👉 శ్రీనివాస మంగాపురం తిరుపతి కి 12 కి.మీ. దూరంలో ఉంది. 

ఇక్కడ శ్రీ కళ్యాణవేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు.

🔅 స్వామివారికి ఆ పేరు ఎందుకు వచ్చింది ? 

👉తిరుమలలో శ్రీవారి పాదాల వద్ద ప్రవహించే నది " విరజా నది" . ఆ నది తిరుమల గిరుల నుండి ప్రవహించి కిందకు వచ్చాక రెండుగా చీలిపోతుంది . అవే స్వర్ణముఖి మరియూ కల్యాణి.

ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనం లో కళ్యాణం చేసుకొని, 

శాస్త్రప్రకారం పెళ్లయిన దంపతులు ఆరు నెలలపాటు కొండలు ఎక్కడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కూడదని అగస్త్యమహర్షి చెప్పడంతో తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇదే కల్యాణి నది ఒడ్డున 6నెలల పాటు కాపురం చేసాడు...కనుకనే కల్యాణవేంకటేశ్వర స్వామి అనే సార్థక నామధేయం వచ్చింది; ఇక్కడి స్వామిని దర్శిస్తే యువతి యువకులకు పెళ్లిళ్లు అవుతాయి అనే నమ్మకం వల్ల కల్యాణ వేంకటేశ్వరస్వామి అని వ్యావహారిక నామధేయం వచ్చింది .

👉 ఇక్కడి స్వామి వారి విగ్రహం ముమ్ముర్తుల తిరుమల శ్రీవారిని పోలి ఉంటుంది మరియు ఇక్కడి మూలవిరాఠ్ తిరుమలలోని మూలవిరాఠ్ కన్నా పెద్దది. తిరుమలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడ జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు.

 పాకాల -- తిరుపతి రైలు మార్గంలో శ్రీనివాసమంగాపురం వద్ద గతంలో రైల్వే స్టేషన్ వుండేది. ఆ దారిన వచ్చే భక్తులు అందరు శ్రీనివాసమంగాపురంలొ దిగి అక్కడి స్వామి వారిని దర్శించుకొని 

ఇక్కడికి దగ్గరలోని తిరుమల కొండల పాధ భాగాన వున్న శ్రీవారి మెట్టు వద్దకు వెళ్లి అక్కడి నుండి ప్రారంబమౌ నూరు మెట్ల దారి గుండా తిరుమలకు వెళ్లెవారు. తిరుపతిలోని అలిపిరి వద్దనున్న మెట్ల దారికంటే ఈ మెట్ల దారి అతి దగ్గర. 

👉 ఈ ఆలయాన్ని 16వ శతాబ్ధంలో తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడు తాళ్లపాక చినతిరుమలయ్య పునరుద్ధరించారు.

👉ఈ క్షేత్రానికి ఎక్కువగా అవివాహితులు తమ తల్లిదండ్రులతో కలిసివచ్చి కల్యాణోత్సవం చేయిస్తుంటారు.

చివరలో అర్చకులే ఇచ్చే ‘‘కల్యాణకకంణం’’ ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఆ కారణంగానే ఈ ఆలయంలో రోజూ ఎంతోమంది యువతీ యువకులు తమ తల్లిదండ్రులతో కలిసి కల్యాణోత్సవం చేయిస్తుంటారు. తిరుమల క్షేత్రానికి వెళ్లలేనివారు ఇక్కడే స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. 

👉తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని అర్జితసేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తుంటారు.

ఎన్నో వ్యవయప్రయాలకు ఓర్చి రోజుల తరబడి ఎదురు చూసినా తిరుమలలో క్షణకాంల శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలిగితే అదే మహాభాగ్యంగా భక్తులు భావిస్తుంటారు. ఆ లిప్తపాటు దర్శనానికి వెళ్ళలేనివారు ఇక్కడ స్వామివారిని తనివితీరా ఎక్కువసేపు దగ్గరగా దర్శించుకుని తృప్తిపొందుతారు.

 ఈ క్షేత్రానికి దగ్గరలోనే శ్రీనివాసుడు తిరుమల కొండకు నడిచి వెళ్ళిన శ్రీవారిమెట్లు కలవు. 

👉యోగం, భోగం, వీరం, అభిచారిక అనే నాలుగురకాల మూర్తుల్లో ఏదో ఒక మూర్తిని వైష్ణవాలయాలలో ప్రతిష్టిస్తారు. కాని తిరుమల శ్రీవేంకటేశ్వరుడు స్వయంభువు కాబట్టి శ్రీనివాసుడు ఈ రూపాలకు అందనివాడూ, అన్నిటికీ అతీతుడు కాబట్టి ఆయన విగ్రహం ఏ శాస్త్రాలకు అందని అర్ఛావతారం. శ్రీనివాస మంగపురంలో శ్రీనివాసుడు కూడా అర్ఛావతార స్వరూపుడే.

👉తిరుమలకు వెళుతూ శ్రీనివాసుడు తన భక్తులకు రెండువరాలు ప్రసాదించాడని చెబుతారు. తిరుమలకు వచ్చి తనను దర్శించుకోలేని భక్తులకు శ్రీనివాసమంగాపురంలో అర్చావతార స్వరూపంతో దర్శనభాగ్యం కల్పిస్తాననీ, పద్మావతీదేవిని పరిణయమాడిన వెంటనే తాను విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు, పెళ్లికానివారికి కల్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహించినట్లు చెబుతారు.

👉కాంచీపురంలో ఉన్న సుందరరాజస్వామి అనే అర్చకునికి స్వామికి కలలో కన్పించి తాను శ్రీనివాసమంగాపురంలో ఉన్నానని తనుకు పూజాదికాలు నిర్వహించమని చెబుతారు. అప్పటినుండి మళ్లీ ఆలయం కళకళలాడుతుంది. ఆయనకు స్వామివారు కలలో కనిపించిన రోజున సాక్షాత్కార వైభవోత్సావాన్ని మూడురోజుల పాటు జులై మాసంలో వైభవంగా నిర్వహిస్తుంటారు.

బ్రహ్మోత్సవాలు : తిరుమలలో లాగానే ఇక్కడకూడా ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. ధ్వజారోహణంతో మొదలై తొమ్మిదిరోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 

స్వామివారు తిరుమలకు వెళుతూ దగ్గర్లోని సువర్ణముఖీ నదిలో అగస్త్య మహాముని ఆశ్రమంలో పెట్టిన పాదాన్ని భక్తులు "విష్ణుపాదం" గా కొలుస్తుంటారు.

అన్నమయ నిత్యం తన ఇంట్లో పూజించే అలమేలు మంగ , శ్రీనివాస విగ్రహాలు ఎవరో దొంగిలించి పోయ్యారు.

 అయితే ఇది అన్నమయ జీవితం లో 5 సార్లు జరిగినట్టు చరిత్ర చెప్తోంది .

ఒకసారి హనుమ , ఒకసారి గరుడ , ఒకసారి విశ్వసేన , ఒకసారి పూరీ జగన్నాద స్వామి ,ఒకసారి శ్రీవారి అనుగ్రహం తో అన్నమయ వద్దకు వచ్చాయి .

👉ఇప్పటికీ వారు పూజించిన విగ్రహాలు శ్రీనివాస మంగాపురం లో చూడవచ్చు

కలిన్ స్మరణాన్ ముక్తిహః

 కలిన్ స్మరణాన్ ముక్తిహః " దీని భావము ఏమిటంటే కలి యుగంలో భగవాన్ నామ స్మరణ చేస్తేనే ముక్తి లభిస్తుందని.   వాక్యాన్ని చాలామంది నమ్మి తాము రోజులో  కొంతసమయం చేసే భగవన్నామముతో ముక్తి లభిస్తుందని  భావిస్తున్నారునిజానికి ఇతర యుగాల మనుషులతో పోలిస్తే కలియుగంలో వుండే మనుష్యులు చాలా బద్దకస్తులు అంటే తామస ప్రవ్రుత్తి  కలిగినవారుఇక అటువంటి వారికి ఇటువంటి మాటలు ఎంతో రుచిస్తాయి.  అది యెట్లా అంటే పని ఎగవేసే ఉద్యోగస్తునికి నీవు పని చేయకపోయినా జీతం ఇస్తారు అనే మాటలు ఎలా రుచిస్తాయో అలాగే.  కానీ సాధక మిత్రమా ఎట్టి పరిస్థితిలోను ఇటువంటి మాటలను నమ్మి నీ సాధనను మధ్యలో ఆపు చేయకు.  ఒక్క విషయం మనం చుస్తువున్నాం. గత యుగాలలో కూడా సూర్యభగవానుడు తూర్పు దిక్కునే ఉదయించాడు, నీరు పల్లానికే ప్రవహించింది. నదులన్నీ సముద్రంలోనే కలిసాయి, అగ్నికి దహించే శక్తి వున్నది. నెలకు 30 రోజులే వున్నాయి. మరి ప్రక్రుతి లోని శక్తులు అన్ని, అన్నీ యుగాలలో ఒకే విధంగా ఉంటే మరి పురుషుడు అంటే భగవంతుని విషయంలో అంటే ముక్తి విషయంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ఎందుకు ఉంటుంది.  ఆలోచించండి. ఇటువంటి వాక్యాలు అకుంఠిత దీక్ష, నిరంతర కృషి చేయలేని వారు కల్పించినవి కాక మరొకటి కాదు. నిజానికి ఇటువంటి విషయాలే నిజమైతే హిమాలయాలల్లో సాధువులుసన్యాసులుజ్ఞ్యానులు ఇప్పటికి నిరంతరం నిద్రాహారాలు మాని ఎముకలు కొరికే చలిలో ఎందుకు  సాధన చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించు.  కఠినమైన తపమొనరిస్తేనే మనకు జ్ఞ్యానం  కలుగుతుందిఅప్పుడే మోక్షసిద్దిజన్మ రాహిత్యానికి ప్రయత్నించే చక్కటి అవకాశం మనకు కేవలం  మనుష్య జన్మలోనే వున్నది.   అవకాశాన్ని చేయిజార్చకూడదుమిత్రమా ఇప్పుడే మోక్షసిద్దికి ఉద్యుక్తుడవు కమ్ము

గురుకులములు

  ఇంగ్లాండ్‌లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి. 

మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో, గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం.!🥲

గురుకుల సంస్కృతిలో (సనాతన సంస్కృతిలో) ఈ క్రింది విషయాలను బోధించారు.😍

01 అగ్ని విద్య (లోహశాస్త్రం)

02 వాయు విద్య (గాలి)

03 జల్ విద్య (నీరు)

04 అంతరిక్ష విద్య (స్పేస్ సైన్స్)

05 పృథ్వి విద్య (పర్యావరణం)

06 సూర్య విద్య (సౌర అధ్యయనం)

07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్ర అధ్యయనం)

08 మేఘ విద్య (వాతావరణ సూచన)

09 ధాతు ఉర్జా విద్య (బ్యాటరీ శక్తి)

10 దిన్ రాత్ విద్య.

12 శ్రద్ధా విద్యా (అంతరిక్ష పరిశోధన)

13 ఖాగోళ విజ్ఞానం (ఖగోళ శాస్త్రం)

14 భుగోళ విద్య (భౌగోళిక)

15 కాల విద్యా(సమయ అధ్యయనాలు)

16 భూగర్బ విద్య (జియాలజీ & మైనింగ్)

17 రత్నాలు మరియు లోహాలు 

18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)

19 ప్రకాశ విద్య (శక్తి)

20 సంచార విద్య (కమ్యూనికేషన్)

21 విమాన విద్య (విమానం)

22 జలయన్ విద్య (నీటి నాళాలు)

23 అగ్నియా ఆస్ట్రా విద్య (ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి)

24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)

25 యజ్ఞ విద్య

ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలుసుకుందాం!*😍

26 వ్యాపార్ విద్య (వాణిజ్యం)

27 కృషి విద్య (వ్యవసాయం)

28 పశు పాలన విద్య (పశుసంవర్ధక)

29 పక్షి పాలన (బర్డ్ కీపింగ్)

30 యాన విద్య (మెకానిక్స్)

32 వాహనాల రూపకల్పన

33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)

36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)

37 లఘు (లోహశాస్త్రం & కమ్మరి)

38 తక్కలు

39 రంగ్ విద్యా (డైయింగ్)

40 ఖాట్వాకర్

41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)

42 వాస్తుకర విద్యా (ఆర్కిటెక్చర్)

43 ఖానా బనానే కి విద్యా (వంట)

44 వాహన్ విద్యా (డ్రైవింగ్)

45 జలమార్గాల నిర్వహణ

46 సూచికలు (డేటా ఎంట్రీ)

47 గౌషాలా మేనేజర్ (పశుసంవర్ధక)

48 బాగ్వానీ (హార్టికల్చర్)

49 వాన్ విద్యా (అటవీ)

50 సహోగీ ( పారామెడిక్స్).

ఈ విద్య అంతా గురుకులం లోనే బోధించబడింది, ❤️

కాని కాలంతో పాటు, గురుకులాలను అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరుగయ్యేలా చేశారు! ఇది మెకాలేతో ప్రారంభమైంది. ఈ రోజు, మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది.🥲

భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది?

కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది. భారతీయ విద్యా చట్టం 1835 లో ఏర్పడింది (1858 లో సవరించబడింది). దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు.

మెకాలే ఇక్కడ విద్యావ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా, చాలా మంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారు. బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యు. లూథర్ మరియు మరొకరు థామస్ మున్రో! వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో సర్వే చేశారు. ఉత్తర భారతదేశం (ఉత్తర భారత్) ను సర్వే చేసిన లూథర్, ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని, దక్షిణ భారతదేశం (దక్షిణ భారత్) ను సర్వే చేసిన మున్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు.😍

భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, వారి నుండి గోవులను దూరం చేయూలి, గోవుపాలు, పెరుగు, వెన్న, నెయ్యి జ్ఞానాన్ని పెంచుతాయి ′ ′ *దేశీయ మరియు సాంస్కృతిక విద్యావ్యవస్థ* పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ′ ′ ఆంగ్ల విద్యా విధానం ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు , కానీ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు. 🥲😔

వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పని చేస్తారు.

మెకాలే ఇలా చెప్పాడు - ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే, దానిని దున్నుతూ ఆంగ్ల విద్యావ్యవస్థలో తీసుకురావాలి. అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు. అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించి గురుకుల వ్యవస్థకు నిప్పంటించాడు, అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు.🥲

1850 వరకు భారతదేశంలో '7 లక్షల 32 వేల' గురుకుల & 7,50,000 గ్రామాలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము ఉంది మరియు ఈ గురుకులములన్నీ 'ఉన్నత విద్యా సంస్థలు' గా ఉండేవి. గురుకులములు ప్రజలు మరియు రాజు చేత కలిపి నడుపబడేవి. రాజులు విద్యను ఉచితంగా ఇచ్చారు.❤️

గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. ఆ సమయంలో దీనిని 'ఉచిత పాఠశాల' అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!🥲

మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: " కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలంతో నిండి ఉంటుంది

మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు. వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి జాతి గురించి వారికి తెలియదు, అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు వెళ్లినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు". ఆ సమయంలో రాసిన లేఖ లో ఉన్న నిజం ఈనాటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము. 🥲

గోవు నుండి, సంస్కృత భాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం! నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు. భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి.🙏

 మన భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని తిరిగి పొందే సమయం ఇది.

కృష్ణం వందే జగద్గురుమ్.. 🙏

పిండిమ‌ర‌" కష్టాలు

🤔 *చిన్న‌త‌నంలో "పిండిమ‌ర‌" కష్టాలు* 🤔

చిన్న‌త‌నంలో ఎంత‌ క‌ష్ట‌మైనా రావచ్చుగాని పిండి మ‌ర‌కెళ్ళాల్సిన క‌ష్టం మాత్రం ఎవ్వ‌రికీ రాకూడ‌దు.

అంతా చ‌దివి... మీరే అవునో, కాదో చెప్పండి...

నా బాల్యం అంతా చిన్న టౌన్ లో గ‌డిచింది.. 

అప్ప‌ట్లో *అన్న‌పూర్ణా* ఆటాలు, *ఆశీర్వాద్* ఆటా ఆశీర్వాదాలు మాకు దొర‌క‌ని క‌ష్ట‌కాల‌మాయే..

అంద‌రూ గోధుమ‌లు, ధాన్యం, ప‌ప్పులు మ‌ర ఆడించుకోవ‌ల్సిందే..

ఈ ప‌నికోసం అమ్మ‌లు, అమ్మ‌మ్మ‌లు మ‌మ్ముల్ని బాల కార్మికులుగా వినియోగించుకుని పిండిమ‌ర‌కుతోలేవాళ్ళు..

మాకు ఇప్ప‌టిపిల్ల‌లంత అవేర్‌నెస్ క‌పోవ‌డంతో..

కార్మిక శాఖ‌కు కంప్లైట్ చేయాల‌ని తెలియ‌దు..

మేము అలా పిండిమ‌ర దారిప‌ట్ట‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వ రాయితీ జ‌ల్లులా మ‌ర‌కు పోయి వ‌స్తే పావలానో..

ప‌దిపైస‌లో ఆక‌ర్ష్ ప‌థ‌కానికి ఆశ ప‌డి..

ఈ సాహ‌సానికి సిద్ద‌ప‌డితే మేము ప‌డ్డ క‌ష్టాలు ప‌గవాడికి కూడా వ‌ద్దు...

గోధుమ‌లో మ‌రొక‌టో నాలుగుమూడు కిలోలు క్యాన్‌లో పోసి ఆడించుకు ర‌మ్మ‌ని చెపుతూ.. 

అమ్మ‌లు మ‌ర‌వాడికి ఒక కేజీ త‌క్కువ చేసి చెప్ప‌మ‌ని చెప్పి పంపేవారు... 

మ‌ర‌కు పోయి.. అబ‌ద్దం చెప్ప‌డానికి పూర్తిగా సాహ‌సించ‌లేక పిండిమ‌ర చ‌క్రాలు క‌ర్‌క‌ర్ మ‌ని చేసే సౌండ్‌లో..

అశ్వ‌ద్దామ హ‌తఃకుంజ‌రః అన్న‌ట్లుగా మూడు కేజీల‌ని రెండ‌నో, నాలుగును మూడ‌నో అనేసేవాళ్ళం...

పిండిమ‌ర వాళ్ళు పొద్దున్నుంచి నాలాంటి వాళ్ళ‌ను ఎంతో మందిని చూసుంటారు కదా..

బాల‌య్య బాబులా* కంటి చూపుతో స‌రుకు తూకం క‌నిపెట్టేసి క‌రెక్ట్ గా వ‌సూలు చేసేవాళ్ళు...

ఇంట్లో మ‌ర‌కు పంపేముందు క‌ణ్వ‌మ‌హ‌ర్షి శ‌కుంత‌ల‌కు చేసే అప్ప‌గింత‌ల కంటె ఎక్కువే..

మాకూ బోధ జ‌రిగేది...

*”పిండి ఆడించేప్పుడు దిక్కులు చూడ‌కు, పిండికాజేస్తారు జాగ్ర‌త్త”* అని, బరకగా ప‌ట్టించ‌మ‌నో, మెత్త‌గా ప‌ట్టించ‌మ‌నో, ప‌సుపు త‌రువాత ఆడించ‌వ‌ద్ద‌నో, కారం త‌రువాత ఆడించ‌వ‌ద్ద‌నో..

ఆంక్ష‌లు చెప్పి పంపేవారు...

ఇన్ని జాగ్ర‌త్త‌లు చెప్పారు క‌దా అని మేము పిండిమ‌రలో అడుగు పెట్టిన ద‌గ్గ‌ర‌నుండి..

ముఖ్య‌మంత్రి గారి సెక్యూరిటీ వింగ్ వాళ్ళు డేగ క‌న్నుతో చూస్తున్న‌ట్లు చూస్తూ ఉండే వాళ్ళం... 

దీనికితోడు ప్ర‌తి పిండి మ‌ర‌లో ఒక స‌న్న గొట్టం.. 

దొంగ చాటుగా అందులోనుండి కొంత పిండి మ‌ర‌వాళ్ళు కాజేస్తార‌న్న బ‌ల‌మైన‌ రూమరు ప్రచారం లో ఉండేది...

పిండిమ‌ర‌కు చేరుకుని హై ఎల‌ర్ట్ లో వెయిటింగ్‌లో ఉంటే..

ఈ లోపు మ‌ర‌వాళ్ళు మేము పిల్ల‌లం గ‌నుక..

పెద్ద‌ల్ని, నోరుగ‌ల‌వాళ్ళ‌ని ప్ర‌యార్టీలో పెట్టేసేవారు..

ఆ రోజుల్లో క‌రెంట్ ఉన్న స‌మ‌యం కంటే..

క‌రెంట్ క‌ట్ స‌మ‌య‌మే ఎక్కువ కావ‌డంతో..

వెయిటింగ్ త‌ప్పేది కాదు...

ఈ వినోదాన్ని గ‌మ‌నిస్తూ కొంతసేపు వేచి ఉండేసరికి మ‌ర‌లో లేచిన పిండంతా.. 

త‌ల‌మీద ప‌డి మాకు బాల‌వృద్దుల గెట‌ప్ వ‌చ్చేసేది... 

కాసేప‌టికి ఆ గోల‌లోనే ఆప‌రేట‌ర్ మా చేతిలో క్యాన్ గుంజుకుని..

స్పెసిఫికేష‌న్స్ చెప్పేలోపే పైనున్న బ‌కెట్ లో పోసేసి..

పిండి వ‌చ్చే గొట్టానికి వేలాడుతున్న టార్ప‌లిన్ గుడ్డ‌ను మ‌డిచి..

గొట్టం మీద‌కు తోసి.. 

క‌ర్ క‌ర్ మ‌ని విష్టుమూర్తిలా రెండు చ‌క్రాలు తిప్పేవాడు...

పైన బ‌కెట్‌లో వేసిన గోధుమ‌లు గ్రైండ‌ర్‌లో న‌లిగి క్రింద ఉన్న టిన్‌లో ప‌డ‌టానికి రెండు,మూడు, నిముషాలు ప‌ట్టేది..

పిండి నలిగి కింద‌కు ప‌డే టైమ్ కు మ‌డ‌చి ఉంచిన టార్పాలిన్ గొట్టాన్ని క్రింద ఉన్న డ‌బ్బాలోకి సెట్ చేసేవాడు...

ఈ నాలుగైదు నిముషాల్లో పైన వేసినదంతా పిండిగా వ‌స్తుందో లేదో అన్న టెన్ష‌న్‌తో మా న‌రాలు చిట్లుతుండేవి... 

(ఇంట్లో పెట్టిన అప్ప‌గింత‌లు భ‌యాలు సామాన్యమైనవా!) 

మ‌న‌పిండి ఆడుతున్నంత సేపూ ఏ చ‌క్రం తిప్పినా ఎటువెళ్ళినా మ‌న పిండి పోతోంద‌న్న అనుమానంతో మాకు మ‌న‌శ్శాంతి ఉండేదికాదు...

కాసేప‌టికి డ‌బ్బాలో ప‌డ్డ‌పిండిని మ‌న క్యాన్‌లో వొంపి పొమ్మ‌నేవాడు..

మ‌న క‌ళ్ళ‌న్నీ వింబుల్డ‌న్ ఫైన‌ల్ మ్యాచ్‌లో బాల్ వైపే తిరుగుతున్న‌ట్లు ఆప‌రేట‌ర్ చుట్టూ తిరుగుతూ ఉండేవి...

ఈ అడ్వెంచ‌ర్ ముగించుకుని త‌ల, వొళ్ళు దులుపుకుని క్యాన్ భుజానికో, సైకిల్‌కో త‌గిలించుకుని..

మ‌న‌కు ఇవ్వ‌బోయే పావాలాకు బ‌డ్జెట్ ప్లానింగ్ డ్రీమ్స్ వేసుకుంటూ..

ఇల్లు చేరేవాళ్ళం... 

ఇంటికి రాగానే క్యాన్ లో వ‌చ్చిన పిండిని తూనిక‌లు కొల‌త‌ల శాఖ‌ల వ‌లె హోమ్ శాఖ‌వారు కొలిచేవారు...

 ఇహ‌మొద‌లు ”ఎటు దిక్కులు చూశావ్‌! 

 మోసం చేసి పిండి కాజేశాడు..

మేము ఎన్ని చెప్పిపంపితే ఏం ప్ర‌యోజ‌నం, అర‌కేజి త‌క్కువొచ్చింది...

మెత్త‌గా ప‌ట్ట‌మంటే బ‌ర‌గ్గా ప‌ట్టాడు. నీకు ఇన్నేళ్ళొచ్చాయి. ఒక్క ప‌నీ వివ‌రంగా చేసుకురాలేవు” అంటూ..

 కేంద్ర్రప్ర‌భుత్వం జి.ఎస్‌.టీ కాంపెన్సేష‌న్ ఎగొట్టిన‌ట్లో, త‌గ్గించిన‌ట్లో వారి ద‌యాదాక్షిణ్యాల‌తో కొంత‌ కోత విధించి ప‌దిపైస‌లే ఇవ్వ‌డ‌మో..

మ‌రీమూడ్ బాగాలేక పోతే మొత్తానికే మొండి చెయ్యి చూపేవారు... 

ఇలాంటి చేదు అనుభ‌వ‌మైన త‌రువాత మ‌ళ్ళీ మ‌ర‌కు పోకూడ‌దు అనుకునే వాడిని..

కాని ప్ర‌తీసారీ కొత్త రాయితీల‌తో న‌మ్మ‌బ‌లికి పంపేవారు...

క్లైమాక్స్ మాత్రం ఒక్క‌టే, ‘పిండి త‌క్కువ వచ్చింది మోసం జ‌రిగిపోయింది. మీ వ‌ల్ల ఏమీ కాదు’...

ఆ రోజుల్లో పిండిమ‌ర స్వానుభ‌వం అయిన సాటి కామ్రేడ్స్ అంద‌రికీ ఒక్క విష‌యం అర్థ‌మై ఉంటుంది...

యూనివ‌ర్సిటీ వీ.సీ.గా ప‌నిచేసి విద్యార్థుల‌తో తిట్టించుకోకుండా ఉండొచ్చేమో..

ఎమ్మేల్యేగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రితో మంచి అనిపించుకోవ‌చ్చేమో కానీ..

పిండిమ‌🤔 *చిన్న‌త‌నంలో "పిండిమ‌ర‌" కష్టాలు* 🤔

పిండిమ‌ర‌కెళ్ళొచ్చి మంచి ప‌నిమంతుడ‌నిపించుకోవ‌డం మాత్రం దుర్ల‌భం...

🤔😄🤔😄🤔😄🤔😄🤔😄🤔😄🤔ర‌కెళ్ళొచ్చి మంచి ప‌నిమంతుడ‌నిపించుకోవ‌డం మాత్రం దుర్ల‌భం...

🤔😄🤔😄🤔😄🤔😄🤔😄🤔😄🤔ర‌కెళ్ళొచ్చి మంచి ప‌నిమంతుడ‌నిపించుకోవ‌డం మాత్రం దుర్ల‌భం...

🤔😄🤔😄🤔😄🤔😄🤔😄🤔😄🤔

భవిష్యత్తు కోసం ఆశించడం, గ

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️* *భవిష్యత్తు కోసం ఆశించడం, గతం గురించి తలచుకోవటం రెండిటి వల్ల ప్రయోజనం లేదు.. మంచి పనికి సంకల్పం వచ్చిన వెంటనే దాన్ని ఆచరించడం నేర్చుకోవాలి.. ఎదగాలంటే ఒదిగి ఉందిగి ఉండడం నేర్చుకోవాలి.. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి.. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు.. కష్టాలకు ఎదిరించే ధైర్యం.. బాధలను భరించే ఓర్పు.. సమస్యలను పరిష్కరించుకునే నేర్పు మనలో ఉంటే జీవితంలో మనదే గెలుపు*🏵️ మనిషికి ఓపిక సహనం అనేవి బలహీనతలు కావు.. అంతర్గతంగా ఉండే శక్తులు.. ఇవి అందరిలో ఉండవు.. మనిషి కన్నా విలువైనది మనసు.. ఆవేశం కన్నా విలువైనది ఆలోచన.. కోపం కన్నా విలువైనది జాలి.. స్వార్థం కన్నా విలువైనది త్యాగం.. ఇవి అలవర్చుకుంటే మనిషి ధన్యుడు అవుతాడు🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కర శర్మ శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ .D .N. 29-2-3 .గోకవరం బస్ స్టాండ్ దగ్గర . 

మనం పాపాలు చేసామా?

 మనం పాపాలు చేసామా?

పుణ్యాలు చేసామా?

మనలో పాపం ఎక్కువా?

పుణ్యం ఎక్కువా?

ఎలా తెలుసుకోవాలి? 

— అన్న సందేహం సహజమే!

మన శరీరం మూడు రకాలుగా ఉంటుంది:

1️⃣ స్థూల శరీరం (భౌతిక శరీరం)

2️⃣ సూక్ష్మ శరీరం (మనస్సు–బుద్ధి)

3️⃣ కారణ శరీరం (పాప–పుణ్యాల బీజరూపం)

మన చేసిన పాపం–పుణ్యం ఈ మూడు శరీరాల్లో నిల్వ ఉంటాయని శాస్త్రం చెబుతుంది.

అయితే మనలో పాపం ఎక్కువా? పుణ్యం ఎక్కువా? — దీన్ని ఎలా గుర్తించాలి?

ఎలా దుర్వాసన చెడు వస్తువుని తెలియజేస్తుందో,

ఎలా సుగంధం మంచి వస్తువుని తెలియజేస్తుందో,

అలానే ఈ మూడు శరీరాల లక్షణాలను బట్టి పాప–పుణ్యాల నిల్వను తెలుసుకోవచ్చు.

1️⃣ స్థూల శరీర లక్షణాలు

(అ) శరీరం పవిత్రంగా ఉంటే — తెల్లవారుజామునే మేల్కొంటుంది.

పాపం పెరిగేకొద్దీ — బ్రాహ్మీ ముహూర్తంలోనే గాఢ నిద్ర, ఆలస్యంగా లేవడం జరుగుతుంది.

శిశువులు, మహాత్ములు — ఉదయమే మేల్కొనడం గమనించండి.

(ఆ) పవిత్రమైన స్థూలశరీరం — బద్ధకం లేకుండా, ఉత్సాహంగా ఉంటుంది.

పాపం పెరిగేకొద్దీ — సోమరితనం, నిరుపయోగకర పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది.

మహాత్ములు, చిన్నపిల్లలు — ఎప్పుడూ బద్ధకంగా ఉండరు.

(ఇ) పవిత్రమైన శరీరం — క్రమశిక్షణతో, నియమబద్ధంగా ఉంటుంది.

పాపం పెరిగితే — క్రమశిక్షణ లోపిస్తుంది.

(ఈ) పాపం పెరిగితే — అనారోగ్యకర ఆహారం, అధికాహారం.

పవిత్రత పెరిగితే — మితాహారం, శుభ్రమైన ఆహారం.

(ఉ) పాపంతో అపవిత్రమైన శరీరం — అవసరానికి మించి నిద్రిస్తుంది.

పవిత్రత పెరిగితే — ఎంత అవసరమో అంతే నిద్ర.

(ఊ) పవిత్రమైన శరీరం — నిద్రలేచిన వెంటనే స్ఫూర్తితో, చైతన్యంతో ఉంటుంది.

పాపం పెరిగితే — 10–15 నిమిషాలు స్పృహకి రావడానికి పడుతుంది, ముఖం మబ్బుగా ఉంటుంది.

➡️ ఇలా స్థూల శరీర లక్షణాలే మన పాప–పుణ్య సూచికలు.

ఎలుక చచ్చి దుర్గంధం వచ్చిందని గ్రహించినట్లే,

మన జీవితంలో శుభాలు ఆలస్యం అవుతున్నాయా?

కష్టాలు వరుసగా వస్తున్నాయా? — అయితే అది నిల్వ పాపం శోధన కావాల్సిన సూచన.

**➡️ కాబట్టి వెంటనే జాగ్రత్తపడాలి.

➡️ క్రమశిక్షణ, ధ్యానం, మంచి ఆహారం, సాధన — ఇవి స్థూల శరీరాన్ని పవిత్రంగా ఉంచే మార్గాలు.**

  🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

శనివారం*🍁 *🌹22నవంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

       🍁 *శనివారం*🍁

 *🌹22నవంబర్2025🌹*  

     *దృగ్గణిత పంచాంగం* 

       *స్వస్తి శ్రీ విశ్వావసు*

       *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్ల పక్షం*

*తిథి  : విదియ* ‌సా 05.11 వరకు ఉపరి *తదియ*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : జ్యేష్ఠ* సా 04.47 వరకు ఉపరి *మూల*

*యోగం : సుకర్మ* ఉ 11.30 వరకు ఉపరి *ధృతి*

*కరణం  : కౌలువ* సా 05.11 ఉపరి *తైతుల పూర్తిగా రాత్రంతా*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 08.00 - 09.00 & 10.30 - 12.00 సా 04.30 - 06.30* 

అమృత కాలం  : *ఉ 06.56 - 08.43*

అభిజిత్ కాలం  : *ప 11.31 - 12.16*

*వర్జ్యం    : రా 01.40 - 03.27*

*దుర్ముహూర్తం  : ఉ 06.15 - 07.45*

*రాహు కాలం   : ఉ 09.04 - 10.29*

గుళికకాళం      : *ఉ 06.15 - 07.39*

యమగండం    : *మ 01.18 - 02.43*

సూర్యరాశి : *వృశ్చికం*        

చంద్రరాశి : *వృశ్చికం/ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.25*

సూర్యాస్తమయం :*సా 05.40*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.14 - 08.30*

సంగవ కాలం         :     *08.30 - 10.46*

మధ్యాహ్న కాలం    :    *10.46 - 01.01*

అపరాహ్న కాలం    : *మ 01.01 - 03.17*

*ఆబ్ధికం తిధి         : మార్గశిర శుద్ధ విదియ*

సాయంకాలం        :  *సా 03.17 - 05.32*

ప్రదోష కాలం         :  *సా 05.32 - 08.05*

రాత్రి కాలం           :*రా 08.05 - 11.28*

నిశీధి కాలం          :*రా 11.28 - 12.19*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.34 - 05.24*

****************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

*శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం*

*శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ*

*వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే*

*శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత*

*శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌*

తా. ఓ వేంకటేశ్వరా! నీవు పద్మము నాభియందు కలవాడవు. పురుషోత్తముడవు. వాసుదేవుడవు. వైకుంఠుడవు. మాధవుడవు. జనులను రక్షించువాడవు. హస్తమున చక్రము కలవాడవు. శ్రీవత్స చిహ్నము కలవాడవు. శరణుజొచ్చినవారి పాలిట కల్పవృక్షమవు. నీకు సుప్రభాతమగు గాక.

*ఓం నమో వేంకటేశాయ*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*

*హారిణే వజ్రదేహాయ* 

*చోల్లంఘిత మహాబ్దయే*

*బలినా మగ్రగణ్యాయ నమః* 

*పాపహరాయతే*

*లాభ దోసిత్వేమేవాసు* *హనుమాన్ రాక్షసాంతక!!*

            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శుక్రవారం 21 నవంబర్ 2025🌹*

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🌹శుక్రవారం 21 నవంబర్ 2025🌹*

             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                           5️⃣1️⃣``

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``

      *సంపూర్ణ మహాభారతము*

              *51 వ రోజు* ``

           *సభా పర్వము*

        *ప్రథమాశ్వాసము*  

            *ప్రారంభము*

అర్జునుని చూసిన దానవ శిల్పి  మయుడు “అర్జునా! నీ దయ వలన నేను అగ్నికి ఆహుతి కాకుండా బ్రతికాను. నేను దానవ శిల్పిని. చిత్ర విచిత్రమైన నిర్మాణాలు చేయగలను. మీకు ఇష్టమైనది ఏదో చెప్పండి చేస్తాను” అన్నాడు. 

అర్జునుడు కృష్ణుని వంక చూసాడు. 

శ్రీకృష్ణుడు “కురువంశ మహారాజు  ధర్మరాజు వైభవానికి తగినట్లు ఒక భవనం నిర్మించి ఇవ్వు!” అని మయునితో అన్నాడు. 

మయుడు “ఈ భూమిపై ధర్మరాజుని మించిన రాజు లేడు. అందుకని ప్రజలు మెచ్చేలా చిత్ర విచిత్రమైన భనాన్ని నిర్మించి ఇస్తాను. వృషపర్వుడనే రాక్షస రాజుకు ఒక సభ నిర్మించడానికి ఉపకరణాలు సమకూర్చుకున్నాను. కారంణాంతాల వలన నిర్మించలేక పోయాను. ఉపకరణాలను బిందుసరము అనే సరోవరంలో దాచాను. వాటిని తెచ్చి భవన నిర్మాణం చేస్తాను- నా వద్ద భౌమాదిత్యుడు దాచిన గద, శంఖము ఉన్నాయి. గదను భీమసేనునికి దేవదత్తము అనే శంఖమును అర్జునినికి ఇస్తాను” అన్నాడు.```

       *మయసభా వైభవం*```

మయుడు బిందుసరోవరములో ఉన్న దూలాలూ, కంభములను ఉపయోగించి చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించాడు. నీటికి బదులు ఇంద్రనీల మణులను, పద్మరాగ మణులతో ఎర్రని పద్మాలను, రజితముతో తెల్లటి తామరలను, రాజహంసలను, వజ్రాలతో చేపలను, ముత్యములతో తెల్లటి నురగలను, మరకత మణులతో నీటిలోని నాచుని తయారు చేసాడు. అవి నిజమని భ్రమించేలా నిర్మించాడు. నీటి యంత్రాలు, చెట్లు, నీటి పక్షులు, పక్షిగూళ్ళు మొదలైనవి వివిధ రత్న కాంతులతో శోభిల్లే భవనం పదునాలుగు మాసాలు శ్రమించి నిర్మించాడు. దానిని ఎనిమిది వేల మంది బలిష్టులతో ఆకాశమార్గాన మోసుకు వచ్చి ధర్మరాజుకు  బహూకరించాడు. ధర్మరాజు ఒక శుభ ముహూర్తాన పురోహితుడైన ధౌమ్యుని ఆశీర్వాదంతో భార్యతో తమ్ములతో మయసభా ప్రవేశం చేసాడు. సామంతరాజులు ధర్మరాజుని దర్శించి కానుకలు సమర్పించారు.```

       *నారదమహర్షి రాక*```

ఒకరోజు ధర్మరాజు వద్దకు నారదమహర్షి వచ్చాడు. ధర్మరాజు నారదమహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. నారదమహర్షి ధర్మరాజును రాజనీతి సంబంధమైన విషయాలు అడిగాడు. 

ధర్మరాజా నీవు ధర్మ మార్గము అనుసరిస్తున్నావు కదా,

రాజకార్యాలను ధర్మనిష్టతో, స్వబుద్ధితో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఆలోచిస్తున్నావు కదా!

రాజోద్యోగాలలో యోగ్యులను, స్థిరచిత్తులను నియమించావు కదా! సమర్ధులైన బ్రాహ్మణులను, శాస్త్ర నియమాలు తెలిసిన వారిని మంత్రులుగా నియమించావు కదా! 

నీ విజయానికి కారణమైన రహస్యాలోచనం ఎవరికీ తెలియకుండా రక్షిస్తున్నావు కదా! 

నీ చేత యజ్ఞములు చేయించిన యాజ్ఞికుడు యజ్ఞాలు సక్రమంగా నిర్వహిస్తున్నాడు కదా!

ఎల్ల వేళలా నీ మేలు కోరేవారిని విశ్వాసపాత్రులను సైన్యాద్యక్షులుగా నియమించావు కదా! 

పలుకుబడి కలిగిన మంత్రి నీకు వ్యతిరేక కార్యాలలో దిగి నీకు ద్రోహం తలపెట్ట లేదు కదా? 

ఎందు కంటే ధనము అధికారం ఎలాంటి వారికైనా గర్వం, దురాశను కలిగిస్తుంది. నీ రాజ్యంలోని శాస్త్రజ్ఞులు రాబోయే ఉత్పాతాలను కనిపెట్టి శాంతి క్రియలు చేపడుతున్నారు కదా! 

ఆయుర్వేద వైద్యులు ప్రజలకు ప్రేమతో సేవ చేస్తున్నారు కదా! 

ఆర్థిక సంబంధిత కార్యాలలో నైపుణ్యం కలవారిని, పాపరహిత చరిత్రులను, నీతి నియమాలు కలవారిని, ధర్మ పరీక్షలో నెగ్గిన వారిని నియమించావు కదా!

యోగ్యతను దృష్టిలో ఉంచుకుని ఉత్తమ, మధ్యమ అధమ ఉద్యోగాలలో నియమించావు కదా!

నీ ఉద్యోగులకు సకాలంలో జీతభత్యాలు అందచేస్తున్నావు కదా! 

లేకుంటే రాజుకు అది కీడు కలిగించ వచ్చు. వంశపారంపర్యంగా నీకు సేవ చేస్తూ ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగులను గుర్తించి సత్కారాలు చేస్తున్నావు కదా!

నీ రాజ్యంలో నీ కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు తిండి, బట్ట, నీడ కల్పిస్తున్నావు కదా! 

లోభబుద్ధి కలవాళ్ళను, దొంగలను, శత్రువులతో స్నేహంగా ఉండేవాళ్ళను, పిరికి వాళ్ళను, దుర్మార్గులను రాజకార్యాలను నిర్వహించడానికి పంపడం లేదు కదా!

నీ రాజ్యంలో అనావృష్టి లేదు కదా ! 

చెరువులన్నీ నిండి ఉన్నాయి కదా !

పేద రైతులకు ఉచితంగా విత్తనాలు, తదితరాలు ఇస్తున్నావు కదా!

పౌరులకు నూటికి ఒకటి చొప్పున వడ్డీకి ఋణసౌకర్యం కల్పిస్తున్నావు కదా! 

నీ రాజ్యం లోని కుంటి గుడ్డి, వికలాంగులు, అనాథలు, దిక్కులేని వారిని దయతో పోషిస్తున్నావు కదా!

యుద్ధంలో శరణన్న వారిని కాపాడుతున్నావు కదా! నీకు మేలు చేసిన వారిని ఉచితరీతిన సత్కరిస్తున్నావు కదా!

నీకు వచ్చిన ఆదాయంలో నాల్గవ లేక రెండవ లేక మూడవ భాగాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నావు కదా ! ```

             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 

ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*

 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

యాత్రా కాలే విశేషేణ

 ✤ యాత్రా కాలే విశేషేణ యస్య కస్యాపి దేహినః | 

న దేయాన్ ఏవ దుఃఖాని విచార్య విధిమాదరాత్ ॥ 

కాశీక్షేత్రంలో మన వల్ల ఎవరికీ దుఃఖం కలగకూడదు. ఎవరిపట్లా పరుషవాక్యాలు అనరాదు. 

✤ 'మౌనమేవ సదా కార్యం' – ఏదో అత్యవసరమైనపుడు ముఖ్యమైనవి మాట్లాడినప్పటికీ కూడా లోకవ్యవహారంలో ఉండరాదు. మౌనమే ప్రధానంగా పెట్టుకోవాలి. 

✤ 'కర్తవ్యం శివచింతనం' - శివచింతన నిరంతరం జరుగుతూ ఉండాలి. 

✤ 'మార్గే విలోక్య కీటాదీన్' - నడిచేటప్పుడు కూడా కాలు కీటకం మీద పడకుండా జాగ్రత్తగా నడవాలి. కీటకం మీద కూడా కాలు వేసి తొక్కకూడదు. 

'నో చేత్ యాత్రాఫలం న్యూనం భవిష్యతి' - ఒకవేళ తెలిసి కానీ, తెలియక గానీ కాలి క్రింద ఏమైనా మరణించినట్లైతే యాత్రాఫలం తగ్గుతుంది సుమా! 

✤ ‘అనృతం నైవ వక్తవ్యం' - ఎట్టి పరిస్థితులలో అసత్యమనేది పలుకరాదు. 'కదాచిదపి సర్వథా' - ఎట్టి పరిస్థితిలో, పరిహాసానికి కూడా అబద్ధం పలకరాదు. 

✤ 'నిందాన్యస్య న కర్తవ్యా న శ్రోతవ్యా సర్వథా' - ఇతరులను ఎట్టి పరిస్థితులలో నిందించరాదు. మనం నిందించకూడదు, ఎవరైనా నిందిస్తుంటే వినకూడదు.  

✤ 'బ్రహ్మచర్యవ్రతం చరేత్' - ఎట్టి పరిస్థితులలో కూడా బ్రహ్మచర్యవ్రతం తప్పరాదు. 

✤ 'ఋతుకాలేపి సంప్రాప్తే స్వస్త్రియా సహ సర్వథా' - తన భార్యతో కూడా అక్కడ కాముక దృష్టి కూడదు.

✤ ‘నైకత్ర శయనం కార్యం' - ఒక చోట నిద్రించరాదు. 

✤ ‘ప్రతిగ్రహో న కర్తవ్యో యాత్రాకాలేషు సర్వథా' - ప్రతిగ్రహణం అంటే ఎక్కడా స్వీకరించడం కూడదు. ఈ మాట మళ్ళీ చెప్పుకోవాలి. ఇంకొకరి దగ్గర ధనాదులు స్వీకరించరాదు. 

✤ అలాగే భక్తులుకానివారితో, నీచులతో, నాస్తికులతో మాట్లాడరాదు. ఇది పెద్ద నియమంగా పెట్టుకోవాలి. ఎందుకంటే దృష్టి చెదరగొట్టాలంటే వారు చాలు. 

✤ కాలత్రయేపి కర్తవ్యం శివలింగస్య పూజనమ్ | తతః శివకథా శ్రావ్యాః శ్రోతవ్యాః పాపనాశికాః || 

- వీలైతే మూడుపూటలు శివపూజ చేసుకోవాలి. మధ్యాహ్నావేళలలో వీలైనంతవరకు శివభక్తులకు భోజనం పెట్టడం చాలా శ్రేష్ఠం. కాశీలో వీలైనంతవరకు శ్రోత్రియులైన శివభక్తులకు పద్ధతిగా, శుచిగా భోజనం పెట్టడం ఎప్పుడూ మంచిదే. ఎందుకంటే అక్కడ మనకు తెలిసో, తెలియకో ఏవైనా దోషములు జరిగినా వాటిని శాంతింపజేసే శక్తి దానికి ఉన్నది. 

✤ కాశీలో కొంతసేపు జపం, కొంతసేపు పూజ, కొంతసేపు యాత్ర చేసుకోవాలి. యాత్ర చాలా విశేషంగా చెప్పారు. కాశీలో కూర్చోవడానికి కాదు, యాత్ర చెయ్యాలి. విరామసమయంలో ముఖ్యంగా చెయ్యవలసింది - శివకథలను వినడం, చదువుకోవడం, చెప్పుకోవడం చెయ్యాలి. 'శ్రావ్యాః, శ్రోతవ్యాః' - వినాలి, వినిపించాలని రెండు మాటలు చెప్పారు. 'ఆసాయం' సాయంకాలం వరకు ఇదే చెయ్యాలి. తరువాత సాయంకాల సంధ్యాదులు చేసుకోవాలి. ఎవరైతే ఉపనయనాది సంస్కారం పొందినవారు కాశీలో ఉంటారో వారు సంధ్యావందనం చెయ్యకపోతే ఆ యాత్ర పూర్ణనిష్ఫలం అవుతుంది.  

సంధ్యావందనం మూడు పూటలా చెయ్యనివారికి యాత్రలు నిష్ఫలం అవుతాయి. ఉపనయన సంస్కారంలో 'అహరహస్సంధ్యాముపాసీత' - అని ఒట్టు పెడతారు. ఆ ఒట్టు తప్పిపోతే వేదముల శాపం తగులుతుంది. అందుకే ఉపవీతుడు ముప్పూటలా సంధ్యావందనం చెయ్యవలసిందే. ఉపనయనాది సంస్కారములు లేనివారు శివనామములు, గురువు వద్ద పొందిన శివమంత్రాలు చేసుకుంటే వారు తరించిపోతారు, సందేహం లేదు. 

ఇలా చేస్తూ ఈ నియమాలతో కాశీలో కానీ సంచరిస్తే అడుగడుగునా అశ్వమేధఫలం, మరెన్నో యజ్ఞఫలాలు లభిస్తూ ఉంటాయి. అంత విశేషమైనది. 

సేకరణం - పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రవచించిన శివరహస్యం ప్రవచనం నుండి

శివరహస్యం ప్రతుల కొరకు

వెంకట రమణ - 92464 88975

భారత ఋషిపీఠం 

ఫ్లాట్ నం. 37-93/138/2,

మధురా నగర్, నేరేడ్ మెట్,

హైదరాబాద్ - 500056

తెలంగాణా

ఫోన్ నం. 040 79658274