22, నవంబర్ 2025, శనివారం

కలిన్ స్మరణాన్ ముక్తిహః

 కలిన్ స్మరణాన్ ముక్తిహః " దీని భావము ఏమిటంటే కలి యుగంలో భగవాన్ నామ స్మరణ చేస్తేనే ముక్తి లభిస్తుందని.   వాక్యాన్ని చాలామంది నమ్మి తాము రోజులో  కొంతసమయం చేసే భగవన్నామముతో ముక్తి లభిస్తుందని  భావిస్తున్నారునిజానికి ఇతర యుగాల మనుషులతో పోలిస్తే కలియుగంలో వుండే మనుష్యులు చాలా బద్దకస్తులు అంటే తామస ప్రవ్రుత్తి  కలిగినవారుఇక అటువంటి వారికి ఇటువంటి మాటలు ఎంతో రుచిస్తాయి.  అది యెట్లా అంటే పని ఎగవేసే ఉద్యోగస్తునికి నీవు పని చేయకపోయినా జీతం ఇస్తారు అనే మాటలు ఎలా రుచిస్తాయో అలాగే.  కానీ సాధక మిత్రమా ఎట్టి పరిస్థితిలోను ఇటువంటి మాటలను నమ్మి నీ సాధనను మధ్యలో ఆపు చేయకు.  ఒక్క విషయం మనం చుస్తువున్నాం. గత యుగాలలో కూడా సూర్యభగవానుడు తూర్పు దిక్కునే ఉదయించాడు, నీరు పల్లానికే ప్రవహించింది. నదులన్నీ సముద్రంలోనే కలిసాయి, అగ్నికి దహించే శక్తి వున్నది. నెలకు 30 రోజులే వున్నాయి. మరి ప్రక్రుతి లోని శక్తులు అన్ని, అన్నీ యుగాలలో ఒకే విధంగా ఉంటే మరి పురుషుడు అంటే భగవంతుని విషయంలో అంటే ముక్తి విషయంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ఎందుకు ఉంటుంది.  ఆలోచించండి. ఇటువంటి వాక్యాలు అకుంఠిత దీక్ష, నిరంతర కృషి చేయలేని వారు కల్పించినవి కాక మరొకటి కాదు. నిజానికి ఇటువంటి విషయాలే నిజమైతే హిమాలయాలల్లో సాధువులుసన్యాసులుజ్ఞ్యానులు ఇప్పటికి నిరంతరం నిద్రాహారాలు మాని ఎముకలు కొరికే చలిలో ఎందుకు  సాధన చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించు.  కఠినమైన తపమొనరిస్తేనే మనకు జ్ఞ్యానం  కలుగుతుందిఅప్పుడే మోక్షసిద్దిజన్మ రాహిత్యానికి ప్రయత్నించే చక్కటి అవకాశం మనకు కేవలం  మనుష్య జన్మలోనే వున్నది.   అవకాశాన్ని చేయిజార్చకూడదుమిత్రమా ఇప్పుడే మోక్షసిద్దికి ఉద్యుక్తుడవు కమ్ము

కామెంట్‌లు లేవు: